Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today

Top Stories

ప్రధాన వార్తలు

Once Again Lies Of Eenadu News Paper Have Been Exposed1
మరోసారి బయటపడ్డ ఈనాడు పచ్చి అబద్ధాలు

సాక్షి, అమరావతి: మరోసారి ‘ఈనాడు’ పచ్చి అబద్ధాలు బయటపడ్డాయి. సెకీ సీఎండీ రామేశ్వరగుప్తాను కేంద్రం తొలగించిన వార్తపై ఈనాడు వక్రభాష్యం చెప్పింది. వైఎస్‌ జగన్‌ హయాంలో ఏపీలో జరిగిన విద్యుత్‌ ఒప్పందాలే తొలగింపునకు కారణం అంటూ ఈనాడు అబద్ధాలు రాసింది.2023లో జూన్‌లో సెకీ సీఎండీగా రామేశ్వర్‌ పదవి చేపట్టగా.. రామేశ్వర్‌ గుప్తా ఛైర్మన్‌ కాకముందే ఏపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుంది. రామేశ్వర్‌ గుప్తా సెకీలో లేనప్పుడు ఒప్పందాలు జరిగితే.. ఆయన తొలగింపునకు ఏపీతో జరిగిన ఒప్పందాలే కారణమంటూ ఈనాడు అబద్ధాలు అచ్చేసింది.2021 డిసెంబర్‌లోనే ఏపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం కుదుర్చుకుందని ఈనాడు ఒప్పుకుంది. అబద్ధం వండివార్చాలనే తాపత్రయంలో కనీసం వాస్తవాలు ఏంటో తెలుసుకోని ఈనాడు.. అడ్డగోలు రాతలతో రెచ్చిపోయింది.ఈనాడు పిచ్చిరాతలపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్‌ జగన్‌ వ్యక్తిత్వ హననం కోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోతారా? నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారా?. ఈనాడుది జర్నలిజమా? లేక బ్రోకరిజమా?. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంపై సెకీతో 2021 డిసెంబర్‌లో ఒప్పందం జరిగింది. 2023లో సెకీ సీఎండీగా రామేశ్వర్‌ గుప్తా నియమితులయ్యారు. 2023లో ఛైర్మన్‌ అయిన రామేశ్వర్‌ గుప్తాకు 2021 నాటి ఏపీ-సెకీ ఒప్పందానికి ఏం సంబంధం’’ అంటూ వైఎస్సార్‌సీపీ ప్రశ్నించింది.‘‘సెకీకి రామేశ్వర్‌ గుప్తా సీఎండీ కాకముందు కేంద్ర పర్యావరణ శాఖ సెక్రటరీగా పనిచేశారు. అనిల్‌ అంబానీ కంపెనీ ఫేక్‌ డాక్యుమెంట్లతో బిడ్డింగ్‌ వేశారన్న ఆరోపణలు నేపథ్యంలో రామేశ్వర్‌ గుప్తాను తొలగించినట్టుగా 5-6 రోజులుగా జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను వక్రీకరించి ఏపీ-సెకీ ఒప్పందానికి లింకు పెడుతూ.. నిస్సిగ్గుగా ఈనాడు పచ్చి అబద్ధాలు రాసింది’’ అని వైఎస్సార్‌సీపీ మండిపడింది.

They Advised: Details Of India A Team Selection For England Tour Revealed2
ఇంగ్లండ్‌ టూర్‌: వారినే ఎంపిక చేయమని బీసీసీఐ ఆదేశం!?

