Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

ప్రధాన వార్తలు

YSRCP MLAs Will Attend Assembly Sessions1
రేపు అసెంబ్లీకి వైఎస్సార్‌సీపీ నేతలు.. ప్రతిపక్ష హోదా డిమాండ్‌

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రేపు(సోమవారం) అసెంబ్లీకి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను వైఎస్సార్‌సీపీ నేతలు డిమాండ్‌ చేయనున్నారు. ప్రతిపక్ష హోదాలో ఉంటేనే సభలో ప్రజల తరఫున ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష హోదాపై మరోసారి గట్టిగా డిమాండ్ చేయాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించింది. సోమవారం నుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు గట్టిగా గళం విప్పాలని వైఎస్సార్‌సీపీ ప్లాన్ చేసింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ప్రతిపక్ష హోదాలో తగిన సమయం కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందేనని పట్టబడనుంది.కూటమి ప్రభుత్వం కుట్రలను అసెంబ్లీ సాక్షిగా తిప్పి కొట్టేందుకు వైఎస్సార్‌సీపీ రెడీ అయింది. సోమవారం నుంచి జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై ఇప్పటికే ఒక ప్లాన్ ను రూపొందించింది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో ఉన్నది నాలుగు పార్టీలు మాత్రమే. అందులో తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కూటమిగా ప్రభుత్వంలో ఉన్నాయి. ఇక మిగిలిన ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీ మాత్రమే. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్సార్‌సీపీకే రావాల్సి ఉంది. కానీ కూటమి ప్రభుత్వం దురుద్దేశ్యంతో వ్యవహరిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ముందుకు రావటం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై ఎక్కడ గట్టిగా నిలదీస్తుందోననే భయంతో కూటమి పార్టీలు ఉన్నాయి. నిజానికి ప్రతిపక్షంగా గుర్తిస్తే కచ్చితంగా అధికార పార్టీ తర్వాత ప్రతిపక్షానికి అసెంబ్లీలో తగిన సమయం ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు సభా కార్యకలాపాల్లో పాల్గొని, ప్రజల గొంతు విప్పటానికి ఒక హక్కుగా తగిన సమయం కూడా లభిస్తుంది. ప్రధాన ప్రతిపక్షం హోదా ఇవ్వకపోతే ఈ అవకాశం ఉండదు. అందుకనే వైఎస్సార్‌సీపీ తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తూ ఉంది. దీనిపై ఇప్పటికే హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసింది. వైయస్సార్ సీపీ వేసిన పిటిషన్ కు కౌంటర్ దాఖలు చేయాలని అప్పట్లోనే హైకోర్టు ఆదేశించింది. కానీ స్పీకర్ ఇప్పటి వరకు ఈ పిటిషన్ పై తన అభిప్రాయాన్న చెప్పలేదు. అంటే ప్రజా సమస్యలపై గొంతెత్తే అవకాశం వైఎస్సార్‌సీపీకి ఇవ్వకూడదన్నదే తమ నిర్ణయమని చెప్పకనే చెప్పినట్లు అయింది.కూటమి నేతల కుట్రలు..వైఎస్సార్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ఇష్టం లేదన్న సంగతి గతంలోనే కూటమి నేతల మాటల్లోనే తేలిపోయింది. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అనేకసార్లు మీడియా సమావేశాల్లోనే తమ బుద్దిని బయట పెట్టుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రభుత్వ వైఫల్యాలపై ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయం వారిలో ప్రతిసారీ కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయటం లేదు. పైగా గతంలో జగన్ ప్రభుత్వంలో ఉన్న సంక్షేమ పథకాలన్నిటినీ కొనసాగిస్తామనీ, ఏ పథకాన్ని నిలిపేసేది లేదని చెప్పిన చంద్రబాబును వైఎస్సార్‌సీపీ ఎక్కడ నిలదీస్తుందోనన్న బెంగ వారిలో కనిపిస్తోంది. మిర్చి రైతుల కోసం..అదేకాదు.. మిర్చి రైతులకు కనీసం గిట్టుబటు ధరలు కూడా లేకపోవటం దగ్గర్నుంచి, రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లటం, మహిళలు-ఆడపిల్లలకు రక్షణ లేకపోవటం, దారుణ హత్యల వరకు అన్ని అంశాలపై వైఎస్సార్‌సీపీ గట్టిగా నిలదీస్తుందనే భయంతో కూటమి నేతలు ఉన్నారు. గ్రూపు-2 అభ్యర్థులను మోసం చేసిన తీరు, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్న వైనంపై వైఎస్సార్‌సీపీ చంద్రబాబు సర్కారుకు చుక్కలు చూపిస్తుందనే ఆందోళన కూటమి నేతల్లో ఉంది. ఇలా వరుస వెంబడి ఈ తొమ్మిది నెలల్లో చంద్రబాబు సర్కారు వైఫల్యాలు, ప్రజల సమస్యలను అసెంబ్లీ సాక్షిగా వైఎస్సార్‌సీపీ ఎక్కడ నిలదీస్తుందోననే భయంతో కూటమి నేతలు ఉన్నారు. సభ సాక్షిగా ప్రజల గొంతుకగా వైసీపీ నిలవడం, సమస్యలపై నిశితంగా మాట్లాడటం అనేది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే సాధ్యం కాదు. కాబట్టే వైయస్సార్ సీపీకి ఆ హోదాను ఇచ్చేందుకు కూటమి పెద్దలు ముందుకు రావటం లేదు. ఈ నేపథ్యంలోనే సోమవారం నుంచి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న సందర్భంగా మరోసారి ప్రధాన ప్రతిపక్ష హోదాపై శాసనసభలో డిమాండ్‌ చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ డిమాండ్‌కు వెనుక ఉన్న సదుద్దేశాన్ని, న్యాయబద్ధతను ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలనని వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనికోసం సోమవారం జరగబోయే సమావేశానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరు కానుంది.

Champions Trophy 2025: Pakistan Won The Toss And Choose To Bat, Here Are Playing XI2
Champions Trophy 2025: పాక్‌తో కీలక సమరం.. మళ్లీ టాస్‌ ఓడిన రోహిత్‌ శర్మ

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో భారత్‌, పాకిస్తాన్‌ జట్లు ఇవాళ (ఫిబ్రవరి 23) తలపడుతున్నాయి. దుబాయ్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. రోహిత్‌ శర్మ వరుసగా తొమ్మిదో మ్యాచ్‌లో టాస్‌ ఓడాడు. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. పాక్‌ మాత్రం ఓ మార్పుతో బరిలోకి దిగింది. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో గాయపడిన ఫకర్‌ జమాన్‌ స్థానంలో ఇమామ్‌ ఉల్‌ హక్‌ తుది జట్టులోకి వచ్చాడు. తుది జట్లు..పాకిస్తాన్‌: సౌద్‌ షకీల్‌, బాబర్‌ ఆజమ్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌, రిజ్వాన్‌ (కెప్టెన్‌, సల్మాన్‌ అఘా, తయ్యబ్‌ తాహిర్‌, ఖుష్దిల్‌ షా, షాహీన్‌ అఫ్రిది, నసీం షా, హరీస్‌ రౌఫ్‌, అబ్రార్‌ అహ్మద్‌భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్‌ రాణా, షమీ, కుల్దీప్‌ యాదవ్‌

YSRCP Kanna Babu Satirical Comments On CBN Govt3
కూటమి.. చంద్రన్న పగ, దగ పథకాన్ని అమలు చేస్తోంది: కన్నబాబు

సాక్షి, విశాఖపట్నం: ప్రజలకు ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్‌ జగన్‌.. ప్రజలను మోసం చేసే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. చంద్రబాబులాగా మోసం చేయడం వైఎస్‌ జగన్‌కు తెలియదని కన్నబాబు చెప్పుకొచ్చారు. గ్రూప్‌-2 అభ్యర్థులను చంద్రబాబు మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్‌గా కురుసాల కన్నబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ధర్మాన కృష్ణ దాస్, ఎంపీ తనూజ రాణి, గుడివాడ అమర్నాథ్, వరుదు కళ్యాణి, ధర్మశ్రీ, కేకే రాజు, పండుల రవీంద్ర బాబు సహా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..‘నాకు బాధ్యత అప్పగించిన వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు. ఈ ప్రాంతంతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఉత్తరాంధ్ర ఒక ప్రత్యేకమైన ప్రాంతం. ఇక్కడ వైఎస్సార్‌సీపీ ఎంతో బలంగా ఉంది. ఉత్తరాంధ్ర ఉద్యమాల పురిటి గడ్డ. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని చూశారు.ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తి వైఎస్ జగన్. సినిమా హీరోలను మించి వైఎస్ జగన్‌కు జనాలు వస్తున్నారు. ప్రజలను మోసం చేయాలంటే జగన్ సూపర్ సిక్స్ కాదు.. సూపర్ 60 ఇచ్చేవారు. రాష్ట్రంలో చంద్రన్న పగ, చంద్రన్న దగ అనే పథకాలను అమలు చేస్తున్నారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారు. వైఎస్‌ జగన్‌ చెప్పిందే చేస్తారు. పేదల పక్షపాతి వైఎస్‌ జగన్‌. ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ నిలబడుతుంది. ప్రజల కోసం పోరాడుతుంది. జగన్‌ కోసం ప్రాణాలు ఇచ్చే కార్యకర్తలు, నేతలు ఎందరో ఉన్నారు. రాజకీయ పార్టీల్లో వలసలు సాధారణం. జగన్‌ సేన అన్ని పార్టీల సేనల కంటే బలంగా ఉంది. లక్షా 20వేల కోట్లు అప్పు చేసి చంద్రబాబు ఏమి చేశారో తెలియదు’ అంటూ కామెంట్స్‌ చేశారు.

