Top Stories
ప్రధాన వార్తలు

కూటమి ప్రభుత్వ అరాచకాలను దీటుగా ఎదుర్కొందాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి/తిరువూరు: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని.. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా కూటమి నేతలు బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను దీటుగా ఎదుర్కొందామన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వైఎస్ జగన్‌ను ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కలిశారు. చైర్పర్సన్ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకులు చేసిన దాడుల గురించి వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిన తీరును వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ అరాచకాలు, దాష్టీకాలను దీటుగా ఎదుర్కొందామని.. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనేక ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలబడ్డారంటూ కౌన్సిలర్లను అభినందించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్, తిరువూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాసు, కౌన్సిలర్లు తంగిరాల వెంకటరెడ్డి, పరసా శ్రీనివాసరావు, మోదుగు ప్రసాద్, ఇనపనూరి చిన్నారి, పాలం రమాదేవి, గుమ్మా వెంకటేశ్వరి, పరసా సత్యనారాయణ, వెలుగోటి విజయలక్ష్మి, షేక్ నదియా, రామవరపు మంజుల, జెడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ నల్లగట్ల సుధారాణి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కలకొండ రవికుమార్, సీనియర్ నాయకులు మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, నరెడ్ల వీరారెడ్డి, తిరువూరు మండలాధ్యక్షుడు తాళ్లూరి నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు

మేము చనిపోయామని అనుకున్నాం.. ఇండిగో బాధితుల ఆవేదన
శ్రీనగర్: దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు.. ఢిల్లీ నుంచి ప్రయాణికులతో శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుకుని తీవ్ర కుదుపులకు గురైంది. వడగండ్ల కారణంగా విమానం ముందుభాగం దెబ్బతిని పెద్ద రంధ్రమే ఏర్పడింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై హాహాకారాలు చేశారు. ఇదే విమానంలో ప్రయాణించిన తృణముల్ కాంగ్రెస్ నేతలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఐదుగురు సభ్యుల తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం డెరెక్ ఓ'బ్రియన్, నదిముల్ హక్, సాగరికా ఘోష్, మనస్ భూనియా, మమతా ఠాకూర్‌తో కూడిన బృందం బుధవారం శ్రీనగర్‌కు వెళ్తున్న 6E2142 విమానంలో ప్రయాణించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత సాగరిక ఘోష్ మాట్లాడుతూ.. విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో మేమంతా ఇక చనిపోయామని అనుకున్నాం. చావు దగ్గర వరకు వెళ్లి వచ్చినట్టుగా ఉంది. నా జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదు.I had a narrow escape while flying from Delhi to Srinagar. Flight number #6E2142. Hats off to the captain for the safe landing.@IndiGo6E pic.twitter.com/tNEKwGOT4q— Sheikh Samiullah (@_iamsamiullah) May 21, 2025విమానంలో ఉన్న వారంతా భయంతో కేకలు వేస్తున్నారు. కొందరు ప్రార్థనలు చేశారు. మమ్మల్ని సురక్షితంగా తీసుకువచ్చిన పైలట్‌కు కృతజ్ఞతలు. విమానం దిగిపోయిన తర్వాత మేమంతా విమానం దెబ్బతిన్న భాగాన్ని చూసి ఖంగుతిన్నాం’ అని చెప్పుకొచ్చారు. భారత్, పాక్ మధ్య దాడుల వల్ల సరిహద్దుల్లో ప్రభావితమైన ప్రజలకు సంఘీభావం తెలియజేయడానికి వీరంతా శ్రీనగర్ వెళ్లినట్టు తెలిపారు. టీఎంసీ ప్రతినిధి బృందం మే 23 వరకు జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. శ్రీనగర్‌తో పాటు పూంచ్, రాజౌరిలో వీరు పర్యటించనున్నారు.Delhi–Srinagar IndiGo flight hit by severe turbulenceFlight 6E-2142 was caught in a terrifying hailstorm just before landing in Srinagar, forcing an emergency landing around 6:30pm. Damage to plane's nose cone, cabin luggage tumbling. #6E2142 #indigo6e pic.twitter.com/gHKFxpn7SI— Lucifer (@krishnakamal077) May 21, 2025ఇదిలా ఉండగా.. 227 మంది ప్రయాణికులతో శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుకుని బుధవారం తీవ్ర కుదుపులకు గురైంది. అప్రమత్తమైన పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో విమానం సురక్షిత ల్యాండింగ్‌కు చర్యలు చేపట్టారు. చివరకు సాయంత్రం 6.30గంటల సమయంలో విమానాన్ని సురక్షితంగా కిందకు దించారు. విమానం ముందు భాగం దెబ్బతిన్న, ప్రయాణికులు కేకలు వేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సాంకేతిక సమస్యలతో విమానం శ్రీనగర్‌లోనే నిలిచిపోయింది.

ఢిల్లీ అతలాకుతలం.. తెలంగాణలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: మండు వేసవిలో దేశవ్యాప్తంగా అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. వర్షాకాలం నాటి పరిస్థితులు వేసవిలో కనిపిస్తున్నాయి. ఢిల్లీ, తెలుగు రాష్ట్రాలు సహా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, ఢిల్లీలో బలమైన గాలులు, వడగళ్ల వానతో నగరం మొత్తం అస్తవ్యస్తంగా మారింది. ఈదురు గాలులకు చెట్లు, హోర్డింగ్‌లు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు.. చెట్లు కూలడంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. కొన్ని ఏరియాల్లో మెట్రో సేవలు కూడా నిలిచిపోయాయి. ఇటు తెలంగాణలోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.ఢిల్లీలో బుధవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటకు 70కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. సఫ్దర్‌జంగ్ ప్రాంతంలో ఏకంగా గంటకు 80 కిలీమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. లోదీ రోడ్లో వడగళ్ల వాన పడింది. ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టు సహా పలు విమానయాన సంస్థలు ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశముందని ముందుగానే ప్రకటించాయి.Just now Delhi witnessed a massive dust storm followed by rain and hail. The power of nature is on full display #delhirain ⛈️"From dust storm to heavy rain and hail - #Delhi's weather is going to change dramatically tonight 🌪⚡️#delhirain #DelhiWeather pic.twitter.com/FLatYfSEap— Weatherman Uttam (@Gujarat_weather) May 21, 2025Thunderstorms and dust storms coupled with heavy rain wreak havoc across Delhi-NCR, uprooting trees and mangling sign boards.#delhirain #DelhiWeather pic.twitter.com/duY0nhOhIs— Mr. J (@LaughingDevil13) May 21, 2025ఇదిలా ఉండగా.. మరో మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళా తీరాన్ని తాకనున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. నిన్న తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. పిడుగులు పడి మహబూబాబాద్ జిల్లాల్లో ఇద్దరు, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. సూర్యాపేట జిల్లాలో పిడుగుపాటుకు 39 మేకలు చనిపోయాయి. ఇక వీటితో పాటు.. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.#delhirain pic.twitter.com/1nxW0mxdVC— Suaib (@JournalistSuaib) May 21, 2025హైదరాబాద్‌లో వాన బీభత్సంహైదరాబాద్‌లో వాన బీభత్సం సృష్టించింది. రోడ్లన్ని నదులను తలపించాయి. దీంతో ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తం చేసింది. తెలంగాణలోని అన్నిజిల్లాలకు ఎల్లో అలర్ట్ విధించింది వాతావరణ శాఖ. బంగ్లగూడ, సైదాబాద్, మలక్‌పేట్, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. #HyderabadRains Continue... 🌧️📸: Retratoooo [IG] pic.twitter.com/2LrjO7dxqT— Hi Hyderabad (@HiHyderabad) May 21, 2025It was a craziest downpour in Sikh Village Secunderabad. @balaji25_t #HyderabadRains pic.twitter.com/TzkHmGDfUA— The Food GlanZer (@JavedMohammeds) May 21, 2025Dramatic visuals from Hyderabad's Greenpark Colony: Two-wheeler almost swept away by rainwater.#Rain #Hyderabad #HyderabadRains #ViralVideo #Trending pic.twitter.com/mD3hRXFpLi— TIMES NOW (@TimesNow) May 22, 2025

45 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కాజీపేట అర్బన్: మావోయిస్టు పార్టీ తన ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు కాసింది. కానీ.. ఆ పార్టీకి బుధవారం తగిలిన ఎదురుదెబ్బ మాత్రం అశనిపాతమే. పార్టీ సుప్రీం కమాండర్‌గా ఉన్న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (ఎన్కే) అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఎవరూ ఊహించని విధంగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసు తూటాలకు నేలకొరిగారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో దిట్టగా గుర్తింపు పొందిన నంబాల అనేక భారీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచే.. కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జియ్యన్నపేట. వాసుదేవరావు, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలోనే విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్‌ఎస్‌లోను, టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, టెక్కలి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించిన కేశవరావు విద్యార్థి దశలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితుడయ్యారు. విద్యార్థి దశలో తన స్వగ్రామం వచ్చి తనకు రావాల్సిన వాటాను ఆస్తిగా ఇస్తే, పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగినట్టు సమాచారం. వరంగల్‌లోని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో (ఇప్పటి నిట్) బీటెక్ చేశారు. ఆ సమయంలోనే విప్లవ పార్టీలతో పరిచయాలు ఏర్పడ్డాయి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) సభ్యుడిగా చేరిన ఆయనకు సీపీఐ (ఎంఎల్) అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మలుపు తిప్పినఎంటెక్..ఎంటెక్ చదువుతుండగా కళాశాలలోని మెస్‌లో జరిగిన చిన్నపాటి వివాదం కేశవరావు జీవితాన్ని మలుపు తిప్పింది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్‌గా కేశవరావు ఉన్న సమయంలో మరో విద్యార్థి సంఘం ఏబీవీపీతో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆయన చిక్కుకున్నారు. అరెస్టు చేస్తారన్న సమాచారంతో.. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు 1982లో చింతపల్లి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్టణం సెంట్రల్ జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు.ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు..కేశవరావు విప్లవ పార్టీలో చేరిన తరువాత ఒక్కసారి కూడా తన స్వగ్రామం జియ్యన్నపేటకు రాలేదు. 1980లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలుత గంగన్న అనే పేరుతో పీపుల్స్ వార్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా చేశారు. 1987లో ఈస్ట్ డివిజన్‌ను విస్తరించి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటు ఆయన ఆలోచనే. ఆ కమిటీలో కేశవరావుతో పాటు మల్లోజుల కోటేశ్వరరావు, కటకం సుదర్శన్ కీలకపాత్ర పోషించారు.ఎల్టీటీఈ ద్వారా శిక్షణ1990లో కేశవరావు పీపుల్స్‌వార్ పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ తరువాత పీపుల్స్ వార్ పార్టీకి గుండెకాయ వంటి దండకారణ్య కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేశవరావు పేలుడు పదార్థాల తయారీ నిపుణుడిగా, మిలటరీ ఆపరేషన్ల వ్యూహ నిపుణుడిగా గుర్తింపు పొందారు. అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ కీలక నేతలు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలసి 1987లో మధ్యప్రదేశ్‌లోని బస్తర్ అడవుల్లో పేలుడు పదార్థాల ప్రయోగం, గెరిల్లా దాడుల్లో శిక్షణ పొందారు. ఎల్టీటీఈ ద్వారా వీరు ఈ శిక్షణ తీసుకున్నారు. దేశవ్యాప్త మిలటరీ ఆపరేషన్లకు నేతృత్వం పీపుల్స్‌వార్ పార్టీలో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్స్ విభాగం ఏర్పాటు చేయాలని 1995లో గణపతి, కేశవరావు భావించారు. ఆ మిలటరీ ఆపరేషన్స్ విభాగానికి బసవరాజు, బీఆర్ పేర్లతో కేశవరావే నేతృత్వం వహించారు. 2001లో పీపుల్స్‌వార్ 7వ కాంగ్రెస్‌లో సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. అప్పటివరకు దండకారణ్య ప్రాంతానికే పరిమితమైన ఆయన ఆ తర్వాత దేశవ్యాప్తంగా పీపుల్స్‌వార్ పార్టీ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి బిహార్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశాలో వేలాదిమందికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు.2016లో సుప్రీం కమాండర్‌గా..పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్(ఎంసీసీ)ను విలీనం చేయడంలో గణపతి, కేశవరావు జోడీ ప్రధాన పాత్ర పోషించింది. గణపతి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా.. కేశవరావు మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2016లో వయోభారంతో గణపతి ఆ పదవి నుంచి వైదొలగడంతో ప్రధాన కార్యదర్శి హోదాలో కేశవరావు సుప్రీం కమాండర్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో రెండు దశాబ్దాల పాటు పీపుల్స్‌వార్/మావోయిస్టు పార్టీ జరిపిన అన్ని ప్రధాన దాడుల వెనుక వ్యూహకర్త నంబాల కేశవరావే అని పోలీసులు చెబుతారు. గెరిల్లా వార్ఫేర్, ఆయుధాల తయారీ, మెరుపు దాడులు చేయడం వంటి అంశాల్లో నంబాల కేశవరావుకు దిట్టగా పేరుంది. స్వతహాగా ఇంజనీరింగ్ చదివి ఉండడంతో ఆ నైపుణ్యాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించినట్టు చెబుతారు. పీపుల్స్‌వార్ చరిత్రలో తొలిసారి 1987లో తూర్పుగోదావరి జిల్లా దారగడ్డలో పోలీసు బలగాలపై గెరిల్లా దళం దాడికి కేశవరావు నేతృత్వం వహించారు. ఆ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. అలిపిరి ఘటనకు, ఇతర భారీ దాడులకు బాధ్యుడు 2003 అక్టోబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలోని అలిపిరిలో క్లెమోర్ మైన్ దాడి వ్యూహం కేశవరావుదే. 2008లో ఒడిశా నాయగఢ్‌లో పోలీసుల ఆయుధాగారంపై దాడిచేసి వెయ్యికి పైగా ఆధునిక ఆయుధాలను అపహరించుకుపోయిన దాడికి నేతృత్వం వహించారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను బలిగొన్న దాడికి వ్యూహకర్త నంబాల కేశవరావే. ఆ దాడికి హిడ్మా నేతృత్వం వహించాడు. 2013లో ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ నేత నందకుమార్ మరో 27మందిని బలిగొన్న దాడికి కూడా కేశవరావే వ్యూహకర్త. విశాఖ జిల్లా అరకులో అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య ఘటనలోనూ కేశవరావు ప్రమేయం ఉందన్న వాదనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయాగరా, చింతల్నార్, బలిమెల వంటి దాడులు కూడా ఆయన నేతృత్వంలోనే చోటుచేసుకున్నాయి. శత్రువులుగా భావించిన వారికి మాటల కంటే తూటాలతోనే ఎక్కువ బదులిస్తారనే పేరు మోశారు. కాగా బసవరాజు పేరు ఏపీ, తెలంగాణలో కంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.నీడను కూడా నమ్మని మావోయిస్టు పార్టీ గెరిల్లా పోరాట పంథానుఅనుసరిస్తుండటంతో మావోయిస్టు పార్టీ నీడను సైతం నమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీలో ఏదైనా విభాగానికి నిర్దిష్టమైన పనులు తప్ప మొత్తం వ్యవహారంపై అవగాహన ఉండదు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్‌బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్, రాష్ట్ర కమిటీలు, వివిధ డివిజన్ కమిటీలను సమన్వయం చేయడం, ఆర్థిక, ఆయుధ వ్యవహారాలను చక్కదిద్దడం వంటి పనులు చూస్తుంటారు.ఎక్కడ నుంచి ఆయుధాలు వస్తుంటాయి, ఆర్థిక వనరుల ఆనుపానులు ఎక్కడ ఉంటాయి, పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎక్కడ షెల్టర్లలో ఉన్నారనే అంశాలు కూడా ఆయనకే ఎక్కువగా తెలుస్తాయి. ఇప్పటికే పెరిగిన నిర్బంధంతో ఆ పార్టీ విభాగాలు, కీలక నేతలు చెల్లాచెదురయ్యారు. ఇప్పుడు కేంద్ర కార్యదర్శే చనిపోవడంతో పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు. ఒక్కసారి చిక్కినా విదిలించుకుని.. నంబాల కేశవరావు విద్యార్థి సంఘాలు ఆర్ఎస్యూ, ఏబీవీపీ ఘర్షణల్లో ఒక్కసారి మాత్రమే అరెస్టయ్యారు. 1987లో విశాఖపటా్ననికి ఒంటరిగా వచ్చిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే కబడ్డీ క్రీడాకారుడు కావడంతో చాకచక్యంగా విదిలించుకుని పరారయ్యారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయనపై రూ.10 లక్షలతో మొదలైన పోలీసు రివార్డు రూ.1.50 కోట్లకు చేరుకుంది. పోలీసు శాఖ మోస్ట్‌వాంటెడ్ లిస్టులో అత్యధిక రివార్డు కేశవరావుపైనే ఉందని సమాచారం. 45 ఏళ్ల క్రితం విద్యార్థిథగా ఇంటిని వదిలివెళ్లిన కేశవరావు మావోయిస్టు అగ్రనేతగా ఎదిగి అప్పట్నుంచీ అజ్ఞాతంలోనే జీవితాన్ని గడిపారు. చివరకు అడవిలోనే ప్రాణాలు విడిచారు. కేశవరావు కుటుంబం విశాఖపట్నంలోనే స్థిరపడింది.

నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్న రైల్వే స్టేషన్లు ఇవే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (మే 22)న ప్రారంభించనున్నారు. 2022, డిసెంబర్లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధానమంత్రి రెండు దశల్లో శంకుస్థాపన చేశారు. దేశంలోని రైల్వే స్టేషన్లను ఆధునిక, సమగ్ర రవాణా కేంద్రాలుగా మార్చడంలో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 1,300కుపైగా స్టేషన్లను పునరాభివృద్ధి చేసింది.అమృత్ భారత్ స్టేషన్(Amrit Bharat Station) పథకాన్ని దేశంలోని పలు రైల్వే స్టేషన్లలో ఆధునిక వసతుల కల్పన, మల్టీమోడల్ ఇంటిగ్రేషన్, దివ్యాంగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చేపట్టారు. నేడు ప్రధాని మోదీ 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 103 రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు. ఆ స్టేషన్ల వివరాలిలా ఉన్నాయి.అస్సాం: హైబర్‌గావ్బీహార్: పిర్పైంటి, థావే.ఛత్తీస్‌గఢ్: దొంగగర్, భానుప్రతాపూర్, భిలాయ్, ఉర్కురా, అంబికాపూర్.గుజరాత్: సమఖియాలీ, మోర్బి, హపా, జామ్ వంతాలి, కనలస్ జంక్షన్, ఓఖా, మిథాపూర్, రాజులా జంక్షన్, సిహోర్ జంక్షన్, పాలిటానా, మహువ, జామ్ జోధ్‌పూర్, లింబ్డి, డెరోల్, కరంసాద్, ఉత్రాన్, కొసాంబ జంక్షన్, డాకోర్.హర్యానా: మండి దబ్వాలి.హిమాచల్ ప్రదేశ్: బైజ్నాథ్ పప్రోలా.జార్ఖండ్: శంకర్పూర్, రాజమహల్, గోవింద్పూర్ రోడ్.కర్ణాటక: మునీరాబాద్, బాగల్కోట్, గడగ్, గోకాక్ రోడ్, ధార్వాడ్.కేరళ: వడకర, చిరాయింకీజ్.మధ్యప్రదేశ్: షాజాపూర్, నర్మదాపురం, కట్ని సౌత్, శ్రీధం, సియోని, ఓర్చా.మహారాష్ట్ర: పరేల్, చించ్పోక్లి, వడలా రోడ్, మాతుంగా, షాహద్, లోనంద్, కేద్గావ్, లాసల్గావ్, ముర్తిజాపూర్ జంక్షన్, దేవ్లాలి, ధూలే, సావ్దా, చందా ఫోర్ట్, ఎన్‌ఎస్‌బీసీ ఇటావ్రీ జంక్షన్, అమ్గావ్. పుదుచ్చేరి: మహే.రాజస్థాన్: ఫతేపూర్ షెఖావతి, రాజ్‌గఢ్, గోవింద్ గర్, దేశ్నోక్, గోగమేరి, మందావర్ మహువ రోడ్, బుండి, మండల్ గర్.తమిళనాడు: సామలపట్టి, తిరువణ్ణామలై, చిదంబరం, వృద్ధాచలం జంక్షన్, మన్నార్గుడి, పోలూరు, శ్రీరంగం, కుళిత్తురై, సెయింట్ థామస్ మౌంట్.తెలంగాణ: బేగంపేట(Begumpet), కరీంనగర్, వరంగల్.ఉత్తరప్రదేశ్: బిజ్నోర్, సహరాన్పూర్ జంక్షన్, ఈద్గా ఆగ్రా జంక్షన్, గోవర్ధన్, ఫతేహాబాద్, కర్చన, గోవింద్‌పురి, పోఖ్రాయాన్, ఇజ్జత్‌నగర్, బరేలీ సిటీ, హత్రాస్ సిటీ, ఉఝని, సిద్ధార్థ్ నగర్, స్వామినారాయణ్ చప్పియా, మైలానీ జంక్షన్, గోల గోకరనాథ్, రామ్‌ఘాట్ హాల్ట్, సురైమాన్‌పూర్, బల్రామ్పూర్.పశ్చిమ బెంగాల్: పనగఢ్, కళ్యాణి ఘోష్పరా, జోయ్‌చండీ పహార్.ఇది కూడా చదవండి: యూట్యూబ్‌లో జ్యోతి మల్హోత్రా సంపాదన ఎంతంటే..

హనుమ జీవితమే ఒక వ్యక్తిత్వ వికాసం
సమున్నతమైన ఆలోచనా విధానం, అసాధ్యాన్ని సుసాధ్యంచేసే తెగువ, అసాధారణ కార్యదక్షత, భయాన్నీ, నిరాశానిస్పృహలను దరిచేరనివ్వని ధీశక్తి... ఈ లక్షణాలకు తోడు ఎదుటివారిని ప్రభావితం చేయగలిగే వాక్పటుత్వం... ఇవన్నీ కలబోసుకున్న ఒక విశిష్ఠ వ్యక్తి హనుమ. కేవలం ఆయనను దైవంగా పూజించడంతో సరిపెట్టుకోకుండా ఆయన బుద్ధిబలం, దేనినైనా సాధించి తీరాలన్న తపన, ధైర్యం, భయరాహిత్యం, వాక్చాతుర్యం, ఆరోగ్యం, దేహ దారుఢ్యం వంటి వాటిని అలవరచుకోగలగాలి. నేడు హనుమజ్జయంతి సందర్భంగా ఆయనలోని వ్యక్తిత్వ వికాస కోణాన్ని చర్చించుకుందాం.జీవితంలో మనకు ప్రధానమైన శత్రువు భయం. మతంగ మహర్షి శాపం వల్ల వాలి ఋష్యమూక పర్వతం మీదకు రాలేడని సుగ్రీవునికి తెలుసు. అయినా ధనుర్బాణాలు, కత్తులు ధరించి, ఋషి వేషంలో ఉన్న బలిష్టులైన రామలక్ష్మణులను ఋష్యమూక పర్వత శిఖరం మీద నుంచి చూసి భయపడిపోతున్న సుగ్రీవునికి ధైర్యం చెప్పేప్రయత్నం చేస్తాడు హనుమ ఈ రకంగా చూస్తే హనుమ తొలి దర్శనంలోనే సుగ్రీవునికే కాదు మనకు కూడా నిర్భయత్వాన్ని అలవరచుకోవాలనే పాఠం చెప్పే గురువుగా.. మంత్రిగా... సన్మిత్రుడిగా దర్శనమిస్తాడు. ‘సుగ్రీవా! నువ్వు మహారాజుగా ఉండవలసిన వాడివి, ఎవరో ఇద్దరిని చూసి నిన్ను చంపడానికే వచ్చారని భయపడితే ఎలాగయ్యా.. నడక చేత, అవయవాల కదలిక చేత, మాట చేత, అవతలివారు ఎటువంటి స్థితిలో ఉన్నారో, ఎందుకు వచ్చారో, వారి మనస్సులలో ఏ భావన ఉన్నదో కనిపెట్టి, దానికి అనుగుణంగా నడిచి, తనని, తన ప్రజలని రక్షించుకోగల సమర్థత ఎవడికి ఉన్నదో వాడు రాజు. అంతేకాని కనపడ్డ ప్రతివాడిని చూసి ఇలా పారిపోతే, నువ్వు రేపు రాచపదవి ఎలా నిర్వహిస్తావు?‘ ఈ విధంగా హనుమ తొలిసారిగా కనిపించగానే నిర్భీకతను బోధించే గురువుగా దర్శనమిస్తాడు.సమయోచిత వేష భాషలుఇంటర్వ్యూలకు వెళ్ళేటప్పుడు, ఉద్యోగజీవితంలో, వ్యక్తిగత జీవితాలలో సందర్భోచిత వేషధారణ అవసరమని చెపుతూ ఉంటాం. సందర్భోచిత వేషధారణ హనుమను చూసే నేర్చుకోవాలి. సుగ్రీవుని కోరిక మేరకు రామలక్ష్మణులతో మాట్లాడ్డానికి వెళ్ళేముందు కపివేషంలో కాక యతి వేషంలో వెళతాడు. వచ్చినవారు ఎవరు, ఎలాంటి వారు అన్న విషయం తెలిసిన తర్వాతనే నిజరూపం ధరిస్తాడు. మనం రూపాలు మార్చలేకపోయినా వస్త్రధారణనైనా సందర్భోచితంగా మార్చుకోగలం గదా! తాను స్వతహాగా అత్యంత శక్తిమంతుడైనా వ్యక్తి కంటే ధర్మం గొప్పది అని నమ్మిన వాడు గనకనే అధర్మపరుడైన వాలితో కాక సుగ్రీవునితోనే వుంటాడు ఆంజనేయుడు. అతను మాట్లడిన నాలుగు మాటలకే మురిసి పోతాడు తానే పెద్ద వాగ్విశారదుడైన శ్రీరామచంద్రుడు. హనుమంతుని సంభాషణా చాతుర్యాన్ని గురించి ‘‘చూశావా లక్ష్మణా, ఈయన మాట్లాడిన విధానాన్ని చూస్తే, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం తెలియకపోతే ఇలా మాట్లాడలేడు. అన్నిటినీ మించి ఈయన వ్యాకరణాన్ని చాలాసార్లు చదువుకున్నాడు. ఈయనకి ఉపనిషత్తుల అర్ధం పూర్తిగా తెలుసు. అందుకనే ఈయన మాట్లాడేటప్పుడు కనుబొమలు నిష్కారణంగా కదలడం లేదు, లలాటం అదరడం లేదు. కాళ్ళు, చేతులు, శరీరాన్ని అనవసరంగా కదపడం లేదు. ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో, ఎంతవరకు ఉచ్చరించాలో అలా పలుకుతున్నాడు’’ అని రాముడు తన సోదరుడైన లక్ష్మణునితో చెబుతాడు. అంటే దీనిని బట్టి మనం ఎప్పుడు ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలి.ఆయన జీవితమే ఓ పాఠ్యపుస్తకంనేను చేపట్టిన కార్యం అసాధ్యమేమో అని భయపడుతూ ఉండిపోతే ఏ కార్యం కూడా సాధ్యం కాదు... ఉదాహరణకు హనుమకు అప్పగించిన పనినే తీసుకోండి. సీతను అతను ఇంతవరకూ చూడలేదు. ఆమె ఎలాఉంటుందో తెలియదు. ఆమెను ఎత్తికెళ్ళింది ఎవరో తెలియదు ఎక్కడ దాచి ఉంచాడో తెలియదు. ఐనా నెల రోజులలో ఆమె ఆచూకీ తెలుసుకొని వస్తానని బయలుదేరతాడు హనుమంతుడు. అంటే సవాళ్లను స్వీకరించి వాటిని సమర్థంగా ఎదుర్కొని విజయవంతంగా బయటపడటమెలాగో అనే అంశాన్ని నేర్చుకోవడానికి హనుమ జీవితమే మనకు ఒక పెద్ద ఉదాహరణ. వినయగుణ సంపన్నుడుసముద్ర తీరానికి చేరుకొన్నప్పుడు హనుమ ప్రవర్తన చూసి వినయమంటే ఏమిటో, అన్నీ ఉన్నా ఒదిగి ఉండటమంటే ఏమిటో నేర్చుకోవాలి. సముద్రాన్ని దాటి లంకను చేరే పని నువ్వే చేయగలవని అందరూ కలిసి అడిగేటంతవరకూ తానుగా నా బలమింతటిది అనీ, ఈ పని నేను చేయగలను అనీ ఎగిసి ఎగిసి పడలేదు. శ్రేయాంసి బహు విఘ్నాని అని ఉత్తమ కార్యంలో అనేక విఘ్నాలు ఎదురవుతూనే ఉంటాయి. అవాంతరాలను ఎదుర్కొని కార్య సాధన చేయడమెలాగో, తొణకకుండా బెణకకుండా కార్యాన్ని చక్కపెట్టడమెలాగో హనుమనే మనకు చేసి చూపించాడు. మైనాకుడు అనే పర్వతం ఆదరించి ఆతిథ్యం స్వీకరించి ΄÷మ్మని అడగటం, దాన్ని సున్నితంగా తిరస్కరించి ముందుకు సాగటం సానుకూలంగా కనిపించే విఘ్నాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పుతాయి. భుజబలాన్నీ, బుద్ధి బలాన్నీ ఉపయోగించి విఘ్నాలను గట్టెక్కడం ఎలాగో సింహికను జయించడంలోనూ, సరమ నోటి లోనికి ప్రవేశించి బయటకు రావడంలోనూ చూపుతాడు.కష్టాల్లో ఉన్న వాళ్ళను ఓదార్చడం ఇది ఒక గొప్ప కళ. అశోక వనంలో సీతతో మాట్లాడుతున్నప్పుడు చూడాలి హనుమ చాతుర్యం. ‘అమ్మా, వానరసైన్యంలో నాకన్నా తక్కువ వాళ్ళెవరు లేరు, నాతో సమానమైనవారూ, నన్ను మించినవారూ ఎందరో ఉన్నారు. రాముడు వానరసైన్యంతో రావణుని సునాయాసంగా జయించగలడు. కనుక నీవు నిర్భయంగా ఉండమ్మా‘ అన్న పలుకులు ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్న వారికైనా ఎంత సాంత్వన కలిగించ గలుగుతాయో చూడండి.సమర్థుడైన కార్యసాధకుడుఆటంకాలను ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని హనుమ దగ్గర నేర్చుకోవాలి. అంతిమ విజయానికి ఉపయోగ పడుతుందనుకొంటే, కార్యసాధనలో అవసరమైతే చొరవ తీసుకొని స్వతంత్ర నిర్ణయాలను కూడా తీసుకోగలిగి ఉండాలి. సీతాన్వేషణకు బయలుదేరినప్పుడు, లంకా దహనం చేయమనీ, రాక్షస సంహారం చేయమనీ, రాముడు ఆయనతో చెప్పలేదు. కానీ రామదూతనైన తనే ఇంత విధ్వంసాన్ని సృష్టించగలిగితే కపిసైన్యంతో రాముడు వస్తే రాముడి ముందు తాను నిలవగలనా అన్న అనుమానాలను రావణునిలో రేకెత్తించే అనే ప్రయత్నం చేయడం హనుమ తీసుకొన్న స్వతంత్ర నిర్ణయం. అక్కడికక్కడ నిర్ణయాలను తీసుకోగలగడం ఒక సమర్థుడైన కార్యసాధకుడి లక్షణం. హనుమంతుని దగ్గర మనమెన్నో వ్యక్తిత్వ వికాస లక్షణాలనూ, సకారాత్మక ఆలోచనా విధానాన్నీ, యాజమాన్య కౌశలాన్నీ ఎంతైనా నేర్చుకోవచ్చు, నేర్చుకోవాలి కూడా. సంభాషణా చతురుడులంక నుంచి తిరిగి వచ్చిన తరువాత దూరంనించే ‘దృష్టా సీతా‘ అని ఒక్క మాటలో తన కార్యం విజయవంతమైనదన్న విషయాన్ని సూచించి ఆ తరువాత మిగతా విశేషాలను వివరిస్తాడు. అలాకాకుండా మైనాకుడూ, సరమా, సింహికా, లంఖిణీ అని నస మొదలు పెడితే వినేవారికి ఆందోళన. పెరిగిపోవడం ఖాయం. అలాగే లంకలో సీత దగ్గిర అకస్మాతుగా ఊడిపడి గాభరా పెట్టకుండా కొమ్మమీద కూర్చుని మొదట రామకథను వినిపించి, ఆమెను తగిన మానసిక స్థితికి తేవడంలో హనుమంతుని నేర్పు కనిపిస్తుంది. అదీ మాట తీరు అంటే. ఇదీ మనం నేర్చుకోవాలి హనుమ దగ్గర. ఎలాంటి వారికైనా సహజంగానే పరిస్థితుల ్రపాబల్యం వల్ల ఒక్కొక్కసారి దారుణమైన ఆవేదన, గ్లాని కలుగుతూ ఉంటాయి గానీ అలాంటి సందర్భాలలో కూడా వెంటనే తేరుకోగలిగి, నిర్వేదం నుంచి తక్షణమే బయటపడగలిగితేనే ఏదైనా సాధించగలం. – డి.వి.ఆర్.

'పూరి అంటే చాలా రెస్పెక్ట్'.. అది ఎవరో క్రియేట్ చేశారు: విజయ్ సేతుపతి
కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి మరో మూవీ రెడీ అయిపోయారు. విడుదల-2 తర్వాత ఆయన నటించిన ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఏస్. ఈ మూవీ హీరోయిన్గా రుక్మిణీ వసంత్ నటించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 23న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో విజయ్ సేతుపతి పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌తో చేస్తున్న సినిమా టైటిల్‌పై ప్రశ్నించగా.. విజయ్ సేతుపతి స్పందించారు. ఇంకా మేము టైటిల్ ఫిక్స్ చేయలేదని ఆయన అన్నారు. ఏఐతో ఎవరో పోస్టర్ చేశారని.. అది మనది కాదని తెలిపారు. పూరి జగన్నాథ్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉందని విజయ్ సేతుపతి అన్నారు. ఆయన సినిమాలు కూడా చూశానని.. స్క్రిప్ట్ అద్భుతంగా ఉంటుందని ప్రశంసలు కురిపించారు. అంతేకాకుండా విశాల్‌తో ఎయిర్‌పోర్ట్‌లో కలవడంపై మాట్లాడారు. ఆయనతో కేవలం పెళ్లి గురించి మాత్రమే చర్చించానని వెల్లడించారు. రాజకీయాల్లోకి వస్తారా? అని కూడా విశాల్‌ను అడిగానని తెలిపారు. నేను మాత్రం రాజకీయాల్లోకి రానని విజయ్ సేతుపతి ఫుల్ క్లారిటీ ఇచ్చారు.విజయ్ సేతిపతి మాట్లాడుతూ.. 'మేము టైటిల్ ఖరారు చేయలేదు. బెగ్గర్ అని టైటిల్ మీరే ఫిక్స్ చేశారా? పూరి జగన్నాథ్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. ఆయన సినిమాలు చాలా చూశా. స్క్రిప్టు వినడానికి రెండు, మూడు రోజులు పడుతుందేమో అనుకున్నా. కానీ కొన్ని గంటల్లోనే పూర్తి చేశారు. జూన్‌లో షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఆడియన్స్ కంటే ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా' అని అన్నారు.

టీసీఎస్‌కు రూ. 2,903 కోట్ల ఆర్డర్
న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తాజాగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి రూ. 2,903 కోట్ల యాడ్–ఆన్ అడ్వాన్స్ పర్చేజ్ ఆర్డరు (ఏపీవో) దక్కించుకుంది. దీని ప్రకారం బీఎస్ఎన్ఎల్కు 18,685 సైట్లలో 4జీ మొబైల్ నెట్వర్క్ ప్లానింగ్, ఇంజినీరింగ్, సరఫరా, ఇన్‌స్టాలింగ్, టెస్టింగ్, వార్షిక మెయింటెనెన్స్ మొదలైన సర్వీసులను టీసీఎస్ అందించాల్సి ఉంటుంది.ఏపీవోలో పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలకు లోబడి సవివర పర్చేజ్ ఆర్డర్లను (పీవో) బీఎస్ఎన్ఎల్ జారీ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఈ కాంట్రాక్టుకు సంబంధించి తాము టీసీఎస్‌కు సరఫరా చేసే రేడియో యాక్సెస్ నెట్వర్క్ (ఆర్ఏఎన్), ఇతరత్రా పరికరాల విలువ సుమారు రూ. 1,526 కోట్లుగా ఉంటుందని తేజాస్ నెట్వర్క్స్ పేర్కొంది. నిర్దిష్ట షరతులకు లోబడి టీసీఎస్ సవివర పీవోలను జారీ చేస్తుందని వివరించింది.

ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి: బ.దశమి రా.8.47 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: పూర్వాభాద్ర ప.1.49 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర,వర్జ్యం: రా.10.54 నుండి 12.25 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.39 వరకు,తదుపరి ప.2.55 నుండి 3.46 వరకు,అమృత ఘడియలు: ఉ.6.10 నుండి 7.41 వరకు, హనుమజ్జయంతి.సూర్యోదయం : 5.30సూర్యాస్తమయం : 6.22రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకుయమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు మేషం.... వ్యయప్రయాసలు. బంధువర్గంతో వైరం. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. పనుల్లో నిరుత్సాహం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.వృషభం... శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. మిత్రుల రాక సంతోషం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.మిథునం... బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విచిత్ర సంఘటనలు. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.కర్కాటకం... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. మానసిక ఆందోళన. ధనవ్యయం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.సింహం.... వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. సోదరులు, మిత్రుల నుండి సమస్యలు రావచ్చు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.కన్య.... ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.తుల.... దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. స్థిరాస్తి వృద్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు కొత్త హోదాలు.వృశ్చికం... మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. విద్యార్థుల యత్నాలలో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు ముందుకు సాగవు.ధనుస్సు... పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం. దేవాలయ దర్శనాలు. మిత్రుల నుండి ఒత్తిడులు. లేనిపోని ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.మకరం.... ఆకస్మిక ధనప్రాప్తి. సంఘంలో ఎనలేని గౌరవం. ఆస్తి ఒప్పందాలు. సోదరులతో సఖ్యత. ఉద్యోగయోగం. మీ ఖ్యాతి విస్తరిస్తుంది. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతి.కుంభం... శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.మీనం... ముఖ్య∙కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు, ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

ఇండియన్ ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు!
వాషింగ్టన్: అమెరికాను మరోసారి గొప్పదేశంగా మారుస్తానంటూ అధికారంలోకి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆయన నిర్ణయాలతో అమెరికాలో ఉంటున్న భారతీయుల బెంబేలెత్తిపోతున్నారు. ఎవరిని ఎప్పుడు వెళ్లగొడతారో తెలియక హడలిపోతున్నారు. అక్రమ వలసదారుల పేరిట 300 మంది భారతీయులను ఇటీవల అమెరికా నుంచి వెనక్కి పంపించిన సంగతి తెలిసిందే. అమెరికాలోకి భారతీయులు అక్రమంగా అడుగుపెట్టడానికి ఇండియన్ ట్రావెల్ ఏజెంట్లే ధనదాహమే కారణమని ట్రంప్ ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది. అందుకే సదరు ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతోంది. ‘‘అమెరికాకు భారతీయులను అక్రమంగా పంపిస్తున్న ఏజెంట్లను గుర్తించే పనిలో మిషన్ ఇండియాకు సంబంధించిన కాన్సులర్ అఫైర్స్ అండ్ డిప్లొమాటిక్ సెక్యూరిటీ సర్వీసు సిబ్బంది నిమగ్నమయ్యారు. మానవ అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయం’’అని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అక్రమాలకు పాల్పడుతున్న ఇండియన్ ట్రావెల్ ఏజెన్సీల యజమానులు, ప్రతినిధులపై వీసా ఆంక్షలు విధించడానికి చర్యలు చేపట్టామని స్పష్టంచేసింది. ఉద్దేశపూర్వకంగా చట్టవిరుద్ధమైన వలసలను ప్రోత్సహిస్తే శిక్ష తప్పదని తేలి్చచెప్పింది. మనుషుల స్మగ్లింగ్ అనేది పెద్ద నేరమని వెల్లడించింది. అమెరికాకు రావాలనుకుంటే ముందు తమ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు పూర్తిగా తెలుసుకోవాలని విదేశీయులకు సూచించింది. చట్టాలను ఉల్లంఘిస్తే తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలని పేర్కొంది. అక్రమంగా వలస వచ్చినవారికే కాకుండా.. అలా రావడానికి సహకరించిన వారికి కూడా శిక్షలు ఉంటాయని ఉద్ఘాటించింది. హెచ్–1బీ వీసాలు రద్దు చేయాలి మరోవైపు హెచ్–1బీ వీసాలపై అమెరికాలోని అతివాదుల దృష్టి పడినట్లు తెలుస్తోంది. ఇలాంటి వీసాలను ఎందుకు రద్దు చేయకూడదని అధికార డెమొక్రటిక్ పార్టీ మద్దతుదారు లారా ఎలిజబెత్ లూమర్ ప్రశ్నించారు. చట్టపరమైన ఈ తాత్కాలిక వర్క్ వీసాలతో భారతీయులు ప్రయోజనం పొందుతున్న సంగతి తెలిసిందే. హెచ్–1బీ వీసాలను రద్దు చేయాలంటూ ట్రంప్ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ వాదనలు వినిపిస్తున్నారు. ‘‘అక్రమ వలసదారులను బయటకు పంపిస్తున్నాం, బాగానే ఉంది.. మరి హెచ్–1బీ వీసాదారుల సంగతేమిటి?’’అని లారా ఎలిజబెత్ లూమర్ తాజాగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ‘‘హెచ్–1బీ వీసాల కుంభకోణాన్ని ట్రంప్ ప్రభుత్వం అడ్డుకోకపోతే కోట్లాది మంది అమెరికన్లకు అసంతృప్తే మిగులుంది’’అని మరో పౌరుడు పోస్టు చేశాడు. గత 30 ఏళ్లుగా కుంభకోణం జరుగుతోందని ఆరోపించాడు. టెక్నాలజీ కంపెనీలు ఈ స్కామ్‌ను అడ్డం పెట్టుకొని వందల కోట్ల డాలర్లు ఆర్జించాయని విమర్శించాడు. అవే కంపెనీలు 2020లో ట్రంప్‌ను ఓడించాయని చెప్పాడు. అమెరికన్ల ప్రయోజనాలను పణంగా పెట్టి టెక్ కంపెనీలకు ట్రంప్ చీఫ్ లేబర్‌ను కానుకగా ఇస్తున్నాడని మండిపడ్డాడు. విదేశీయులను బయటకు వెళ్లగొట్టి, ఉద్యోగాలన్నీ అమెరికన్లకే ఇవ్వాలని మరో వ్యక్తి డిమాండ్ చేశాడు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ) గ్రాడ్యుయేట్లతో ఈ పని ప్రారంభించాలని చెప్పాడు. అమెరికాను అమ్మకానికి పెట్టొద్దని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరాడు.
ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు
ప్రమాదం బారిన జీవవైవిధ్యం
బంగారం, స్టాక్ మార్కెట్, కరెన్సీ లేటెస్ట్ అప్డేట్స్
ఒంటరి మహిళలే రాము టార్గెట్.. 18 దారుణ హత్యలు!
వెస్టిండీస్‌కు ‘భారీ’ షాకిచ్చిన ఐర్లాండ్.. చిత్తు చిత్తుగా ఓడించి..
ఢిల్లీ అతలాకుతలం.. తెలంగాణలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్
టీసీఎస్‌కు రూ. 2,903 కోట్ల ఆర్డర్
'పూరి అంటే చాలా రెస్పెక్ట్'.. అది ఎవరో క్రియేట్ చేశారు: విజయ్ సేతుపతి
కొత్త సభ్యులకు రేషన్ కోటా!
ఇండస్ఇండ్ బ్యాంక్‌కు నష్టాలు.. అవకతవకల ఎఫెక్ట్!
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
ముక్కులో దూది.. నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకుని..
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
పచ్చ కండువా వేసుకుని రా.. లేదంటే నీ అంతు చూస్తా..
PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే
ఆ నటుడి వల్ల కన్నీటిపర్యంతమైన సాయిధన్సిక,అండగా నిలిచిన విశాల్
విశాల్ జీవితంలో ఆ నలుగురు అమ్మాయిలు!
'నా దుస్తులతో మీకేం పని?': రిపోర్టర్‌కు ఇచ్చిపడేసిన నటి ఐశ్వర్య
హెచ్–1బీ వీసాలు రద్దు చేయాలి
అయ్యయ్యో చైనా.. ఎంత కష్టమొచ్చే?
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
నా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు
ప్రేమ పేరుతో మోసం.. యువకుడిపై కేసు
ప్రమాదం బారిన జీవవైవిధ్యం
బంగారం, స్టాక్ మార్కెట్, కరెన్సీ లేటెస్ట్ అప్డేట్స్
ఒంటరి మహిళలే రాము టార్గెట్.. 18 దారుణ హత్యలు!
వెస్టిండీస్‌కు ‘భారీ’ షాకిచ్చిన ఐర్లాండ్.. చిత్తు చిత్తుగా ఓడించి..
ఢిల్లీ అతలాకుతలం.. తెలంగాణలో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్
టీసీఎస్‌కు రూ. 2,903 కోట్ల ఆర్డర్
'పూరి అంటే చాలా రెస్పెక్ట్'.. అది ఎవరో క్రియేట్ చేశారు: విజయ్ సేతుపతి
కొత్త సభ్యులకు రేషన్ కోటా!
ఇండస్ఇండ్ బ్యాంక్‌కు నష్టాలు.. అవకతవకల ఎఫెక్ట్!
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్‌తో దెబ్బకి 62 కిలోలకు!
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
ముక్కులో దూది.. నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకుని..
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
పచ్చ కండువా వేసుకుని రా.. లేదంటే నీ అంతు చూస్తా..
PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే
ఆ నటుడి వల్ల కన్నీటిపర్యంతమైన సాయిధన్సిక,అండగా నిలిచిన విశాల్
విశాల్ జీవితంలో ఆ నలుగురు అమ్మాయిలు!
'నా దుస్తులతో మీకేం పని?': రిపోర్టర్‌కు ఇచ్చిపడేసిన నటి ఐశ్వర్య
హెచ్–1బీ వీసాలు రద్దు చేయాలి
అయ్యయ్యో చైనా.. ఎంత కష్టమొచ్చే?
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
నా కొడుకును అమృతే కడతేర్చి ఉంటుంది.. తండ్రి ఫిర్యాదు
దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..
సినిమా

'ఇది చాలా ప్రత్యేకం.. నా అభిమానులకు అంకితమిస్తున్నా': మోహన్ లాల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న తాజా చిత్రం వృషభ. ఎంపురాన్-2, తుడురుమ్ సూపర్ హిట్స్ తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇవాళ ఆయన పుట్టినరోజు కావడంతో మోహన్ లాల్ ఫస్ట్ లుక్ రివీల్ చేశారు మేకర్స్. యోధుడి లుక్‌లో ఉన్న పోస్టర్ మోహన్ లాల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పెద్ద కత్తిని చేతిలో పట్టుకుని కనిపిస్తోన్న ఈ పోస్టర్ చూస్తుంటే పౌరాణిక చిత్రంగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని మోహన్ లాల్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. 'ఇది చాలా ప్రత్యేకమైనది.. నా అభిమానులందరికీ దీన్ని అంకితం చేస్తున్నా.. మీ నిరీక్షణ ఇక్కడితో ముగుస్తుంది. తుఫాను మేల్కోనుంది. గర్వం, శక్తితో వృషభ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరిస్తున్నా. ఇది మీ ఆత్మను మండించే కథగా కాలక్రమేణా ప్రతిధ్వనిస్తుంది. నా పుట్టినరోజున ఈ పోస్టర్ ఆవిష్కరించడం మరింత అర్థవంతంగా ఉండనుంది. మీ ప్రేమ ఎల్లప్పుడూ నాకు గొప్ప బలం' అంటూ పోస్ట్ చేశారు. ఈ సినిమాను అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మోహన్ లాల్ వెల్లడించారు. This one is special — dedicating it to all my fans.The wait ends. The storm awakens.With pride and power, I unveil the first look of VRUSSHABHA – a tale that will ignite your souland echo through time.Unveiling this on my birthday makes it all the more meaningful - your love… pic.twitter.com/vBl1atqY3Z— Mohanlal (@Mohanlal) May 21, 2025

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్.. ఆ రోజే తుది నిర్ణయం!
జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో జూన్‌పై విడుదలయ్యే సినిమాలపై ఈ ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ విషయంపై సమావేశం నిర్వహించారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై ఫిల్మ్ ఛాంబర్లో చర్చించారు. ఈ నెల 23న మరోసారి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సంయుక్త సమావేశం నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో శుక్రవారం రోజైనా తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను అద్దె విధానంలో నడుపుతున్నారు. దీని వల్ల తాము నష్టపోతున్నామని ఎగ్జిబిటర్లు వాదిస్తున్నారు. అందుకే పర్సంటేజీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానం అమలు చేయకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ప్రకటించారు. అయితే తాజా సమావేశంలో పర్సంటేజీ విధానంపై కొందరు నిర్మాతలు మొగ్గు చూపగా.. మరికొందరు ఓకే చేయలేదని సమాచారం. ఈ సమావేశంలో టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, సురేశ్‌బాబు, డీవీవీ దానయ్య, సాహు గారపాటి, బాపినీడు, నాగవంశీ పాల్గొన్నారు.

కమల్ హాసన్ థగ్ లైఫ్.. 'షుగర్ బేబీ' వచ్చేసింది..!
కమల్‌హాసన్ , త్రిష జంటగా నటిస్తోన్న తాజా చిత్రం థగ్ లైఫ్. ఈ సినిమాకు మణిశర్మ దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 36 సంవత్సరాల తర్వాత స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో కమల్ హాసన్ జతకట్టారు. దీంతో వీరిద్దరి కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. షుగర్ బేబీ అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటకు ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను అలెగ్జాండ్ర జాయ్, శుభ, నకుల్ అభ్యంకర్ ఆలపించారు. (ఇది చదవండి: కమల్ హాసన్ 'థగ్ లైఫ్' ట్రైలర్ రిలీజ్)కాగా..ఈ సినిమా జూన్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో శింబు కీలక పాత్రలో కనిపించనున్నారు. శింబు సరసన సన్య మల్హోత్రా నటించింది. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మీ, జోజూ జార్జ్, నాజర్, గౌతమ్ కార్తీక్, అశోక్ సెల్వన్, అభిరామి, మహేష్ మంజ్రేకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతమందించారు.

లెజెండ్‌కు నివాళులర్పించిన కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ చిత్రంలో అజిత్ సరసన హీరోయిన్గా త్రిష మెప్పించింది.అయితే అజిత్ కుమార్ కేవలం సినిమాలే కాదు.. కారు రేసింగ్‌లోనూ ఆయన దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆయన టీమ్ వరుసగా మూడు దేశాల్లో కప్‌లు కొట్టింది. తన చిన్నప్పటి నుంచి రేసర్ కావాలనేది ఆయన కోరిక అని.. యాక్సిడెంటల్‌గా సినిమాల్లోకి వచ్చానని గతంలోనే వెల్లడించారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా సినిమాల్లోకి వచ్చానని అజిత్ కుమార్ తెలిపారు. రేసింగ్ పట్ల తన అభిమానాన్ని ఏదో ఒక సందర్భంలో చాటుకుంటూనే ఉన్నారు.తాజాగా అజిత్ కుమార్ ఇటలీలోని ఇమోలాలో ఉన్న ఫార్ములా వన్ లెజెండ్ అయర్టన్ సెన్నా స్మారక చిహ్నాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. అజిత్ స్వయంగా 1994 శాన్ మారినో గ్రాండ్ ప్రిక్స్ సందర్భంగా ఎఫ్‌వన్ రేసులో ప్రాణాలు కోల్పోయిన ప్రదేశంలో ఉన్న సెన్నా విగ్రహాన్ని ముద్దాడారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.Ajith Sir paying tribute to Ayrton Senna at the Imola circuit. | #AK #Ajith #Ajithkumar | #GoodBadUgly | #AjithKumarRacing | #24HSeries | #AKRacing | #AyrtonSenna | pic.twitter.com/bWUJacUPSR— Ajith (@ajithFC) May 20, 2025 ThalaAjith pays respect to his Idol #AyrtonSenna 👏👏👏👏👏 pic.twitter.com/xU2t8yXG9l— Joker (@joker28_joker) May 20, 2025
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

సంచలనాల మోత
కౌలాలంపూర్: మలేసియా ఓపెన్ మాస్టర్స్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారులు అదర గొట్టారు. తొలి రౌండ్లో నలుగురు భారత ప్లేయర్లు కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, సతీశ్ కుమార్ కరుణాకరన్, ఆయుశ్ శెట్టి తమకంటే మెరుగైన ర్యాంక్ ఉన్న ఆటగాళ్లను బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఈ సీజన్లో ఫామ్‌లో లేని ప్రపంచ మాజీ నంబర్‌వన్, ప్రస్తుత 65వ ర్యాంకర్ శ్రీకాంత్ 23–21, 13–21, 21–11తో ప్రపంచ 13వ ర్యాంకర్ లు గ్వాంగ్ జు (చైనా)ను ఓడించాడు. మరో మ్యాచ్‌లో ప్రపంచ 35వ ర్యాంకర్ ప్రణయ్ 19–21, 21–17, 21–16తో ప్రపంచ 12వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)పై సంచలన విజయం సాధించాడు. ప్రపంచ 51వ ర్యాంకర్ సతీశ్ కుమార్ కరుణాకరన్ 21–13, 21–14తో ప్రపంచ 9వ ర్యాంకర్ చౌ టియెన్ చెన్ (చైనీస్ తైపీ)ను కంగుతినిపించాడు. ప్రపంచ 41వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 20–22, 21–10, 21–8తో ప్రపంచ 30వ ర్యాంకర్ బ్రియాన్ యాంగ్ (కెనడా)పై గెలుపొందాడు.అయితే భారత్‌కే చెందిన ప్రపంచ 34వ ర్యాంకర్ ప్రియాన్షు రజావత్‌కు నిరాశ ఎదురైంది. ప్రియాన్షు 15–21, 17–21తో జియా హెంగ్ జేసన్ టెహ్ (సింగపూర్) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో క్రిస్టో పొపోవ్ (ఫ్రాన్స్)తో సతీశ్; యుషి టనాకా (జపాన్)తో ప్రణయ్; ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)తో శ్రీకాంత్; తొమా జూనియర్ పొపోవ్ (ఫ్రాన్స్)తో ఆయుశ్ శెట్టి తలపడతారు. సింధుకు నిరాశ మహిళల సింగిల్స్ విభాగంలో భారత్‌కు నిరాశాజనక ఫలితాలు వచ్చాయి. బరిలో ఉన్న నలుగురు క్రీడాకారిణులు పీవీ సింధు, ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్, మాళవిక తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ 16వ ర్యాంకర్ సింధు 11–21, 21–14, 15–21తో ప్రపంచ 26వ ర్యాంకర్ థుయ్ లిన్ ఎన్గుయెన్ (వియత్నాం) చేతిలో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో ఉన్నతి 12–21, 20–22తో లిన్ సియాంగ్ టి (చైనీస్ తైపీ) చేతిలో, ఆకర్షి 9–21, 8–21తో పుత్రి కుసుమ వర్థిని (ఇండోనేసియా) చేతిలో, మాళవిక 21–19, 18–21, 8–21తో చియు పిన్ చియాన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో గద్దె రుత్విక శివాని–రోహన్ కపూర్ (భారత్) జోడీ 10–21, 14–21తో గువో జిన్ వా–చెన్ ఫాంగ్ హుయ్ (చైనా) జంట చేతిలో ఓడిపోగా... తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల (భారత్) ద్వయం 21–18, 15–21, 21–14తో అద్నాన్–సారి జమాల్ (ఇండోనేసియా) జోడీపై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. పురుషుల డబుల్స్‌లో పృథ్వీ కృష్ణమూర్తి రాయ్–సాయిప్రతీక్; హరిహరన్–రూబన్ కుమార్ (భారత్) జోడీలు తొలి రౌండ్లోనే ఓడిపోయాయి.

‘ప్లే ఆఫ్స్’కు ముంబై
తొలి ఐదు మ్యాచ్‌లలో నాలుగు పరాజయాలు... ఎప్పటిలాగే ముంబై ఇండియన్స్ తమ సీజన్‌ను నెమ్మదిగా మొదలు పెట్టింది... అయితే ఆ తర్వాత తమ స్థాయికి తగ్గ ఆటతో తర్వాతి ఎనిమిది మ్యాచ్‌లలో ఏడు విజయాలతో ముందంజ వేసింది. 2025 సీజన్లో ‘ప్లే ఆఫ్స్’లో చివరిదైన నాలుగో బెర్త్‌ను ఖరారు చేసుకుంది. సొంత మైదానంలో జరిగిన కీలక పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై పైచేయి సాధించింది. మరోవైపు వరుసగా నాలుగు విజయాలతో ఘనంగా సీజన్‌ను ప్రారంభించినా... ఆపై గతి తప్పిన ఆటతో వరుస ఓటములు ఎదుర్కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ ‘ప్లే ఆఫ్స్’ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ముంబై: ఐపీఎల్లో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ మరో టైటిల్ వేటలో నిలిచింది. ఈ సీజన్ ‘ప్లే ఆఫ్స్’లో మిగిలిన నాలుగో స్థానాన్ని ముంబై భర్తీ చేసింది. బుధవారం వాంఖెడే మైదానంలో జరిగిన పోరులో ముంబై 59 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడైన బ్యాటింగ్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. సమీర్ రిజ్వీ (35 బంతుల్లో 39; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. బుమ్రా 3 వికెట్లతో ఢిల్లీని దెబ్బ తీశాడు. 2 ఓవర్లలో 48 పరుగులు... బంతి తక్కువ ఎత్తులో వస్తూ నెమ్మదిగా ఉన్న పిచ్‌పై పరుగులు చేయడంలో ముంబై బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. రోహిత్ శర్మ (5) విఫలం కాగా... రికెల్టన్ (18 బంతుల్లో 25; 2 సిక్స్‌లు), విల్ జాక్స్ (13 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. దాంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 54 పరుగులకు చేరింది. కుల్దీప్ తన తొలి ఓవర్లోనే రికెల్టన్ను వెనక్కి పంపగా, తిలక్ వర్మ (27 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్) వేగంగా ఆడలేకపోయాడు.ఆరంభంలో సూర్యకుమార్ బ్యాటింగ్‌లో కూడా తడబాటు కనిపించగా, హార్దిక్ పాండ్యా (3) కూడా ఎక్కువసేపు నిలవలేదు. 18 ఓవర్లలో ముంబై స్కోరు 132/5 మాత్రమే. కనీసం 160 పరుగులు కూడా దాటడం అసాధ్యంగా అనిపించింది. అయితే ఆఖరి 2 ఓవర్లలో సూర్య, నమన్ ధీర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పండగ చేసుకున్నారు. ముకేశ్ వేసిన 19వ ఓవర్ తొలి బంతికి సూర్య సిక్స్ బాది 36 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా... చివరి నాలుగు బంతుల్లో నమన్ వరుసగా 4, 6, 6, 4 బాదడంతో మొత్తం 27 పరుగులు వచ్చాయి. చమీరా వేసిన ఆఖరి ఓవర్లో సూర్య ఒక్కడే 2 సిక్స్‌లు, 2 ఫోర్లు కొట్టడంతో 21 పరుగులు లభించాయి. టపటపా... ఛేదనలో ఢిల్లీ పూర్తిగా తలవంచింది. ఏ దశలోనూ జట్టు విజయం దిశగా వెళ్లలేకపోయింది. తొలి 5 ఓవర్లలోపే డుప్లెసిస్ (6), కేఎల్ రాహుల్ (11), అభిషే పొరేల్ (6) అవుట్ కావడంతోనే గెలుపుపై ఆశలు తగ్గిపోయాయి. ఆ తర్వాత విప్రాజ్ నిగమ్ (11 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోగా, ట్రిస్టన్ స్టబ్స్ (2) కూడా విఫలం కావడంతో సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు 66/5కు చేరింది. మరో ఎండ్‌లో రిజ్వీ కొంత పోరాడినా లాభం లేకపోయింది. మరో 10 బంతులు మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. రెగ్యులర్ కెపె్టన్ అక్షర్ పటేల్ జ్వరంతో ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో డుప్లెసిస్ ఢిల్లీకి సారథిగా వ్యవహరించాడు. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) మాధవ్ తివారి (బి) కుల్దీప్ 25; రోహిత్ (సి) పొరేల్ (బి) ముస్తఫిజుర్ 5; జాక్స్ (సి) నిగమ్ (బి) ముకేశ్ 21; సూర్యకుమార్ (నాటౌట్) 73; తిలక్ వర్మ (సి) రిజ్వీ (బి) ముకేశ్ 27; పాండ్యా (సి) ముకేశ్ (బి) చమీరా 3; నమన్ ధీర్ (నాటౌట్) 24; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1–23, 2–48, 3–58, 4–113, 5–123. బౌలింగ్: ముకేశ్ కుమార్ 4–0–48–2, చమీరా 4–0–54–1, ముస్తఫిజుర్ 4–0–30–1, విప్రాజ్ నిగమ్ 4–0–25–0, కుల్దీప్ యాదవ్ 4–0–22–1. ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: కేఎల్ రాహుల్ (సి) రికెల్టన్ (బి) బౌల్ట్ 11; డుప్లెసిస్ (సి) సాంట్నర్ (బి) చహర్ 6; పొరేల్ (స్టంప్డ్) రికెల్టన్ (బి) జాక్స్ 6; రిజ్వీ (బి) సాంట్నర్ 39; నిగమ్ (సి అండ్ బి) సాంట్నర్ 20; స్టబ్స్ (ఎల్బీ) (బి) బుమ్రా 2; అశుతోష్ శర్మ (స్టంప్డ్) రికెల్టన్ (బి) సాంట్నర్ 18; మాధవ్ తివారి (బి) బుమ్రా 3; చమీరా (నాటౌట్) 8; కుల్దీప్ (సి) రాజ్ బావా (సబ్) (బి) కరణ్ శర్మ 7; ముస్తఫిజుర్ (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.2 ఓవర్లలో ఆలౌట్) 121. వికెట్ల పతనం: 1–12, 2–20, 3–27, 4–55, 5–65, 6–103, 7–104, 8–108, 9–120, 10–121. బౌలింగ్: బౌల్ట్ 4–0–29–1, చహర్ 3–0–22–1, జాక్స్ 1–0–16–1, సాంట్నర్ 4–0– 11–3, బుమ్రా 3.2–0–12–3, కరణ్ శర్మ 3–0–31–1. ఐపీఎల్లో నేడుగుజరాత్ X లక్నోవేదిక: అహ్మదాబాద్∙రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఘన విజయం.. ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబై
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరిగిన కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. తద్వారా ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. ఢిల్లీ మరో మ్యాచ్ మిగిలుండగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ఇదివరకే ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే.ఢిల్లీతో మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. తొలి 18 ఓవర్లు పరుగులు సాధించేందుకు ఇబ్బంది పడిన ముంబై.. ఆఖరి రెండు ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఈ రెండు ఓవర్లలో సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), నమన్ ధిర్ (8 బంతుల్లో 24 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) విధ్వంసం సృష్టించారు. ముకేశ్ కుమార్, చమీరా వేసిన ఈ ఓవర్లలో ఏకంగా 48 పరుగులు పిండుకున్నారు. ముంబై ఇన్నింగ్స్‌లో రికెల్టన్ 25, రోహిత్ శర్మ 5, విల్ జాక్స్ 21, తిలక్ వర్మ 27, హార్దిక్ పాండ్యా 3 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ 2, దుష్మంత చమీరా, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ.. ఆది నుంచే వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా సాగింది. ఆ జట్టు 18.2 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటై 59 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో ముంబై బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటారు. సాంట్నర్, బుమ్రా చెరో 3 వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, చాహర్, జాక్స్, కర్ణ్ శర్మ తలో వికెట్ తీశారు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో సమీర్ రిజ్వి (39) టాప్ స్కోరర్ కాగా.. విప్రాజ్ నిగమ్ (20), అశుతోష్ శర్మ (18), కేఎల్ రాహుల్ (11) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.

IPL 2025, MI VS DC: సెంచరీ పూర్తి చేసిన కుల్దీప్ యాదవ్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 21) జరుగుతున్న అత్యంత కీలకమైన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి (ముంబైలో). ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ ముంబై ఇండియన్స్‌ను కట్టడి చేసింది.9 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై 3 వికెట్లు కోల్పోయి 73 పరుగులు మాత్రమే చేసింది. రికెల్టన్ (25), రోహిత్ శర్మ (5), విల్ జాక్స్ (21) ఔట్ కాగా.. సూర్యకుమార్ యాదవ్ (13), తిలక్ వర్మ (7) క్రీజ్‌లో ఉన్నారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్, ముస్తాఫిజుర్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు.కుల్దీప్ సెంచరీఈ మ్యాచ్‌లో రికెల్టన్ వికెట్ తీయడంతో కుల్దీప్ ఐపీఎల్లో 100 వికెట్లు పూర్తి చేశాడు. ఈ ఘనతను కుల్దీప్ 97 మ్యాచ్‌ల్లో సాధించాడు. తద్వారా ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పూర్తి చేసిన టాప్-5 స్పిన్నర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన స్పిన్నర్లుగా అమిత్ మిశ్రా, రషీద్ ఖాన్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. వీరు ముగ్గురు 83 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని తాకారు. ఈ జాబితాలో చహల్ (84 మ్యాచ్‌లు), సునీల్ నరైన్ (86) రెండు, మూడు స్థానాల్లో ఉండగా.. కుల్దీప్ నాలుగో స్థానంలో నిలిచాడు.ప్లే ఆఫ్స్ సమీకరణలు ఇలా..ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇప్పటికే మూడు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు (గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్) ఖరారయ్యాయి. మిగిలిన ఏకైక బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ఇరు జట్లు తలో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నా, వీరి ప్లే ఆఫ్స్ భవితవ్యం ఇవాల్టి మ్యాచ్‌తో దాదాపుగా డిసైడైపోతుంది.ఈ మ్యాచ్‌లో ముంబై గెలిస్తే ఇంకో మ్యాచ్‌తో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఢిల్లీ గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ అప్పుడే ఖరారు కాదు. ఆ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పంజాబ్‌పై (మే 24) కూడా గెలిస్తేనే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారవుతుంది.ఒకవేళ ఢిల్లీ.. ముంబైపై గెలిచి, పంజాబ్ చేతిలో ఓడినా ప్లే ఆఫ్స్ బెర్త్‌పై సందిగ్దత కొనసాగుతుంది. మే 26న జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలిస్తే ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది. ఒకవేళ ముంబై ఆ మ్యాచ్‌లో కూడా ఓడితే లీగ్ నుంచి నిష్క్రమిస్తుంది. ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు చేరుతుంది.
బిజినెస్

టారిఫ్ ప్రభావాలను భారత్ తట్టుకోగలదు
న్యూఢిల్లీ: యూఎస్ టారిఫ్‌లు, అంతర్జాతీయంగా వాణిజ్య ప్రతికూలతలను భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదని మూడీస్ రేటింగ్స్ అంచనా వేసింది. భారత్ ఎగుమతులపై తక్కువ ఆధారపడడం.. అదే సమయంలో బలమైన సేవల రంగం అండతో అమెరికా టారిఫ్‌లను అధిగమించగలదని అభిప్రాయం వ్యక్తం చేసింది. దీనికితోడు దేశీ వృద్ధి చోదకాలు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. మరే వర్ధమాన దేశంతో పోల్చుకున్నా భారత్ మెరుగైన స్థితిలో ఉందని పేర్కొంది. ప్రైవేటు వినియోగం పెంపు, తయారీ సామర్థ్యాల విస్తరణ, మౌలిక సదుపాయలపై వ్యయాలు పెంచడం వంటివి.. అంతర్జాతీయ డిమాండ్ బలహీనతలను అధిగమించేందుకు సాయపడతాయని తెలిపింది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో వడ్డీ రేట్ల తగ్గింపునకు అవకాశాలున్నాయని.. ఇది ఆర్థిక వ్యవస్థకు మరింత మద్దతుగా నిలుస్తుందని వివరించింది. వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు పెంపు డిమాండ్‌కు ఊతమిస్తుందని అంచనా వేసింది. పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు భారత్ కంటే పాక్‌కే ఎక్కువ నష్టం చేస్తాయని పేర్కొంది. ఆ దేశంతో భారత్‌కు పెద్దగా వాణిజ్య సంబంధాలు లేకపోవడాన్ని ప్రస్తావించింది. పైగా భారత్‌లో అధిక వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తి అంతా ఘర్షణ ప్రాంతాలకు దూరంగా ఉన్నట్టు తెలిపింది. కానీ, రక్షణ రంగంపై అధికంగా వెచి్చంచాల్సి వస్తే అది భారత్ ద్రవ్య పరిస్థితులపై ప్రభావం చూపిస్తుందని.. ద్రవ్య స్థిరీకరణ ఆలస్యం కావొచ్చని అభిప్రాయపడింది. భారత ఆటో రంగం మాత్రం అంతర్జాతీయంగా నెలకొన్న సవాళ్లను ఎదుర్కొనాల్సి వస్తుందని పేర్కొంది. అమెరికా టారిఫ్‌ల కారణంగా ఏర్పడిన అనిశి్చతులతో 2025 సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి అంచనాలను మూడీస్ 6.7 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గిస్తున్నట్టు ఈ నెల మొదట్లో ప్రకటించడం తెలిసిందే.

ప్రైవేట్ లేబుల్స్‌కి జై...
న్యూఢిల్లీ: దేశీయంగా వినియోగదారుల కొనుగోలు ధోరణులు మారుతున్నాయి. ప్రైవేట్ లేబుల్స్ వైపు మళ్లే వారు గణనీయంగా పెరుగుతున్నారు. ప్రస్తుతం దాదాపు సగం మంది వినియోగదారులు ఇలా మొగ్గు చూపుతున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఒక సర్వే నివేదికలో తెలిపింది. ఈవై రూపొందించిన ఫ్యూచర్ కన్జూమర్ ఇండెక్స్ (ఎఫ్‌సీఐ) ఇండియా నివేదిక ప్రకారం సంప్రదాయ బ్రాండెడ్ ఉత్పత్తుల స్థానంలో స్టోర్ల సొంత బ్రాండ్లకు ప్రాచుర్యం పెరుగుతోంది. 52% మంది వినియోగదారులు ప్రైవేట్ లేబుల్స్‌కు మారారు. ప్రైవేట్ లేబుల్ బ్రాండ్లు మంచి నాణ్యమైన ఉత్పత్తులను అందిస్తున్నాయని విశ్వసిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో 70% మంది తెలిపారు. అలాగే, బ్రాండెడ్ ఉత్పత్తులతో సరిసమానంగా ప్రైవేట్ లేబుల్స్ ప్రోడక్టులు తమ అవసరాలను తీర్చే విధంగా ఉంటున్నాయని భావిస్తున్నట్లు 70% మంది వినియోగదారులు పేర్కొన్నారు. ముడి సరుకులను లేదా ఫార్ములాను మార్చి, ఉత్పత్తిని మెరుగుపర్చి, వినూత్నంగా అందించేందుకు బ్రాండ్లు ప్రయత్నిస్తున్నా.. ఇవన్నీ నిఖార్సయిన ఆవిష్కరణలు కావని, కంపెనీలు ఖర్చు తగ్గించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు మాత్రమేనని 34% మంది భావిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. మారుతున్న ఆర్థిక పరిస్థితుల రీత్యా వినియోగదారుల ధోరణులు మారడం సాధారణమే అయినా, ప్రస్తుత మార్పులు శాశ్వత ప్రాతిపదికన కొనసాగేలా కనిపిస్తోందని ఈవై–పారీ్థనన్ పార్ట్నర్ అంగ్షుమన్ భట్టాచార్య చెప్పారు.నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు.. → బ్రాండ్‌కు కట్టుబడి ఉండటం కన్నా డిస్కౌంట్లకే వినియోగదారులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. సేల్ పెట్టినప్పుడు మాత్రమే పెద్ద బ్రాండ్లను కొంటున్నామని 59 % మంది తెలిపారు. → రిటైల్ స్టోర్స్‌లో కూడా ప్రైవేట్ లేబుల్స్‌కి ప్రాధాన్యత పెరుగుతోంది. తాము షాపింగ్ చేసే చోట మరిన్ని ప్రైవేట్ లేబుల్ ఆప్షన్లు కనిపిస్తున్నట్లు 74 శాతం మంది చెప్పారు. స్టోర్లలోని షెల్ఫుల్లో సరిగ్గా కంటికి కనిపించే స్థాయిలో మరిన్ని ప్రైవేట్ లేబుల్ ఉత్పత్తులను డిస్ప్లే చేస్తున్నట్లు గమనించామని 70 శాతం మంది వివరించారు. స్టోర్ల సొంత బ్రాండ్లు, ప్రైవేట్ లేబుల్స్‌తో డబ్బు ఆదా అవుతోందని 69 శాతం మంది వినియోగదారులు చెప్పారు. → రిటైలర్లు మరింత ధీమాగా ప్రైవేట్ లేబుల్స్‌ను ప్రవేశపెడుతున్నారు. వాటికి ప్రధానమైన ప్రైమ్ షెల్ఫ్ స్పేస్ కూడా ఇస్తున్నారు. అలాగే, వినియోగదారులకు అపరిమిత ఆప్షన్లను, టెక్నాలజీతో ఇతర ఉత్పత్తులతో పోల్చి చూసుకునే వెసులుబాట్లను కలి్పస్తూ మెరుగైన షాపింగ్ అనుభూతిని అందిస్తున్నారు. → తాజా, కొత్త బ్రాండ్లకు భారత వినియోగదారుల్లో ప్రాచుర్యం పెరుగుతుండటాన్ని ప్రైవేట్ లేబుల్స్ వేగవంతమైన వృద్ధి సూచిస్తోంది. వినూత్న ఆవిష్కరణలతో వారికి మరింతగా చేరువయ్యేందుకు పెద్ద బ్రాండ్లు దృష్టి పెట్టాల్సిన అవసరం నెలకొంది. → అత్యుత్తమమైన రుచి, నాణ్యత లేదా పని తీరును అందిస్తే తిరిగి బ్రాండెడ్ ఉత్పత్తికి మళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని 47 శాతం మంది తెలిపారు. కట్టే డబ్బుకు మరింత మెరుగైన విలువను పొందడం కోసం తాము మళ్లీ బ్రాండెడ్ ఉత్పత్తులకు మళ్లే అవకాశం ఉందంటూ 44 శాతం మంది సూచనప్రాయంగా తెలిపారు. → కృత్రిమ మేధ(ఏఐ) కీలకమైన షాపింగ్ సాధనంగా మారింది. ఏఐ సిఫార్సుల ఆధారంగా తాము కొనుగోలు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు 62 శాతం మంది చెప్పారు. తమ షాపింగ్ అనుభూతిని ఏఐ మరింత మెరుగుపర్చిందంటూ 58 శాతం మంది వినియోగదారులు తెలిపారు.

జియో, ఎయిర్టెల్, వీఐ.. చవకైన రీచార్జ్ ప్లాన్లు ఇవే...
టెలికాం కంపెనీలు టారీఫ్‌లు పెంచిన తర్వాత మొబైల్ రీఛార్జ్ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో చవకైన రీచార్జ్ ప్లాన్ల కోసం వినియోగదారులు చూస్తుంటారు. అటువంటివారి కోసం కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ వంటి అవసరమైన అన్ని ప్రయోజనాలను తక్కువ ధరలో అందించే రీచార్జ్ ప్లాన్లను ఇక్కడ అందిస్తున్నాం. జియో, ఎయిర్ టెల్, వీఐలు రూ.200 లోపు ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నాయి. ఇవి అపరిమిత కాలింగ్, రోజువారీ డేటా, ఎస్ఎంఎస్, అనేక అదనపు ప్రయోజనాలను అందిస్తాయి.ఎయిర్టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ఎయిర్ టెల్ రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇందులో, వినియోగదారులు మొత్తం 2 జిబి డేటా (రోజువారీ పరిమితి లేకుండా), ఏ నెట్‌వర్క్‌లోనైనా లోకల్, ఎస్టీడీ, రోమింగ్ అపరిమిత కాల్స్ పొందుతారు. ఈ ప్లాన్‌లో మొత్తం 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.జియో రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్జియో రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ కూడా 28 రోజులు. ఈ ప్లాన్ ద్వారా మొత్తం 2 జీబీ డేటా, మొత్తం 300 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అలాగే, ఈ ప్లాన్ అపరిమిత కాల్స్ ప్రయోజనాన్ని అందిస్తుంది. జియో టీవీ సబ్ స్క్రిప్షన్, జియోక్లౌడ్ వంటి అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి.వీఐ రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్వొడాఫోన్ ఐడియా రూ .189 ప్రీపెయిడ్ ప్లాన్ 26 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఇది మొత్తం 1 జిబి డేటా (రోజువారీ పరిమితి లేకుండా), మొత్తం 300 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాల్స్, వీఐ మూవీస్ అండ్ టీవీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్జియో రూ.199 ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 18 రోజులు. రోజుకు 1.5 జీబీ డేటా, ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. జియో టీవీ సబ్ స్క్రిప్షన్, జియోక్లౌడ్ వంటి అదనపు బెనిఫిట్స్ లభిస్తాయి.వీఐ రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్విఐ రూ .189 ప్రీపెయిడ్ ప్లాన్ 26 రోజుల వాలిడిటీని అందిస్తుంది. ఇది మొత్తం 1 జిబి డేటా (రోజువారీ పరిమితి లేకుండా), మొత్తం 300 ఎస్ఎంఎస్లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాల్స్, వీఐ మూవీస్ అండ్ టీవీ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది.

యూపీఐ యాప్‌లలో కొత్త మార్పులు.. జూన్ 30 నుంచి..
దేశంలో జరిగే డిజిటల్ లావాదేవీల్లో అత్యధికం యూపీఐ (UPI) ద్వారానే జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ వంటి అనేక యూపీఐ యాప్‌లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో లోపాల ద్వారా వినియోగదారులు డబ్బులు పోగుట్టుకుంటున్న సంఘటనలూ అక్కడక్కడా జరగుతున్నాయి. వీటిని నివారించడంలో భాగంగా యూపీఐ యాప్‌లలో కొత్త మార్పులు త్వరలో రానున్నాయి.యూపీఐ లావాదేవీలో డబ్బులు అంతిమంగా ఎవరికి చేరుతున్నాయన్నది తప్పనిసరిగా ప్రదర్శించాలని యూపీఐ పేమెంట్, భారత్ బిల్ పే, రూపే కార్డ్‌లతోపాటు దేశంలోని అన్ని రిటైల్ చెల్లింపులను నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా సర్క్యులర్ జారీ చేసింది.అంతిమ లబ్ధిదారు ఎవరన్నది పేయర్ యాప్‌లో అలాగే లావాదేవీ స్టేట్మెంట్, హిస్టరీలోనూ ప్రదర్శించాలని ఎన్పీసీఐ సర్క్యులర్‌లో తెలిపింది. సరైన లబ్ధిదారునికి డబ్బు పంపుతున్నామని వినియోగదారుల్లో విశ్వాసం కలిగించడానికి, సంభావ్య ప్రమాదాన్ని నివారించడానికి యూపీఐ యాప్‌లలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.చేయాల్సిన మార్పులివే..యూపీఐ యాప్‌లు లావాదేవీకి ముందు వివరాల పేజీలో డబ్బు ఎవరికి వెళ్తుందో అంతిమ లబ్ధిదారుని పేరు (ధ్రువీకరించిన ఏపీఐ అడ్రెస్ ద్వారా సంగ్రహించిన లబ్ధిదారు బ్యాంకింగ్ పేరు) మాత్రమే వినియోగదారునికి కనిపించాలి. అలాకాకుండా క్యూఆర్ కోడ్ ల నుంచి సేకరించిన పేర్లు, చెల్లింపుదారు నిర్వచించిన పేర్లు లేదా మరే ఇతర పేర్లను యూపీఐ యాప్ లో పేయర్ కు ప్రదర్శించకూడదు.యాపీఐ యాప్‌లలో లావాదేవీలకు బెనిఫీషియరీ పేరును మార్చేందుకు వీలు కల్పించే ఫీచర్లు ఉంటే వాటిని తప్పనిసరిగా తొలగించాలి. ఆయా యూపీఐ యాప్‌లన్నీ జూన్ 30 నాటికి ఈ మార్పులు అమలు చేయాలి. లేకుంటే నిబంధనల ఉల్లంఘనగా భావించి చర్యలు తీసుకుంటామని ఎన్పీసీఐ స్పష్టం చేసింది.
ఫ్యామిలీ

ముత్యాల నగలు, ఘూంఘట్ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్ లుక్
అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో (Cannes Film Fesitval 2025) అరంగేట్రం చేసింది. డెబ్యూలోనే తన అందం, ఫ్యాషన్ స్టైల్‌తో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంది. డిజైనర్ డ్రెస్, ముత్యాల దండలు, చక్కటి మేలిముసుగుతో తళుక్కున మెరిసింది. దీంతో 2025 కాన్స్‌లో భారతీయ అందగత్తెలు -ఉత్తమ లుక్ టైటిల్ జాన్వీకి ఇవ్వాలంటున్నారు ఫ్యాన్స్.బాలీవుడ్లో అత్యంత అందమైన నటీమణులలో ఒకరైన జాన్వీ కపూర్, తన అందమైన లుక్స్ ,నటనా నైపుణ్యాలతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. తాజాగా బ్యూటీ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో బ్లష్ పింక్ త్రీ-పీస్ ఎథ్నిక్ డ్రెస్‌లో తనదైన స్టైల్లో అరంగేట్రం చేసింది.జాన్వీ రాబోయే చిత్రం హోమ్‌బౌండ్ 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్బంగా జాన్వీతోపాటు, నీరజ్ ఘయ్వాన్, ఇషాన్ ఖట్టర్, కరణ్ జోహార్ , విశాల్ జెత్వా కూడా రెడ్ కార్పెట్‌పై నడిచారు.ఘూంఘాట్లో జాన్వీ కపూర్ కాన్స్ అరంగేట్రం జాన్వీ లుక్‌ను ఆమె కజిన్ , సెలబ్రిటీ స్టైలిస్ట్ రియా కపూర్ స్టైల్ చేశారు. తరుణ్ తహ్లియాని ప్రత్యేకంగా రూపొందించినగౌనులో జాన్వీ కపూర్ మెరిసింది. 2022లో ఐశ్వర్య రాయ్ బచ్చన్ ధరించిన ఫ్రాక్ అలా అనిపించినా, భిన్నమైన లుక్‌లో ఉంది. సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్, సావ్లీన్ మంచాంద జాన్వి లుక్ కు 90ల నాటి శ్రీ దేవి గ్లామ్ ను జోడించింది,లేత గులాబీ రంగులో , కార్సెట్ బాడీస్ బాటమ్, పొడవాటి ట్రాతో కూడిన స్కర్ట్‌ను ఆమె ఎంచుకుంది. దీనికి అందమైన ఘూంఘాట్ మరో హైలైట్‌గా నిలిచింది. దాన్ని తలపై కప్పుకుని మహారాణిలా జాన్వీ అడుగులు వేయడం స్పెషల్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor)డిజైనర్ డ్రెస్‌తో పాటు ముత్యాల ఆభరణాలు ఆమె లుక్‌కి మరింత హుందాతనాన్నిచ్చాయి. జాన్వీ నెక్లెస్‌ల స్టాక్‌తో సహా ముత్యాల నగలు ప్రత్యేక ఆకర్షణ అనడంలో ఎలాంటి సందేహంలేదు. చోపార్డ్ హౌస్‌కు చెందిన డైమండ్ పొదిగిన బ్రూచ్, డైమండ్ డ్రాప్ స్టైల్ పెండెంట్, లారియట్ స్టైల్ నెక్లెస్, ఒక సిగ్నేచర్ మల్టీ లేయర్డ్ నెక్లెస్‌తో షో స్టార్ గా నిలిచింది. దీనికి జతగా ప్లవర్ డిజైన్ డైమండ్ చెవిపోగులు, చక్కటి మేకప్ హెయిర్‌డోతో, ఆమె తన లుక్‌ను ఎలివేట్ చేసింది.

నాడు సన్యాసి.. ఇవాళ కంపెనీ సీఈవోగా..!
ఎందరో మేధావులు, ప్రముఖులు జీవితంలో అనుభవించాల్సిన ఆనందమంతా పొంది, బాధ్యతలు కూడా నెరవేర్చి.. చరమాంకంలో ఆధ్యాత్మికత వైపుకి అడుగులు వేస్తుంటారు. ఇక వారి శేష జీవితాన్ని ఆ దేవుని సేవకు అంకితం చేసిన ఎందరో భక్తాగ్రేసులను చూశాం. అలా కాకుండా వారందరికంటే భిన్నంగా..ఓ వ్యక్తి ఆధ్యాత్మికత నుంచి ఆధునిక జీవన విధానంలోకి వచ్చాడు. ఆయన ఆధ్యాత్మికంగా పరిపక్వత చెంది..చివరికి ప్రాంపించిక జీవితంలోకి రావడమే గాక..కోట్లు టర్నోవర్ చేసే కంపెనీకి సీఈవోగా ఎదిగారాయన. అంతేగాదు కుటుంబ జీవనంలో బతుకుతూనే ఆధ్యాత్మికంగా బతకొచ్చు అని నిరూపించాడు. పైగా అది మన జీవితంలో భాగమే గానీ ఎక్కడో దేవాలయాల్లో, మఠాల్లోనూ పొందే సిద్ధాంతం కాదని అంటారాయన. అది మన జీవన విధానానికే పునాది..అదే కేంద్రం బిందువని చెప్పకనే చెప్పాడు.ఆయనే స్టోన్ సఫైర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో శోభిత్ సింగ్. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించిన సింగ్ చిన్నప్పటి నుంచి తత్వశాస్త్రం, ఆధ్యాత్మికతవైపు ఆకర్షితుడయ్యాడు. అలా తన చదువు పూర్తి చేసుకున్న వెంటనే..కేవలం 26 ఏళ్లకే రిషికేశ్‌లోని ఒక ఆశ్రమంలో ఆధ్యాత్మికతలో మునిగిపోయాడు. అక్కడే వేద అధ్యయనం చేశాడు. ఇక పూర్తిగా ఆధ్యాత్మిక మార్గంలోనే నడవాలని భావించాడు. అలా ఆ రిషికేశ్ ఆశ్రమం మహర్షి సంస్థలో సభ్యుడిగా కూడా మారాడు. పూర్తి సన్యాసి జీవితం గడుపుతున్న శోభిత్ సింగ్ మఠాన్ని విడిచి పెట్టి..ప్రాపంచిక జీవితంలో గడుపుతూ ఆధ్యాత్మికంగా ఉండొచ్చు అని విశ్విసించడం మొదలుపెట్టాడు. ఆయనకు ఆ ఆశ్రమంలో ఉండగానే ఆధ్యాత్మికత అంటే కేవలం ఆచారాలు లేదా ఏకాంతం లేదా 'సంసారం' నుంచి నిష్క్రమించడం కాదని బోధపడింది. మన దైనందిన జీవితంలో ప్రతిపాత్రలో దీన్ని విలీనం చేసి బతికే జీవన విధానమే అది అని తెలుసుకున్నానని చెబుతున్నాడు శోభిత్. అప్పుడే స్ట్రాంగ్‌గా డిసైడ్ అయ్యా..అందరిలా జనజీవన స్రవంతిలో చేరి కార్పొరేట్ ప్రంపంచలో బతుకుతూ కూడా ఆధ్యాత్మికంగా ఎలా బతకచ్చో ఆచరించి చూపాలని నిర్ణయించుకున్నారట శోభిత్ సింగ్ఆ నేపథ్యంలోనే కొత్తమంది స్నేహితులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించి అంచలంచెలుగా విజయాలను అందుకున్నానని అన్నారు. ఈ పోటీతత్వంతో కూడిన కార్పొరేట్ వరల్డ్‌లో కూడా తన ఆలోచన విధానంలో ఎట్టి మర్పు రాలేదని ధీమాగా చెబుతున్నారు శోభిత సింగ్. ఆశ్రమంలో లేదా వ్యాపారంలో అయినా..తాను ఆధ్యాత్మికత విద్యార్థినే అంటారు. ఇక్కడ ఆధ్యాత్మికత..వినయం, సానుకూలత, సానుభూతి, గ్రహణశక్తి తదితరాలను ప్రతిబింబిస్తే..వ్యాపారంలో రాణించాలంటే కూడా ఇవన్నీ అవసరం..అదే నన్ను వ్యవస్థాపక జీవితంలోకి తీసుకొచ్చాయని నవ్వుతూ చెబుతారాయన. అదే వ్యాపార సూత్రం..ఆధ్యాత్మికత ప్రాథమిక విలువలైనా..బహిరంగత, వినయం, సానుకూలత, సానుభూతి, ఆత్మపరిశీలన, గ్రహణశక్తి తదితరాలే నా వ్యాపార సూత్రాలంటారు ఆయన. వాటితోనే తాను అందరితో సంబంధాలు నెరపీ..వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. అలాగే ప్రతి వ్యక్తికి 200% జీవితం ఉంటుందట. అంటే 100% అంతర్గత (ఆధ్యాత్మిక), ఇంకో 100% బాహ్య జీవతానికి కేటాయించి ఉంటుందంటారు సింగ్. ఈ ఆధ్యాత్మికత ప్రయాణం వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన జీవితంలో కూడా స్పష్టమైన వైఖరితో ఉండటం నేర్పిస్తుందట. పైగా అన్నివేళల మంచి స్పృహతో ఉంటారట. ఈ ఆధ్యాత్మికతలో మనల్ని మనం పరిశీలించటంతో జర్నీ మొదలవుతుంది..అక్కడ నుంచి మన దృక్కోణం మారుతుది..దాంతోపాటు జీవితం కూడా మారుతుంది. అలాగే ఏ విషయాలకు ఎలా స్పందించాలనే విషయంపై పూర్తి అవగాహన ఉంటుంది. అది ఈ ప్రాపంచిక జీవన విధానంలో ఎలా మసులుకోవాలో నేర్పించడమే గాక జీవితంలో ఉన్నతంగా బతకడం వైపుకు మార్గం వేస్తుందని చెబుతున్నారు శోభిత్ సింగ్. కాగా, ఆయన కంపెనీ గుజరాత్‌కు చెందిన కాగితపు ఉత్పత్తుల సరఫరాదారు. దీని టర్నోవర్ కోట్లలో ఉంటుందట. అంతేగాదు ఇది ఆసియాలో అతిపెద్ద ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సరఫరాదారులలో ఒకటి, పైగా US రిటైలర్ల కాగితపు ఉత్పత్తి అవసరాలను కూడా తీరుస్తుంది. ముఖ్యంగా చిన్నారుల ఆర్ట్ సామాగ్రి, క్రాఫ్ట్ మెటీరియల్, పర్యావరణ అనుకూల స్టేషనరీ తదితర ఉత్పత్తులను అందిస్తుంది. (చదవండి: International Tea Day: 'టీ' వ్యాపారంలో సత్తా చాటుతున్న మహిళలు వీరే..!)

కాన్స్‌లో బాలీవుడ్ నటి రుచి : ప్రధాని మోదీ ఫోటో నెక్లెస్‌పై చర్చ
78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Canne Film Festival 2025) వేడుక వైభవంగా జరుగుతోంది. ఫ్యాషన్ స్టైల్స్, గ్రామ్ లెన్స్, రెడ్ కార్పెట్ మెరుపులతో సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. అత్యంతప్రతిష్టాత్మక కాన్స్రెడ్ కార్పెట్‌పై ఎవరి ప్రత్యేకతను వారు చాటుకుంటున్నారు. నటులు, మోడల్స్ ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా అందరూ ఫ్యాషన్ గేమ్‌ను నెక్ట్స్ లెవల్ అనిపించుకుంటన్నారు. తాజాగా బాలీవుడ్ నటి రుచి గుజ్జర్ (Ruchi Gujjar) లుక్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్యారిస్‌లో జరుగుతోన్నకాన్స్ ఫిలిం ఫెస్టివల్లో రుచి ధరించిన మూడు మోదీ ఫోటోలతో ఉన్న నెక్లెస్ ఇప్పుడు వైరల్‌గా మారింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రంతో ఉన్న నెక్లెస్‌తోపాటు, అందమైన లెహెంగాలో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. దీనికితోడు రుచి అందమైన లెహంగాతో కాన్స్ ఫిలిం ఫెస్టివల్ 2025లో ఔరా అనిపించుకుంది. సాంప్రదాయ గాజులు, భారీ మాంగ్-టీకా, దానికి సరిపోయే చెవిపోగులతో, ఆమె తన లుక్‌ను అందంగా తీర్చిదిద్దుకుంది. లేత గోధుమ రంగు లెహంగాకు నక్సీ వర్క్ ఉన్న డీప్-ప్లంగింగ్ బ్లౌజ్, స్కర్ట్‌ను జత చేసింది. హర్యాన్వి బంధానీ దుప్పట్టా ఆకర్షణీయంగా నిలిచింది. స్కర్ట్ అంతా అద్దాలను పొందుపరిచారు. బంధానీ దుప్పట్టాను జరిబారికి చెందిన రామ్ రూపొందించారని, దీని ద్వారా రాజస్థాన్ ఆత్మను కప్పుకున్నట్టు అనిపించిందని వ్యాఖ్యానించింది. View this post on Instagram A post shared by Ruchi Gujjar (@ruchigujjarofficial)స్టేట్మెంట్ నెక్లెస్, హైలైట్కాన్స్లో రుచి గుజ్జర్ లుక్ చర్చకు దారితీసింది. పీఎం మోదీ ముఖంతో డిజైన్ చేసిన డబుల్ లేయర్డ్, నెక్లెస్ ధరించి తళుకున్న మెరిసింది. ఒకటి మినీ-పెర్ల్స్‌తో తయారు చేసిన చోకర్ కాగా, మరొకటి స్టేట్మెంట్ పీస్. స్పెషల్ నెక్లెస్‌పై మూడు కమలాల మోటిఫ్లో మోదీ ఫోటోను జతచేసి ఉండటం హైలైట్. తన నెక్లెస్ గురించి మాట్లాడుతూ..ఇది ప్రత్యేకమైందీ, ప్రతీకాత్మకమైనదని చెప్పింది రుచి. ఇది కేవలం నెక్లెస్ కాదు, భారతదేశం బలానికి ఉన్నతికి చిహ్నం. ప్రపంచ వేదికపై దేశం బలాన్ని, పటిష్టతను ఇది చాటి చెప్పుతుందని తెలిపింది. భారతదేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లిన ప్రధాని మోదీని గౌరవార్ధం దీన్ని ధరించినట్టు చెప్పింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. రుచి గుజ్జర్ ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. కొందరు ఆమె లుక్ చూసి ఆశ్చర్యపోగా, మరికొందరు అద్భుతం అంటూ మెచ్చుకున్నారు. ఒక యూజర్ మాత్రం "యే క్యా బక్వాస్ హై" అని కామెంట్ చేశారు. మరొక యూజర్ "మీ తలపై హర్యాన్వి దుపట్టా" అని కామెంట్ చేశారు. మూడవ వినియోగదారుడు, "అన్నీ ఆర్గానిక్‌గా బాగున్నాయి కానీ మోదీజీ ఫోటో ఎందుకు?" అంటూ నిట్టూర్చాడు.

'కమ్యూనిటీ' ఆవకాయ..! ఒక్కరోజులోనే ఏకంగా..
ఆవకాయ.. ఇది తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకం. విస్తర్లో ఎన్ని వంటకాలు ఉన్నా.. ఏదో ఒక మూల ఆవకాయ టేస్ట్ తగలకపోతే ఏదో వెలితి. ఆఖరికి పెరుగులో టచింగ్కైనా సరే. తెలుగు విందు భోజనాల్లో అంతటి స్థానాన్ని సంపాదించుకుంది ఆవకాయ. అంతెందుకు దేశం దాటి వెళ్తున్న తమ వారి లగేజీల్లో ఆవకాయ పచ్చడి ఉండి తీరాల్సిందే. ఇప్పటికే విదేశాల్లో స్థిరపడ్డ కుటుంబీకులకు పచ్చళ్లు పంపడానికి ఏకంగా కొరియర్ సర్వీసులు లెక్కకుమించి పుట్టుకొస్తున్నాయంటే తెలుగు ఆవకాయకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా వేసవి విహారంలో విలేజీకి వెళ్లినప్పుడు అమ్మమ్మలు, నాన్నమ్మలు చుట్టుపక్కల అమ్మలక్కలతో కలిసి ఆవకాయ పట్టడం ఇప్పటికీ చూస్తునే ఉంటాం. అలాంటి మధుర జ్ఞాపకాలు పాత తరం వారి ప్రతిఒక్కరి జీవితంలో ఉండే ఉంటాయి. ఆ జ్ఞాపకాలను తిరగేసుకుని మళ్లీ అలాగే అందరం కలిసి ఆవకాయ పడితే ఎలా ఉంటుందని ఆ అపార్ట్మెంట్ మహిళల మదిలో ఆలోచన తళుక్కుమనడమే కాదు..ఏకంగా పట్టాలెక్కించారు. ఆవకాయ పచ్చడి పట్టడానికి ఒక వేడుకగా మలచుకున్నారు. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని మోతీనగర్ సమీపంలో కొత్తగా నిర్మితమైన బ్రిగేడ్ సిటాడెల్ హైరైజ్డ్ అపార్ట్మెంట్ అది. 1300 ప్లాట్లు కలిగిన ఈ అపార్ట్‌మెంట్స్‌లో ఇప్పుడిప్పుడే కుటుంబాలు గృహప్రవేశాలు చేస్తున్నాయి. అలా దిగిన కుటుంబాలకు చెందిన 800 మంది మహిళలంతా ఒక వాట్సప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. అందులో మనమందరం కలిసి ఆవకాయ పచ్చడి పట్టుకుంటే బాగుంటుందని స్వాతి జ్యోతులకు వచ్చిన ఆలోచనను వాట్సప్ గ్రూపులో పంచుకుంది. దీనికి మిగతా మహిళల నుంచి కూడా ఆమోదం వచ్చింది. ఒక వంద కుటుంబాలు కలసికట్టుగా ఆవకాయ పచ్చడి పట్టుకుందామని ముందుకువచ్చాయి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆవకాయ పచ్చడి పట్టడాన్ని ఒక పండుగలా, ఒక జాతరలా జరుపుకుని మహానగరంలో సరికొత్త సంప్రదాయానికి తెరలేపారనే చెప్పవచ్చు.ఒక్కరోజులో 150 కిలోల పచ్చడి.. దాదాపు 100 కుటుంబాల డబ్బులు వేసుకుని సామూహిక ఆవకాయ పచ్చడికి సిద్ధమయ్యారు. ఇందుకోసం అక్కడే ఒక హాల్‌ను బుక్ చేసుకున్నారు. పచ్చడి పెట్టుకునేందుకు ముందుకు వచ్చిన కుటుంబాలతో పాటు చూడడానికి వచ్చిన వారితో ఈ ఈవెంట్ ఒక వేడుకగా మారింది. శంషాబాద్ శివారుల నుంచి 300 దాకా ఆర్గానిక్ మామిడి కాయలను ప్రత్యేకంగా కోసుకుని తీసుకువచ్చారు. గుంటూరు కారాన్ని తెప్పించారు. ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, పసుపు ఇలా అన్ని పదార్థాలూ సరిపడా సమకూర్చుకున్నారు. ఒక్కరోజులో 150 కిలోల పచ్చడిని పట్టి ఔరా అనిపించారు. తొలిసారి ప్రయత్నమే సక్సెస్ అందరం ఒకచోట చేరి ఒక పండుగలా ఆవకాయ ఈవెంట్‌ను జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇలాంటి వేడుక ద్వారా ఐక్యత పెరుగుతోంది. బతుకమ్మ, సంక్రాంతి, దసరా పండుగలప్పుడు కలవడం సాధారణమే అయినా ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలతో అందరూ తలో చేయి వేసి సమిష్టిగా పచ్చడిని పెట్టుకోవడం నిజంగా అద్భుతమనిపించింది. మరుపురాని అనుభూతి మిగిల్చింది. – దీప్తి ధరణిప్రగడమధురానుభూతి.. కొత్తగా చేరిన కుటుంబాలంతా కలిసి తొలిసారిగా ఆవకాయ ఈవెంట్‌ను జరుపుకోవడం ఎంతో మధురానుభూతిని కలిగించింది. ఒక కుటుంబమో, లేక ఆ కుటుంబంలోని బంధువులో కలిసి ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం మామూలే. కానీ అపార్ట్మెంట్లోని మహిళలంతా కలిసి ఒక వేడుకగా జరుపుకోవడం ద్వారా అందరి మధ్య ఒక ఆత్మీయ బంధాన్ని ఆవకాయ ఏర్పరిచింది. – స్వాతి జ్యోతుల (చదవండి: Asli Mango 2.0: అస్లీ మ్యాంగో.. రుచి చూడాల్సిందే..)
ఫొటోలు
అంతర్జాతీయం

బ్రిటిష్ కశ్మీరీ ప్రొఫెసర్ ఓసీఐ రద్దు.. కారణమిదే..
లండన్: భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్నవారిపై ప్రభుత్వం దృష్టిసారించింది. తాజాగా లండన్‌లోని వెస్ట్మిన్స్టర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారత సంతతికి చెందిన బ్రిటిష్ అకాడమిక్ నితాషా కౌల్(Nitasha Kaul)కు చెందిన ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) స్టేటస్‌ను భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా సాయంతో వెల్లడించారు.తాను భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నానని, ప్రత్యేకించి తన రచనలు, ప్రసంగాలు, సోషల్ మీడియా పోస్టులు.. దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని భారత ప్రభుత్వం తనపై ఆరోపణలు గుప్పించిందని నితాషా కౌల్ ఆ పోస్టులో పేర్కొన్నారు. గోరఖ్‌పూర్‌లో జన్మించిన కౌల్ కశ్మీరీ పండిట్, బ్రిటిష్ పౌరురాలు. ఆమె వెస్ట్మిన్స్టర్ విశ్వవిద్యాలయం(University of Westminster)లో సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెమోక్రసీ (సీఎస్డీ) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రచయిత్రిగా, యాక్టివిస్ట్‌గా కూడా పనిచేస్తున్నారు. భారత ప్రభుత్వం తన ఓసీఐ స్టేటస్‌ను రద్దు చేయడాన్ని క్రూరమైన, ప్రతీకార చర్యగా ఆమె అభివర్ణించారు.2024 ఫిబ్రవరిలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ‘రాజ్యాంగం, భారత ఐక్యత" అనే అంశంపై ఒక సమావేశంలో ప్రసంగించేందుకు బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న నితాషాను ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకుని, లండన్‌కు తిరిగి పంపించారు. ఆమె రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను విమర్శించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు నాడు తెలిపారు. భారత ప్రభుత్వం జారీ చేసిన నోటీసులో నితాషా కౌల్.. భారతదేశ సార్వభౌమత్వంపై దురుద్దేశపూరితంగా, వాస్తవాలు లేదా చరిత్రను పట్టించుకోకుండా రచనలు, ప్రసంగాలు, జర్నలిస్టిక్ కార్యకలాపాటు సాగించినట్లు పేర్కొంది. లండన్‌లోని భారత హైకమిషన్ నిర్దేశించిన ఓసీఐ నిబంధనల ప్రకారం, భారత ప్రభుత్వం ఏ వ్యక్తి కి చెందిన ఓసీఐ రిజిస్ట్రేషన్‌ను అయినా కొన్ని నిర్దిష్ట కారణాలతో రద్దు చేయవచ్చు.ఇది కూడా చదవండి: ప్రముఖ శాస్త్రవేత్త నార్లికర్ కన్నుమూత.. సాగించిన పరిశోధనలివే..

World Bee Day... అప్పుడు మనిషి జీవితం నాలుగేళ్లే!
తేనె.. ఎంత రుచికరమో అంత ఆరోగ్యదాయకం. ప్రతిరోజూ తగిన మోతాదులో తేనె(Honey)ను తీసుకోవడం ద్వారా పలు అనారోగ్యాల బారి నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. భూమిమీద కష్టించే జీవుల జాబితాలో తేనెటీగలు ముందుంటాయి. ఒకవైపు పర్యావరణాన్ని కాపాడుతూ, మరోవైపు మనకు ఆరోగ్యాన్ని అందిస్తున్న తేనెటీగలకు సంబంధించిన చాలా విషయాలు మనకు తెలియదు. రాయల్ జియోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ లండన్ సైంటిస్టులు తెలిపిన వివరాల ప్రకారం భూమి మీద తేనెటీగలు లేకపోతే మనిషి జీవితం దుర్భరమవుతుంది. నేడు (మే 20) ప్రపంచ తేనేటీగల దినోత్సవం. ఈ సందర్భంగా తేనెటీగలు పర్యావరణానికి అందించే సాయాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి మీద బతికే హక్కు మనిషికి ఎంత ఉందో, మిగతా జీవరాశులకూ అంతే ఉంది. అయితే మనిషి తన అవసరాల కోసం మిగిలిన జీవుల ఉనికికి ముప్పు వాటిల్లే పనులు చేస్తున్నాడు. జీవ వైవిధ్యం(Biodiversity) కరువైతే ప్రకృతిలో సమతుల్యత దెబ్బతింటుంది. చివరికి ఆ ప్రభావం మనిషి మీదే పడుతుంది. రాయల్ జియోగ్రాఫిక్ సొసైటీ ఆఫ్ లండన్ సైంటిస్టులు చెప్పినదాని ప్రకారం తేనెటీగలు లేని భూమి మీద మనిషి కేవలం నాలుగేళ్లు మాత్రమే బతకగలడు. మిగిలిన జీవులు కూడా దాదాపు అంతరించిపోయే దశకు చేరుకుంటాయి. నాడు ప్రముఖ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ కూడా ‘తేనెటీగలు లేకపోతే మనిషి నాలుగేళ్ల కన్నా ఎక్కువ కాలం జీవించడం కష్టం’ అని తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంఖ్య అంతకంతకూ క్షీణిస్తోంది. దాదాపు 90 శాతం తేనెటీగలు ఇప్పటికే అంతరించిపోయాయి. ప్రస్తుతం పదిశాతం మాత్రమే మిగిలాయి. భవిష్యత్తులో తేనెటీగలను ల్యాబ్‌లలో ప్రత్యేకంగా పెంచుకోవావల్సిన పరిస్థితులు ఏర్పడేలా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచంలో పండించే 100 రకాల పంటలలో.. 90 రకాల పంటలు ఫలదీకరణం చెందాలంటే తేనెటీగలు ఎంతో అవసరం. దీని ప్రకారం చూస్తే, అధికశాతం శాతం వ్యవసాయం తేనెటీగల వల్లే జరుగుతోందని చెప్పుకోవచ్చు.ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా సెల్ ఫోన్ వినియోగం మరింతగా పెరిగింది. సెల్ ఫోన్ సిగ్నల్స్(Cell phone signals) తేనెటీగలకు హాని కలిగిస్తున్నాయి. అవి తాము కట్టుకున్న గూడుకు వెళ్లే దారిని మర్చిపోయేలా చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో తేనెటీగలు మరణిస్తున్నాయని పలు పరిశోధనల్లో తేలింది. మన పర్యావరణ వ్యవస్థలను సజీవంగా ఉంచడంలో తేనెటీగలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉంది.ఇది కూడా చదవండి: Meghalaya: మూక దాడి.. 15 ట్రక్కులు ధ్వంసం

‘యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నాం.. కానీ’
కాల్పుల విరమణ దిశగా రష్యా, ఉక్రెయిన్ తక్షణం చర్చలు మొదలు పెడతాయని.. ఇరు దేశాధినేతలు వ్లాదిమిర్ పుతిన్, జెలెన్స్కీ ఇందుకు అంగీకరించినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే.. పుతిన్‌తో ట్రంప్ సోమవారం రెండు గంటలకు పైగా సుదీర్ఘంగా ఫోన్ చర్చలు జరిపారు. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ కూడా చర్చించారు.ఈ క్రమంలో యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని.. అయితే రష్యా అందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదంటూ జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. రష్యా నియమాలు ఏంటో తనకు తెలియదన్న జెలెన్స్కీ.. ఈ యుద్ధంలో మేము చాలా కోల్పోయామన్నారు. ఎలాంటి షరతులు లేకుండా పూర్తి కాల్పుల విరమణకు తాము సిద్ధం.. కానీ.. రష్యా అందుకు రెడీగా ఉన్నట్లు తనకు అనిపించడం లేదంటూ జెలెన్స్కీ చెప్పుకొచ్చారు.ముందుగా కాల్పుల విరమణను రష్యా అంగీకరించాలని.. ఆ తర్వాత యుద్ధాన్ని పూర్తిగా ఆపేయాలంటూ జెలెన్స్కీ కోరారు. మరో వైపు, ఈ కాల్పుల విరమణను ప్రతిపాదించినందుకు ట్రంప్‌నకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

గాజాపై దాడులు ఆపకుంటే.. ఇజ్రాయెల్‌కు యూకే, ఫ్రాన్స్, కెనడా హెచ్చరిక
టెల్ అవీవ్: గాజా స్ట్రిప్‌లో పూర్తి విజయం సాధించాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్(Israel) నిరంతరం తన దాడులను కొనసాగిస్తోంది. ఈ నేపధ్యంలో బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు ఇజ్రాయెల్ జరుపుతున్న తాజా సైనిక దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని వెంటనే ఆపకపోతే కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరించారు.ఇజ్రాయెల్ సైన్యం గాజా స్ట్రిప్(Gaza Strip)లో తాజాగా ‘ఆపరేషన్ గిడియన్స్ చారియట్స్’ అనే పేరుతో కొత్త సైనిక దాడిని ప్రారంభించింది. ఉత్తర, దక్షిణ గాజాలో వ్యూహాత్మక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడుతోంది. వీటిని మే 17 నుంచి ప్రారంభించింది. ఈ దాడులలో వందలాది పాలస్తీనియన్లు మరణించారని పాలస్తీనా ఆరోగ్య అధికారులు తెలిపారు. మే 14, 2025న జబాలియాలో జరిగిన ఇజ్రాయెల్ వైమానిక దాడులలో 48 మంది మరణించారు. వీరిలో 22 మంది పిల్లలు ఉన్నారని స్థానిక ఆసుపత్రులు తెలిపాయి.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(Benjamin Netanyahu) ఇటీవల ఈ దాడులను పూర్తి విజయం సాధించే వరకు కొనసాగిస్తామని, హమాస్‌ను నాశనం చేయడం, నిరాయుధీకరణ చేయడం, బందీలను విడుదల చేయడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు. దీనిపై స్పందించిన బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా నేతలు మే 19, ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేసి, ఇజ్రాయెల్ చేపడుతున్న అత్యంత దారుణమైన చర్యలను ఖండించారు. ఇజ్రాయెల్ తన సైనిక దాడులను ఆపకపోతే, సహాయ నిరోధకాలను ఎత్తివేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ మూడు దేశాలు గాజాలో తక్షణ కాల్పుల విరమణ కోసం అమెరికా, ఖతార్, ఈజిప్ట్‌లు చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికాయి. కాగా ఇజ్రాయెల్ గత మార్చి నుండి గాజాకు ఆహారం, వైద్య సామగ్రి, ఇంధన సహాయాన్ని నిరోధించింది. దీని వల్ల గాజాలో సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. కాగా ఉత్తర గాజాలో పౌరులు తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇదిలావుండగా మే 19న ఇజ్రాయెల్ ఒక ప్రాథమిక పరిమాణంలో ఆహార సహాయాన్ని గాజాకు అనుమతిస్తామని ప్రకటించింది. ఫలితంగా అక్కడ ఆహారం సంక్షోభం నివారణ జరుగుతుందని తెలిపింది. అయితే, ఐక్యరాష్ట్ర సమితి (యూఎన్ఓ) ఈ సహాయాన్ని సముద్రంలో ఒక చుక్కగా అభివర్ణించింది.ఖతార్‌లోని దోహాలో.. గాజాలో కాల్పుల విరమణ, బందీల మార్పిడికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇందులో అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. హమాస్.. 60 రోజుల కాల్పుల విరమణ, రోజుకు 400 సహాయ ట్రక్కుల అనుమతి తదితర ప్రతిపాదనలను ముందుకు తెచ్చింది. ఇజ్రాయెల్ ఈ దీనిపై ఇంకా బహిరంగంగా స్పందించలేదు. గతంలో గాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించడానికి, యుద్ధాన్ని ముగించడానికి నిరాకరించింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. హమాస్ నిరాయుధీకరణ దిశగా ముందడుగు వేస్తేనే గాజా యుద్ధం ముగుస్తుందని ఖతార్ చర్చలలో స్పష్టం చేశారు.ఇది కూడా చదవండి: ఇన్ఫ్లుయెన్సర్ కుమారుని అనుమానాస్పద మృతి
జాతీయం

నేడు ప్రధాని చేతుల మీదుగా ‘అమృత్’ స్టేషన్ల ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నేడు రాష్ట్రంలో పలు అమృత్ భారత్ స్టేషన్లు ప్రారంభం కాను న్నాయి. గురువారం దేశవ్యాప్తంగా మొత్తం 103 రైల్వే స్టేషన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. వాటిలో రాష్ట్రంలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేశారని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బేగంపేట రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో తాను స్వయంగా పాల్గొన నున్నట్లు పేర్కొన్నారు. బేగంపేట రైల్వేస్టేషన్ పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడుస్తుందని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం రూ.42,219 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం రైల్వే బడ్జెట్లోనూ రూ.5,337 కోట్లు తెలంగాణకు కేటాయించిందని, ఇది 2014–15 నాటి బడ్జెట్‌తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ అని తెలిపారు. రాష్ట్రంలోని 40 రైల్వేస్టేషన్లలో దాదాపు రూ. 2,750 కోట్లతో పునరాభివృద్ధి పనులు జరుగుతున్నాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు.

అమెరికా గోల్డెన్ డోమ్.. భారత్ ఐరన్ డోమ్ ఇదే
ఢిల్లీ: అతి శక్తిమంతమైన ఆయుధాలు. అంతకు మించిన నిఘా సంపత్తి. అవడానికి చిన్న దేశమే అయినా సైనిక సంపత్తిలో మాత్రం ఇజ్రాయెల్ అక్షరాలా అమేయ శక్తే. సుదీర్ఘంగా కొనసాగుతున్న యుద్ధంలో అటు ఇరాన్, ఇటు హిజ్బొల్లాలు ఇజ్రాయెల్‌పై క్షిపణులతో దాడి చేశాయి. అయితే ఈ దాడిలో రాకెట్లను ఐరన్ డోమ్ అడ్డంగించింది.రాడార్ టెక్నాలజీ సాయంతో అడ్డగించి తుత్తునియలు చేసి తన సామర్థ్యం ఏంటో ఇజ్రాయెల్ ప్రపంచానికి చాటి చెప్పింది. దీంతో ఇప్పుడు ఈ ఐరన్ డోమ్ వ్యవస్థపై ప్రపంచ దేశాలు కన్నేశాయి. మొబైల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఐరన్‌డోమ్‌తో శత్రు దుర్భేద్య దేశంగా పేరొందేందుకు భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. ఇప్పుడీ ఐరన్ డోమ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. అమెరికాను బాలిస్టిక్,క్రూజ్ క్షిపణుల దాడుల నుంచి రక్షించేందుకు 175 బిలియన్ డాలర్ల వ్యవస్థతో గోల్డెన్ డోమ్‌ను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. దీంతో అసలు ఐరన్ డోమ్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది? ఇది ఎలా పనిచేస్తోంది?వంటి వివరాలు చూద్దాం.గోల్డెన్ డోమ్ అంటే ఏమిటి?గోల్డెన్ డోమ్ అనేది అమెరికా కోసం రూపొందించబడిన అంతరిక్ష ఆధారిత క్షిపణి నిరోధక కవచం. శుత్రువులు ప్రయోగించిన రాకెట్లను భూమి మీదకు చేరుకునే లోపే అడ్డుకునేలా టెక్నాలజీని వినియోగిస్తోంది. ఉదాహరణకు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌లు భూమి మీద ఉన్న ఇంటర్సెప్టర్లు (Interceptors) ఆధారంగా పనిచేస్తే, అమెరికా గోల్డ్ డోమ్ పూర్తిగా అంతరిక్షంలో శాటిలైట్ ద్వారా పనిచేస్తాయి. ఈ గోల్డెన్ డోమ్‌లో శాటిలైట్స్ ఉంటాయి. ఇవి క్షిపణులు ఎగురటం ప్రారంభమైన వెంటనే వాటిని గుర్తించి, ప్రారంభ దశలోనే వాటిని నిలువరించే సామర్ధ్యం సత్తా దీని సొంతం.ఈ సాంకేతికత అమెరికా భూమిపైకి మాత్రమే కాకుండా ఇతర ఖండాల నుండి లేదా అంతరిక్షం నుండి వచ్చే క్షిపణుల నుండి కూడా రక్షణ కలిగిస్తుంది. ఇది చైనా, రష్యా, ఉత్తర కొరియా, భవిష్యత్తులో ఇరాన్ లాంటి దేశాలు తలపెట్టే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని అమెరికా రూపొందిస్తోంది.బాలిస్టిక్, హైపర్సోనిక్, క్రూయిజ్ క్షిపణుల నుంచి దేశాన్ని రక్షిస్తోంది. గోల్డెన్ డోమ్‌లో అవుటర్ లేయర్ స్పేస్ బేస్డ్ ఇన్ఫ్రారెడ్ సిస్టమ్ (SBIRS),గ్రౌండ్-బేస్డ్ రాడార్స్తో పాటు,మిసైల్ లాంఛర్లను అడ్డుకుంటుంది. భారత్‌కు ఆకాశ్ఇజ్రాయెల్ ఐరన్ డోమ్, అమెరికా గోల్డెన్‌డోమ్.. భారత్‌కు ఆకాశ్. ఆకాశ్ భారత్ క్షిపణి రక్షక వ్యవస్థ. 30 కి.మీ. దూరంలో, 18,000 మీ. ఎత్తులో ఎగురుతున్న శత్రు విమానాల్ని కూల్చేస్తుంది. గాల్లో ఎగురుతున్న యుద్ధ విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, గాలి నుండి భూమికి ప్రయోగించే క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులనూ నిర్వీర్యం చెయ్యగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. ఒక్కో ఆకాశ్ బ్యాటరీలో నాలుగు లాంచర్లు, ఒక్కో లాంచరులో మూడేసి క్షిపణులూ ఉంటాయి. ఇందులో ఒక రాజేంద్ర 3డీ పాసివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఎర్రే రాడార్ కూడా ఉంటుంది. ప్రతీ బ్యాటరీ ఏకకాలంలో 64 లక్ష్యాలను పరిశీలిస్తుంది. వాటిలో 12 లక్ష్యాలను ఛేదించగలదు.ఒక్కో క్షిపణిలో 60 కిలోగ్రాము శకలాలతో కూడుకున్న వార్‌హెడ్ ఉంటుంది.ఆకాశ్ వ్యవస్థ తేలిగ్గా ఎక్కడికంటే అక్కడికి తరలించవచ్చు.

భారీ తుపాను.. ఢిల్లీ అతలాకుతలం!
న్యూఢిల్లీ: భారీ తుపాను(Delhi Massive Storm) ధాటికి దేశ రాజధాని అతలాకుతలం అయ్యింది. బుధవారం సాయంత్రం నుంచి ధూళి, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయ్యింది. నిన్నమొన్నటి దాకా 40 డిగ్రీల ఉష్ణోగ్రలతో.. తీవ్ర ఉక్కపోతతో రాజధాని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే బుధవారం సాయంత్రం వాతావరణం చల్లబడిందని అనుకునేలోపే.. ధూళి తుపానుతో ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆ ధాటికి ఢిల్లీ, నోయిడాల్లో చాలా చోట్ల చెట్లు, హోర్డింగులు, కరెంట్ పోల్స్ నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపైనే చెట్లు, హోర్డింగ్స్ పడిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు రేపటికి తెలిసే అవకాశం ఉంది. మరోవైపు ప్రతికూల వాతావరణం కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఢిల్లీతో పాటు హర్యానా, యూపీ రాష్ట్రాల్లోనూ పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఢిల్లీకి వర్షాలు ఉండడంతో.. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సోషల్ మీడియాలో తుపాను బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. #WATCH | Delhi-NCR experiences weather change. Visuals from Noida Sector 10 in Uttar Pradesh as it experiences dust storm. pic.twitter.com/gsqXxyFGhq— ANI (@ANI) May 21, 2025 #WATCH | Delhi: A tree uprooted at Janpath Road as the city received gusty wind, heavy rainfall and hailstorm. pic.twitter.com/GDVI1OpSz4— ANI (@ANI) May 21, 2025#WATCH | Delhi receives gusty wind, heavy rainfall and hailstorm. Visuals from Geeta Colony. pic.twitter.com/hTIXMzETgZ— ANI (@ANI) May 21, 2025

బెంగళూరు: సూట్‌కేస్‌లో యువతి డెడ్‌బాడీ కలకలం
బెంగళూరు: నగరంలో దారుణం జరిగింది. సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం కలకలం రేపింది. రైల్వే వంతెన సమీపంలో ట్రావెల్ బ్యాగ్‌లో యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. బుధవారం ఉదయం హోసూర్ ప్రధాన రహదారిలోని పాత చందాపుర రైల్వే బ్రిడ్జి సమీపంలో, రైలు పట్టాల దగ్గర నీలం రంగులో ఉన్న ట్రావెల్ సూట్‌కేస్ పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు.అందులో యువతి మృతదేహం ఉండటంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువతిని వేరే ప్రాంతంలో హత్య చేసి మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి కదులుతున్న రైలు నుంచి బయటకు విసిరేసి ఉంటారని అనుమానిస్తున్నారు.ట్రావెల్ బ్యాగ్‌లోని యువతి మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. యువతి వయస్సు 18 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. ఆమె వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఎన్ఆర్ఐ

శంకర్ సుబ్రమోనియన్ తో SNUSA 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
వాషింగ్టన్: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం, ప్రముఖ దాత, IIT మద్రాస్ పూర్వ విద్యార్థి శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారిని సత్కరించేందుకు 2025 ఏప్రిల్ 26న (శనివారం) ఒక ప్రత్యేకమైన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారు అట్లాంటా నివాసితులు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక సంస్థలకు ప్రోత్సాహక దాతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాలను స్థాపించడంలో మరియు కొనసాగించడంలో ఆయన పాత్ర విలువైనదిగా నిలిచింది.2022 లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ వారు శ్రీ శంకర్ గారిని "ఇంజినీరింగ్ వాల్ ఆఫ్ ఫేమ్"లో చేర్చి సత్కరించారు. 2024 సెప్టెంబర్‌లో, IIT మద్రాస్ పూర్వ విద్యార్థుల సహకారంతో, డయాబెటిస్‌పై పరిశోధన కోసం "శంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను స్థాపించారు. ఇది ఎమోరీ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ (EGDRC) తో భాగస్వామ్యంలో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మధుమేహ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ప్రారంభించబడింది.తమ సొంత ఊరైన ఎట్టాయపురం, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం $350,000 విరాళం అందించి, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు చేయడంలో శ్రీ శంకర్ గారు ముఖ్యపాత్ర పోషించారు. ఇది శంకర నేత్రాలయకు ఐదవ MESU యూనిట్ కాగా,2025 ఆగస్టులో ఇది పూర్తిగా సిద్ధమై తమిళనాడు మరియు కేరళకు సేవలు అందించనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 80 కన్ను శిబిరాలు నిర్వహించగలగడం వల్ల అనేకమందికి వెలుగు పంచే అవకాశం లభించనుంది.ఈ సందర్భంగా శ్రీ శంకర్ గారి కుటుంబ సభ్యులు — శ్రీమతి లక్ష్మీ శంకర్, కుమార్తె అంబికా శంకర్, కుమారుడు అశోక్ కుమార్ మరియు మనవడు — కార్యక్రమానికి హాజరయ్యారు.SNUSA అధ్యక్షుడు మరియు "శంకర రత్న" అవార్డు గ్రహీత శ్రీ బాలా ఇందుర్తి గారు, శ్రీ శంకర్ గారిని ఘనంగా సత్కరించి,SNUSA యొక్క బ్రాండ్ అంబాసడర్‌గా ఆయనను ప్రకటించారు. ఈ సందర్భంగా, వారి మానవతా దృక్పథానికి, లక్షలాది మంది కళ్లల్లో వెలుగు నింపాలనే శంకర నేత్రాలయ ఆశయానికి ఆయన అందిస్తున్న మద్దతుకు SNUSA తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపబడింది.ప్రస్తుతం శంకర నేత్రాలయ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇతర క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా సమీపంలోని శంకర నేత్రాలయ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి.ఈ కార్యక్రమాన్ని SNUSA అధ్యక్షుడు శ్రీ బాలా ఇందుర్తి, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనీ వంగిమల్ల, మెహర్ లంకా, డా. మాధురి నాముదూరి, సాంస్కృతిక విభాగం నీలిమ గడ్డమనుగు, క్రీడా విభాగం రమేష్ చాపరాల, MESU “అడాప్ట్-ఎ విల్లేజ్” చైర్ డా. కిశోర్ రాసమళ్ళు, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తాడికమల్లా, మీడియా చైర్ గిరి కోటగిరి, మరియు సభ్యులు శ్రీధర్ జూలపల్లి, పాడి రావు అట్మూరి, మరియు అట్లాంటా చాప్టర్ నాయకులు శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, డా. జనార్ధన్ పన్నెల, రామరాజు గదిరాజు, వెంకీ నిలం, సందీప్ కౌత, దుర్గ గోరా, బిజు దాస్, మరియు యువత విభాగం చరిత్ర జూలపల్లి గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్ నుండి శ్రీ రత్నకుమార్ కవుటూరు గారు మీడియా విభాగంలో ఎనలేని సేవలందిస్తున్నారని బాలగారు తన ప్రసంగంలో పేర్కొన్నారుఈ వేడుకలో మేటి నాట్య కళాకారులు — రేవతి కోమందూరి, శశికల పెనుమర్తి, నీలిమ గడ్డమనుగు, సోబియా కిషన్, జసోథ బాలసుబ్రమణ్యం — నేతృత్వంలో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాధవి ఉప్పులూరి మరియు ఉష మోచెర్ల లలిత సంగీతంతో పాటు, స్థానిక గాయనీ గాయకులు, జసోథ బాలసుబ్రమణ్యం విద్యార్థుల వాయిలిన్ వాయిద్య ప్రదర్శన కూడా ఆధ్యాత్మికతతో కూడిన మూడ్‌ను ఏర్పరిచిందివేదికపై శ్రీ శంకర్ గారు $350,000 చెక్కును SNUSA కోశాధికారి మూర్తి రేకపల్లి గారికి అందజేశారు,SN బృందం మరియు పూజారుల సమక్షంలో. కార్యక్రమం ప్రారంభం లో అట్లాంటా హిందూ టెంపుల్ ప్రధాన పూజారి శ్రీ గోపాల్ భట్టార్ మరియు నలుగురు పూజారులు వేద మంత్రాలతో దీపప్రజ్వలన చేశారు మరియు శంకర నేత్రాలయ సేవా మార్గానికి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమం ముఖ్య అతిథులుగా డా. కిషోర్ చివుకుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ - ఆబర్న్, అలబామా), శ్రీ శ్యామ్ అప్పలి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - లాస్ ఏంజలిస్), శ్రీ అధి మొర్రెడ్డి, శ్రీమతి రేఖా రెడ్డి (ఫీనిక్స్, AZ), శ్రీమతి భాను రామకృష్ణన్ (వాషింగ్టన్ DC), డా. కేశవ్ భట్ (రాలీ,NC), మరియు ఇతరులు పాల్గొన్నారు. మెహర్ లంకా కార్యక్రమ స్థల ఎంపిక మరియు అతిథుల ఆతిథ్య ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. నీలిమ గడ్డమనుగు పూజారులు, కొరియోగ్రాఫర్లు, గాయనీ గాయకులు మరియు అలంకరణ బృందంతో సమన్వయం చేసారు.ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మరియు MESU దాతలు: డా. బీకే మోహన్, డా. సుజాత రెడ్డి,కోమటి మోహన్ రెడ్డి, రవి పోనంగి, మురళి రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, బాలరామిరెడ్డి, శ్రీకాంత్ కొండా, కిరణ్ పాశం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, అనిల్ జాగర్లమూడి, భరత్ మదాడి, వంశీ మదాడి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, నారాయణ రేకపల్లి, శీలా లింగం, అధి చిన్నతిమ్మ, గోపాల్ నాయర్, ఇందు నాయర్, ప్రవీణ్ ఆకుల, రవి గెల్లా, రాజ్ వుచాటు, రాఘవ తడవర్తి, కమల్ సాతులూరు, శ్రీరామ్ రెడ్డి పళ్ళా, మరియు డా. ప్రమోద్ రెడ్డి కైలా.ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్స్ ఆఫ్ సెరిమనీ: శ్రీ విజు చిలువేరు మరియు శ్రీ శ్యామ్ అప్పలి . ఫోటో/వీడియో కవరేజ్: శ్రీ వెంకట్ కుట్టువా. ఫుడ్ : అచిస్ రెస్టారెంట్. ఓటు ఆఫ్ థ్యాంక్స్: శ్రీ శ్యామ్ అప్పలి. ఫోటో గ్యాలరీ: https://sankaranethralayausa.org/meet-n-greet-shankar-subramonian/index.htmlమరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.SankaraNethralayaUSA.org

నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా పేద దేశాల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. రిచర్డ్సన్ నగరంలో నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థతో కలిసి తెలుగు చిన్నారులతో ఫుడ్ డోనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యద్భుత సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. దాదాపుగా 30 మంది పిల్లలు, పది మంది పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 105 బాక్సులు ప్యాక్ చేయబడి, 22,680 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించగలిగే ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాపు నూతి , నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టు కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలు నాయకత్వం వహించారు. నిర్వాహకులుగా సౌజన్య రావెళ్ళ, పావని నున్న వ్యవహరించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి రాజేంద్ర మాదాల, రవి తాండ్ర , కిషోర్ నారె, సత్య శ్రీరామనేని మరియు డల్లాస్ చాప్టర్ జట్టు నుండి సుమతి మాదాల, శివ మాధవ్, బద్రి బియ్యపు, కిరణ్ నారె తదితరులు పాల్గొన్నారు. "ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది" అనే నినాదంతో నాట్స్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి, దాతలకు నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ మరియు శ్రావణ్ నిడిగంటిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాలస్ చాప్టర్ టీం, సలహాదారు బృందం సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

మిస్సోరిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
అమెరికాలో తెలుగు వారి మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .మిస్సోరీలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మిస్సోరి విభాగం బాల్విన్లోని మహాత్మగాంధీ సెంటర్లో ఆదివారం నాడు ఓ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి ఉచిత వైద్య సేవలు అందించారు. రోగులను పరీక్షించిన సుధీర్ అట్లూరి వారికి విలువైన వైద్య సలహాలు ఇచ్చారు.. నాట్స్ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరి విభాగం కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర ఈ వైద్య శిబిరం నిర్వహణకు సహకారం అందించారు.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శాంతా బయోటెక్, శంకర నేత్రాలయ ఆత్మీయ సమావేశం: భారీ విరాళం
అమెరికాలోని అట్లాంటా మహానగరంలో భారతీయ పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త, శాంతా బయోటెక్వ్యవస్థాపక చైర్మన్ పద్మ భూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డితో శంకర్ నేత్రాలయ ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షడు బాలారెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో, కోశాధికారి మూర్తి రేకపల్లి, పాలకమండలి సభ్యులు శ్రీని వంగిమళ్ళ, ఉపేంద్ర రాచుపల్లి, నీలిమ గడ్డమణుగు, డా. కిషోర్ రసమల్లు, రాజేష్ తడికమల్ల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్ రెడ్డి శంకరనేత్రాలయ మేసు (MESU) కార్యక్రమాలను అభినందిస్తూ, తనవంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. గత విరాళం రూ. 25 లక్షల కు తోడు, మొత్తం రూ. 50 లక్షలువిరాళాన్ని ఆయన శంకర నేత్రాలయ యుఎస్సే కు అందించారు. అలాగే 2026లో నెల్లూరులో మరో భారీ కంటి చికిత్సా శిబిరాన్ని నిర్వహించడానికి డా. వరప్రసాద్ రెడ్డి అంగీకరించారు. కాగా ఈ విరాళం ఐదు MESU Adopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు సాయం అందుతుందని అద్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి కొనియాడారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రసాద్‌రెడ్డి డాలస్ ను కూడా సందర్శించారు. ఆయన మిత్రుడుCTO EVP, LennoxInternational (బిలియన్-డాలర్ పబ్లిక్ కంపెనీ) ప్రకాశ్ ఆహ్వానం మేరకు , ఆయన స్వగృహంలొ15 మంది స్నేహితులతో ఇంకొక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. వరప్రసాద్ ప్రసంగాలు, సంగీత సాహిత్య మేళవింపుగా ఇది ఈ సమావేశం హృద్యంగా సాగింది. డాలస్ నివాసి, శంకర నేత్రాలయ యుఎస్సే పాలక మండలి సబ్యులు డా. రెడ్డీ (NRU) ఊరిమిండి సంస్థ లక్ష్యాలను, సేవలనుపంచుకొన్నారు. ప్రకాశ్ బెడపూడి శంకరనేత్రాలయ సంస్థ సమగ్ర సేవలను అభినందిస్తూ తమ మిత్రుని గౌరవార్ధం యాభై వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. అక్కడకు విచ్చేసిన స్నేహితులు అదనంగా మరో రెండు MESUAdopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇతర విరాళాలతో కలిపి డాలస్ కార్యక్రమంలో దాదాపు లక్ష డాలర్ల వరకు విరాళాలు ప్రకటించడం సంస్థకార్యక్రమాలకు ఉత్సాహాన్ని ఇచ్చిందని శంకర్‌నేత్రాలయ ప్రకటించింది.
క్రైమ్

మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించడం మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టమనే చెప్పాలి. ఆపరేషన్ కగార్ పేరిట తరుముతున్న సాయుధ పోలీసు బలగాలు..మరోవైపు ముంచుకొస్తున్న ఆనారోగ్య సమస్యలు.. కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీ కేడర్‌ను సతమతం చేస్తున్నాయి. ప్రధానంగా మావోయిస్టు సెంట్రల్ కమిటీలో ఉన్న నాయకులంతా ఐదుపదుల వయస్సు దాటినవారే కావడంతో ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్య వారిని వెంటాడుతూనే ఉంది. కొందరు కీలక నేతలను అనారోగ్యంతో కోల్పోతే, మరికొందరు ఎన్కౌంటర్లలో హతమవడం మావోయిస్టులను కలవర పెడుతోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సెంట్రల్ కమిటీ మెంబర్ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ జూన్ 2023లో మృతి చెందారు. అంతకుముందే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ కమిటీ మెంబర్ యాపా నారాయణ (హరిభూషణ్) కరోనాతో మృతి చెందారు.మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) సైతం కిడ్నీలు ఫెయిల్ అవడం ఇతర అనారోగ్యంతో బాధపడుతూ బస్తర్ అటవీ ప్రాంతంలో చనిపోయారు. ఇక సెంట్రల్ కమిటీలోని కొందరు నేతలు సొంతగా నడవలేని స్థితిలోనూ ఉన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర సాయుధ బలగాల నుంచి తప్పించుకుని తిరగడం వారికి కష్టమవుతోందనే వాదనలు ఉన్నాయి. కీలక నేతలే టార్గెట్‌గా ఆపరేషన్లు మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 డెడ్‌లైన్‌గా విధించడంతో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక బలగాలతో పాటు స్థానిక పోలీసులు మావోయిస్టు కీలక నేతలనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఓవైపు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్‌మఢ్, బస్తర్, కర్రిగుట్టలు సహా కీలక ప్రాంతాలన్నింటిలోకి చొచ్చుకుని వెళుతూ దళాలు క్యాంపులు నిర్మిస్తున్నాయి. మరోవైపు మావోయిస్టు అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తేనే మావోయిస్టులను మూలాల నుంచి దెబ్బ కొట్టవచ్చన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నాయి. గతంలోనూ ఇదే తరహా వ్యూహాలను అమలు చేశాయి. ఈ ఏడాది జనవరి 16న ఛత్తీస్‌గఢ్ జాపూర్ జిల్లా పరిధిలో చేసిన ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్‌ను మట్టుపెట్టాయి. జనవరి 21న ఒడిశా మావోయిస్టు పార్టీ కార్యదర్శి చలపతి మరణించారు. 2024 డిసెంబర్లో ములుగు జిల్లా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో కుర్సుం మంగు అనే కీలక నేత చనిపోయారు. దంతెవాడ–బీజాపూర్ జిల్లా పరిధిలో 2024 సెప్టెంబర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మాచర్ల ఏసోబు అలియాస్ రణ«దీర్ ఎన్కౌంటర్ అయ్యారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో అత్యంత చురుకైన, ప్రమాకరమైన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా కోసం వేలాది మందితో కూడిన భద్రత బలగాలు గాలిస్తున్నాయి. క్రమంగా కుచించుకుపోతున్న పార్టీ మావోయిస్టుల స్థావరాలు భద్రత బలగాల హస్తగతం అవుతుండడం..వరుస ఘటనల్లో అగ్ర నాయకత్వాన్ని కోల్పోతుండడంతో మావోయిస్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే పదుల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ప్రస్తుతం మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీలో వంద మంది లోపే సభ్యులు ఉన్నారని, వారిలోనూ 80 శాతానికి పైగా ఇతర రాష్ట్రాల వారే ఉన్నట్టు పోలీసులు అధికారికంగా వెల్లడించారు.ఇలా తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ మావోయిస్టు కమిటీల్లో కొత్తగా రిక్రూట్మెంట్లు లేకపోగా..ఉన్న వారు లొంగిపోతుండడంతో పార్టీ క్రమంగా కుచించుకుపోతోందని అంటున్నారు. తుడిచివేతే లక్ష్యంగా ‘కగార్’ దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో 2009లో కేంద్రం ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను చేపట్టింది. గడిచిన పదహారేళ్లలో ఈ కార్యక్రమం ఆపరేషన్ సమాధాన్, ప్రహార్గా కొనసాగి ఇప్పుడు కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలను నలువైపుల నుంచి చుట్టుముట్టడం ద్వారా మావోయిస్టులను పూర్తిగా ఏరివేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా.. 1) ఆయా ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తారు. దీని కోసం సీఆర్పీఎఫ్, ఇండోటిబెటన్ పోలీస్, బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ, కోబ్రా ఇలా వివిధ పేర్లతో లక్ష మందికి పైగా జవాన్లను తయారు చేశారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి వంతున క్యాంపులు ఏరా>్పటు చేస్తున్నారు. 2) మావోయిస్టుల సమాచారం సేకరించడంలో భాగంగా డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్, ఆర్టిఫిíÙయల్ ఇంటిలిజెన్స్‌లను వాడుతున్నారు. 3) తమ ఆ«దీనంలోకి వచి్చన ప్రాంతాల్లో వెనువెంటనే పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్‌ను అమలు చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. 4) లొంగిపోవాలని భావించే మావోయిస్టులకు ఉదారంగా సరెండర్ పాలసీ అమలు. ఈ నాలుగు లక్ష్యాలతో ఆపరేషన్ కగార్ 2024 జనవరి 1న మొదలైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి క్యాంపులు రావడంతో నక్సలైట్ల కదలికలు పరిమితం అయ్యాయి. వారు దట్టమైన అడవుల్లో, షెల్టర్ జోన్లలో ఉండటాన్ని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి గుర్తిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్లు చేసే క్రమంలో ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. సరెండర్ పాలసీ కారణంగా లొంగుబాట్లు కూడా పెరిగాయి.

45 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కాజీపేట అర్బన్: మావోయిస్టు పార్టీ తన ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు కాసింది. కానీ.. ఆ పార్టీకి బుధవారం తగిలిన ఎదురుదెబ్బ మాత్రం అశనిపాతమే. పార్టీ సుప్రీం కమాండర్‌గా ఉన్న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (ఎన్కే) అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఎవరూ ఊహించని విధంగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసు తూటాలకు నేలకొరిగారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో దిట్టగా గుర్తింపు పొందిన నంబాల అనేక భారీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచే.. కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జియ్యన్నపేట. వాసుదేవరావు, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలోనే విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్‌ఎస్‌లోను, టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, టెక్కలి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించిన కేశవరావు విద్యార్థి దశలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితుడయ్యారు. విద్యార్థి దశలో తన స్వగ్రామం వచ్చి తనకు రావాల్సిన వాటాను ఆస్తిగా ఇస్తే, పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగినట్టు సమాచారం. వరంగల్‌లోని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో (ఇప్పటి నిట్) బీటెక్ చేశారు. ఆ సమయంలోనే విప్లవ పార్టీలతో పరిచయాలు ఏర్పడ్డాయి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) సభ్యుడిగా చేరిన ఆయనకు సీపీఐ (ఎంఎల్) అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మలుపు తిప్పినఎంటెక్..ఎంటెక్ చదువుతుండగా కళాశాలలోని మెస్‌లో జరిగిన చిన్నపాటి వివాదం కేశవరావు జీవితాన్ని మలుపు తిప్పింది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్‌గా కేశవరావు ఉన్న సమయంలో మరో విద్యార్థి సంఘం ఏబీవీపీతో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆయన చిక్కుకున్నారు. అరెస్టు చేస్తారన్న సమాచారంతో.. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు 1982లో చింతపల్లి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్టణం సెంట్రల్ జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు.ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు..కేశవరావు విప్లవ పార్టీలో చేరిన తరువాత ఒక్కసారి కూడా తన స్వగ్రామం జియ్యన్నపేటకు రాలేదు. 1980లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలుత గంగన్న అనే పేరుతో పీపుల్స్ వార్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా చేశారు. 1987లో ఈస్ట్ డివిజన్‌ను విస్తరించి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటు ఆయన ఆలోచనే. ఆ కమిటీలో కేశవరావుతో పాటు మల్లోజుల కోటేశ్వరరావు, కటకం సుదర్శన్ కీలకపాత్ర పోషించారు.ఎల్టీటీఈ ద్వారా శిక్షణ1990లో కేశవరావు పీపుల్స్‌వార్ పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ తరువాత పీపుల్స్ వార్ పార్టీకి గుండెకాయ వంటి దండకారణ్య కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేశవరావు పేలుడు పదార్థాల తయారీ నిపుణుడిగా, మిలటరీ ఆపరేషన్ల వ్యూహ నిపుణుడిగా గుర్తింపు పొందారు. అప్పటి పీపుల్స్‌వార్ పార్టీ కీలక నేతలు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలసి 1987లో మధ్యప్రదేశ్‌లోని బస్తర్ అడవుల్లో పేలుడు పదార్థాల ప్రయోగం, గెరిల్లా దాడుల్లో శిక్షణ పొందారు. ఎల్టీటీఈ ద్వారా వీరు ఈ శిక్షణ తీసుకున్నారు. దేశవ్యాప్త మిలటరీ ఆపరేషన్లకు నేతృత్వం పీపుల్స్‌వార్ పార్టీలో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్స్ విభాగం ఏర్పాటు చేయాలని 1995లో గణపతి, కేశవరావు భావించారు. ఆ మిలటరీ ఆపరేషన్స్ విభాగానికి బసవరాజు, బీఆర్ పేర్లతో కేశవరావే నేతృత్వం వహించారు. 2001లో పీపుల్స్‌వార్ 7వ కాంగ్రెస్‌లో సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. అప్పటివరకు దండకారణ్య ప్రాంతానికే పరిమితమైన ఆయన ఆ తర్వాత దేశవ్యాప్తంగా పీపుల్స్‌వార్ పార్టీ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి బిహార్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశాలో వేలాదిమందికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు.2016లో సుప్రీం కమాండర్‌గా..పీపుల్స్‌వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్(ఎంసీసీ)ను విలీనం చేయడంలో గణపతి, కేశవరావు జోడీ ప్రధాన పాత్ర పోషించింది. గణపతి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా.. కేశవరావు మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2016లో వయోభారంతో గణపతి ఆ పదవి నుంచి వైదొలగడంతో ప్రధాన కార్యదర్శి హోదాలో కేశవరావు సుప్రీం కమాండర్‌గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో రెండు దశాబ్దాల పాటు పీపుల్స్‌వార్/మావోయిస్టు పార్టీ జరిపిన అన్ని ప్రధాన దాడుల వెనుక వ్యూహకర్త నంబాల కేశవరావే అని పోలీసులు చెబుతారు. గెరిల్లా వార్ఫేర్, ఆయుధాల తయారీ, మెరుపు దాడులు చేయడం వంటి అంశాల్లో నంబాల కేశవరావుకు దిట్టగా పేరుంది. స్వతహాగా ఇంజనీరింగ్ చదివి ఉండడంతో ఆ నైపుణ్యాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించినట్టు చెబుతారు. పీపుల్స్‌వార్ చరిత్రలో తొలిసారి 1987లో తూర్పుగోదావరి జిల్లా దారగడ్డలో పోలీసు బలగాలపై గెరిల్లా దళం దాడికి కేశవరావు నేతృత్వం వహించారు. ఆ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. అలిపిరి ఘటనకు, ఇతర భారీ దాడులకు బాధ్యుడు 2003 అక్టోబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలోని అలిపిరిలో క్లెమోర్ మైన్ దాడి వ్యూహం కేశవరావుదే. 2008లో ఒడిశా నాయగఢ్‌లో పోలీసుల ఆయుధాగారంపై దాడిచేసి వెయ్యికి పైగా ఆధునిక ఆయుధాలను అపహరించుకుపోయిన దాడికి నేతృత్వం వహించారు. 2010లో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను బలిగొన్న దాడికి వ్యూహకర్త నంబాల కేశవరావే. ఆ దాడికి హిడ్మా నేతృత్వం వహించాడు. 2013లో ఛత్తీస్‌గఢ్ మాజీ మంత్రి, మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ నేత నందకుమార్ మరో 27మందిని బలిగొన్న దాడికి కూడా కేశవరావే వ్యూహకర్త. విశాఖ జిల్లా అరకులో అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య ఘటనలోనూ కేశవరావు ప్రమేయం ఉందన్న వాదనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయాగరా, చింతల్నార్, బలిమెల వంటి దాడులు కూడా ఆయన నేతృత్వంలోనే చోటుచేసుకున్నాయి. శత్రువులుగా భావించిన వారికి మాటల కంటే తూటాలతోనే ఎక్కువ బదులిస్తారనే పేరు మోశారు. కాగా బసవరాజు పేరు ఏపీ, తెలంగాణలో కంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.నీడను కూడా నమ్మని మావోయిస్టు పార్టీ గెరిల్లా పోరాట పంథానుఅనుసరిస్తుండటంతో మావోయిస్టు పార్టీ నీడను సైతం నమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీలో ఏదైనా విభాగానికి నిర్దిష్టమైన పనులు తప్ప మొత్తం వ్యవహారంపై అవగాహన ఉండదు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్‌బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్, రాష్ట్ర కమిటీలు, వివిధ డివిజన్ కమిటీలను సమన్వయం చేయడం, ఆర్థిక, ఆయుధ వ్యవహారాలను చక్కదిద్దడం వంటి పనులు చూస్తుంటారు.ఎక్కడ నుంచి ఆయుధాలు వస్తుంటాయి, ఆర్థిక వనరుల ఆనుపానులు ఎక్కడ ఉంటాయి, పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎక్కడ షెల్టర్లలో ఉన్నారనే అంశాలు కూడా ఆయనకే ఎక్కువగా తెలుస్తాయి. ఇప్పటికే పెరిగిన నిర్బంధంతో ఆ పార్టీ విభాగాలు, కీలక నేతలు చెల్లాచెదురయ్యారు. ఇప్పుడు కేంద్ర కార్యదర్శే చనిపోవడంతో పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు. ఒక్కసారి చిక్కినా విదిలించుకుని.. నంబాల కేశవరావు విద్యార్థి సంఘాలు ఆర్ఎస్యూ, ఏబీవీపీ ఘర్షణల్లో ఒక్కసారి మాత్రమే అరెస్టయ్యారు. 1987లో విశాఖపటా్ననికి ఒంటరిగా వచ్చిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే కబడ్డీ క్రీడాకారుడు కావడంతో చాకచక్యంగా విదిలించుకుని పరారయ్యారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయనపై రూ.10 లక్షలతో మొదలైన పోలీసు రివార్డు రూ.1.50 కోట్లకు చేరుకుంది. పోలీసు శాఖ మోస్ట్‌వాంటెడ్ లిస్టులో అత్యధిక రివార్డు కేశవరావుపైనే ఉందని సమాచారం. 45 ఏళ్ల క్రితం విద్యార్థిథగా ఇంటిని వదిలివెళ్లిన కేశవరావు మావోయిస్టు అగ్రనేతగా ఎదిగి అప్పట్నుంచీ అజ్ఞాతంలోనే జీవితాన్ని గడిపారు. చివరకు అడవిలోనే ప్రాణాలు విడిచారు. కేశవరావు కుటుంబం విశాఖపట్నంలోనే స్థిరపడింది.

రహదారులు రక్తసిక్తం
హయత్‌నగర్ (హైదరాబాద్)/గద్వాల క్రైం: బుధవారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్, కర్ణాటకలోని విజయపుర జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 8 మంది మృతిచెందారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు యువకులు వారి కుటుంబాల్లో ఒక్కరే మగపిల్లలు కాగా, కర్ణాటకలో జరిగిన ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ కుటుంబంలో ఒక్కరు తప్ప అందరూ మృత్యుఒడికి చేరారు. విషాదం మిగిల్చిన అతివేగం.. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ప్రమాదంలో అతి వేగం నాలుగు కుటుంబాలలో పెను విషాదం మిగిల్చింది. వేగంగా వచ్చిన కారు ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు గాయాలపాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దఅంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూర్‌కు చెందిన పిన్నింటి చంద్రసేనారెడ్డి (24), చుంచు త్రినాథ్‌రెడ్డి (24), చుంచు వర్షిత్‌రెడ్డి (23), ఎలిమేటి పవన్‌కల్యాణ్‌రెడ్డి చిన్నప్పటినుంచి స్నేహితులు. బుధవారం తెల్లవారుజామున వారంతా పస్మాముల వైపు నుంచి కుంట్లూర్‌కు స్కోడా కారులో వస్తున్నారు. ఉదయం 5:40 గంటల సమయంలో కుంట్లూర్‌లోని నారాయణ కళాశాల సమీపంలోని గ్యాస్ బంకు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో కారులో ఉన్న చంద్రసేనారెడ్డి, త్రినాథ్‌రెడ్డి, వర్షిత్‌రెడ్డిలు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడ్డ పవన్కల్యాణ్రెడ్డిని కారులో నుంచి బయటికి తీసిన పోలీసులు చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. కాగా, మంగళవారం రాత్రి ఓ రిసెప్షన్‌కు హాజరైన ఈ యువకులు మధ్యలో ఓ ఫాంహౌస్‌లో గడిపినట్లు తెలిసింది. అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిన వారు కొద్దిసేపట్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా మృత్యుఒడిలోకి చేరుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులలో ముగ్గురు మృతి చెందగా, డ్రైవర్‌సీటు పక్కన కూర్చున్న పవన్‌కల్యాణ్‌రెడ్డి గాయాలతో బయటపడ్డాడు. అతను సీటు బెల్టు పెట్టుకోవడంతో బెలూన్ ఓపెన్ అయినట్లు పోలీసులు తెలిపారు. వారసులను కోల్పోయిన కుటుంబాలు... పిన్నింటి చంద్రసేనారెడ్డి, చుంచు త్రినాథ్‌రెడ్డి, చుంచు వర్షిత్‌రెడ్డి వారి కుటుంబాల్లో ఒకరే మగపిల్లలు. వీరిలో త్రినాథ్‌రెడ్డి, వర్షిత్‌రెడ్డిలు అన్నదమ్ముల కుమారులు. వారిద్దరూ ప్రమాదంలో మృతి చెందడంతో తమకు వారసులు లేకుండా పోయారని, చేతికి అందివచ్చిన కొడుకులు ఇలా మృతిచెందారని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. వీరిలో జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గద్వాల పట్టణం బీసీ కాలనీకి చెందిన తెలుగు భాస్కర్ (41) మహారాష్ట్రలో కెనరా బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని భండారా జిల్లా వార్తి ప్రాంతం నుంచి హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్‌కు బదిలీ అయ్యారు. దీంతో బుధవారం భార్య పవిత్ర (38), కుమార్తె జ్యోత్స్న (10), కుమారులు అభిరాం (8), ప్రవీణ్‌తో పాటు కర్ణాటకకు చెందిన డ్రైవర్ శివప్ప (45)తో కలిసి కారులో బయల్దేరారు. ఈ క్రమంలో కర్ణాటకలోని విజయపుర జిల్లా మనగులి సమీపంలో సోలాపూర్– చిత్రదుర్గ హైవేపై వీరు ప్రయాణిస్తున్న స్కార్పియో కారు డివైడర్‌ను ఢీకొని అవతలి లేన్‌లో ఎదురుగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ప్రమాదంలో స్కార్పియో కారు తుక్కుతుక్కు కాగా అందులో ఉన్న భాస్కర్, పవిత్ర, జ్యోత్స్న, అభిరాం, డ్రైవర్ శివప్పలు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయాలతో బయటపడిన ప్రవీణ్ కుటుంబసభ్యులను కోల్పోయి అనాథగా మిగిలాడు.

ట్రాఫికింగ్ డాన్ హితేశ్ అరెస్ట్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విదేశాల్లో కొలువుల పేరిట వందలాది మంది భారతీయులను విదేశాల్లోని చైనా సైబర్ కేఫ్‌లకు విక్రయించిన మానవ అక్రమ రవాణా డాన్ హితేశ్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. భారత విదేశాంగ శాఖ కోరిక మేరకు అతడిని మంగళవారం రాత్రి థాయ్‌లాండ్ ఇమిగ్రేషన్ అధికారులు ఇండియాకు డిపోర్ట్ చేశారు. బుధవారం ఉదయం ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన హితేశ్‌ను ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని, విదేశాంగశాఖకు అప్పగించారు. మార్చిలో కరీంనగర్ పోలీసులు జారీచేసిన లుక్అవుట్ నోటీసుల ఫలితంగా హితేశ్ ఇండియా రాగానే అదుపులోకి తీసుకున్నారు. హితేశ్ ఇండియాకు వస్తున్నాడన్న సమాచారంతో మంగళవారం రాత్రి కరీంనగర్ జిల్లా మానకొండూరు పోలీసులు ఢిల్లీకి చేరుకున్నారు. అయితే, గుజరాత్‌కు చెందిన హితేశ్‌ను తెలంగాణ పోలీసుల కంటే ముందే ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రోజంతా జరిగిన హైడ్రామా తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కలుగజేసుకోవటంతో ఎట్టకేలకు హితేశ్‌ను తెలంగాణ పోలీసులకు అప్పగించారు. దీంతో కరీంనగర్ పోలీసులు అతన్ని సాయంత్రానికి కరీంనగర్‌కు తరలించారు. దేశవ్యాప్త నెట్వర్క్ గుజరాత్‌లోని పోర్బందర్కు చెందిన హితేశ్ మానవ అక్రమ రవాణా సూత్రధారి. ఇతను థాయ్‌లాండ్, మయన్మార్, లావోస్ దేశాల్లో సైబర్ నేరాలకు పాల్పడే కేఫ్‌లకు మనుషులను అక్రమంగా పంపిస్తాడు. విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలిప్పిస్తానని, నెలకు రూ.లక్ష జీతమని నమ్మబలికి ఒక్కో వ్యక్తిని 3,000 డాలర్లకు చైనీస్ సైబర్ కేఫ్‌లకు విక్రయించేవాడు. మనదేశంలో ఇతనికి ప్రతి రాష్ట్రంలో ఏజెంట్లు ఉన్నారు. ఇప్పటివరకు అతడు దాదాపు 300 మందికిపైగా భారతీయులను విక్రయించాడని సమాచారం. ఇతని ఏజెంట్లలో జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్యామారావు రాజశేఖర్ ఒకడు. వీరిద్దరు కలిసి గతేడాది డిసెంబర్లో కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన మధుకర్‌రెడ్డి అనే యువకుడిని మయన్మార్‌కు పంపారు. అక్కడ ఆ యువకుడు తిరగబడ్డాడు. ఈ విషయాన్ని ‘సాక్షి’వరుస కథనాలతో వెలికితీయడంతో స్పందించిన బండి సంజయ్.. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు. దీంతో తొలుత అక్కడ సైబర్‌కేఫ్‌లో చిక్కుకున్న 540 మందిని మయన్మార్ సైన్యం సాయంతో కాపాడారు.తెలంగాణ సైబర్ పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మానకొండూరు, ఖానాపూర్‌లో హితేశ్‌పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లోనే కరీంనగర్ పోలీసులు హితేశ్‌పై లుక్అవుట్ నోటీసులు జారీచేశారు. మరో కీలక నిందితుడు రాజశేఖర్ లావోస్‌లో తలదాచుకుంటున్నాడని సమాచారం. భారతీయ యువతీ యువకులను చైనీయులకు విక్రయించిన హితేశ్.. వారు తిరగబడితే చిత్రహింసలు పెట్టి చీకటిగదుల్లో వేయించేవాడు. చైనీయుల కోసం వందల మంది భారతీయులను అంగడి సరుకుగా విక్రయించాడు. చివరికి ఆ చైనీయులే అతన్ని చితకబాది థాయ్‌లాండ్ ఇమిగ్రేషన్ అధికారులకు పట్టించడం కొసమెరుపు.