Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

Russia Demands For Talks With US On Ukraine Deal1
అమెరికాకు పుతిన్‌ డిమాండ్స్‌.. రష్యాకు ట్రంప్‌ సీరియస్‌ వార్నింగ్‌

వాష్టింగన్‌/మాస్కో: ఉక్రెయిన్‌-రష్యా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ కుదుర్చేందుకు అమెరికా ప్లాన​్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌తో డీల్‌ చేసుకునేందుకు రష్యా పలు డిమాండ్లను అమెరికా ముందుకు తీసుకొచ్చినట్టు యూఎస్‌కు చెందిన ఇద్దరు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో అమెరికా ప్రతినిధులు రష్యాకు బయలుదేరడం విశేషం.ఉక్రెయిన్‌తో యుద్ధం ముగింపు, అమెరికాతో సంబంధాల మెరుగు కోసం రష్యా పలు డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చింది. ఈ మేరకు ఓ జాబితాను సిద్దం చేసి రష్యాకు చెందిన అధికారులు అమెరికాకు అందజేశారు. అయితే, జాబితాలో రష్యా ఏం కోరిందనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. ఇక,గత మూడు వారాలుగా పలు నిబంధనలపై అమెరికా, రష్యా అధికారులు చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా డిమాండ్లు ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది.మరోవైపు.. యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యా బయల్దేరారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) వైట్‌హౌస్‌ వద్ద మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్బంగా ట్రంప్‌ మాట్లాడుతూ..‘మా ప్రతినిధులు రష్యాకు బయల్దేరారు. కాల్పుల విరమణకు పుతిన్‌ అంగీకరిస్తారనే ఆశిస్తున్నాం. లేదంటే యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. అదే జరిగితే మాస్కో ఆర్థికంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది రష్యాకే వినాశకరంగా మారుతుంది. అలాంటి ఫలితాన్ని నేను కోరుకోవట్లేదు. శాంతిని సాధించడమే నా లక్ష్యం. రష్యా అంగీకరిస్తే అది గొప్ప నిర్ణయం అవుతుంది. లేదంటే ప్రజలు మరణిస్తూనే ఉంటారు’ అని స్పష్టం చేశారు.Trump threatens Putin with 'devastating' punishment if he doesn't agree to 30-day ceasefire with Ukraine. pic.twitter.com/vU6rLTX479— Daily Mail Online (@MailOnline) March 12, 2025ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌ మాత్రం కీవ్‌కు నాటో సభ్యత్వం ఇవ్వాలని ముందు నుంచి డిమాండ్‌ చేస్తోంది. ఉక్రెయిన్‌లో విదేశీ దళాలను మోహరించకూడదని చెబుతోంది. ఈ మేరకు అమెరికాతో కూడా చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ డిమాండ్లపైనే రష్యా కూడా ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌ను నాటోలో చేర్చకూడదనే వాదనలు వినిపిస్తోంది. మాస్కో కాల్పుల విరమణకు సంతకం చేయకపోతే ఆంక్షల వలయంలో చిక్కుకోవాల్సి ఉంటుంది.

Karnataka Ranya Rao gold case Update Over Investigation2
యూట్యూబ్‌ చూసి నేర్చుకున్నా: రన్యా రావు

బెంగళూరు: దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే రావు బెయిల్‌ అర్జీపై తీర్పును బెంగళూరులోని ఆర్థిక నేరాల విభాగం ప్రత్యేక కోర్టు 14వ తేదీకి రిజర్వు చేసింది. ఇక రన్యా బంగారం దందాలో కొత్త కొత్త సంగతులు వెలుగులోకి వస్తున్నాయి.తాజాగా ఈ కేసులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు ఆమెను కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విచారణ సందర్భంగా ఆమె పలు విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. విచారణలో రన్యా రావు..‘దుబాయ్‌ నుంచి ఇంతకుముందు ఎప్పుడూ బంగారాన్ని అక్రమంగా తీసుకురాలేదు. స్మగ్లింగ్‌ చేయడం ఇదే మొదటిసారి. ఎవరికీ కనబడకుండా బంగారాన్ని ఎలా దాచాలన్నది యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నా’ అంటూ అధికారులకు చెప్పినట్లు సమాచారం.ఇదిలా ఉండగా.. రన్యా రావు బంగారు స్మగ్లింగ్ కేసులో రాష్ట్ర పోలీసులు అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై సీఐడీ దర్యాప్తునకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వును కర్ణాటక ప్రభుత్వం బుధవారం ఉపసంహరించుకుంది. అయితే, కర్ణాటక ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తా నేతృత్వంలో రన్యా రావు తండ్రి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) కె రామచంద్రరావు పాత్రపై దర్యాప్తు కొనసాగుతుందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.తరుణ్‌ మాస్టర్‌ మైండ్‌ దుబాయ్‌లో బంగారం కొనుగోలు చేయడం, తిరిగి రావడం ఎలా అనే అన్ని వివరాలను నటి రన్య స్నేహితుడు, పారిశ్రామికవేత్త కుమారుడు తరుణ్‌రాజు మార్గదర్శకం చేసినట్లు డీఆర్‌ఐ అధికారుల విచారణలో వెలుగుచూసింది. పట్టుబడిన తరుణ్‌రాజును విచారిస్తున్నారు. దుబాయ్‌కు వెళ్లే రన్యాతో నిరంతరం సంప్రదించేవాడు. అతడు చెప్పినట్లు ఆమె నడుచుకునేది. విదేశాల నుంచి బంగారం తీసుకొచ్చే కొరియర్‌గా ఆమెను వాడుకున్నాడని డీఆర్‌ఐ భావిస్తోంది. ఇద్దరినీ ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ జరిపారు. కొన్నేళ్లుగా రన్యారావుతో తరుణ్‌రాజు ఆత్మీయంగా ఉంటున్నాడు. అతనికి దుబాయ్‌లో కొందరు పారిశ్రామికవేత్తలు బాగా తెలుసు. భారీగా ధన సంపాదన ఆశతో బంగారం స్మగ్లింగ్‌లో నిమగ్నమయ్యాడు. అతనిని ఐదురోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇందులో రన్యా స్నేహితుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది.సమగ్ర విచారణ జరగాలి: మంత్రి లక్ష్మి నటి రన్యా రావు బంగారం కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు వెలుగులోకి వస్తాయని మహిళా శిశు సంక్షేమ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ తెలిపారు. ఈ కేసులో ఓ ప్రముఖ మంత్రి హస్తం ఉందనే ఆరోపణలపై బుధవారం విధానసౌధలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. కేసు పూర్తి స్థాయిలో విచారణ జరగాలన్నారు. గ్యారంటీ పథకాలను కమిటీల గొడవపై స్పందిస్తూ ఆ కమిటీలను రద్దుచేయాలని ప్రతిపక్షాలు చేపట్టిన ధర్నాకు అర్థం లేదన్నారు. తమ పథకాలను పోలిన స్కీములను అమలు చేసిన కొన్ని బీజేపీ ప్రభుత్వాలు రెండు నెలల తరువాత రద్దు చేశాయని ఆరోపించారు.

Chhaava Movie Making Video Telugu3
'ఛావా'.. తెర వెనక ఇంత కష్టపడ్డారా?

గత నెలరోజులుగా దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచిన మూవీ 'ఛావా'. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే రూ.600 కోట్ల మేర వసూళ్లు సాధించింది. తెలుగులోనూ రూ.11 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 21 సినిమాలు స్ట్రీమింగ్)దాదాపు నెలరోజుల నుంచి థియేటర్లలో అద్భుతంగా ప్రదర్శితమవుతున్న 'ఛావా' క్లైమాక్స్ బీటీఎస్ (బిహైండ్ ద సీన్స్) వీడియోని చిత్రబృందం రిలీజ్ చేసింది. ఇందులో విక్కీ రిహార్సల్ చేయడం, ప్రొస్థటిక్ మేకప్ లాంటివి చూపించారు. ఇదంతా చూస్తున్నప్పుడు సినిమా కోసం ఇంతలా కష్టపడ్డారా అనిపించకమానదు.(ఇదీ చదవండి: 40 ఏళ్ల చరిత్ర గల 'రజినీకాంత్' థియేటర్ కూల్చివేత)

ప్రతీకాత్మక చిత్రం4
Termin Injection : సైడ్‌ ఎఫెక్ట్స్‌ తెలుసుకోండి.. లేదంటే ముప్పే!

డాక్టర్‌ గారూ, నేను డిగ్రీ చదివి కానిస్టేబుల్‌ పరీక్షల కోసం ప్రిపేర్‌ అవుతున్నాను. నాకు బాడీ బిల్డింగ్‌ అంటే చాలా ఇష్టం. ఒక సంవత్సరం క్రితం మా ఊర్లో ఉన్న ఒక ఫేమస్‌ జిమ్‌లో చేరాను. తొందరగా బాడీ పెరగడం కోసం ‘టెర్మిన్‌’ అనే ఇంజక్షన్‌ ఉంటుంది అని, అక్కడ పని చేసే ట్రెయినర్‌ ఒకతను చెబితే అది తీసుకోవడం మొదలు పెట్టాను. మొదట్లో చాలా బాగా అనిపించింది. జిమ్‌లో ఎంతసేపు వర్కవుట్స్‌ చేసినా అలసట వచ్చేది కాదు. నిద్రలేకపోయినా చాలా హుషారుగా ఉండేవాణ్ణి. కొన్నాళ్లకు ఇక ఇంజక్షన్‌ సరిపోయేది కాదు. రెండు నుంచి మూడు ఇంజక్షన్స్‌ తీసుకోవడం మొదలు పెట్టాను. దానివల్లేనేమో, ఆకలి బాగా తగ్గిపోయింది. బరువు తగ్గాను. బాగా చికాకుగా ఉంటోంది. ఇంజక్షన్‌ తీసుకోకపోతే పిచ్చెక్కినట్టు అనిపిస్తుంది. చెవిలో వింతవింత శబ్దాలు కూడా వినపడుతున్నాయి. ఎవరో నన్ను గమనిస్తున్నట్లు, నన్ను చంపడం కోసం వెంబడిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ భయంతో ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను. నా జీవితాన్ని నేను చేతులారా నాశనం చేసుకున్నానేమో అనిపిస్తుంది. దయచేసి నన్ను ఈ సమస్య నుంచి ఎలాగైనా బయట పడెయ్యండి. – రమేష్, విశాఖపట్నంముందుగా మీ తప్పు మీరు తెలుసుకుని మారాలి అని అనుకుంటున్నందుకు మీకు నా అభినందనలు. మీరు పంచుకున్న ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు. మన దేశంలో ఇటీవల చాలామంది యువత ఇలాంటి ఇంజెక్షన్స్‌కి అడిక్ట్‌ అయి బాధపడుతున్నారు. తమ అభిమాన నటుడు ఎవరో సిక్స్‌ ప్యాక్‌ శరీరం పెంచారని, తాము కూడా అలా పెంచుకోవాలి అనే యావలో లేదా ఎవరినయినా ఇంప్రెస్‌ చేయాలనే ఉద్దేశ్యంతో జిమ్‌లలో చేరడం తొందరగా బాడీ పెంచాలనే ఉద్దేశ్యంతో అడ్డదారులైన ఇలాంటి ఇంజెక్షన్లను ఎంచు కుంటున్నారు. మీరు తీసుకున్న టెర్మిన్‌ ఇంజక్షన్‌ సైకోస్టిమ్యులెంట్‌ డ్రగ్‌ కిందకు వస్తుంది. ఈ మందు మెదడులో సెరటోనిన్, డోపమైన్, నార్‌ అడ్రినలిన్‌ అనే రసాయనాలను ఎక్కువ మోతాదులో విడుదల అయ్యేలా చేస్తుంది. దానివల్ల వారికి అమితమైన బలం వచ్చినట్లు అనిపిస్తుంది. ఎంత పని చేసినా అలసట రాదు. దాంతో గంటలు గంటలు జిమ్‌లో వర్కవుట్స్‌ చేయగలుగుతారు. అయితే క్రమేణా కొంతకాలానికి శరీరం చల్లబడటం, బీపీ తగ్గిపోవడం, బాగా అలసటగా అనిపించడం జరుగుతుంది. బీపీ విపరీతంగా పెరగడం, ఆకలి మందగించటం, బరువు తగ్గిపోవడం, వెంట్రుకలు ఊడిపోవడం లాంటి దుష్ప్రభావాలు కనపడతాయి. ఒక్కోసారి గుండెలయలో మార్పులు వచ్చి ప్రాణం మీదికి వచ్చే ప్రమాదం కూడా ఉంది. కొంతమందిలో చెవిలో మాటలు వినపడటం, విపరీతమైన మూడ్‌ స్వింగ్స్‌ రావడం చూస్తుంటాము. దీనినే సైకోపిన్‌ అంటారు. మీరు వీలైనంత తొందరగా ఒకసారి మానసిక వైద్యుడిని సంప్రదిస్తే ఈ సైకోసిస్‌ లక్షణాలను తగ్గించేలా సరైన వైద్యం చేసి తర్వాత అవసరమైతే కొంతకాలం పాటు మిమ్మల్ని రీహాబిలిటేషన్‌ సెంటర్‌లో ఉంచి కౌన్సెలింగ్, యోగ, ఇతరత్రా వైద్యవిధానాల ద్వారా పూర్తిగా ఈ అడిక్షన్‌ సమస్య నుంచి బయటకి తీసుకు రావచ్చు. ఆలస్యం చేయకుండా సైకియాట్రిస్టులను సంప్రదిస్తే మీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. గుడ్‌లక్‌. -డా. ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ. మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com

Behind Balochistan Freedom Struggle5
Balochistan: జిన్నా చేసిన ద్రోహమే.. పాక్‌కు ముప్పుగా మారిందా?

ఖనిజ సంపద అధికంగా ఉన్న బలూచిస్తాన్‌(Balochistan) రాష్ట్రం పాకిస్తాన్‌ నుంచి స్వాతంత్ర్యం కోరుతూ దశాబ్దాలుగా సాయుధ పోరాటం చేస్తోంది. ఇది పాక్‌కు భద్రతా ముప్పుగా పరిణమించింది. ఈ క్రమంలోనే ఇరాన్- ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో రైలు హైజాక్‌ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ). ఇంతకీ బలూచిస్తాన్‌ ఎందుకు పాక్‌ నుంచి విడిపోవాలనుకుంటోంది? దీని వెనుక ఏముంది?పాకిస్తాన్(Pakistan) స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి చెలరేగుతున్న బలూచ్ ఉద్యమంలో తాజాగా చోటుచేసుకున్న రైలు హైజాక్ అతి పెద్ద ఘటనగా చెప్పుకోవచ్చు. బలూచ్‌ తిరుగుబాటుకు మూలం పాకిస్తాన్ జాతిపి ముహమ్మద్ అలీ జిన్నా చేసిన ద్రోహం అని చెబుతుంటారు. నాడు పాక్‌తో విలీనం కావడానికి బలూచిస్తాన్‌ ఏమాత్రం ఇష్టపడలేదు. పాకిస్తాన్‌లో విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్ ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటూ వచ్చింది. నాడు రష్యా నుండి తన వలస ప్రయోజనాలను రక్షించుకునేందుకు బ్రిటిష్ పాలకులు ఈ ప్రాంతాన్ని ఒక స్థావరంగా ఉపయోగించుకున్నారు. అయితే భారతదేశ విభజన తర్వాత పలు పరిణామాల నేపధ్యంలో పాకిస్తాన్‌లో బలూచ్ విలీనమయ్యింది. ఇది స్థానికులకు నచ్చలేదు. దీంతో స్వతంత్ర బలూచిస్తాన్ కోసం ఉద్యమం ప్రారంభమయ్యింది.బలూచిస్తాన్ అధికంగా బీడువారినట్లు కనిపించినప్పటికీ, ఖనిజాలు, వనరులతో సమృద్ధిగా ఉంది. చాఘి జిల్లాలోని రెకో దిక్, సైందక్ ప్రాంతాల్లో అపారంగా బంగారం, రాగి నిక్షేపాలు ఉన్నాయి. అలాగే బలూచిస్తాన్‌లోని పలు ప్రాంతాల్లో సీసం, జింక్, బొగ్గు నిక్షేపాలు కూడా ఉన్నాయి. బెలూచ్‌కు సొంతమైన ఈ వనరులను పాక్‌ ప్రభుత్వం దోపిడీ చేస్తోందని బలూచ్ ఎప్పటి నుంచో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తిరుగుబాటు సంస్థలైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ),బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (బీఎల్‌ఎప్‌)లు బలూచ్‌ స్వాంతంత్య్రం కోసం ఉద్యమిస్తున్నాయి.ఈ సంస్థలు పాకిస్తాన్ భద్రతా దళాలు(Pakistan security forces), సంస్థలు, మౌలిక సదుపాయాలపై దాడులకు తెగబడ్డాయి. గత కొన్నేళ్లుగా మానవ హక్కుల ఉల్లంఘనల ఆరోపణలతో బలూచ్‌ ఉద్యమం మరింత తీవ్రమైంది. తమ ఉద్యమాన్ని అణచివేసేందుకు తమ దళాలకు చెందిన వందలాది మంది కార్యకర్తలు, పౌరులను పాక్‌ సైన్యం అదృశ్యం చేసిందని తిరుగుబాటు సంస్థలు ఆరోపిస్తున్నాయి.విభజన సమయంలో బలూచిస్తాన్‌ను భారతదేశం, పాకిస్తాన్‌లతో పాటు స్వతంత్ర దేశంగా ప్రకటించారు. నాడు ఈ ప్రాంతంలో నాలుగు రాచరిక రాష్ట్రాలు ఉండేవి. అవి ఖరన్, మకరన్, లాస్ బేలా, కలాత్. విభజనకు ముందు ఈ రాచరిక రాష్ట్రాలకు మూడు ఎంపికలు ఇచ్చారు. అవి భారతదేశం లేదా పాకిస్తాన్‌లో చేరడం లేదా స్వతంత్రంగా ఉండటం. ఈ నేపధ్యంలో మూడు ప్రాంతాలు పాకిస్తాన్‌లో విలీనమ్యాయి. దీంతో కలాత్‌కు 1947, ఆగస్టు 15న స్వాతంత్ర్యం ప్రకటించారు. అయితే విస్తరణవాద పాలన భయంతో కలాత్ స్వతంత్రంగా ఉండటానికి బ్రిటిష్ ఒప్పుకోలేదు. కలాత్‌ను స్వాధీనం చేసుకోవాలంటూ పాక్‌పై ఒత్తిడి తెచ్చారు. 1947 అక్టోబరులో పాక్‌ వ్యవస్థాపకుడు జిన్నా.. కలాత్‌ విలీనాన్ని వేగవంతం చేయాలని సలహా ఇచ్చాడు. అయితే కలాత్‌ పాలకుడు దీనిని నిరాకరించాడు.నాటి నుండి పాకిస్తాన్ అధికారులు కలాత్‌ పాలకుడు ఖాన్‌ను పాకిస్తాన్‌లో చేరాలంటూ మరింతగా ఒత్తిడి తీసుకువచ్చారు. 1954లో పాకిస్తాన్ తన ప్రావిన్సులను పునర్వ్యవస్థీకరిస్తూ వన్-యూనిట్ ప్రణాళికను ప్రారంభించినప్పుడు బలూచ్‌లో తిరుగుబాటు వచ్చింది. ఖాన్ ఆఫ్ కలాత్ నవాబ్ నౌరోజ్ ఖాన్ 1959లో పాక్‌కు లొంగిపోయాడు. ఏడాది తరువాత పశ్చిమ పాకిస్తాన్‌లో వన్ యూనిట్ ప్లాన్ రద్దు చేశారు. దీంతో బలూచిస్తాన్‌ను పంజాబ్, సింధ్, ఫ్రాంటియర్‌తో పాటు మరో రాష్ట్రంగా ప్రకటించారు.1970లలో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన దరిమిలా బలూచ్‌లలో ధైర్యం పెరిగింది. స్వయంప్రతిపత్తి కోసం డిమాండ్లను లేవనెత్తారు. అయితే నాటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో దీనిని నిరాకరించారు. ఇది భారీ నిరసనలకు దారితీసింది. ఇది నాటి నుంచి ఏదో ఒక రూపేణా ఉద్యమం కొనసాగుతూనే వస్తోంది. గత కొన్నేళ్లుగా పాక్‌ భద్రతా సిబ్బంది, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని బలూచ్‌ దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పట్లో బలూచ్ డిమాండ్లకు పాకిస్తాన్ ప్రభుత్వం అంగీకరించే సూచనలు కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: మహాకుంభ్‌తో నిండిన రైల్వే ఖజానా.. ఎంత ఆదాయమంటే..

Ashwini Vaishnaw Welcomes Starlink to India A Leap Towards Connectivity but post been deleted6
‘స్టార్‌లింక్‌కు స్వాగతం’.. కాసేపటికే పోస్ట్‌ డిలీట్‌ చేసిన కేంద్రమంత్రి

కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌(Starlink) శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు స్వాగతం అ​ంటూ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా పోస్ట్‌ చేశారు. మారుమూల ప్రాంతాల్లో, ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టుల కనెక్టివిటీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి స్టార్‌లింక్‌ సామర్థ్యాన్ని మంత్రి హైలైట్ చేశారు. కానీ, ఈమేరకు చేసిన ట్వీట్‌ను కాసేపటికే డిలీట్‌ చేయడం గమనార్హం.కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో స్టార్‌లింక్‌ భారత్‌లో ప్రవేశించబోతుండడంపై స్పందిస్తూ..‘భారత్‌లోకి స్టార్‌లింక్‌కు స్వాగతం! మారుమూల ప్రాంత రైల్వే ప్రాజెక్టులకు ఇది ఎంతో ఉపయోగం’ అని తెలిపారు. దేశంలోని రెండు ప్రముఖ టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ తమ సేవలను విస్తరించేందుకు ఇప్పటికే స్పేస్‌ఎక్స్‌ ఆధ్వర్యంలోని స్టార్‌లింక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈనేపథ్యంలో మంత్రి ట్వీట్‌ క్షణాల్లో వైరల్‌ అయింది. కానీ, కాసేపటికే దాన్ని మంత్రి తన ఎక్స్‌ ఖాతా నుంచి డిలీట్‌ చేశారు. అందుకుగల కారణాలు తెలియరాలేదు.‍స్టార్‌లింక్‌ లోఎర్త్‌ ఆర్బిట్‌ ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్‌ కనెక్టివిటీని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రైల్వే కార్యకలాపాలను పెంచుతుందని, డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుందని, గ్రామీణ అభివృద్ధికి మద్దతుగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. దాంతో ఇటీవల టెలికాం కంపెనీ కుదుర్చుకున్న భాగస్వామ్యాలు ఈ రంగంలో మార్పును సూచిస్తున్నాయి. ఒకప్పుడు భారత్‌లోకి స్టార్‌లింక్‌ ప్రవేశాన్ని వ్యతిరేకించిన కంపెనీలు ఇప్పుడు ఆ కంపెనీతో జతకట్టడం డిజిటల్ ఎకోసిస్టమ్‌లో రాబోతున్న మార్పును తెలియజేస్తుంది.షరతులకు అంగీకారందేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు సంబంధించిన షరతులను స్టార్‌లింక్‌ అధికారికంగా ఇప్పటికే అంగీకరించింది. ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ పొందడానికి భారత ప్రభుత్వం విధించిన నియమాలకు కట్టుబడి ఉంటానని తెలిపింది. స్టార్‌లింక్‌ భారత్‌లో ప్రవేశించేందుకు ఇది కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలని స్టార్‌లింక్‌ ఎప్పటినుంచో యోచిస్తోంది.ఇదీ చదవండి: భయపడుతున్న‘రిచ్‌ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత..యూజర్‌ డేటాను దేశంలోనే నిల్వ చేసేలా..ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కంపెనీ మొత్తం యూజర్‌ డేటాను దేశంలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఈ సమాచారాన్ని నిర్ధారించుకోవాలి. దీనికి స్టార్‌లింగ్‌ అంగీకరించింది. అయితే ఇటీవల టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (DoT) రాసిన లేఖలో స్టార్‌లింక్‌ కొన్ని షరతులను సడలించాలని అభ్యర్థించింది. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత కాలక్రమేణా వాటిని పాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం కీలకం కానుంది.

Noor, Bracewell Secure Top Deals In The Hundred Draft7
న్యూజిలాండ్‌ కెప్టెన్‌ మైఖేల్‌ బ్రేస్‌వెల్‌కు జాక్‌పాట్‌

నిన్న (మార్చి 12) జరిగిన హండ్రెడ్‌ లీగ్‌-2025 డ్రాఫ్ట్‌లో (వేలం) న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, ఆఫ్ఘనిస్తాన్‌ యువ స్పిన్నర్‌ నూర్‌ అహ్మద్‌ జాక్‌పాట్‌ కొట్టారు. ఈ ఇద్దరు ఊహించని ధర 2 లక్షల పౌండ్లకు (రూ. 2.26 కోట్లు) అమ్ముడుపోయారు. బ్రేస్‌వెల్‌ను గత సీజన్‌ రన్నరప్‌ సధరన్‌ బ్రేవ్‌ దక్కించుకోగా.. నూర్‌ అహ్మద్‌ను మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ సొంతం చేసుకుంది. బ్రేస్‌వెల్‌ త్వరలో స్వదేశంలో పాకిస్తాన్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు న్యూజిలాండ్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈసారి డ్రాఫ్ట్‌లో బ్రేస్‌వెల్‌, నూర్‌ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు ఇంగ్లండ్‌ ఆటగాళ్లు కూడా 2 లక్షల పౌండ్లకు (రూ. 2.26 కోట్లు) అమ్ముడుపోయారు. ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్‌ను లండన్‌ స్పిరిట్‌.. మరో ఆల్‌రౌండర్‌ డేవిడ్‌ విల్లేను ట్రెంట్‌ రాకెట్స్‌ సొంతం చేసుకున్నాయి. నిన్నటి డ్రాఫ్ట్‌లో మరో మేజర్‌ సైనింగ్‌ ఆసీస్‌ వెటరన్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ది. గతేడాది డ్రాఫ్ట్‌లో అమ్ముడుపోని వార్నర్‌ను ఈసారి లండన్‌ స్పిరిట్‌ 1.2 లక్షల పౌండ్లకు (రూ. 1.35 కోట్లు) సొంతం చేసుకుంది. న్యూజిలాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీ హీరో రచిన్‌ రవీంద్రను మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌ ఇదే ధరకు (1.2 లక్షల పౌండ్లు) దక్కించుకుంది. ఈసారి డ్రాఫ్ట్‌కు అందుబాటులో ఉండిన ఇంగ్లండ్‌ మాజీ పేసర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌కు చుక్కెదురైంది. ఆండర్సన్‌ను డ్రాఫ్ట్‌లో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. మహిళల డ్రాఫ్ట్‌ విషయానికొస్తే.. సోఫి డివైన్‌, జార్జియా వాల్‌, పెయిజ్‌ స్కోల్‌ఫీల్డ్‌ మంచి ధరలు దక్కించుకున్నారు. పురుషులు, మహిళల డ్రాఫ్ట్‌లో మొత్తం 66 మంది ప్లేయర్లు అమ్ముడుపోయారు. ఈ డ్రాఫ్ట్‌ తర్వాత కూడా ఫ్రాంచైజీలకు వైల్డ్‌కార్డ్‌ డ్రాఫ్ట్‌ ద్వారా ప్లేయర్లను ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ద హండ్రెడ్‌ లీగ్‌-2025 (పురుషులు, మహిళలు) ఆగస్ట్‌ 5 నుంచి ప్రారంభం కానుంది. లార్డ్స్‌లో జరిగే తొలి మ్యాచ్‌లో లండన్‌ స్పిరిట్‌, ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ తలపడతాయి.హండ్రెల్‌ లీగ్‌లో పాల్గొనే అన్ని ఫ్రాంచైజీల జట్లు..బర్మింగ్హమ్ ఫీనిక్స్పురుషుల విభాగం: లియామ్ లివింగ్‌స్టోన్, బెన్ డకెట్, ట్రెంట్ బౌల్ట్*, జాకబ్ బెథెల్, బెన్నీ హోవెల్, ఆడమ్ మిల్నే*, డాన్ మౌస్లీ, టిమ్ సౌథీ*, విల్ స్మీడ్, క్రిస్ వుడ్, అనేరిన్ డోనాల్డ్, జో క్లార్క్, హ్యారీ మూర్, టామ్ హెల్మ్.మహిళలు: ఎల్లీస్ పెర్రీ*, అమీ జోన్స్, ఎమిలీ ఆర్లాట్, మేగాన్ షుట్*, హన్నా బేకర్, చారిస్ పావెలీ, స్టెర్ కాలిస్, ఐల్సా లిస్టర్, జార్జియా వాల్*, ఎమ్మా లాంబ్, జార్జీ బోయ్స్, మేరీ కెల్లీ, బెథాన్ ఎల్లిస్.లండన్ స్పిరిట్పురుషుల విభాగం: జామీ స్మిత్, లియామ్ డాసన్, డేనియల్ వొరాల్, కేన్ విలియమ్సన్*, రిచర్డ్ గ్లీసన్, ఓల్లీ స్టోన్, ఓల్లీ పోప్, కీటన్ జెన్నింగ్స్, జేమీ ఓవర్టన్, డేవిడ్ వార్నర్*, ల్యూక్ వుడ్, ఆష్టన్ టర్నర్*, జాఫర్ చోహన్, వేన్ మాడ్సెన్.మహిళలు: గ్రేస్ హారిస్*, డేనియల్ గిబ్సన్, సారా గ్లెన్, చార్లీ డీన్, దీప్తి శర్మ*, జార్జియా రెడ్‌మైన్*, ఎవా గ్రే, కార్డెలియా గ్రిఫిత్, తారా నోరిస్, సోఫీ మున్రో, హీథర్ నైట్, ఇస్సీ వాంగ్, రెబెక్కా టైసన్.మాంచెస్టర్ ఒరిజినల్స్పురుషులు: జోస్ బట్లర్, ఫిల్ సాల్ట్, హెన్రిచ్ క్లాసెన్*, మాథ్యూ హర్స్ట్, స్కాట్ క్యూరీ, జోష్ టంగ్, టామ్ హార్ట్లీ, సోనీ బేకర్, టామ్ ఆస్పిన్‌వాల్, నూర్ అహ్మద్*, రాచిన్ రవీంద్ర*, లూయిస్ గ్రెగొరీ, బెన్ మెక్‌కిన్నీ, జార్జ్ గార్టన్.మహిళలు: అమేలియా కెర్*, సోఫీ ఎక్లెస్టోన్, బెత్ మూనీ*, లారెన్ ఫైలర్, మహికా గౌర్, ఈవ్ జోన్స్, కాథరిన్ బ్రైస్, ఫై మోరిస్, డేనియల్ గ్రెగొరీ, డియాండ్రా డాటిన్*, సెరెన్ స్మాల్, ఎల్లా మెక్‌కాఘన్, ఆలిస్ మోనాఘన్.నార్తర్న్ సూపర్‌చార్జర్స్పురుషుల విభాగం: హ్యారీ బ్రూక్, ఆదిల్ రషీద్, డేవిడ్ మిల్లర్*, మిచెల్ సాంట్నర్*, బ్రైడాన్ కార్స్, మాథ్యూ పాట్స్, బెన్ డ్వార్షుయిస్*, గ్రాహం క్లార్క్, పాట్ బ్రౌన్, టామ్ లావెస్, జాక్ క్రాలే, డాన్ లారెన్స్, మైఖేల్ పెప్పర్, డేవిడ్ మలన్.మహిళలు: ఫోబ్ లిచ్‌ఫీల్డ్*, అన్నాబెల్ సదర్లాండ్*, జార్జియా వేర్‌హామ్*, కేట్ క్రాస్, బెస్ హీత్, లిన్సే స్మిత్, హోలీ ఆర్మిటేజ్, ఆలిస్ డేవిడ్సన్-రిచర్డ్స్, గ్రేస్ బలింగర్, డేవినా పెర్రిన్, గ్రేస్ పాట్స్, లూసీ హిఘం, ఎల్లా క్లారిడ్జ్.ఓవల్ ఇన్విన్సిబుల్స్పురుషుల విభాగం: సామ్ కర్రాన్, విల్ జాక్స్, టామ్ కర్రాన్, జోర్డాన్ కాక్స్, రషీద్ ఖాన్*, సాకిబ్ మహమూద్, సామ్ బిల్లింగ్స్, గస్ అట్కిన్సన్, నాథన్ సౌటర్, డోనోవన్ ఫెర్రీరా*, తవాండా ముయేయ్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్*, మైల్స్ హామండ్.మహిళలు: మారిజాన్ కాప్*, ఆలిస్ కాప్సే, లారెన్ విన్‌ఫీల్డ్-హిల్, అమాండా-జేడ్ వెల్లింగ్టన్*, మెగ్ లాన్నింగ్*, టాష్ ఫారెంట్, రైనా మెక్‌డోనాల్డ్-గే, సోఫియా స్మాల్, జో గార్డ్నర్, రాచెల్ స్లేటర్, పైజ్ స్కోల్‌ఫీల్డ్, ఫోబ్ ఫ్రాంక్లిన్, కలియా మూర్.సదరన్ బ్రేవ్పురుషులు: జేమ్స్ విన్స్, జోఫ్రా ఆర్చర్, టైమల్ మిల్స్, క్రిస్ జోర్డాన్, ఫాఫ్ డు ప్లెసిస్*, ల్యూస్ డు ప్లూయ్, క్రెయిగ్ ఓవర్టన్, లారీ ఎవాన్స్, ఫిన్ అల్లెన్*, డానీ బ్రిగ్స్, జేమ్స్ కోల్స్, మైఖేల్ బ్రేస్‌వెల్*, రీస్ టోప్లీ, జోర్డాన్ థాంప్సన్.మహిళలు: లారా వోల్వార్డ్*, డానీ వ్యాట్-హాడ్జ్, మైయా బౌచియర్, లారెన్ బెల్, ఫ్రెయా కెంప్, జార్జియా ఆడమ్స్, టిల్లీ కోర్టీన్-కోల్‌మన్, రియానా సౌత్‌బై, సోఫీ డెవిన్*, క్లోయ్ ట్రయాన్*, మాడీ విలియర్స్, జోసీ గ్రోవ్స్, ఫోబ్ గ్రాహం.ట్రెంట్ రాకెట్స్పురుషుల విభాగం: జో రూట్, మార్కస్ స్టోయినిస్*, టామ్ బాంటన్, జాన్ టర్నర్, సామ్ కుక్, సామ్ హైన్, టామ్ అల్సోప్, కాల్విన్ హారిసన్, డేవిడ్ విల్లీ, లాకీ ఫెర్గూసన్*, మాక్స్ హోల్డెన్, జార్జ్ లిండే*, ఆడమ్ హోస్, రెహాన్ అహ్మద్.మహిళలు: ఆష్ గార్డ్నర్*, నాట్ స్కైవర్-బ్రంట్, అలానా కింగ్*, హీథర్ గ్రాహం*, బ్రయోనీ స్మిత్, గ్రేస్ స్క్రీవెన్స్, కిర్స్టీ గోర్డాన్, అలెక్సా స్టోన్‌హౌస్, నటాషా వ్రైత్, కాసిడీ మెక్‌కార్తీ, జోడి గ్రూకాక్, ఎమ్మా జోన్స్, ఎల్లీ థ్రెల్‌కెల్డ్.వెల్ష్ ఫైర్పురుషుల విభాగం: క్రిస్ వోక్స్, స్టీవ్ స్మిత్*, జానీ బెయిర్‌స్టో, టామ్ కోహ్లర్-కాడ్మోర్, టామ్ అబెల్, ల్యూక్ వెల్స్, స్టీఫెన్ ఎస్కినాజీ, డేవిడ్ పేన్, పాల్ వాల్టర్, రిలే మెరెడిత్*, క్రిస్ గ్రీన్*, సైఫ్ జైబ్, జోష్ హల్, మాసన్ క్రేన్.మహిళలు: హేలీ మాథ్యూస్*, టామీ బ్యూమాంట్, జెస్ జోనాసెన్*, షబ్నిమ్ ఇస్మాయిల్*, సారా బ్రైస్, జార్జియా ఎల్విస్, ఫ్రెయా డేవిస్, జార్జియా డేవిస్, ఎమిలీ విండ్సర్, బెత్ లాంగ్‌స్టన్, సోఫియా డంక్లీ, కేటీ జార్జ్, కేటీ లెవిక్.

Sunita Williams Return Delayed Again Here Complete Details8
Sunita Williams: మళ్లీ నిరాశే.. చివరి నిమిషంలో ప్రయోగం వాయిదా

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్మోర్‌ రాక విషయంలో మళ్లీ నిరాశే ఎదురైంది. వీరిద్దరి రాక ఇంకాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ నుంచి వీళ్లను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా-స్పేస్‌ఎక్స్‌ సంయుక్తంగా ‘క్రూ 10 మిషన్‌’ చేపట్టింది. అయితే ఇవాళ జరగాల్సిన ఈ ప్రయోగం.. చివరి నిమిషంలో నిలిచిపోయింది. కిందటి ఏడాది క్రూ9 మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌కి వెళ్లిన సునీత, విల్మోర్‌లు అక్కడే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అయితే క్రూ-10 మిషన్‌ ద్వారా మరో నలుగురు వ్యోమగాముల్ని అక్కడికి పంపి.. ఆ ఇద్దరినీ వెనక్కి రప్పించాలని అనుకున్నారు. ఈ ఉదయం ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష ప్రయోగ కేంద్రం 39ఏ కాంప్లెక్స్‌ నుంచి రాకెట్‌ ప్రయోగం కౌంట్‌ డౌన్‌ సైతం దగ్గర పడింది. అయితే చివరి నిమిషంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది. రాకెట్‌ హైడ్రాలిక్‌ సిస్టమ్‌లో సమస్య ఉత్పన్నం కావడంతో ప్రయోగం నిలిపివేసినట్లు నాసా ప్రకటించింది. దీంతో నలుగురు వ్యోమగాములు బయటకు వచ్చేశారు. రేపు, లేదంటే ఎల్లుండి.. ఈ ప్రయోగాన్ని తిరిగి నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఇటు నాసా, అటు స్పేస్‌ఎక్స్‌ ప్రకటించుకున్నాయి. ఈ ప్రయోగం జరిగిన వారం తర్వాత.. సునీత, విల్‌మోర్‌లు భూమ్మీదకు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి.ప్రీపోన్‌ అయినప్పటికీ.. తొలుత మార్చి 25వ తేదీన ఈ ప్రయోగాన్ని షెడ్యూల్‌ చేసి.. ఆ తర్వాత ముందుకు జరిపింది నాసా. అయితే ఇవాళ జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో సమస్య తలెత్తి వాయిదా పడింది. క్రూ-10 ద్వారా కొత్త టీం అక్కడికి చేరుకోగానే.. స్పేస్‌ఎక్స్‌కు చెందిన డ్రాగన్‌ క్యాప్సూల్‌ ‘ఎండేవర్‌’ ద్వారా సునీత, విల్మోర్‌లు భూమ్మీదకు తిరిగి వస్తారు. అదే సమయంలో ఐఎస్‌ఎస్‌ నిర్వహణ కూడా నిలిచిపోకుండా ఉండగలుగుతుందన్నమాట. ఇక క్రూ10లో వెళ్లే నలుగురు వోమగాములు 150 రోజులపాటు ఐఎస్‌ఎస్‌లోనే ఉంటారు. ఆ తర్వాత స్పేస్‌ ఎక్స్‌కే చెందిన ఎండూరెన్స్‌ క్యాప్సూల్‌ ద్వారా భూమ్మీదకు వస్తారు.9 నెలల నిరీక్షణ.. కిందటి ఏడాది జూన్‌లో బోయింగ్‌ స్టార్‌లైనర్‌ ద్వారా క్రూ9 మిషన్‌లో భాగంగా సునీత సహా నలుగురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. అయితే.. స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇద్దరు వోమగాములు నిక్‌ హేగ్, అలెగ్జాండర్‌ గోర్బునోవ్‌లు మాత్రమే తిరిగి భూమ్మీదకు వచ్చారు. దీంతో అప్పటి నుంచి సునీత, విల్‌మోర్‌లు స్పేస్‌ స్టేషన్‌లోనే ఉండిపోయారు. వీరి రాక కోసం యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.

Posani Crying infront of Judge Over Kutami Cases9
లోకేశ్‌ ఆహ్వానాన్ని తిరస్కరించినందుకే ఇదంతా: పోసాని

సాక్షి, అమరావతి /గుంటూరు లీగల్‌: తన మీద ఎన్ని కేసులు కట్టారో తనకే తెలియదని, రాష్ట్రమంతా తిప్పుతున్నారని, తాను నిజంగా తప్పు చేస్తే నరికేయండి సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి కన్నీళ్లు పెట్టుకున్నారు. బెయిల్‌ రాకపోతే తనకు ఆత్మహత్యే శరణ్యమని అంటున్నారాయన. పోసానిని సీఐడీ పోలీసులు బుధవారం రాత్రి గుంటూరులో ఎక్సైజ్‌ కోర్టు న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరు పరిచారు. ఈ సందర్భంగా పోసాని అనారోగ్య సమస్యల గురించి విన్నవించుకున్నారు. తన పరిస్థితి చాలా దైన్యంగా ఉందని దయచేసి విడుదల చేయమని వేడుకున్నారు. ఈ కేసులకు సంబంధించి తనకు ఎటువంటి పాపం తెలియదని, తానేం చేయలేదని న్యాయమూర్తి ఎదుట బోరున విలపించారు. నిజం మాట్లాడినందుకు తన మీద కక్ష కట్టి ఇలాంటి అన్యాయమైన కేసులు పెట్టారని విన్నవించారు. తల్లి మీద, పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నానని తనకే పాపమూ తెలియదని న్యాయమూర్తిని వేడుకొన్నారు. బెయిల్‌ ఇవ్వాలని కోరారు. వయసు మీదపడడంతో కూర్చోలేక పోతున్నానని చెప్పుకొచ్చారు. పోలీసులు ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదని, ఇప్పటికే కొన్ని వందల మైళ్లు ప్రయాణం చేయించారని, ఎందుకు నన్ను తిప్పుతున్నారో అర్థం కావడం లేదని, ఇలా చేస్తే తాను ఎక్కువ రోజులు బతకనని మొరపెట్టుకున్నారు. టీడీపీలోకి రమ్మంటే రానందుకు లోకేశ్‌ తనను వేధిస్తున్నారని, నంది అవార్డుల ప్రకటనలో పక్షపాతాన్ని ఎత్తిచూపడంతో కక్ష కట్టారని తెలిపారు. అన్నీ నిజాలే చెబుతున్నానని నార్కో ఎనాలసిస్‌ టెస్టుకూ సిద్ధమన్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే ఇన్ని కేసులు కడతారా అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, న్యాయమూర్తి బెయిల్‌ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్‌ విధించారు. పోసానిని గుంటూరు జైలుకు తరలించారు. హైకోర్టులో పోసాని పిటిషన్‌ కొట్టివేత సోషల్‌ మీడియా పోస్టుల వ్యవహారంలో సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయడంతో పాటు తదుపరి చర్యలన్నీ నిలిపేయాలని కోరుతూ సినీ నటుడు పోసాని కృష్ణమురళి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే పీటీ వారెంట్‌ను అమలు చేసి కర్నూలు నుంచి మంగళగిరి మేజిస్ట్రేట్‌ వద్దకు పోసానిని తీసుకొస్తున్నామని రాష్ట్ర పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ చెప్పడంతో.. హైకోర్టు దానిని పరిగణనలోకి తీసుకుంది. పీటీ వారెంట్‌ అమలైన నేపథ్యంలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యం కాదంటూ పిటిషన్‌ను తోసిపుచి్చంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నూనెపల్లి హరినాథ్‌ బుధవారం ఉత్తర్వులిచ్చారు. సీఎం చంద్రబాబును పోసాని దూషించారంటూ మంగళగిరికి చెందిన తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు గతేడాది కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

Telangana Police Given Notices To BRS Mlc Pochampally Srinivas Reddy10
విచారణకు రావాల్సిందే.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీకి పోలీసుల నోటీసులు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మరోసారి రాజకీయం ఆసక్తికరంగా మారింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ కేసుకు సంబంధించి రేపు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో, ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది.బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి బిగ్‌ షాకిచ్చారు పోలీసులు. ఆయన ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన క్యాసినో, కోళ్ల పందేల కేసులో తాజాగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. మాదాపూర్‌లోకి పోచారం ఇంటికి వెళ్లిన పోలీసులు.. నోటీసులు అంటించారు. ఈ క్రమంలో రేపు మొయినాబాద్‌ పోలీసు స్టేషన్‌లో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక, అంతకుముందు ఈ కేసులో ఇచ్చిన నోటీసులకు లాయర్‌ ద్వారా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సమాధానం ఇచ్చారు. తాజాగా నోటీసుల నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌ నగర శివారు మొయినాబాద్‌లోని తోల్కట్ట గ్రామంలో సర్వే నెంబర్‌ 165/a లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు చెందిన ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో పోచంపల్లిని నిందితుడిగా చేర్చారు. పోచంపల్లిపై సెక్షన్‌-3 అండ్‌ గేమింగ్‌ యాక్ట్‌, సెక్షన్‌-11 యానిమల్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు ఇచ్చిన నోటీసులకు అప్పుడు.. తన లాయర్‌ ద్వారా పోచంపల్లి సమాధానం ఇచ్చారు. అనంతరం, పోచంపల్లి స్పందిస్తూ..‘ఫామ్‌హౌస్‌ తనదేనని.. రమేష్‌ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని ఆయన తెలిపారు. అతను ఇంకో వ్యక్తికి లీజుకిచ్చారనే విషయం తనకు తెలియదన్న పోచంపల్లి.. తాను ఫామ్‌హౌస్‌కు వెళ్లి 8 ఏళ్లు అయ్యిందన్నారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించానని తెలిపారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

International View all
title
Balochistan: జిన్నా చేసిన ద్రోహమే.. పాక్‌కు ముప్పుగా మారిందా?

ఖనిజ సంపద అధికంగా ఉన్న బలూచిస్తాన్‌(

title
అమెరికాకు పుతిన్‌ డిమాండ్స్‌.. రష్యాకు ట్రంప్‌ సీరియస్‌ వార్నింగ్‌

వాష్టింగన్‌/మాస్కో: ఉక్రెయిన్‌-రష్యా కాల్పుల విరమణ ఒప్పందంలో

title
గాజా ప్లాన్‌పై ట్రంప్‌ రివర్స్‌ గేర్‌

వాషింగ్టన్‌: ఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధంతో శిథిలమైన గాజాను స్వా

title
Sunita Williams: మళ్లీ నిరాశే.. చివరి నిమిషంలో ప్రయోగం వాయిదా

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్‌, బచ్‌ విల్మోర్‌ రాక విషయంలో మళ్లీ నిరాశే ఎదురైంది.

title
పాక్‌ రైలు హైజాక్‌: 50 నిమిషాలు నరకమే.. ప్రయాణీకుడి ఆవేదన

ఇస్లామాబాద్‌: సంచలనం సృష్టించిన రైలు హైజాక్‌ ఉదంతానికి తెర ద

NRI View all
title
ఫిలడెల్ఫియాలో తానా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఫిలడెల్ఫియాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.

title
భారత విద్యార్థుల చూపు.. ఆ దేశాలవైపు!

ఉన్నత విద్య కోసం అగ్ర రాజ్యాలకు వెళ్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.

title
సుదీక్ష మిస్సింగ్‌.. కిడ్నాపైందా?

న్యూఢిల్లీ: కరీబియన్‌ దేశం డొమినికన్‌ రిపబ్లిక్‌లో తెలుగు వి

title
టీటీఏ (TTA) న్యూయార్క్‌ చాప్టర్‌ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA)  న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి &

title
న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు

మహిళలకు  ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి  పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోస

Advertisement

వీడియోలు

Advertisement