Top Stories
ప్రధాన వార్తలు

Sukma: భారీ ఎన్కౌంటర్.. 20 మంది మావోయిస్టుల మృతి
రాయ్‌గఢ్: మరో భారీ ఎన్‌కౌంటర్‌తో ఛత్తీస్‌గఢ్ ఉలిక్కిపడింది. సుక్మా జిల్లాలో ఈ ఉదయం ఎదురు కాల్పులు చోటు చేసుకోగా.. ఇప్పటిదాకా 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. సుక్మా-దంతేవాడ సరిహద్దులో ఉప్పనల్లి వద్ద గోగుండ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ప్రతిగా జరిపిన కాల్పుల్లో మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లింది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనపర్చుకున్నారు. ఘనటలో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే కాల్పుల్లో మావోయిస్టు కమాండర్ డీవీసీఎం జగదీష్ మృతి చెందాడని ప్రచారం జరుగుతున్నప్పటికీ.. అధికారికంగా ధృవీకరణ కావాల్సి ఉంది.ప్రస్తుతం అక్కడ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ పర్యవేక్షణలో డీఆర్జీ, సీఆర్పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉంటే.. గత మూడు నెలల్లో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 100 మంది దాకా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుపెట్టడం గమనార్హం.ఈ ఏడాది జనవరిలో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా మావోయిస్టులు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది మరణించారు. అదే నెల చివర్లో.. కూంబింగ్ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఫిబ్రవరిలో బీజాపూర్ జిల్లాలోనే జరిగిన ఎన్కౌంటర్లో 31 మంది మావోయిస్టులు, ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. బీజాపూర్-దంతెవాడ సరిహద్దుల్లోని.. గంగలూరు పరిధి ఆండ్రి దండకారణ్యంలో మార్చి 20వ తేదీన జరిగిన ఎన్కౌంటర్లో 26 మంది మావోయిస్టులు, ఓ డీఆర్జీ జవాన్ రాజు మరణించారు. అదే రోజున కాంకేర్ జిల్లా(Kanker Encounter) ఛోటెబేథియా కోరోస్కోడో గ్రామంలో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.మావోయిస్టు రహిత భారత్ లక్ష్యంగా ఆపరేషన్ కగార్(Operation Kagar) పేరిట హోం మంత్రి అమిత్ షా పర్యవేక్షణలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ఇప్పటికే జరిగిన అనేక ఎన్కౌంటర్లలో భారీగా మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో.. ఆపరేషన్ కగార్ చర్యను ఖండిస్తూ మావోయిస్టులు స్పందించారు. మావోయిస్టు పశ్చిమ బస్తర్ కమిటి అధికార ప్రతినిధి మోహన్ పేరిట ఓ లేఖ విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ దాడులతో 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు మావోయిస్టులు, ఆదివాసీలను కలిపి మొత్తం 78 మందిని హతమార్చారని అందులో పేర్కొన్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకు ఏయే ప్రాంతాల్లో, ఎప్పుడు ఎన్కౌంటర్లు జరిగాయి.. ఎంతమంది చనిపోయారు.. వారి వివరాలను తెలుపుతూ మావోయిస్టు పశ్చిమ బస్తర్ కమిటి అధికార ప్రతినిధి మోహన్ లేఖను విడుదల చేశారు. పోరాటం విషయంలో రాజీపడబోమని వెల్లడించారు. మావోయిస్టుల ప్రభుత్వ హత్యలను ఖండిస్తూ ఏప్రిల్ 4వ తేదీన బీజాపూర్ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. ఈ లేఖ విడుదలైన మరుసటిరోజే మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం.

ట్యాపింగ్ కేసులో వీడిన ఉత్కంఠ.. సిట్ ఎదుటకు శ్రవణ్ రావు
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉత్కంఠకు తెర పడింది. మీడియా సంస్థ నిర్వాహకుడు, ఈ కేసులో నిందితుడు శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పీఎస్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) ఎదుట హాజరయ్యారు. ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఏ6 నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్‌కు ఈ నెల 26వ తేదీన సిట్ నోటీసులు జారీ చేసింది. 29వ తేదీన తమ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావాల్సిందిగా తెలిపింది. ఆయన అమెరికాలో ఉండడంతో కుటుంబ సభ్యులకు ఆ నోటీసులను అందజేసింది. అయితే ఈలోపు అరెస్ట్ నుంచి ఆయనకు సుప్రీం కోర్టు ఊరట ఇచ్చింది. అయినప్పటికీ ఈ కేసులో విచారణకు సహకరించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం షరతు విధించింది. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు. మరోవైపు.. శ్రవణ్ రావు విచారణకు కచ్చితంగా హాజరు అవుతారని కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఈ వేకువఝామున విమానంలో ఆయన నగరానికి వచ్చారని తెలుస్తోంది. ఈ కేసులో శ్రవణ్ వాంగ్మూలం కీలకంగా మారవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ వెర్షన్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో.. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) కేంద్రంగా ఎవరెవరిపై నిఘా ఉంచాలనే విషయంలో శ్రవణ్ రావు సూచన మేరకే కీలక నిందితులు ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావులు నడుచుకున్నారనేది దర్యాప్తుసంస్థ ప్రధాన అభియోగం. ఓ మీడియా సంస్థకు అధిపతిగా ఉంటూ 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు లబ్ధి చేకూర్చారని.. కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు వారికి ఆర్థిక వనరులు సమకూర్చుతున్న వ్యాపారులపై నిఘా ఉంచాలని ఈయనే సూచించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన్ను విచారిస్తే ఈ విషయాలపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. గతేడాది మార్చి 10న పంజాగుట్ట ఠాణాలో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే ఆయన తొలుత లండన్‌కు.. అక్కడి నుంచి అమెరికాకు వెళ్లిపోయారు. సిట్ విచారణకు రాకుండా అక్కడే ఉండిపోయారు. ఇటీవలే ఆయనపై రెడ్‌కార్నర్ నోటీస్ సైతం జారీ అయింది. అయితే తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో.. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు వేసి ఊరట పొందినప్పటికీ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదేం ప్రశ్న? ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడాలి: సీఎస్కే కోచ్ ఆగ్రహం
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కంచుకోటను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఎట్టకేలకు బద్దలు కొట్టింది. పదిహేడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చెపాక్‌లో జయకేతనం ఎగురవేసింది. ఫలితంగా ఆర్సీబీ ఆటగాళ్లతో పాటు అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.మరోవైపు.. సొంతగడ్డపై ఆర్సీబీ చేతిలో పరాభవాన్ని సీఎస్కే జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం మీడియాతో మాట్లాడిన చెన్నై జట్టు హెడ్‌కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు చేదు అనుభవం ఎదురైంది. రుతురాజ్ సేన బ్యాటింగ్ తీరును ఉద్దేశించి ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్న అతడికి ఆగ్రహం తెప్పించింది.కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో తమ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై.. చిరకాల ప్రత్యర్థి ముంబై ఇండియన్స్‌తో తలపడింది. చెపాక్‌లో ఈ మాజీ చాంపియన్ల మధ్య జరిగిన పోరులో చెన్నై నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత ముంబైని 155 పరుగులకు కట్టడి చేసిన సీఎస్కే.. 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.పాటిదార్, టిమ్ డేవిడ్ మెరుపులుతాజాగా ఆర్సీబీతో శుక్రవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగుల మేర మంచి స్కోరు రాబట్టింది.ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32), విరాట్ కోహ్లి (30 బంతుల్లో 31)లతో పాటు దేవదత్ పడిక్కల్ (14 బంతుల్లో 27) రాణించగా.. కెప్టెన్ రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22) మెరుపులు మెరిపించారు.అయితే, లక్ష్య ఛేదనలో చెన్నై ఆరంభం నుంచే తడబడింది. టాపార్డర్‌లో ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (5), వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (0) పూర్తిగా విఫలం కాగా.. మరో ఓపెనర్ రచిన్ రవీంద్ర (31 బంతుల్లో 41) ఫర్వాలేదనిపించాడు.ధోని ధనాధన్ సరిపోలేదుమిగతా వాళ్లలో రవీంద్ర జడేజా (19 బంతుల్లో 25), మహేంద్ర సింగ్ ధోని (16 బంతుల్లో 30 నాటౌట్) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 146 పరుగుల వద్ద చెన్నై నిలిచిపోయింది. ఫలితంగా యాభై పరుగుల తేడాతో ఆర్సీబీ చేతిలో ఓడిపోయింది.A never ending story 😊Last over 🤝 MS Dhoni superhits 🔥Scorecard ▶ https://t.co/I7maHMwxDS #TATAIPL | #CSKvRCB | @ChennaiIPL pic.twitter.com/j5USqXvf7r— IndianPremierLeague (@IPL) March 28, 2025అవుట్‌డేటెడ్ అంటూ సెటైర్లుఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మీడియా ముందుకు రాగా.. ‘‘తొలి మ్యాచ్‌లో 20 ఓవర్లలో మీరు 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. ఈరోజు 146 పరుగులు చేశారు.మీ బ్రాండ్ క్రికెట్ ఇలాగే ఉంటుందని తెలుసు. కానీ ఇది పాతబడి పోయిందని మీకు అనిపించడం లేదా?’’ అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు.ఇందుకు బదులుగా.. ‘‘నా బ్రాండ్ క్రికెట్ అంటే ఏమిటి? మీరు ఫైర్ పవర్ గురించి మాట్లాడుతున్నారా? మా జట్టు సత్తా ఏమిటో అందరికీ తెలుసు. అసలు మీ ప్రశ్న ఏమిటో నాకు అర్థం కావడమే లేదు.మమ్మల్ని తక్కువ చేయకండితొలి బంతి నుంచే మేము స్వింగ్ చేయడం లేదని మీరిలా అంటున్నారా? మా వ్యూహాల గురించి సానుకూలంగా ఆలోచించడంలో తప్పేముంది? గెలుపు కోసమే ఎవరైనా ప్రయత్నిస్తారు. దీనినే సానుకూల దృక్పథం (పాజిటివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్) అంటారు.మమ్మల్ని తక్కువగా అంచనా వేయడం.. మా గురించి తక్కువగా మాట్లాడటం చేయకండి. ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడండి! ’’ అని ఫ్లెమింగ్ ఒకింత అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశాడు.ఇందుకు సదరు జర్నలిస్టు.. ‘‘నేను మిమ్మల్ని తక్కువ చేసి చూపడటం లేదు’’అని సమాధానమిచ్చారు. దీంతో.. ‘‘మీరు అలాగే మాట్లాడుతున్నారు.. అర్థంపర్థంలేని ప్రశ్నలు వేస్తున్నారు’’ అని ఫ్లెమింగ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. అదే విధంగా.. చెపాక్‌లో ఆడటం వల్ల తమకు అదనపు ప్రయోజనాలేమీ ఉండవని.. ఇతర వేదికలపై తమ జట్టు సత్తా చాటిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఫ్లెమింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!

అమాంతం పెరిగిపోతున్న బంగారం ధరలు: నాలుగు రోజుల్లో..
ఉగాదికి ముందే బంగారం ధరలు తారాస్థాయికి చేరుతున్నాయి. వరుసగా నాలుగో రోజు గోల్డ్ రేటు ఎగిసిపడింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా పసిడి ధరలలో మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏ ప్రాంతంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలను తెలుసుకుందాంహైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 83,600 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 91,200 వద్ద నిలిచాయి. నిన్న రూ. 1050 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1140 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు వరుసగా రూ. 200, రూ. 220 పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 200, రూ. 220 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 83,600 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 91,200 వద్ద ఉంది.దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 83,750 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 91,350 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 200, రూ. 220 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.వెండి ధరలు (Silver Price)బంగారం ధరలు పెరిగినప్పటికీ.. వెండి ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (మార్చి 29) కేజీ సిల్వర్ రేటు రూ. 1,13,000 చేరింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు ఒకే విధంగా ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,04,000 వద్దనే ఉంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

ఉగాది రోజున నోరూరించే కమ్మని పిండివంటలు ఈజీగా చేసుకోండిలా..!
పూర్ణాలు..కావలసినవి: పచ్చిశనగ పప్పు – అర కేజీ, బెల్లం – అరకేజీ, యాలక్కాయలు – పది, బియ్యం – రెండు కప్పులు, పొట్టుతీసిన మినప గుళ్లు – కప్పు, ఉప్పు – రుచికి సరిపడా, ఆయిల్ – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ముందుగా మినప పప్పు, బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి. శనగ పప్పుని కూడా కడిగి గంట పాటు నానబెట్టాలి ∙నానిన బియ్యం మినప పప్పులని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి ∙నానిన శనగపప్పుని కుకర్‌లో వేసి రెండు గ్లాసులు నీళ్లు΄ోసి మూడు విజిల్స్ రానివ్వాలి ∙ఉడికిన శనగ పప్పులో బెల్లం వేసి మెత్తగా గరిటతో తిప్పుతూ దగ్గర పడేంత వరకు ఉడికించి, యాలుక్కాయల పొడి వేసి తిప్పి దించేయాలి ∙శనగపప్పు మిశ్రమం చల్లారాక, ఉండలుగా చుట్టుకోవాలి ∙బియ్యం, మినపగుళ్ల రుబ్బులో కొద్దిగా ఉప్పు వేసి తి΄్పాలి. ఇప్పుడు శనగ పప్పు ఉండలను ఈ పిండిలో ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి ∙మీడియం మంట మీద గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయిస్తే తియ్యని పూర్ణాలు రెడీ.పరమాన్నం..కావలసినవి: బియ్యం – అర కప్పు, పాలు – కప్పు, బెల్లం తురుము – ముప్పావు కప్పు, నెయ్యి – ముప్పావు కప్పు, జీడి పప్పు పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూను, పచ్చకర్పూరం – చిటికెడు. తయారీ: ముందుగా బియ్యాన్ని కడిగి పదిహేను నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో పాలుపోసి కాయాలి. కాగిన పాలల్లో నానబెట్టిన బియ్యం వేసి తిప్పుతూ ఉడికించాలి. అన్నం మెత్తగా ఉడికాక దించి చల్లారనివ్వాలి. స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కిన తరువాత జీడి పప్పు పలుకులు వేసి గోల్డ్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. స్టవ్ మీద మరో పాత్ర పెట్టి బెల్లం తురుము వేయాలి. దీనిలో పావుకప్పు నీళ్లుపోసి సిరప్‌లా మారేవరకు ఉడికించి, చల్లారనివ్వాలి. బెల్లం సిరప్‌లోనే యాలకుల పొడి, పచ్చ కర్పూరం వేసి తిప్పాలి. బెల్లం సిరప్ చల్లారక అన్నంలో వేసి బాగా కలపాలి, దీనిలో మిగిలిన నెయ్యి, జీడిపప్పుతో గార్నిష్ చేస్తే పరమాన్నం రెడీ.మామిడికాయ పులిహోరకావలసినవి: బియ్యం – కప్పు, పచ్చిమామిడి కాయ – మీడియం సైజుది ఒకటి, పచ్చికొబ్బరి తురుము – అర కప్పు, ఆవాలు – టీస్పూను, మినప పప్పు – టీస్పూను, పచ్చిశనగ పప్పు – టీ స్పూను, వేరుశనగ గుళ్ళు – రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు – మూడు రెమ్మలు, పచ్చిమిర్చి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి – నాలుగు, మెంతులు – పావు టీస్పూను, ఆయిల్ – నాలుగు టేబుల్ స్పూన్లు, పసుపు – పావు టీస్పూను, చింతపండు ఉసిరికాయంత, బెల్లం తురుము – రెండు టీస్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి అన్నం పొడి పొడిగా వచ్చేలా వండి ఆరబెట్టుకోవాలి మామిడి కాయ తొక్క తీసి ముక్కలుగా తరగాలి. ఎండు మిర్చి, మెంతులు, అరటీస్పూను ఆవాలను దోరగా వేయించుకుని పొడిచేయాలి. ఈ పొడిలో పచ్చికొబ్బరి, మామిడికాయ ముక్కలు, చింతపండు, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కనపెట్టుకోవాలి. స్టవ్ మీద బాణలి పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు వేయాలి. చిటపటలాడాక మినప పప్పు, శనగ పప్పు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేయాలి ∙ఇవన్ని వేగాక వేరుశనగ గుళ్ళు వేసి వేయించాలి. ఇవి వేగాక పసుపు, గ్రైండ్ చేసిన మామిడికాయ మిశ్రమం వేసి ఐదు నిమిషాలు వేయించాలి ∙తరువాత రుచికి సరిపడా ఉప్పు వేసి, ఆరబెట్టిన అన్నాన్ని వేసి కలిపితే మామిడికాయ పులిహోర రెడీ. (చదవండి: 6 రుచులు... 6 ఆరోగ్య లాభాలు)

మంచి స్కోర్ చేశాము.. సీఎస్కేను వారి సొంత ఇలాకాలో ఓడించడం చాలా ప్రత్యేకం: పాటిదార్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. సీఎస్కేతో నిన్న (మార్చి 28) జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. కష్ట సాధ్యమైన పిచ్‌పై తొలుత బ్యాటింగ్ చేసి 196 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం అద్భుతంగా బౌలింగ్ చేసి విజయంవంతంగా లక్ష్యాన్ని కాపాడుకుంది. బ్యాటింగ్‌లో రజత్ పాటిదార్ (32 బంతుల్లో 51; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఫిల్ సాల్ట్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, సిక్స్), పడిక్కల్ (14 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (8 బంతుల్లో 22 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు) సత్తా చాటగా.. బౌలింగ్‌లో హాజిల్‌వుడ్ (4-0-21-3), లవింగ్‌స్టోన్ (4-0-28-2), యశ్ దయాల్ (3-0-18-2) మ్యాజిక్ చేశారు. ఫలితంగా ఆర్సీబీ సీఎస్కేను 17 ఏళ్ల తర్వాత వారి సొంత ఇలాకాలో ఓడించింది.ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకోగా.. సీఎస్కే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఓటమిపాలైంది. టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన సీఎస్కే కీలక సమయాల్లో క్యాచ్‌లు జారవిడచడంతో పాటు ఫీల్డింగ్‌లో అనవసర తప్పిదాలు చేసి అదనపు పరుగులు సమర్పించుకుంది. నూర్ అహ్మద్ (4-0-36-3), పతిరణ (4-0-36-2), ఖలీల్ అహ్మద్ (4-0-28-1) బాగానే బౌలింగ్ చేసినా మిగతా బౌలర్లు సామర్థ్యం మేరకు రాణించలేక ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. స్లోగా ఉన్న పిచ్‌పై సీఎస్కే బౌలర్లు 20-30 పరుగులు అదనంగా ఇచ్చారు.అనంతరం కష్ట సాధ్యమైన ఛేదనలో సీఎస్కే బ్యాటర్లు ఆదిలోనే చేతులెత్తేశారు. కనీస పోరాటం కూడా చూపలేక మ్యాచ్‌ను ఆర్సీబీకి అప్పగించారు. ఓ పక్క వికెట్లు పడుతున్నా రచిన్ రవీంద్ర (41) ఒక్కడే క్రీజ్‌లో నిలబడి ఏదో చేసే ప్రయత్నం చేశాడు. ఆఖర్లో ధోని (16 బంతుల్లో 30 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ షాట్లు ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సీఎస్కేకు పిచ్ నుంచి కూడా ఎలాంటి సహకారం లభించలేదు. వికెట్ చాలా స్లోగా ఉండింది. కొత్త బంతి కూడా వారికి కలిసి రాలేదు.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ రజత్ పాటిదార్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ వికెట్‌పై మంచి స్కోర్ చేశాము. వికెట్ చాలా స్లోగా ఉండింది. బ్యాటర్లకు ఇది అంత సులభం కాదు. సీఎస్కేను వారి సొంత అభిమానుల మధ్య ఓడించడం చాలా ప్రత్యేకం. ఈ వికెట్‌పై ఛేజింగ్ చేయడం అంత సులభం కాదని తెలుసు. అందుకే 200 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. నేను క్రీజ్‌లో ఉన్నంత సేపు ప్రతి బంతికి భారీ షాట్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఓ రకంగా సఫలమయ్యాను. స్పిన్నర్లకు ఈ ట్రాక్ చాలా ఉపయోగకరంగా ఉండింది. అందుకే ముందుగానే స్పిన్నర్లను బరిలోకి దించాలని అనుకున్నాము. లివింగ్‌స్టోన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హాజిల్‌వుడ్ తన తొలి ఓవర్లో, ఆతర్వాత కొత్త బంతితో మ్యాజిక్ చేశాడు. ఈ రెండు సందర్భాలు మ్యాచ్‌ను మాకు అనుకూలంగా మార్చాయి. మేము పరుగులు సాధించగలిగినా వారి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.

‘ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే నోరు మెదపరా?'
తూర్పుగోదావరి, సాక్షి: ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే సహించబోనని.. చెయ్యి వేసిన వాడి తాట తీస్తానని గతంలో పవన్ కల్యాణ్ ఎన్నో ప్రకటనలు ఇచ్చారు. మరి ఇప్పుడు ఆయనెక్కడ ఉన్నారు? అంటూ రాజమండ్రి ఫార్మసీ విద్యార్థిని తల్లిదండ్రులు, ఆమె స్నేహితులు ప్రశ్నిస్తున్నారు. పోలవరం దాకా వచ్చిన చంద్రబాబుకి.. ఇక్కడిదాకా వచ్చే టైం లేదా? అని అడుగుతున్నారు. మహిళా హోం మంత్రి అనితకు పరామర్శించే సమయమే లేదా? అని నిలదీస్తున్నారు. లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టిన డీ ఫార్మ్ ఫైనలియర్ విద్యార్థిని పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఆమె చికిత్స పొందుతున్న రాజమండ్రి బొల్లినేని కిమ్స్ ఆస్పత్రి యాజమాన్యమే వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నమూ చేస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని సమాచారం అందుతోంది. ఫార్మసీ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి కమిటీ వేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి వెంకటేశ్వరరావు సారథ్యంలోని ముగ్గురు సభ్యులతో కూడిన ఈ బృందం శుక్రవారం ఆసుపత్రికి వచ్చి విద్యార్థినికి అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యంపై ఇవాళ(శనివారం) హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు.బాధిత విద్యార్థిని డైరీలో రాసుకున్న సూసైడ్ నోట్‌తో ఆత్మహత్యా యత్నం బహిర్గతమైంది. నిందితుడు దీపక్ ఓ టీడీపీ ఎమ్మెల్యేకి బంధువు కావడంతో కేసును నీరు కారుస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగిన మూడు రోజుల దాకా అంతా గోప్యంగా ఉంచారని అంటున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆందోళన బాట పట్టారు. సీసీ ఫుటేజీ ఎక్కడ? బాధితురాలు వేకురోనీమ్ 10 ఎంజీ ఇంజక్షన్ తీసుకుందని.. దీనివల్ల బ్రెయిన్ డెడ్ అయ్యే ప్రమాదం ఉందని కొందరు పేర్కొంటుండగా.. ఇంకా బ్రెయిన్ డెడ్ కాలేదని ఆస్పత్రి యాజమాన్యం అంటోంది. మరి అంత ప్రమాదకరమైన ఇంజక్షన్ ఆమె చేతికి ఎలా వచ్చిoది? ఆమే చేసుకుందా..? ఎవరైనా ఇచ్చారా? సీసీ ఫుటేజీలో ఏం ఉంది? అనే దిశగా పోలీసు దర్యాప్తు చేయకపోవడం సందేహాలకు తావిస్తోంది. వాడిని చంపేయండి..! చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన చెల్లికి ఈ పరిస్థితి కల్పించిన దీపక్‌ను చంపేయాలని బాధితురాలి సోదరి, మేనత్త ఆగ్రహంతో మండిపడ్డారు. తన చెల్లెలు బాగా చదువుకునేదని, మంచి మార్కులతో ఫార్మసీ పూర్తి చేసే లోపు ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. ఆసుపత్రి లోపల ఏం జరుగుతోందో తెలియడం లేదని, ఎలాంటి వైద్యం అందిస్తున్నారో చెప్పడం లేదని బాధితురాలి అక్క విలపించింది. దీపక్‌ను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని మేనత్త డిమాండ్ చేసింది. సూసైడ్ లేఖ దొరక్కపోయి ఉంటే ఈ కేసును వేరే విధంగా మార్చేసేవారన్నారు.

మా వల్ల కావట్లేదు.. ఎవరి దయ మీదా బతకాలనుకోవడం లేదు
బెంగళూరు: వీడియో కాల్ చేసి.. ఆపై నగ్నఫొటోలున్నయంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్య తరచూ చూస్తున్నదే. అయితే అలాంటి సైబర్ నేరంలో చిక్కుకుని.. వాళ్ల బెదిరింపులకు భయపడి వృద్ధ దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పైగా అప్పటికే రూ.50 లక్షలు చెల్లించిన ఆ జంట.. ఇంకా చేసేది లేక ఈ ఘాతుకానికి దిగింది.బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా బీడి గ్రామంలో గ్రామంలో విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి డియోగో నజరత్(83), పావీయా నజరత్(79) దంపతులు నివాసం ఉంటున్నారు. గత రెండు రోజులుగా ఇంటినుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో స్వసహయ సంఘం మహిళలు వెళ్లి చూడగా.. విగతజీవులుగా కనిపించారు. సమాచారం అందుకున్న నందగడ పోలీసులు వచ్చి పరిశీలించారు. డియోగో గొంతు, మణికట్టు వద్ద కత్తి కోసిన గాయం కనిపించింది. ఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించింది. దీంతో మృతదేహాలను పోస్టుమార్టం కోసం బీమ్స్ ఆస్పత్రికి తరలించారు. ‘‘నా వయసు 82 ఏళ్లు.. నా భార్య వయసు 79 సంవత్సరాలు. ఈ వయసులో మాకు ఆదుకోవడానికి ఎవరూ లేరు. సమాజంలో ఎంతో గౌరవంగా ఇంతకాలం బతికాం. కానీ, ఇప్పుడు ఈ వేధింపులు భరించలేకపోతున్నాం. ఎవరిని సాయం అడిగి.. ఎవరి దయ మీదా బతకాలనీ అనుకోవడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని డియోగో స్వదస్తూరితో రాసిన లేఖ అది. నెల రోజులుగా వేధింపులు.. సూసైడ్ నోట్ ఆధారంగా కీలక విషయాలు వెలుగు చూశాయి. దంపతులను సైబర్ నేరగాళ్లు నెల రోజులుగా వేధిస్తున్నారు. తాము పోలీసులమంటూ పరిచయం చేసుకున్నారు. మా వద్ద మీ నగ్న చిత్రాలున్నయంటూ ఫోన్లో బెదిరించారు. అడిగినంత డబ్బులు ఇవ్వకంటే ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాలలో వైరల్ చేస్తామంటూ బెదిరించారు. ఆ వేధింపులు తాళలేక రూ.50 లక్షలు చెల్లించారు. అయినా మరింత నగదు కావాలని ఒత్తిడి చేశారు. దీంతో బలవన్మరణానికి పాల్పడాలని నిర్ణయించుకున్నారు. పావీయా నిద్రమాత్రాలు మింగి ఆత్మహత్య చేసుకుంది. డియాగో డెత్‌నోట్ రాసి చాకుతో గొంతు కోసుకోని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటన స్థలాన్ని బెళగావి జిల్లా ఎస్పీ పరిశీలించి కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు.లేఖలో.. సుమిత్రా బిర్రా, అనిల్ యాదవ్ అనే ఇద్దరి పేర్లను డియాగో ప్రస్తావించారు. తాను న్యూఢిల్లీ నుంచి టెలికామ్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నానని సుమిత్రా , అనిల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుగా పరిచయం చేసుకుని మరీ బెదిరింపులకు దిగారట. నగ్నఫోల్‌కాల్స్ ఉన్నాయని.. సిమ్ కార్డ్ దుర్వినియోగం కింద చట్టపరమైన చర్యలు ఉంటాయని బెదిరించారట. అయితే.. అప్పటికే రూ.50 లక్షలు చెల్లించామని.. ఇంకా కావాలని డిమాండ్ చేశారని.. బంగారం మీద రుణం కూడా తీసుకుని చెల్లించామని లేఖలో డియాగో వాపోయాడు. స్నేహితుల వద్ద నుంచి తెచ్చిన అప్పును తన భార్య నగలు అమ్మి చెల్లించాలని సూసైడ్ నోట్లో కోరిన డియాగో.. తమ ఇద్దరి మృతదేహాలను మెడికల్ కాలేజీకి అప్పగించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశాడు.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com

లూసిఫర్2 కలెక్షన్ల సునామీ.. ప్రకటించిన మోహన్‌లాల్
మలయాళ సినిమా 'లూసిఫర్2: ఎంపురాన్' (L2 Empuraan) బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే, తాజాగా ఈ సినిమా రెండు రోజుల్లోనే బెంచ్‌మార్క్ కలెక్షన్స్ రాబట్టినట్లు మోహన్‌లాల్ ప్రకటించారు. 2019లో వచ్చిన లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని భారీ బడ్జెట్‌తో లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుమారు రూ.140 కోట్ల బడ్జెట్‌తో లూసిఫర్2 చిత్రాన్ని నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్లో విడుదలైన ఈ చిత్రాన్ని స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించారు.లూసిఫర్2 కేవలం రెండురోజుల్లోనే రూ. 100 కోట్లు రాబట్టినట్లు మోహన్‌లాల్ ఒక పోస్టర్‌తో ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 48 గంటల్లోపు రూ. 100 కోట్లను అధిగమించి, సినిమా చరిత్రలోనే కొత్త రికార్డ్‌ను లూసిఫర్ నెలకొల్పిందని మోహన్‌లాల్ అన్నారు. ఈ విజయంలో భాగమైనందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలని ఒక పోస్ట్ చేశారు.మలయాళ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు వంద కోట్ల క్లబ్లో చేరిన సినిమాలు కేవలం 10 మాత్రమే ఉన్నాయి. అయితే, ఎంపురాన్ 48 గంటల్లోనే రూ. 100 కోట్ల క్లబ్లో చేరడం విశేషం. ఈ సినిమా ఫైనల్‌గా రూ. 200 కోట్లు దాటొచ్చు అని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవంగా 2019 వరకు మలయాళంలో రూ.100 కోట్లు రాబట్టిన సినిమాలే లేవు. అప్పట్లో లూసిఫర్ సినిమానే మొదటిసారి ఈ మార్క్‌ను దాటి రూ.127 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ రూ.242 కోట్లతో ఏకైక మలయాళ మూవీగా రికార్డుకెక్కింది. మరి ఈ రికార్డును ఎంపురాన్ బ్రేక్ చేస్తుంది అని మోహన్‌లాల్ అభిమానులు అంటున్నారు. The Cicada himself. #L2E #Empuraan surpasses 100 crore at the box office worldwide in less than 48 hours, setting new benchmarks in cinematic history.A heartfelt thanks to all of you for being part of this extraordinary success! Your love and support made this possible. pic.twitter.com/SoGeHClLY2— Mohanlal (@Mohanlal) March 28, 2025

Earthquake Updates: 1000 దాటిన మృతుల సంఖ్య
Earthquake Live Rescue OP Updates👉వెయ్యి దాటిన భూకంప మృతులుమయన్మార్, థాయ్‌లాండ్‌లో వెయ్యి దాటిన మృతుల సంఖ్యమయన్మార్లోనే మృతులు అత్యధికంశిథిలాల నుంచి పలువురిని రక్షిస్తున్న సహాయక బృందాలు 👉 మయన్మార్, థాయ్‌లాండ్‌లో మృత్యు ఘోషభారీ భూకంపంతో రెండు దేశాల్లో మృత్యు ఘోషమయన్మార్, థాయ్‌లాండ్‌లో 700కి పెరిగిన భూకంప మృతుల సంఖ్యఒక్క మయన్మార్‌లోనే 694 మంది మృతి, 1500 మందికి పైగా గాయాలుబ్యాంకాక్‌లో ఇప్పటిదాకా 10 మంది మృతి చెందినట్లు ప్రకటనసహాయక చర్యల్లో భాగంగా.. శిథిలాల నుంచి బయటపడుతున్న మృతదేహాలు సజీవంగా బయటపడుతున్నవాళ్ల సంఖ్య తక్కువేరెండు దేశాల్లోనూ కొనసాగుతున్న సహాయక చర్యలుమయన్మార్‌లో కూలిపోయిన సగాయింగ్ బ్రిడ్జిశిథిలా కింద చిక్కుకున్న వాళ్లను కాపాండేందుకు రెస్క్యూ టీం సహాయంమృతుల సంఖ్య 10వేలకు పైగా ఉండొచ్చని అమెరికా సంస్థ అంచనా 👉 భూకంపం ధాటికి బ్యాంకాక్‌లో కుప్పకూలిన భారీ భవనంకుప్పకూలిన 33 అంతస్తుల భవనంనాలుగు మృతదేహాల వెలికితీత90 మంది ఆచూకీ గల్లంతుకొనసాగుతున్న శిథిలాల తొలగింపు👉మయన్మార్, థాయ్‌లాండ్‌లో ప్రకృతి విలయం200 దాటిన మృతుల సంఖ్యమయన్మార్‌లో నేలమట్టమైన 40 భారీ అపార్ట్‌మెంట్లుబ్యాంకాక్‌లోనూ కూలిన భవనాలుశిథిలాల కింద వందలాది మంది.. కొనసాగుతున్న సహాయక చర్యలురక్షించాలంటూ శిథిలాల నుంచి కేకలుఅయినవాళ్ల కోసం కన్నీళ్లతో గాలిస్తున్న పలువురుమృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అంచనా👉అఫ్గాన్‌లో భూకంపంరిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదుఉదయం 5.16 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు తెలిపిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ👉భూకంప బాధితులకు భారత్ ఆపన్న హస్తం15 టన్నుల సహాయక సామగ్రిని మయన్మార్‌కు పంపించిన భారత్గుడారాలు, స్లీపింగ్ బ్యాగ్స్, ఆహార పొట్లాలు, సోలార్ లైట్లు, ఔషధాలను మిలిటరీ విమానంలో పంపించినట్లు వెల్లడించిన విదేశాంగశాఖ 👉మయన్మార్‌లో మళ్లీ భూకంపంమయన్మార్‌ను వణికించిన మరో భూకంపంసహాయక చర్యలు కొనసాగుతుండగానే గతరాత్రి మళ్లీ భూకంపం4.2 తీవ్రతతో మళ్లీ ప్రకంపనలునిన్నటి భూకంపం ధాటికి 200 మంది మరణించినట్లు ప్రకటించిన అధికారులుఇంకా భారీగా మృతులు ఉండే అవకాశంవెయ్యి మంది మరణించి ఉండొచ్చని అంచనా వేస్తున్న అమెరికా భూకంపం సర్వే సంస్థ👉 థాయ్‌లాండ్‌లో కొనసాగుతున్న ఎమర్జెన్సీథాయ్‌లాండ్‌లో భూకంపంతో అత్యవసర పరిస్థితి ప్రకటనఉత్తర థాయ్‌లాండ్‌లో తీవ్ర నష్టంరాజధాని బ్యాంకాక్ అతలాకుతలంకొనసాగుతున్న శిథిలాల తొలగింపు భారీ సంఖ్యలో మృతులు ఉండే అవకాశంA huge earthquake hits Bangkok Capita Thai and Mayanmar.#trending #breakingnews #viralreels #viral #earthquake #bangkok #mayanmar #NEW pic.twitter.com/AoNn9P30Oq— Dr Maroof (@maroof2221) March 28, 2025👉హృదయ విదారకం మయన్మార్, థాయ్‌లాండ్‌ల్లో హృదయవిదారకంగా భూకంప దృశ్యాలు పలుచోట్ల కుప్పకూలిన భవనాలు, నిర్మాణాల కింద నుంచి హాహాకారాలు స్కూల్స్, ఆఫీసులు, ఆస్పత్రులు.. ఇలా అన్ని కుప్పకూలిన వైనంశిథిలాల నడుమ తమవారి కోసం కన్నీటి మధ్యే వెదుక్కుంటున్న జనం కంటతడి పెట్టిస్తున్న దృశ్యాలు👉మయన్మార్, థాయ్‌లాండ్‌ను కుదిపేసిన భారీ భూకంపంకుప్పకూలిన భవనాలతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టంఇంకా శిథిలాల కిందే పలువురు.. కొనసాగుతున్న సహాయకచర్యలుమయన్మార్‌లో ఆరు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటనథాయ్‌లాండ్‌లో భారతీయుల సహాయార్థఇండియన్ ఎంబసీ హెల్ప్‌లైన్‌థాయ్‌లాండ్‌లో హెల్ఫ్‌లైన్ నెంబర్ +66618819218ఊహించని ప్రకృతి వికృతి చర్య.. అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న మయన్మార్ పాలిట భారీ భూకంపం గోరుచుట్టుపై రోకటిపోటుగా మారింది.టిబెట్ పీఠభూమి ప్రాంతంలో సంక్లిష్టమైన టెక్టానిక్ ఫలకాలపై ఉన్నందున మయన్మార్‌కు భూకంప ముప్పు ఎక్కువే. ఇక్కడ హెచ్చు తీవ్రతతో కూడిన భూకంపాలు పరిపాటి. భూమి పై పొరలోని ఇండో, బర్మా టెక్టానిక్ ఫలకాలు సమాంతరంగా కదలడమే తాజా భూకంపానికి కారణమని సైంటిస్టులు తేల్చారు. భూ ఫలకాల అంచులను ఫాల్ట్‌గా పిలుస్తారు. లక్షలాది ఏళ్ల కింద భారత ఉపఖండం ఆసియాను ఢీకొట్టడం వల్ల ఏర్పడ్డ సాగయింగ్ ఫాల్ట్‌గా పిలిచే పగుళ్ల వెంబడే తాజా భూకంపం చోటుచేసుకుంది. ఇక్కడ టెక్టానిక్ ఫలకాలు ఏటా 0.7 అంగుళాల చొప్పున పరస్పర వ్యతిరేక దిశలో కదులుతున్నాయి. ఫలితంగా పుట్టుకొచ్చే ఒత్తిడి భూకంపాలుగా మారుతుంటుంది. ఇక్కడ దశాబ్దానికి ఒక్క భారీ భూంకంపమన్నా నమోదవుతుంటుంది. మయన్మార్‌లో గత వందేళ్లలో 6కు మించిన తీవ్రతతో 14కు పైగా భూకంపాలు నమోదయ్యాయి. 1946లో 7.7, 1956లో 7.1 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. 1988 నాటి భూకంపానికి వేలాది మంది బలయ్యారు. 2011, 2016ల్లో కూడా 6.9 తీవ్రతతో భూకంపాలొచ్చాయి. 👉ప్రకృతి ప్రకోపానికి చిగురుటాకుల్లా వణికిపోయిన థాయ్‌లాండ్, మయన్మార్‌మార్చి 28 శుక్రవారం మధ్యాహ్నం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇటు మయన్మార్‌లో.. 7.4 తీవ్రతతో సంభవించిన ప్రకంపనలు అటు థాయ్‌లాండ్‌లోనూ భారీ విధ్వంసం సృష్టించాయి. మయన్మార్‌లో 6.4 తీవ్రతతో మరోసారి భూమి కంపించగా తర్వాత కూడా మరో నాలుగైదు ప్రకంపనాలు వణికించాయి. ఇటు మయన్మార్‌లో.. అటు థాయ్ రాజధాని బ్యాంకాక్‌లో భారీ భవనాలు కళ్లముందే పేకమేడల్లా కుప్పకూలాయి. మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి
అలాంటి ఫ్యాన్స్ ఉండడం నా అదృష్టం: విజయ్ దేవరకొండ
Nepal: మాజీ రాజు జ్ఞానేంద్ర షా అరెస్టుకు రంగం సిద్ధం?
భర్త సంపాదన ప్రియుడిపాలు!
ట్యాపింగ్ కేసులో వీడిన ఉత్కంఠ.. సిట్ ఎదుటకు శ్రవణ్ రావు
ప్రతి షోకి వసూళ్లు పెరుగుతున్నాయి: ‘రాబిన్‌హుడ్’ నిర్మాత
ఇదేం ప్రశ్న? ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడాలి: సీఎస్కే కోచ్ ఆగ్రహం
బిడ్డా.. నన్ను విడిచి వెళ్లిపోయావా...
ఐపీఎల్లో నేటి (మార్చి 29) మ్యాచ్.. ముంబైతో గుజరాత్ 'ఢీ'
ఉగాది రోజున నోరూరించే కమ్మని పిండివంటలు ఈజీగా చేసుకోండిలా..!
40 ఏళ్లు దాటినా పెళ్లి కావడంలేదని...
ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
రాజేంద్రప్రసాద్ బూతు మాటలపై డేవిడ్ వార్నర్ రియాక్షన్ ఇదీ..
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
15 ఏళ్ల క్రితం పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకున్నా.. కానీ అంతకంటే టైం వేస్ట్ ఇంకోటి లేదు!
అప్సర కేసు: ఒక్క రాత్రిలో తలకిందులైన జీవితాలు
గవర్నమెంట్ స్కూల్ టీచర్ కొడుకు.. కట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే విధ్వంసం
మంచు ఫ్యామిలీలో గొడవలు.. మామయ్యకేమైనా అవుతుందేమోనని..: విరానిక
BCCI Contracts: రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ షాక్.. !
అప్సర కేసులో సాయికృష్ణకి జీవితఖైదు
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
అలాంటి ఫ్యాన్స్ ఉండడం నా అదృష్టం: విజయ్ దేవరకొండ
Nepal: మాజీ రాజు జ్ఞానేంద్ర షా అరెస్టుకు రంగం సిద్ధం?
భర్త సంపాదన ప్రియుడిపాలు!
ట్యాపింగ్ కేసులో వీడిన ఉత్కంఠ.. సిట్ ఎదుటకు శ్రవణ్ రావు
ప్రతి షోకి వసూళ్లు పెరుగుతున్నాయి: ‘రాబిన్‌హుడ్’ నిర్మాత
ఇదేం ప్రశ్న? ఆఖర్లో ఎవరు గెలుస్తారో చూడాలి: సీఎస్కే కోచ్ ఆగ్రహం
బిడ్డా.. నన్ను విడిచి వెళ్లిపోయావా...
ఐపీఎల్లో నేటి (మార్చి 29) మ్యాచ్.. ముంబైతో గుజరాత్ 'ఢీ'
ఉగాది రోజున నోరూరించే కమ్మని పిండివంటలు ఈజీగా చేసుకోండిలా..!
40 ఏళ్లు దాటినా పెళ్లి కావడంలేదని...
ముందు అతన్ని బ్రష్ చేసుకోమన్నా: నటి సురభి
రాజేంద్రప్రసాద్ బూతు మాటలపై డేవిడ్ వార్నర్ రియాక్షన్ ఇదీ..
రూ.కోట్లు కోల్పోయిన వ్యాపారవేత్త.. ఏం జరిగిందంటే..
15 ఏళ్ల క్రితం పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకున్నా.. కానీ అంతకంటే టైం వేస్ట్ ఇంకోటి లేదు!
అప్సర కేసు: ఒక్క రాత్రిలో తలకిందులైన జీవితాలు
గవర్నమెంట్ స్కూల్ టీచర్ కొడుకు.. కట్ చేస్తే! తొలి మ్యాచ్‌లోనే విధ్వంసం
మంచు ఫ్యామిలీలో గొడవలు.. మామయ్యకేమైనా అవుతుందేమోనని..: విరానిక
BCCI Contracts: రుతురాజ్ గైక్వాడ్‌కు భారీ షాక్.. !
అప్సర కేసులో సాయికృష్ణకి జీవితఖైదు
‘విడాకులు మాత్రమే కావాలి.. నేనేమీ బికారిని కాదు.. ఆ దెయ్యం డబ్బు నాకొద్దు’
సినిమా

పట్టు పరికిణిలో బిగ్‌బాస్ బ్యూటీ.. ఉప్పెన భామ కృతి శెట్టి గ్లామరస్ పిక్స్!
అవార్డ్స్ ఫంక్షన్లో మెరిసిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి..షిప్లో చిల్ అవుతోన్న ప్రగ్యా జైస్వాల్, మంచు లక్ష్మి..బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ అదిరిపోయే లుక్స్...జీన్స్ డ్రెస్‌లో శ్రద్ధాదాస్ పోజులు... మేకప్ ప్రాక్టీస్ చేస్తోన్న బాలీవుడ్ భామ కాజోల్.. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207)

హీరో విజయ్ కంటే మన హీరోనే స్మార్ట్..: మల్లారెడ్డి ప్రశంసలు
దివంగత లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు, సింగర్ ఎస్పీ చరణ్ చాలా ఏళ్ల తర్వాత 'లైఫ్'(లవ్ యువర్ ఫాదర్) అనే సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు. మనీషా ఆర్ట్స్, అన్నపరెడ్డి స్టూడియోస్ బ్యానర్స్‌పై కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ కేతరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే మల్లా రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా హీరో శ్రీ హర్ష మాట్లాడుతూ.. 'ముందుగా ముఖ్య అతిధి మల్లా రెడ్డికి కృతజ్ఞతలు. ఆయన ఈ సినిమాలో నటించి ఉంటే, పాన్ వరల్డ్ సినిమా అయ్యేది. ఈ సినిమాని నిర్మించిన తన తండ్రి రామ స్వామి రెడ్డికి కృతజ్ఞతలు. ఇంత అద్భుతంగా తీసిన డైరెక్టర్ పవన్ కేతరాజుకి ఎంతో రుణపడి ఉంటా. మణి శర్మ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ తన సినిమాకి సంగీతం ఇవ్వడం తన అదృష్టం. అలాగే సింగర్ ఎస్పీ చరణ్, నటుడు ప్రవీణ్‌తో కలిసి పని చెయ్యడం చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు.ఎమ్మెల్యే మల్లా రెడ్డి మాట్లాడుతూ.. 'ముందుగా ప్రేక్షకులకు నా నమస్కారాలు. ఈ సినిమాని పాన్ ఇండియా భాషల్లో తీశారని తెలిసి ఆశ్చర్యపోయా. హీరో శ్రీ హర్ష తమిళ హీరో విజయ్ కంటే స్మార్ట్‌గా ఉన్నారు. శ్రీ హర్ష తమ కాలేజీ స్టూడెంట్.. అతని తండ్రి తమ కాలేజీ ప్రిన్సిపాల్.. వీరు సినిమా చెయ్యడం తనకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమాలో పని చేసిన నటినటులకి నా అభినందనలు. డైరెక్టర్ ప్రవీణ్ కేతరాజు ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు ప్రత్యేక అభినందనలు. ఈ సినిమా కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవ్వాలి' అని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇక డైరెక్టర్ పవన్ మాట్లాడుతూ.. 'తమని దీవించడానికి వచ్చిన ముఖ్య అతిధి మల్లా రెడ్డికి నా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు ప్రత్యేక ధన్యవాదాలు. చరణ్ ఈ సినిమా చేయబట్టే చాలా అద్భుతంగా వచ్చింది. బాల సుబ్రహ్మణ్యం చరణ్‌ను మనకు గిఫ్ట్‌గా ఇచ్చారు. బాల సుబ్రహ్మణ్యం ఎక్కడున్నా మమ్మల్ని దీవిస్తూ ఉంటారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు' అని అన్నారు.సింగర్ ఎస్పీ చరణ్ మాట్లాడుతూ.. 'వేదిక మీద ఉన్న పెద్దలందరికి నమస్కారం. తన క్యారెక్టర్‌ను అద్భుతంగా డిజైన్ చేసిన డైరెక్టర్ పవన్ కేతరాజుకు ధన్యవాదాలు . ఈ సినిమా హీరో శ్రీ హర్ష చాలా కష్ట పడ్డారు. వారణాసిలో ఆయన పడ్డ కష్టాన్ని గుర్తు చేశారు. ఈ సినిమా శ్రీ హర్షకి మంచి సక్సెస్ ఇవ్వాలి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించినందుకు కషికకి స్పెషల్ థాంక్స్. అలాగే ఎంతో సపోర్టింగ్ యాక్ట్ చేసిన నటుడు ప్రవీణ్‌కు నా కృతజ్ఞతలు. ఇంతమంచి సినిమాలో తాను పాడేందుకు అవకాశం ఇవ్వనందుకు కోపంగా ఉన్నానని సరదాగా' అన్నారు. ఈ చిత్రంలో చరణ్, నవాబ్ షా, ప్రవీణ్, భద్రం, రఘుబాబు, షకలక శంకర్, రియా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సిినిమాను ఏప్రిల్ 4వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

సూర్యతో బుట్టబొమ్మ స్టెప్పులు.. బుజ్జమ్మ సాంగ్ వచ్చేసింది
సూర్య హీరోగా కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన సినిమా ‘రెట్రో’. ఇందులోని హుషారైన గీతాన్ని టీమ్ విడుదల చేసింది. ఈ చిత్రాన్ని జ్యోతిక, సూర్యనే నిర్మిస్తున్నారు. ప్రేమ, యుద్ధం నేపథ్యంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ చిత్రంలో బుజ్జమ్మ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్‌కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. సంతోష్ నారాయణన్ ఆలపించారు. ఈ సాంగ్ విడుదలైన కొద్ది సేపటికే యూట్యూబ్‌లో దూసుకెళ్లోంది. సూర్య అభిమానులను ఓ ఊపు ఊపేస్తోంది. ఈ చిత్రంలో జోజు జార్జ్, జయరామ్, కరుణాకరన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతమందిస్తుండగా.. మే 1న మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

రాబిన్‌హుడ్‌లో డేవిడ్ వార్నర్.. రెండు నిమిషాలకే ఇంత హంగామా చేశారా?
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ రోజే థియేటర్లలోకి వచ్చేసింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ సినిమా ద్వారా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీ రిలీజ్ ముందు ప్రమోషన్లలోనూ బిజీగా పాల్గొన్నారు. రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిశారు. దీంతో రాబిన్‌హుడ్‌లో డేవిడ్ రోల్‌పై అభిమానుల్లో మరింత అంచనాలు పెరిగాయి.అయితే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ పాత్రపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కెమియో రోల్ అయినప్పటికీ ట్రైలర్ ఎంట్రీ ఇవ్వడం చూసిన ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఉంటుందని ఊహించారు. కానీ అభిమానులు ఊహించినంత స్థాయిలో మాత్రం డేవిడ్ పాత్ర కనిపించలేదు. కేవలం 2 నిమిషాల 50 సెకన్ల పాటు కనిపించి ఉస్సురుమనిపించారు. రాబిన్‌హుడ్‌లో కొద్దిసేపే కనిపించడంపై డేవిడ్ వార్నర్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అది కూడా కేవలం డ్రగ్ డీలర్ పాత్రలో కనిపించడం.. కథలో పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతో మైనస్‌గా మారింది.మూవీ ప్రమోషన్స్‌లో డైరెక్టర్ వెంకీ కుడుముల వార్నర్ పాత్రపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. వార్నర్ రోల్ ఈ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తుందని అన్నారు. అంతేకాకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కావడం, స్వయంగా అతను కూడా మూవీ ప్రమోషన్లలో పాల్గొనడంతో అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కనీసం పది నిమిషాల పాటైనా వార్నర్ స్క్రీన్‌పై సందడి చేస్తే బాగుండేదని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వార్నర్.. భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుందాం.
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

ఈ పిచ్‌పై 170 పరుగులే ఎక్కువ.. ఇంకా భారీ తేడాతో ఓడిపోనందుకు సంతోషించాలి: రుతురాజ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ముంబై ఇండియన్స్‌పై గెలుపుతో ప్రారంభించింది. అయితే రెండో మ్యాచ్‌లో మాత్రం సీఎస్కే బొక్క బోర్లా పడింది. నిన్న (మార్చి 28) సొంత మైదానం చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ సేన ఆర్సీబీ చేతిలో ఘోర పరాజయాన్ని (50 పరుగుల తేడాతో) ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ అయిన సీఎస్కే స్థాయి తగ్గట్టుగా ఆడలేకపోయింది. తొలుత బౌలింగ్‌లో పట్టులేక ప్రత్యర్ధిని 196 పరుగులు చేయనిచ్చింది. ఆతర్వాత ఛేదనలో కనీస పోరాటం కూడా ప్రదర్శించలేక 146 పరుగులకే పరిమితమైంది. బౌలింగ్‌తో పోలిస్తే సీఎస్కే బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. రచిన్ రవీంద్ర (41) ఒక్కడే కాస్త పోరాడే ప్రయత్నం చేశాడు. చివర్లో ధోని (16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించినా అప్పటికే సీఎస్కే ఓటమి ఖరారైపోయింది. ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఫీల్డింగ్‌లోనూ దారుణంగా విఫలమైంది. కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలేయడంతో పాటు లేని పరుగులు సమర్పించుకుంది.మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. వాస్తవానికి ఈ వికెట్‌పై 170 పరుగులే చాలా ఎక్కువ. అలాంటిది ఆర్సీబీ 196 పరుగులు చేసి, మా బ్యాటింగ్‌ను మరింత సంక్లిష్టం చేసింది. వారి బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ రోజు ఫీల్డింగ్‌లోనూ మేము గొప్పగా లేము. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాం. ఊహించిన దానికంటే అదనంగా 20 పరుగులను ఛేదిస్తున్నప్పుడు పవర్ ప్లేలో మా బ్యాటింగ్ స్టయిల్ భిన్నంగా ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. తొలి ఐదు ఓవర్లు కొత్త బంతి కూడా ఇబ్బంది పెట్టింది. ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు. రాహుల్ త్రిపాఠి, నేను చాలా కాన్ఫిడెంట్‌గా షాట్లు ఆడాము. కానీ వర్కౌట్ కాలేదు. మా స్పిన్ త్రయాన్ని ఆర్సీబీ బ్యాటర్లు అద్భుతంగా ఎదుర్కొన్నారు. కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలేశాము. అది కూడా మా ఓటమికి కారణమైంది. తదుపరి మ్యాచ్ కోసం మానసికంగా సిద్దంగా ఉండాలి. ఐపీఎల్ లాంటి టోర్నీల్లో బ్యాటింగ్, బౌలింగ్‌లో చెడు రోజు ఉంటుంది. మేము ఫీల్డింగ్‌లో చాలా మెరుగుపడాలి.రచిన్ సరిగ్గా ముందుకు సాగలేకపోయాడు. హుడా పరిస్థితి కూడా అలాగే ఉండింది. దూబే నుంచి ప్రామిసింగ్ ఇన్నింగ్స్ ఆశించాము. యశ్ దయాల్ డబుల్ స్ట్రయిక్ (ఒకే ఓవర్లో 2 వికెట్లు) మా ఓటమిని ఖరారు చేసింది. చివర్లో జడేజా, ధోని భారీ షాట్లు ఆడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓవరాల్‌గా ఆర్సీబీ అద్భుత ప్రదర్శన చేసింది.

వద్దనుకున్నవాడే... ఆపద్బాంధవుడయ్యాడు!
ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను అభిమానులు అంత త్వరగా మరచిపోలేరు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేస్తే... ఛేదనలో చెలరేగిపోయిన రైజర్స్ 9.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 167 పరుగులు చేసి విజయం సాధించింది!దూకుడే మంత్రంగా సాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... ఈ సీజన్లో రాజస్తాన్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనూ 286 పరుగులతో విజృంభించింది. రెండో మ్యాచ్‌లో లక్నోతో తలపడాల్సి రావడంతో మరింత భారీ స్కోరు ఖాయమే అని అభిమానులంతా అంచనాకు వచ్చేశారు. అందుకు తగ్గట్లే రైజర్స్‌కు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం దక్కింది. ఇంకేముంది మరోసారి పరుగుల వరద ఖాయం అనుకుంటే... ఒకే ఒక్కడు హైదరాబాద్ జోరుకు అడ్డుకట్ట వేశాడు!! ఐపీఎల్ వేలంలో ఏ జట్టు కొనుగోలు చేయని ఆ ప్లేయర్... అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. సొంతగడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న రైజర్స్ జోరుకు కళ్లెం వేశాడు. ప్రమాదకర ఓపెనర్ అభిషేక్ శర్మతో పాటు క్రితం మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ కిషన్‌ను వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపి ఆరెంజ్ ఆర్మీని నిలువరించాడు. చివర్లో మరో రెండు వికెట్లు తీసిన అతడే భారత సీనియర్ ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్. అనూహ్య అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకుంటున్న శార్దుల్‌పై ప్రత్యేక కథనం... జాతీయ జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో కలిపి 80కి పైగా మ్యాచ్‌లు ఆడిన అనుభవం... మీడియం పేస్‌తో పాటు లోయర్ ఆర్డర్లో విలువైన పరుగులు చేయగల నైపుణ్యం... తాజా రంజీ ట్రోఫీలో అటు బంతితో పాటు ఇటు బ్యాట్‌తో చక్కటి ప్రదర్శన చేసినప్పటికీ... శార్దుల్ ఠాకూర్‌ను ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుకోలేదు. రూ. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శార్దుల్‌పై ఏ జట్టు ఆసక్తి కనబర్చలేదు. దీంతో కౌంటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమవుతున్న ఈ ఆల్‌రౌండర్‌కు... భారత మాజీ పేసర్ జహీర్ ఖాన్ నుంచి పిలుపు వచ్చిoది. ‘ప్రయత్నాలు విడిచిపెట్టకు. నిన్ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రిప్లేస్‌మెంట్‌గా నువ్వు టీమ్‌లో చేరితే తొలి మ్యాచ్ నుంచే బరిలోకి దిగాల్సి ఉంటుంది’ అని లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ జహీర్ ఖాన్ చెప్పిన మాటలతో శార్దుల్ తనను తాను టి20 ఫార్మాట్‌కు సిద్ధం చేసుకున్నాడు. లక్నో పేసర్ మొహసిన్ ఖాన్ గాయంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌కు దూరం కావడంతో... అతడి స్థానంలో ప్రత్యామ్నాయంగా శార్దుల్‌ను జట్టులోకి తీసుకున్నారు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న శార్దుల్ తొలి మ్యాచ్ నుంచే తనదైన ముద్ర వేశాడు. తొలి మ్యాచ్‌లో 2 ఓవర్లే... విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన పోరులో శార్దుల్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. భారీ స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే శార్దుల్ 2 వికెట్లు పడగొట్టి జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. ఇన్నింగ్స్ మూడో బంతికి మెక్‌గుర్క్‌ను ఔట్ చేసిన ఈ ముంబైకర్... ఐదో బంతికి అభిõÙక్ పొరెల్‌ను బుట్టలో వేసుకున్నాడు. దీంతో భారీ ఛేదనలో ఢిల్లీ ఆరంభంలోనే తడబడింది. అయితే ఆ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్... శార్దుల్‌ను సరిగ్గా వినియోగించుకోలేదు. 2 ఓవర్ల తర్వాత అతడికి అసలు తిరిగి బౌలింగే ఇవ్వలేదు. దీంతో పంత్ సారథ్యంపై సర్వత్ర విమర్శలు వ్యక్తం కాగా... రెండో మ్యాచ్‌లో హైదరాబాద్‌పై దాన్ని పునరావృతం కానివ్వకుండా చూసుకున్నాడు. దాని ఫలితమే శార్దుల్ ఐపీఎల్లో తన అత్యుత్తమ గణాంకాలు (4/34) నమోదు చేసుకోవడంతో పాటు లీగ్‌లో 100 వికెట్ల మైలురాయిని సైతం దాటాడు. షార్ట్‌బాల్‌తో అబిషేక్‌కు బైబై చెప్పిన శార్దుల్... తదుపరి బంతికే ఇషాన్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ బాట పట్టించాడు. చివర్లో మరోసారి బౌలింగ్‌కు వచి్చన అతడు... అభినవ్ మనోహర్, మొహమ్మద్ షమీని ఔట్ చేశాడు. రైజర్స్‌కు కళ్లెం... హిట్టర్లతో దట్టంగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు పక్కా ప్రణాళికతో బరిలోకి దిగినట్లు శార్దుల్ వెల్లడించాడు. ‘రైజర్స్ బ్యాటర్లు ప్రత్యర్థి బౌలర్లపై తీవ్ర ఒత్తిడి పెంచి భారీ షాట్లు ఆడుతూ మ్యాచ్‌ను లాగేసుకుంటున్నారు. అలాంటిది వారిపై ఒత్తిడి పెంచితే ఫలితాలు రాబట్టవచ్చు అని ముందే అనుకున్నా. చాన్స్ తీసుకోవాలనుకున్నా.ఫ్లాట్ పిచ్‌పై ఆరంభంలోనే ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకోవడం సన్‌రైజర్స్ ప్లేయర్లకు అలవాటు. అలాంటిది వారిని భారీ స్కోరు చేయకుండా మొదట్లోనే అడ్డుకోవాలని భావించా. నా ప్రణాళికలకు తగ్గట్లే బౌలింగ్ చేశాను. మెరుగైన ఫలితాలు రావడం ఆనందంగా ఉంది. నేనెప్పుడు వ్యక్తిగత ప్రదర్శనను పట్టించుకోను. జట్టు విజయంలో నా వంతు పాత్ర ఉండాలని భావిస్తా’ అని శార్దుల్ అన్నాడు. ఐపీఎల్‌లోని అన్నీ జట్లలో బౌలింగ్ లైనప్ బలహీనంగా ఉందని విమర్శలు మూటగట్టుకున్న లక్నో... ఇప్పుడు శార్దుల్ మ్యాజిక్‌తో ముందుకు సాగుతోంది. లీగ్‌లో మున్ముందు కూడా ఇదే ప్రదర్శన కొనసాగించాలనుకుంటున్నుట్లు ఈ ఆల్‌రౌండర్ వెల్లడించాడు. జహీర్ ఫోన్ కాల్‌తో.. ఐపీఎల్ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసుకోకపోవడంతో... శార్దుల్ దేశవాళీల్లో మరింత పట్టుదలగా ఆడాడు. 2024–25 రంజీ సీజన్లో ముంబై జట్టు తరఫున ఈ ఆల్‌రౌండర్ 35 వికెట్లు తీయడంతో పాటు లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగి 500 పైచిలుకు పరుగులు చేశాడు. ‘రంజీ నాకౌట్ మ్యాచ్‌ల సమయంలో జహీర్ ఖాన్ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో సాధన కొనసాగించా. వేరే జట్లు కూడా సంప్రదించినప్పటికీ... జహీర్ ముందు ఫోన్ చేయడంతో అతడి మాటకు విలువ ఇచ్చి లక్నో జట్టులో చేరేందుకు అంగీకరించా’ అని శార్దుల్ చెప్పాడు. ఐపీఎల్ వేలంలో కొనుగోలు ఏ జట్టు కొనుగోలు చేసుకోక పోవడంతో ఏమాత్రం నిరుత్సాహానికి గురికాని శార్దుల్... మరింత క్రమశిక్షణతో తన బౌలింగ్ అ్రస్తాలను పెంచుకొని ఫలితాలు రాబడుతున్నాడు. –సాక్షి, క్రీడావిభాగం

జొకోవిచ్ అరుదైన రికార్డు
ఫ్లోరిడా: సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. మయామి ఓపెన్ ఏటీపీ–1000 మాస్టర్స్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరాడు. తద్వారా ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీ సెమీఫైనల్‌కు చేరిన పెద్ద వయసు్కడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) పేరిట ఉంది. 37 ఏళ్ల జొకోవిచ్ శుక్రవారం పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 6–3, 7–6 (7/4)తో సెబాస్టియన్ కొర్డా (అమెరికా)పై విజయం సాధించాడు. 1 గంట 24 నిమిషాల పాటు సాగిన పోరులో నాలుగో సీడ్ జొకోవిచ్ 11 ఏస్‌లు కొట్టగా... కోర్డా ఏడు ఏస్‌లకు పరిమితమయ్యాడు. సెర్బియా వీరుడు రెండు బ్రేక్ పాయింట్లు కాచుకోవడంతో పాటు ఒక దశలో వరుసగా 12 పాయింట్లు సాధించి ఆధిక్యం కనబర్చాడు. ఇప్పటికే ఆరుసార్లు మయామి ఓపెన్ టైటిల్ చేజిక్కించుకున్న జొకోవిచ్ ఏడోసారి చాంపియన్‌గా నిలిచేందుకు రెండడుగుల దూరంలో ఉన్నాడు. సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియా ఓపెన్ మధ్యలో గాయం కారణంగా తప్పుకున్న జొకోవిచ్... ఇటీవల ఇండియన్ వెల్స్ టోర్నీ తొలి రౌండ్లో పరాజయం పాలయ్యాడు. గ్రాండ్‌స్లామ్ చాంపియన్ పీటర్ కొర్డా కుమారుడైన సెబాస్టియన్ కొర్డా... రెండో సెట్ ఆరంభంలో 4–1తో ఆధిక్యంలో నిలిచినా... దాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ సబలెంక (బెలారస్) 6–2, 6–2తో జాస్మిన్ పావోలిని (ఇటలీ)పై గెలుపొందింది. తద్వారా తొలిసారి మయామి ఓపెన్ ఫైనల్లో అడుగుపెట్టింది.

మనీషాకు స్వర్ణం
అమ్మాన్ (జోర్డాన్): ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో భారత రెజ్లర్ మనీషా భన్వాల్ పసిడి పతకంతో మెరిసింది. హోరాహోరీగా సాగిన మహిళల 62 కేజీల విభాగం ఫైనల్లో శుక్రవారం మనీషా 8–7 పాయింట్ల తేడాతో ఓక్ జే కిమ్ (కొరియా)పై విజయం సాధించింది. ఒక దశలో 2–7తో వెనుకంజలో నిలిచిన మనీషా... ఆఖరి నిమిషంలో అసమాన పోరాటంతో వరుసగా 6 పాయింట్లు సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. ఆసియా చాంపియన్‌షిప్‌లో 3 కాంస్యాలు గెలిచిన మనీషాకు ఇదే తొలి స్వర్ణం కాగా... సెమీఫైనల్లో మనీషా 5–1తో బిలిమ్బెక్ కైజీపై విజయం సాధించింది. అంతకుముందు టైనిస్ డుబెక్ (కజకిస్తాన్), హన్బిట్ లీ (కొరియా)పై ఏకపక్ష విజయాలతో మనీషా సెమీస్‌కు చేరింది. 2021 ఆసియా చాంపియన్‌షిప్ తర్వాత ఈ పోటీల్లో భారత్‌కు ఇదే తొలి పసిడి పతకం. ఆ పోటీల్లో భారత్ తరఫున వినేశ్ ఫొగాట్, సరితా మోర్ భారత్ తరఫున స్వర్ణాలు గెలిచారు. మరోవైపు యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్ మహిళల 53 కేజీల విభాగంలో కాంస్యం కైవసం చేసుకుంది. సెమీఫైనల్లో జపాన్‌కు చెందిన మోయో కియోకా చేతిలో ఓడిన అంతిమ్... కాస్య పతక పోరులో సత్తాచాటింది. నేహ శర్మ (57 కేజీలు), మోనిక (65 కేజీలు), జ్యోతి బెరివాల్ (72 కేజీలు) మెడల్ రౌండ్స్‌కు అర్హత సాధించలేకపోయారు. ఈ టోర్నీలో భారత్ 1 స్వర్ణం, 1 రజతం, 6 కాంస్యాలతో మొత్తం 8 పతకాలు సాధించగా... పురుషుల ఫ్రీస్టయిల్ పోటీలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి.
బిజినెస్

లక్ష్యంలో 86 శాతానికి ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024–25) ఫిబ్రవరి చివరికి ద్రవ్యలోటు రూ.13,46,852 కోట్లకు చేరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో నిర్దేశించుకున్న మొత్తం ద్రవ్యలోటు లక్ష్యంలో 11 నెలల్లో 85.8 శాతానికి చేరుకుంది. వ్యయాలు–ఆదాయాల మధ్య అంతరాన్ని ద్రవ్యలోటుగా చెబుతారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు రూ.15.69 లక్షల కోట్లుగా ఉంటుందని బడ్జెట్ అంచనా. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ఈ గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. ఫిబ్రవరి చివరికి నికర పన్నుల ఆదాయం రూ.20 లక్షల కోట్లుగా ఉంది. 2024–25 సవరించిన అంచనాల్లో ఇది 78.8 శాతానికి సమానం. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది 79.6 శాతంగా ఉండడం గమనార్హం. మొత్తం వ్యయాలు రూ.38.93 లక్షల కోట్లుగా ఉన్నాయి. సవరించిన బడ్జెట్ అంచనాల్లో ఇది 82.5 శాతానికి సమానం. జీడీపీలో ద్రవ్యలోటు 4.8 శాతంగా 2024–25 బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొనడం గమనార్హం. 2025–26 సంవత్సరానికి దీన్ని 4.4 శాతంగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. మొత్తం రెవెన్యూ వ్యయాల్లో 9.52 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులు కాగా, 3.63 లక్షల కోట్లు సబ్సిడీలకు ఖర్చు అయింది. 11.80 లక్షల కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేసినట్టు సీజీఏ తెలిపింది. గతేడాది ఇదే కాలంతో పోలి్చతే రాష్ట్రాలకు బదిలీ చేసిన మొత్తం రూ.1.47 లక్షల కోట్ల మేర పెరిగింది.

ఫిబ్రవరిలో నిదానించిన మౌలిక రంగం
న్యూఢిల్లీ: ఫిబ్రవరిలో మౌలిక రంగం నిదానించింది. ఎనిమిది మౌలిక రంగాల్లో ఉత్పత్తి 2.9 శాతం మేర పెరిగింది. క్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 7.1 శాతంతో పోల్చి చూస్తే గణనీయంగా తగ్గింది. అంతే కాదు ఇది ఐదు నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలోనూ కీలక మౌలిక రంగాల్లో 5.1 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది సెపె్టంబర్లో వచ్చిన 2.4 శాతం వృద్ధి చివరి కనిష్ట స్థాయిగా ఉంది. ముఖ్యంగా ఫిబ్రవరిలో ముడి చమురు, సహజ వాయువు రంగాల్లో ప్రతికూల వృద్ధి (క్షీణత) కనిపించింది. బొగ్గు ఉత్పత్తి 1.7 శాతం వృద్ధి చెందింది. గతేడాది ఫిబ్రవరిలో ఈ రంగంలో 11.6 శాతం వృద్ధి నమోదు కావడం గమనించొచ్చు. రిఫైనరీ ఉత్పత్తుల్లో వృద్ధి క్రితం ఏడాది ఇదే నెలలో ఉన్న 2.6 శాతం నుంచి 0.8 శాతానికి తగ్గిపోయింది. స్టీల్ ఉత్పత్తి 9.4 శాతం నుంచి 5.6 శాతానికి.. విద్యుదుత్పత్తి 7.6 శాతం నుంచి 2.8 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. ఎరువుల ఉత్పత్తి 10.2 శాతం, సిమెంట్ ఉత్పత్తి 10.5 శాతం చొప్పున వృద్ధి చెందడం కొంత కలిసొచ్చింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు మొత్తం 11 నెలల్లో ఈ ఎనిమిది మౌలిక రంగాల్లో వృద్ది 4.4 శాతంగా ఉంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి 7.8 శాతంగా ఉంది. పారిశ్రామికోత్పత్తి సూచీలో (ఐఐపీ) ఈ ఎనిమిది మౌలిక రంగాల వాటా 40.27 శాతంగా ఉంది.

కాంట్రాక్ట్ మహిళా టెకీలకు సవాళ్లు
ముంబై: కాంట్రాక్టు ప్రాతిపదికన టెక్నాలజీ ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ వారు ఎక్కువగా ఎంట్రీ స్థాయికే పరిమితమవుతున్నారే తప్ప కెరియర్లో పెద్దగా ముందుకెళ్లలేకపోతున్నారు. అలాగే పురుషులతో పోలిస్తే వేతనాల్లోనూ వ్యత్యాసాలు ఉంటున్నాయి. టీమ్‌లీజ్ డిజిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపడటం, రిమోట్ వర్క్ అవకాశాలు, అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే (డీఈఐ) విధానాలు గత నాలుగేళ్లలో మహిళా టెకీల సంఖ్య పెరగడానికి దోహదపడ్డాయి. 2020లో కాంట్రాక్టు టెక్ ఉద్యోగాల్లో మహిళల సంఖ్య 9.51 శాతంగా ఉండగా, 2024లో ఇది 27.98 శాతానికి పెరిగింది. ఐటీ సర్వీసుల రంగంలో మహిళా సిబ్బంది వాటా 7.8 శాతం నుంచి 21.2 శాతానికి పెరిగింది. అయితే, ఇది చెప్పుకోతగ్గ స్థాయిలో కెరియర్ పురోగతికి దారితీయడం లేదు. మధ్య స్థాయి ఉద్యోగాల్లో మహిళల ప్రాతినిధ్యం 4.13 శాతం నుంచి 8.93 శాతానికి మాత్రమే పెరగడం ఇందుకు నిదర్శనం. ఎంట్రీ స్థాయిని దాటి పురోగమించేందుకు మహిళలకు గణనీయంగా అవరోధాలు ఉండటాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నట్లు నివేదిక వివరించింది. 2020–2024 మధ్య టీమ్‌లీజ్ డిజిటల్ టెక్ కాంట్రాక్ట్ సిబ్బందిలోని 13,000 మంది అసోసియేట్స్ గణాంకాల విశ్లేషణ ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. వేతనాల్లోనూ వ్యత్యాసాలు.. వేతనాల విషయానికొస్తే పురుషులు, మహిళల మధ్య ఎంట్రీ స్థాయి కొలవుల్లో 6 శాతం, మధ్య స్థాయి ఉద్యోగాల్లో 19 శాతం వరకు వ్యత్యాసం ఉంటోంది. అయితే, సీనియర్ స్థాయిలో మాత్రం 13 శాతంగా ఉంటోంది. ‘కాంట్రాక్ట్ టెక్ ఉద్యోగాల్లో మహిళల సంఖ్య పెరుగుతుండటం హర్షణీయమే అయినప్పటికీ, లింగ సమానత సాధించాలంటే నియామకాల పరిధికి మించి బహుముఖ విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. లీడర్షిప్ స్థానాల్లో మహిళలకు ప్రాతినిధ్యం అంతగా లేకపోవడం, పురుషులతో పోలిస్తే వేతనాల మధ్య వ్యత్యాసాలు అలాగే కొనసాగుతుండటమనేది వ్యవస్థలో దీర్ఘకాలిక మార్పులను చేయాల్సిన ఆవశ్యకతను సూచిస్తోంది. మహిళలు ఉద్యోగాల్లో చేరడమే కాకుండా, కెరియర్లో పురోగమించేందుకు, సారథ్య బాధ్యతల్లో రాణించేందుకు అవసరమైన పరిస్థితులను కలి్పంచే దిశగా కంపెనీలు కృషి చేయాలి‘ అని టీమ్‌లీజ్ డిజిటల్ సీఈవో నీతి శర్మ తెలిపారు.

టీవీని దాటేసిన డిజిటల్ మీడియా
న్యూఢిల్లీ: దేశీయంగా డిజిటల్ మీడియా జోరుగా వృద్ధి చెందుతోంది. 2024లో సాంప్రదాయ టీవీ మాధ్యమాన్ని కూడా దాటేసి మీడియా, వినోద రంగంలో (ఎంఅండ్‌ఈ) అతి పెద్ద సెగ్మెంట్‌గా ఆవిర్భవించింది. మొత్తం ఆదాయాల్లో 32 శాతం వాటాను దక్కించుకుంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ–ఈవై నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 2026లో ప్రకటనలపై ఆదాయాలపరంగా రూ. 1 లక్ష కోట్ల మార్కును అధిగమించే తొలి ఎంఅండ్‌ఈ విభాగంగా డిజిటల్ మీడియా నిలవనుంది. దేశీ ఎంఅండ్‌ఈ రంగం వచ్చే మూడేళ్లలో 7 శాతం వృద్ధితో రూ. 3 లక్షల కోట్ల స్థాయిని దాటుతుందని నివేదిక వివరించింది. 2024లో దేశీ ఎంఅండ్‌ఈ రంగం రూ. 2.5 లక్షల కోట్ల స్థాయికి చేరుకోగా, స్థూల దేశీయోత్పత్తిలో 0.73 శాతం వాటాను దక్కించుకుంది. ‘ఈ పరిశ్రమ 2025లో 7.2 శాతం వృద్ధి చెంది రూ. 2.7 లక్షల కోట్లకు, ఆ తర్వాత 7 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2027 నాటికి రూ. 3.1 లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుంది‘ అని నివేదిక వివరించింది. వినూత్న వ్యాపార విధానాల దన్ను.. ఈ భారీ వృద్ధికి వినూత్న వ్యాపార విధానాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, పరిశ్రమలో స్థిరీకరణ తదితర అంశాలు తోడ్పడనున్నాయి. దేశీ ఎంఅండ్‌ఈ రంగం 2023లో 8.3 శాతం పెరగ్గా గతేడాది 3.3 శాతం (సుమారు రూ. 8,100 కోట్లు) వృద్ధి చెందింది. సబ్‌్రస్కిప్షన్ ఆదాయాలు తగ్గడం, భారత్‌కి యానిమేషన్.. వీఎఫ్ఎక్స్ ఔట్సోర్సింగ్ వర్క్ తగ్గిపోవడం వంటి అంశాలు ఇందుకు కారణం. మరోవైపు, ఈ–కామర్స్ వెబ్సైట్లు సహా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ప్రకటనలు, ప్రీమియం.. డిజిటల్ అవుటాఫ్ హోమ్ (ఓఓహెచ్) మీడియాకు డిమాండ్ పెరగడంతో పరిశ్రమ అడ్వరై్టజింగ్ ఆదాయాలు 8.1 శాతం పెరిగాయి. డిజిటల్ మీడియా (17 శాతం) లైవ్ ఈవెంట్లు (15 శాతం), ఓఓహెచ్ మీడియా (10 శాతం) ఈ వృద్ధికి దోహదపడ్డాయి. డిజిటల్ వినియోగం వేగవంతమవుతుండటం, వినియోగదారుల ప్రాధాన్యతలు మారుతుండటం తదితర అంశాల నేపథ్యంలో భారతీయ మీడియా, వినోద రంగం కీలక పరివర్తన దశలో ఉందని ఫిక్కీ చైర్మన్ (మీడియా, ఎంటర్టైన్మెంట్ కమిటీ) కెవిన్ వాజ్ చెప్పారు. దీనితో కంటెంట్ క్రియేటర్లు, ప్రకటనకర్తలు, టెక్నాలజీ ఆవిష్కర్తలకు అపార అవకాశాలు లభిస్తున్నాయని వివరించారు.
ఫ్యామిలీ

డిజిటల్ లోయల్లో టీనేజ్ పిల్లలు
తల్లిదండ్రులు పిల్లల కోసం కష్టపడుతుంటారు. పిల్లలు చదువులతో కష్టపడాలి వాస్తవంగా. కాని వారికి సోషల్ మీడియాలోని చెత్తా చెదారం, తప్పుడు సమాచారం, ఉద్రిక్త ఆకర్షణలు, హింసాత్మక భావజాలాలు... ఇవి కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. ఇటీవల వచ్చిన ‘అడోలసెన్స్’ వెబ్‌సిరీస్ మీద సర్వత్రా చర్చ జరుగుతున్నది. ఇది హెచ్చరిక అంటున్నారు. ఈ సిరీస్ మనల్ని ఎలా నిద్ర లేపుతున్నది?మీ పిల్లలు మీతో ఇంట్లో మాట్లాడే భాష మీకు తెలుసు. వాళ్లు సోషల్ మీడియాలో మాట్లాడే భాష మీకు తెలుసా? వాళ్లు ఉపయోగించే ‘ఎమోజీ’ల అర్థాలు తెలుసా? మాటలు లేకుండా ఎమోజీలతో గాయపరిచే వీలు ఉంటుందని తెలుసా? కిడ్నీ బీన్స్, రెడ్ పిల్, బ్లూ పిల్, డైనమైట్, రెడ్ హార్ట్, పర్పుల్ హార్ట్, ఎల్లో హార్ట్.... ఈ ఎమోజీల అర్థం ప్రతి దానికీ మారుతుంది. అవి ఎందుకు ఉపయోగిస్తున్నారు. ఇంట్లో మన ఎదురుగా పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు తెలుసు. సోషల్ మీడియాలో ఎలా ప్రవర్తిస్తున్నారో మీకు తెలుసా?ముఖ్యంగా వారి వయసు 12– 14 సంవత్సరాల మధ్య ఉంటే వారికి తెలిసింది ఎంత... తెలియంది ఎంత... తెలిసీ తెలియంది అంత. జాగ్రత్త సుమా... అని హెచ్చరించడానికి వచ్చింది ‘అడోలసెన్స్’ అనే వెబ్ సిరీస్.నాలుగు ఎపిసోడ్స్ల సిరీస్‘అడోలసెన్స్’ అనేది నాలుగు ఎపిసోడ్ల మినీ వెబ్ సిరీస్. బ్రిటిష్ క్రైమ్ డ్రామా. బ్రిటన్‌లో టీనేజ్ పిల్లల్లో పెరుగుతున్న హింసా ప్రవృత్తిని గమనించి ఈ సిరీస్‌ను తీశారు. జాక్ థోర్న్ స్క్రిప్ట్ రాస్తే, ఫిలిప్ బరాన్టిని దర్శకత్వం వహించాడు. ఒక్కో ఎపిసోడ్ ఒక గంట ఉంటుంది. విశేషం ఏమిటంటే ప్రతి ఎపిసోడ్ సింగిల్ షాట్. అంటే మధ్యలో కట్ లేకుండా కెమెరా కదులుతూ దృశ్యాలను చూపుతూ వెళుతుంది. ఈ మేకింగ్‌లో వినూత్నత వల్ల కూడా ఈ సిరీస్ ప్రశంసలు అందుకుంటోంది.ఆ పసివాడి సంఘర్షణఈ సిరీస్ మొదలు కావడమే ‘జెమీ మిల్లర్’ అనే 13 ఏళ్ల పిల్లవాడి అరెస్టుతో మొదలవుతుంది. ముందు రోజు రాత్రి స్కూల్లో తన క్లాస్మేట్ అమ్మాయి కేటీని కత్తితో ఏడుసార్లు పొడిచి చంపాడని అభియోగం. తండ్రి, తల్లి, సోదరి హడలిపోతాడు. జెమీ మిల్లర్ అయితే పోలీసులను చూసి ప్యాంట్ తడుపుకుంటాడు. ఆ తర్వాత జేమీనే కేటీని చంపాడని ఇందుకు ఒక స్నేహితుడు కూడా పురిగొల్పాడని విచారణలో ప్రేక్షకులకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఇందులో ఎవరి తప్పు ఎంత? దీనికి బాధ్యులు ఎవరెవరు? శిక్ష మాత్రం ఒక్కడికే పడబోతోందా?ఇన్‌స్టా గొడవజెమీ వయసు 13 ఏళ్లే అయినా అతనికి ఇన్‌స్టా అకౌంట్ ఉంది. అందమైన ఫిమేల్మోడల్స్ బొమ్మలను అప్పుడప్పుడు షేర్ చేస్తుంటాడు. అతని పోస్టులకు కేటీ కామెంట్స్ పెడుతూ ఉంటుంది. వాటికి రకరకాల ఎమోజీలు వాడుతుంటుంది. అవి జెమీని బాధ పెట్టాయని మనకు తెలుస్తుంది. జెమీ తన వయసులో అపరిపక్వత వల్ల తను ఆకర్షణీయంగా లేడని తనను ఎవరూ ఇష్టపడరని న్యూనతతో ఉంటాడు. కేటీ కామెంట్స్ ఇందుకు ఆజ్యం పోస్తాయి. అంతే కాదు సాటి మనిషి పట్ల, ఆడపిల్లల పట్ల సెన్సిటివ్‌గా ఉండాలనే భావజాలం కాకుండా వాళ్లను ఏమైనా అనొచ్చు ఎలాగైనా ఉండొచ్చు అనే ఆధిపత్యపు భావజాలమే ఎక్కువగా జెమీకి పరిచయం అవుతుంటుంది. వీటన్నింటి దరిమిలా అతడు కేటీప్రాణం తీసేవరకూ వెళతాడు.టీనేజ్ పిల్లలు ఎంతో సున్నితమైన దశలో ఉండే సీతాకోక చిలుకలు. వారిని గురించి అందరికీ బాధ్యత ఉండాలని చెబుతోంది ఈ సిరీస్. ఇందులోని ముఖ్య పాత్రను ఒవెన్ కూపర్ అనే బాల నటుడు అద్భుతంగా పోషించాడు. దిన పత్రికల వార్తలు కూడా మనకు రోజూ టీనేజ్ పిల్లల సమస్యలు, కుటుంబాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ లోపం పట్టి ఇస్తున్నాయి. తల్లిదండ్రులు ఈ సిరీస్ చూడటం మంచిదంటున్నారు అభిరుచి ఉన్న ప్రేక్షకులు. కొందరైతే టీనేజ్ పిల్లలతో పాటుగా తల్లిదండ్రులూ చూడాలని సూచిస్తునారు. ముందు పెద్దలు చూడండి. ఆ తర్వాత మీకు సబబని అనిపిస్తే పిల్లలకు చూపించండి. కానీ ఆలోచించండి.ఎవరు నిందితులు?సోషల్ మీడియాను, ఎమోజీలను కనిపెట్టిన వారా? వాటిని ఫోన్లకు అనుసంధానం చేసిన వారా? పిల్లలకు ఫోన్లు కొనిచ్చిన తల్లిదండ్రులా? వాళ్లు ఏ మీడియాను ఉపయోగిస్తున్నారో చూడని తల్లిదండ్రుల నిర్బాధ్యతా? వారితో గడపలేని బిజీతో ఉన్న తల్లిదండ్రుల నిర్లక్ష్యమా? సరిగా పెంచని, సరిగా విద్యాబుద్ధులు చెప్పని వారంతా ఇందుకు బాధ్యులు కాదా? సమాజంలో పేరుకున్న హింసా ప్రవృత్తిని దూరం చేయలేని పాలనా వ్యవస్థ, శాసన వ్యవస్థ, పౌర వ్యవస్థలో ఉన్న వీరంతా కాదా బాధ్యులు.

ఆఫీసులో అమ్మ... ఇంట్లో బిడ్డ
ఐఏఎస్ అధికారిణి, ఇద్దరు పిల్లల తల్లి అయిన దివ్య మిట్టల్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ‘నేను ఒక ఐఏఎస్ అధికారిణి ని. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీలో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎమ్) బెంగళూరులో చదివాను. వీటిని సాధించడానికి చాలా కష్టపడ్డాను. కానీ, నా ఇద్దరు చిన్నారి కూతుళ్లను పెంచే క్రమంలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఏదీ నన్ను సిద్ధం చేయలేదు..’ అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొంది. ఇటీవల కాలంలో ఉద్యోగం చేసే అమ్మల శాతం పెరుగుతోంది. అదే సమయంలో పిల్లల పెంపకం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నామా అనే ఆందోళనా పెరుగుతోంది. కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులను నేటి తల్లులు ఎలా సమతుల్యతను సాధించాలో నిపుణులు సూచిస్తున్నారు.వయస్సుతో సంబంధం లేకుండా కష్టాల్లో ఉన్నప్పుడు మనం ‘అమ్మా’ అని పిలుస్తాం. ఈ పిలుపు తల్లీ బిడ్డ జీవితాంతం పంచుకునే అనుబంధానికి స్పష్టమైన సూచన. ప్రాచీన కాలం నుండి సమాజంలో మహిళలు పిల్లల సంరక్షకులుగా పరిగణించబడ్డారు. వారి విధి ఇంటికి, ఇంట్లోని వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి మాత్రమే పరిమితమయ్యింది. దీంతో తల్లులు ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలనే ఈ భావన పిల్లలను వారి జీవితాల్లో, అభివృద్ధిలో సురక్షితంగా ఉంచింది. నేడు సమాజంలో తల్లులు ఇంటి పనుల నిర్వహణలోనూ, పిల్లల సంరక్షణలోనూ రెండు పాత్రలను పోషిస్తున్నారు. పిల్లల సంరక్షణలో తండ్రుల వాటా పెరిగినప్పటికీ మహిళలు ఇప్పటికీ వారి ఇంట్లో మొదటి సంర క్షకులుగా ఉంటున్నారు.విజయవంతమైన మార్పుప్రపంచవ్యాప్తంగా వర్కింగ్ ఉమెన్ గురించి చేసిన అధ్యయనాల్లో దాదాపు 73 శాతం మంది మహిళలు 30 ఏళ్ల వయసులో తమ పిల్లలను చూసుకోవడానికి తమ ఉద్యోగాలను విడిచిపెట్టారని, 27 శాతం మంది కొంతకాలం తర్వాత తిరిగి వచ్చారని గమనించారు. వారిలో దాదాపు 16 శాతం మంది తమ వృత్తిపరమైన పని జీవితంలో అధికారులుగా ఉన్నారు. కాబట్టి తల్లులుగా ఉన్న మహిళలు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను విజయవంతంగా మార్చుకుంటున్నారని కూడా స్పష్టమైంది.‘ఉద్యోగినిగా డబ్బు సంపాదిస్తూ పిల్లలకు కావల్సినవి సమకూర్చగలుగుతున్నాను. కానీ, వారిని సక్రమంగా పెంచగలుగుతున్నానా..’ అనుకునే తల్లులకు సాంకేతికత వరంగా మారింది. సమయానుకూలంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎంచుకోవచ్చు.సానుకూల ప్రభావాలు → ఉద్యోగ తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో రెండు పని చక్రాలతో తమ జీవితాలు సజావుగా నడుస్తున్నట్టు చూస్తారు. ఉన్నత విద్యను పొందగల సామర్థ్యం, భౌతిక, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపగల సామర్థ్యం కారణంగా వారు మరింత సంతృప్తికరమైన జీవితాలను గడుపుతారు. ఇప్పుడు ఉద్యోగాల్లోకి వెళ్లే మహిళలు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, కెరీర్ అవకాశాలను సరైన ప్యాకేజీలతో అందుకుంటున్నారు. → హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అధ్యయనం ప్రకారం పనిచేసే తల్లుల కుమార్తెలు వారి తల్లులకంటే 23శాతం ఎక్కువ సంపాదిస్తారని తెలిసింది. మరోవైపు పనిచేసే తల్లుల కుమారులు బాధ్యతాయుతమైన పెద్దలుగా ఎదుగుతారు. వారి ఆఫీసుల్లో లింగ సమానత్వాన్ని ఇష్టపడతారు. మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను గౌరవిస్తారు. వారు భవిష్యత్తులో తమ కుమార్తెలకు అద్భుతమైన తండ్రులుగా కూడా పెరుగుతారు.→ తమ తల్లి జీవితంలోని దుఃఖకరమైన రోజులనూ చూసి ఉంటారు. అంతేకాదు తమ తల్లి పట్టుదల, దృఢ సంకల్పం వారు మానసికంగా, ఆర్థికంగా తమ సామర్థ్యాల మేరకు తమను తాము ముందుకు తీసుకెళ్లేలా చేస్తాయి. అన్నింటికంటే వారు హీరోలలో తమ తల్లిని ఒక షీ–రో గా చూస్తారు.మెరుగైన సమయ నిర్వహణ → పనిచేసే తల్లులు ప్రతిరోజూ తమ పిల్లలతో కనీసం ఒకటి లేదా రెండు గంటలు గడపగలిగేలా సమయాన్ని ప్లాన్చేసుకోవాలి. ఇది ఒక దినచర్యగా అనుసరించాలి. వేర్వేరు పనులను షెడ్యూల్ చేయడం, వాటిని సమయానికి పూర్తి చేయడం అనే మీ అలవాటు మీ పిల్లలు అదే అడుగు జాడల్లో నడవడానికి ఒక ఉదాహరణగా ఉపయోగపడుతుంది. → పిల్లలు టైమ్‌టేబుల్‌కు కట్టుబడి ఉండటానికి కూడా ప్రోత్సహిస్తుంది. పిల్లలు మీ పనిని పూర్తి చేయడంలో సహకరిస్తున్నందుకు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. → కాలక్రమంలో పిల్లల సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది వారి మెరుగైన జీవితానికి సహాయపడుతుంది. అంతేకాదు, పిల్లలతో మరింత నాణ్యమైన సమయాన్ని గడపడానికి సహాయపడుతుంది. రోజువారీ జీవన విధానంలో ముఖ్యమైన వాటికి సమయం ఇస్తూ, తమ పనిని బ్యాలెన్స్ చేసుకుంటూ, చేస్తున్న పని గురించి పిల్లలకు క్లారిటీ ఇవ్వడం వల్ల మెరుగైన ప్రయోజనాలను పొందుతారు. హద్దులు అవసరంపని, కుటుంబంతో పాటు వ్యక్తిగత అవసరాలకూప్రాముఖ్యం ఇవ్వండి. శారీరక, భావోద్వేగ శ్రేయస్సు కోసం స్వీయ సంరక్షణ అవసరం అనేది గుర్తుంచుకోవాలి. రోజులో పిల్లలకోసమే అన్నట్టుగా కొంత సమయం గడపండి. ఆ సమయంలో ఏదైనా పని నైపుణ్యాలు నేర్పించాలా, చదువు పట్ల దృష్టి పెట్టాలా, ఆనందంగా ఉంచడానికిప్రాధాన్యత ఇవ్వాలా.. ఇలా దేనికది బేరీజు వేసుకోవాలి. సహాయకులుగా ఉండేవారి మద్దతు ఎలా అందుతుందో చెక్ చేసుకోండి. వృత్తిపరమైన వృద్ధికి, తల్లి పాత్రకు విలువనిచ్చేవారిని సహాయకులుగా ఉండేలా చూసుకోండి. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం తీసుకునే కుటుంబ వాతావరణాన్ని సృష్టించండి. ప్రతి ఒక్కరూ పనులు చేసేలా, బాధ్యత తీసుకునే కుటుంబ వాతావరణాన్ని సృష్టించండి. –ప్రొ÷. పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్ నిపుణులుఅమ్మా, నువ్వే నా హీరో..నా పెద్ద కూతురికి 8 ఏళ్లు. ప్రపంచం గురించి ఇప్పటికే భిన్నమైన ఆలోచనలను చేస్తుంటుంది. ఎదిగే క్రమంలో ఆమె ఆలోచనల కాంతిని మసకబారనివ్వం. కొన్నిసార్లు పని ఒత్తిడిలో చాలా అలసిపోయినట్టుగా ఉంటుంది. ఆ అలసటలో ఏడుపు వచ్చేస్తుంటుంది కూడా. అలాంటప్పుడు నా కూతురు నన్ను కౌగిలించుకుని, ‘నువ్వు నా హీరోవి‘ అని చెబుతుంది. అంటే, పిల్లలు మనల్ని గమనిస్తారు. వారు మన వైఫల్యాల నుండి దృఢంగా ఎలా ఉండాలో నేర్చుకుంటారు. పడిపోవడం సహజమే అని ఆమెకు చూపించండి, ఆపై లేవండి. నా ఉద్యోగం నాకు ఇది నేర్పింది. ఏది జరిగినా నువ్వు స్థిరంగా ఉంటావని చూపించండి. మాతృత్వంలో తమకు తాము వేసుకునే ప్రశ్నల్లో కొంత అపరాధ భావనతో నిండి ఉంటాయి. నేను పిల్లలకు సరైనదే ఇస్తున్నానా, ఏమైనా తప్పులు చేస్తే.. ఇలాంటివి తలెత్తుతుంటాయి. కానీ, తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు మీ సొంత మార్గంలో ప్రయాణిస్తూ ఆమె దేనినైనా వెంబడించగల ప్రపంచాన్ని నిర్మిస్తున్నారని గుర్తించాలి. తనను తాను క్షమించుకుంటూ ముందుకు సాగడం కూడా చాలా ముఖ్యం. మీకు ఒకరి కంటే పిల్లలు ఎక్కువమంది ఉంటే ఆ బాధ్యత పది రెట్లు పెరుగుతూనే ఉంటుంది. అందుకని, పిల్లలను ప్రేమించడం కంటే కూడా న్యాయంగా ఉండడటం ముఖ్యం. – దివ్యా మిట్టల్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

తండ్రీకూతుళ్లను కలిపిన కాలం కథ
అందరి నాన్నల్లా అతడు కూడా తన కూతురిని అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. తన కూతురిని పైలట్ చేయాలనుకున్నాడు. కానీ కూతురు ఊహించని షాక్ ఇచ్చింది. తన అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దీంత తండ్రికూతుళ్ల మధ్య పూడ్చలేనంత దూరం పెరిగింది. అయితే కాలం (Time) ఎవరి కోసం ఆగదుగా, అది తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎంతటి గాయాన్నైనా కాలం నయం చేస్తుందంటారు. అంతేకాదు విడిపోయిన మనుషులను కూడా కాలం కలుపుతుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే తండ్రి విషయంలోనూ అదే జరిగింది.అస్సలు ఊహించలేదు..ఆయన పేరు అశోక్ కేత్కర్. భారత వాయుసేనలో వింగ్ కమాండర్‌గా రిటైర్ అయ్యారు. విధి నిర్వహణలో ఆయన తన రెండు కాళ్లను కోల్పోయి చక్రాల కుర్చీకే పరిమితమయ్యాడు. దీని కంటే కూడా తాను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కన్నకూతురు భార్గవి తనను కాదని పెళ్లి చేసుకుని వెళ్లిపోవడం కేత్కర్‌ను ఎక్కువ బాధ పెట్టింది. దీంతో కూతురికి కటీఫ్ చెప్పారు. ఇది జరిగిన ఐదేళ్ల తర్వాత ఒకరోజు కేత్కర్ విమానంలో ముంబై (Mumbai) నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఆయనకు ముందుగా తెలియదు ఈ ప్రయాణం (Journey) తన జీవితంలో అత్యంత తీపి జ్ఞాపకం అవుతుందని. భూమాకాశాల మధ్యలో విధి ప్రత్యేక ‘నిధి’ని కానుకగా అందివ్వబోతోందని ఆయన అస్సలు ఊహించలేదు.విమానం గాల్లోకి లేవగానే ఓ చిన్నపిల్లవాడు కేత్కర్కు వచ్చి గ్లాసుతో మంచినీళ్లు అందించాడు. ఆ బుడ్డోడిని చూసి ఎంతో ముచ్చటపడ్డారు కేత్కర్. ఇంతలో మైక్ నుంచి మహిళా పైలట్ (Woman Pilot) మాటలు వినిపించాయి. కేత్కర్‌ను యుద్ధవీరుడిగా ప్రయాణికులకు పరిచయం చేసింది. తర్వాత మాటలు విని ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఎందుకంటే ఆ పైలట్ ఎవరో కాదు, ఆయన కూతురు భార్గవి. ‘సర్, మీరు బంధాలను తెంచుకున్న అమ్మాయి, మీ కూతురు భార్గవి ఈ విమానాన్ని నడుపుతోంది’ అనే మాటలు చెవిన పడగానే కేత్కర్ ఖిన్నుడయ్యారు.కేత్కర్ తేరుకునేలోపే కాక్‌పిట్ నుంచి బయటకు వచ్చిన భార్గవి, ఆయనకు ఎదురుగా నిలబడి సెల్యూట్ చేసింది. ‘నాన్నా.. నేను మీ కలను సాకారం చేశాను. మీరు అనుకున్నట్టుగానే పైలట్ అయ్యాను. దయచేసి నన్ను క్షమించండి’ అని వేడుకుంది. కూతురిని అలా చూడగానే ఆయన కరిగిపోయాడు. తన బిడ్డను ఆలింగనం చేసుకుని అప్యాయత కురిపించారు. ఇందాక మీకు మంచినీళ్లు ఇచ్చిన చిన్నారి ఎవరో కాదు తన కొడుకే అని భార్గవి చెప్పడంతో కేత్కర్ ఆనందంతో పొంగిపోయారు. ‘తాతయ్యా, నేను మీలాగే ఫైటర్ పైలట్ అవ్వాలనుకుంటున్నాను’ అని మనవడు అనడంతో ఆయన సంతోషం రెట్టింపయింది.‘బయట సూర్యుడు అస్తమించాడు. విమానం కిందకు దిగిపోయింది. కానీ అశోక్ కేత్కర్ జీవితం మళ్ళీ చిగురించింది’ అంటూ ఈ కథను ఎక్స్‌లో షేర్ చేశారు ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka). అయితే ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలు ఆయన వెల్లడించలేదు. ఈ పోస్ట్‌కు 3 లక్షలకు పైగా వ్యూస్, 5 వేలకు పైగా లైకులు వచ్చాయి.నెటిజన్ల రియాక్షన్..హర్ష్ గోయెంకా పోస్ట్‌పై పలువురు నెటిజనులు స్పందించారు. ‘దర్శకుడు మణిరత్నం దీన్ని చదివితే, ఈ కథకు ఒక రూపాన్ని ఇచ్చి సినిమా తెరకెక్కిస్తార’ని ఒకరు కామెంట్ చేశారు. ‘ఆ తండ్రి గర్వం, బాధ తన కూతురి కౌగిలిలో కరిగిపోయాయి. ఒకప్పుడు వారిని విడదీసిన ఆకాశం ఇప్పుడు వారిని కలిపింది. అతడు కూతురిని కోల్పోయాడు కానీ హీరోని కనుగొన్నాడు!’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఇది నిజంగా జరిగిందనడానికి నమ్మదగిన ఆధారాలు లేవని మరొక యూజర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ సోర్టీ చాట్‌జీపీటీ రాసిందా అని ఒక నెటిజన్ వ్యంగ్యంగా అడిగారు. కొంతమంది అయితే స్టోరీలోని లొసుగులను ప్రశ్నించారు. ఎక్కువ మంది మాత్రం పాజిటివ్‌గా స్పందించారు. At Mumbai airport, a wheelchair-bound veteran, Wing Commander Ashok Ketkar, boarded a flight to Delhi. He had lost both legs in service, but what truly broke him was losing his daughter Bhargavi, who married against his wishes.He hadn’t spoken to her in 5 years.Mid-flight, an…— Harsh Goenka (@hvgoenka) March 26, 2025

గ్లోబల్ స్టార్ రామ చరణ్ ఫిట్నెస్ సీక్రెట్..! డైట్లో అవి ఉండాల్సిందే..
చిరంజీవి నట వారసుడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. నటన పరంగా యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఎందులోనైనా తండ్రికి ధీటుగా చేసి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ప్రస్తుతం ఆయన గ్లోబల్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. ఇవాళ ఆయన పుట్టినరోజు. ఈ రోజుతో ఆయనకు 40 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా చరణ్ ఫిట్నెస్ సీక్రెట్, డైట్‌ప్లాన్‌లు ఏంటో చూద్దామా. ఆయన తొలి చిత్రం చిరుత మూవీ నుంచి ఇటీవల విడుదలైన గేమ్‌ఛేంజర్ మూవీ వరకు అదే లుక్‌తో కనిపించేలా బాడీని మెయింటైన్ చేస్తున్నారు. అంతలా ఫిట్‌గా కనిపించేందుకు వెనుక ఎంతో డెడీకేషన్తో చేసే వర్కౌట్లు అనుసరించే డైట్లే అత్యంత ప్రధానమైనవి. అవేంటో చూద్దామా..రామ్ చరణ్ ఒకసారి అపోలా లైఫ్ డాట్ కామ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ఫిట్‌గా యాక్టివ్‌గా ఉండేందుకు ఎలాంటి వ్యాయమాలు, ఆహారం తీసుకుంటారో షేర్ చేసుకున్నారు. జంపింగ్ జాక్‌లు, సీటెడ్ మెషిన్ ప్రెస్‌ల నుంచి మిలిటరీ పుషప్‌లు, బార్బెల్ స్టిఫ్-లెగ్ డెడ్ లిఫ్ట్‌ల వరకు ప్రతిదీ చేస్తానని అన్నారు. అయితే ఇంట్లో వండిన భోజనం మాత్రమే తీసుకుంటానని అన్నారు. సమతుల్య జీవనశైలికి ప్రాధన్యాత ఇస్తానని చెప్పారు. ప్రతిరోజూ కొన్ని క్రీడలు తప్పనిసరిగా ఆడతానని అన్నారు. వారంలో నాలుగు రోజులు అధిక తీవ్రతతో కూడిన వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తానని అన్నారు. ముఖ్యంగా ప్రశాంతంగా ఉండేందుకు ఇష్టపడతానని చెప్పారు. అలాగే ప్రతిరోజు ఒక గంటన్నర పాటు వ్యాయామం చేస్తానని తెలిపారు. అంతేగాదు శరీర బరువుని అదుపులో ఉంచే వ్యాయామాలపై దృష్టి పెడతానని చెప్పారు. 80% ఆహారంపైనే..ఫిట్ బాడీని నిర్వహించడంలో ఆహారం ప్రాముఖ్యతను హైలెట్ చేశారు రామ్‌చరణ. మన ఆరోగ్యం 80 శాతం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందన్నారు. అందువల్ల మనం ఏం తింటున్నాం అనేది అత్యంత ముఖ్యం అని చెప్పారు. అలాగే తాను ఆహారం విషయంలో చాలా కేర్ తీసుకుంటానని చెప్పారు. అనారోగ్యకరమైన ఆహారాలకు చాలా దూరంగా ఉంటానని చెప్పారు. అంతేగాదు ప్రతి ఆదివారం చీట్మీల్స్లో పాల్గొంటా, కానీ అది సృతి మించకుండా చూసుకుంటానని అన్నారు. డైట్ సీక్రెట్స్ఫిట్నెస్ కోచ్ రాకేష్ ఉడియార్ రూపొందించిన డైట్ ప్లాన్ ప్రకారం..కెఫిన్, ఆల్కహాల్, చక్కెర పానీయాలు, రెడ్ మీట్, గోధుమలు, ప్రోటీన్ షేక్‌లకు దూరంగా ఉంటారట రామ్‌చరణ్. తన రోజుని గుడ్డులోని తెల్లసొనతో చేసిన ఆమ్లేట్ లేదా పూర్తి గుడ్లు, ఓట్స్, బాదంపాలతో ప్రారంభిస్తారట. ఆ తర్వాత మధ్యాహ్నం కూరగాయలతో చేసి సూప్‌ని తీసుకుంటారట. ఇక భోజనంలో చికెన్ బ్రెస్ట్, బ్రౌన్ రైస్, గ్రీన్ వెజిటేబుల్ కర్రీ తీసుకుంటారట. సాయంత్రం స్నాక్స్ కోసం గ్రిల్డ్ ఫిష్, చిలగడదుంప, గ్రిల్డ్ వెజిటేబుల్స్‌ను ఇష్టపడతారని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు రాత్రి భోజనంలో 'లార్జ్ మిక్స్డ్ గ్రీన్ సలాడ్', కొన్ని అవకాడోలను తీసుకుంటారని తెలిపారు ఫిట్నెస్ కోచ్ రాకేష్ ఉడియార్.వారంలో చేసే వర్కౌట్లు:సోమవారం: బైసెప్స్ (తప్పనిసరి)మంగళవారం: క్వాడ్స్బుధవారం: క్లేవ్స్ అండ్ అబ్స్గురువారం: ఛాతీ ట్రైసెప్స్శుక్రవారం: బ్యాక్ వర్కౌట్లుశనివారం: హామ్ స్ట్రింగ్ అండ్ ఇన్నర్ థై అబ్స్ఆదివారం: ఫుల్ రెస్ట్ View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) (చదవండి: బాబోయ్ మరీ ఇంతలానా..! వైరల్‌గా ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ జీవనశైలి)
ఫొటోలు
International

అర్ధశతాబ్దం భూగర్భంలో.. నేడు కళ్లు చెదిరే ధరలో!
అవన్నీ అరుదైన నాణేలు. కొన్ని అయితే ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా వేలానికి రాలేదు. మరికొన్ని నాణేలను చరిత్రకారులు కూడా ఎన్నడూ చూడలేదు. ఇంతటి విశేషాలున్న పురాతన నాణేలు ఇప్పుడు వేలంపాటకు వచ్చాయి. వీటిని దక్కించుకోవాలంటే దాదాపు రూ.860 కోట్లు చెల్లించాల్సి రావొచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. ఇంత రేటు పలుకుతున్న ఈ నాణేల కథాకమామిషు ఓసారి చూద్దాం.ఒక ట్రావెలర్ కథ.. ప్రపంచంలోనే 100 వేర్వేరు ప్రాంతాలకు చెందిన అరుదైన నాణేలను మే 20వ తేదీన స్విట్జర్లాండ్‌లో వేలం వేయనున్నారు. అన్నింటినీ ఒకేసారిగా కాకుండా మూడేళ్లకాలంలో కొద్ది కొద్దిగా వేలంలో విక్రయించనున్నారు. దాదాపు 15,000 నాణేలను ఏకంగా 50 సంవత్సరాలపాటు ఎవరికీ దక్కకుండా భూగర్భంలో దాచేసి తర్వాత బయటకు తీయడంతో ఇప్పుడీ నాణేల గురించి చర్చ మొదలైంది. యూరప్‌కు చెందిన ఒక వ్యక్తి గతంలో అమెరికాలో స్థిరపడ్డాడు. అత్యంత దారుణమైన స్టాక్‌మార్కెట్ (Stock Market) పతనంగా చరిత్రలో నిలిచిపోయిన ‘1929 వాల్‌స్ట్రీట్ క్రాష్’ ఉదంతం తర్వాత మదుపరులు స్టాక్‌మార్కెట్‌పై నమ్మకం కోల్పోయారు. అంతా బంగారం కొనడంపై దృష్టిపెట్టారు. అదే సమయంలో ఇతను సైతం తొలుత బంగారు కొన్నాడు. తర్వాత పాత నాణేలను కొని వాటిని అధిక ధరలకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. అలా తన బంగారు నాణేల కొనుగోలు ప్రస్థానానికి శ్రీకారం చుట్టాడు.1930వ దశకంలో భార్యతో కలిసి ప్రపంచయాత్ర మొదలెట్టి ఎన్నో దేశాల్లో అరుదైన నాణేలను సేకరించడం మొదలెట్టాడు. ఎక్కువగా అమెరికా, యురప్ ప్రాంతాల నాణేలను సేకరించారు. ప్రతి నాణెం ప్రత్యేకత, విశిష్టతలను రాసిపెట్టుకున్నాడు. తర్వాత ఈ జంట యూరప్‌లో స్థిరపడింది. అయితే యూరప్‌ను అడాల్ఫ్ హిట్లర్ సారథ్యంలోని నాజీ పార్టీ దురాక్రమిస్తుండటంతో భయపడిపోయి తమ నాణేలను సురక్షితంగా దాచాలని భావించారు. 15,000 నాణేలను వేర్వేరుగా సిగార్ పెట్టెల్లో పెట్టి వాటిని అల్యూమినియం డబ్బాల్లో నింపి భూమిలో పాతిపెట్టారు. వాటిని దాచిన రహస్యప్రాంతం జాడను తమ కుటుంబసభ్యులకు మాత్రం చెప్పారు. అలా ఆ నాణేలు ఏకంగా 50 సంవత్సరాలపాటు భూమిలోనే ఉండిపోయాయి. ఇటీవల వాళ్ల వారసులు వాటిని బయటకు తీసి కొంతకాలం బ్యాంక్ లాకర్లో దాచారు. తాజాగా వేలం సంస్థకు అప్పగించారు. స్విట్లర్లాండ్‌లోని నమిస్మాటికా ఆర్స్ క్లాసికా వేలం సంస్థ వీటిని వేర్వేరు లాట్లుగా వేలం(Auction) వేయనుంది. ఎన్నెన్నో అరుదైన బంగారు నాణేలుదాదాపు 80 సంవత్సరాలుగా ఎవ్వరూ చూడని అరుదైన బంగారు నాణేలు (Gold Coins) ఈ ‘ట్రావెలర్ కలెక్షన్’లో ఉన్నాయి. 1629లో ముద్రించిన ‘100’డ్యూకాట్ ఫెర్డినాడ్–3 రాజు బంగారు నాణెం సైతం ఇందులో ఉంది. ఫెర్డినాడ్–3 రాజు చెక్ రాజ్యం, క్రొయేషియా, హంగేరీ, ఆస్ట్రియాలకు పాలించారు. స్వచ్ఛమైన బంగారంతో చేసిన ఈ నాణెం బరువు ఏకంగా 348.5 గ్రాములు. ఆనాడు యూరప్‌లో ముద్రించిన అతిబరువైన నాణేల్లో ఇదీ ఒకటి. ఇరాన్లో 18వ శతాబ్దం చివర్లో, ఆఘా మొహమ్మద్ ఖాన్ ఖాజర్ కాలంలో ఇస్ఫమాన్, టెహ్రాన్లలో ముద్రించిన టోమాన్ బంగారు నాణేలు సైతం ఈయన కలెక్షన్లో ఉన్నాయి.చదవండి: పాస్‌పోర్టు మర్చిపోయిన పైలట్.. విమానం యూటర్న్!‘‘ఏమాత్రం పాడవకుండా కొత్తగా ఉన్న ఈ నాణేలు చరిత్రలోని ఎన్నో విశేషాలను మనకందిస్తాయి. మా వేలం సంస్థ కీర్తినీ పెంచుతాయి’’అని వేలం సంస్థ డైరెక్టర్ ఆర్టురో రూసో అన్నారు. ‘‘ఈ రకం డిజైన్ నాణేలను నేనెప్పుడూ చూడలేదు. ఇలాంటి నాణేలు గత 80 ఏళ్లలో ఎక్కడా వేలానికి రాలేదు’’ అని కలెక్షన్ కన్సల్టెంట్ డేవిడ్ గెస్ట్ అన్నారు. ప్రమాదంలో అలనాటి ఏథెనా పాథినోస్ బంగారు శిల్పం కరిగిపోగా వచ్చిన బంగారం నుంచి క్రీస్తుపూర్వం 296 ఏడాదిలో తయారుచేసిన నాణేన్ని సైతం వేలానికి ఉంచారు.– సాక్షి, నేషనల్ డెస్క్

భూకంపం ధాటికి.. బ్యాంకాక్‌లో ఎమర్జెన్సీ
బ్యాంకాక్: మయన్మార్ భారీ భూకంపం పొరుగున ఉన్న థాయ్లాండ్పైనా తీవ్ర ప్రభావం చూపెట్టింది. ఉత్తర భాగం.. ప్రత్యేకించి రాజధాని బ్యాంకాక్ భారీ ప్రకంపనతో వణికిపోయింది. రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రత నమోదైంది. వందల భవనాలు కుప్పకూలిపోవడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. ఈ క్రమంలో.. ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్రా ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలను ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నేలమట్టమైన బహుళ అంతస్థుల శిథిలాల కింద ఎంత మంది చిక్కుకుని ఉంటారన్న దానిపై అంచనాకి రాలేకపోతున్నారు. మరోసారి భూకంపం వస్తుందన్న అంచనాలతో అధికారులు బ్యాంకాక్‌లో భవనాలను ఖాళీ చేయిన్నారు. మెట్రో, రైలు సేవలు నిలిపివేశారు. ఎయిర్‌పోర్టు దెబ్బ తినడంతో సర్వీసులను నిలిపివేసి లాక్డౌన్ ప్రకటించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భూకంపం ధాటికి విద్యుత్ సేవలకు, పలు చోట్ల ఇంటర్నెట్కు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. అయితే ప్రపంచ పర్యాటక నగరం కావడంతో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని త్వరగతిన సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని అక్కడ స్థిరపడ్డ తెలుగు వ్యాపారి ఒకరు చెబుతున్నారు. #แผ่นดินไหว#แผ่นดินไหว #bangkok #earthquake #Thailand #Myanmar #disaster pic.twitter.com/lwHeZYNNCo— Siu (@ItsSiuOfficial) March 28, 2025At the time of the #Earthquake, some people were on the MRT and luckily the swaying moment had already stopped at the station. So, everyone ran out quickly while the station floor was swinging. #Thailand #Bangkok #Myanmar #แผ่นดินไหว pic.twitter.com/1XlClCWkfH— कृतिका शर्मा (@Kriti_Sanatani) March 28, 2025Bangkok gempa bumi kuat. Received photos & videos from my brother. His office crack everywhere & heard ada building yang runtuh. Semoga dipermudahkan 🥺 #bangkok pic.twitter.com/L4jXpyRfSh— netaflutar (@Netaflutar) March 28, 2025

మయన్మార్‌లో భారీ భూకంపం.. 200 చేరిన మృతుల సంఖ్య
Myanmar, Thailand Earthquake Live Updates: మయన్మార్: మయన్మార్‌లో 200 దాటిన భూకంప మృతుల సంఖ్యమృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశంభారీగా కుప్పకూలిన 40 అపార్ట్మెంట్లు శిధిలాల కింద వెయ్యిమందికి పైగా ఉన్నారని అంచనాకొనసాగుతున్న సహాయక చర్యలు రోడ్లపైనే క్షతగాత్రులకు కొనసాగుతున్న చికిత్సమయన్మార్శిధిలాల కింద వందల మంది ప్రజలు మయన్మార్‌లో అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్యఇప్పటి వరకు భూకంపం ధాటికి 103 మరణించినట్లు అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వంమృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశంభూకంపంతో కూలిన భారీగా సముదాయాలుశిధిలాల కింద వందల మంది ప్రజలు అంతర్జాతీయ సాయం కోరిన మయన్మార్ ప్రభుత్వం థాయ్‌లాండ్‌లో భారతీయుల సహాయార్థం హెల్ప్లైన్భారతీయుల కోసం ఇండియన్ ఎంబసీ హెల్ప్‌లైన్‌థాయ్‌లాండ్‌లో హెల్ప్‌లైన్ నంబర్+66618819218థాయ్‌లాండ్‌లో ఎయిర్పోర్ట్ లాక్డౌన్అన్ని విమానసర్వీలు రద్దుథాయ్లాండ్కు వచ్చే విమానాలు దారి మళ్లింపుథాయ్లాండ్ లో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రకటించిన షినవ్రతమయన్మార్, బ్యాంకాక్‌ో కుప్పకూలిన వందల భవనాలుభయంతో రోడ్డపైకి వచ్చిన వేలాది మంది జనంశిథిలాల కింద వేలమంది ఉన్నట్లు అధికారులు ప్రకటనమృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశంబ్యాంకాక్ో మెట్రో రైలు ేసేవలు నిలిపివేతబ్యాంకాక్లో శిథిలాల్లో చిక్కుకున్న పలువురుఓ భవనంలో 50 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు వెల్లడిబ్యాంకాక్లో భవనాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు Over 40 construction workers are reported missing, following the collapse of an under construction high-rise building in the Thai capital of Bangkok, as a result of today’s 7.7 magnitude earthquake in Myanmar. pic.twitter.com/ydkbxExorf— OSINTdefender (@sentdefender) March 28, 2025 భారీ భూకంపంతో మయన్మార్ శుక్రవారం చిగురుటాకులా వణికిపోయింది. ప్రకంపనల ధాటికి బహుళ అంతస్తుల భవనాలు ఊగిపోయి కుప్పకూలిపోయాయి. ప్రాణ, ఆస్తి నష్టాలు భారీగా సంభవించి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ భూకంపం ధాటికి పొరుగున ఉన్న థాయ్‌లాండ్‌లోనూ భారీగా భూమి భారీగా కంపించింది. చైనా, భారత్, లావోస్, బంగ్లాదేశ్‌లోనూ ఈ ప్రకంపనల ప్రభావం కనిపించింది.మయన్మార్‌లో శుక్రవారం మధ్యాహ్నాం 12గం.50ని. ప్రాంతంలో తొలుత భూమి భారీగా కంపించింది. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే మరో రెండుసార్లు కంపించింది. మొదటిసారి రిక్టర్ స్కేల్‌పై 7.7 తీవ్రతతో.. రెండోసారి 6.4 తీవ్రత.. మూడోసారి 4.9 తీవ్రత నమోదైంది. సెంట్రల్ మయన్మార్‌లోని సగైంగ్‌కు 16 కిలోమీటర్ల దూరంలో.. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్ర నమోదైంది. మరోసారి భూకంపం వస్తాయన్న హెచ్చరికలు అక్కడి అధికారులు భవనాల నుంచి జనాల్ని ఖాళీ చేయిస్తున్నారు.భూకంపం ధాటికి జనం రోడ్ల మీదకు హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. కొందరు తమ ఫోన్లలో వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో వదిలారు. నిర్మాణంలో ఉన్న ఓ భారీ భవనం కుప్పకూలిపోవడం, ప్రకంపనల ధాటికి పైఅంతస్తుల్లోని స్విమ్మింగ్ పూల్స్ నుంచి నీరు కిందకు పడడం, నేల మీద ఉన్న పూల్స్లోని నీరు కూడా బయటకు ఉబికిరావడం లాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మండాలెలో ఇర్రవడ్డీ నదిపై ఉన్న చారిత్రక వంతెన అవా బ్రిడ్జి కుప్పకూలిపోయింది.#BREAKING A 7.9-magnitude earthquake struck Myanmar, according to the China Earthquake Networks Center. Neighboring regions, including Thailand and China's Yunnan Province, felt significant tremors. #Myanmar #earthquake pic.twitter.com/qgRHQ7ltjl— 鳳凰資訊 PhoenixTV News (@PhoenixTV_News) March 28, 2025మరోవైపు థాయ్‌లాండ్ ఉత్తర భాగం మొత్తం భూకంపంతో వణికిపోయింది. రాజధాని బ్యాంకాక్‌లో 7.3 తీవ్రతతో భూమి కంపించడంతో భవనాలు ఊగిపోయాయి. ప్రాణభయంతో జనాలు పరుగులు తీసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అక్కడి నష్టం వివరాలపైనా స్పష్టత రావాల్సి ఉంది. ఇంకోవైపు చైనా సరిహద్దు ప్రావిన్స్‌తో పాటు బంగ్లాదేశ్, లావోస్, భారత్‌లోనూ భూమి కంపించింది. భారత్‌లో మణిపూర్, కోల్‌కతా, మేఘాలయా ప్రాంతాల్లో ఈ ప్రభావం కనిపించింది. ఇటు మయన్మార్, అటు థాయ్‌లాండ్‌లోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 🚨 7.7 Magnitude Earthquake Hits Mandalay, MyanmarMultiple buildings destroyed in devastating quake.#Myanmar #Earthquake #แผ่นดินไหว pic.twitter.com/fgQTBlUqjw— Weather Monitor (@WeatherMonitors) March 28, 2025 Under construction building collapses in Myanmar following 7.7 scale #earthquake pic.twitter.com/8yzH8UFvjk— The Raisina Hills (@theraisinahills) March 28, 2025 1930 నుంచి 1956 మధ్య 7 తీవ్రతతో మయన్మార్‌లో భారీ భూకంపాలే సంభవించాయి. అయితే ఈ మధ్య కాలంలో ఇంత శక్తివంతమైన ప్రకంపనలు సంభవించడం ఇదే. చివరిసారిగా.. 206లో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి పాత రాజధాని బాగన్‌లో ముగ్గురు మరణించారు. A massive 7.6m earthquake that just hit Thailand minutes ago. This caused a new skyscraper under construction to collapse in downtown Bangkok. https://t.co/0TF79rqqIq pic.twitter.com/RpzLKwQPvW— RyanMatta 🇺🇸 🦅 (@RyanMattaMedia) March 28, 2025 🚨 Strong 7.7 Earthquake shakes Bangkok: People run out onto the streets, water splashes out of swimming pools.pic.twitter.com/U4nlcRGaT0— Gems (@gemsofbabus_) March 28, 2025

అమెరికాతో పాతబంధం ముగిసింది.. ప్రతిచర్య తప్పదు: మార్క్ కార్నీ
ఒట్టావా: అమెరికా-కెనడా మధ్య ఆర్థిక, భద్రత, మిలిటరీ సంబంధాల శకం ముగిసిందంటున్నారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ(Mark Carney). ఆటో ఉత్పత్తులపై సుంకాలు విధింపుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసిన నేపథ్యంలోనే కార్నీ ఇలా ఘాటుగా వ్యాఖ్యానించారు.ఆటో ఉత్పత్తులపై 25శాతం సుంకాలు విధిస్తానంటూ ట్రంప్(Trump Tariffs) తాజాగా వ్యాఖ్యానించారు. వచ్చే వారం నుంచి ఇది అమల్లోకి రానుండగా.. ఈ నిర్ణయం ఐదు లక్షల మంది ఉద్యోగులు పని చేసే కెనడా ఆటో పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ నేపథ్యంలో తన ఎన్నికల ప్రచారాన్ని సైతం పక్కన పెట్టి మరీ కార్నీ ఒట్టావా చేరుకుని కేబినెట్ భేటీ నిర్వహించారు. ట్రంప్ ఆటో టారిఫ్‌లను అన్యాయంగా అభివర్ణించిన కార్నీ.. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల ఆర్థిక, భద్రత, మిలిటరీ సంబంధాల శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. అలాగే.. ట్రంప్ ఆటో టారిఫ్‌లకు కెనడా ప్రతిచర్య కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. జస్టిన్ ట్రూడో స్థానంలో మార్క్ కార్నీ కెనడాకు ప్రధాని అయ్యారు. సాధారణంగా కెనడా ప్రధాని బాధ్యతలు చేపట్టాక అగ్రరాజ్య అధ్యక్షుడితో ఫోన్ కాల్ మాట్లాడడం ఆనవాయితీగా వచ్చేది. అయితే కార్నీ దానిని బ్రేక్ వేశారు. ఇప్పటిదాకా ఆయన ట్రంప్‌తో మాట్లాడకపోవడం గమనార్హం. ట్రంప్‌తో మాట్లాడడానికి తనకేమీ అభ్యంతరాలు లేవని.. అయితే తన దేశానికి తగిన గౌరవం ఇస్తేనే అది జరుగుతుందని కార్నీ ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రాబోయే రెండు, మూడో రోజుల్లో ఇరు దేశాల అధినేతలు మాట్లాడుకోవచ్చని వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి.ఇదీ చదవండి: కెనడా ప్రధాని మార్క్ కార్నీ.. అసలు ఎవరీయన?
National

రూ.62,500 కోట్లతో 156 ప్రచండ్ హెలికాప్టర్లు
న్యూఢిల్లీ: రూ.62,500 కోట్లతో 156 ప్రచండ్ హెలికాప్టర్ల కొనుగోలుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్రతపై కేబినెట్ కమిటీ(సీసీఎస్) శుక్రవారం ఆమోద ముద్రవేసింది. ఈ తేలికపాటి కాంబాట్ హెలికాప్టర్లను హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) నుంచి కొనుగోలు చేయనున్నారు. దేశంలో సైనిక సామర్థ్యాన్ని పెంచడంలో ఇదొక ముందడుగు అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డిజైన్ చేసి, అభివృద్ధి చేసిన యుద్ధ హెలికాప్టర్లు ఇవే కావడం విశేషం. ప్రచండ్ హెలికాప్టర్లు 5 వేల మీటర్ల ఎత్తు వరకు ప్రయాణింగలవు. సీసీఎస్ ఆమోదం తెలపడంతో హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన రెండు ఒప్పందాలపై రక్షణ శాఖ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఇందులో 66 హెలికాప్టర్లను భారత వాయుసేనకు, మరో 90 హెలికాప్టర్లను భారత నావికాదళానికి హెచ్ఏఎల్ సరఫరా చేయాల్సి ఉంటుంది. ‘మేక్ ఇన్ ఇండియా’కు ఇదొక గొప్ప ప్రోత్సాహకమని, ఈ రెండు ఒప్పందాల వల్ల 8,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

జస్టిస్ యశ్వంత్‌కు ఏ పనీ ఇవ్వొద్దు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలతో చిక్కుల్లో పడ్డ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాసేపటికి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ కేవలం బదిలీపై మాత్రమే అలహాబాద్ హైకోర్టుకు వస్తున్నారని, ఆయనకు ప్రస్తుతానికి ఏ విధమైన జ్యుడిషియల్ వర్క్ అప్పచెప్పవద్దని సీజేఐ సంజీవ్ ఖన్నా కోరారు. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం జస్టిస్ యశ్వంత్ పై విచారణ పెండింగ్ లో ఉన్న క్రమంలోనే ఆయనకు ఏ పనీ అప్పచెప్పవద్దని సీజేఐ సూచించారు. అంతకుముందు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా ఈ తరహా ఆదేశాలనే జారీ చేశారు సీజేఐ.కేంద్రానికి సిఫార్సు.. గ్రీన్ సిగ్నల్జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీ అంశానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే క్రమంలో కేంద్రానికి ప్రతిపాదన పంపింది సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం. దీనికి ఈరోజు(శుక్రవారం) గ్రీన్ సిగ్నల్ లభించడంతో యశ్వంత్ వర్మ.. అలహాబాద్ హైకోర్టుకు వెళ్లనున్నారు. 2021లో అలహాబాద్ హైకోర్టు నుంచి బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చిన యశ్వంత్ మళ్లీ అక్కడికే వెళ్లనున్నారు.ఆరు రాష్ట్రాల బార్ అసోసియేన్స్ తో సీజేఐ భేటీఅయితే యశ్వంత్ వర్మ సచ్ఛీలురుగా బయటకొచ్చేవరకూ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయొద్దంటూ అక్కడ బార్ అసోసియేషన్ తో పలు రాష్ట్రాల బార్ అసోయేషన్స్ కూడా కోరాయి. గుజరాత్ హైకోర్టు బార్ అసోసియేషన్, కేరళ హైకోర్టు బార్ అసోసియేషన్, కర్ణాటక హైకోర్టు బార్ అసోసియేషన్, లక్నో బార్ అసోసియేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సీజేఐ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే పలు బార్ అసోసియేషన్ హెడ్స్ తో సీజేఐ సంజీవ్ ఖన్నా నిన్న(గురువారం)ఢిల్లీలో సమావేశమయ్యారు. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ బదిలీని నిలుపుదల చేయాలని సదరు బార్ అసోసియేషన్స్ కోరిన తరుణంలో వారితో సీజేఐ భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ సమావేశమై వారితో చర్చించారు. వారి డిమాండ్ ను పరిగణలోకి తీసుకుంటామని సీజేఐ సంజీవ్ ఖన్నా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇంట్లో నోట్ల కట్టలు..!కాగా, ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దాని విలువ సుమారు రూ. 15 కోట్లు ఉంటుందని అంచనాలు కూడా వేశారు. ఒక న్యాయమూర్తి వద్ద అంత డబ్బు ఎలా వచ్చిందంటూ చర్చ మొదలైంది. అదే సమయంలో ఇది కచ్చితంగా అవినీతి చేసే కూడపెట్టిందని వాదన బలంగా వినిపించింది.ఈ క్రమంలోనే ఆరు రాష్ట్రాలకు చెందిన బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సీజేఐ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని కొన్నాళ్లపాటు నిలుపుదల చేయడమే సమంజసమా?, బదిలీ చేసి అక్కడ జ్యుడిషియల్ వ్యవహారాలు అప్పగించకుండా ఉండేలా చేయడమే కరెక్టా అనే కోణంలో వీరు చర్చించినట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే జస్టిస్ యశ్వంత్ పై విచారణ పూర్తయ్యేవరకూ ఎటువంటి బాధ్యతలు కేటాయించవద్దని అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించినట్లు సమాచారం.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. అదనపు 2 శాతం డీఏ పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.దీంతో ప్రస్తుతం ఉన్న డియర్నెస్ అలవెన్స్ (డీఏ) 53 శాతం నుంచి 55 శాతానికి పెరిగినట్లైంది. రెండు శాతం డీఏ పెంపు ద్వారా 48.56 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 66.55 లక్షల మంది పెన్షనర్లకు లాభం చేకూరనుంది. తాజా కేబినెట్ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వంపై రూ.6వేల 614 కోట్ల భారం పడనుండగా.. పెరిగిన డీఏ జనవరి 2025 నుంచి అమల్లోకి రానుంది. రైతులపై భారం తగ్గించేందుకు రైతులపై భారం తగ్గించేందుకు పోషక ఆధారిత ఎరువులపై సబ్సిడీ ఇస్తున్న కేంద్రం ఇస్తుంది. అయితే, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పోషక ఆధారిత పీఅండ్‌కే ఎరువులకు సబ్సిడీ (రూ. 37,216 కోట్లు) మంజూరు చేసింది. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సీడీ పథకం కింద 28 రకాల పోషక ఆధారిత ఎరువుల గరిష్ట చిల్లర ధరను తయారీదారులు/దిగుమతిదారులు తగినంత స్థాయిలో నిర్ణయించేందుకు అనుమతి ఇచ్చింది. కోవిడ్ సంవత్సరాల నుండి, అంతర్జాతీయ మార్కెట్లో అధిక స్థాయికి డీఏపీ ధరలు పెరిగాయి. తాజాగా, కేబినెట్లో రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు, ధరల అస్థిరత ప్రభావాన్ని తగ్గించేందుకు డీఏపీ గరిష్ట చిల్లర ధర 50 కిలోల బ్యాగ్‌కు రూ.1,350 కు పరిమితం చేసింది.

Justice Yashwant Varma : అలహాబాద్ కోర్టుకే జస్టిస్ వర్మ.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ : హోలీ పండుగ రోజు రాత్రి ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో కోట్లు విలువ చేసే కాలిన కరెన్సీ నోట్లు వెలుగులోకి వచ్చాయనే వార్త దేశవ్యాప్తంగా సర్వత్రా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు ఉపక్రమించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. నోట్ల కట్టల విషయంపై విచారణ చేపట్టేందుకు ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో కమిటీని ఏర్పాటు చేసింది. పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి షీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీఎస్ సందవాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్‌లను సభ్యులుగా చేర్చింది. సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ రెండురోజుల కిందట ఘటన జరిగిన జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసానికి వెళ్లింది.అయితే, సుప్రీం కోర్టు కొలీజియం జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్‌తో పాటు దేశంలో పలు రాష్ట్రాల హైకోర్టు బార్ అసోసియేషన్లు సుప్రీం కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. దీంతో ఈ నెల 21న సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఆయనను బదిలీ చేయాలని కేంద్రానికి సిఫారసు చేసింది.ఈ క్రమంలో శుక్రవారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడానికి కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆయన తన పదవిని చేపట్టి ఉత్తరప్రదేశ్ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. కాగా, జస్టిస్ వర్మ విషయాన్ని సమీక్షిస్తున్నామని,ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన బదిలీపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించిన ఒక రోజు తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
NRI

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్‌కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్‌ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్‌పర్సన్‌గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్‌లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్‌ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్‌లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్‌లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్‌లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు సహాయం కోరే వారికి మరియు సహాయం అందించే వారికి వారధిగా నిలిచే తెలుగు లేడీస్ ఇన్ యుకె గ్రూపును శ్రీదేవి మీనా వల్లి 14 ఏళ్ల క్రితం స్థాపించారు. ఈ గ్రూపులో ప్రస్తుతం ఐదు వేలకు పైగా తెలుగు మహిళలు ఉన్నారు.యూకే కి వచ్చినా తెలుగు ఆడపడుచులను ఆదరించి వారికి తగిన సూచనలు సలహాలు ఇస్తూ విద్యా వైద్య ఉద్యోగ విషయాల్లో సహాయం అందించడమే గ్రూప్ ఆశయమని శ్రీదేవి గారు తెలియజెప్పారు. ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో ,లైవ్ తెలుగు బ్యాండ్ తో, పసందైన తెలుగు భోజనంతో పాటు,చారిటీ రాఫెల్ నిర్వహించి అవసరంలో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచారు.మస్తీ ఏ కాదు మానవత్వం లో కూడా ముందు ఉన్నాము అని నిరూపించారు.ఈవెంట్ లో డాక్టర్ వాణి శివ కుమార్ గారు మహిళలకు సెల్ఫ్ కేర్ గురించి ఎన్నో మంచి సూచనలు ఇచ్చారు. ఈవెంట్ కి వచ్చిన వాళ్లందరికీ మనసు నిండా సంతోషంతో పాటు మన తెలుగుతనాన్ని చాటిచెప్పేలా గాజులు,పూతరేకులు, కాజాలు వంటి పసందైన రుచులతో తాంబూలాలు పంచిపెట్టారు. ఈ ఈవెంట్లో శ్రీదేవి మీనావల్లితో పాటు సువర్చల మాదిరెడ్డి ,స్వాతి డోలా,జ్యోతి సిరపు,స్వరూప పంతంగి ,శిరీష టాటా ,దీప్తి నాగేంద్ర , లక్ష్మి చిరుమామిళ్ల , సవిత గుంటుపల్లి, చరణి తదితరులు పాల్గొన్నారు.
క్రైమ్

ప్రవీణ్ ఇప్పుడైనా పెళ్లి చేసుకో.. నేను గర్భిణిని
విశాఖపట్నం: మూడేళ్లుగా ఓ యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ యువకుడు.. ఆ యువతి గర్భం దాల్చగానే ముఖం చాటేశాడు. మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించి మల్కాపురం సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాలివి. ప్రవీణ్ అనే 24 ఏళ్ల యువకుడు 40వ వార్డు ఏకేసీ కాలనీలోని తన అక్క వద్ద మూడేళ్ల నుంచి నివాసం ఉంటున్నాడు. ప్రవీణ్ ఉంటున్న ఇంటికి సమీపంలో 19 ఏళ్ల వయసు గల ఓ యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.ఆ యువతితో మొదట పరిచయం ఏర్పరచుకున్న ప్రవీణ్, అనంతరం ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆ యువకుడి మాటలను నమ్మిన యువతి అతడితో బయటకు వెళ్లడం, వారిద్దరూ శారీరకంగా కలవడం వంటివి జరిగాయి. ఈ క్రమంలో ఆ యువతి మూడు నెలల గర్భం దాల్చడంతో.. తనను ఇప్పుడైనా పెళ్లి చేసుకోవాలని ప్రవీణ్‌ను కోరింది. దీంతో అతడు నిరాకరించడంతో, న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది. ప్రవీణ్‌ను పోలీసులు విచారించగా, అక్కడ కూడా పెళ్లికి నిరాకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నగరంలో మహిళ దారుణ హత్య
నిజామాబాద్ రూరల్: నగరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. నిందితుడు మృతదేహాన్ని కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. రూరల్ సీఐ సురేష్ ఎస్‌హెచ్‌వో ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. కంఠేశ్వర్ బైపాస్ నుంచి దాస్‌నగర్ కెనాల్ కట్టవైపు వెళుతున్న ఓ కారు సిగ్నల్స్ వద్ద ఆపకపోవడంతోపాటు, కారు డిక్కీలోని కవర్ బయటకు కనబడటంతో పోలీసులకు అనుమానం వచ్చి వెంబడించారు. మాక్లూర్ పోలీసులు కారును ఆపగా, డిక్కీలో మహిళ మృతదేహం ఉండటంతో రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడు రాజేష్ ను అదుపులోకి తీసుకొని వివరాలు తెలుసుకున్నారు. మృతురాలు ముబారక్ నగర్ ప్రాంతానికి చెందిన బింగి కమల(46)గా గుర్తించారు. ముబారక్ నగర్‌కు చెందిన రాజేష్ వాళ్ల అమ్మకు అదేప్రాంతానికి చెందిన కమల చెడు వ్యసనాలు అలవాటు చేస్తోంది. దీంతో ఆగ్రహించిన రాజేష్ గురువారం కమలను కంఠేశ్వర్ బైపాస్ లోపలికి తీసుకెళ్లాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగగా రాజేష్ కమలను బండరాయితో మోదీ హత్య చేశాడు. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని కాలువలో పడేయడానికి కారు డిక్కీలో పెట్టి బయలుదేరాడు. మృతదే హానికి కప్పిన కవర్ బయటకు రావడం, సిగ్నల్స్ వద్ద కారు ఆపకపోవడంతో పోలీసులు అనుమానం వచ్చి అతడిని పట్టుకున్నారు. మృతదేహాన్ని పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పాంగ్రాలో మరో మహిళ..ఖలీల్‌వాడి: నగరంలోని పాంగ్రా కల్లుబట్టి సమీపంలో ఓ మహిళ హత్యకు గురైంది. సీఐ శ్రీనివాసురాజు తెలిపిన వివరాలు ఇలా.. పాంగ్రా కల్లుబట్టి సమీపంలోని ఇంట్లో నివాసముంటున్న చంద్రకళ(50)కు తన కూతురు మౌనిక నాలుగు రోజులుగా ఫోన్ చేసిన స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన మౌనిక శుక్రవారం ఇంటికి వచ్చి చూడగా చంద్రకళ హత్యకు గురైనట్లు గుర్తించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటన స్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధంతో దాడి చేసి హత్య చేసినట్లు, ఈనెల 23న ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితులు మహిళ ఒంటిపై ఉన్న బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారురు. పోలీసులు పలువురు యువకులను ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ప్రేమ.. పరువు.. ఆత్మహత్య.. హత్య!
ప్రేమ.. త్యాగం నేర్పుతుంది అంటారు. కానీ.. యువతీ, యువకుల మధ్య చిగురించిన ప్రేమ బలికోరుతోంది. సామాజిక సమీకరణాలు కుదరక కులాల కుంపటి రాజుకుంటోంది. గ్రామాల్లో ఈ పోకడ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాము కనీ, పెంచిన పిల్లలు తమకు దక్కకుండా పోతారన్న భయం, పరువు పోతుందన్న ఆందోళనలో తల్లిదండ్రులు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. .. ఇవి హత్యల వరకు దారితీస్తున్నాయి. మరోపక్క తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించన్న భయంతో ప్రేమికులు ప్రాణత్యాగాలు చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తూ ఉమ్మడి జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతుండగా.. సామాజిక అంతరాలకు అద్ధం పడుతున్నా యి. వేర్వేరు కులాల యువతీ, యువకులు ప్రేమించుకుంటే వారిపై దాడులు సహజమే అయినా.. అది చంపుకునేదాకా వెళ్తుండడమే ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు ఉత్తరాదికే పరిమితమైన ఈ పోకడ ఉమ్మడిజిల్లాకు పాకడం గమనార్హం.పంతాలతో కుటుంబాలు నాశనంసామాజిక కట్టుబాట్లను ఛేదించలేక, అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లల ప్రేమను అంగీకరించలేక పెద్దలు తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలు ఆయా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. కుటుంబ పెద్ద జైలుకు వెళ్లడంతో ఆర్థికంగా చితికిపోతున్నా యి. వాస్తవానికి ఏ సమాజంలో ఏ పరువు కోసం హత్యలు చేస్తున్నారో.. తరువాత అదే సమాజం ఆయా కుటుంబాలకు అండగా నిలబడని విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో యుక్తవయసులో ప్రేమే సర్వస్వం అంటూ జీవితంలో స్థిరపడక ముందే ప్రేమ వ్యవహారాల్లో చిక్కుకొని ప్రాణాలు తీసుకుని, తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగుల్చుతున్నారు.ఉమ్మడి జిల్లాలోని పలు ఘటనలు⇒ మార్చి 27న పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోటకు చెందిన సాయికుమార్‌ను అదే గ్రామానికి చెందిన ముత్యం సద య్య తన కుమార్తెను ప్రేమిస్తున్నాడని గొడ్డలితో నరికి చంపడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. కేవలం కులాలు వేరన్న కా రణమే సాయిని చంపేలా చేసింది.⇒ ఇల్లందకుంట యువకుడు, నిర్మల్ జిల్లాకు చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెద్దల ఆమోదం ఉండదన్న ఆందోళనతో మార్చి 17న జమ్మికుంట పరిధిలోని రైల్వేస్టేషన్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.⇒ మార్చి 6న చొప్పదండికి చెందిన ప్రేమికులు ఇంట్లోవారు తమ ప్రేమను అంగీకరించరన్న భయంతో కరీంనగర్లో స్నేహితుడి ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.⇒ 2024 ఏప్రిల్‌లో తాను అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు కులాంతర వివాహం చేసుకుని వెళ్లిపోయిందన్న బాధతో సిరిసిల్ల జిల్లాలో ఓ తండ్రి తన కుమార్తెకు పిండ ప్రదానం చేశాడు. తమ ఆశలను అడియాశలు చేసిన కూతురు మరణించిందని ఫ్లెక్సీ పెట్టించడం సంచలనంగా మారింది.⇒ 2023 నవంబరులో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన ప్రేమికులు విషం తాగి ప్రాణాలు తీసుకున్నారు.⇒ 2023 ఆగస్టులో కోరుట్ల పట్టణంలో తన ప్రియుడితో పరారయ్యే క్రమంలో ప్రియురాలు తన అక్కనే హత్య చేసి పరారవడం కలకలం రేపింది.⇒ 2021 ఆగస్టులో మంథనికి చెందిన ఓ ప్రేమజంటపై యువతి తండ్రి హేయంగా దాడి చేశాడు. ఈ దాడిలో ప్రేమికులు తృటిలో చావు నుంచి తప్పించుకున్నారు. ⇒ 2017లో మంథనిలో మధుకర్ అనే దళిత యువకుడి అనుమానాస్పద మరణం కూడా పరువుహత్యగా ప్రాచుర్యం పొందింది. అనుమానాస్పద మరణం అని పోలీసులు, ప్రి యురాలి బంధువులే చంపారని మధుకర్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. దళితసంఘాలు ధర్నా చేయడంతో మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించారు. అప్పట్లో ఇది జాతీయస్థాయిలో చర్చానీయాంశంగా మారింది. ఈ కేసు ఇంకా తేలాల్సి ఉంది.⇒ 2016లో తిమ్మాపూర్‌లోని ఓ గుడిలో ప్రేమ వివాహం చేసుకునేందుకు పీటల మీద కూర్చున్న జంటపై యువతి బంధువులు దాడి చేశారు. పెళ్లికూతురు కళ్లముందే పెళ్లి కొడుకును విచక్షణా రహితంగా పొడిచి చంపడం కలకలం రేపింది.ఆలోచన తీరు మారాలి కులం అహంకారంతో జరిగే దారుణాలతో ప్రాణాలుపోతున్నాయి. టెక్నాలజీలో ముందున్న మనం ఆధునికంగా ఆలోచించలేక పోతున్నాం. ఉన్నత చదువులు చదువుకునే..యువత కూడా ప్రేమించుకోవడం.. కాదన్నారని ప్రాణాలు తీసుకోవడం తగదు. ఈ ఘటనలకు కేవలం ఆలోచన తీరే కారణం. తీరుమారితే విపరీత ధోరణులు మారుతాయి. – ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత,సోషియాలజీ విభాగం అధిపతి, శాతవాహన వర్సిటీకుల వివక్షపై అవగాహన కల్పించాలి సమాజంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నా కుల,మత భేదాలు గ్రామాల్లో అలాగే కొనసాగుతున్నాయి. కులాల మధ్య వైరుధ్యాలు పెరిగేలా ప్రభుత్వాలు కులాల ఆధారంగా ప్రవేశపెడుతున్న పథకాలు ప్రజల మధ్య దూరాలను పెంచుతున్నాయి. పిల్లల ప్రేమ కన్నా పరువు, పట్టింపులే ఎక్కువ అనే భావన తొలిగేలా, కులవివక్షపై ప్రజలకు అవగాహన కలిగించేలా ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.– కల్లెపల్లి ఆశోక్, కేవీపీఎస్ :::సాక్షిప్రతినిధి, కరీంనగర్

నాతో ఉంటే నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు..!
ఫిలింనగర్: ఇంటర్వ్యూకు వెళ్లిన ఓ వివాహితను పరిచయం చేసుకున్న స్పా యజమాని ప్రేమ పేరుతో వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తుండటంతో బాధితురాలు ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు మల్కాజగిరిలోని హనీ స్పా యజమాని విక్కీ విక్రమ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..ఫిలింనగర్‌లోని దీన్‌దయాళ్‌నగర్ బస్తీకి చెందిన వివాహిత (35) మాదాపూర్‌లోని ఓ స్పాలో బ్యూటీషియన్‌గా పనిచేస్తున్నది. ఇటీవల మరింత మెరుగైన ఉద్యోగం కోసం మల్కాజిగిరిలోని హనీ స్పాలో ఇంటర్వ్యూకు వెళ్లగా స్పా యజమాని విక్కీ విక్రమ్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య తరచూ ఫోన్ సంభాషణ జరుగుతుంది. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తన భర్తకు ఈ విషయం తెలియదని ఆమె చెప్పగా అదంతా తాను చూసుకుంటానని, నాతో ఉంటే నీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని నమ్మబలికాడు. దీంతో ఆమె విక్కీ విక్రమ్‌తో మరింత సన్నిహితంగా మెలిగింది. ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో ఆమె దూరంగా ఉండసాగింది. ఇది భరించలేని విక్రమ్ గురువారం అర్ధరాత్రి ఆమె ఇంటికి వచ్చి బయట నుంచి డోర్ లాక్ చేశాడు. దీంతో ఆమె భయంతో అరవడంతో చుట్టుపక్కల వారు గమనించారు. దీంతో విక్రమ్ అక్కడి నుంచి ఉడాయించాడు. తనను శారీరికంగా, మానసికంగా వేధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్న నిందితుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీసులు నిందితుడిపై బీఎన్ఎస్ సెక్షన్ 75, 78 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.