ఐపీఎల్‌-2025 (IPL 2025) ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు అంతర్జాతీయ షెడ్యూల్‌తో బిజీకానున్నారు. ఇందులో భాగంగా భారత జట్టు తొలుత ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లనుంది. ఇరుజట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (WTV) 2025-27 సీజన్‌ ఆరంభం కానుంది.తొలుత అనధికారిక టెస్టులుఅయితే, అంతకంటే ముందే భారత్‌-‘ఎ’- ఇంగ్లండ్‌ లయన్స్‌ (India A vs England Lions)తో తలపడనుంది. ఇరు జట్ల మధ్య రెండు అనధికారిక టెస్టులు జరుగుతాయి. మే 30 నుంచి తొలి మ్యాచ్, జూన్‌ 6 నుంచి రెండో మ్యాచ్‌ జరుగుతాయి. ఆ తర్వాత భారత సీనియర్‌ జట్టు, భారత ‘ఎ’ టీమ్‌ మధ్య కూడా జూన్‌ 13 నుంచి ఒక నాలుగు రోజుల మ్యాచ్‌ జరుగుతుంది.జైసూ, నితీశ్‌, గిల్‌, జురెల్‌ కూడాఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఇంగ్లండ్‌ పర్యటనకు వెళ్లే భారత్‌-‘ఎ’ జట్టును ప్రకటించింది. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్‌ గత సీజన్‌లో అద్భుతంగా చెలరేగిన బ్యాటర్‌ కరుణ్‌ నాయర్‌కు భారత టెస్టు టీమ్‌లో పునరాగమనం చేసేందుకు మరో అవకాశం లభించింది. ఇంగ్లండ్‌ ‘ఎ’ జట్టుతో రెండు ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లలో తలపడేందుకు సెలక్టర్లు ఎంపిక చేసిన భారత ‘ఎ’ జట్టులో కరుణ్‌ నాయర్‌కు చోటు లభించింది. అదే విధంగా ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ టెస్టు సిరీస్‌లో సభ్యులైన యశస్వి జైస్వాల్, ధ్రువ్‌ జురేల్, నితీశ్ కుమార్‌‌ రెడ్డి, హర్షిత్‌ రాణా, సర్ఫరాజ్‌ ఖాన్‌, ఆకాశ్‌దీప్‌లను కూడా భారత ‘ఎ’ జట్టుకి సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌లో పరిస్థితులను అర్థం చేసుకునేందుకు యువ ఆటగాళ్లకు ఈ ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు సరైన అవకాశంగా సెలక్టర్లు భావించారు.వారినే ఎంపిక చేయమని బీసీసీఐ ఆదేశం!?అయితే, ఈ జట్టు ఎంపిక సమయంలో బీసీసీఐ ఆచితూచి అడిగేసిందంటూ బోర్డు సన్నిహిత వర్గాలు వార్తా సంస్థ IANSకు ఆసక్తికర విషయాలు వెల్లడించాయి. ‘‘భారత్‌-‘ఎ’ జట్టు ఎంపిక విషయంలో ఒక విధమైన గందరగోళం నెలకొందనే చెప్పాలి. ఏ ఆటగాడిని తీసుకోవాలో అర్థం కాలేదు.అప్పుడు బీసీసీఐ సెలక్టర్లకు ఓ సలహా ఇచ్చింది. ఐపీఎల్‌-2025 ప్లే ఆఫ్స్‌నకు చేరని జట్ల నుంచి ఆటగాళ్లను ఎంపిక చేయమని చెప్పింది. వారికి ప్రాధాన్యం ఉండేలా చూసుకోమంది. ఎందుకంటే.. భారత్‌-‘ఎ’ జట్టు మే 25న ఇంగ్లండ్‌కు బయలుదేరాల్సి ఉంది’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు వార్తా సంస్థతో చెప్పుకొచ్చాయి.కాగా ఇంగ్లండ్‌కు వెళ్లే భారత్‌-‘ఎ’ జట్టులో గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, ఓపెనర్‌ సాయి సుదర్శన్‌లు ఉన్నారు. వీరి టీమ్‌ ప్లే ఆఫ్స్‌ రేసులో ముందుంది. మిగతా ఆటగాళ్ల జట్లు రాజస్తాన్‌ రాయల్స్‌ (యశస్వి జైస్వాల్‌, ధ్రువ్‌ జురెల్‌), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఇషాన్‌ కిషన్‌, నితీశ్‌ రెడ్డి), చెన్నై సూపర్‌ కింగ్స్‌ (రుతురాజ్‌ గైక్వాడ్‌, ఖలీల్‌ అహ్మద్‌, అన్షుల్‌ కాంబోజ్ తదితరులు) ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ పోటీ నుంచి నిష్క్రమించాయి.ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపిక చేసిన భారత్‌- ‘ఎ’ జట్టు అభిమన్యు ఈశ్వరన్‌ (కెప్టెన్‌), ధ్రువ్‌ జురేల్‌ (వైస్‌ కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, కరుణ్‌ నాయర్, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, శార్దుల్‌ ఠాకూర్, ఇషాన్‌ కిషన్, మానవ్‌ సుతార్, తనుశ్‌ కొటియాన్, ముకేశ్ కుమార్‌, ఆకాశ్‌దీప్, హర్షిత్‌ రాణా, అన్షుల్‌ కాంబోజ్, ఖలీల్‌ అహ్మద్, రుతురాజ్‌ గైక్వాడ్, సర్ఫరాజ్‌ ఖాన్, తుషార్‌ దేశ్‌పాండే, హర్ష్‌ దూబే, శుబ్‌మన్‌ గిల్, సాయిసుదర్శన్‌.చదవండి: రోహిత్‌ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!

Ysrcp Leader Bhumana Karunakar Reddy Fires On Chandrababu Conspiracy3
చంద్రబాబు కుట్ర ఇదే: భూమన

సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీని నాశనం చేయాలనే లక్ష్యంతోనే సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని మాజీ టీటీడీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి మండపడ్డారు. మాజీ ప్రభుత్వ ఉద్యోగులు కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిల అరెస్ట్‌లను ఖండిస్తూ తిరుపతి క్యాంప్ కార్యాలయం నుంచి వీడియోను విడుదల చేశారు. ‘‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోంది. చంద్రబాబు అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీని నాశనం చేయాలని, వైఎస్‌ జగన్ నాయకత్వాన్ని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. వైఎస్సార్‌సీపీపై కక్షతో నిరంతరం దుర్మార్గంగా పనిచేస్తోంది. వైఎస్‌ జగన్‌ను బలహీనపరచాలని, అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను వేధింపులకు గురి చేయడమే కాకుండా చివరికి ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలడం లేదు...గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారనే కక్షతో తప్పుడు కేసులు బనాయించి, జైలుకు పంపుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోవడం, సూపర్ సిక్స్ విషయంలో ఏడాది కాలంలో ఎటువంటి హామీని అమలు చేయలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. దీనికి పరాకాష్టగా లేని మద్యం స్కామ్‌లో సీనియర్ ప్రభుత్వ అధికారులుగా పనిచేసిన కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయరెడ్డిలను అరెస్ట్ చేశారు. వీరి సర్వీస్ కాలంలో చిత్తశుద్దితో, నిజాయితీతో పనిచేసిన సమర్థులైన అధికారులుగా వీరు పేరు సంపాదించుకున్నారు...తప్పుడు ఆరోపణలతో వైఎస్‌ జగన్‌ను రాజకీయంగా దెబ్బతీయడానికే వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. ప్రజలకు ఆమోదయోగ్యమైన పాలన చేయకుండా, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి అంటకాగారనే నెపంతో సివిల్ సర్వెంట్‌లు, ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేయడం అత్యంత దారుణం. ఇలా చేస్తుంటే ఏ ప్రభుత్వ అధికారి చిత్తశుద్దితో పనిచేస్తారు? ఎక్కడా జరగని మద్యం కుంభకోణంను సృష్టించి, దీనిలో వైఎస్‌ జగన్‌ను ఇరికించి, అరెస్ట్ చేయాలనే కుట్రతోనే చంద్రబాబు పనిచేస్తున్నారు...ఇలాంటి తప్పుడు కేసులు బనాయించి, ఇదే తరహాలో పాలన సాగించాలని అనుకుంటే ప్రజలు సరైన సమయంలో బుద్ది చెబుతారు. శిశుపాలుడి మాదిరిగా చంద్రబాబు చేస్తున్న తప్పులను కృష్ణుడి మాదిరిగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల గురించి ఆలోచించకుండా, ప్రతి పదిహేను రోజులకు ఒక డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రయోగిస్తూ, గత వైయస్ఆర్‌సీపీపై ఏదో ఒక ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారు. నిజాయితీపరులైన అధికారులను జైళ్లకు పంపడం ద్వారా చంద్రబాబు సర్కార్ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రతీకార చర్యలను చూసి రేపు మన భవిష్యత్తు ఏమిటీ అనే ఆత్మ మథనం అధికారుల్లో ప్రారంభమైంది’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి పేర్కొన్నారు.

Seven MPs Carry Message To World Over Ind-Pak Clash4
పాక్‌కు భారత్‌ చెక్‌.. ఏడుగురు ఎంపీలతో దౌత్య యుద్ధం!

ఢిల్లీ: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు పాకిస్తాన్‌ తీరు ఎండగట్టేందుకు భారత్‌ పక్కా ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే పాక్‌ ఉగ్ర కుట్రలను ప్రపంచదేశాలకు వివరించడం కోసం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వం ఏర్పాటుచేసిన మొత్తం ఏడు గ్రూపులు 10 రోజుల వ్యవధిలో ఐదు దేశాలకు వెళ్తాయి. ఈ మేరకు ప్రతినిధుల బృందాలకు సంబంధించిన వివరాలను కేంద్రం శనివారం వెల్లడించింది.అఖిలపక్ష ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లను కేంద్రం ప్రకటించింది. వీరిలో ఎంపీలు శశిథరూర్‌ (కాంగ్రెస్‌), సుప్రియా సూలే (ఎన్సీపీ -ఎస్పీ), కనిమొళి (డీఎంకే), రవిశంకర్‌ ప్రసాద్‌(బీజేపీ), బైజయంత్‌ పాండా (బీజేపీ) సంజయ్‌ కుమార్‌ ఝా(జేడీయూ), శ్రీకాంత్‌ శిందే (శివసేన) విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీరంతా.. మే 22న విదేశాలకు బయలుదేరి జూన్ మొదటి వారంలో తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని దేశాలు, ఇతర కీలక దేశాలను అఖిలపక్ష బృందం సందర్శించనుంది. ఉగ్రవాదం అణిచివేతకు భారత్ అనుసరిస్తున్న జీరో టాలరెన్స్ విధానాన్ని అఖిలపక్ష నేతలు వివరించనున్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని వ్యతిరేకించాల్సిందే అనేది భారత విధానమని చెప్పనున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఏకతాటిపై నిలబడిందని సందేశం ఇచ్చేందుకు అఖిలపక్షం ఏర్పాటైంది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాక్‌ ఏవిధంగా మద్దతు పలుకుతోందనే విషయాన్ని.. ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)తో ఉగ్రవాదంపై భారత్‌ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు వివరించనున్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్‌ అనుసరిస్తున్న పాత్రను.. దానివల్ల ప్రపంచదేశాలకు పొంచిఉన్న ముప్పును వివరించనుంది. భవిష్యత్తులో భారత్‌పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత ఇవ్వనుంది. ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టడానికి కారణమైన పాక్‌ రెచ్చగొట్టే చర్యలు, పాక్‌ బెదిరింపులకు ధీటుగా భారత్‌ ఆపరేషన్‌ సిందూర్‌ను ఎలా చేపట్టిందో వివరణ ఇవ్వనుంది. ఆపరేషన్ సమయంలో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే కచ్చితంగా లక్ష్యంగా చేసుకొని దాడులు చేశామని, పౌరులకు ఎలాంటి హానీ చేయలేదని ఆధారాలు చూపించనున్నారు. Union Minister Kiren Rijiju tweets "In moments that matter most, Bharat stands united. Seven All-Party Delegations will soon visit key partner nations, carrying our shared message of zero-tolerance to terrorism. A powerful reflection of national unity above politics, beyond… pic.twitter.com/yYiQF4ufEF— ANI (@ANI) May 17, 2025కాంగ్రెస్‌ లిస్టులో నో శశిథరూర్‌.. చివరకు ట్విస్ట్‌..ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పంపిన జాబితాలో అసలు థరూర్ పేరు లేకపోవడం గమనార్హం. పాక్‌ను ఎండగట్టేందుకు పంపే బృందం కోసం పేర్లు పంపాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మే 16న కాంగ్రెస్‌ను కోరగా, అదే రోజున హస్తం పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ నాలుగు పేర్లు పంపారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్‌ హుస్సేన్‌, లోక్‌సభ ఎంపీ రాజా బ్రార్, మరో నేత గౌరవ్‌ గొగొయ్‌ ఉన్నారని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆ లిస్ట్‌లో థరూర్‌ పేరు లేదు. అయితే ఈ రోజు కేంద్రం విడుదల చేసిన తుది జాబితాలో వారి పేర్లేవీ లేవు. కానీ తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌కు మాత్రం అనూహ్యంగా చోటు దక్కింది.మరోవైపు, శశిథరూర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘ఇటీవలి పరిణామాలపై దేశం విధానాన్ని వివిధ దేశాలకు వివరించేందుకు వెళ్తున్న బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. దేశ ప్రయోజనాలతో ముడిపడిన సందర్భాల్లో అక్కడ నా అవసరం ఉంటే.. నేను అందుబాటులో ఉంటా. జైహింద్‌’ అంటూ వ్యాఖ్యలు చేశారు. Yesterday morning, the Minister of Parliamentary Affairs Kiren Rijiju spoke with the Congress President and the Leader of the Opposition in the Lok Sabha. The INC was asked to submit names of 4 MPs for the delegations to be sent abroad to explain India's stance on terrorism from…— Jairam Ramesh (@Jairam_Ramesh) May 17, 2025

KSR Comments On Chandrababu Govt Schemes5
బాబూ.. కూటమి సంక్షేమం ఉత్తుత్తి మాటేనా?

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రభావం ప్రస్తుత అధికార కూటమిపై బాగానే ఉన్నట్టుంది. ఇచ్చిన హామీలను దాదాపుగా నెరవేర్చిన జగన్‌ ఒక పక్కనుంటే.. ఇంకోపక్క ఒకటి అర కూడా అమలు చేయని కూటమి ఇంకోవైపున ఉంది. రెండింటినీ పోల్చుకుంటున్న ప్రజలు అసంతృప్తిని వెళ్లగక్కుతుంటే.. దాన్ని చల్చార్చలేక కూటమి డైవర్షన్‌ రాజకీయాలకు పాల్పడుతోంది. రెడ్‌బుక్‌ పేరుతో సృష్టిస్తున్న ఆరాచకాలు.. జగన్‌పై లేనిపోని అభాండాలు వేయడం వంటివి ఎన్ని చేస్తున్నా ప్రజల్లో అసంతృప్తిని మాత్రం ఇసుమంత కూడా తగ్గడం లేదు.ఈ విషయం కూటమి నేతలకూ బాగానే అర్థమైంది. ఎక్కడికెళ్లినా జగన్‌కు ప్రజాదరణ ఏమాత్రం తగ్గకపోవడం కూడా కూటమి నేతలకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు, ఎల్లోమీడియా తన స్వరాన్ని కొంత మార్చుకుంటున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. సూపర్‌సిక్స్‌ హామీల్లో అన్నీ కాకపోయినా కొన్నింటినైనా అమలు చేసినట్లు కనిపించాలని సంక్షేమ రాగం ఎత్తుకున్నాయి!. అయితే ఇందులోనూ చిత్తశుద్ధి కనిపించడం లేదు. సంక్షేమ కార్యక్రమాల పేరిట టీడీపీ కార్యకర్తలకు నిధుల పందేరానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. టీడీపీ పోలిట్‌ బ్యూరో నిర్ణయాలు కొన్నింటిని గమనిస్తే.. పార్టీ కేడర్‌ను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యమని స్పష్టమవుతుంది.టీడీపీ కార్యకర్తలకు గతంలో పెండింగ్‌లో ఉన్న నీరు-చెట్టు, ఉపాధి హామీ పనులకు సంబంధించి సుమారు రూ.650 కోట్ల చెల్లించేందుకు నిర్ణయించారు. ఈ స్కీమ్‌ల కింద పనులు చేయకుండా చేసినట్లు చూపించడం, పలు అవకతవకలు పాల్పడినందున అప్పట్లో విజిలెన్స్ అధికారులు విచారణ చేసి నిధుల మంజూరును నిలిపి వేశారు. కూటమి అధికారంలోకి రాగానే ఇలాంటి పనుల బిల్లులు సుమారు రూ.1000కోట్ల మేర చెల్లించారని వార్తలు వచ్చాయి. తాజాగా మరో రూ.650 కోట్ల నిధులు పంచబోతున్నారు. విశేషం ఏమిటంటే టీడీపీ కార్యకర్తలే ఈ పనులు చేపట్టారని పార్టీ అంగీకరించడం!. పాలిట్ బ్యూరో నిర్ణయాన్ని ప్రజలు వేరే రకంగా భావించకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం సంక్షేమ స్కీములు అమలు చేయబోతోందని, సంక్షేమ క్యాలెండర్ తీసుకురాబోతోందని, దీని ద్వారా ప్రతి నెల ఒక స్కీము అమలు చేయాలని నిర్ణయించారని ఉచిత సిలిండర్లకు సంబంధించి నగదు ముందుగానే లబ్దిదారుల ఖాతాలలోకి వేయాలని నిర్ణయించారంటూ, సంక్షేమ సందడి అంటూ ఎల్లో మీడియా ప్రచారంలో పెట్టింది. టీడీపీ ఈ మాత్రం నిర్ణయాలైనా తీసుకుందంటే అది జగన్ ఎఫెక్ట్ అని తెలుస్తూనే ఉంది.ఉదాహరణకు ఈ మధ్య కాలంలో జగన్ రెండు, మూడు సార్లు అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఎప్పుడు వెళ్లినా అశేష జనసందోహం తరలివచ్చి ఆయనను ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేస్తూ జై కొడుతోంది. తిరుపతిలో తొక్కిసలాట ఘటన పరామర్శకు వెళ్లినప్పుడు, సింహాచలంలో గోడ కూలి మరణాలు సంభవించినప్పుడు వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి వెళ్లినప్పుడు కూడా జనం అభిమానం ఎంతటిదో అంతా గమనించారు. జగన్ ప్రభుత్వంలో మద్యం స్కాం అంటూ తప్పుడు కేసు పెట్టినా జనం పట్టించుకోవడం లేదని అర్థమైంది. దాంతో సంక్షేమం అమలు చేయబోతున్నామని ప్రజలను ఆకట్టుకోవడానికి యత్నిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ, ఇందులో ఒక నిజాయితీ ఉందా అన్న చర్చ వస్తోంది. ఉదాహరణకు ప్రభుత్వం మూడు వంట గ్యాస్ సిలిండర్ల హామీ నెరవేర్చడంలో భాగంగా ముందుగానే వాటికి అయ్యే ఖర్చు మొత్తాన్ని వినియోగదారుల ఖాతాలో వేయాలని పాలిట్‌బ్యూరో నిశ్చయించిందట.జనసేన, బీజేపీలతో కూడా మాట్లాడి దీనిపై తుది నిర్ణయం చేస్తారట. నిజంగానే వంటగ్యాస్ వినియోగుదారులందరికీ ఈ రకంగా డబ్బు వేస్తారా?. మళ్లీ ఇందులో ఏ లిటిగేషన్ పెడతారో తెలియదు. ఎందుకంటే ఇప్పటికి ఏడాది పూర్తి అవుతున్నా, ఒక సిలిండర్ మాత్రమే.. అది కూడా అరకొరగా ఇచ్చి కథ నడిపించారు. అంటే ఒక ఏడాదికి రెండు సిలిండర్ల డబ్బు ఎగవేసినట్లు అవుతుంది. నిజంగానే రెండు లేదా, మూడు సిలిండర్ల నగదు ఇచ్చి ఉంటే దానిని విస్తారంగా ప్రచారంలో పెట్టడానికి చంద్రబాబు అన్ని చర్యలు తీసుకునేవారు కదా?. వెయ్యి రూపాయల పెన్షన్ అదనంగా ఇవ్వడానికే చంద్రబాబు లక్షల రూపాయల ఖర్చు పెట్టి హెలికాప్టర్లలో ప్రయాణిస్తూ సభలు పెట్టి హడావుడి చేస్తున్నారు. అలాంటిది అందరికి సిలిండర్ల డబ్బు ఇస్తే ఇంకెంత హడావుడి చేసేవారు? ఇప్పుడైనా నిజంగానే మూడు సిలిండర్ల డబ్బు వినియోగదారులకు ఇస్తారా? అందుకు అవసరమైన బడ్జెట్ ఉందా అంటే అనుమానమే. ఎందుకంటే బడ్జెట్ లో ఈ స్కీమ్‌కు వంద కోట్లే కేటాయించారని, అది ఎలా సరిపోతుందని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రశ్నించారు. ఆలోచిస్తే ఇది నిజమే కదా అనిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్‌లో సుమారు కోటి గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయనుకుంటే ఎన్ని కోట్లు అవసరం అవుతాయి. మరి ఇప్పుడు కొత్తగా ఏమైనా నిధులు కేటాయిస్తారా అన్నది చెప్పాల్సి ఉంటుంది. లేకుంటే ఇది ప్రచారం కోసమే అన్న సంగతి అర్థం చేసుకోవడం కష్టం కాదు. తల్లికి వందనం గురించి ఇప్పటికి పలు వాయిదాలు వేశారు. మళ్లీ జూన్ అంటున్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మరో రెండు నెలలు పడుతుందని చెబుతున్నారు. మహిళలకు రూ.1500 చొప్పున ఇస్తామన్న హామీ గురించి చెప్పడం లేదు. అలాగే నిరుద్యోగ భృతిని ఏం చేశారు?. బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ అని ఆర్భాటంగా చెప్పారు. ఆ మాట గురించి ఏంటి?. జగన్ ఆయా స్కీమ్‌లను పద్ధతి ప్రకారం అమలు చేస్తే శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేశారు. ఎన్నికలు వచ్చేసరికి తాము రెండు, మూడు రెట్లు ఎక్కువ ఇస్తామని ఊదరగొట్టారు. అధికారం వచ్చాక అప్పులు పుట్టడం లేదని ఒకసారి, సంక్షేమ పథకాలు వంద శాతం అమలు చేసేశామని ఇంకోసారి, అప్పులు చేసి సంక్షేమం అమలు చేయలేమని మరోసారి చెప్పారు.ఇలా ఎప్పుడు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలకు ఏం ఉపయోగం?. పాలిట్‌బ్యూరోలో ప్రస్తావనకు వచ్చిన ఇంకో విషయం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి.. దావోస్ నుంచి ఒక్క రూపాయి పెట్టుబడులు రాలేదు కానీ.. ఏడాది కాలంలో రాష్ట్రానికి ఎనిమిది లక్షల కోట్లు వచ్చేశాయని డమ్మీ ప్రచారం మొదలుపెట్టింది కూటమి!. ఇలాంటి అబద్ధాలే.. చంద్రబాబు ప్రభుత్వంపై అపనమ్మకాన్ని రోజు రోజుకూ పెంచుతున్నాయి!.- కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Pak PM Shahbaz Sharif Key Comments With India War6
అవును.. భారత్‌ క్షిపణుల దెబ్బ మాకు తగిలింది: పాక్‌ ప్రధాని

ఇస్లామాబాద్‌: ఆపరేషన్‌ సిందూర్‌పై ఇన్నాళ్లూ బుకాయించిన పాకిస్తాన్‌.. తాజాగా అసలు నిజాలను వెల్లడించింది. నూర్‌ ఖాన్‌, ఇతర వైమానిక స్థావరాలపై దాడి జరిగిందని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అంగీకరించారు. దాడుల విషయం తెల్లవారుజామున 2.30 గంటలకు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసీమ్‌ మునీర్‌ వివరించారని వెల్లడించారు. ఆ సమయంలో తమ వైమానిక దళం స్థానిక సాంకేతిక పరిజ్ఞానం, చైనీస్‌ యుద్ధ విమానాలను వినియోగించిందని షరీఫ్‌ పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత్, పాకిస్తాన్‌లు కశ్మీర్‌ సహా తమ మధ్య విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధానమంత్రి షహబాజ్‌ షరీఫ్‌ అన్నారు. భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఇప్పటికి మూడు సార్లు యుద్ధం జరిగినా వచ్చిందేమీ లేదు అంటూ సరికొత్త వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం రాత్రి సైనికులకు నివాళులర్పించే కార్యక్రమంలో పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షరీఫ్‌ మాట్లాడుతూ..‘భారత్, పాకిస్తాన్‌లు ఇప్పటి వరకు మూడుసార్లు యుద్ధాలు చేసినా ఏమీ సాధించలేకపోయాయి. జమ్మూకశ్మీర్‌ వంటి అన్ని ప్రధాన అంశాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. లేకుంటే మనం ప్రశాంతంగా ఉండలేం’ అని పేర్కొన్నారు.Pakistan PM Shahbaz Sharif says, "At around 2:30 am on 10 May, General Syed Asim Munir called me on secure line and informed me that India's ballistic missiles have hit Nur Khan Airbase and other areas.#nurkhanairbase #Pakistan #PakistanArmy pic.twitter.com/RKnWGP8WeS— Manish Shukla (@manishmedia) May 17, 2025తమది శాంతికాముక దేశమైనా స్వీయరక్షణకు తగినట్లు స్పందించే హక్కు ఉందని షెహబాజ్‌ అన్నారు. ‘భారత్‌కు దీటుగా జవాబిచ్చి’ పాక్‌ సైనిక చరిత్రలో స్వర్ణాధ్యాయాన్ని లిఖించారని కొనియాడారు. శాంతియుత వాతావరణం నెలకొనేందుకు ముందుకు వస్తే ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో సహకరిస్తామని భారత్‌కు హామీ ఇచ్చారు. కాల్పుల విరమణకు సహకరించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.అనంతరం, పాక్‌ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇశాక్‌ దార్‌ మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్‌ల మధ్య అపరిష్కృత, వివాదాస్పద అంశాలపై సమగ్ర చర్చలు జరుపుదామని కామెంట్స్‌ చేశారు. మరోవైపు.. తమపై భారత్‌ ఎలాంటి దురాక్రమణకు దిగినా దానికి బదులిస్తామని పాకిస్తాన్‌ విదేశాంగ శాఖ పేర్కొంది. కాల్పుల విరమణకు భారత్‌ చిత్తశుద్ధితో కట్టుబడి ఉండాలని ఈ శాఖ అధికార ప్రతినిధి షఫ్ఖత్‌ అలీఖాన్‌ వ్యాఖ్యలు చేశారు. ఇక, కృతజ్ఞతా దినం సందర్భంగా ఇస్లామాబాద్‌లో 31 సార్లు, ప్రావిన్సుల రాజధానుల్లో 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి సెల్యూట్‌ చేశారు. ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలతో సైనికదళాలకు సంఘీభావం ప్రకటించారు.

do you know Regrowing hair on a bald head is possible7
బట్టతలపై వెంట్రుకలు సాధ్యమే! దువ్వెన్లు సిద్దం చేసుకోండి!

వయసు మీరుతున్న కొద్దీ తలపై జుట్టూడిపోవడం సాధారణం. కానీ.. కొంతమందికి చిన్న వయసులోనే బట్టతల వచ్చేస్తుంటుంది. మళ్లీ జుట్టు కావాలని అనుకుంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వంటి వ్యయ ప్రయాసలతో కూడిన పద్ధతులు మాత్రమే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే త్వరలోనే ఈ సమస్య తీరి పోతుందంటున్నారు హార్వర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా... రాలిపోయిన జుట్టు స్థానంలో సరికొత్తగా వెంట్రుకలు మొలిచేలా కూడా చేసేందుకు తాము ఓ కొత్త పద్ధతిని ఆవిష్కరించామని వీరు చెబుతున్నారు. నొప్పి ఏమాత్రం కలిగించని, అతిసూక్ష్మమైన సూదులతో కూడిన పట్టీని అతికించి.. ఆ సూదుల ద్వారా ఒక మందును నెత్తికి అందించడం ద్వారా ఇది సాధ్యమని వారు వివరించారు. ఎలుకలపై తాము ఇప్పటికే కొన్ని ప్రయోగాలు చేశామని, సత్ఫలితాలు సాధించామని తెలిపారు.అలొపీసియాకు కారణాలు కచ్చితంగా తెలియవు కానీ.. ఇది ఒక ఆటో ఇమ్యూన్‌ వ్యాధి. అంటే.. శరీర రోగ నిరోధక వ్యవస్థే.. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు దాడి చేశాయని పొరబడి మన శరీరానికి నష్టం చేయడాన్నే ఆటో ఇమ్యూన్‌ వ్యాధి అంటారు. అలోపీసియా విషయంలో రోగ నిరోధక వ్యవస్థలోని టీ–కణాలు వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తాయన్న మాట. ఫలితంగా వెంట్రుకలు అక్కడక్కడా రాలిపోవడం మొదలవుతుంది. కొంతమందిలో రాలిపోయిన తరువాత ఒకసారి పెరిగే అవకాశం ఉంటుంది కానీ.. మిగిలిన వారికి ఆ అదృష్టం ఉండదు. ఇదీ చదవండి: బిగ్‌ బాస్‌ విన్నర్‌ లివర్‌లో టెన్నిస్‌ బాల్‌ అంత కణితి : వైరల్‌ పోస్ట్‌ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కీళ్లనొప్పులు, తామర వంటివి ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు కావడం... చికిత్సకు మందులు (రోగ నిరోధక వ్యవస్థను అణచివేసేవి) ఉపయోగించినప్పుడు జుట్టు మొలవడం! మందులు వాడటం నిలిపేసిన వెంటనే జుట్టు రాలడమూ మొదలవుతూ ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఈ మందుల్లోనే ఏదో మర్మముందన్న సందేహంతో శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేయడం మొదలుపెట్టారు. ఇదీ చదవండి: వెండి గాజుల కోసం.. తల్లి చితిపై పడుకుని..కొడుకు కాదు!మందులు కేవలం వెంట్రుకల కుదుళ్లపై దాడి చేస్తున్న టీ–కణాలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీంతో మైక్రో నీడిల్‌ ప్యాచ్‌ ద్వారా ఈ మందులు నేరుగా వెంట్రుకల కుదుళ్లకు మాత్రమే అందేలా చేశారు. ఎలుకలతో ప్రయోగాలు చేసినప్పుడు మూడు వారాల్లోపు పదిసార్లు ΄్యాచ్‌లు మార్చి.. ఇంకో ఎనిమిది వారాలు వాటిని గమనించారు. మూడు వారాల తరువాత వెంట్రుకలు పెరగడం మొదలైంది. పదివారాలపాటు పెరుగుతూనే ఉన్నాయి. సో... సమీప భవిష్యత్తులోనే బట్టతల కలవారందరూ ఎంచక్కా జేబులో దువ్వెన పెట్టుకుని తిరిగే అవకాశం ఉందన్నమాట!

Dadasaheb Phalke grandson Comments On SS Rajamouli and Aamir Khan8
'దాదాసాహెబ్‌ ఫాల్కే' బయోపిక్‌లో ఎవరు.. క్లారిటీ వచ్చేసింది

భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్‌ ఫాల్కే (అసలు పేరు ధుండీరాజ్‌ గోవింద్‌ ఫాల్కే) బయోపిక్‌ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. దాదా సాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌ చేసేందుకు ఇటు రాజమౌళి అటు ఆమిర్‌ ఖాన్‌ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. దీంతో ముందుగా ఎవరు ఈ సినిమాను సెట్స్‌ పైకి తీసుకెళ్తారనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో దాదాసాహెబ్‌ ఫాల్కే మనవడు చంద్రశేఖర్‌ అసలు విషయం చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతుంది ఎవరో ఆయన పంచుకున్నారు.దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌పై ఇండస్ట్రీలో చర్చ జరుగుతుందని ఆయన మనవడు చంద్రశేఖర్‌ అన్నారు. ఈ ప్రాజెక్ట్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన అన్నారు. 'దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌ విషయంలో రాజమౌళి టీమ్‌ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మమ్మల్ని సంప్రదించలేదు. కానీ, ఆమిర్‌ టీమ్‌ నన్ను సంప్రదించింది. ఈ బయోపిక్‌ కోసం ఆమిర్‌ మూడేళ్ల నుంచి పరిశోధనలు చేస్తున్నారు. దర్శకుడు రాజ్‌కుమార్‌ హీరాణీ ‘దాదాసాహెబ్‌ ఫాల్కే’ బయోపిక్‌ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నట్లు నాకు కూడా సమాచారం ఉంది. రాజ్‌కుమార్‌ హీరాణీ అసిస్టెంట్‌ ప్రొడ్యూసర్‌ హిందూకుష్‌ భరద్వాజ్ నాతో మూడేళ్లుగా టచ్‌లో ఉన్నారు. మా తాతగారి గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నారు. అతను నన్ను మళ్ళీ మళ్ళీ కలవడానికి, పరిశోధన చేయడానికి, వివరాలు అడగడానికి వచ్చేవాడు. దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌లో ఆమిర్‌ ఖాన్‌ బాగా సెట్‌ అవుతాడు.' అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.దాదాసాహెబ్‌ ఫాల్కే బయోపిక్‌లో ఎన్టీఆర్‌ నటించడం లేదని దీంతో క్లారిటీ వచ్చేసింది. తారక్‌ నటిస్తున్నారని వార్తలు వచ్చిన 24 గంటల్లోపే ఈ ప్రాజెక్ట్‌లో ఆమిర్‌ ఖాన్‌ చేస్తున్నట్లుగా ప్రకటన వచ్చింది. అయితే, మేడ్‌ ఇన్‌ ఇండియా... ఫాదర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా బయోపిక్‌ ‘మేడ్‌ ఇన్‌ ఇండియా’కు సమర్పకుడిగా వ్యవహరించనున్నట్లుగా 2023లో దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు. వరుణ్‌ గుప్తా, ఎస్‌ఎస్‌ కార్తికేయ ఈ సినిమాను నిర్మించనున్నట్లు, నితిన్‌ కక్కడ్‌ (హిందీ చిత్రం ‘నోట్‌బుక్‌’ ఫేమ్‌) ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఆ తర్వాత ఈ సినిమా గురించి అప్‌డేట్‌ ఏదీ బయటకు రాలేదు. తాజాగా దాదాసాహెబ్‌ ఫాల్కే మనవుడి ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది.

​Hindupur: Officer Demands 10 Thousand Bribe From Woman To Grant Pension9
వీడియో వైరల్‌.. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో దారుణం

శ్రీ సత్యసాయి జిల్లా: టీడీపీ కూటమి పాలనలో ఏ సంక్షేమ పథకం కావాలన్నా లంచం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పింఛన్‌ కావాలంటే అన్ని అర్హతలున్నా చేయి తడపందే పనికాని దుస్థితి. సీఎం చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. వివరాలివీ..హిందూపురం మోడల్‌ కాలనీకి చెందిన ఓ మహిళ తన చెవి దుద్దులు తాకట్టు పెట్టేందుకు ఓ బంగారం దుకాణానికి వెళ్లింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ‘ఏమంత కష్టం వచ్చిందమ్మా’ అని అడిగితే పింఛన్‌ కోసం రూ.10 వేలు డబ్బులడిగారని, తాను అంత ఇవ్వలేనని చెప్పి రూ.6 వేలకు ఒప్పించుకున్నానని మహిళ బదులిచ్చింది.ఈ డబ్బు కూడా తనవద్ద లేక చెవికమ్మలు తాకట్టు పెడుతున్నానని చెప్పింది. లంచం ఎవరడిగారని దుకాణం యజమాని ప్రశ్నించగా.. ‘మోడల్‌ కాలనీ సచివాలయంలో డబ్బు అడిగారు. ఇవ్వకపోతే పింఛన్‌ రాదని చెప్పారు.. అందుకే సామీ కమ్మలు తాకట్టుపెడుతన్నా’.. అంటూ ఆ మహిళ నిట్టూర్చింది.ఈ సంభాషణంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీ­డియాలో పోస్ట్‌చేయడంతో ఈ అంశం వైరల్‌గా మా­రింది. ఎమ్మెల్యే బాల­కృష్ణ స్థానికంగా ఉండకపోవడం, నియోజకవర్గంపై పర్య­వే­క్షణ లేకపోవడంతో టీడీపీ నేతలు, కొందరు అధికా­రులు పేదలను పీల్చి పిప్పిచేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వంలో ఇలా ఎప్పుడూ జరగలేదని, ఎటువంటి లంచాలు లేకుండానే అప్పట్లో నేరుగా ఇంటివద్దే సేవలు అందేవని.. ఇప్పుడు వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయాయని వారు దుమ్మెత్తిపోస్తున్నారు.

Sebi urges Karvy investors to file claims before June 2 deadline approaches10
డెడ్‌లైన్‌ దగ్గరపడుతోంది.. క్లెయిమ్స్‌ దాఖలు చేయండి

న్యూఢిల్లీ: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ (కేఎస్‌బీఎల్‌) ఇన్వెస్టర్లు తమ క్లెయిమ్‌లను దాఖలు చేసేందుకు గడువు తేదీ అయిన జూన్‌ 2 దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో మదుపరులు త్వరపడాలని, సత్వరం క్లెయిమ్‌లను ఫైల్‌ చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సూచించింది.దీనిపై సహాయం కోసం ఎన్‌ఎస్‌ఈని సంప్రదించవచ్చని లేదా టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 266 0050కి కాల్‌ చేయొచ్చని (ఐవీఆర్‌ ఆప్షన్‌ 5), లేదా defaultisc@nse.co.in ఈమెయిల్‌ ఐడీకి మెయిల్‌ చేయొచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది. కేఎస్‌బీఎల్‌ తమ క్లయింట్ల సెక్యూరిటీలను తనఖా పెట్టి భారీగా నిధులు సమీకరించడం, వాటిని సొంత అవసరాల కోసం ఇతర అనుబంధ సంస్థలకు మళ్లించడం తెలిసిందే.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement