Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Amaravati Relaunch: Chandrababu Govt Is Moving Massive People1
అమరావతి రీలాంచ్‌.. పరువు కోసం బాబు సర్కార్‌ పాట్లు

సాక్షి, విజయవాడ: పరువు నిలుపుకోవడం కోసం చంద్రబాబు ప్రభుత్వం పాట్లు పడుతోంది. అమరావతి పునః ప్రారంభ కార్యక్రమానికి ప్రజలను బలవంతంగా తరలింపునకు ప్రభుత్వం నానా తిప్పలు పడుతోంది. 5 లక్షల మందిని తరలించే బాధ్యత అధికారులు, ఉద్యోగులకు అప్పగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 6500 బస్సులు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం.. అన్ని ప్రాంతాల నుంచి ప్రజలను తరలించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.ప్రతి డ్వాక్రా గ్రూపు నుంచి ఏడుగురు సభ్యులు తప్పక హాజరు కావాలంటూ హుకుం జారీ చేసింది. హాజరుకాని డ్వాక్రా గ్రూపులను ఆన్‌లైన్‌లో తొలగిస్తామంటూ హెచ్చరికలిచ్చిన సర్కార్‌.. సంక్షేమ పథకాలు అమలు నిలిపివేస్తామంటూ ఆదేశాలిచ్చింది. యనిమేటర్ల ఆడియో లీక్‌తో చంద్రబాబు సర్కార్‌ బండారం బట్టబయలైంది. సచివాలయ ఉద్యోగులు, అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.5 లక్షల మంది తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించగా.. ప్రభుత్వం.. పి4 బహిరంగ సభ ప్లాప్ కావడంతో ప్రభుత్వంలో గుబులు పుట్టిస్తోంది. ప్రధాని మోదీ రాక నేపథ్యంలో భారీగా ప్రజల తరలింపుకు ప్రయత్నాలు చేస్తోది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు నిన్నటి నుండి బస్సుల్లో జనం, డ్వాక్రా మహిళలు తరలింపు కొనసాగుతోంది. అన్ని ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సుల్లో తరలిస్తున్నారు.

Farooq Abdullah Sensational Comments On India And Pak2
భారత్‌, పాక్‌ మధ్య యుద్ధమే.. ఫరూక్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

శ్రీనగర్‌: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదని చెప్పుకొచ్చారు. అలాగే, ఈ ఘటనకు భద్రత, నిఘా లోపాలు కూడా ఒక కారణమని అన్నారు.పహల్గాం ఘటనపై తాజాగా ఫరూక్‌ అబ్దుల్లా స్పందిస్తూ ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఫరూక్‌ అబ్దుల్లా మాట్లాడుతూ..‘పాకిస్తాన్‌ ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోంది. రేపటి రోజు ఎలా ఉండబోతోందో ఎవరికీ తెలియదు. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు. ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పహల్గాం ఉగ్ర దాడి జరగడానికి కారణమైన ఉగ్రవాదులను పట్టుకోవాలి. అలాగే, ఈ ఘటన వెనక ఉన్న వారిని వీలైనంత తొందరగా పట్టుకోవాలి. అప్పుడే యుద్ధాన్ని నివారించే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. భద్రత, నిఘా లోపాలు కూడా ఉగ్ర దాడి జరిగేందుకు ఒక కారణమని అనడంలో సందేహం లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు.. పహల్గాం ఘటనపై జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా స్పందిస్తూ.. ఉగ్రవాదుల బారి నుంచి అతిథుల(పర్యాటకులు)ను కాపాడటంలో తాను విఫలమయ్యానని రాష్ట్ర శాసనసభ వేదికగా ప్రకటించారు. బైసరన్‌లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పనిచేయలేకపోయాను. పహల్గాం ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర హోదాను డిమాండ్‌ చేయాలి. నా రాజకీయాలు అంత చౌకబారువి కాదు. గతంలో రాష్ట్ర హోదా అడిగాం.. భవిష్యత్తులో కూడా అడుగుతాం. కానీ, 26 మంది చనిపోయారు.. ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు. ప్రజలు మాకు మద్దతు ఇస్తే.. ఉగ్రవాదం అంతమవుతుంది’ అని పేర్కొన్నారు.

Air India huge Losses Due To Pak Airspace Ban3
Air India: పాక్‌ గగనతలంపై ఆంక్షలు.. ఎయిరిండియాకు వేల కోట్ల నష్టం

ఢిల్లీ: కశ్మీర్‌లోని పహల్గాం భూతల స్వర్గం.. ఆ ప్రదేశంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడితో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో పాకిస్తాన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత్‌లోని ప్రముఖ ఏవియేషన్‌ దిగ్గజం ఎయిరిండియాకు వేలకోట్ల నష్టం వాటిల్లింది.పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత్‌ కఠిన చర్యలకు ఉపక్రమించింది. దీంతో పాక్‌ సైతం భారత్‌పై పలు ఆంక్షలు విధించింది. పాక్‌ గగన తలంపై భారత విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.ఆ నిర్ణయంతో ఎయిరిండియా సుమారు 600 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. పాక్‌ గగనతలంపై భారత విమానాల రాకపోకలపై నిషేదం కారణంగా విమానాల దారి మళ్లింపు, పెరిగిన ప్రయాణ దూరం, అదనపు ఇంధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫలితంగా ప్రతీ ఏడాది తమ సంస్థకు 591 మిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేసింది.ఈ నష్టం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని కోరుతూ విమానయాన శాఖకు ఎయిరిండియా యాజమాన్యం లేఖ రాసినట్లు సమాచారం. గగనం తలంపై పాక్‌ తీసుకున్న నిర్ణయంతో ఒక్క ఎయిరిండియా మాత్రమే కాదని టాటా గ్రూప్‌కు చెందిన ఇతర విమానాల సర్వీసులపై ప్రభావం పడనున్నట్లు ఆ లేఖలో పేర్కొంది.ఉదాహరణకు ఇండిగో గురువారం న్యూఢిల్లీ-బాకు (అజర్‌బైజాన్‌లో) విమానం ఐదు గంటల 43 నిమిషాలు ప్రయాణించింది. పాక్‌ గగన తలం నుంచి కాకుండా దారి మళ్లించిన కారణంగా 38 నిమిషాలు ఎక్కువ సమయం పట్టింది. ఆ సమయానికి అదనంగా ఇంధనం వెచ్చించాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అందించే ఇతర సర్వీసుల్లో సైతం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.అయితే, మిగితా విమానయాన సంస్థలతో పోలిస్తే ఎయిరిండియా పలు ప్రపంచ దేశాలకు విమానాల రాకపోకలన్నీ పాకిస్తాన్‌ గగన తలం నుంచే నిర్వహిస్తుంది. పాక్‌ తాజా నిర్ణయం ఎయిరిండియాపై కాస్త ప్రతికూల ప్రభావం పడనుంది. ఉదాహరణకు, ఢిల్లీ-మిడిల్ ఈస్ట్ విమానాలు ఇప్పుడు కనీసం ఒక గంట అదనంగా ప్రయాణించవలసి వస్తుంది, దీనికి ఎక్కువ ఇంధనం అవసరం అవుతుంది.ఎయిరిండియా దాని బడ్జెట్ సర్వీస్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగోలు గత నెలలో పదిహేను రోజుల్లో న్యూఢిల్లీ నుండి యూరప్, మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికాలోని గమ్యస్థానాలకు 1,200 విమానాలు బయలుదేరాయని అంచనా.

Chandrababu Naidu Yet to Visit Victims of Simhachalam Temple Tragedy4
పరామార్శకూ తీరకలేదా బాబూ!

సింహాచలం అప్పన్న ఆలయంలో హాహాకారాలు.. మృత్యు ఘోష.. ఎవరికైనా బాధనిపిస్తుంది. కాని ఆంధ్రప్రదేశ్‌ సర్కారుకు మాత్రం అవేమీ పట్టినట్లు లేదు. కూటమి నేతలందరూ అమరావతి సంబరంలో మునిగి తేలుతున్నారు. పలుమార్లు శంకుస్థాపనలు జరిగిన అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇంకోసారి శంకుస్థాపన చేయిస్తున్నారు.సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలి అయింది సామాన్యులే.. అమరావతి హంగామాతో తీవ్రంగా నష్టపోతున్నదీ పేదలే. హిందూ మతంలో ఒక నమ్మకం ఉంటుంది. ఏదైనా ఒక కుటుంబంలో అశుభం జరిగితే నిర్దిష్టంగా కొన్నాళ్లపాటు ఎలాంటి శుభ కార్యక్రమాలు జరపరు. హిందూ మతోద్దారకులమని ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సనాతన హిందూ అని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. శంకుస్థాపన కార్యక్రమాలను వాయిదా వేసుకోలేదు. పాలకులు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కుటుంబంలా పరిగణిస్తారు. ఆ ప్రకారం చూస్తే ఒక ప్రముఖ ఆలయంలో జరిగిన ఈ దుర్ఘటనలో కొత్తగా కట్టిన గోడ కూలి ఏడుగురు మరణించినా తమ ప్రోగ్రాం ఆపుకోవడానికి ఇష్టపడలేదు. సింహాచలం మృతుల కుటుంబాలను పరామర్శించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు వెళ్లలేదు.అంటే వారికి ఏదో అనుమానం ఉండబట్టే అటువైపు వెళ్లకుండా ఉన్నట్లు అనిపిస్తుంది.మామూలుగా అయితే ఒక ప్రసిద్ద పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు సంభవిస్తే వెంటనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు అంతా వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించి బాధితులకు స్వాంతన చేకూర్చడానికి యత్నిస్తారు. కాని వీరిద్దరూ ఆ పని చేయలేదు. కొద్ది నెలల క్రితం వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల కోసం తిరుపతి వెళ్లిన వేలాది భక్తులు తొక్కిసలాటకు గురయ్యారు. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఆ తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆ సమాచారం వచ్చిన వెంటనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పోటీ పడి తిరుపతి వెళ్లారు.ఏదో చేస్తున్నట్లు హడావుడి చేశారు. అలాంటి వారు సింహాచలం ఎందుకు వెళ్లలేదు? ప్రధాని మోడీ అమరావతి వస్తున్నందున వెళ్లలేక పోయారని చెప్పవచ్చు కానీ మూడు గంటల ఖాళీ కూడా లేదనడం అతిశయోక్తి అవుతుంది. పైగా ఇప్పుడు వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ నుంచైనా పర్యవేక్షణ చేయవచ్చు. పవన్ కళ్యాణ్ కు ఆ ఇబ్బంది లేదు కదా?మరి ఆయన ఎందుకు సింహాచలం వెళ్లలేదు? దీనికి రెండు,మూడు కారణాలు చెబుతున్నారు. అక్కడకు వెళ్లితే భక్తులలో ఉన్న కోపం అంతా తమపై చూపే అవకాశం ఉందని, వారు ప్రభుత్వ నిర్వాకంపై నిలదీస్తే ఇబ్బంది అవుతుందని అనుకుని ఉండవచ్చ అంటున్నారు. అమరావతి పునః శంకుస్థాపన పనుల పేరుతో తప్పించుకునే అవకాశం ఉండడం. మరొకటి చావుల వద్దకు వెళ్లి రావడం అశుభం అని ఎవరైనా సలహా ఇచ్చారేమో తెలియదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు నిజంగానే హిందూ మతాచారాలపై అంత శ్రద్దగా ఉంటారా అంటే అదీ గ్యారంటీ లేదు. ఏ మతం వారివద్దకు వెళ్లితే ఆ మతమే గొప్పదని చెప్పి వస్తుంటారు. రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటారు.గత గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు కుటుంబం స్నానమాచరించే ఘట్టాన్ని సినిమా తీయడం కోసం సామాన్య భక్తులను నిలిపి వేయడం, ఒక్కసారిగా గేటు తెరవడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించడం జరిగింది. అప్పుడు చంద్రబాబు తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో యత్నాలు చేశారు. చివరికి రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలో చనిపోలేదా? అంటూ వితండ వాదం చేశారు. అంతే తప్ప అంత పెద్ద ఘటన జరిగితే మామూలుగా అయితే పదవి నుంచి తప్పుకుంటారు. ప్రాంతీయ పార్టీ కనుక ఆయనను పార్టీలో ఎవరూ ప్రశ్నించరు కనుక ఆ ప్రస్తావనే ఉండదు. పోనీ కనీసం ఒక కానిస్టేబుల్ పై కూడా చర్య తీసుకోకపోవడం విశేషం. తిరుపతి తొక్కిసలాట ఘటన జరిన తర్వాత పవన్ కళ్యాణ్ క్షమాపణల డ్రామా తెలిసిన సంగతే.చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు ఏమి మాట్లాడింది అందరికి తెలుసు. అక్కడ చైర్మన్ లేదా, అధికారులపై చర్య తీసుకోలేదు. వారిని పదవుల నుంచి తప్పించలేదు. నిజంగా హిందూ మత విశ్వాసాలు నమ్మేవారైతే అలా చేస్తారా? అన్న విమర్శలను పలువురు చేశారు. చివరికి ఒక రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. గోదావరి పుష్కరాల మరణాలపై వేసిన కమిషన్ ఏ తరహా రిపోర్టు ఇచ్చిందో, తిరుపతి ఘటనపై కూడా రిపోర్టు అందుకు భిన్నంగా వస్తుందా అన్నది కొందరి సందేహం. పుష్కరాల తొక్కిసలాటలో తప్పు భక్తులదే అని ఆ కమిషన్ తేల్చింది. ఇప్పుడు సింహాచలం ఘటనపై కూడా విచారణ కమిటీని నియమించినా, ఎంతవరకు ప్రయోజనం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. గోడ కూలడానికి నాణ్యత లోపమని కాకుండా, భక్తుల రద్దీ, తోపులాట అని నివేదికలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఆలయాలలో ఏ చిన్న ఘటన జరిగినా, దాని వెనుక టీడీపీ, జనసేన రాజకీయ శక్తుల ప్రమేయం ఉన్నా, దానినంతటిని జగన్ కు ఆపాదించి ఎంత రచ్చ చేసేవారో గుర్తు చేసుకుంటేనే కంపరం కలుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం అదే ధోరణి ప్రదర్శించారు. తిరుమల లడ్డూ లో జంతు కొవ్వు కలిసిదంటూ దారుణమైన అసత్యాన్ని చంద్రబాబు, పవన్ లు ప్రజలకు చెప్పారు. దీనివల్ల కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, దైవానికి అపచారం చేసినట్లు అవుతుందని వారు ఫీల్ కాలేదు. తమ రాజకీయ ప్రయోజనం కోసం ఎంతకైనా దిగజారతామన్నట్లుగా వారు వ్యవహరించారు. ఈ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి తాను అన్ అప్పాలజిటిక్ సనాతన హిందూ అని ప్రకటించుకుని కొత్త వేషం కట్టారు.అసలు సనాతన హిందూయిజం ఏమి చెబుతుందో తెలియకుండానే, తానేదో వేద శాస్త్రాలు అన్నిటిని పుక్కిట పట్టినట్లుగా మాట్లాడారు. విశేషం ఏమిటంటే ఆయన భార్య విదేశీయురాలు. క్రైస్తవ మతానికి చెందిన వారు.అలాగే పవన్ కు పుట్టిన వారు సైతం క్రైస్తవమే తీసుకున్నారు. మరి అక్కడ ఈయన సనాతనమేమైందో తెలియదు. అనవసరంగా సినిమా డైలాగులు చదివితే ఇలాంటి అప్రతిష్టే వస్తుంది. చంద్రబాబు తన రాజకీయం కోసం ఏ మతాన్ని అయినా వాడుకోగలరు.ఆయన తెలివితేటలు వేరు.ఆయనను మించి ఏదో చేసి బీజేపీ వారి మెప్పు పొందాలని పవన్ చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల ఆయన పరువు పోగొట్టుకుంటున్నారు. పోనీ నిజంగానే అంత సనాతన హిందూ అయితే సింహాచలం ఎందుకు వెళ్లలేదు.ఒక సంతాప సందేశం ఇచ్చి వదలివేశారే.అమరావతి కార్యక్రమ ఆహ్వానంలో తన పేరు వేయలేదని మొదట అలిగారని, దాంతో ప్రభుత్వం మరో కార్డు వేసిందని చెబుతున్నారు. తన డిమాండ్ నెరవేరకపోతే ఏమైనా సింహాచలం వెళ్లేవారేమో. తిరుమల గోవుల మరణాలు, కాశీనాయన క్షేత్రంలో భవనాల కూల్చివేత, తిరుమల, బ్రహ్మం గారి మఠం తదితర ఆధ్యాత్మిక కేంద్రాలలో మత్తు పదార్ధాల వాడకం వంటి ఆరోపణలు వస్తున్నా ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టలేక పోతోందన్న విమర్శలు వస్తున్నాయి. సింహాచలంలో చందనోత్సవానికి ఐదుగురు మంత్రుల కమిటీ కూడా ఉందట. వారంతా ఏమి చేశారో తెలియదు. కాని గోడ కూలి ఏడుగురు మరణించారు. చిన్న ఆలయ గోడ నిర్మాణమే చేయలేని వారు రాజధాని నిర్మాణం చేస్తారట అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి.అదే టైమ్ లో జగన్ విజయవాడ వద్ద కృష్ణానదికి కట్టిన రిటైనింగ్ వాల్ ఏ రకంగా స్ట్రాంగ్ గా ఉందీ వివరిస్తూ కూడా వీడియోలు వచ్చాయి. సింహాచలం ఘటన తర్వాత జగన్ వెంటనే అక్కడకు వెళ్లి మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చివచ్చారు. చంద్రబాబు, పవన్ లు మాత్రం సాకులు వెతుక్కుంటూ కూర్చున్నారు. ఎల్లో మీడియా మాత్రం సింహాచలం ప్రమాదాన్ని తగ్గించి చూపడానికి నానా పాట్లు పడింది. ఏది ఏమైనా మత సెంటిమెంటును రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదు.అది ఎప్పటికైనా వారికే తగులుతుంది.ఈ నేపథ్యంలో పాలకులు చేసే పాపాలు తమకు శాపాలుగా మారుతున్నాయని ప్రజలు సెంటిమెంట్ గా భావించే పరిస్థితి ఏర్పడింది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

IPL 2025: GT Official Provides Crucial Update On Shubman Gill Back Spasm Before SRH Clash5
నేడు (మే 2) సన్‌రైజర్స్‌తో తలపడనున్న గుజరాత్‌.. గిల్‌ గాయంపై అప్‌డేట్‌

ఐపీఎల్‌ 2025లో ఇవాళ (మే 2) గుజరాత్‌ టైటాన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనున్నాయి. గుజరాత్‌ హోం గ్రౌండ్‌ అహ్మదాబాద్‌లో ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ సన్‌రైజర్స్‌కు అత్యంత​ కీలకంగా పరిగణించబడుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు గల్లంతైరనట్లే. ఈ సీజన్‌లో ఇప్పటికే సీఎస్‌కే, రాజస్థాన్‌ రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించాయి.సన్‌రైజర్స్‌ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. గుజరాత్‌ విషయానికొస్తే.. 9 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలతో నాలుగో స్థానంలో కొనసాగుతూ, ప్లే ఆఫ్స్‌ బెర్త్‌కు ప్రధాన పోటీదారుగా ఉంది. ప్రస్తుత​ పాయింట్ల పట్టికలో ముంబై, ఆర్సీబీ, పంజాబ్‌ టాప్‌-3లో ఉన్నాయి. ఢిల్లీ, లక్నో, కేకేఆర్‌ ఐదు నుంచి ఏడు స్థానాల్లో ఉన్నాయి.గిల్‌ గాయంపై అప్‌డేట్‌గుజరాత్‌ కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే. గిల్‌ ఆ మ్యాచ్‌లో వెన్ను సమస్య కారణంగా ఫీల్డింగ్‌కు (బ్యాటింగ్‌ చేశాడు) దిగలేదు. అతడి గైర్హాజరీలో రషీద్‌ ఖాన్‌ గుజరాత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. గిల్‌ గాయంపై గుజరాత్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ విక్రమ్‌ సోలంకి తాజాగా అప్‌డేట్‌ ఇచ్చాడు. గిల్‌ ఇవాళ సన్‌రైజర్స్‌తో జరుగబోయే ​మ్యాచ్‌లో బరిలోకి దిగుతాడని స్పష్టం చేశాడు.గిల్‌ గాయంపై సానుకూల అప్‌డేట్‌ రావడంతో గుజరాత్‌ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. లీగ్‌ కీలక దశలో గిల్‌ అందుబాటులో ఉండకపోతే అది గుజరాత్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను భారీగా ప్రభావితం చేస్తుంది. ఈ సీజన్‌లో గిల్‌ వ్యక్తిగతంగా అద్భుతమై ఫామ్‌లో కొనసాగుతూ (9 మ్యాచ్‌ల్లో 4 హాఫ్‌ సెంచరీల సాయంతో 389 పరుగులు చేసి ఈ సీజన్‌ లీడింగ్‌ రన్‌ స్కోరర్ల జాబితలో ఏడో స్థానంలో ఉన్నాడు), తన జట్టును కూడా విజయవంతంగా నడిపిస్తున్నాడు. రాజస్థాన్‌ మ్యాచ్‌లో గిల్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆ మ్యాచ్‌లో రషీద్‌ అనుభవారాహిత్యం కారణంగా గుజరాత్‌ ఓటమిపాలైంది. రషీద్‌ కీలక సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలం కావడంతో పాటు బౌలర్లను సరిగ్గా మేనేజ్‌ చేయలేకపోయాడు.నేటి మ్యాచ్‌కు గిల్‌ అందుబాటులోకి రావడం గుజరాత్‌లో జోష్‌ నింపనుంది. ఈ మ్యాచ్‌ గెలిస్తే ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకడంతో పాటు ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకుంటుంది. ఈ సీజన్‌లో గుజరాత్‌ నేటి మ్యాచ్‌తో కలుపుకుని మరో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 6న ముంబై ఇండియన్స్‌తో, మే 11న ఢిల్లీ క్యాపిటల్స్‌తో, మే 14న లక్నోతో, మే 18న సీఎస్‌కేతో తలపడనుంది.నేటి మ్యాచ్‌కు తుది జట్లు (అంచనా)గుజరాత్‌: శుభ్‌మన్ గిల్ (C), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (WK), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మసన్‌రైజర్స్‌: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అనికేత్ వర్మ, కమిందు మెండిస్, పాట్ కమిన్స్ (C), హర్షల్ పటేల్, సిమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ, మహమ్మద్ షమీ

Ex CJI NV Ramana Key Comments On Caste Census6
కుల గణనపై మాజీ సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

ఢిల్లీ: దేశంలో జనాభా లెక్కలతో పాటు కుల గణన చేపట్టాలన్న కేంద్రం నిర్ణయంపై మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్పందించారు. జనగణనలో భాగంగా కుల గణన చేయడం చారిత్రక అవసరం అని ఎన్వీ రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే, జనగణనలో ప్రతి సామాజిక సూచికను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.తాజాగా మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కులం, కులం ఆధారిత వివక్ష ఒక కఠినమైన వాస్తవం. చాలా కాలం పాటు మనం ఈ వాస్తవాన్ని అంగీకరించకుండా విస్మరించడానికే ప్రాధాన్యం ఇచ్చాం. ఇప్పుడు మనం చైతన్యంతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది. కుల గణన నిర్ణయం తీసుకున్న భారత ప్రభుత్వానికీ హృదయపూర్వక అభినందనలు. కులాన్ని ఒక గుర్తింపుగా తీసుకుని జనగణన (Census)లో భాగం కుల గణన నిర్వహించడం సరైన నిర్ణయం.ప్రామాణికమైన డేటాను సేకరించకపోతే సమగ్ర కోణంలో అభివృద్ధి కార్యాచరణను రూపొందించడం సాధ్యపడదు. కుల గణనతో మన సమాజంలోని అన్ని వర్గాలకు అధికారంలో, ఆర్థిక అభివృద్ధిలోను వారికి రావాల్సిన వాటా లభించేలా చేయడంలో తోడ్పడుతుంది. సామాజిక, ఆర్థిక, ఇతరత్రా అసమానతలను తగ్గించడంలో కూడా కుల గణన ఎంతో దోహదపడుతుంది. జనగణనలో ప్రతి సామాజిక సూచికను కూడా పరిగణనలోకి తీసుకోవాలి అని అన్నారు.

Heavy Rain, Dust Storm In Delhi NCR7
ఢిల్లీలో వర్ష బీభత్సం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం సృష్టించిన వర్షం బీభత్సంలో కుటుంబంలో నలుగురు మృతి చెందారు. వర్ష కారణంగా ద్వారాకాలో ఓ ఇంటిపై చెల్లి కూలింది. ఈ దుర్ఘటనలో తల్లి, ఆమె ముగ్గురు పిల్లలు మరణించారు. శుక్రవారం తెల్లవారు జామున ఢిల్లీ వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. దుమ్ముతో పాటు భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ సైతం ఢిల్లీలో రెడ్‌ జోన్‌ ప్రకటించింది. భారీ వర్షం కారణంగా ఏర్పడిన ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ అంతరాయం ఏర్పడింది. వర్షం దెబ్బకు విమానాల సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ఆయా విమానయాన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. Severe thunderstorms and rain lash Delhi and NCR.IMD forecasts heavy rainfall, thunderstorms, and gusty winds for the next two days, issuing a yellow alert for the national capital.#Rain #IMD #DelhiRains #rainfall #thunderstorms #Weather pic.twitter.com/fiZb2DPJJS— All India Radio News (@airnewsalerts) May 2, 2025 ఎయిర్‌ పోర్టుకు వెళ్లే ముందు ప్రయాణికులు తమ విమానాల రాకపోకల్ని పరిశీలించాలని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రయాణికుల్ని కోరింది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది #TravelAdvisoryThunderstorms and gusty winds have affected flight operations in parts of Northern India. Some of our flights to and from Delhi are being delayed, which is likely to impact our overall flight schedule. We are doing our best to minimise disruptions.We advise our…— Air India (@airindia) May 2, 2025‘ఢిల్లీకి వెళ్లే, బయల్దేరే ఎయిరిండియా విమానాల సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో దుమ్ము తుఫాను, వర్షం కారణంగా విమానాల్ని దారి మళ్లిస్తున్నాం. ఫలితంగా మొత్తం విమానాల రాకపోకలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. అంతరాయాలను తగ్గించడానికి మా వంతు మేం కృషి చేస్తున్నాం’ అంటూ ఎయిరిండియా ట్వీట్‌లో పేర్కొంది.

WAVES 2025: Allu Arjun Shares About An Accident He Had8
ఆ యాక్సిడెంట్‌ నా జీవితంలో పెద్ద గిఫ్ట్‌ : అల్లు అర్జున్‌

ప్రమాదం జరిగితే కష్టం, నష్టమే. కానీ, అనుకోకుండా కొన్ని ప్రమాదాలు మంచి కూడా చేస్తాయి. ప్రముఖ హీరో అల్లు అర్జున్‌(Allu Arjun) స్వయంగా ఈ మాట అంటున్నారు. ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతున్న ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ సమ్మిట్‌ (వేవ్స్‌)(WAVES 2025)లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ– ‘‘కెరీర్‌ తొలి రోజుల్లో నా దృష్టి అంతా ఫిజికల్‌ ఫిట్‌నెస్, ఎజిలిటీ మీదే ఉండేది. కానీ, జీవితంలో ఒక ఘటన నా ఆలోచననే మార్చేసింది. నా పదో సినిమా తర్వాత నా భుజానికి దెబ్బ తగిలి, ఆస్ట్రేలియాలో సర్జరీ చేయించుకున్నా. అంతా బాగైపోయి, నాలుగో వారం నుంచి సెట్స్‌ మీదకు వెళ్ళిపోవచ్చనుకున్నా. డాక్టర్లు 6 నెలలు రెస్ట్‌ తప్పనిసరి అన్నారు. నాకు కొత్తగా పెళ్ళయింది. ఓ సినిమా సగంలో ఉంది. అప్పటి దాకా ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన నాకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది.వయసు పెరిగే కొద్దీ ఫిట్‌నెస్, ఎజిలిటీ తగ్గుతాయి. కానీ, నటనపై దృష్టి పెడితే అది చిరకాలం మిగిలిపోతుందని గ్రహించా. అక్కడి నుంచి నా ఆలోచనే మారిపోయింది’’ అని వివరించారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘పదో సినిమా దగ్గర మొదలైన ఆ ఆలోచన ఇరవయ్యో సినిమా ‘పుష్ప–1’ దగ్గరకు వచ్చేసరి కల్లా నన్ను జాతీయ ఉత్తమ నటుడిగా, అందులోనూ తెలుగు సినీరంగం నుంచి ఆ ఘనత అందుకున్న తొట్ట తొలి నటుడిగా నిలిపింది. పదో సినిమా సమయంలో ఆ యాక్సిడెంట్‌ జరగకపోతే... నా దృక్పథం ఇలా మారేది కాదు.అందుకే, కొన్ని యాక్సిడెంట్లు అనుకోకుండా మన మంచికే జరుగుతాయి. మొత్తం నా ఆలోచనలు, కెరీర్‌నే మార్చేసిన ఆ యాక్సిడెంట్‌ నా జీవితంలో పెద్ద గిఫ్ట్‌’’ అని అల్లు అర్జున్‌ వివరించారు. ‘సాక్షి’ ఆయనను పలకరించినప్పుడు ‘‘మెడిసిన్, టెక్నాలజీ లాంటి అనేక రంగాలలో చాలా కాలంగా జరుగుతున్న సమ్మిట్‌లు చూసి, అలాంటివి మన సినీ, వినోద రంగంలో కూడా జరగాలనుకున్నాను. ప్రధాని మోదీ చొరవతో తొలిసారిగా వేవ్స్‌ సదస్సు జరగడం శుభారంభం’’ అన్నారు.

Despite disability Chess Champion Vaibhav Gautam success story9
భళా వైభవ్‌...వైకల్యానికి ‘చెక్‌’ పెట్టాడు!

సెరిబ్రల్‌ పాల్సీతో చక్రాల కుర్చీకే పరిమితమైన వైభవ్‌కు చెస్‌ పరిచయం చేశాడు తండ్రి గౌతమ్‌. ఆనాటి నుంచి ఒంటరి ప్రపంచం నుంచి చదరంగ ప్రపంచంలోకి వచ్చాడు వైభవ్‌. తండ్రితో కలిసి తరచుగా చెస్‌ ఆడేవాడు. క్రమంగా ఆటలో నైపుణ్యం సాధించాడు. ఆ నైపుణ్యం అతడిని జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది.దిల్లీ ఇంటర్నేషనల్‌ టోర్నమెంట్‌ వైభవ్‌ తొలి టోర్నమెంట్‌. తొలి ప్రయత్నంలోనే రేటింగ్‌ను సాధించడం విశేషం. చెస్‌లో మరిన్ని శిఖరాలను అధిరోహించడానికి అవసరమైన స్ఫూర్తిని ఆ రేటింగ్‌ ఇచ్చింది.గ్రాండ్‌ మాస్టర్‌’ కావాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. దేశవిదేశాల్లో జరిగే టోర్నమెంట్స్‌కు వైభవ్‌తో పాటు అతడి తండ్రి గౌతమ్‌ కూడా వెళుతుంటాడు. మ్యాచ్‌ సమయంలో అతడి పక్కనే కూర్చొని నొటేషన్‌లు రాస్తుంటాడు. కొడుకు కెరీర్‌ పట్ల తండ్రి చూపిస్తున్న అంకితభావం మాటలకు అందనిది.ఇదీ చదవండి: అత్తగారు, ఆవకాయ పచ్చడి : ఉపాసన కొణిదెల వీడియో వైరల్‌ View this post on Instagram A post shared by vaibhav gautam (@vaibhav.gautam_official) ఆటలంటే ఇష్టపడే గౌతమ్‌ తన కుమారుడు కూడా ఆటలు ఆడాలనుకునేవాడు. న్నప్పటి నుం వీల్‌చైర్‌కే పరిమితమైన వైభవ్‌ క్రికెట్, వాలీబాల్, కబడ్డీ...లాంటి ఆటలు ఆడలేడు. ‘ఇంతేనా’ అని కుమారుడి గురించి ఆలోచిస్తున్న సమయంలో ‘చెస్‌’ అనే ఆలోచన మెరిసింది. ఇక అప్పటి నుంచి కుమారుడికి చెస్‌పై ఆసక్తి కలిగేలా ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తానే గురువుగా మారాడు. మొదట్లో తండ్రి ఒక గేమ్, కొడుకు ఒక గేమ్‌ గెలిచేవారు. ఆ తరువాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారి΄ోయింది. తండ్రిపై ఎప్పుడూ వైభవే విజయం సాధించేవాడు. దీంతో కుమారుడిపై ఆ తండ్రికి మరింత నమ్మకం కలిగింది.‘యస్‌. మా వాడు సాధించగలడు’ ఒకటికి పదిసార్లు అనుకునేవాడు. ఆటలో మరింత నైపుణ్యం కోసం రామ్‌కుమార్‌ అనే కోచ్‌తో వైభవ్‌కు ఆన్‌లైన్‌లో కొన్ని నెలలు శిక్షణ ఇప్పించాడు. ఆ తరువాత జీబి జోషిని కోచింగ్‌ ఇవ్వాల్సిందిగా అభ్యర్థించాడు. ‘మీరు ఎంత ఫీజు అడిగినా ఇస్తాను’ అన్నాడు. ‘ఒక్క పైసా కూడా అక్కర్లేదు’ అంటూ వైభవ్‌కు ఉచిత కోచింగ్‌ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు జోషి. ఆటలో ఎప్పటికప్పుడు రేటింగ్‌ పెంచుకుంటూ అద్భుతం అనిపించు కుంటున్నాడు వైభవ్‌.‘వైభవ్‌ శారీరక స్థితికి వీల్‌చైర్‌లో కూర్చుని చెస్‌ ఆడడం అనేది అంత సులువైన విషయమేమీ కాదు. దీని కోసం ఎంతో కఠోర సాధన చేశాడు’ అంటున్నాడు గౌతమ్‌. జీవనోపాధి కోసం గౌతమ్‌ దిల్లీలో చిన్న షాప్‌ నడుపుతున్నాడు. ‘మీరు ఎక్కువ సమయం వైభవ్‌తోనే గడపాల్సి వస్తుంది కదా’ అని అడిగితే ఆ తండ్రి చెప్పిన జవాబు...‘మా అబ్బాయికి కచ్చితంగా మంచి టైమ్‌ వస్తుంది. అప్పటి వరకు నా టైమ్‌ గురించి ఆలోచించడం లేదు’ ‘ఇలా అయితే ఎలా?’ అని ఎప్పుడూ బాధ పడలేదు వైభవ్‌. ఆ యువకుడు నడవలేడు. మాట్లాడలేడు. 90 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగుడు. తనను నిస్సహాయ స్థితిలో నుంచి బయటికి తీసుకువచ్చి కొత్త ప్రపంచం చూపించింది చదరంగం....

Cognizant to hire 20000 freshers in 202510
కాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు 20 వేల కొలువులు

అమెరికన్‌ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌ ఈ ఏడాది సుమారు 20,000 మంది ఫ్రెషర్లను రిక్రూట్‌ చేసుకునే యోచనలో ఉంది. ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, మేనేజ్డ్‌ సర్వీసెస్‌ విభాగాల్లో ఈ కొలువులు ఉండనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,36,300గా ఉంది.‘ఇన్వెస్టర్‌ డే సందర్భంగా చెప్పినట్లు మా వ్యూహంలో భాగంగా 20,000 మంది ఫ్రెషర్లను తీసుకోబోతున్నాం. గతేడాదితో పోలిస్తే ఇది రెట్టింపు‘ అని కంపెనీ సీఈవో ఎస్‌ రవి కుమార్‌ తెలిపారు. ఫ్రెషర్లను తీసుకోవడం, ఏఐ ద్వారా ఉత్పాదకతను పెంచుకోవడం, మానవ వనరుల వ్యయాలను తగ్గించుకునేలా సామర్థ్యాల వినియోగాన్ని మెరుగుపర్చుకోవడం వంటి మూడు అంశాలపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు.ఈ ఏడాది జనవరి–మార్చ్‌ త్రైమాసికంలో కాగ్నిజెంట్‌ ఆదాయం సుమారు 7 శాతం పెరిగి 5.1 బిలియన్‌ డాలర్లకు చేరింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో టాప్‌ ఐదు ఐటీ కంపెనీలు మొత్తంగా 80 వేల నుంచి 84 మందిని కొత్తగా నియమించుకోనున్నట్లు సంకేతాలిచ్చాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement