Top Stories
ప్రధాన వార్తలు

ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేత భారత్.. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం
పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు చెలరేగిన వేల డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు సాధించి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆదిలో రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. కుల్దీప్, వరుణ్, జడ్డూ, అక్షర్ పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటర్లు భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు.అనంతరం స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఛేదనలో రోహిత్ (76) భారత్‌కు శుభారంభాన్ని అందించారు. శుభ్‌మన్ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి ఒత్తిడిలో పడింది. ఇన్నింగ్స్ మధ్యలో పరుగులు చేసేందుకు భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. న్యూజిలాండ్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా బ్యాటర్లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు.ఈ దశలో కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. జడేజా బౌండరీ బాది భారత్‌ను గెలిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025). ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. టోర్నీ ఆధ్యాంతం రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది.

మా స్పిన్నర్లు అద్భుతం.. అతడు ఒత్తిడిని చిత్తు చేశాడు: రోహిత్
పుష్కరకాలం తర్వాత టీమిండియా మరోసారి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)ని ముద్దాడింది. పాతికేళ్ల క్రితం న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని 2025 విజేతగా ఆవిర్భవించింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో కివీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సాంట్నర్ బృందంపై పైచేయి సాధించి అభిమానులకు కనులవిందు చేసింది.మా స్పిన్నర్లు అద్భుతంఈ నేపథ్యంలో విజయానంతరం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మాట్లాడుతూ సమిష్టి కృషి వల్లే గెలుపు సాధ్యమైందని సహచరులపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్లు చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆసాంతం అదరగొట్టారని కితాబులిచ్చాడు. అదే విధంగా తమకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.‘‘ఇది మా సొంత మైదానం కాదు. అయినప్పటికీ మాకు మద్దతుగా అభిమానులు ఇక్కడికి తరలివచ్చారు. మా హోం గ్రౌండ్ ఇదే అన్నంతలా మాలో జోష్ నింపారు. గెలుపుతో మేము వారి మనసులను సంతృప్తిపరిచాం.ఫైనల్లో మాత్రమే కాదు.. టోర్నీ ఆరంభం నుంచీ మా స్పిన్నర్లు గొప్పగా రాణించారు. దుబాయ్ పిచ్ స్వభావరీత్యా వారిపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ ఒత్తిడికి లోనుకాకుండా పనిపూర్తి చేశారు. వారి నైపుణ్యాలపై నమ్మకంతో మేము తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని నిరూపించారు. వారి బలాలను మాకు అనుకూలంగా మలచుకోవడంలో మేము సఫలమయ్యాం.అతడు ఒత్తిడిని చిత్తు చేశాడుఇక.. కేఎల్ రాహుల్(KL Rahul) గురించి చెప్పాలంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరిచేరనీయడు. అందుకే మేము అతడి సేవలను మిడిల్లో ఎక్కువగా ఉపయోగించుకున్నాం. ఈరోజు తను బ్యాటింగ్ చేస్తున్నపుడు పరిస్థితులు మాకు అంత అనుకూలంగా లేవు. అయినప్పటికీ అతడు ఏమాత్రం తడబడకుండా షాట్ల ఎంపికలో సంయమనం పాటించాడు.తనతో పాటు బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించేలా చక్కటి సహకారం అందిస్తాడు. తను సరికొత్తగా కనిపిస్తున్నాడు. నాణ్యమైన బౌలర్ఇక వరుణ్ టోర్నీ ఆరంభంలో ఆడలేదు. అయితే, న్యూజిలాండ్‌తో లీగ్ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో మెరిసిన తర్వాత అతడి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. అతడొక నాణ్యమైన బౌలర్. ట్రోఫీ గెలవడంలో ప్రతి ఒక్క సభ్యుడు తమ వంతు పాత్ర పోషించారు’’ అని జట్టు ప్రదర్శన పట్ల రోహిత్ శర్మ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్‌వెల్(53 నాటౌట్) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. షమీ, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు.ఇక లక్ష్య ఛేదనలో భారత్‌కు ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్(31) శుభారంభం అందించారు. విరాట్ కోహ్లి(1) విఫలం కాగా.. శ్రేయస్ అయ్యర్(48)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 76 పరుగుల వద్ద రోహిత్ స్టంపౌట్ కాగా.. అక్షర్ పటేల్(29), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9) వేగంగా ఆడి మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి చంద్రబాబు షాక్
అమరావతి: పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షాకిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వర్మకి ఎమ్మెల్సీ టికెట్ ఇస్తానని హామీ ఇచ్చిన బాబు..ఇప్పుడు ఆ హామీని గాలికొదిలేశారు. దాంతో చంద్రబాబు మాట నమ్మి ఇప్పటికే రెండు సార్లు మోసపోయిన వర్మ.. మరోసారి దానికి గురి కాకతప్పలేదు. తాజాగా టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ టికెట్ల జాబితాలో వర్మ పేరు ఎక్కడా కనిపించలేదు.పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే సీటును వర్మ వదులుకున్న క్రమంలో ఎమ్మెల్సీ టికెట్ హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు తీరా చూస్తే వర్మ కి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు చంద్రబాబు. దాంతో చంద్రబాబు తీరుపై వర్మ వర్గంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. మరొకవైపు వర్మ రాజకీయ భవిష్యత్ ముగిసిందనే ప్రచారం కూడా సాగుతోంది. చంద్రబాబు ఇచ్చిన షాక్ తో వర్మ వర్గం అయోమయంలో పడింది. తమనేత రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో ఏం చేయాలనే దానిపై వారు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.

Virat Kohli: అద్భుత విజయం.. అంతులేని సంతోషం!.. ఆసీస్ టూర్ తర్వాత..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ఫైనల్లో టీమిండియా విజయం పట్ల స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) హర్షం వ్యక్తం చేశాడు. టోర్నమెంట్ ఆసాంతం జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడు టైటిల్ గెలిచేందుకు తమ వంతు సహకారం అందించాడని తెలిపాడు. భారత జట్టులో ప్రస్తుతం ప్రతిభకు కొదువలేదని.. యువ ఆటగాళ్లు సీనియర్ల సలహాలు తీసుకుంటూనే తమదైన శైలిలో ముందుకు సాగుతున్న తీరును కొనియాడాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్.. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌తో ముగిసింది. ఈ వన్డే టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్ పోటీపడ్డాయి. అయితే, ఆసీస్‌ను ఓడించి టీమిండియా.. సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ తుదిపోరుకు అర్హత సాధించాయి.ఈ క్రమంలో మార్చి 9 నాటి మ్యాచ్‌లో రోహిత్ సేన ఆఖరి వరకు పోరాడి కివీస్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో విజయానంతరం కోహ్లి తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ‘‘ఇది అద్భుత విజయం. ఆస్ట్రేలియా పర్యటనలో చేదు అనుభవం తర్వాత పెద్ద టోర్నమెంట్ గెలవాలని మేము కోరుకున్నాం.సరైన దిశలోఇలాంటి తరుణంలో చాంపియన్స్ ట్రోఫీ గెలవడం అద్భుతంగా అనిపిస్తోంది. యువ ఆటగాళ్లతో కలిసి ఆడటం సంతోషంగా ఉంది. సీనియర్లుగా మేము మా అనుభవాలను వారితో పంచుకుంటున్నాం. వారు కూడా మా సలహాలు, సూచనలు తీసుకుంటూనే తమదైన శైలిలో రాణిస్తున్నారు.జట్టు ప్రస్తుతం సరైన దిశలో వెళ్తోంది. ఈ టోర్నీ మొత్తాన్ని మేము ఆస్వాదించాం. కొంతమంది బ్యాట్‌తో రాణిస్తే.. మరికొందరు బంతితో ప్రభావం చూపారు. అంతా కలిసి జట్టు విజయంలో భాగమయ్యారు. ఐదు మ్యాచ్‌లలో ప్రతి ఒక్కరు సరైన సమయంలో సరైన విధంగా రాణించి జట్టు గెలుపునకు బాటలు వేశారు. నిజంగా మాకు ఇది చాలా చాలా అద్భుతమైన టోర్నమెంట్’’ అంటూ కోహ్లి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.కాగా ఈ టోర్నీలో దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో శతకం(100 నాటౌట్)తో మెరిసిన కోహ్లి.. ఆసీస్‌తో సెమీ ఫైనల్లోనూ అద్భుత అర్ధ శతకం(84)తో రాణించాడు. అయితే టైటిల్ పోరులో మాత్రం దురదృష్టవశాత్తూ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను చిత్తు చేసిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆసీస్‌ను, ఫైనల్లో కివీస్‌ను ఓడించి అజేయంగా టైటిల్ విజేతగా నిలిచింది. ఇక కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది రెండో ఐసీసీ టైటిల్. గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన హిట్‌మ్యాన్.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కూడా సాధించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ స్కోర్లు👉వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్👉టాస్: న్యూజిలాండ్... తొలుత బ్యాటింగ్👉న్యూజిలాండ్ స్కోరు: 251/7 (50)👉కివీస్ టాప్ రన్ స్కోరర్: డారిల్ మిచెల్(101 బంతులలో 63)👉టీమిండియా స్కోరు: 254/6 (49)👉ఫలితం: న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు,3 సిక్స్ లు 76 పరుగులు).చదవండి: మా స్పిన్నర్లు అద్భుతం: రోహిత్

TG: ఊహించని విధంగా విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులపై కసరత్తు పూర్తయింది. కొద్ది సేపటి క్రితమే ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖారారు చేసింది. ఎవరూ ఊహించని విధంగా పార్టీ అధిష్టానం విజయశాంతితో పాటు అద్దంకి దయాకర్, కెతావత్ శంకర్ నాయక్‌కు టికెట్లు ఇచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. సీపీఐ నుంచి ఒకరికి ఎమ్మెల్సీ టికెట్ కేటాయించింది.తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను ఖరారు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.అయితే, చివరి నిమిషంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లేకపోవడంతో తెలంగాణ నేతల ఢిల్లీ పర్యటన రద్దయ్యింది. అయినప్పటికీ రాష్ట్ర అగ్రనేతలతో కేసీ వేణుగోపాల్ ఫోన్లో మంతనాలు జరిపారు. ముగ్గురు అభ్యర్థుల ఎంపికను ఖరారు చేయడంతో ఉత్కంఠతకు తెరపడింది. మరోవైపు ఎమ్మెల్సీ స్థానాల కోసం కాంగ్రెస్‌లో భారీ పోటీ నెలకొంది. తమకు అవకాశం కల్పించాలంటూ ఆశావహులు పెద్ద ఎత్తున లాబియింగ్‌లు జరిపారు. చివరికి పార్టీ అధిష్టానం విజయశాంతి, అద్దంకి దయాకర్, కెతావత్ శంకర్ నాయక్ పేర్లను ఫైనల్ చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ బరిలో ఓసీ కేటగిరి నుంచి వేం నరేందర్ రెడ్డి, పారిజాత నరసింహ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, కుమార్ రావు, కుసుమ కుమార్ పేర్లు బలంగా వినిపించాయి. వీరితో పాటు బీసీ కేటగిరి నుండి ఇరవత్రి అనిల్, కొనగాల మహేష్, జెర్పేటి జైపాల్, గాలి అనిల్, ఎస్సీ కేటగిరి నుండి అద్దంకి దయాకర్, జ్ఞాన సుందర్, దొమ్మటి సాంబయ్య, రాచమల్ల సిద్దేశ్వర్, ఎస్టీ నుంచి బెల్లయ్య నాయక్, బానోతు విజయాభాయి, రేఖా నాయక్ పేర్లు వినిపించాయి.

టాటా స్టీల్ మూసివేత.. 900 మంది అప్పు తీర్చిన హాలీవుడ్ నటుడు
సౌత్ వేల్స్ లోని పోర్ట్ టాల్బోట్లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత తర్వాత అక్కడి వారి జీవితాలు దుర్భరంగా మారాయి. 2,800 మంది కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ షీన్.. తమ ప్రాంత ప్రజలను ఆదుకునేందుకు ముందుకువచ్చారు. సుమారు 900 మందికి చెందిన 1 మిలియన్ పౌండ్ల (సుమారు రూ.8 కోట్లు) రుణాలను తాను చెల్లించారు.ది క్వీన్, గుడ్ ఓమెన్స్, ట్విలైట్ చిత్రాల్లో నటించిన మైఖేల్ షీన్ బాధితుల ఆర్థిక భారాన్ని తగ్గించే బాధ్యతను తనపై వేసుకున్నాడు. షీన్ తన వ్యక్తిగత సంపాదన లోంచి 1,00,000 పౌండ్లు వెచ్చించి 900 మందికి సంబంధించిన రుణాలను తీర్చడం కోసం ఒక సంస్థను స్థాపించాడు. రుణ పరిశ్రమ ఎలా పనిచేస్తుందనే దానిపై మొదట్లో తనకు అవగాహన లేదని, కానీ మార్పు తీసుకురావాలని నిశ్చయించుకున్నానని షీన్ చెప్పాడు. మైఖేల్ షీన్ సీక్రెట్ మిలియన్ పౌండ్ గిఫ్ట్ గురించి త్వరలో ప్రసారం కానున్న ఛానెల్ 4 షోలో డాక్యుమెంట్ చేశారు.టాటా స్టీల్ మూసివేత ప్రభావంపోర్ట్ టాల్బోట్లోని టాటా స్టీల్ బ్లాస్ట్ ఫర్నేస్ మూసివేత ఈ ప్రాంతంలో సాంప్రదాయ ఉక్కు తయారీ ముగింపును సూచిస్తోంది. పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గణనీయ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవడంతోపాటు స్థానికులకు సైతం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది. పోర్ట్ టాల్బోట్కు చెందిన షీన్.. కార్మికులు, వారి కుటుంబాల దుస్థితిని చూసి చలించిపోయారు. స్థానిక కేఫ్ ను సందర్శించిన సందర్భంగా ఆయన ఉద్యోగుల తొలగింపు భావోద్వేగాలను కళ్లారా చూశారు. ఉక్కు కార్మికులు తమ అనిశ్చిత భవిష్యత్తుపై కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో వారిని ఆదుకునేందుకు ఏదైనా చేయాలని సంకల్పించారు.ఎవరీ మైఖేల్ షీన్?మైఖేల్ షీన్ బహుముఖ ప్రజ్ఞతోపాటు సామాజిక కారణాల పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన నటుడు. 1969లో వేల్స్ లోని న్యూపోర్ట్ లో జన్మించిన షీన్ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్ (రాడా)లో శిక్షణ పొంది నాటకరంగంలో తన కెరీర్ ను ప్రారంభించారు. ది క్వీన్ అండ్ ది స్పెషల్ రిలేషన్ షిప్ లో బ్రిటిష్ ప్రధాని టోనీ బ్లెయిర్ పాత్రలకు అంతర్జాతీయ ప్రశంసలు పొందాడు. తన నటజీవితానికి మించి, సామాజిక పోరాటకారుడైన షీన్.. తనను తాను "లాభాపేక్ష లేని నటుడిగా" ప్రకటించుకున్నాడు. తన సంపాదనను సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నాడు. ఇప్పుడే కాదు.. 2021లోనే అతను తన సంపదను ధార్మిక కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వాలనే నిర్ణయాన్ని ప్రకటించాడు.

ప్రతీ పల్లెలో ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ వేడుకలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఈనెల 12న చేపట్టిన ‘యువత పోరు’ ద్వారా రాష్ట్రంలో యువతను, నిరుద్యోగులను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అలాగే, 12వ తేదీన వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలని సూచించారు.యువత పోరు, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలపై ఆదివారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. మొత్తం రూ.3900 కోట్ల మేరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉంటే ఈ బడ్జెట్లో కేవలం రూ.2600 కోట్లు కేటాయించడం దుర్మార్గం. అంటే విద్యార్ధుల సంఖ్యను కూడా కుదించేందుకు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తోంది.బకాయిలు పెండింగ్..పేద, మధ్యతరగతి విద్యార్ధులను చదువులకు దూరం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అయిదు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ పెట్టడం రాక్షసత్వం. ఫీజులు చెల్లించకపోవడంతో కాలేజీల నుంచి విద్యార్ధులను వెళ్లగొడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో చదువులు మధ్యలో ఆగిపోతున్నా సర్కారు చోద్యం చూస్తోంది. పేద పిల్లలకు పెద్ద చదువులు సాకారం చేస్తూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చారు. నిరుపేద ఇళ్ల నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు తయారు కావాలన్న సమున్నత లక్ష్యంతో నాడు ఫీజు రీయింబర్స్మెంట్ కు శ్రీకారం చుట్టారు.చంద్రబాబు సర్కార్ 2014-19 మధ్యలో ఈ పథకానికి తిలోదకాలు ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా బకాయిలు పెట్టి, కాలేజీ యాజమాన్యాలను, విద్యార్ధులను ఇబ్బందుల పాలు చేసింది. వైఎస్సార్ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసిన వైఎస్ జగన్ 93 శాతం మంది విద్యార్ధులకు మేలు చేసేలా ఈ పథకాన్ని విస్తరింపచేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు కూటమి సర్కార్ ఈ పథకాన్ని నీరు గార్చేందుకు ప్రయత్నిస్తోంది.నిరుద్యోగులను వంచిస్తున్న కూటమి..కూటమి ప్రభుత్వంపై యువతలోనూ ప్రభుత్వం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. నిరుద్యోగ యువతకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని విస్మరించారు. ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా ప్రతినెలా మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి చెల్లిస్తామంటూ ఇచ్చిన హామీ ఏమైంది?. ఈ హామీని అమలు చేయాలంటే ఏడాదికి రూ.7200 కోట్లు అవసరం. కానీ గత బడ్జెట్ లో దీనికి కేటాయింపులు లేవు. ఈ ఏడాది బడ్జెట్ లోనూ పైసా కూడా కేటాయించలేదు.మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం..ప్రజారోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు వైఎస్సార్సీపీ హయాంలో పదిహేడు కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. ఇందులో అయిదు కాలేజీల నిర్మాణం పూర్తై, తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన వాటిల్లో నిర్మాణపనులు పూర్తిచేసి, తరగతులను ప్రారంభించాల్సి ఉంది. కానీ వాటిని కూడా ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఇచ్చిన మెడికల్ సీట్లను కూడా వద్దంటూ రాష్ట్రప్రభుత్వమే లేఖ రాయడం దుర్మార్గం. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో ఒకేసారి పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టింది.వీటిల్లో విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కాలేజీలు 2023లో ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. 2019 వరకు రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కాలేజీలే ఉండేవి. వందేళ్ళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుంది. అయితే కొత్త మెడికల్ కాలేజీలను, వాటిద్వారా వచ్చే సీట్లను కూటమి ప్రభుత్వం అడ్డుకుంటోంది. వాటిని ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నిస్తోంది.విద్యార్థి సంఘాలు కలిసి రావాలి..ఈ తరుణంలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీ.. యువతకు, విద్యార్ధులకు అండగా నిలిచి ప్రభుత్వం విధానాలపై పోరాడాలి. అందుకోసం తలపెట్టిన యువత పోరులో కలిసి వచ్చే అన్ని విద్యార్థిసంఘాలు, యువజన సంఘాలతో వైఎస్సార్సీపీ నేతృత్వంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించాలి. అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట విద్యార్థులు, నిరుద్యోగులు, యవతతో కలిసి వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రదర్శన, ధర్నా కార్యక్రమం చేపట్టాలి. అనంతరం కలెక్టర్లకు సమస్యలపై విజ్ఞాపన పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, మండల స్థాయి నేతలు సమన్వయంతో విజయవంతం చేయాలి.వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలు..ఈనెల 12వ తేదీ వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం. రాష్ట్రంలోని వాడవాడలా పార్టీ ఆవిర్భావ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలి. ప్రతి పల్లెలోనూ పార్టీ జెండాలను ఎగురవేయాలి. ప్రజల్లో వైఎస్సార్సీపీకి ఉన్న బలాన్ని చాటుకోవాలి. పార్టీ పట్ల సానుభూతితో ఉన్న శ్రేణులను ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములను చేయాలి. ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణను నిలబెట్టుకుంటూ, రానున్న రోజుల్లో వారికి అండగా ఉంటామనే భరోసాను కల్పించాలి. మండలస్థాయి కమిటీల ఏర్పాటుకు కూడా నియోజకవర్గ ఇన్చార్జీలు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.

Pranay Amrutha: ప్రణయ్ అమృత కేసులో రేపే తుది తీర్పు
సాక్షి,నల్లగొండ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో రెండో అదనపు సెషన్స్ కోర్టు,ఎస్సీ ఎస్టీ కోర్టు సోమవారం (మార్చి 10న) తుది తీర్పును వెలవరించనుంది. దీంతో ఈ కేసులో నిందితుల పాత్రపై సాక్ష్యాధారాలను పరిగణించి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం వెల్లడించే తుదితీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇక కేసు విషయానికొస్తే.. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుసుకుందన్న నెపంతో తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబరు 14వ తేదీన ప్రణయ్‌ను హత్యచేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసుశాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తిచేసి 1600పేజీల్లో చార్జిషీట్ నివేదికను రూపొందించింది. 2019 జూన్ 12న చార్జిషీట్ దాఖలు చేయగా ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్‌కోర్టు విచారణ మొదలుపెట్టింది.సుమారు ఐదున్నర ఏళ్ల పాటు విచారణ కొనసాగగా, ఈ కేసులో ఇప్పటికే ఏ-1 మారుతీరావు 2020 మార్చి 7న ఖైరతాబాద్ వైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఏడుగురు నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్, పోస్టుమార్టం నివేదిక, చార్జ్ షీట్‌తో పాటు సాక్షులను విచారించిన న్యాయస్థానం విచారించి తుది తీర్పును మార్చి 10వ తేదీకి రిజర్వు చేసింది. రేపు తుది తీర్పును వెలువరించనుంది.ఈ కేసులో ఏ-2 సుబాష్ శర్మ, ఏ-3 అజ్గర్ అలీ, ఏ-4 అబ్దుల్ బారీ, ఏ-5 ఎంఏ కరీం, ఏ-6 తిరునగరు శ్రవణ్ కుమార్, ఏ-7 శివ, ఏ-8 నిజాంలుగా నిర్ధారించారు. సుబాష్ శర్మ, అస్గర్ అలీ మినహా మిగతా ఐదుగురు నిందితులు గతంలోనే బెయిల్ పొందారు. నిందితుల్లో అస్గర్ అలీ గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలక నిందితుడు.

SLBC: ఒక మృతదేహం వెలికితీత
నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఒక మృతదేహాన్ని ఎట్టకేలకు వెలికితీశారు. మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ వెలికి తీసుకొచ్చింది. అతన్ని టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా అనుమానిస్తున్నారు. వెలికితీసిన మృతదేహాన్ని నాగర్ కర్నూల్ ఆస్పత్రికి తరలించారు.ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా 8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్ ఎండ్ పాయింట్లో కీలక స్పాట్స్‌ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్‌లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.జీపీఆర్, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్‌లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఆ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ టీమ్.కాగా, గత నెల 22వ తేదీన శైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది.

'ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను'.. టాలీవుడ్ కమెడియన్ ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రచ్చ రవి అందరికీ సుపరిచితమే. బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. తనదైన కామెడీ, పంచ్ డైలాగ్స్‌తో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవలే బాపు సినిమాలో రచ్చరవి నటించారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించారు. నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. టాలీవుడ్లో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించారు.తాజాగా రచ్చ రవి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. ఇవాళ తన పెళ్లి రోజు కావడంతో భార్యకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ప్రేమను వ్యక్తం చేశారు. నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణంలో తోడుగా నిలిచిన తన భార్య స్వాతిని ప్రశంసిస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. ఇది చూసిన రచ్చ రవి అభిమానులు తమ అభిమాన నటుడికి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.రచ్చ రవి తన ఇన్‌స్టాలో రాస్తూ..' నిన్ను పరిచయం చేసిన నీ... నా... తల్లిదండ్రుల రుణం తీరదు. నా జీవన ప్రయాణంలో నీ పూర్తి సహాయ సహకారం అందిస్తున్న నాకు తృప్తి ఉండదు. ఎన్ని ఆశలు.. కోరికలు.. ఇష్టాలు.. ఉన్నాయో నీకు వాటిని నేను తీర్చగలనో లేదో అని ఎన్నడు నేను అడగలేదు..నువ్వు చెప్పలేదు. నా ప్రపంచానికి చిరుదివ్యల వెలుగును పంచుతూ నా జీవన ప్రయాణానికి వసంతాలు పూయిస్తూ కష్టాలను భరిస్తూ దుఃఖాలను దిగమింగుకుంటూ... కాంప్రమైజ్ అవుతూ లైఫ్‌లో నన్ను సక్సెస్ చేయిస్తూ.... ఇదే జీవితంలో నీ ఇష్టాలు కోరికలు ఆశలను తీర్చాలని... అంత శక్తి నాకు భగవంతుడు ఇవ్వాలని.. నా నిస్వార్థ కోరిక అర్థం చేసుకొని ఇస్తాడని.... నీ రుణం కూడా తీరదని తెలిసి కూడా కనీసం వడ్డీగానైనా ప్రేమిస్తానని ప్రేమగా చూసుకుంటానని...నా సహచరికి పెళ్లిరోజు శుభాకాంక్షలు.. ఐ లవ్ యు స్వాతి..' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. View this post on Instagram A post shared by Ravi Racha (@meracharavi)
సినిమా

ఫిట్‌నెస్‌పై రూమర్స్.. కరణ్ జోహార్ క్లారిటీ!
బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత కరణ్ జోహార్ తాజాగా ఐఫా అవార్డుల వేడుకలో మెరిశారు. రాజస్థాన్‌లోని జైపూర్ వేదికగా జరిగిన ఈవెంట్లో ఆయన సందడి చేశారు. ఇటీవల తన ఫిట్నెస్ గురించి వస్తున్న వార్తలపై తాజా ఈవెంట్లో స్పందించారు. స్లిమ్‌గా కనిపించడానికి గల కారణాలను వివరించాడు. తన ఫిట్‌నెస్‌కు ప్రధాన కారణం అలవాట్లేనని కరణ్ జోహార్ వెల్లడించారు. సరైన టైమ్‌కి తినడం, వ్యాయామం చేయడం వల్లే సాధ్యమైందని తెలిపారు. ఫిట్‌నెస్‌కు క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ముఖ్యమని డైరెక్టర్ సలహా ఇచ్చాడు. దీంతో కరణ్ బరువు తగ్గడంపై వస్తున్న వార్తలకు ఆయన చెక్‌పెట్టారు.(ఇది చదవండి: 'ఐఫా' అవార్డ్స్ 2025 విజేతల జాబితా)కరణ్ జోహార్ బరువు తగ్గేందుకు ఓజెంపిక్ వంటి డయాబెటిక్ మందుల వాడుతున్నారని రూమర్స్ వచ్చాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన సన్నిహిత మిత్రుడు మహీప్ కపూర్ వ్యాఖ్యల తర్వాత ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ షో లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్లో మహీప్ కపూర్ ఈ విషయంపై మాట్లాడారు. తాజాగా కరణ్ క్లారిటీ ఇవ్వడంతో ఇకపై ఆ వార్తలకు చెక్ పడనుంది. కాగా.. గతంలో స్లిమ్‌గా ఉంటూ తన ఫిట్నెస్ పట్ల నిబద్ధతను చాటుకున్నారు కరణ్ జోహార్.

కష్టాల 'రాజాసాబ్'.. అసలేం జరుగుతోంది?
ప్రభాస్ (Prabhas) చేస్తున్న వాటిలో కాస్త తక్కువ బజ్ ఉన్న సినిమా అంటే 'రాజాసాబ్'.(The Rajasaab Movie) ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గురించి ప్రకటన వచ్చినప్పుడు తొలుత డార్లింగ్ ఫ్యాన్స్ వద్దన్నారు. కానీ తర్వాత వచ్చిన కొంత కంటెంట్ చూసి ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం మాత్రం ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు.దర్శకుడు మారుతి.. హారర్ కామెడీ కథతో తీస్తున్న మూవీ 'రాజాసాబ్'. లెక్క ప్రకారం ఈ ఏప్రిల్ 10న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. దీంతో వాయిదా గ్యారంటీ. కొన్నాళ్ల ముందు టీజర్ గురించి అదిగో, ఇదిగో వచ్చేస్తుందని అన్నారు. కానీ దాని అప్డేట్ ఏంటో చెప్పట్లేదు.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' నటి)మరోవైపు ఇంకా మూడు పాటలు షూటింగ్ చేయాల్సి ఉందని, కానీ హీరోయిన్లు మాళవిక మోహన్, నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆలస్యమవుతూనే ఉంది. మరోవైపు బడ్జెట్ ప్రాబ్లమ్ కూడా ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. గతేడాది చాలా ఫ్లాప్స్ వల్ల నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కాస్త ఇబ్బందుల్లో ఉందని, అందుకే 'రాజాసాబ్' లేట్ అవుతుందని అనుకుంటున్నారు.ఇవన్నీ పక్కనబెడితే ఇప్పటికే 'రాజాసాబ్' ఫుటేజ్ మూడున్నర గంటలు వచ్చిందని, పాటలు కూడా కలిపితే మరో 15 నిమిషాలు పెరుగుతుంది. కాబట్టి లింక్స్ మిస్ కాకుండా వాటిని ఎడిట్ చేయాల్సిన పెద్దపనే ఉందని అంటున్నారు. అలానే ఈ ఏడాది రాబోయే పండగల కోసం కొత్త మూవీస్ ఆల్రెడీ కర్చీఫ్ వేసేశాయి. ఇలా ఇన్ని కష్టాలు పడుతున్న 'రాజాసాబ్'.. ఈ ఏడాది రిలీజ్ అవుతుందా? లేదంటే వచ్చే ఏడాది పడుతుందా అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2' దెబ్బకు ఫ్లాప్.. ఇన్నాళ్లకు ఓటీటీలోకి ఆ సినిమా)

కస్టడీలో రన్యా రావు.. కన్నీళ్ల పర్యంతమైన నటి!
ప్రముఖ కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడింది. దుబాయ్ నుంచి బెంగళూరు చేరుకున్న ఆమెను డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి దాదాపు 14 కేజీలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే రన్యారావును అరెస్ట్ చేసిన అధికారులు రిమాండ్‌కు పంపించారు. ప్రస్తుతం రన్యా రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఇవాళ డీఆర్ఐ అధికారుల ముందు విచారణకు హాజరైన రన్యారావు కన్నీళ్ల పర్యంతమైంది. అసలు ఇందులోకి ఎందుకు వచ్చానో అంటూ తన న్యాయవాదులతో అన్నారు. నిద్రలో కూడా ఎయిర్పోర్ట్ గుర్తొస్తోందని.. అస్సలు నిద్రపట్టడం లేదని తెలిపింది. మానసికంగా కృంగిపోయానని తన లాయర్లతో రన్యా రావు చెప్పింది. విచారణ సందర్భంగా ఫుల్ ఎమోషనలైంది రన్యా రావు. మరోవైపు ఆమెపై ఇప్పటికే సీబీఐ అధికారులు కూడా కేసు నమోదు చేశారు.కాగా.. మాణిక్య సినిమాతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన రన్యా రావు కేవలం మూడు చిత్రాల్లో మాత్రమే కనిపించింది. ఈ మూవీ తెలుగు సినిమా మిర్చి రీమేక్‌గా తెరకెక్కించారు. ఆ తర్వాత పటాస్ కన్నడ రీమేక్ పటాకిలో హీరోయిన్గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. బంగారు అక్రమ రవాణా చేస్తుండగా మార్చి 3న దుబాయ్ నుంచి వస్తుండగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అందాల నిధి.. డిఫరెంట్ డ్రస్సులో తమన్నా!
చాలారోజుల తర్వాత మెరిసిపోతున్న నిధి అగర్వాల్వెరైటీ ఔట్ ఫిట్ లో తమన్నా స్టైలిష్ పోజులుపెంపుడు కుక్క అస్థికల్ని గోదావరి నదిలో కలిపిన రష్మీహాట్ నెస్ తో చంపేస్తున్న బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీచీరలో కుందనపు బొమ్మలా కేక పుట్టిస్తున్న కాయదు లోహర్పసుపు చీరలో చూడముచ్చటగా తమిళ హీరోయిన్ దివ్య భారతిగ్లామర్ తో చంపేస్తున్న యంగ్ బ్యూటీ మాళవిక శర్మ View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim) View this post on Instagram A post shared by Poonam kaur (@puunamkhaur) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Gouri G Kishan (@gourigkofficial) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Saanve Megghana (@saanve.megghana) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Nikhila Vimal (@nikhilavimalofficial) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

వన్డే విజయం తెచ్చిన ఆనందం...
నవంబర్ 19, 2023... కోట్లాది మంది భారతీయుల ఆశలు మోస్తూ వన్డే వరల్డ్ కప్‌లో ఫైనల్ బరిలోకి దిగిన భారత్ అనూహ్య పరాజయంతో అభిమానుల గుండెలు బద్దలయ్యాయి... జూన్ 29, 2024... టి20 ఫార్మాట్లో తమ స్థాయికి తగ్గ ఆటను కనబరుస్తూ భారత జట్టు వరల్డ్ కప్ గెలుచుకుంది...ఫ్యాన్స్‌కు కాస్త ఊరట... మార్చి 9, 2025... అంచనాలకు అనుగుణంగా ప్రతీ మ్యాచ్‌లో సంపూర్ణ ఆధిక్యంతో భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ సాధించింది... దేశవ్యాప్తంగా అన్ని చోట్లా ఆనందం... సాక్షి క్రీడా విభాగం : సుమారు 16 నెలల వ్యవధిలో భారత జట్టు మూడు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్ చేరింది. వాటిలో రెండింటిలో విజేతగా నిలిచింది. వన్డే వరల్డ్ కప్ ఓటమి వేదన ఇప్పటికీ తీరనిది అయినా మిగతా రెండు విజయాలతో సాంత్వన దక్కిందనేది మాత్రం వాస్తవం. అంతర్జాతీయ క్రీడల్లో ఒక టోర్నమెంట్‌కు, మరో టోర్నమెంట్‌కు పోలిక ఉండదు. ఒక విజయానికి, మరో విజయానికి సంబంధం ఉండదు. దేని ప్రత్యేకత దానిదే. కానీ గెలుపు ఇచ్చే కిక్ మాత్రం ఎప్పుడైనా ఒకటే! ఇప్పుడు టీమిండియా ఆటగాళ్లు దానినే అనుభవిస్తున్నారు.వరల్డ్ కప్ కాకపోయినా టాప్–8 జట్ల మధ్య జరిగిన సమరంలో భారత్ తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 2013లో చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో సభ్యులైన రోహిత్, కోహ్లి, జడేజా ఇప్పుడూ ఉన్నారు. 2017 ఫైనల్లో పాక్ చేతిలో ఓడిన వారిలో ఈ ముగ్గురితో పాటు హార్దిక్ పాండ్యా, షమీ కూడా ఉన్నారు. షమీ, అయ్యర్, రాహుల్, హర్షిత్ రాణా, వరుణ్, సుందర్‌లకు ఇదే తొలి ఐసీసీ టైటిల్. దాని విలువ ఏమిటో వారి ఆనందంలోనే కనిపిస్తోంది. స్పిన్నర్లే విన్నర్లు... చాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించినప్పుడు ‘ఐదుగురు స్పిన్నర్లా’ అంటూ అన్ని వైపుల నుంచి ఆశ్చర్యం వ్యక్తమైంది. పైగా అప్పటికే ఎంపిక చేసిన జట్టులో ఉన్న బ్యాటర్ యశస్వి జైస్వాల్‌ను తప్పించి మరీ వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేశారు. టోర్నీలో మన స్పిన్నర్ల ప్రదర్శన చూస్తే ఇది ఎంత సరైన నిర్ణయమో తేలింది. సుందర్‌కు మ్యాచ్ ఆడే అవకాశం రాకపోగా... మిగతా నలుగురు వరుణ్, కుల్దీప్, అక్షర్, జడేజా పెను ప్రభావం చూపించారు. ఈ నలుగురు కలిసి మొత్తం 26 వికెట్లు పడగొట్టారు. ఇందులో వరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కేవలం 15.11 సగటుతో అతను 9 వికెట్లు తీశాడు. లీగ్ దశలోనే కివీస్ పని పట్టిన అతను ఫైనల్లోనూ అదే ఆటను ప్రదర్శించి జట్టు విజయానికి కారణమయ్యాడు. కీలకమైన యంగ్, ఫిలిప్స్ వికెట్లు తీసిన అతను కనీసం ఒక్క బౌండరీ కూడా ఇవ్వకపోవడం విశేషం! టోర్నీకి ముందు అతను ఒకే ఒక వన్డే ఆడాడు. ‘వరుణ్ బౌలింగ్‌లో ఏదో ప్రత్యేకత ఉంది. నెట్స్‌లో కూడా అతను మాకు మామూలుగానే బౌలింగ్ చేస్తాడు. తన అసలైన ఆయుధాలను మ్యాచ్‌లోనే ప్రదర్శిస్తాడు. అలా చేస్తే చాలు’ అంటు రోహిత్ చేసిన ప్రశంస వరుణ్ విలువను చూపించింది. ఆరంభంలో కుల్దీప్ పెద్దగా ప్రభావం చూపకపోయినా... తుది పోరులో రెండు కీలక వికెట్లతో కివీస్‌ను నిలువరించాడు. జడేజా, అక్షర్ కూడా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టి పడేశారు. వీరిద్దరి ఎకానమీ 4.35 మాత్రమే ఉందంటే వారు ఎంత పొదుపుగా బౌలింగ్ చేశారో అర్థమవుతుంది. గాయం నుంచి కోలుకొని తిరిగొచ్చిన షమీ గతంలోలా అద్భుతంగా బౌలింగ్ చేయకపోయినా కీలక సమయాల్లో జట్టును ఆదుకున్నాడు. టోర్నీలో అతను తీసిన 9 వికెట్లలో సెమీస్‌లో స్మిత్‌ను అవుట్ చేసిన క్షణం హైలైట్‌గా నిలిచింది. బుమ్రా లేని లోటును పూరిస్తూ ఈ సీనియర్ బౌలర్ తన వంతు పాత్రను పోషించాడు. బ్యాటర్లు సమష్టిగా... బ్యాటింగ్‌లో ఎప్పటిలాగే విరాట్ కోహ్లి (మొత్తం 218 పరుగులు) భారత జట్టు మూల స్థంభంగా నిలిచాడు. 1 సెంచరీ, 1 అర్ధసెంచరీతో రెండుసార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా అతను జట్టును గెలిపించాడు. టోర్నీకి ముందు అతని బ్యాటింగ్‌పై కాస్త సందేహాలు రేగినా... వాటిని అతను పటాపంచలు చేశాడు. కోహ్లినే స్వయంగా చెప్పినట్లు ఆ్రస్టేలియా టూర్ తర్వాత తాము ఒక విజయం కోసం చూస్తున్న స్థితిలో ఈ టైటిల్ దక్కింది. మొత్తం పరుగులు చూస్తే రోహిత్ శర్మ (180) తక్కువగానే కనిపిస్తున్నా... ఓపెనర్‌గా అతను చూపించిన ప్రభావం ఎంతో ఉంది. శ్రేయస్ అయ్యర్ (243) జట్టు అత్యధిక స్కోరర్‌గా నిలవగా, గిల్ (188 పరుగులు) ఒక సెంచరీతో తాను ప్రధాన పాత్ర పోషించాడు. తనపై వస్తున్న విమర్శలకు జవాబిస్తూ కేఎల్ రాహుల్ (140 పరుగులు) మూడు మ్యాచ్‌లలో చివరి వరకు నిలిచి జట్టును గెలుపు తీరం చేర్చాడు. ఐదో స్థానంలో ప్రమోట్ అయిన అక్షర్ పటేల్ (109 పరుగులు) కూడా ఆకట్టుకున్నాడు. టాప్–6 బ్యాటర్లు ఆశించిన స్థాయిలో ఆడటంతో ఆందోళన లేకపోయింది. ఐదు మ్యాచ్‌లలో భారత్ నాలుగు సార్లు సునాయాసంగా 232, 242, 265, 252 లక్ష్యాలను అందుకుంది. కెప్టెన్ గా రోహిత్ ముద్ర... భారత్ నుంచి ధోని మాత్రం కెపె్టన్‌గా ఒకటికి మించి ఐసీసీ టైటిల్స్ సాధించాడు. ఇప్పుడు రెండు ట్రోఫీలతో రోహిత్ శర్మ తన నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాడు. మరో దాంట్లో ఫైనల్ కూడా చేర్చిన ఘనత, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఫైనల్లో సారథిగా వ్యవహరించిన ఘనత కూడా అతని ఖాతాలో ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో కీలక సమయాల్లో కెప్టెన్ గా అతను జట్టును నడిపించిన తీరు హైలైట్‌గా నిలిచింది. గంభీర్‌కు ఊరట... ద్రవిడ్ నుంచి కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత గంభీర్ కోచింగ్‌లో చెప్పుకోదగ్గ ఫలితాలు రాలేదు. శ్రీలంకపై టి20 సిరీస్, స్వదేశంలో ఇంగ్లండ్‌తో సిరీస్ లు గెలిచినా వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సొంతగడ్డపై న్యూజిలాండ్, ఆ తర్వాత ఆసీస్ చేతిలో టెస్టుల్లో చిత్తయిన అవమాన భారం మాత్రమే అందరికీ గుర్తుండిపోయింది.ఇలాంటి సమయంలో వచ్చిన గెలుపు కోచ్‌గా అతనికి ఊరటనిచ్చిoదనడంలో సందేహం లేదు. ‘అంతర్జాతీయ క్రికెట్లో సంతృప్తికరమైన ఆట ఎప్పటికీ ఉండదు. ప్రతీసారి ఏదో ఒక విషయం మెరుగు పర్చుకోవాల్సిందే. అప్పుడే నిలకడగా ఫలితాలు వస్తాయి’ అంటూ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపిన కోచ్ ఇప్పుడు ఫైనల్ అనంతరం చిరునవ్వులు చిందించాడు.ప్రధాని ప్రశంసలు... మూడోసారి చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ‘అద్భుతమైన మ్యాచ్...అద్భుతమైన ఫలితం... ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన మన క్రికెట్ జట్టును చూసి గర్వపడుతున్నా. టోర్నమెంట్ ఆసాంతం వారంతా చాలా బాగా ఆడారు. అసాధారణ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన మన జట్టుకు నా అభినందనలు’ అని ‘ఎక్స్’లో మోదీ పేర్కొన్నారు. టీమిండియాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చందబ్రాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అభినందనలు తెలిపారు.మాజీ సీఎం జగన్ అభినందనలు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అసాధారణ విజయం సాధించిన భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాత్రి తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పందించారు. ‘ఇది ఎంతో అర్హమైన అజేయ విజయం. మన దేశానికి గర్వకారణమైన క్షణం! టీమిండియాకు అభినందనలు’ అని ఆయన పేర్కొన్నారు.7 భారత్ సాధించిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టైటిల్స్ సంఖ్య. ఇందులో 2 వన్డే వరల్డ్‌కప్‌లు (1983, 2011), 2 టి20 వరల్డ్‌కప్‌లు (2007, 2024), 3 చాంపియన్స్ ట్రోఫీలు (2022, 2013, 2025) ఉన్నాయి. ఈ జాబితాలో ఆస్ట్రేలియా 10 ఐసీసీ టైటిల్స్‌తో అగ్రస్థానంలో ఉంది.ఎవరికెంత ప్రైజ్‌మనీ అంటే? విజేత భారత్ 22 లక్షల 40 వేల డాలర్లు (రూ. 19 కోట్ల 52 లక్షలు) రన్నరప్ కివీస్ 11 లక్షల 20 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 76 లక్షలు)

మనమే చాంపియన్స్
భారత జట్టు మరోసారి తమ చాంపియన్ ఆటను ప్రదర్శించింది. తొలి మ్యాచ్ నుంచి అన్ని రంగాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తూ వచ్చిన జట్టు అజేయంగా విజయప్రస్థానాన్ని ముగించింది. అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో సమష్టి ఆటతో ఒక్కో ప్రత్యర్థిని పడగొడుతూ వచ్చిన జట్టు తమ స్థాయికి తగ్గ విజయాన్ని అందుకుంది. ఏడాది వ్యవధిలో మరో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టైటిల్‌ను సొంతం చేసుకొని ప్రపంచ క్రికెట్‌పై తమ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపించింది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని పూర్తిగా మరచిపోయేలా కాకపోయినా... ఈ ఫార్మాట్లో మరో ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకొని అభిమానులకు ఆనందాన్ని పంచింది. 2013లాగే ఒక్క ఓటమి కూడా లేకుండా టీమిండియా ట్రోఫీని గెలుచుకోవడం విశేషం. ఫైనల్లో టాస్ ఓడినా న్యూజిలాండ్‌ను సాధారణ స్కోరుకే పరిమితం చేయడంతోనే భారత్‌కు గెలుపు దారులు తెరుచుకున్నాయి. మన స్పిన్ చతుష్టయాన్ని ఎదుర్కోవడంలో మళ్లీ తడబడిన కివీస్ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఛేదనలో రోహిత్ శర్మ దూకుడైన ఆరంభం లక్ష్యాన్ని అందుకునేందుకు తగిన పునాది వేసింది. మధ్యలో కొద్దిసేపు కివీస్ స్పిన్నర్లూ ప్రభావం చూపడంతో 17 పరుగుల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో సమర్థమైన బ్యాటింగ్ లైనప్ తడబడకుండా టీమ్‌ను విజయతీరం చేర్చింది. క్రికెట్లో ‘మంచి బాలురు’వంటి న్యూజిలాండ్ టీమ్ మరోసారి ‘పోరాడి ఓడిన’ ముద్రతోనే నిరాశగా నిష్క్రమించింది.దుబాయ్: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ–2025ను భారత్ సొంతం చేసుకుంది. లీగ్ దశలో మూడు మ్యాచ్‌లతో పాటు సెమీఫైనల్, ఫైనల్ కలిపి ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఓటమి లేకుండా జట్టు టైటిల్ గెలుచుకుంది. దుబాయ్‌లో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. గతంలో భారత్ 2002, 2013లలో కూడా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెల్చుకుంది. ఫైనల్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డరైల్ మిచెల్ (101 బంతుల్లో 63; 3 ఫోర్లు), మైకేల్ బ్రేస్‌వెల్ (40 బంతుల్లో 53 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం భారత్ 49 ఓవర్లలో 6 వికెట్లకు 254 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (83 బంతుల్లో 76; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగగా... శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 48; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టోర్నీ మొత్తంలో 263 పరుగులు చేసి 3 వికెట్లు తీసిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు గెల్చుకున్నాడు. మిచెల్ హాఫ్ సెంచరీ... కివీస్ ఇన్నింగ్స్‌ను రచిన్ రవీంద్ర (29 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా మొదలు పెట్టాడు. పాండ్యా ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ కొట్టిన అతను షమీ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. దాంతో ఆరో ఓవర్లోనే భారత్ స్పిన్నర్ వరుణ్‌ను బౌలింగ్‌కు దింపింది. విల్ యంగ్ (23 బంతుల్లో 15; 2 ఫోర్లు)ను అవుట్ చేసి అతను ఓపెనింగ్ జోడీని విడదీశాడు. 10 ఓవర్లలో కివీస్ స్కోరు 69 పరుగులకు చేరింది. తన తొలి బంతికే రచిన్‌ను బౌల్డ్ చేసిన కుల్దీప్, తన రెండో ఓవర్లో విలియమ్సన్ (14 బంతుల్లో 11; 1 ఫోర్)ను పెవిలియన్ పంపించి ప్రత్య ర్థిని దెబ్బ కొట్టాడు.లాథమ్ (30 బంతుల్లో 14) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ (52 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో బ్యాటర్లు బాగా ఇబ్బంది పడటంతో పరుగులు నెమ్మదిగా వచ్చాయి. వరుసగా 81 బంతుల పాటు బౌండరీనే రాలేదు. ఎట్టకేలకు 91 బంతుల్లో మిచెల్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఒక వైపు తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోయినా... ఆఖర్లో బ్రేస్‌వెల్ వేగంగా ఆడటంతో జట్టు స్కోరు 250 పరుగులు దాటింది. చివరి 10 ఓవర్లలో కివీస్ 79 పరుగులు చేసింది. నలుగురు భారత స్పిన్నర్లు కలిపి 38 ఓవర్లలో 144 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా... ఇద్దరు పేసర్లు 12 ఓవర్లలో 104 పరుగులిచ్చి ఒకే వికెట్ తీయడం మన స్పిన్నర్ల ప్రభావాన్ని చూపించింది. రాణించిన అయ్యర్... ఇన్నింగ్స్ రెండో బంతికే సిక్స్‌తో మొదలు పెట్టిన రోహిత్ తన ఇన్నింగ్స్ ఆసాంతం దూకుడుగా ఆడాడు. నాథన్ స్మిత్ ఓవర్లో అతను 2 ఫోర్లు, సిక్స్ కొట్టాడు. మరో ఎండ్‌లో శుబ్‌మన్ గిల్ (50 బంతుల్లో 31; 1 సిక్స్) పరుగులు చేయడానికి తీవ్రంగా శ్రమించాడు. 10 ఓవర్లలో స్కోరు 64 పరుగులు కాగా, 41 బంతుల్లోనే రోహిత్ హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఎట్టకేలకు శతక భాగస్వామ్యం తర్వాత గిల్ అవుట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆపై మరో 17 పరుగుల తేడాతో రెండు కీలక వికెట్లు తీసి కివీస్ పైచేయి సాధించింది. బ్రేస్‌వెల్ తొలి బంతికి కోహ్లి (1) వికెట్ల ముందు దొరికిపోగా, రోహిత్ భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంపౌటయ్యాడు. ఈ దశలో అయ్యర్, అక్షర్ పటేల్ (40 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి చక్కటి సమన్వయంతో జాగ్రత్తగా ఆడుతూ మళ్లీ ఇన్నింగ్స్‌ను నడిపించారు. అయితే వీరిద్దరిని తక్కువ వ్యవధిలో వెనక్కి పంపడంతో కివీస్ బృందంలో ఆశలు రేగాయి. అయితే కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) ముందుండి నడిపిస్తూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. 68 బంతుల్లో 69 పరుగులు చేయాల్సిన స్థితిలో బరిలోకి దిగిన రాహుల్‌కు హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) సహకరించాడు. 49వ ఓవర్ చివరి బంతిని జడేజా (6 బంతుల్లో 9 నాటౌట్; 1 ఫోర్) డీప్‌స్క్వేర్ లెగ్ దిశగా ఫోర్ కొట్టడంతో భారత్ విజయాన్ని పూర్తి చేసుకుంది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: యంగ్ (ఎల్బీ) (బి) వరుణ్ 15; రచిన్ (బి) కుల్దీప్ 37; విలియమ్సన్ (సి అండ్ బి) కుల్దీప్ 11; మిచెల్ (సి) రోహిత్ (బి) షమీ 63; లాథమ్ (ఎల్బీ) (బి) జడేజా 14; ఫిలిప్స్ (బి) వరుణ్ 34; బ్రేస్‌వెల్ (నాటౌట్) 53; సాంట్నర్ (రనౌట్) 8; స్మిత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 251. వికెట్ల పతనం: 1–57, 2–69, 3–75, 4–108, 5–165, 6–211, 7–239. బౌలింగ్: షమీ 9–0–74–1, పాండ్యా 3–0–30–0, వరుణ్ చక్రవర్తి 10–0–45–2, కుల్దీప్ యాదవ్ 10–0–40–2, అక్షర్ పటేల్ 8–0–29–0, రవీంద్ర జడేజా 10–0–30–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (స్టంప్డ్) లాథమ్ (బి) రచిన్ 76; శుబ్‌మన్ గిల్ (సి) ఫిలిప్స్ (బి) సాంట్నర్ 31; కోహ్లి (ఎల్బీ) (బి) బ్రేస్‌వెల్ 1; శ్రేయస్ అయ్యర్ (సి) రచిన్ (బి) సాంట్నర్ 48; అక్షర్ పటేల్ (సి) రూర్కే (బి) బ్రేస్‌వెల్ 29; కేఎల్ రాహుల్ (నాటౌట్) 34; హార్దిక్ పాండ్యా (సి అండ్ బి) జేమీసన్ 18; జడేజా (నాటౌట్) 9; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (49 ఓవర్లలో 6 వికెట్లకు) 254. వికెట్ల పతనం: 1–105, 2–106, 3–122, 4–183, 5–203, 6–241. బౌలింగ్: జేమీసన్ 5–0–24–1, రూర్కే 7–0–56–0, స్మిత్ 2–0–22–0, సాంట్నర్ 10–0–46–2, రచిన్ 10–1–47–1, బ్రేస్‌వెల్ 10–1–28–2, ఫిలిప్స్ 5–0–31–0. ఫిలిప్స్ అసాధారణంఫీల్డింగ్ అత్యుత్తమ ప్రమాణాలు చూపిస్తూ తన స్థాయిని పెంచుకున్న ఫిలిప్స్ ఆదివారం మరోసారి దానిని ప్రదర్శించాడు. షార్ట్ కవర్ వైపు గిల్ షాట్ ఆడగా అసాధారణంగా గాల్లోకి ఎగురుతూ ఒంటి చేత్తో ఫిలిప్స్ అందుకోవడం అందరినీ ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. ఈ టోర్నీలో అతను ఇప్పటికే కోహ్లి, రిజ్వాన్ క్యాచ్‌లను కూడా ఇదే తరహాలో అందుకున్నాడు. క్యాచ్‌లు వదిలేశారు...భారత జట్టు ఫీల్డింగ్‌లో పలు అవకాశాలు చేజార్చింది. కష్టసాధ్యమే అయినా ఏకంగా నాలుగు క్యాచ్‌లు వదిలేసింది. అయితే లైఫ్ లభించిన ఆటగాళ్లెవరూ దానిని పెద్దగా సది్వనియోగం చేసుకోలేకపోవడంతో పెద్దగా నష్టం జరగలేదు. రచిన్ రవీంద్ర స్కోరు 29 వద్ద ఉన్నప్పుడు రెండుసార్లు బతికిపోయాడు. షమీ రిటర్న్ క్యాచ్ వదిలేయగా, అయ్యర్ మరో క్యాచ్ వదిలేశాడు. మిచెల్ స్కోరు 38 వద్ద రోహిత్ క్యాచ్ వదిలేయగా, ఫిలిప్స్ స్కోరు 27 వద్ద గిల్ క్యాచ్ వదిలేసి అవకాశమిచ్చాడు. ఆ తర్వాత కివీస్ కూడా గ్రౌండ్ ఫీల్డింగ్ అద్భుతంగా చేసినా... రెండు క్యాచ్‌లు వదిలేసింది. గిల్ 1 పరుగు వద్ద మిచెల్ క్యాచ్ వదిలేయగా, అయ్యర్ 44 పరుగుల వద్ద ఉన్నప్పుడు జేమీసన్ అతి సులువైన క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. 12 రోహిత్ శర్మ వరుసగా 12వసారి టాస్ ఓడిపోయాడు. ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉన్న వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా (12) రికార్డును సమం చేశాడు. అయితే మ్యాచ్‌లు గెలుస్తూ ఐసీసీ టైటిల్ సాధించిన వేళ ఇలాంటి టాస్‌లు ఎన్ని ఓడిపోయినా రోహిత్‌కు లెక్క లేదు! ‘నేను రిటైర్ కావడం లేదు’ చాలా సంతోషంగా ఉంది. చక్కటి క్రికెట్ ఆడిన మాకు దక్కిన ఫలితమిది. మొదటి నుంచి మా స్పిన్నర్లు ప్రభావం చూపించారు. ఎన్నో అంచనాలు ఉన్న సమయంలో వారు నిరాశపర్చలేదు. ఈ సానుకూలతను మేం సమర్థంగా వాడుకున్నాం. రాహుల్ మానసికంగా దృఢంగా ఉంటాడు. సరైన షాట్లను ఎంచుకుంటూ ఒత్తిడి లేకుండా అతను ఈ మ్యాచ్‌ను ముగించగలిగాడు. అతని వల్లే అవతలి వైపు పాండ్యా స్వేచ్ఛగా ఆడగలిగాడు. మా బ్యాటర్లంతా ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చారు. వరుణ్ బౌలింగ్‌లో ఎంతో ప్రత్యేకత ఉంది. అతను కీలక సమయాల్లో వికెట్లు తీశాడు. ఇలాంటి పిచ్‌పై అలాంటి బౌలర్ కావాలని అంతా కోరుకుంటారు. మాకు ఇది సొంత మైదానం కాకపోయినా పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. దూకుడుగా బ్యాటింగ్ చేసేందుకు నన్ను కోచ్ ప్రోత్సహించారు. మరో విషయం నేను స్పష్టం చేయదల్చుకున్నాను. నేను ఈ ఫార్మాట్‌నుంచి రిటైర్ కావడం లేదు. ఎలాంటి వదంతులు రాకూడదని ఇది చెబుతున్నాను –రోహిత్, భారత కెప్టెన్ గొప్పగా అనిపిస్తోంది. ఆ్రస్టేలియాతో సిరీస్ తర్వాత సరైన రీతిలో పునరాగమనం చేయాలని భావించాం. కుర్రాళ్ళతో కలిసి ఆడటం ఎంతో బాగుంది. వారు సరైన సమయంలో స్పందిస్తూ జట్టును ముందుకు తీసుకెళుతున్నారు. ఇన్నేళ్లుగా ఆడుతున్న తర్వాత ఒత్తిడి కొత్త కాదు. టైటిల్ గెలవాలంటే ఆటగాళ్లంతా రాణించాల్సి ఉంటుంది. అందరూ సమష్టిగా సత్తా చాటడంతోనే ఇది సాధ్యమైంది. సరైన, తగిన సమయం సమయం చూసి తప్పుకోవడం ముఖ్యం (రిటైర్మెంట్పై). –విరాట్ కోహ్లి

Virat Kohli: అద్భుత విజయం.. అంతులేని సంతోషం!.. ఆసీస్ టూర్ తర్వాత..
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) ఫైనల్లో టీమిండియా విజయం పట్ల స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) హర్షం వ్యక్తం చేశాడు. టోర్నమెంట్ ఆసాంతం జట్టులోని ప్రతి ఒక్క సభ్యుడు టైటిల్ గెలిచేందుకు తమ వంతు సహకారం అందించాడని తెలిపాడు. భారత జట్టులో ప్రస్తుతం ప్రతిభకు కొదువలేదని.. యువ ఆటగాళ్లు సీనియర్ల సలహాలు తీసుకుంటూనే తమదైన శైలిలో ముందుకు సాగుతున్న తీరును కొనియాడాడు.కాగా పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ తాజా ఎడిషన్.. ఆదివారం దుబాయ్ వేదికగా భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్‌తో ముగిసింది. ఈ వన్డే టోర్నీలో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్.. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్ ఇంగ్లండ్ పోటీపడ్డాయి. అయితే, ఆసీస్‌ను ఓడించి టీమిండియా.. సౌతాఫ్రికాను ఓడించి న్యూజిలాండ్ తుదిపోరుకు అర్హత సాధించాయి.ఈ క్రమంలో మార్చి 9 నాటి మ్యాచ్‌లో రోహిత్ సేన ఆఖరి వరకు పోరాడి కివీస్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది.. టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో విజయానంతరం కోహ్లి తన మనసులోని భావాలు పంచుకున్నాడు. ‘‘ఇది అద్భుత విజయం. ఆస్ట్రేలియా పర్యటనలో చేదు అనుభవం తర్వాత పెద్ద టోర్నమెంట్ గెలవాలని మేము కోరుకున్నాం.సరైన దిశలోఇలాంటి తరుణంలో చాంపియన్స్ ట్రోఫీ గెలవడం అద్భుతంగా అనిపిస్తోంది. యువ ఆటగాళ్లతో కలిసి ఆడటం సంతోషంగా ఉంది. సీనియర్లుగా మేము మా అనుభవాలను వారితో పంచుకుంటున్నాం. వారు కూడా మా సలహాలు, సూచనలు తీసుకుంటూనే తమదైన శైలిలో రాణిస్తున్నారు.జట్టు ప్రస్తుతం సరైన దిశలో వెళ్తోంది. ఈ టోర్నీ మొత్తాన్ని మేము ఆస్వాదించాం. కొంతమంది బ్యాట్‌తో రాణిస్తే.. మరికొందరు బంతితో ప్రభావం చూపారు. అంతా కలిసి జట్టు విజయంలో భాగమయ్యారు. ఐదు మ్యాచ్‌లలో ప్రతి ఒక్కరు సరైన సమయంలో సరైన విధంగా రాణించి జట్టు గెలుపునకు బాటలు వేశారు. నిజంగా మాకు ఇది చాలా చాలా అద్భుతమైన టోర్నమెంట్’’ అంటూ కోహ్లి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.కాగా ఈ టోర్నీలో దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో శతకం(100 నాటౌట్)తో మెరిసిన కోహ్లి.. ఆసీస్‌తో సెమీ ఫైనల్లోనూ అద్భుత అర్ధ శతకం(84)తో రాణించాడు. అయితే టైటిల్ పోరులో మాత్రం దురదృష్టవశాత్తూ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. ఇదిలా ఉంటే.. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లను చిత్తు చేసిన రోహిత్ సేన.. సెమీస్‌లో ఆసీస్‌ను, ఫైనల్లో కివీస్‌ను ఓడించి అజేయంగా టైటిల్ విజేతగా నిలిచింది. ఇక కెప్టెన్‌గా రోహిత్ శర్మకు ఇది రెండో ఐసీసీ టైటిల్. గతేడాది టీ20 ప్రపంచకప్ గెలిచిన హిట్‌మ్యాన్.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కూడా సాధించాడు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ స్కోర్లు👉వేదిక: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం, దుబాయ్👉టాస్: న్యూజిలాండ్... తొలుత బ్యాటింగ్👉న్యూజిలాండ్ స్కోరు: 251/7 (50)👉కివీస్ టాప్ రన్ స్కోరర్: డారిల్ మిచెల్(101 బంతులలో 63)👉టీమిండియా స్కోరు: 254/6 (49)👉ఫలితం: న్యూజిలాండ్‌పై నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: రోహిత్ శర్మ(83 బంతుల్లో 7 ఫోర్లు,3 సిక్స్ లు 76 పరుగులు).చదవండి: మా స్పిన్నర్లు అద్భుతం: రోహిత్

మా స్పిన్నర్లు అద్భుతం.. అతడు ఒత్తిడిని చిత్తు చేశాడు: రోహిత్
పుష్కరకాలం తర్వాత టీమిండియా మరోసారి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy 2025)ని ముద్దాడింది. పాతికేళ్ల క్రితం న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని 2025 విజేతగా ఆవిర్భవించింది. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి ఫైనల్లో కివీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సాంట్నర్ బృందంపై పైచేయి సాధించి అభిమానులకు కనులవిందు చేసింది.మా స్పిన్నర్లు అద్భుతంఈ నేపథ్యంలో విజయానంతరం భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మాట్లాడుతూ సమిష్టి కృషి వల్లే గెలుపు సాధ్యమైందని సహచరులపై ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా స్పిన్నర్లు చాంపియన్స్ ట్రోఫీ-2025 ఆసాంతం అదరగొట్టారని కితాబులిచ్చాడు. అదే విధంగా తమకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు.‘‘ఇది మా సొంత మైదానం కాదు. అయినప్పటికీ మాకు మద్దతుగా అభిమానులు ఇక్కడికి తరలివచ్చారు. మా హోం గ్రౌండ్ ఇదే అన్నంతలా మాలో జోష్ నింపారు. గెలుపుతో మేము వారి మనసులను సంతృప్తిపరిచాం.ఫైనల్లో మాత్రమే కాదు.. టోర్నీ ఆరంభం నుంచీ మా స్పిన్నర్లు గొప్పగా రాణించారు. దుబాయ్ పిచ్ స్వభావరీత్యా వారిపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ ఒత్తిడికి లోనుకాకుండా పనిపూర్తి చేశారు. వారి నైపుణ్యాలపై నమ్మకంతో మేము తీసుకున్న నిర్ణయాలు సరైనవే అని నిరూపించారు. వారి బలాలను మాకు అనుకూలంగా మలచుకోవడంలో మేము సఫలమయ్యాం.అతడు ఒత్తిడిని చిత్తు చేశాడుఇక.. కేఎల్ రాహుల్(KL Rahul) గురించి చెప్పాలంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడిని దరిచేరనీయడు. అందుకే మేము అతడి సేవలను మిడిల్లో ఎక్కువగా ఉపయోగించుకున్నాం. ఈరోజు తను బ్యాటింగ్ చేస్తున్నపుడు పరిస్థితులు మాకు అంత అనుకూలంగా లేవు. అయినప్పటికీ అతడు ఏమాత్రం తడబడకుండా షాట్ల ఎంపికలో సంయమనం పాటించాడు.తనతో పాటు బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించేలా చక్కటి సహకారం అందిస్తాడు. తను సరికొత్తగా కనిపిస్తున్నాడు. నాణ్యమైన బౌలర్ఇక వరుణ్ టోర్నీ ఆరంభంలో ఆడలేదు. అయితే, న్యూజిలాండ్‌తో లీగ్ మ్యాచ్‌లో ఐదు వికెట్లతో మెరిసిన తర్వాత అతడి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని మేము నిర్ణయించుకున్నాం. అతడొక నాణ్యమైన బౌలర్. ట్రోఫీ గెలవడంలో ప్రతి ఒక్క సభ్యుడు తమ వంతు పాత్ర పోషించారు’’ అని జట్టు ప్రదర్శన పట్ల రోహిత్ శర్మ సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. డారిల్ మిచెల్(63), మైకేల్ బ్రాస్‌వెల్(53 నాటౌట్) అర్ధ శతకాలతో రాణించారు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. షమీ, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు.ఇక లక్ష్య ఛేదనలో భారత్‌కు ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్(31) శుభారంభం అందించారు. విరాట్ కోహ్లి(1) విఫలం కాగా.. శ్రేయస్ అయ్యర్(48)తో కలిసి రోహిత్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. 76 పరుగుల వద్ద రోహిత్ స్టంపౌట్ కాగా.. అక్షర్ పటేల్(29), కేఎల్ రాహుల్(33 బంతుల్లో 34 నాటౌట్), హార్దిక్ పాండ్యా(18 బంతుల్లో 18), రవీంద్ర జడేజా(6 బంతుల్లో 9) వేగంగా ఆడి మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
బిజినెస్

సన్‌స్క్రీన్ టెస్టర్ - స్మార్ట్ వాటర్ బాటిల్
వేసవిలో మీ చర్మానికి రక్షణ ఉందా? లేదా? అని ఈ బుల్లి సన్‌స్క్రీన్ టెస్టర్ ద్వారా ఇట్టే తెలుసుకోవచ్చు. చిన్న పెన్‌డ్రైవ్‌లా కనిపించే ఈ పరికరం, నిజానికి ఒక ప్రత్యేకమైన కెమెరా.వేసవిలో ఒళ్లంతా చెమటలు పట్టిన తర్వాత, ఈత కొట్టినప్పుడు, రుమాలుతో ముఖం తుడుచుకున్నప్పుడు, రాసుకున్న క్రీమ్స్ చర్మంపై అక్కడక్కడ మిస్ అవుతుంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న కెమెరాలో నుంచి చూసినట్లయితే, సన్‌స్క్రీన్ క్రీమ్ రక్షణ తొలగిపోయిన ప్రదేశాలను డార్క్‌గా చూపిస్తుంది. ఇది పూర్తిగా వాటర్ ప్రూఫ్, అల్ట్రా పోర్టబుల్. దీని ధర రూ.10,311 మాత్రమే!స్మార్ట్ వాటర్ బాటిల్వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండటం తప్పనిసరి. పని ఒత్తిడిలో పడి చాలామంది తరచుగా నీళ్లు తాగటం మరచిపోతుంటారు. ఈ స్మార్ట్ వాటర్ బాటిల్‌తో మీరు హైడ్రేటెడ్‌గా ఉండొచ్చు.ఈ బాటిల్ మీరు నీటిని తీసుకోవడాన్ని ట్రాక్ చేస్తుంది. అంతే కాకుండా, అవసరమైనప్పుడల్లా మిమ్మల్ని చల్లబరచడానికి మంచి కూలింగ్ వాటర్‌ను అందిస్తుంది. అలాగే వ్యాయామాలు, హైకింగ్లు, బీచ్ డేస్‌కి తీసుకెళ్లడానికి ఈ వాటర్ బాటిల్ చాలా అనువుగా ఉంటుంది. ఇలాంటి బాటిల్స్ మార్కెట్లో చాలానే దొరుకుతున్నాయి. రివ్యూలను చూసి తీసుకోవటం మంచిది.

అందరికీ గూగుల్ జాబే కావాలి.. ఎందుకో వీడియో చూసేయండి
దిగ్గజ టెక్ కంపెనీ 'గూగుల్'లో జాబ్ తెచ్చుకోవాలని చాలామంది కలలు కంటారు. దీనికి కారణం ఎక్కువ వేతనాలు, ఆఫీసులోనే లగ్జరీ సదుపాయాలు. ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన ఒక వీడియోలో గూగుల్ ఆఫీస్ ఎలా ఉంటుందో చూడవచ్చు.శివ్జీ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ తన ఖాతాలో గూగుల్ ఆఫీస్ వీడియో షేర్ చేశారు. ఇది గురుగ్రామ్‌లోని గూగుల్ ఆఫీస్ అని తెలుస్తోంది. అద్భుతమైన డోర్స్, హాల్, కావలసినన్ని స్నాక్స్, డ్రింక్స్ వంటివన్నీ ఆఫీసులోనే ఉండటం చూడవచ్చు. మైక్రో కిచెన్, పూల్ టేబుల్ ఉన్న గేమ్స్ రూమ్, ఒక స్నాప్ రూమ్, మసాజ్ కుర్చీలతో కూడిన రూమ్ కూడా వీడియోలో కనిపిస్తాయి. వీడియో షేర్ చేస్తూ.. గూగుల్‌లో మరో అలసిపోయే రోజు! అని క్యాప్షన్ ఇచ్చింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎంతోమంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 4,72,786 లైక్స్ పొందిన ఈ వీడియోను 12.3 మిలియన్ల మంది వీక్షించారు. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఎప్పుడూ ఎంటర్టైన్మెంట్ మాత్రమేనా.. పనిచేసేది ఏమైనా ఉందా? అని ఒకరు కామెంట్ చేశారు. ఇన్ని సౌకర్యాలను ఉపయోగించుకుంటూ పని చేస్తున్నారు కదా.. మీకు జీతం ఎంత ఇస్తారు అని మరొకరు కామెంట్ చేశారు. నాకు విశ్రాంతి తీసుకునే గది చాలాబాగా నచ్చిందని ఇంకొకరు కామెంట్ చేశారు.ఇదీ చదవండి: బనస్కాంత నుంచి బోర్డ్‌రూమ్ వరకు: అదానీ పోస్ట్ వైరల్గూగుల్ కంపెనీ.. తమ ఉద్యోగులకు ఆఫీసులోనే చాలా సౌకర్యాలను అందిస్తుంది. దీనికోసం కార్యాలయాలను ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. ఆఫీసులోనే ఫిట్నెస్ కేంద్రాలు, ఆన్ సైట్ చైల్డ్‌కేర్, గేమ్ రూమ్‌లు, వినోద ప్రదేశాలు, విశ్రాంతి ప్రాంతాలు ఉన్నాయి. ఇటీవల గూగుల్ కంపెనీ బెంగళూరులో అత్యాధునిక సదుపాయాలతో.. ఓ ఆఫీస్ ప్రారంభించింది. View this post on Instagram A post shared by Shivangi Gupta | Content creator 🌶️ (@shivjeee)

కొత్త రకం ఫ్యాన్లు: వీటి గురించి తెలుసా?
వేసవిలో చాలామంది ఉపయోగించే క్యాప్స్ కూడా స్మార్ట్‌గా మారాయి. ఈ క్యాప్స్‌కు అటాచబుల్ మిని ఫ్యాన్ వస్తుంది. ముఖానికి కప్పుకొనే చోట ఈ ఫ్యాన్ ఉంటుంది. దీనికి సోలార్ ప్యానెల్స్ సహాయంతో పవర్ సరఫరా అవుతుంది. క్యాప్ ఎండకు ఎక్స్పోజ్ కాగానే ఆటోమేటిక్‌గా ఈ ఫ్యాన్స్ పనిచేస్తాయి. వీటిల్లో కొన్ని చార్జబుల్ స్టయిల్ మోడల్స్‌లోనూ లభిస్తున్నాయి. కంపెనీల్లో క్వాలిటీ బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు. రివ్యూలను పరిశీలించి, కొనుగోలు చేసుకోవచ్చు.చేతిలోనే ఫ్యాన్స్విసనకర్రలను ఎక్కడికైనా తేలికగా తీసుకుపోగలిగినట్లే, ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. స్మార్ట్‌ఫోన్, పవర్ బ్యాంకు మాదిరిగానే ఈ మినీ ఫ్యాన్స్‌ను కూడా పాకెట్లో లేదా హ్యాండ్‌బ్యాగులో పెట్టుకోవచ్చు. మండుటెండల్లో ఇవి ఎంతగానో ఉపశమనాన్ని కలిగిస్తాయి. మల్టిపుల్ ఫ్యాన్ స్పీడ్స్కు తోడు రీచార్జబుల్ బ్యాటరీలు వీటిలో ఉంటాయి. వీటిలో కొన్ని యూఎస్బీ పవర్ సోర్స్‌కు కనెక్ట్ చేసుకుని కూడా వాడుకోవచ్చు. ఇలాంటి మినీ ఫ్యాన్స్‌లోనూ వివిధ రకాలు, స్టయిల్స్ ఉంటాయి. కొనుగోలు చేసే ముందు కాస్త నాణ్యత ప్రమాణాలను పరిశీలించడం మంచిది.

భారత్‌లో ఖరీదైన స్కూటర్ లాంచ్: రేటు ఎంతంటే?
బీఎండబ్ల్యూ మోటొరాడ్ (BMW Motorrad) ఇండియన్ మార్కెట్లో.. 'సీ 400 జీటీ' స్కూటర్ లేటెస్ట్ వెర్షన్ లాంచ్ చేసింది. రూ. 11.50 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభించే ఈ స్కూటర్, దాని మునుపటి మోడల్ కంటే అప్డేట్స్ పొందుతుంది. కాబట్టి దీని ధర స్టాండర్డ్ మోడల్ కంటే రూ. 25000 ఎక్కువ. దీంతో ఇండియన్ మార్కెట్లో లభిస్తున్న స్కూటర్లలో ఇది ఒకటిగా చేరింది.బీఎండబ్ల్యూ సీ 400 జీటీ స్కూటర్.. సాధారణ ప్రయాణానికి మాత్రమే కాకుండా, దూర ప్రయాణాలకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందులోని 350 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 7500 rpm వద్ద 34 Bhp పవర్, 5750 rpm వద్ద 35 Nm టార్క్ అందిస్తుంది. ఈ స్కూటర్ లీన్-సెన్సిటివ్ బ్రేకింగ్ అసిస్ట్, డైనమిక్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్‌తో కూడిన ఏబీఎస్ వంటి రైడర్ అసిస్ట్ ఫీచర్లను పొందుతుంది.సీ 400 జీటీ స్కూటర్.. పెద్ద విండ్‌షీల్డ్ పొందుతుంది. ఇది బ్లాక్‌స్టార్మ్ మెటాలిక్, డైమండ్ వైట్ మెటాలిక్ పెయింట్ స్కీమ్‌లలో లభిస్తుంది. ఇందులో 10.25 ఇంచెస్ TFT డిస్ప్లే ఉంది. ఇది హై రిజల్యూషన్ ఇంటర్ఫేస్తో నావిగేషన్, మీడియా అండ్ స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ వంటి వాటిని మెరుగుపరుస్తుంది. అండర్ సీట్ కంపార్ట్మెంట్ 37.6 లీటర్లు. కాబట్టి ఇది అన్ని విధాలా రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.
ఫ్యామిలీ

'యుద్ధాన్ని తలపించే పండుగ'..! కానీ అక్కడ అడుగుపెట్టారో..
శరవేగంగా పరుగులు తీసే గుర్రాలను అధిరోహించి, ఒకరిపై మరొకరు ఈటెలతో కలబడే ఆ దృశ్యాన్ని చూస్తే, అక్కడేదో యుద్ధం జరుగుతోందని ఎవరైనా పొరబడతారు. నిజానికి అది యుద్ధంకాదు, అక్కడి ప్రజలు జరుపుకొనే సంప్రదాయ పర్వదినం. ఇండోనేసియా తూర్పు ప్రాంతంలోని సుంబా దీవిలో జరిగే ఈ పండుగ పేరు ‘పసోలా’. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ పండుగను పంటకాలానికి ప్రారంభ సూచికగా జరుపుకొంటారు.పూర్వీకుల ఆత్మశాంతి కోసం, కుటుంబాల మధ్య అనుబంధాలను బలపరచుకోవడానికి, మూలాలను కాపాడుకోవడానికి ఈ పండుగ ఒక మార్గమని స్థానికులు చెబుతారు. ఈ పండుగలో ముఖ్యమైన ఘట్టం ఈటెల పోటీ. సత్తా ఉన్నవారంతా బరిలోకి దిగి, గుర్రాల మీద స్వారీ చేస్తూ, ప్రత్యర్థులతో కలబడతారు. ఎదురుగా దూసుకొచ్చే ఈటెలను తప్పుకోవడం ఒక ఎత్తయితే, గురిచూసి ఎదుటివారిని దెబ్బతీయడం మరో ఎత్తు. యుద్ధాన్ని తలపించే ఈ పోటీల్లో చాలామందికి గాయాలవుతుంటాయి.పసోలా అనే పదానికి సుంబా స్థానిక భాషల్లో ‘ఈటె విసరడం’ అని అర్థం. ఈ పోటీల్లో వినియోగించే ఈటెలను ‘హోలా’ అని పిలుస్తారు. ఈ పండుగ వెనుక పురాతన చరిత్ర ఉంది. స్థానిక పురాణాల ప్రకారం, పసోలా పండుగ ఆకాశంలో ఒకరితో ఒకరు పోరాడిన రెండు శక్తిమంతమైన ఆత్మల కథ నుంచి మొదలైందట! ఆ ఆత్మల సంఘర్షణ ఫలితంగా భూమిపై ఈటెల వర్షం కురిసిందట!. ఈ పౌరాణిక గాథ ప్రేరణతోనే ఈ పండుగ ప్రారంభమైంది. ఈ వేడుక కోసం గుర్రాలను పెంచడాన్ని గౌరవంగా, హోదాచిహ్నంగా భావిస్తుంటారు. పనికట్టుకుని ఈ పోటీలో పాల్గొనే పోటీదారులు తమ గుర్రాలను తామే పెంచుకుని, రోజుల తరబడి సాధన చేసి మరీ బరిలోకి దిగుతుంటారు. ఈ పోటీని చూడటానికి పెద్దసంఖ్యలో పర్యటకులు కూడా పోటెత్తుతారు. అడుగుపెడితే శిలైపోతారుభూమిపై ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఉత్తర టాంజానియాలో ఉండే నాట్రాన్ సరస్సు ఒకటి. ఇందులోని నీరు నెత్తుటిలా ఎర్రగా ఉంటుంది. సరస్సంతా నెత్తుటి మడుగులా కనిపిస్తుంది. ఈ సరస్సును దయ్యాలు సృష్టించాయని, ఆ సరస్సులోకి మనుషులు గాని, జంతువులు గాని దిగితే, రాళ్లుగా మారిపోతారని స్థానికులు చెబుతుంటారు. అందుకే, సూర్యాస్తమయం తర్వాత ఎవరూ అక్కడ తిరగడానికి సాహసించరు. శాస్త్రవేత్తలు ఈ సరస్సును పరిశీలించి, ఈ సరస్సు నీటిలో సోడియం కార్బొనేట్, నైట్రో కార్బొనేట్ ఎక్కువగా ఉండటంతో, ఇందులోని నీరు ప్రాణాంతకంగా మారిందని తేల్చారు. ఈ సరస్సులోకి మనుషులు సహా ప్రాణులేవైనా వెళ్తే, ఇలా రాళ్లలా గడ్డకట్టిపోవడానికి గల కారణాలను మాత్రం శాస్త్రవేత్తలు ఇంకా కనిపెట్టలేకపోయారు. (చదవండి: గిన్నిస్‌కెక్కిన మహిళల వేడుక..!)

గిన్నిస్‌కెక్కిన మహిళల వేడుక..!
అందరూ మహిళలే జరుపుకొనే వేడుక ఇది. అత్యధిక సంఖ్యలో మహిళలు ఒకేచోట చేరి జరుపుకొనే కార్యక్రమంగా గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన అరుదైన వేడుక ఇది. ఈ వేడుకలో పాల్గొనడానికి పురుషులకు అనుమతి ఉండదు. తరతరాలుగా సాగుతున్న ఈ వేడుక కేరళ రాజధాని తిరువనంతపురం చేరువలోని అట్టుకల్ గ్రామంలో వెలసిన భగవతి అమ్మవారి ఆలయంలో జరుగుతుంది. ఏటా పదకొండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో లక్షలాది మంది మహిళలు పాల్గొంటారు.తిరువనంతపురం జిల్లా అట్టుకల్ గ్రామంలోని భగవతి అమ్మవారి ఆలయం చాలా పురాతనమైనది. అట్టుకల్ గ్రామంలో వెలసినందున ఈ అమ్మవారు ‘అట్టుకల్ భగవతి’గా ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాది మార్చి 5 నుంచి 15 వరకు ఈ ఆలయంలో అట్టుకల్ భగవతి అమ్మవారి వేడుకలు జరుగుతున్నాయి. వేడుకల తొమ్మిదో రోజున లక్షలాది మంది మహిళలు ఇక్కడకు చేరుకుని, అమ్మవారికి పొంగలి నైవేద్యం సమర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని ‘అట్టుకల్ పొంగల్’ వేడుకగా పిలుస్తారు. తొమ్మిదో రోజున తిరువనంతపురం నగరంలోని అన్ని రహదారులూ అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయానికి వెళ్లే మహిళలతో కిటకిటలాడుతూ కనిపిస్తాయి. ఈ వేడుకల్లో పాల్గొనడానికి కేరళ నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన మలయాళీ మహిళలు పెద్దసంఖ్యలో ఇక్కడకు చేరుకుంటారు.ఇక్కడకు వచ్చే మహిళలు ఆలయ ప్రాంగణంలోను, ఆలయ పరిసరాల్లోని వీథుల్లోను ఇటుకలతో కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుని, వాటి మీద పొంగలి, చక్కెరపొంగలి వండుతారు. ఆలయ ప్రధాన అర్చకుడు నిర్ణయించిన ముహూర్తానికి అందరూ ఒకేసారి పొయ్యిలు వెలిగించి వంట మొదలుపెడతారు. ముహూర్త సమయం ఆసన్నం కాగానే, అర్చకుడు గంట మోగిస్తాడు. అయితే, మహిళలు పొంగలి వండుతున్న ప్రదేశంలోకి ఆలయ అర్చకులు కూడా అడుగు పెట్టరు. ఈ వేడుకలో భాగంగా మహిళలందరూ తిరువనంతపురంలోని మనకాడు ప్రాంతంలో ఉండే శ్రీధర్మ శాస్త ఆలయం వరకు భారీ ఊరేగింపు జరుపుతారు. మొదటి రోజున ‘కప్పుకెట్టు’ కార్యక్రమంతో ఈ వేడుక మొదలవుతుంది. ఇందులో భాగంగా ‘కణ్ణగి చరిత’ను గానం చేస్తారు. ‘కణ్ణగి చరిత’గానం వరుసగా తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. చివరి రోజున ‘కురుత్తి తర్పణం’ పేరుతో తర్పణాలు విడిచిపెట్టడంతో ఈ వేడుకలు ముగుస్తాయి. వేడుక కొనసాగినన్ని రోజులూ అట్టుకల్ భగవతి అమ్మవారి ఆలయానికి చేరుకునే వీథులన్నీ రంగురంగుల అలంకరణలతో కనువిందు చేస్తాయి. ఈ వేడుకల సందర్భంగా వీథుల్లో ఏర్పాటు చేసే బహిరంగ వేదికలపై సంప్రదాయ నృత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. అట్టుకల్ పొంగల్ వేడుకలలో 1997 సంవత్సరంలో 15 లక్షల మందికి పైగా మహిళలు పాల్గొనడంతో తొలిసారి గిన్నిస్‌బుక్ రికార్డుల్లో నమోదైంది. ఆ తర్వాత 2009లో 25 లక్షలకు పైగా మహిళలు పాల్గొనడంతో మరోసారి గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కింది. ఈ వేడుక ప్రశాంతంగా జరగడానికి వీలుగా కేరళ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తుంది.(చదవండి: అంచనాలు నెరవేరకపోయినా..బంధం స్ట్రాంగ్‌గానే ఉండాలి..!)

అంచనాలు నెరవేరకపోయినా..బంధం స్ట్రాంగ్‌గానే ఉండాలి..!
అనిత, అరవింద్ ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. యూనివర్సిటీ లెక్చరర్ అవ్వాలని అరవింద్ కలలు కన్నాడు. అదే లక్ష్యంగా చదువుతూ, అనితకు కూడా తన భవిష్యత్తుపై అదే ఆశను కల్పించాడు. కానీ పెళ్లయిన రెండేళ్ల తర్వాత, అరవింద్ తన ఆలోచన మార్చుకున్నాడు. అకడమిక్ కెరీర్ కంటే తనకు వ్యాపారం సరిపోతుందని భావించి, స్నేహితుడితో కలిసి టీవీ షోరూం ప్రారంభించాడు. అనితకు ఇది పెద్ద షాక్.అనిత ఎప్పుడూ ‘యూనివర్సిటీ ప్రొఫెసర్ భార్య’ అని తనను ఊహించుకుంది. కానీ అరవింద్ వ్యాపారం ప్రారంభించడం ఆమె అంచనాలను తారుమారు చేసింది. దాన్ని ఆమె భరించలేకపోయేది. ‘‘నువ్వు లెక్చరర్ అవుతావని నిన్ను పెళ్లి చేసుకున్నా!’’అంటూ తరచు విమర్శించేది. దానికితోడు వ్యాపారంలో అరవింద్‌కు నష్టం వచ్చింది. దాంతో అనిత విమర్శల జోరు పెరిగింది. ‘‘ఈ మాత్రం దాని కోసమేనా లెక్చరర్ ఉద్యోగం వద్దనుకుంది’’ అని దెప్పి పొడిచేది. కష్టాల్లో అండగా ఉండాల్సిన భాగస్వామి అలా మాట్లాడటం అరవింద్ మనసును తీవ్రంగా గాయపరిచింది. తనను తాను నిరూపించుకోవాలని అరవింద్ కసిగా పనిచేశాడు. వ్యాపారం పట్టాలెక్కింది. పట్టణంలో ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తన వ్యాపారం పట్ల అరవింద్ ఎంత సంతోషంగా ఉన్నా, అనిత మాత్రం అతని మార్పును అంగీకరించలేదు. తన కలలను నాశనం చేశాడనే బాధ ఆమె మనసును దాటడంలేదు. దాంతో సూటిపోటి మాటలు అంటూనే ఉంది. దీంతో వారి మధ్య మాటలు తగ్గాయి. ఒకరి ఆనందాన్ని మరొకరు పంచుకోవడం మానేశారు. చివరకు ఒకరినొకరు ఇష్టపడటం కూడా మానేశారు. ఒకే ఇంట్లో ఉంటున్న ఇద్దరు అపరిచితులుగా మారిపోయారు.అంచనాలు నెరవేరకపోతే!?‘నా కలలు తుడిచిపెట్టుకుపోయాయి’ అనే భావనతో నిరాశ పెరుగుతుంది.‘నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు’ అంటూ విమర్శ తారస్థాయికి చేరుతుంది.‘ఇప్పటికైనా మారవచ్చు కదా’ అనే ఒత్తిడి పెరుగుతుంది. ‘ఇతను నా జీవితానికి సరైన వ్యక్తి కాదు’ అంటూ ప్రేమ తగ్గిపోతుంది ‘ఇదే కొనసాగితే విడిపోవడమే సరైన మార్గమేమో’ అనే ఆలోచన బలపడుతుంది.అసలైన సమస్య ఏమిటి?‘పెళ్లికి ముందు మాయ మాటలు చెప్పి నన్ను మోసం చేశాడు’ అని అనిత భావించడం.‘నా నిర్ణయాన్ని, నా కెరీర్ మార్పును భార్య అర్థం చేసుకోవడం లేదు!’ అని అరవింద్ భావించడం.నిజానికి ఇద్దరూ బాధితులే కాని, ఇద్దరూ ఒకరినొకరు బాధ్యుల్ని చేయడం.భాగస్వామి మారుతున్నప్పుడు మనం కూడా మారాలనే దృక్పథం లేకపోవడం.ఒకరి మార్పును మరొకరు అంగీకరించకపోవడం.ఆర్థిక భద్రత, భవిష్యత్తు పట్ల భయం సంబంధాన్ని దెబ్బతీసేలా మారడం. బంధాన్ని ఎలా కాపాడుకోవాలి? ‘నా దృష్టికోణం మాత్రమే నిజం’ అనే ఆలోచన వదలాలి. ‘అతను నన్ను మోసం చేశాడు’ అనే ఆలోచన పక్కనపెట్టి ‘అతనికి సంతోషం ఇచ్చే మార్గం మారిపోయింది. నేను దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు?’ అని ఆలోచించాలి.ఆశలకు, వాస్తవానికి మధ్య తేడా ఎక్కడుందో గుర్తించాలి. భర్త లెక్చరర్ అవ్వాలి, జీతం స్థిరంగా ఉండాలనేది అనిత ఆశ. భద్రత కంటే ఆనందం అరవింద్‌కు ముఖ్యం. ఈ తేడాను అంగీకరించకపోతే, సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది!‘వ్యాపారంలో నష్టం వస్తే మన భవిష్యత్తు ఏమిటి?’ అనే భయాన్ని ‘మన ఇద్దరి భద్రత కోసం మనం కలిసి ప్లాన్ చేసుకోవచ్చు’ అని ప్రేమగా మార్చాలి.అరవింద్ అనితను ప్రేమించడంలేదని కాదు, అతను తన కలలను మార్చుకున్నాడు, కాని, అనిత తన ఊహల్లోనే ఉంది. కలిసుండాలంటే, ఒకరి కలలను మరొకరు అర్థం చేసుకోవాలి.అరవింద్ మారిన మార్గాన్ని అనిత అర్థం చేసుకోవాలి. భద్రత పట్ల ఉన్న అనిత భయాన్ని అర్థం చేసుకోవాలి. ఇద్దరూ సంపాదన, భద్రత, భవిష్యత్తు గురించి కలిసి చర్చించుకోవాలి.పెళ్లంటే ఒకరినొకరు మార్చడం కాదు, ఒకరి కోసం ఒకరు మారడమని, ఇద్దరూ కలిసి ప్రయాణం చేయడమని అర్థం చేసుకోవాలి. సంబంధాల్లో ప్రధానమైనది భాగస్వాముల ఆనందం. ఆర్థిక భద్రత అవసరమే కాని, అది మాత్రమే ప్రేమను నిర్వచించలేదు. పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచనలను సర్దుబాటు చేసుకోగలగాలిసైకాలజిస్ట్ విశేష్ www.psyvisesh.com(చదవండి: హీరోయిన్ నయనతారలాంటి స్టన్నింగ్ లుక్ కోసం..!)

భారతీయుల ఖర్చు మాములుగా లేదు..!
భారత్ ఖర్చు చేస్తోంది. షాపింగ్ ద్వారా సంతోషాన్ని కొని తెచ్చుకునేవారు కొందరైతే, ఇతరులకు పోటీగా హోదా ప్రదర్శించేవారు మరికొందరు. మారుమూల పల్లెలకూ ఇంటర్నెట్ చేరువ కావడం; చౌకగా డేటా లభించడం; విరివిగా స్మార్ట్ఫోన్ల వాడకం; ఈ–కామర్స్ దూకుడు; స్వదేశీ, విదేశీ బ్రాండ్ల మార్కెటింగ్ వ్యూహాలు; ఊరిస్తున్న ఫ్యాషన్ ప్రపంచం; ఊదరగొట్టే కంపెనీల ప్రకటనలు; సానుకూల మార్కెట్ వాతావరణం.. కారణం ఏదైతేనేం ప్రజల ఆదాయాల్లో వృద్ధి, మారుతున్న జీవన శైలి, పెరుగుతున్న ఆకాంక్షలు జనాలను ఖర్చుల వైపు నడిపిస్తున్నాయి. బ్యాంకింగ్, ఫిన్‌టెక్ కంపెనీలు టెక్నాలజీని ఆసరాగా చేసుకుని ప్రజలకు రుణాలను వేగంగా, విరివిగా అందించడమూ ఖర్చులకు ఆజ్యం పోస్తోంది. దినసరి కూలీలు, వేతన జీవులు, వ్యాపారస్తులు– ఉపాధిమార్గం ఏదైనా, ఆదాయం ఎంత ఉన్నా, డబ్బు ఖర్చుకు వెనుకాడడం లేదు. భారతీయులు తమ మొత్తం ఆదాయంలో అనవసర ఖర్చులకే 29 శాతం వెచ్చిస్తున్నారట! రూ.40 వేల కంటే అధిక ఆదాయం ఉన్న వ్యక్తులైతే అవసరాలను మించి అనవసర వ్యయాలు చేస్తున్నారంటే ప్రజలు హంగు, ఆర్భాటాలకు ఎంతలా ప్రాధాన్యమిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. మరీ విడ్డూరమేమిటంటే, రూ.20 వేలలోపు ఆదాయం ఉన్న అల్పాదాయ వర్గాల వారిలో ఆన్లైన్ గేమింగ్‌కు ఖర్చు చేస్తున్న వారి శాతం అత్యధికంగా 22% ఉంది. జనం ఎంతగా వెచ్చిస్తున్నారంటే, తాము చేసిన పెట్టుబడుల గడువు తీరక ముందే వాటిని ఉపసంహరించుకుని మరీ ఖర్చు చేస్తున్నారు.బలమైన వృద్ధి, పెరుగుతున్న మధ్య, అధిక–ఆదాయ తరగతి, డిజిటల్ మౌలిక సదుపాయాలు, వెరసి పెట్టుబడి, వినియోగదారుల కార్యకలాపాలకు ప్రపంచ హాట్‌స్పాట్‌గా భారత్ ఉద్భవించింది. భారత మార్కెట్లోకి భారీగా మూలధనం వెల్లువెత్తుతోంది. ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక సేవల రంగంలో పెరుగుతున్న డిజిటలైజేషన్ తిరుగులేని ప్రభావాన్ని చూపుతోంది. పెరుగుతున్న మధ్యతరగతి, ఆదాయాల్లో వృద్ధి, విస్తరిస్తున్న గ్రామీణ మార్కెట్లు, మెరుగైన డిజిటల్ అనుసంధానత, జనాభాలో పెరుగుతున్న ఆకాంక్షల ఫలితంగా 2027 నాటికి భారత్ రెండు మెట్లు ఎక్కి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌గా అవతరిస్తుందని పలు నివేదికలు చెబుతున్నాయి. దేశంలో వినియోగదారుల మార్కెట్ పరివర్తన దిశగా పయనిస్తోంది. వినియోగదారుల ప్రవర్తనలో శరవేగంగా మార్పులొస్తున్నాయి. వస్తువులు, సేవలకు డిమాండ్ పెరుగుతోంది.ఈ డైనమిక్ మార్కెట్లో భాగస్వామ్యం కోసం ఉవ్విళ్లూరుతున్న ఆర్థిక సంస్థలు, విధాన రూపకర్తలు, వ్యాపారులకు భారతీయులు ఖర్చు పెడుతున్న తీరును అర్థం చేసుకోవడం చాలా అవసరం. ‘భారత్ ఎలా ఖర్చు చేస్తోంది: వినియోగదారుల వ్యయాల తీరుతెన్నులపై లోతైన అధ్యయనం’ పేరుతో కన్సల్టింగ్, ఫైనాన్షియల్ అడ్వైజరీ సేవల్లో ఉన్న పీడబ్ల్యూసీ ఇండియా సహకారంతో ఫిన్‌టెక్ సాఫ్ట్వేర్ కంపెనీ పర్ఫియోస్ నివేదికను రూపొందించింది. 30 లక్షల మంది టెక్–ఫస్ట్ భారతీయ వినియోగదారుల లావాదేవీల సమాచారాన్ని విశ్లేషించి, వారు చేసే ఖర్చులను లోతుగా పరిశీలించింది. ఈ అధ్యయనం వివిధ ఆదాయ స్థాయులు, ప్రదేశాలలోని వ్యక్తుల ఖర్చు అలవాట్ల గురించి తెలియజేస్తుంది. భారతీయ వినియోగ, వ్యయ ధోరణులలోని మార్పులకు ఈ నివేదిక అద్దం పడుతుంది. ప్రజలు తప్పనిసరి ఖర్చులకు అత్యధిక మొత్తంలో డబ్బు కేటాయిస్తున్నారు. ఇది వారి మొత్తం వ్యయంలో 39 శాతం ఉంటోంది. అవసరాలకు 32 శాతం, హంగులు, ఆర్భాటాలు వంటి అనవసర ఖర్చులకు 29 శాతం వెచ్చిస్తున్నారు.అన్ని నగరాల్లోనూ వ్యక్తులు తమ ఆదాయంలో 33 శాతానికి పైగా నెల వాయిదాల (ఈఎంఐ) చెల్లింపులకు కేటాయిస్తున్నారు.అనవసర ఖర్చుల్లో 62 శాతం కంటే ఎక్కువ జీవనశైలి కొనుగోళ్లకు సంబంధించివే! అంటే ఫ్యాషన్, వ్యక్తిగత సంరక్షణ వస్తువుల షాపింగ్‌కు ఖర్చు చేస్తున్నారు.నెలకు రూ.20 వేల లోపు ఆదాయం ఉన్న ఎంట్రీ–లెవల్ సంపాదనపరుల్లో ఆన్లైన్ గేమింగ్‌కు ఖర్చు చేస్తున్న వ్యక్తుల సంఖ్య అత్యధికంగా 22 శాతం ఉంది.టైర్–1 నగరాల కంటే టైర్–2 నగరాల్లో ఇంటి అద్దెకు సగటున 4.5 శాతం ఎక్కువ ఖర్చు అవుతోంది. టైర్–2 నగరాల్లో నివసించే ప్రజలు వైద్య ఖర్చులకు సగటున రూ.2,450 వెచ్చిస్తున్నారు. మెట్రోలలో ప్రజలు నెలకు సగటున వైద్య ఖర్చులకు రూ.2,048 వెచ్చిస్తున్నారు.తప్పనిసరి ఖర్చులకు, అవసరాలు, అనవసర ఖర్చుల చెల్లింపులకు యూపీఐని ఎక్కువగా వినియోగిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న వినియోగదారుల దేశంగా భారత్ ఆకర్షిస్తోంది. 2023లో జీడీపీలో ప్రైవేట్ వినియోగం (వస్తు సేవలకు జనం చేసిన ఖర్చు) వాటా 60% నమోదు కావడం ఇందుకు నిదర్శనం. 2031 నాటికి ఏటా 13.4 శాతం వార్షిక సగటు వృద్ధితో దేశ వినియోగ ఆర్థిక వ్యవస్థ రూ.426.4 లక్షల కోట్లను తాకనుందని అంచనాలు ఉన్నాయి. పెరుగుతున్న మధ్యతరగతి, వస్తు సేవల వినియోగం, పట్టణీకరణ, పెరుగుతున్న ఆకాంక్షలు, యువజన జనాభా ఈ వృద్ధిని ముందుకు నడిపిస్తున్నాయి. వేతన జీవుల సంఖ్యలో 2019 నుంచి ఏటా సగటున 9.1 శాతం వృద్ధి నమోదవుతోంది. ఆదాయాల్లో స్థిర వృద్ధి గృహ వినియోగం పెరగడానికి, వస్తు సేవల గిరాకీకి కారణమవుతోంది. అయితే, భారతీయ కుటుంబాలు బ్యాంక్ డిపాజిట్లు, స్టాక్స్, బాండ్స్, లోన్ల వంటి తమ ఆర్థిక ఆస్తులలో క్షీణతను ఎదుర్కొంటున్న సమయంలో ఈ ధోరణి నెలకొనడం గమనార్హం. దేశ జీడీపీలో ఫైనాన్షియల్ అసెట్స్ వాటా 2022లో 7.2 శాతం నుంచి 2023లో 5.1 శాతానికి పడిపోయింది. గత యాభయ్యేళ్లలో ఇదే అత్యల్పస్థాయి అని ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2024 నాటికి పర్సనల్ లోన్స్ 13.7 శాతం వార్షిక వృద్ధితో ఏకంగా రూ.55.3 లక్షల కోట్లకు చేరుకున్నాయంటే జనం ఏ స్థాయిలో ఖర్చు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.డిజిటల్ అక్షరాస్యతవిభిన్న ఫీచర్లతో ఆకట్టుకుంటున్న స్మార్ట్ఫోన్లు, సామాన్యులకు చేరువైన టెలికం సేవలు 82 కోట్ల మంది భారతీయులకు ఇంటర్నెట్ను చేర్చింది. వాస్తవ వినియోగంలో ఉన్న స్మార్ట్ఫోన్ల వాటా మొత్తం జనాభాలో 72% మించిపోయింది. దేశంలో డిజిటల్ అక్షరాస్యత 38 శాతం ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఇది 61 శాతం ఉంది. వెబ్, మొబైల్ అప్లికేషన్లతో సేవలను అందించడం ద్వారా ఆర్థిక సేవల రంగం ఈ ధోరణిని ఉపయోగించుకుంటోంది. ఈ అంశమే వ్యక్తిగత రుణాల పెరుగుదలకు ఆజ్యం పోస్తోంది.ఆదాయాల జోరుదేశవ్యాప్తంగా 2019–24 మధ్య వ్యక్తుల వేతనాలు ఏడాదికి 9.1 శాతం కంటే ఎక్కువ రేటుతో పెరిగింది. వ్యక్తుల ఆదాయంలో ఈ పెరుగుదల వినియోగదారుల వ్యయాల తీరును నిర్ణయించే కీలక అంశాలలో ఒకటి. భారతీయుల తలసరి ఖర్చు చేయదగ్గ ఆదాయం 13.3 శాతం వృద్ధి రేటుతో 2023–24లో రూ.2.14 లక్షలకు పెరిగింది. 2023–24లో స్థూల పొదుపు 30 శాతం తగ్గింది. పొదుపులో తగ్గుదల పెరిగిన వ్యయాలను సూచిస్తుంది. ఉపాధి, ఉద్యోగ భద్రత2017–19 నుంచి 2022–23 మధ్య ఉపాధి రేటు 46.8 శాతం నుంచి 56 శాతానికి పెరిగింది. నిరుద్యోగ రేటు 6 శాతం నుంచి 3.2 శాతానికి తగ్గింది. పెరిగిన ఉపాధి రేటు వ్యక్తుల వినియోగ వ్యయం పెరగడానికి దోహదపడుతోంది.భావోద్వేగ వ్యయంసాధారణంగా వినియోగదారులు సంతోషం, ఒత్తిడి, ఆందోళన మొదలైన మానసిక స్థితి ద్వారా ప్రభావితం అవుతున్నారు. ఇది వారి వ్యయ ప్రవర్తనను ప్రభావితం చేస్తోంది. ఉదాహరణకు చాలామంది కస్టమర్లు తమ మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి అంటే తమ సంతోషం కోసం ఇష్టమైన బ్రాండ్లు, నచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేసే రిటైల్ థెరపీలో పాల్గొంటున్నారు.సామాజిక ప్రభావంకుటుంబం, సహచరుల ప్రభావం, సామాజిక స్థితి, జీవనశైలి, సాంస్కృతిక ధోరణులు వంటి అనేక సామాజిక అంశాలు కస్టమర్ల ఖర్చు ప్రవర్తనను నిర్ణయిస్తాయి. ఉదాహరణకు తల్లిదండ్రులు చేస్తున్న ఖర్చులు, ఆదా చేసే విధానం వారి పిల్లల వ్యయ ప్రవర్తనపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అలాగే, తోటివారి ఒత్తిడి యువ వినియోగదారులను వారి సామాజిక స్థితిని కొనసాగించడానికి, మెరుగుపరచడానికి ఖర్చు పెట్టేలా చేస్తోంది. భారతీయ సాంస్కృతిక పద్ధతులు వినియోగదారుల ఖర్చులను ప్రభావితం చేస్తున్నాయి. ఉదాహరణకు 2023 దీపావళి సీజన్లో భారత రిటైల్ మార్కెట్లో రూ.3.75 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి.సాంకేతికతతో వినియోగం దూకుడుటెక్నాలజీ అందుబాటులో ఉండటం, ఈ–కామర్స్ వృద్ధి, ఫిన్ టెక్ పరిష్కారాల పెరుగుదల భారతీయ వినియోగాన్ని దూసుకెళ్లేలా చేస్తున్నాయి. ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల విస్తృతితో ఈ–కామర్స్ వృద్ధి వినియోగదారుల షాపింగ్ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చింది. దేశంలో 2024లో ఈ కామర్స్ ఆధారిత అమ్మకాలు రూ.4,41,700 కోట్లు నమోదయ్యాయి. 2029 నాటికి ఏటా 11.45% వార్షిక వృద్ధితో ఇది రూ.7,59,200 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రభుత్వ విధానాలు, పన్నుల కారణంగా వివిధ ఉత్పత్తుల ధరలు ప్రభావితమవుతున్నాయి. ఆకట్టుకునే ప్రకటనలువినియోగదారుల ఖర్చును వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ప్రభావితం చేయవచ్చు. ఇవి కస్టమర్లను ఆకట్టుకుంటూ, అమ్మకాలను మాత్రమే కాకుండా, బ్రాండ్ విధేయతను కూడా పెంచుతున్నాయి. దేశంలో ప్రకటన ఖర్చులు 2024లో 10.2 శాతం పెరిగి రూ.1,55,386 కోట్లు నమోదయ్యాయి. మార్కెట్ వాటాను పెంచుకోవడానికి, వినియోగదారులను ప్రభావితం చేయడానికి కంపెనీలు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.ఈఎంఐలే తప్పనిసరి..తప్పనిసరి ఖర్చుల్లో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలకు చెల్లించే ఈఎంఐలే సింహభాగం ఉంటున్నాయి. రుణ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులోకి రావడంతో అప్పులు తీసుకోవడంలో వృద్ధి నమోదవుతోంది. ఆర్బీఐ డేటా ప్రకారం మొత్తం క్రెడిట్లో వ్యక్తిగత రుణాల వాటా 2023లో 30.6 శాతం నుంచి 2024 ఫిబ్రవరిలో 32.6 శాతానికి పెరిగింది. 2023 నాటికి మొత్తం రిటైల్ రుణాలలో గృహరుణాల వాటా ఏకంగా 47.2 శాతానికి చేరింది. ఈఎంఐలు 42 శాతానికి పెరిగాయి. మదుపు చేయడమూ తెలుసుఖర్చులే కాదు మదుపు చేయడమూ జనానికి తెలుసు. షేర్స్, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్‌ను నిల్వ చేసుకునే డీమ్యాట్ ఖాతాలు దేశవ్యాప్తంగా 2022 ఆగస్ట్ నాటికి 10 కోట్లు. 2025 జనవరి నాటికి ఈ సంఖ్య 18.8 కోట్లకు చేరిందంటే, పెట్టుబడుల పట్ల జనంలో ఆసక్తిపెరుగుతోందని చెప్పవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలో ఉన్న ఆస్తులు (ఏయూఎం), బీమా, పదవీ విరమణ పొదుపులు 2013 నుంచి 2023 వరకు ఏటా 15% పెరిగాయి. బ్యాంక్ డిపాజిట్లు కూడా అదే కాలానికి 9% వార్షిక సగటు వృద్ధి నమోదు చేశాయి.(చదవండి: అంచనాలు నెరవేరకపోయినా..బంధం స్ట్రాంగ్‌గానే ఉండాలి..!)
ఫొటోలు
International View all

White House: గన్ తో సంచరిస్తున్న వ్యక్తి కాల్చివేత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు నివాసముండే వైట్ హౌస్ కు కూతవే

ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వింత కోరిక.. ట్రంప్ అందుకు ఒప్పుకుంటారా?
వాషింగ్టన్: అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐకు

ఐఎస్ఎస్ కమాండ్ బాధ్యతలు.. రష్యా వ్యోమగామికి అప్పగించిన సునీత
వాషింగ్టన్: కేవలం పది రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కి వెళ్లి అనుకోని పరిస్థితుల్లో 9 నెలలపాట

వీడియో: న్యూయార్క్‌లో కార్చిర్చు మంటలు.. ఎమర్జెన్సీ విధింపు
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్ నగరంలో కార్చిర్చు అంటుక

భారత్ వ్యతిరేక రాతలు.. అమెరికా టెంపుల్ ధ్వంసం
కాలిఫోర్నియా: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడి జరిగింది.
NRI View all

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి.

ఆస్ట్రేలియాలో మహిళలపై లైంగిక దాడి.. భారతీయ ప్రముఖుడికి 40 ఏళ్ల జైలు శిక్ష
సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఐదుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడిన

విశాఖకు ఎన్నారై మహిళ ఎందుకొచ్చింది?.. ఆ రూమ్‌లో ఏం జరిగింది?
విశాఖ సిటీ: విశాఖలో ఖాకీ క్రైమ్ కథా చిత్రం..

లండన్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
బిందువు బిందువు కలిస్తేనే సింధువు అనే విధంగా యూకే లో నివసిస్తున్న తెలుగు మహిళలు అందరూ “తెలుగు లేడీస్ యుకె” అనే ఫేస్బుక్

న్యూజెర్సీలో నాట్స్ ఇమ్మిగ్రేషన్ సెమినార్
న్యూ జెర్సీ: అమెరికాలో తెలుగు వారి కోసం అనేక కార్యక్రమాలు చ
National View all

సీఎం నితీష్‌కు మీరు ఏదో ఆఫర్ చేశారంట కదా?
పాట్నా: ఈ ఏడాది చివర్లో బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక

TG: తుది దశకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక
ఢిల్లీ ; తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటా ఎంఎల్సీ అభ్యర్థుల ఖరారు అంశం తు

ఉప రాష్ట్రపతి జగదీప్ దన్కర్ త్వరగా కోలుకోవాలి: ప్రధాని
న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ దన్కర్ త్వరలో కోల

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు
ఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్(Jagdeep Dhankar) అస

సెలవు లేదన్న హెడ్మాస్టర్.. లెక్కల టీచర్ ఏం చేశారంటే?
భువనేశ్వర్: తీవ్ర అనారోగ్యం పాలైన ఓ ఉపాధ్యాయుడు సెలవు కోసం
క్రైమ్

రన్యారావు కేసు కీలక మలుపు.. ఆమె శరీరంపై గాయాలు
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావు(34) కేసు కీలక మలుపు తిరిగింది. తాజాగా ఆమెపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక నుంచి ఆమె సీబీఐ బోనులోకి వెళ్లాల్సిందే. వారు అడిగే ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరి కావాల్సిందే. మరో రెండు రోజుల్లో ఆమెను సీబీఐ అధికారులు విచారించనున్నారు. రన్యారావును పోలీసులు విచారిస్తున్న క్రమంలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం బంగారం అక్రమ రవాణా మాత్రమే కాకుండా సంఘవిద్రోహ శక్తులతో కూడా ఆమెకు సంబంధాలు ఉన్నట్లు వారు కనుగొన్నారు. సౌదీ అరేబియాతో పాటు అమెరికా, పశ్చిమాసియా, ఐరోపా దేశాలలో కూడా రన్యారావు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కారణంతోనే సీబీఐ రంగంలోకి దిగింది.రన్యారావు నుంచి ఇప్పటికే 14 కిలోల బంగారు బిస్కెట్లు, రూ.2 కోట్ల విలువైన ఆభరణాలు, సుమారు రూ.3 కోట్ల నగదును డీఆర్ఐ అధికారులు జప్తు చేశారు. ఆమె వద్ద మొత్తం రూ. 18 కోట్ల ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన ఫోన్స్‌తో పాటు ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం ఆమె డీఆర్ఐ అధికారుల విచారణలో ఉంది. త్వరలో సీబీఐ అధికారులు కూడా ఆమెను ప్రశ్నించనున్నారు. వారు ఇప్పటికే పలు ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు.రన్యారావును విచారించిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ సంచలన విషయాలను తెలిపింది. ఆమె శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయని తెలిపింది. అయితే, దుబాయ్‌కి వెళ్లక ముందే తనకు ఈ గాయాలు అయినట్లు ఆమె తెలియజేసిందని అధికారులు చెప్పారు. దీంతో ఆమెకు అవసరం అయితే వైద్య సాయం అందించాలని జైలు అధికారులను కోర్టు సూచించింది. రన్యారావు విచారణలో భాగంగా తమకు సహకరించడం లేదని డీఆర్ఐ అధికారులు కోర్టుకు తెలిపారు.

బ్యాంకింగ్ సంస్థల పేరిట బురిడీ!
సాక్షి, అమరావతి: బ్రాండింగ్ ముసుగులో సైబర్ నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల పేర్లతోనే అత్యధికంగా నిధులు కొల్లగొడుతున్నారు. రిటైల్, టెక్నాలజీ రంగాల పేరిట మోసాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇక సైబర్ నేరస్తులు నిధులు కొల్లగొట్టేందుకు ఫిషింగ్ యాప్‌లు, లింక్‌లనే ప్రధాన సాధనంగా చేసుకుంటున్నారు. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘క్లౌడ్ సేక్’ దేశంలో సైబర్ నేరాల తీవ్రతపై తాజా నివేదికలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 2025లో దేశంలో సైబర్ నేరగాళ్లు మరింతగా రెచ్చిపోయే అవకాశాలున్నాయని కూడా అంచనా వేసింది. నివేదికలోని ప్రధాన అంశాలివి..» బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేరిట మోసాలే మొదటి స్థానంలో ఉన్నాయి. దేశంలో 39.5 శాతం సైబర్ నేరాలు బ్యాంకులు, ఆర్థిక సంస్థల పేరిటæ బురిడీ కొట్టించి నిధులు కొల్లగొడుతున్నారు. » రెండు, మూడు స్థానాల్లో రిటైల్/ఈ–కామర్స్, టెక్నాలజీ సంస్థలున్నాయి. రిటైల్ సంస్థల పేరుతో 21.4 శాతం, టెక్నాలజీ సంస్థల పేరిట 12.5శాతం సైబర్ నేరస్తులు బురిడీ కొట్టిస్తున్నారు. ఇక టెలీ కమ్యూనికేషన్ల సంస్థలు(9.1శాతం), ట్రావెల్ సంస్థలు(8.6శాతం), రియల్ ఎస్టేట్ సంస్థలు(2.5శాతం), బీమా కంపెనీలు(1.9%) పేరిట కూడా సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు.» సైబర్ ముఠాలు అత్యధికంగా ఫిషింగ్ యాప్‌లు/లింకులనే తమ మోసాలకు సాధనంగా చేసుకుంటున్నాయి. ఫిషింగ్ యాప్‌లు/ లింకులు పంపి వాటిని క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాల్లో నిధులు కొల్లగొడుతున్నాయి. మొత్తం సైబర్ నేరాల్లో ఈ తరహా మోసాలు ఏకంగా 58% ఉండటం గమనార్హం. » తర్వాత స్థానాల్లో సోషల్ మీడియా మాధ్యమాలున్నాయి. ఫేక్ ఫేస్బుక్ ఐడీల పేరిట 25.7శాతం, యూట్యూబ్ ద్వారా 5.8శాతం, ఎక్స్( ట్విట్టర్) ఖాతాల ద్వారా 3.2శాతం, ఇన్స్టాగామ్ ద్వారా 2.5శాతం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. » సైబర్ నేరస్తులు 2025లో దేశంలో ఏకంగా రూ.20 వేల కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని అంచనా. దేశంలో సైబర్ మోసాలపై ఏకంగా 25 లక్షలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యే అవకాశం ఉంది. వాటిలో 41 శాతం వరకు బ్యాంకింగ్, ఆర్థిక సంస్థల పేరిట మోసాలే ఉంటాయని భావిస్తున్నారు. ఇక దేశంలో మోసపూరితమైన యాప్‌లు 83 శాతం, ఫేక్ సోషల్ మీడియా ఖాతాలు 65 శాతం పెరగొచ్చని అంచనా.

‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’
తిరుపతి: మండల కేంద్రమైన సైదాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గురువారం సైదాపురం–తిప్పవరపాడు మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సైదాపురానికి చెందిన దొడ్డగా మునెయ్య, భార్య జ్యోతి అక్కడికక్కడే మృతిచెందారు. కుమార్తె వైష్ణవి రక్తగాయాలతో బయటపడింది. ఈ క్రమంలో శుక్రవారం సైదాపురంలో మృతదేహాలకు అంతిమ వీడ్కోలు పలికారు.కంటతడి పెట్టించిన కుమార్తెల మాటలుకళ్లెదుటే తల్లిదండ్రులు విగత జీవులుగా పడి ఉండడంతో ఆ పసి హృదయాలు తల్లడిల్లిపోయాయి. ‘అమ్మా..నాన్నా.. ఒక్కసారి మాట్లాడండి’ అంటూ వారిపై పడి గుండెలు బాదుకోవడం అక్కడి వారిని కలచివేసింది. గాయపడిన వైష్ణవి చివరగా తల్లిదండ్రుల అంతిమయాత్రలో టాటా చెప్పడం స్థానికులకు కన్నీళ్లు తెప్పించింది.గోకుల బృందావనంలో పుట్టి..మండల కేంద్రమైన సైదాపురం సమీపంలోనే ఉన్న గోకుల బృందావనం గ్రామంలో దొడ్డగ మునెయ్య జన్మించారు. ఆయనకు అన్నలు భాస్కర్, చంద్రయ్య ఉన్నారు. వారంతా గోకులబృందావనం గ్రామం వీడి సైదాపురానికి చేరుకుని అక్కడే స్థిరపడ్డారు. మునెయ్యకు పెళ్లి చేసి సైదాపురంలోనే ఇల్లు కటించి బాగోగులు చూసుకునే వారు. ఈ క్రమంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మునెయ్యతోపాటు భార్య జ్యోతి మరణించడంతో విషాదంలో మునిగిపోయారు. ముక్కుపచ్చలారని పసిబిడ్డలను వదిలివెళ్తున్నారా..! అంటూ కన్నీరుమున్నీరయ్యారు. మృతుని కుటుంబాన్ని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మన్నారపు రవికుమార్ పరామర్శించారు. మృతుని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.‘అమ్మా..నాన్నా మమ్మల్ని వదిలి వెళ్లిపోయారా..!

యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి లే..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: గోకవరం మండలం కొత్తపల్లి శివారున పెట్రోల్‌బంక్ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో(road accident) ఉపాధ్యాయుడు(Govt School Teacher) మృతి చెందగా అటవీశాఖ ఉద్యోగిని తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం దొలిపాడుకు చెందిన వలాల చిన్నబ్బాయి (52) జగ్గంపేట మండలం గోవిందపురం జిల్లా పరిషత్ హైసూ్కల్లో 2023 నుంచి సాంఘిక శాస్తం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. కొంత కాలంగా గోకవరంలో నివాసం ఉంటూ బైక్‌పై వెళ్లి వస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయన వెళ్తుండగా అటవీశాఖలో గార్డుగా పని చేస్తున్న రెడ్డి విజయదుర్గ లిఫ్ట్ అడగడంతో ఆమెను ఎక్కించుకుని మళ్లీ ముందుకు సాగిపోయారు. కొత్తపల్లి శివారున పెట్రోల్ బంకు సమీపంలో వారు ప్రయాణిస్తున్న బైక్‌ను జగ్గంపేట వైపు నుంచి ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నబ్బాయి అక్కడికక్కడే మృతి చెందగా విజయదుర్గ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఆమెను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న గోకవరం ఎస్సై పవన్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. పిల్లలను పాఠశాల వద్ద దించి.. చిన్నబ్బాయికి భార్య పార్వతి, తొమ్మిదో తరగతి చదువుతున్న మేఘవర్షిణి, ఎనిమిదో తరగతి చదువుతున్న స్నేహిత ఉన్నారు. స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న వారిని పాఠశాల వద్ద దించి, అనంతరం ఇంటి నుంచి బయలుదేరి కొద్దిసేపటికే ఆయన మృత్యువాతపడ్డారు. యాన్యువల్ డేకి వెళ్లాలి డాడి లే.. ఆ చిన్నారులు చదువుతున్న పాఠశాల వార్షికోత్సవం శనివారం జరగనుంది. తన పిల్లలు ఆ కార్యక్రమానికి రావాలి డాడీ అని పిలవగా నేను రాను అన్న ఆయన మాటే నిజమైందని చిన్నబ్బాయి భార్య రోదించారు. యాన్యువల్డేకి వెళ్లాలి లే డాడీ అంటూ చిన్నారులు పోలీసులు వద్ద రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీస్‌స్టేషన్ వద్ద నుంచి ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించడానికి వాహనాన్ని నిలపగా భార్య, కుమార్తెలు మృతదేహంపై పడి గుండెలవిసేలా రోదించారు. ఈ క్రమంలో వారిని ఎవరూ వారించలేకపోయారు. హెల్మెట్ ఉన్నా.. బైక్ నడిపే సమయంలో చిన్నబ్బాయి హెల్మెట్ కచ్చితంగా వాడతారు. ప్రమాదం జరిగినపుడు కూడా హెల్మెట్ ధరించినప్పటికీ కారు ఢీకొట్టిన వేగానికి హెల్మెట్ ముక్కలైపోయి తలకు గట్టి దెబ్బ తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఉపాధ్యాయుడి మృతి విషయం తెలుసుకున్న సహచర ఉపాధ్యాయులు భారీగా అక్కడకు చేరుకుని విచారం వ్యక్తం చేశారు.