PM Modi Praises Telangana Teacher In Mann ki baat4
‘మన్‌కీ బాత్‌’లో తెలంగాణ టీచర్‌ ప్రస్తావన..కారణమిదే..

న్యూఢిల్లీ:మన్‌కీ బాత్‌లో తెలంగాణ టీచర్‌ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఆదివారం(ఫిబ్రవరి23) నిర్వహించిన మన్‌కీ బాత్‌లో ప్రధాని జాతినుద్దేశించి మాట్లాడారు.‘ఇటీవల కృత్రిమమేధ (ఏఐ) సదస్సులో పాల్గొనేందుకు పారిస్‌ వెళ్లాను. ఏఐలో భారత్‌ సాధించిన విజయాలను ప్రపంచం ప్రశంసించింది. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ స్కూల్‌ టీచర్‌ తొడసం కైలాష్‌ గిరిజన భాషలను కాపాడడంలో మాకు సాయం చేశారు. ఏఐ సాధనాలను ఉపయోగించి కొలామి భాషలో పాటను కైలాష్‌ కంపోజ్‌ చేశారు’ అని మోదీ కొనియాడారు. ‘ఇస్రో 100వ రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేయడం దేశానికే గర్వకారణం. పది సంవత్సరాల్లో దాదాపు 460 ఉపగ్రహాలను ఇస్రో లాంచ్‌ చేసింది.చంద్రయాన్‌ విజయం దేశానికి ఎంతో గర్వకారణం.అంతరిక్షం, ఏఐ ఇలా ఏ రంగమైనా మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది.జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారి జీవితాల్లో స్ఫూర్తి నింపేందుకు ఒక రోజు నా సోషల్ మీడియా ఖాతాను వారికే అంకిత చేస్తా’అని మోదీ తెలిపారు.

 Srisailam SLBC Tunnel Roof Collapsed Rescue Operation Updates5
SLBC ప్రమాదం.. ఎనిమిది మంది ప్రాణాలతో ఉన్నారా?

SLBC Tunnel Rescue Operation Updates..👉శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్‌ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. రేవంత్‌కు రాహుల్‌ ఫోన్‌..SLBC ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిన రాహుల్ గాంధీసొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి ఆరాదాదాపు 20 నిమిషాలు వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివెంటనే ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించిందో తెలిపిన సీఎంమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సంఘటన స్థలానికి చేరుకొని తరలించడం, NRDF, SRDF రెస్క్యూ స్క్వాడ్‌లను మోహరించామన్న రేవంత్‌గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం, లోపల చిక్కుకున్న వారి కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్న సీఎంప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిరంతర పర్యవేక్షణను అభినందించిన రాహుల్ గాంధీ మంత్రి ఉత్తమ్‌ కామెంట్స్‌.. టన్నెల్‌ చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు కాపాడేందుకు ప్రాధాన్యతనిస్తున్నాం. రాత్రి నుంచి కేంద్ర బృందాలు రాష్ట్ర బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేసింది. 14 కిలోమీటర్ల మేర లోపలికి వెళ్ళగలిగాం. టెన్నెల్‌ బోర్ మెషిన్ లోపలి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. టన్నెల్‌ నీటిమయం..ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్, సీనియర్ ఐఏఎస్ శ్రీధర్.మరోసారి తన లోపలికి వెళ్లిన ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందం.12వ కిలోమీటర్ నుంచి పూర్తిగా బురదమయం.నీటితో కూడుకున్న టన్నెల్.నీటిని బయటికి తీసేందుకే సమాలోచనలు.నీరంతా బయటకి తోడిన తర్వాతే భవిష్యత్తు సహాయక చర్యలు చేపట్టే అవకాశం.వారంతా ప్రాణాలతో ఉన్నారా? లేదా?లోపలికి ఆక్సిజన్‌ అందుతోందా?.అనే అనుమానాలు వ్యక్తమువుతున్నాయి. రాత్రి పరిస్థితి ఇది..👉ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిన్న రాత్రి 12 గంటలకు వరకు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 12 కిలోమీటర్ల లోపలికి వెళ్లి పరిస్థితిని అంచనా వేశారు. ఈ సందర్బంగా మోకాళ్ల లోతు బురద ఉన్నట్టు వారు గుర్తించారు. 👉ఇక, ఈ సొరంగానికి ఇన్‌లెట్‌ తప్ప ఎక్కడా ఆడిట్‌ టన్నెళ్లు, ఎస్కేప్‌ టన్నెళ్లు లేవు. దీనితో ఒక్క మార్గం నుంచే లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం సాయంత్రానికి సుమారు 150 మంది ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి. చిక్కుకున్నది వీరే.. ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. జేపీ సంస్థకు చెందిన మనోజ్‌కుమార్‌ (పీఈ), శ్రీనివాస్‌ (ఎస్‌ఈ), రోజువారీ కార్మికులు సందీప్‌సాహు (28), జక్తాజెస్‌ (37), సంతోష్‌సాహు (37), అనూజ్‌ సాహు (25) ఉన్నారు. రాబిన్‌సన్‌ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్‌ (35), గురుదీప్‌ సింగ్‌ (40) సొరంగం లోపల విధుల్లో ఉన్నారు. జమ్మూ, పంజాబ్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రాంతాల నుంచి వచ్చిన వీరు సొరంగంలో కొంతకాలంగా పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. బయటపడిన వారు కూడా ఆయా ప్రాంతాలకు చెందిన వారే.మంత్రుల పర్యవేక్షణ..👉మరోవైపు.. దోమలపెంట వద్దకు నేడు మంత్రులు ఉత్తమ్‌, జూపల్లి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యలను మంత్రులు పర్యవేక్షించనున్నారు.ఇటీవలే పనులు పునః ప్రారంభమై... 👉శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించే ‘ఎస్‌ఎల్‌బీసీ’ ప్రాజెక్టులో భాగంగా భారీ సొరంగం నిర్మిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట వైపు (టన్నెల్‌ ఇన్‌లెట్‌) నుంచి టీబీఎం (టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌)తో ఈ తవ్వకం కొనసాగుతోంది. కొంతకాలం కింద టీబీఎం బేరింగ్‌ చెడిపోగా పనులు నిలిచిపోయాయి. 👉ఇటీవలే అమెరికా నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతు చేశారు. నాలుగైదు రోజుల కిందే పనులను పునః ప్రారంభించారు. ప్రస్తుతం సొరంగం లోపల 14వ కిలోమీటర్‌ వద్ద పనులు జరుగుతున్నాయి. శనివారం ఉదయం టన్నెల్‌ ఇన్‌లెట్‌ నుంచి 14 కిలోమీటర్‌ పాయింట్‌ వద్దకు ప్రాజెక్టు ఇంజనీర్లు, మెషీన్‌ ఆపరేటర్లు, కార్మీకులు చేరుకున్నారు. నీటి ఊట పెరిగి.. కాంక్రీట్‌ సెగ్మెంట్‌ ఊడిపోయి.. 👉శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్‌లో నీటి ఊట పెరిగింది. దీనితో మట్టి వదులుగా మారి.. సొరంగం గోడలకు రక్షణగా లేర్పాటు చేసిన రాక్‌బోల్ట్, కాంక్రీట్‌ సెగ్మెంట్లు ఊడిపోయాయి. పైకప్పు నుంచి మట్టి, రాళ్లు కుప్పకూలాయి. ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించడంతో.. టీబీఎం మెషీన్‌కు ఇవతలి వైపున్న 50 మంది వరకు కార్మీకులు సొరంగం నుంచి బయటికి పరుగులు తీశారు. మెషీన్‌కు అవతలి వైపున్న 8 మంది మాత్రం మట్టి, రాళ్లు, శిథిలాల వెనుక చిక్కుకుపోయారు. టన్నెల్‌లో సుమారు 200 మీటర్ల వరకు పైకప్పు శిథిలాలు కూలినట్టు సమాచారం. వేగంగా సహాయక చర్యలు చేపట్టినా..👉సొరంగం పైకప్పు కూలిన విషయం తెలిసిన వెంటనే.. లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. పైకప్పు కూలిపడటంతో జనరేటర్‌ వైర్లు తెగిపోవడంతో సొరంగం మొత్తం అంధకారం ఆవహించింది. పైగా 14 కిలోమీటర్ల లోపల ఘటన జరగడం, నీటి ఊట ఉధృతి పెరగడం, శిథిలాలు, బురదతో నిండిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందిగా మారింది.

Italy PM Giorgia Meloni Slams Global Left Liberals6
ట్రంప్‌, మోదీలపై మెలోని కీలక వ్యాఖ్యలు

రోమ్‌:ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రపంచ వామపక్ష నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిది ద్వంద్వ విధానాలతని విమర్శించారు. తాను,అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్రమోదీ, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలీలు ప్రపంచ సంప్రదాయవాద ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారన్నారు.తామంతా తమ దేశాల ప్రయోజనాలను,సరిహద్దులను కాపాడుకోవడం గురించి మాట్లాడుతున్నామని,కానీ తమ విధానాలు ప్రజాస్వామ్యానికి ముప్పు అని లెఫ్ట్‌ పార్టీల నేతలు విమర్శిస్తున్నారన్నారు. ప్రపంచం ఇక ఎంత మాత్రం లెఫ్టిస్ట్‌ విధానాలను నమ్మబోదని మెలోని చెప్పారు. తాను,ట్రంప్‌,మోదీ ప్రపంచవ్యాప్తంగా వరుస విజయాలు సాధిస్తుంటే లెఫ్ట్‌ లిబరల్స్‌లో ఆందోళన మొదలైందని ఎద్దేవా చేశారు. 90వ దశకంలో అమెరికాలో బిల్‌ క్లింటన్‌, బ్రిటన్‌లో టోనీ బ్లెయిర్‌లను లెఫ్ట్‌ నేతలు రాజనీతిజ్ఞులని కీర్తించారని, తమను మాత్రం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన వ్యక్తులుగా చిత్రీకరిస్తున్నారని మెలోని మండిపడ్డారు.

Thandel Rama Rao Couple Takes Money From Movie Unit7
'తండేల్‌' రామారావుకు రూ. 20 లక్షలు, ఇల్లు: మత్స్యకారులు

నాగచైతన్య- సాయిపల్లవి నటించిన తండేల్‌ సినిమా భారీ విజయం సాధించింది. పద్నాలుగు నెలలు పాకిస్తాన్‌ జైలులో మగ్గిపోయిన 22 మంది మత్స్యకారుల జీవితాలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాతో తండేల్‌ రామారావు బాగా పాపులర్‌ కావడమే కాకుండా ఆయన చిత్ర యూనిట్‌ నుంచి ఎక్కువగా లబ్ధి పొందాడని మిగిలిన మత్స్యకారులు మీడియా ముందుకు వచ్చి తెలుపుతున్నారు. సినిమాలో సగం నిజమే చెప్పినా.., చూపించని కోణాలు ఎన్నో ఉన్నాయని వారు చెబుతున్నారు. గనగళ్ల రామారావు, ఆయన సతీమణి నూకమ్మకు దక్కుతున్న గౌరవం, లబ్ధి 21 మత్స్యకార కుటుంబాలకు దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.మత్స్యలేశం గ్రామంలో 21 మత్స్యకార కుటుంబాలు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తండేల్‌ రామారావు గురించి సంచలన విషయాలు పంచుకున్నారు. 'సినిమాలో రియల్‌ తండేల్‌ రామారావు ఒక్కడే అని చూపారు. అందులో ఎలాంటి నిజం లేదు. పాకిస్థాన్‌కు దొరికిన మూడు బోట్లలో ముగ్గురు తండేల్‌లు ఉన్నారు. కేవలం రామారావు చేసిన తప్పు వల్లే మేము పాకిస్థాన్‌కు దొరికిపోయాం. మేము హెచ్చిరించినా మాట వినకుండా రామారావు బోటును ముందుకు పోనిచ్చాడు. దీంతో పాక్‌ దళాలకు దొరికిపోయాం. కానీ, సినిమా విషయానికి వస్తే కేవలం రామారావు, అతడి భార్య నూకమ్మకు మాత్రమే గౌరవం దక్కుతుంది. మిగిలిన 21 మత్స్యకార కుటుంబాలకు ఎలాంటి గౌరవం దక్కడం లేదు. సినిమా కథ రాసిన కార్తీక్‌, రామారావు మాకు తీరని అన్యాయం చేశారు. సినిమా ప్రారంభంలో మా 20 మంది మత్స్యకారుల కుటుంబాలకు రూ. 45 వేలు చొప్పున ఇచ్చి సంతకాలు చేయించుకున్నారు. అయితే, రామారావు, ఆయన బావమరిదికి ఎర్రయ్యకు మాత్రం చెరో రూ. 90 వేలు ఇచ్చారు. కొద్దిరోజుల క్రితం శ్రీకాకుళంలో జరిగిన తండేల్‌ ఈవెంట్‌కు మా 20 కుటుంబాలను పిలిపించి.. కనీసం స్టేజీ మీదకు కూడా పిలవులేదు. స్టేజీ మీద రామారావు, ఆయన సతీమణి నూకమ్మ మాత్రమే ఉన్నారు. మమ్మల్ని పిలిపించి చెప్పుతో కొట్టినంత పని చేశారు. వారిద్దరికి సినిమా కథ రచయిత కార్తీక్‌ అండదండలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సినిమాతో రామారావు జీవితం మాత్రం మారిపోయింది. ఆయనకు ఒక ఇళ్లు, రూ. 20 లక్షలు డబ్బులు చిత్ర యూనిట్‌ నుంచి అందినట్లు తెలుస్తోంది. అందుకే రామారావు కూడా వారు ఏం చెబితే అది మీడియా ముందు మాట్లాడుతున్నాడు. ఆతనితో పాటు మేము కూడా పాక్‌స్థాన్‌ జైల్లో ఉన్నాం. అక్కడ ఏం జరిగిందో మాకు కూడా తెలుసు. ఎవరి వల్ల విడుదలయ్యామో కూడా అందరికీ తెలుసు. మేము స్టేజీ ఎక్కుతే అవన్నీ చెబుతామని ఆ అవకాశం లేకుండా చేశారు. రామారావు, కథ రచయిత కార్తీక్‌ మమ్మల్ని మోసం చేశారు. వాళ్లు మాత్రమే లబ్ధి పొందారు. మాకు ఎలాంటి సాయం చేయలేదు.' అని ఆవేదన వ్యక్తం చేశారు.

Indian-origin billionaire's daughter Vasundhara Oswal reveals shocking details8
బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు: ఆహారం, నీరు ఇవ్వడానికి..

భారత సంతతికి చెందిన బిలియనీర్ పంకజ్ ఓస్వాల్ కుమార్తె 'వసుంధర ఓస్వాల్' ఉగాండాలో జైలు పాలైన దాదాపు నాలుగు నెలల తర్వాత.. అక్కడ తాను అనుభవించిన కొన్ని కష్టాలను వివరించింది. తనను ఐదు రోజుల పాటు నిర్బంధించారని.. ఆహారం, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించలేదని పేర్కొంది. ఆఖరికి స్నానం చేయడానికి కూడా నిరాకరించారని వెల్లడించింది.ఇంటర్‌పోల్‌కు వెళ్లడానికి తాను అయిష్టత చూపినప్పుడు.. ఒక పురుష అధికారి తనను ఎత్తుకుని వారి వ్యాన్‌లో పడేశారని వసుంధర ఓస్వాల్ ఆరోపించింది.వసుంధర (26)పై గత సంవత్సరం తన తండ్రి పంకజ్ ఓస్వాల్ మాజీ ఉద్యోగి ముఖేష్ మెనారియా కిడ్నాప్ & హత్య కేసులో తప్పుడు అభియోగం మోపబడింది. తరువాత అతను టాంజానియాలో సజీవంగా కనిపించాడు. అయితే ఈమెను 2024 అక్టోబర్ 1న అరెస్టు చేశారు. అదే నెలలో (అక్టోబర్ 2) బెయిల్ మంజూరు చేశారు.నన్ను ఐదు రోజులు నిర్బంధించారు, మరో రెండు వారాల పాటు జైలులో పెట్టారని.. వసుంధర ఓస్వాల్ పేర్కొంది. ఆ సమయంలో వారు స్నానం చేయనివ్వలేదు. ఆహారం & నీరు ఇవ్వడానికి కూడా నిరాకరించారు. నాకు ఆహారం, నీరు వంటి ప్రాథమిక అవసరా కోసం నా తల్లిదండ్రులు న్యాయవాదుల ద్వారా పోలీసు అధికారులకు లంచం ఇవ్వవలసి వచ్చిందని పేర్కొంది.ఇదీ చదవండి: గ్రామంలో నివాసం.. వేలకోట్ల కంపెనీకి సారథ్యం!.. ఎవరో తెలుసా?ఒక విధమైన శిక్షగా వాష్‌రూమ్‌ను ఉపయోగించుకోవడానికి అనుమతించలేదని వసుంధర ఓస్వాల్ ఆరోపించారు. పోలీసులు వారెంట్ లేకుండా తన ఇంటిని సోదా చేశారని ఆరోపించారు.

Seema Haider's statement came before India vs Pakistan match9
భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై సీమా హైదర్‌ ఏమన్నదంటే..

నోయిడా: ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు(ఆదివారం ఫిబ్రవరి 23) భారత్-పాకిస్తాన్ మధ్య కీలక మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్‌కు ముందు సీమా హైదర్‌(Seema Haider) భారత జట్టకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలవాలని భగవంతుణ్ణి వేడుకున్నట్లు ఆమె చెప్పారు. భారత్‌ ఈ మ్యాచ్‌ గెలిస్తే దేశమంతటా సంబరాలు జరుగుతాయని సీమా హైదర్‌ పేర్కొన్నారు.పాకిస్తాన్‌ నుంచి తన ప్రియుణ్ణి కలుసుకునేందుకు భారత్‌ వచ్చిన సీమా హైదర్‌ ఎప్పుడూ భారత్‌కు మద్దతుపలుకుతూనే వస్తున్నారు. తాజాగా ఆమె ఇండియన్‌ క్రికెట్ టీమ్‌కు ‘బెస్ట్‌ ఆఫ్‌ లక్‌’ చెప్పారు. టీమిండియా ఎప్పటిలానే అద్భుతమైన ప్రదర్శన చేస్తుందని అన్నారు.భారత్‌- పాక్‌ మ్యాచ్‌(India-Pakistan match) చూసేందుకు తాను ఎంతో ఆతృతతో ఉన్నానని, భారత్‌ మ్యాచ్‌ గెలవాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ గెలవడం దేశవాసులకు గర్వకారణంగా నిలుస్తుందని, అందరూ కలసి పండుగ చేసుకుంటారని సీమా పేర్కొన్నారు. ఈరోజు తన కుమార్తె పరీ పుట్టినరోజు కావడం విశేషమని, భారత్‌ గెలిస్తే కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందంగా రెండు వేడుకలు చేసుకుంటామన్నారు.ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్‌కు ప్రధాని మోదీ.. క్యాన్సర్‌ ఆస్పత్రికి శంకుస్థాపన

Sunday Is No Holiday For Women She Is Forefront In Family10
ఆదివారం ఆమెకు రెస్ట్‌ ఇద్దామా..!

ఉదయం లేచింది మొదలు.. టీ పెట్టివ్వడం నుంచి కూరగాయలు కోయడం, వంట చేయడం. బట్టలు ఆరేయడం.. ఆరేసినవి మడత బెట్టడం. ఇంటిని సర్దడం.. పిల్లలకు స్నానాలు చేయించడం. వారిని చదివించడం.. ఇలా చూడడానికి అన్నీ చిన్న పనులే.. కానీ అవే ఆమె ముఖాన చిరునవ్వులు మొలిపిస్తాయి. ‘ప్రతీ క్షణం నీకోసం నువ్వు.. వారానికి ఒక్కరోజు నీ ఇల్లాలికి ఇవ్వు’ అన్నట్లు ఆదివారం ‘ఇల్లాలి’కి ఇంటి పనుల్లో సాయమందించాల్సిన అవసరం ఉంది. గంపెడు బాధ్యతలతో ఇంటి బండిని నడిపే ఆమెకు వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి కావాలంటున్నారు.. ఆదివారం ఇంటి, వంట పనుల్లో పాలు పంచుకుంటే అనుబంధం మరింత పెరిగే అవకాశమూ ఉంది. నవ్వులు విరియాలంటే..ఆమె ఆరోగ్యవంతురాలైతే.. ఇంటిల్లిపాదికీ ఆరోగ్యమే. కుటుంబం సక్రమంగా నడవడానికి ఆమే ప్రధాన కారణం. అలాంటి ఇల్లాలికి వారంలో ఒక్కరోజైనా విశ్రాంతి కావాలి. వారాంతంలో భార్య చేసే ఇంటి పనుల్లో ఓ చెయ్యి వేస్తే ఆ ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆమెకూ విశ్రాంతి దొరుకుతుంది. ఉదయం లేచింది మొదలు.. టీ పెట్టివ్వడం నుంచి కూరగాయలు కోయడం, వంట చేయడం. బట్టలు ఆరేయడం.. ఆరేసినవి మడత బెట్టడం. ఇంటిని సర్దడం.. పిల్లలకు స్నానాలు చేయించడం. వారిని చదివించడం.. ఇలా చూడడానికి అన్నీ చిన్న పనులే.. కానీ అవే ఆమె ముఖాన చిరునవ్వులు మొలిపిస్తాయి. వర్క్‌ షేరింగ్‌.. హ్యాపీనెస్‌ లోడింగ్‌కలిగే ప్రయోజనాలుఇల్లాలిపై ప్రేమను చూపడంలో అతను ఇంటిపనుల్లో చేసే సహాయం కీలకం. ప్రతి పనిని భారంగా తీసుకోకుండా చేస్తున్నప్పుడు భర్త తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో, పట్టించుకున్నాడో భార్య అర్థం చేసుకుంటుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకునేందుకు దోహద పడుతుంది. భర్త తన కష్టాలను మోస్తున్నాడని, తనకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాడని నమ్మకం ఏర్పడుతుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య కొన్ని అపార్థాలు ఉంటాయి. కుటుంబ పరిస్థితులు, సంఘటనలతో ఇవి తలెత్తుతుంటాయి. వంట చేయడం, దుస్తులు ఉతికి ఆరబెట్టడం వంటి కొన్ని పనులు కలిసి చేయడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలగిపోయే అవకాశం ఉంది.ఇంటిపని మహిళలకే పరిమితమనే భావన నెలకొంది. కానీ, భార్యాభర్తలు ఇంటిపనులు పంచుకోవడం వల్ల దాంపత్యంలో సామరస్యం పెరుగుతుంది.పనులను షేర్‌ చేసుకున్నప్పుడు త్వరగా పూర్తవుతాయి. మిగిలిన సమయంలో కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవచ్చు. అప్పుడు ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవించడం ప్రారంభిస్తారు.ఏమి చేయొచ్చంటే..ఇంట్లోని దుమ్ము దులపడం, వాక్యూమింగ్‌ చేయడం, నేలలను తుడవడం, బాత్రూం శుభ్రపరచడం, వంటగది శుభ్రపరచడం (పాత్రలు, కౌంటర్‌టాప్‌లు), కూరగాయలు కోయడం, భోజనం తయారీ, దుస్తులు ఉతికి ఆరబెట్టడం, ఆరాక మడతబెట్టడం, అవసరమైనప్పుడు ఇస్త్రీ చేయడం.పిల్లల సంరక్షణలో ఇలా..ఆ రోజు పిల్లలకు కూడా సెలవుదినం కావడం వల్ల స్నానం చేయించి దుస్తులు ధరింపజేయాలి.హోంవర్క్‌లో సహాయం చేయడం, ఆ రోజు పాఠశాలలో ఏదైనా కార్యక్రమం ఉన్నా హాజరు కావడం. ఇంటి ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలను తొలగించడం, పచ్చిక కోయడం, తోటపని చేయడం.ఆదివారం ప్రత్యేకమైన వంటలు చేస్తారు...నా భర్త ఉద్యోగరీత్యా ఉదయమే వెళ్తారు. ఆదివారం సెలవు కావడంతో నాకు సహాయంగా ఉంటారు. కూరగాయలు తరగడం, బట్టలు ఉతికితే ఆరేయడం, వంటగదిని శుభ్రం చేయడం వంటి పనులు చేస్తారు. మా బాబుకు ఇష్టమైన చికెన్‌ బిర్యానీ చేసి స్వయంగా వడ్డిస్తారు. – సీత స్వప్న, పోచమ్మకుంట, హనుమకొండభాగస్వామికి విశ్రాంతినివ్వాలి..నిత్యం పని ఒత్తిడిలో బిజీగా ఉండే భార్యకు వారాంతపు సెలవు దినంలో విశ్రాంతినివ్వాలి. ఇలా చేయడం వల్ల జీవితభాగస్వామి మానసిక ఒత్తిడికి దూరమవుతుంది. వారాంతపు సెలవు దినంలో ఇంటిపని, గార్డెనింగ్, ఇంటి శుభ్రతలో నిమగ్నమవుతుంటాను. నేనే స్వయంగా పిల్లలకు ఇష్టమైన, ఆరోగ్యకరమైన వంటలు చేసి వడ్డిస్తాను. పిల్లలకు అవసరమైన వస్తువులు కొనిస్తాను. సంతోషంగా గడుపుతాను. – డాక్టర్‌ బీఆర్‌ శరవణభవ, ప్రొఫెసర్, హెడ్‌ ఫార్మ్‌ డీ, వాగ్దేవి కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, హనుమకొండఇంటి పనుల్లో సాయంగా ఉంటాను..నా జీవితభాగస్వామితో కలిసి ఉదయమే దేవతారాధన చేస్తాను. అనంతరం మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు, నిత్యవసర సరుకులు అందిస్తాను. నా భార్యకు ప్రతీ పనిలోనూ సాయంగా ఉంటాను. వారాంతంలో రుచికరమైన భోజనం సిద్ధం చేసుకొని హైదరాబాద్‌లో ఉన్న మా పిల్లల వద్దకు వెళ్తాం.– మునుగోటి రమేశ్, వరంగల్‌(చదవండి: ‘ఫాఫో పేరెంటింగ్‌’ అంటే..? నెట్టింట వైరల్‌)

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

NRI View all
title
ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ లవ్‌స్టోరీ : అందంలోనే కాదు టాలెంట్‌లోనూ!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌  ట్రంప్‌ (Donald Trump) తన  మద్దతు ద

title
మాట నూతన కార్యవర్గం ఏర్పాటు

మన అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌-మాట బోర్డు మీటింగ్‌ డల్లాస్ లో ఘనంగా జరిగింది.

title
న్యూయార్క్ వేదికగా ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఆల్బమ్ సాంగ్స్

ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ నటించిన తెలుగు , హిందీ ఆల్బమ్ పాటలు  న్యూయార్క్ వేదికగా రిలీజ్ కానున్నాయి.

title
సులభతర వీసా విధానం అవసరం

న్యూఢిల్లీ: వైద్య చికిత్సల కోసం భారత్‌కు వచ్చే విదేశీ రోగులకు సులభతర వీసా విధానాన్ని ప్రవేశపెట్టాలని అపోలో హాస్పిటల్స్‌

title
గుంటూరులో కుట్టుమిషన్లను పంపిణి చేసిన నాట్స్

Advertisement

వీడియోలు

Advertisement