మృతదేహాల తరలింపునకు.. టీఈజీడబ్ల్యూఏ చొరవ | TeGWA urges indian ambassador to repatrition of gulf workers bodies | Sakshi
Sakshi News home page

మృతదేహాల తరలింపునకు.. టీఈజీడబ్ల్యూఏ చొరవ

Published Mon, Aug 7 2017 10:27 PM | Last Updated on Sun, Apr 7 2019 4:37 PM

మృతదేహాల తరలింపునకు.. టీఈజీడబ్ల్యూఏ చొరవ - Sakshi

మృతదేహాల తరలింపునకు.. టీఈజీడబ్ల్యూఏ చొరవ

బతుకుదెరువు కోసం గల్ఫ్‌కు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన తెలంగాణకు చెందిన పలమాకుల సత్తయ్య, గంగ శ్రీనందన్‌(19)ల మృతదేహాలను భారత్‌కు రప్పించేందుకు తెలంగాణ గల్ఫ్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌(టీఈజీడబ్ల్యూఏ) ఒమన్‌లోని భారత అంబాసిడర్‌కు ఓ లేఖ రాసింది. ఈ మేరకు టీఈజీడబ్ల్యూఏ అధ్యక్షుడు నాంగి దేవేందర్‌ రెడ్డి ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.

సత్తయ్య 14 సంవత్సరాల క్రితం ఒమన్‌లో పని చేయడానికి వచ్చినట్లు చెప్పారు. కాగా, శ్రీనందన్‌ బహ్రయిన్‌లో క్లీనర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. గత నెల అనారోగ్యంతో ఒమన్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన సత్తయ్య.. 31వ తేదీన ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మనస్తాపంతో శ్రీనందర్‌ ఆత్మహత్య చేసుకున్నారని వెల్లడించారు. సత్తయ్య, శ్రీనందన్‌ల మరణవార్తను వారి కుటుంబసభ్యులకు చేరవేసి, మృతదేహాలను భారత్‌కు పంపేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement