భర్త మృతదేహానికి అంత్యక్రియలు చేస్తున్న లక్ష్మి
అల్లిపురం(విశాఖ దక్షిణ): భర్త మృతదేహానికి భార్యే అంత్యక్రియలు నిర్వహించిన ఘటన గురువారం అల్లిపురంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కుమ్మరవీధి కమ్యూనిటీ హాల్ ఎదురుగా అనగోలు నర్సింగరావు (54), తన భార్య లక్ష్మితో కలసి నివసిస్తున్నాడు. వీరికి పిల్లలు లేరు. గత బుధవారం నర్సింగరావుకు చాతీలో నొప్పి రావడంతో స్థానికంగా ఉంటున్న సామాజిక కార్యకర్త పచ్చిరిపల్లి రాము సహకారంతో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను గురువారం ఉదయం మృతి చెందాడు. మృతుని భార్య లక్ష్మి దిక్కుతోచని స్థితిలో ఉంటే స్థానికులు, రాము సహకారంతో మృతదేహానికి కాన్వెంట్ జంక్షన్ వద్ద గల శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. పిల్లలు లేకపోవడంతో తన భర్తకు లక్ష్మి కర్మకాండలు జరిపించింది.
Comments
Please login to add a commentAdd a comment