Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YS Jagan Key Comments At YSRCP District Presidents Meeting Updates1
బాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు : వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: సీఎం చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదంటూ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులతో ఆయన సోమవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలు సహా అనేక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమానికి సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతాకాదు. విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్నిరంగాల్లోనూ విద్వంసమే. రెడ్‌ బుక్‌ రాజ్యాంగం రాష్ట్రంలో అమలవుతోంది. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లాలి’ అని సూచించారు. జిల్లాలో పార్టీ ఓనర్‌షిప్‌ మీదిప్రజా సంబంధిత అంశాల్లో ఒకరి ఆదేశాలకోసం మీరు ఎదురు చూడొద్దు. మీకు మీరుగా స్వచ్ఛందంగా కదలాలి. నియోజకవర్గ ఇన్‌ఛార్జితో కలిసి మొదట కదలాల్సిందే మీరే. ప్రజలకు అండగా మీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల అది రాష్ట్రస్థాయి దృష్టిని ఆకర్షిస్తుంది. దీనిద్వారానే మీ పనితీరు బయటపడుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మన్ననలు పొందాల్సిన బాధ్యత మీది. సమాజంలో గొంతులేని వారికి బాసటగా నిలిచేది వైయస్సార్‌సీపీయే. ప్రతి సమస్యలోనూ బాధితులకు తోడుగా నిలిచేది వైఎస్సార్‌సీపీయే. మే నెలలోపు మండల కమిటీలు పూర్తిచేయాలిజూన్‌-జులైల్లో గ్రామస్థాయి, మున్సిపాల్టీలల్లో డివిజన్‌ కమిటీలు పూర్తిచేయాలి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులో బూత్‌ కమిటీలు ఏర్పాటు కావాలి. ఈమేరకు లక్ష్యంగా పెట్టుకోండి. జిల్లా స్థాయి నుంచి పార్టీని గ్రామస్థాయి వరకూ తీసుకువెళ్లే బాధ్యతల్లో మీరు ఉన్నారు. పార్టీ వ్యవస్థీకృతంగా ముందుకు సాగాలి. జిల్లా అధ్యక్షుల పాత్ర పార్టీలో చాలా కీలకమైనది. గ్రామస్థాయి బూత్‌ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు అనేది అత్యంత కీలక విధుల్లో ఒకటి. పార్టీలో సమర్థులు ఎవరు, ప్రతిపక్షంలో ఎవరు లీడ్ చేయగలరు అని ఆలోచన చేసి మీకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మీమీ జిల్లాల్లో పార్టీ మీద మీకు పట్టు ఉండాలి. పార్టీ బలోపేతం కోసం గట్టిగా కృషిగా చేయాలి. బాధ్యతల నుంచే అధికారం వస్తుంది.జిల్లాల్లో మీరే సర్వం. మీరే పార్టీ.. పార్టీయే మీరుజిల్లాల్లో అన్నిస్థానాల్లో గెలిపించాల్సిన బాధ్యత మీది. మనసా వాచా కర్మేణా అదే తలంపుతో పార్టీని నడపాలి. జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో గెలిపించే బాధ్యత మీది. అది మీ ప్రధాన బాధ్యత. దీనికోసం ఏం చేయాలన్నదానిపై మీరు గట్టిగా పనిచేయాలి. జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ ప్రతి కమిటీ బలంగా ఉండాలి. ఏదైనా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పనితీరు బాగోలేకపోతే పిలిచి చెప్పగలగాలి. అప్పటికీ పనితీరు బాగోలేకపోతే ప్రత్యామ్నాయం చూడ్డంలో మీ భాగస్వామ్యం కీలకం. పార్టీలో ఇద్దరి మధ్య వివాదం ఉన్నప్పుడు పిలిచి సమన్వయం చేయాల్సిన బాధ్యత మీది. మీ పరిధిలో 7కు ఏడు గెలిపించాల్సిన బాధ్యత మీది. బాధ్యత, అధికారం రెండూ తీసుకోండి. మీరు సమర్థులని భావించి, మీకు ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమన్వయం చేయడం, జిల్లాస్థాయి నుంచి గ్రామస్థాయి వరకూ కమిటీ నిర్మాణం మీ ప్రధాన బాధ్యత. అలాగే ప్రజా సంబంధిత అంశాల్లో చురుగ్గా ఉండాలి.ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుందిప్రతిపక్షంలో ఉన్నప్పుడే మన నాయకత్వ ప్రతిభ బయటపడుతుంది. భారీ లక్ష్యం ఉన్నప్పుడే బ్యాట్స్‌మన్‌ ప్రతిభ బయటపడుతుంది. అప్పుడే ఆ బ్యాట్స్‌మెన్‌ ప్రజలకు ఇష్టుడు అవుతాడు. ఇదికూడా అంతే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం చేసే పనులవల్ల మనం ఎలివేట్‌ అవుతాం. ప్రజల దగ్గర, పార్టీలోనూ గౌరవం పెరుగుతుంది. ఇమేజీ పెరుగుతుంది. మన పనితీరు వల్లే మనం మన్ననలను పొందగలుగుతాం. అందరూ ధోనీల్లా తయారు కావాలి. అప్పుడే మీ జిల్లాల్లో ఏడుకు ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో గెలవగలుగుతాం. జిల్లాల్లో ఏ జరిగినా మీరు ప్రజల తరఫున నిలబడాలి.కార్యక్రమాలు చురుగ్గాచేయాలి, ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రజా వ్యతిరేక అంశాలమీద గట్టిగా పోరాటం చేయాలి. లేదంటే పార్టీపరంగా మనం అవకాశాలను కోల్పోయినట్టే. బాధితులకు మనం అండగా ఉండాలి.మనమంతా రాజకీయ నాయకులంమనమంతా రాజకీయ నాయకులం. మన జీవితాలను రాజకీయాలకోసం పెట్టామనే విషయం మరిచిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వెనకడుగు వేయకూడదు. ప్రతిపక్షంగా మనకు వచ్చిన అవకాశాలను వదిలిపెట్టకూడదు. జిల్లాస్థాయిలో ప్రజా సంబంధిత అంశాలను మీరు బాగా వెలుగులోకి తీసుకు వస్తేనే ప్రజలకు దగ్గరవుతాం. మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మరింత మంచి చేయగలం. ప్రజలకు మరింత మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఉంది కాబట్టే రాజకీయాలు చేస్తున్నాం. నాన్నగారు చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో నా ఫొటో ఉండాలనుకున్నాను కాబట్టే నేను రాజకీయాలు చేస్తున్నాను. అలాగే ప్రతి జిల్లాల్లో మీ సేవల గురించి మాట్లాడుకోవాలి.రెండు మూడు సంవత్సరాలు అయితే కాని ప్రభుత్వ వ్యతిరేకత సాధారణంగా బయటకు కనిపించదు. కాని ఏడాదిలోపే ప్రభుత్వంమీద వ్యతిరేకత తీవ్రంగా ఉంది. అందుకే యుద్ధ ప్రాతిపదికన కమిటీ నిర్మాణం పూర్తిచేయాలి. దీని తర్వాత పార్టీ పరంగా మీకూ, నాకూ పూర్తిగా పని ఉంటుంది. అందరం కలిసికట్టుగా పార్టీపరంగా కార్యక్రమాలు బలంగా ముందుకు తీసుకెళ్లాలి. అందుకనే పార్టీ పరంగా నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేయాలి. గ్రామస్థాయిలోకూడా కమిటీలు, బూత్‌ కమిటీల ఏర్పాటు పూర్తిచేస్తే… పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉన్నట్టు అవుతుంది ప్రతి జిల్లాల్లో పార్టీ నిర్మాణం ద్వారా దాదాపు 12వేల మంది పార్టీ కార్యక్రమాలకోసం మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపుగా 1500 మంది ఉంటారు.మద్దతు ధరలు దొరక్క రైతులు తీవ్రంగా నష్టపోతున్నారువివిధ జిల్లాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల తరఫున పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. ఆ మేరకు జిల్లాల్లో రైతులకు అండగా ఉండాలి. రైతుల డిమాండ్లపై పోరాటం చేయాలి.

Nothing wrong Supreme Court on Pegasus row2
‘పెగాసస్‌’పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: పెగాసస్‌ వ్యవహారంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. జాతీయ భద్రతా ప్రయోజనాల కోసం ఓ దేశం స్పైవేర్‌(Spyware)ను కలిగి ఉండటం తప్పులేదని పేర్కొంది. అయితే.. అది ఎలా? ఎవరిపై ఉపయోగించారనే విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.దాదాపు నాలుగేళ్ల క్రితం దేశ రాజకీయాలను కుదిపేసిన పెగాసస్‌ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ స్పైవేర్‌ను వినియోగించి దేశంలోని ప్రముఖ పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖులపై నిఘా పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. పెగాసస్‌ ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ జరిగింది. పిటిషన్‌ తరఫున న్యాయవాది మాట్లాడుతూ.. పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందా? లేదా? అనే విషయాన్ని కేంద్రం స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతేగాక, ఈ ఆరోపణలపై దర్యాప్తు జరిపి సాంకేతిక నిపుణుల బృందం నివేదిక కోసం సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఆదేశించిందని, ఇప్పటివరకూ ఆ నివేదిక అందలేదని, దానిని బయట పెట్టాలని ధర్మాసనాన్ని కోరారు. జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌తో కూడిన ధర్మాసనం స్పందిస్తూ.. దేశం స్పైవేర్‌ను వినియోగిస్తే గనుక అందులో తప్పేముంది. అయితే, దాన్ని ఎవరిపైన ఉపయోగిస్తున్నారన్నదే ఇక్కడ ప్రశ్న. పౌర సమాజంపై కాకుండా.. దేశ వ్యతిరేక శక్తులపై దీన్ని వినియోగిస్తే గనుక అందులో ఏ తప్పు లేదు. దేశ భద్రత విషయంలో రాజీపడకూడదు. ఒకవేళ సామాన్య పౌరులపై ఉపయోగిస్తే గనుక దాని గురించి మేం దర్యాప్తు జరిపిస్తాం. ఉగ్రవాదులు గోప్యత హక్కును కోరకూడదు. అయితే, సామాన్య పౌరుల గోప్యతకు మేం తప్పకుండా రక్షణ కల్పిస్తాం. ప్రస్తుతం మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉందో అందరికీ తెలుసు(పహల్గాం ఉగ్రదాడి ఘటనను పరోక్షంగా ప్రస్తావిస్తూ..). కాబట్టి మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’’ అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక, సాంకేతిక బృందం నివేదిక గురించి మాట్లాడుతూ.. ‘‘దేశ భద్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన నివేదికను బహిర్గతం చేయడం సరికాదు. ఒకవేళ ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే.. వారికి సమాచారం అందిస్తాం’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.పెగాసస్‌ వ్యవహారం ఏంటంటే.. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ అనే సంస్థ ‘పెగాసస్‌’ స్పైవేర్‌ని అభివృద్ధి చేసింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్‌ను ఎన్‌ఎస్‌వో పలు ప్రభుత్వాలు, ప్రభుత్వ అధీనంలో పనిచేసే సంస్థలకు విక్రయిస్తుంటుంది. అయితే, ఈ పెగాసస్‌ను ఉపయోగించి పాత్రికేయులు, పౌరసమాజ ప్రముఖుల ఫోన్లను హ్యాక్‌ చేశారంటూ 2021లో ఓ అంతర్జాతీయ పత్రిక సంచలన కథనం ప్రచురించింది. భారత్‌ నుంచి 300 మంది ఫోన్లు హ్యాక్‌ అయినట్లు పేర్కొంది. వీరిలో రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలిపింది. దీంతో ఈ వివాదం దేశ రాజకీయాలను కుదిపేసింది.

PET Candidates Protest At Pawan Kalyan3
‘లోకేష్‌ అన్యాయం చేశారు మీరైనా..’ పట్టించుకోని పవన్‌!

గుంటూరు, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు నిరసన సెగ తగిలింది. మంగళగిరి జనసేన కార్యాలయంలో ఇవాళ ఆ పార్టీ ఆధ్వర్యంలో పహల్గాం సంతాప సభ జరిగింది. అయితే ఆ సమయంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్(PET) అభ్యర్థులు ఆయన కోసం నిరసన చేపట్టారుడీఎస్సీ నుంచి పీఈటీని ఎత్తేయడంపై ఆయన్ని ప్రశ్నించారు. పాదయాత్రలో నారా లోకేష్‌ తమకు హామీ ఇచ్చి మోసం చేశారని.. కనీసం మీరైనా న్యాయం చేయాలని పవన్‌ను ఉద్దేశిస్తూ ఫ్లెక్సీ, ఫ్లకార్డులు పట్టుకున్నారు. వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, దాని ద్వారానే పీఈటీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.పవన్‌ కాన్వాయ్‌ వస్తున్న సమయంలో వాళ్లు తమ నినాదాలను పెంచారు. అయితే పవన్‌ వాళ్లను కనీసం పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో వాళ్లు నిరాశ చెందారు.

Canada PM Mark Carney powerful victory speech Slams Trump4
ట్రంప్‌ కోరుకునేది ఎన్నటికీ జరగదు.. విక్టరీ స్పీచ్‌లో మార్క్‌ కార్నీ

టొరంటో: కెనడాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో అధికార లిబరల్‌ పార్టీ(Liberal Party of Canada) విజయం దిశగా దూసుకెళ్తోంది. వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టడం దాదాపు ఖాయం కావడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. ఈ క్రమంలో మార్క్‌ కార్నీ(Mark Carney) మద్ధతుదారుల్ని ఉద్దేశిస్తూ విజయ ప్రసంగం చేస్తూ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు.‘‘కెనడా చరిత్రలో కీలకమైన క్షణం ఇది. అమెరికా(America)తో మన పాత ఏకీకరణ సంబంధం ఇప్పుడు ముగిసింది. ఇకపై అమెరికాను స్థిరమైన మిత్రదేశంగా నమ్మలేం. అమెరికా చేసిన ద్రోహం నుండి మనం తేరుకుంటున్నాం. నెలల తరబడి నుంచి నేను ఈ విషయంలో హెచ్చరిస్తూ వస్తున్నా. అమెరికా మన భూమిని, మన వనరులను, మన నీటిని, మన దేశాన్ని కోరుకుంటోంది. మనల్ని విచ్ఛిన్నం చేసి తద్వారా కెనడాను సొంతం చేసుకోవాలని ట్రంప్‌ ప్రయత్నించారు. కానీ, అది ఎప్పటికీ జరగదు’’ అని కార్నీ అన్నారు.అమెరికాతో సుంకాల యుద్ధం, కెనడా యూఎస్‌లో 51వ రాష్ట్రంగా చేరాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) బెదిరింపుల వేళ ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కెనడా పార్లమెంట్‌లో 343 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటునకు 172 మెజారీటీ అవసరం. ఇప్పటికే కన్జర్వేటివ్‌ పార్టీ నేత పియరీ పొయిలివ్రా ఓటమిని అంగీకరించారు. అయితే లిబరల్‌ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోయినప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో మిత్రపక్షాలతో కలిసి మార్క్‌ కార్నీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఈ ఏడాది జనవరిలో జస్టిన్‌ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో లిబరల్‌ పార్టీ సభ్యులు తదుపరి ప్రధానిగా ఆర్థిక వేత్త అయిన మార్క్‌ కార్నీని ఎన్నుకున్నారు. ప్రధాని బాధ్యతలు చేపట్టిన కార్నీ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు.ఇదీ చదవండి: ట్రంప్‌తో కయ్యం.. ఎవరీ మార్క్‌ కార్నీ?

KSR Comments Over KCR Speech In BRS Rajatotsava Sabha 20255
రజతోత్సవ సభతో నయా జోష్‌!.. కేసీఆర్‌ ప్లాన్‌ ఫలించినట్లేనా?

భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) తెలంగాణలో తన పూర్వ వైభవాన్ని సంపాదించుకునే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది. వరంగల్‌లో జరిగిన పార్టీ రజతోత్సవ సభను విజయవంతంగా నిర్వహించి ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఈ సభ పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపేందుకు, నేతల ఆత్మవిశ్వాసం పెంచేందుకు ఉపయోగపడుతుందని విశ్లేషకుల అంచనా. తెలంగాణలో అధికార కాంగ్రెస్‌ పార్టీ పాలనపై ఇప్పటికే అసంతృప్తి ఏర్పడ్డ నేపథ్యంలో ప్రజల దృష్టి బీజేపీవైపు కాకుండా బీఆర్‌ఎస్‌కు అధికారం వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం ఏర్పడేందుకు కూడా వరంగల్‌ బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ ఉపయోగపడుతుంది.2023లో బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోవడం అనూహ్యమే. దీంతో పార్టీ శ్రేణుల్లోనూ నైరాశ్యం నెలకొంది. ఆ తరువాత జరిగిన పార్లమెంటు, శాసన మండలి ఎన్నికల్లోనూ ఓటమే ఎదురు కావడంతో పరిస్థితులు ఇబ్బందిగా మారాయి. రాజకీయాలలో ఒడిదుడుకులు ఉండటం సహజం. రాజకీయ పార్టీలకు ఇలాంటి పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎదుర్కొన్నాయి. 1983 నుంచి 1989 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 1989 లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాలకే పరిమితమైంది. ఆ తర్వాత 1991లో 13 సీట్లు వచ్చాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ తొమ్మిదిన్నరేళ్లపాటు సీఎంగా ఉన్నారు. కానీ ఆయన ఒంటెద్దు పోకడల ఆరోపణలు, వ్యతిరేకత ఉందని తెలిసి సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వడం వంటి అనేకానేక కారణాల వల్ల 2023 ఎన్నికల్లో పార్టీ 39 సీట్లకే పరిమితమైంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదానైతే దక్కిం‍చుకుంది కానీ.. పది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడంతో కొంత నష్టం చేసింది.రేవంత్ రెడ్డి సర్కార్ కాళేశ్వరం, తదితర అంశాలపై విచారణ కమిషన్లు వేయడం కూడా పార్టీపై వ్యతిరేక ప్రచారం జరిగేందుకు అవకాశమిచ్చింది. దీన్ని అధిగమించడానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రజలలో వ్యతిరేకత పెంచడానికి కేసీఆర్‌ ఈ రజతోత్సవ సభను వాడుకున్నారు. తన పాలనకు, కాంగ్రెస్ పాలనకు మధ్య ఉన్న తేడాను వివరించి, ప్రస్తుతం తెలంగాణ ఆగమవుతోందని, అది చూసి తనకు దుఃఖం వేస్తోందని ఆయన చెప్పారు. అలాగే తెలంగాణ ఉద్యమం నాటి సంగతులు, 1956 నుంచి జరిగిన రాజకీయ పరిణామాలు అన్నింటినీ ప్రజలకు వివరించడం ద్వారా మరోసారి సెంటిమెంట్‌ను ప్రయోగించే యత్నం చేసినట్లు స్పష్టంగా బోధపడుతుంది. ఈ క్రమంలో 1956లో ప్రజలంతా తెలంగాణ, ఏపీలో కలపడానికి వ్యతిరేకించారని ఆయన చెప్పడం కొంత వక్రీకరించడమే అవుతుంది. ఎందుకంటే అప్పట్లో తెలంగాణ, ఆంధ్రలు కలవడానికి అంగీకరించని వారు కొంతమంది ఉండవచ్చు కానీ, హైదరాబాద్ శాసనసభలో ఉమ్మడి ఏపీకి అనుకూలంగా మెజార్టీ సభ్యులు మాట్లాడారు.అంతేకాదు.. అంతకుముందు ప్రముఖుల సారథ్యంలో తెలంగాణలో సైతం ఆంధ్ర మహాసభలు జరిగేవి. చరిత్రను ఎవరికి అనుకూలంగా వారు చెప్పుకోవచ్చు. అది వేరే విషయం. 2009లో సోనియాగాంధీ తెలంగాణ ప్రకటన చేయడం కీలకమైన మలుపు. టీఆర్‌ఎస్‌కు అప్పట్లో ఇద్దరు ఎంపీలే ఉండేవారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడం, తదనంతరం జరిగిన పరిణామాలలో తెలంగాణలోని కాంగ్రెస్ నేతలు పలువురు ప్రత్యేక రాష్ట్ర సాధనకు కట్టుబడి ఉండటం, చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వంటి అంశాలు కలిసి వచ్చాయి.తెలంగాణ వాదంతో కాంగ్రెస్, టీడీపీలను కేసీఆర్‌ భయపెట్టగలిగారు. ఆ పార్టీలను తనదారిలోకి తెచ్చుకోగలిగారు. అంతవరకు ఉన్న రాజకీయ ఉద్యమం, ప్రజా ఉద్యమంగా మారే పరిస్థితులు ఏర్పడడం కలిసి వచ్చిన అంశం అని చెప్పాలి. ఏది ఏమైనా తెలంగాణకు సంబంధించినంత వరకు గతంలో నాయకత్వం వహించిన చెన్నారెడ్డి, తదితరులకు భిన్నంగా కేసీఆర్‌ పనిచేసిన మాట నిజం. టీడీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత తెలంగాణ వాదానికే కట్టుబడి రాజకీయం చేశారు. నిజానికి ఇదంతా గతం. ఇప్పుడు ఆ అంశాలను ప్రస్తావించి కాంగ్రెస్ ఆనాడైనా, ఈనాడైనా తెలంగాణకు విలనే అని చెప్పడంలో హేతుబద్దత ఎంత ఉందన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా అని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి, పొన్నం, సీతక్కలు ప్రశ్నించారు.అయితే, ప్రస్తుతం అధికారంలో ఉన్నందున కాంగ్రెస్‌నే టార్గెట్ చేస్తారు. అదే పని కేసీఆర్‌ చేశారు. బీజేపీపై మాత్రం నామమాత్రపు విమర్శలు చేశారనే చెప్పాలి. అంత భారీ సభలో కేసీఆర్ ఒక్కరే మాట్లాడటం కూడా విశేషమే. సాధారణంగా ఇలాంటి సభలలో నాయకుడు వచ్చేలోగా పలువురు నేతలు మాట్లాడుతుంటారు. ఈసారి అలా చేయలేదు. కాకపోతే పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు అయిన కేటీఆర్‌ ప్రాముఖ్యతను మరింత పెరిగేలా ఈ సభలలో జాగ్రత్తపడ్డారని అనుకోవాలి. సభా వేదికపై కూడా కేసీఆర్‌తోపాటు ఆయన ఫోటో కూడా ఉంచారు. కేసీఆర్‌ తన స్పీచ్‌ను మరీ ఎక్కువ సేపు చేయలేదు. అంతేగాక.. పరుష పదాలతో కాంగ్రెస్‌ను తీవ్రంగా రెచ్చగొట్టే యత్నం కూడా చేసినట్లు అనిపించదు. కాంగ్రెస్ పాలనపై గట్టి విమర్శలే చేస్తూ, ప్రధానంగా తెలంగాణ ఆగమైందని, రియల్ ఎస్టేట్ పడిపోయిందని, రైతులు పాట్లు పడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రస్తావించి వాటిని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్లు ప్రస్తావించకుండా ప్రసంగించడం కూడా చెప్పుకోదగిన అంశమే.కాంగ్రెస్ పార్టీ హామీలపై బాండ్లు రాసిచ్చి ప్రజలను మోసం చేసిందని ఆయన పేర్కొన్నారు. ఇందులో వాస్తవం ఉందని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన కొన్ని వాగ్దానాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఉపయోగం లేదని ఆయన తేల్చారు. తన పాలన గురించి చెబుతూ ప్రత్యేకించి రాష్ట్రంలో నీరు, విద్యుత్ తదితర సదుపాయాలు కల్పించడంలో నెంబర్ వన్‌గా ఉన్నామని, భూముల విలువలు పెరగడానికి దోహదపడ్డామని, రైతుబంధును అమలు చేయడం ద్వారా రైతులకు మేలు చేశామని ఆయన వివరించారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు పెడుతోందని, పోలీసులకు రాజకీయాలు వద్దని ఆయన సూచించారు. ఆయా సందర్భాలలో సభలోని వారిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపై చేస్తున్న ఆరోపణలు, అధిక అప్పుల భారం, ఫోన్‌ ట్యాపింగ్ తదితర అంశాల జోలికి వెళ్లలేదు.కేసీఆర్‌ స్పీచ్ ముగిసిన వెంటనే మంత్రులు గట్టిగానే జవాబు ఇచ్చారు. కేసీఆర్‌ అసెంబ్లీకి రావడం లేదని, ఆయన చేసిన విమర్శలపై చర్చకు సిద్దమని అన్నారు. పొన్నం ప్రభాకర్ అయితే గ్రీన్‌మ్యాట్ వేసి ప్రజలు అధికంగా వచ్చినట్లు చూపే యత్నం జరిగిందని ఆరోపించారు. కాకపోతే గతంలో మాదిరి కాకుండా, ఇప్పుడు కనుచూపు మేర కుర్చీలు వేశారు. రాజకీయ సభల నిర్వహణలో చాలా మార్పులు వస్తున్నాయి. ఏ పార్టీ సభ జరిగినా, గతంలో ఒకటి, రెండు బ్లాక్‌లు తప్ప, అంతా కిందే కూర్చునేవారు. ఇప్పుడు అలా చేయడం లేదు. విశేషం ఏమిటంటే కేసీఆర్‌పై విమర్శలు చేసిన మంత్రులలో పొంగులేటి, జూపల్లి గతంలో బీఆర్‌ఎస్‌ ప్రముఖులు. గత ఎన్నికల సమయంలో వారు కాంగ్రెస్ పక్షాన పోటీచేసి గెలిచారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకంటే చిన్నవాడు కావడం, కొందరు మంత్రులు గతంలో తన వద్ద పని చేసినవారు కావడం తదితర కారణాల వల్ల బహుశా ఆయన ఈగో సమస్య ఎదుర్కొంటున్నారని అది కేసీఆర్‌ స్పీచ్‌లో కనిపించిందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇది కొంతవరకు నిజమే కావచ్చు. ఓవరాల్‌గా పరిశీలిస్తే రజతోత్సవ సభకు జనం బాగానే వచ్చారు. స్పందన కూడా బాగానే ఉంది. కానీ, ఇదే వరంగల్‌లో ఉద్యమ సమయంలో ఇంతకన్నా భారీ బహిరంగ సభలే జరిగాయి. అయినా భారీ సభలే అన్నిటికి కొలమానం కావు. కాకపోతే జనంలో పార్టీ పట్ల ఒక నమ్మకాన్ని పెంచడానికి రజతోత్సవ సభ కొంతమేర అవకాశం కలిగిస్తుంది. కేసీఆర్‌ ఒక్కరే మాట్లాడడం వల్ల ఎంతవరకు ప్రయోజనమో చెప్పలేం. కేసీఆర్‌ పూర్వపు స్పీచ్‌ల మాదిరి మరీ ఘాటుగా మాట్లాడలేదన్నది ఎక్కువ మంది అభిప్రాయం. అదేమీ తప్పు కాదు. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్లు ఉన్నప్పటికీ, ఈ సభ ద్వారా తాను మళ్లీ బయటకు వచ్చి జనంలో తిరుగుతానని కేసీఆర్‌ చెబుతున్నారు. ఇప్పటికీ కేసీఆర్‌ గ్లామర్ పైనే బీఆర్ఎస్ ఆధారపడి ఉన్న నేపథ్యంలో ఇది కీలకం.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

 AI Healthcare: Microsoft Techie Fathers Pain Satya Nadellas Email Reply6
మైక్రోసాఫ్ట్‌ సీఈవో, టెక్కీ తండ్రుల ఆవేదన ఫలితం..ఏఐ హెల్త్‌కేర్‌ రివల్యూషన్‌..!

మనల్ని చుట్టుముట్టే సమస్యలే ఆవిష్కరణలకు దారితీస్తాయి. ఒకరకంగా అవి మనలోని టాలెంట్‌ని పదునుపెట్టేలా చేస్తాయి. మనలా ఇబ్బంది పడుతున్న వాళ్లెందరికో మార్గం చూపే కాంతికిరణలవుతాయి. అందుకు నిదర్శనం ఈ మైక్రోసాఫ్ట్‌ సీఈవో, టెక్కీ తండ్రులే. వాళ్ల పిల్లలు ఎదుర్కొన్న సిండ్రోమ్‌ ఫలితంగా వచ్చిన ఫ్రీ ఏఐ హెల్త్‌కేర్‌ ఎందరికో మార్గం చూపి, వైద్యులే గుర్తించడంలో విఫలమైన వ్యాధులను ఐడెంటిఫై చేసి ఇవాళ ఎందరి ప్రాణాలనో కాపాడుతోంది.మైక్రోసాఫ్ట్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ జూలియన్ ఇస్లా కొడుకు సెర్గీయో అరుదైన నాడీ సంబంధిత రుగ్మత డ్రావెట్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నాడు. నిజానికి ఈ వ్యాధిని అంతతొందరగా ఏంటన్నది వైద్యుల కూడా త్వరగా గుర్తించలేకపోతున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఈ పరిస్థితితో బాధపడుతున్నారని తెలుసుకోవడానికి ఎన్నో నిరీక్షణల తర్వాత గానీ తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ జూలియన్ ఇస్లా కూడా తన పసికందు సమస్య ఏంటన్నది ఒక ఏడాది వరకు తెలుసుకోలేకపోతాడు. అప్పుడే ఆయన ఈ అరుదైన వ్యాధి నిర్ధారణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని కంకణం కట్టుకున్నాడు. అందుకోసమే ఇస్లా వైద్య పురోగతి కోసం AIని ఉపయోగించేలా లాభాపేక్షలేని సంస్థ ఫౌండేషన్ 29ని స్థాపించారు. సరిగ్గా ఆ సమయంలోనే అనుకోకుండా మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల ప్రసంగం వింటాడు. ఆయన తన స్పీచ్‌లో కొడుకు పోరాడుతున్న సెరిబ్రల్ పాల్సీ వ్యాధి తీరును హృదయవిదారకంగా వెల్లడిస్తాడు. దీంతో ఇస్లా వెంటనే నాదెళ్లను ఇమెయిల్ ద్వారా సంప్రదించి.. తన కొడుకు సెర్గియో కథను పంచుకుంటాడు. అలాగే ఇలా ఒక పట్టాన వ్యాధులు నిర్ధారణ కాని రోగులకు ఏఐ సాంకేతికత గేమ్-ఛేంజర్‌గా ఎలా ఉంటుందో వివరిస్తాడు ఇస్లా. ఆ వెనువెంటనే నాదెళ్ల ఐదు నిమిషాల్లోనే రిప్లై ఇచ్చి.. మైక్రోసాఫ్ట్ AI హెల్త్‌కేర్ బృందాలతో కనెక్ట్‌ అయ్యారు. అంతేగాదు ప్రాథమిక AI అల్గారిథమ్‌లను ఉపయోగించి క్లినికల్-గ్రేడ్ డయాగ్నస్టిక్ సాధనాన్ని అభివృద్ధి చేశాడు. ఇది ఇస్లా స్థాపించిన లాభాపేక్షలేని సంస్థ ఫౌండేషన్ 29 అతిపెద్ద విజయం అని చెప్పొచ్చు. 2023 నాటికి, వారు అధునాతన భాషా నమూనాల ఆధారిత డయాగ్నస్టిక్ అసిస్టెంట్ అయిన DxGPT అభివృద్ధి చేశారు. ఇదెలా పనిచేస్తుందంటే..DxGPT అంటే ..ఇది వ్యాధిని నిమిషాల వ్యవధిలోనే నిర్థారిస్తుంది. ఇది ప్రజా వైద్య వనరులు, ఆరోగ్య సంరక్షణ భాగస్వాముల కలయికతో ూకూడిన పజీపీటీ-40, 01 నమునాలను ఉపయోగిస్తుంది. ోగోప్యత దృష్టిలో ఉంచుకుని రూపొందించిన సాంకేతికత. అలాగే ఏ రోగి డేటాను సేకరించదు, స్టోర్‌ చేయదు. జస్ట్‌ రోగులు లేదా సంరక్షకులు ఇచ్చే లక్షణాలు, వివరణల ఇన్‌పుట్‌ని ఆధారంగా చేసుకుని రోగనిర్ధారణ సారాంశాన్ని పొందుతారు. దీని ఆధారంగా వైద్య పరీక్షలు చేయించుకుని ధృవీకరించుకోవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఉచితంగా యాక్సెస్ అయ్యే DxGPT అంతుచిక్కని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాల బాధను తీర్చడంలో కీలకంగా ఉంటుంది.(చదవండి: పిల్లిలా కనిపించాలనుకోవడం ఎంత పనైపాయే..! ఏకంగా రూ. 6 లక్షలు పైనే..)

India Army Effect 4500 Pakistani Soldiers And Officers Resign7
భారత్‌తో యుద్ధ భయం.. పాక్‌ సైన్యంలో భారీ రాజీనామాలు

ఇస్లామాబాద్‌: కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. భారత్‌ ఎప్పుడు, ఎలా దాడి చేస్తుందోనన్న భయంతో పాకిస్తాన్‌ వణికిపోతోంది. తమపై భారత్‌ వైమానిక దాడులకు దిగొచ్చని పాకిస్తాన​్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత వైమానిక దాడులను పసిగట్టడానికి సియాల్‌కోట్‌ ప్రాంతానికి పాక్‌ సైన్యం తన రాడార్‌ వ్యవస్థలను తరలిస్తున్నట్లు సమాచారం. అలాగే, అత్యవసరంగా తమ దేశ గగనతలాన్ని సైతం మూసివేసింది.ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి తర్వాత భారత్‌ తీసుకుంటున్న చర్యలు, హెచ్చరికల కారణంగా పాకిస్తాన్‌కు టెన్షన్‌ మొదలైంది. ఈ క్రమంలో పాక్‌ ఆర్మీ కూడా భయాందోళనకు గురైనట్టు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడి తర్వాత.. కేవలం రెండు రోజుల వ్యవధిలో పాకిస్తాన్‌ ఆర్మీలో 4500 మంది సైనికులు, 250 మంది అధికారులు తమ పదవులను విడిచిపెట్టి వెళ్లిపోయినట్టు ‘ది డేలీ గార్డియన్‌’ ఓ కథనంలో వెల్లడించింది. ఈ మేరకు పాక్‌ 11వ దళ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ బుఖారీ లేఖను బయటపెట్టింది.కథనం ప్రకారం.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌కు బుఖారీ ఒక లేఖ రాశారు. ఈ లేఖలో తమ దేశ సైనికుల ఆత్మస్థైర్యం వేగంగా క్షీణిస్తోందని హెచ్చరించారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే.. ఒకవేళ భారత్‌తో యుద్ధం చేయాల్సి వస్తే.. పాకిస్తాన్ సైన్యం అసమర్థమైన ప్రతిఘటనను ప్రదర్శించవచ్చు. కొంతమంది సైనికులు ఇప్పటికే క్రియాశీల విధులను విడిచిపెట్టినప్పటికీ, మరికొందరు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది పాకిస్తాన్ సైనిక ర్యాంకుల్లో తీవ్ర సంక్షోభాన్ని సూచిస్తోంది. ఈ పరిణామం తీవ్రమైన ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు.. సామూహిక రాజీనామాలపై పాకిస్తాన్ సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి తర్వాత బలమైన భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందనే భయమే రాజీనామాలకు ముఖ్య కారణంగా తెలుస్తోంది. భారత్‌ ఎప్పుడైనా దాడి చేయవచ్చనే భయంతో సైనికులు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు సైనికులు రాజీనామాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 🚨 Breaking News.4500 Soldiers and 250 Officers of Pakistan Army resigned from service amid arising tension with India after #PahalgamTerroristAttackLt. Gen Umar Ahmad Bukhari, 11 Corp Cdr has written this letter to the Chief of army Staff. This letter is being circulated on… pic.twitter.com/XLE1G84rrY— JK CHANNEL (@jkchanneltv) April 28, 2025మునీర్‌ ఎక్కడ?మరోవైపు.. సరిహద్దుల్లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ సైన్యాధిపతి జనరల్‌ సయీద్‌ అసిమ్‌ మునీర్‌ కనిపించడం లేదన్న వార్తలు పాకిస్తాన్‌లో కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో పాటుగా ఆయన దేశం వీడి పారిపోయారని స్థానిక మీడియాలో ఆదివారం వార్తలొచ్చాయి. ‘తొలుత కుటుంబాన్ని విదేశాలకు తరలించారు. తర్వాత తానూ పాక్‌ వీడారు’ అన్నది వాటి సారాంశం. కొద్ది రోజులుగా, ఆ మాటకొస్తే పహల్గాం దాడి జరిగినప్పటి నుంచీ మునీర్‌ బయట ఎక్కడా కన్పించడం లేదని ఆ కథనాలు చెబుతున్నాయి. దాడిపై ఆగ్రహంతో రగిలిపోతున్న భారత్‌ తీవ్రస్థాయిలో ప్రతీకార చర్యలకు దిగుతుందని పాక్‌ ఆందోళన చెందుతోంది. అందుకు తానే బాధ్యుడిని అవుతానని మునీర్‌ భయపడ్డారు. అందుకే దేశం నుంచి జారుకున్నట్టు కనిపిస్తోంది’ అని కథనాలు పేర్కొంటున్నాయి

YS Jagan Wishing speedy recovery For KTR8
బ్రదర్‌ కేటీఆర్‌.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా గాయపడిన మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) త్వరగా కోలుకోవాలని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆకాంక్షించారు. ఈ మేరకు వైఎస్‌ జగన్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. బ్రదర్‌ కేటీఆర్‌.. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు. ఇక, బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్‌కు వైద్యులు ఆయనకు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వైద్యుల పర్యవేక్షణలో రికవరీ అవుతున్నట్లు పేర్కొన్నారు. త్వరగా కోలుకొని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పలువురు నేతలు, అభిమానులు కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.Wishing you a speedy recovery, brother. Get well soon! @KTRBRS— YS Jagan Mohan Reddy (@ysjagan) April 29, 2025 Picked up a slip disc injury during a gym workout session. Have been advised a few days of bed rest and recovery by my doctorsHope to be back on my feet soon— KTR (@KTRBRS) April 28, 2025

Pankaj Tripathi Criminal Justice Season 4 OTT Date9
'కోర్ట్'ని మించిపోయేలా ఉంటుంది.. ఓటీటీ డేట్ ఫిక్స్

కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలు తెలుగులో పెద్దగా రాలేదు. రీసెంట్ టైంలో మాత్రం 'కోర్ట్' అనే మూవీ సూపర్ హిట్ అయింది. తొలుత థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ పైన ఓటీటీలోకి వచ్చిన తర్వాత కూడా అదే జోరు చూపించింది. 'కోర్ట్'(Court Movie Telugu) గురించి కాసేపు పక్కనబెడితే ఇదే తరహాలో తీసిన వెబ్ సిరీసులు కూడా ఓటీటీలో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి 'క్రిమినల్ జస్టిస్'(Criminal Justice). 2019లో తొలి సీజన్ రిలీజ్ కాగా అద్భుతమైన స్పందన వచ్చింది. 'మీర్జాపుర్' ఫేమ్ పంకజ్ త్రిపాఠి(Pankaj Tripathi), విక్రాంత్ మస్సే ఇందులో నటించారు.(ఇదీ చదవండి: శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?) తొలి సీజన్ సూపర్ సక్సెస్ అయ్యేసరికి మరో కేసుని తీసుకుని 2020లో రెండో సీజన్, 2022లో మూడో సీజన్ రిలీజ్ చేశారు. వీటికీ మంచి స్పందన వచ్చింది. ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లు కూడా థ్రిల్లింగ్ గా ఉన్నాయి. ఇప్పుడు చాలా గ్యాప్ తీసుకుని నాలుగో సీజన్ ని సిద్ధం చేశారు. 'క్రిమినల్ జస్టిస్: ఏ ఫ్యామిలీ మేటర్' పేరుతో నాలుగో సీజన్ టీజర్ తాజాగా రిలీజ్ చేశారు. మే 22 నుంచి హాట్ స్టార్ ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించారు. మరి ఈసారి ఎలాంటి కేసు వాదించబోతున్నారో అనేది చూడాలి?(ఇదీ చదవండి: నెలలోపే ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్‌ సినిమా) Seedha aur simple toh Madhav Mishra ji ke syllabus mein hai hi nahi. Aapke favourite vakeel sahab aa rahe hain courtroom mein wapas! ⚖️#HotstarSpecials #CriminalJustice - A Family Matter, streaming from May 22, only on #JioHotstar@ApplauseSocial @BBCStudiosIndia @nairsameer… pic.twitter.com/Gu1B3bnLWF— JioHotstar (@JioHotstar) April 29, 2025

IPL 2025: Vaibhav Suryavanshi Comments After Record Making Hundred Over Gujarat10
RR VS GT: ఇది నా కల.. నాకు భయం లేదు: వైభవ్‌ సూర్యవంశీ

ఐపీఎల్‌ 2025లో నిన్న (ఏప్రిల్‌ 28) గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కుర్రాడు వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడ్డాడు. ఈ సెంచరీతో (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) వైభవ్‌ చాలా రికార్డులు కొల్లగొట్టాడు. ఈ మ్యాచ్‌లో వైభవ్‌ విధ్వంసకాండ దెబ్బకు రాయల్స్‌ 15.5 ఓవర్లలోనే గుజరాత్‌ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం సాధించింది.వైభవ్‌ సాధించిన రికార్డులు..ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన భారత ఆటగాడు (35 బంతుల్లో)ఐపీఎల్‌లో సెకెండ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన ఆటగాడు (క్రిస్‌ గేల్‌ (30 బంతుల్లో) తర్వాత)ఐపీఎల్‌లో సెంచరీ, హాఫ్‌ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (11) కొట్టిన ఆటగాడు (మురళీ విజయ్‌తో కలిసి)టీ20 క్రికెట్‌ చరిత్రలో సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్‌లో హాఫ్‌ సెంచరీ చేసిన అత్యంత పిన్న వయస్కుడు (14 ఏళ్ల 32 రోజులు)ఐపీఎల్‌ 2025లో ఫాస్టెస్ట్‌ హాఫ్‌ సెంచరీ (17 బంతుల్లో)ఐపీఎల్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్న అతి పిన్న వయస్కుడుమ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. శుభ్‌మన్‌ గిల్‌ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (26 బంతుల్లో​ 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు‌), సాయి సుదర్శన్‌ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్‌) సత్తా చాటడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రాయల్స్‌.. వైభవ్‌ రికార్డు సెంచరీతో (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) చెలరేగడంతో మరో 25 మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రాయల్స్‌ గెలుపులో వైభవ్‌తో పాటు మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (40 బంతుల్లో 70 నాటౌట్‌; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కీలకపాత్ర పోషించాడు. ఆఖర్లో రియాన్‌ పరాగ్‌ (15 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు.మ్యాచ్‌ అనంతరం వైభవ్‌ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఇది చాలా మంచి అనుభూతి. ఐపీఎల్‌లో సెంచరీ సాధించాలనేది నా కల. దీన్ని నా మూడో మ్యాచ్‌లోనే సాకారం చేసుకున్నాను. సీజన్‌ ప్రారంభానికి ముందు చేసిన కఠోర సాధనకు ఈ మ్యాచ్‌లో ఫలితం పొందాను. నేను బంతిని బాగా గమనించి ఆడతాను. నాకు భయం లేదు. నేను పెద్దగా ఆలోచించను. కేవలం ఆడటంపైనే దృష్టి పెడతాను. జైస్వాల్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా బాగుంది. అతను నాకు ప్రతి విషయంలో గైడ్‌ చేస్తాడు. ఏమి చేయాలో, ఎలా ఆడాలో చెబుతాడు. నాలో సానుకూల విషయాలను నింపుతాడు.కాగా, రాజస్థాన్‌ రాయల్స్‌ యాజమాన్యం వైభవ్‌ను ఎంతో నిశితంగా పరిశీలించి, ఈ సీజన్‌ మెగా వేలంలో రూ. 1.1 కోట్లకు కొనుక్కుంది. ఊహించినట్లుగానే వైభవ్‌ తొలి మ్యాచ్‌లోనే (లక్నోతో) విధ్వంకర ఇన్నింగ్స్‌ (20 బంతుల్లో 34; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్‌ తొలి బంతికే సిక్సర్‌ బాది అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఆతర్వాతి మ్యాచ్‌లో (ఆర్సీబీ) కాస్త నిరాశపరిచినా (12 బంతుల్లో 16; 2 సిక్సర్లు).. కెరీర్‌లో మూడో మ్యాచ్‌లోనే విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement