1/12
వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా సెల్ కాదు.. టీడీపీ సోషల్ మీడియానే ఓ ఉన్మాద కారాగారమంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు పంచులు విసిరారు.
2/12
సోషల్ మీడియా ద్వారా ఎవరి అభిప్రాయాలను వారు చెప్పుకునే అవకాశం ఉంది. చంద్రబాబు తన చేతిలో ఉన్న ఎల్లోమీడియాని కట్టడి చేయగలరు. కానీ సోషల్ మీడియాని ఎవరూ కట్టడి చేయలేరు
3/12
ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. బెదిరిస్తున్నారు. అక్రమంగా నిర్బంధిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఉన్మాదుల కర్మాగారం అంటూ ఎల్లోమీడియాలో చంద్రబాబు రాయిస్తున్నారు.
4/12
రాష్ట్రంలో ముచ్చుమర్రిలాంటి ఘటనలు జరిగినా ఆ పత్రికలు పట్టన్నట్లు వ్యవహరిస్తున్నాయి. అదే.. చంద్రబాబు రోడ్డు మీద గుంటలకు శంకుస్థాపన చేస్తే అదొక పెద్ద కార్యక్రమంగా వార్తలు రాస్తున్నాయి.
5/12
ఏపీలో పోలీసులతో జనాన్ని భయపెడుతున్నారు. చట్టపరమైన పనులు చేసే పోలీసు అధికారులను బదిలీలు చేస్తున్నారు. అక్రమమైన పనులు చేసేవారికి మంచి పోస్టులు ఇస్తున్నారు
6/12
ఎల్లోమీడియా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలుగా మారాయి. జగన్ వ్యక్తిత్వహననం చేసేలా వార్తలు పోస్టు చేశారు. టీడీపీ అధికారిక పేజీలలోనూ నారా లోకేష్ తన ట్విట్టర్‌లో దారుణమైన దూషణలు చేశారు. అనుకూల పేజీల్లోనూ ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నారు.
7/12
చంద్రబాబు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడులలో అడ్డగోలు కథనాలతో తిట్టిస్తున్నారు. జగన్ గురించి మాట్లాడితే నన్ను చంపేస్తానని వెంగళరావు అనే టీడీపీ కార్యకర్త బెదిరించాడు. నా గురించి, నా కుటుంబం గురించి దారుణంగా పోస్టులు పెట్టారు. యూట్యూబ్ ఛానల్స్‌లో జగన్‌ని దారుణంగా తిడుతూ మాట్లాడుతున్నారు. వీటన్నింటికీ కారకుడు నారా లోకేష్
8/12
సీమరాజా, కిర్రాక్ ఆర్పీ, స్వాతి.. ఇలా కొందరు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. వీళ్లంతా టీడీపీ సైకో ఫ్యాక్టరీ నుంచి పుట్టుకొచ్చినవాళ్లే. టీడీపీనే వీళ్లను పెంచిపోషిస్తోంది. మరి వీళ్లను అరెస్ట్ చేయరా?.
9/12
మిమ్మల్ని తిడితే నేరం. జగన్‌ను ఇంత తిడుతుంటే అరెస్ట్ చేయరా?. టీడీపీ అరాచకాన్ని అడ్డుకోలేరుగానీ మావారిపై మాత్రం అక్రమ కేసులు పెడతారా?. విడదల రజినీ తనపై దుష్ర్పచారం చేసిన యూట్యూబ్ ఛానెల్స్‌పై ఫిర్యాదు చేశారు. మరి చర్యలేవీ?. మా కార్యకర్తలకు అండగా జగన్ ఉన్నారు. న్యాయపరంగా లీగల్ సెల్ ఆదుకుంటుంది.
10/12
సోషల్ మీడియాలో తన బిడ్డలను దూషిస్తున్నారని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఆడబిడ్డను తిడితే ప్రొత్సహించేవాళ్లు ఎవరైనా ఉంటారా?. మేం అసలు ఆ రకం కానేకాదు.
11/12
పచ్చమీడియాని బహిష్కరించమని గతంలో పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రజ్యోతినా? టీడీపీ జ్యోతినా? అని విమర్శించారు. తన తల్లిని కూడా టీడీపి వారు దూషించారు అంటూ పవన్ ఆప్పుడు అన్నారు. ఇప్పుడు వాళ్లను క్షమించారా?.
12/12
హోం మంత్రి, కాబోయే హోం మంత్రి పవన్ కల్యాణ్‌లు చెడును భుజానా మోయకండి. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. ఎవరికీ భయపడం. న్యాయపరంగా పోరాటం చేస్తాం.