వైద్యవృత్తిలో ముడుపుల పర్వం
విశ్లేషణ
డాక్టర్‌కు, లేబొరేటరీకి మధ్య ఉండే ఆర్థికపరమైన ఒప్పందం వల్ల అనవసరమైన లెక్కలేనన్ని పరీక్షలను చేయించుకోవాల్సి వస్తుంది. రోగికి ఆ పరీక్షలు అవసరం కాకపోవచ్చు. ఆ విషయం డాక్టర్‌కు తెలిసే ఉండవచ్చు.
‘‘నిజాయితీతో కూడిన అభి ప్రాయం. కమీషన్లు లేని డాక్టర్లు’’ అంటూ ఆసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ముంబైలో పెట్టిన ప్రకటన పని చేసినట్టే కనిపిస్తోంది. వైద్య వృత్తిలోని ముడుపులు చెల్లింపుల పద్ధ తికి పగ్గాలు వేయడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం నియ మించిన బృందం కొన్ని సూచనలను చేసింది. శాస నసభ వాటిని చట్టంగా రూపొందించవచ్చు. అయితే అది ఆ ఒక్క రాష్ట్రానికే పరిమితం. ముడుపులు పుచ్చు కుంటూ లేదా ఇస్తూ దొరికినవారికి రూ. 5,000 జరి మానా, మూడు నెలల జైలుశిక్ష విధించాలని కొన్ని వారాల క్రితం ఏర్పాటు చేసిన ఆ బృందం సూచిం చింది. అదే నేరాన్ని తిరిగి చేసేట్టయితే జరిమానా మరింత పెరుగుతుంది.
అంటే, మొదటి దఫా జరిమా నాకు ఐదు రెట్లు. జరిమానా కాకపోయినా, జైలు శిక్ష వల్ల కలిగే అవమానమైనా ఈ ముడుపుల బాట పట్టిన వారిని ఇరుకుగా ఉండే ముక్కు సూటి దారికి తీసుకు రావాలి. ఇది ఏదో ఒక్కరికి సంబంధించిన వ్యవహారం కాదు. నిపుణ వైద్యులను, వైద్య పరీక్షలు చేసే లేబొ రేటరీలను సూచించే డాక్టర్లందరికీ, సదరు వైద్యులు లేదా లేబొరేటరీలు రోగుల నుంచి వసూలు చేసే బిల్లు పరిమాణాన్ని బట్టి ముడుపులు అందుతాయి. ఈ పద్ధతికి సంబంధించి సమాధానపరచగలిగిన వివరణ ప్రజలకు అవసరం. ఈ పద్ధతి అమలులో ఉందనడాన్ని ఖండించడం మాత్రమే వారిని సమాధానపరచలేక పోవచ్చు. ఆ సమస్య ఉన్నదని ఆమోదించి, ఆ పద్ధతి అంతరించిపోయిందని ప్రజలు సంతృప్తి చెందే రీతిలో దానికి కళ్లెం వేయడం అవసరం.
మహారాష్ట్ర పోలీసుశాఖ మాజీ అధిపతి ప్రవీణ్ దీక్షిత్ నేతృత్వంలో ఈ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయడం, ముడుపుల పద్ధతికి వ్యతిరేకంగా పోరా డుతున్న డాక్టర్ హెచ్ బవాస్కర్‌కు అందులో స్థానం కల్పించడం ఈ సమస్య పట్ల రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ చూపుతున్నదని సూచిస్తున్నాయి. డాక్టర్ బవాస్కర్ గురించి ప్రముఖ వైద్య పత్రిక ద లాన్‌సెట్ , బహుశా 2013లో ప్రస్తావించింది. అందువల్లనే గామోసు ఆయన వైద్య వృత్తిలోని ప్రముఖుడు కాలేకపోయారు, ఈ పద్ధతికి ముగింపు పలకాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తులను విస్మరించారు.
