Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

ChandraBabu, Pawan silent on APs rights in the PM Modi Sabha1
ప్రధాని సభలో ఏపీ హక్కులపై బాబు, పవన్‌లు మౌనం

అమరావతి: అమరావతి పునః ప్రారంభ కార్యక్రమంలో భాగంగా ఏపీకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ఎదుట.. రాష్ట్ర హక్కులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు మౌనం పాటించారు. రాష్ట్ర విభజన నాటి ఏపీ హక్కుల గురించి ప్రధాని మోదీ వద్ద.. వీరు కనీసం ప్రస్తావించలేదు. కేవలం ప్రధాని మోదీపై పొగడ్తల వర్షం కురిపించిన బాబు.. విభజన సమస్యల పరిష్కారం అంశానికి సంబంధించి మోదీ నుంచి ఎటువంటి ప్రకటన చేయించలేకపోయారు.విభజన హామీలు పెండింగ్ లో ఉన్నందను చంద్రబాబు, పవన్‌లు కనీసం మోదీ వద్ద ఆ ప్రస్తావన తెచ్చి ఉంటే బాగుండేది. కానీ వారు ఆ పని చేయలేదు. అమరావతిని రీలాంచ్ చేసే కార్యక్రమం వరకే పెట్టుకున్నట్లే చంద్రబాబు, పవన్‌ల ధోరణి కనబడింది. ప్రధాని బ్లెస్సింగ్స్ కావాలన్నారే కానీ ఏపీ హక్కుల కోసం మాత్రం అడగలేదు చంద్రబాబు. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరణ, పోలవరం ఎత్తు తగ్గింపుపై స్పష్టత తదితర అంశాలు మోదీ వద్ద చంద్రబాబు, వవన్‌లు ప్రస్తావించలేదు.అమరావతి రీలాంచ్ కార్యక్రమంలో భాగంగా కొత్తగా మరో శిలాఫలకాన్ని ఆవిష్కరించారే కానీ, విభజన నాటి ఏపీ హక్కుల గురించి మాత్రం మోదీ ప్రసంగంలో కానీ, చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ల ప్రసంగంలో కానీ కనీసం మచ్చుకైనా కనిపించకపోవడం గమనార్హం.పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు

Sai Sudarsan Creates Histtoy, Second Batter Fewest innings taken for 2000 runs in T20s2
చ‌రిత్ర సృష్టించిన సాయి సుదర్శన్‌.. సచిన్ రికార్డు బ‌ద్ద‌లు

ఐపీఎల్‌-2025లో గుజ‌రాత్ టైటాన్స్ యువ ఓపెనర్ సాయిసుదర్శన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా ఈవెంట్‌లో భాగం‍గా అహ్మదాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సుదర్శన్ విధ్వం‍సం సృష్టించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఎస్‌ఆర్‌హెచ్ బౌలర్లను ఊతికారేశాడు. ముఖ్యంగా గుజరాత్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన స్టార్ పేసర్ మహ్మద్ షమీకి సుదర్శన్‌ చుక్కలు చూపించాడు. ఆ ఓవర్‌లో ఐదు ఫోర్ల సాయంతో ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. ఓవరాల్‌గా 23 బంతులు ఎదుర్కొన్న 9 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో సుదర్శన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో అత్యంతవేగంగా 2000 పరుగుల మైలు రాయిని అందుకున్న భార‌త క్రికెట‌ర్‌గా సాయి సుదర్శన్ రి​కార్డు సృష్టించాడు. సుదర్శన్ కేవలం 54 ఇన్నింగ్స్‌లలో అందుకున్నాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉండేది. సచిన్ ఈ ఘ‌న‌త‌ను 59 ఇన్నింగ్స్‌ల‌లో అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో స‌చిన్ రికార్డును ఈ త‌మిళ‌నాడు బ్యాట‌ర్ బ్రేక్ చేశాడు. ఓవ‌రాల్‌గా ఈ రేర్ ఫీట్ సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ షాన్ మార్ష్‌(53) అగ్రస్దానంలో ఉండ‌గా.. రెండో స్దానంలో సుద‌ర్శ‌న్ కొన‌సాగుతున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు బ్రాడ్ హాడ్జ్ , మార్కస్ ట్రెస్కోథిక్, ముహమ్మద్ వసీం పేరిట సంయుక్తంగా ఉండేది. తాజా మ్యాచ్‌తో వీరిని సుదర్శన్ అధిగమించాడు. చ‌ద‌వండి: బాబర్‌ ఆజం, మహ్మద్‌ రిజ్వాన్‌లకు షాక్‌.. అకౌంట్లు బ్లాక్‌

PM Narendra Modi jibe at INDIA bloc via Shashi Tharoor3
శ‌శిథ‌రూర్‌పై ప్ర‌ధాని మోదీ వ్యాఖ్యల వెనుక‌..

'ఈ స‌మావేశం త‌ర్వాత కొంత‌మందికి నిద్ర‌ప‌ట్ట‌దు' అంటూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ (Narendra Modi) చేసిన వ్యాఖ్యలకు రాజ‌కీయంగా ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. కేర‌ళ‌లో శుక్ర‌వారం ప‌ర్య‌టించిన మోదీ మాట‌ల తూటాల‌తో ప్ర‌త్య‌ర్థుల‌పై సూటిగా గురిపెట్టారు. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత శ‌శిథ‌రూర్ భుజాల‌పైనుంచి ప్ర‌తిప‌క్ష ఇండియా కూట‌మిపై తుపాకీ ఎక్కుపెట్టారు. 'మీ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత మా ప‌క్కన నిల‌బ‌డ్డారు చూడండి' అన్న‌ట్టుగా గ్రాండ్ ఓల్డ్ పార్టీ అయిన కాంగ్రెస్‌కు పరోక్షంగా కౌంట‌ర్ ఇచ్చారు.వారికి నిద్ర ప‌ట్ట‌క‌పోవ‌చ్చు..తిరువ‌నంత‌పురం స‌మీపంలో నిర్మించిన ప్ర‌తిష్టాత్మ‌క‌ ఇంట‌ర్నేష‌న‌ల్‌ డీప్ వాట‌ర్ మ‌ల్టీప‌ర్ప‌స్ సీపోర్టును ఆయ‌న ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్‌తో పాటు స్థానిక ఎంపీ, సీనియ‌ర్ కాంగ్రెస్ నేత శ‌శిథ‌రూర్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ.. "ముఖ్యమంత్రి (పినరయి విజయన్)కి నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు INDIA కూటమికి బలమైన స్తంభం, శశి థరూర్ (Shashi Tharoor) కూడా ఇక్కడ కూర్చున్నారు. ఈరోజు మీరు నాతో పాటు వేదిక పంచుకున్నారు. మీరు ఇక్క‌డ ఉండ‌డం కొంద‌రికి రుచించ‌క‌పోవ‌చ్చు. వారికి నిద్ర కూడా ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. ఈ మెసేజ్ ఎక్క‌డికి వెళ్లాలో అక్క‌డికి చేరుతుంద"ని వ్యాఖ్యానించారు.గ్యాప్ పెరిగింది..తిరువ‌నంత‌పురం లోక్‌స‌భ నియోజక‌వ‌ర్గానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న శ‌శిథ‌రూర్.. ఇండియ‌న్ నేష‌న‌ల్ డెవ‌ల‌ప్‌మెంటల్ ఇంక్లూజివ్ అల‌యన్స్‌ (INDIA) కూటమిలో కీల‌క నేత‌గా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ఆయ‌న‌కు మ‌ధ్య దూరం పెరిగింది. పినరయి విజయన్ (Pinarayi Vijayan) స‌ర్కారు తీసుకొచ్చిన ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్, రెడ్‌ టేప్‌ కోత విధానాలపై కొద్ది రోజుల క్రితం శ‌శిథ‌రూర్ ప్ర‌శంసలు కురిపించారు. అక్క‌డితో ఆగ‌కుండా కాంగ్రెస్‌కు బ‌ద్ద‌శ‌త్రువైన ప్ర‌ధాని మోదీని పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. మోదీ అమెరికా పర్యటన, డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీపై పాజిటివ్ కామెంట్స్ చేశారు. దీంతో శ‌శిథ‌రూర్‌ను కాంగ్రెస్ హైక‌మాండ్ దూరం పెట్టింది. పార్టీకి త‌న అవ‌స‌రం లేక‌పోతే స్ప‌ష్టంగా చెప్పాల‌ని, త‌న దారి తాను చూసుకుంటాన‌ని గ‌త ఫిబ్ర‌వ‌రిలో అధిష్టానాన్ని అడిగారు. ఈ నేప‌థ్యంలో థరూర్ బీజేపీలో చేర‌తార‌ని ప్ర‌చారం కూడా ఊపందుకుంది. అయితే తాను పార్టీ మార‌బోన‌ని అప్ప‌ట్లో ఆయ‌న స్ప‌ష్టం చేశారు.చ‌ద‌వండి: ప్ర‌పంచానికి ఇదే సందేశం ఇచ్చాం.. మ‌ల్లిఖార్జున ఖ‌ర్గేప‌తాక శీర్షిక‌ల‌కు మోదీ వ్యాఖ్య‌లుతాజాగా థ‌రూర్‌పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన‌ వ్యాఖ్య‌లు ప‌తాక శీర్షిక‌ల‌కు ఎక్కాయి. శ‌శిథ‌రూర్ భుజాల పైనుంచి ప్ర‌తిప‌క్ష ఇండియా కూట‌మిపైకి మోదీ తుపాకీ ఎక్కుపెట్టార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇండియా కూట‌మిని డిఫెన్స్‌లో పడేసేందుకే మోదీ ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని అంటున్నారు. మ‌రోవైపు కేర‌ళ‌లో పాగా వేసేందుకు కాషాయ పార్టీ ఇప్ప‌టివ‌ర‌కు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. ఈ నేప‌థ్యంలో మోదీ వ్యాఖ్యలు రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. మోదీ వ్యాఖ్య‌ల‌పై ఇండియా కూటమి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Gold Price Down Check The Reason Here4
భారీగా తగ్గుతున్న బంగారం ధరలు: కారణం ఇదే..

గ్లోబల్ మార్కెట్లలో టారిఫ్ భయం తగ్గిపోతున్న క్రమంలో.. బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. దీంతో గోల్డ్ రేటు లక్ష రూపాయల నుంచి సుమారు రూ. 7000 తగ్గింది. దీంతో కొనుగోలుదారుల్లో కూడా బంగారం కొనాలా? వద్దా? అనే ప్రశ్న మొదలైపోయింది. ఎందుకంటే ఇంకా తగ్గుముఖం పడుతుందేమో అనే ఆలోచన వారిలో తలుపుతట్టింది.గత వారం గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3500.05 డాలర్ల వద్ద ఉంది. అయితే గురువారం రోజు 2.2 శాతం క్షీణించి 3216.41 డాలర్లకు పడిపోయింది. ప్రస్తుతం భారతదేశంలో కూడా బంగారం ధరలు రూ. 95510 వద్ద ఉన్నాయి. ఏప్రిల్ నెలతో పోలిస్తే.. ఈ ధరలు కొంత తక్కువే అని స్పష్టమవుతోంది.బంగారం ధరలు తగ్గడానికి కారణంప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం వల్ల సురక్షితమైన ఆస్తులకు డిమాండ్ తగ్గింది. దీంతో పెట్టుబడిదారులు మళ్ళీ లాభాలను ఆర్జించడానికి సిద్ధమయ్యాయి. అంతే కాకుండా దక్షిణ కొరియా, జపాన్, భారతదేశంతో సంభావ్య వాణిజ్య ఒప్పందాల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచనలు.. చైనాతో ఒప్పందం గురించి సానుకూల వ్యాఖ్యలు కూడా బంగారం ధరల తగ్గుదలకు కారణమైందని ఏంజెల్ వన్‌లో కమోడిటీస్ అండ్ కరెన్సీల చీఫ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ 'తేజస్ అనిల్ షిగ్రేకర్' అన్నారు.ఇదీ చదవండి: ఆ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు: జాబితాలో ఉన్న మోడల్స్ ఇవే..అమెరికా సుంకాలను నివారించడానికి అనేక ప్రధాన వాణిజ్య భాగస్వాములు "చాలా మంచి" ఆఫర్లను అందించారని, ఒప్పందం కుదుర్చుకున్న మొదటి దేశాలలో భారతదేశం ఉంటుందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి 'స్కాట్ బెసెంట్' అన్నారు. మొత్తం మీద రాబోయే మూడు నుంచి నాలుగు నెలల్లో బంగారం మరింత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

3 Men Committee on Preliminary Report Of Simhachalam Incident5
సింహాచలం ఘటన: ముగిసిన త్రీమెన్ కమిటీ ప్రాథమిక విచారణ

విశాఖ :సింహాచలంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతిచెందిన దుర్ఘటనలో త్రీమెన్ కమిటీ ప్రాథమిక విచారణ ముగిసింది. దీనిపై ప్రభుత్వానికి రేపు(శనివారం) నివేదిక ఇవ్వనుంది త్రీమెన్ కమిటీ. దీనివలో భాగంగా త్రీమెన్‌ కమిటీ చైర్మన్‌, మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్‌ కుమార్ మాట్లాడుతూ ‘ సింహాచలం దుర్ఘటనపై రేపు ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ప‍్రమాదానికి కారణమైన గోడను నోటి మాటతో కట్టేశారు. గోడ నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేవు.విచారణలో భాగంగా వివిధ శాఖల వారిని విచారించాం. వైదిక నియమాలను ఉల్లంఘించినట్లు ఆలయ అర్చకులు చెప్పారు. ఆగమ శాస్త్రపరమైన సలహాలు లేకుండానే గోడ నిర్మించారని వైదికులు మా దృష్టికి తీసుకొచ్చారు. మాస్టర్ ప్లాన్ ఉల్లంఘనలు కనిపించాయి. ఎవరి అనుమతిలో మాస్టర్ ప్లాన్ పై నిర్ణయాలు తీసుకున్నారో తేలాలి. ప్రసాద్ స్కీం పనులు గత ఏడాది ఆగస్టులో పూర్తి కావాల్సి ఉంది. ఆలస్యానికి కారణం ఏంటని అడిగితే భిన్నమైన సమాధానాలు వచ్చాయి. అధికారుల మధ్య సమన్వయంపై ఉ‍న్నతాధికారులతో మాట్లాడాలి’ అని స్పష్టం చేశారు.కాగా, సింహాచలం చందనోత్సవంలో గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్‌ కౌంటర్‌ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్‌లో ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు.

TDP Leader JC Prabhakar Reddy Sensational Comments6
హైకోర్టు అనుమతిచ్చినా.. జేసీ ప్రభాకర్ రెడ్డి బరితెగింపు!

అనంతపురం: వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చినా టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తొడలు కొడుతున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే తిరిగి వెళ్లడు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినా... తాను మాత్రం దాడులు చేస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగంగా సవాల్ చేశారు.పెద్దారెడ్డికి ఎవరూ మద్దత ఇవ్వొద్దని, తనకు పెద్దారెడ్డితో గొడవలు ఉన్నాయని, ఒకవేళ వస్తే తిరిగి వెళ్లడు అంటూ వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. తాడిపత్రి వెళ్లడానికి హైకోర్టు అనుమతిచ్చిన క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా వ్యాఖ్యానించడం ఏంటో అర్థం కావడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయడంలో తాము వెనక్కి తగ్గమని సంకేతాల్ని ఇచ్చిన జేసీపై విశ్లేషకులు మండిపడుతున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నా టీడీపీ పెద్దలు మాత్రం పెదవి విప్పడం లేదు. పార్టీలో సభ్యుడైన వ్యక్తిని కంట్రోల్ చేయాల్సిన వారు మిన్నుకుండిపోతుండటంతో జేసీ ప్రభాకర్ రెడ్డి పదే పదే రెచ్చిపోయి వ్యాఖ్యలు చేస్తున్నారనే అబిప్రాయం వ్యక్తమవుతోంది.

PM Narendra Modi AP Tour Updates7
పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు

PM Narendra Modi AP Tour Updatesవెలగపూడి:02-05, 5.10 PMప్రధాని మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీమీ అందరిని కలవడం నాకు ఆనందంగా ఉందిఏపీకి కేంద్రం సంపూర్ణం సహకారం అందిస్తుందిమౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తున్నాంఏపీలో కనెక్టవిటీ వేగంగా అభివృద్ధి చెందుతుందికనెక్టివిటీ అభివృద్ధి చెందితే అన్ని రంగాలకు లబ్ధిదీంతో రవాణా రంగం అభివృద్ధి చెంది రైతులకు మేలు జరుగుతుందిరైల్వే బడ్జెట్‌ లో ఏపీ వాటా 10 రెట్లు పెరిగిందికేంద్ర ప్రభుత్వం రైల్వేల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోందిరూ. 9 వేల కోట్లకు పైగా ఏపీకి కేటాయిస్తున్నాంఏపీలో వందశాతం రైల్వేల విద్యుదీకరణ జరిగిందిమౌలిక సదుపాయాల కల్పనతో ఆర్ధిక వ్యవస్థ బలోపేతం చేస్తున్నాంనిర్మాణ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయిగత పదేళ్లలో ఏపీలో 750 రైల్వే బ్రిడ్జిలు నిర్మించాంఏపీకి వందే భారత్‌, అమృత్‌ భారత్‌ రైళ్లు కేటాయించాంహైవేల నిర్మాణం వల్ల టూరిజం అభివృద్ధి చెందుతుందిపంట బీమా యోజన కింద రైతులకు ఇప్పటివరకూ రూ. 5,500 కోట్లు ఇచ్చాంఅంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఏపీలో ఘనంగా నిర్వహిస్తాంజూన్‌ 21 యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఏపీకి వస్తానాగాయలంక క్షిపణి కేంద్రంతో దేశ రక్షణకు కొత్త శక్తి వస్తుందియూనిటీ మాల్‌ తో స్థానిక ఆర్థిక వ్యవస్థలు బలోపేతం అవుతాయియూనిటీ మాల్‌ లో హస్త కళాకారుల ఉత్పత్తులు ఒకేచోట అందుబాటులో ఉంటాయిరైతుల వికాసానికి కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోందిపథకాలు, పరిహారం కింద రైతులకు రూ. 17 వేల కోట్లు ఇచ్చాంపీఎం సమ్మాన్‌ నిధి ద్వారా రైతులకు సాయం చేస్తున్నాం02-05, 4.55 PMపలు ప్రాజెక్టులకు నరేంద్ర మోదీ శంకుస్థాపనలువేదికపై నుంచి ప్రాజెక్టుల శంకుస్థాపనలు చేసిన మోదీమొత్తం 18 ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలుఅమరావతిలో రూ. 49 వేల కోట్ల పనులకు మోదీ శ్రీకారంరూ. 8 వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు సైతం మోదీ శంకుస్థాపనలురాజధాని సహా రూ. 58 వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు02-05, 2:50PMప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాష్ట్రానికి వచ్చారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. శుక్రవారం మధ్యా­హ్నం 2.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు మోదీ,. ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయమునకు చేరుకున్న భారత ప్రధానికి ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో వెలగపూడి చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో వెలగపూడి సభా ప్రాంగణానికి బయల్దేరి వెళ్లారు. పలు కేంద్ర ప్రాజెక్ట్‌ లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మోదీ పాల్గొననున్నారు. దీనిలో భాగంగా 18 ప్రాజెక్ట్‌ లకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారీ భద్రత ఏర్పాట్లు..ప్రధాని పర్యటనకు పోలీ­సు­లు భారీ భద్రతా ఏర్పా­ట్లు చేస్తున్నారు. 6 వేల మందికి పైగా పోలీస్‌ బలగా­లను మోహ­రించారు. భద్రతను పర్యవేక్షించేందుకు 19 మంది ఐపీఎస్‌ అధికారులను నియమించారు. అమరావతి­లోని సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 11 మార్గా­ల­ను ఖరారు చేశారు. వాటిలో రెండు మార్గాలను ప్రముఖులకు కేటాయించారు. సభా ప్రాంగణం పరిసరాలను ఎన్‌ఎస్‌జీ కమెండోలు ఆ«దీనంలోకి తీసుకున్నారు. సభ కోసం 5 లక్షల మందిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బాధ్యత రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్‌ అధికారులకు అప్పగించింది. జన సమీకరణ కోసం 4,500 ఆర్టీసీ బస్సులను కేటాయించింది.

New Wellness Trend Fart Walk Going Viral Experts Explained Its Benefits8
సరికొత్త వెల్నెస్‌ ట్రెండ్‌ "ఫార్ట్ వాక్" అంటే ..? వైద్య నిపుణుల సైతం బెస్ట్‌..

ప్రస్తుతం అభివృద్ధి చెందిన సాంకేతికత తోపాటు..సరికొత్త వెల్నెస్‌ ట్రెండ్‌లు తెగ పుట్టుకొచ్చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్‌ మీడియా పుణ్యమా అని సామాన్యులు సైతం ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. పైగా ఇంట్లో వాళ్లకు కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఈ డైట్‌ మంచిది, ఇలా చేస్తే బెటర్‌ అంటూ ఎన్నెన్నో ఆరోగ్య చిట్కాలు కోకొల్లలుగా వచ్చేస్తున్నాయి. అలానే ఇప్పుడు మరో వెల్నెస్ ట్రెండ్‌ నెట్టింట సందడి చేస్తోంది. ఆఖరికి నిపుణులు సైతం చాలా మంచిదని చెబుతుండటం మరింత విశేషం. మరీ ఆ ట్రెండ్‌ ఏంటి..? దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటీ అంటే.."ఫార్ట్ వాక్"(Fart Walk) అనే పదాన్ని తొలిసారిగా కెనడియన్ కుక్‌బుక్ రచయిత్రి మైర్లిన్ స్మిత్ రూపొందించారు. ఇదే చాలామంది వ్యక్తుల దీర్ఘాయువు రహస్యం అట. తక్కువ శ్రమతో కూడిన ఆరోగ్య రహస్యమని అంటున్నారు. ఇంతకీ అసలు ఈ వాక్‌ ఎలా చేస్తారంటే..ఫార్ట్ వాక్ అంటే..భోజనం తర్వాత తేలికపాటి నడకనే ఫార్ట్‌వాక్‌ అంటారు. అంటే ఇక్కడ రాత్రిభోజనం తర్వాత తప్పనిసరిగా వాక్‌ చేయడంగా భావించాలి. ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలందిస్తుందని వైద్యనిపుణులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యానికి సహాయపడుతుందట. ఈ ఫిట్‌నెస్ దినచర్య ప్రాథమిక లక్ష్యం జీర్ణక్రియకు సహాయపడటం, తీవ్రమైన వ్యాధులను నివారించడం అని రచయిత్రి స్మిత్‌ చెబుతున్నారు. View this post on Instagram A post shared by Dr. Tim Tiutan | Internal Medicine (@doctortim.md) మనం ఫైబర్‌తో కూడిన భోజనం తీసుకుంటాం కాబట్టి గ్యాస్‌ సమస్య ఉత్ఫన్నమవుతుందట. అలాంటప్పుడు గనుక ఇలా ఫార్ట్‌ వాక్‌ చేస్తే.. ఆపానవాయువు నోరు లేదా కింద నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుందట. జస్ట్‌ రెండు నిమిషాలు ఆ విధంగా నడిస్తే..టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు కూడ తగ్గుతాయని చెబుతున్నారు స్మిత్‌. కేన్సర్‌ వైద్యుడు డాక్టర్ టిమ్ టియుటన్ రచయిత్రి స్మిత్‌ సూచించిన ఫిట్‌నెస్‌ చిట్కాని సమర్థించారు. ఆమె చెప్పింది సరైనదేనని, నిజంగానే దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చెప్పారు. భోజనం తర్వాత నడవడం వల్ల పేగు చలనశీలత - లేదా మన ప్రేగుల కదలిక అనేది గ్యాస్‌ను వదిలించుకోవడమే గాక మలబద్ధకాన్ని కూడా నివారిస్తుందని చెప్పారు. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నివారించడం లేదా 24 గంటల వరకు ఇన్సులిన్ సమస్య ఏర్పడదని అన్నారు. అలాగే మరో వైద్యుడు అమెరికాకు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ క్రిస్టోఫర్ డామన్ కూడా ఈ ఫిట్‌నెస​ ట్రెండ్‌కి మద్దుతిచ్చారు. భోజనం తర్వాత నడక అనేది తిన్న గంటలోపు చేస్తేనే అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని అన్నారు. ఆలస్యంగా నడక ప్రారంభిస్తే అప్పటికే పోషకాలు శోషించబడి రక్తంలో కలిసిపోతాయని, అలాగే గ్లూకోజ్‌ లెవెల్స్‌​ పెరిగిపోతాయని చెబుతున్నారు డామన్‌. కలిగే లాభాలు..కేన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మంచి దీర్ఘాయువుని అందిస్తుందిఎలాంటి అనారోగ్యల బారినపడకుండా కాపాడుతుందివృద్దాప్యంలో ఎలాంటి సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది. కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటేనే కాసేపు ఓ రెండడుగులు అటు.. ఇటు..నడిచి ఆరోగ్యంగా ఉందామా మరీ..!. (చదవండి: Summer Tips: ఏసీతో పనిలేకుండానే సహజసిద్ధంగా ఇంటిని చల్లగా మార్చేద్దాం ఇలా..!)

Folk Dancer Janulyri Burst Into Tears, Shared Videos9
గలీజ్‌ మాటలు.. నా జీవితంతో ఆడుకుంటున్నారు.. బతకను: జానులిరి

జాను లిరి (Janu Lyri).. జానపద పాటలతో చాలా ఫేమస్‌ అయింది. యూట్యూబ్‌లో ఫోక్‌ సాంగ్స్‌కు హుషారుగా స్టెప్పులేసే జాను.. తర్వాత ఢీ సెలబ్రిటీ స్పెషల్‌ 2 షో విన్నర్‌గానూ నిలిచింది. పదో తరగతిలోనే పెళ్లి చేసుకున్న ఈ డ్యాన్సర్‌కు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. భర్తతో విభేదాల కారణంగా వీరు విడిపోయారు. అయితే జాను ఏం చేసినా సరే కొందరు తనను విమర్శిస్తూనే ఉన్నారు. ఈ మధ్య ఓసారి మంచి వ్యక్తి దొరికితే రెండో పెళ్లికి కూడా సిద్ధమే అంది. దాన్ని కూడా తప్పుపడుతూ తనను ట్రోల్‌ చేస్తున్నారు.గుక్కపెట్టి ఏడ్చిన జానుఈ విమర్శలను జాను లిరి భరించలేకపోయింది. నన్ను టార్గెట్‌ చేయడం ఆపండి అంటూ బోరుమని ఏడుస్తోంది. ఈ మేరకు పలు వీడియోలు షేర్‌ చేసింది. నా జీవితంతో ఆడుకుంటున్నారు. నేను నవ్వితే ఓవరాక్షన్‌.. నాకు పద్ధతి తెలీదు..కదా? ఫోక్‌ ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకుని డ్యాన్స్‌ చేస్తుంది నేనే. కెమెరా ముందు ఒకలా, వెనక ఒకలా ఉండను. అందరితో నవ్వుతూ ఉంటాను. నేనేం చేసినా తప్పే అంటున్నారు.బతకాలని లేదుఇన్‌స్టాగ్రామ్‌లో నా వాయిస్‌కు గలీజ్‌ మాటలు యాడ్‌ చేస్తున్నారు. అవి నా కొడుకు చూడడా? ఎక్కడికైనా వెళ్లి చచ్చిపోవాలనిపిస్తోంది. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే మాత్రం మీరే కారణం. ఇంత నరకమా? మీ వ్యూస్‌ కోసం ఒకమ్మాయి జీవితాన్ని రోడ్డుమీద పడేస్తున్నారు. మా అమ్మానాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక్క మాట అనకుండా పెంచారు. కానీ ఈరోజు అడ్డమైన వెధవలతో మాటలు పడుతున్నాను. సూసైడ్‌ తప్పు అని నలుగురికీ చెప్పేదాన్ని.. కానీ ఇప్పుడర్థమవుతోంది.నా వల్ల కావట్లేదువాళ్లు పడే బాధల వల్ల చనిపోవట్లేదు. మీరు చేసే రచ్చ తట్టుకోలేక చనిపోతున్నారని! నా వల్ల కావట్లేదు. నా ఓపిక నశించింది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, నవ్వినా, కూర్చున్నా.. ఎందుకు నిందలేస్తున్నారు? నా గురించి మంచి పెట్టొచ్చు కదా.. బాధ తట్టుకోలేకపోతున్నా.. నా జీవితంతో ఆడుకోవడం ఎందుకు? నా వల్ల మీకేమైనా హాని జరిగిందా? నా కొడుకును బాగా చదివించి మంచి స్థాయిలో చూడాలనుకున్నాను. అప్పటివరకు నేను బతకనని నాకర్థమవుతోంది. నేను మధ్యలోనే పోతాను అంటూ జాను వెక్కి వెక్కి ఏడ్చేసింది. View this post on Instagram A post shared by Jimmidi Jhansi - Janulyri (@janulyri_official) ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: హీరోయిన్‌ రెచ్చగొట్టింది.. అందుకే సిక్స్‌ ప్యాక్‌ చేశా: అల్లు అర్జున్‌

Supreme Court Relief For Accenture Staffer Told To Go To Pak10
పాక్‌ వెళ్లిపోవాలన్న కేంద్రం ఆదేశాలపై ఓ కుటుంబానికి సుప్రీంలో ఊరట

ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌ జాతీయుల వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.. ఇలాంటి పరిస్థితుల్లో కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఆరుగురు సభ్యులున్న అహ్మద్‌ తారిక్‌ బట్‌ కుటుంబం కూడా తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది. అయితే, వారు వేసిన పిటిషన్‌పై శుక్రవారం.. వాదనలు విన్న జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ ఎన్‌కే సింగ్‌ ధర్మాసనం.. ఆ కుటుంబానికి తాత్కాలిక ఊరటనిచ్చింది. వీసా గడువు ముగిసినా వీరు ఇంకా భారత్‌లోనే ఉన్నట్లు తేలింది. ఆ కుటుంబం కశ్మీర్‌లో ఉండగా.. కుమారుడు బెంగళూరు యాక్సెంచర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.తాము భారత జాతీయులమేనని అయినా మమ్మల్ని అరెస్టు చేశారంటూ వాదనలు వినిపించారు. తమ వద్ద అన్ని ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఉన్నాయని పేర్కొన్నారు. ఆధార్‌, పాన్‌, ఓటర్‌ ఐడీ ఉన్నాయని కోర్టుకు ఆధారాలు సమర్పించారు. ఈ కుటుంబంలో ఒకరు పాకిస్థాన్‌లో జన్మించినా.. ఆ తర్వాత భారత్‌కు వలసవచ్చి ఆ దేశ పాస్‌పోర్ట్‌ను సరెండర్‌ చేశారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ఈ అంశంలో ధ్రువీకరించాల్సిన అంశాలున్నాయని.. ఈ పిటిషన్‌ దాఖలు చేయడంలోనే లోపాలున్నాయని పేర్కొంది. దీని మెరిట్‌పై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయకుండా పిటిషన్‌ను కొట్టేస్తున్నామన్న ధర్మాసనం.. అధికారులకు ఓ సూచన చేసింది. ఏ నిర్ణయం తీసుకోబోయే ముందైనా.. వారు చూపుతున్న పత్రాలను ధ్రువీకరించాలని.. ఈ కేసులో ఉన్న కొన్ని విచిత్ర పరిస్థితుల దృష్ట్యా సరైన నిర్ణయం తీసుకొనేవరకు ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అధికారుల చర్యలతో సంతృప్తి లేకపోతే పిటిషనర్లు జమ్మూకశ్మీర్‌ హైకోర్టును ఆశ్రయించవచ్చంటూ కూడా ధర్మాసనం సూచించింది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement