Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Madras High Court Stay On NEET Results1
నీట్ ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే

చెన్నై: నీట్ ఫలితాల విడుదలకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాలను విడుదల చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ.. తదుపరి విచారణ జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా స్టే విధించింది.తమ ఎగ్జామ్ సెంటర్లో విద్యుత్ అంతరాయం కారణంగా.. పరీక్ష సరిగ్గా రాయలేకపోయామని కొంతమంది విద్యార్థులు ఫిటిషన్ దాఖలు చేశారు. పరీక్ష కేంద్రంలో విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు, ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయలేదని వారు పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఫలితాలను నిలిపివేయాలని ఆదేశించింది. ఫలితాలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. కాగా రిజల్ట్స్ విడుదలకు సంబంధించిన తేదీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.2024 - 25 సంవత్సరానికి దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలలో ప్రవేశాలకై నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ మే 4న పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు 23 లక్షలమంది అప్లై చేసుకోగా.. 20.8 లక్షలమంది పరీక్షకు హాజరయ్యారు. ఇక ఈ పరీక్ష ఫలితాలు విడుదల కావాల్సి ఉంది.

Former Minister Sailajanath Takes On Chandrababu Sarkar2
‘చంద్రబాబు.. లిక్కర్ స్కామ్‌కు అర్థం మీ వద్దే ఉంది వెతుక్కోండి’

తాడేపల్లి: నాణ్యమైన మద్యం, తక్కువ ధరలు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాన్ని మోసం చేశారని మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. విమర్శించారు. దేశంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ కు కూటమి ప్రభుత్వం పెట్టింది పేరని ఎద్దేవా చేశారు శైలజానాథ్,ఈ రోజు(శనివారం) తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన శైలజానాథ్‌.. మద్యం వ్యాపారంలో చంద్రబాబు ఎక్స్ పర్ట్. అని స్పష్టం చేశారు. ‘చంద్రబాబు చేసిన అన్ని వ్యవహారాలు ప్రజలు మర్చిపోతారనే భావనలో ఉంటారు. చంద్రబాబు ప్రభుత్వం లోనే డిస్టలరీలకు అనుమతి ఇచ్చారు. చంద్రబాబు వ్యవహారం గురువింది గింజ సమేతలా ఉంటుంది. నూతన పాలసీ విధానంలో మద్యం అమ్మకాలు ప్రైవేటుకి ఇవ్వడంలో కూడా అవకతవకలు జరిగాయి. టీడీపీ స్థానిక నాయకులకు భాగస్వామ్యం ఉంది. రండి చూపిస్తాం... బెల్ట్ షాప్ లు లేని గ్రామం లేదు.. మేము చూపిస్తాం. అసలు మద్యం స్కాం అనేది ఇప్పుడు మీ ప్రభుత్వం లోనే నడుస్తోంది. మీ ప్రభుత్వ హయాంలో రోజు రెవెన్యూ లోటు కనిపిస్తుంది.మీరు సంవత్సర కాలంలో ఏం చేశారు?, లిక్కర్ కేసులో ఉన్న ఆధారాలు ఏంటి?, భయాన్ని క్రియట్ చేసి రాజ్యం నడుపుదాం అనుకుంటున్నారా?, చంద్రబాబు ఎన్నికల్లో గెలుపుకోసం ఏమైనా ప్రకటనలు చేస్తారని మరోసారి రుజువైంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన సాగించాలి. చంద్రబాబుపై సీఐడీ పెట్టిన కేసు ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు?, ఇప్పటికైనా కక్ష పూరిత వేధింపులు ఆపండి. మనం ఏది ఇస్తే అది మనకు వస్తుంది. మీ సీనియర్లతో చర్చించి చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోండి. మీ సచ్చీలతను నిరూపించుకోండి. చంద్రబాబు.. లిక్కర్ స్కామ్ కు అర్థం మీ వద్దే ఉంది వెతుక్కోండి’ అంటూ ధ్వజమెత్తారు శైలజానాథ్.

IPL 2025: Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders Live Updates3
ఐపీఎల్‌-2025 రీస్టార్ట్‌కు వ‌రుణుడి ఆడ్డంకి

IPL 2025 RCB vs KKR Live Updates:👉బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వ‌ద్ద వ‌ర్షం ఇంకా కురుస్తోంది. దీంతో టాస్ మ‌రింత ఆల‌స్యం కానుంది.👉ఐపీఎల్‌-2025 పున:ప్రారంభానికి వరుణడు ఆడ్డంకిగా నిలిచాడు. శనివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు త‌ల‌పడాల్సి ఉంది. అయితే ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో భారీ వ‌ర్షం కురుస్తోంది. మైదానం మొత్తాన్ని క‌వ‌ర్ల‌తో సిబ్బంది క‌ప్పి ఉంచారు. దీంతో ఈ మ్యాచ్ టాస్ ఆలస్యం కానుంది. కాగా చిన్న‌స్వామి స్టేడియంలో అద్బుత‌మైన డ్రైన‌జీ వ్య‌వ‌స్ద ఉండంతో వ‌ర్షం త‌గ్గిన వెంట‌నే మైదానాన్ని సిద్దం చేసే అవ‌కాశ‌ముంది.

We have formed a new party, Indraprastha Vikas Part AAP councillors4
తిరుగుబాటు: ఆమ్ ఆద్మీ పార్టీలో ‘ కొత్త పార్టీ’!

ఢిల్లీ: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీలో అంతర్గత పోరు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. తాజాగా ఆప్ లో ఎప్పట్నుంచో నివురుగప్పిన నిప్పులో ఉన్న వర్గ పోరు వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ)లో ఆప్ కు చెందిన కౌన్సిలర్లు తమ రాజీనామాలు ప్రకటించారు.తమకు అసలు పనే లేదని, ఇంకెందుకు కౌన్సిల్లరుగా ఉండటం అంటూ వారు రాజీనామాలు చేశారు. ఆప్ కు చెందిన 15 మంది కౌన్సిలర్లు రాజీనామాలు చేయడమే కాకుండా కొత్తగా ఓ పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి ఇంద్రప్రస్థ వికాస్ పేరును పెట్టినట్లు రాజీనామాకు సిద్ధమైన ఆప్ కౌన్సిలర్ హిమానీ జైన్ స్పష్టం చేశారు. గత రెండున్నరేళ్లుగా మాకు పని లేదు. కార్పోరేషన్ లో జరగాల్సిన పని ఏదీ జరగలేవు. మేము అధికారంలో ఉన్న సమయంలో కూడా ఏమీ చేయలేదు. కౌన్సిలర్లుగాఉండటం అనవసరం అని భావించే కొత్త పార్టీ పెట్టాం ’ అని ఆమె స్పష్టం చేశారు. తాము ఆప్‌ లో ఉన్నామనే సంగతినే అధ్యక్షుడు కేజ్రీవాల్‌ మరిచిపోయినట్లున్నారని మరో కౌన్సిలర్‌ ముఖేస్‌ గోయల్‌ వ్యాఖ్యానించారు.#WATCH | Delhi | On her resignation from the AAP, party councillor Himani Jain says, "We have formed a new party, Indraprastha Vikas Party. We have resigned from AAP. In the last 2.5 years, no work was done in the corporation which should have been done. We were in power, yet we… pic.twitter.com/c1thjuALZU— ANI (@ANI) May 17, 2025

Once Again Lies Of Eenadu News Paper Have Been Exposed5
మరోసారి బయటపడ్డ ఈనాడు పచ్చి అబద్ధాలు

సాక్షి, అమరావతి: మరోసారి ‘ఈనాడు’ పచ్చి అబద్ధాలు బయటపడ్డాయి. సెకీ సీఎండీ రామేశ్వరగుప్తాను కేంద్రం తొలగించిన వార్తపై ఈనాడు వక్రభాష్యం చెప్పింది. వైఎస్‌ జగన్‌ హయాంలో ఏపీలో జరిగిన విద్యుత్‌ ఒప్పందాలే తొలగింపునకు కారణం అంటూ ఈనాడు అబద్ధాలు రాసింది.2023లో జూన్‌లో సెకీ సీఎండీగా రామేశ్వర్‌ పదవి చేపట్టగా.. రామేశ్వర్‌ గుప్తా ఛైర్మన్‌ కాకముందే ఏపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. రామేశ్వర్‌ గుప్తా సెకీలో లేనప్పుడు ఒప్పందాలు జరిగితే.. ఆయన తొలగింపునకు ఏపీతో జరిగిన ఒప్పందాలే కారణమంటూ ఈనాడు అబద్ధాలు అచ్చేసింది.2021 డిసెంబర్‌లోనే ఏపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుందని ఈనాడు ఒప్పుకుంది. అబద్ధం వండివార్చాలనే తాపత్రయంలో కనీసం వాస్తవాలు ఏంటో తెలుసుకోని ఈనాడు.. అడ్డగోలు రాతలతో రెచ్చిపోయింది.ఈనాడు పిచ్చిరాతలపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వ హననం కోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా?. ఈనాడుది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంపై సెకీతో 2021 డిసెంబర్‌లో ఒప్పందం జరిగింది. 2023లో సెకీ సీఎండీగా రామేశ్వర్‌ గుప్తా నియమితులయ్యారు. 2023లో ఛైర్మన్‌ అయిన రామేశ్వర్‌ గుప్తాకు 2021 నాటి ఏపీ-సెకీ ఒప్పందానికి ఏం సంబంధం’’ అంటూ వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది.🚨 #BanYellowMediaSaveAPఏమిటీ రాక్షసత్వం. వైయస్.జగన్మోహన్‌రెడ్డిగారి వ్యక్తిత్వ హననంకోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా? “ఈనాడూ’’ మీది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంపై సెకీతో 2021 డిసెంబరులో ఒప్పందం. 2023లో సెకీ… pic.twitter.com/CJzt414GJH— YSR Congress Party (@YSRCParty) May 17, 2025 ‘‘సెకీకి రామేశ్వర్‌ గుప్తా సీఎండీ కాకముందు కేంద్ర పర్యావరణ శాఖ సెక్రటరీగా పనిచేశారు. అనిల్‌ అంబానీ కంపెనీ ఫేక్‌ డాక్యుమెంట్లతో బిడ్డింగ్‌ వేశారన్న ఆరోపణలు నేపథ్యంలో రామేశ్వర్‌ గుప్తాను తొలగించినట్టుగా 5-6 రోజులుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను వక్రీకరించి ఏపీ-సెకీ ఒప్పందానికి లింకు పెడుతూ.. నిస్సిగ్గుగా ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది’’ అని వైఎస్సార్‌సీపీ మండిపడింది.

Haryana-Based Youtuber Among 6 Arrested For Spying For Pakistan6
పాకిస్థాన్ స్పైగా హర్యానా యూట్యూబర్‌.. జ్యోతి మల్హోత్రా అరెస్ట్‌

ఢిల్లీ: హర్యానా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాక్‌లో ఐఎస్‌ఐ ఏజెంట్‌గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. జ్యోతి మల్హోత్రాతో పాటు మరో ఆరుగురి అరెస్ట్‌ను చేశారు. భారత సైనిక సమాచారాన్ని పాక్‌కు చేరవేసిన జ్యోతి మల్హోత్రా.. ఇటీవల ట్రావెల్‌ వీసాపై పాకిస్థాన్‌లో రెండుసార్లు పర్యటించారు. పాకిస్తాన్ అధికారి ఎహ్సాన్ రహీంను కలిసిన జ్యోతి మల్హోత్రా.. ఆ దేశానికి కీలక సమాచారం చేరవేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ నెట్‌వర్క్‌ హర్యానా, పంజాబ్‌ అంతటా విస్తరించినట్లు తేలింది. వీరంతా పాక్‌ ఐఎస్‌ఐకి ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. జ్యోతి.. ‘ట్రావెల్‌ విత్‌ జో’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ నడుపుతోంది. ఆమె ఎవరికీ అనుమానం రాకుండా పాక్‌ అధికారులకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నట్లు తేలింది. ఈ కేసులో జ్యోతి మల్హోత్రా ట్రావెల్ వ్లాగర్‌తో కలిసి పని చేస్తున్నట్లు గుర్తించారు. మరో ఐదుగురితో కలిసి ముఠాగా ఏర్పడి హర్యానా, పంజాబ్ నుంచి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌ ఉద్యోగి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో జ్యోతి మల్హోత్రా పరిచయాలు పెంచుకుంది.డానిష్‌ను ప్రభుత్వం ఇటీవేల బహిష్కరించిన విషయం తెలిసిందే. డానిష్ గురించి కూపీ లాగడంతో జ్యోతి గూఢచార్యం సంగతి బట్టబయలైంది. పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లకు జ్యోతి మల్హోత్రాను డానిష్ పరిచయం చేసినట్లు తేలింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్ట్ చేసిన ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాక్‌ ఇంటెలిజెన్స్‌ ఆపరేటివ్‌లతో నిత్యం టచ్‌లో ఉంటున్నట్లు తేలింది.ఈ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారానే భారత్‌కు చెందిన కీలక సమాచారాన్ని పాక్‌ అధికారులకు చేరవేసినట్లు సమాచారం. ‘జాట్ రంధావా’ అని సేవ్ చేసుకున్న ఓ పేరు షకీర్ అలియాస్ రాణా షాబాజ్‌ అనే పాకిస్థాన్‌ వ్యక్తిదిగా అధికారులు గుర్తించారు. గడిచిన రెండేళ్లలో మూడు సార్లు పాకిస్తాన్‌కు వెళ్లిన జ్యోతి.. యూట్యూబ్ వీడియోల కోసం చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్, నేపాల్, భూటాన్, యూఏఈ దేశాల్లో కూడా పర్యటించింది.పాక్ ఇంటలిజెన్స్ అధికారితో సన్నిహిత పెంచుకుని ఇద్దరూ ఇటీవల ఒక వారం పాటు ఇండోనేషియాలోని బాలి వెళ్లినట్లు గుర్తించిన అధికారులు. జ్యోతి మల్హోత్రాను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరింత సమాచారం సేకరించే పనిలో పడ్డారు.

Ajith Says He Decided Stay Away From Movies When Racing Time7
సినిమాలు, రేసింగ్‌.. హీరో అజిత్‌ కీలక నిర్ణయం!

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌(Ajith)కి రేసింగ్‌ అంటే ఎంత ఇష్టం అందరికి తెలిసిందే. రేజింగ్‌లో పాల్గొని ఇప్పటికే పలుమార్లు ప్రమాదానికి గురైనా కూడా ఆయన దాన్ని వదలడం లేదు. సినిమాల కంటే రేసింగే ఎక్కువ ఇష్టమని గతంలో చాలా సార్లు చెప్పారు. అంతేకాదు తాను యాక్సిడెంటల్‌ హీరో​ అని కూడా చెప్పుకుంటారు. ఒకనొక దశలో సినిమాలకు గుడ్‌బై చెప్పి పూర్తిస్థాయిలో రేసింగ్‌పై ఫోకస్‌ పెట్టబోతున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. తాజాగా దీనిపై అజిత్‌ క్లారిటీ ఇచ్చాడు. సినిమాలు చేస్తూనే రేసింగ్‌లో పాల్గొంటానని, ఒకటి చేసేటప్పుడు మరోకదానికి బ్రేక్‌ ఇస్తానని చెప్పుకొచ్చాడు.‘రేసింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో పాల్గొనాలంటే చాలా ఫిట్‌గా ఉండాలి. సినిమాలు చేస్తూ రేసింగ్‌లో పాల్గొనడం చాలా కష్టమైన పని. కార్ల రేస్‌పై దృష్టిపెట్టినప్పుడు ముందు శారీరకంగా మారాలి. అందుకే సైక్లింగ్‌, స్విమ్మింగ్‌తో పాటు డైట్‌ ఫాలో అవుతా. గత ఎనిమిది నెలల్లో దాదాపు 42 కిలోల బరువు తగ్గాను. ఇలాంటి సమయంలో మళ్లీ సినిమాలు చేస్తే దానికి పూర్తి న్యాయం చేయలేకపోతున్నాను. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నాను. ఇకపై రేసింగ్‌ సీజన్‌ ఉన్నప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉంటా’అని ఆయన అన్నారు. ఇక రేసింగ్‌ సమయంలో ఆయనకు జరిగిన ప్రమాదాల గురించి మాట్లాడుతూ.. ‘సినిమాల్లో స్టంట్స్‌ చేసేటప్పుడు నాకు చాలా దెబ్బలు తగిలాయి.ఎన్నో సర్జరీలు జరిగాయి. అలా అని యాక్షన్‌ సినిమాలు వదిలేయలేం కదా? అదే విధంగా ప్రమాదాలు జరిగాయని రేసింగ్‌కు దూరం కాలేను. నా దృష్టిలో రెండు ఒక్కటే’ అన్నారు.ఇక సినిమాల విషయాలకొస్తే.. ఇటీవ‌ల గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో సూప‌ర్ హిట్ అందుకున్నాడు అజిత్. అధిక్ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం రూ.200 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.త్వరలోనే తన 64వ సినిమా ప్రారంభం కాబోతుంది. దర్శకుడు ఎవరనేది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ధనుష్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో షూటింగ్‌ ప్రారంభం కానుంది.

RBI announces new Rs 20 denomination banknotes with new RBI Governor signature8
కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి.. ఆర్బీఐ ప్రకటన

దేశంలో కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి. మహాత్మాగాంధీ (కొత్త) సిరీస్ కింద త్వరలో కొత్త రూ .20 డినామినేషన్ నోట్లను విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ఈ నోట్లపై ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది.రాబోయే రూ .20 నోట్ల డిజైన్, ఫీచర్లు మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ కింద ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్ల మాదిరిగానే ఉంటాయని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. కలర్ స్కీమ్, కొలతలు, సెక్యూరిటీ ఫీచర్లు, వెనుకవైపు ఉండే ఎల్లోరా గుహల చిహ్నం.. అన్నీ అలాగే ఉంటాయి."రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో గవర్నర్‌ సంజయ్ మల్హోత్రా సంతకంతో రూ .20 డినామినేషన్ నోట్లను విడుదల చేస్తుంది. ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలుగా మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లోని రూ .20 నోట్లను పోలి ఉంటుంది" అని సెంట్రల్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది.కాగా గతంలో జారీ చేసిన అన్ని రూ .20 నోట్లు జారీ చేసే గవర్నర్ సంతకంతో సంబంధం లేకుండా పూర్తిగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్త గవర్నర్ సంతకంతో కొత్త నోట్లను జారీ చేయడం అనేది ఆర్బీఐ అధి నాయకత్వం మార్పు తరువాత సాధారణంగా జరిగే ప్రక్రియే. ఇది ప్రస్తుత కరెన్సీ నోట్ల వినియోగం లేదా విలువను ప్రభావితం చేయదు.

Arya Badai Gets Engaged To Fellow Bigg Boss Alum DJ Sibin9
ఎట్ట​కేలకు ఎంగేజ్‌మెంట్‌ : రెండో పెళ్లికి సిద్ధపడుతున్న బిగ్‌బాస్‌ ఫేం

మలయాళ టీవీ నటి, యాంకర్‌ బిగ్‌బాస్‌ ఫేం ఆర్య బాబు (ఆర్య బదై) తన జీవితంలో సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఎట్టకేలకు తన ప్రేమ రెండో పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆర్య బడై బంగ్లా ఫేమ్, ప్రాణ స్నేహితుడు, వెడ్డింగ్‌ డిజైనర్‌ సిబిన్ బెంజమిన్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ సంతోషకరమైన వార్తను ఇద్దరూ ఇన్‌స్ట పోస్ట్‌ ద్వారా వెల్లడించారు. అలాగే ప్రేమపూర్వక సందశాన్ని కూడా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లలో పంచుకున్నారు. దీంతో ఇద్దరికీ ఫ్యాన్స్‌ అభినందనలు తెలిపారు. 'ది బెస్ట్ అన్ ప్లాన్డ్ థింగ్' అంటూ ఆర్య తన ఎంగేజ్‌మెంట్‌ వార్తను అభిమానులతో షేర్‌చేసింది. మలయాళం బిగ్ బాస్ 2 లో ఆర్య, సిబిన్‌ కలిసి పాల్గొన్నారు. ఆర్య తన కాబోయే భర్తతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్‌ అగ్ర హీరోయిన్లను..!‘‘సిబిన్‌ సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నాను. ప్రాణ స్నేహితుల నుండి జీవితాంతం సహచరులుగా... జీవితం ఒకే ఒక సాధారణ ప్రశ్నతో , నా మొత్తం జీవితంలో నేను తీసుకున్న వేగవంతమైన నిర్ణయంతో అత్యంత నమ్మశక్యం కాని, అందమైన మలుపు తీసుకుంది. ఇది అస్సలు ప్లాన్‌ చేసుకోని విషయం... ఆనందంలో, బాధలో తోడుంటే వ్యక్తిగా, నా కూతురు ఖుషీకి ఉత్తమ తండ్రిగా, స్నేహితుడిగా,మా మొత్తం కుటుంబానికి బలమైన సపోర్ట్‌గా ఉన్నందుకు ధన్యవాదాలు. చివరకు నేను సంపూర్ణం.. నా గృహం నీచేతుల్లో..’’ అని పోస్ట్‌ పెట్టింది ఆర్య.ఇదీ చదవండి: బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!అటు సిబిన్‌ కూడా ఆర్య కోసం ఒక భావోద్వేగ పోస్ట్‌ పెట్టాడు. ఫోటోను షేర్ చేశాడు. ఆర్యను ముద్దుగా 'చోక్కి' అని పిలుస్తాడు. ఆర్య లాగే,. ర్యాన్ , ఖుషీ ఇద్దరికీ తండ్రిగా ఉన్నందుకు సంతోషిస్తూ, సిబిన్ ఇలా వ్రాశాడు: "నేను జీవితంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను - అవి తరచుగా నన్ను కోల్పోయేలా, విచ్ఛిన్నం చేసేలా చేశాయి. కానీ ప్రతి తుఫానులో, ఎలాంటి శషబిషలు లేకూడా నాతో నిలిచిన వ్యక్తి. అదే ఆమె - నా ప్రాణ స్నేహితురాలు. గందరగోళంలో నాకు ప్రశాంతత, నిశ్శబ్దంలో నా నవ్వు, నా ఓదార్పు - నా చోక్కీ... నా చోక్కీ, నా కొడుకు ర్యాన్ ,నా కుమార్తె ఖుషీతో హృదయపూర్వకంగా, ఎప్పటికీ అంతం జీవితం ప్రారంభించబోతున్నాను. దేవా, నాకు నా శాశ్వతత్వాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.కాగా కాంచీవరం.ఇన్‌కు ఫౌండర్‌ సీఈవోగా ఉంది ఆర్యం. ఆర్య గతంలో రోహిత్ సుశీలన్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఖుషీ (13) అనే కుమార్తె ఉంది. పెళ్లైన పదేళ్లకు 2018లో ఆర్య, రోహిత్‌ విడిపోయారు. ఆ తరువాత ప్రముఖ వివాహ డీజే సిబిన్‌తో ప్రేమలో పడింది. వీరు చాలా సంవత్సరాలుగా కలిసే ఉంటున్నారు. తమ సంబంధాన్ని చాలావరకు గోప్యంగా ఉంచారు, ఎట్టకేలకు తమ నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు సిబిన్‌కు కూడా మొదటి భార్య ద్వారా ఒక కుమారుడు ర్యాన్ ఉన్నాడు.

Seven MPs Carry Message To World Over Ind-Pak Clash10
పాక్‌కు భారత్‌ చెక్‌.. ఏడుగురు ఎంపీలతో దౌత్య యుద్ధం!

ఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాకిస్తాన్‌ తీరు ఎండగట్టేందుకు భారత్‌ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే పాక్‌ ఉగ్ర కుట్రలను ప్రపంచదేశాలకు వివరించడం కోసం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన మొత్తం ఏడు గ్రూపులు 10 రోజుల వ్యవధిలో ఐదు దేశాలకు వెళ్తాయి. ఈ మేరకు ప్రతినిధుల బృందాలకు సంబంధించిన వివరాలను కేంద్రం శనివారం వెల్లడించింది.అఖిలపక్ష ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లను కేంద్రం ప్రకటించింది. వీరిలో ఎంపీలు శశిథరూర్‌ (కాంగ్రెస్‌), సుప్రియా సూలే (ఎన్సీపీ -ఎస్పీ), కనిమొళి (డీఎంకే), రవిశంకర్‌ ప్రసాద్‌(బీజేపీ), బైజయంత్‌ పాండా (బీజేపీ) సంజయ్‌ కుమార్‌ ఝా(జేడీయూ), శ్రీకాంత్‌ శిందే (శివసేన) విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీరంతా.. మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మొదటి వారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని దేశాలు, ఇతర కీలక దేశాలను అఖిలపక్ష బృందం సందర్శించనుంది. ఉగ్రవాదం అణిచివేతకు భారత్ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని అఖిలపక్ష నేతలు వివరించనున్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించాల్సిందే అనేది భారత విధానమని చెప్పనున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఏకతాటిపై నిలబడిందని సందేశం ఇచ్చేందుకు అఖిలపక్షం ఏర్పాటైంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్‌ ఏవిధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని.. ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)తో ఉగ్రవాదంపై భారత్‌ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు వివరించనున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్‌ అనుసరిస్తున్న పాత్రను.. దానివల్ల ప్రపంచదేశాలకు పొంచిఉన్న ముప్పును వివరించనుంది. భవిష్యత్తులో భారత్‌పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత ఇవ్వనుంది. ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టడానికి కారణమైన పాక్‌ రెచ్చగొట్టే చర్యలు, పాక్‌ బెదిరింపులకు ధీటుగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను ఎలా చేపట్టిందో వివరణ ఇవ్వనుంది. ఆపరేషన్ సమయంలో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కచ్చితంగా లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని, పౌరులకు ఎలాంటి హానీ చేయలేదని ఆధారాలు చూపించనున్నారు. Union Minister Kiren Rijiju tweets "In moments that matter most, Bharat stands united. Seven All-Party Delegations will soon visit key partner nations, carrying our shared message of zero-tolerance to terrorism. A powerful reflection of national unity above politics, beyond… pic.twitter.com/yYiQF4ufEF— ANI (@ANI) May 17, 2025కాంగ్రెస్‌ లిస్టులో నో శశిథరూర్‌.. చివరకు ట్విస్ట్‌..ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పంపిన జాబితాలో అసలు థరూర్ పేరు లేకపోవడం గమనార్హం. పాక్‌ను ఎండగట్టేందుకు పంపే బృందం కోసం పేర్లు పంపాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మే 16న కాంగ్రెస్‌ను కోరగా, అదే రోజున హస్తం పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ నాలుగు పేర్లు పంపారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్‌ హుస్సేన్‌, లోక్‌సభ ఎంపీ రాజా బ్రార్, మరో నేత గౌరవ్‌ గొగొయ్‌ ఉన్నారని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆ లిస్ట్‌లో థరూర్‌ పేరు లేదు. అయితే ఈ రోజు కేంద్రం విడుదల చేసిన తుది జాబితాలో వారి పేర్లేవీ లేవు. కానీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు మాత్రం అనూహ్యంగా చోటు దక్కింది.మరోవైపు, శశిథరూర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘ఇటీవలి పరిణామాలపై దేశం విధానాన్ని వివిధ దేశాలకు వివరించేందుకు వెళ్తున్న బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. దేశ ప్రయోజనాలతో ముడిపడిన సందర్భాల్లో అక్కడ నా అవసరం ఉంటే.. నేను అందుబాటులో ఉంటా. జైహింద్‌’ అంటూ వ్యాఖ్యలు చేశారు. Yesterday morning, the Minister of Parliamentary Affairs Kiren Rijiju spoke with the Congress President and the Leader of the Opposition in the Lok Sabha. The INC was asked to submit names of 4 MPs for the delegations to be sent abroad to explain India's stance on terrorism from…— Jairam Ramesh (@Jairam_Ramesh) May 17, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement