Mahesh Vijaprukar
-
ముందు నొయ్యి వెనుక గొయ్యి!
ఇటీవలే కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసిన నారాయణ రాణే మంత్రివర్గంలో సీటు కాదు కదా.. ఎమ్మెల్సీగా ఎన్నిక అవడం కూడా కష్టమయ్యే పరిస్థితుల్లో చిక్కుకు పోయారు. మాతృ సంస్థ శివసేన ఆయనపై పగ సాధింపుకు సిద్ధమైంది. నారాయణ్ రాణే ఉల్లాసకరమైన స్థితిలో కాలం గడుపుతున్నారు. బీజేపీకి తానిచ్చిన మాట ప్రకారం తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, తన శాసనమండలి సభ్యత్వాన్ని కూడా వదిలేశారు. కొత్త మిత్రురాలి సహాయంతో ఆ స్థానాన్ని వెనువెంటనే దక్కించుకుంటానని తప్పుగా అంచనా వేశారు. కానీ అలా జరగలేదు. ఎందుకంటే, బీజేపీ రాణేపట్ల ఆసక్తి ప్రదర్శిస్తే దేనికైనా తెగిస్తానని రాణే మాజీ పార్టీ లేదా అతడి తొలి ప్రేమికురాలు అయిన శివసేన తీవ్రంగా హెచ్చరించింది. బీజేపీ సాధించిన 122 స్థానాలతో పోలిస్తే 63 స్థానాల్లో మాత్రమే గెలిచిన శివసేన మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో భాగస్వామి. శివసేన ఎప్పటికైనా తన కాళ్లకింది తివాచీని లాగేస్తుందన్న బీజేపీ భయాన్ని అర్థం చేసుకోవలసిందే. శివసేన నమ్మదగిన భాగస్వామి కాదు. ఒకవైపు బీజేపీతో అధికారం పంచుకుంటూనే కాంగ్రెస్, ఎన్సీపీల కంటే సమర్థంగా ప్రతిపక్షపాత్ర పోషిస్తోంది. ప్రభుత్వంలో ఉంటూ వచ్చే అన్ని ప్రయోజనాలనూ అందుకుంటూనే దానిపై నాలుగు రాళ్లు వేస్తూ ఉండటం దాని లక్షణం. రాణేపై శివసేనకు ఉన్న పట్టు చాలా గట్టిది. ఆ పార్టీకి చెందిన మనోహర్ జోషి స్థానంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన రాణేపై దాని పగ ప్రబలంగానే ఉంది. బహిరంగంగా అలా చెబుతోంది కూడా. ప్రజలు, రాజ కీయ వాదుల అవగాహన కూడా అదే మరి. రాణే తన ఎమ్మెల్సీ స్థానాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నిస్తే, కాంగ్రెస్, బీజేపీ రెండూ శివసేనకు మద్దతు ఇవ్వవచ్చు, లేదా దాని మద్దతును అవి అంగీకరించవచ్చు. మాజీ శివసైనికుడు, ప్రస్తుతం మాజీ కాంగ్రెస్ వాది అయిన రాణే తనను సభ్యుడిగా చేర్చుకున్న పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారవుతాడని చాలామంది వర్ణిస్తుంటారు. పార్టీలో ఉన్నత స్థానాల్లో ఉన్న అశోక్ చవాన్‌ను లేదా పృథ్వీరాజ్ చవాన్‌ను తొలగించి తాను వారి స్థానాన్ని చేజిక్కించుకోవడంలో కాంగ్రెస్ అధిష్టానం మద్దతును పొందడం చాలా సులువైన విషయమని రాణే భావించారు. అది బాల్ ఠాక్రేను ఒప్పించడమంత సులువైన అంశమని భావించారు. ఆయన అసహనం, పార్టీకిమించి తన స్వార్థాన్ని మాత్రమే చూసుకునే వైఖరి వల్లే రాజకీయాల్లోనే కాకుండా సొంత నియోజకవర్గంలో కూడా అనేక సమస్యలు తనను చుట్టుముడుతూ వచ్చాయి. అందుకే 2014 ఎన్నికల్లో రాణే ఆయన కుమారుడు తమ కంచుకోటలను కోల్పోయారు. ఆ తర్వాత ముంబైలో అసెంబ్లీ స్థానాన్ని కూడా రాణే గెల్చుకోలేకపోయారు. ఇప్పుడు తన సంరక్షణలోని కొంకణ్ ప్రాంతంకోసం పోరాడుతున్నారు. ఇతరుల మద్దతుతో కాకుండా స్వయంగా దీనికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ గెలిస్తే, అప్పుడు బీజేపీ అభినందనలను అందుకోవచ్చు. రాణేను తన చెంత చేర్చుకునే విషయమై బీజేపీ చాలా అప్రమత్తతతో ఉంది. రాణే ఆగ్రహ ప్రవృత్తి, ఉన్నట్లుండి ఆకస్మిక దాడిగా మారి తాను సొంత పార్టీ పెట్టుకుని చిన్న మిత్రపక్షంలా మారే అవకాశం ఉందని కూడా బీజేపీకి బాగా తెలుసు. నరేంద్ర మోదీ, అమిత్ షా పట్ల విశ్వాసం ప్రకటించేటట్లయితే ఎలాంటి భావజాలం నుంచి వచ్చిన వారికైనా సభ్యత్వం ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. రాణే బీజేపీలో చేరడానికి గట్టిగానే లాబీయింగ్ చేశారు. కానీ తనకు కేబినెట్లో స్థానం ఇవ్వాలంటే బీజేపీకి మద్దతు ఇస్తున్న శివసేన ఆమోదం తప్పనిసరిగా మారింది. రాణే సభ్యుడిగా ఒకే మంత్రివర్గంలో తన సరసన కూర్చోవడానికి శివసేన నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. రాణేను బీజేపీలో చేర్చుకునే ప్రక్రియ ప్రారంభమైనప్పటినుంచీ దానివల్ల కలిగే పర్యవసానాల గురించి ఉద్దవ్ ఠాక్రే పదే పదే హెచ్చరిస్తూ వచ్చారు. తన మాజీ శత్రువు (శివసేన నుంచి బయటకు వచ్చేటప్పుడు రాణే ఆ పార్టీని అత్యంత పరుషమైన రీతిలో దూషించాడు) ట్రంప్ కార్డును గట్టిగా పట్టుకోవడంతో రాణేకి చేదుమాత్ర మింగినట్లయింది. తన, తన కుటుంబ భవిష్యత్ అవకాశాలకు సంబంధించి రాణే సొంత చొరవతో చేయగలిగిందేమీ లేకుండా పోయింది. ఎక్కువ సీట్లు ఖాళీగా ఉండే శాసన మండలి ఎన్నికలలాగా కాకుండా, ఎమ్మెల్యేల నుంచి ఓట్ల కోటాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఉపఎన్నికలో పరిస్థితి అలాంటిది కాదు. రాణే తన స్థానాన్ని తిరిగి పొందాలంటే, ప్రస్తుతం శాసనసభలో ఉన్న మొత్తం సభ్యులలో సగంకంటే ఎక్కువ ఓట్లను తాను సాధించాల్సి ఉంటుంది. కానీ ఉన్నట్లుండి ఆయన మొత్తం ప్రతిపక్షాన్ని తనకు వ్యతిరేకంగా ఐక్యం చేసిపడేశారు. అందులోనూ శివసేన ఆయనపై పగ సాధించడానికి పొంచుకుని ఉంటోంది. ఈ మొత్తం దృశ్యాన్ని పరిశీలించినట్లయితే నారాయణ్ రాణే భారతీయ జనతాపార్టీకి ఇప్పటికయితే పెద్ద ఆస్తిగా కనిపించడం లేదు. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ :mvijapurkar@gmail.com -
వైద్యవృత్తిలో ముడుపుల పర్వం
విశ్లేషణ డాక్టర్‌కు, లేబొరేటరీకి మధ్య ఉండే ఆర్థికపరమైన ఒప్పందం వల్ల అనవసరమైన లెక్కలేనన్ని పరీక్షలను చేయించుకోవాల్సి వస్తుంది. రోగికి ఆ పరీక్షలు అవసరం కాకపోవచ్చు. ఆ విషయం డాక్టర్‌కు తెలిసే ఉండవచ్చు. ‘‘నిజాయితీతో కూడిన అభి ప్రాయం. కమీషన్లు లేని డాక్టర్లు’’ అంటూ ఆసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ముంబైలో పెట్టిన ప్రకటన పని చేసినట్టే కనిపిస్తోంది. వైద్య వృత్తిలోని ముడుపులు చెల్లింపుల పద్ధ తికి పగ్గాలు వేయడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం నియ మించిన బృందం కొన్ని సూచనలను చేసింది. శాస నసభ వాటిని చట్టంగా రూపొందించవచ్చు. అయితే అది ఆ ఒక్క రాష్ట్రానికే పరిమితం. ముడుపులు పుచ్చు కుంటూ లేదా ఇస్తూ దొరికినవారికి రూ. 5,000 జరి మానా, మూడు నెలల జైలుశిక్ష విధించాలని కొన్ని వారాల క్రితం ఏర్పాటు చేసిన ఆ బృందం సూచిం చింది. అదే నేరాన్ని తిరిగి చేసేట్టయితే జరిమానా మరింత పెరుగుతుంది. అంటే, మొదటి దఫా జరిమా నాకు ఐదు రెట్లు. జరిమానా కాకపోయినా, జైలు శిక్ష వల్ల కలిగే అవమానమైనా ఈ ముడుపుల బాట పట్టిన వారిని ఇరుకుగా ఉండే ముక్కు సూటి దారికి తీసుకు రావాలి. ఇది ఏదో ఒక్కరికి సంబంధించిన వ్యవహారం కాదు. నిపుణ వైద్యులను, వైద్య పరీక్షలు చేసే లేబొ రేటరీలను సూచించే డాక్టర్లందరికీ, సదరు వైద్యులు లేదా లేబొరేటరీలు రోగుల నుంచి వసూలు చేసే బిల్లు పరిమాణాన్ని బట్టి ముడుపులు అందుతాయి. ఈ పద్ధతికి సంబంధించి సమాధానపరచగలిగిన వివరణ ప్రజలకు అవసరం. ఈ పద్ధతి అమలులో ఉందనడాన్ని ఖండించడం మాత్రమే వారిని సమాధానపరచలేక పోవచ్చు. ఆ సమస్య ఉన్నదని ఆమోదించి, ఆ పద్ధతి అంతరించిపోయిందని ప్రజలు సంతృప్తి చెందే రీతిలో దానికి కళ్లెం వేయడం అవసరం. మహారాష్ట్ర పోలీసుశాఖ మాజీ అధిపతి ప్రవీణ్ దీక్షిత్ నేతృత్వంలో ఈ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడం, ముడుపుల పద్ధతికి వ్యతిరేకంగా పోరా డుతున్న డాక్టర్ హెచ్ బవాస్కర్కు అందులో స్థానం కల్పించడం ఈ సమస్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపుతున్నదని సూచిస్తున్నాయి. డాక్టర్ బవాస్కర్ గురించి ప్రముఖ వైద్య పత్రిక ద లాన్సెట్ , బహుశా 2013లో ప్రస్తావించింది. అందువల్లనే గామోసు ఆయన వైద్య వృత్తిలోని ప్రముఖుడు కాలేకపోయారు, ఈ పద్ధతికి ముగింపు పలకాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తులను విస్మరించారు. ‘‘63 ఏళ్ల డాక్టర్ హిమ్మత్రావు సాలుబా బవాస్కర్ డెస్క్ మీదకు ఒక డయాగ్నస్టిక్ సెంటర్ నుంచి ‘వృత్తి పరమైన ఫీజు’ పేరిట ఓ చెక్కు వచ్చి పడగా, ఆయన దాన్ని స్వీకరించడానికి బదులు తిప్పి పంపడమే కాదు, ఆ సెంటర్‌కు వ్యతిరేకంగా వైద్య విద్యను, డాక్టర్లను పర్యవేక్షించి, నిఘా ఉంచే సంస్థౖయెన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’’(ఎంసీఐ)కు ఫిర్యాదు చేశారు కూడా. ఆ కేసు పర్యవసానం ఏమైందో స్పష్టంగా తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందంలో ఎంసీఐ ప్రతినిధితో పాటూ బవాస్కర్కు కూడా చోటు దక్కడం ఉత్సాహాన్ని రేకెత్తించే అంశం. ఇది ఈ బృందం ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం దిశను సూచించేది మాత్రమే. ఒకసారి ఆ చట్టాన్ని తెచ్చాక, దాన్ని ప్రభుత్వ యంత్రాంగం ఎలా అమలు చేస్తుం దనేది పూర్తిగా వేరే విషయం. అధ్వానమైన అమలుతో ఎంత మంచి చట్టానికైనా తూట్లు పొడిచేయగలిగిన మన దేశంలో పరిపాలనకు సంబంధించిన ప్రధాన సమస్య అదే, నిజమే. వైద్య వృత్తిలో నిస్సిగ్గుగా అదనపు రాబడిని రాబట్టే సాధనంగా అమలవుతున్న ఈ పద్ధతిని తుదముట్టించడానికి మెడికల్ కౌన్సిల్ సుముఖంగా ఉండి ఉంటే... దాదాపు అర్ధ దశాబ్ది క్రితం నాటి బవాస్కర్ ఫిర్యాదు ఆధారంగానే అది ఆ పని చేసి ఉండేది. ఆ వ్యాపార ప్రకటన తెలిసి ఉండక పోవచ్చు కూడా. ముడుపుల గురించి కౌన్సిల్‌కు తెలియకపోవడం కాదు. ప్రత్యేకించి స్టెంట్లు సహా పలు విష యాలలో ఆసుపత్రులు రోగుల నుంచి అధికంగా ఎలా వసూళ్లను చేస్తున్నాయో ప్రభుత్వమే ఎత్తి చూపుతోంది. కాబట్టి ఎంసీఐకి ముడుపుల వ్యవహారం తెలియదను కోలేం. ఆసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ప్రకటన పట్ల వెలువడ్డ ప్రతిస్పందనలు... ఈ సమస్యపై వైద్య వృత్తిలో ఉన్నవారు చీలిపోయి ఉన్నట్టు వెల్లడి చేశాయి. కొందరు దీన్ని ప్రచారం కోసం వేసిన తెలివైన ఎత్తుగడని ఆరోపించగా, మరికొందరు ఈ ముడుపుల వ్యవహారం కొందరికే పరిమితమని వాదించారు. అయితే, బవాస్కర్ మినహా ఈ వృత్తికి చెందిన మరె వరూ దీని గురించి ఏ మాత్రం బయటకు పొక్క నియ్యలేదు. ఈ అవినీతి విస్తృతి ఎంతో నిర్వచించలేం. కానీ ఔషధ సంస్థలు మాత్రం, తాము అందించే ప్రోత్సాహకాలకు బదులుగా లబ్ధిని పొందుతూనే ఉండి ఉండాలి. వైద్య వృత్తిలోని ముడుపులను ‘కట్ ప్రాక్టీస్’ (ఫీజుల పంపకం పద్ధతి)గా పిలుస్తారు లేదా అభి వర్ణిస్తారు. ఈ పద్ధతి వల్ల వైద్య సేవల వ్యయం పెరిగిపోతుంది. డాక్టర్‌కు, రోగనిర్ధారణ లేబొరేటరీకి మధ్య ఉండే ఈ ఆర్థికపరమైన ఒప్పందం వల్లనే అన వసరమైన లెక్కలేనన్ని పరీక్షలను చేయించుకోవాల్సి వస్తుంది. రోగికి ఈ పరీక్షలు అవసరం లేకపోవచ్చు. ఆ విషయం డాక్టర్‌కూ తెలిసే ఉండవచ్చు. ఆ లేబొరేటరీ అనవసరమైన ఆ పరీక్షలను నిజంగా చేయకుండానే వాటికి బిల్లు ఇచ్చి ఉండవచ్చు. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
సిద్ధు వాదం సమంజసం
విశ్లేషణ ఎప్పటిలా తన పనిని తాను చేసుకుంటూనే ప్రభుత్వ పదవిలో కొనసాగాలని సిద్ధు ఆశిస్తున్నారు. ఆయన ఇలా పట్టుబట్టడం సరైనదే. దేశానికి నేడు కావాల్సి నది, కొరవడినది కూడా పార్ట్‌టైమ్ రాజకీయవేత్తలు, పార్ట్‌టైమ్ రాజకీయాలే. నవజోత్‌సింగ్ సిద్ధు మాజీ క్రికెట్ క్రీడాకారుడు, పంజాబ్ నూతన ప్రభుత్వంలో నేడు మంత్రి. ఒక ఆసక్తికరమైన అంశాన్ని ఆయన లేవనె త్తారు. ఒక మంత్రి సాధారణ మైన తన పనిని కొనసాగిస్తూ ఆదాయాన్ని సంపాదించుకో వచ్చా? ఈ సందర్భంలో అది టీవీలోని ఒక హాస్య కార్యక్రమంలో కనిపించడం. అది తనకు ఆదాయ వనరనీ, తాను అవినీతి ద్వారా బతకా లనుకోవడం లేదనీ, అందువలన ఆ పని తనకు అవసర మని ఆయన వాదన. సిద్ధు ఒక మంత్రి కాబట్టి ఆయన ప్రభుత్వ ఉద్యో గనీ, అందుకు ఆయనకు ప్రతిఫలం ముడుతుందని భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఒక టీవీ చానల్‌తో అన్నారు. కాబట్టి ఆయన ప్రతిఫలాన్ని స్వీక రించరనీ లేదా మరే పనినీ చేయారని భావించాలి. అందువలన ఆయన టీవీలో చేస్తున్న హాస్య కార్య క్రమం నియమ నిబంధనలకు విరుద్ధమైనది. మంత్రిగా సిద్ధు పదీవీ స్వీకారం చేసేటప్పుడు, ప్రభుత్వ విధులను మాత్రమే నిర్వర్తిస్తానని ప్రమాణం చేశారు. రోహత్గీ తన వాదనను సవివరంగా ఒక టీవీ చానల్లో వినిపించారు. అయినాగానీ, పంజాబ్ అడ్వ కేట్ జనరల్ అతుల్ నందా రోహత్గీ అభిప్రాయానికి విరుద్ధంగా.. సిద్ధూ తన హాస్య కార్యక్రమాన్ని కొనసా గించడానికి అడ్డంకులు ఏవీ లేవనే వైఖరి చేపట్టారు. సిద్ధు శాఖను ప్రస్తుత సాంస్కతిక వ్యవహారాలు, స్థానిక పాలనా సంస్థలు, ఆర్క్సీవ్స్, మ్యూజియంల నుంచి మరో శాఖకు మార్చాల్సి రావచ్చునని ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అన్నారు. ఈ మార్పు ఎందుకో మాత్రం స్పష్టం చేయలేదు. పారితోషికం సంగతి అలా ఉంచినా, ఒక మంత్రి రోజుకు 24 గంటలు, వారానికి ఏడు రోజులు (24X7) మంత్రిగా ఉండటం తప్ప, మరే పనీ చేయడం ఆమో దనీయం కాదన్నట్టే అనిపిస్తుంది. శాసససభ ఎన్ని కల్లో కాంగ్రెస్ అనూహ్య విజయానికి దోహదపడినది తానేననే భావన సిద్ధుకు ఉంది. అందుకు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉన్నదని అనుకునేట్టయితే, ఏ శాఖలూ లేని మంత్రి పదవిని ఇచ్చి ఉంటే తప్ప ఆయన వాదన ఆమోదనీయం కాదనే అనిపిస్తుంది. ఏ శాఖలూ లేకపోతే ఆయనకు కొన్ని బాధ్యతలు తగ్గి, షూటింగ్ లకు ముంబైకి విమానంలో వెళ్లి రావడానికి వీలు చిక్క వచ్చు. సిద్ధూ కొనసాగించాలనుకుంటున్న పని లాభ దాయకమైనది అయితే, ప్రభుత్వ పదవి, మంత్రిగా ఉండటం మాత్రం చట్టం దృష్టిలో లాభదాయకమైనది ఎలా కాకపోతుంది? ఇదే ఆయన వాదనలోని సారం. సిద్ధూ టీవీలోని తన హాస్య కార్యక్రమంలో అలం కృతమైన భారీ సోఫాలో కూచుని, సిద్ధూయిజంగా పేరుమోసిన తన సొంత శైలిలో చతురోక్తులను సంధి స్తుండాలి, అతిగా నవ్వుతుండాలి. ఆ పనిని చేసు కుంటూనే ప్రభుత్వ పదవిలో కొనసాగాలని ఆయన కోరుకుంటున్నారు. సిద్ధు ఇలా పట్టుబట్టడం సరైనదే. దేశానికి నిజానికి నేడు కావాల్సినది, కొరవడినది కూడా పాక్షిక కాలిక (పార్ట్‌టైమ్) రాజకీయవేత్తలు, పాక్షిక కాలిక రాజకీయాలే. నా ఖాళీ సమయాల్లో నేను ఏం చేస్తాననే దానితో మరెవరికీ సంబంధం లేదని సిద్ధు అంటున్నారని నాకు అనిపిస్తుంది. తన చెవుల్లో మోగే సంగీతంతో మరెవరికీ సంబంధమూ లేనట్టే ఇది కూడా. రాజకీయవేత్తలు నిజాయితీగా పనిచేసి, తమ మధ్యవర్తిత్వాలు, ప్రాపకాలు ఏవీ లేకుండానే సాగి పోయే పరిపాలనకు హామీని కల్పిస్తే దేశం బాగుపడు తుంది. వ్యవస్థతో దాడుగుమూతలు ఆడటంతోనే రాజ కీయవేత్తలు తమ సగం కాలాన్ని వెచ్చిస్తుంటారు. ఒక గ్రామంలో బావి తవ్వాలన్నా, ఒక ఉపాధ్యా యుడ్ని ఒకజిల్లా పరిషత్తు పాఠశాల నుంచి మరో దానికి లేదా ఒక పోలీసు అధికారిని ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో దానికి బదీలీ చేయించడానికి మంత్రి జోక్యం అవసరం అవుతోందంటేనే ఏదో తీవ్రమైన తప్పు జరుగుతోందని అర్థం. మన పాలనా యంత్రాం గపు శక్తినంతటినీ అది హరించేసివేస్తోంది, అయినా ఆ దుస్థితిని మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. వ్యవస్థ పనిచేయకపోవడమే లేదా ఎల్లప్పుడూ దానితో ఆట లాడుతుండటమే 24్ఠ7 రాజకీయాలు కొనసాగడానికి కారణం. మంత్రి కాకపోయినా, శానససభ్యులుగా ఎన్నికైన కొద్ది రోజులకే రాజకీయవేత్తలు పోగు చేసుకుంటున్న సంపదకు ఏదో వనరు ఉండే ఉండాలి. ఇది రాజకీయ వ్యవస్థలోని దిగువ స్థాయి మునిసిపల్ సంస్థలకు, కార్పొరేటర్లకు కూడా వర్తిస్తుంది. ఎన్నికల సంఘం అధికారుల వద్ద దఖలు పరచే అఫిడవిట్లు ఆస్తులను సూచిస్తాయే తప్ప, వాటిని ఎలా సంపాదించారో మాత్రం చెప్పవు. అంటే ఏదో వ్యాపారం జరిగిందన్న మాటే. వ్యాపారం అంటే అదేదో చట్టం దృష్టిని ఆకర్షించే తరహాలో సాగేదని వూహించడం తప్పు కావచ్చు. ఈ బావతు వారికి తమ ఆస్తులను ప్రకటించేటప్పుడు పశ్చాత్తాపమూ కలగదు. ప్రస్తుతం ఉన్న ఎన్నికల చట్టాల ప్రకారం వారి ఆదాయ వనరులను వెల్లడిం చాల్సిన అవసరం లేదు. ప్రజా ప్రతినిధులకు చెల్లించే పారితోషికాలకు, వారి సంపదలకు పొంతనే ఉండదు. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
మచ్చలేని ఎన్నికల వ్యవస్థ
విశ్లేషణ మన ఎన్నికలు సాధ్యమైనంత సక్రమంగానే సాగుతాయి. అయినా ఓడిపోయిన వారు ఈవీఎంలలో దగా జరిగిందని అంటుంటారు. అవి నీతి, అధ్వాన పాలన అలవాటైన మనం మంచిని గుర్తించలేమేమో. ఉత్తరప్రదేశ్ ఎన్నిక లపై జరిపిన ఒక ఎగ్జి్జట్æపోల్ బీజేపీకి మెజారిటీ లభిస్తుం దని చెప్పిన విషయం తెలిసిందే. యూపీకి చెందిన ఒక ట్యాక్సీ డ్రైవర్ అలా ముంద స్తుగా ఫలితాలను చెప్పగలిగారంటే ఈవీఎంలలోకి తొంగిచూడ టం సహా ఏదో ఒక మోసం జరిగినట్టేనని గట్టిగా నమ్మేశాడు. ఎగ్జిట్ పోల్స్‌ను ఎలా నిర్వహిస్తారనే క్రమాన్ని అర్థం చేసుకునే ఓపిక కూడా లే కుండా అదేదో మోసమేనని బలంగా వాదించాడు. అక్కడి తమ గ్రామంలోని మతపరమైన రాజ కీయాలకు అనుగుణంగా ఫలితాలు లేవు మరి. ఇది ఓడిపోయిన వాళ్ల వాదన. యూపీలో మాయావతి, ముంబైలో ఘోర పరాజయానికి గురైన మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి ఇదే వాదన చేశారు. తమ ఓటమికి తామే కారణ మని గుర్తించలేకపోతే, తప్పులు మరెక్కడో ఉన్నాయంటూ అందుకు ఆధారాలను సృష్టిం చాల్సి వస్తుంది. ఇది, ఫలితాలను అంగీకరించ లేని అధ్వాన నాయకత్వపు లక్షణం. ఐదు రాష్ట్రాల.. యూపీ, పంజాబ్, ఉత్తరా ఖండ్, మణిపూర్, గోవాలలో ఎన్నికల తదుపరి ఎస్పీ, ఎమ్ఎన్ఎస్ క్యాడర్లు మళ్లీ ఈవీఎంలను తప్పుపడుతూ, ఈవీఎంల బొమ్మలను తగుల బెట్టి హోలీ జరుపుకున్నారు. ప్రజల దృష్టిలో సామంజస్యాన్ని సాధిస్తూ బీజేపీ భారీ విజ యాలతో ముందుకు సాగుతోంది. దీంతో ఈవీ ఎమ్లలోని ఫలితాలను తారుమారు చేయడ మనే భయం వ్యాపించింది. అయినా అలా జరి గిందని ఎవరు రుజువు చేసింది లేదు. భారత్‌లో ఎన్నికలు సాధ్యమైనంత సజా వుగానే సాగుతాయి. నరనరాన అవినీతి జీర్ణిం చుకుపోయిన పాలనా వ్యవస్థ నుంచే ఎన్నికల కమిషన్ ప్రధానంగా తన ఎన్నికల నిర్వహణ సిబ్బందిని సమకూర్చుకుంటుంది. పోలింగ్ బూత్ స్థాయి పోలింగ్ అధికారుల నుంచి రిట ర్నింగ్ అధికారులు, యంత్రాలకు కాపలా కాసే పోలీసుల వరకు అంతా అలాగే సమకూరు తారు. వారు, రోజువారీ పాలనా విధులలో కని పించని లక్ష్యశుద్ధిని, నిబద్ధతను ప్రదర్శిస్తారు. ఎన్నికల కమిషన్ మాట చెల్లుబాటవు తుంది, అది తన ఉత్తర్వుల అమలుపై శ్రద్ధ చూపుతుంది. ఈవీఎంలను, ఆ తర్వాత ఓటరు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టినప్పటి నుంచి బూత్‌ల స్వాధీనం పాత సంగతిగా మారి పోయింది. ఒకరి ఓటును మరొకరు వేయడం అరుదుగా తప్ప జరగడం లేదు. ఈసీ, ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినో లేక డీజీపీనో మార్చమని ఆదేశించినాగానీ, తక్షణమే దాన్ని అమలు చేయడం జరుగుతోంది. కేవలం ఎన్ని కల సమయంలోనే మన పాలనా యంత్రాం గంలో పనిచేస్తున్నవారి మంచి బయటకు వస్తుంది, అందువల్లనే వారా విధులను సక్ర మంగా నిర్వహిస్తారు. ఎన్నికల ప్రక్రియలో ఏదైనా వంచన అంటూ జరిగితే అది రాజకీయ నాయకుల వల్లనే జరుగుతుంది. నల్లధనం, లంచగొండితనం, బూటకపు వాగ్దానాలు వంటి తప్పుడు పనులన్నీ వారు చేసేవే. ఎన్నికలు సక్రమంగా జరగాలంటే కళ్లెం వేయాల్సింది వారికి మాత్రమే. ఎన్నికల నిర్వహణను జవహర్లాల్ నెహ్రూ 1950లో సుకుమార్ సేన్‌కు అప్పగిం చారు. అప్పటికంటే నేడు అది మెరుగుపడింది. అప్పట్లో సేన్, నిరక్షరాస్య ఓటర్లకు అర్థమయ్యే ఎన్నికల చిహ్నాలను ఎంపిక చేయడం నుంచి అన్నీ చేయాల్సి వచ్చింది. ఎన్నికల ప్రక్రియను మెరుగుపరిచేలా మార్పులు, చేర్పులు చేయడ మనేది నిరంతర ప్రక్రియగా సాగుతూ ఉంది. రాజకీయవేత్తలు తమ పార్టీలను సమాచార హక్కు చట్టం పరిధి కిందికి తెచ్చి, పార్టీల జవా బుదారీతనం విషయంలో మరింత పారదర్శక తను తేవడానికి తిరస్కరించాయి. ఎన్నికల కమి షన్ విచారించాల్సిన విషయం అదే. అవి అలా చేసి ఉంటే, ప్రత్యర్థి బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టి ప్రకటనలకు స్థలం నుంచి మీడియా (డబ్బు చెల్లించి వేయించుకునే వార్తలు), ఓట్లు వరకు ప్రతిదాన్నీ కొనేయడానికి నిధుల అందుబాటును తగ్గించగలుగుతాం. కానీ ఇందుకు రాజకీయ వ్యవస్థ నిరాకరిస్తుంది. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు ఓటమి పాలైన ప్పుడు మాత్రం ఈవీఎంలను తప్పుబడుతుం టుంది. అయితే, పైన పేర్కొన్న ట్యాక్సీ డ్రైవర్, దేశంలోని చాలా మందిలాగే తాము కోరుకున్న ఫలితాలు రావాలనే దానిపైనే దృష్టి పెడతాడు. అంతేగానీ, అనుమానానికి తావేలేని పరిశుద్ధ మైన వ్యవస్థను నిర్మించగలమని మాత్రం నమ్మడు. ఏ మోసానికి ఆస్కారం లేకుండా కూడా మన దేశంలో కొన్ని పనులు జరగవచ్చని తెలిస్తే హాయిగా ఉండదూ? అవినీతికి, అధ్వాన పాలనకు అలవాటుపడ్డ మనం మెరుగ్గా ఉన్న దాన్ని గుర్తించలేమేమో అనిపిస్తుంది. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com