సిద్ధు వాదం సమంజసం
విశ్లేషణ
ఎప్పటిలా తన పనిని తాను చేసుకుంటూనే ప్రభుత్వ పదవిలో కొనసాగాలని సిద్ధు ఆశిస్తున్నారు. ఆయన ఇలా పట్టుబట్టడం సరైనదే. దేశానికి నేడు కావాల్సి నది, కొరవడినది కూడా పార్ట్‌టైమ్ రాజకీయవేత్తలు, పార్ట్‌టైమ్ రాజకీయాలే.
నవజోత్‌సింగ్ సిద్ధు మాజీ క్రికెట్ క్రీడాకారుడు, పంజాబ్ నూతన ప్రభుత్వంలో నేడు మంత్రి. ఒక ఆసక్తికరమైన అంశాన్ని ఆయన లేవనె త్తారు. ఒక మంత్రి సాధారణ మైన తన పనిని కొనసాగిస్తూ ఆదాయాన్ని సంపాదించుకో వచ్చా? ఈ సందర్భంలో అది టీవీలోని ఒక హాస్య కార్యక్రమంలో కనిపించడం. అది తనకు ఆదాయ వనరనీ, తాను అవినీతి ద్వారా బతకా లనుకోవడం లేదనీ, అందువలన ఆ పని తనకు అవసర మని ఆయన వాదన.
సిద్ధు ఒక మంత్రి కాబట్టి ఆయన ప్రభుత్వ ఉద్యో గనీ, అందుకు ఆయనకు ప్రతిఫలం ముడుతుందని భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఒక టీవీ చానల్‌తో అన్నారు. కాబట్టి ఆయన ప్రతిఫలాన్ని స్వీక రించరనీ లేదా మరే పనినీ చేయారని భావించాలి. అందువలన ఆయన టీవీలో చేస్తున్న హాస్య కార్య క్రమం నియమ నిబంధనలకు విరుద్ధమైనది. మంత్రిగా సిద్ధు పదీవీ స్వీకారం చేసేటప్పుడు, ప్రభుత్వ విధులను మాత్రమే నిర్వర్తిస్తానని ప్రమాణం చేశారు.
రోహత్గీ తన వాదనను సవివరంగా ఒక టీవీ చానల్‌లో వినిపించారు. అయినాగానీ, పంజాబ్ అడ్వ కేట్ జనరల్ అతుల్ నందా రోహత్గీ అభిప్రాయానికి విరుద్ధంగా.. సిద్ధూ తన హాస్య కార్యక్రమాన్ని కొనసా గించడానికి అడ్డంకులు ఏవీ లేవనే వైఖరి చేపట్టారు. సిద్ధు శాఖను ప్రస్తుత సాంస్కతిక వ్యవహారాలు, స్థానిక పాలనా సంస్థలు, ఆర్క్సీవ్స్, మ్యూజియంల నుంచి మరో శాఖకు మార్చాల్సి రావచ్చునని ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ అన్నారు. ఈ మార్పు ఎందుకో మాత్రం స్పష్టం చేయలేదు.
పారితోషికం సంగతి అలా ఉంచినా, ఒక మంత్రి రోజుకు 24 గంటలు, వారానికి ఏడు రోజులు (24X7) మంత్రిగా ఉండటం తప్ప, మరే పనీ చేయడం ఆమో దనీయం కాదన్నట్టే అనిపిస్తుంది. శాసససభ ఎన్ని
కల్లో కాంగ్రెస్ అనూహ్య విజయానికి దోహదపడినది తానేననే భావన సిద్ధుకు ఉంది. అందుకు ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సి ఉన్నదని అనుకునేట్టయితే, ఏ శాఖలూ లేని మంత్రి పదవిని ఇచ్చి ఉంటే తప్ప ఆయన వాదన ఆమోదనీయం కాదనే అనిపిస్తుంది. ఏ శాఖలూ లేకపోతే ఆయనకు కొన్ని బాధ్యతలు తగ్గి, షూటింగ్ లకు ముంబైకి విమానంలో వెళ్లి రావడానికి వీలు చిక్క వచ్చు.
సిద్ధూ కొనసాగించాలనుకుంటున్న పని లాభ దాయకమైనది అయితే, ప్రభుత్వ పదవి, మంత్రిగా ఉండటం మాత్రం చట్టం దృష్టిలో లాభదాయకమైనది ఎలా కాకపోతుంది? ఇదే ఆయన వాదనలోని సారం. సిద్ధూ టీవీలోని తన హాస్య కార్యక్రమంలో అలం కృతమైన భారీ సోఫాలో కూచుని, సిద్ధూయిజంగా పేరుమోసిన తన సొంత శైలిలో చతురోక్తులను సంధి స్తుండాలి, అతిగా నవ్వుతుండాలి. ఆ పనిని చేసు కుంటూనే ప్రభుత్వ పదవిలో కొనసాగాలని ఆయన కోరుకుంటున్నారు. సిద్ధు ఇలా పట్టుబట్టడం సరైనదే.
దేశానికి నిజానికి నేడు కావాల్సినది, కొరవడినది కూడా పాక్షిక కాలిక (పార్ట్‌టైమ్) రాజకీయవేత్తలు, పాక్షిక కాలిక రాజకీయాలే. నా ఖాళీ సమయాల్లో నేను ఏం చేస్తాననే దానితో మరెవరికీ సంబంధం లేదని సిద్ధు అంటున్నారని నాకు అనిపిస్తుంది. తన చెవుల్లో మోగే సంగీతంతో మరెవరికీ సంబంధమూ లేనట్టే ఇది కూడా. రాజకీయవేత్తలు నిజాయితీగా పనిచేసి, తమ మధ్యవర్తిత్వాలు, ప్రాపకాలు ఏవీ లేకుండానే సాగి పోయే పరిపాలనకు హామీని కల్పిస్తే దేశం బాగుపడు తుంది. వ్యవస్థతో దాడుగుమూతలు ఆడటంతోనే రాజ కీయవేత్తలు తమ సగం కాలాన్ని వెచ్చిస్తుంటారు.
ఒక గ్రామంలో బావి తవ్వాలన్నా, ఒక ఉపాధ్యా యుడ్ని ఒకజిల్లా పరిషత్తు పాఠశాల నుంచి మరో దానికి లేదా ఒక పోలీసు అధికారిని ఒక పోలీస్ స్టేషన్ నుంచి మరో దానికి బదీలీ చేయించడానికి మంత్రి జోక్యం అవసరం అవుతోందంటేనే ఏదో తీవ్రమైన తప్పు జరుగుతోందని అర్థం. మన పాలనా యంత్రాం గపు శక్తినంతటినీ అది హరించేసివేస్తోంది, అయినా ఆ దుస్థితిని మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. వ్యవస్థ పనిచేయకపోవడమే లేదా ఎల్లప్పుడూ దానితో ఆట లాడుతుండటమే 24్ఠ7 రాజకీయాలు కొనసాగడానికి కారణం.
మంత్రి కాకపోయినా, శానససభ్యులుగా ఎన్నికైన కొద్ది రోజులకే రాజకీయవేత్తలు పోగు చేసుకుంటున్న సంపదకు ఏదో వనరు ఉండే ఉండాలి. ఇది రాజకీయ వ్యవస్థలోని దిగువ స్థాయి మునిసిపల్ సంస్థలకు, కార్పొరేటర్లకు కూడా వర్తిస్తుంది. ఎన్నికల సంఘం అధికారుల వద్ద దఖలు పరచే అఫిడవిట్లు ఆస్తులను సూచిస్తాయే తప్ప, వాటిని ఎలా సంపాదించారో మాత్రం చెప్పవు.
అంటే ఏదో వ్యాపారం జరిగిందన్న మాటే. వ్యాపారం అంటే అదేదో చట్టం దృష్టిని ఆకర్షించే తరహాలో సాగేదని వూహించడం తప్పు కావచ్చు. ఈ బావతు వారికి తమ ఆస్తులను ప్రకటించేటప్పుడు పశ్చాత్తాపమూ కలగదు. ప్రస్తుతం ఉన్న ఎన్నికల చట్టాల ప్రకారం వారి ఆదాయ వనరులను వెల్లడిం చాల్సిన అవసరం లేదు. ప్రజా ప్రతినిధులకు చెల్లించే పారితోషికాలకు, వారి సంపదలకు పొంతనే ఉండదు.
- మహేష్ విజాపృకర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com