పిల్లల చదువులు పెద్దల హక్కు | opinion over parents rights on children's education by Central Information Commissioner madabhushi sridhar | Sakshi
Sakshi News home page

పిల్లల చదువులు పెద్దల హక్కు

Published Fri, Oct 28 2016 1:04 AM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

పిల్లల చదువులు పెద్దల హక్కు

పిల్లల చదువులు పెద్దల హక్కు

పిల్లల చదువులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ బడులే కాదు ప్రైవేట్‌ పాఠశాలలు కూడా ఇవ్వాల్సిందే. పౌరులు తమ పిల్లల బడులకు సంబంధించి సమాచారం కోరే హక్కును స.హ. చట్టం ఇచ్చింది.

విశ్లేషణ
పిల్లల చదువులకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వ బడులే కాదు ప్రైవేట్‌ పాఠశాలలు కూడా ఇవ్వాల్సిందే. పౌరులు తమ పిల్లల బడులకు సంబంధించి సమాచారం కోరే హక్కును స.హ. చట్టం ఇచ్చింది.
 
పాఠశాలలు తమ సమాచా రాన్ని స్థానిక సంస్థలకు, ప్రభు త్వానికి ఇవ్వాలని సెక్షన్‌ 12 (3) విద్యా హక్కు చట్టం నిర్దేశి స్తున్నది. ప్రభుత్వంగానీ స్థానిక సంస్థగానీ కోరిన విధంగా ప్రతి స్కూల్‌ సమాచారాన్ని ఇవ్వాల న్నది సుస్పష్టం. ప్రభుత్వ లేదా ఎయిడెడ్‌ పాఠశాల స.హ. చట్టం కింద ప్రభుత్వ సంస్థలే. ఈ బడులకు సంబం ధించి పౌరులు సమాచారాన్ని కోరే హక్కు స.హ. చట్టం ఇచ్చింది. పిల్లలు గానీ వారి పక్షాన తల్లి దండ్రులుగానీ కోరవచ్చు. ప్రభుత్వ నిధులు పొందక పోయినా, తగ్గింపు ధరలో భూములు ఇతర మినహాయింపులు పొందిన ప్రైవేటు స్కూల్‌ కూడా ప్రభుత్వం కోరిన సమాచారాన్ని విద్యా చట్టం 2009 కింద ఇవ్వాల్సిందే. ఒక చట్టం ద్వారా ప్రైవేటు స్కూలు సమాచారాన్ని కోరుకునే వ్యవస్థ ఉంటే అది ఆర్టీఐ కింద సమాచారమే అవుతుందని ఆ చట్టం సెక్షన్‌ 2(ఎఫ్‌) నిర్వచించింది.
 
ప్రతి ప్రాంతంలో బడి ఉండాలని విద్యా చట్టం నిర్దేశిస్తున్నది. సర్కారు బడి లేకపోతే అక్కడి ప్రైవేటు స్కూల్‌లో చదువులకు నోచుకోని వెనుకబడిన తరగ తుల పిల్లలకు 25 శాతం సీట్లు ఇవ్వాలి. ఆ చదువు ఖర్చు లను ప్రభుత్వమే భరించాలి. ప్రైవేటు బడులు సర్కారు నుంచి ఏ విధమైన సహాయం పొందినా తగ్గింపు ధరలో భూమి పొందినా, మినహాయింపులు పొందినా, చదు వుల ఖర్చు భరించాల్సిన పని లేదని సెక్షన్‌ 12 పేర్కొ న్నది. కనుక ప్రైవేటు బడులు కూడా సమాచారం ఇవ్వా ల్సిందే. సమాధానం చెప్పాల్సిందే.
 
తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లలను తప్పని సరిగా బడిలో చేర్చి చదువుకునే అవకాశం కల్పించా  ల్సిందే. (సెక్షన్‌ 10) తరువాత ఈ చట్టంలో పిల్లల హక్కులన్నీ అమలు చేయడానికి వారు నడుంకట్టాలి. విద్యా చట్టం ప్రకారం ఆరునుంచి 14 ఏళ్ల వయసు వారిని పిల్లలు అని నిర్వచించారు. వీరి తరఫున సంర క్షకులే ఆ హక్కులను కోరి సాధించాలి.
 
విద్యా చట్టం కింద వివరించిన పిల్లల చదువు హక్కులు ఇవి. 1. ప్రభుత్వం ద్వారా తప్పనిసరి విద్య పొందే బాధ్యత హక్కు తల్లిదండ్రులకు ఉంది. (సెక్షన్‌ 3); 2.ఆరు సంవ త్సరాలు దాటిన పిల్లలు బడిలో చేరి ఉండకపోతే బడిలో చేర్పించుకునే హక్కు (సె. 4); 3. తమ సమీప ప్రాంతాలలో ప్రభుత్వం బడిని నెలకొల్పా లని కోరే హక్కు (సె. 6); 4. కేంద్రం రాష్ట్రాల ప్రభు త్వాల నుంచి తగిన నిధులు కోరే హక్కు (సె. 7); 5. ప్రభుత్వం స్థానిక సంస్థలకు సె. 8,9  కొన్ని బాధ్యత లను నిర్దేశించాయి. వాటిని అమలు చేయించుకునే హక్కు; 6. పాఠశాలలకు చట్టం నిర్దేశించిన బాధ్యతలను అమలు చేయించుకునే హక్కు (సె.12); 7.  సమాచార హక్కు (సె.12(3)); 8. క్యాపిటేషన్‌ ఫీజును వ్యతిరేకించే హక్కు, బడిలో చేర్చడానికి ఇంటర్వూ్యలు తదితర అడ్డం కులేవీ లేకుండా ఉండే హక్కు; 9. వయసు ధ్రువీకరణ లేదని బడిలో చేరనీయకపోవడాన్ని నిరోధించే హక్కు (సె.14); 10. విద్యార్థిని పై తరగతిలో  చేరడాన్ని ఆప కూడదని కోరే హక్కు, బడి నుంచి పంపివేయకుండా ఉండే హక్కు (సె. 16), 11. పిల్లలను శారీరకంగా మాన సికంగా హింసించకుండా ఉండే హక్కు, (సె. 17); 12. బడికి గుర్తింపు ఉండాలి, ఆ గుర్తింపు పత్రం చూపాలని కోరే హక్కు (సె. 18); 13. బడులకు నిర్దేశించిన నియ మాల అమలు (సె. 19); 14. స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ సరిగ్గా పనిచేయాలని, తీర్మానాలు అమలు చేయాలని కోరే హక్కు (సె. 21); 15, ప్రతి బడి అభివృద్ధి ప్రణా ళికను రూపొందించి అమలుచేయాలని కోరే హక్కు (సె.22); 16. నిర్దేశిత అర్హతలు ఉన్న పంతుళ్లనే నియ మించాలని కోరే హక్కు (సె.23); 17. పంతుళ్లు తమ బాధ్యతలను నిర్వహించాలనీ, తమ సమస్యలు తీర్చా లని కోరే హక్కు (సె24); 18. పంతుళ్లకు విద్యార్థుల మధ్య సరైన నిష్పత్తి ఉండాలని కోరే హక్కు (సె25); 19. పంతుళ్ల స్థానాలను భర్తీ చేయాలనే హక్కు, (సె26); 20. విద్యా బోధనా ప్రణాళిక (కరికులం) అమలు, దాని మూల్యాంకన విధానం కోరే హక్కు (సె 29); 21. స్థానిక సంస్థకు లేదా రాష్ట్ర పిల్లల కమిషన్‌కు ఫిర్యాదు చేసే హక్కు (సె32); 22. స్వతంత్రంగా ఫిర్యా దులను బాధలను వినేందుకు రాష్ట్ర స్థాయి పిల్లల కమి షన్‌ ఏర్పాటు చేయాలని కోరే హక్కు (సె. 32); 23. ఈ హక్కులకు సంబంధించిన పూర్తి సమాచారం పొందే హక్కు (ఆర్టీఐ కింద); 24. జాతీయ సలహా మండలిని ఏర్పాటు చేయాలని కోరే హక్కు, (సె. 33); 25. రాష్ట్ర సలహా మండలి ఏర్పాటు కోరే హక్కు (సె. 34).
 
పిల్లలందరికీ చదువు చెప్పాలంటే, విద్యా హక్కు అమలు కావాలంటే ఈ 25 రకాల హక్కులను అమలు చేయించుకోవలసి ఉంటుంది. ప్రతి ఊళ్లో బడికి సంబం ధించి 25 హక్కుల సమాచారాన్ని సహ చట్టం కింద అడగడం ద్వారా హక్కులను సాధించుకోవచ్చు.
 
(తెలంగాణ తల్లిదండ్రుల సంఘం ప్రారంభ సభలో ప్రసంగం ఆధారంగా)
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
ఈ మెయిల్ : professorsridhar@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement