Top Stories
ప్రధాన వార్తలు

తిరుగుబాటు: ఆమ్ ఆద్మీ పార్టీలో ‘ కొత్త పార్టీ’!
ఢిల్లీ: గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైన తర్వాత ఆ పార్టీలో అంతర్గత పోరు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. తాజాగా ఆప్ లో ఎప్పట్నుంచో నివురుగప్పిన నిప్పులో ఉన్న వర్గ పోరు వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ)లో ఆప్ కు చెందిన కౌన్సిలర్లు తమ రాజీనామాలు ప్రకటించారు.తమకు అసలు పనే లేదని, ఇంకెందుకు కౌన్సిల్లరుగా ఉండటం అంటూ వారు రాజీనామాలు చేశారు. ఆప్ కు చెందిన 15 మంది కౌన్సిలర్లు రాజీనామాలు చేయడమే కాకుండా కొత్తగా ఓ పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి ఇంద్రప్రస్థ వికాస్ పేరును పెట్టినట్లు రాజీనామాకు సిద్ధమైన ఆప్ కౌన్సిలర్ హిమానీ జైన్ స్పష్టం చేశారు. గత రెండున్నరేళ్లుగా మాకు పని లేదు. కార్పోరేషన్ లో జరగాల్సిన పని ఏదీ జరగలేవు. మేము అధికారంలో ఉన్న సమయంలో కూడా ఏమీ చేయలేదు. కౌన్సిలర్లుగాఉండటం అనవసరం అని భావించే కొత్త పార్టీ పెట్టాం ’ అని ఆమె స్పష్టం చేశారు. తాము ఆప్ లో ఉన్నామనే సంగతినే అధ్యక్షుడు కేజ్రీవాల్ మరిచిపోయినట్లున్నారని మరో కౌన్సిలర్ ముఖేస్ గోయల్ వ్యాఖ్యానించారు.#WATCH | Delhi | On her resignation from the AAP, party councillor Himani Jain says, "We have formed a new party, Indraprastha Vikas Party. We have resigned from AAP. In the last 2.5 years, no work was done in the corporation which should have been done. We were in power, yet we… pic.twitter.com/c1thjuALZU— ANI (@ANI) May 17, 2025

మరోసారి బయటపడ్డ ఈనాడు పచ్చి అబద్ధాలు
సాక్షి, అమరావతి: మరోసారి ‘ఈనాడు’ పచ్చి అబద్ధాలు బయటపడ్డాయి. సెకీ సీఎండీ రామేశ్వరగుప్తాను కేంద్రం తొలగించిన వార్తపై ఈనాడు వక్రభాష్యం చెప్పింది. వైఎస్ జగన్ హయాంలో ఏపీలో జరిగిన విద్యుత్ ఒప్పందాలే తొలగింపునకు కారణం అంటూ ఈనాడు అబద్ధాలు రాసింది.2023లో జూన్‌లో సెకీ సీఎండీగా రామేశ్వర్ పదవి చేపట్టగా.. రామేశ్వర్ గుప్తా ఛైర్మన్ కాకముందే ఏపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. రామేశ్వర్ గుప్తా సెకీలో లేనప్పుడు ఒప్పందాలు జరిగితే.. ఆయన తొలగింపునకు ఏపీతో జరిగిన ఒప్పందాలే కారణమంటూ ఈనాడు అబద్ధాలు అచ్చేసింది.2021 డిసెంబర్లోనే ఏపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుందని ఈనాడు ఒప్పుకుంది. అబద్ధం వండివార్చాలనే తాపత్రయంలో కనీసం వాస్తవాలు ఏంటో తెలుసుకోని ఈనాడు.. అడ్డగోలు రాతలతో రెచ్చిపోయింది.ఈనాడు పిచ్చిరాతలపై వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్ జగన్ వ్యక్తిత్వ హననం కోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా?. ఈనాడుది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సెకీతో 2021 డిసెంబర్లో ఒప్పందం జరిగింది. 2023లో సెకీ సీఎండీగా రామేశ్వర్ గుప్తా నియమితులయ్యారు. 2023లో ఛైర్మన్ అయిన రామేశ్వర్ గుప్తాకు 2021 నాటి ఏపీ-సెకీ ఒప్పందానికి ఏం సంబంధం’’ అంటూ వైఎస్సార్సీపీ ప్రశ్నించింది.🚨 #BanYellowMediaSaveAPఏమిటీ రాక్షసత్వం. వైయస్.జగన్మోహన్రెడ్డిగారి వ్యక్తిత్వ హననంకోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా? “ఈనాడూ’’ మీది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై సెకీతో 2021 డిసెంబరులో ఒప్పందం. 2023లో సెకీ… pic.twitter.com/CJzt414GJH— YSR Congress Party (@YSRCParty) May 17, 2025 ‘‘సెకీకి రామేశ్వర్ గుప్తా సీఎండీ కాకముందు కేంద్ర పర్యావరణ శాఖ సెక్రటరీగా పనిచేశారు. అనిల్ అంబానీ కంపెనీ ఫేక్ డాక్యుమెంట్లతో బిడ్డింగ్ వేశారన్న ఆరోపణలు నేపథ్యంలో రామేశ్వర్ గుప్తాను తొలగించినట్టుగా 5-6 రోజులుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను వక్రీకరించి ఏపీ-సెకీ ఒప్పందానికి లింకు పెడుతూ.. నిస్సిగ్గుగా ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది’’ అని వైఎస్సార్సీపీ మండిపడింది.

బాబర్ ఆజం వరల్డ్ ఎలెవన్: కోహ్లి, బుమ్రాలకు దక్కని చోటు
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) టీ20 ఫార్మాట్లో తన అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. తన వరల్డ్ ఎలెవన్‌లో తనతో పాటు టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli), ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)లకు మాత్రం బాబర్ చోటివ్వలేదు.టీమిండియా నుంచి ఆ ఇద్దరుఅయితే, భారత్ నుంచి మరో ఇద్దరు ఆటగాళ్లను మాత్రం బాబర్ ఆజం తన జట్టుకు ఎంపిక చేసుకున్నాడు. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లో దుమ్మురేపిన రోహిత్ శర్మతో పాటు.. టీమిండియా టీ20 జట్టు ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లకు చోటిచ్చాడు. కాగా ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్లో రోహిత్ శర్మ అత్యధిక పరుగుల వీరుడిగా ఉన్నాడు.హిట్‌మ్యాన్ ఖాతాలో 4231 పరుగులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవర్ హిట్టర్‌గా పేరొందిన రోహిత్‌ను బాబర్ ఆజం తన జట్టులో ఓపెనర్‌గా ఎంపిక చేసుకున్నాడు. అతడికి జోడీగా పాకిస్తాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్‌కు స్థానం ఇచ్చాడు.ఇక వన్‌డౌన్‌లో పాక్‌కే చెందిన ఫఖర్ జమాన్‌ను సెలక్ట్ చేసుకున్న బాబర్.. మిడిలార్డర్లో ధనాధన్ దంచికొట్టే సూర్యకుమార్ యాదవ్‌ను నాలుగో నంబర్ బ్యాటర్‌గా ఎంచుకున్నాడు. అదే విధంగా ఇంగ్లండ్ విధ్వంసకర వీరుడు జోస్ బట్లర్, సౌతాఫ్రికా హార్డ్ హిట్టర్ డేవిడ్ మిల్లర్లను ఐదు, ఆరు స్థానాలకు ఎంపిక చేసుకున్నాడు.ఏకైక స్పిన్నర్ ఏడో స్థానంలో సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్‌కు చోటు ఇచ్చిన బాబర్ ఆజం.. ఎనిమిదో స్థానానికి అఫ్గనిస్తాన్ మేటి స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను ఎంచుకున్నాడు. ఇక పేస్ దళంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు ఆసీస్‌కే చెందిన మరో ఫాస్ట్‌బౌలర్ మిచెల్ స్టార్క్‌లకు బాబర్ తన జట్టులో స్థానం ఇచ్చాడు. వీరితో పాటు ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్‌ను పేస్ దళంలో చేర్చాడు.తన జట్టులో పవర్ హిట్టర్లతో పాటు విలక్షణ బౌలర్లు ఉన్నారని.. అందుకే ఈ టీమ్ సమతూకంగా ఉంటుందని బాబర్ ఆజం చెప్పుకొచ్చాడు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ అతడు ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు.కాగా టీ20 ప్రపంచకప్-2024లో కనీసం గ్రూప్ దశను కూడా దాటకుండానే పాకిస్తాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాబర్ ఆజంను కెప్టెన్సీ నుంచి తప్పించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను వన్డే, టీ20 జట్ల కెప్టెన్‌గా నియమించింది. అయితే, అతడి సారథ్యంలోనూ పాక్ ఘోర పరాభవాలు చవిచూస్తోంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలలో వన్డేలు గెలవడం మినహా చెప్పుకోదగ్గ విజయాలేవీ సాధించలేదు.ఇక ఇటీవల నిర్వహించిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో రిజ్వాన్ బృందం ఒక్క గెలుపు కూడా లేకుండానే టోర్నీని ముగించింది. అయితే, ఈ రెండు సందర్భాల్లోనూ రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా ఐసీసీ ట్రోఫీలు గెలవడం విశేషం. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన తర్వాత రోహిత్, కోహ్లి అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరూ టెస్టులకు కూడా రిటైర్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు వన్డేలలోనూ కొనసాగుతున్నారు.బాబర్ ఆజం వరల్డ్ ఎలెవన్:రోహిత్ శర్మ, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్, మార్కో యాన్సెన్, రషీద్ ఖాన్, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, మార్క్‌వుడ్.చదవండి: బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్‌గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్: టీమిండియా మాజీ కోచ్

చంద్రబాబు కుట్ర ఇదే: భూమన
సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండపడ్డారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిల అరెస్ట్‌లను ఖండిస్తూ తిరుపతి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియోను విడుదల చేశారు. ‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీని నాశనం చేయాలని, వైఎస్ జగన్ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. వైఎస్సార్సీపీపై కక్షతో నిరంతరం దుర్మార్గంగా పనిచేస్తోంది. వైఎస్ జగన్‌ను బలహీనపరచాలని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను వేధింపులకు గురి చేయడమే కాకుండా చివరికి ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలడం లేదు...గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారనే కక్షతో తప్పుడు కేసులు బనాయించి, జైలుకు పంపుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడం, సూపర్ సిక్స్ విషయంలో ఏడాది కాలంలో ఎటువంటి హామీని అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. దీనికి పరాకాష్టగా లేని మద్యం స్కామ్‌లో సీనియర్ ప్రభుత్వ అధికారులుగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిలను అరెస్ట్ చేశారు. వీరి సర్వీస్ కాలంలో చిత్తశుద్దితో, నిజాయితీతో పనిచేసిన సమర్థులైన అధికారులుగా వీరు పేరు సంపాదించుకున్నారు...తప్పుడు ఆరోపణలతో వైఎస్ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికే వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన చేయకుండా, వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అంటకాగారనే నెపంతో సివిల్ సర్వెంట్లు, ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేయడం అత్యంత దారుణం. ఇలా చేస్తుంటే ఏ ప్రభుత్వ అధికారి చిత్తశుద్దితో పనిచేస్తారు? ఎక్కడా జరగని మద్యం కుంభకోణంను సృష్టించి, దీనిలో వైఎస్ జగన్‌ను ఇరికించి, అరెస్ట్ చేయాలనే కుట్రతోనే చంద్రబాబు పనిచేస్తున్నారు...ఇలాంటి తప్పుడు కేసులు బనాయించి, ఇదే తరహాలో పాలన సాగించాలని అనుకుంటే ప్రజలు సరైన సమయంలో బుద్ది చెబుతారు. శిశుపాలుడి మాదిరిగా చంద్రబాబు చేస్తున్న తప్పులను కృష్ణుడి మాదిరిగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల గురించి ఆలోచించకుండా, ప్రతి పదిహేను రోజులకు ఒక డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రయోగిస్తూ, గత వైయస్ఆర్సీపీపై ఏదో ఒక ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. నిజాయితీపరులైన అధికారులను జైళ్లకు పంపడం ద్వారా చంద్రబాబు సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రతీకార చర్యలను చూసి రేపు మన భవిష్యత్తు ఏమిటీ అనే ఆత్మ మథనం అధికారుల్లో ప్రారంభమైంది’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి.. ఆర్బీఐ ప్రకటన
దేశంలో కొత్త కరెన్సీ నోట్లు వస్తున్నాయి. మహాత్మాగాంధీ (కొత్త) సిరీస్ కింద త్వరలో కొత్త రూ .20 డినామినేషన్ నోట్లను విడుదల చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకటించింది. ఈ నోట్లపై ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది.రాబోయే రూ .20 నోట్ల డిజైన్, ఫీచర్లు మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ కింద ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్ల మాదిరిగానే ఉంటాయని సెంట్రల్ బ్యాంక్ స్పష్టం చేసింది. కలర్ స్కీమ్, కొలతలు, సెక్యూరిటీ ఫీచర్లు, వెనుకవైపు ఉండే ఎల్లోరా గుహల చిహ్నం.. అన్నీ అలాగే ఉంటాయి."రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లో గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో రూ .20 డినామినేషన్ నోట్లను విడుదల చేస్తుంది. ఈ నోట్ల డిజైన్ అన్ని విధాలుగా మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్‌లోని రూ .20 నోట్లను పోలి ఉంటుంది" అని సెంట్రల్ బ్యాంక్ ఒక నోటిఫికేషన్లో తెలిపింది.కాగా గతంలో జారీ చేసిన అన్ని రూ .20 నోట్లు జారీ చేసే గవర్నర్ సంతకంతో సంబంధం లేకుండా పూర్తిగా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. కొత్త గవర్నర్ సంతకంతో కొత్త నోట్లను జారీ చేయడం అనేది ఆర్బీఐ అధి నాయకత్వం మార్పు తరువాత సాధారణంగా జరిగే ప్రక్రియే. ఇది ప్రస్తుత కరెన్సీ నోట్ల వినియోగం లేదా విలువను ప్రభావితం చేయదు.

ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ : రెండో పెళ్లికి సిద్ధపడుతున్న బిగ్‌బాస్ ఫేం
మలయాళ టీవీ నటి, యాంకర్ బిగ్‌బాస్ ఫేం ఆర్య బాబు (ఆర్య బదై) తన జీవితంలో సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఎట్టకేలకు తన ప్రేమ రెండో పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆర్య బడై బంగ్లా ఫేమ్, ప్రాణ స్నేహితుడు, వెడ్డింగ్ డిజైనర్ సిబిన్ బెంజమిన్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ సంతోషకరమైన వార్తను ఇద్దరూ ఇన్స్ట పోస్ట్ ద్వారా వెల్లడించారు. అలాగే ప్రేమపూర్వక సందశాన్ని కూడా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లలో పంచుకున్నారు. దీంతో ఇద్దరికీ ఫ్యాన్స్ అభినందనలు తెలిపారు. 'ది బెస్ట్ అన్ ప్లాన్డ్ థింగ్' అంటూ ఆర్య తన ఎంగేజ్మెంట్ వార్తను అభిమానులతో షేర్చేసింది. మలయాళం బిగ్ బాస్ 2 లో ఆర్య, సిబిన్ కలిసి పాల్గొన్నారు. ఆర్య తన కాబోయే భర్తతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!‘‘సిబిన్ సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నాను. ప్రాణ స్నేహితుల నుండి జీవితాంతం సహచరులుగా... జీవితం ఒకే ఒక సాధారణ ప్రశ్నతో , నా మొత్తం జీవితంలో నేను తీసుకున్న వేగవంతమైన నిర్ణయంతో అత్యంత నమ్మశక్యం కాని, అందమైన మలుపు తీసుకుంది. ఇది అస్సలు ప్లాన్ చేసుకోని విషయం... ఆనందంలో, బాధలో తోడుంటే వ్యక్తిగా, నా కూతురు ఖుషీకి ఉత్తమ తండ్రిగా, స్నేహితుడిగా,మా మొత్తం కుటుంబానికి బలమైన సపోర్ట్‌గా ఉన్నందుకు ధన్యవాదాలు. చివరకు నేను సంపూర్ణం.. నా గృహం నీచేతుల్లో..’’ అని పోస్ట్ పెట్టింది ఆర్య.ఇదీ చదవండి: బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!అటు సిబిన్ కూడా ఆర్య కోసం ఒక భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ఫోటోను షేర్ చేశాడు. ఆర్యను ముద్దుగా 'చోక్కి' అని పిలుస్తాడు. ఆర్య లాగే,. ర్యాన్ , ఖుషీ ఇద్దరికీ తండ్రిగా ఉన్నందుకు సంతోషిస్తూ, సిబిన్ ఇలా వ్రాశాడు: "నేను జీవితంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను - అవి తరచుగా నన్ను కోల్పోయేలా, విచ్ఛిన్నం చేసేలా చేశాయి. కానీ ప్రతి తుఫానులో, ఎలాంటి శషబిషలు లేకూడా నాతో నిలిచిన వ్యక్తి. అదే ఆమె - నా ప్రాణ స్నేహితురాలు. గందరగోళంలో నాకు ప్రశాంతత, నిశ్శబ్దంలో నా నవ్వు, నా ఓదార్పు - నా చోక్కీ... నా చోక్కీ, నా కొడుకు ర్యాన్ ,నా కుమార్తె ఖుషీతో హృదయపూర్వకంగా, ఎప్పటికీ అంతం జీవితం ప్రారంభించబోతున్నాను. దేవా, నాకు నా శాశ్వతత్వాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు.కాగా కాంచీవరం.ఇన్‌కు ఫౌండర్ సీఈవోగా ఉంది ఆర్యం. ఆర్య గతంలో రోహిత్ సుశీలన్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఖుషీ (13) అనే కుమార్తె ఉంది. పెళ్లైన పదేళ్లకు 2018లో ఆర్య, రోహిత్ విడిపోయారు. ఆ తరువాత ప్రముఖ వివాహ డీజే సిబిన్‌తో ప్రేమలో పడింది. వీరు చాలా సంవత్సరాలుగా కలిసే ఉంటున్నారు. తమ సంబంధాన్ని చాలావరకు గోప్యంగా ఉంచారు, ఎట్టకేలకు తమ నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించారు. మరోవైపు సిబిన్‌కు కూడా మొదటి భార్య ద్వారా ఒక కుమారుడు ర్యాన్ ఉన్నాడు.

పాక్‌కు భారత్ చెక్.. ఏడుగురు ఎంపీలతో దౌత్య యుద్ధం!
ఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాకిస్తాన్ తీరు ఎండగట్టేందుకు భారత్ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచదేశాలకు వివరించడం కోసం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన మొత్తం ఏడు గ్రూపులు 10 రోజుల వ్యవధిలో ఐదు దేశాలకు వెళ్తాయి. ఈ మేరకు ప్రతినిధుల బృందాలకు సంబంధించిన వివరాలను కేంద్రం శనివారం వెల్లడించింది.అఖిలపక్ష ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లను కేంద్రం ప్రకటించింది. వీరిలో ఎంపీలు శశిథరూర్ (కాంగ్రెస్), సుప్రియా సూలే (ఎన్సీపీ -ఎస్పీ), కనిమొళి (డీఎంకే), రవిశంకర్ ప్రసాద్(బీజేపీ), బైజయంత్ పాండా (బీజేపీ) సంజయ్ కుమార్ ఝా(జేడీయూ), శ్రీకాంత్ శిందే (శివసేన) విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీరంతా.. మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మొదటి వారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని దేశాలు, ఇతర కీలక దేశాలను అఖిలపక్ష బృందం సందర్శించనుంది. ఉగ్రవాదం అణిచివేతకు భారత్ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని అఖిలపక్ష నేతలు వివరించనున్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించాల్సిందే అనేది భారత విధానమని చెప్పనున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఏకతాటిపై నిలబడిందని సందేశం ఇచ్చేందుకు అఖిలపక్షం ఏర్పాటైంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్ ఏవిధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని.. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు వివరించనున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ అనుసరిస్తున్న పాత్రను.. దానివల్ల ప్రపంచదేశాలకు పొంచిఉన్న ముప్పును వివరించనుంది. భవిష్యత్తులో భారత్‌పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత ఇవ్వనుంది. ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి కారణమైన పాక్ రెచ్చగొట్టే చర్యలు, పాక్ బెదిరింపులకు ధీటుగా భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ఎలా చేపట్టిందో వివరణ ఇవ్వనుంది. ఆపరేషన్ సమయంలో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కచ్చితంగా లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని, పౌరులకు ఎలాంటి హానీ చేయలేదని ఆధారాలు చూపించనున్నారు. Union Minister Kiren Rijiju tweets "In moments that matter most, Bharat stands united. Seven All-Party Delegations will soon visit key partner nations, carrying our shared message of zero-tolerance to terrorism. A powerful reflection of national unity above politics, beyond… pic.twitter.com/yYiQF4ufEF— ANI (@ANI) May 17, 2025కాంగ్రెస్ లిస్టులో నో శశిథరూర్.. చివరకు ట్విస్ట్..ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పంపిన జాబితాలో అసలు థరూర్ పేరు లేకపోవడం గమనార్హం. పాక్‌ను ఎండగట్టేందుకు పంపే బృందం కోసం పేర్లు పంపాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మే 16న కాంగ్రెస్‌ను కోరగా, అదే రోజున హస్తం పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ నాలుగు పేర్లు పంపారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్ హుస్సేన్, లోక్‌సభ ఎంపీ రాజా బ్రార్, మరో నేత గౌరవ్ గొగొయ్ ఉన్నారని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆ లిస్ట్‌లో థరూర్ పేరు లేదు. అయితే ఈ రోజు కేంద్రం విడుదల చేసిన తుది జాబితాలో వారి పేర్లేవీ లేవు. కానీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు మాత్రం అనూహ్యంగా చోటు దక్కింది.మరోవైపు, శశిథరూర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ఇటీవలి పరిణామాలపై దేశం విధానాన్ని వివిధ దేశాలకు వివరించేందుకు వెళ్తున్న బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. దేశ ప్రయోజనాలతో ముడిపడిన సందర్భాల్లో అక్కడ నా అవసరం ఉంటే.. నేను అందుబాటులో ఉంటా. జైహింద్’ అంటూ వ్యాఖ్యలు చేశారు. Yesterday morning, the Minister of Parliamentary Affairs Kiren Rijiju spoke with the Congress President and the Leader of the Opposition in the Lok Sabha. The INC was asked to submit names of 4 MPs for the delegations to be sent abroad to explain India's stance on terrorism from…— Jairam Ramesh (@Jairam_Ramesh) May 17, 2025

బాబూ.. కూటమి సంక్షేమం ఉత్తుత్తి మాటేనా?
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ ప్రభావం ప్రస్తుత అధికార కూటమిపై బాగానే ఉన్నట్టుంది. ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చిన జగన్ ఒక పక్కనుంటే.. ఇంకోపక్క ఒకటి అర కూడా అమలు చేయని కూటమి ఇంకోవైపున ఉంది. రెండింటినీ పోల్చుకుంటున్న ప్రజలు అసంతృప్తిని వెళ్లగక్కుతుంటే.. దాన్ని చల్చార్చలేక కూటమి డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోంది. రెడ్‌బుక్ పేరుతో సృష్టిస్తున్న ఆరాచకాలు.. జగన్‌పై లేనిపోని అభాండాలు వేయడం వంటివి ఎన్ని చేస్తున్నా ప్రజల్లో అసంతృప్తిని మాత్రం ఇసుమంత కూడా తగ్గడం లేదు.ఈ విషయం కూటమి నేతలకూ బాగానే అర్థమైంది. ఎక్కడికెళ్లినా జగన్‌కు ప్రజాదరణ ఏమాత్రం తగ్గకపోవడం కూడా కూటమి నేతలకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు, ఎల్లోమీడియా తన స్వరాన్ని కొంత మార్చుకుంటున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. సూపర్‌సిక్స్ హామీల్లో అన్నీ కాకపోయినా కొన్నింటినైనా అమలు చేసినట్లు కనిపించాలని సంక్షేమ రాగం ఎత్తుకున్నాయి!. అయితే ఇందులోనూ చిత్తశుద్ధి కనిపించడం లేదు. సంక్షేమ కార్యక్రమాల పేరిట టీడీపీ కార్యకర్తలకు నిధుల పందేరానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయాలు కొన్నింటిని గమనిస్తే.. పార్టీ కేడర్‌ను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని స్పష్టమవుతుంది.టీడీపీ కార్యకర్తలకు గతంలో పెండింగ్‌లో ఉన్న నీరు-చెట్టు, ఉపాధి హామీ పనులకు సంబంధించి సుమారు రూ.650 కోట్ల చెల్లించేందుకు నిర్ణయించారు. ఈ స్కీమ్‌ల కింద పనులు చేయకుండా చేసినట్లు చూపించడం, పలు అవకతవకలు పాల్పడినందున అప్పట్లో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి నిధుల మంజూరును నిలిపి వేశారు. కూటమి అధికారంలోకి రాగానే ఇలాంటి పనుల బిల్లులు సుమారు రూ.1000కోట్ల మేర చెల్లించారని వార్తలు వచ్చాయి. తాజాగా మరో రూ.650 కోట్ల నిధులు పంచబోతున్నారు. విశేషం ఏమిటంటే టీడీపీ కార్యకర్తలే ఈ పనులు చేపట్టారని పార్టీ అంగీకరించడం!. పాలిట్ బ్యూరో నిర్ణయాన్ని ప్రజలు వేరే రకంగా భావించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం సంక్షేమ స్కీములు అమలు చేయబోతోందని, సంక్షేమ క్యాలెండర్ తీసుకురాబోతోందని, దీని ద్వారా ప్రతి నెల ఒక స్కీము అమలు చేయాలని నిర్ణయించారని ఉచిత సిలిండర్లకు సంబంధించి నగదు ముందుగానే లబ్దిదారుల ఖాతాలలోకి వేయాలని నిర్ణయించారంటూ, సంక్షేమ సందడి అంటూ ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టింది. టీడీపీ ఈ మాత్రం నిర్ణయాలైనా తీసుకుందంటే అది జగన్ ఎఫెక్ట్ అని తెలుస్తూనే ఉంది.ఉదాహరణకు ఈ మధ్య కాలంలో జగన్ రెండు, మూడు సార్లు అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఎప్పుడు వెళ్లినా అశేష జనసందోహం తరలివచ్చి ఆయనను ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేస్తూ జై కొడుతోంది. తిరుపతిలో తొక్కిసలాట ఘటన పరామర్శకు వెళ్లినప్పుడు, సింహాచలంలో గోడ కూలి మరణాలు సంభవించినప్పుడు వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి వెళ్లినప్పుడు కూడా జనం అభిమానం ఎంతటిదో అంతా గమనించారు. జగన్ ప్రభుత్వంలో మద్యం స్కాం అంటూ తప్పుడు కేసు పెట్టినా జనం పట్టించుకోవడం లేదని అర్థమైంది. దాంతో సంక్షేమం అమలు చేయబోతున్నామని ప్రజలను ఆకట్టుకోవడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ, ఇందులో ఒక నిజాయితీ ఉందా అన్న చర్చ వస్తోంది. ఉదాహరణకు ప్రభుత్వం మూడు వంట గ్యాస్ సిలిండర్ల హామీ నెరవేర్చడంలో భాగంగా ముందుగానే వాటికి అయ్యే ఖర్చు మొత్తాన్ని వినియోగదారుల ఖాతాలో వేయాలని పాలిట్‌బ్యూరో నిశ్చయించిందట.జనసేన, బీజేపీలతో కూడా మాట్లాడి దీనిపై తుది నిర్ణయం చేస్తారట. నిజంగానే వంటగ్యాస్ వినియోగుదారులందరికీ ఈ రకంగా డబ్బు వేస్తారా?. మళ్లీ ఇందులో ఏ లిటిగేషన్ పెడతారో తెలియదు. ఎందుకంటే ఇప్పటికి ఏడాది పూర్తి అవుతున్నా, ఒక సిలిండర్ మాత్రమే.. అది కూడా అరకొరగా ఇచ్చి కథ నడిపించారు. అంటే ఒక ఏడాదికి రెండు సిలిండర్ల డబ్బు ఎగవేసినట్లు అవుతుంది. నిజంగానే రెండు లేదా, మూడు సిలిండర్ల నగదు ఇచ్చి ఉంటే దానిని విస్తారంగా ప్రచారంలో పెట్టడానికి చంద్రబాబు అన్ని చర్యలు తీసుకునేవారు కదా?. వెయ్యి రూపాయల పెన్షన్ అదనంగా ఇవ్వడానికే చంద్రబాబు లక్షల రూపాయల ఖర్చు పెట్టి హెలికాప్టర్లలో ప్రయాణిస్తూ సభలు పెట్టి హడావుడి చేస్తున్నారు. అలాంటిది అందరికి సిలిండర్ల డబ్బు ఇస్తే ఇంకెంత హడావుడి చేసేవారు? ఇప్పుడైనా నిజంగానే మూడు సిలిండర్ల డబ్బు వినియోగదారులకు ఇస్తారా? అందుకు అవసరమైన బడ్జెట్ ఉందా అంటే అనుమానమే. ఎందుకంటే బడ్జెట్ లో ఈ స్కీమ్‌కు వంద కోట్లే కేటాయించారని, అది ఎలా సరిపోతుందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఆలోచిస్తే ఇది నిజమే కదా అనిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్‌లో సుమారు కోటి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయనుకుంటే ఎన్ని కోట్లు అవసరం అవుతాయి. మరి ఇప్పుడు కొత్తగా ఏమైనా నిధులు కేటాయిస్తారా అన్నది చెప్పాల్సి ఉంటుంది. లేకుంటే ఇది ప్రచారం కోసమే అన్న సంగతి అర్థం చేసుకోవడం కష్టం కాదు. తల్లికి వందనం గురించి ఇప్పటికి పలు వాయిదాలు వేశారు. మళ్లీ జూన్ అంటున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మరో రెండు నెలలు పడుతుందని చెబుతున్నారు. మహిళలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీ గురించి చెప్పడం లేదు. అలాగే నిరుద్యోగ భృతిని ఏం చేశారు?. బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ అని ఆర్భాటంగా చెప్పారు. ఆ మాట గురించి ఏంటి?. జగన్ ఆయా స్కీమ్‌లను పద్ధతి ప్రకారం అమలు చేస్తే శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. ఎన్నికలు వచ్చేసరికి తాము రెండు, మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని ఊదరగొట్టారు. అధికారం వచ్చాక అప్పులు పుట్టడం లేదని ఒకసారి, సంక్షేమ పథకాలు వంద శాతం అమలు చేసేశామని ఇంకోసారి, అప్పులు చేసి సంక్షేమం అమలు చేయలేమని మరోసారి చెప్పారు.ఇలా ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలకు ఏం ఉపయోగం?. పాలిట్‌బ్యూరోలో ప్రస్తావనకు వచ్చిన ఇంకో విషయం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి.. దావోస్ నుంచి ఒక్క రూపాయి పెట్టుబడులు రాలేదు కానీ.. ఏడాది కాలంలో రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్లు వచ్చేశాయని డమ్మీ ప్రచారం మొదలుపెట్టింది కూటమి!. ఇలాంటి అబద్ధాలే.. చంద్రబాబు ప్రభుత్వంపై అపనమ్మకాన్ని రోజు రోజుకూ పెంచుతున్నాయి!.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

అవును.. భారత్ క్షిపణుల దెబ్బ మాకు తగిలింది: పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‌పై ఇన్నాళ్లూ బుకాయించిన పాకిస్తాన్.. తాజాగా అసలు నిజాలను వెల్లడించింది. నూర్ ఖాన్, ఇతర వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అంగీకరించారు. దాడుల విషయం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ వివరించారని వెల్లడించారు. ఆ సమయంలో తమ వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనీస్ యుద్ధ విమానాలను వినియోగించిందని షరీఫ్ పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్, పాకిస్తాన్‌లు కశ్మీర్ సహా తమ మధ్య విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య ఇప్పటికి మూడు సార్లు యుద్ధం జరిగినా వచ్చిందేమీ లేదు అంటూ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి సైనికులకు నివాళులర్పించే కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ..‘భారత్, పాకిస్తాన్‌లు ఇప్పటి వరకు మూడుసార్లు యుద్ధాలు చేసినా ఏమీ సాధించలేకపోయాయి. జమ్మూకశ్మీర్ వంటి అన్ని ప్రధాన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. లేకుంటే మనం ప్రశాంతంగా ఉండలేం’ అని పేర్కొన్నారు.Pakistan PM Shahbaz Sharif says, "At around 2:30 am on 10 May, General Syed Asim Munir called me on secure line and informed me that India's ballistic missiles have hit Nur Khan Airbase and other areas.#nurkhanairbase #Pakistan #PakistanArmy pic.twitter.com/RKnWGP8WeS— Manish Shukla (@manishmedia) May 17, 2025తమది శాంతికాముక దేశమైనా స్వీయరక్షణకు తగినట్లు స్పందించే హక్కు ఉందని షెహబాజ్ అన్నారు. ‘భారత్‌కు దీటుగా జవాబిచ్చి’ పాక్ సైనిక చరిత్రలో స్వర్ణాధ్యాయాన్ని లిఖించారని కొనియాడారు. శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ముందుకు వస్తే ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో సహకరిస్తామని భారత్‌కు హామీ ఇచ్చారు. కాల్పుల విరమణకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.అనంతరం, పాక్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇశాక్ దార్ మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ల మధ్య అపరిష్కృత, వివాదాస్పద అంశాలపై సమగ్ర చర్చలు జరుపుదామని కామెంట్స్ చేశారు. మరోవైపు.. తమపై భారత్ ఎలాంటి దురాక్రమణకు దిగినా దానికి బదులిస్తామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. కాల్పుల విరమణకు భారత్ చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలని ఈ శాఖ అధికార ప్రతినిధి షఫ్ఖత్ అలీఖాన్ వ్యాఖ్యలు చేశారు. ఇక, కృతజ్ఞతా దినం సందర్భంగా ఇస్లామాబాద్‌లో 31 సార్లు, ప్రావిన్సుల రాజధానుల్లో 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి సెల్యూట్ చేశారు. ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలతో సైనికదళాలకు సంఘీభావం ప్రకటించారు.

బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!
వయసు మీరుతున్న కొద్దీ తలపై జుట్టూడిపోవడం సాధారణం. కానీ.. కొంతమందికి చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తుంటుంది. మళ్లీ జుట్టు కావాలని అనుకుంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి వ్యయ ప్రయాసలతో కూడిన పద్ధతులు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే త్వరలోనే ఈ సమస్య తీరి పోతుందంటున్నారు హార్వర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా... రాలిపోయిన జుట్టు స్థానంలో సరికొత్తగా వెంట్రుకలు మొలిచేలా కూడా చేసేందుకు తాము ఓ కొత్త పద్ధతిని ఆవిష్కరించామని వీరు చెబుతున్నారు. నొప్పి ఏమాత్రం కలిగించని, అతిసూక్ష్మమైన సూదులతో కూడిన పట్టీని అతికించి.. ఆ సూదుల ద్వారా ఒక మందును నెత్తికి అందించడం ద్వారా ఇది సాధ్యమని వారు వివరించారు. ఎలుకలపై తాము ఇప్పటికే కొన్ని ప్రయోగాలు చేశామని, సత్ఫలితాలు సాధించామని తెలిపారు.అలొపీసియాకు కారణాలు కచ్చితంగా తెలియవు కానీ.. ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి. అంటే.. శరీర రోగ నిరోధక వ్యవస్థే.. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు దాడి చేశాయని పొరబడి మన శరీరానికి నష్టం చేయడాన్నే ఆటో ఇమ్యూన్ వ్యాధి అంటారు. అలోపీసియా విషయంలో రోగ నిరోధక వ్యవస్థలోని టీ–కణాలు వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తాయన్న మాట. ఫలితంగా వెంట్రుకలు అక్కడక్కడా రాలిపోవడం మొదలవుతుంది. కొంతమందిలో రాలిపోయిన తరువాత ఒకసారి పెరిగే అవకాశం ఉంటుంది కానీ.. మిగిలిన వారికి ఆ అదృష్టం ఉండదు. ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్‌ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కీళ్లనొప్పులు, తామర వంటివి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కావడం... చికిత్సకు మందులు (రోగ నిరోధక వ్యవస్థను అణచివేసేవి) ఉపయోగించినప్పుడు జుట్టు మొలవడం! మందులు వాడటం నిలిపేసిన వెంటనే జుట్టు రాలడమూ మొదలవుతూ ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఈ మందుల్లోనే ఏదో మర్మముందన్న సందేహంతో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. ఇదీ చదవండి: వెండి గాజుల కోసం.. తల్లి చితిపై పడుకుని..కొడుకు కాదు!మందులు కేవలం వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తున్న టీ–కణాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీంతో మైక్రో నీడిల్ ప్యాచ్ ద్వారా ఈ మందులు నేరుగా వెంట్రుకల కుదుళ్లకు మాత్రమే అందేలా చేశారు. ఎలుకలతో ప్రయోగాలు చేసినప్పుడు మూడు వారాల్లోపు పదిసార్లు ΄్యాచ్‌లు మార్చి.. ఇంకో ఎనిమిది వారాలు వాటిని గమనించారు. మూడు వారాల తరువాత వెంట్రుకలు పెరగడం మొదలైంది. పదివారాలపాటు పెరుగుతూనే ఉన్నాయి. సో... సమీప భవిష్యత్తులోనే బట్టతల కలవారందరూ ఎంచక్కా జేబులో దువ్వెన పెట్టుకుని తిరిగే అవకాశం ఉందన్నమాట!
తిరుగుబాటు: ఆమ్ ఆద్మీ పార్టీలో ‘ కొత్త పార్టీ’!
రోహిత్ శర్మకు రాహుల్ ద్రవిడ్ మెసేజ్.. వీడియో వైరల్
ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ : రెండో పెళ్లికి సిద్ధపడుతున్న బిగ్‌బాస్ ఫేం
గృహ కొనుగోళ్లలో మారుతున్న ఆలోచనలు.. ఇవన్నీ ఉండాల్సిందే!
రక్తం పంచుకుని పుట్టినోళ్లే నా పతనాన్ని.. ప్రభాస్ మాత్రం
స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల ఛార్జిషీట్
ఎపిటోరియా ఫార్మా ‘ఆరో అస్త్ర’ కోర్సు ప్రారంభం
బాబర్ ఆజం వరల్డ్ ఎలెవన్: కోహ్లి, బుమ్రాలకు దక్కని చోటు
ఆ రకమైన కులగణన జరపాలి!
World Hypertension Day : పట్టణ యువతలో పెరుగుతున్న ‘హైబీపీ’
పెళ్లి పెద్దగా పెద్దపల్లి కలెక్టర్
కోటి ఇస్తావా.. ఫొటోలు అప్లోడ్ చేయమంటావా?
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన..
మన వేలితో మన కన్నే..!
‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’
ఏపీ పోలీస్ ఆఫీసర్‌గా బాలకృష్ణ
పసిడి ఢమాల్.. రూ.వేలల్లో తగ్గిన బంగారం
'పద్మ భూషణ్' చేయాల్సిన పనులేనా..? బాలకృష్ణపై విమర్శలు
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
నెల్లూరులో ప్రసిద్ధ ఆలయం..శనివారం ఒక్కరోజే భక్తులకు దర్శనం (ఫొటోలు)
ఈ రాశి వారికి ముఖ్యమైన పనులలో విజయం.. ఉద్యోగలాభం
బర్త్ డే పార్టీ ఫోటోలు షేర్ చేసిన యాంకర్ రష్మీ గౌతమ్ (ఫొటోలు)
అలాగే ‘మన టెర్రరిస్టులు’ కూడా 100 మంది పోయారని చెప్పండి!
..పన్లోపని తుర్కియే అధ్యక్షుడిని కూడా పిలుద్దాం సార్! కొంతకాలం పాలన చూసుకోమని చెబుదాం!
ఇప్పటికైనా తెలిసిందా సార్!.. మీరెంత పేదరికంలో బతుకుతున్నారో!
ఈ రాశి వారికి వ్యాపారాలలో ఊహించని లాభాలు.. ఉద్యోగాలలో హోదాలు
మళ్లీ కరోనా మహమ్మారీ పలుదేశాల్లో హై అలర్ట్
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
వాళ్లు ఇస్తానన్న విమానం ఇదేనట సార్!
విజయవాడలో బోర్డు తిప్పేసిన నాగరాజు కన్సల్టెన్సీ సంస్థ
తిరుగుబాటు: ఆమ్ ఆద్మీ పార్టీలో ‘ కొత్త పార్టీ’!
రోహిత్ శర్మకు రాహుల్ ద్రవిడ్ మెసేజ్.. వీడియో వైరల్
ఎట్టకేలకు ఎంగేజ్మెంట్ : రెండో పెళ్లికి సిద్ధపడుతున్న బిగ్‌బాస్ ఫేం
గృహ కొనుగోళ్లలో మారుతున్న ఆలోచనలు.. ఇవన్నీ ఉండాల్సిందే!
రక్తం పంచుకుని పుట్టినోళ్లే నా పతనాన్ని.. ప్రభాస్ మాత్రం
స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటనపై పోలీసుల ఛార్జిషీట్
ఎపిటోరియా ఫార్మా ‘ఆరో అస్త్ర’ కోర్సు ప్రారంభం
బాబర్ ఆజం వరల్డ్ ఎలెవన్: కోహ్లి, బుమ్రాలకు దక్కని చోటు
ఆ రకమైన కులగణన జరపాలి!
World Hypertension Day : పట్టణ యువతలో పెరుగుతున్న ‘హైబీపీ’
పెళ్లి పెద్దగా పెద్దపల్లి కలెక్టర్
కోటి ఇస్తావా.. ఫొటోలు అప్లోడ్ చేయమంటావా?
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన..
మన వేలితో మన కన్నే..!
‘పాకిస్తాన్ వద్దే కాదు.. చైనాకు కూడా ఆ సామర్థ్యం లేదు’
ఏపీ పోలీస్ ఆఫీసర్‌గా బాలకృష్ణ
పసిడి ఢమాల్.. రూ.వేలల్లో తగ్గిన బంగారం
'పద్మ భూషణ్' చేయాల్సిన పనులేనా..? బాలకృష్ణపై విమర్శలు
ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
ఈ రాశి వారికి ముఖ్యమైన పనులలో విజయం.. ఉద్యోగలాభం
అలాగే ‘మన టెర్రరిస్టులు’ కూడా 100 మంది పోయారని చెప్పండి!
..పన్లోపని తుర్కియే అధ్యక్షుడిని కూడా పిలుద్దాం సార్! కొంతకాలం పాలన చూసుకోమని చెబుదాం!
ఇప్పటికైనా తెలిసిందా సార్!.. మీరెంత పేదరికంలో బతుకుతున్నారో!
ఈ రాశి వారికి వ్యాపారాలలో ఊహించని లాభాలు.. ఉద్యోగాలలో హోదాలు
మళ్లీ కరోనా మహమ్మారీ పలుదేశాల్లో హై అలర్ట్
ఈ రాశి వారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.
వాళ్లు ఇస్తానన్న విమానం ఇదేనట సార్!
విజయవాడలో బోర్డు తిప్పేసిన నాగరాజు కన్సల్టెన్సీ సంస్థ
కడప మేయర్ పదవి.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
IPL 2025 Resumption: ఆసక్తి రేపుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ ఆటగాడి పోస్ట్
సినిమా

కేరళలో 'అల్లు అర్జున్'ను స్టార్‌గా చేసిన ఖాదర్ ఎవరో తెలుసా?
అల్లు అర్జున్‌కు మలయాళంలో కూడా భారీగా అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. అక్కడ మన బన్నీకి అంతలా గుర్తింపు రావడం వెనుక ఒక నిర్మాత ఉన్నారని మీకు తెలుసా..? ‘ఆర్య’ సినిమా తర్వాత అల్లు అర్జున్‌కు మలయాళంలో విపరీతమైన క్రేజ్ వచ్చింది. మలయాళీలు ఆయన్ను మల్లు అర్జున్ అరి ముద్దుగా పిలుచుకుంటారు. టాలీవుడ్లో ఆయన సినిమాలు ఎంతలా అలరిస్తాయో.. అందుకు ఏమాత్రం తగ్గకుండా.. కేరళలోనూ ఆడుతుంటాయి. పుష్ప విడుదల సమయంలో అక్కడ ఏ సినిమా కూడా పోటీకి దిగలేదు అంతలా స్టార్డమ్ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్. అయితే, మలయాళీ గడ్డమీద మన బన్నీ అడుగులు ఎలా పడ్డాయో తెలుసా.అల్లు అర్జున్ను మలయాళ ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయాణం గురించి నిర్మాత ఖాదర్ హసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, వ్యూహాలతో పాటు కేరళలో అల్లు అర్జున్‌కు వచ్చిన ప్రజాదరణ గురించి ఆయన మాట్లాడారు. నేను పేరుకే నిర్మాతను. కానీ, నాకు దర్శకత్వం చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే అన్ని భాషల సినిమాలను చూస్తుంటాను. అలా 2002లో జెమిని టీవీలో 'నువ్వే నువ్వే' సినిమా చూశాను. అందులో 'ఐ యామ్ వెరీ సారీ' పాట నా దృష్టిని ఆకర్షించింది. వెంటనే ఈ సినిమా డబ్బింగ్ వర్షన్ కేరళలో విడుదల చేయాలని హైదరాబాద్ వచ్చేశాను. నిర్మాత రవి కిషోర్‌ను కలిసి డబ్బింగ హక్కులను పొందాను. మలయాళంలో 'ప్రణయమయి' పేరుతో విడుదల చేశాను. అయితే, సినిమాకు పెద్దగా డబ్బులు రాలేదు. కానీ, మంచి పేరు వచ్చింది. అలా మొదటిసారి డబ్బింగ్ సినిమాలపై నా అడుగులు పడ్డాయి.'ప్రణయమయి' సినిమా తర్వాత మరోక ప్రాజెక్ట్‌ను కేరళలో విడుదల చేయాలని నిర్మాత ఖాదర్ హసన్ అనుకుంటున్న సమయంలో ఆర్య పాటలు ఆయన చెవున పడ్డాయి. 'ఆర్య సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ తప్పకుండా కేరళలో స్థానం దక్కించుకుంటాడని నాకు అనిపించింది. 2004లో మళ్లీ హైదరాబాద్ వెళ్లి దిల్రాజును కలిశాను. ఆర్య డబ్బింగ హక్కులు కావాలని అడిగాను. మొదట్లో ఆయన ఒప్పుకోలేదు. చాలాకష్టపడి ఆయన్ను ఒప్పించి కేరళలో ఆర్య సినిమాను విడుదల చేశాను. అప్పటికి తెలుగు సినిమాలకు ఇక్కడ పెద్దగా మార్కెట్ లేదు. డబ్బింగ్ సినిమాలు అంటేనే చిన్నచూపు చూసేవారు. దానిని నేను ఎలాగైనా సరే మార్చాలని అనుకున్నాను. మలయాళీలకు తగ్గట్టుగా ఆర్య కోసం మంచి సంభాషణలు రాయించాను. మిక్సింగ్, ఇతర సాంకేతిక అంశాలను చెన్నైలోని భరణి వంటి ప్రఖ్యాత స్టూడియోలలో చేపించాను. ఆర్య పాటలను ప్రముఖ మలయాళ గాయకులు పాడారు. ఈ సినిమా కోసం నేను వ్యక్తిగతంగా చాలా రిష్క్ చేశాను. అప్పటికీ నేను అల్లు అర్జున్ను కనీసం కలవలేదు' అని అన్నారు.ఆర్య విజయం కోసం..ఆర్య సినిమా బాగుంది. కానీ, మలయాళీలకు పరిచయం చేయాలని తాను చాలా కష్టపడ్డానని నిర్మాత ఖాదర్ హసన్ అన్నారు. 'ఈ సినిమా పాటలు, ట్రైలర్లను విస్తృతంగా ప్రసారం చేయడానికి మేము ఆసియానెట్ కేబుల్ వారితో కనెక్ట్ అయ్యాం. లోకల్ కేబుల్ టీవీ నెట్‌వర్క్‌లను కూడా సంప్రదించాము. ఆపై సినిమా చూడటానికి విద్యార్థులను ఆహ్వానిస్తూ కళాశాలల్లోని యూనియన్లను సంప్రదించాం. అల్లు అర్జున్ స్టిక్కర్స్‌ను పంపిణీ చేశాం. పిల్లలకు అవి బాగా నచ్చాయి. బన్నీ మాస్క్‌లను కూడా ఉచితంగానే ఇచ్చాం. వాటితో పాటు మేము 3డి ఫ్యాన్ కార్డ్‌ను విడుదల చేశాం. ఇలా ఎన్నో ఆర్య సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశాం' అని ఆయన అన్నారు.ఆర్యతో అనుకున్నది చేశాను: ఖాదర్ఆర్య విడుదల తర్వాత తాము అనుకున్నది సాధించామని ఖాదర్ హసన్ అన్నారు. ఎవరూ ఊహించలేనంతగా తమకు లాభాలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని చోట్లు ఈ చిత్రం వందరోజులు కూడా రన్ అయినట్లు పేర్కొన్నారు. ఈ మూవీ తర్వాత తాము బన్నీ, హ్యాపీ, దేశముదురు, పరుగు, ఆర్య2 ఇలా దాదాపు అన్ని సినిమాలు మలయాళంలో విడుదల చేశామన్నారు. ఆర్య విజయం తర్వాత కేరళ ప్రజలకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఆ సమయంలో ఆయన మాట్లాడిన మాటలు మలయాళీలకు బాగా కనెక్ట్ అయ్యాయి. అందుకే ఇప్పటికీ ఆయనంటే అభిమానం చూపుతారు. 'ఈ ప్రయాణంలో, కేరళలో తన ఉనికిని స్థాపించడానికి నేను చేసిన ప్రయత్నాలకు అల్లు కృతజ్ఞతతో ఉన్నాడు. ఆయన మద్దతు మాపై ఎప్పటికీ ఉంటుంది. మలయాళీ ప్రజల పట్ల అల్లు అర్జున్ ఎప్పటికీ కృతజ్ఞతతోనే ఉంటాడు. ఇలా పరస్పర గౌరవం, అవగాహన వల్లే బన్నీతో వృత్తిపరమైన సంబంధాన్ని బలోపేతం చేసింది. నన్ను ఒక స్నేహితుడిగానే మల్లు అర్జున్ చూస్తాడు' అని ఖాదర్ అన్నారు.

'దాదాసాహెబ్ ఫాల్కే' బయోపిక్‌లో ఎవరు.. క్లారిటీ వచ్చేసింది
భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే (అసలు పేరు ధుండీరాజ్ గోవింద్ ఫాల్కే) బయోపిక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ చేసేందుకు ఇటు రాజమౌళి అటు ఆమిర్ ఖాన్ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. దీంతో ముందుగా ఎవరు ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ అసలు విషయం చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతుంది ఎవరో ఆయన పంచుకున్నారు.దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌పై ఇండస్ట్రీలో చర్చ జరుగుతుందని ఆయన మనవడు చంద్రశేఖర్ అన్నారు. ఈ ప్రాజెక్ట్ రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన అన్నారు. 'దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ విషయంలో రాజమౌళి టీమ్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మమ్మల్ని సంప్రదించలేదు. కానీ, ఆమిర్ టీమ్ నన్ను సంప్రదించింది. ఈ బయోపిక్ కోసం ఆమిర్ మూడేళ్ల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. దర్శకుడు రాజ్‌కుమార్ హీరాణీ ‘దాదాసాహెబ్ ఫాల్కే’ బయోపిక్ సినిమా కోసం వర్క్ చేస్తున్నట్లు నాకు కూడా సమాచారం ఉంది. రాజ్‌కుమార్ హీరాణీ అసిస్టెంట్ ప్రొడ్యూసర్ హిందూకుష్ భరద్వాజ్ నాతో మూడేళ్లుగా టచ్‌లో ఉన్నారు. మా తాతగారి గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నారు. అతను నన్ను మళ్ళీ మళ్ళీ కలవడానికి, పరిశోధన చేయడానికి, వివరాలు అడగడానికి వచ్చేవాడు. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో ఆమిర్ ఖాన్ బాగా సెట్ అవుతాడు.' అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో ఎన్టీఆర్ నటించడం లేదని దీంతో క్లారిటీ వచ్చేసింది. తారక్ నటిస్తున్నారని వార్తలు వచ్చిన 24 గంటల్లోపే ఈ ప్రాజెక్ట్‌లో ఆమిర్ ఖాన్ చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. అయితే, మేడ్ ఇన్ ఇండియా... ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా బయోపిక్ ‘మేడ్ ఇన్ ఇండియా’కు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా 2023లో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. వరుణ్ గుప్తా, ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మించనున్నట్లు, నితిన్ కక్కడ్ (హిందీ చిత్రం ‘నోట్‌బుక్’ ఫేమ్) ఈ బయోపిక్కు దర్శకత్వం వహించనున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఆ తర్వాత ఈ సినిమా గురించి అప్డేట్ ఏదీ బయటకు రాలేదు. తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే మనవుడి ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది.

రెమ్యునరేషన్ పెంచేసిన 'డ్రాగన్' బ్యూటీ.. ఎంతో తెలుసా..?
రంగుల ప్రపంచం, కలల ప్రపంచం, మాయాజాలం అంతా సినిమానే. ఇక్కడ ప్రయత్నాలు ఫలిస్తే వారి స్థాయి ఉన్నతంగా ఉంటుంది. అయితే అలాంటి విజయం ఎక్కడ నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. నటి కయ్యదు లోహర్(Kayadu Lohar)ది ఇదే పరిస్థితి. ఇండస్ట్రీలో సరైన ఛాన్స్ కోసం ఈ బ్యూటీ కూడా మూడు, నాలుగేళ్లు పోరాడిందనే చెప్పాలి. 2021లో కన్నడంలో ముకిల్ పేట్ అనే చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు. ఆ తరువాత మలయాళంలో పత్తొంబదామ్ నూట్రాండు చిత్రంతో అదృష్టాన్ని పరిక్షించుకుంది. ఆ తరువాత తెలుగులో అల్లూరి చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. అలా మరాఠి భాషలోనూ నటించింది. వీటిలో ఏ ఒక్కటీ ఆశించిన విజయం సాధించకపోయినా, వరుసగా ఇతర భాషల్లో కూడా అవకాశాలు వరించడం ఈ అమ్మడి లక్కే అని చెప్పక తప్పదు. అలా ఇటీవల తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ ఈమెకు డ్రాగన్ చిత్రం రూపంలో అదృష్టం పట్టుకుంది. ఈ చిత్రంలో నటి అనుపమ పరమేశ్వరన్ కూడా ఒక నాయకిగా నటించింది. ఆమెనెవరూ పట్టించుకోలేదు. డ్రాగన్ చిత్రం సూపర్‌హిట్ కావడంతో నటి కయ్యదు లోహర్ వెంటే దర్శక నిర్మాతలు, కథానాయకులు పరిగెడుతున్నారనే చెప్పాలి. ఇక్కడ ఈమె నటించిన డ్రాగన్ చిత్రం ఒక్కటే విడుదలైంది. అయితే కయ్యదు లోహర్ రూ. 2 కోట్లకు పైగానే పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి ఎదిగిందనే ప్రచారం జరుగుతోంది. డ్రాగన్ చిత్రానికి తను కేవలం రూ. 30 లక్షలు మాత్రమే తీసుకున్నట్లు సమాచారం. అయితే, సినిమాకు భారీ లాభాలు రావడంతో ఆమెకు మరో రూ. 70 లక్షలు ఇచ్చారని ప్రచారం ఉంది.అయితే, తన కొత్త సినిమాలకు రెమ్యునరేషన్ పెంచేసినట్లు తెలుస్తోంది. అందుకు కారణం సంచలన నటుడు శింబు, ధనుష్ వంటి వారు ఈ అమ్మడిని హీరోయిన్గా కోరుకోవడమే అంటున్నారు. ప్రస్తుతం నటుడు అధర్వకు జంటగా ఇదయం మురళి చిత్రంలో నటిస్తున్న కయ్యదు లోహర్ నటుడు, సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు జంటగా ఇమ్మార్టల్ అనే చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా శింబు 49వ చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో నటుడు ధనుష్‌తో జంటగా నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. పోర్ తొళిల్ చిత్రం ఫేమ్ విఘ్నేశ్ రాజా దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించనున్న చిత్రంలో కయ్యదు లోహర్‌ను హీరోయిన్గా ఎంపిక చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. అంతే కాకుండా లబ్బర్ బంతు చిత్రం ఫేమ్ తమిళరసన్ దర్శకత్వంలో ధనుష్ నటించనున్న చిత్రంలోనూ కయ్యదు లోహర్‌నే నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ధనుష్‌తో సినిమా ఛాన్స్ పూర్తి అయితే.. తన రెమ్యునరేషన్ మరో రూ. 3 కోట్లు పెరగొచ్చని పరిశ్రమ అంచనా వేస్తుంది. అదే సమయంలో టాలీవుడ్‌లోనూ మరో చిత్రం చేస్తోంది. ఇలా డ్రాగన్ అనే ఒక్క చిత్రం సక్సెస్‌తో ఇప్పుడు కోలీవుడ్‌లో కయ్యదు లోహర్ క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. ఇది కదా లక్కు అంటే.

అమ్మ కోరిక తీర్చిన విజయ్ దేవరకొండ.. ఇంతకీ అదేంటో తెలుసా?
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్డమ్ మూవీతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు అభిమానుల అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. ఇటీవల సాంగ్ రిలీజ్ చేయగా విజయ్ దేవరకొండతో కెమిస్ట్రీ ఫుల్ రొమాంటిక్‌గా సెట్ అయింది. అయితే ఈనెల 30న థియేటర్లలో విడుదల కావాల్సిన కింగ్డమ్ ఊహించని విధంగా వాయిదా పడింది. ఇండియా- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కింగ్డమ్ మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జూలై 4న సినిమా థియేటర్లలోకి రానుందని వెల్లడించారు.ఇక సినిమాల సంగతి పక్కనపెడితే విజయ్ తన ఫ్యామిలీతో చాలా సరదాగా గడుపుతూ ఉంటారు. ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో వేదికగా ఫోటోలు షేర్ చేస్తుంటారు. తాజాగా విజయ్ దేవరకొండ తన తల్లి కోరికను తీర్చాడు. ఈ వీకెండ్లో డిన్నర్ బయట ప్లాన్ చేద్దామని అమ్మ కోరడంతో వెంటనే విజయ్ డిన్నర్ ప్లాన్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అమ్మానాన్న, తమ్ముడు ఆనంద్‌తో డిన్నర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.(ఇది చదవండి: అటు రొమాన్స్.. ఇటు యాక్షన్.. 'కింగ్డమ్' తొలి పాట చూశారా?)విజయ్ తన పోస్ట్‌లో రాస్తూ..'అమ్మ అకస్మాత్తుగా మనం డిన్నర్ కి బయటకు వెళ్దామని అడిగింది. మేము బయటకు వెళ్లి చాలా కాలం అయింది. మనమందరం ఎప్పుడూ పని, లక్ష్యాల వెంట పరిగెడుతుంటాం. పనిలో బిజీగా ఉంటూ కొన్నిసార్లు జీవించడం మర్చిపోతాం. అందుకే నిన్న రాత్రి మేము బయటకు వెళ్లి చాలా సమయం గడిపాం. మీరు కూడా మీ అమ్మ, నాన్నలతో సమయం గడపడం మర్చిపోవద్దు. వారిని బయటకు తీసుకెళ్లండి, వారికి కొన్ని కౌగిలింతలు, ముద్దులు ఇవ్వండి. మీరు వారిని ప్రేమిస్తున్నారని చెప్పండి. మీ అందరికీ, మీ కుటుంబాలకు చాలా ప్రేమను పంపుతున్నా' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Vijay Deverakonda (@thedeverakonda)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

‘బుమ్రా వద్దే వద్దు!.. కెప్టెన్‌గా ఆ ఇద్దరిలో ఒకరు బెటర్’
భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ అంశంపై టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయం పంచుకున్నాడు. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సారథిగా నియమించకూడదని యాజమాన్యానికి సూచించాడు. పేస్ దళ నాయకుడికి బదులు యువ ఆటగాడికి పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందంటూ ఇద్దరు స్టార్ల పేర్లు చెప్పాడు.దిగ్గజాల వీడ్కోలుకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) 2025-27 సీజన్ భారత్- ఇంగ్లండ్ సిరీస్‌తో మొదలుకానున్న విషయం తెలిసిందే. స్టోక్స్ బృందంతో ఐదు టెస్టుల్లో తలపడేందుకు టీమిండియా అక్కడకు వెళ్లనుంది. అయితే, ఈ కీలక పర్యటనకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా రోహిత్ బాటలోనే సంప్రదాయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో భారత జట్టు కొత్త కెప్టెన్, నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసే ఆటగాడు ఎవరన్న అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో భాగంగా ప్రజెంటర్, బుమ్రా సతీమణి సంజనా గణేషన్‌తో రవిశాస్త్రి తన అభిప్రాయాలు పంచుకున్నాడు.బుమ్రానే ఫస్ట్ చాయిస్.. కానీ వద్దే వద్దు‘‘నా వరకైతే.. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత కచ్చితంగా జస్ప్రీత్ బుమ్రానే కెప్టెన్‌గా ప్రథమ ప్రాధాన్యం ఇవ్వగలిగే ఆటగాడు. అయితే, నేను జస్ప్రీత్ సారథి కావాలని కోరుకోవడం లేదు. ఎందుకంటే.. కెప్టెన్‌గా ఉంటే అతడిపై అదనపు భారం పడుతుంది.బౌలర్‌గానూ బుమ్రా సేవలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. అతడు తన శరీరాన్ని మరీ ఎక్కువగా కష్టపెట్టకూడదు. తీవ్రమైన వెన్నునొప్పి తర్వాత ఇటీవలే బుమ్రా తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఐపీఎల్ ఆడుతున్నాడు.ఒత్తిడికి లోనయ్యే అవకాశంఅయితే, అక్కడ కేవలం నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటా మాత్రమే ఉంటుంది. కానీ టెస్టుల్లో 10- 15 ఓవర్లు వేయాల్సి ఉంటుంది. ఇలా బౌలర్‌గా, కెప్టెన్‌గా అదనపు భారం పడితే అతడు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది’’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.ఆ ఇద్దరిలో ఒకరు బెటర్ఇక యువ ఆటగాళ్లకు కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందంటూ.. ‘‘కెప్టెన్‌గా శుబ్‌మన్ సరైన వాడు అనిపిస్తోంది. అతడికి అవకాశం ఇస్తే బాగుంటుంది. అతడి వయసు 25- 26 ఏళ్ల మధ్య ఉంటుంది. సారథిగా తనను తాను నిరూపించుకుంటే.. దీర్ఘకాలం కొనసాగల సత్తా అతడికి ఉంది.రిషభ్ పంత్‌ను పక్కన పెట్టే వీలు లేదు. నా దృష్టిలో టీమిండియా టెస్టు కొత్త కెప్టెన్లుగా వీరిద్దరిలో ఒకరే అత్యుత్తమ ఎంపిక. మరో దశాబ్దకాలం పాటు టీమిండియాకు ఆడగలరు.ఇప్పటికే ఇద్దరూ ఐపీఎల్లో జట్లకు కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. వారికి ఆ అనుభవం కూడా పనికివస్తుంది. అందుకే గిల్, పంత్‌లలో ఒకరికి టీమిండియా కెప్టెన్‌గా అవకాశం ఇస్తే బాగుంటుంది’’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గా జూన్ 20 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ మొదలుకానుంది.కాగా గతంలో ఇంగ్లండ్ పర్యటనలో ఓసారి భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇటీవల ఆస్ట్రేలియా టూర్లో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో పెర్త్, సిడ్నీ టెస్టుల్లో టీమిండియాకు సారథ్యం వహించాడు. ఈ ఐదు టెస్టుల సిరీస్‌లో పెర్త్‌లో మాత్రమే గెలిచిన భారత జట్టు.. 1-3తో ట్రోఫీని చేజార్చుకుంది.చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!

‘ఈసారి హార్దిక్ అలా చేయడం లేదు.. అందుకే ముంబై దూసుకెళ్తోంది’
ఐపీఎల్-2025 (IPL 2025)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. వరుస పరాజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కొట్టడం అద్భుతమని కొనియాడాడు. ఇందుకు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్సీ ప్రధాన కారణమని గావస్కర్ ముంబై సారథిని ప్రశంసించాడు.గతేడాది చేదు అనుభవాలుకాగా గతేడాది ముంబై ఇండియన్స్, హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఐదుసార్లు జట్టును చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కాదని పాండ్యాకు పగ్గాలు అప్పగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మైదానం లోపలా, వెలుపలా అతడిని హేళన చేస్తూ నిరుత్సాహపరిచారు.ఖేల్ ఖతమే అనుకున్నవేళఈ క్రమంలో గతేడాది ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడగున పదో స్థానంతో సీజన్‌ను ముగించింది. తాజా ఎడిషన్‌లో తొలి ఐదు మ్యాచ్‌లలో నాలుగు ఓడిపోయింది. దీంతో ముంబై ఖేల్ ఖతమే అని అనుకున్న సమయంలో.. ఊహించని రీతిలో పుంజుకుంది.అంతా హార్దిక్ వెంట ఉన్నారువరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ముంబై జట్టు, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ తీరును కొనియాడాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘గతేడాది సొంత జట్టు అభిమానుల నుంచే హార్దిక్‌కు మద్దతు లేదు.కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముంబై ప్రేక్షకులు, ముంబై జట్టు మద్దతుదారులు అంతా హార్దిక్ వెంట ఉన్నారు. ప్రతి ఒక్కరు టీమ్‌ను గెలిపించాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆరంభంలో తడబడినా ముంబై అద్భుత రీతిలో తిరిగి పుంజుకుంది.హార్దిక్ ఈసారి అలా చేయడం లేదుహార్దిక్ పాండ్యా ప్రభావం ఈసారి గట్టిగానే ఉంది. అతడు తన భావోద్వేగాలను మైదానంలో ఎక్కువగా కనిపించకుండా దాచేస్తున్నాడు. మిస్‌ఫీల్డ్ అయినప్పుడు, క్యాచ్‌లు జారవిడిచినపుడు ఫీల్డర్లకు మరేం పర్లేదు అన్నట్లుగా మద్దతుగానే ఉంటున్నాడు.ఒకవేళ కెప్టెన్ ఇలాంటపుడు అతిగా స్పందిస్తే.. ఫీల్డర్ కూడా డీలాపడిపోతాడు. అయితే, హార్దిక్ ఈసారి అలా చేయడం లేదు. అందుకే ముంబై ఇంత త్వరగా తిరిగి రేసులోకి వచ్చింది. అయినా.. వాళ్లకు ఇది అలవాటే. ముంబై ఇండియన్స్ అభిమానిగా ఆ జట్టు విజయపరంపర కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’’ అని సునిల్ గావస్కర్ పేర్కొన్నాడు.ధనాధన్‌కాగా ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఇప్పటికి పన్నెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడు గెలిచింది. పద్నాలుగు పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్న హార్దిక్ సేన.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిచి సగర్వంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది. ఇక హార్దిక్ పాండ్యా వ్యక్తిగత ప్రదర్శన విషయానికొస్తే.. పదకొండు ఇన్నింగ్స్‌లో 158 పరుగులు చేసిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. పదమూడు వికెట్లు కూడా పడగొట్టాడు. మరోవైపు.. పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ 510 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు.చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!

IPL 2025: ఆర్సీబీని గెలిపిస్తాం కదా!.. అంతా కోహ్లి మయం!
టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli)కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ టెండుల్కర్ (100) తర్వాత అత్యధిక శతకాలు బాదిన ఆటగాడిగా కోహ్లి (82) కొనసాగుతున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్-2024 తర్వాత అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ రికార్డుల రారాజు.. ఇటీవలే టెస్టు ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు (Test Retirement) పలికాడు. ప్రస్తుతం ఐపీఎల్‌తో పాటు.. టీమిండియా తరఫున వన్డేల్లోనూ కొనసాగుతున్నాడు కోహ్లి.అంతా కోహ్లి మయం..ఈ క్రమంలో ఇటీవల వ్యక్తిగత పని పూర్తి చేసుకొని తిరిగొస్తుండగా మైదానంలో ఒక అభిమాని ఎందుకు టెస్టులకు రిటైర్మెంట్ తీసుకున్నావని కోహ్లిని అడిగాడు. ఇందుకు స్పందిస్తూ ‘ఆర్సీబీని గెలిపిస్తాం కదా’ అని కోహ్లి జవాబిచ్చాడు. ఈ సీజన్లో బెంగళూరుకు టైటిల్ అందించాలని అతను ఎంత పట్టుదలగా ఉన్నాడో అర్థమవుతుంది. కోహ్లి బ్యాటింగ్‌లోనూ అది కనిపిస్తోంది. ఐపీఎల్-2025 (IPL 2025)లో ఇప్పటికి 11 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 7 అర్ధసెంచరీలతో ఇప్పటికే 505 పరుగులు సాధించిన కోహ్లి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.టెస్టు ఫార్మాట్‌కు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మొదటిసారి కోహ్లి మైదానంలోకి దిగుతుండటంతో అందరి దృష్టీ అతనిపైనే ఉంది. గురువారం అతడి ప్రాక్టీస్ సెషన్ సమయంలో కూడా చిన్నస్వామి స్టేడియంను ఫ్యాన్స్ హోరెత్తించారు. వందల సంఖ్యలో హాజరైన అభిమానులు కోహ్లి ప్రతీ కదలికపై సందడి చేశారు. దాదాపు గంట పాటు అతను నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. కోహ్లి ఉన్నంత సేపూ అతని పేరు తప్ప అక్కడ మరేమీ వినిపించలేదు.భారీ స్థాయిలో స్పందనకోల్‌కతాతో శనివారం జరిగే మ్యాచ్‌లోనూ ఇదే పరిస్థితి ఉండవచ్చు. కోహ్లి టెస్టుల నుంచి రిటైర్ అయిన తర్వాత కొందరు వీరాభిమానులు సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని పంచుకున్నారు. ‘కింగ్’పై తమ అభిమానాన్ని ప్రదర్శిస్తూ, టెస్టు క్రికెటర్‌గా కోహ్లిని గుర్తు చేస్తూ ఐపీఎల్ మ్యాచ్‌కు కూడా తెలుపు రంగు టెస్టు జెర్సీలతో స్టేడియానికి రావాలని పిలుపునిచ్చారు. ఇందుకు భారీ స్థాయిలో స్పందన లభించింది.ఎలాంటి ప్రభావం చూపదుఈ రకంగా చూస్తే శనివారం ఆర్సీబీ రెగ్యులర్ జెర్సీ ‘రెడ్ అండ్ గోల్డ్’లో కాకుండా ‘విరాట్ 18’ వైట్ జెర్సీలే మైదానాన్ని ముంచెత్తవచ్చు. అయితే విరాట్‌పై మైదానం బయటి స్పందనలు, వ్యాఖ్యలు ఎలాంటి ప్రభావం చూపించవని... ఏకాగ్రత చెదరకుండా తనదైన శైలిలో ఎప్పటిలాగే అతను బాగా ఆడి మ్యాచ్‌ను గెలిపించాలనే ఏకైక లక్ష్యంతోనే బరిలోకి దిగుతున్నాడని ఆర్సీబీ డైరెక్టర్ మో బొబాట్ వ్యాఖ్యానించారు. కాగా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారం పాటు వాయిదా పడిన ఐపీఎల్ తాజా ఎడిషన్ శనివారం (మే 17) నుంచి పునః ప్రారంభం కానుంది. ఆర్సీబీ- కోల్‌కతా జట్ల మధ్య జరిగే శనివారం నాటి మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక.ఇదిలా ఉంటే.. కొత్త కెప్టెన్ రజత్ పాటిదార్ సారథ్యంలో ఆర్సీబీ ఈసారి అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న బెంగళూరు జట్టు.. ఎనిమిదింట గెలిచి పదహారు పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. కోల్‌కతాపై తాజా మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!

ఎయిర్ ట్యాక్సీల్లో వేదికలకు రవాణా.. ఇలా ఇదే తొలిసారి
లాస్ ఏంజెలిస్: వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఒలింపిక్స్ క్రీడల్లో ఇప్పటి వరకు ఆటగాళ్లు, ప్రేక్షకులు, వీఐపీలు కార్లు, బస్సుల్లోనే వేదికలకు చేరేవారు. కానీ లాస్ ఏంజెలిస్‌లో 2028లో జరిగే విశ్వక్రీడలు ‘విహంగ విహారానికి’ సిద్ధమవుతున్నాయి. మరో మూడేళ్లలో అమెరికాలోని ప్రఖ్యాత నగరంలో జరిగే ఈ మెగా ఈవెంట్లో ‘ఎయిర్ ట్యాక్సీ’లను వినియోగిస్తామని ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది.ఆటగాళ్లు, వీఐపీలే కాదు... సాధారణ ప్రేక్షకులు సైతం విహంగ విహారం చేస్తూ ఆయా వేదికలకు చేరుకుంటారు. విశ్వక్రీడల్లో ఈ తరహా ఎయిర్ ట్యాక్సీలు నిర్వహించనుండటం చరిత్రలోనే తొలిసారి కానుంది. తద్వారా ఎవరికీ ప్రయాణ బడలిక లేకుండా కేవలం పది నుంచి 20 నిమిషాల్లోపే వేదికలకు చేరవేయవచ్చని నిర్వాహకులు ప్రణాళికలతో ఉన్నారు. సోఫీ స్టేడియం, లాస్ ఏంజెలిస్ మెమోరియల్ కొలిజియం, శాంటా మోనికా, ఆరెంజ్ కౌంటీ, హాలీవుడ్ వేదికలకు ఎయిర్ ట్యాక్సీలను వినియోగించే ఆలోచనతో ఉన్నట్లు ఆర్గనైజింగ్ కమిటీ సీఈఓ ఆడమ్ గోల్డ్‌స్టెయిన్ తెలిపారు. అమెరికా భవిష్య ప్రయాణ ముఖచిత్రాన్నే లాస్ ఏంజెలిస్ విశ్వక్రీడలు మార్చబోతున్నాయని చెప్పారు. ఇదీ చదవండి: ఫైనల్లో అల్కరాజ్రోమ్: స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ తన కెరీర్లో 25వ టోరీ్నలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో అల్కరాజ్ 6–3, 7–6 (7/4)తో లొరెంజో ముసెట్టి (ఇటలీ)పై విజయం సాధించాడు. 2 గంటల 3 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో అల్కరాజ్ ఒక ఏస్ సంధించి, ఐదు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేశాడు. ఈ ఏడాది నాలుగో టోర్నీలో ఫైనల్లోకి ప్రవేశించిన అల్కరాజ్ రెండు టోర్నీల్లో (మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్; రోటర్‌డామ్ ఓపెన్) విజేతగా నిలిచి, బార్సిలోనా ఓపెన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. యానిక్ సినెర్ (ఇటలీ), టామీ పాల్ (అమెరికా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో ఫైనల్లో అల్కరాజ్ తలపడతాడు.
బిజినెస్

ప్రభుత్వం ఆదుకోకుంటే ’దివాలా’నే..
న్యూఢిల్లీ: ప్రభుత్వం నుంచి తమకు సకాలంలో మద్దతు లభించకపోతే ఈ ఆర్థిక సంవత్సరం తర్వాత కార్యకలాపాలను కొనసాగించే పరిస్థితి ఉండదని టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్) వెల్లడించింది. ప్రభుత్వ మద్దతు, బ్యాంకుల నుంచి రుణాలు లభించక, పెట్టుబడులు పెట్టలేక, తమ సంస్థ (దివాలా పరిష్కార ప్రక్రియ కోసం) నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను (ఎన్సీఎల్టీ) ఆశ్రయించాల్సి వస్తుందని పేర్కొంది.అలాంటి పరిస్థితే వస్తే స్వల్ప వ్యవధికైనా సర్వీసుల్లో అంతరాయం ఏర్పడిన పక్షంలో నెట్వర్క్, స్పెక్ట్రం అసెట్స్ విలువ పడిపోతుందని టెలికం శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో వీఐఎల్ సీఈవో అక్షయ ముంద్రా తెలిపారు. దీని వల్ల 20 కోట్ల మంది యూజర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు.ఈ నేపథ్యంలో ఏజీఆర్ బాకీలు, స్పెక్ట్రం బాకీల కేంద్రం కొంత సహాయం అందించాలని ముంద్రా పేర్కొన్నారు. ప్రభుత్వం సకాలంలో మద్దతునిస్తే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి పొందుతున్న 30,000 మందికి, 60 లక్షల మంది పైగా షేర్హోల్డర్లకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.

సుజుకి యాక్సెస్ కొత్త ఎడిషన్ వచ్చేసింది.. సరికొత్తగా..
సుజుకి ద్విచక్రవాహనాల్లో అత్యధికంగా అమ్ముడయ్యే స్కూటర్ సుజుకి యాక్సెస్ కొత్త ఎడిషన్‌ను ఆ కంపెనీ తాజాగా విడుదల చేసింది. జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి మోటార్ కార్పొరేషన్ కు చెందిన భారత విభాగమైన సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కొత్త వేరియంట్ సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది.సమకాలీన సాంకేతిక పరిజ్ఞానాన్ని, స్టైలిష్ డిజైన్ అంశాలతో మిళితం చేసి సుజుకి యాక్సెస్ స్కూటర్ కొత్త ఎడిషన్‌ను మరింత ఆకర్షణీయంగా రూపొందించారు. బ్లూటూత్ ఎనేబుల్డ్, ఫుల్ కలర్ 4.2 అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కొత్త ఎడిషన్ ముఖ్యమైన ఫీచర్. ఇందులో డిస్ప్లే రైడర్‌కు క్లీనర్ ఇంటర్ఫేస్, మెరుగైన విజిబిలిటీని అందిస్తుంది. సుజుకి రైడ్ కనెక్ట్ ప్లాట్ ఫామ్ ద్వారా స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉంటుంది.కొత్త కలర్కాగా యాక్సిస్ వాహనాలకు ఇప్పటికే ఉన్న కలర్ ఆప్షన్లకు అదనంగా కొత్త ఎడిషన్ "పెర్ల్ మ్యాట్ ఆక్వా సిల్వర్" రంగును పరిచయం చేస్తుంది. మ్యాట్ ఫినిష్ స్కూటర్ కు ఆధునిక, ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. దీంతోపాటు మెటాలిక్ మ్యాట్ బ్లాక్ నెం.2, మెటాలిక్ మ్యాట్ స్టెల్లార్ బ్లూ, పెర్ల్ గ్రేస్ వైట్, సాలిడ్ ఐస్ గ్రీన్ అనే మరో నాలుగు కలర్ షేడ్స్‌లోనూ యాక్సిస్ కొత్త ఎడిషన్ లభిస్తుంది.సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ టీఎఫ్టీ ఎడిషన్ ఇప్పుడు భారతదేశంలోని డీలర్‌షిప్‌లలో రూ .1,01,900 ఎక్స్-షోరూమ్ (ఢిల్లీ) ధరతో లభిస్తుంది. స్మార్ట్ టెక్ ఫీచర్లు, రిఫ్రెష్డ్ కలర్ స్కీమ్ జోడించడంతో కొత్త వేరియంట్ పోటీ 125 సీసీ స్కూటర్ విభాగంలో యాక్సెస్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని కంపెనీ భావిస్తోంది.

ఇన్వెస్టర్లూ.. ఇవిగో కొత్త ఐపీవోలు..
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల కంపెనీ బెల్రైజ్ ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 21న ప్రారంభంకానుంది. 23న ముగియనున్న ఇష్యూకి రూ. 85–90 ధరల శ్రేణిని ప్రకటించింది. ఇష్యూలో భాగంగా రూ. 2,150 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. 20న యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించనుంది.రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 166 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ నిధులలో రూ. 1,618 కోట్లు రుణ చెల్లింపులకు వెచ్చించనుంది. 2024 డిసెంబర్‌కల్లా కంపెనీ రుణ భారం రూ. 2,600 కోట్లుగా నమోదైంది. కంపెనీ ప్రధానంగా ఆటో రంగంలోని సేఫ్టీ క్రిటికల్ సిస్టమ్స్‌ను రూపొందించడంతోపాటు.. ఇత ర ఇంజినీరింగ్ సొల్యూషన్స్ అందిస్తోంది. బొరానా వీవ్స్ టెక్స్టైల్ తయారీ కంపెనీ బొరానా వీవ్స్ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 20న ప్రారంభం కానుంది. 22న ముగియనున్న ఇష్యూకి రూ. 205–216 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూలో భాగంగా 67.08 లక్షల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేయనుంది. తద్వారా రూ. 145 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. 19న యాంకర్ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించనుంది.రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 69 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ నిధులను కొత్త తయారీ యూనిట్ ఫైనాన్స్ వ్యయాలతోపాటు.. వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచి్చంచనుంది. గుజరాత్‌లోని సూరత్ వద్ద ఏర్పాటు చేస్తున్న యూనిట్ ద్వారా గ్రే ఫ్యాబ్రిక్‌ను ఉత్పత్తి చేయనుంది.

హ్యుందాయ్ లాభం డౌన్.. రూ.21 డివిడెండ్
న్యూఢిల్లీ: ఆటో రంగ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 4 శాతం నీరసించి రూ. 1,614 కోట్లకు పరిమితమైంది. దేశీ అమ్మకాలు మందగించడం ప్రభావం చూపింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 1,677 కోట్లు ఆర్జించింది.వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 21 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది. మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 17,671 కోట్ల నుంచి రూ. 17,940 కోట్లకు బలపడింది. ఈ కాలంలో దేశీయంగా 1,53,550 వాహనాలను విక్రయించింది. 2023–24 క్యూ4లో రూ. 1,60,317 యూనిట్ల అమ్మకాలు సాధించింది. అయితే ఎగుమతులు 33,400 యూనిట్ల నుంచి 38,100 వాహనాలకు జంప్ చేశాయి.పూర్తి ఏడాదికి మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి హ్యుందాయ్ ఇండియా కన్సాలిడేటెడ్ నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 5,640 కోట్లను తాకింది. 2023–24లో రూ. 6,060 కోట్ల లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 69,829 కోట్ల నుంచి రూ. 69,193 కోట్లకు స్వల్పంగా తగ్గింది. దేశీ అమ్మకాలు 6,14,721 యూనిట్ల నుంచి 5,98,666 యూనిట్లకు వెనకడుగు వేశాయి. ఎగుమతులు నామమాత్ర వృద్ధితో 1,63,386 యూనిట్లకు చేరాయి. 2030కల్లా 20 ఐసీఈ, 6 ఈవీలతో కలిపి 26 కొత్త ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ ఎండీ అన్సూ కిమ్ పేర్కొన్నారు.వీటిలో 8 మోడళ్లు 2027కల్లా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది(2025–26) రూ. 7,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించనున్నట్లు కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ తెలియజేశారు. వీటిలో 40 శాతాన్ని పుణేలో ఏర్పాటు చేస్తున్న ప్లాంటుపై వెచ్చించనున్నట్లు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో హ్యుందాయ్ షేరు 1.3 శాతం లాభంతో రూ. 1,860 వద్ద ముగిసింది.
ఫ్యామిలీ

వెండి గాజుల కోసం.. తల్లి చితిపై పడుకుని..కొడుకు కాదు!
డబ్బుకోసం ఎంత నీచానికైగా దిగజారిపోతున్నాడు మనిషి. తప్పు చేస్తున్నామన్న భయం, పాపభీతి, ఆందోళన ఇలాంటివన్నీ కనుమరుగై పోతున్నాయి. అందుకే మాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు అనిఅంటూ ఏనాడో ఆవేదన వ్యక్తం చేశాడు కవి అందెశ్రీ. కనీస మానవ విలువల్ని మంట గలుపుతూ కన్న బిడ్డలే తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు ఇటీవల కోకొల్లలుగా చూస్తున్నాం. చనిపోయిన తరువాత కూడా తల్లి నగలకోసం ఒక కొడుకు అతి హీనంగా ప్రవర్తించిన ఉదంతం నెట్టింట హృదయ విదారకంగా నిలిచింది. జైపూర్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వెండి ఆభరణాల కోసం తన సొంత తల్లి దహన సంస్కారాలను అడ్డుకున్నాడో కొడుకు. అవి తనకు దక్కేదాకా అంత్యక్రియలు జరిగేదే లేదంటూ నానా యాగీ చేశాడు. చివరికి ఆమె చితిపై పడుకుని, నన్ను కూడా తగలబెట్టండి అంటూ గొడవ చేశాడు. దీంతో ఆమె అంతిమ సంస్కార కార్యక్రమాలు రెండు గంటలు నిలిచిపోయాయి. ఈ సంఘటన జైపూర్ గ్రామీణ ప్రాంతంలోని విరాట్‌నగర్ ప్రాంతంలో జరిగింది. దీన్ని అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.ఈ నెల 3న, 80 ఏళ్ల వృద్ధురాలు కన్నుమూసింది. ఆమె కుమారులు, బంధువులు ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం సమీపంలోని శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. మృతురాలిని చితిపై ఉంచే ముందు, కుటుంబ పెద్దలు ఆమె వెండి గాజులు ,ఇతర ఆభరణాలను ఆమె పెద్ద కుమారుడు గిర్ధారి లాల్ కు అప్పగించారు.ఆమె బ్రతికి ఉన్నప్పుడు పెద్ద కుమారుడే ఆమెను జాగ్రత్తగా చూసుకున్నాడు. అంత్యక్రియలకు సన్నాహాలు జరుగుతుండగాచిన్న కుమారుడు ఓంప్రకాష్ వాగ్వాదానికి దిగాడు. చితిపై పడుకుని, వెండి గాజులు ఇవ్వకపోతే దహన సంస్కారాలు కొనసాగించడానికి వీల్లేదంటూ పట్టుబట్టాడు. कलियुग का कलंक... चांदी के कड़े के लिए बेटे ने माँ का अंतिम संस्कार रोक दिया!'माँ' के लिए जहाँ प्रेम और त्याग की मिसालें दी जाती हैं, वहीं जयपुर के विराटनगर से एक घटना सामने आई है जिसने रिश्तों की मर्यादा को झकझोर दिया. 80 वर्षीय महिला के निधन के बाद, जब शव को चिता पर रखा जा… pic.twitter.com/E51YseAgSi— AajTak (@aajtak) May 16, 2025y"> బంధువులు , గ్రామస్తులు అతనికి నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. అయినా వినలేదు పైగా తనను తాను దహనం చేసుకుంటానని బెదిరించాడు. చివరికి, చిర్రెత్తుకొచ్చిన స్థానికులు అతన్ని బలవంతంగా చితిరి దూరంగా లాగి కార్యక్రమాన్ని పూర్తిచేశారు. అయినా అతగాడు పక్కనే కూర్చుని తన నిరసనను కొనసాగించాడు. గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం, ఓంప్రకాష్ , అతని సోదరుల మధ్య చాలా కాలంగా ఆస్తి వివాదం ఉంది

'వాటర్ బర్త్' అంటే..? నటి కల్కి కోచ్లిన్ ప్రసవ అనుభవం..
ఇటీవల కాలంలో సీజేరియన్ డెలివరీల కంటే..నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యత ఇస్తున్నారు పలువురు మహిళలు, సెలబ్రిటీలు. ఆ దిశగా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకుని మరీ ప్రసవిస్తున్నారు. అయితే ఇటీవల ఎక్కువగా ట్రెండ్ అవుతోంది 'వాటర్ బర్త్'. చాలామంది ప్రముఖులు, సెలబ్రిటీలు దీని గురించే సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు బాలీవుడ్ నటి కల్కి కోచ్లిన్. అంతేగాదు ఈ నీటి ప్రసవం గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పొకొచ్చారామె. ఇంతకీ ఏంటా ప్రసవం.. ? అందరూ దీన్ని ఎంచుకోవచ్చా..? తదితర విషయాలు గురించి తెలుసుకుందామా..కల్కి కొచ్లిన్ ఫ్రెంచ్ దేశానికి చెందిన బాలీవుడ్ నటి. తన విలక్షణమైన నటనతో ఎన్నో అవార్డులు, సత్కారాలు పొందిన నటి. ఆమె పియానిస్ట్ గయ్‌ని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె అందరిలాంటి నార్మల్ డెలివరీ కాకుండా..నీటి ప్రసవాన్ని ఎంచుకుంది. సంప్రదాయ నార్మల్ డెలివరీలలో ఇది కూడా ఒకటి. బిడ్డను స్వాగతించడానికి ఈ పద్ధతి అద్బుతమైనదని అంటోంది నటి కల్కి. శరీరానికి చాలా సులభమైన ప్రక్రియని చెబుతోందామె. కానీ భారతీయ మహిళలు దీన్ని ఎందుకు ఎంచుకురో తెలియడం లేదన్నారు. బహుశా ఇది ఖర్చుతో కూడిన ప్రక్రియనే ఉద్దేశ్యంతో కావొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారామె. ఇటీవల అలీనా డిసెక్ట్స్తో జరిగిన సంభాషణలో నటి కల్కి ఈ విషయాలు వెల్లడించారు. ఇదేమి ఆశ్చర్యపోవాల్సిన ప్రవాస ప్రక్రియ కాదంటున్నారామె. శిశువు అల్రెడీ ఉమ్మనీరులో ఉంటుంది కాబట్టి ఇలా నీటిలో ప్రసవిస్తే శిశువుకి మరింత సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు కల్కి. ఆస్పత్రిలో కూడా అందుకు సంబంధించిన సౌకర్యాలు ఉన్నాయని చెబుతోంది కల్కి. సహజ సిద్ధమైన కాన్పులలో ఇది ఒకటని..ఇటీవలే నెమ్మదిగా వెలుగులోకి వస్తోందని చెబుతున్నారామె. ముఖ్యంగా తనలాంటి సెలబ్రిటీల అనుభవాలతోనే ప్రజలకు తెలుస్తోందని చెబుతోంది. అసలేంటి ప్రసవం..వాటర్ బర్త్ అంటే ..సింపుల్‌గా చెప్పాలంటే..వాటర్ బర్త్ అంటే.. ఒక రకమైన ప్రసవం. దీనిలో కాబోయే తల్లి డెలివరీ టైంలో ప్రవహించే కొలను లేదా వెచ్చని నీటి తొట్టిలో గడుపుతారు. అలా విశ్రాంతి తీసుకున్నప్పుడూ..డెలివరీ సంక్లిష్టంగా కాకుండా సులభంగా అయిపోతుంది. సాధారణ ప్రసవంతో పోలిస్తే..ఈ ప్రసవం చాలా సౌకర్యవంతగంగా, తేలికపాటి కష్టంతో కూడుకున్నదని చెబుతున్నారు వైద్యులు. ఇది ఎందుకు ప్రజాదరణ పొందుతోందంటే..తల్లి శరీర బరువుని తగ్గించి స్వేచ్ఛగా కదలడానికి అనుమతిస్తుంది. అలాగే సమర్ధవంతమైన గర్భాశయ సంకోచాలను ప్రోత్సహిస్తుంది. పైగా రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఫలితంగా గర్భాశయ కండరాలు తక్కువ నొప్పితోనే ప్రసవం అయ్యేలా చేస్తాయి. అలాగే శిశువుకి మంచి ఆక్సిజన్ కూడా అందుతుందట. అంతేగాదు డెలివరీ టైంలో ఉండే ఆందోళన కూడా నీటిలో మునిగి ఉండటం వల్ల తగ్గుతుందట. ఒత్తిడికి సంబధించిన హార్మోన్లు తగ్గించి..నొప్పులు వచ్చేలా ఎండార్ఫిన్లు విడుదలయ్యేలా వీలు కల్పిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల నీటిలో తక్కువ పురిట నొప్పులతోనే ప్రసవం సులభంగా అయిపోతుందట.అందరూ ఈ ప్రక్రియ ఎంచుకోవచ్చా.?క్రిటికల్ కానీ గర్భణిలు మాత్రమే ఈ పద్ధతిని ఎంచుకోగలరని చెబుతున్నారు నిపుణులు. అలాగే పిండం 37 నుండి 41 వారాల మధ్య ఉంటేనే ఈ పద్ధతికి అనుమతిస్తారట. అలాగే తల్లిలో అమ్నియోటిక్ ద్రవం(ఉమ్మనీరు) తగిన మోతాదులో ఉండాలని చెబుతున్నారు. అలాగే నెలలు నిండక ముందు అయ్యే కాన్పులకు ఈ పద్ధతి పనికిరాదని చెబుతున్నారు. అదీగాక గతంలో సీజేరియన్ అయ్యిన మహిళలు కూడా ఈ ప్రక్రియని ఎంచుకోకూడదని వెల్లడించారు నిపుణులు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 'టీ బ్యాగులు' తింటే ఏమవుతుందో తెలుసా..!)

హ్యాట్సాఫ్.. పోలీస్.. ఇంట్రస్టింగ్ స్టోరీ
అబిడ్స్: కుటుంబ కలహాలతో కలత చెందిన ఓ వైద్యురాలు హైదరాబాద్ ఉమెన్ పోలీస్ డీసీపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ డీసీపీ లావణ్య జాదవ్‌ను కలిసి తన సమస్యను వివరించగా ఆమెను షాహినాయత్‌గంజ్‌లోని సౌత్‌వెస్ట్ జోన్ మహిళా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. అక్కడికి వచ్చిన వెంటనే ఆమె మహిళా పోలీసులు, ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసరావులను కలిసి తన వివరాలను చెప్పారు. వెంటనే వారు డాక్టర్ ఆయేషా ఫిర్యాదు చేసిన వ్యక్తిపై కేసును నమోదు చేసి కోర్టులో ఛార్జీషీట్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆయేషా మాట్లాడుతూ.. హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ పోలీసులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వారితో మర్యాదగా మాట్లాడడం, వారికి కౌన్సిలింగ్, సలహాలు ఇవ్వడం ఎంతో ధైర్యాన్ని ఇచి్చందన్నారు. తాను ఎంతో భయంగా మహిళా పోలీస్స్టేన్కు వచ్చానని కానీ ఇక్కడ పోలీసులు ఎంతో మర్యాదగా తన కేసును తీసుకొని పరిష్కారం దిశగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తనకేసు కాకుండా మిగతా మహిళల కేసులు కూడా పరిష్కారమే దిశగా ప్రయత్నిస్తున్నారని అందరికి మర్యాదనిస్తూ వారిలోని భయాన్ని దూరం చేస్తున్నారని తెలిపారు. చదవండి: Cannes Film Festival 2025: కాన్స్‌లో మెరిసిన 17 ఏళ్ల యువతార, బాలీవుడ్ అగ్ర హీరోయిన్లను..!ప్రతి ఒక్క మహిళా ధైర్యంగా తనకు జరుగుతున్న అన్యాయాన్ని మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చునని భరోసా కలిగిందన్నారు. హైదరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావును కలిసి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్

బిగ్ బాస్ విన్నర్ లివర్‌లో టెన్నిస్ బాల్ అంత కణితి : వైరల్ పోస్ట్
ప్రముఖ టీవీ నటి,బాగ్ బాస్ 12 విన్నర్ దీపిక కాకర్ (Dipika Kakar), తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఆమె భర్త సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన భార్య ఆరోగ్యం కోసం ప్రార్థించాల్సిందిగా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. అసలు దీపిక కాకర్‌కు ఏమైంది?దీపిక కాకర్ టెలివిజన్ పరిశ్రమలో అత్యంత ప్రియమైన నటీమణులలో ఒకరు.ససురాల్ సిమర్ కా , కహాం హమ్ కహాం తుమ్‌లాంటి షోల పాత్రల్లోని నటనతో పాపులర్ అయింది. ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ నటిగా నిలిచింది. టీవీ నటిగా వచ్చిన పాపులారిటీతోనే 2018లో హిందీ బిగ్ బాస్ 12 రియాలిటీ షోలో విన్నర్‌గా నిలిచింది. తాజాగా దీపిక కాకర్‌ను లివర్‌లో పెద్ద ట్యూమర్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీన్ని తొలగించేందుకు వైద్యులు త్వరలోనే ఆపరేషన్ చేయనున్నారు. ఈ విషయాన్ని నటుడు, దీపిక భర్త షోయబ్ ఇబ్రహీం ఒక వ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అయితే అదృష్టవశాత్తూ అది ట్యూమర్ కాదని తెలిపాడు. దీపిక ఇటీవల కడుపునొప్పితో బాధపడిందని, మొదట్లో అది మామూలు కడుపు నొప్పే అనుకున్నారు. యాంటీబయాటిక్స్ తీసుకున్న తర్వాత అది తగ్గింది. కానీ మళ్లీ నొప్పి రావడంతో వైద్య పరీక్షలు చేయించగా ట్యూమర్ ఉన్నట్టు తేలింది. కాలేయంలోని ఎడమ లోబ్‌లో చాలా దాదాపు టెన్నిస్ బంతి అంత కణిడి తున్నట్టు సీటీ స్కాన్ ద్వారా గుర్తించారు షోయబ్ పోస్ట్‌లో అభిమానులతో షేర్ చేశారు. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. కెరీర్‌కు దూరంగా కెరీర్ పీక్‌లో ఉండగానే భర్త, ఫ్యామిలీకోసం పరిశ్రమకు దూరమైంది. పెళ్లికి ముందు చదువు పూర్తికాగానే, దీపిక కాకర్ మూడు సంవత్సరాలు విమాన సహాయకురాలిగా పనిచేసింది. 2010లో, నీర్ భరే తేరే నైనా అనే షోతో టెలివిజన్‌లోకి అడుగుపెట్టింది. అలా దాదాపు ఆరేళ్లు టీవీలో ప్రదర్శితమైన ససురల్ సిమర్ కాలో ఆమె 'సిమర్' పాత్ర ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. టెలివిజన్ ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది. దీపిక ఎపిసోడ్‌కు రూ. 70వేలు వసూలు చేసేదంటే ఆమె క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు.మొదటి భర్తకు విడాకులు, రెండో పెళ్లి2011లో దీపికా కాకర్ రౌనక్ సామ్సన్ను వివాహం అయింది. విభేదాల కారణంగా 2015లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ససురాల్ సిమర్ కా సమయంలో, దీపిక షోయబ్ ఇబ్రహీంతో పరిచయం ప్రేమగా మారింది. తెరపై అందరినీ ఆశ్చర్యపరిచిన వీరి కెమిస్ట్రీ నిజజీవితంలోనూ బాగా పండింది. ముఖ్యంగా మొదటి భర్తతో విడాకుల సమయంలో షోయబ్ దీపికకు సపోర్ట్‌గా నిలిచాడు. 2018లో మాతం మారి, తన పేరును ఫైజాగా మార్చుకుని మరీ షోయబ్ ఇబ్రహీని వివాహం చేసుకుంది. 2023లో, ఈ జంట తమ మగబిడ్డ ( రుహాన్ )కు జన్మనిచ్చింది.2019లో, దీపిక ‘కహాం హమ్ కహాం తుమ్’ అనే షోలో నటించింది, కానీ ఆ షో ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇక కుమారుడు రుహాన్ పుట్టిన తర్వాత దీపిక తన కెరీర్‌ను విడిచిపెట్టి, కొడుకు శ్రద్ధ పెట్టాలని నిర్ణయించుకుంది. మాస్టర్ చెఫ్ ఇండియాలో పాల్గొంది కానీ భుజం గాయం కారణంగా షోను మధ్యలోనే వదిలేసింది. 2011 - 2018 వరకు అత్యధిక పారితోషికం తీసుకున్న దీపిక నికర విలువ రూ. 40 - రూ. 45 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
ఫొటోలు
అంతర్జాతీయం

మేపలేక ‘తెల్ల ఏనుగు’.. ట్రంప్ ముఖాన డంప్!
ప్రపంచంలో సొంతంగా అతి పెద్ద ప్రైవేట్ జెట్స్ శ్రేణి కలిగిన యజమానుల్లో ఖతార్ రాజకుటుంబం ఒకటి. తమకు ఆర్థిక భారంగా పరిణమించిన కొన్ని భారీ విమానాలను అది తాపీగా వదిలించుకుంటోంది. ప్రయోజనం లేని, నిర్వహణ భారం మితిమీరిన ‘తెల్ల ఏనుగు’ లాంటి తమ ‘బోయింగ్ 747 జంబో’ను అచ్చం రాజకుటుంబం లాగే పోషించగల డొనాల్డ్ ట్రంప్ లాంటి సరైన వ్యక్తిని ఖతార్ రాజకుటుంబం ఎట్టకేలకు పట్టుకోగలిగింది!. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి లబ్ధి పొందడానికే ఖతార్ అత్యంత విలాసవంతమైన విమానాన్ని ఆయనకు బహుమతిగా ఇస్తోందని ఊహాగానాలు వినిపించినా ఈ వ్యవహారం వెనక అసలు కారణం.. ఖతార్ రాజవంశీయులకు ఆ విమానంతో అవసరం తీరిపోవడం!. నిజానికి వారు 2020లోనే ఆ విమానాన్ని అమ్మకానికి పెట్టారు. కానీ, కొనుగోలుదారు దొరక్క విక్రయంలో విఫలమయ్యారు. తమకు అవసరం లేని ఆ ‘చెత్త’ విమానాన్ని ఇప్పుడు ట్రంప్ ముఖాన ‘డంప్’ చేస్తున్నారు కనుక వారికి నిర్వహణ ఖర్చులు, స్టోరేజి వ్యయం బాగానే తగ్గుతాయని వైమానికరంగ నిపుణులు అంటున్నారు. ‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’ అన్నట్టు.. అలా అటు ఖతార్ రాజకుటుంబానికి ఖర్చూ తగ్గింది, ఇటు ట్రంప్ కూడా ఫ్రీ గిఫ్టుతో ఉబ్పితబ్బిబ్బవుతున్నారు. మొత్తానికి ఖతార్ ఒక బోయింగ్ 747 జంబో పీడను ఇలా వదిలించుకుంది.ఇంకా ఇలాంటివే మరో రెండు విమానాలు దాని దగ్గరున్నాయి. పరిమాణంలో పెద్దవైన, సుందరంగా అలంకరించిన, వాడకపోయినా నిరంతరం సరైన స్థితిలో (కండిషన్లో) ఉంచాల్సిన, ఇంధనం విపరీతంగా తాగే, పూర్తిగా వ్యక్తిగత అవసరాలకు ఉద్దేశించిన ఇలాంటి విమానాలకు డిమాండ్ పడిపోయిందని తాజా ఉదంతం చాటుతోంది. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం ఈ విమానాలను కొనేవారు లేరు. అందుకే రాజకుటుంబాలు, ఆయా దేశాల ప్రభుత్వాలు దశాబ్ద కాలంగా ఈ ‘తెల్ల ఏనుగు’లను వదిలించుకునే పనిలో ఉన్నాయి.Qatar gifted this Boeing 747 Jumbo Jet to the US defence department during the visit of Presidnet Donald Trump. pic.twitter.com/d5ad0k2Q0M— Aftab Chaudhry (@AftabCh81) May 15, 2025ఇతర ఆధునిక దేశాల మాదిరిగానే ఖతార్ కూడా ప్రస్తుతం నాజూకైన, బహుళ ప్రయోజనకర, ఆర్థిక అంశాలు కలిసొచ్చే, అధికారిక ప్రయాణాలకు అనువుగా ఉండే విమానాల వైపు మొగ్గు చూపుతోందని దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఏవియేషన్ కన్సల్టింగ్ సంస్థ ‘బీఏఏ & పార్టనర్స్’ మేనేజింగ్ డైరెక్టర్ లైనస్ బాయర్ ‘ఫోర్బ్స్’కు వెల్లడించారు. అమెరికా అధ్యక్షుడికి బోయింగ్ 747-8 విమానాన్ని ఖతార్ అప్పగించడాన్ని ఓ ‘సృజనాత్మక పరిష్కార వ్యూహం’గా, ‘ఆకాశంలో పోటాపోటీ బలప్రదర్శన అనే గతించిన నమూనాకు వీడ్కోలు’గా బాయర్ అభివర్ణించారు.అంతా ‘ఆయిల్ అండ్ గ్యాస్’ మహిమ!సౌదీ అరేబియా పక్కనే పర్షియన్ సింధుశాఖలో సుమారుగా అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్ర భూభాగం సైజులో ఉంటుంది ఖతార్ ద్వీపకల్పం. చమురు, సహజ వాయువు నిక్షేపాలు తెచ్చిపెట్టిన సంపద ఈ దేశాన్ని తలసరి జీడీపీ పరంగా ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలబెట్టింది. అటు ఖతార్ పాలకులనూ ఆగర్భ శ్రీమంతులను చేసింది. అలా ఖతార్ ఎమిర్ తమిమ్ బిన్ హమద్ అల్ థాని కుటుంబం సిరి సంపదలతో అలరారుతోంది. దీంతో దాదాపు డజను ఎయిర్ బస్, బోయింగ్ విమానాల శ్రేణిని థాని కుటుంబం సమకూర్చుకుంది. కొద్దిమంది వ్యక్తులు విలాసవంతమైన ప్రయాణాలు చేయడానికి వీలుగా ఆ విమానాలకు మార్పులు చేయించారు.ఇవి కాకుండా రాజ కుటుంబానికి చిన్నపాటి బంబార్డియర్, డసాల్ట్ బిజినెస్ జెట్స్ ఎలాగూ ఉన్నాయి. ట్రంప్ కు బహూకరించిన 747 విమానం తోకపై ‘ఏ7-హెచ్బీజే’ (A7-HBJ) అని ఉంటుంది. 2007 నుంచి 2013 వరకు ఖతార్ ప్రధానమంత్రిగా వ్యవహరించిన హమద్ బిన్ జసిమ్ బిన్ జబర్ అల్ థాని పేరులోని తొలి మూడు పదాల ప్రధమ అక్షరాలను ‘హెచ్బీజే’ (HBJ) స్ఫురింపజేస్తుంది.ప్రస్తుతం ఖతార్ ‘రాజ’ విమానాల శ్రేణిలో ఉన్న మూడు 747-8 విమానాల్లో ఈ విమానం ఒకటి. ‘ఖతార్ అమీరీ ఫ్లైట్’ సంస్థ దీని నిర్వహణను చూస్తోంది. 13 ఏళ్ల కిందట 2012లో కొనుగోలు చేసినప్పుడు ఈ విమానం ఖరీదు 367 మిలియన్ డాలర్లు. అంటే రూ.3,130 కోట్లు. కొన్న తర్వాత మూడేళ్లపాటు వందల కోట్లు కుమ్మరించి విమానం లోపలి స్వరూపాన్ని (ఇంటీరియర్) సుందరంగా తీర్చిదిద్దారు. సాధారణ బోయింగ్ 747-8 విమానంలో 467 మంది ప్రయాణించవచ్చు. కానీ ‘ఎగిరే ప్యాలెస్’గా అభివర్ణిస్తున్న ‘హెచ్బీజే’లో 89 మంది మాత్రమే ప్రయాణించేలా మార్పులు చేసి హంగులు అద్దారు. రెండు పడక గదులు, వినోద గది, సమావేశ గదులు అందులో ఉన్నాయి.ఎగిరితే గంటకు రూ.20 లక్షల ఖర్చు!బోయింగ్ తయారుచేసే 747 సిరీస్ విమానాలు 1970 నుంచి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. వైమానిక దూర ప్రయాణాలను అవి ఎక్కువ మందికి అందుబాటులోకి తెచ్చాయి. అయితే పెరుగుతున్న ఇంధనం ధర ఆకాశవీధిలో ఈ నాలుగు భారీ ఇంజిన్ల విమానం ప్రయాణాన్ని వ్యయభరితంగా మార్చింది. ‘కార్పొరేట్ జెట్ ఇన్వెస్టర్’ అంచనా ప్రకారం 747-8 వీఐపీ వెర్షన్ విమానాన్ని ఆపరేట్ చేయడానికి గంటకు 23 వేల డాలర్లు (రూ.20 లక్షలు) ఖర్చవుతుంది. వ్యయభారం తట్టుకోలేక గత దశాబ్ద కాలంగా పలు విమానయాన సంస్థలు బోయింగ్ 747, నాలుగు ఇంజిన్ల ఎయిర్ బస్ ఏ340 విమానాలను సేవల నుంచి తప్పిస్తున్నాయి. వీటి బదులుగా రెండు ఇంజిన్లు గల వెడల్పాటి బోయింగ్ 787, ఎయిర్ బస్ ఏ350 విమానాలపై ఆధారపడుతున్నాయి. నాలుగు ఇంజిన్ల 747 సిరీస్ విమానాలు ఇంధనాన్ని విపరీతంగా తాగుతాయి!.ఈ ‘ఎగిరే భవనాలు’ను ఒక్క ఖతారే కాదు.. సౌదీ అరేబియా, బ్రూనై, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జర్మనీ కూడా క్రమంగా వదిలించుకుంటున్నాయి. తక్కువ ఇంధన సామర్థ్యం అటుంచి పెద్ద విమానాలతో భద్రతాపరమైన సమస్యలున్నాయని, వాటిని పెద్ద లక్ష్యాలుగా ఎంచుకునే ప్రమాదం ఉందని ఏరోడైనమిక్ అడ్వైజరీ మేనేజింగ్ డైరెక్టర్ రిచర్డ్ అబౌలాఫియా చెప్పారు. పెద్ద విమానాలు దిగాలంటే పొడవైన రన్ వేలు కావాలని, దాంతో ఆ విమానాల వినియోగం పరిమితమేనని వివరించారు. సన్నటి విమానాలకైతే చాలా ఎయిర్ పోర్టులు, సంప్రదాయ బిజినెస్ జెట్స్ అయితే మరిన్ని విమానాశ్రాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. 2020లో మార్కెట్లో అమ్మకానికి పెట్టడానికి ముందు ఐదేళ్లలో ఖతారీ విమానం ప్రయాణించింది మొత్తం కలిపి 1,059 గంటలే.ఇక ఖతార్ దగ్గరున్న మిగతా రెండు వీఐపీ 747-8 విమానాల్లో ఒకదాన్ని పూర్తిగా క్రియాశీల సేవల తప్పించారని లైనస్ బాయర్ తెలిపారు. 2018లో ఖతార్ ఇలాంటి 747-8 విమానాన్నే తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ కు కూడా ఇచ్చింది. మరో పాత 747-ఎస్పీ విమానాన్ని ఓ అసెట్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పగించగా దాన్ని ఆ సంస్థ స్టోరేజికి తరలించింది. ఇలాంటి ఉదాహరణలు బోలెడు. సౌదీ యువరాజు సుల్తాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సాద్ 2011లో మరణించాడు. అతడి మరణానికి ముందు ఓ విలాసవంతమైన 747-8 విమానాన్ని అతడి కోసం సేవల్లోకి తీసుకున్నారు. కేవలం 42 గంటలే ప్రయాణించిన ఆ విమానాన్ని చివరికి 2022లో తుక్కు కింద ముక్కలు చేశారు. ప్రస్తుతం సౌదీలో రాజకుటుంబ ఉపయోగంలో ఉన్న 747 విమానాల శ్రేణిని ఒకే ఒక విమానానికి కుదించారు. సౌదీ యువరాజు మఃహమ్మద్ బిన్ సాల్మన్ ప్రస్తుతం బోయింగ్ 737, 787-8 వంటి చిన్న విమానాలు వినియోగిస్తున్నారు.అయితే లోపల ఖాళీ ప్రదేశం అధికం కనుక బోయింగ్ 747-8లకు సరకు రవాణా (కార్గో) రంగంలో మంచి డిమాండ్ ఉంది. 2023లో కర్మాగారం నుంచి బయటికొచ్చిన చివరి 747-8తో కలిపి బోయింగ్ ఇప్పటివరకు మొత్తం 155 విమానాలను విక్రయించగా వాటిలో రెండొంతులు సరకు రవాణాలోనే నిమగ్నమయ్యాయి. కేవలం కొద్దిమంది దూర ప్రయాణాల కోసమని స్వరూపం పరంగా, యాంత్రికంగా, కస్టమ్ ఇంటీరియర్స్ పరంగా మార్పులు చేసిన ఖతారీ 747-8 విమానాలను కార్గో విమానాల రూపంలోకి తేవడం కష్టమని బాయర్ అభిప్రాయం వెలిబుచ్చారు. ఇక బహుమతిగా ట్రంప్ స్వీకరిస్తున్న ఖతార్ విమానాన్ని పరికిస్తే... భద్రతపరమైన నిబంధనలను సడలిస్తే తప్ప... ఆ విమానాన్ని విడదీసి పునర్నిర్మించడానికి కనీసం ఐదేళ్లు పడుతుందని రిచర్డ్ అబౌలాఫియా అంచనా. అంటే అప్పటికి అధ్యక్షుడిగా ట్రంప్ రెండో విడత పుణ్యకాలం... ఆ విమానంలో తిరగాలనే ఆయన బులపాటం తీరకుండానే ముగిసిపోతుంది! - జమ్ముల శ్రీకాంత్ Source: Forbes

పాక్ ప్రధాని సంచలన ప్రకటన
ఇస్లామాబాద్: భారత్ శక్తి, సామర్థ్యం తెలుసుకున్న పాకిస్తాన్.. చివరకు దిగి వచ్చింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎట్టకేలకు కీలక ప్రకటన చేశారు. భారత్‌తో చర్చలకు పాక్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ మేరకు శాంతి కోసం భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని షరీఫ్ వెల్లడించారు.పాక్‌లోని పంజాబ్ ప్రావిన్సులో కామ్రా వైమానిక స్థావరాన్ని షెహబాజ్ షరీఫ్ సందర్శించారు. అనంతరం, షరీఫ్ పాక్ మీడియాతో మాట్లాడుతూ.. పాకిస్తాన్ శాంతి కోసం సిద్ధంగా ఉంది. అందుకు భారత్‌తో చర్యలకు సిద్ధం. భారత్‌తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నాను. అయితే, కశ్మీర్ అంశం కూడా చర్చల్లో చేర్చాలనేది తమ షరతు అని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగాలని, వాటిని తమ నుంచి విడదీయలేరని భారత్ పదేపదే స్పష్టం చేస్తున్నా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.పాక్ ప్రధాని ప్రకటన చేసిన సమయంలో షెహబాజ్‌తో పాటు ఉప ప్రధాన మంత్రి ఇషాక్ దార్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, వైమానిక దళ అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిద్ధూ అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత్ వైరం వద్దని వారంతా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక.. భారత్, పాకిస్తాన్ యుద్ధం తర్వాత.. పాక్ ప్రధాని షరీఫ్ రక్షణ కేంద్రాన్ని సందర్శించడం ఇది రెండోసారి.Peace and Pakistan, Biggest Joke of the decade 😆“Pakistan's prime minister, Shehbaz Sharif, said on Thursday he was ready to engage in peace talks with India. Prime Minister Shehbaz Sharif extended an offer of talks to India, saying Pakistan is ready to engage "for peace". pic.twitter.com/NHvt1DNqsB— Vaibhav Rathi 🇮🇳 (@Vaibhavrathi05) May 16, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు పాకిస్తాన్ అంశంపై భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కీలక ప్రకటన చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను పాకిస్తాన్ ఎలా ఖాళీ చేయాలనే అంశంపైనైతే ఆ దేశంతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పాకిస్తాన్‌తో కేవలం ద్వైపాక్షిక సంబంధాలే ఉంటాయని, అనేక ఏళ్లుగా దానిపై ఏకాభిప్రాయంతో ఉన్నామని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి ముష్కరులపై చర్యలు చేపట్టాల్సిందేనని ఐరాస భద్రతామండలి కూడా నొక్కిచెప్పిందని, ఆపరేషన్ సిందూర్ ద్వారా ఈ నెల 7న అదే చేశామని పేర్కొన్నారు. ఆపరేషన్‌ను ప్రారంభించడానికి ముందే పాక్‌కు సందేశం పంపించాం. ఉగ్రస్థావరాలపైనే దాడులు చేస్తామని, సైనిక స్థావరాల జోలికి వెళ్లబోమని చెప్పాం. దానిని వారు పెడచెవినపెట్టారు. మనం వారికి ఎంత నష్టం కలిగించామో, వారు ఎంత స్వల్పంగా మనకు నష్టపరిచారో అందరికీ తెలుసు. శాటిలైట్ చిత్రాలే దీనికి సాక్ష్యం. అందుకే నాలుగు రోజుల్లో వారు వైఖరి మార్చుకున్నారు. కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారు అని తెలిపారు. This video explains the extent of damage caused by @IAF_MCC in Pakistan. Pak PM took a dusty road to reach the PAF base. You know why? Watch this. 👇pic.twitter.com/XYQLEWWB0P— Pramod Kumar Singh (@SinghPramod2784) May 15, 2025

పుతిన్ లేకుండానే ఉక్రెయిన్–రష్యా చర్చలు
ఇస్తాంబుల్: తుర్కియే వేదికగా ఉక్రెయిన్‌తో జరిగే మొట్టమొదటిసారిగా జరిగే ప్రత్యక్ష శాంతి చర్చలకు అధ్యక్షుడు పుతిన్ హాజరుకావడం లేదని రష్యా తెలిపింది. అధ్యక్షుడు పుతిన్ సహాయకుడు వ్లాదిమిర్ మెడిన్స్కీ సారథ్యంలోని బృందం గురువారం తుర్కియే రాజధాని అంకారా చేరుకుందని రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా వెల్లడించారు. ముగ్గురు సభ్యులతో కూడిన సీనియర్ అధికారుల బృందానికి సాయంగా నలుగురితో కూడిన నిపుణుల బృందం కూడా ఉందన్నారు. ఉక్రెయిన్‌తో జరిగే చర్చలకు అధ్యక్షుడు పుతిన్ వెళ్లడం లేదన్నారు. మూడేళ్లుగా జరిగే యుద్ధానికి ముగింపు పలికేందుకు తుర్కియేలో జరిగే శాంతి చర్చలకు రావాలని పుతిన్‌కు జెలెన్స్కీ సవాల్ విసిరారు. తాజా పరిణామంపై తుర్కియేలోని అంటాల్యాలో జరుగుతున్న నాటో సమావేశానికి హాజరైన జెలెన్స్కీ మీడియాతో మాట్లాడుతూ.. కీలకమైన విధాన నిర్ణయాలను తీసుకునే అధికారం ఆ బృందంలోని వారెవరికీ లేదని వ్యాఖ్యానించారు. అందుకే చర్చలకు తాను సైతం వెళ్లనని, రక్షణ మంత్రి రుస్తెం ఉమెరోవ్ సారథ్యంలో ప్రతినిధి బృందాన్ని పంపుతానని ప్రకటించారు. తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌తో మాట్లాడాక చర్చల తేదీ, ప్రాంతం వెల్లడిస్తామన్నారు. రష్యాపై ఆంక్షలను మరింత కఠినతరం చేస్తామన్న యూరప్ నేతల హెచ్చరికలు, ట్రంప్ ఒత్తిడితో పుతిన్ ఈ చర్చలకు హాజరయ్యే అవకాశముందని సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. చివరికి ఇరుదేశాల అధ్యక్షులకు బదులుగా ప్రతినిధి బృందాలను పంపడం నిరాశ కలిగించిందని పరిశీలకులు అంటున్నారు. నేను వెళ్లనిదే పుతిన్ రారు తుర్కియేలో జరిగే చర్చలకు పుతిన్ హాజ రు కాకపోవడంపై ఖతార్‌లో పర్యటిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ఈ విషయం తనకు ఆశ్చ ర్యం కలిగించలేదన్నారు. ‘నేను వెళ్లనిదే ఆ యన అక్కడికి రావడం అసాధ్యం’అంటూ పుతిన్ నిర్ణయాన్ని సమరి్ధస్తూ మాట్లాడారు.

ఖాన్‌యూనిస్ వాసులకు కాళరాత్రి
ఖాన్‌యూనిస్: గాజాలోని ఖాన్‌యూనిస్ నగర పాలస్తీనియన్లకు వరుసగా రెండో రోజు రాత్రి కూడా కాళరాత్రే అయ్యింది. ఇజ్రాయెల్ వైమానిక దళాలు బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఖాన్యూనిస్తోపాటు గాజా నగరం, జబాలియాలపై యథేచ్ఛగా సాగించిన వైమానిక దాడుల్లో 59 మంది ప్రాణాలు కోల్పోయారు. నక్బాకు 77 ఏళ్లవుతున్న వేళ ఈ దారుణాలు కొనసాగుతుండటంపై పాలస్తీనియన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఖాన్‌యూనిస్‌పై 10, జబాలియా, చుట్టుపక్కల ప్రాంతాలపై కనీసం 13 భారీ బాంబు దాడులు జరిగినట్లు మీడియా తెలిపింది. మొత్తం 59 చనిపోయారని స్థానిక పౌర రక్షణ దళాలు తెలిపాయి. కొన్ని మృతదేహాలు ఛిద్రమయ్యాయని పేర్కొన్నాయి. సరైన యంత్ర సామగ్రి లేకపోవడంతో శిథిలాల్లో చిక్కుకున్న బాధితులను వెలికి తీయడం కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఖాన్‌యూనిస్‌పై జరిగిన దాడిలో ఖతార్ టీవీ ‘అల్ అరబీ’జర్నలిస్ట్ హసన్ సమౌర్ సహా అతడి కుటుంబంలోని 11 మంది చనిపోయినట్లు సోషల్ మీడియా పేర్కొంది. గాజాపై మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఇజ్రాయెల్ సాగించిన వైమానిక దాడుల్లో సుమారు 25 మంది చిన్నారులు సహా 70 వరకు ప్రాణాలు కోల్పోవడం తెల్సిందే. హమాస్‌ను తుదముట్టించాలన్న తమ మిషన్ మరికొద్ది రోజుల్లోనే పూర్తవనుందని, అప్పటి వరకు దాడులను ఆపేదిలేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ స్పష్టం చేశారు. గాజాతోపాటు వెస్ట్‌బ్యాంక్‌లోని నగరాలు, టుబాస్, నబ్లుస్, బెత్లెహెం, కలండియా, యాబాద్, ఫవ్వర్, అస్కర్ శరణార్థి శిబిరాలపై గురువారం ఉదయం ఇజ్రాయెల్ బలగాలు దాడులు చేపట్టాయి. ఇంటింటి సోదాలు, అరెస్ట్‌లను ముమ్మరం చేశాయి. ‘నక్బా’ ప్రాముఖ్యం ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాలస్తీనియన్లు ఏటా మే 15వ తేదీని నక్బా లేదా జాతి నిర్మూలన దినంగా పాటిస్తారు. పాలస్తీనా భూభాగం నుంచి 1948 మే 14వ తేదీన బ్రిటిష్ బలగాలు వైదొలగాయి. మే 15వ తేదీన ఇజ్రాయెలీలతో కూడిన జియోనిస్ట్ బలగాలు బ్రిటన్ దన్నుతో చారిత్రక పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంక్, గాజా స్ట్రిప్ మినహా 78 శాతం ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాయి. ఇక్కడున్న 7.50 లక్షల పాలస్తీనియన్లను వెళ్లగొట్టి ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాయి. జియోనిస్ట్ మూకల మారణకాండలో 15 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. నగరాలు, పట్టణాలతోపాటు 530 పాలస్తీనా గ్రామాలు ధ్వంసమయ్యాయి. దారుణాలు జరిగిన మే 15ను పాలస్తీనియన్లు ‘నక్బా’గా ఏటా పాటిస్తారు. కూడు, నీడ కోల్పోయిన పాలస్తీనియన్లు గాజా, వెస్ట్ బ్యాంక్‌తోపాటు పొరుగు దేశాలైన సిరియా, లెబనాన్, ఈజిప్టుల్లో ఏర్పాటు చేసిన 58 శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. గాజాలోని 70 శాతం మంది శరణార్థులే. ఇంత సుదీర్ఘకాలంపాటు అపరిష్తృతంగా ఉన్న శరణార్థుల సమస్య ఇదే కావడం గమనార్హం.
జాతీయం

ఆయనపై కేసులున్నాయని మీరెలా చెబుతున్నారు?
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసులు ఉన్నాయని మీరెలా చెబుతారు.. అంటూ సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. క్వార్ట్జ్ ఖనిజం తవ్వకాల కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కాకాణి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం విచారించింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరదాపురం సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి క్వార్ట్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారని, గిరిజనులను బెదిరించారని మైనింగ్ అధికారి బాలాజీనాయక్ ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ఫిబ్రవరి 16న పొదలకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డిని ఏ–4గా చేర్చారు. దీంతో ముందస్తు రక్షణ కల్పించాలని కోరుతూ.. ఆయన మే 13న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఆ పిటిషన్ శుక్రవారం జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అరవింద్ కుమార్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. కాకాణి గోవర్ధన్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ దవే వాదనలు వినిపించారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా పెట్టిన కేసేనని, అందులో ఏ మాత్రం వాస్తవం లేదని కోర్టుకు తెలిపారు. అందుకు ధర్మాసనం.. ‘హైకోర్టు డివిజన్ బెంచ్ వద్దే తేల్చుకోవచ్చు కదా.. దీనికోసం ఇక్కడి వరకు ఎందుకు వచ్చారు.. అని అడిగింది.హైకోర్టు డివిజన్ బెంచ్ కేసును జూన్ 16కు వాయిదా వేసిందని, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించామని దవే బదులిచ్చారు. కాగా.. తనపై గతంలో ఇలాంటి కేసులేవీ నమోదు కాలేదని గోవర్దన్ రెడ్డి కోర్టును తప్పుదారి పట్టించేలా పిటిషన్లో పేర్కొన్నారని ఏపీ ప్రభుత్వం తరఫున ప్రేరణ సింగ్ ధర్మాసనానికి తెలిపారు. ‘ఆయన మీద కేసులు ఉన్నాయని మీరు ఎలా చెబుతున్నారు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. అయినా ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, వాస్తవాలపై స్పష్టత రావాల్సి ఉన్నందున అరెస్టు నుంచి కాకాణికి మినహాయింపు ఇవ్వలేమని ధర్మాసనం తెలిపింది.

కేంద్రం దౌత్యమార్గం
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి దన్నుగా నిలుస్తున్న పాకిస్తాన్ అసలు స్వరూపాన్ని ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్రం దౌత్య మార్గాన్ని ఎంచుకుంది. ఇందులో భాగంగా అఖిలపక్ష నేతల బృందాలను వచ్చే వారం నుంచి వివిధ దేశాలకు పంపించాలని నిర్ణయించింది. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న తేదీన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకోవడం, కేంద్రం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తదితర పరిణామాలను వివరిస్తూ పాక్ వక్రబుద్ధిని విదేశీ ప్రభుత్వాలకు ఈ బృందాలు వివరించనున్నాయి. ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు, సీనియర్ నేతలుంటారు. బృందాలకు కేంద్ర మాజీ మంత్రులు సారథ్యం వహించనున్నారు. ఈ ప్రతిపాదనకు ఇప్పటికే కొన్ని పార్టీలు ఆమోదం తెలిపాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఎన్ని బృందాలుంటాయి, అందులో ఎందుకు సభ్యులుంటారనే దానిపై స్పష్టత రాలేదు. కనీసం 30 మంది ఎంపీలకు భాగస్వామ్యం ఉంటుందని కొందరు నేతలంటున్నారు. బృందాలకు ప్రయాణ ప్రణాళికతోపాటు అవసరమైన సూచనలను విదేశాంగ శాఖ అందించనుంది. ఈ బృందాల్లో బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎన్సీపీ(ఎస్పీ), జేడీయూ, బీజేడీ, శివసేన(యూబీటీ), సీపీఎం తదితర పార్టీల ఎంపీలుండొచ్చని సమాచారం. ఈ నెల 22, 23వ తేదీల్లో బయలు దేరనున్న ఈ బృందాలు 10 రోజుల్లో వివిధ దేశాలకు వెళ్లనున్నాయి. అధికార బీజేపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఒడిశా బీజేపీ ఎంపీ అపరాజిత సారంగితోపాటు కాంగ్రెస్ నుంచి శశి థరూర్ సహా నలుగురు ఎంపీలు ఇందులో ఉంటారు. ఇందులో కాంగ్రెస్ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల బృందం దక్షిణ, వాయవ్య ఆసియాలోని దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ తదితర దేశాలకు వెళ్లనుంది. బారామతి ఎంపీ సుప్రియా సూలే బృందం ఆఫ్రికా, పశ్చిమాసియాలోని ఒమన్, ఈజిప్టు, కెన్యా, దక్షిణాఫ్రికాలకు వెళ్లనుంది. కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం యూరప్ లేదా మధ్యప్రాచ్యానికి వెళ్లే అవకాశముంది. అమెరికా వెళ్లే బృందానికి శశిథరూర్ నాయకత్వం వహిస్తారు. ప్రతి బృందంలో ఏడెనిమిది మంది సభ్యులుంటారు. వీరు నాలుగు నుంచి ఐదు దేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. బృందాలను పంపించడంపై కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ విషయమై కేంద్ర మంత్రి రిజిజు కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో మాట్లాడారని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ వెల్లడించారు.

రక్షణకు మరో రూ.50 వేల కోట్లు!
న్యూఢిల్లీ: అటు ఉగ్రవాదం, ఇటు దాయాది దుస్సాహసాల నేపథ్యంలో రక్షణ కేటాయింపులను మరింత పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా రక్షణ రంగానికి రూ.50 వేల కోట్లు అదనంగా కేటాయించనున్నట్టు సమాచారం. అనుబంధ బడ్జెట్ ద్వారా ఈ మొత్తాన్ని సమకూర్చాలని కేంద్రం ప్రతిపాదించింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఇందుకు ఆమోదముద్ర పడనుందని తెలుస్తోంది. సైనిక బలగాల తక్షణా వసరాలను తీర్చడంతో పాటు పరిశోధనలు, అభివృద్ధి కార్యకలాపాలపై ఈ నిధులను వెచ్చించనున్నారు. ప్రస్తుత బడ్జెట్లో రక్షణ రంగానికి రికార్డు స్థాయిలో రూ.6.81 లక్షల కోట్లు కేటాయించడం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది 9.5 శాతం అదనం. గత పదేళ్లలో రక్షణ బడ్జెట్ దాదాపు మూడింతలైంది.

జరిమానా విధిస్తాం జాగ్రత్త
సాక్షి, న్యూఢిల్లీ: ‘మీ ఇష్టం వచ్చినట్లు ఒకే విషయంపై పదే పదే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే జరిమానా విధించాల్సి ఉంటుంది జాగ్రత్త..’అని గ్రూప్–1 అభ్యర్థులను సుప్రీంకోర్టు హెచ్చరించింది. ‘ఈ విషయమై గతంలోనూ కొందరు కోర్టును ఆశ్రయించారు. పరీక్షలు అయ్యాక దీనిపై వాదనలు అవసరమా అని అప్పుడే మేం ప్రశ్నించాం. ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేశాం. ఇప్పుడు మళ్లీ మీరెందుకు వచ్చారు? మేం డిస్మిస్ చేసిన విషయం మీకు తెలియదా?’అంటూ నిలదీసింది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. అభ్యర్థులు పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకున్నారు, ఆ పిటిషన్ విత్‌డ్రాకు ధర్మాసనం అనుమతి ఇచి్చంది.గ్రూప్–1,2,3 నోటిఫికేషన్లకు సంబంధించిన జీవో 29, జీవో 33ను, పీహెచ్సీ రిజర్వేషన్లు వర్టీకల్గా అమలు చేయడాన్ని సవాల్ చేస్తూ కుమ్మరి ప్రవీణ, మరో 12 మంది 370 పేజీలతో కూడిన రిట్ పిటిషన్‌ను ఏప్రిల్ 30న సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జోమాల్య బగి్చలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎస్.నిరంజన్ రెడ్డి, పిటిషనర్ల తరపున రానా ముఖర్జీ వాదనలు వినిపించారు.గ్రూప్–1 నోటిఫికేషన్ వ్యవహారంలో జీవో 29 రద్దు అంశంపై సుప్రీంకోర్టు ఇప్పటికే విచారణ జరిపి, కొట్టివేసిందని నిరంజన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం అభ్యర్థులపై సీరియస్ అయ్యింది. ‘పిటిషన్లో కొత్తగా ఏం ఉంది? ఒకే అంశంపై ఇంతమంది ఇన్నిసార్లు ఎందుకు? ఇలా చేస్తే జరిమానా విధిస్తాం..’అని హెచ్చరించింది. దీంతో పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని రానా ముఖర్జీ అభ్యర్థించగా ధర్మాసనం అంగీకరించింది.
ఎన్ఆర్ఐ

TANA: ‘ఆంధ్ర బాలానంద సంఘం’ ముచ్చట్లు విజయవంతం
డాలస్, టెక్సస్, అమెరికా: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా “రేడియో అన్నయ్య, అక్కయ్య గార్ల స్మృతిలో – “85 వసంతాల ఆంధ్ర బాలానంద సంఘం ముచ్చట్లు” అనే అంశంపై జరిపిన 79 వ అంతర్జాల అంతర్జాతీయ దృశ్య సమావేశం పెద్దల ప్రసంగాలు, బాలానందం పిల్లల పాటలతో కోలాహలంగా జరిగింది.తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు పాల్గొన్న అతిథులందరికీ స్వాగతం పలుకుతూ, బాలలకోసం ఏర్పడిన ఒక సంస్థ 85 వసంతాలు జరుపుకోవడం వెనుక ఈ సంస్థ స్థాపకులైన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి ఎంతైనా ఉందని అన్నారు.తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “పిల్లలకు పసిప్రాయంలోనే గేయాలు, రూపకాలు, ఆటలు, పాటలతో తెలుగు భాష, సాహిత్యంపట్ల ఆసక్తి కల్గించి, వారిలో క్రమశిక్షణ, మానసిక వికాసం, విజ్ఞానం, సృజనాత్మకత, నాయకత్వ ప్రతిభను కల్గించడంలో ఆకాశవాణిలో కొన్ని దశాబ్దాలపాటు వారం వారం ‘బాలానందం’ కార్యక్రమంతో పిల్లలకు పెద్దపీట వేసిన రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య గార్ల కృషి అజరామరం అన్నారు. పిల్లలకు చిన్నవయస్సులోనే ఇలాంటి విషయాల పట్ల అవగాహన, ఆసక్తినికల్గించి సరైన దిశానిర్దేశం చెయ్యవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నారు. ప్రత్యేక అతిథులుగా పాల్గొన్న శారదా శ్రీనివాసన్ (రేడియో హీరోయిన్, సుప్రసిద్ధ ఆకాశవాణి కళాకారిణి), డా. మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ శాసనసభ్యులు, రేడియో అన్నయ్య, అక్కయ్యగార్లతో ప్రత్యక్ష పరిచయం ఉన్నవారు), పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. కె.ఐ. వరప్రసాదరెడ్డి (బాలానంద కార్యక్రమాలను ఆస్వాదించినవారు), డా. మోహన్ కందా, ఐ.ఎ.ఎస్ (ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదర్శి, బాలానంద సంఘ పూర్వసభ్యులు), జంధ్యాల కామేశ్వరి-పాప (రేడియో అన్నయ్య గారి మేనకోడలు, ఆంధ్ర బాలానంద సంఘం అధ్యక్షులు), కలగా కృష్ణమోహన్ (బాలానందం పూర్వ సభ్యులు, ఆంధ్ర బాలానంద సంఘం ఉపాధ్యక్షులు, ప్రముఖ గీత రచయిత, సంగీత దర్శకులు) బాలానందం కార్యక్రమంతోను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లతో తమకున్న ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలతోపాటు ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకుని వారికి ఘననివాళులర్పించారు. విశిష్టఅతిథులుగా - ఎన్.వి. అశోక్ (విశ్రాంత ఇంజనీర్, ‘బాలానందం’ పూర్వసభ్యులు), రావులపర్తి రాజేశ్వరి (విశ్రాంత బ్యాంకు అధికారి, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),నండూరి సీతా సాయిరాం (విశ్రాంత ఉపాధ్యాయిని, ‘బాలానందం’ పూర్వ సభ్యురాలు),మాడభూషి బద్రినాథ్ (బాలానందం-నృత్య దర్శకులు), డా. ఆవుల హరిత (బాలానందం-కార్యవర్గ సభ్యురాలు), చినముత్తేవి కరుణ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యురాలు), మాలెంపాటి నవ్య (ఐఐటి ఖర్గపూర్, ‘బాలానందం’ సంగీత, నృత్య కళాకారిణి), గోవిందు దేవరాజ (బాలానందం-గాయకబృందం, శిక్షణా విభాగపు కార్యవర్గసభ్యులు) పాల్గొని తమ స్వీయ అనుభవాలను, రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఎంతో దూరదృష్టితో స్థాపించిన ఆంధ్ర బాలానందం సంఘం తమ పిల్లల జీవితాలలో తీసుకువచ్చిన మార్పులను వివరించి వారిరువురికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ - ఒక సంస్థ ఎనిమిదన్నర దశాబ్దాలగా నిరాటంకంగా కొనసాగడం ఒక చరిత్ర అని, ఏ ఆశయంతో రేడియో అన్నయ్య, అక్కయ్య గార్లు ఈ బాలానందం స్థాపించారో, అదే స్ఫూర్తితో ఉత్సాహంగా ఆంధ్ర బాలానంద సంఘం నిర్వహిస్తున్న అధ్యక్షురాలు జంధ్యాల కామేశ్వరి (పాప) వారి కార్యవర్గ సభ్యులకు, ఈ నాటి కార్యక్రమంలో శ్రావ్యంగా పాటలు పాడి ఆనందపరిచిన 25 మందికి పైగా పిల్లలకు, పాల్గొన్న అతిథులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ 6 వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు హాజరయ్యారు. సింగపూర్ లోని తెలుగు వారంతా అన్ని విధాలా సుసంపన్నులని ఈ విధంగా లలిత కళలను ప్రోత్సహించడం ఆనంద దాయకమన్నారు. చిన్నారులు పాడిన పాటలు ఎంతో బాగున్నాయి అని , ఇంత చక్కగా నేర్పిన గురువును నేర్చుకున్న వారి శిష్యులను వారి తల్లిదండ్రులను ప్రశంసించారు. సంగీతం, నాట్యం వంటి కళల ద్వారా మనలో మృదుత్వం కలుగుతుందని, నేటి యాంత్రిక జీవితంలో ఈ మాధ్యమం ఎంతో ముఖ్యం అని కాబట్టి కళల పైన ఉన్న ఆసక్తిని తమ తమ ఆర్థిక సంపాదన రధ చక్రాల కింద పడి నలిగి పోనివ్వవద్దని కోరారు.ఈ కార్యక్రమానికి STS వైస్ ప్రెసిడెంట్ జ్యోతీశ్వర్ , శ్రీ సాంస్కృతిక కలసారథి అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్,TCSS అధ్యక్షులు గడప రమేష్, TAS (మనం తెలుగు ) అసోసియేషన్ అనిత రెడ్డి , కమల క్లబ్ మాజీ అధ్యక్షులు, సారీ కనెక్షన్ అడ్మిన్ పద్మజ నాయుడు , మగువ మనసు అడ్మిన్ వీర మాంగోస్ ఉష , సింగపూర్ తెలుగు టీవి రాధాకృష్ణ గణేశ్న , జయంతి రామ, భాగవత ప్రచార సమితి భాస్కర్ ఊలపల్లి, H& H శ్యామల , విష్ణు ప్రియ , సింగపూర్ తెలుగు వనితలు అడ్మిన్స్ క్రాంతి, దేదీప్య, జయ, ప్రత్యూష , అమ్ములు గ్రూపు నుండి అడ్మిన్ సునీత రామ్, , KCAS దివ్య ఇంకా పలువురు సింగపూర్ తెలుగు కమ్యూనిటీ వ్యవస్థాపకులు హాజరయి అందరూ కలిసి వైస్ ఛాన్స్‌లర్‌ను సన్మానించారు. స్వరలయ ఆర్ట్స్, సింగపూర్ వ్యవస్థాపక అధ్యక్షురాలు యడవల్లి శేషుకుమారి వారి శిష్యులు,స్నేహితులు కీర్తనలను ఆలపించారు. పద్మజ నాయుడు మాట్లాడుతూ శేషు గాన కోకిల అని పొగడగా ఆచార్య నిత్యానందరావు గారు కోకిల ఒక కాలంలో మాత్రమే పాడుతుందని కాని ఈమె 365 రోజులు గానం ఆలపిస్తారు అన్నారు. శ్యామల మాట్లాడుతూ వారి వెంకటేశ్వర గానామృతం కార్యక్రమానికి శేషు కుమారి 70 పాటలు 40 రాగాలలో స్వర పరిచి మూడున్నర గంటల సేపు పాడి అందరినీ అలరించిన వైభవం గుర్తు చేసి ఈ రోజుకి ఆ పాటలు తమ చెవులలో ప్రతి ధ్వనిస్తూ పరవసింప చేస్తాయని ప్రశంసించారు.పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం సర్టిఫికేట్ కోర్సు మొదటి వత్సరం, రెండవ సంవత్సరం పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన స్వరలయ ఆర్ట్స్ విద్యార్థులకు వైస్ ఛాన్స్ లర్ బహుమతి ప్రధానం చేశారు. అతిథులకు మొమెంటోలను బహుకరించారు ఈ నెల ఆరవ తారీఖున స్వరలయ ఆర్ట్స్ వారు నిర్వహించిన త్యాగ రాజ ఆరాధన ఉత్సవాలలో పాల్గొని తమతో కలిసి పంచరత్నాలు పాడిన సౌభాగ్య లక్ష్మి తంగిరాల, షర్మిల చిత్రాడ, సౌమ్య ఆలూరు, శరజ అన్నదానం, రాధికా నడదూర్, ప్రియ లకు మొమెంటోలను బహుకరించారు. శివ కుమార్ మృదంగం పై వాయిద్య సహకారం అందించారు ఈ కార్యక్రమానికి శ్రీమతి చైతన్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. పలువురినీ లలిత కళారంగంలో ఉత్సాహ పరుస్తూ ముందుకు నడిచే ఇటువంటి కార్యక్రమానికి దాదాపుగా 200 మంది హాజరు కావటమే కాకుండా, సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా వీక్షించి విశేషస్పందనలను తెలియజేయటం అభినందనీయం.

9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ’’ విశేష సంచిక ఆవిష్కారం
ఖతార్ దేశ రాజధాని దోహా మహానగరంలో 2024 నవంబర్‌లో జరిగిన "9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" యొక్క సభా విశేష సంచిక అంతర్జాల మాధ్యమంలో ఆదివారం ఆవిష్కరించారు. 'వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా' ,'ఆంధ్ర కళా వేదిక - ఖతార్' సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహింపబడి, మధ్య ప్రాచ్య దేశాలలోనే తొలి సాహితీ సదస్సుగా రికార్డును సృష్టించిన ఈ '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో పది దేశాల నుండి పాల్గొన్న వక్తలు, కవులు, రచయితలు ప్రసంగించిన అన్ని అంశాలను పొందుపరుస్తూ 380 పేజీలతో ఈ సభా విశేష సంచిక రూపొందించబడింది. ఈ ఉద్గ్రంధానికి సంపాదకులుగా రాధికా మంగిపూడి, విక్రమ్ సుఖవాసి, వంగూరి చిట్టెన్ రాజు, లక్ష్మి రాయవరపు, శాయి రాచకొండ వ్యవహరించారు.సదస్సు నిర్వాహకవర్గము, సంచిక సంపాదకులు, సదస్సులో వివిధ దేశాల నుండి పాల్గొన్న వక్తలు, రచయితలు అందరి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరణ జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకించి అంతర్జాల మాధ్యమంలో ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు డా. వంగూరి చిట్టెన్ రాజు, ఖతార్ ఆంధ్ర కళా వేదిక నుండి విక్రమ్ సుఖవాసి ప్రధాన నిర్వాహకులుగా, వారి అధ్యక్షతన, రాధిక మంగిపూడి సభానిర్వహణలో దాదాపు మూడు గంటల పాటు ఆదివారం సాయంత్రం నిర్వహింపబడిన ఈ కార్యక్రమంలో భారత్, ఖతార్, అమెరికా, సౌదీ అరేబియా, బహరైన్, యూఏఈ, సింగపూర్ తదితర దేశాలనుండి వక్తలు, తెలుగు సంస్థల ప్రతినిధులు, రచయితలు పాల్గొన్నారు.అమెరికా నుండి చెరుకూరి రమాదేవి, శాయి రాచకొండ, భారత్ నుండి డా. వంశీ రామరాజు, డా. అద్దంకి శ్రీనివాస్, డా. బులుసు అపర్ణ, ఆచార్య అయ్యగారి సీతారత్నం, ఆచార్య త్రివేణి వంగారి, కస్తూరి అలివేణి, డా. దేవులపల్లి పద్మజ తదితరులు, బహరైన్ నుండి మురళీకృష్ణ, సౌదీ అరేబియా నుండి కోనేరు ఉమామహేశ్వరరావు, చివుకుల పట్టాభిరామ శర్మ, సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, యూఏఈ నుండి షేక్ రఫీ, డా. తాడేపల్లి రామలక్ష్మి, ఖతార్ నుండి శ్రీసుధ, గోవర్ధన్ రెడ్డి, మనీష్, మాధవి లలిత, గౌరీ బొమ్మన తదితరులు ఆసక్తిగా పాల్గొని సదస్సు యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.ఈ సభా విశేష సంచికలో నిర్వాహక సంస్థల పరిచయాలు, అధ్యక్షుల, సంచాలకుల ముందుమాటలు, సదస్సు ప్రకటనలు, వక్తలందరి ఫోటోలు, వ్యాసాలు, కథలు, కవితలతో పాటు, సదస్సు అనంతరం అందరూ అందించిన స్పందనలు కూడా జోడించడం, ఆనందంగా ఉందని, జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సంచిక ఉందంటూ సంపాదకులను నిర్వాహకులను అభినందించారు.డా. వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ "మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు సాహిత్య అభిమానులందరికీ ఈ సదస్సు కొత్త స్ఫూర్తిని అందించిందని, సదస్సు ప్రభావం వలన ఎంతోమంది సాహిత్యంపై చక్కటి ఆసక్తి పెంచుకోవడం, కొత్త రచయితలు జనించడం.. ఆనందదాయకమని తెలియజేశారు. ఇటువంటి సదస్సులు మరిన్ని జరగాలని, కొత్త రచయితలు యువతరం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. విక్రమ్ సుఖవాసి ఆంధ్ర కళావేదిక తరపున మరొకసారి అందరికీ తమ దేశానికి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ తొలిసారి ప్రపంచ సదస్సుకు సంచాలకునిగా ఈ సంచికకు సహసంపాదకునిగా ఉండడం చాలా ఆనందంగా ఉందన్నారుఈ సంచికకు రూపకల్పన సహకారం అందించిన జేవి పబ్లికేషన్స్ అధినేత్రి జ్యోతి వలబోజు కూడా ఈ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఇతర మధ్యప్రాచ్య దేశాల సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ తమ దేశాలలో కూడా ఇటువంటి సాహిత్య సదస్సులు నిర్వహించడానికి తాము సిద్ధంగా ఉన్నామని 10వ ప్రపంచ సదస్సు జరపడానికి అవకాశం ఇమ్మని కోరుతూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమం వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమైంది.

న్యూజెర్సీ, పార్సిప్పనీలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
న్యూజెర్సీలోని పార్సిప్పనీలో శ్రీ సీతారాముల కల్యాణం రమణీయంగా, కమనీయంగా సాగింది. న్యూయార్క్‌లోని శ్రీ రంగనాథ ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపానికి స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, అమ్మవారిని ఆసీనులను చేశారు. కళ్యాణం సందర్భంగా భక్తులు చేయించిన అభరణాలను వధూవరులకు ధరింపజేశారు. రాముల వారికి, సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు, తాళిబొట్టు, మెట్టలు, ఆభరణాలు, ముత్యాల తలంభ్రాలను సమర్పించారు. మేళంతో ఊరేగింపుగా పట్ట వస్త్రాలను తీసువచ్చారు. సీతమ్మ, రామయ్యల ఎదుర్కోలు ఘట్టం కనులారా తిలకించిన భక్తులు ఆనందపరవశులయ్యారు. భక్తజనంతో న్యూజెర్సీలో పండగ వాతావరణం నెలకొంది. సంస్కృతి, సంప్రదాయలకు అనుగుణంగా వివాహ వ్యవస్థపై కృష్ణ దేశిక జీయర్ స్వామిజీ చేసిన వ్యాఖ్యానం విశేషంగా ఆకట్టుకుంది. దండలు మార్చుకునే క్రమంలో అర్చకులు నృత్య ప్రదర్శన చేసి సంప్రదాయాన్ని గుర్తు చేశారు. మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!అనంతరం గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, మహాసంకల్పం, మంగళఅష్టకాలు, కన్యాదానం, తలంబ్రాల ఘట్టం, పూలదండల మార్పు, మహా హారతి, నివేదన తదితర ఘట్టాలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ జగదభిరాముడు జానమ్మను మనువాడారు. కోదండ రాముడు సీతమ్మ మెడలో మూడుముళ్లు వేసిన వేళ, రఘునందనుడి దోసిట తలంబ్రాలు ఆణిముత్యాలే నీలపురాశులుగా, జగన్మాత లోకపావని సీతమ్మ దోసిట అక్షింతలు మణిమాణిక్యాలై సాక్షాత్కారించిన వేళ కల్యాణ ప్రాంగణం భక్తిపారవశ్యంతో ఓలలాడింది.ఈ సీతారాముల కాళ్యానికి పార్సిప్పనీకి మేయర్ జేమ్స్ బార్బెరియోతో పాటు 300 మందికి ప్రవాస తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. దాదాపు అందరూ సంప్రదాయబద్ధంగా తయారై కళ్యాణంలో పాల్గొన్నారు. 72 పైగా జంటలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకున్నాయి. ఈ కల్యాణాన్ని ప్రవాసులు కన్నులారా వీక్షిం చి తరించారు. ఈ ఉత్సవం.. భద్రాచల రాముల వారి కళ్యాణమహోత్సవాన్ని తలపించింది. కల్యాణం అనంతరం ఉత్సవ మూర్తులను భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అక్షింతలు అందజేశారు.
క్రైమ్

రేణిగుంటలో 24.5 కిలోల గంజాయి స్వాధీనం
రేణిగుంట (శ్రీకాళహస్తి రూరల్): ఒడిశా నుంచి కేరళకు గంజాయి తరలించేందుకు ప్రయత్నించిన ఇద్దరు పశ్చిమ బెంగాల్ మహిళలను రేణిగుంట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రేణిగుంట లాడ్జిలో ఉన్న వారి వద్ద నుంచి 24.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం తిరుపతి జిల్లా ఏఎస్పీ రవిమనోహరాచారి తెలిపిన వివరాల మేరకు.. పోలీసులకు వచ్చిన రహస్య సమాచారం మేరకు రైల్వేస్టేషన్ సమీపంలోని ఎస్బీఎస్ లాడ్జిలోని 207 గదిలో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సీఐ జయచంద్ర, ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో సోదాలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమోని మొండాల్ (31), నమితా మొండాల్ (37) లను అదుపులోకి తీసుకుని, రెండు సూట్‌కేస్‌లలో ఉన్న రూ.2.45 లక్షల విలువ చేసే 24.5 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఒడిశా నుంచి రైల్లో కేరళ తీసుకెళుతుండగా వారి సంబం«దీకుల నుంచి సూచన రావడంతో రేణిగుంటలో దిగి లాడ్జిలో బస చేశారు.వారిద్దరినీ అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో వారు చెప్పిన ఇద్దరు అంతర్ రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేయాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి సీఐ జయచంద్ర, సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు అభినందించినట్లు ఏఎస్పీ తెలిపారు.

అర్ధరాత్రి క్షుద్రపూజల కలకలం..!
కర్నూలు: పట్టణంలోని కర్నూలు – బెంగళూరు జాతీయ రహదారి పక్కన చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంట్లో క్షుద్రపూజలు చేసి న ఫొటోలు, వీడియో లు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. ఓ వ్యక్తి మీద చేతబడి ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు పట్టణానికి చెందిన వ్యక్తి సూత్రధారిగా ఉండి కొందరి ఫొటోలతో, భయానక చేతబడి చేస్తున్నప్పటి ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. సేకరించిన సమాచారం మేరకు.. పట్టణానికి చెందిన వ్యక్తి సిఫారసుతో చెరుకులపాడు క్రాస్ రోడ్డులోని ఓ ఇంటిని అద్దెకు తీసుకున్న వారు అందులో చేతబడులు చేస్తూ, గుప్తనిధుల వేటగాళ్లకు ఆసరాగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఎమ్మిగనూరుకు చెందిన వ్యక్తికి అప్పు ఉండ గా అప్పు ఎగ్గొట్టేందుకు ఏకంగా ఆ వ్యక్తిపై చేతబడి ప్రయోగం చేసినట్లు సమాచారం. ఇందులో పట్టణానికి చెందిన పంచాయతీ కార్యాలయంలో అనధికారికంగా పనిచేస్తున్నకార్మికుడి ఫొటో ఉంది. ఇటీవల ఉలిందకొండకు చెందిన వ్యక్తిపై కూడా ఇక్కడి నుంచే చేతబడి ప్రయోగం చేసినట్లుగా తెలుసుకున్న ఉలిందకొండ వారు ఈ ఇంటికి చేరుకుని ఇంట్లో ఉన్నవారితో గొడవ పడినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ఇళ్లు కేంద్రంగా రెండు నెలల పాటు మండలం వ్యాప్తంగా గుప్తనిధుల వేట కొనసాగినట్లుగా సైతం తెలుస్తోంది. పోలీసులకు సైతం సమాచారం అందినా చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.

భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య
ఉయ్యాలవాడ: విధి ఆటలో ఓ చిన్నారి అనాథగా మారింది. అభంశుభం తెలియని పసిపాప తొమ్మిది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయింది. ఈ విషాద ఘటన ఆర్. పాంపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొగాకు నారాయణ కూలీ పనులకు వెళుతూ జీవనం కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మట్టి మిద్దె పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మిద్దె కూలి శిథిలాలు నారాయణపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి నుంచి అతని భార్య లలిత (40) తీవ్ర మనోవేదనకు గురైంది. మనస్తాపంతో వారం రోజులుగా ఆహారం తీసుకోకుండా భర్త గురించే ఆలోచించింది. తన 45 రోజుల చిన్నారికి కూడా పోతపాలు తాపింది. చివరకు జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం లలిత రసాయన పౌడర్‌ను నీళ్లలో కలుపుకుని అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన బంధువులు, స్థానికులు చికిత్స నిమిత్తం 108లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో లలిత మృతి చెందింది. తల్లిదండ్రుల మృతి చెంద డంతో 45 రోజుల చిన్నారి అనాథగా మిగిలింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పసిపాపకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాయనమ్మ శివమ్మ దిక్కైంది. అమ్మపాల కోసం ఏడస్తున్న చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. కాగా నారాయణ మొదటి భార్య విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో క్రిమి సంహారక మందు తాగి మృతి చెందింది. రెండేళ్ల క్రితం లలితను రెండవ వివాహం చేసుకున్నాడు. మృతురాలి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. ఇటీవల జిల్లాలో పలువురు ఆత్మహత్యకు కల్లాపికి ఉపయోగించే పేడ రంగును నీళ్లలో కలుపుకుని తాగి మృతి చెందుతుండటంతో కలెక్టర్ రాజకుమారి నెల క్రితం పేడ రంగు విక్రయాలను నిషేధించారు. అయినా కొందరు కిరాణ దుకాణ వ్యాపారులు విక్రయిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పేడ రంగు విక్రయించకుండా అధికారులు దుకాణాలపై దాడులు చేయా లని గ్రామస్తులు కోరుతున్నారు.

తాళిబొట్లు తెంచి పడేసి హిజ్రాల ఆవేదన..!
తమిళనాడు: కూవాగంలో గత కొద్ది రోజులు సందడి చేసిన హిజ్రాలు బుధవారం విషాదంతో స్వస్థలాలకు తిరుగు పయనం అయ్యారు. మంగళవారం ఎంతో ఆనందంగా కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి ఒప్పారి పెట్టారు. తెల్ల చీరలు ధరించి వితంతువులుగా మారి కూవాగం నుంచి తిరుగు పయనం అయ్యారు. ముందుగా ఉదయం కూత్తాండవర్ రథోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. రాష్ట్రంలోని కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూర్ పేట సమీపంలోని కూవాగం గ్రామంలోని కూత్తాండవర్ ఆలయంలో రెండు వారాల పాటు చిత్తిరై ఉత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గత మూడు రోజులు హిజ్రాల సందడితో కూవాగం కళకళలాడింది. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, ఆలయ పూజారి చేతుల మీదుగా మంగళవారం హిజ్రాలు తాళిబొట్లు కట్టించుకున్నారు. రాత్రంతా ఆట పాటలతో సందడి చేశారు. రథోత్సవం బుధవారం ఉదయం కూత్తాండవర్ రథోత్సవం ఘనంగా జరిగింది. ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా జనసందోహం తరలివచ్చారు. ఈ వేడుక కోసం కూవాగం, పందలాడి, కిలక్కు కుప్పం, శిరులాయం కుళం గ్రామాల నుంచి ప్రజలు చేతులు, కాళ్లు, భుజాలు, శిరస్సు ఆకారాలను తీసుకొచ్చి రథంపై ఉంచారు. బ్రహ్మాండంగా కూత్తాండవర్ రథోత్సవ సేవ జరిగింది. అనంతరం బలిదానం జరిగింది. బలిదానంలో తమ ఆరాధ్యుడు బలి కావడంతో తమ భర్తను కోల్పోయినంతగా తీవ్ర వేదనతో ఒక్కసారిగా హిజ్రాలు విషాదంలో మునిగారు. తాము కట్టుకున్న మంగళ సూత్రాలను తెంచి పడేసి కన్నీటి సంద్రంలో మునిగారు. ఏడుపులు, పెడ»ొబ్బలతో ఒప్పారి పెట్టారు. అక్కడి కొలనులో స్నానం చేసి తెల్ల చీరల్ని ధరించి తమ స్వస్థలాలకు తిరుగు పయనమయ్యారు.