Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Teleconference With Party Leaders Over Unseasonal Rains1
రైతులకు బాసటగా వైఎస్సార్‌సీపీ: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ఏపీలో అధికార యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉందని, రైతులు నష్టపోకుండా ప్రభుత్వం సరైన చర్యలేవీ చేపట్టలేదని వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. ఏపీలో అకాల వర్షాలపై పార్టీ రీజినల్‌ కో-ఆర్డినేటర్లు, ముఖ్యనాయకులతో సోమవారం వైఎస్‌ జగన్‌ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘కష్టకాలంలో ఉన్న రైతులకు అండగా నిలవాలి. అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా నష్టపోయిన రైతులను పరామర్శించండి.. వారికి ధైర్యం చెప్పండి. రాష్ట్రంలో పలుచోట్ల ధాన్యం తడిసిపోయింది. అనేక ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణం, కనీస మద్దతు ధరలు లభించక ధాన్యఙ రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ రబీ సీజన్‌లో కూడా కష్టాలు పడటం ఆవేదన కలిగిస్తోంది. వర్షాలు కురుస్తాయన్న సమాచారం ముందస్తుగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కళ్లాల్లో, పొలాల్లో రైతులవద్దనున్న ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనబరిచింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు సహా పలు చోట్ల ప్రభుత్వం ధాన్యాన్ని సరిగ్గా సేకరించడంలేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అకాల వర్షాలవల్ల మరింతగా నష్టపోతున్నారు. యంత్రాంగం మొత్తం నిస్తేజంలో ఉంది. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి. రైతులకు బాసటగా నిలవాలి. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని కేడర్‌కు వైఎస్‌ జగన్‌ సూచించారు.

Waqf Act Petitions: petitioners response to govt Arguments in SC Updates2
వక్ఫ్‌ చట్టం చట్టబద్ధతపై కాసేపట్లో ‘సుప్రీం’ విచారణ

న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్‌ చట్టం(Waqf Amendment Act) రాజ్యాంగ చెల్లుబాటును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లు ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు మరోసారి రానున్నాయి. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం పిటిషన్లపై విచారణ జరపనుంది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు ఇవాళ వాదనలు వినిపించే అవకాశం ఉంది.వక్ఫ్‌ (సవరణ) చట్టం2025 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన 72 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖయ్యాయి. ఇప్పటికే పలుసార్లు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) కేంద్రం విజ్ఞప్తి మేరకు నేటి వరకు గడువు ఇచ్చింది. గత విచారణ సమయంలో చట్టంలోని రెండు వివాదాస్పద నిబంధనలను తాత్కాలికంగా కేంద్రం నిలిపివేసింది. మే 5వ తేదీ వరకు వక్ఫ్‌ ఆస్తులను డీనోటిఫై చేయబోమని తెలిపింది. గత వాదనల్లో.. వక్ఫ్‌ కౌన్సిల్, బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించొద్దని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. గత విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. అన్నిరకాలుగా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే చట్టాన్ని రూపొందించినట్లు పేర్కొంది. ప్రభుత్వం తరపున పూర్తిస్థాయి వాదనలు వినకపోవడం సముచితం కాదని పేర్కొన్నారు. మరోవైపు.. వక్ఫ్‌గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్‌ జాబితా నుంచి తొలగించొద్దని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్‌ బోర్డులు, కేంద్ర వక్ఫ్‌ మండలిలో ఎక్స్‌అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా కచ్చితంగా ముస్లింలే అయ్యుండాలనీ చెప్పింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్‌ అఫీషియో సభ్యులను నియమించొచ్చని.. ఈ మేరకు వక్ఫ్‌(సవరణ) చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదించింది.

Vundavalli Aruna Kumar Reacts On PSR Anjaneyulu Arrest3
ఈనాడు పేపర్‌నే కూటమి సర్కార్‌ ఫాలో అయ్యేది: ఉండవల్లి

తూర్పుగోదావరి, సాక్షి: సీనియర్‌ పోలీస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్‌ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనాడు పత్రికకు ఆంజనేయులిపై చాలా కక్ష ఉండి ఉండొచ్చని.. ఈ అరెస్ట్‌ పోలీస్‌ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలని అన్నారాయన. ఈ కేసులో అసలు ముంబై నటి ని రేప్ చేసారన్న వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారు?. ఆంజనేయులు లాంటి అధికారులను వేధించడం సరికాదు. ఇలా అయితే పోలీసులు ఎలా పని చేస్తారు?. ముంబైలో నమోదైన కేసులో ఏం జరుగుతుందో?. ఈనాడు పేపర్‌కు ఆంజనేయులిపై కక్ష చాలా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈనాడు పేపర్‌లో ముందురోజు ఏమి వస్తుందో.. ఆ తర్వాతి రోజు ప్రభుత్వం అదే ఫాలో అవుతోంది అని ఉండవల్లి అన్నారు. ఆంధ్రా నుంచి ఎవరూ మాట్లాడరా?ఏపీ రీఆర్గనైజేషన్ చట్టానికి సంబంధించి 11 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ చేసిన రోజు ఇదేనని ఉండవల్లి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకూ అఫిడవిట్ ఫైల్ చేయలేదు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. నేనే 43 సార్లు పార్టీ ఇన్ పర్సన్ గా కోర్టుకు హాజరయ్యాను. విభజన చట్టంలో ఆంధ్రా కు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఒక ఆర్డర్ ఇవ్వండని కోర్టును కోరాం. ఆంధ్ర నుంచి ఈ విషయం ఎవరూ మాట్లాడరు. పబ్లిక్ మీటింగ్లో మాత్రం ఆంధ్రాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు..‌ కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడటం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ ఈ కేసుకు సంబంధించి అనుకూలంగా స్పందించారు.. అందుకే ఆయనకు లెటర్ రాశాను.. ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ ను తీసుకువచ్చి వాదన వినిపించమని కోరుతున్నా. ప్రజాస్వామ్యానికి అతి ప్రధానమైన ఆర్టికల్ 100 లోక్సభలో ఏపీ రిఆర్గనైజేషన్ చట్టం చేసే సమయంలో సక్రమంగా అమలు కాలేదు అని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

Jasprit Bumrah Not To Be Vice Captain For England Series, These Can Replace4
IND vs ENG: బుమ్రాకు షాక్‌.. వైస్‌ కెప్టెన్‌గానూ అవుట్‌!

గత కొంతకాలంగా టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన టీమిండియా.. ఇంగ్లండ్‌లో సత్తా చాటి పూర్వ వైభవం పొందాలని పట్టుదలగా ఉంది. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సెలక్టర్లు సీనియర్‌ టీమ్, భారత ‘ఎ’ జట్టు కోసం కలిపి ఇప్పటికే ప్రాథమికంగా 35 మంది ప్రాబబుల్స్‌ను ఎంపిక చేశారు. ఇందులో కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ (Rohit Sharma)పేరు దాదాపుగా ఖరారు కాగా.. వైస్‌ కెప్టెన్‌ ఎవరన్న అంశంపై సందిగ్దం నెలకొంది.నిజానికి స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3-0తో క్లీన్‌స్వీప్‌, ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీ (BGT)ని చేజార్చుకున్న తర్వాత రోహిత్‌ టెస్టు భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి. కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ అతడు విఫలం కావడంతో ఇక సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కెప్టెన్‌గానే కాదు.. వైస్‌ కెప్టెన్‌గానూ బుమ్రా అవుట్‌!ఈ నేపథ్యంలో రోహిత్‌ స్థానాన్ని పేస్‌ దళ నాయకుడు, టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah)తో భర్తీ చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే, తాజా సమాచారం రోహిత్‌నే కెప్టెన్‌గా కొనసాగించేందుకు మొగ్గు చూపిన బోర్డు.. బుమ్రా పేరును కనీసం వైస్‌ కెప్టెన్సీ రేసులోనూ పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఈ విషయం గురించి బీసీసీఐ సన్నిహిత వర్గాలు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘ఐదు టెస్టులకూ అందుబాటులో ఉండే ఆటగాడికే వైస్‌ కెప్టెన్‌ ఇవ్వాలని భావిస్తున్నాం.నిజానికి బుమ్రా ఈ పర్యటనలో అన్ని మ్యాచ్‌లు ఆడడు. కాబట్టి కెప్టెన్‌కు డిప్యూటీగా వేర్వేరు మ్యాచ్‌లలో వేర్వేరు ఆటగాళ్లను నియమించలేము. అందుకే ఐదు టెస్టులు ఆడే ఆటగాడినే వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేస్తాం’’ అని పేర్కొన్నాయి.గాయం తిరగబెట్టే అవకాశం!కాగా ఆస్ట్రేలియా పర్యటనలో ఐదింట రెండు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించడంతో పాటు.. పేస్‌ దళం భారం మొత్తాన్ని బుమ్రానే మోశాడు. ప్రతిష్టాత్మక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ 2023-25 సీజన్‌లో ముప్పై రెండు వికెట్లు కూల్చి సత్తా చాటాడు. కానీ ఈ సిరీస్‌లో భారత్‌ ఓడిపోయింది. మరోవైపు.. ఆఖరిదైన సిడ్నీ టెస్టులో బుమ్రా గాయపడ్డాడు.వెన్నునొప్పి తిరగబెట్టడంతో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 మొత్తానికి బుమ్రా అందుబాటులో లేకుండా పోయాడు. ఐపీఎల్‌-2025లో ముంబై ఇండియన్స్‌ ఆరంభ మ్యాచ్‌లకూ అతడు దూరమయ్యాడు. దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరంగానే న్నాడు.ఈ క్రమంలో బుమ్రా ఫిట్‌నెస్‌ దృష్ట్యా ఇంగ్లండ్‌లోనూ అతడిని వరుస మ్యాచ్‌లలో ఆడిస్తే మళ్లీ గాయం తిరగబెట్టే అవకాశం ఉందని పలువురు మాజీ క్రికెటర్లు హెచ్చరిస్తున్నారు.బుమ్రా వంటి విలువైన ఫాస్ట్‌ బౌలర్‌ను కాపాడుకోవాలంటే.. ఒక టెస్టు ముగిసిన తర్వాత రెండో టెస్టు కోసం అతడికి విశ్రాంతినివ్వాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుమ్రాపై పనిభారం తగ్గించే విషయంలో సెలక్టర్లు కూడా ఓ నిర్ణయానికి వచ్చారని.. అందుకే వైస్‌ కెప్టెన్సీ రూపంలో అదనపు బాధ్యతల నుంచి కూడా తప్పించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.రేసులో ఆ మూడు పేర్లుఒకవేళ బుమ్రాను వైస్‌ కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. అతడి స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాళ్ల ఎవరన్న చర్చ ఇప్పటికే మొదలైంది. రిషభ్‌ పంత్‌ లేదంటే.. శుబ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌ల పేర్లు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే, అసలే ఇంగ్లండ్‌తో టెస్టులు కాబట్టి యువ ఆటగాళ్ల వైపు మొగ్గుచూపకుండా.. విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌లకు బోర్డు బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు. కాగా టీమిండియా ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్‌-2025తో బిజీగా ఉన్నారు. మే 25న క్యాష్‌ రిచ్‌ లీగ్‌ ఫైనల్‌ జరుగనుండగా.. ఆ తర్వాత భారత జట్టు ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్తుంది. జూన్‌ 20 నుంచి ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ మొదలుకానుంది.చదవండి: PBKS VS LSG: అప్పుడే అంతా అయిపోలేదు: లక్నో కెప్టెన్‌ పంత్‌

Ambati Rambabu Complaint Against Seema Raja, Kiraak RP5
సీమ రాజా, కిర్రాక్‌ ఆర్పీలాంటోళ్లను చట్టం వదలదు: అంబటి

గుంటూరు, సాక్షి: తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని.. అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సోషల్‌ మీడియాలో పార్టీ మీద, పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేసే వాళ్లను వదలబోమని, చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరతామని అన్నారాయన.సోమవారం పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన అనంతం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ సోషల్‌ మీడియా వింగ్‌ వైఎస్సార్‌సీపీపై, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిపై, తనపైనా తప్పుడు ప్రచారం చేస్తోంది. అందుకే ఐటీడీపీపై ఫిర్యాదు చేశాం. అలాగే.. వైఎస్సార్‌సీపీ కండువా చేసి ప్రేలాపనలు చేసే సీమ రాజా అనే వ్యక్తిపైనా, మాజీ మంత్రి రోజా తదితరులపైనా వీడియోలు చేసే కిర్రాక్‌ ఆర్పీపైనా ఫిర్యాదు చేశాం.గతంలోనూ మేం ఫిర్యాదులు చేశాం. కానీ, పోలీసులు చర్యలు తీసుకోలేదు. అందుకే ఈసారి రసీదు తీసుకున్నాం. మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదు. అందుకే టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగానే తప్పుడు కేసులు పెడుతున్నారు. పోలీస్‌ వ్యవస్థ టీడీపీ గుప్పిట్లో ఉంది. పోలీసులు చర్యలు తీసుకోకుంటే కోర్టులకు వెళ్తాం.ఐటీడీపీ పేరుతో చంద్రబాబు, లోకేష్‌ ప్రొత్సహంతో వైఎస్సార్‌సీపీ నేతలపై ప్రేలాపనలు చేస్తున్నారు. పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తాం. దోషులను చట్టబద్ధంగా శిక్షించే వరకు మా పోరాటం జరుగుతుంది. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తాం. పార్టీ ఇన్‌ పర్సన్‌గా నా ఆవేదనను నేనే స్వయంగా వినిపిస్తా. చట్టం సీమ రాజాను, కిర్రాక్‌ ఆర్పీ లాంటి వాళ్లను చట్టం వదలదు. ఎంత పెద్దవారు అయినా శిక్ష నుంచి తప్పించుకోలేరు.

Allu Aravind Visited To Sri Tej Who Recently Shifted To Rehabilitation Centre6
శ్రీతేజ్‌ను పరామర్శించిన నిర్మాత అల్లు అరవింద్‌, బన్నీవాసు

సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌(Sri Tej )ను సోమవారం ఉదయం నిర్మాతలు అల్లు అరవింద్(Allu Aravind), బన్నీ వాసు పరామర్శించారు. కిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్ ప్రస్తుతం ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్న నిర్మాతలు, శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.శ్రీతేజ్ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అల్లు అర్జున్, అల్లు అరవింద్, బన్నీ వాసు అతని యోగక్షేమాలను నిరంతరం అడిగి తెలుసుకుంటున్నారు. శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులతోపాటు, అతని కుటుంబానికి హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్, మైత్రీ మూవీస్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ ఆర్థిక సహాయం అందించారు. శ్రీతేజ్ పూర్తిగా కోలుకొని, సాధారణ స్థితికి చేరే వరకు, భవిష్యత్‌లో అతనికి ఏ అవసరమైనా అతనికి, అతని కుటుంబానికి అండగా ఉంటామని అల్లు అర్జున్ హామీ ఇచ్చారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నుంచి రిహాబిలిటేషన్ కేంద్రంలో చికిత్స వరకు, అల్లు అరవింద్, బన్నీ వాసుల ద్వారా శ్రీతేజ్ ఆరోగ్య వివరాలను అల్లు అర్జున్ నిరంతరం తెలుసుకుంటున్నారు.

KSR Comments Over PM Modi Amaravati Visit7
పవన్‌ మర్చిపోవచ్చు.. మోదీ కూడా యూటర్న్‌!

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత దేశ ప్రధానిగా ఎన్నికైన తొలి నాళ్లలో అందరికీ నరేంద్ర మోదీ అంటే బాగా గౌరవం ఉండేది. కానీ, కాలం గడిచే కొద్ది ఆయనలో రాజనీతిజ్ఞుడు బదులు ఫక్తు రాజకీయవేత్త కనిపిస్తున్నారు. సొంత అవసరాలకోసం అవకాశవాద రాజకీయాలు చేసే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ప్రధాని మోదీకి పెద్ద తేడా లేదేమో అన్న అభిప్రాయం కలిగేలా వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది.అమరావతి పనుల పునః ప్రారంభానికి మోదీ ఏపీకి వచ్చిన సందర్భంలో జరిగిన సభ, ఆయనతోపాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల స్పీచ్ గమనిస్తే, ప్రజలను మభ్య పెట్టడానికి ఒకరికొకరు పోటీ పడినట్లు కనిపిస్తుంది. దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీ ఒక విధంగా తండ్రి పాత్రలో ఉన్నట్లు లెక్క. కుటుంబంలోని పిల్లలు ఎవరైనా తప్పుడు మార్గంలో ఉంటే తండ్రి ఏ రకంగా మందలిస్తారో, అదే రీతిలో మోదీ కూడా రాష్ట్రాలలో జరుగుతున్న తప్పులను ఎత్తిచూపి అలా చేయవద్దని చెప్పాలి. కానీ, దురదృష్టవశాత్తు, అందుకు విరుద్దంగా ఆయన కూడా అల్లరిచేసే పిల్లాడిని గారాబం చేసినట్లు వ్యవహరిస్తున్నారన్న సందేహం వస్తుంది.ఏపీలో ఇప్పటికే పలుమార్లు శంకుస్థాపనలు జరిగిన అమరావతిలో.. అందులోనూ తానే గతంలో ఒకసారి శంకుస్థాపన చేసిన ప్రదేశానికి మళ్లీ వచ్చి అదేమీ తప్పు కాదన్నట్లు ఉపన్యసించి వెళ్లారు. దేశంలో కొత్తగా వచ్చిన రాష్ట్రాలలో ఏర్పడిన రాజధానులలో అవసరమైన భవనాల నిర్మాణాలకు ఎంత ఖర్చు అయింది మోదీకి తెలిసే ఉండాలి. ఎన్ని వేల ఎకరాల భూమి ఆ రాష్ట్రాలు సేకరించాయన్న సమాచారం ఆయన వద్ద ఉండి ఉండాలి. ఏపీ తప్ప మిగిలిన కొత్త రాష్ట్రాలలో లక్ష ఎకరాల భూమి సమీకరించలేదు. ఆ రాష్ట్రాలలో నేతలు తామే నగరాలు నిర్మిస్తామని చెప్పి, రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చలేదు. కానీ ఏపీలో మాత్రం తొలుత ఏభైమూడువేల ఎకరాలు సిద్దం చేసుకుని, తిరిగి ఇంకో 44వేల ఎకరాలు తీసుకుంటామని చెబుతుంటే మోదీ వారించనవసరం లేదా?.అసలు ఇంత భూమి తీసుకుని ఏమి చేస్తారు?. మూడు పంటలు పండే పచ్చటి పొలాలను ఎందుకు ఈ స్థాయిలో తీసుకుంటున్నారు? అని అడగాలా?లేదా?. తెలంగాణలో 400 ఎకరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏవో అభివృద్ది పనులు చేపట్టాలని తలపెడితే, పర్యావరణం దెబ్బతినిపోయిందని గగ్గోలు పెట్టిన ఆయన లక్ష ఎకరాలలో పర్యావరణ విధ్వంసానికి ఎందుకు పాల్పడుతున్నారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి కదా?. అలా చేయకపోగా తగుదునమ్మా అంటూ ఆ పర్యావరణ విధ్వంసంలో తాను కూడా భాగస్వామి అవడం మోదీ ప్రత్యేకత అనుకోవాలి. ఇదే అమరావతికి సంబంధించి 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబును ఏ స్థాయిలో మోదీ విమర్శించారో గుర్తు చేసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అవినీతి కోసమే పధకాలను తయారు చేస్తున్నారని, రాజధాని నుంచి అన్నిటా అవినీతి రాజ్యమేలుతోందని చంద్రబాబుపై ధ్వజమెత్తిన మోదీ, ఇప్పుడు చంద్రబాబు గొప్ప పని చేస్తున్నారని మెచ్చుకోవడం అవకాశవాదం అవ్వదా?.అమరావతి ఏపీకి ఒక శక్తి అవుతుందని అన్నారు. నిజంగా అలా జరిగితే ఎవరూ కాదనరు. కానీ, అదెలా సాధ్యం?. అందుకోసం అయ్యే లక్షల కోట్ల వ్యయం ఎక్కడ నుంచి వస్తుందో మోదీ చెప్పాలి కదా!. ఏపీ ప్రభుత్వం సుమారు లక్ష కోట్ల పనులు చేపడుతోందని మంత్రి నారాయణ ప్రకటించారు. గతంలో 33వేల ఎకరాల భూమిలో మౌలిక సదుపాయాల కల్పనకు లక్షాతొమ్మిదివేల కోట్ల రూపాయలు అవసరం అని కేంద్రాన్ని చంద్రబాబు కోరారు. ఆ లేఖను మోదీ సర్కార్ చెత్తబుట్టలో పడేసినట్లుగా పక్కనబెట్టేసి కేవలం 2500 కోట్ల రూపాయలు మాత్రం మంజూరు చేసింది. తాజాగా 2024 ఎన్నికలలో మళ్లీ స్నేహం కుదిరింది కనుక మోదీ, చంద్రబాబు ఒకరినొకరు పొగుడుకుంటూ జనాన్ని పిచ్చోళ్లను చేస్తున్నారు. చంద్రబాబును యూటర్న్ బాబు అని, పోలవరం, అమరావతిలను ఏటీఎంల మాదిరి వాడుకుంటున్నారని గతంలో ధ్వజమెత్తిన మోదీ.. ఇప్పుడు పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేయడంలో చంద్రబాబుకు అనుభవం ఉందని అంటున్నారు. మోడీ కూడా యూటర్న్ తీసుకున్నట్లే కదా!.ప్రస్తుతం లక్ష కోట్లు వ్యయం చేస్తామని చెబుతున్న ఏపీ ప్రభుత్వానికి ఆ మొత్తం కేంద్రం నుంచి వచ్చే అవకాశమే లేదు. అదంతా రుణమే. అంటే అమరావతిని అప్పుల చిప్పగా మార్చుతున్నారన్నమాట. అమరావతి సభలో ఒక్క నయాపైసా కూడా కొత్తగా ఇస్తున్నట్లు మోదీ చెప్పలేదు. ఇదంతా అయ్యే పని కాదని, లక్షల కోట్ల అప్పు భారం ఏపీ ప్రజలపై పడుతుందని తెలిసి కూడా మోదీ మాట మాత్రం కూడా హెచ్చరించకపోవడం దారుణంగా ఉంటుంది. ఇప్పటికే ఒక సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు ఉన్నాయి కదా!. మళ్లీ ఆ స్థాయిలో నిర్మాణాలు చేపట్టవలసిన అవసరం ఏమిటి అని ప్రధాని హోదాలో ప్రశ్నించలేదు.అంతేకాదు.. కేవలం రెండువేల మంది పనిచేసే సచివాలయానికి ఏభై, నలభై అంతస్తుల టవర్లు దేనికి అని అడగలేదు. ఏపీలో కూటమి నేతలు కోరగానే వాటికి మరోసారి శంకుస్థాపన చేసేశారు. దీనిపై సోషల్ మీడియాలో చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ జరగాలన్న పిచ్చి కవిత్వాన్ని ప్రస్తావిస్తూ ఎద్దేవ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున కూడా చిన్న, చిన్న రోడ్ల విస్తరణ పనులకు ప్రధాని శంకుస్థాపనలు చేసి అవేదో చాలా పెద్ద పనులు అన్నట్లుగా పిక్చర్ ఇచ్చే ప్రయత్నం జరిగినట్లు అనిపిస్తుంది. మండుటెండలో లక్షల సంఖ్యలో జనాన్ని బలవంతంగా అధికార యంత్రాంగం ద్వారా తరలించి వందల కోట్లు ఖర్చు చేయడం మినహా ఏమీ ప్రయోజనం జరిగిందన్నది ప్రశ్నగా ఉంది.సూపర్ సిక్స్ హామీల అమలులో ప్రజలను మోసం చేస్తున్న నేపధ్యంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలలో పెరుగుతున్న నిరసనను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు వ్యూహాత్మకంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు అనిపిస్తుంది. బీజేపీ కూడా కూటమిలో భాగస్వామి కనుక ప్రధాని కూడా ఒక పాత్ర పోషించారనుకోవాలి. చంద్రబాబు తన ప్రసంగంలో మోదీని ఆకాశానికి ఎత్తివేశారు. ఒకప్పుడు మోదీ అంత అవినీతిపరుడు లేడన్న నోటితోనే, మోదీ ప్రపంచంలోనే పవర్ పుల్ నేత అని, 2047 నాటికి వికసిత్ భారత్ ఆయన వల్లే సాధ్యమని చెబుతున్నారు. 2047 నాడికి మోదీకి 96 ఏళ్లు వస్తాయి. అప్పటి వరకు ఆయనే దేశానికి సారధ్యం వహించడం సాధ్యమేనా అని ఎవరు అడుగుతారు!. మరో పదిహేనేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పొగిడినట్లే ఇది కూడా ఉంది. మోడీ ఒకటి, రెండు అంశాలలో చంద్రబాబును పొగిడినా, మరీ అతి చేయలేదు.కానీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లు మాత్రం హద్దులు లేకుండా పొగిడారు. ఒకరకంగా నమో సంకీర్తన చేశారనిపిస్తుంది. పోనీ ఇంతగా పొగిడితే పొగిడారులే.. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, ఇతర హామీల విషయంలో మోదీకి ఏమైనా విజ్ఞప్తి చేస్తారేమోలే అని ఆశించినవారికి మాత్రం ఆశాభంగమే ఎదురైంది. అమరావతికి లక్ష కోట్ల అప్పు చేస్తున్నాం.. ఇందులో మీరు ఇంత శాతం భరించండి .. అని అడగలేదు. ప్రత్యేక హోదా ఊసే లేదు. అసలు ఈ నేతలెవ్వరూ లక్ష కోట్ల అప్పు చేస్తున్న విషయాన్నే ప్రజలకు చెప్పకుండా దాటవేయడంలోనే కుట్ర ఉందనిపిస్తుంది. ఒకపక్క భారీ ఎత్తున పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ, లక్షల కోట్లను కేవలం 30 గ్రామాలలో వ్యయం చేస్తూ ఆర్ధిక విధ్వంసానికి పాల్పడుతున్న చంద్రబాబు.. గత జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందని విమర్శించారు.చంద్రబాబు ప్రభుత్వం 2014 టర్మ్‌లో నిర్మించిన అసెంబ్లీ, సచివాలయం తదితర నీరు కారే భవనాలను ఏమైనా జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందా?. ఉన్నవాటిని వాడుకుందాం.. విశాఖ కార్యనిర్వాహణ రాజధాని అయితే పదివేల కోట్లతో గ్రోత్ ఇంజన్ అవుతుంది అని జగన్ చెబితే విధ్వంసం అని తప్పుడు ప్రచారం చేశారు. అప్పట్లో అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ నగరం అని ప్రచారం చేసిన చంద్రబాబు ఈ సభలో ఆ మాట ఎందుకు అనలేకపోయారు. ఖర్చుకు అవసరమైన నిధులు ఎలా సేకరిస్తున్నది, దాని భారం ప్రజలపై ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలను వివరించలేకపోయారు. పైగా మూడేళ్లలో లక్ష కోట్ల పనులు పూర్తి చేస్తామని అనడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. దానికి ఎంతో యంత్రాంగం అవసరం అవుతుంది. ఏ ప్రభుత్వం అయినా ఏడాదికి ఒక ప్రాజెక్టుకు ఐదువేల నుంచి పదివేల కోట్లు వ్యయం చేయగలిగితే గొప్ప. కానీ, ఏడాదికి 33 వేల కోట్ల చొప్పున ఖర్చు చేయడం అంటే అందులో మతలబు ఉన్నట్లే అవుతుంది. ఆయా పనుల రేట్లు డబుల్ చేసి కాంట్రాక్టర్లకు మేలు చేస్తారేమో తెలియదు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గతంలో రాజధానిపై ఏ విమర్శలు చేసింది మర్చిపోయి మాట్లాడారు. పనిలో పని చంద్రబాబును గొప్పగా పొగిడి మార్కులు తెచ్చుకున్నారు. లోకేష్ అయితే విభజన తర్వాత హైదరాబాద్ నుంచి తరిమేశారని చెప్పి నవ్వులపాలయ్యారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడి రాత్రికి రాత్రి చంద్రబాబు విజయవాడ వెళ్లిపోయిన సంగతిని అంతా గుర్తు చేసుకుంటున్నారు. విశేషం ఏమిటంటే బాబు, లోకేష్‌, పవన్లు పహల్గామ్ ఉగ్రదాడిని ప్రస్తావించి తన నాయకత్వం గురించి విశేషంగా పొగిడినా, మోదీ మాత్రం ఆ ప్రస్తావనే తేలేదు.అలాగే జగన్ ప్రభుత్వాన్ని వారు విమర్శించినా, మోదీ మాత్రం అందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏతావాతా చెప్పవచ్చేదేమిటంటే, అమరావతి పనుల పునఃప్రారంభ సభ నిర్వహణకు, పబ్లిసిటీకి వందల కోట్లు ఖర్చు అయినా, ఆ మందం అయినా ఏపీ ప్రజలకు మేలు జరగలేదన్న భావనే కలుగుతుంది. కాకపోతే, పవన్‌కు మోదీ నుంచి ఒక చాక్లెట్ లభించింది. ఆయనకు అదే మంచి లడ్డూ అనుకోవాలి.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Today gold and silver rates in Telugu states8
పడి లేచిన పసిడి ధర! తులం ఎంతంటే..

స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టినట్లే పట్టి తిరిగి ఈరోజు మళ్లీ పెరిగింది. వివిధ ప్రాంతాల్లో సోమవారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో ఒక తులం బంగారం ధరలు రూ.87,750 (22 క్యారెట్స్), రూ.95,730 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.200, రూ.220 పెరిగింది.చెన్నైలో సోమవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.200, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగింది. దీంతో గోల్డ్ రేటు రూ.87,750 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.95,730 (24 క్యారెట్స్ 10 గ్రామ్‌ గోల్డ్)కు చేరింది.దేశ రాజధాని నగరం దిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.200 పెరిగి రూ.87,900కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.220 పెరిగి రూ.95,880 వద్దకు చేరింది.వెండి ధరలుబంగారం ధరల మాదిరిగా కాకుండా సోమవారం వెండి ధర(Silver Prices)లు తిరోగమనం చెందాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కేజీపై రూ.1,000 తగ్గింది. దాంతో కేజీ వెండి ధర రూ.1,08,000 వద్దకు చేరింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

Trump slaps 100% tariff on foreign films9
దయలేని ట్రంప్‌.. ఈసారి సినిమాపై సుంకం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలపై సుంకాలు విధించారు. అమెరికా గడ్డపై షూటింగ్‌ జరగని సినిమాలపై ఏకంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారాయన.కొందరు నిర్మాతల తీరుతో హాలీవుడ్ తీవ్రంగా నష్టపోతోందన్న ట్రంప్‌.. విదేశాల్లో చిత్రీకరణ జరిగి.. అమెరికాలో రిలీజ్‌ అయ్యే చిత్రాలపై వెంటనే 100 శాతం సుంకాలను విధించాలని యూఎస్‌ ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌(USTR)కు ఆదేశాలు జారీ చేశారాయన. అమెరికా చలన చిత్ర పరిశ్రమను పునరుద్ధించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారాయన.చాలా దేశాలు అమెరికన్ స్టూడియోలు, చిత్రనిర్మాతలను ఆకర్షించడానికి లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఇది అమెరికా ఆర్థిక, జాతీయ భద్రతకు ముప్పు కలిగించడమేనని అన్నారాయన. అమెరికన్ సినిమా ఇండస్ట్రీ చాలా వేగంగా మరణిస్తోందన్న ట్రంప్‌.. మళ్లీ అమెరికా గడ్డపై సినిమాలు చిత్రీకరణ జరగాల్సిన రోజులు రావాలని ఆశిస్తున్నట్లు ట్రూత్‌ సోషల్‌ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద చిత్ర మార్కెట్‌ ఉంది చైనాకే. అలాంటి దేశం కిందటి నెలలో ‘టారిఫ్‌ వార్‌’లో భాగంగా హాలీవుడ​ చిత్రాల విడుదలపై పరిమితి విధించింది. ఈ క్రమంలో ఇప్పుడు ట్రంప్‌ విదేశాల్లో చిత్రీకరణ చేసుకునే చిత్రాలపై 100 శాతం సుంకాలను విధించడం గమనార్హం. బెడిసికొట్టే అవకాశం?ట్రంప్‌ తాజా ప్రకటపై విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. ఇది హాలీవుడ్‌ను పునరుద్ధరించకపోగా.. నష్టం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. డిస్నీ, పారామౌంట్‌, వార్నర్‌ బ్రోస్‌ లాంటి స్టూడియోలు కరోనా దెబ్బ నుంచి ఇంకా కొలుకోలేదు. ఇప్పటికీ చాలా వరకు అమెరికా చిత్రాలు బయటి దేశాల్లో షూటింగులు చేసుకుంటున్నాయి. పన్ను మినహాయింపులు, సినిమాకు పని చేసే టెక్నీషియన్లకు తక్కువ ఖర్చులు అవుతుండడమే అందుకు ప్రధాన కారణం.

Nita Ambani Coach Vinod Channa On Her Yoga At 60, shares interesting facts10
60 ఏళ్ల వయసులో చెప్పింది.. చెప్పినట్టు : సెలబ్రిటీ కోచ్‌ ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌

వ్యాపారవేత్త, దేశీయ అతిపెద్ద కార్పొరేట్‌ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌ పర్సన్‌ నీతా అంబానీ ఆరుపదుల వయసులో కూడా ఫిట్‌గా ఉంటారు. మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన ఫిట్‌నెస్‌ రహస్యాన్ని వెల్లడిస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. చాలా అలవోకగా యోగాసనాలు వేస్తూ కనిపించారు. మహిళలు తమను తాము జాగ్రత్తగా చూసు కోవాలని ఈ సందర్భంగా మహిళలకు సలహా ఇచ్చారు. 40 ఏళ్లు దాటిన తరువాత ప్రతీ మహిళ తన ఆరోగ్యంపై, శరీరంపై శ్రద్ధ పెట్టాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కూడా. తాజాగా కోచ్‌ వినోద్‌ చన్నా నీతా అంబానీ వ్యాయామ పద్ధతులపై కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.నీతా అంబానీ ఫిట్‌నెస్ కోచ్ వినోద్ చన్నా, తన అనుభవాన్ని బాలీవుడ్ షాదీస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా పంచుకున్నారు . 60 ఏళ్ళ వయసులో కూడా నీతా అంబానీ వ్యాయామానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారంటూ వినోద్ చన్నా ఆమె వ్యాయామ దినచర్య గురించి మాట్లాడారు. తన సలహాలను, సూచనలను తు.చ తప్పకుండా పాటిస్తారని వెల్లడించారు. " నేను నిర్ణయించినట్టే ఆమె వ్యాయామం చేస్తారు.చాలా కష్టపడతారు. వ్యాయామం చేయడానికి సిద్ధంగా ఉంది. నేను ఏమి చెప్పినా, అనుసరించి లక్ష్యాన్ని చేరుకుంటారు" అని చెప్పారు. వినోద్ మార్గదర్శకత్వంలో వివిధ యోగా ఆసనాలు, స్ట్రెచింగ్ ,శ్వాస వ్యాయామాలు చేసిన వీడియోను నీతా ఇటీవల షేర్ చేసిన సంగతి తెలిసిందే.వినోద​ చన్నా వ్యాయామ సలహాలు50 ఏళ్లు పైబడిన వారు, ముఖ్యంగా మహిళలకు శిక్షణ ఇస్తున్న సమయంలో వారి వారి విభిన్న జీవనశైలి, ప్రతిదాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలు తమ పోషకాహారాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలని, కాల్షియం స్థాయి గురించి తెలుసుకోవాలని చెప్పారు. లేదంటే పైకి బాగానే ఉన్నప్పటీ, ఎముకలు పెళుసుగా మారి తొందరగా గాయపడతారని తెలిపారు. వయస్సు పెరిగే కొద్దీ కండరాల నిర్మాణం తగ్గుతుంది కాబట్టి పోషకాహారం పరిపూర్ణంగా ఉండాలని, కదలిక లేకపోవడం వల్ల ఎముక సాంద్రత తగ్గుతుంది కాబట్టి, మంచి ఆహారం తీసుకోవడం, శక్తి, స్థిరత్వం, మనస్సు,శరీరం మధ్య సమన్వయాన్ని సమతుల్యం చేసుకోవడం చాలా ముఖ్యమని సూచించారు.చదవండి: స్కూటీపై కన్నేసిన ఎద్దు : ఇది టెస్ట్‌ రైడ్‌ బ్రో..!ఉదయమా? సాయంత్రమా? ఉదయం లేదా రాత్రి వ్యాయామం చేయాలా వద్దా అని ప్రశ్నిస్తే.. రోజులో ఏ సమయంలోనైనా వ్యాయామం చేయవచ్చని చెప్పారు వినోద్ . శరీరానికి చురుకుదనం, కదలికలే ముఖ్యం అని చెప్పారు. "ఆడ అయినా మగ అయినా వర్కౌట్ వెయిట్ ట్రైనింగ్ అనేది చేతులు, భుజాలు, పొట్ట, వీపు , కాళ్లు వంటి శరీర భాగాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరైతే చురుగ్గా ఉండరో, వారికి భవిష్యత్తులో ప్రతీ విషయంలోనూ సమస్యలొస్తాయి. చురుగ్గా ఉండని వారు ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాంటి వాళ్లకి వెయిట్‌ ట్రైనింగ్‌లో ముందుగా మొబిలిటీ అనేది చూడాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: దిల్‌ ఉండాలే గానీ : రూ. 50 వేలతో మొదలై, నెలకు రూ. 7.50 లక్షలుకాగా సెలబ్రిటీ ఫిట్‌నెస్‌ కోచ్‌ వినోద్ చన్నా నీతాతోపాటు, ఆమె కుమార్తె ఇషా , చిన్న కుమారుడు అనంత్ అంబానీలకు శిక్షణ ఇవ్వడంతో పాటు, వ్యాపారవేత్త, అనన్య బిర్లా, నటి శిల్పా శెట్టి, జాన్ అబ్రహం, రితేష్ దేశ్‌ముఖ్,ఆయుష్మాన్ ఖురానా ఇతర నటులు కొంతమందికి వినోద్‌ దగ్గర శిక్షణ పొందిన వారే కావడం విశేషం.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement