
మలయాళ బ్యూటీ అపర్ణదాస్ ఎంబీఏ చదివింది. ఆ తర్వాత అకౌంటెంట్‌గా పని చేస్తూనే మోడల్‌గానూ ట్రై చేసింది.

ఖాళీ సమయంలో టిక్‌టాక్ వీడియోలూ చేసింది. ఈ సమయంలోనే డైరెక్టర్ సత్యన్ అనికంద్ తన వీడియోలు చూసి ఇంప్రెస్ అయ్యాడు.

అలా నిళన్ ప్రకాశన్ (2018) సినిమాలో తీసుకున్నాడు. ఇదే అపర్ణకు తొలి సినిమా.

తర్వాత మనోహరం మూవీతో హీరోయిన్‌గా మారింది. దాదా సినిమాతో అందరి మనసులు గెలిచేసింది.

తెలుగులో మాత్రం ఆదికేశవ మూవీలో హీరో సోదరిగా నటించింది.

ప్రస్తుతం మలయాళంలో వరుస సినిమాలు చేస్తున్న బ్యూటీ ఇటీవలే (ఏప్రిల్ 24న) మంజుమ్మల్ బాయ్స్ నటుడు దీపక్ పరంబోల్‌ను పెళ్లాడింది.

తాజాగా అపర్ణదాస్ 29వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. తన బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బ్యూటీ అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది.