‘‘63 ఏళ్ల డాక్టర్ హిమ్మత్‌రావు సాలుబా బవాస్కర్ డెస్క్ మీదకు ఒక డయాగ్నస్టిక్ సెంటర్ నుంచి ‘వృత్తి పరమైన ఫీజు’ పేరిట ఓ చెక్కు వచ్చి పడగా, ఆయన దాన్ని స్వీకరించడానికి బదులు తిప్పి పంపడమే కాదు, ఆ సెంటర్‌కు వ్యతిరేకంగా వైద్య విద్యను, డాక్టర్లను పర్యవేక్షించి, నిఘా ఉంచే సంస్థౖయెన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’’(ఎంసీఐ)కు ఫిర్యాదు చేశారు కూడా. ఆ కేసు పర్యవసానం ఏమైందో స్పష్టంగా తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందంలో ఎంసీఐ ప్రతినిధితో పాటూ బవాస్కర్‌కు కూడా చోటు దక్కడం ఉత్సాహాన్ని రేకెత్తించే అంశం. ఇది ఈ బృందం ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం దిశను సూచించేది మాత్రమే. ఒకసారి ఆ చట్టాన్ని తెచ్చాక, దాన్ని ప్రభుత్వ యంత్రాంగం ఎలా అమలు చేస్తుం దనేది పూర్తిగా వేరే విషయం. అధ్వానమైన అమలుతో ఎంత మంచి చట్టానికైనా తూట్లు పొడిచేయగలిగిన మన దేశంలో పరిపాలనకు సంబంధించిన ప్రధాన సమస్య అదే, నిజమే.
వైద్య వృత్తిలో నిస్సిగ్గుగా అదనపు రాబడిని రాబట్టే సాధనంగా అమలవుతున్న ఈ పద్ధతిని తుదముట్టించడానికి మెడికల్ కౌన్సిల్ సుముఖంగా ఉండి ఉంటే... దాదాపు అర్ధ దశాబ్ది క్రితం నాటి బవాస్కర్ ఫిర్యాదు ఆధారంగానే అది ఆ పని చేసి ఉండేది. ఆ వ్యాపార ప్రకటన తెలిసి ఉండక పోవచ్చు కూడా. ముడుపుల గురించి కౌన్సిల్‌కు తెలియకపోవడం కాదు. ప్రత్యేకించి స్టెంట్లు సహా పలు విష యాలలో ఆసుపత్రులు రోగుల నుంచి అధికంగా ఎలా వసూళ్లను చేస్తున్నాయో ప్రభుత్వమే ఎత్తి చూపుతోంది. కాబట్టి ఎంసీఐకి ముడుపుల వ్యవహారం తెలియదను కోలేం.
ఆసియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ ప్రకటన పట్ల వెలువడ్డ ప్రతిస్పందనలు... ఈ సమస్యపై వైద్య వృత్తిలో ఉన్నవారు చీలిపోయి ఉన్నట్టు వెల్లడి చేశాయి. కొందరు దీన్ని ప్రచారం కోసం వేసిన తెలివైన ఎత్తుగడని ఆరోపించగా, మరికొందరు ఈ ముడుపుల వ్యవహారం కొందరికే పరిమితమని వాదించారు. అయితే, బవాస్కర్ మినహా ఈ వృత్తికి చెందిన మరె వరూ దీని గురించి ఏ మాత్రం బయటకు పొక్క నియ్యలేదు. ఈ అవినీతి విస్తృతి ఎంతో నిర్వచించలేం. కానీ ఔషధ సంస్థలు మాత్రం, తాము అందించే ప్రోత్సాహకాలకు బదులుగా లబ్ధిని పొందుతూనే ఉండి ఉండాలి.
వైద్య వృత్తిలోని ముడుపులను ‘కట్ ప్రాక్టీస్’ (ఫీజుల పంపకం పద్ధతి)గా పిలుస్తారు లేదా అభి వర్ణిస్తారు. ఈ పద్ధతి వల్ల వైద్య సేవల వ్యయం పెరిగిపోతుంది. డాక్టర్‌కు, రోగనిర్ధారణ లేబొరేటరీకి మధ్య ఉండే ఈ ఆర్థికపరమైన ఒప్పందం వల్లనే అన వసరమైన లెక్కలేనన్ని పరీక్షలను చేయించుకోవాల్సి వస్తుంది. రోగికి ఈ పరీక్షలు అవసరం లేకపోవచ్చు. ఆ విషయం డాక్టర్‌కూ తెలిసే ఉండవచ్చు. ఆ లేబొరేటరీ అనవసరమైన ఆ పరీక్షలను నిజంగా చేయకుండానే వాటికి బిల్లు ఇచ్చి ఉండవచ్చు.
- మహేష్ విజాపృకర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com