Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Chandrababu Cabinet transfer of lands worth Rs 3,000 crore to anonymous company1
కేంద్ర సంస్థలకు రూ.కోట్లలో..'ఉర్సాకు ఊరికే'!

సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: కేంద్ర సంస్థలకైతే ఎకరా రూ.4 కోట్లు.. ఆర్మీకైనా సరే కోటికి తగ్గేది లేదు..! ఉర్సాకైతే ఊరికే! ఒక్క రూపాయికి కనీసం ఓ ఇడ్లీ కూడా రాదు..! మరి 99 పైసలకు రూ.3,000 కోట్ల భూములు ఎలా..? ఊరూ పేరు లేని కంపెనీపై ఔదార్యం వెనుక గుట్టు ఏమిటి? ప్రతిష్టాత్మక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలు ఏర్పాటవుతుంటే ఏ ప్రభుత్వమైనా స్వాగతించి వీలైనన్ని వెసులుబాట్లు కల్పించి భూముల కేటాయింపులో ఉదారంగా వ్యవహరిస్తుంది! కానీ.. ప్రముఖ కేంద్ర సంస్థల నుంచి ఎకరా రూ.నాలుగు కోట్ల చొప్పున వసూలు చేస్తూ.. ఊరూ పేరు లేని ఓ డొల్ల కంపెనీకి మాత్రం రూ.3,000 కోట్లకుపైగా విలువ చేసే అత్యంత విలువైన దాదాపు 60 ఎకరాలను ఎకరా 99 పైసలకే కట్టబెట్టడం నాకింత.. నీకింత లాంటి లాలూచీ వ్యవహారాలకు పరాకాష్ట! పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జాతీయ సంస్థలకు గతంలో చంద్రబాబు సర్కారు అమరావతిలో ఎకరా రూ.4 కోట్లు చొప్పున భూములను కేటాయించింది. హడ్కో, ఎల్‌ఐసీ, గెయిల్, ఎఫ్‌సీఐ, ఆర్బీఐ, ఎస్‌బీఐ, విజయా బ్యాంకు, కెనరా బ్యాంకు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్, రైల్‌టెల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా, రైల్‌ ఇండియా టెక్నికల్‌ ఎకనమిక్‌ సర్వీస్‌ లాంటి ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు ఎకరా రూ.నాలుగు కోట్లు చొప్పున భూ కేటాయింపులు చేశారు. చివరకు దేశ రక్షణ వ్యవహారాల్లో అత్యంత కీలకమైన ఇండియన్‌ ఆర్మీకి సైతం ఎకరా రూ.కోటి చొప్పున భూమిని కేటాయించడం గమనార్హం. ఇలా కేంద్ర, జాతీయ సంస్థలకు భూములిచ్చినందుకు భారీగా వసూలు చేస్తూ ఊరూ పేరు లేని అనామక ఉర్సా కంపెనీకి మాత్రం రూ.3,000 కోట్ల విలువైన 59.86 ఎకరాల ఖరీదైన భూమిని అత్యంత కారు చౌకగా కట్టబెడుతూ తన బంధువులు, బినామీలు, సన్నిహితులకు ప్రభుత్వ భూములను ధారాదత్తం చేయడంలో చేతికి ఎముకే లేదని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ప్రతిష్టాత్మక జాతీయ సంస్థలకు భూములు కేటాయించేటప్పుడు మాత్రం మార్కెట్‌ ధరను తెరపైకి తేవడం.. బంధుగణం, బినామీలకు మాత్రం కారుచౌకగా ప్రభుత్వ భూములను రాసిచ్చేయడం సీఎం చంద్రబాబుకు రివాజు అని పారిశ్రామికవేత్తలు, అధికార వర్గాలే స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలోనూ చంద్రబాబు 1995 నుంచి 2004 వరకూ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తరహాలో వ్యవహరించారని గుర్తు చేస్తున్నారు. 2004లో ఆపద్ధర్మ సీఎంగా ఉంటూ తనకు అత్యంత సన్నిహితుడైన బిల్లీ రావుకు చెందిన బోగస్‌ కంపెనీ ఐఎంజీ భారత్‌కు గచ్చిబౌలిలో 400 ఎకరాలు.. శంషాబాద్‌ విమానాశ్రయం సమీపంలో 450 ఎకరాల భూమిని కేటాయించడం చంద్రబాబు భూ సంతర్పణకు పరాకాష్టగా పేర్కొంటున్నారు. విభ­జన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాక కూడా అదే పంథాను కొనసాగించారని ప్రస్తావిస్తున్నారు. భూ పందేరానికి ఆధారాలివిగో.. నారా లోకేశ్‌ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్‌ తండ్రి ఎం.పట్టాభిరామారావుకు చెందిన వీబీసీ ఫర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌కు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఏపీఐఐసీకి చెందిన 498.93 ఎకరాల భూమిని ఎకరం రూ.లక్ష చొప్పున కేటాయిస్తూ 2015 జూలై 15న నాటి చంద్రబాబు సర్కార్‌ ఉత్తర్వులు (జీవో ఎంఎస్‌ నెంబరు 269) జారీ చేసింది. బహిరంగ మార్కెట్‌ ప్రకారం ఆ భూముల విలువ అప్పట్లోనే రూ.498 కోట్లు. ఆ తర్వాత ఆ భూములను రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) పరిధిలోకి తెస్తూ 2015 సెపె్టంబరు 22న ఉత్తర్వులు (జీవో ఎంస్‌ నెంబరు 207) జారీ చేయడం ద్వారా వాటి విలువను మరింతగా పెంచుకున్నారు. సత్తా లేని సంస్థకు సంతర్పణ..! జనసేన, బీజేపీతో జట్టుకట్టి 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన బంధువులు, సన్ని­హి­తులు, బినామీలకు ప్రభుత్వ భూములను ఇష్టారీతిన ధారాదత్తం చేస్తున్నారు. ఊరూ పేరూ లేని ఉర్సా క్లస్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విశాఖలోని ఐటీ పార్క్‌లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు.. ఎకరం కేవలం 99 పైసలకే కేటాయించడమే అందుకు నిదర్శనం. వాస్తవంగా ఆ భూముల విలువ రూ.3 వేల కోట్లకుపైగా ఉంటుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. కేవలం రెండు నెలల క్రితం ఏర్పాటైన కంపెనీకి రూ.5,278 కోట్ల పెట్టుబడి పెట్టి డేటా సెంటర్‌ ప్రాజెక్టును నెలకొల్పే సామర్థ్యం ఉందా.. లేదా? అన్నది పరిశీలించుకోకుండా భూ కేటాయింపులు చేశారంటే.. ఆ సంస్థ ఎవరి బినామీలదో అర్థం చేసుకోవచ్చని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. కేంద్ర సంస్థలకు మార్కెట్‌ ధరకే.. విశాఖలో గతంలో టీడీపీ హయాంలోనే కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మార్కెట్‌ ధరకే భూమిని కేటాయించారు. కీలకమైన నావికాదళ స్థావరం ఏర్పాటుకు ఇండియన్‌ నేవీతో పాటు ఎన్‌టీపీసీ విద్యుత్‌ ప్లాంటుకు కూడా మార్కెట్‌ ధరకే భూమి ఇచ్చారు. దీనికి భిన్నంగా ఉర్సాకు విశాఖలో అత్యంత ఖరీదైన ఐటీ పార్కులో 3.5 ఎకరాలతో పాటు కాపులుప్పాడలో ఏకంగా 56.36 ఎకరాలను కేటాయించేందుకు టీడీపీ కూటమి సర్కారు నిర్ణయం తీసుకుంది. ఉర్సా కంపెనీ గత ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని నివాస ప్రాంతంలో ఓ అపార్టుమెంట్‌లోని ఫ్లాటు అడ్రస్‌తో ఏర్పాటు కాగా ‘ఎక్స్‌’ ఖాతాలో ఇప్పటివరకూ కేవలం ఒకే ఒక పోస్టు పెట్టింది. అది కూడా భూ కేటాయింపులపై విమర్శల నేపథ్యంలో వివరణ ఇస్తూ చేసిన పోస్టు మాత్రమే. ఇక ఈ ఖాతాను కేవలం ఒకే ఒక్కరు ఫాలో అవుతుండటం గమనార్హం. దేశాభివృద్ధిలో కీలకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు రక్షణ వ్యవస్థలో భాగ­స్వామిగా ఉన్న ఇండియన్‌ నేవీకి కూడా మార్కెట్‌ ధరకే భూమిని కేటాయించిన టీడీపీ ప్రభుత్వం.. ఉర్సాకు మాత్రం నామమాత్ర ధరకే సంతర్పణ చేయడం వెనుక భారీ వ్యవహారమే ఉందనే ఆరోపణలున్నాయి. విశాఖలోని కీలకమైన ఏపీ సెజ్‌లో ఎకరా ధర లీజు రూ.35 లక్షల మేర పలుకుతోంది. ఏ సంస్థకు భూమి కావాలన్నా ఇదే ధర చెల్లించి భూమిని లీజుకు తీసుకోవాల్సి ఉంటుంది. కమిషనర్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్, కస్టమ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ సంస్థ కార్యాలయం నిర్మాణం కోసం అనకాపల్లిలోని రాజుపాలెం వద్ద మార్కెట్‌ ధర మేరకు ఎకరా రూ.80 లక్షల చొప్పున సర్వే నెంబరు 75/3లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ 25 జనవరి 2016న టీడీపీ సర్కారు 326/2016 జీవోను జారీ చేసింది. నిబంధనలు ఏం చెబుతున్నాయి?2012లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు (జీవో నెంబరు 571– 14–9–2012) ప్రకారం ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే సమయంలో.. మార్కెట్‌ విలువ మీద వార్షిక లీజు రెంటల్‌ పది శాతం కంటే తక్కువ ఉండకూడదు. లీజును ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మార్కెట్‌æ ధర ఆధారంగా సవరించాలి. విశాఖలో టీసీఎస్‌తో పాటు ఉర్సాకు ఇవ్వనున్న భూమి రిజిస్ట్రేషన్‌ ధరల మేరకే చదరపు గజం రూ. 30 వేల వరకు ఉంది. ఇక మార్కెట్‌ ధరను గనుక తీసుకుంటే రూ.లక్ష వరకూ పలుకుతోంది. ఇంత విలువైన భూమిని ఊరూ పేరు లేని ఉర్సాకు ఎకరం 99 పైసలకే ఇచ్చేందుకు టీసీఎస్‌ను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చి కథ నడిపినట్లు స్పష్టమవుతోంది.

KSR Comments On Chandrababu And Yellow Media2
ఎల్లో మీడియాకు ఎంత ముడుతోందో?

‘ఖజానాకు కిక్కు’ కొద్ది రోజుల క్రితం ఎల్లో మీడియా పత్రిక ఒకటి పెట్టిన శీర్షిక ఇది. ఏపీలో మద్యం విచ్చలవిడి ప్రవాహంపై ఆందోళన చెందాల్సిన మీడియా ఏడాదిలో మద్యం వ్యాపారం ద్వారా ప్రభుత్వ ఆదాయం 14 శాతం వృద్ది చెందిందని సంబరపడింది. 2024-25లో రూ.28,842 కోట్ల రాబడి మద్యం ద్వారా వచ్చిందని ఎగిరి గంతేసినట్లు ప్రచారం చేసింది.గత సంవత్సరం అంటే జగన్ ప్రభుత్వ చివరి సంవత్సరంలో వచ్చిన మొత్తం కన్నా రూ.3750 కోట్లు ఎక్కువ అని ఈ కథనంలో చెప్పారు. అంతటితో ఆగి ఉంటే బాగుండేది. కానీ, ఈ పెరిగిన ఆదాయమంతా జగన్‌ హయాంలో జరిగిందనడంలోనే పచ్చమీడియా తన కుట్ర స్వభావాన్ని సిగ్గు లేకుండా బయటపెట్టుకుంది. నిజానికి ఇది పిచ్చి వాదన. దీని సాయంతో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న విషయాన్ని ప్రజల దృష్టి నుంచి తప్పించాలన్నది ప్లాన్‌ కావచ్చు.జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపేది. నిర్దిష్ట వేళలు ఉండేవి. మద్య​​​ం ప్రియులు కూడా ఇబ్బంది పడేలా దుకాణాలు దూరంగా ఉంచేవారు. బెల్ట్‌షాపుల్లేకుండా చూసుకున్నారు. ఇదంతా చేసింది ప్రజలు మద్యానికి బానిసలు కాకూడదనే. మద్యపాన నియంత్రణకే. అందుకే అప్పట్లో తాగే మద్యం మోతాదు తగ్గినా ఆదాయం మాత్రం రూ.25,082 కోట్ల వరకూ వచ్చింది. అయినా ఇందులో ఏదో కుంభకోణం జరిగిందని కాకి లెక్కలు రాసి వైఎస్సార్‌సీపీ నేతలను ఇరికించడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఏ రంగమైనా ఏటా ఎంతో కొంత వృద్ధి చెందుతూ ఉంటుంది. బడ్జెట్‌ల మాదిరిగానే ఎల్లో మీడియా తలతిక్క రాతలను పరిగణనలోకి తీసుకుంటే బడ్జెట్ల రూపకల్పనలోనే కుంభకోణాలున్నట్లు అనుకోవాలి.చంద్రబాబు ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని మళ్లీ ప్రైవేటు వారికి అప్పగించింది. ఆ షాపుల వేలం పాటల ద్వారా కూడా సుమారు రెండు వేల కోట్ల ఆదాయం వచ్చింది. బెల్ట్ షాపుల సంగతి చెప్పనవసరం లేదు. బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా విధిస్తామని చంద్రబాబు ఉత్తుత్తి హెచ్చరికలు చేస్తున్నట్లు కనిపిస్తున్నా.. టార్గెట్లు పెట్టి అమ్మకాలు చేయిస్తుండటంతో ఇవి మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్నాయి. బెల్ట్‌ షాపులషాపుల నిర్వాహకుల్లో ఎక్కువ మంది టీడీపీ, జనసేనకు చెందినవారే. గుడి, బడి తేడా లేకుండా, నివాస ప్రాంతం, వ్యాపార ప్రాంతం తేడా లేకుండా షాపులు పెడుతున్నారు. గుంటూరు తదితర ప్రాంతాలలో వైన్ షాపులు తీసివేయండి అని మహిళలు మొత్తుకున్నా, ధర్నాలు చేసినా ఎక్సైజ్ శాఖ అధికారులు చీమ కుట్టినట్లుగా కూడా స్పందించడం లేదు!.త్రీస్టార్ హోటల్స్‌, బార్లు, ప్రివిలేజ్ ఫీజ్ తగ్గించడం, వ్యాపారుల మార్జిన్ పెంచడం స్కామ్‌లు కాదట. ప్రభుత్వపరంగా విక్రయిస్తే స్కామ్ అట. ఏపీలో ఉన్న విచ్చలవిడి మద్యం అమ్మకాల పరిస్థితిని కొందరు టీడీపీ ఎమ్మెల్యేలే బహిరంగంగానే విమర్శించారు. అంతేకాదు.. చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో, ఆ తర్వాత..‘తాగండి తమ్ముళ్లు’ అంటూ సామాన్యులకు మద్యాన్ని అందుబాటులోకి తెచ్చామని, అదేదో గొప్ప విషయంగా అసెంబ్లీలోనే ప్రకటించారు. మద్యం డిస్టిలరీల ద్వారా అధికారికంగా ఎంత కొనుగోలు చేస్తున్నారు? అనధికారికంగా మరెంత వస్తున్నదో ఎవరైనా చెప్పగలరా?. 2014-19 మధ్య ఐదు డిస్టిలరీల నుంచే ఏభై శాతం మద్యాన్ని కొనుగోలు చేశారట. పవర్ స్టార్, లెజెండ్, తదితర కొత్త బ్రాండ్లు వచ్చింది కూడా చంద్రబాబు టైమ్‌లోనే. వాటి సంగతి ఏమిటి?.ఆ కుంభకోణాలపై గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విచారణ జరిపించి కేసు పెట్టడంతో, ఆ కక్షతో ఎలాగోలా వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి కదా?. ఇందుకోసం గతంలో వైఎస్సార్‌సీపీలో ప్రముఖుడిగా ఉన్న విజయసాయి రెడ్డిని వాడుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం స్కాం అంటూ తొలుత విజయసాయి రెడ్డిపై కూడా కూటమి నేతలు అభియోగాలు మోపారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎన్నికలకు ముందు విజయసాయి రెడ్డిపై ఎన్ని వేల కోట్ల ఆరోపణలు చేశారు. ఆయన పార్టీని వీడిన తర్వాత సిట్ విచారణకు హాజరవడానికి ముందు ఏదో బ్రహ్మాండం బద్దలవుతుందన్నట్లుగా ఎల్లో మీడియా ఊదరగొట్టింది. తీరా ఆయన విచారణకు హాజరై, ఒక్క రాజ్ కేసిరెడ్డి అన్న వ్యక్తిపై ఆరోపణలు చేసి, మద్యంలో స్కామ్ జరిగినట్లు తనకు తెలియదని, అందువల్ల వ్యక్తుల ప్రమేయం తనకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించడంతో కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు నిరుత్సాహం వచ్చింది.ఆ తర్వాత వైఎ‍స్సార్‌సీపీ ఎంపీ మిథున్‌ రెడ్డిని విచారణకు పిలిచారు. కానీ, ఏమీ సాధించలేక పోయారన్నది తెలిసిపోతోంది. తదుపరి రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్ రెడ్డిలను విచారించినా, వారు రిమాండ్ రిపోర్టుపై సంతకాలే చేయలేదు. అలాంటప్పుడు ఆ రిపోర్టులకు ఎంత విలువ ఉంటుంది?. అయినా అందులో సీఐడీ రాసిన కథలన్నిటినీ ఎల్లో మీడియా బ్యానర్లుగా పరిచి జగన్‌పై తమకు ఉన్న విద్వేషాన్ని కక్కాయి తప్ప, అందులో సరుకు కనిపించడం లేదు. సాధారణంగా సిట్ అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించి ప్రశ్నిస్తారు. కానీ, మిథున్‌ రెడ్డిని తమ వద్ద ఉన్న ఊహాజనిత ఆరోపణలు, బలవంతంగా కొందరి నుంచి తీసుకున్న వాంగ్మూలాల బేసిస్‌తో ప్రశ్నలు అడగడంతో ఆయన వాటికి గట్టిగా బదులిచ్చారు.గతంలో చంద్రబాబుపై స్కిల్‌స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడు సిట్ బృందం స్పష్టమైన ఆధారాలు సేకరించింది. అంతకుముందే ఈడీ ఆ కేసును డీల్ చేసి కొందరిని అరెస్టు చేసింది. ఆ అంశంతో పాటు, స్కిల్‌ స్కామ్ డబ్బు టీడీపీ బ్యాంక్ ఖాతాలోకి కూడా చేరిందని, షెల్ కంపెనీలు ఎలా పనిచేశాయన్నది వివరాలతో సహా అధికారులు బయటపెట్టడంతో వాటి గురించి చెప్పకుండా చంద్రబాబు తప్పించుకునే యత్నం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అన్ని ఆధారాలు చూపించినా, అవి అక్రమ కేసులంటూ ఎల్లో మీడియా గగ్గోలు పెట్టింది. అధికారం రావడంతో ఇప్పుడు వాటన్నిటిని కప్పిపుచ్చుతున్నారు. మరో సంగతి చెప్పాలి. మార్గదర్శి డిపాజిట్లు, చిట్ ఫండ్స్‌లో అక్రమాల గురించి ఆధారాలను చూపి రామోజీరావును విచారించినప్పుడు ఆయన తనకు గుర్తులేదు.. తెలియదు.. అని మాత్రమే జవాబిచ్చారు. తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ, ఎదుటివారిపై మాత్రం బురద వేయడం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ మూల సిద్దాంతాలలో ఒకటిగా మారిపోయింది.ఎల్లో మీడియా రాసిందే కొలమానం అయితే, చంద్రబాబు ప్రభుత్వం ఈ పది నెలల్లో ఎన్ని స్కాంలకు పాల్పడినట్లు?. ఉదాహరణకు జగన్ టైమ్ లో ఇసుక విక్రయం ద్వారా ఏడాదికి సుమారు రూ.700 కోట్ల ఆదాయం సమకూరింది. కొన్ని వందల కోట్ల విలువైన ఇసుకను స్టాక్ యార్డులలో నిల్వ చేసింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే టీడీపీ, జనసేన నేతలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందినకాడికి దోచేశారు. పోనీ ఇప్పుడు ఉచితం అని చెబుతున్నా, వినియోగదారుడికి ఏమైనా రేటు తగ్గిందా అంటే అదీ లేదు. అంటే కూటమి నేతలు రోజూ ఎంత పెద్ద స్కామ్ చేస్తున్నట్లు?. జగన్ టైమ్ లో వచ్చిన ఆదాయం ఇప్పుడు రావడం లేదు కనక అదంతా కూటమి కుంభకోణం అని ఎల్లో మీడియా అంగీకరించాలి.టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఒక్క తిరువూరు ప్రాంతంలోనే వందల ట్రక్కుల ఇసుక అక్రమ రవాణా అవుతోందని వెల్లడించారు కదా!. ఆ మొత్తం అంతా ఎవరి ఖాతాలోకి వెళుతోంది?. బహుశా ఎల్లో మీడియాకు కూడా వాటాలు ఉన్నాయేమో?.. అందుకే టీడీపీ ఎమ్మెల్యే అక్రమ వ్యవహారాలను బయటపెట్టడం తప్పన్నట్లు రాశారా?. గనుల శాఖలో కూడా గత జగన్ ప్రభుత్వంలో వచ్చిన ఆదాయంతో పోల్చితే ఇప్పుడు తక్కువ వచ్చింది. పైగా ఈ శాఖలో అవినీతి జరిగిపోతోందని ఎల్లో మీడియానే కథనాలుగా ఇచ్చింది కదా? దాని గురించి ఏమంటారు? ఏది ఏమైనా జగన్ టైమ్ లో మద్యం స్కామ్ అటూ వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి వచ్చి మళ్లీ ఎంపీ అయిన లావు కృష్ణదేవరాయలతో ఢిల్లీలో ప్రచారం చేయించినా, రాష్ట్రంలో సిట్‌తో దర్యాప్తు చేయించినా, ఎల్లో మీడియాతో పిచ్చి కథనాలు రాయించినా ఆ ఆరోపణలకు ఆధారాలు కనిపించడం లేదే!. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Indian Govt Banned Pakistan YouTube Channels3
పాకిస్తాన్‌కు మరో షాకిచ్చిన భారత్‌.. వాటిపై నిషేధం

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత ప్రభుత్వం మరో షాకిచ్చింది. పాకిస్తాన్‌ యూట్యూబ్‌ ఛానళ్ల(Ban on Youtube Channels)పై భారత్‌ ఉక్కుపాదం మోపింది. పాక్‌కు చెందిన 16 యూట్యూబ్‌ ఛానళ్లపై భారత్‌లో నిషేధం విధించారు. ఇక, నిషేధం విధించిన వాటిలో మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ఛానల్‌ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఇప్పటికే పాకిస్తాన్‌ ట్విట్టర్‌, సినిమాలపై భారత్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో బీబీసీ చానల్స్‌కు సైతం భారత ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఉగ్రవాదులను మిలిటెంట్లుగా అభివర్ణించిన బీబీసీకి ప్రభుత్వం నోటీసులు అందజేసింది.భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు పాకిస్థాన్‌ కేంద్రంగా నిర్వహిస్తున్న పలు యూట్యూబ్‌ ఛానళ్ల ప్రసారాలను భారత్‌లో నిషేధించింది. పాక్‌ న్యూస్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియాకు చెందిన 16 ఛానళ్లపై ఈ వేటు వేసింది. డాన్‌ న్యూస్‌, జియో న్యూస్‌, సామా టీవీ సహా పలు మీడియా ఛానళ్లు, కొంతమంది జర్నలిస్టుల ఖాతాలపై ఈ నిషేధం విధించింది.🚨 BIG BREAKING Modi govt BANS 16 #Pakistani #YouTube channels, including Dawn, Samaa TV, ARY, Geo News etc for spreading provocative content and false narratives against India, Army, and security forces after the Pahalgam terror attack.— Shoaib Akhtar’s channel also BLOCKED pic.twitter.com/DOzHwxgp4N— HIND KE SITARA ✨ (@ChanakyaRashtra) April 28, 2025ఇందులో భాగంగా.. ఈ ఛానళ్లను తెరవగానే.. కంటెంట్‌ అందుబాటులో లేదు. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం అని కనిపిస్తోంది. భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన సున్నితమైన కంటెంట్‌, తప్పుదోవ పట్టించే కథనాలను ప్రసారం చేస్తున్నారన్న ఆరోపణలపై ఈ యూట్యూబ్‌ ఛానళ్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

MI 5th Consecutive Win: Fans Says History Will Repeat How They Finished In Past4
‘వరుసగా ఐదో విజయం.. సెంటిమెంట్‌ ప్రకారం టైటిల్‌ మాదే!’

గతేడాది చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న ముంబై ఇండియన్స్‌ (MI).. ఐపీఎల్‌-2025 (IPL 2025)ని కూడా పేలవంగానే ఆరంభించింది. తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో చిత్తై ఓటమితో ఈ ఎడిషన్‌ను మొదలుపెట్టింది.రెండో మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో పరాజయం పాలైన హార్దిక్‌ సేన.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ను ఓడించి తొలి గెలుపు అందుకుంది. అయితే, ఆ తర్వాత మళ్లీ పాత కథే. లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ముంబై ఇండియన్స్‌ ఆట తీరుపై విమర్శలు రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలుపుతో మళ్లీ విజయాల బాట పట్టింది.వరుసగా ఐదు విజయాలు ఆ తర్వాత హార్దిక్‌ సేన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను రెండుసార్లు, చెన్నై సూపర్‌ కింగ్స్‌.. తాజాగా ఆదివారం లక్నో సూపర్‌ జెయింట్స్‌పై గెలిచి వరుసగా ఐదు విజయాలు అందుకుంది. ఏదేమైనా సీజన్‌ను చెత్తగా మొదలుపెట్టి.. ఇలా మళ్లీ గాడిలో పడటంతో ముంబై ఇండియన్స్‌ శిబిరం ఆనందంలో తేలిపోతోంది.సెంటిమెంట్‌ ప్రకారం ఈసారి మరోవైపు.. వరుస విజయాల నేపథ్యంలో ముంబై జట్టు అభిమానులు సైతం ఖుషీ అవుతున్నారు. ఇప్పటికి ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన ఈ మేటి జట్టు.. సెంటిమెంట్‌ ప్రకారం ఈసారి కూడా ట్రోఫీని ముద్దాడుతుందని, టైటిల్‌ మాదే అని సంబరపడిపోతున్నారు.ఏకంగా నాలుగుసార్లు చాంపియన్‌గాకాగా గతంలో వరుసగా ఇలా ఐదుసార్లు (అంతకంటే ఎక్కువ) మ్యాచ్‌లు గెలిచిన ముంబై ఇండియన్స్‌.. ఏకంగా నాలుగుసార్లు చాంపియన్‌గా అవతరించింది. అంతేకాదు మరోసారి రన్నరప్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా కూడా వరుసగా ఐదు గెలిచాం అంటూ ఈసారి తమకు తిరుగులేదన్నట్లుగా ట్వీట్‌ చేశాడు.ఇక ముంబైకి ఐదుసార్లు టైటిల్‌ అందించిన దిగ్గజ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను కాదని.. గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి ట్రేడ్‌ చేసుకున్న హార్దిక్‌ పాండ్యాను యాజమాన్యం సారథిగా నియమించింది. అయితే, సొంత జట్టు అభిమానులకే ఇది ఏమాత్రం నచ్చలేదు. రోహిత్‌పై ప్రేమ.. హార్దిక్‌పై కోపానికి దారితీసింది. మైదానం వెలుపలా, బయటా అతడిపై పెద్ద ఎత్తున ట్రోల్స్‌ వచ్చాయి.అందుకు అనుగుణంగానే ఐపీఎల్‌-2024లో హార్దిక్‌ కెప్టెన్సీ చెత్తగా సాగింది. పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచిన ముంబై పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంతో సీజన్‌ను ముగించింది. అయితే, ఐపీఎల్‌-2025లో మాత్రం ముంబై మళ్లీ విజయపరంపరను పునరావృతం చేస్తోంది. తద్వారా ఆరో టైటిల్‌ దిశగా దూసుకుపోతోంది.ఐపీఎల్‌-2025: ముంబై వర్సెస్‌ లక్నో👉వేదిక: వాంఖడే, ముంబై👉టాస్‌: లక్నో తొలుత బౌలింగ్‌👉ముంబై స్కోరు: 215/7 (20)👉లక్నో స్కోరు: 161 (20)👉ఫలితం: లక్నోపై 54 పరుగుల తేడాతో ముంబై విజయంఐపీఎల్‌ చరిత్రలో ముంబై ఇండియన్స్‌ వరుసగా ఐదు లేదంటే అంతకంటే ఎక్కువగా విజయాలు సాధించిన సందర్భాలు ఇవే..👉2008లో ఆరుసార్లు వరుసగా👉2010లో ఐదుసార్లు వరుసగా- రన్నరప్‌గా👉2013లో ఐదుసార్లు వరుసగా- చాంపియన్స్‌గా👉2015లో ఐదుసార్లు వరుసగా- చాంపియన్స్‌గా👉2017లో ఆరుసార్లు వరుసగా- చాంపియన్స్‌గా👉2020లో ఐదుసార్లు వరుసగా- చాంపియన్స్‌గా👉2025లో ఐదుసార్లు వరుసగా..*.చదవండి: కేఎల్‌ రాహుల్‌తో కోహ్లి వాగ్వాదం.. గట్టిగానే బదులిచ్చిన వికెట్‌ కీపర్‌! వీడియో𝙂𝙖𝙢𝙚. 𝙎𝙚𝙩. 𝘿𝙤𝙣𝙚 ✅@mipaltan make it 5⃣ in 5⃣ and are marching upwards and onwards in the season 📈Scorecard ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG pic.twitter.com/zW7EuWhU7j— IndianPremierLeague (@IPL) April 27, 2025

Supreme Court Lawyer Prashant Bhushan Raises Concerns Over Ursa Land Deal5
‘ఇది చాలా తప్పు చంద్రబాబు’.. ఉర్సా ల్యాండ్‌ డీల్‌పై సుప్రీం న్యాయవాది ఆగ్రహం

సాక్షి,విజయవాడ: ఉర్సా ల్యాండ్‌ డీల్‌పై దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఉర్సాకి రూ.3వేల కోట్ల విలువైన భూముల్ని చంద్రబాబు కట్టబెట్టారు. అయితే, ఊరుపేరు లేని ఉర్సాకి వేలకోట్ల భూముల్ని కట్టబెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆఫీస్‌,ట్రాక్‌ రికార్డ్‌ లేని ఉర్సాకి భూ కేటాయింపులపై ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు.రెండు నెలల కిందట పెట్టిన ఉర్సాకు కోట్ల విలువైన భూముల్ని కేటాయించడంపై విమర్శలు గుప్పించారు. ఆఫీసు లేదు, ట్రాక్ రికార్డ్ లేదు. రెండు నెలల కిందట పెట్టిన ఉర్సాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోట్ల రూపాయల ఒప్పందం ఎలా కుదుర్చుకుంది? వావ్! చంద్రబాబు ప్రభుత్వం ఘోస్ట్‌ కంపెనీకి 59.6 ఎకరాల భూమిని దాదాపు ఉచితంగా బహుమతిగా ఇచ్చింది! పూర్తిగా చట్టవిరుద్ధం! 59.6 ఎకరాలు ఘోస్ట్‌ కంపెనీకి కేటాయించడం చట్ట వ్యతిరేకం’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. No Office, No Track Record: How a Two-Month-Old Firm Landed a Multi-Crore Deal With Andhra Govt. Wow!59.6 Acres of land gifted virtually free to this ghost company by the CB Naidu govt! Totally illegal!Is it kickbacks or connections with Top officials? https://t.co/XzoU8HVCp4— Prashant Bhushan (@pbhushan1) April 22, 2025ఒక్క రూపాయికి కనీసం ఓ ఇడ్లీ కూడా రాదు..! మరి 99 పైసలకు రూ.3,000 కోట్ల భూములు ఎలా..? అంటూ ఉర్సా ల్యాండ్‌ డీల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీసీఎస్ కంటే ఎక్కువగా ఉర్సాకి భూ కేటాయింపులపై అనుమానాలు తలెత్తతున్నాయి.అయినా సరే ఉర్సా ల్యాండ్ డీల్‌పై ఇప్పటి వరకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నోరు మెదకపోవడం గమనార్హం. ఉర్సా డైరెక్టర్ అబ్బూరి సతీష్‌తో టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి భాగస్వామ్యం ఉంది. కేశినేని చిన్ని, అబ్బూరి సతీష్ బంధం బయటపడటంతో ఉర్సా ల్యాండ్ డీల్‌పై గల్లీ నుంచి ఢిల్లీ వరకు చర్చాంశనీయంగా మారింది.

Asaduddin Owaisi fires on Pakistan6
పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్‌పై ఎంపీ అసదుద్దీన్‌ ఆగ్రహం

ఢిల్లీ: మీరు మా కంటే (భారత్‌) అరగంట వెనకబడలేదు.. అర్థ శతాబ్ధం వెనకబడ్డారంటూ ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ పాకిస్తాన్‌పై సెటైర్లు వేశారు. అదే సమయంలో భారత్‌లో పలు టీవీ ఛానెళ్ల యాంకర్లపై మండిపడ్డారు. కాశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. ఆదివారం మహారాష్ట్ర పర్భానిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌పై దాడి చేసేందుకు తాము అణు ఆయుధాల్ని సిద్ధం చేశామంటూ బాహాటంగా జారీ చేసిన పాక్‌ నాయకుల హెచ్చరికలపై ఆయన స్పందించారు. ‘తమ వద్ద అణు బాంబులు, అణు బాంబులు ఉన్నాయని పాకిస్తాన్ పదే పదే చెబుతోంది. గుర్తుంచుకోండి. మీరు వేరే దేశంలోకి వెళ్లి అమాయక ప్రజలను చంపితే.. ఏ దేశం ఎందుకు మౌనంగా ఉంటుంది. అందుకు గట్టిగానే బదులిస్తోంది.మీరు మాకంటే అరగంట కాదు.. అర్థశతాబ్ధం వెనకబడ్డారుఅభివృద్ధిలో మా దేశానికి, మీ దేశానికి పోలిక ఎక్కడా? అభివృద్ధిలో మీరు మాకంటే అరగంట కాదు.. అర్థశతాబ్ధం వెనకబడ్డారు. మీ దేశ బడ్జెట్ మా సైనిక బడ్జెట్‌కు కూడా సమానం కాదు’ అని గుర్తు చేశారు. పహల్గాంలో పర్యాటకుల ప్రాణాలు తీసే ముందు వారి మతాన్ని అడిగారు. మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు? మీరు ఖవారీజ్ (అరబ్‌ భాషలో తీవ్రవాదులు) కంటే దారుణంగా ఉన్నారు. ఈ చర్య మీరు ఐఎస్‌ఐఎస్‌ వారసులని చూపిస్తుంది’ అని ఎద్దేవా చేశారు.Parbhani, Maharashtra: AIMIM Chief Asaduddin Owaisi says, "Pakistan always talks about being a nuclear power; they need to remember if they enter a country and kill innocent people, that country will not sit quietly. No matter the government, by killing our people on our land,… pic.twitter.com/zB80FJcY8G— ANI (@ANI) April 27, 2025 ప్రధాని మోదీకి ఎంపీ అసదుద్దీన్‌ డిమాండ్‌అంతేకాదు భారత్‌ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ అనేక సంవత్సరాలుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని ఆరోపించారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం.. పాకిస్తాన్ వైమానిక దళాన్ని దిగ్బంధించడానికి, హ్యాకర్లను ఉపయోగించి ఆ దేశంలో ఇంటర్నెట్‌ను హ్యాక్ చేసేందుకు భారత్‌కు అనుమతి ఉందని గుర్తు చేశారు. పాకిస్తాన్‌ను ఆర్థికంగా బలహీన పరిచేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.షేమ్‌పలు టీవీ ఛానెళ్లలో పనిచేసే యాంకర్లు కశ్మీరీలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. షేమ్‌. కశ్మీర్ మన అంతర్భాగం. కాశ్మీరీలు కూడా మనదేశంలో అంతర్భాగమే. అలాంటి వారిని మనం ఎలా అనుమానించగలం? ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు తన ప్రాణాలను అర్పించింది ఓ కాశ్మీరీనే. గాయపడిన పిల్లవాడిని తన వీపుపై మోసుకుని 40 నిమిషాలు నడిచింది కూడా ఓ కాశ్మీరీనే అని ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఎత్తి చూపారు.

CM Revanth And Jana Reddy Meeting Over operation Kagar7
జానారెడ్డితో సీఎం రేవంత్‌ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు జానారెడ్డితో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆపరేషన్ కగార్ అంశంపై సీఎం రేవంత్‌.. జానారెడ్డితో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. మాజీ మంత్రి జానారెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఆపరేషన్ కగార్ ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే యోచనలో రాష్ట్ర కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జానారెడ్డితో రేవంత్‌ భేటీ అయినట్టు తెలుస్తోంది. జానారెడ్డి నివాసంలో భేటీ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి భేటీకి హాజరయ్యారు. ఇదిలా ఉండగా..తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కగార్ పేరుతో కొన్ని రోజులుగా మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం టార్గెట్‌ చేసింది. కర్రెగుట్టలో బాంబు వర్షం కురిపిస్తోంది. ఈ ఆపరేషన్ వల్ల వందలాది మంది మావోలు మృతిచెందుతున్నారు. మావోలు చనిపోతుండటంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర చర్యలను ఖండించారు. పౌర హక్కుల సంఘాలు తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శాంతి చర్చల కమిటీ భేటీలో నక్సలిజాన్ని శాంతి భద్రతల అంశంగా పరిగణించమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయడానికి మంత్రులతో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. సామాజిక కోణంలో మావోయిస్టుల అంశాన్ని చూడాలి. మావోయిస్టుల భావాజాలాన్ని చంపాలనుకోవడం సరైంది కాదని అన్నారు.

Nandamuri Balakrishna To Receive Padma Bhushan On April 28, 20258
నేడు పద్మభూషణ్‌ అందుకోనున్న బాలకృష్ణ

న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లో నేడు (ఏప్రిల్‌ 28) పద్మ పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. టాలీవుడ్‌ నుంచి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) పద్మభూషణ్‌ అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్‌ హాజరు కానున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం జనవరి 25న పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఏడుగురికి పద్మ విభూషణ్‌, 19 మందికి పద్మ భూషణ్‌, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలను అనౌన్స్‌ చేసింది.బాలకృష్ణ ప్రస్థానంనందమూరి బాలకృష్ణ.. తాతమ్మ కల (1974) సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. 14 ఏళ్ల వయసులో తండ్రి రామారావుతో కలిసి నటించారు. సాహసమే జీవితం సినిమాతో హీరోగా మారారు. వందకు పైగా సినిమాలు చేశారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌ కేసరి, డాకు మహారాజ్‌ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నారు. ప్రస్తుతం అఖండ 2 మూవీ చేస్తున్నారు. ఈయన హిందూపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి చైర్మన్‌గానూ సేవలందిస్తున్నారు.చదవండి: ఆ హీరో తండ్రి సలహాతో 15 రోజులు నా యూరిన్‌ తాగా: నటుడు

Bill Gates Predicts 2-Day Work Week For Employees9
రెండు రోజులే పనిచేసే రోజులొస్తాయ్‌..

విపరీతమైన పని గంటలు, వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ వంటి అంశాలపై ఇటీవల చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కారణంగా మానవ ఉద్యోగాలకు ముప్పు తప్పదన్న ఆందోళనలూ మరోవైపు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆసక్తికరమైన అంచనాను వెల్లడించారు.వారానికి ఐదు.. ఆరు రోజులు పని, 9 టు 5 జాబ్‌.. ఈ సంప్రదాయ భావనలకు కాలం చెల్లిపోనుందా? ఈ పరిస్థితి మరీ అంత ఎక్కువ దూరంలో ఏమీ ఉండకపోవచ్చు. కృత్రిమ మేధస్సు ప్రపంచ శ్రామిక శక్తిని పునర్నిర్మించగలదని, వచ్చే దశాబ్దంలో ప్రామాణిక పని వారాన్ని కేవలం రెండు రోజులకు తగ్గించగలదని బిల్ గేట్స్ చెప్పారు.బిల్ గేట్స్ బోల్డ్ జోస్యంజిమ్మీ ఫాలన్ ది టునైట్ షోలో ఇటీవల కనిపించిన గేట్స్, ప్రస్తుతం మానవులు చేస్తున్న చాలా పనులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్వరలో నిర్వహిస్తుందని జోస్యం చెప్పారు. తత్ఫలితంగా, సాంప్రదాయ ఐదు రోజుల పని వారం అంటే వారంలో పనిచేసే రోజులు తగ్గిపోతాయని, విశ్రాంతి, సృజనాత్మకత, వ్యక్తిగత సంతృప్తి కోసం ఉద్యోగులకు ఎక్కువ సమయం లభిస్తుందని చెప్పుకొచ్చారు. దైనందిన జీవితంలో అపారమైన మార్పులను తీసుకురావడంతో పాటు వైద్యులు, మానసిక ఆరోగ్య నిపుణుల కొరత వంటి ప్రధాన సమస్యలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిష్కరించగలదని గేట్స్ పేర్కొన్నారు.పని గంటల్లో ఊహించని మార్పువారానికి ఐదు రోజులు, 40 పని గంటల విధానం దశాబ్దాలుగా ఆధునిక సమాజంలో లోతుగా పాతుకుపోయింది. కానీ ఇది నాటకీయంగా మారుతుందని గేట్స్ భావిస్తున్నారు. తయారీ, లాజిస్టిక్స్ దగ్గర నుండి విద్య, ఆరోగ్య సంరక్షణ వరకు అన్నింటా కృత్రిమ మేధ (ఏఐ) సహాయం చేయడమే కాదు.. మనుషులు చేసే పనిని కూడా భర్తీ చేస్తుందని ఆయన ఊహిస్తున్నారు. ఈ మార్పు ఉద్యోగం అర్థాన్నే పునర్నిర్వచించగలదని గేట్స్ సూచిస్తున్నారు. వారంలో రెండు లేదా మూడు రోజులే పనిచేసే రోజులొస్తాయంటున్నారు.సృజనాత్మకత పెంపు, సంక్లిష్ట సమస్యల పరిష్కారంలో ఆర్టిఫీషియల్‌ జనరల్‌ ఇంటెలిజెన్స​ (ఏజీఐ) సామర్థ్యం గురించి గేట్స్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఇది కలిగించే సామాజిక, ఆర్థిక అంతరాయాల గురించి కూడా ఆయన హెచ్చరిస్తున్నారు. తయారీ, రవాణా, వ్యవసాయం వంటి కార్యకలాపాల్లో యంత్రాలు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, సాంస్కృతిక, భావోద్వేగ కారణాల వల్ల సమాజం కొన్ని మానవ కేంద్రీకృత కార్యకలాపాలను సంరక్షిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Grandmacore: Heres Why Youngsters Are Embracing Granny Hobbies10
'గ్రాండ్‌మాకోర్‌' అంటే..? యువత ఇష్టపడుతున్న ట్రెండ్‌..

ఈకాలం యువత ఎంత ఫాస్ట్‌గా ఉంటుందో చెప్పనవసరం లేదు. ఇదివరకు 90ల యువత వంటపని, కుట్లు, అల్లికలు వంటి ఇతరత్ర కళలు నేర్చుకునేవారు. ఇప్పుడు ఇంటర్‌నెట్, స్మార్ట్‌ఫోన్‌ల యుగం. ఏది గంటలకొద్దీ నేర్చుకునేందుకు ఇష్టపడరు. క్షణాల్లో పట్టేసి చకచక నేర్చేసే జెన్‌ జెడ్‌ తరం ఇది. వారి మెదుడు కూడా మహాచురుకు. ఇట్టే నేర్చుకునే అపార ప్రతిభాపాటవాలు వారి సొంతం. పైగా డిజిటల్‌ హవా కాబట్టి ఆ దిశగానే స్కిల్స్‌ పెంచుకుంటోంది యువత. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా సాంప్రదాయ హాబీలనే ఇష్టపడుతూ షాక్‌కి గురి చేస్తున్నారు. పరిగెడుతూ బిజీ లైఫ్‌లు, లక్షలు సంపాదనలు వద్దంటూ నిధానం, ప్రశాంతతే కావలంటూ..'గ్రాండ్‌మాకోర్'కి జై కొడుతున్నారు. అలసలేంటీ ట్రెండ్‌ అంటే..గత కొన్ని రోజులుగా సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ జెన్‌ జెడ్‌ మిలీనియల్స్‌ అమ్మమ్మల నానమ్మల అభిరుచుల వైపుకి మొగ్గుచూపుతున్నారు. అలాంటి రెట్రో కార్యకలాపాలలోనే సౌకర్యం ఉందని నొక్కి చెబుతున్నారు. గ్రాండ్‌మాకోర్ అంటే..'గ్రానీ'ల జీవనశైలి. అంటే ఏంలేదు..ఇదివరకు మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో వాళ్లు అనుసరించే అభిరుచులనే ఈతర యువత ఇష్టపడుతుండటం విశేషం. ఈ డిజిటల్‌ యుగంలో ఏ కోడింగ్‌, కంటెంట్‌ రైటింగ్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌, మ్యూజిక్‌ అంటూ ఇతరత్ర కళలను ఇష్టపడే యువత మైండ్‌సెట్‌ మార్చుకుంది. ఏకంగా బామ్మల కాలం నాటి జీవనశైలికే ఓటేస్తూ..ఇదే అత్యంత హాయిగా ఉంటుంది, మసుసుకు మంచి ప్రశాంతతనిస్తుందని అని చెబుతున్నారు. అంతేకాదండోయ్‌.. ఈ ట్రెండ్‌కి సంబంధించి.. సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫాంలలో గ్రాండ్‌మాకోర్ హ్యాష్‌ట్యాగ్‌లతో వాళ్ల బామ్మల అభిరుచులను డాక్యుమెంటు చేస్తున్నారు కూడా. నిధానంగా ఓపికతో నేర్చుకునే ఈ హాబీలే మనకు సరైన దృక్పథాన్ని ఇవ్వగలవని అంటున్నారు. వాళ్లు పనిచేయాలనుకోవడం లేదట..పనిలో పొందే ఆనందాన్ని వెతుకుతున్నారట..మంచి అభిరుచితో కూడిన పని ఇచ్చే ఆనందం వెలకట్టలేనిదని నమ్మకంగా చెబుతోంది నేటి యువత. ఒకరకంగా ఇది వారికి తమ అమ్మమ్మలు, నానమ్మలతో గడిపిన మధుర క్షణాలను జ్ఞప్తికి వచ్చేలా చేయడమే గాక స్వాంతన చేకూరుతుందని ఈ ట్రెండ్‌ని స్వీకరించిన అమెరికాకు చెందిన గృహిణి హన్నా ఆర్నాల్డ్ అంటున్నారు. దీనివల్ల వృద్ధాప్యంలో కూడా జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించగలుగుతామని అంటున్నారామె.ఈ గ్రాండ్‌మాకోర్‌ భావోద్వేగాలకు సంబంధించింది, పైగా హానికరం కానీ సృజనాత్మకత మార్గాన్ని అందించే గొప్ప అభిరుచులట అవి. ఇంతకీ అవేంటో తెలుసా..ఏం లేదండీ..తోటను చూసుకోవడం, స్కార్ఫ్‌ అల్లడం, కుట్లు, ఆహారం వృధాకాకుండా కేర్‌ తీసుకుని చేసే చిరు వంటకాలు తదితరాలే..నిపుణులు ఏమంటున్నారంటే..ఈ ట్రెండ్‌ వల్ల ఆందోళన కలిగించే విషయాల నుంచి కాసేపు ఆలోచనలు మళ్లించడం సాధ్యపడుతుందట. భావోద్వేగాలు నియంత్రణలో ఉంటాయి. అలాగే మన చుట్టూ జరుగుతున్నదాన్ని ప్రశాంతంగా గమనించే అవకాశం ఏర్పడుతుందట. పైగా వీలైనంతగా మిమ్మల్ని మీరు పూర్తిగా తెలుసుకునే అవకాశం ఏర్పుడుతుందని చెబుతున్నారు వెస్ట్రన్ సిడ్నీ విశ్వవిద్యాలయానికి చెందిన మానసిక శాస్త్రవేత్త గాబ్రియెల్ వైడెమాన్. మరీ ఇంకెందుకు ఆలస్యం..మీరు కూడా మీ బామ్మల హాబీలను ట్రై చేసి చూడండి.(చదవండి: సాహసం చేద్దాం బ్రదర్‌..! అడ్వెంచర్‌కే ప్రాధాన్యత ఇస్తున్న భాగ్యనగరవాసులు)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement