Top Stories
ప్రధాన వార్తలు

తెలుగువారికి వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు
తాడేపల్లి: తెలుగు సంవత్సరాది(ఉగాది) పర్వదినాన్ని పురస్కరించుకుని రెండు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి.శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు కలగాలని, రాష్ట్రం సుబిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లూ కళకళలాడాలని, మన సంస్కృతీ సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ విశ్వావసు సంవత్సరంలో ఇంటింటా ఆయురారోగ్యాలు, సిరిసంపదలు, ఆనందాలు నిండాలని ఆయన అభిలషించారు. ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని వైఎస్ జగన్ తన సందేశంలో ఆకాంక్షించారు.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఏడాది అందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ ఉగాది పండుగను ఇంటిల్లిపాది ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.#Ugadi— YS Jagan Mohan Reddy (@ysjagan) March 30, 2025

శ్రీ విశ్వావసు నామ సంవత్సర (2025 – 26) రాశిఫలాలు
మేష రాశి ఆదాయం–2, వ్యయం–14, రాజయోగం–5, అవమానం–7.అశ్వని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా)భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో)కృత్తిక 1వ పాదము (ఆ)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (తృతీయ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (లాభ), కేతువు సింహరాశి (పంచమ) స్థానాల్లో సంచరిస్తారు. శని మార్చి 29 నుండి మీనరాశి (వ్యయం)లో సంచారం. ఏలినాటి శని ప్రారంభమైంది. ఈ సంవత్సరం పనులు ఆలస్యం అవుతాయే గాని, పనులు పాడవడం జరగదు. దూకుడుగా నిర్ణయాలు చేయకండి. ఇతరుల సహకారం తక్కువగా ఉంటుంది. రోజువారీ పనుల్లో మంచిగా వ్యవహరించి సత్ఫలితాలు అందుకుంటారు. అనవసర కాలక్షేపం చేస్తారు. బంధువర్గంతో జాగ్రత్తలు తీసుకోండి. పెద్దల ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. పిల్లల అభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగాల్లో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. స్థానచలన, ప్రమోషన్ ప్రయత్నాలు ప్రత్యేకంగా చేయకపోతే ప్రతికూలతలు తప్పవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి పనులు వేగంగా సాగవు. వ్యాపారులకు అధికారుల ఒత్తిడి, పనివాళ్లతో సమస్యలున్నా, లాభాలు దక్కుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలకు, కొత్త పెట్టుబడులకు అనుకూలంగా ఉంది.వృథా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఋణాలను ఎగవేసే వారు ఎక్కువ అవుతారు. కొత్త ఋణాలు దొరకవు. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉన్నది. నరాలు, ఎముకల సమస్యలు పెరగగలవు. మార్కెటింగ్ ఉద్యోగులకు పనులు ఆలస్యం అయినా, మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులకు దూకుడుగా వ్యాపారం చేసే అవకాశం ఉండదు. రైతులు సాధారణ ఫలితాలు పొందుతారు. విద్యార్థులు ఆశించిన ఫలితాల కోసం మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో నష్టాలు లేకున్నా, ఆశించిన ఫలితం ఉండదు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు మే నెల నుంచి అంతా సానుకూలం. విదేశీ విద్యా నివాస ప్రయాణ ప్రయత్నాలు çఫలిస్తాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని విధాలా అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలలో మంచి ఫలితాలు అందుకుంటారు. గర్భిణీ స్త్రీలు మే నెల చివర వరకు జాగ్రత్తలు పాటించడం మంచిది.అశ్వని: ఎక్కువ కాలం సమయపాలనలో పనులు పూర్తి చేయలేరు. అందరితో మైత్రీ భావంతో ఉంటూ, సమస్యలు దగ్గరకు రాకుండా చూసుకోగలరు. మీ వద్ద పనిచేసేవారు పూర్తిగా సహకరిస్తారు. ఇతరుల విషయాలలో కలుగ చేసుకోరు. భవిష్యత్ ప్రణాళికలు బాగా చేస్తారు. భరణి: మీ ప్రవర్తనతో బంధుమిత్రులకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. సాంఘిక కార్యక్రమాలలో అవమానం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల విషయంలో అసంతృప్తి ఎదురవుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధిని చేతులారా పాడు చేసుకుంటారు. కృత్తిక నక్షత్రం 1వ పాదం: మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనీ మధ్యలోనే వదిలి వేస్తూ ఉంటారు. ఒంటరిగా ప్రయాణాలు చేస్తుంటారు. కొన్నిసార్లు చక్కటి ఆలోచనా పటిమ ప్రదర్శించి విజయాలు సాధిస్తారు. విద్యా విషయాల్లో సానుకూలత ఎక్కువ. ఆర్థిక నిర్ణయాలు బాగుంటాయి. శాంతి మార్గం: నిత్యం రావిచెట్టు కింద ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రదక్షిణలు చేయండి. రోజూ దశరథకృత శని స్తోత్ర పారాయణ చేయండి. మే 15 తరువాత శని/ గురువులకు జపం దానాలు చేయడం, నవముఖ రుద్రాక్షధారణ మంచిది.ఏప్రిల్: గురు, కుజుల అనుకూలత బాగుంది. ఐదు గ్రహాలు వ్యయంలో ఉన్నందున ప్రతి పనీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కుటుంబంలో అనుకోని సమస్యలు రాగలవు. మీకు సంబంధం లేని విషయాల్లోనూ ఇబ్బందులు రాగలవు. అందరికీ మీ మీద వైరభావం రాగలదు. దూర ప్రయాణాలు ఎక్కువగా చేయవద్దు. పనులు వాయిదా వేయకండి. ఒంటరిగా ఉండడం, ఒంటరిగా దూరప్రాంతాలకు వాహనాలు నడపడం మంచిదికాదు. మే: కొన్ని సందర్భాలు సానుకూలం అవుతాయి. వ్యయంలో వున్న రాహు, శని, శుక్ర సంచారం వల్ల ఎక్కువగా ఇుబ్బందికర çపరిస్థితులే ఉంటాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల వ్యవహారాలలో కలగజేసుకోకండి. ఆర్థిక లావాదేవీలను స్వయంగా పరిశీలించండి. ఋణాలు తీర్చడం, కొత్త ఋణాలు దొరకడం కష్టమవుతుంది. జూన్: జన్మ శుక్రుడు వల్ల ఈ నెలంతా చాలా సమస్యలను తెలివిగా ఎదుర్కోగలుగుతారు. కుటుంబంలో అందరికీ వారి వారి విధానములు సవ్యంగా సాగుతాయి. ఒత్తిడి లేని జీవితం సాగిస్తారు. బంధువుల సహకారం బాగుంటుంది. ఆరోగ్యం పట్ల ముందుజాగ్రత్తలు పాటించి సమస్యలను నివారించుకుంటారు. జులై: పనులు సకాలంలో పూర్తి అవుతాయి. శుభవార్తలు వింటారు. అన్ని వ్యవహారాలలో ఓర్పు, సహనం ప్రదర్శించి అనుకున్న ఫలితాలు పొందుతారు. ఏలినాటి శని ప్రభావం పెద్దగా ఉండదు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలలో గొప్ప సానుకూలత ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలం. ఆగస్ట్: అన్ని పనులు చక్కగా సాగుతాయి. కొత్త ప్రయత్నాలు 21వ తేదీ నుండి వేగవంతమవుతాయి. మీకు అధికారులు, కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. స్వబుద్ధితో కార్య జయం. ధన ధాన్యలాభం చేకూరుతుంది. బంధుమిత్రుల కలయిక వలన భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రమోషన్ లభిస్తుంది. సెప్టెంబర్: బుద్ధి కుశలతతో పనులు సానుకూలం చేసుకుంటారు. కుటుంబ సమస్యలు పెరుగుతున్నట్లు అనిపించినా, తెలివిగా వాటిని పరిష్కరించుకుంటారు. ఓర్పుగా వ్యవహార జయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను అధికంగా చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో అధికారుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులను తెలివిగా అధిగమించగలరు. అక్టోబర్: కలహప్రదమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పెంచుకోవద్దు. అన్న, వస్త్రాదులు సకాలంలో అందని పరిస్థితి ఏర్పడుతుంది. అవయవాలు ప్రతికూలిస్తున్నాయనే భావన ఎక్కువ అవుతుంది. మిత్రులతో మనసు విప్పి మాటలాడలేని పరిస్థితి. ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఇబ్బందికరం కాకుండా చూసుకోండి.నవంబర్: వాక్ నియంత్రణ పాటించడం, పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. రోజువారీ కార్యక్రమాలు మినహా ఇతరమైనవి చేపట్టవద్దు. ఆగ్రహావేశాలను అదుపు చేసుకోండి. ఆర్థిక వెసులుబాటు ఉన్నా, అనవసర ఖర్చులు పెరుగుతాయి. డిసెంబర్: ప్రత్యేక జాగ్రత్తలతో కాలక్షేపం చేయవలసిన కాలం. ప్రతిపనికీ అవరోధాలు ఎదురవుతాయి. కుటుంబసభ్యులతో దూరప్రాంత విహారాలు చేస్తారు. శుభకార్యాలు, బంధు మిత్రుల కలయిక, కుటుంబంలోని పెద్దల ఆరోగ్య చికాకుల వల్ల వృత్తి ఉద్యోగాల్లో శ్రద్ధ తగ్గుతుంది. ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉన్నా, శ్రద్ధగా ఋణములు, ఖర్చులు నిర్వహిస్తారు. జనవరి: మంచి మార్పులు మొదలవుతాయి. కుటుంబ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. సమస్యలను సరిచేసుకొని ముందుకు వెడతారు. ధైర్యంగా ఉంటారు. ఉద్యోగంలో పాత సమస్యలు తీరుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులు ఉంటాయి. ఫిబ్రవరి: కాలం అనుకూలంగా ఉంది. గత సమస్యల పరిష్కారానికి కృషి చేయండి. ఇటువంటి మంచి గ్రహచారం చాలా అరుదుగా వస్తుంటుంది. కుటుంబ సమస్యలు తీరుతాయి. ఋణ విషయాలలో మంచి నిర్ణయాలు జరుగుతాయి. కొన్ని జటిల సమస్యలు పరిష్కారానికి దగ్గర అవుతాయి. స్థిరబుద్ధిని ప్రదర్శించండి. మార్చి: మొండి ధైర్యం పెరుగుతుంది. వ్యయ గ్రహచారం పెరుగుతోంది. జాగ్రత్తగా ఉండవలసిన కాలం. ఇతరులకు సలహాలు ఇవ్వడం శ్రేయస్కరం కాదు. మీ కుటుంబ సభ్యుల సహకారం తక్కువగా ఉంటుంది. రోజువారీ వ్యవహారాల్లోనూ అనుకూలత తక్కువగా ఉంటుంది. వ్యాపారులకు అనుకూలత తక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగం అవుతాయి. వృషభ రాశిఆదాయం–11, వ్యయం–5, రాజయోగం–1, అవమానం–3.కృత్తిక 2,3,4 పాదములు (ఈ, ఊ, ఏ) రోహిణి 1,2,3,4 పాదములు (వో,వా,వీ,వూ)మృగశిర 1,2 పాదములు (వే,వో)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (ద్వితీయ) స్థానంలో ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (దశమ), కేతువు సింహరాశి (చతుర్థ) స్థానాల్లో సంచరిస్తారు. శని మార్చి 29 నుండి మీనరాశి (లాభ) సంచారం. శని, గురు సంచారం అనుకూలత కారణంగా మంచి ఫలితాలు అందుకుంటారు. సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సమయపాలనతో విజయాలు సాధిస్తారు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ధర్మకార్యాలు చేస్తారు. సమస్యలు లేని జీవితం సాగుతుంది. కుటుంబ విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు. పిల్లల అభివృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అందరి సహాయ సహకారాలతో విజయాలు సాధిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలకు అనుకూలం. ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి. ఆదాయం అనుకూలం. ఖర్చులను అదుపు చేయగలరు. నగలు, అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. అవసరానికి తగిన ఋణ సౌకర్యం దొరుకుతుంది. ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తారు. పాత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. నియమబద్ధమైన జీవనం సాగించి ఆరోగ్యపరంగా సత్ఫలితాలు పొందుతారు. దూరప్రాంతాలను సందర్శిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగులు తేలికపాటి ప్రయత్నాలతోనే అభివృద్ధి సాధిస్తారు. షేర్ వ్యాపారులకు లాభాల పంట. రైతులకు సంవత్సరం అంతా బాగుంటుంది. విద్యార్థులకు సర్వత్రా విజయప్రదం. విజ్ఞాన విహార యాత్రలు చేస్తారు. కోర్టు వ్యవహారాలలో అఖండ విజయానికి అవకాశం ఉంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో సానుకూల స్థితి ఉంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. ఉద్యోగాలలో సత్ఫలితాలు ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు పుణ్యక్షేత్ర సందర్శన అవకాశాలు పెరుగుతాయి. ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అన్ని రంగాలలో విజయాలు సాధిస్తారు. పనివారితో సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయాలలో ముందు జాగ్రత్తలు పాటిస్తారు. గర్భిణీ స్త్రీలకు సంవత్సరం అంతా అనుకూలం. మే నుంచి సత్ఫలితాలు పెరుగుతాయి. సుఖ ప్రసవయోగం ఉంది.కృత్తిక 2, 3, 4 పాదాలు: అంతా శుభప్రదంగా ఉంటుంది. తెలియని మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. వ్యాపారులకు ఋణ వెసులుబాటు తక్కువగా ఉంటుంది. అయినా నష్టం ఉండదు. పుణ్యకార్యాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. రోహిణి: తెలివిగా ఓర్పుగా వ్యవహరించడంలో వీరికి తిరుగులేదు. వృత్తి ఉద్యోగాలలో మంచి నిర్ణయాలు చేస్తారు. అందరికీ సహకరించడం ద్వారా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ అవసరాలు తీర్చడం ప్రధాన అంశంగా ముందుకు సాగుతారు. ప్రజాసంబంధాలు పెంచు కుంటారు.మృగశిర 1, 2 పాదాలు: ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల విషయాలలో కలుగ చేసుకోవద్దు. మీ విషయంలో ఇతరుల ప్రమేయానికి అవకాశం ఇవ్వవద్దు. పుణ్యకార్య, శుభకార్యాల కోసం ప్రయాణాలు ఎక్కువ. ఖర్చులు ఎక్కువ. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడికి లోనవుతారు.శాంతి మార్గం: లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం నిత్యం పారాయణ చేయండి. ప్రాతః కాలంలో తెల్లటి పూలతో లక్ష్మీపూజ చేయడం, గోపూజ చేయడం విశేషం. గ్రహశాంతి ప్రత్యేకంగా అవసరం లేదు కాని, నవగ్రహస్తోత్రములు రోజూ పారాయణ చేయడం శ్రేయస్కరం. పంచముఖ రుద్రాక్షధారణ మంచిది.ఏప్రిల్: అన్ని పనులలోను ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. నూతనోత్సాహంతో ముందుకు వెడతారు. మీకు సహకరించే బంధుమిత్రులు ఉంటారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. ప్రయత్నించవలసిన పనులు ఏమయినా ఉంటే 14వ తేదీ లోపుగా చేయండి. ఉద్యోగ, వ్యాపారాలలో మీ దగ్గర పనిచేసే వారి నుంచి ప్రోత్సాహం అందుకుంటారు. శుభకార్య, పుణ్యకార్య ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు, షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు అనుకూలం. మే: ఎక్కువకాలం అనుకూలంగా ఉంటుంది. కొద్దిరోజులు మాత్రమే మానసిక ఒత్తిడి వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబసభ్యుల సహకార ధోరణి వల్ల సత్ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా అనుకూల స్థితి ఉంటుంది. పుణ్యకార్య శుభకార్యాలు చేస్తారు. విజ్ఞాన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. జూన్: ప్రయాణాలలో మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. వాహనాలు తరచుగా రిపేర్‌కు వస్తుంటాయి.పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ, వ్యాపారాలలో అద్భుతంగా ఉంటుంది. పుణ్యకార్య శుభకార్యాల కోసం ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తెలివిగా పనులు సానుకూలం చేసుకుంటారు. జులై: చాలా అనుకూలమైన ఫలితాలు అందుతాయి. పుణ్యకార్య శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి విజయాలు అందుకుంటారు. ప్రారంభించిన ప్రతిపనీ అనుకూలమే. మనస్సౌఖ్యం ఎక్కువ. ధనధాన్య లాభం చేకూరుతుంది. కుటుంబపరంగా అన్నీ అనుకూలం. ఉద్యోగ, వ్యాపార, ఋణ, ఆరోగ్య విషయాలలో పనులు సానుకూలం చేసుకుంటారు. ఆగస్ట్: అకాలంలో పూర్తయ్యే పనులు వృత్తి ఉద్యోగాలకు చికాకులు కలిగిస్తాయి. భార్యా పిల్లల సహకారం బాగా ఉంటుంది. తరచుగా పనులు మరచిపోతుంటారు. పెంపుడు జంతువుల ద్వారా ఖర్చు పెరుగుతుంది. అధికారుల ద్వారా ఒత్తిడికి లోనవుతారు. అన్ని విషయాలలోనూ అసంతృప్తి ఉంటుంది. సెప్టెంబర్: వృద్ధి శాతం క్రమంగా పెరుగుతుంది. గత సమస్యల పరిష్కారానికి, కొత్త పనుల ప్రణాళికా రచనకు ఈ నెల అనుకూలం. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. అందరి నుంచి సహకారం అందుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో సాధించే విజయాలతో ఆనందంగా ఉంటారు. అక్టోబర్: మనోధైర్యంతో ఉంటారు. విద్యా, వినోద, విజ్ఞాన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వెసులుబాటు బాగా అందుతుంది. పదిమందికీ సలహాలు ఇస్తారు. ఉద్యోగ భద్రత, వ్యాపార వృద్ధి అద్వితీయంగా ఉంటాయి. ఋణ సౌకర్యం బాగుంటుంది. స్వేచ్ఛగా జీవితం గడుపుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నవంబర్: ఆరోగ్యపరంగా ఏదో తెలియని ఇబ్బందిని ఎదుర్కొంటారు. కుటుంబపరంగా గురు, శుక్ర, కుజ ప్రతికూలత దృష్ట్యా జాగ్రత్తలు అవసరం. అనవసర కలహాలకు దూరంగా ఉండండి. జ్ఞాతి వైరం ఎక్కువగా ఉం టుంది. శుభకార్య ప్రయత్నాలు, ప్రయాణాలలో విçఘ్నాలు ఎదురవుతాయి. అనవసర కాలక్షేపాలు చేస్తారు. డిసెంబర్: ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం అవసరం. అంతా అనుకూలంగా ఉందని అనుకున్నా, అకస్మాత్తుగా ఇబ్బందులు రాగలవు. ఇతర వ్యాపకాలు పనికిరాదు. కేవలం వృత్తి, కుటుంబ విషయాల మీద దృష్టి కేంద్రీకరించండి. పాత ఋణాల విషయంలో విచిత్రమైన సమస్యలు వచ్చే అవకాశములు ఎక్కువగా ఉన్నాయి. జనవరి: పిల్లల అభివృద్ధి సంతృప్తి కలిగిస్తుంది. క్రమంగా ఒక్కో మంచి మార్పు మీకు దగ్గర అవుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. భోజన వసతి 17వ తేదీ నుండి ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగ విషయాలు సాధారణంగా ఉంటాయి. మిగిలిన అన్ని ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఫిబ్రవరి: గోచారం చాలా బాగుంది. ప్రధానంగా పాత సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో ఎక్కువ శ్రమ చేసి, ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సమస్యలు లేకుండా నడుస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. మార్చి: కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా వృద్ధిని సాధిస్తారు. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నడుపుతారు. ఋణ సౌకర్యం బాగుంటుంది. మనశ్శాంతిగా ఉంటారు. కుటుంబ జీవితం అనుకూలంగా సాగుతుంది. మిథున రాశిఆదాయం–14, వ్యయం–2, రాజయోగం–4, అవమానం–3.మృగశిర 3,4 పాదములు (కా, కి)ఆరుద్ర 1,2,3,4 పాదములు (కూ, ఖం, ఙ, ఛ)పునర్వసు 1,2,3 పాదములు (కే, కొ, హా)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (జన్మ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (నవమ), కేతువు సింహరాశి (తృతీయం) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (దశమ) సంచారం. తరచుగా బుద్ధి భ్రంశానికి లోనవుతుంటారు. చేసే పనులు విడిచి ప్రశాంతంగా దూరంగా వెళ్ళాలి అనే కోరిక పెరుగుతుంది. ప్రతిపనీ పరధ్యానంగా చేస్తారు. మీ ప్రయత్నాలు ఏవీ సరిగా సాగవు. చతుష్పాద జంతువులతో ఇబ్బంది ఉంటుంది. సమయపాలనతో రోజువారీ పనులు పూర్తి అవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో మే వరకు కొన్ని సమస్యలు ఉంటాయి, మే తర్వాత కొంత అనుకూలత ఉంటుంది. కుటుంబ వ్యవహారములలో ఇతరుల ప్రమేయాన్ని ఖండిస్తేనే సుఖపడతారు. ఉద్యోగ విషయాల్లో మీకు సహకరించే అధికారులు విరుద్ధంగా ఉంటారు. ప్రతిపనీ మీ అవగాహన లోపం వలన ఒకటికి రెండుసార్లు చేయవలసి వచ్చి ఇబ్బంది పడుతుంటారు. వ్యాపారులకు అనుకూలత తక్కువ. ఆలోచనలకు, అమలుకు సంబంధం లేక సాధారణ ఫలితాలు అందుకుంటారు. నూతన వ్యాపార ప్రయత్నాలలో అనిశ్చితి వల్ల చికాకులు ఎదుర్కొంటారు. ఆదాయం తక్కువ. అనవసర ఖర్చులను నియంత్రించలేకపోతారు. ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. వస్తునష్టం ఉంటుంది. కొత్త ఋణాలు సకాలంలో అందవు. పాత ఋణాలు ఇబ్బందులు సృష్టిస్తాయి. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. తరచుగా చికాకుపడుతుంటారు. మార్కెటింగ్ ఉద్యోగులు ప్రశాంతంగా ప్రవర్తిస్తే కొంత మంచి ఫలితాలు పొందగలరు. షేర్ వ్యాపారులకు చికాకులు ఎదురవుతాయి. ప్రశాంత చిత్తంతో ముందుకు వెళ్ళండి. రైతులకు శ్రమ ఎక్కువ. లాభాలు తక్కువ. విద్యార్థులకు సాధారణ స్థాయి ఫలితాలు అందు తాయి. కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టు వ్యవహారాలలో ప్రతిపనీ చికాకు పెడుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అనుకూలత తక్కువ. విదేశీ నివాస ఉద్యోగ ప్రయాణ ప్రయత్నాలలో పనులు లాభదాయకంగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలు చాలా విషయాలలో ధైర్యంగా ఉన్నా, బుద్ధి కుశలత తగ్గుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మే నెల నుంచి పెరుగుతుంది. ప్రధానంగా పిల్లల విషయంలో కలవర పడుతుంటారు. ఆరోగ్యంలో తేడా ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు ఇబ్బందికర ఘటనలేవీ ఉండవు. జూన్ వరకు ఆరోగ్య జాగ్రత్తలు అవసరం.మృగశిర 3, 4 పాదాలు: మీ స్వభావ సిద్ధమైన పనులు మాత్రమే చేసుకుంటూ కాలక్షేపం చేస్తారు. చతుష్పాద జంతువులు, పెంపుడు జంతువులు ఇబ్బంది సృష్టిస్తాయి. నమ్మకంగా ఉండే వారి ప్రవర్తన కూడా కొంత అనుమానించేలా ఉండటంతో సందిగ్ధావస్థ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. ఆరుద్ర: అంతా శుభ పరిణామాలే ఉంటాయి. కుటుంబపరంగా మంచి నిర్ణయాలు చేయగలుగుతారు. విజయం సాధిస్తారు. విద్యా, విజ్ఞాన, విషయ శోధనలో కాలక్షేపం జరుగుతుంది. ఆర్థిక వెసులుబాటు సాధారణంగా ఉంటుంది. వ్యాపారులకు ధనం వెసులుబాటు, పనివారి సహకారం తక్కువగా ఉంటుంది. పునర్వసు 1, 2, 3 పాదాలు: తరచుగా బుద్ధి స్థిమితం కోల్పోతుంటారు. ఆగ్రహావేశాలతో ప్రవర్తిస్తుంటారు. కుటుంబ సభ్యులకు మీకు సయోధ్య సరిగా సాగదు. అస్థిర బుద్ధితో ఏ పనీ సరిగా చేయలేరు. ఋణ విషయాలలో అవమానకర ఘటనలు ఉంటాయి. శాంతి మార్గం: కుజ గురువులకు జప, దాన, తర్పణ వంటివి తరచుగా చేయించండి. సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం రోజూ పఠించండి. ప్రదోషకాలంలో శివాలయంలో ‘‘శ్రీమాత్రే నమః’’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు, కాలభైరవాష్టకం పారాయణ చేయండి. షణ్ముఖ రుద్రాక్షధారణ మంచిది.ఏప్రిల్: ఆదాయం బాగుంటుంది. ఖర్చులు నియంత్రించలేరు. అన్నీ అనుకూలంగానే ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. అన్ని వ్యవహారాలలోనూ ప్రోత్సాహకరంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలలో తరచుగా పాల్గొంటారు. ఉద్యోగంలో స్థానచలన, ప్రమోషన్ ప్రయత్నాలకు అనుకూలం. వ్యాపారులు సంతృప్తికరంగా వ్యాపారం చేయగలుగుతారు. గురువులను, పూజ్యులను తరచుగా దర్శిస్తుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు సానుకూలం. మే: చాలా అనుకూల వాతావరణం. స్వయంగా పనులు పర్యవేక్షించడం, స్వబుద్ధితో ఆలోచించడం, సమయపాలన ద్వారా విజయావకాశాలు అందుకుంటారు. ఉద్యోగులకు అధికారుల సహకారం, తోటివారి సహకారం బాగా అందుతుంది. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జూన్: కేవలం ఓర్పు, సహనం మిమ్మల్ని విజయపథం వైపు నడిపిస్తాయి. మీ సహనాన్ని పరీక్షించే సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యపరంగా ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. ఋణ సౌకర్యం తగ్గుతుంది. జులై: వాహన చికాకులు, ప్రయాణ చికాకులు రాకుండా జాగ్రత్తపడండి. ధనవ్యయం ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉంటుంది. వస్తువులను తరచుగా మరచిపోతుంటారు. కార్యవిఘ్నం తరచుగా ఉంటుంది. మొండి ధైర్యంతో పనులకు శ్రీకారం చుడతారు. చతుష్పాద జంతువుల వలన ఇబ్బందులు ఉంటాయి. ఆగస్ట్: చాలా విచిత్రమైన కాలం. తెలివి, ఓర్పు ప్రదర్శిస్తారు. విజయాలు సాధిస్తారు. పని ఒత్తిడి ఎక్కువ. అనుకోకుండా కొత్త పనులు చేయవలసి వచ్చి రోజువారీ పనులకు ఇబ్బంది కలుగుతుంది. శుభ, పుణ్యకార్యాలలో పాల్గొంటారు. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పాత కుటుంబ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. సెప్టెంబర్: ఇబ్బందులు లేని కాలమే నడుస్తుంది. కొత్త కొత్త ప్రయత్నాలు, వాటికి సంబంధించిన చర్చలు చేస్తారు. అంతా శుభంగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో అన్యోన్యత బాగుంటుంది. పెద్దలు, పూజ్యులు, గురువుల సందర్శన, పుణ్యకార్య నిర్వహణలో కాలక్షేపం జరుగుతుంది. అక్టోబర్: సాధారణ జీవనశైలితో ముందుకు వెడతారు. తెలియని అనిశ్చితి ఏర్పడుతుంది. ఉద్యోగం బాగుంటుంది. అసంతృప్తిగా ఉంటారు. వ్యాపారం బాగా ఉన్నా, ఆర్థిక లావాదేవీలు, ఋణ వ్యవహారాలు ఇబ్బంది లేకున్నా, భయంతో గడుపుతారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న చికాకులు, శ్రమాధిక్యం ఉంటాయి. నవంబర్: ఊహాతీతంగా పనులు వేగంగా పూర్తవుతాయి. అనుకోని వ్యక్తులు కూడా సహకారం అందిస్తారు. వృత్తి రీత్యా అభివృద్ధి బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. అప్పులు తీర్చడానికి అనుకూలం. ప్రయాణాలు అధికంగా చేస్తారు. శుభ, పుణ్యకార్యాలలో పాల్గొంటారు. డిసెంబర్: శుక్ర, కుజుల అనుకూలత తక్కువగా ఉన్నందున కుటుంబ కలహాలకు అవకాశం ఇవ్వకుండా కాలక్షేపం చేయండి. ప్రతి విషయంలో ఓర్పు అవసరం. స్నేహితుల పొరపాట్లకు మీరు సమాధానం చెప్పవలసి ఉంటుంది. అనవసర కాలక్షేపాలకు దూరంగా ఉండండి. బంధువర్గంతో కలసి చేసే వ్యాపార వ్యవహారాలు సానుకూలం కావు. పుణ్యకార్య, పుణ్యక్షేత్ర సందర్శన ఖర్చులు పెరుగుతాయి. జనవరి: తరచుగా చేస్తున్న పనులు మానేసి, దూరంగా వెళ్ళాలి అనే కోరిక పెరుగుతుంది. రవి, కుజ, శుక్ర, బుధ సంచారం అనుకూలంగా లేదు. ప్రతి వ్యవహారాన్ని స్వయంగా సాధించుకోవాలి. సాంఘికంగా గౌరవ మర్యాదలకు ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడండి. ఋణ, ఆరోగ్య సమస్యలకు సంబంధించి జాగ్రత్తలు పాటించాలి. ఫిబ్రవరి: చాలాకాలం తరువాత అనుకూల గ్రహచారం చూస్తున్నారు. 13వ తేదీ నుండి కొంత మార్పు, 23వ తేదీ నుంచి పూర్తి అనుకూలత ఉంటుంది. పుణ్య, శుభకార్యాలు చేస్తారు. క్రమంగా లాభదాయక ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఈనెల ద్వితీయార్ధం అనుకూలంగా ఉంటుంది. ఋణ సమస్యలు తీరడానికి మంచి మార్గం దొరుకుతుంది. మార్చి: గ్రహచారం అద్భుతంగా ఉంది. అందరూ సహకరిస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. షేర్ వ్యాపారులకు అనుకూలం. వాహన కొనుగోలు, అలంకరణ వస్తు కొనుగోలు పనులు వేగంగా జరుగుతాయి. కర్కాటక రాశిఆదాయం–8, వ్యయం–2, రాజయోగం–7, అవమానం–3పునర్వసు 4వ పాదము (హి)పుష్యమి 1,2,3,4 పాదములు (హూ, హే, హొ, డా)ఆశ్లేష 1,2,3,4 పాదములు (డీ, డూ, డే, డొ)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (నవమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (అష్టమ), కేతువు సింహరాశి (ద్వితీయ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (భాగ్య) సంచారం. ఒక్కోసారి అనుకూలత, ఒక్కోసారి ప్రతికూలత ఎదురవుతాయి. మే నెల నుంచి మానసిక, శారీరక శ్రమ ఎక్కువ. మీ వస్తువులను ఏదో ఒక రూపంగా నష్టపోతూ ఉంటారు. జాగ్రత్త పడాలనే విషయాలలో అనవసర ప్రయత్నాలు చేస్తారు. తరచుగా పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. రోజువారీ పనుల్లో సమయపాలన లేక ఇతర పనుల్లో ఇబ్బంది పడుతుంటారు. పిల్లలకు, మీకు సమన్వయం కుదరక బాధపడతారు. పెద్దల ఆరోగ్యం ప్రతికూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో బంధువుల ప్రమేయం ఎక్కువ. ఉద్యోగులు మే తరువాత అధికారుల ఆగ్రహావేశాలను ఎదుర్కొంటారు. మే వరకు తెలివిగా ప్రవర్తిస్తారు. స్థానచలనం, ప్రమోషన్ ఆశించిన రీతిలో ఉండవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మోసపోయే అవకాశాలు మే నెల నుండి ఉన్నాయి. వ్యాపారులకు జాగ్రత్తలు మే నుంచి ఎక్కువ అవసరం. నూతన వ్యాపార ప్రయత్నాలలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయానికి, ఖర్చుకు పొంతన ఉండదు. మే తరువాత నిల్వలు తీసే ఖర్చులు పెరుగుతాయి. ఋణ వ్యవహారాలలో అనుకూలత లేదు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. పెద్ద ఇబ్బంది లేకున్నా, మంచి వైద్య సలహాలు అందక చికాకు పడే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. పాత సమస్యలు ఇబ్బంది పెడతాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు మానసిక, శారీరక శ్రమ తప్పదు. షేర్ వ్యాపారులకు దూకుడు తగ్గించమని సూచన. మే నుంచి చికాకులు పెరుగుతాయి. రైతులకు శ్రమ ఎక్కువ. నకిలీ పురుగు మందులు, ఎరువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు బుద్ధి స్థిరం తప్పే అవకాశం ఉన్నది. కోర్టు వ్యవహారాలలో మే నుంచి ప్రతికూలతలు ఎక్కువ. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో తరచుగా తప్పుడు సూచనలు అందుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ధనవ్యయం ఎక్కువ అవుతుంది. ఈ రాశి స్త్రీలకు తరచుగా పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి ఎక్కువవుతాయి. సమర్థంగా ప్రవర్తించలేరు. అనవసర విషయాలు కలవర పెడుతుంటాయి. లేని అనారోగ్యాలకు కూడా భయపడతారు. గర్భిణీ స్త్రీలకు జాగ్రత్తలు అవసరం. మే 15 తరువాత ఆరోగ్య ఆహార విషయాలలో జాగ్రత్తలు పాటించలేక ఇబ్బందులకు లోనవుతారు. పునర్వసు 4వ పాదం: అనవసర ప్రయాణాలతో ఖర్చులు ఎక్కువవుతాయి. అందరితోనూ స్నేహంగా ఉండాలని ప్రయత్నించినా సానుకూలత ఉండదు. సమస్యల్లో చిక్కుకున్న ఇతరులకు సçహాయం చేసి అవమానాలకు లోనవుతుంటారు. శుభకార్య ప్రయత్నాలు తేలికగా పూర్తవుతాయి. జాగ్రత్తగా ఉన్నా, ఆశించిన ఫలితాలు అందవు. పుష్యమి: వృథా కాలక్షేపాలు అధికం అవుతాయి. వృత్తి విషయంలో మీ ఆలోచనకు, ఆచరణకు పొంతన ఉండదు. కుటుంబ విషయాలలో మంచి చేసినా అవమనాలకు లోనయ్యే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. ఆశ్లేష: తరచుగా అనుకూలతలు ప్రతికూలతలు వస్తుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని స్థానచలనం లేదా మార్పు ఉంటుంది. సమయపాలన లేకుండా పనులు చేయవలసి ఉంటుంది. పిల్లల వలన మానసిక చికాకులు ఎక్కువ అవుతాయి. కుటుంబంలో సంఘంలో మీకు నచ్చని సందర్భాలు ఎక్కువగా ఉంటాయి.శాంతి మార్గం: రాహువుకు దుర్గా స్తోత్ర పారాయణ మంచిది. కేతువుకు లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ మంచిది. శివాలయంలో రోజూ ‘‘శ్రీమాత్రే నమః’’ అని చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయండి. గురు రాహు కేతువులకు జపదానం తర్పణం మేలో చేయించండి. త్రిముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: ప్రతి విషయం లాభదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. స్వయంగా విజయాలు సాధిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగపరంగా అధికారుల ప్రోత్సాహం బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. కోర్టు వ్యవహారాలు సానుకూలం. మార్కెటింగ్ ఉద్యోగులు లబ్ధి పొందుతారు. కులవృత్తిలో ఉన్నవారికి అనుకూలం. మే: ఆరుగ్రహాలు భాగ్య, రాజ్య, లాభ స్థానాలలో ఉన్నా, జన్మ కుజ, నవమ శని వల్ల ఏదో తెలియని భయం, ఆరోగ్య సమస్యలు ఉన్నాయనే భావన పీడిస్తుంటాయి. సమస్యలు ఉన్నా, పరిష్కార మార్గం కూడా పక్కనే ఉంటుంది. జూన్: మొదటివారంలో ఆశ్లేష వారికి అనుకూలత తక్కువ. అన్నీ బాగున్నట్లుగా ఉన్నా, ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. ఆర్థిక లావాదేవీలను అప్రమత్తంగా నిర్వహించాలి. పాత ఆరోగ్య సమస్యలు తిరగబడే సూచన. ఇతరుల వ్యవహారాల జోలికి పోవద్దు. ఈ నెలలో కొత్త ఋణాలు చేస్తే, వాటిని తీర్చడం కష్టం. జులై: పుష్యమీ నక్షత్రం వారికి 20వ తేదీ నుండి కొంచెం శ్రమ ఎక్కువ. రాశివారు అందరూ ఏదో ఒక రకంగా పను వాయిదా వేస్తుంటారు. ప్రతిచోట, ప్రతిపనిలోనూ అధిక ఖర్చులు తప్పవు. భోజనం, నిద్ర వంటి రోజువారీ పనుల్లోనూ జాప్యం ఎదురవుతుంది. ఆగస్ట్: వాహన ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పడండి. తెలియని అసంతృప్తి వెంబడిస్తుంది. కొన్ని సందర్భాలలో మొండి ధైర్యంతో పనులు సానుకూలం చేసుకుంటారు. విద్యార్థులకు, ఫైనాన్స్ వ్యాపారులకు జాగ్రత్తలు అవసరం. ఒంటరి ప్రయాణాలు, అనవసర కాలక్షేపాలు విడనాడండి. సెప్టెంబర్: ఆర్థిక సమస్యలకు ఈ నెలలో పరిష్కార మార్గాలు గోచరిస్తాయి. ఇంటి విషయంలోనూ, వృత్తి విషయంలోనూ పనివారు సహకరించరు. కుటుంబ సమస్యల పరిష్కారం తేలికవుతుంది. ప్రయాణాలు, శుభకార్యాలు, ఉద్యోగ సమస్యల పరిష్కారంతో కాలక్షేపం బాగా సాగుతుంది. అక్టోబర్: కొత్త పనులు చేపట్టినవారికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాలలో తోటివారి ప్రతికూలత ఎక్కువ. అధికారుల రక్షణ విశేషంగా ఉంటుంది. స్వబుద్ధితో పనులు సానుకూలం చేసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు తేలికగా పూర్తి చేసుకుంటారు. నవంబర్: తెలివి, ఓర్పుతో విజయాలు సాధిస్తారు. పాత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. పాత ఆరోగ్య సమస్యలకు మంచి వైద్యం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార కుటుంబ వ్యవహారాలలో సానుకూలత ఉంటుంది. డిసెంబర్: భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలలో మంచి సలహాలు అందవు. కొత్త ఋణాలు చేయకుండా ఉండడం మంచిది. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు అనుకూలత తక్కువ. ఆరోగ్యం మీద శ్రద్ధ అవసరం. జనవరి: అన్నింటిలోనూ 17వ తేదీ నుంచి అడ్డంకులు పెరుగుతాయి. కోపావేశాలను అదుపు చేసుకోవలసిన కాలం. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. దూర ప్రయాణాలు తగ్గించండి. కలహాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకోవద్దు. ఫిబ్రవరి: ఎవరూ మీకు సరిగా సహాయ సహకారాలు చేయరు. పనులు ఆలస్యం అవుతాయి. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా ఉండవు. అధికారులతో జాగ్రత్త అవసరం. ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల వ్యవహారాలలో కలుగచేసుకోవద్దు. మార్చి: అవరోధాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ నిర్వహణ, వృత్తి నిర్వహణ ఒకదానికి మరొకటి అవరోధాలు సృష్టిస్తాయి. ఆర్థిక లావాదేవీలలో అనుకూలత తక్కువ. కుజ, గురు, శాంతి చేయించండి. ఉద్యోగ ఒత్తిడితో మీరు అందరితో కలహిస్తారు. ఇతరుల వ్యవహారాలు కలహప్రదంగా మారతాయి. సింహ రాశిఆదాయం–11, వ్యయం–11, రాజయోగం–3, అవమానం–6.మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే)పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ)ఉత్తర 1వ పాదము (టే)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (లాభ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (సప్తమ), కేతువు సింహరాశి (జన్మ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుండి మీనరాశి (అష్టమ) సంచారం. మనస్పర్థలు రావడం, వాటిని సరి చేసుకోవడంతోనే ఈ ఏడాది కాలక్షేపం అవుతుంది. గురుబలం ఈ సంవత్సరమంతా శ్రీరామరక్ష. భాగస్వామ్య వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. గురు అనుకూలత ఉన్నప్పటికీ మంచి ప్రణాళికలు చేసినా, సన్నిహితులను నమ్మి సమస్యలకు దగ్గర అవుతుంటారు. రోజువారీ పనుల్లో భోజన, స్నాన, నిద్రలకు కూడా సమయపాలన ఉండదు. కుటుంబ విషయాల్లో మితభాషణ అవసరం. శని, రాహు సంచారం బాగా లేదు. ఉద్యోగులకు అధికారుల అండదండలు బాగా ఉంటాయి. మీ కింద పనిచేసేవారి ద్వారా ఇబ్బందులు పడతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అయోమయస్థితి ఉంటుంది. వ్యాపారస్తులకు శ్రమ తప్పదు. పనివారితో సమస్యలు ఎక్కువ, లాభాలు తక్కువ ఉంటాయి. ఆదాయానికి ఇబ్బంది లేదు కాని, అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. పాత, కొత్త ఋణాలు ఇబ్బందులు సృష్టిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వాత, జీర్ణ çసమస్యలు ఉంటాయి. అయితే మంచి వైద్యం లభిస్తుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఎక్కువైనా, పనులు పూర్తి అవుతాయి. షేర్ వ్యాపారులు మంచి ఆలోచనలు చేస్తారు. రైతులకు శ్రమ ఎక్కువ. విద్యార్థులకు ఏకాగ్రత లోపం ఉంటుంది. కోర్టు వ్యవహారాలలో మోసపూరిత వాతావరణం ఎదురవుతుంది. స్థిరాస్తి కొనుగోలులో ఇతరుల సలహాలు పాటించకుండా ఉంటే మంచిది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు ఆలస్యం అవుతాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని పనులు ఆలస్యంగా అవుతాయి. తెలివి, ఓర్పు ప్రదర్శిస్తారు. కుటుంబం, ఉద్యోగం సమతూకంగా నిర్వహించలేక ఇబ్బంది పడతారు. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు పాటించాలి. నిత్యం వైద్యుల సలహాలు, ఆహార, ఆరోగ్య నియమాలు పాటించాలి.మఘ: మానసికంగా ఇతరులతో అనుబంధంగా మెలగలేని పరిస్థితి ఉంటుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు బాగానే ఉంటాయి. పుణ్య, శుభకార్య ప్రయత్నాలలో కాలక్షేపం చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలలో విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. వాహన చికాకులు ఎక్కువ ఉంటాయి. పుబ్బ: ఇతరులను నమ్మి ధనం పెట్టుబడులు పెట్టవద్దు. మీ వస్తువులను ఎక్కడైనా మరచిపోవడం లేదా చౌర్యానికి గురవడం జరుగుతాయి. చేసే పనులలో ఏదో తెలియని అసంతృప్తి ఉంటుంది. రోజువారీ పనుల్లో సమయపాలన లోపిస్తుంది. ఉత్తర 1వ పాదం: మీ పనులు ఇతరులకు, ఇతరుల పనులు మీకు నచ్చక ఉద్యోగ, వ్యాపార కుటుంబ విషయాలలో ఒత్తిడికి లోనవుతారు. ప్రతి పనీ మళ్లీ మళ్లీ చేయవలసి వస్తుంది. అందరినీ అనుమానిస్తుంటారు. పనులు వదిలివేసి ఒంటరిగా ఉండాలనే కోరిక పెరుగుతుంది. శాంతి మార్గం: శని రాహు కేతువులకు శాంతి చేయించండి. మే నెల నుంచి ప్రతి నెలా ఒకసారి కుజగ్రహ శాంతి చేయించండి. రోజూ శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి భువనేశ్వరీ సహస్ర నామ స్తోత్రం పారాయణ చేయండి. కుదిరినప్పుడు చండీహోమం చేయించండి. సప్తముఖ రుద్రాక్షధారణ చేయడం శుభప్రదం.ఏప్రిల్: ప్రశాంతత కోసం, ధైర్యం కోసం ధ్యానం చేయండి. ప్రతిపనీ కాలవ్యయం, ధనవ్యయం సూచిస్తున్నాయి. నమ్మక ద్రోహం చేసేవారు మీ చుట్టూనే ఉంటారు. పాత ఆరోగ్య సమస్యలు తిరగపెట్టకుండా, పాత ఋణాలు ఇబ్బందికరం కాకుండా చూసుకోండి. వ్యవహార ప్రతిబంధకాలు గోచరిస్తున్నాయి. మే: తొందరపాటు నిర్ణయాలు చేయవద్దని సూచన. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దు. రోజువారీ పనుల్లోనూ తెలియని ఆటంకాలు ఉంటాయి.ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాలలో క్రమంగా మంచి ఆలోచనలు చేసి సమస్యలు దూరం చేసుకోగలుగుతారు. జూన్: మఘ నక్షత్రం వారికి 7వ తేదీ నుంచి ఆరోగ్య చికాకులు ఉంటాయి. అయితే శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. తరచుగా శుభ, పుణ్య కార్యాలలో పాల్గొంటారు. రోజువారీ పనులు అనుకూలంగా ఉంటాయి. జులై: పుబ్బా నక్షత్రం వారు 23 వరకు, ఉత్తర 1వ పాదం వారు 23 నుంచి ఆరోగ్య సమస్యలకు గురవుతారు. పుబ్బవారు ఈనెల 21 నుండి కొంచెం ఎక్కువ చికాకులు పొందుతారు. భాగస్వామ్య వ్యవహారాల్లో చిక్కులు తలెత్తవచ్చు. కుటుంబ, ఆరోగ్య, వృత్తి విషయాలలో జాగ్రత్తలు పాటించాలి. ఆగస్ట్: శ్రమ చేసి ముఖ్యమైన సమస్యలు తీర్చుకోండి. ఒకటి రెండు ప్రయత్నాలు చేయడం ద్వారా సహకరించం అనే వ్యక్తులు కూడా బాగా సహకరించే అవకాశం ఉంటుంది. ఈ నెల 21 నుంచి కొన్ని పనులు వాయిదా పడడం, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. సెప్టెంబర్: ఆశ్చర్యకరమైన శుభ పరిణామాలు కొన్ని చోటు చేసుకుంటాయి. పనులు వాయిదా వేయడం, బద్ధకించడం మానకుంటే, 14వ తేదీ నుంచి మంచి పరిణామాలు ఉంటాయి. మీ శ్రమను గుర్తించి మీకు సహకరించేవారు పెరుగుతారు. ఉద్యోగ వ్యాపారాలలో అధికారుల తోడ్పాటు పెరుగుతుంది. అక్టోబర్: పుబ్బ నక్షత్ర జాతకులు మీ వ్యక్తిగత జాతకాన్ని సిద్ధాంతి ద్వారా పరిశీలన చేయించుకోండి. చాలా సందర్భాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. తెలివి, ఓర్పు ప్రదర్శించి కార్యసాధనకు కృషి చేస్తారు. అధికారులతో విరోధం రాకుండా జాగ్రత్తపడండి. కొన్ని ముఖ్యమైన పనులు మరచిపోయే లక్షణాలు గోచరిస్తున్నాయి. నవంబర్: కొంత అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నా, పనుల్లో తొందరపాటు పనికిరాదు. జాగ్రత్తగా ప్రయత్నిస్తే సత్ఫలితాలు పొందగలరు. కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు చాలావరకు సానుకూలం అవుతాయి. ఉద్యోగ, వ్యాపారాలు సత్ఫలితాలను ఇస్తాయి. భవిష్యత్తు ప్రణాళి కలు గురించి చర్చిస్తారు. డిసెంబర్: తెలివిగా కార్యసాధన చేస్తారు. అవరో«ధాలను లెక్కచేయరు. ఉద్యోగంలో కొత్త రకంగా అనుకూలత కలుగుతుంది. నూతన ఉద్యోగ వ్యాపార స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు సంబంధించి మంచి సలహాలు అందుతాయి. రైతులకు విద్యార్థులకు అనుకూలం. దేవాలయ దర్శనములు చేస్తుంటారు. జనవరి: శుభా శుభ పరిణామములతో కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయ, వ్యయ, ఋణ విషయాలలో కూడా మిశ్రమ ఫలితాలే ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో మాత్రం పూర్తి భిన్నంగా చాలా లాభదాయక ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఫిబ్రవరి: ప్రతి విషయం సునిశితంగా పరిశీలించి చేయడానికి అలవాటు పడండి. పని ఒత్తిడి 13వ తేదీ నుంచి పెరుగుతుంది. మీ ఇంటి యజమాని లేదా షాపు యజమానితో కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. రాబోయే రెండు మాసాల గోచారంలో అనుకూలత తక్కువగా గోచరిస్తోంది. అవకాశం ఉన్నంత వరకు ఈ నెలలోనే ఆ పనులు పూర్తి చేయడం శ్రేయస్కరం. మార్చి: చేయవలసిన పనులు మానేసి అనవసర వ్యవహారాల్లో తలమునకలు అవుతుంటారు. గ్రహచార ప్రతికూలతలు పెరుగుతున్నాయి. రాబోవు మూడు నెలలలో కోర్టు వ్యవహారాలు, ఆరోగ్యం, ఋణ విషయాలలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పాటించాలి. ఒంటరి కాల క్షేపం, ఒంటరిగా దూరప్రాంత ప్రయాణములు విడనాడండి. కలహాలు, కొత్త ప్రయత్నాలు విడనాడండి. విద్యార్థులకు, రైతులకు కూడా అనుకూలత తక్కువగా ఉంది. కన్యా రాశిఆదాయం–14, వ్యయం–2, రాజయోగం–6, అవమానం–6.ఉత్తర 2,3,4 పాదములు (టే, పా, పీ)హస్త 1,2,3,4 పాదములు (పూ, ష, ణా, ఠా)చిత్త 1,2 పాదములు (పే, పో)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (దశమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (షష్ఠ), కేతువు సింహరాశి (వ్యయ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (సప్తమ) సంచారం. మే నెల వరకు పుణ్యకార్యాలు, «ధార్మిక విజ్ఞాన వినోద కార్యక్రమాలు చేస్తుంటారు. «సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. ప్రతిపనిలోనూ మే నెల నుంచి ధైర్యం పెరుగుతుంది. ప్రతిపనీ ఆలస్యం అవుతుంది. తరచుగా కుటుంబానికి దూరంగా గడపవలసి వస్తుంది. కొన్నిసార్లు భయం పొందుతారు. రోజువారీ పనుల్లో మే నుంచి సమయపాలన లేకుండా ప్రవర్తిస్తారు. బంధువుల రాకపోకలు అధికం అవుతాయి. ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఉద్యోగ విషయాలలో సందర్భానుసారంగా ప్రవర్తించలేరు. ఒక పనిలో జరిగే ఆలస్యం మరొక ముఖ్యమైన పనికి ఇబ్బందిగా మారుతుంది. మే నెల నుంచి మీ కింద పనిచేసే వారితో ఇబ్బంది ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారులకు లాభాలు తక్కువ అయినా ప్రశాంతంగా ఉంటారు. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి సలహాలు అందుతాయి. సకాలంలో స్పందించి లబ్ధి పొందుతారు. ఆర్థిక లావాదేవీలను సవ్యంగా నడపగలుగుతారు. ఖర్చులకు తగిన ఆర్థిక వనరులు సమకూరుతాయి. ఋణ విషయాలు సానుకూలం. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తారు. కొత్తగా వచ్చే సమస్యలేవీ ఉండవు. భార్యాపిల్లల ఆరోగ్య విషయంలోనూ శుభ పరిణామాలు ఉంటాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్లు పూర్తి కావడానికి ఆలస్యమవుతుంది. అయితే నష్టం ఉండదు. షేర్ వ్యాపారులకు తెలివి, ధైర్యం ఉన్నా అనుకున్న ఫలితాలు దక్కవు. రైతులకు శ్రమ ఎక్కువ అయినా సమయానికి మంచి సలహాలు అందడం వల్ల నష్టం ఉండదు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు అందవు. నిరుత్సాహం పెరుగుతుంది. కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులు ఉన్నా, ధైర్యంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో కావలసిన రీతిలో లబ్ధి పొందుతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు ఆలస్యం అవుతాయి కాని, నష్టం ఉండదు. ఈ రాశి స్త్రీలకు శారీరక శ్రమ ఎక్కువ అవుతుంది. తరచుగా కుటుంబ, ఉద్యోగ విషయాలలో ఇతరుల నుంచి సహాయ సహకారాలు తగ్గుతాయి. పనులు సమయపాలన లేకుండా సాగడం వలన ముఖ్యమైన పనుల్లో ప్రతికూలతలు చూస్తారు. గర్భిణీ స్త్రీలు కంగారు పడనవసరం లేదు. వైద్య సలహాలు, చక్కటి నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ఆరోగ్యంతో సుఖజీవనం సాగిస్తారు.ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు: ఇతరుల విషయాలలో ఎక్కువగా కలుగ చేసుకోవద్దు తెలివిగా ప్రవర్తించి సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో సంఘంలో అనుకూల స్థితి ఉంటుంది. కొత్త కొత్త ప్రణాళికలు చేస్తారు. విజయాలు సాధిస్తారు. అయితే ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. హస్త: ప్రయాణాలను వీలయినంత తగ్గించుకుంటే లాభిస్తుంది. భవిష్యత్తు కార్యాచరణ మీద దృష్టి సారిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఒంటరి ప్రయాణం, ఒంటరి కాలక్షేపాలు పనికిరాదు. కొన్ని సందర్భాలలో ముఖ్యమైన పనులు వదిలేసి అనవసర కాలక్షేపం చేస్తూ ఉంటారు. చిత్త నక్షత్రం 1, 2 పాదాలు: వాహనాలు, పనిముట్ల వాడకంలో జాగ్రత్త అవసరం. ప్రతికూల విషయాలలో కూడా ధైర్యంగా ఉంటారు. వృత్తి ఉద్యోగ కుటుంబ విషయాలలో పనివారితో సమస్యలు తరచుగా ఉంటాయి. ఋణ వెసులుబాటు అవసర సమయంలో అందక ఒత్తిడికి లోనవుతారు. శాంతి మార్గం: ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో ‘‘శ్రీరామశ్శరణంమమ’’ అని చెబుతూ ప్రదక్షిణలు చేయడం మంచిది. ప్రాతఃకాలంలో లకీ‡్ష్మనారాయణ పూజ చేయండి. ఏప్రిల్‌లో శని శాంతికి జపదానాదులు చేయించండి. రామాయణ పారాయణ మంచిది. పంచముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని అంశాలు ఆశించిన రీతిగా సాగుతాయి. గురు, కుజుల అనుకూలత దృష్ట్యా ఋణ సమస్యలు ఎలా ఉన్నా, ఆర్థిక లావాదేవీలు బాగా నడపగలుగుతారు. పాత ఆరోగ్య సమస్యల పట్ల కూడా తెలివిగా ముందు జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. తరచు శుభకార్యాలలో పాల్గొంటారు. మే: అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రమేయం లేని విషయాల్లోనూ చికాకులు రాగలవు. తెలివిగా ఓర్పుగా ఉన్నా, వాత ఆర్థిక ఆరోగ్య కోర్టు సమస్యలు తిరగబెట్టగలవు. షేర్ వ్యాపారులు దూకుడు తగ్గించాలి. మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్లు పూర్తి కావడం కష్టమవుతుంది. ఇతరులను నమ్మి ఏ పనీ చేయవద్దు. జూన్: అందరికీ సహకరిస్తారు. మంచి గౌరవ మర్యాదలు అందుకుంటారు. కొన్నిసార్లు అనుకోని లాభాలు ఉంటాయి. మీ ఉద్యోగ వ్యాపార విషయాలలో ప్రతిపనీ ఆలస్యం అయినా లాభదాయకంగా పూర్తి అవుతాయి. ఆర్థిక వెసులుబాటు బాగుంటుంది. విజ్ఞాన వినోద కార్యక్రమాలు ఎక్కువ చేస్తుంటారు. బంధువులకు సహాయం చేస్తారు. జులై: బాగా ఆలోచించి నిర్ణయాలు చేయవలసిన కాలం. తెలివి ఓర్పు ప్రదర్శించి కార్యసాధనలో అనుకూల స్థితిని పొందుతారు. కొన్ని మంచి ఫలితాలు కూడా అందుతాయి. అయితే జాగ్రత్తగా కాలక్షేపం చేయండి. ఇతరులపై ఆధారపడి ఏ పనినీ మొదలు పెట్టవద్దు. ఆగస్ట్: ప్రత్యేక జాగ్రత్తలు పాటించి, కొన్ని విషయాలలో విజయం సాధిస్తారు. మితభాషణ ఓర్పు అవసరం. కొన్ని సందర్భాలలో కొత్త అవకాశాలు వస్తాయి. ఇతరులను నమ్మి ఏ పనీ చేయవద్దని సూచన. శుభకార్య ప్రయత్నాలు లాభదాయకంగా పూర్తవుతాయి. సెప్టెంబర్: చిత్త నక్షత్రం 3వ తేదీ నుంచి 13వ తేదీ మధ్యలో ఆరోగ్య ఋణ సమస్యలు రాగలవు. రాశి వారు అందరికీ 14వ తేదీ నుంచి దూర ప్రయాణాలు, ఒంటరి ప్రయాణాలు మంచిది కాదు. వాహనాలు, ఆభరణాల మరమ్మతులకు ధనవ్యయం బాగా అవుతుంది. అక్టోబర్: అభివృద్ధి నిరోధకమైన అంశాలను సరి చేసుకుని మంచి జీవనం వైపు ప్రయాణం చేస్తారు. కొత్త వస్తువుల కొనుగోలుకు ఎక్కువ ధనవ్యయం చేస్తారు. ఆర్థిక లావాదేవీలలో ఇబ్బందులను సరిచేసుకోగలుగుతారు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కొంత లాభదాయకంగా ఉంటాయి. నవంబర్: పనులు సకాలంలో జరగకపోవడం తప్ప మిగిలినవన్నీ సంతృప్తికరంగా ఉంటాయి. అందరి నుంచి సహకారం ఉంటుంది. ఇబ్బందులు లేని జీవితం సాగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది.డిసెంబర్: ఉద్యోగులు ఎక్కువగా రక్షణకు ప్రాధాన్యం ఇస్తారు. వ్యాపారులకు ఇబ్బందులు తొలగుతాయి. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉంటాయి. షేర్ వ్యాపారులకు, విద్యార్థులకు పరిస్థితులు సానుకూలం. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. జనవరి: సంతృప్తికరంగా కాలక్షేపం జరుగుతుంది. పనులు ఆలస్యమైనా, సానుకూలం అవుతాయి. ప్రతి పనీ విజయవంతం అయ్యే అవకాశాలు ఉంటాయి. గౌరవ మర్యాదలు పొందుతారు. గత సమస్యల పరిష్కారానికి అవకాశం చాలా బాగుంది. ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత. ఫిబ్రవరి: కుటుంబ విషయాలు మినహా అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనులు ఆలస్యం అవుతాయి. వ్యాపారాలలో ఏదో ఒక అడ్డంకి గోచరిస్తూనే ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అసలు ఉండదు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు ఉంటాయి. మార్చి: పనులు ఆలస్యమైనా, సానుకూలంగా అవుతాయి. ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉన్నా, ఇబ్బందికరం కాదు. రోజువారీ పనుల్లోనూ చికాకులు ఎదురవుతాయి. ధైర్యంగా ఉద్యోగ, వ్యాపారాలలో ఒత్తిళ్లను ఎదుర్కోగలుగుతారు. కుటుంబ విషయాలు సాధారణం. తులా రాశిఆదాయం–11, వ్యయం–5, రాజయోగం–2, అవమానం–2.చిత్త 3,4 పాదములు (రా, రి)స్వాతి 1,2,3,4 పాదములు (రూ, రే, రో, తా)విశాఖ 1,2,3 పాదములు (తీ, తూ, తే)ఈ సంవత్సరం గురువు మే 14న మి«థునరాశి (భాగ్య) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (పంచమ), కేతువు సింహరాశి (లాభ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (షష్ఠ)లో సంచారం. చాలా సమస్యలకు పరిష్కారం పొందగలిగే కాలం. మే నెల నుంచి శుభ పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. పుణ్య, శుభకార్యములు, సాంఘిక కార్యక్రమాలు చేస్తారు. గత సమస్యలు తీరే అవకాశం మే నెల నుంచి పెరుగుతాయి. రోజువారీ పనులు సానుకూలంగా ఉంటాయి. కుటుంబ విషయాలలో శుభ పరిణామాలు ఎక్కువ. ఉద్యోగులకు ఇబ్బందులు లేని జీవితం సాగుతుంది. క్రమంగా అభివృద్ధి వైపు ప్రయాణం సాగుతుంది. అనూహ్యంగా అందరూ సహకరిస్తారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో చక్కటి లాభాలు అందుకుంటారు. వ్యాపారులకు కావలసిన వనరులు సమకూరి, ఇబ్బందిలేని వ్యాపారం చేస్తారు. నూతన వ్యాపార ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. మే తరువాత ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు పెరిగినా, వాటికి సమతూకంగా ఆదాయం అందుతుంది. పాతా ఋణాలు తీరుతాయి. అవసరానికి కొత్త ఋణాలు సకాలంలో అందుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త ప్రదర్శిస్తారు. పాత సమస్యలు తీరుతాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు మే నెల వరకు ఒత్తిడి. మే నెల నుంచి మంచి ఫలితాలు ఉంటాయి. షేర్ వ్యాపారులు ఈ సంవత్సరం జూన్ నుంచి విశేష లాభాలను అందుకుంటారు. రైతులకు శ్రమ కొద్ది లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వం, వరుణుడు, సలహాలు ఇచ్చేవారు అందరూ సహకరిస్తారు. విద్యార్థులకు మే వరకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. మే నుంచి విశేష ఫలితాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో సమస్యల పరిష్కారానికి మే నుంచి సెటిల్మెంట్ ధోరణి ప్రదర్శించండి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కాలం అనుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో సత్ఫలితాలు ఉంటాయి. ఈ రాశి స్త్రీలు ప్రశాంత జీవనం సాగిస్తారు. సంవత్సరారంభంలో ఉన్న ఒత్తిడిని అధిగమించి జూన్ నుంచి విశేష లాభాలు అందుకుంటారు. ఉద్యోగ, కుటుంబ పరిస్థితులు అనుకూలం. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా కాలక్షేపం చేస్తారు. మంచివైద్యం లభించి సుఖప్రసవం జరుగుతుంది.చిత్త 3, 4 పాదాలు: అద్భుతాలు చూస్తారు. కుటుంబ అవసరాలు తీర్చడంపై దృష్టి పెట్టి మంచి జీవనం సాగిస్తారు. విజయాలు సాధిస్తారు. పుణ్యకార్యాలు చేయడం, గురువులు, పూజ్యులను దర్శించుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. స్వాతి: కుటుంబంలో పెద్దల ఆరోగ్య విష యంగా సేవలు చేయవలసి రావడంతో సొంత పనులలో సమయపాలన లోపిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో మంచి అవకాశాలు చేజారే పరిస్థితులు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. మితభాషణ అవసరం అని గ్రహించండి. విశాఖ 1, 2, 3 పాదాలు: గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయ వ్యయాలపై మంచి పట్టు సాధిస్తారు. ఋణాలు ప్రతిబంధకం కాకుండా తెలివిగా ప్రవర్తిస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. పిల్లల విషయంలో చేయవలసిన పనుల పట్ల కొంత అసంతృప్తి ఉంటుంది.శాంతి మార్గం: గురు రాహువులకు జప, దానాదులు చేయండి. సంవత్సరారంభంలో రోజూ దేవీ భాగవతం పారాయణ చేయడం బాగుంటుంది. ప్రాతఃకాలంలో విష్ణు సహస్ర నామ పారాయణం, ప్రదోషకాలంలో కాలభైరవాష్టక పారాయణం ద్వారా పాత సమస్యలు పోతాయి. షణ్ముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: కొన్ని వ్యవహారాలు లాభదాయకంగానూ, కొన్ని ఇబ్బందికరంగానూ ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకోండి. ఈ నెల ఎంత మౌనం వహిస్తే అంత అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి ఎక్కువవుతుంది. అధికారులు, కుటుంబ సభ్యుల సహకారం తక్కువగా ఉంటుంది. మే: మితభాషణ, ఓర్పు ప్రదర్శించి విజయాలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం తక్కువగా ఉంటుంది. అన్నింటా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని విజయాలు సాధిస్తారు. గురుబలంతో వృత్తి, ఆర్థిక, ఆరోగ్య వ్యవహార లాభాలు ప్రారంభం అవుతాయి. కలహాలకు దూరంగా ఉండండి. జూన్: కోపావేశాలు తగ్గించుకోవాలి. రోజువారీ పనులు మాత్రమే చేస్తూ ఉండండి. భోజనం అయిష్టమైన విధానాలతో ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపారాలు, విదేశీ నివాస ప్రయత్నాలు పూర్తిగా సత్ఫలితాలను ఇస్తాయి. జులై: పుణ్యకార్య శుభకార్య ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపారాలలోను, విదేశీ నివాస, కోర్టు, ఋణ వ్యవహారాలలో అనుకూల స్థితి ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు చాలా గొప్ప అనుకూల స్థితి. ఆదాయ, వ్యయ, ఋణ వ్యవహారాలు అనుకూలం. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం బాగుంటుంది. ఆగస్ట్: అద్భుతమైన కాలమనే చెప్పాలి. స్థానచలనం వంటి ప్రయత్నాలు అనుకూలం అవుతాయి. కోర్టు వ్యవహారాలు, పాత కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి. కాలం వృథా చేయకుండా ప్రయత్నించండి. ధన, ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండండి. సెప్టెంబర్: కుజగ్రహ శాంతి, సుబ్రహ్మణ్య ఆరాధన చాలా అవసరం. రోజువారీ పనులు బాగానే ఉన్నా, ఏదో తెలియని శారీరక మానసిక ఒత్తిడి వెంబడిస్తుంది. ఋణ వ్యవహారాలు, వాహనాలు ఇబ్బంది కలిగిస్తాయి. అక్టోబర్: ఒంటరిగా ప్రయాణాలు చేయవద్దు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు. ఋణ, ఆరోగ్య విషయాలలో బహు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కుటుంబ వ్యవహారాలలో ఇతరుల ప్రభావం వలన కలçహాలు పెరగవచ్చు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇబ్బందికరం అవుతాయి. నవంబర్: ప్రతి విషయంలోనూ తెలివిగా వ్యవహరిస్తారు. అనుకున్న ఫలితాలను సాధిస్తారు. బంధువులకు, స్నేహితులకు సహాయం చేస్తారు. మీ వద్ద పనిచేసేవారు మీకు బాగా సహకరిస్తారు. పుణ్యకార్యాలు, శుభకార్యాలతో కాలక్షేపం చేస్తారు. డిసెంబర్: చాలా వ్యవహారాలను తెలివిగా సాధిస్తారు. పనులు వేగంగా సాగుతాయి. ఉద్యోగ, వ్యాపారాలలో మీ వద్ద పనిచేసేవారు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో ఖర్చు పెరుగుతుంది. పిల్లల అభివృద్ధి వార్తలు అందుతాయి. జనవరి: కుటుంబ వ్యవహారాలను సానుకూలం చేయగలుగుతారు. ప్రశాంతంగా అన్ని వ్యవహారాలు సాధించుకుంటారు. బంధువులకు, స్నేహితులకు ధనవ్యయం చేయవలసి వస్తుంది. ప్రయాణాలలో ఖర్చులు పెరుగుతాయి. వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా అనుకూలత. ఫిబ్రవరి: తెలివిగా ధైర్యంగా వ్యవహార లాభం అందుకుంటారు. వృత్తి సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో ఎక్కువ శ్రమ చేయమని ప్రత్యేక సూచన. ఆదాయ, వ్యయాలను సమర్థంగా నిర్వహిస్తారు. అవసరమైన ఋణాలు సకాలంలో అందుతాయి. వ్యాపారులకు ప్రోత్సాహకరమైన కాలం. షేర్ వ్యాపారులు లబ్ధి పొందుతారు. మార్చి: ప్రతిపనీ స్వయంగా చేసుకోండి. కుటుంబ విషయాలలో ఇతరుల ప్రమేయ కలహాలకు దారి తీస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడిని తెలివిగా దాటతారు. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. ప్రతి విషయంలో ఆర్థిక వెసులుబాటు అనుకూలం. వ్యాపారులకు అనుకూలం. మీ పిల్లల నుంచి ఆశించిన ఫలితాలు అందక మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఋణ సౌకర్యం బాగుంటుంది. వృశ్చిక రాశిఆదాయం–2, వ్యయం–14, రాజయోగం–5, అవమానం–2.విశాఖ 4 వ పాదము (తొ)అనురాధ 1,2,3,4 పాదములు (నా, నీ, నూ, నే)జ్యేష్ఠ 1,2,3,4 పాదములు (నో, యా, యీ,యూ)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (అష్టమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (అర్థాష్టమ), కేతువు సింహరాశి (దశమ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29వ తేదీ నుండి మీనరాశి (పంచమ) సంచారం. ఏ పనిలోను స్థిరబుద్ధి ప్రదర్శించలేరు. అందరికీ మీ వ్యవహారాల మీద తక్కువ స్థాయి ఆలోచనలు ఉంటాయి. మీరు తరచుగా ప్రభుత్వ అధికారులు, చోరులు వంటి వారితో చికాకు పడుతూనే ఉంటారు. పరుషంగా మాట్లాడుతుంటారు. రోజువారీ పనుల్లో ఆలస్యం చేసి ఇబ్బంది పడతారు. మీ నుంచి కుటుంబీకులకు అందవలసినవన్నీ ఆలస్యంగా అందుతాయి. భోజన, స్నానాదికాలలో కూడా సమయపాలన లేక జీవనశైలి ఇబ్బందికరం అవుతుంది. ఉద్యోగ విషయాల్లో సరైన దృష్టి ప్రదర్శించక పనులు పాడు చేసుకుంటారు. ప్రమోషన్, స్థానచలనాలు అనుకూలంగా లేవు. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులు సరిగా సాగవు. వ్యాపారులకు అనుకూల లాభాలు లేకున్నా, ఇబ్బందులు ఉండవు. నూతన వ్యాపార ప్రయత్నాలను వాయిదా వేసుకుంటే మంచిది. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. స్థిరాస్తి లావాదేవీలు, ఆస్తి తగాదాలలో ఇబ్బందులు తప్పవు. మే వరకు ఆదాయ వ్యయాలు సమంగా ఉంటాయి. మే తరువాత డబ్బు ఇబ్బందులు తప్పవు. కొత్త ఋణాలు సకాలంలో అందవు. వాత సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం అంతా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మార్కెటింగ్ ఉద్యోగులకు శారీరక మానసిక ఒత్తిడి ఉంటుంది. షేర్ వ్యాపారులకు మే వరకు లాభాలు బాగుంటాయి. మే తరువాత లాభాలు తక్కువగా ఉంటాయి. రైతులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విద్యార్థులకు మే నుంచి ఏకాగ్రత లోపిస్తుంది. కోర్టు వ్యవహారాలలో వాయిదాలే శరణ్యం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో మోసాలు ఎదురవుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో విద్య కోసం వెళ్ళేవారికి మే వరకు కాలం అనుకూలం. ఈ రాశి స్త్రీలకు మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ, కుటుంబ విషయాలకు సమతూకంగా న్యాయం చేయలేరు. కుటుంబ సభ్యులు తగిన గౌరవం ఇవ్వడం లేదనే భావనకు లోనవుతారు. పనులు వాయిదా పడుతుంటాయి. ఆర్థిక లావాదేవీలలో సమస్యలు వెంటాడుతాయి. గర్భిణీ స్త్రీలకు మే నుంచి జాగ్రత్తలు అవసరం. వైద్య సలహాలు, పెద్దల సంరక్షణ తప్పనిసరి.విశాఖ 4వ పాదం: దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఆర్థిక చికాకులు ఇంకా ఉంటాయి. ఋణ అసౌకర్యం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలసి చేయవలసిన పనులు వాయిదా పడుతూ ఉంటాయి. వివాదాల జోలికి వెళ్ళవద్దు. స్వబుద్ధితో చేసే పనుల్లో విజయావకాశాలు ఎక్కువ. అనురాధ: స్పష్టత లేని నిర్ణయాలు చేస్తుంటారు. ఎప్పటి నుంచో ఉన్న వ్యాపార సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఉద్యోగ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ అవసరాలు తీర్చడానికి ఎక్కువ కృషి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. జ్యేష్ఠ: అవసరమైన సమయాలలో ఆత్మీయులు స్పందింపక పోవడంతో మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. çగౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవసరానికి ఋణం, ఆదాయం సరిగా అందక ఇబ్బంది పడతారు. శాంతి మార్గం: మార్చి నెలలో రాహువుకు, మే నెలలో గురువుకు శాంతి చేయించండి. దుర్గా సప్తశ్లోకి, దక్షిణామూర్తి స్తోత్రం, దేవీ భాగవత పారాయణం చేయడం వలన ప్రశాంతత ఏర్పడుతుంది. విష్ణుపూజలు చేయండి. పంచముఖ రుద్రాక్షధారణ శ్రేయోదాయకం.ఏప్రిల్: కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. పిల్లల అభివృద్ధి వార్తలు తరచుగా వింటారు. ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా సాగుతాయి. ఋణాలు ఇబ్బందికరం కాకుండా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలం. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త కొత్త ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మే: స్థానచలన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. 15వ తేదీ తరువాత గురుగ్రహ శాంతి చేయించండి. అందరి సహాయ సహకారాలు, గౌరవం అందుకుంటారు. ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాలలో ఆలోచించి నిర్ణయాలు చేయండి. ఒంటరిగా దూర ప్రయాణాలు విరమించుకోండి. జూన్: ఆత్మీయుల సేవలను గుర్తించరు. ఉద్యోగ వ్యాపారాలలో ఒత్తిడి ఉంటుంది. కొన్ని పాత సమస్యలు మరలా తిరగబడే అవకాశం ఉంటుంది. అవసరాలకు తగిన డబ్బులు సర్దుబాటు జరగదు. కొన్ని సందర్భాలలో మనో నిబ్బరం ప్రదర్శిస్తారు. ప్రయాణ అసౌకర్యాలు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. జులై: కోపావేశాలకు అనుకూల కాలం కాదు. ఉద్యోగ రీత్యా అనవసర తిరుగుడు పెరుగుతుంది. జీర్ణసంబంధ ఇబ్బందులు రాగలవు. పాత సమస్యలు తిరగబడే అవకాశం ఉంది. అధికారులు, తోటివారు సహకరించరు. అవసరానికి ధనం అందుబాటు తక్కువ. అనవసర విషయాల జోలికి పోవద్దు. ఆగస్ట్: కొత్త అవసరాలకు తగిన ఆర్థిక సౌకర్యం లభిస్తుంది. చాలా విషయాలలో స్వయంగా శోధించి, విజయాలు అందుకుంటారు. తెలియక చేసిన పొరపాట్లు నెలాఖరులో సరిచేసుకునే అవకాశం ఉంది. బంధువులు, కుటుంబసభ్యులు సహకారం తక్కువ. ఉద్యోగ వ్యాపారాలలో సాధారణ స్థితి ఉంటుంది. సెప్టెంబర్: అధిక గ్రçహానుకూలత ఉన్న కాలం. కుటుంబ సౌఖ్యం అద్భుతంగా ఉంటుంది. ఆదాయం వ్యయాలు సమతూకంగా లేకున్నా, సమర్థంగా ఆర్థిక వ్యవహారాలను నిర్వహిస్తారు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లలో కొత్త ఋణాలు చేయవద్దు. అక్టోబర్: ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది. మీరు మంచి మాటలు చెప్పినా, అవి వికటించే అవకాశం ఉంది. మితభాషణ, ఓర్పు చాలా అవసరం. విద్యా వ్యాసంగం సరిగా సాగదు. నూతన ఉద్యోగ వ్యాపారాలు కొంత ఇబ్బందికరం. అవసరానికి తగిన ధనం చేకూరదు.నవంబర్: పనులు కొంచెం ఇబ్బందికరం అవుతున్నా, అన్నింటా సమర్థంగా వ్యవహరిస్తూ ముందుకు వెడతారు. ఫలితాలు ఆశించిన రీతిగా ఉండవు. విద్యా విజ్ఞాన కార్యక్రమాలలో విఘ్నాలు ఎదురవుతాయి. ఆర్థిక కార్యకలాపాలు సంతృప్తికరంగా సాగవు. డిసెంబర్: వృత్తి ఉద్యోగాలను శ్రద్ధగా నడపలేని పరిస్థితి ఉంటుంది. పనులు దాటవేసే లక్షణాలు ఎక్కువ అవుతాయి. ఎక్కువగా ప్రయాణాలు చేయాలనే కోరిక పెరుగుతుంది. పిల్లలు వ్యతిరేక ధోరణితో ప్రవర్తిస్తారు. ఆర్థిక లావాదేవీలలో తెలివిగా వ్యవహరిస్తారు. కొత్త ఋణాలు చేయవద్దని సూచన. జనవరి: మంచి కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ సభ్యులు సహకరిస్తారు. ధైర్య స్థైర్యాలను అన్ని విషయాలలోనూ ప్రదర్శిస్తారు. ఆర్థిక లావాదేవీలు బాగా సాగుతాయి. కుటుంబపరంగా చిన్న చిన్న చికాకులు ఉంటాయి. గత సమస్యలకు పరిష్కారాలను త్వరగా వెదకగలుగుతారు. కొత్త ఋణాలు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి.ఫిబ్రవరి: మంచి అనుభూతులు మిగిల్చే కాలం. అన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు ఇబ్బందికరం అయినా, తెలివిగా వ్యవరించి, లాభాలు పొందుతారు. ఉద్యోగంలో మంచి మార్పులు ఉంటాయి. ఒత్తిడిని తట్టుకుని నిలబడతారు. కుటుంబ, వృత్తి విషయాలు రెండింటినీ సమర్థంగా నడిపి మంచి పేరు సాధిస్తారు. మార్చి: రోజువారీ పనులలో బాగా తెలివిగా వ్యవహరిస్తారు. ఇతరులకు సçహాయం చేయడాన్ని ఒక విధిగా భావించి చేస్తుంటారు. ఉద్యోగంలో శ్రమ ఎక్కువ అవుతుంది. అధికారుల తోడ్పాటు తక్కువ అయినా నష్టంలేని జీవితం సాగుతుంది. వ్యాపారులకు సాధారణ స్థాయి లాభాలు అందుతాయి. ఆదాయ, వ్యయ ఋణాలు సాధారణ స్థాయిలో ఉంటాయి. మాట నిలబెట్టుకోలేరు. ధనూ రాశిఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–1, అవమానం–5మూల 1,2,3,4 పాదములు (యే, యో, బా, బీ)పూర్వాషాఢ 1,2,3,4 పాదములు (బూ, ధా, భా, ఢా)ఉత్తరాషాఢ 1వ పాదము (బే)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (సప్తమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (తృతీయం), కేతువు సింహరాశి (భాగ్య) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (అర్ధాష్టమ) సంచారం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చేసిన పనులకు తగిన గుర్తింపు రాదు. గొప్పగా ఓర్పు సహనం ప్రదర్శించి సాధారణ జీవనానికి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడతారు. అందరితోనూ కలహాలు రాకుండా స్నేహభావం ప్రదర్శిస్తారు. స్నేహితులతో మిత సంభాషణ, సంచారం చేయండి. రోజువారీ పనులపై ప్రత్యేక దృష్టి ఉంచండి. కుటుంబ వ్యవహారాల్లో శుభపరిణామాలు ఉంటాయి. మీ అవసరాలు గుర్తించి సహకరించే కుటుంబసభ్యుల కారణంగా మంచి ఫలితాలు ఉంటాయి. సోదరద్వేషం తప్పదు. ఉద్యోగాల్లో ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు జాగ్రత్తగా చేసుకుంటే మీకు కావలసిన చోటుకు చేరే అవకాశం ఉంటుంది. ఎవరూ సహకరించకపోయినా, విజయం తథ్యం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మంచి సూచనలు అందుతాయి. వ్యాపారులకు కొన్నిసార్లు విశేష మందగమనం, కొన్నిసార్లు విశేష లాభాలు ఉంటాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు తెలివిగా నడుపుతారు. అనవసర ఖర్చులు ఉంటాయి. ప్రయాణ ఖర్చులు అధికం అవుతాయి. ఋణ విషయాలు సానుకూలం. వాత సంబంధ ఆరోగ్య సమస్యలు, చర్మవ్యాధులు ఉన్నవారు ఇబ్బంది పడతారు. మార్కెటింగ్ ఉద్యోగులు జూన్ నుంచి తేలికపాటి ప్రయత్నాలతో మంచి ఫలితాలు అందుకుంటారు. షేర్ వ్యాపారులు బుద్ధి, ఓర్పుతో లాభాలు అందిస్తాయి. రైతులకు శ్రమకు తగిన లాభాలు అందుతాయి. విద్యార్థులకు మంచి కాలం. కోర్టు వ్యవహారాలలో స్వయంగా అన్నీ శోధిస్తే విజయం పొందగలరు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో పనులు వేగం చేయమని సూచన. వాహన కొనుగోలుకు కాలం అనుకూలం. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో అంతా లాభదాయకం. ఈ రాశి స్త్రీలకు చాలా ధైర్యం చేకూరుతుంది. ప్రతిపనీ చేయగలం అనే ధీమా ఉంటుంది. ఉద్యోగినులకు ప్రమోషన్లు ద్వితీయార్ధంలో అందుతాయి. వ్యాపారులు శ్రమతో పనులు పూర్తి చేసు కుంటారు. గర్భిణీ స్త్రీలకు సాధారణ ఫలితాలు ఉంటాయి. జూన్ దగ్గర నుంచి అంతా అనుకూలం. కావలసిన వైద్య సదుపాయాలు, మంచి సంరక్షణ అందుతాయి. మూల: ఎవరికీ హామీలు ఇవ్వవదు. ముఖ్య వ్యవహరాలలో అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. బహు జాగ్రత్తలతో కాలక్షేపం చేయాలి. రోజువారీ కార్యక్రమాలకు పరిమితం కావడం మేలు. వేరే వ్యవహారాల జోలికి వెళ్ళవద్దు. పూర్వాషాఢ: మీ సహననానికి పరీక్షా కాలం. మీ ఆర్థిక వనరులు అవసరానికి ఉపయోగపడవు. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో శ్రమ ఎక్కువైనా, సమస్యలు ఉండవు. వినోద కార్యక్రమాలో పాల్గొంటారు. ఉత్తరాషాఢ 1వ పాదం: వ్యాపారులకు విజయావకాశాలు ఎక్కువ. ఉద్యోగంలో పదోన్నతికి ఆటంకాలు. కుటుంబ విషయంలో మంచి నిర్ణయాలు చేయగలుగుతారు. కొత్త ప్రయత్నాలు వద్దు అనుకుంటూనే ప్రారంభించి, రోజువారీ పనుల్లో ఇబ్బందులు పడతారు. అనవసర ప్రయాణాలు ఎక్కువ. శాంతి మార్గం: కుజగ్రహ సంచారం ఎక్కువ ఇబ్బందికరం. జూన్ వరకు నెలకు ఒకసారి కుజగ్రహ శాంతి చేయించండి. రోజూ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. పంచముఖ రుద్రాక్షధారణ శ్రేయోదాయకం.ఏప్రిల్: కొత్త కొత్త అనుభూతులు ఎదురవుతాయి. రోజువారీ జీవనశైలిలో విశేష మార్పులు చూస్తారు. కొన్ని సందర్భాలు ఆనందాన్ని, కొన్ని సందర్భాలు విచిత్రమైన భయాలు కలుగజేస్తాయి. అందరి సహకారం లభిస్తుంది. ఎవరినీ నమ్మలేని స్థితిలో ఉంటారు. ఉద్యోగ వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. మే: ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారో, ఎప్పుడు ఆగ్రహావేశాలతో ఉంటారో తెలియని పరిస్థితి. ఉద్యోగ వ్యాపారాలలో ఇతరుల ప్రమేయానికి ఆస్కారం ఇవ్వకండి. «అవసరానికి దనం సర్దుబాటు కాకపోవచ్చు. ఇల్లు లేదా వాహనం విషయంలో ఖర్చులు పెరగవచ్చు. 15వ తేదీ తరువాత అనుకూలం. జూన్: తెలివిగా ఉద్యోగ, వ్యాపార సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలలో నిబద్ధతతో వ్యవహరిస్తారు. కుటుంబ వ్యవహారాలు తెలివిగా సాగిస్తారు. పెద్దల ఆరోగ్య విషయంలో చికాకులు ఉంటాయి. పుణ్యకార్యాలు చేయాలనుకుంటారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. జులై: కలహాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఏకాగ్రత లోపిస్తుంది. వాత సమస్యలు తరచుగా వెంటబడే అవకాశం ఉంటుంది. అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వేళకు అన్న వస్త్రాలు అందవు. స్థానచలన విషయంలో ప్రతికూలతలు రాకుండా జాగ్రత్త పడండి. తెలియని పొరపాట్ల వల్ల ఇబ్బంది పడవచ్చు. ఆగస్ట్: అనవసర చర్చలు, వృథా కాలక్షేపాలతో అవసరమైన పనులు దూరం చేసుకుంటారు. అధికారుల సహాయ సహకారాలు తగ్గుతాయి. దూర ప్రయాణాలలో చికాకులు, వాహన మరమ్మతు ఖర్చులు ఉంటాయి. బంధు మిత్రుల రాకపోకలు ఎక్కువవుతాయి. సెప్టెంబర్: ఆనందంగా కాలక్షేపం చేస్తారు. తరచుగా బంధు మిత్రుల కలయిక మంచి అనుభూతిని ఇస్తుంది. పుణ్య కార్య శుభ కార్యాలలో మంచి కాలక్షేపం జరుగుతుంది. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ వ్యవహారాలను సమర్థంగా నిర్వహించగలుగుతారు. సర్వత్రా విజయం ఉంటుంది. అక్టోబర్: కొన్ని విశేష కార్యక్రమములకు శ్రీకారం చేస్తారు. కాలం చాలా బాగుంది. పనులు వేగం చేయండి. బంధు మిత్రులు బాగా సహకరిస్తారు. ఉద్యోగ వ్యాపారాలు లాభదాయకంగా మారతాయి. కీర్తి ప్రతిష్ఠలు బాగా పెరుగుతాయి. నవంబర్: 15వ తేదీ తరువాత అడ్డంకులు తరచుగా వస్తాయి. ఆలోచనా శక్తి బాగున్నా పనుల అమలు కష్టం అవుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో అధికారులతో ఒత్తిడి ఉంటుంది. అందరూ సహకారం చేస్తున్నట్లుగా ఉన్నా, అది భ్రమ. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటేనే అభివృద్ధి ఉంటుంది.డిసెంబర్: అనవసర భయాందోళనలను దరి చేరనివ్వకండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. కుటుంబ సభ్యులతో సఖ్యత లోపిస్తుంది. ఆదాయం తక్కువగా ఉన్నా ఖర్చులు నియంత్రించగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యం. మంచి ఆలోచనలు చేసినా అమలు చేయలేని స్థితి. జనవరి: బంధుమిత్రుల రాకపోకలలో కలహాలకు అవకాశం ఇవ్వవద్దని సూచన. కొన్ని పనుల వల్ల రోజువారీ పనుల్లో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఆర్థిక లావాదేవీలు బాగానే ఉన్నా, ఋణ విషయాలలో కొంత జాగ్రత్త పాటించాలి. కుటుంబ అవసరాలు తీర్చడంలో జాగ్రత్తలు తీసుకుంటారు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. విహార యాత్రలు, పుణ్యకార్యాలు చేస్తుంటారు. ఫిబ్రవరి: కాలం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ప్రయత్నాలు చేసేవారు మాత్రమే ఇబ్బంది ఎదుర్కొంటారు. ఆరోగ్యం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ విషయాలు సాధారణంగా ఉంటాయి. వ్యాపారాలలో కొంత ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు సాధారణంగా ఉంటాయి. మార్చి: అంతా శుభ పరిణామాలతో గడచిపోతుంది. ఎప్పటి నుంచో ఉండిపోయిన వ్యవహారాలు ఈ నెలలో పూర్తి అయ్యే దిశగా పయనిస్తాయి. ఉద్యోగులకు చాలా విశేషమైన కాలం. పదోన్నతులు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు బాగా అనుకూలం. విద్యార్థులకు, షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం. మకర రాశిఆదాయం–8, వ్యయం–14 , రాజయోగం–4, అవమానం–5 .ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ)శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ)ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి)ఈ సంవత్సరం గురువు మే 14న మి«థునరాశి (షష్ఠ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (ద్వితీయ), కేతువు సింహరాశి (అష్టమం) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (తృతీయ) సంచారం. కేవలం శని, రాహు సంచారం అనుకూలత వల్ల విజయాలు సాధిస్తారు. అయితే జూన్ వరకు కుజ సంచారం ప్రభావంగా ప్రయాణ విషయాలలో చికాకులు ఉంటాయి. స్వబుద్ధి, స్వశక్తితో విజయాలు సాధిస్తారు. శ్రమతో కూడిన పనులు జూన్‌లోపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. రోజువారీ పనుల్లో ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ విషయాలను కొంచెం ఓర్పుగా చూసుకోవాలి. చికాకులు ఎప్పుడు ఎలా ఉత్పన్నమవుతాయో చెప్పలేని స్థితి ఉంటుంది. ఉద్యోగాలలో శని అనుకూలత వల్ల సర్వత్రా విజయమే. ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు, ప్రమోషన్ ప్రయత్నాలు విశేషంగా అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులు జూన్ వరకు విశేషం. సంవత్సరం అంతా శుభమే. వ్యాపారులు మార్పులు చేపట్టే ఆలోచనలు చేస్తారు. వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో సానుకూలత. ఆర్థిక లావాదేవీలు సమర్థంగా సాగిస్తారు. ఆదాయం తక్కువగా ఉన్నా, ఖర్చులు నియంత్రించి జూన్ వరకు సుఖపడతారు. జూన్ తరువాత ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరిగే అవకాశములు ఉ్తన్నాయి. తరువాత కొత్త ఋణాలు అందడం కష్టం అవుతుంది. ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉండవు. ప్రతి విషయంలో ముందు జాగ్రత్తలు పాటిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగులకు అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. షేర్ వ్యాపారులకు అంతా శుభసూచకమే. మీ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేస్తారు. రైతులకు శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. విద్యార్థులకు విద్యావ్యాసంగం బాగా సాగుతుంది. కోర్టు వ్యవహారాలలో మంచి లాభ ఫలితాలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో పనులు వేగవంతం అవుతాయి. అనుకున్న రీతిగా వ్యవహారం జరుగుతుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఇబ్బందులు లేకుండా పనులు పూర్తి అవుతాయి. ఈ రాశి స్త్రీలకు మే వరకు ఉన్న ప్రశాంతతో చాలా విజయాలు సాధిస్తారు. ఇబ్బందిలేని జీవనం సాగిస్తారు. తెలివిగా ఓర్పుగా కుటుంబవృద్ధి సాధించుకుంటారు. గౌరవం పొందుతారు. సమయపాలన ద్వారా విజయాలు అందుకుంటారు. పుణ్య విజ్ఞాన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో ముందు జాగ్రత్తలు పాటిస్తారు. అంతా శుభప్రదంగా ఉన్నా, అధైర్యం పొందుతారు. చిన్న ఆరోగ్య సమస్యలు తరచుగా వస్తుంటాయి. దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయండి.ఉత్తరాషాఢ 2, 3,4 పాదాలు: అనాలోచిత కార్యములు ఎక్కువగా చేస్తుంటారు. నమ్మకంగా మోసగించే లక్షణాలు వున్నవారు మీ పనులలో చొరబడతారు. ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, ఆర్థిక విషయాలలో ఇతరుల సలహాలకు అవకాశం ఇవ్వకుండా గౌరవంగా పనులు పూర్తి చేసుకుంటారు. శ్రవణం: మరింత శ్రద్ధ అవసరం. ఇతరులకు ఇచ్చిన డబ్బులు వసూలు కావడంలో ఇబ్బందులు ఉంటాయి. ఇతర వ్యాపకాలు ఆకర్షించినా, వాటి జోలికి పోవద్దని సూచన. మితభాషణ, ఓర్పు మీకు శ్రీరామరక్షగా గుర్తించండి. ధనిష్ఠ 1, 2 పాదాలు: కర్తవ్య నిర్వహణ నిబద్ధతతో ఉండి గౌరవం అందుకుంటారు. కొత్త వ్యవహారాల జోలికి పోవద్దు. వ్యాపారులకు వర్కర్స్ ద్వారా సహకారం అందుతుంది. కొత్త అలంకరణ వస్తువులు, వాహనాల కొనుగోలుపై దృష్టి ఉంచుతారు. కుటుంబ ప్రోత్సాహం అద్భుతంగా అందుకుంటారు. శాంతి మార్గం: గురువుకు, కుజుడికి మే నెలలో శాంతి చేయించండి. రోజూ శివ కుటుంబం అంతా ఉన్న శివాలయంలో ప్రదోషకాలంలో 11 ప్రదక్షిణాలు చేయడం మంచిది. గురుచరిత్ర పారాయణ, సుదర్శన స్తోత్ర పారాయణ చేయడం మంచిది. అష్టముఖ రుద్రాక్షధారణ శ్రేయోదాయకం.ఏప్రిల్: కొత్త ప్రయోగాలు చేయకుండా ఉండేవారు సుఖంగా ఉంటారు. అనవసర ప్రయోగాలు చేసేవారు ఇబ్బందులు పడతారు. ఈ నెలంతా వృత్తి రీత్యా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ప్రతిపనీ ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయడం వలన అద్భుత ఫలితాలు రాగలవు. విద్యార్థులకు కాలం అనుకూలం. మే: ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోండి. కోపావేశాలకు గురి అవుతుంటారు. కొత్త ప్రయోగాలు చేయవద్దు. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళకండి. అధికంగా దూర ప్రయాణాలు చేయవద్దు. మార్కెటింగ్ ఉద్యోగులకు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. ప్రతి విషయానికి అతిగా స్పందించవద్దు. జూన్: బహు జాగ్రత్తలతో కాలక్షేపం చేయండి. జీవనోపాధి మార్గాలు సాధారణ స్థాయిలో నడుస్తాయి. కుటుంబ విషయాల్లో ఎప్పుడెలా సమస్యలు తలెత్తుతాయో చెప్పలేం. కొన్నిసార్లు లాభం చేకూరుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలలో మంచి వార్తలు వింటారు. జులై: 16 తర్వాత అనుకూలత తగ్గుతుంది. ప్రతి విషయంలోనూ అలసత్వం ప్రదర్శించకుండా ఓర్పుగా ముందుకు వెళితే విజయావకాశాలు పెరుగుతాయి. జాగ్రత్తగా సంచరించేవారికి ఈ నెల చాలా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆగస్ట్: చాలా విషయాలు స్వయంగా పరిశీలించుకుంటే ఇబ్బందులు ఉండవు. పూర్తి అనుకూలమైన కాలం కాకున్నా, సరిగా ప్రయత్నిస్తే సమస్యలు దూరం అవుతాయి. కొత్త అలంకరణ వస్తువుల కొనుగోలు విషయంగా ఖర్చులు పెరుగుతాయి. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. భవిష్యత్తు వ్యవహారాలకు శ్రీకారం చేస్తారు. సెప్టెంబర్: కోపావేశాలు లేనివారికి, తొందరపాటు నిర్ణయాలు చేయనివారికి చాలా మంచి కాలం. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. అయితే వాటి అమలు కష్టసాధ్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఉపశమనంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా మంచి మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి. అక్టోబర్: భార్యాభర్తలకు, తండ్రి పిల్లలకు మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వాహన లాభం, ప్రయాణ సౌఖ్యం బాగుంది. ఆర్థిక లావాదేవీలు బాగా జరుగుతాయి. అందరి ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెటింగ్ ఉద్యోగులు, షేర్ వ్యాపారులు కొంత శ్రమను పొందినా, లాభాలు పొందుతారు. విద్యార్థులకు, రైతులకు లాభదాయకం. నవంబర్: చాలా గొప్ప అనుభూతులు కలుగుతాయి. ధైర్యం తెలివి ప్రతి విషయంలో ప్రదర్శిస్తారు. మీ ప్రయత్నాలు సానుకూలం అవుతాయి. ఇతరుల వ్యవహారాలు చూడడం విడనాడండి. కావలసిన ఆర్థిక వెసులుబాటు, మనిషి సహకారం బాగా అందుతాయి. ప్రశాంత జీవనంతో సుఖపడతారు. డిసెంబర్: వ్యాపార అవరో«ధాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక లావాదేవీలలో విచిత్రస్థితి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలకు ఈ నెలలో కదలికలు వస్తాయి. జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగ వ్యాపార కుటుంబ వ్యవహారాలు మినహా ఇతర పనులు చేపట్టవద్దు అని సూచన. ఋణాలు అవసరానికి సర్దుబాటు కావు. జనవరి: ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ, కుటుంబ విషయాలు మినహా మిగిలిన వాటిని వాయిదా వేయడం మంచిది. ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకోవడం మంచిది కాదు. ఒంటరిగా దూర ప్రయాణాలు చేయవద్దు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయడం శ్రేయస్కరం. ఫిబ్రవరి: శుభాశుభ పరిణామాలు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలలో ఎక్కువగా కలుగచేసుకోకండి. పనులు స్వయంగా చేసుకోండి. ఆగ్రహావేశాలు తగ్గించండి. చాలా ఒత్తిడితో ఉద్యోగ విధి నిర్వహణ చేస్తారు. శుభకార్య పుణ్యకార్యాలలో ధనవ్యయం అధికం అవుతుంది. మార్చి: మంచి మార్పులు ఉంటాయి. అన్ని అంశాలలోనూ విజయాలకు దగ్గర అవుతారు. రాబోవు మూడు మాసాలలో చాలా అనుకూలతలు గోచరిస్తున్నాయి. వేగంగా పనులు పూర్తి చేసి వృత్తి ఉద్యోగాలలో గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. ఆదాయ వ్యయాలు సానుకూలంగా ఉంటాయి. ప్రశాంత జీవనం చేస్తారు. కుంభ రాశిఆదాయం–8, వ్యయం–14, రాజయోగం–7, అవమానం–5ధనిష్ఠ 3,4 పాదములు (గూ, గే)శతభిషం 1,2,3,4 పాదములు (గొ, సా, సీ, సు)పూర్వాభాద్ర 1,2,3 పాదములు (సే, సొ, దా)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (పంచమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (జన్మ), కేతువు సింహరాశి (సప్తమ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (ద్వితీయ) సంచారం. ఏలినాటి శని తృతీయ భాగంలో నడుస్తుంది. రాహువు పెద్దగా యోగించకపోయినా, గురుబలం అనుకూలత వలన మంచి ఫలితాలు అందుకుంటారు. కొన్నిసార్లు తెలివిగాను, కొన్నిసార్లు అసహనంతో ప్రవర్తిస్తుంటారు. మీ గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ప్రవర్తన ఉండేలా చూసుకోండి. రోజువారీ పనులలో స్థిరచిత్తం లోపించడంతో కొత్త కొత్త సమస్యలు ఎదురవుతాయి. కుటుంబ విషయాల్లో అనవసర కలహాలకు అవకాశం ఇచ్చేలా ప్రవర్తిస్తుంటారు. గురుబలం వలన పెద్దస్థాయి కుటుంబ ఇబ్బందులు ఉండవు. ఉద్యోగాలలో కొన్నిసార్లు ఓర్పుగా ప్రవర్తించి మంచి ఫలితాలు, కొన్నిసార్లు చికాకుగా వ్యవహరించి ఇబ్బందులు పొందుతారు. అధికారులతో జాగ్రత్త అవసరం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో పనులు వేగంగా సాగుతాయి. వ్యాపారులకు అంతా శుభ ఫలితాలే ఉన్నా, తెలియని అసంతృప్తి ఉంటుంది. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి సలహాలు, సహకారం లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఇబ్బందులు లేకుండా కాలం సాగుతుంది. ఋణ విషయాలలో జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్య విషయంలో రోగం ఒకటి, వైద్యం మరొకటిగా ఉంటుంది. మార్కెటింగ్ ఉద్యోగులకు బుద్ధి సరిలేక తగిన ఫలితాలు అందుకోలేరు. షేర్ వ్యాపారులకు శుభపరిణామాలు ఉంటాయి. రైతులకు శ్రమకు తగిన లాభాలు అందుతాయి. విద్యార్థులకు శ్రమ చేసిన కొద్దీ మంచి ఫలితాలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలలో తప్పుదోవ పట్టించేవారిని గుర్తించి, దూరంగా ఉంచడం మంచిది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో చికాకులు, మోసం వెంట వచ్చినా చివరకు లాభాలు అందుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో మందగమనంగా లాభదాయకంగా పూర్తి అవుతాయి. ఈ రాశి స్త్రీలకు అన్ని పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో కొత్త ప్రయోగాలు చేస్తారు. రాహు ప్రభావం వల్ల మీ సేవలకు తగిన గుర్తింపు ఉండదు. మోసపోయే అవకాశాలు ఎక్కువ. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం బాగానే ఉన్నా, అనవసర భయాందోళనలు పెరిగి చికాకులు పొందుతారు. దేవీ భాగవత పారాయణ చేయండి. దుర్గా/దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ చేయండి.ధనిష్ఠ 3, 4 పాదాలు: తరచుగా మోసాలకు గురవుతారు. శారీరకంగా ఇబ్బంది ఉందనే భావన గోచరిస్తుంది. చేయవలసిన పనులు ఆపేసి అనవసరమైనవి చేస్తూ ఉంటారు. ఉద్యోగాల్లో అంతా బాగున్నా, తెలియని భయం వెంటాడుతుంది. అవసరాలకు కావలసిన డబ్బు అందుతుంది. సకాలంలో లక్ష్యాలు పూర్తి చేయరు. శతభిషం: వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజా సంబంధాలు చికాకులు సృష్టిస్తాయి. గొప్ప కోసం విరాళాలు ఇవ్వాల్సి వచ్చి ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్త. కుటుంబంలో పెద్దలు, పిల్లల విషయంలో సంతృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు: ఆర్థిక లావాదేవీలు విచిత్రంగా ఉంటాయి. కొన్నిసార్లు డబ్బు ఉన్నా అప్పులు చేయడం, కొన్నిసార్లు డబ్బు ఉన్నా అప్పులు తీర్చకపోవడం వంటివి చేస్తుంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి అనుమానాలు పెరుగుతాయి. నేత్ర బాధలు చికాకులు కలిగిస్తాయి. అనాలోచితంగా ప్రవర్తించడం సహజ లక్షణంగా మారిపోతుంది. సొంత డ్రైవింగ్ తగ్గించండి.శాంతి మార్గం: శని, రాహు, కేతువులకు శాంతి చేయించండి. రోజూ ఇంద్రాక్షీ స్తోత్రం మరియు పిప్పలాద కృత శనిస్తోత్రం పారాయణ చేయడం శ్రేయస్కరం. శనివారం రోజు బట్టలు, చెప్పులు వంటివి దానం చేయడం శుభప్రదం. గౌరీశంకర రుద్రాక్షధారణ చేయడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది.ఏప్రిల్: సమస్యలు ఉన్నాయో లేవో చెప్పలేని సందిగ్ధ కాలం. ఓర్పుగా ఉండాలి. కొత్త పనులు చేయడం మంచిది కాదు. ఋణ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో ఇతరుల ప్రమేయం వల్ల సమస్యలు రాగలవు. శతభిషా నక్షత్రం వారికి మానసిక అసౌకర్యం, పూర్వాభాద్ర వారికి ఆర్థిక అసౌకర్యం, ధనిష్ఠ వారికి ఉద్యోగ అసౌకర్యం ఉంటాయి. వ్యాపారులకు పనివారితో సమస్యలు ఎక్కువవుతాయి. మే: మాటకు విలువ పెరుగుతుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. అందరి సహకారం బాగుంటుంది. పూజ్యులు, గురువులు, పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అధికంగా ఉంటాయి. ఆరోగ్య ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. జూన్: జూన్, జులై నెలల్లో స్నేహితులు చేసిన పనుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. షేర్ వ్యాపారాలకు, మార్కెటింగ్ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఋణ, ఆరోగ్య విషయములలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడండి. ఓర్పు అవసరం. జులై: మనో ధైర్యం పాడవకుండా జాగ్రత్తలు తీసుకోండి. విద్యా, విజ్ఞాన, ప్రదర్శన చేస్తారు. చాలా వ్యవహారాలలో అడ్డంకులు రావడం, వాటిని తొలగించుకోవడం జరుగుతుంది. స్నేహితుల ద్వారా ఇబ్బందులు రాకుండా చూసుకోండి. ప్రయాణ అసౌకర్యాలు ఎక్కువ. విద్యా వ్యాసంగం బాగుంటుంది. ధన ధాన్యలాభం చేకూరుతుంది. ఆగస్ట్: ఋణ, ఆరోగ్య విషయాలలో ప్రతికూల సలహాలు ఇచ్చేవారికి ఆకర్షితులు అవుతారు. ఆదాయం తక్కువ, ఖర్చులు నియంత్రించలేని స్థితి ఉంటుంది. ప్రతివారికి సహాయం చేయాలనే కోరిక పెరుగుతుంది. లాభదాయక సంఘటనలు ఉంటాయి. పెద్దలను దర్శించడం, పుణ్యకార్యాలు చేయడం జరుగుతుంది. సెప్టెంబర్: అభివృద్ధికి మీ కోపావేశాలు అడ్డంకులు కలిగిస్తాయి. ఎప్పుడు ఏ పని సక్రమంగా అవుతుందో తెలియని çపరిస్థితి. మితభాషణ చాలా అవసరం. ఇతరుల వ్యవహారాలలో కలగజేసుకోవద్దు. కలహాలకు దూరంగా ఉండండి. పనివారిని నమ్ముకొని పెద్ద వ్యవహారాలకు శ్రీకారం చుట్టవద్దు. అక్టోబర్: పనులు సకాలంలో సవ్యంగా పూర్తవని కారణంగా చికాకులు పడతారు. అనవసర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబంలో, ఉద్యోగంలో, తోటివారితో ఇబ్బందులు పెరుగుతాయి. రోజువారీ పనులు కాకుండా కొత్త çపనులు చేపట్టవద్దు. నవంబర్: పనులు సానుకూలం చేసుకుంటూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు. అన్ని అంశాలలోనూ కాలం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ విషయాలు సానుకూలం అవుతాయి. వ్యాపారులకు లాభదాయకం. ఉద్యోగులకు పనులు సకాలంలో అవుతాయి. డిసెంబర్: మానసిక అశాంతి ఎక్కువైనా, విజయాలు సాధిస్తారు. కొన్నిసార్లు ధైర్యం ప్రదర్శిస్తారు. ఉద్యోగాలలో అంతా సానుకూలమే. వ్యాపారులు ప్రోత్సాహకర ఫలితాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు అద్భుతంగా ఉంటాయి. విద్యార్థులకు, రైతులకు, షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం. జనవరి: 13వ తేదీ నుండి జాగ్రత్తలు పాటించండి. 13వ తేదీ వరకు అనుకున్న పనులు వేగంగా సాగుతాయి. ఆ తర్వాత ప్రయాణ చికాకులు, ఆరోగ్య చికాకులు ఉంటాయి. ఒంటరిగా దూర ప్రయాణాలు చేయవద్దు. బంధు మిత్రులతో కలహాలు రాకుండా సంచరించాలి. కొత్త వ్యవహారాలు చేయవద్దు. ఫిబ్రవరి: తరచు ఇబ్బందులు వస్తుంటాయి. అయినా తెలివిగా సరి చేసుకోగలుగుతారు. ఆర్థిక అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో మంచి తెలివి ప్రదర్శిస్తారు కాని, రాబోవు మూడు మాసాలు ఒత్తిడిగానే సాగుతుంది. ఆరోగ్యం, స్థానచలనం విషయాలలో ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందులు రాగలవు. మార్చి: తరచు ఎదురయ్యే సమస్యలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి రావడంతో రోజువారీ పనులకు ఆటంకాలు ఏర్పడతాయి. మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగ భద్రత కోసం ఎక్కువగా శ్రమించాలి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. అధికంగా ప్రయాణాలు చేయవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. మీన రాశి ఆదాయం–5, వ్యయం–5 , రాజయోగం–3, అవమానం–1పూర్వాభాద్ర 4 వ పాదము (ది)ఉత్తరాభాద్ర 1,2,3,4 పాదములు (దు, శ్య, ఝా, థా)రేవతి 1,2,3,4 పాదములు (దే, దొ, చా, చి)ఈ సంవత్సరం గురువు మే 14న మిథునరాశి (అర్థాష్టమ) ప్రవేశం. రాహువు మే 19న కుంభరాశి (వ్యయ), కేతువు సింహరాశి (షష్ఠ) స్థానాలలో సంచరిస్తారు. శని మార్చి 29 నుంచి మీనరాశి (జన్మ) సంచారం. ఏలినాటి శని జన్మంలో రెండవ భాగం ప్రారంభం. జన్మ శని, వ్యయ రాహు తగు జాగ్రత్తలతో కాలక్షేపం చేయాలి. మీ ప్రమేయం లేకుండా సమస్యలు తలెత్తే సమయం. అందరినీ మీరు, మిమ్మల్ని అందరూ అనుమానిస్తారు. ఇతర పనులు ఆపివేయండి. ప్రతిపనిలోనూ మందగమనం ఉంటుంది. రోజువారీ పనుల్లో జాగ్రత్త వహించండి. కుటుంబపరంగా ఇబ్బందిలేని జీవనశైలి ఉంటుంది. అలసత్వం, పనులు వాయిదా వేయడం, అనవసర కలహాలు మానసిక ఒత్తిడి కలిగిస్తాయి. ఉద్యోగులు తోటివారితోను, మీ కింద పనిచేసే వారితోను జాగ్రత్తగా ఉండాలి. మోసపూరిత వాతావరణంతో ఇబ్బంది పడతారు. అధికారులతో జాగ్రత్త. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూలత ఉన్నట్లు కనిపించినా, పనులు పూర్తి కావు. వ్యాపారులకు శ్రమకు తగిన ఫలితాలు అందవు. పనివారితో సమస్యలు, అధికారుల ఒత్తిడి ఎక్కువ అవుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో మంచి ఫలితాలు లేవనే చెప్పాలి. ఆర్థిక లావాదేవీలలో చికాకులు పొందుతారు. అవసరానికి తగిన ఆదాయం అందదు. ఖర్చులు నియంత్రించలేరు. ఋణ విషయములో అవమానాలు ఎదురవకుండా జాగ్రత్తపడండి. ఆరోగ్య విషయంలో నేత్ర బాధలు ఉన్నవారు ఇబ్బందులు పడతారు. గుండె, ఎముకల సమస్యలు ఉన్నవారు పాత సమస్యలు తిరగబెట్టకుండా ముందు జాగ్రత్తలు పాటిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగులకు ఎన్నో అడ్డంకులు ఉంటాయి. అధికారుల ఆగ్రహం తప్పదు. షేర్ వ్యాపారులకు కాలం అనుకూలం కాదు. రైతులు స్వబుద్ధితో ప్రత్యక్షంగా పనులు పర్యవేక్షించుకోవాలని సూచన. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ. విద్యార్థులకు ఇతర వ్యాపకాలు ఎక్కువై ఇబ్బంది పడతారు. కోర్టు వ్యవహారాలలో బాగా సçహాయం చేస్తారు అనుకునేవారు కూడా మోసం చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో మోసాలు ఎదురవుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో పనులు చికాకులతో సాగుతాయి. ఈ రాశి స్త్రీలకు అంతటా చిక్కులు, సమస్యలు తప్పవ. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ ఉంచండి. ఇతరుల విషయాలలో కలుగచేసుకోవద్దు. దూర ప్రయాణాలు విరమించండి. అలంకరణ మీద దృష్టి ఉంచరు. మీరు చేసే పనికి గుర్తింపుకు రాకపోగా విమర్శలు ఎదురవుతాయి. గర్భిణీ స్త్రీలకు మానసిక ఆందోళనలు ఎక్కువవుతాయి.అనవసర భయాందోళనలు పెరుగుతాయి. తరచుగా వైద్య అవసరాలు ఏర్పడతాయి. సౌందర్యలహరి పారాయణ శ్రేయోదాయకం.పూర్వాభాద్ర 4వ పాదం: అనవసర ఆలోచనలు, అనవసర కాలక్షేపాలు, అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వైద్య, ఋణ, కోర్టు విషయాలలో సమస్యలు కొని తెచ్చుకుంటారు. కొత్త పనులు చేపట్టకపోవడం శ్రేయస్కరం. అన్ని పనుల్లోనూ వాయిదాలను ఇష్టపడుతుంటారు. ఉత్తరాభాద్ర: వైద్యపరంగా మంచి సలహాలు అందక ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్య విషయాలలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించలేరు. అజీర్ణ సమస్యలు తరచుగా వస్తుంటాయి. ఉద్యోగ, వ్యాపారాలలో మంచిగా వ్యవహరించి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడతారు. ఆర్థిక ప్రోత్సాహం తక్కువ. రేవతి: వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. సామాజిక చెడు ప్రభావాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. మిత్రుల సలహాలు, బంధు సహకారం అనుకూలించవు. మతిమరపు పెరుగుతుంది. ఆరోగ్యపరంగా అధిక జాగ్రత్తలు పాటిస్తారు. పుణ్యకార్యాలు చేస్తుంటారు. శాంతి మార్గం: శని, రాహు, కుజ గ్రహశాంతి అవసరం. రావి చెట్టు కింద కొలువైన ఆంజనేయస్వామికి ‘‘శ్రీరామ జయరామ జయజయరామ’’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం, ప్రదోషకాలంలో ‘‘శ్రీమాత్రే నమః’’ అని చెబుతూ శివాలయంలో ప్రదక్షిణలు చేయడం శుభప్రదం. గౌరీశంకరం రుద్రాక్షధారణ శుభప్రదం.ఏప్రిల్: ఈ నెలలో చేసే కొత్త ఋణాలు భవిష్యత్తుకు ప్రమాదం అవుతాయి. పనులు వాయిదా వేయడం మానుకోండి. బుద్ధి కుశలత తగ్గుతుంది. ఒంటరి కాలక్షేపం, ఒంటరి ప్రయాణాలు విడనాడడం శ్రేయస్కరం. రోజువారీ పనులు మినహా కొత్త ప్రయోగాలు చేయవద్దు. ఎవరికీ వాగ్దానాలు చేయవదు.్ద మే: ఒక విచిత్రమైన కాలం. ప్రతిపనీ ఒకటికి రెండుసార్లు చేయవలసి ఉంటుంది. ప్రతిపనీ ఆలస్యం అవుతుంది. చాలా అంశాలలో తెలివి ప్రదర్శించి చికాకులు పెరగకుండా చూసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగుతుంటాయి. జూన్: కుటుంబ వాతావరణం చాలా సౌకర్యంగా ఉంటుంది. మీ పనులు ఆలస్యమైనా, సానుకూలంగా పూర్తవుతాయి. వాహన, ప్రయాణ, ఆర్థిక విషయాలలో అనుకూల స్థితి ఉంటుంది. శుభకార్యాలు, పుణ్యకార్యాలు చేస్తుంటారు. జులై: పనులు సాధించే వనరులు ఉన్నా, ఆలస్యం అవుతుంటుంది. కొత్త ప్రయత్నాలు చేయవద్దు. అవయవాలు కొంత ప్రతికూలిస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విదేశీ ప్రయత్నాలు మందగమనంగా ఉంటాయి. ఆగస్ట్: మానసిక ఒత్తిడి ఎక్కువ. ప్రతికూల సలహాలు ఎక్కువగా ఆకర్షిస్తాయి. చేయవలసిన పనులు ఆలస్యంగానూ, అనవసరమైన పనులు వేగంగానూ చేస్తూ ఉంటారు. ఎవరినీ నమ్మలేని స్థితి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, ఋణ విషయాలు సానుకూలంగా సాగుతాయి.సెప్టెంబర్: విచిత్రమైన కాలం. ద్వితీయార్ధం కార్య వైఫల్యాలు ఉంటాయి. కొత్త పనులు చేయవద్దు. రోజువారీ పనులలోనూ, వృత్తి వ్యవహారాలలోనూ ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. కుటుంబ వ్యవహారాలలో ఇతరుల ప్రమేయాన్ని తగ్గించండి. ప్రయాణాలు తగ్గించడం శ్రేయస్కరం. అక్టోబర్: బహు జాగ్రత్తగా కాలక్షేపం చేయండి. స్థానభ్రష్టతకు, కుటుంబంలో అనైక్యతకు అవకాశాలు ఎక్కువ. ఆర్థిక లావాదేవీలు, ఋణ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. దూర ప్రయాణాలు విరమించండి. ఒంటరిగా ఏ పనీ చేయవద్దని సూచన. నవంబర్: విచిత్రమైన కాలం. ఏ పనీ సవ్యంగా సకాలంలో పూర్తవదు. ప్రతిదానికీ భయపడుతూ ఏ ప్రయత్నమూ సవ్యంగా చేయరు. మానసిక పరిస్థితికి, ఆచరణకు పొంతన ఉండదు. పుణ్యకార్యాలలో అవరోధాలు రాకుండా జాగ్రత్తపడండి. చిన్న చిన్న ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఉంటాయి. డిసెంబర్: ఉద్యోగంలో మీ అధికారులు బాగా ప్రోత్సాహం అందిస్తారు. వ్యాపారులకు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ విషయంలో అనుకూలత ఉంటుంది. పిల్లల అభివృద్ధి వార్తలు వింటారు. పుణ్యకార్యాలు చేస్తారు. విజ్ఞాన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పెద్దలను సేవించుకుంటారు. షేర్ వ్యాపారులకు అనుకూలం. జనవరి: క్రమంగా లాభాలు పెరుగుతాయి. ప్రారంభించిన ప్రతి పని లాభదాయకంగా పూర్తవుతుంది. గత సమస్యల పరిష్కారానికి, భవిష్యత్ ప్రణాళికలకు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక ఆరోగ్య కుటుంబ ఉద్యోగ వ్యాపార వ్యవహారాలన్నీ చాలా అనుకూలం.ఫిబ్రవరి: చాలా జాగ్రత్తలు పాటించాలి. వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఋణ వ్యవహారాలలో అవమానాలు తలెత్తకుండా జాగ్రత్త పడండి. దూర ప్రయాణములు, ఒంటరి ప్రయాణాలు రాబోవు మూడు మాసములు అనుకూలంగా అగుపించడం లేదు. ఆర్థికలావాదేవీలు ఇబ్బందికరం. మార్చి: ఆరోగ్య చికాకులు రాగలవు. తెలివిగా పనిచేయగలిగిన శక్తి ఉన్నా, నిస్తేజంగా ఉండిపోతారు. పనులు అనుకూలం కావు. రోజువారీ పనులు అస్తవ్యస్తంగా జరుగుతాయి. ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో ఇబ్బందులు పడతారు. మేష సంక్రమణ ఫలముది.14 ఏప్రిల్ 2025 ఉదయం 5:33లకు విశ్వావసు చైత్ర బహుళ పాడ్యమీ సోమవారం స్వాతి నక్షత్రం వజ్రనామయోగం, కౌలవ కరణం మీనలగ్న సమయంలో రవి మేషరాశిలో ప్రవేశం. సోమవారం సుభిక్షం. సంధ్యాకాలం ప్రజలకు సుఖం. స్వాతీ నక్షత్ర సమయంలో ప్రవేశం హానికలుగును. రోహిణీ చక్ర విధానంగా చూడగా మంచి వర్షానికి అవకాశం. సంవత్సరం అంతా ఉన్నది. ప్రవేశకాల గ్రహ సంచారం ప్రకారం లగ్నంలో చాతుర్గ్రహ కూటమి అందులోను, శని, రాహువులు పరిపాలనా రంగంలో ఎన్నో ఆటంకాలు ఉంటాయి. సమాజంలో ఇబ్బందికర ఘటనలకు అవకాశం గోచరిస్తుంది. అయితే గురుసంచారం బాగుంది. కావున సాధారణ స్థాయి ఇబ్బందులుగా గుర్తించవచ్చు.రవి ఆర్ద్ర నక్షత్ర ప్రవేశ ఫలముది.22–06–2024 పగలు (22.35 వి.ఘ.) గం.2:32ని.లకు విశ్వావసు సంవత్సరం జ్యేష్ఠ బహుళ ద్వాదశీ ఆదివారం భరణీ నక్షత్రం సుకర్మ యోగం తైతుల కరణం తులా లగ్నం సమయంలో రవి ఆర్ద్రా నక్షత్రంలో ప్రవేశం. ‘‘అపరేహేః ఆర్ద్రా ప్రవేశం అతిలోక పీడా’’ అపరాహ్ణ కాలములో ఆర్ద్రా నక్షత్రంలో రవి ప్రవేశం లోకులకు ఇబ్బంది. చంద్రుడు మేషంలో ఉన్న కారణంగా దివారాత్రి దోషం తోడయి ఎక్కువ కాలం నీటి ఎద్దడి. అయితే రవి చంద్రులకు ఇరువురికీ శుభగ్రహ కలయిక వలన దోషం తక్కువగా భావించాలి. ద్వాదశ్యాం శుభప్రోక్తం అని చెప్పబడినది. ఆదివారం పశువులకు నష్టం. కశ్యపవచనం దృష్ట్యా భరణిలో చంద్రుడు ఆర్ద్రా ప్రవేశ కాలంలో వున్న కారణం సస్యవృద్ధిగా గమనించాలి. సుకర్మ యోగం సువృష్టి అని చెప్పబడినది. భరణ్యాది చతుష్కమండలం దృష్ట్యా సస్యానుకాలం వర్షయోగం చెప్పబడినది. తులాలగ్న సమయంలో ప్రవేశం సువృష్టి. తైతుల కరణం నిత్యశుభం. ఫలితం: సాధారణం నుండి అధిక వర్షపాతం నమోదు అవుతుంది. సూచన: ఈరోజు వర్షం కురిసినట్లయితే, దానిని ఆధారం చేసుకొని భవిష్య వర్షయోగం నిర్ణయిస్తారు.చంద్రచారముజ్యేష్ఠ శుక్ల ప్రతిపత్ బుధవారం ‘‘సుభిక్షం క్షేమమారోగ్యం వృష్టిసస్య వివర్ధనం స్వధర్మ నిరతాభూపాః జ్యేష్టాదౌ సౌమ్యవాసరేః’’ సస్యానుకూల వర్షాలు పాడిపంటలు సమృద్ధి ఉంటుంది. రాజులు ధర్మ నిరతులై ఉంటారు. ‘‘ఆషాఢే పంచమీ శుక్లా సోమవారో యదా భవేత్ సుభిక్షం క్షేమమారోగ్యం సువృష్టిశ్చ భవేద్భవం’’ ఆషాఢ శుక్ల పంచమీ సోమవారం కూడా సుభిక్ష క్షేమ ఆరోగ్యాలను సూచిస్తోంది. ‘‘ఆషాఢే శుక్ల పక్షేతు దశమీ స్వాతీ సంయుతా మహద్వర్షం భవేద్ధ్రువం’’ అధిక వర్షాలకు అవకాశం. ‘‘ఆషాఢే కృష్ణపక్షే రోహిణీ ఏకాదశీ యుతామధ్యమ వర్షాలు మధ్యంగా సస్యాలు ఫలిస్తాయి. పుష్య అమావాస్య ఆదివారం దుర్భిక్షం మాఘ ఫాల్గుణాలలో అని గ్రహించాలి.మకర సంక్రాంతి పురుష లక్షణ ది.14 జనవరి 2026 రా.8:51లకు పుష్య బహుళ ద్వాదశి బుధవారం అనురాధ నక్షత్రం, గండ యోగం, కౌలవ కరణం సింహలగ్న సమయాన రవి మకరంలో రవి ప్రవేశం. తర్పణాలు సంకల్పాలు 15 జనవరి ఉదయం నుండి ప్రారంభం కుంకుమోదక స్నానం రాజులకు అరిష్టం. విచిత్ర వస్త్రధారణ శుభం. మందాకినీ నామధేయం రాజులకు నష్టం.

Myanmar: ఇంకా తప్పని ముప్పు.. 24 గంటల్లో 15 భూ ప్రకంపనలు
నేపిడా: శుక్రవారం సంభవించిన భారీ భూకంపం మయన్మార్(Myanmar)ను అతలాకుతలం చేసింది. నాటి భయం నుంచి అక్కడి ప్రజలు కోలుకోకముందే తిరిగి పలుమార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. గడచిన 24 గంటల్లో మయన్మార్‌లో 15 సార్లు భూమి కంపించింది. దీంతో మయన్మార్‌కు ఇంకా భూ ప్రకంపనల ముప్పు తప్పలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.గడచిన 24 గంటల్లో ప్రతి రెండు గంటలకు ఒకసారి భూమి కంపించడాన్ని శాస్త్రవేత్తలు(Scientists) గుర్తించారు. భూకంపం తర్వాత మయన్మార్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో అక్కడి విషాదానికి సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు అందుబాటులోకి రావడం లేదు. భూకంపం తీవ్రతకు పలు భవనాలు, వంతెనలు కూలిపోయాయి. మయన్మార్‌లోని చారిత్రక అవా వంతెన కూడా భూకంపం తీవ్రతకు కూలిపోయింది. ఈ వంతెనను 1934లో నిర్మించారు.ఇదేవిధంగా మయన్మార్‌లోని ప్రముఖ పగోడా ఆలయం కూడా కూలిపోయింది. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా(UNESCO World Heritage List)లో చోటు దక్కించుకుంది. ఈ ఆలయ నిర్మాణశైలి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు ఈ ఆలయం శిథిలమయ్యింది. మయన్మార్‌లో ఇప్పటికీ అంతర్యుద్ధం కొనసాగుతోంది. అటువంటి పరిస్థితిలో తాజాగా సంభవించిన భూకంపం మయన్మార్‌కు దెబ్బ మీద దెబ్బలా తయారయ్యింది. ఈ నేపధ్యంలో భారత్.. మయన్మార్‌కు అండగా నిలిచింది. బాధితులకు సహాయ సామాగ్రిని అందించేందుకు ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది.ఇది కూడా చదవండి: చైత్ర నవరాత్రుల సందడి ప్రారంభం

GT VS MI: మొదటి మ్యాచ్‌కు ముందే 'ఆ' నిర్ణయం తీసుకున్నాం.. ప్రసిద్ద్ బౌలింగ్ అద్భుతం: గిల్
ఐపీఎల్ 2025లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో నిన్న (మార్చి 29) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ అన్ని విభాగాల్లో సత్తా చాటింది. తొలుత బ్యాటింగ్‌కు దిగి భారీ స్కోర్ (196/8) చేసిన ఆ జట్టు.. ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టాప్-3 బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తన క్లాస్‌ను ప్రదర్శించాడు. శుభ్‌మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, సిక్స్) భారీ స్కోర్లు చేయకపోయిన బాగా ఆడారు. స్లోగా ఉన్న పిచ్‌పై ఈ ముగ్గురు సూపర్‌గా బ్యాటింగ్ చేశారు. ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బౌల్ట్ (4-0-34-1), దీపక్ చాహర్ (4-0-39-1), సాంట్నర్ (3-0-25-0) పర్వాలేదనిపించగా.. ముజీబ్ రెహ్మాన్ (2-0-28-1), యువ పేసర్ సత్యనారాయణ రాజు (3-0-40-1) భారీగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఆదిలోనే తడబడింది. సిరాజ్ తొలి ఓవర్లోనే ముంబైని దెబ్బకొట్టాడు. రెండు బౌండరీలు బాది జోరుమీదున్న రోహిత్ శర్మను (8) క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం ఐదో ఓవర్లో సిరాజ్ మరోసారి చెలరేగాడు. ఈసారి మరో ఓపెనర్ రికెల్టన్ను (6) రోహిత్ తరహాలోనే క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆతర్వాత క్రీజ్‌లోకి వచ్చిన తిలక్ వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; ఫోర్, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ దశలో గుజరాత్ ప్రస్దిద్ద్ కృష్ణను బరిలోకి దించింది. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేసి క్రీజ్‌లో కుదురుకున్న తిలక్, స్కైలను ఔట్ చేశాడు. ఇక్కడే ప్రసిద్ద్ ముంబై చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు.ప్రసిద్ద్ అద్భుతమైన స్లో బాల్స్‌తో ముంబై బ్యాటర్లను ఇరుకునపెట్టాడు. తిలక్, స్కై ఔటయ్యాక హార్దిక్ బ్యాటింగ్‌కు దిగకుండా రాబిన్ మింజ్‌ను పంపి తప్పు చేశాడు. మింజ్ (6 బంతుల్లో 3), హార్దిక్ (17 బంతుల్లో 11) బంతులు వృధా చేసి ముంబై ఓటమిని ఖరారు చేశారు. ఆఖర్లో నమన్ ధీర్ (11 బంతుల్లో 18 నాటౌట్), సాంట్నర్ (9 బంతుల్లో 18 నాటౌట్) భారీ షాట్లు ఆడినా అప్పటికే ముంబై ఓటమి ఖరారైపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. పొదుపుగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసిన ప్రసిద్ద్ కృష్ణకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. గుజరాత్ బౌలరల్లో ప్రసిద్ద్, సిరాజ్ చెరో 2, రబాడ, సాయికిషోర్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో గుజరాత్ ఈ సీజన్లో బోణీ కొట్టింది. ముంబై వరుసగా తమ రెండో మ్యాచ్‌లో కూడా పరాజయంపాలైంది.మ్యాచ్ అనంతరం విన్నింగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. ఈ మ్యాచ్‌ను బ్లాక్ సాయిల్ పిచ్‌పై ఆడాము. ఇది మాకు కలిసొచ్చింది. మొదటి మ్యాచ్‌కు ముందే ఈ పిచ్‌పై ఆడాలని నిర్ణయించుకున్నాము. ఈ వికెట్ మాకు సూటైంది. బంతి పాతబడిన తర్వాత ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం కష్టం. అందుకే పవర్ ప్లేలోపే వీలైనన్ని పరుగులు సాధించేందుకు ప్రయత్నించాము. మనందరం ప్రణాళికలు వేసుకుంటాము. కొన్ని వర్కౌట్ అవుతాయి. మరికొన్ని కావు. రషీద్ ఖాన్‌ను తన కోటా నాలుగు ఓవర్లు వేయించకపోవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. వాస్తవానికి రషీద్‌ను ఆఖర్లో బౌలింగ్ చేయిద్దామనే అనుకున్నాను. కానీ పేసర్లు బాగా బౌలింగ్ చేస్తుండటంతో అతన్ని బరిలోకి దించలేదు. ప్రసిద్ద్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.

ఎర్రబుక్కు తెల్లమొహం!
ఎర్ర పుస్తకం తెల్లమొహం వేసినట్లయింది. రాజ్యాంగ విధి విధానాలను కూడా ప్రైవేటీకరించబోయిన తెంపరితనానికి చెంపలు వాయించినట్లయింది. ఇష్టారీతిన పోలీసు రాజ్యాన్ని నడుపుతామంటే, పౌరహక్కుల్ని చిదిమేస్తామంటే అంగీకరించేది లేదని ఇప్పటికే పలుమార్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయ స్థానం ప్రభుత్వ యంత్రాంగాన్ని హెచ్చరించింది. ఇప్పుడదే హెచ్చరికను జనతా న్యాయస్థానం కూడా జారీ చేసినట్లయింది. రాష్ట్రంలో 56 మండల పరిషత్తు అధ్యక్ష ఉపాధ్యక్ష స్థానాలకు, కడప జిల్లా పరిషత్తు అధ్యక్ష స్థానానికి మొన్న ఉపఎన్నికలు జరిగాయి. ఓట్లు వేసింది ఎంపీటీసీలు, జడ్పీటీసీలే. వీరు క్షేత్రస్థాయి ప్రజా ప్రతినిధులు. జనం గుండె చప్పుళ్లను నిరంతరం వినగలిగేవాళ్లు. ప్రజల నాడీ స్పందనను ముందుగా పసిగట్టగలిగేవాళ్లు.ఉపఎన్నికల్లో అధికార కూటమి పన్నిన వ్యూహం ఫలించ లేదు. విపక్షమైన వైసీపీ ఘనవిజయాన్ని నమోదు చేసింది. కడప జడ్పీతో సహా 40 స్థానాలను ఆ పార్టీ అవలీలగా గెలవగలిగింది. కూటమికి 10 స్థానాలు దక్కాయి. మిగిలినచోట్ల ఎన్నిక వాయిదా పడింది. వైసీపీ టిక్కెట్‌పై గెలుపొందిన స్థానిక ప్రతినిధులు ఆ పార్టీ పక్షాన్నే నిలవడంలో వింతేముందని ఇప్పుడు కూటమి చిలుకలు పలుకుతుండవచ్చు. కానీ ఏపీలో ఈ తొమ్మిది నెలల పూర్వరంగం అర్థమైన వారికి వైసీపీ గెలుపులో వింతే కాదు, అద్భుతం కూడా కనిపిస్తుంది.ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో బలంగా వేళ్లూనుకున్న పార్టీ వైసీపీ. ఆ సంగతి కూటమి నేతలకు స్పష్టంగా తెలుసు. అందుకే కూటమి కట్టుకున్నారు. కుయుక్తులను ఆశ్రయించారు. ఎన్నికల్లో ఈ కూటమి చేసిన దుష్ప్రచారం, వెదజల్లిన విషం, పలికిన అసత్యాలు, చేసిన బూటకపు బాసలు అనే నిచ్చెనమెట్ల మీదుగా చేరుకున్న అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతిపక్ష పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేయాలనే సంకల్పానికి అధికార కూటమి వచ్చినట్టు దాని చర్యలు నిరూపిస్తున్నాయి. ఇటువంటి ప్రయ త్నాలు సత్ఫలితాలనివ్వవని గతంలో అనేక గుణపాఠాలు న్నాయి. అయినా అధికార మత్తులో ఉన్నప్పుడు అవి స్ఫురించక పోవచ్చు. ‘తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు.... ... కానీ మూర్ఖుని మనసును సమాధానపరచడం మాత్రం సాధ్యంకాద’ని భర్తృహరి చెప్పిన సుభాషితం మనకు ఉండనే ఉన్నది.ప్రభుత్వ వైఖరిని విమర్శించిన వారి మీద, ఎన్నికల హామీలను అమలు చేయలేదేమని అడిగిన వారి మీద వందలాది కేసులు నమోదయ్యాయి. టెర్రరిస్టుల మీద పెట్టాల్సిన కేసులను సోషల్ మీడియా విమర్శకుల మీద ఎందుకు పెడు తున్నారని హైకోర్టు ప్రశ్నిస్తున్నా పోలీసు యంత్రాంగం ఖాతరు చేయడం లేదు. రక్షక భటులే అర్ధరాత్రి పూట సివిల్ డ్రెస్సుల్లో ఇళ్లలోకి చొరబడి విమర్శకులను బరబరా లాక్కొని వెళ్తున్నారని, రాష్ట్రమంతటా తిప్పుతున్నారనీ, కుటుంబ సభ్యులకు సమా చారం కూడా ఇవ్వడం లేదనే ఆరోపణలు తరచుగా వినిపి స్తున్నాయి. పోసాని కృష్ణమురళి పదేళ్ల కింద ప్రెస్మీట్లో చేసిన విమర్శలపై టెర్రరిస్టు కేసు పెట్టి జైల్లోకి నెట్టారు. నడివీధుల్లో విపక్ష కార్యకర్తలను విచ్చుకత్తులతో నరుకుతున్న దృశ్యాల వీడియోలను చూడవలసి వచ్చింది. ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు జరిగాయి. పార్టీ ఆఫీసులను కూల్చేశారు. పంట చేల విధ్వంసం జరిగింది. పండిన తోటలను నరికేశారు. మీడియా మీద అప్రకటిత సెన్సార్షిప్ అమలైంది. తమకు గిట్టని వార్తా చానెళ్ల ప్రసారాలను నిలిపివేసేలా కేబుల్ ఆపరేటర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చారు.ఈ నేపథ్యంలో వచ్చిన స్థానిక ఉపఎన్నికల సందర్భంగా కూటమి నాయకత్వం మరింత రెచ్చిపోయింది. స్థానిక ప్రతి నిధులను లొంగదీసుకోవడానికి సామ దాన భేద దండో పాయాలను ప్రయోగించారు. ప్రలోభాల ఎరలు వేశారు. కేసులు పెడతామని బెదిరించారు. ఉపాధిని దెబ్బతీస్తామని హెచ్చరించారు. పోలీసు యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని స్వయంగా ప్రభుత్వమే అధికార జులుమ్కు దిగినప్పుడు స్థానిక ప్రతినిధులను లొంగదీసుకోవడం పెద్ద విశేషమేమీ కాదు. పైగా రాజ్యసభల్లో, శాసన మండళ్లలో అధికార హోదాలు వెలగబెట్టిన బడాబడా ఆసాములే సర్కార్ కొరడా ముందు సాగిలపడి పోయిన ఉదంతాలు కళ్లముందటే కనిపిస్తున్నాయి. స్థానిక పదవులను గెలుచుకోవడానికి అధికార పార్టీ బరి తెగించిందనీ, పలుచోట్ల ప్రతినిధులను అడ్డుకున్నారనీ, ప్రలోభపెట్టారనీ ‘సాక్షి’ మీడియానే కాదు, ‘ప్రజాశక్తి’ పత్రిక కూడా రాసింది. ఇలా అధికార యంత్రాంగం బరితెగించి ప్రవర్తించినప్పుడు స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ స్వీప్ చేయడం కష్టం కాదనే అభిప్రాయం చాలామందికి ఉంటుంది. కానీ, వైసీపీ స్థానిక ప్రతినిధులు అరుదైన ప్రజాస్వామిక చైతన్యాన్ని ప్రదర్శించారు. పరిశీలకులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. నిర్బంధాలను ధిక్క రించి తమను నమ్మి గెలిపించిన పార్టీ పక్షానే దృఢంగా నిలబడ్డారు. తమ పదవులేమీ ప్రభావం చూపగలిగేంత పెద్దవి కాదు. అయినా సరే విశ్వసనీయతకే వారు పట్టం కట్టారు. గోడ దూకిన బడా ఆసాములు ఈ పరిణామం తర్వాత ఎలా తలెత్తుకుంటారో చూడాలి. ‘స్టేట్ టెర్రరిజమ్’ అనదగ్గ స్థాయిలో నిర్బంధకాండను ప్రయోగించినా ఈ క్షేత్రస్థాయి ప్రతినిధులు దృఢంగా నిలవడానికి రెండు ముఖ్యమైన కారణాలు కనిపి స్తున్నాయి. మొదటిది – రెండు నెలల క్రితం పార్టీ కార్య కర్తలనుద్దేశించి ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేసిన ప్రసంగం. కార్యకర్తలెవరూ అధైర్యపడవలసిన అవసరం లేదనీ, వారికి తాను అండగా నిలబడతాననీ ప్రకటించారు. జగనన్న 2.0 కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తాడో చేసి చూపెడతానని భరోసా ఇచ్చారు.జగన్ ప్రకటన తర్వాత గ్రామస్థాయి నుంచి పార్టీ కార్యకర్తలకు మంచి ప్రేరణ లభించిందనీ, వారు ధైర్యంగా నిలబడుతున్నారనీ వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెండో ప్రధాన కారణం – క్షేత్రస్థాయి వాస్తవికత. ఎన్నికలకు ముందు చంద్రబాబు కూటమి చేసిన బూటకపు హామీల బండారం ప్రజ లందరికీ అర్థమైంది. వైసీపీ సర్కార్ మీదా, జగన్మోహన్రెడ్డిపై వ్యక్తిగతంగా కూటమి చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని ప్రజాశ్రేణులు ఇప్పుడు భావిస్తున్నాయి. మోసపోయామన్న భావన వారిని వెంటాడుతున్నది. ప్రభుత్వంపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతున్నది. వారు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి భయపడటం లేదు. బహిరంగంగానే కూటమి సర్కార్‌ను విమర్శిస్తున్నారు. ఈ పరిణామం కూడా వైసీపీ కార్యకర్తలు ఎదురొడ్డి నిలబడేందుకు దోహదపడింది.జనంలో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా కూటమి సర్కార్ తన ధోరణిని మార్చుకోకపోగా అదే అసత్య ప్రచారాన్ని మరింత ఎక్కువగా ఆశ్రయిస్తున్నది. తేలిపోయిన ఆరోపణల్నే మళ్లీ మళ్లీ ఎక్కుపెడుతున్నారు. చంద్రబాబు చెబుతున్న అప్పుల లెక్కల్ని గుర్తు చేసుకుంటూ జనం నవ్వుకుంటున్నారు. సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. శనివారం నాడు జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా అలవాటు ప్రకారం అప్పుల కథను మరోసారి వినిపించారు. ఎన్నికల ప్రచారంలో 14 లక్షల కోట్లున్న అప్పు, గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లుగా మారి, బడ్జెట్ ప్రసంగంలో ఏడు లక్షల కోట్లుగా రూపాంతరం చెంది, ఆవిర్భావ సభలో తొమ్మిదిన్నర లక్షల కోట్లుగా పరిణామం చెందింది.అప్పుల కథతోపాటు అసలు విషయాన్ని కూడా ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు. ‘‘బయట నుండి (ప్రభుత్వంలోకి రాకముందు) చూసినప్పుడు ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేయవచ్చని అనుకున్నా, ఇప్పుడు చూస్తే తొమ్మిదిన్నర లక్షల కోట్ల అప్పుంది. దీనిపై వడ్డీ కట్టాలి. ఇప్పుడు సంక్షేమాన్ని అమలుచేస్తే మధ్యలోనే ఆగిపోతుంది. కనుక ముందుగా అభివృద్ధి చేసి, వచ్చే ఆదాయంతో సంక్షేమం చేద్దా’’మని ఈ సభలో చెప్పుకొచ్చారు.ఈ తూచ్ మంత్రాన్ని ఆయన ఆవిర్భావ సభలో మాత్రమే చెప్పలేదు. ఈ వార్షిక బడ్జెట్లో కూడా ఆయన దీన్ని పొందు పరిచారు. కాకపోతే అంకెల్లో చెప్పడం వల్ల సరిగ్గా అర్థం కాలేదు. ‘సూపర్ సిక్స్’గా పేర్కొన్న ఆరు అంశాలను ఆయన చెప్పి నట్టుగా అమలు చేస్తే 70 వేల కోట్ల పైచిలుకు నిధులు అవసరమవుతాయని అంచనా. అయితే బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం 17 వేల కోట్లు మాత్రమే చూపెట్టారు. కేటాయింపు చూపినంత మాత్రాన అమలు చేస్తారని అర్థం కాదు. గత బడ్జెట్లో కూడా ‘తల్లికి వందనం’, ‘అన్నదాతా సుఖీభవ’ పథకాలకు అరకొర కేటాయింపులు చూపెట్టారు. కానీ,అందులో అణా పైసలు కూడా ఖర్చుపెట్టలేదన్నది జనం అనుభవంలోకి వచ్చిన సత్యం.మొన్నటి మంగళవారం జోలెతో పాడుకున్న వేలంతో కలిపి తొమ్మిదిన్నర మాసాల్లో బాబు సర్కార్ ఒక లక్షా 52 వేల కోట్ల పైచిలుకు అప్పులు చేసి జాతీయ రికార్డును నెలకొల్పింది. ప్రభుత్వం నేరుగా చేసిన అప్పు 98,088 కోట్లయితే, ష్యూరిటీ సంతకం పెట్టి కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు 23,700 కోట్లు, ఇక రాజధాని పేరుతో ఇప్పటివరకు చేసిన అప్పు 31,000 కోట్లు. వెరసి 1,52,788 కోట్లు. ఇంతటి జగదేక అప్పారావు ప్రభుత్వం జగన్ సర్కార్‌ను అప్పులకు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేయబూనడాన్ని దాష్టీకం అనాలో, దగుల్బాజీతనం అనాలో తెలుసుకోవాలి. ఈ అప్పుల చిట్టా వ్యవహారం ఇక ఎంతమాత్రమూ దాచేస్తే దాగేది కాదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఇస్తున్న సమాచారాన్ని బట్టి, కాగ్ రిపోర్టుల ఆధారంగా, బడ్జెట్ పత్రాల సాక్షిగా జనంలోకి వాస్తవాలు వస్తున్నాయి. రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం అప్పుల కుప్ప చేసిందన్న ప్రచారాన్ని ఇప్పుడెవ్వరూ నమ్మడం లేదు.జగన్ ప్రభుత్వ హయాంలో విధ్వంసం జరిగిందనే మాట చంద్రబాబుకు ఊతపదంగా మారింది. చివరికి కలెక్టర్ల సమా వేశంలో కూడా ‘గత ప్రభుత్వం విధ్వంసం చేసింద’ని మాట్లా డారు. ఇలా కలెక్టర్ల సమావేశాన్ని రాజకీయాలకు వాడుకున్న ముఖ్యమంత్రి ఈయన తప్ప మరొకరు ఉండకపోవచ్చు. తాను చెప్పిందే వేదం, తన పచ్చ కోడి కూస్తేనే సమాచారం తెలిసేది అనే భ్రమల్లోంచి ఆయనింకా బయటపడలేదు. పదేపదే అబద్ధాన్ని వల్లెవేస్తే అది నిజమైపోతుందనే పాతకాలపు గోబెల్స్ థియరీని పట్టుకొని వేళ్లాడుతున్నారు. ఇప్పుడు విధ్వంసం గురించి ఎక్కువ మాట్లాడితే జనం రికార్డుల్ని తిరగేస్తారు.విధ్వంసం ఎవరిదో వికాసం ఎవరి వల్ల జరిగిందో తెలుసుకుంటారు. సమాచారం ఇప్పుడు ఎవరి ప్రైవేట్ ప్రాపర్టీ కాదు. అది ప్రజల హక్కు.పౌరుల భావప్రకటనా స్వేచ్ఛపై శుక్రవారం నాడు సర్వో న్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అధికార మత్తులో జోగుతున్న మన వ్యవస్థలకు కనువిప్పు కావాలి. భావ ప్రకటనా స్వాతంత్య్రం లేనినాడు రాజ్యాంగం హామీ పడిన గౌరవ ప్రదమైన జీవన హక్కు సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేటతెల్లం చేసింది. ఈ హక్కును రక్షించడంలో పోలీసులు విఫలమైతే ఆ బాధ్యతను కోర్టులు తీసుకోవాలని కూడా సుప్రీంకోర్టు హితవు చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ అనే కాంగ్రెస్ ఎంపీ పెట్టిన పోస్టుపై గుజరాత్ పోలీసులు పెట్టిన కేసును సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఈ తీర్పుపై సంపాదకీయం రాసిన ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ‘కేసును కొట్టివేయడంలో ఆశ్చర్యం లేదు. అసలు సుప్రీంకోర్టు దాకా ఈ కేసు రావడమే దిగ్భ్రాంతిని కలిగిస్తు న్నద’ని వ్యాఖ్యానించింది. ప్రతాప్‌గఢీ పెట్టిన పోస్టుకూ,ఆంధ్రాలో ప్రేమ్ కుమార్ అనే దళిత యువకుడి సోషల్ మీడియా పోస్టుకూ సారూప్యతలున్నాయి. కానీ ఆ యువకుడిని మన పోలీసు యంత్రాంగం ఎంతగా వేధించిందో తెలిసిందే. ఇప్పటి కైనా పోలీస్ యంత్రాంగం జీ హుజూర్ పద్ధతుల్ని విడిచి పెట్టక పోతే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవని గ్రహిస్తే మంచిది. పోలీసు యంత్రాంగానికే కాదు... రెడ్‌బుక్ వంటి గ్రంథాల రచయితలకు కూడా సుప్రీం వ్యాఖ్యలు వాతలు పెట్టినట్టే!వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com

'సికందర్' ట్విటర్ రివ్యూ.. ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడం బెటర్ అంటూ..
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) , రష్మికా మందన్నా(Rashmika ) జంటగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సికందర్' సినిమా థియేటర్స్‌లోకి వచ్చేసింది. రంజాన్ కానుకగా మార్చి 30న విడుదలైన ఈ చిత్రాన్ని సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్‌తో సాజిద్ నడియాద్వాలా నిర్మించారు. రజనీకాంత్ దర్బార్ (2020) సినిమా తర్వాత ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేసిన చిత్రం కావడంతో సికిందర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలక పాత్రలు నటించారు. ఇప్పటికే పలుచోట్ల సినిమా చూసిన నెటిజన్లు సికిందర్‌పై తమ ఎక్స్ పేజీలలో ఇలా చెప్పుకుంటున్నారు.సికిందర్ అందరికి షాక్ ఇచ్చాడు అంటూ నెటిజన్లు పంచులు వేస్తున్నారు. సినిమా ఏమాత్రం అంచనాలకు కనీసం దగ్గర్లో కూడా లేదని చెబుతున్నారు. అవుట్ డేటెడ్ కథను ఎన్నిసార్లు మాకు చూపుతారంటూ చెబుతున్నారు. ఇందులో ఒక సాంగ్ మినహా సంగీతం చాలా దారుణంగా ఉందని చెబుతున్నారు. సినిమా చూసి ఎంజాయ్ చేయాడానికి అందులో ఏమీ లేదని చెబుతున్నారు. సల్మాన్ , AR మురుగదాస్ కాంబోకి సికిందర్ సినిమా అతిపెద్ద డిజాస్టర్ అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయం తెలుపుతున్నారు.సల్మాన్ ఖాన్ ఎంట్రీ సీన్ చాలా హైప్లో ఉంటుందని అభిమానులు సోషల్‌మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సల్మాన్ నటించిన గత సినిమాలకు సికందర్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది అందుకే ప్రేక్షకులకు నచ్చలేదని అభిమానులు తెలుపుతున్నారు. ఇందులో యాక్షన్, ఎమోషన్స్, పాటలు అన్నీ కూడా చాలా బాగున్నాయంటున్నారు. కానీ, సాధారణ ప్రేక్షకుల మాత్రం ఇదేం సినిమా అంటూ మండిపడుతున్నారు. ఇలాంటి కథ పట్టుకుని సల్మాన్‌ను మురగదాస్ ఎలా ఒప్పించాడు అంటూ సెటైర్స్ వేస్తున్నారు. సినిమాపై డివైడ్ టాక్ భారీగా వస్తున్నా సల్లూ భాయ్ ఫ్యాన్స్ మాత్రం సికిందర్‌ను బ్లాక్ బస్టర్ అంటూ ట్వీట్లు పెడుతున్నారు.పైసా వసూల్ బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు చెబుతున్నప్పటికీ కామన్ ఆడియెన్స్ నుంచి మాత్రం చెత్త సినిమా అంటూ రివ్యూలు ఇస్తున్నారు. మురుగదాస్ ఇకనైన సినిమాల నుంచి రిటైర్ అయిపోవడం మంచిదని తెలుపుతున్నారు. కాజల్ అగర్వాల్ పాత్రపై కూడా విమర్శలు వస్తున్నాయి. విలన్‌గా సత్యరాజ్ కూడా సెట్ కాలేదని తెలుపుతున్నారు. సల్మాన్ కనిపిస్తే చాలు బీజీఎమ్‌తో సంతోష్ నారయణ బాగా ఇబ్బంది పెట్టాడని ఒకరు కామెంట్ చేశారు. ఫస్టాఫ్ ఏదో కాస్త ఓకే అనుకుంటే సెంకండాఫ్లో స్టోరీ మరింత ఇబ్బంది పెడుతుందని అంటున్నారు. ఫైనల్‌గా సల్మాన్‌కు సికిందర్ బిగ్ డిజాస్టర్‌గా మిగిలిపోతుందని ఎక్కువమంది ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. #Sikandar is a dull action drama with a lifeless story that fails to engage. The background music is very bad, and except for a few decent action scenes, there’s nothing to enjoy. Biggest disaster for Salman and AR Murugadoss combo.— LetsCinema (@letscinema) March 29, 2025#Sikandar Public reviews are coming out and it’s disappointing .. Another mess by salman khan on eid 😢#SikandarReview pic.twitter.com/JPZkestxMs— Cheemrag (@itxcheemrag) March 30, 2025Crowd goes crazy on Megastar #SalmanKhan entry scene in #Sikandar movie.Theatre Turn Into Stadium 🔥🔥🔥 @BeingSalmanKhan #SalmanKhan #SikandarReview #Sikandar pic.twitter.com/ytTrI7CQaO— Filmy_Duniya (@FMovie82325) March 30, 2025@ARMurugadoss pls get retire.#Sikandar #SalmanKhan We appreciate your contributions to the film industry with your successful movies. However, we kindly request that you refrain from directing any further films.. Heart-full Request.— Daino (@ursrokk) March 30, 2025The audience is showering love on #Sikandar. Another blockbuster loading for @iamRashmika and @BeingSalmanKhan. 🔥🔥#RashmikaMandanna ❤️#SalmanKhan #Sikandar 🔥 pic.twitter.com/xywPwUnhFA— Rashmika Delhi Fans (@Rashmikadelhifc) March 30, 2025Sikandar Review ⭐️⭐️⭐️⭐️⭐Blockbuster, Blockbuster, Blockbuster......Just Saw sikandar- #Sikandar is the best #SalmanKhan film after Bajrangi Bhaijaan, Yes even better than Sultan and TZH.Even I cry after Watching it, Too emotional and Action packedMany goosebump moments. pic.twitter.com/QPqlNohEGG— taran adarsh (@taran_adarsh76) March 29, 2025

ఓపెన్ ప్లాటా.. అపార్ట్‌మెంటా?
ఓపెన్ ప్లాటా? అపార్ట్‌మెంటా? ఎందులో పెట్టుబడులకు ఆసక్తి ఉందనే ప్రశ్నకు సగానికి పైగా తొలిసారి ప్రాపర్టీ కొనుగోలుదారుల అభిప్రాయం ఓపెన్ ప్లాటనే సమాధానం. 58 శాతం మంది కస్టమర్లు స్థలం మీద పెట్టుబడులకు మొగ్గు చూపిస్తున్నారని మ్యాజిక్ బ్రిక్స్ సర్వేలో తేలింది. దీర్ఘకాలిక మూలధన లాభాలు, అధిక రాబడులే ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోదేశంలోని సుమారు 2,200 మంది గృహ కొనుగోలుదారులతో సర్వే నిర్వహించింది. ఇందులో 17.1 శాతం మంది కస్టమర్లు పెట్టుబడులకు రెండో ప్రాధాన్యత ఆస్తిగా వాణిజ్య స్థలాలను ఎంచుకున్నారు. ఓపెన్ ప్లాట్లలో అత్యధికంగా బెంగళూరు స్థలాలకు డిమాండ్ ఉంది. 36.5 శాతంతో గ్రీన్ సిటీ అగ్రస్థానంలో ఉండగా.. చెన్నై ప్లాట్లకు 11 శాతం, లక్నో స్థలాలకు 8.9 శాతం ఆసక్తి చూపిస్తున్నారు. 1,000–2,000 చ.అ. మధ్య తరహా ప్లాట్లకు 46.76 శాతం డిమాండ్ ఉంది. రూ.50 లక్షల వరకూ.. రూ.50 లక్షల వరకు ధర ఉండే స్థలాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 50.83 శాతం మంది ప్లాట్లలో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. గ్రేటర్లో షాద్‌నగర్, కడ్తాల్, సదాశివపేట వంటి ప్రాంతాలలో ప్లాట్ల సరఫరా అత్యధికంగా ఉంది. ఇక్కడ ప్లాట్ల సగటు ధర చ.అ.కు రూ.2,765గా ఉంది. లక్నోలో రూ.2,836, చెన్నైలో రూ.3,208లు పలుకుతున్నాయి. అత్యధికంగా నోయిడాలో రూ.22,523, గుర్గావ్లో రూ.21,901లతో ఖరీదైన మార్కెట్లుగా ఉన్నాయి.

ఆపరేషన్ బ్రహ్మ.. మయన్మార్‌కు భారత్ ఆపన్నహస్తం
న్యూఢిల్లీ: భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌కు అంతర్జాతీయ సాయం వెల్లువెత్తుతోంది. ఈ విషయంలో తక్షణం స్పందించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. బాధిత దేశానికి యుద్ధ ప్రాతిపదికన సహాయక సామగ్రి తదితరాలు అందజేసేందుకు ఆపరేషన్ బ్రహ్మ పేరిట హుటాహుటిన రంగంలోకి దిగింది. టెంట్లు, స్లీపింగ్ బ్యాగు లు, బ్లాంకెట్లు, ఆహార పదార్థాలు, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్లైట్లు, జెనరేటర్ సెట్లు, అత్యవసర ఔషధాల వంటివాటితో కూడిన 15 టన్నుల సహాయక సామగ్రిని శనివారం తెల్లవారుజామున మూడింటికే సైనిక విమానాల్లో మయన్మార్‌కు పంపింది. ఉదయం 8 గంటలకల్లా వాటిని స్థానికంగా బాధిత ప్రాంతాలకు పంపే కార్యక్రమం మొదలైపోయింది. అంతేగాక 118 మంది వైద్య తదితర సిబ్బందితో కూడిన పూర్తిస్థాయి ఫీల్డ్ ఆస్పత్రిని కూడా వాయుమార్గాన శనివారం రాత్రికల్లా మయన్మార్‌కు తరలించింది! వాళ్లంతా ఇప్పటికే మాండలే ప్రాంతంలో రంగంలోకి దిగా రు. గాయపడ్డ వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. మరో రెండు వాయుసేన విమానాల్లో మరింత సామగ్రిని పంపుతున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. అంతేగాక మరో 40 టన్నుల సామగ్రిని ఐఎన్ఎస్ సాత్పురా, ఐఎన్ఎస్ సావిత్రి నౌకల్లో యాంగూన్కు తరలిస్తున్నట్టు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. కమాండెంట్ పి.కె.తివారీ నేతృత్వంలో 80 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ అన్వేషక, విపత్తు సహాయక బృందాలు శనివారం సాయంత్రానికే బాధిత ప్రాంతాలకు చేరుకుని రంగంలోకి కూడా దిగాయని చెప్పారు. ‘‘రెస్క్యూ డాగ్స్ కూడా వెంట వెళ్లాయి. వాయు మార్గాన ఆరు అంబులెన్సులను తరలిస్తున్నాం’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. చైనా, రష్యా, దక్షిణ కొరియా తదితర దేశాల నుంచి కూడా సహాయక సామగ్రి మయన్మార్ చేరుతోంది. ఆ దేశంతో భారత్ 1,643 కి.మీ. పొడవైన సరిహద్దును పంచుకుంటుంది. అందుకే ‘బ్రహ్మ’ ‘‘బ్రహ్మ సృష్టికర్త. తీవ్ర విధ్వంసం బారిన పడ్డ మయన్మార్‌లో వీలైనంత త్వరగా మౌలిక సదుపాయాల పునరుద్ధరణ జరగాలన్నది భారత్ ఆకాంక్ష. అందుకే ఈ సహాయక ఆపరేషన్‌కు బ్రహ్మ అని పేరు పెట్టాం’’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైస్వాల్ మీడియాకు వివరించారు. మరింత సాయం పంపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు చెప్పారు. గతేడాది యాగీ తుపానుతో అతలాకుతలమైనప్పుడు కూడా మయన్మార్‌కు భారత్ ఇలాగే తక్షణం ఆపన్నహస్తం అందించిందని గుర్తు చేశారు. సహాయక సామగ్రి బాధిత ప్రాంతాలకు తక్షణం చేరేలా చర్యలు తీసుకుంటున్నట్టు మయన్మార్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మయన్మార్ సైనిక పాలకుడు జనరల్ మిన్ ఆంగ్ లయాంగ్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. అన్నివిధాలా దన్నుగా నిలుస్తామని మరోసారి హామీ ఇచ్చారు.

వీసా రద్దు చేశాం.. తక్షణం వెళ్లిపోండి
వాషింగ్టన్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ వ్యతిరేక విధానాలను సమరి్థంచే వాళ్లెవరూ ఇక్కడ ఉండొద్దని, తక్షణం వెళ్లిపోవాలంటూ వందలాది మంది విదేశీ విద్యార్థుల వీసాలను అమెరికా ప్రభుత్వం హఠాత్తుగా రద్దుచేసింది. వీసా రద్దయిన నేపథ్యంలో కస్టమ్స్, అండ్ బోర్డర్ ప్రొటెక్షన్(సీబీపీ) యాప్ లో నమోదుచేసుకుని స్వీయబహిష్కరణ ద్వారా అమెరికాను వదిలివెళ్లాలంటూ ఆయా వి ద్యార్థులకు ఈ–మెయిళ్లు, టెక్ట్స్ సందేశాలను పంపించింది. ఇలా బహిష్కరణ సందేశాలను అందుకున్న వారిలో భారతీయ విద్యార్థులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది.ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంతో అక్కడ విద్యనభ్యసిస్తున్న లక్షలాది భారతీయ విద్యార్థుల్లో ఒక్కసారిగా భయాందోళనలు పెరిగాయి. గాజా యుద్ధంలో హమాస్‌కు, పాలస్తీనియన్లకు మద్దతు పలకడం, ఇజ్రాయెల్‌ను విమర్శించడం, యుద్ధం విషయంలో ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతూ సంబంధిత సోషల్ మీడియా పోస్ట్‌లను సోషల్ మీడియా ఖాతాల్లో లైక్ చేయడం, షేర్ చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారి వీసాలను రద్దుచేశామని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్(డీఓఎస్) ప్రకటించింది. ఈ మేరకు ఎఫ్–1 వీసాను రద్దుచేస్తూ సంబంధిత విద్యార్థులకు ఈమెయిల్ పంపించింది. ఈ సందర్బంగా ‘‘అమెరికా శరణార్థి, జాతీయత చట్టంలోని సెక్షన్ 221(ఐ) ప్రకారం మీ ఎఫ్–1 వీసా గడువును తక్షణం ముగిస్తున్నాం. అమెరికాను వీడటానికి ముందు కచ్చితతంగా అమెరికా ఎంబసీ/కాన్సులేట్‌లో మీ పాస్‌పోర్ట్‌ను చూపించండి. వాళ్లు మీ వీసాను స్వయంగా రద్దు చేస్తారు. ఆ తర్వాత సీబీపీ యాప్ సాయంతో స్వీయబహిష్కరణ విధానాన్ని వాడుకుని అమెరికాను వీడండి. అలా వెళ్లకపోతే మీమే మిమ్మల్ని బలవంతంగా బహిష్కరిస్తాం. మేం పంపితే మీ స్వదేశానికే పంపకపోవచ్చు. మా వీలును బట్టి మాకు అనువైన మరేదైనా దేశానికి తరలించే వీలుంది’’ అని ఈ–మెయిల్ సందేశంలో ప్రభుత్వం పేర్కొంది. 2023–24 ఏడాదికి విదేశీ విద్యార్థులకు సంబంధించిన ‘ఓపెన్ డోర్స్’నివేదిక ప్రకారం అమెరికాలో 11 లక్షల మంది విదేశీ విద్యార్థులున్నారు. వారిలో 3.31 లక్షల మంది భారతీయ విద్యార్థులే.

బంగ్లా షేక్ హసీనాకు బిగ్ షాక్
ఢాకా: అంతర్గత తిరుగుబాటు ద్వారా యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారంటూ బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాపై కేసు నమోదైంది. హసీనా, మరో 72 మందిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్(సీఐడీ) ఢాకాలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కోర్టు దర్యాప్తు చేపట్టాలంటూ సీఐడీని గురువారం కోరిందన్నారు.ఈ సందర్బంగా ‘జోయ్ బంగ్లా బ్రిగేడ్’పేరుతో ఏర్పాటైన ఆన్లైన్ వేదికపై 2024 డిసెంబర్ 19వ తేదీన కొందరు సమావేశమై దేశంలో అంతర్యుద్దం ద్వారా హసీనాను తిరిగి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే విషయమై చర్చించినట్లు సమాచారము ఉందని సీఐడీ తన ఫిర్యాదులో పేర్కొంది. మధ్యంతర ప్రభుత్వాన్ని కొనసాగనివ్వరాదని డాక్టర్ రబ్బీ ఆలం సారథ్యంలో జరిగిన ఈ వర్చువల్ సమావేశం నిర్ణయించిందన్నారు.షేక్ హసీనా తదితరులు పాల్గొన్న ఈ భేటీ రికార్డింగ్స్ తమకు లభ్యమైనట్లు సీఐడీ తెలిపింది. హసీనా ఆదేశాల మేరకు అమెరికాలో ఉంటున్న అవామీ లీగ్ నేత ఆలం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేశ, విదేశాలకు చెందిన మొత్తం 577 మంది పాల్గొన్నట్లు సీఐడీ తెలిపింది. ఈ కేసులో ఆలంను రెండో నిందితుడిగా పేర్కొంది. కాగా, యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వం భారత్‌లో ఉంటున్న హసీనాపై పలు ఆరోపణల కింద కేసులు నమోదు చేయడం తెలిసిందే.
హెచ్ఆర్ కంపెనీ చేతికి బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ సంస్థ
కాల్పుల కలకలం
ఐపీఎల్-2025లో నేడు (మార్చి 30) రెండు మ్యాచ్‌లు.. రెండూ భారీ మ్యాచ్‌లే..!
నాగ్‌పూర్ చేరుకున్న ప్రధాని మోదీ.. సంఘ్ కార్యాలయం సందర్శన
సౌత్‌లో నా సినిమాలు చూడరు.. మనమేమో వాళ్లవి ఎగబడి చూస్తాం: సల్మాన్
'సికందర్' ట్విటర్ రివ్యూ.. ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడం బెటర్ అంటూ..
పండుగ పూట విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
Myanmar: ఇంకా తప్పని ముప్పు.. 24 గంటల్లో 15 భూ ప్రకంపనలు
GT VS MI: మొదటి మ్యాచ్‌కు ముందే 'ఆ' నిర్ణయం తీసుకున్నాం.. ప్రసిద్ద్ బౌలింగ్ అద్భుతం: గిల్
ఓపెన్ ప్లాటా.. అపార్ట్‌మెంటా?
సుప్రీం కోర్టు తీర్పు.. కూటమి సర్కార్‌కు చెంపపెట్టు
ప్రియుడితో 'అభినయ' పెళ్లి.. కాబోయే భర్త ఫోటో రివీల్
పదో తరగతి సోషల్ పరీక్ష వాయిదా
నీ అభిమానం తగలెయ్య.. ఏకంగా రూ.1.72 లక్షల విలువైన టికెట్లు దానం
MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!
చరణ్ బర్త్‌డే వేడుకల్లో నాగార్జున.. కనిపించని అల్లు ఫ్యామిలీ
IPL 2025: భువీ వరల్డ్ రికార్డు
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం...
16 ఏళ్ల నిరీక్షణ.. నిర్దోషిగా హైకోర్టు మాజీ జడ్జి
టీమిండియా కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్..!?
హెచ్ఆర్ కంపెనీ చేతికి బ్యాగ్రౌండ్ వెరిఫికేషన్ సంస్థ
కాల్పుల కలకలం
ఐపీఎల్-2025లో నేడు (మార్చి 30) రెండు మ్యాచ్‌లు.. రెండూ భారీ మ్యాచ్‌లే..!
నాగ్‌పూర్ చేరుకున్న ప్రధాని మోదీ.. సంఘ్ కార్యాలయం సందర్శన
సౌత్‌లో నా సినిమాలు చూడరు.. మనమేమో వాళ్లవి ఎగబడి చూస్తాం: సల్మాన్
'సికందర్' ట్విటర్ రివ్యూ.. ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడం బెటర్ అంటూ..
పండుగ పూట విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి
Myanmar: ఇంకా తప్పని ముప్పు.. 24 గంటల్లో 15 భూ ప్రకంపనలు
GT VS MI: మొదటి మ్యాచ్‌కు ముందే 'ఆ' నిర్ణయం తీసుకున్నాం.. ప్రసిద్ద్ బౌలింగ్ అద్భుతం: గిల్
ఓపెన్ ప్లాటా.. అపార్ట్‌మెంటా?
సుప్రీం కోర్టు తీర్పు.. కూటమి సర్కార్‌కు చెంపపెట్టు
ప్రియుడితో 'అభినయ' పెళ్లి.. కాబోయే భర్త ఫోటో రివీల్
పదో తరగతి సోషల్ పరీక్ష వాయిదా
నీ అభిమానం తగలెయ్య.. ఏకంగా రూ.1.72 లక్షల విలువైన టికెట్లు దానం
MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే!
చరణ్ బర్త్‌డే వేడుకల్లో నాగార్జున.. కనిపించని అల్లు ఫ్యామిలీ
IPL 2025: భువీ వరల్డ్ రికార్డు
స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం...
16 ఏళ్ల నిరీక్షణ.. నిర్దోషిగా హైకోర్టు మాజీ జడ్జి
టీమిండియా కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్..!?
సినిమా

పిల్లలు పుట్టిన తర్వాత 'రీ ఎంట్రీ' ఇస్తానంటే ఇలాంటి మాటలన్నారు: జెనీలియా
జెనీలియా( Genelia)... పరిచయం అక్కర్లేని పేరు. ‘అంతేనా... వీలైతే నాలుగు మాటలు... కుదిరితే కప్పు కాఫీ’ అంటూ ‘బొమ్మరిల్లు’ సినిమాలో ఆమె చెప్పిన డైలాగ్స్ ఇప్పటికీ ఫేమస్సే. సుమంత్ హీరోగా రూపొందిన ‘సత్యం’ (2003) సినిమాతో తెలుగులో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ ‘సాంబ, సై, సుభాష్ చంద్రబోస్, హ్యాపీ, ఆరెంజ్, రెడీ, బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సొంతం చేసుకున్నారు. ‘నా ఇష్టం’ (2012) తర్వాత ఆమె మరో తెలుగు చిత్రంలో నటించలేదు. బాలీవుడ్ హీరో రితేశ్ దేశ్ముఖ్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టాక సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. పెళ్లి, పిల్లల కారణంగా దాదాపు పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారామె.ఆ తర్వాత కమ్ బ్యాక్ అవుదామనుకుంటే తెలిసినవారెవరూ ప్రోత్సహించలేదనీ, పైగా నిరాశపరిచారనీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు జెనీలియా. ‘‘పిల్లలు పుట్టిన తర్వాత యాక్టింగ్‌కు దూరం అయ్యాను. కమ్ బ్యాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు తెలిసినవాళ్లెవరూ ప్రోత్సహించలేదు. ‘పదేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లోకి వస్తున్నావా? ఇది ఏమాత్రం వర్కౌట్ కాదు’ అంటూ నిరాశపరిచారు. కానీ వారి మాటలు వినకుండా ధైర్యంగా రీ ఎంట్రీ ఇచ్చాను. నా భర్త రితేశ్ దేశ్ముఖ్తో కలిసి నేను నటించిన ‘వేద్’ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో అన్ని విషయాల్లో ఇతరులను నమ్మకూడదని నాకు అనిపించింది’’ అని తెలిపారు జెనీలియా. ప్రస్తుతం ఆమె ‘సితారె జమీన్ పర్, జూనియర్’ వంటి సినిమాల్లో నటిస్తున్నారు.

ఇదిదా సర్ప్రైజ్.. విలన్స్‌గా స్టార్ హీరోలు
కెరీర్ ప్రారంభంలో విలన్‌గా చేసి, ఆ తర్వాత హీరోగా టర్న్ తీసుకున్న హీరోలు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కానీ హీరోగా సక్సెస్ అయిన తర్వాత కూడా విలన్ రోల్స్‌ను ప్రయత్నిస్తున్నారు కొందరు హీరోలు. ‘ఇదిదా సర్ప్రైజ్’ అంటూ ఇలా తమ నెగటివ్ షేడ్స్ ట్యాలెంట్‌తో ఆడియన్స్‌ను సర్ప్రైజ్ చేసిన, సర్ప్రైజ్ చేయనున్న కొందరు హీరోల గురించి ఓ లుక్ వేద్దాం.కూలీకి విలన్?సిల్వర్ స్క్రీన్‌పై నాగార్జున నెగటివ్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ఆడియన్స్‌లో తప్పక ఉంటుంది. పూర్తి స్థాయి గ్రే షేడ్స్ క్యారెక్టర్లో నాగార్జునను స్క్రీన్‌పై చూడాలని కొందరు ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఆ తరుణం ఆసన్నమైందని, రజనీకాంత్ ‘కూలీ’ సినిమాలో నాగార్జున నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారనే టాక్ కోలీవుడ్‌లో ప్రచారంలోకి వచ్చింది. ‘కూలీ’ సినిమా చిత్రీకరణప్రారంభమైనప్పుడు నాగార్జున ఓ వ్యక్తిని క్రూరంగా కత్తితో చంపుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ నెగటివ్ షేడ్స్‌లో ఉంటుందనే వార్తలకు ఈ వీడియో రూపంలో బలం చేకూరినట్లయింది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. శ్రుతీహాసన్, ఉపేంద్ర, సత్యరాజ్ ఇతర కీలకపాత్రల్లో నటించారు. బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఓ గెస్ట్ రోల్ చేశారు. ‘కూలీ’ సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది.బ్రహ్మ రాక్షస హీరోగా ప్రభాస్ కటౌట్‌కి ఉన్న బాక్సాఫీస్ స్టామినా ఏంటో ఆడియన్స్ చూశారు. మరి... ప్రభాస్‌లాంటి కటౌట్ ఉన్న హీరో క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటే ఎలా ఉంటుందో ‘బిల్లా’ సినిమాలో శాంపిల్‌గా ఆడియన్స్ చూశారు. కానీ ఈ డోస్‌ను ఇంకాస్త పెంచి ‘బ్రహ్మ రాక్షస’ సినిమాతో ఆడియన్స్‌ని తన నెగటివ్ షేడ్ యాక్టింగ్ స్కిల్‌తో సర్ప్రైజ్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నారట. ప్రభాస్ మెయిన్ లీడ్ రోల్లో ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘బ్రహ్మ రాక్షస’ అనే మూవీ రానుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబ్, ఫౌజి’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ మూవీ చేస్తారు. ఈ ‘స్పిరిట్’ మూవీ చిత్రీకరణ ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే... ప్రశాంత్ వర్మతో ‘బ్రహ్మ రాక్షస’ సినిమాను టేకాఫ్ చేస్తారు ప్రభాస్. ఈ లోపు రిషబ్ శెట్టితో ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ను పూర్తి చేస్తారు ప్రశాంత్ వర్మ. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభాస్–ప్రశాంత్ వర్మ కాంబోలోని మూవీ 2026 చివర్లో లేదా 2027ప్రారంభంలో మొదలు కానున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ ‘బ్రహ్మ రాక్షస’ సినిమాను తొలుత రణ్వీర్ సింగ్‌తో చేయాలనుకున్నారు ప్రశాంత్ వర్మ. కానీ కొన్ని కారణాల వల్ల రణ్వీర్ సింగ్ ఈప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు.బాలీవుడ్ వార్ ‘టెంపర్, జై లవకుశ’ వంటి చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్‌లో ఎన్టీఆర్ స్క్రీన్‌పై ఎంత రెచ్చిపోయారో ఆడియన్స్ చూశారు. కాగా ఎన్టీఆర్లోని నెగటివ్ షేడ్ యాంగిల్ ఈసారి నార్త్ ఆడియన్స్‌కు కూడా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించనుందని తెలిసింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్‌లో హిందీలో ‘వార్ 2’ అనే మూవీ రానుంది. ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.యశ్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ‘వార్ 2’ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని బాలీవుడ్ సమాచారం. ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) ఏజెంట్ వీరేంద్ర నాథ్పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారని, ఆయన క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని టాక్. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఆగస్టు 14న ‘వార్ 2’ సినిమాను రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే.తొలిసారిగా విలన్‌గా... సిల్వర్ స్క్రీన్‌పై బ్లాక్ బస్టర్ హీరోస్లో అల్లు అర్జున్ ఒకరు. కాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ఆర్య 2’ చిత్రంలో ఆయన క్యారెక్టర్లో కాస్త గ్రే షేడ్స్ ఉంటాయి. ఆ తర్వాత ‘పుష్ప’ వంటి ఎగ్రెసివ్ ఎనర్జీ ఉన్న క్యారెక్టర్స్ చేశారు కానీ, పూర్తి స్థాయి గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌ను అల్లు అర్జున్ చేయలేదు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందట. అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్లో ఓ భారీ బడ్జెట్ మూవీ రానుందనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.ఈ మూవీలో అల్లు అర్జున్ ద్విపాత్రాభినయం చేయనున్నారని, ఈ రెండు రోల్స్‌లో ఓ రోల్లో నెగటివ్ షేడ్స్ ఉంటుందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించనుందట. ఈ వేసవిలో చిత్రీకరణనుప్రారంభించి, 2026 చివర్లో ఈ మూవీని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని భోగట్టా. ఈ చిత్రంపై పూర్తి స్థాయి సమాచారం అందాల్సి ఉంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే. ఈ సందర్భంగా ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.బ్లాక్ స్వార్డ్ హీరోగా తెలుగు స్క్రీన్‌పై సక్సెస్ అయ్యారు మంచు మనోజ్. ఇప్పుడు విలన్‌గా కనిపించనున్నారు. ‘హను–మాన్’ ఫేమ్ తేజ సజ్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ ఈ మైథలాజికల్ అండ్ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్‌ను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సూపర్ యోధపాత్రలో తేజ సజ్జా నటిస్తుండగా, బ్లాక్ స్వార్డ్పాత్రలో మంచు మనోజ్ విలన్‌గా కనిపిస్తారు. ఇక ‘మిరాయ్’ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ హీరోలే కాదు... ఇంకొందరు స్టార్స్ కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్‌కి సై అన్నారు. – ముసిమి శివాంజనేయులుకోలీవుడ్ హీరోలు కూడా వీలైనప్పుడు విలన్ రోల్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ మూవీలో మెయిన్ విలన్‌గా కమల్‌హాసన్ నటించారు. కమల్‌హాసన్ హీరోగా చేసిన ‘విక్రమ్’ మూవీ క్లైమాక్స్‌లో రోలెక్స్‌గా విలన్‌పాత్రలో కనిపించారు సూర్య. ఇక సూర్య హీరోగా చేసిన ‘కంగువ’ మూవీలో కార్తీ విలన్‌గా కనిపించారు. కార్తీ హీరోగా చేసిన ‘ఖైదీ’ సినిమాలో తమిళ యువ నటుడు అర్జున్ దాస్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించారు. కమల్‌హాసన్ ‘విక్రమ్’, కార్తీ ‘ఖైదీ’ చిత్రాల దర్శకుడు లోకేశ్ కనగరాజ్ నేతృత్వంలోని ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంలోనివే. సో... ‘ఖైదీ 2’ చిత్రంలో సూర్య విలన్‌గా నటించే చాన్సెస్ ఉన్నాయి.⇒ ఇంకా శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ సినిమా కోసం తొలిసారిగా విలన్‌గా స్క్రీన్‌పై కనిపించనున్నారు రవి మోహన్ (ఇటీవల ‘జయం’ రవి తన పేరును రవి మోహన్‌గా మార్చుకున్నారు). సుధ కొంగర దర్శకత్వంలోని ఈ మూవీ వచ్చే ఏడాదిప్రారంభంలో రిలీజ్ కానుందని తెలిసింది. ధనుష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఇడ్లీ కడై’లో అరుణ్ విజయ్ విలన్‌గా చేస్తున్నారన్న వార్తలు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. ఇంకా వీలైనప్పుడల్లా విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, మాధవన్ వంటి యాక్టర్స్ కూడా విలన్ రోల్స్ చేస్తున్నారు. ఇలా ఇంకొంతమంది ఉన్నారు.⇒ బాలీవుడ్ హీరోలు కూడా విలన్ రోల్స్ చేస్తున్నారు. షారుక్ ఖాన్ హీరోగా చేయ నున్న నెక్ట్స్ మూవీ ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో అభిషేక్ బచ్చన్ తొలిసారి నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నారు. రణ్‌బీర్ కపూర్ హీరోగా చేస్తున్న ‘రామాయణ’ సినిమాలో ‘కేజీఎఫ్’ హీరో యశ్ రావణుడిపాత్ర చేస్తున్నారు. గత ఏడాది విడుదలైన అజయ్ దేవగన్ ‘సింగమ్ ఎగైన్’లో అర్జున్ కపూర్ విలన్‌గా చేశారు. ఇంకా బాలీవుడ్లో హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్న సంజయ్ దత్, బాబీ డియోల్ (హరిహర వీరమల్లు), ఇమ్రాన్ హష్మి (ఓజీ, జీ 2), జిమ్ సర్ఫ్ (కుబేర), సోహైల్ ఖాన్ (అర్జున్ సన్నాఫ్ వైజయంతి), దివ్యేందు (పెద్ది) వంటి వారు తెలుగు సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తున్నారు. ఇలా ఇంకొందరు ఉన్నారు.⇒ కథ నచ్చితే నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేసేందుకు హీరోయిన్స్ సైతం వెనకాడటం లేదు. ఈ విషయంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ముందుంటారు. హీరోయిన్గా చేస్తూనే ఎక్కువగా విలన్ రోల్స్ చేస్తుంటారామె. ఇక వెంకటేశ్ ‘సైంధవ్’లో ఆండ్రియా, విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ‘వెన్నెల’ కిశోర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’లో అనన్య నాగళ్ల, అజిత్ ‘విడాముయర్చి’ లో రెజీనా, రణ్‌బీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’లో మౌనీ రాయ్, ‘పొన్నియిన్ సెల్వన్’లో ఐశ్వర్యా రాయ్ వంటి వారు కెరీర్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న సమయంలోనే నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు. ఇలా మరికొంతమంది ఉన్నారు.

చరణ్ బర్త్‌డే వేడుకల్లో నాగార్జున.. కనిపించని అల్లు ఫ్యామిలీ
టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ (Ram Charan) మార్చి 27న 40వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఈసారి బర్త్‌డేను మెగా ఫ్యామిలీ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీతో పాటు దగ్గరి ఫ్రెండ్స్ సమక్షంలో చరణ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. అందుకు సంబంధించిన ఫోటోలను చరణ్ భార్య ఉపాసన (Upasana Konidela) సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఎంతో ప్రత్యేకం: ఉపాసనమార్చి 27.. ఎప్పటికీ గ్రేట్‌ఫుల్‌గా ఉంటాను. ఈ రోజును ఇంత ప్రత్యేకంగా మలిచిన అందరికీ కృతజ్ఞతలు అని రాసుకొచ్చింది. మొదటి ఫోటోలో చిరంజీవి- సురేఖ, రామ్ చరణ్ -ఉపాసనతో పాటు సుష్మిత కొణిదెల ఉంది. తర్వాతి ఫోటోల్లో చరణ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక ఫోటోలో అయితే చిరంజీవి క్లోజ్ ఫ్రెండ్ కింగ్ నాగార్జున (Nagarjuna Akkineni) ఉన్నాడు. ఈ వేడుకల్లో అల్లు ఫ్యామిలీ మాత్రం కనిపించలేదు.పార్టీలో కనిపించని 'అల్లు' కుటుంబంచరణ్ బర్త్‌డేరోజు మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కానీ అల్లు ఫ్యామిలీ మాత్రం చరణ్ కోసం సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టు పెట్టలేదు. ఇప్పుడు బర్త్‌డే పార్టీలో కూడా అల్లు ఫ్యామిలీ లేకపోవడంతో ఈ రెండు కుటుంబాల మధ్య వైరం అలాగే కొనసాగుతోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.చరణ్ సినిమాలురామ్చరణ్ చివరగా గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించాడు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం చరణ్.. బుచ్చిబాబుతో పెద్ది సినిమా చేస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ కథానాయిక. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీని తర్వాత సుకుమార్‌తో ఓ సినిమా చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే రంగస్థలం తర్వాత చరణ్- సుకుమార్ కాంబినేషన్లో ఇది రెండో సినిమాగా తెరకెక్కనుందన్నమాట! రంగస్థలం, పుష్ప వంటి బ్లాక్బస్టర్లు అందించిన సుకుమార్ ఈసారి అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో చరణ్‌ను చూపించే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) చదవండి: 'స్నేహ.. కొంచెమైనా బుద్ధుందా? చెప్పులేసుకుని గిరిప్రదక్షిణా?'

ఎప్పుడూ ప్రేమే గెలుస్తుంది.. త్రిష పోస్ట్‌కు అర్థమేంటో?
త్రిష (Trisha Krishnan).. తెలుగులోనే కాదు తమిళంలోనూ టాప్ హీరోయిన్. ఈమధ్య తన హవా కాస్త తగ్గింది కానీ ఒకప్పుడు ఆమె తెరపై కనిపిస్తే విజిల్స్ పడాల్సిందే! గత కొన్నేళ్లుగా సినిమాల సంఖ్య తగ్గించేసిన ఈ బ్యూటీ ఈ ఏడాది మాత్రం చేతి నిండా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటించిన ఐడెంటిటీ, విడాముయర్చి ఇప్పటికే రిలీజయ్యాయి. ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్, విశ్వంభర, రామ్.. సహా సూర్య 45వ సినిమాలో నటిస్తోంది.ప్రేమదే విజయంతాజాగా త్రిష ఇన్‌స్టాగ్రామ్‌లో చేతి ఉంగరాన్ని చూపిస్తూ ఓ ఫోటో షేర్ చేసింది. దీనికి 'ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది' అన్న క్యాప్షన్‌ను జోడించింది. ఆ ఫోటోలో త్రిష ఆకుపచ్చ చీర ధరించి ఉంది. ముక్కుపుడక, మల్లెపూలతో సాంప్రదాయంగా ముస్తాబైంది. చెవికమ్మలకు మ్యాచ్ అయ్యే ఉంగరం ధరించింది. ఇది చూసిన కొందరు ఎంగేజ్మెంట్ జరిగిందా? లేదా పెళ్లికి రెడీ అని హింట్ ఇస్తుందా? అని ఆరా తీస్తున్నారు.పెళ్లికి గ్రీన్ సిగ్నల్?తమిళ హీరో విజయ్‌తో త్రిష ప్రేమలో ఉన్నట్లు కొన్నేళ్లుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ జీవితాంతం కలిసుందామని ఏదైనా నిర్ణయం తీసుకున్నారా? అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే త్రిష.. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అల్లరి బుల్లోడు, అతడు, పౌర్ణమి, సైనికుడు, స్టాలిన్, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, బుజ్జిగాడు, నమో వెంకటేశా.. వంటి పలు చిత్రాలతో తెలుగువారి మనసులో స్థానం సంపాదించుకుంది. View this post on Instagram A post shared by Trish (@trishakrishnan) చదవండి: చరణ్ బర్త్‌డే వేడుకల్లో నాగార్జున.. కనిపించని అల్లు ఫ్యామిలీ
న్యూస్ పాడ్‌కాస్ట్

చిరంజీవిని కలిసిన 'కోర్ట్' మూవీ టీమ్ (ఫొటోలు)

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని నిర్మాణం పేరిట సిండికేట్ లూటీ... సన్నిహితులైన కాంట్రాక్టర్లతో ప్రభుత్వ పెద్దల కుమ్మక్కు...

25 ఏళ్లపాటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టొద్దు... చెన్నైలో జేఏసీ తొలి సమావేశంలో తీర్మానం

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్యోగాలు మాయం... దాదాపు 2 లక్షల మేర తగ్గిపోయిన ఉద్యోగుల సంఖ్య
క్రీడలు

నేడు వైజాగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ X సన్‌రైజర్స్ హైదరాబాద్
విశాఖపట్నం వేదికగా ఐపీఎల్లో నేడు మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతుంది. ఇక్కడే జరిగిన గత మ్యాచ్‌లో లక్నోపై విజయం సాధించిన ఢిల్లీకి ఇది రెండో ‘హోం మ్యాచ్’ కానుంది. మరో వైపు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఒకటి గెలిచి మరొకటి ఓడిన సన్‌రైజర్స్ లీగ్‌లో మళ్లీ గెలుపు బాట పట్టాలని పట్టుదలగా ఉంది. లక్నోతో మ్యాచ్‌లో దాదాపుగా ఓటమికి చేరువై అశుతోష్ అసాధారణ బ్యాటింగ్‌తో గెలుపు అందుకున్న అక్షర్ పటేల్ బృందం సమష్టిగా రాణిస్తేనే మరో విజయానికి అవకాశం ఉంటుంది. మరో వైపు తొలి మ్యాచ్‌లో రాజస్తాన్‌పై అద్భుత బ్యాటింగ్‌తో చెలరేగిన రైజర్స్ బ్యాటర్లు తర్వాతి పోరులో తడబడ్డారు.అయితే అంచనాలకు అనుగుణంగా హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, క్లాసెన్ సత్తా చాటితే జట్టు భారీ స్కోరు సాధించడం ఖాయం. వైజాగ్‌కు చెందిన నితీశ్ కుమార్ రెడ్డి సన్‌రైజర్స్ తరఫున బరిలోకి దిగుతుండటంతో అభిమానులు కూడా మ్యాచ్ పట్ల ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

గుజరాత్ గెలుపు బోణీ
మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ తాజా సీజన్లో తొలి విజయాన్ని అందుకుంది. మొదటి మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓడిన టీమ్ సొంతగడ్డపై పాయింట్ల ఖాతా తెరిచింది. బ్యాటింగ్‌లో సాయిసుదర్శన్, బౌలింగ్‌లో ప్రసిధ్, సిరాజ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. మరో వైపు గత మ్యాచ్‌లాగే అన్ని రంగాల్లో విఫలమైన ముంబై వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. బ్యాటింగ్‌లో ఆ జట్టు కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయింది. అహ్మదాబాద్: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన గుజరాత్ టైటాన్స్ గెలుపు బోణీ చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 36 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 63; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేయగా...జోస్ బట్లర్ (24 బంతుల్లో 39; 5 ఫోర్లు, 1 సిక్స్), శుబ్‌మన్ గిల్ (27 బంతుల్లో 38; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 48; 1 ఫోర్, 4 సిక్స్‌లు), తిలక్‌వర్మ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ప్రసిధ్ కృష్ణ (2/18), సిరాజ్ (2/34) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. కీలక భాగస్వామ్యాలు... గుజరాత్ ఇన్నింగ్స్‌లో టాప్–3 నెలకొల్పిన రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు జట్టు స్కోరులో కీలకంగా నిలిచాయి. తొలి వికెట్‌తో గిల్‌తో 78 పరుగులు (51 బంతుల్లో) జోడించిన సుదర్శన్, రెండో వికెట్‌కు బట్లర్‌తో 51 పరుగులు (32 బంతుల్లో) జత చేశాడు. సుదర్శన్, గిల్ ధాటిగా ఆడుతూ 7 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 66 పరుగులకు చేరింది. గిల్ వెనుదిరిగిన తర్వాత వచ్చిన బట్లర్ కూడా కొద్ది సేపు ధాటిని ప్రదర్శించాడు. 33 బంతుల్లో వరుసగా రెండో మ్యాచ్‌లో సుదర్శన్ అర్ధ సెంచరీ పూర్తయింది. షారుఖ్ ఖాన్ (9)ను ముందుగా పంపిన ప్రయత్నం ఫలితం ఇవ్వకపోగా, రూథర్‌ఫోర్డ్ (18) రాజు ఓవర్లో రెండు సిక్సర్లు బాదాడు. 18వ ఓవర్ చివరి బంతికి సుదర్శన్‌ను బౌల్ట్ అవుట్ చేయడంతో గుజరాత్ జోరుక బ్రేక్ పడింది. చివరి 2 ఓవర్లలో ఆ జట్టు 17 పరుగులు మాత్రమే సాధించి 4 వికెట్లు చేజార్చుకుంది. దాంతో స్కోరు 200 పరుగులు దాటలేకపోయింది. ముంబై తరఫున రెండో మ్యాచ్ ఆడిన ఆంధ్ర పేస్ బౌలర్ పెన్మత్స సత్యనారాయణ రాజు ఐపీఎల్లో తన తొలి వికెట్ సాధించడం విశేషం. రాణించిన తిలక్... ఛేదనలో ముంబై పూర్తిగా తడబడింది. తిలక్‌వర్మ, సూర్యకుమార్ క్రీజ్‌లో ఉన్న సమయంలోనే జట్టు గెలుపుపై ఆశలు ఉండగా...ఇది మినహా మిగతా ఇన్నింగ్స్ పేలవంగా సాగింది. సిరాజ్ వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రోహిత్ శర్మ (8) తర్వాతి బంతికి వెనుదిరగ్గా, రికెల్టన్ (6)ను కూడా సిరాజ్ బౌల్డ్ చేశాడు. తిలక్ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో అలరించాడు. రబాడ ఓవర్లో అతను వరుసగా 4, 4, 6 కొట్టాడు. మరో ఎండ్‌లో సూర్య కూడా తనదైన శైలిలో ధాటిగా ఆడాడు. మూడో వికెట్‌కు 42 బంతుల్లో 62 పరుగులు జత చేసిన తర్వాత తిలక్‌ను ప్రసిధ్ వెనక్కి పంపాడు. 51 బంతుల్లో 100 పరుగులు చేయాల్సిన ఈ స్థితినుంచి ముంబై కోలుకోలేకపోయింది. 27 పరుగుల వ్యవధిలో తర్వాతి 4 వికెట్లు కోల్పోయిన జట్టు ఓటమిని ఆహ్వానించింది. స్కోరు వివరాలు గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 63; శుబ్‌మన్ గిల్ (సి) నమన్ (బి) పాండ్యా 38; బట్లర్ (సి) రికెల్టన్ (బి) ముజీబ్ 39; షారుఖ్ (సి) తిలక్ (బి) పాండ్యా 9; రూథర్‌ఫోర్డ్ (సి) సాంట్నర్ (బి) చహర్ 18; తెవాటియా (రనౌట్) 0; రషీద్ (సి) పాండ్యా (బి) రాజు 6; రబాడ (నాటౌట్) 7; సాయికిషోర్ (రనౌట్) 1; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1–78, 2–129, 3–146, 4–179, 5–179, 6–179, 7–194, 8–196. బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ 4–0–34–1, దీపక్ చహర్ 4–0–39–1, ముజీబ్ 2–0–28–1, హార్దిక్ పాండ్యా 4–0–29–2, సాంట్నర్ 3–0–25–0, సత్యనారాయణ రాజు 3–0–40–1. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) సిరాజ్ 8; రికెల్టన్ (బి) సిరాజ్ 6; తిలక్‌వర్మ (సి) తెవాటియా (బి) ప్రసిధ్ 39; సూర్యకుమార్ (సి) గిల్ (బి) ప్రసిధ్ 48; మిన్జ్ (సి) ఇషాంత్ (బి) సాయికిషోర్ 3; పాండ్యా (సి) సిరాజ్ (బి) రబాడ 11; నమన్ (నాటౌట్) 18; సాంట్నర్ (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1–8, 2–35, 3–97, 4–108, 5–120, 6–124. బౌలింగ్: సిరాజ్ 4–0–34–2, రబాడ 4–0–42–1, ఇషాంత్ 2–0–17–0, రషీద్ 2–0–10–0, సాయికిషోర్ 4–0–37–1, ప్రసిధ్ 4–0–18–2. ఐపీఎల్లో నేడుఢిల్లీ X హైదరాబాద్‌వేదిక: విశాఖపట్నంమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి రాజస్తాన్ X చెన్నై వేదిక: గువాహటిరాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

శరత్ కమల్ శకం ముగిసె...
చెన్నై: భారత టేబుల్ టెన్నిస్ ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్ ఆచంట శరత్ కమల్ తన ఆట ముగించాడు. వరల్డ్ టేబుల్ టెన్నిస్ స్టార్ కంటెండర్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో పరాజయంతో అతను రిటైర్ అయ్యాడు. ఈ టోర్నీ ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో సూరావజ్జుల స్నేహిత్ (తెలంగాణ) చేతిలో శరత్ కమల్ 0–3తో ఓటమిపాలయ్యాడు. 25 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో స్నేహిత్ 11–9, 11–8, 11–9తో విజయం సాధించాడు. శరత్ కమల్ చివరి మ్యాచ్ చూడటం కోసం నెహ్రూ స్టేడియానికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. మ్యాచ్ ముగిసిన తర్వాత వారందరికీ అభివాదం చేస్తూ అతను కృతజ్ఞతలు తెలిపాడు. అంతకు ముందే పురుషుల డబుల్స్ విభాగంలో స్నేహిత్తోనే కలిసి శరత్ డబుల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఈ పోరులో కొరియా జోడి లిమ్ జాంగూన్ – ఆన్ జీహున్ చేతిలో 11–9, 8–11, 9–11, 6–11 స్కోరుతో శరత్ – స్నేహిత్ ఓడిపోయారు. 17 ఏళ్ల వయసులో చెన్నైలోనే జరిగిన ఆసియా జూనియర్స్ టోర్నీతో తొలిసారి ప్రొఫెషనల్ టేబుల్ టెన్నిస్ బరిలోకి దిగిన శరత్ కమల్ రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు. అసాధారణ రీతిలో 10 సార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచిన శరత్ అంతర్జాతీయ మెగా ఈవెంట్లలో పెద్ద సంఖ్యలో పతకాలు గెలుచుకున్నాడు.కామన్వెల్త్ క్రీడల్లో 7 స్వర్ణాలు, 3 రజతాలు, 3 కాంస్యాలు గెలిచిన అతను ఆసియా క్రీడల్లో 2 కాంస్యాలు సాధించాడు. ఆసియా చాంపియన్‌షిప్‌లో కూడా అతని ఖాతాలో 4 కాంస్యాలు ఉన్నాయి. 2004 నుంచి 2024 మధ్య ఐదు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న శరత్ కమల్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, ఖేల్‌రత్న పురస్కారాలతో గౌరవించింది.

నిప్పులు చెరిగిన సిరాజ్, ప్రసిద్ద్.. ముంబైను చిత్తు చేసిన గుజరాత్
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 36 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులకే పరిమితమైంది.ముంబై బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(48) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. తిలక్ వర్మ(39) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్యా చేతులేత్తేశాడు. 17 బంతుల్లో 11 పరుగులు చేసిన హార్దిక్ ముంబై ఓటమికి పరోక్షంగా కారణమయ్యాడు.గుజరాత్ బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. రబాడ, సాయికిషోర్ తలా వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(63) టాప్ స్కోరర్‌గా నిలవగా.. శుబ్‌మన్ గిల్(38), జోస్ బట్లర్(39) రాణించారు. ముంబై బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ తలా వికెట్ సాధించారు.
బిజినెస్

SEBI: 72 రీసెర్చ్ అనలిస్టుల రిజిస్ట్రేషన్ రద్దు
న్యూఢిల్లీ: రెన్యువల్ ఫీజును కట్టనందుకు గాను 72 రీసెర్చ్ అనలిస్టుల రిజిస్ట్రేషన్‌ను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రద్దు చేసింది. దీంతో వాటి రిజిస్ట్రేషన్ ఇక చెల్లుబాటు కాదు. గడువు తీరిపోయిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెబీ తెలిపింది. సెబీ నిబంధనల ప్రకారం నమోదు చేసుకున్న ప్రతి రీసెర్చ్ అనలిస్టు అయిదేళ్లకోసారి రెన్యువల్ ఫీజును కట్టాల్సి ఉంటుంది. అయితే, ఈ 72 అనలిస్టులు రెన్యువల్ ఫీజులు చెల్లించలేదని, వారి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ గడువు ముగిసిపోయిందని సెబీ గుర్తించింది. దీంతో నిబంధనల ఉల్లంఘనకు గాను వారికి షోకాజ్ నోటీసులు పంపించి, తాజా నిర్ణయం తీసుకుంది. అటు లిక్విడిటీ ఉండని స్టాక్ ఆప్షన్లలో మోసపూరిత ట్రేడింగ్ ఆరోపణలపై సహదేవ్ పైక్ హెచ్‌యూఎఫ్, పరితోష్ సాహా హెచ్‌యూఎఫ్, త్రిప్తా ష్రాఫ్, దక్ష్ షేర్ బ్రోకర్స్ మొదలైన వర్గాలపై జరిమానా విధించింది.

ఐపీవోలపై కంపెనీల కసరత్తు..
న్యూఢిల్లీ: పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులను సమీకరించుకునేందుకు మరిన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఇందుకు సంబంధించి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేస్తున్నాయి. తాజాగా స్టడ్స్ హెల్మెట్స్, పార్క్ మెడి వరల్డ్, ఎస్ఐఎస్ క్యాష్ సర్వీస్ మొదలైన సంస్థలు తమ ప్రాస్పెక్టస్‌లను దాఖలు చేశాయి. ఇక ఐపీవో సన్నాహాల్లో ఉన్న ఒక్కొక్క సంస్థ వివరాలను చూస్తే.. రూ. 1,260 కోట్ల పార్క్ మెడి వరల్డ్ ఇష్యూ.. పార్క్ బ్రాండ్ కింద హాస్పిటల్ చెయిన్ నిర్వహించే పార్క్ మెడి వరల్డ్ సంస్థ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ. 1,260 కోట్లు సమీకరించనుంది. దీనికి సంబంధించిన ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది. ఈ ఇష్యూ కింద రూ. 900 కోట్లు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్ ఫర్ సేల్ కింద ప్రమోటర్ అజిత్ గుప్తా రూ. 300 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ప్రీ–ఐపీవో ప్లేస్మెంట్ కింద రూ. 192 కోట్లు సమీకరించే యోచనలో కంపెనీ ఉంది. ఇష్యూ ద్వారా సేకరించిన నిధుల్లో రూ. 410 కోట్ల మొత్తాన్ని రుణాలను తీర్చేసేందుకు, రూ. 110 కోట్లను కొత్త ఆస్పత్రి నిర్మాణం, అనుబంధ సంస్థలైన పార్క్ మెడిసిటీ (ఎన్సీఆర్), బ్లూ హెవెన్స్‌కి చెందిన ప్రస్తుత ఆస్పత్రుల విస్తరణ కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 3,000 పైచిలుకు పడకల సామర్థ్యంతో ఉత్తరాదిలో పార్క్ మెడి వరల్డ్ రెండో అతి పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ చెయిన్‌గా కార్యకలాపాలు సాగిస్తోంది. న్యూఢిల్లీ, జైపూర్, ఫరీదాబాద్ తదితర ప్రాంతాల్లో కంపెనీకి 13 మల్టీ–సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఉన్నాయి. ఎస్ఐఎస్.. షేర్ల జారీతో రూ. 100 కోట్లు.. క్యాష్ లాజిస్టిక్స్ సేవల సంస్థ ఎస్ఐఎస్ క్యాష్ సర్వీస్ తాజాగా షేర్లను జారీ చేయడం ద్వారా ఐపీవో కింద రూ. 100 కోట్లు సమీకరించనుంది. ప్రమోటర్ సంస్థలు ఎస్ఐఎస్ లిమిటెడ్, ఎస్ఎంసీ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ 37.15 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నాయి. తాజా షేర్ల విక్రయం ద్వారా వచ్చే నిధుల్లో రూ. 37.59 కోట్లను వాహనాల కొనుగోళ్లు, ఫ్యాబ్రికేషన్‌కు, రూ. 30 కోట్ల మొత్తాన్ని రుణాల చెల్లింపు, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆదాయంపరంగా 17–18 శాతం మార్కెట్ వాటాతో పరిశ్రమలో రెండో అతి పెద్ద సంస్థగా ఎస్ఐఎస్ క్యాష్ సర్వీసెస్ నిలుస్తోంది. 2024 డిసెంబర్ 31తో ముగిసిన తొమ్మిది నెలల్లో కంపెనీ రూ. 530 కోట్ల ఆదాయాన్ని రూ. 39 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సందిగ్ధంలో కొన్ని.. మరోవైపు, ఎంబసీ గ్రూప్ ప్రమోట్ చేస్తున్న వర్క్‌స్పేస్ ఆపరేటర్ వుయ్‌వర్క్ ఇండియా మేనేజ్మెంట్ ఐపీవో ప్రతిపాదనను సెబీ పక్కన పెట్టింది. ఇందుకు నిర్దిష్ట కారణాలేమీ వెల్లడి కాలేదు. ఇష్యూ కింద ప్రమోటర్ సంస్థ ఎంబసీ బిల్డ్‌కాన్, 1 ఏరియల్ వే టెనెంట్ అనే ఇన్వెస్టరు 4.37 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానం కింద విక్రయించే యోచనలో ఉన్నాయి. అటు ఫెర్టిలిటీ క్లినిక్ చెయిన్ ఇందిరా ఐవీఎఫ్ తమ ఐపీవో ముసాయిదా పత్రాలను వెనక్కి తీసుకుంది. ఐపీవో సన్నాహాల సమయంలోనే కంపెనీ వ్యవస్థాపకుడు అజయ్ మూర్దియాపై బాలీవుడ్ బయోపిక్ విడుదల కావడమనేది ఇష్యూను పరోక్షంగా ప్రభావితం చేస్తుందని సెబీ అభిప్రాయం వ్యక్తం చేయడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందిరా ఐవీఎఫ్ ఐపీవో పత్రాలను దాఖలు చేసిన సుమారు నెల రోజుల్లో మార్చి 21న చిత్రం విడుదలైంది. ఇందులో అనుపమ్ కేర్, ఈషా డియోల్ నటించారు.ఓఎఫ్ఎస్ మార్గంలో స్టడ్స్.. పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించడంపై హెల్మెట్ల తయారీ సంస్థ స్టడ్స్ యాక్సెసరీస్ రెండోసారి కసరత్తు చేస్తోంది. ఏడేళ్ల క్రితం 2018లో ఇందుకు సంబంధించి సెబీ నుంచి అనుమతులు పొందినప్పటికీ, అప్పట్లో ముందుకెళ్లలేదు. తాజా ప్రతిపాదన ప్రకారం ఇనీíÙయల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో ఉంటుంది. ప్రమోటర్ గ్రూప్, ఇతరత్రా షేర్హోల్డర్లు 77.9 లక్షల షేర్లను విక్రయించనున్నారు. ఇది పూర్తిగా ఓఎఫ్ఎస్ రూపంలో ఉంటుంది కాబట్టి ఐపీవో ద్వారా సమీకరించిన నిధులేమీ కంపెనీకి లభించవు. స్టడ్స్ యాక్సెసరీస్ సంస్థ ’స్టడ్స్’, ’ఎస్ఎంకే’ బ్రాండ్ల కింద టూ–వీలర్ హెల్మెట్లను తయారు చేస్తోంది. అలాగే స్టడ్స్ బ్రాండ్ కింద గ్లవ్స్, హెల్మెట్ లాకింగ్ డివైజ్‌లు, రెయిన్ సూట్లు వంటి యాక్సెసరీలను ఉత్పత్తి చేస్తోంది. దేశవ్యాప్తంగానే కాకుండా 70 పైచిలుకు దేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. అమెరికాలో ఓ’నీల్ అనే సంస్థకు, ’డేటోనా’ బ్రాండ్ పేరిట జే స్క్వేర్డ్ అనే సంస్థకు హెల్మెట్లు తయారు చేసి అందిస్తోంది. 2024 సెప్టెంబర్‌తో ముగిసిన ఆరు నెలల వ్యవధిలో కంపెనీ రూ. 285 కోట్ల ఆదాయంపై రూ. 33 కోట్ల నికర లాభం ఆర్జించింది. పేస్ డిజిటెక్ అదే బాటలో..న్యూఢిల్లీ: టెలికం టవర్, ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల విభాగంలో సొల్యూషన్లు అందించే పేస్ డిజిటెక్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు వీలుగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 900 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయాలని భావిస్తోంది. తద్వారా రూ. 900 కోట్లు సమీకరించనుంది. టెలికం మౌలిక సదుపాయాల విభాగంలో సేవలందించే కంపెనీ ఐపీవోకు ముందు రూ. 180 కోట్ల ప్లేస్మెంట్ చేపట్టే యోచనలో ఉంది. ఇష్యూ నిధుల్లో రూ. 630 కోట్లు పెట్టుబడి వ్యయాలకు కేటాయించనుంది. 2024 సెప్టెంబర్‌తో ముగిసిన 6 నెలల్లో రూ. 1,188 కోట్ల ఆదాయం, రూ. 152 కోట్ల నికర లాభం సాధించింది.

ఐపీవోకు హైదరాబాద్ కంపెనీ
హైదరాబాద్: ఇంజినీరింగ్ సంబంధ సేవలందించే హైదరాబాద్ కంపెనీ ఆర్డీ ఇంజినీరింగ్ పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 80 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లలో ఒకరైన చంద్ర శేఖర్ మోటూరు విక్రయానికి ఉంచనున్నారు.కంపెనీ సమీకృత డిజైన్, ఇంజినీరింగ్, మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీసులు సమకూర్చుతోంది. ప్రధానంగా ప్రీఇంజినీర్డ్ బిల్డింగ్స్(పీఈబీ), మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్(ఎంహెచ్ఎస్), ఇంజినీరింగ్ సర్వీసెస్ పేరుతో మూడు విభాగాలలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 280 కోట్లు తెలంగాణలో కొత్తగా రెండు తయారీ యూనిట్ల ఏర్పాటుకు, మరో రూ. 45 కోట్లు ఆంధ్రప్రదేశ్‌లోని పరవాడలో సమీకృత తయారీ యూనిట్ ఏర్పాటుకు వెచ్చించనుంది.రుణ చెల్లింపులకు రూ. 65 కోట్లు వినియోగించనుంది. 2008లో ఏర్పాటైన కంపెనీ క్లయింట్లలో ఆర్సెలర్‌మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా(ఏఎంఎన్ఎస్), జేకే సిమెంట్, నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ, ఉదయ్‌పూర్ సిమెంట్ వర్క్స్ తదితరాలున్నాయి. గతేడాది(2023–24) రూ. 620 కోట్ల ఆదాయం, రూ. 29 కోట్ల నికర లాభం ఆర్జించింది.

బైక్ కొంటే రెండు హెల్మెట్లు తప్పనిసరి
దేశంలో రహదారి భద్రతను మెరుగుపరిచే దిశగా కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ టూవీలర్ విక్రేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని ద్విచక్ర వాహనాలను తప్పనిసరిగా రెండు ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లతో విక్రయించాలని ప్రకటించారు. న్యూఢిల్లీలో జరిగిన ఆటో సమ్మిట్ లో చేసిన ఈ ప్రకటనను ఐఎస్ఐ హెల్మెట్ తయారీదారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశంలోని అతిపెద్ద సంస్థ టూ వీలర్ హెల్మెట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీహెచ్ఎంఏ) సంపూర్ణంగా సమర్థించింది.రోడ్డు ప్రమాదాలను నివారించడానికి గడ్కరీ ఆదేశాలను కీలకమైన, దీర్ఘకాలిక చర్యగా భావిస్తున్నారు. ఐఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లను తప్పనిసరిగా వాడాలని ఎప్పటి నుంచో వాదిస్తున్న హెల్మెట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ మంత్రి క్రియాశీల నాయకత్వాన్ని ప్రశంసించింది. 'ఇది కేవలం రెగ్యులేషన్ మాత్రమే కాదు. ఇది జాతీయ అవసరం. ప్రమాదాల్లో ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాలకు ఈ ఆదేశం భవిష్యత్తులో ఇటువంటి నష్టాలను నివారించగలదనే ఆశను కలిగిస్తుంది" అని టీహెచ్ఎంఏ అధ్యక్షుడు రాజీవ్ కపూర్ అన్నారు.హెల్మెట్ లేకపోవడం వల్లే..దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4,80,000 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 1,88,000 మరణాలు నమోదవుతున్నాయి. ఈ గణాంకాలు భారతదేశ రహదారి భద్రత భయంకరమైన పరిస్థితిని తెలియజేస్తున్నాయి. 66 శాతం ప్రమాదాలలో బాధితులు 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్కులే. ఏటా 69 వేలకు పైగా ద్విచక్ర వాహన ప్రమాద మరణాలు సంభవిస్తుండగా వీటిలో 50 శాతం హెల్మెట్ లేకపోవడం వల్ల సంభవిస్తున్నాయి. ద్విచక్ర వాహనాల ప్రయాణాలు ఇకపై ప్రమాదకరంగా ఉండకూడదని పరిశ్రమ నొక్కి చెప్పింది.
ఫ్యామిలీ

6 రుచులు... 6 ఆరోగ్య లాభాలు
ఉగాది పచ్చడిని సేవించే ఆచారం శాలివాహన శకారంభం నుంచి మొదలైనట్లుగా చరిత్రకారులు చెబుతారు. సంప్రదాయ పద్ధతిలో ఉగాది పచ్చడిని కొత్త మట్టికుండలోతయారు చేస్తారు. ఉగాది పచ్చడిలో వేపపూత, మామిడి పిందెలు, చింతపండు, ఉప్పు, మిరియాల పొడి, బెల్లం, అరటిపండు ముక్కలు ఉపయోగిస్తారు. వీటి వల్ల ఉగాది పచ్చడి ఆరురుచుల సమ్మేళనంగా తయారవుతుంది. ఉగాది పచ్చడిలో ఉపయోగించే పదార్థాలు, వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం....బెల్లం, అరటి పండ్లు– తీపిబెల్లం తీపిగా ఉంటుంది. ఎండ వేడిమి వల్ల కలిగే అలసటను పోగొట్టి, తక్షణ శక్తినిస్తుంది. బెల్లాన్ని అరటిపండుతో కలిపి తీసుకోవడం శ్రేష్ఠమని ఆయుర్వేదం చెబుతోంది. అరటిపండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అధిక రక్తపోటు, మూత్రపిండాల సమస్యలను అరటిపండు నిరోధిస్తుంది.చింతపండు– పులుపుఉగాది పచ్చడి తయారీకి పాత చింతపండు ఉపయోగించడం మంచిది. పాత చింతపండు ఉష్ణాన్ని, వాత దోషాలను తగ్గిస్తుంది. బడలికను పోగొడుతుంది. జఠరశక్తిని పెంచుతుంది. మూత్రవిసర్జన సజావుగా సాగేందుకు దోహదపడుతుంది. వేసవిలో చింతపండు రసం తీసుకోవడం వల్ల ఉష్ణదోషాలు తగ్గుతాయని ఆయుర్వేదం చెబుతోంది.ఉప్పురుచులకు రారాజులాంటిది ఉప్పు. ఉప్పులేని పప్పులు, కూరలు, పచ్చళ్లు రుచించవు. ఆహారంలో అనునిత్యం ఉపయోగించే ఉప్పు త్రిదోషాలను– అంటే, వాత పిత్త కఫ దోషాలు మూడింటినీ పోగొడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. అయితే, ఉప్పును మోతాదులోనే వాడాలి.మామిడి పిందెలు– వగరుమామిడి కాయలు ముదిరితే పులుపుగా ఉంటాయి గాని, పిందెలు వగరుగా ఉంటాయి. మామిడి పిందెల వగరుదనం లేకుంటే, ఉగాది పచ్చడికి పరిపూర్ణత రాదు. మామిడి పిందెలలో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. మామిడి పిందెలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని త్రిదోషాలను హరించి, శక్తిని కలిగిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.వేపపూలు– చేదువసంతారంభంలో వేపపూలను తినే ఆచారం దాదాపు అన్నిప్రాంతాల్లోనూ ఉంది. దీనిని ‘నింబకుసుమ భక్షణం’ అంటారు. షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిలో వేపపూలను ఉపయోగించడం మన తెలుగువాళ్లకే చెల్లింది. వేపపూలు కఫదోషాన్ని, క్రిమిదోషాలను పోగొడతాయి. జీర్ణకోశ సమస్యలను నివారిస్తాయి.మిరియాల పొడి–కారంమిరియాలను నేరుగాను, పొడిగాను వంటకాల్లో తరచుగా వినియోగిస్తూనే ఉంటాం. మిరియాలు రుచికి కారంగా ఉన్నా, శరీరానికి చాలా మేలు చేస్తాయి. మిరియాలు కఫదోషాన్ని, విష దోషాలను హరిస్తాయి. చర్మవ్యాధులను అరికట్టడమే కాకుండా, జీర్ణశక్తిని, శరీరంలోని జీవక్రియలను పెంచుతాయి. అందుకే సంప్రదాయ ఆయుర్వేద ఔషధాల్లో మిరియాలను విరివిగా ఉపయోగిస్తారు.

కొత్త తరానికి చెబుదాం
తెలుగువారి తొలి పండగ వచ్చేస్తోంది. నూతనోత్సాహంతో ఉగాదిని ఆహ్వానించడానికి సిద్ధమవుతున్న వేళ... కొత్త తరానికి పండగల అర్థం తెలుస్తోందా? అంటే... ‘పెద్దవాళ్లు చెబితేనే తెలుస్తుంది’ అంటున్నారు ప్రముఖ రచయితలు రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్. ఉగాది ప్రత్యేకంగా ఇంకా ఈ ఇద్దరూ చెప్పిన విశేషాలు తెలుసుకుందాం.పండగలు జరుపుకోవడం ఎవరూ మానేయలేదు. పిండివంటలు చేసుకోవడానికైనా పండగలు చేసుకుంటున్నాం. పండగ పూట తల స్నానం చేసి, ఉగాది పచ్చడి తిన్న తర్వాతే మిగతా పనులు చేయాలని పిల్లలకు పెద్దలు చెప్పాలి. ఎప్పటికప్పుడు కొత్త తరానికి పాత తరంవాళ్లు చెబుతుండాలి. ఎందుకంటే పండగలన్నీ ముందు తరంవాళ్లు చేసుకుంటూ వచ్చారు కాబట్టి చెప్పడం వారి బాధ్యత. కొత్త తరాన్ని పాజిటివ్‌గా స్వాగతించాలి. వారూ వెల్‌కమింగ్‌గానే ఉంటారు. మన తానులో పెరిగిన ముక్కలు వేరేలా ఎలా ఉంటారు? కొత్త తరానికి పద్ధతులన్నీ కొత్తే. పోనీ ఇవాళ్టి పాత తరం అనుకున్నవారికి ఎవరు చెప్పారు? వారి ముందు తరంవారు చెబితేనే కదా వీరికి తెలిసింది. ఇది రిలే పందెంలాంటిది. ఒక తరానికి ఒక తరానికి సక్రమంగా విషయాలను అందజేయాల్సిన బాధ్యత ముందు తరానికి ఉంటుంది. యువతని నిందించడం సరికాదు: ప్రపంచాన్ని రెండు రకాలుగా చూడొచ్చు. మంచి కోణంలో... దుర్గార్మపు కోణంలో... ఎప్పుడూ మొదటి కోణంలో చూస్తే మంచిది. అది కాదనుకుని యువత పెడదారి పట్టిందని, ఏదేదో జరిగిపోతోందని యువతరాన్ని నిందించడం సరికాదు. ఏదీ వక్రీకరించిన కోణంలో చూడొద్దు. ఫారిన్ కల్చర్ అంటున్నాం... విదేశాలు వెళ్లి చూస్తే ఇక్కడికన్నా ఎక్కువ అక్కడ పండగలు బాగా జరుపుకుంటున్నారు. అన్నమాచార్యుల కీర్తనలు కూడా పాడుతున్నారు. ఇక్కడితో పోల్చితే అమెరికా ఫాస్ట్ ఫార్వార్డ్ అనుకోవాలి కదా. కానీ అక్కడ మన సంప్రదాయాలు బతికే ఉన్నాయి. ఇక ఎప్ప టికీ ఇండియా రామని తెలిసిన కుటుంబాలు కూడా తమ పిల్లలకు తెలుగు నేర్పిస్తున్నారు... మన సంప్రదాయాల గురించి చెబుతున్నారు. పిల్లలూ నేర్చుకుంటున్నారు. యువతరం బాధ్యతగా ఉంటోంది: సారవంతమైన నేల అది (యువతరాన్ని ఉద్దేశించి). బీజం వేయడం అనేది మన చేతుల్లో ఉంది. ముందు తరం బాధ్యతగా ఉండి, తర్వాతి తరానికి దగ్గరుండి అన్నీ నేర్పించి, అన్నీ ఆచరించేలా చేయాలి. వీళ్లు పాటిస్తూ వాళ్లు పాటించేలా చేయాలి. పొద్దున్నే వీళ్లు స్నానం చేయకుండా... పిల్లలను స్నానం చేసి, పూజలు చేయమంటే ఎందుకు చేస్తారు? నువ్వు చేయడంలేదు కదా? అంటారు. ఒకవేళ మాటల రూపంలో చెప్పకపోయినా... ముందు తరం ఆచారాలు పాటిస్తుంటే వీళ్లు చూసి, నేర్చుకుంటారు... అనుసరించడానికి ఇష్టపడతారు. బోధించే విధానం సక్రమంగా ఉండాలి. ఫైనల్‌గా చెప్పేదేంటంటే... మనం అనుకున్నంతగా యువతరం ఏమీ దిగజారిపోలేదు. చెప్పాలంటే మనకన్నా ఇంకా బాధ్యతగా ఉంటూ, పాతా కొత్తా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్నారు. ఈ కాలపు పిల్లలు ఇంటికీ, బయటికీ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ తెలిసినవాళ్లు. వాళ్లలో ఏదైనా లోపం ఉందీ అంటే... చెప్పేవాళ్లదే కానీ వాళ్లది కాదు. సో... ఏ పండగని ఎందుకు జరుపుకోవాలో విడమర్చి యువతరానికి చెప్పాల్సిన బాధ్యత ముందు తరానిదే. సంవత్సరాది ఎందుకు జరుపుకుంటున్నాం? ఉగాది పచ్చడి విశిష్టత వంటివి చెప్పి, పండగ అర్థం తెలియజేయాలి.పండగ‘రుచి’చూపాలి– అనంత శ్రీరామ్పండగలు జరుపుకునే తీరు మారింది. పెళ్లిళ్లల్లో ఎప్పుడైతే మనకు లేని రిసెప్షన్ అని మొదలుపెట్టామో అలానే పండగలు జరుపుకునే తీరులోనూ మార్పు వచ్చింది. ఉగాది గురించి చెప్పాలంటే... మా ఊరులో ఐదు రోజులు ఉగాది జాతర జరుగుతుంది. మాది వెస్ట్ గోదావరి, యలమంచిలి మండలం, దొడ్డిపట్ల గ్రామం. జాతర సందర్భంగా ఊరేగింపులు అవీ చేస్తుంటారు. ఇప్పుడూ జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు జాతరలో భాగంగా మేజిక్ షోస్ అంటూ వెస్ట్రన్ కల్చర్ మిక్స్ అయిపోయింది. ఉగాది అంటే కవి సమ్మేళనాలు విరివిగా జరిగేవి. ఇప్పుడలా లేదు. ఎవరైనా విద్యావంతులు లేదా శాంతి సమాఖ్యలు వాళ్లు ఏదో టౌన్ హాలులో కవి సమ్మేళనాలు ఏర్పాటు చేసినా ఓ ఇరవై ముప్పైమంది ఉంటున్నారు... అంతే. ఉగాది ప్రత్యేకం అమ్మవారి జాతర: ఇక మా ఊరి ఉగాది గురించి చెప్పాలంటే... మాణిక్యాలమ్మ మా గ్రామ దేవత. ఉగాది సమయంలో మాకు ఆ అమ్మవారి జాతర ఉంటుంది. ఉగాది ప్రత్యేకం అంటే ఆ జాతరే. ఐదు రోజులు ఘనంగా చేస్తారు. ఐదో రోజు అయితే అమ్మవారిని బాగా అలంకరించి, ఊరేగించి, తెప్పోత్సవం చేస్తారు. నేను ప్రతి ఏడాది దాదాపు మిస్ కాకుండా వెళతాను. ఈసారి కుదరదు. ఆరు రుచులను సమానంగా ఆస్వాదించాలి: ఉగాది పచ్చడిలోని షడ్రుచుల గురించి చెప్పాలంటే... నేను ‘ఒక్కడున్నాడు’ సినిమాలో ‘ఇవ్వాళ నా పిలుపు... ఇవ్వాలి నీకు గెలుపు... సంవత్సరం వరకు ఓ లోకమా...’ అని పాట రాశాను. అది పల్లవి. పాట మొదటి చరణంలో రుచుల గురించి రాశాను. ‘కొంచెం తీపి... కొంచెం పులుపు పంచే ఆ ఉల్లాసమూ... కొంచెం ఉప్పు... కొంచెం కారం పెంచే ఆ ఆవేశమూ... చేదూ వగరూ చేసే మేలూ... సమానంగా ఆస్వాదించమని ఇవ్వాళ నా పిలుపు’ అని రాశాను. ఆరు విభిన్నమైన రుచులను సమానంగా ఆస్వాదిస్తేనే జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోగలమని చెప్పడమే ఆ పాట ఉద్దేశం. అంటే... జీవితంలో ఎదురయ్యే పరిస్థితులన్నింటినీ సమానంగా స్వీకరించగలగాలి.ఆ బాధ్యత పెద్దవాళ్లదే: ఇక నేటి తరం గురించి చెప్పాలంటే... ఇప్పుడు కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలతో హాలోవెన్ అంటూ రకరకాల వేషాలు వేయిస్తున్నారు. వేలంటైన్స్ డే అనీ ఇంకా వేరే ఎక్కడెక్కడనుంచో తెచ్చిపెట్టుకున్న పండగలను జరుపుతున్నారు. అయితే పిల్లలకు మన పండగల గురించి చెప్పాలి. వేరే సంబరాలు ఎలా ఉన్నా కూడా మన పండగలకు ఎక్కువప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా పాత తరం ఆచరిస్తే కొత్త తరానికి అర్థం అవుతుంది. వాళ్లు మన సంస్కృతీ సంప్రదాయాలను ముందుకు తీసుకెళతారు. మా గ్రామంలో ఉగాది అంటే... ఇంట్లో పిల్లలకు వేప పూత, మామిడికాయలు, చెరుకు గడలు తెమ్మని టాస్కులు ఇచ్చేవారు. అవి తెచ్చే క్రమంలో మాకు పండగలు అర్థమయ్యేవి. అలా మా ముందు తరంవాళ్లు మాకు నేర్పించారు. కొత్త తరానికి మనం అలా నేర్పిస్తే వాళ్లు పాటిస్తారు. ముందు తరాలకు సంస్కృతీ సంప్రదాయాలను నేర్పించే బాధ్యత పెద్దవాళ్లదే.– డి.జి. భవాని

'తోలుబొమ్మలాట'ను సజీవంగా ఉండేలా చేసిందామె..! ఏకంగా రాజధానిలో..
పూర్వకాలంలో పౌరాణిక కథలను ఇలా తోలుబొమ్మలాటలతోనే చెప్పేవారు. అప్పట్లో టీవీలు, రేడియోలు అందుబాటులో లేని కాలంలో ఇవి ఎక్కువగా ఉండేవి. ప్రస్తుత తరానికి మన టీవీల పుణ్యమా అని పంచతంత్ర వంటి ధారావాహికల కారణంగా వాటి గురించి తెలుసుకుంటున్నారు. చెప్పాలంటే చిన్నారులు ఇష్టంగా చూసే కార్టూన్ ఛానెల్స్ మాదిరిగా ఆ రోజుల్లో తోలుబొమ్మలాటలుండేవి. ఇప్పుడు కృత్రిమ మేథాదే హవా అనుకోకండి. ఎందుకంటే ఇప్పడు పాతదిగా అనిపించినా ఒకప్పుడది కొత్తది. దీనిక ప్రస్తుతం ఆదరణ పెరుగి ట్రెండ్‌గా మారుతోంది. స్కూల్క్, కోన్ని కల్చరల్ కార్యక్రమాలు జరిగే చోట ఈ కళా ప్రదర్శనకు అవకాశం ఇస్తున్నారంటే మన పూర్వకాలంనాటి కళలకు ప్రాముఖ్యత ఉందనే కదా అంటుంటారు అనురూప రాయ్. ఆమె వలనే ఈకళ సజీవంగా ఉందని చెప్పొచ్చు. ఎవరామె..? ఆమె ఎలా ఈ రంగంలోకి వచ్చింది తదితరాల గురించి తెలుసుకుందామా..!.ఢిల్లీకి చెందిన అనురూప రాయ్ ఆరేళ్ల వయసు నుంచే ఈ తోలుబొమ్మలాట అంటే మహాఇష్టం. ఆ ఇష్టంతోనే ఆ తోలుబొమ్మలను కొనుక్కుని మరీ జాగ్రత్తగా చూసుకునేది. ఆ ఇష్టం ఆమె వయసుతోపాటు పెరిగిందే గానీ తగ్గలేదు. ఒకప్పుడూ 80లలో బాగా ట్రెండ్‌గా ఉండే ఈ తోలుబొమ్మలాటని సజీవంగా ఉంచాలని ఆరాటపడింది. విద్యాపరంగా ఇలాంటి తోలుబొమ్మల కళారంగం ఎంచుకుంటావా అని విమర్శలు వచ్చినా ధైర్యంగా ఈ రంగంలోకి అడుగుపెట్టిందామె. అందరూ ఫిల్మ్ స్కూల్స్‌లో జాయిన్ అయితే అనురూప తోలుబొమ్మలాటకు సంబంధించిన కళారంగ సంస్థల్లో జాయిన్ అయ్యింది. అలా ఆ రంగం గురించి కూలంకషంగా నేర్చుకుని ఆ విద్యకే కాదు ఆ కళకే ప్రాణం పోసిందామె. ఆ కళను సజీవంగా ఉంచేలా "కథక్కథ పప్పెట్ ఆర్ట్స్ ట్రస్ట్"ని స్థాపించి కళాకారులను ఒక వద్దకు తీసుకొచ్చి ప్రదర్శనలిస్తున్నారామె. ఈ ప్రదర్శనకు మొదటి విమర్శకులు పిలలేలని అంటారామె. ఎందుకంటే కథ నచ్చకపోతే మధ్యలోంచి వెళ్లిపోతారు కాబట్టి నచ్చేలా చక్కటి కథనే ఎంచుకుని ప్రదర్శనలిస్తామన్నారు. ఈ ట్రస్ట్ ప్రదర్శనలు ఇవ్వని విరామ సమయాల్లో ప్రదర్శనకు సంబంధించిన పరిశోధనతో పాటు, ప్రేక్షకులను పెంచుకోవడం వంటి వాటిపై దృష్టిసారిస్తారు. అలాగే పండుగలు, సమావేశాలకు వెళ్లడం, సమాజం వెలుపల ఉన్న వ్యక్తులతో మాట్లాడి ప్రేక్షకాదరణ పొందేలా ప్రయత్నాలు చేయడం వంటివి చేస్తారని చెప్పారు అనురూప.ఈ ట్రస్ట్‌కి అంతర్జాతీయ ఉత్సవాలు, గ్యాలరీలు, మ్యూజియంల ప్రదర్శనల ద్వారా నిధులు ఉత్పత్తి అవుతాయి. వారి స్టూడియో ఢిల్లీలోని బాదర్పూర్ సరిహద్దులో ఉంది. ఇది నగరానికి, ఒక గ్రామానికి మధ్య ఉంటుంది. అందుకే అనురూప కిటికీలు తెరిచి తమ ప్రదర్శన కోసం రిహార్సల్ చేస్తుంటారట. కనీసం అలా అయినా గ్రామంలోని పిల్లలకు అదేంటో తెలుసుకునే వీలు ఉంటుందనే చిన్న ఆశ అంటారామె.కథలకే కాదు అలా కూడా..ఈ తోలు బొమ్మలాట అనగానే కేవలం పంచతంత్ర వంటి కథలనే కాదు. సామాజిక అవగాహన కార్యక్రమాలు కూడా ప్రదర్శిస్తారట. అలా ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించిన అభివృద్ధి పనులు, సామాజిక సేవ గురించి ప్రజలకు తెలియజేస్తుంది. అంతేగాదు ఇటీవల అనురూప తన బృందంతో మధ్యప్రదేశ్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో రుతు కార్యక్రమంపై అవగాహన కల్పించే అద్భుత ప్రదర్శన ఇచ్చింది. తోలుబొమ్మలాటతో ఇలాంటి సామాజికి అవగాహన కార్యక్రమాలు కూడా ప్రదర్శించొచ్చని చూపించింది. ఆమె కృషి పలితంగా న్యూఢిల్లీలో కొద్దోగొప్పో తోలుబొమ్మలాట కళాకారులు ఉండటం విశేషం. అంతేగాదు రాజాధానిలో ఈ తోలుబొమ్మల విద్యను నేర్చుకునే పాఠశాల కూడా ఉందట. ఇందులో జైపూర్, పూణే, మధురై, బర్ధమాన్ తదితరప్రాంతాలకు చెందని విద్యార్థులు ఉన్నారు. వాళ్లంతా ఈ కళను నేర్చుకుని సొంతంగా సంస్థను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అంతేగాదు తన సంస్థే త్వరలో అంతర్జాతీయ తోలుబొమ్మల చిత్రోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. చలనచిత్రోత్సవంకి మించి ఎక్కువ ప్రదర్శనలిస్తారట. వాటిలో తమిళనాడుకి సంబంధించిన షాడో తోలుబొమ్మలాట ప్రధాన ఆకర్షణగా ఉంటుందట. ఇంకో విశేషం ఏంటంటే అనురూప గ్రామన్నే రాజధానికి తీసుకొచ్చేలా తన తోలుబొమ్మలాటతో గ్రామీణ దృశ్యాలను కళ్లకు కట్టినట్లు చూపించనుంది. ఇది సాయంత్రం నుంచి మొదలై తెల్లవారుజాము వరకు ఉంటుందని చెబుతున్నారామె. ఆ కార్యక్రమం వచ్చేనెల ఏప్రిల్ 4 నుంచి 6 వరకు ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరుగునుందని చెప్పారు అనురూప రాయ్. కనుమరుగైపోతున్న కళను ఎంచుకోవడమే సాహసం, పైగా దానికి ఊపిరి పోసి సజీవంగా ఉండేలా చేయడం అంటే మాటలు కాదుకదా..!.(చదవండి:

పరిస్థితులు ఎలా ఉన్నా గెలవడం అంటే ఇదే..! వైరల్‌గా ఆనంద్ మహీంద్రా పోస్ట్
పారిశ్రామిక దిగ్గజం మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ స్ఫూర్తిదాయకమైన కథలను పంచుకంటూటారు. అవి యువతకే కాదు, ఉద్యోగులకు, సాధారణ గృహిణులకు స్థైర్యాన్ని, స్పూర్తిని అందించేలా ఉంటాయి. మనకే ఇంత పెద్ద కష్టం ఏమో!.. అనే అజ్ఞానం నుంచి బయటపడేసేలా ప్రేరణాత్మకంగా ఉంటాయి. ఈసారి కూడా ఆనంద్ అలాంటి స్ఫూర్తిని కలిగించే వీడియోని షేర్చేశారు. విపత్కర పరిస్థితుల్లో ఓ ఉద్యోగి ఎలా వ్యవహరించాలో తెలియజెప్పే స్టోరీ ఇదీ..!.సమస్యలనేవి వస్తూనే ఉంటాయి. అయితే అవి ఏ రూపంలో వచ్చినా మనం ధైర్యం, ఆశ కోల్పోకూడదు. అదే చెబుతోంది ఈ రాజ్‌కుమార్ దాబీ గాథ. అతడు మహీంద్రా గ్రూప్ ఉద్యోగి. సేల్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అతను 2014లో కంటిశుక్లంకి సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్నారు. దాంతో అప్పటి నుంచి నెమ్మదినెమ్మదిగా దృష్టిని కోల్పోవడం ప్రారంభించాడు. అలా ఇప్పుడాయన 5% దృష్టిని మాత్రమే కలిగి ఉన్నారు. అయినా ఆయన అధైర్యపడలేదు. అపుడెలా ఉద్యోగంలో డైనమిక్‌గా పనిచేశారో అలానే దూసుకుపోతున్నారు. తన సహోద్యోగులతో సమానంగా పనిచేస్తారాయన. ఆ టైంలో కూడా ఆయన సుమారు 5 మందికి పైగా తన విభాగంలో శిక్షణ ఇచ్చారు. అతడి సీనియర్ ఉద్యోగులు సైతం రాజ్‌కుమార్ దాబీ విల్పవర్కి అబ్బురపడటమే కాదు అతడి పనిని మెచ్చుకుంటున్నారు కూడా. అంతేగాదు అతను ఇలాంటి స్థితిలో కూడా మంచిగా అమ్మకాలు జోరందుకునేలా చేశాడని చెబుతున్నారు వారంతా. అతడు కంపెనీని తన కుటుంబంలా భావించి..వర్క్ గురించి తన కింద ఉద్యోగులకు తర్ఫీదు ఇస్తాడు. ఫలితంగా అతడు వాళ్ల నుంచి ప్రేమ ఆప్యాయతలో కూడిన ప్రోత్సహాం అందుకుంటాడు. అందువల్లే అతడు ఈ ఆకస్మిక వైకల్యాన్ని అధిగమించి ఉద్యోగంలో కొనసాగుతున్నాడు. అతడు తనకు సడెన్‌గా వచ్చిపడిన ఈవైకల్యానికి చింతిస్తూ కూర్చోలేదు. కేవలం పరిష్కారం దిశగా, తాను చేయగలిగే పనిపై దృష్టిసారించాడు. అదే అతడిని తన ఉద్యోగంలో యథావిధిగా కొనసాగిలే చేసింది. పని అనేది తన అభిరుచిగా భావించి చేసేవారికి తిరిగే ఉండదు అనేందుకు రాజ్‌కుమార్ దాబీనే ఉదాహరణ. ఆ వ్యక్తి తన కంపెనీలో సహోద్యోగిగా కొనసాగడం గర్వంగా భావిస్తున్నా అంటూ అతడికి సంబంధించిన వీడియోని కూడా జత చేసి పోస్ట్ చేశారు ఆనంద్ మహీంద్రా. నెటిజన్లు కూడా ఇది స్పూర్తిదాయకమైన కథ, కార్యాలయంలో గుర్తింపు ఎలా తెచ్చుకోవాలో ఇతడిని చూస్తే క్లియర్‌గా తెలుస్తుందని కొందరూ, ఎలాంటి పరిస్థితుల్లోనూ నమ్మకం కోల్పోకూడదు, అదే మనల్ని ముందుకు సాగేలా ధైర్యం అందిస్తుంది అంటూ పోస్టులు పెట్టారు. Often, the #MondayMotivation you need is right next to you, on your home turf…Dhanyavaad, Thank you, Rajkumar Dabi, for making me so proud to be your colleague. You inspire us every single day…pic.twitter.com/2UcBnqQxjc— anand mahindra (@anandmahindra) March 24, 2025 (చదవండి: 'విల్‌పవర్' అంటే ఇది..ఏకంగా వీల్‌చైర్‌తో బంగీ జంప్..! వీడియో వైరల్)
ఫొటోలు


చిరంజీవిని కలిసిన 'కోర్ట్' మూవీ టీమ్ (ఫొటోలు)


తిరుపతి : గుడి సంబరం..అంగరంగ వైభవంగా (ఫొటోలు)


విశ్వావసు నామ ఉగాది వేడుక సంబరాల్లో యువత (ఫొటోలు)


హీరో రామ్‌చరణ్ 40వ బర్త్‌డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)


సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ.. చెపాక్‌లో సందడి చేసిన సుప్రీత (ఫోటోలు)


Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)


ఒకేసారి మూడు సినిమాలు.. పొలిమేర బ్యూటీ ఫుల్ బిజీ (ఫోటోలు)


స్టన్నింగ్ లుక్స్‌తో కవ్విస్తోన్న అనసూయ ఫోటోలు.. తగ్గేదేలే


తిరుమలలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా (ఫోటోలు)


ప్రియుడితో 'అభినయ' నిశ్చితార్థం.. వివరాలు ఇవే (ఫోటోలు)
International

రాజరికం కోసం.. అట్టుడుకుతున్న నేపాల్
ఖాట్మండు: నేపాల్(Nepal)లో తిరిగి రాచరికాన్ని ప్రవేశపెట్టాలనే డిమాండ్ అంతకంతకూ ఉధృతమవుతోంది. ఈ నేపధ్యంలో ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో హింస చెలరేగి, ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. దేశంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, పరిస్థితిని చక్కదిద్దేందుకు హోం మంత్రిత్వ శాఖ భద్రతా అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ హింసాయుత ఘటనలకు మాజీ రాజు జ్ఞానేంద్ర షానే కారణమని ఆరోపిస్తూ, ఆయనను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందని తెలుస్తోంది.ఇటీవల ఖాట్మండులోని పలు ప్రాంతాలలో రాచరిక మద్దతుదారులు, భద్రతా దళాల(Security forces) మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. నిరసనకారులు బారికేడ్లను బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. దీనికి ప్రతిస్పందనగా భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించాయి. ఇంతలో ఆందోళనకారులు ఒక వాణిజ్య సముదాయం, ప్రముఖ రాజకీయ పార్టీ ప్రధాన కార్యాలయం, ఒక మీడియా హౌస్ భవనానికి నిప్పు పెట్టారు. ఈ ఘటనల్లో 12 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు.ఈ హింసాయుత ఘటనలను నివారించేందుకు నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి(Nepal Prime Minister KP Sharma Oli) అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఖాట్మండులో జరుగుతున్న హింసకు మాజీ రాజు జ్ఞానేంద్ర షాను బాధ్యునిగా చేసి, ఆయనను అరెస్టు చేయాలనే ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. జ్ఞానేంద్ర షా అరెస్టుకు సంబంధించి భద్రతా అధిపతుల అభిప్రాయాన్ని సేకరించడానికి, తదనంతర పరిణామాలను అంచనా వేయడానికి చర్చలు జరుగుతున్నాయని క్యాబినెట్ మంత్రి ఒకరు మీడియాకు తెలిపారు. ఖాట్మండులో చోటుచేసుకుంటున్న హింసాయుత ఘటనల కారణంగా త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.చెలరేగిన హింస.. ఇద్దరు మృతిరాజధాని ఖాట్మండులోని కొన్ని ప్రాంతాల్లో రాచరిక అనుకూల నిరసనకారులు రాళ్లు రువ్వారు. అలాగే దుకాణాలను దోచుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ భవనం వైపు రాళ్లు రువ్వుతున్న వారిని నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలో జరిగిన ఘర్షణల్లో 112 మంది గాయపడ్డారు. ఒక టెలివిజన్ కెమెరామెన్‌తోపాటు ఒక నిరసనకారుడు మృతిచెందాడని అధికారులు తెలిపారు. పరిస్థితిని అదుపులోనికి తెచ్చేందుకు సైన్యాన్ని మోహరిస్తున్నారు.नेपाल जैसे छोटे देश में भी हिंदू राष्ट्र की मांग उठ रही है, लेकिन भारत में 115 करोड़ हिंदू होने के बावजूद यह भावना नहीं जागती। यह वाकई शर्म की बात है!#HinduRashtra #Nepal #India #HinduUnity #Sanatan #WakeUpHindus#earthquake #Bangkok #earthquake#AmitShahAtTimesNowSummit… pic.twitter.com/QBh2uCjNWZ— Journalist Namita Sharma (@NamitaSharmaSV) March 28, 20252008లో రాచరికాన్ని రద్దు చేసి నేపాల్‌లో లౌకిక, సమాఖ్య, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని స్థాపించారు. అయితే ఇటీవలి కాలంలో రాచరికం పునరుద్ధరణ డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం రాజకీయ అవినీతి, ఆర్థిక అస్థిరత, తరచూ ప్రభుత్వాలు మారడంపై ప్రజలలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఫిబ్రవరి 19న ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా మాజీ రాజు జ్ఞానేంద్ర షా ప్రజల నుంచి మద్దతు కోరారు. ఇది ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది. దీని తరువాత దేశంలో ఆందోళనలు చెలరేగాయి. 2008 నుండి నేపాల్‌లో 13 ప్రభుత్వాలు మారాయి. అయినా రాజకీయ స్థిరత్వం ఏర్పడలేదు.ఇది కూడా చదవండి: World Piano Day: తొలి పియానోను ఎక్కడ భద్రపరిచారు?

World Piano Day: తొలి పియానోను ఎక్కడ భద్రపరిచారు?
నేడు (మార్చి 29).. ప్రపంచ పియానో దినోత్సవం(World Piano Day). పియానోను సంగీత కచేరీలలో ఉపయోగిస్తుంటారు. ఈ వాయిద్య పరికరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. పియానోకు సంబంధించిన విషయాలు చాలామందికి తెలియవు. పియానో దినోత్సవం సందర్భంగా ఈ సంగీత పరికరానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.పియానోను తొలిసారిగా 1709లో ఇటలీకి చెందిన హార్ప్సికార్డ్ తయారీదారు బార్టోలోమియో డి ఫ్రాన్సిస్కో క్రిస్టోఫోరీ కనుగొన్నారు. ఆయన రూపొందించిన పియానోలలో ఒకటి న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్(Metropolitan Museum of Art)లో భద్రపరిచారు. పియానో అనేది పియానోఫోర్ట్ అనే పదానికి సంక్షిప్త రూపం. పియానో అంటే మృదువైన, ఫోర్డ్ అంటే బిగ్గరగా.. దీని అర్థం ఏమిటంటే ఈ రెండు రకాల శబ్ధాలను పియానోపై పలికించవచ్చు.తొలినాళ్లలో పియానోలు చాలా ఖరీదైనవిగా ఉండేవి. వీటిని దాదాపు ఒక శతాబ్దం పాటు ఒక నిర్దిష్ట తరగతికి చెందినవారు మాత్రమే కొనుగోలు చేయగలిగేవారు. నూతన పియానోను దాని కొత్త వాతావరణానికి, మారుతున్న రుతువులకు అనుగుణంగా ట్యూన్ చేయాల్సి ఉంటుంది. దీనిని ఏడాదికి రెండుసార్లు ట్యూనింగ్(Tuning) చేస్తారు. పియానోలో మొత్తం 88 నలుపు రంగు, తెలుపు రంగు కీలు ఉంటాయి. పియానో క్లిష్టమైన వాయిద్య పరికరం. దీనిలో 12 వేలకు పైగా విడి భాగాలు ఉంటాయి.ప్రపంచంలో అతిపెద్ద పియానో 1.4 టన్నుల బరువు, 5.7 మీటర్ల పొడవు కలిగివుంది. దీనిని న్యూజిలాండ్ పియానో ట్యూనర్ అడ్రియన్ మాన్ రూపొందించారు. పియానో రెండు విధాలుగా ధ్వనిని అందిస్తుంది. మొదటిది బిగ్గరగా, రెండవది మెల్లగా ఉంటుంది. ఈ రెండు శబ్దాలు సరైన క్రమంలో ఉత్పత్తి అయినప్పుడు, శ్రావ్యమైన సంగీతం వినిపిస్తుంది. పియోనాను కీబోర్డ్ ఆధారంగా రూపొందిస్తుంటారు. దీనిలో ఏదైనా కీని గట్టిగా నొక్కితే పెద్ద శబ్దం వస్తుంది, అదే కీని మెల్లగా నొక్కినప్పుడు మృదువైన శబ్దం వస్తుంది.ఇది కూడా చదవండి: ‘ప్రధాని మోదీ తెలివైన వ్యక్తి’.. భారత్ సుంకాలపై స్పందించిన ట్రంప్

‘ప్రధాని మోదీ తెలివైన వ్యక్తి’.. భారత్ సుంకాలపై స్పందించిన ట్రంప్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) ప్రధాని నరేంద్రమోదీని మెచ్చుకున్నారు. వాషింగ్టన్- భారతదేశం మధ్య సుంకాల చర్చలపై ఆయన సానుకూల వైఖరి ప్రదర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలా తెలివైన వ్యక్తి అని సుంకాల విషయంలో ఇరుదేశాల మధ్య పరస్పర సమన్వయం ఉంటుందని భావిస్తున్నానని ట్రంప్ పేర్కొన్నారు.అమెరికా దిగుమతి చేసుకున్న వాహనాలపై 25 శాతం సుంకాన్ని ప్రకటించిన ట్రంప్ ఆ మర్నాడే భారత్ సుంకాలపై స్పందించారు. ప్రధాని మోదీ ఇటీవలే అమెరికా వచ్చారని, తమ మధ్య మంచి స్నేహం ఉన్నదన్నారు. అయితే భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాలలో ఒకటని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ(Prime Minister Modi) చాలా తెలివైన వ్యక్తి అని, తామ సుంకాల విషయంలో చర్చలు జరిపామని, ఇది అమెరికా, భారత్‌లకు మంచి చేస్తుందన్నారు. అమెరికాలోకి దిగుమతి చేసుకున్న వాహనాలపై ట్రంప్ సర్కారు 25 శాతం సుంకాన్ని విధిస్తూ ఒక ప్రకటన చేసింది. ఇది ఏప్రిల్ 2 నుండి అమలులోకి రానుంది.భారతదేశం విధించే అధిక సుంకాలను హైలైట్ చేసిన ట్రంప్ తాము కూడా త్వరలో పరస్పర సుంకాలను విధిస్తామని, వారు మా నుంచి వసూలు చేస్తే, మేము వారి నుంచి వసూలు చేస్తామన్నారు. భారత్, చైనాలు లేదా అక్కడి కంపెనీల విషయంలో తాము న్యాయంగా ఉండాలనుకుంటున్నామని, పరస్పర అంగీకారంలో సుంకాల విధింపు ఉంటుందన్నారు. ప్రధాని మోదీ ఫిబ్రవరిలో వాషింగ్టన్ డీసీని సందర్శించి ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ పర్యటన సందర్భంగా భారత్, అమెరికాలు ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మరింతగా పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ప్రధానమంత్రి మోదీ-అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు తమ నూతన ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని ‘మిషన్ 500’గా నిర్ణయించారు. 2030 నాటికి ఇరు దేశాల వస్తు, సేవల వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా నిర్థారించారు.ఇది కూడా చదవండి: నాగ్‌పూర్‌లో ప్రధాని మోదీ చైత్ర నవరాత్రి పూజలు

Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో స్వల్ప వ్యవధిలో రెండు భూకంపాలు
కాబూల్: మయన్మార్‌లో సంభవించిన భూకంపం గురించి మరువకముందే ఆఫ్ఘనిస్థాన్(Afghanistan)లో స్వల్ప వ్యవధిలో రెండుమార్లు భూకంపం సంభవించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. నిముషాల వ్యవధిలో భూమి కంపించడంతో ప్రజలు వణికిపోయారు. EQ of M: 4.7, On: 29/03/2025 05:16:00 IST, Lat: 36.50 N, Long: 71.12 E, Depth: 180 Km, Location: Afghanistan. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/F4P212Y0hC— National Center for Seismology (@NCS_Earthquake) March 28, 2025ఆఫ్ఘనిస్థాన్‌లో ఈరోజు (శనివారం, మార్చి 29) ఉదయం సంభవించిన భూప్రకంననలు(Earthquakes) ప్రజలను వణికింపజేశాయి. స్వల్ప వ్యవధిలో ఆఫ్ఘనిస్థాన్‌లో సంభవించిన రెండు ప్రకంపనల తీవ్రత వరుసగా 4.7, 4.3 గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 4:51.. 5:16 గంటలకు ఈ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం కారణంగా జనం తమ ఇళ్లనుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతానికి ఈ భూకంపాల వలన ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు లేవు. మార్చి 28న మయన్మార్, థాయిలాండ్‌లలో బలమైన ప్రకంపనలు సంభవించినప్పుడు ఆఫ్ఘనిస్థాన్లోనూ భూకంపం సంభవించింది.EQ of M: 4.3, On: 29/03/2025 04:51:37 IST, Lat: 36.59 N, Long: 71.12 E, Depth: 221 Km, Location: Afghanistan. For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/gPUcvvaCpb— National Center for Seismology (@NCS_Earthquake) March 28, 2025భూకంపశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 4.3, 4.7 తీవ్రతతో వచ్చే భూకంపాలను మోడరేట్ భూకంపాలుగా వర్గీకరిస్తారు. ఇటువంటివి బలహీనమైన నిర్మాణాలు ఉన్న ప్రదేశాలలో భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కాగా మార్చి 21న ఆఫ్ఘనిస్థాన్‌లో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) నివేదిక ప్రకారం దీని కేంద్రం భూమికి 160 కి.మీ. దిగువన ఉంది. మార్చి 13న కూడా ఆఫ్ఘనిస్థాన్‌లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 4 తీవ్రత నమోదయ్యింది.ఇది కూడా చదవండి: Earthquake: మయన్మార్‌లో మళ్లీ భూ ప్రకంపనలు.. జనం పరుగులు
National

16 ఏళ్ల నిరీక్షణ.. నిర్దోషిగా హైకోర్టు మాజీ జడ్జి
చంఢీగడ్: అదొక పదహారేళ్ల క్రితం కేసు.. అందులోనూ హైప్రొహైల్ కేసు. ఒక జస్టిస్ తనను తాను నిర్దోషిగా నిరూపించుకోవడానికి సుదీర్ఘకాలం వేచి చూసిన కేసు. హర్యానా జడ్జిగా పని చేసిన జస్టిస్ నిర్మలా యాదవ్.. భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే కేసు. అయితే ఆ కేసు సుదీర్ఘంగా విచారణ చేసింది సీబీఐ. చివరకు ఆ కేసులో నిర్మలా యాదవ్ ఎటువంటి తప్పుచేయలేదని తేలడంతో ఆమెకు బిగ్ రీలీఫ్ లభించింది. తాజాగా సీబీఐ కోర్టు.. ఆమెను నిర్దోషిగా తేల్చి తీర్పును వెలువరించింది. 2008 జరిగిన ఈ కేసులో తీర్పు తనకు అనుకూలంగా రావడంతో జస్టిస్ నిర్మలా యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా ఈరోజు(శనివారం) సీబీఐ కోర్టుకు హాజరైన ఆమె.. తీర్పు తర్వాత మాట్లాడారు. తనకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉందని, అందుకే ఇంతకాలం ఓపిక పట్టిన దానికి ప్రతిఫలం లభించిందన్నారు. ఒక జడ్జికి ఇవ్వబోయి.. మరొక జడ్జికి క్యాష్ డెలివరీఆ ఇదర్దు జడ్జి పేర్లు ఇంచుమించు ఒకే మాదిరి ఉంటాయి. ఒకరు నిర్మలా యాదవ్ అయితే మరొకకే నిర్మలాజిత్ కౌర్. అయితే హర్యానా మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ సంజీవ్ బన్సాల్ క్లర్క్.. ఓ రూ. 15 లక్షల నగదును ప్యాక్ చేసుకుని నిర్మలా యాదవ్ ఇంటికి వెళ్లినట్లు విచారణలో తేలింది. తాను ఇవ్వాల్సింది జస్టిస్ నిర్మలాజిత్ కౌర్ కని కాకపోతే పొరపాటున జస్టిస్ నిర్మలా యాదవ్ ఇంటికి వెళ్లినట్లు తెలిపాడు ఆ ప్యాక్ తీసుకెళ్లిన అప్పటి క్లర్క్. రోజుల వ్యవధిలో ఆమెపై రెండు ఎఫ్ఐఆర్‌లుఈ కేసుకు సంబంధించి 2008, ఆగస్టు 16వ తేదీన ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ఆ తర్వాత మళ్లీ ఓ కీలక మలుపు తీసుకుంది. అప్పటి యూనియన్ టెర్రిటరీ జనరల్ ఎస్ఎఫ్ రోడ్రిగ్స్ ఆదేశాలతో ఆ కేసును సీబీఐకి బదిలీ చేశారు. దాంతో 12 రోజుల వ్యవధిలో సీబీఐ మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.2009 జనవరిలో సీబీఐ విచారణ ప్రారంభంజస్టిస్ నిర్మలా యాదవ్ పై వచ్చిన అవినీతి ఆరోపణల్లో దర్యాప్తు చేపట్టేందుకు తమకు అనుమతి కావాలంటూ పంజాబ్, హర్యానా హైకోర్టుకు విజ్క్షప్తి చేసింది సీబీఐ. దీనికి అనుమతి లభించడంతో జస్టిస్ నిర్మలా యాదవ్ పై విచారణ చేపట్టింది సీబీఐ. 2011లో ఆమెపై చార్జిషీట్ నమోదు చేసింది సీబీఐ.దీనిలో భాగంగా మొత్తం 84 మంది సాక్షులను పేర్లను నమోదు చేసింది. ఇందులో 69 మందిని విచారించిన సీబీఐ.. ఈ ఏడాది ఫిబ్రవరిలో 10 మంది సాక్షులను తిరిగి విచారించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే 10 మంది కీలక సాక్షులను మళ్లీ విచారించారు. చివరకు ఆ రూ. 15 లక్షల కేసులో జస్టిల్ నిర్మలా యాదవ్ పాత్ర ఏమీ లేదని తేలడంతో ఆమె నిర్దోషిగా నిరూపితమయ్యారు.

వీడు మనిద్దరికి పుట్టిన బిడ్డేనా?
అన్నానగర్: భార్యపై అనుమానం పెనుభూతమైంది. తామిద్దరూ నల్లగా ఉన్నా.. బిడ్డ మాత్రం మంచి రంగుతో జన్మించడంపై సందేహించాడు. బిడ్డ ఎదిగే కొద్దీ అనుమానం కూడా అదే తీరులో బలపడింది. చివరకు ఆ రెండున్నరేళ్ల చిన్నారిని గొంతు నులిమి హతమార్చాడు. ఊయల తాడు బిగుసుకుని మరణించిందని బుకాయించాడు. అయితే పోస్టుమార్టం నివేదికలో గొంతు నులమడం వల్లే చనిపోయిందని తేలడంతో ఆ కసాయి కటకటాలపాలయ్యాడు. వివరాలు..చెన్నై మన్నడి లింగుచెట్టి వీధికి చెందిన అక్రమ్ జావిద్ (33) పత్తి దుకాణంలో పని చేసేవాడు. అతని భార్య నిలోఫర్. వీరికి పెళ్లయి నాలుగేళ్లైంది. వీరికి రెండున్నరేళ్ల వయసున్న కుమార్తె పాహిమా ఉంది. గత 26వ తేదీ రాత్రి నీలోఫర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ ఉపవాసం విరమించేందుకు సమీపంలోని మసీదుకు వెళ్లింది. కుమార్తెతో ఇంట్లోనే జావిద్ ఉండిపోయాడు. ఇఫ్తార్ అనంతరం ఇంటికి తిరిగొచ్చిన నీలోఫర్‌కు పాహిమా మెడ తొట్టి తాడుతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుందని అక్రమ్ జావిద్ తెలిపారు. వెంటనే చిన్నారిని స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం మేరకు నార్త్ కోస్ట్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయకాంత్ కేసు నమోదు చేసి చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జావిద్‌ను ప్రశ్నిస్తే ఊయల తాడు మెడకు బిగుసుకుపోవడం వల్లే చనిపోయిందని చెప్పుకొచ్చాడు. అయితే శుక్రవారం అందిన పోస్టుమార్టం నివేదికలో చిన్నారిని గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడైంది. దీంతో తమదైన శైలిలో విచారణ చేసేసరికి తానే బిడ్డను గొంతు నులిమి హతమార్చినట్టు జావిత్ అంగీకరించాడు. తాను, తన భార్య నల్లగా ఉన్నప్పటికీ పుట్టిన బిడ్డ మాత్రం మంచి రంగుతో ఉండడంతో తన భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు వాంగ్మూలమిచ్చాడు.

స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం...
తమిళనాడు: తనకు వివాహమైనప్పటికీ స్నేహితుడి భార్యను తీసుకెళ్లి గుట్టుగా కాపురం చేస్తున్న వ్యక్తి చివరకు అనుమానాస్పద స్థితిలో శవమై వెలుగులోకి వచ్చాడు. అతడితో సహజీవనం చేస్తున్న స్నేహితుడి భార్య అదృశ్యం కావడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు సమీపంలోని కటైమేడు గ్రామానికి చెందిన గోకుల్(25) వెల్డింగ్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఇతడు ఆంబూరుకు చెందిన తన స్నేహితుడి భార్యను నాగర్‌కోయిల్‌కు తీసుకెళ్లి అక్కడే ఒక అద్దె ఇంట ఉంటూ ఆమెతో సహజీవనం చేస్తున్నాడు. ఈ వ్యవహారం గోకుల్ భార్య తులసికి తెలియడంతో ఆమె ఎన్నోసార్లు అతడికి ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ అని వస్తూండడంతో అప్పట్లో పోలీసులకు సైతం ఆమె ఫిర్యాదు చేసింది.ఈ నేపథ్యంలో గోకుల్ నివసిస్తున్న ఇంటి నుంచి గురువారం సాయంత్రం దుర్వాసన రావడంతో స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తాళం వేసి ఉండడంతో దానిని పగలగొట్టి లోనికి వెళ్లి పరిశీలించారు. గోకుల్ విగతజీవిగా ఉండటం గుర్తించారు. దీంతో వేలూరులోని అతని భార్యకు సమాచారమిచ్చారు. అయితే గోకుల్‌తో ఉన్న మహిళ ఏమైంది? గోకుల్ హత్యకు గురయ్యాడా, ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

‘ప్రయాగ్‌రాజ్’కు పోటీగా నాసిక్ కుంభమేళా
నాసిక్: ఇటీవలే యూపీలోని ప్రయాగ్‌రాజ్(Prayagraj)లో అత్యంత వైభవంగా మహాకుంభమేళా జరిగింది. ఇప్పుడు దీనికి పోటీనిచ్చే రీతిలో మహారాష్ట్రలోని నాసిక్‌లో కుంభమేళా జరగనుంది. దీనికి త్రయంబకేశ్వర్-నాసిక్ సింహస్థ కుంభమేళాగా నామకరణం చేయనున్నారని తెలుస్తోంది.ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Chief Minister Devendra Fadnavis) నాసిక్‌లో పర్యటించిన తరువాత 2027లో నాసిక్‌లో జరగబోయే కుంభమేళాకు సన్నాహాలు ఊపందుకున్నాయి. అయితే ఈ మేళాకు తగిన పేరు పెట్టే విషయంలో భిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా త్రయంబకేశ్వర్ అఖాఢాల ప్రతినిధులు ఈ ఉత్సవానికి త్రయంబకేశ్వర్-నాసిక్ సింహస్థ కుంభమేళా అనే పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇటీవల నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో అధికారులతో జరిగిన సమావేశంలో నాసిక్ అఖాఢాల నేతలు ఈ కుంభమేళా పేరును నాసిక్ కుంభమేళాగానే కొనసాగించాలని కోరారు.నాసిక్ అఖాడాల సాధువులు సింహస్థ కుంభమేళా అథారిటీలో తమను భాగస్వాములను చేయాలని, కుంభమేళా నిర్వహణకు 500 ఎకరాలకు పైగా భూమిని శాశ్వతంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. నాసిక్ జిల్లా మేజిస్ట్రేట్ జలజ్ శర్మ మాట్లాడుతూ నాసిక్ కుంభమేళా పేరుకు సంబంధించిన సమాచారాన్ని ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందన్నారు. రికార్డులను తనిఖీ తర్వాత ఉన్నతాధికారుల సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు. నాసిక్‌లో 2027 జూలై 14 -సెప్టెంబర్ 25 మధ్య గోదావరి నది ఒడ్డున జరగనుంది. ఇది 12 సంవత్సరాల తర్వాత జరుగుతోంది. ఇటీవల మహారాష్ట్ర జలవనరులు, విపత్తు నిర్వహణ మంత్రి గిరీష్ మహాజన్ కుంభమేళా ఏర్పాట్లను సమీక్షించేందుకు త్రయంబకేశ్వర్‌ను సందర్శించారు. సాధువులు, మహంతుల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళాకు ధీటుగా నాసిక్ కుంభమేళాను నిర్వహించాలని మహారాష్ట్ర సర్కారు(Government of Maharashtra) యోచిస్తోంది.ఇది కూడా చదవండి: Nepal: మాజీ రాజు జ్ఞానేంద్ర షా అరెస్టుకు రంగం సిద్ధం?
NRI

న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాట అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఉమెన్స్ డే వేడకలను అంగరంగ వైభవంగా నిర్వహించి.. వనితలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మాట ఉమెన్ కమిటీ మరోసారి రుజువు చేసింది. ప్రముఖ సినీ నటి, ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. సింగర్ దామిని భట్ల, దీప్తి నాగ్ తో పాటు పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అంకితా కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మాట కార్యవర్గాన్ని అభినందించారు. అంకితా జాదవ్ నటించిన ఆల్బమ్ సాంగ్స్ ను ఈ వేదికగా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో మహిళామణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనువిందు చేశారు. ఇక వేదికపై నిర్వహించిన పలు కార్యక్రమాలు మహిళల సంతోషాల మధ్య ఆహ్లదంగా సాగాయి. యువతులు, మహిళల ఆట, పాటలతో.. సంబరాల సంతోషాలు అంబరాన్నంటాయి. అటు సంప్రదాయం.. ఇటు ఆధునికత ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు ఆకట్టుకున్నారు. శాస్త్రీయ నృత్యం, మోడ్రన్ డ్యాన్స్ రెండింటిలో తమకు సాటి లేదని నిరూపించారు.MS మాట కాంపిటీషన్, ఫ్యాషన్ షో, బ్యూటీ పాజెంట్ వంటి అద్భుతమైన ప్రదర్శనలు ఆహుతులను ఆకర్షించాయి. ఈ ప్రదర్శనల్లో మగువలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తి ఏమిటో నిరూపించారు. అందాల ముద్దుగుమ్మలు హొయలు పోతూ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేశారు. అందాల పోటీలకు నటి అంకితా జాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. MS మాట కాంపిటీషన్ 2025 విజేతకు కిరీటాన్ని బహూకరించారు. పోటీల్లో పాల్గొన్న మగువలకు బెస్ట్ స్మైల్, బెస్ట్ వాక్ వంటి పలు విభాగాల్లో అవార్డులు అందించారు. ఫోటో బూత్, ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్, ఫన్ ఫీల్డ్ గేమ్స్, రాఫెల్ టికెట్స్ వంటి కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.వేదికపై మగువలు, చిచ్చర పిడుగులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్యాన్స్‌లు, డిజె మ్యూజిక్ కార్యక్రమాలు హోరెత్తించాయి. సంప్రదాయ ఫ్యాషన్ షో, గేమ్స్ తో పాటు ఇతర కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వెండర్స్ బూత్ ఏర్పాటు చేశారు. మహిళలు షాపింగ్ స్టాల్స్ దగ్గర సందడి చేశారు. తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పసందైనా విందుభోజనం అందించారు. ఆహా ఏమి రుచి… తినరా మైమరచి.. అనే మాటను నిజం చేస్తూ ఎంతో రుచికరమైన భోజనాలు అందించారు. స్వీట్స్ నుంచి ఐస్ క్రీమ్ వరకు పలు వైరటీలతో రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేశారు. మాట మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాట నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సత్కరించారు. సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి మాట అధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ తరుపున చేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు. స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు హితవు పలికారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మాట పలువురిని అవార్డుతో సత్కరించింది. అలాగే సభా వేదికపై పలువురిని సన్మానించి, సత్కరించారు. మాట కార్యక్రమాలు అండగా ఉంటూ, సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరినీ నిర్వహకులు ప్రశంసించారు. ఈ సంబరాలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరినీ మాట ఉమెన్ కమిటీ ప్రత్యేకంగా అభినందించింది. ఈ వేడుకకు విచ్చేసిన స్త్రీమూర్తులకు నిర్వహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. విందు - వినోదాలతో మాట - అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఉత్సహంగా సాగాయి. ఈ సంబరాల్లో మేము సైతం అంటూ వెయ్యి మందికి పైగా మహిళలు ముందుకొచ్చి ఉమెన్స్ డే వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. సంబరమాశ్చర్యాలతో, ఆసాంతం ఆహ్లాద పరిచేలా ఈ వేడుకను కనువిందుగా నిర్వహించారు. వేలాదిగా ఆదర్శ వనితలు ఒక చోటు చేరి, అటపాటలతో, కేరింతలతో హోరేత్తించడం.. మాట విజయానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్‌కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్‌ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్‌పర్సన్‌గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్‌లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్‌ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్‌లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్‌లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్‌లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

న్యూయార్లో ఘనంగా తెలుగువారి సంబరాలు.
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో తెలుగువారి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఒకే రోజు రెండు ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళా దినోత్సవంతో పాటు మహా శివరాత్రి వేడుకలను కూడా ఓకేసారి న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారి చేసుకున్నారు. న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో ఫ్లషింగ్ గణేష్ టెంపుల్ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.వందలాది మంది తెలంగాణ, తెలుగు వాసులు తమ కుటుంబాలతో సహా చేరి ఉత్సవాల్లో పాల్గొని ఆడి పాడారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ అమెరికాతో పాటు న్యూ యార్క్ మహానగరం అభివృద్ది, సంస్కృతిలో తెలుగువారు అంతర్భాగం అయ్యారని కొనియాడారు.తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్కమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సీతక్క, తదితర ప్రముఖులు ప్రత్యేక సందేశాల ద్వారా నైటా కార్యక్రమాలను, ఆర్గనైజింగ్ కమిటీ కృషిని ప్రశంసిస్తూ ప్రత్యేక సందేశాలను పంపారు. వీటి సంకలనంతో పాటు నైటా సభ్యులు, కార్యక్రమాలతో కూడిన సమాహారంగా నైటా వార్షికోత్సవ సావనీర్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.ఈ ఫెస్టివల్ ఈవెంట్ లో తెలంగాణ సూపర్ రైటర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కాసర్ల శ్యామ్ తో పాటు, యూకే నుంచి సింగర్ స్వాతి రెడ్డి, డాన్సింగ్ అప్సరాస్ గా పేరొందిన టీ అండ్ టీ సిస్టర్స్, ఇండియన్ ఫేమస్ ఫ్యూజన్ మ్యూజిక్ గ్రూప్ పరంపరా లైవ్ ఫెర్మామెన్స్ తో అదరగొట్టారు. కొన్ని గంటల పాటు జరిగిన కార్యక్రమం ఆద్యంతం అందరినీ కట్టిపడేసింది.తెలుగు యువత గుండెల్లో చిరకాలం నిలిచిపోయే పాటలను రచించటంతో పాటు, పాడిన యువ గాయకుడు కాసర్ల శ్యామ్ కొన్ని హిట్ సాంగ్స్ తో అందరినీ ఉర్రూతలూగించారు. అమెరికాలో తెలుగువారి బలగాన్ని, బలాన్ని తన పాటల ద్వారా శ్యామ్ చాటి చెప్పారు. ఇక కొంత ఆలస్యంగానైనా న్యూయార్క్ తెలుగువారు శివరాత్రి వేడుకలు జరుపుకున్నా ఆధ్యాత్మిక గీతాలు, చిన్నారులు భక్తి పాటలతో ఆడిటోరియటం మారు మోగింది.న్యూయార్క్ మహానగరంలో నిత్యం వారి వారి వృత్తుల్లో బిజీగా ఉండే మన తెలుగు వారు అన్నింటినీ పక్కన పెట్టి అటు శివ భక్తి, ఇటు మహిళా దినోత్సవాన్ని ఒకే సారి వేడుకగా జరుపుకున్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నైటా ఆర్గనైజింగ్ టీమ్ తో పాటు తెరవెనుక సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా అధ్యక్షురాలు వాణీ రెడ్డి ఏనుగు కృతజ్జతలు తెలిపారు.నైటా కార్యక్రమాలకు వెన్నుముకగా నిలుస్తూ ప్రోత్సాహం అందిస్తున్న డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిని నైటా టీమ్ ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది తెలుగు కుటుంబాలతో పాటు, న్యూయార్క్ కాంగ్రెస్ విమెన్ గ్రేస్ మెంగ్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ నుంచి బిజేందర్ కుమార్ తదితరులు హాజరయ్యారు.
క్రైమ్

వీడు మనిద్దరికి పుట్టిన బిడ్డేనా?
అన్నానగర్: భార్యపై అనుమానం పెనుభూతమైంది. తామిద్దరూ నల్లగా ఉన్నా.. బిడ్డ మాత్రం మంచి రంగుతో జన్మించడంపై సందేహించాడు. బిడ్డ ఎదిగే కొద్దీ అనుమానం కూడా అదే తీరులో బలపడింది. చివరకు ఆ రెండున్నరేళ్ల చిన్నారిని గొంతు నులిమి హతమార్చాడు. ఊయల తాడు బిగుసుకుని మరణించిందని బుకాయించాడు. అయితే పోస్టుమార్టం నివేదికలో గొంతు నులమడం వల్లే చనిపోయిందని తేలడంతో ఆ కసాయి కటకటాలపాలయ్యాడు. వివరాలు..చెన్నై మన్నడి లింగుచెట్టి వీధికి చెందిన అక్రమ్ జావిద్ (33) పత్తి దుకాణంలో పని చేసేవాడు. అతని భార్య నిలోఫర్. వీరికి పెళ్లయి నాలుగేళ్లైంది. వీరికి రెండున్నరేళ్ల వయసున్న కుమార్తె పాహిమా ఉంది. గత 26వ తేదీ రాత్రి నీలోఫర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇఫ్తార్ ఉపవాసం విరమించేందుకు సమీపంలోని మసీదుకు వెళ్లింది. కుమార్తెతో ఇంట్లోనే జావిద్ ఉండిపోయాడు. ఇఫ్తార్ అనంతరం ఇంటికి తిరిగొచ్చిన నీలోఫర్‌కు పాహిమా మెడ తొట్టి తాడుతో ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుందని అక్రమ్ జావిద్ తెలిపారు. వెంటనే చిన్నారిని స్టాన్లీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. సమాచారం మేరకు నార్త్ కోస్ట్ పోలీస్ ఇన్స్పెక్టర్ విజయకాంత్ కేసు నమోదు చేసి చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. జావిద్‌ను ప్రశ్నిస్తే ఊయల తాడు మెడకు బిగుసుకుపోవడం వల్లే చనిపోయిందని చెప్పుకొచ్చాడు. అయితే శుక్రవారం అందిన పోస్టుమార్టం నివేదికలో చిన్నారిని గొంతు నులిమి హత్య చేసిన ఆనవాళ్లు ఉన్నాయని వెల్లడైంది. దీంతో తమదైన శైలిలో విచారణ చేసేసరికి తానే బిడ్డను గొంతు నులిమి హతమార్చినట్టు జావిత్ అంగీకరించాడు. తాను, తన భార్య నల్లగా ఉన్నప్పటికీ పుట్టిన బిడ్డ మాత్రం మంచి రంగుతో ఉండడంతో తన భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు వాంగ్మూలమిచ్చాడు.

ప్రియురాలికి పురుగుల మందు తాగించి పరారైన ప్రియుడు..!
జంగారెడ్డిగూడెం(ఏలూరు): మండలంలోని పేరంపేటలో ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనికి సంబంధించి ఎస్సై షేక్ జబీర్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పేరంపేటకు చెందిన హేమదుర్గా అనంత ప్రసన్నకు, కొయ్యలగూడెం మండలం యర్రంపేటకు చెందిన దార్ల రాంప్రసాద్‌తో 2014లో వివాహమైంది. వీరికి 11 సంవత్సరాల కుమార్తె ఉంది. కొయ్యలగూడెం మండలం గంగన్నగూడెంకు చెందిన మోదుగ పెద్దసాయి.. ప్రసన్నను ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడు. వారు ఏకాంతంగా ఉన్న సమయంలో పొటోలు, వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేసేవాడు. ఫిబ్రవరి 7న ప్రసన్న ఇంటికి వెళ్లి మనిద్దరం చనిపోదాం! అంటూ పురుగుల మందు తాగించాడు. కుటుంబ సభ్యులు ఆమెను కొయ్యలగూడెం ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అక్కడ చికిత్స పొందిన తరువాత తండ్రి ఈశ్వరాచారి కుమార్తె ప్రసన్ననను జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు తీసుకొచ్చాడు. 15 రోజుల తరువాత పెద్దసాయి పేరంపేటకు వచ్చి గొడవ పడ్డాడు. మార్చి 26న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రసన్న ఇంటికి వచ్చిన సాయి చనిపోదాం.. అని నమ్మించి ప్రసన్నతో కలుపుమందు తాగించాడు. మందు ప్రభావాన్ని తట్టుకోలేక ప్రసన్న కేకలు వేయగా, ఆమె తల్లి పరుగున అక్కడికి వచ్చింది. ఆమెను చూసిన సాయి అక్కడినుంచి పారిపోయాడు. ప్రసన్నను వెంటనే జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 27న చనిపోయింది. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.మృతదేహంతో ధర్నాకొయ్యలగూడెం: ప్రసన్న కుటుంబానికి న్యాయం చేయాలంటూ గంగన్నగూడెంలో బంధువులు ఆందోళన చేపట్టారు. జంగారెడ్డిగూడెం నుంచి గంగన్నగూడెంకు ప్రసన్న మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిస్తుండగా, పోలీసులు అంబులెన్స్ డ్రైవర్‌కు ఫోన్ చేసి మధ్యలోనే ఆపించారు. దీంతో మృతదేహాన్ని మోటార్‌సైకిళ్లపై గంగన్నగూడెం తీసుకువెళ్లి ధర్నా చేశారు. ప్రసన్న మృతికి గంగన్నగూడెం గ్రామానికి చెందిన సాయి కారణమని అతని ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచి ధర్నా చేశారు. ఆ సమయంలో యువకుడితో సహా అతని ఇంట్లో ఎవరూ లేకపోవడంతో బయటే ఉండి ఆందోళన చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వారితో చర్చించి మృతదేహాన్ని తరలించేలా ఒప్పించారు.

హర్షవర్దిని ఎందుకమ్మా ఇలా చేశావు..!
రాప్తాడు రూరల్: మార్కుల ఒత్తిళ్లు ఓ ఇంటర్ విద్యార్థిని బలిగొన్నాయి. వివరాలు.. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లికాలనీ పంచాయతీ పరిధిలోని జీఎం కాలనీకి చెందిన లక్ష్మన్న కళ్యాణదుర్గంలో సెరికల్చర్ శాఖలో పని చేస్తున్నారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె హర్షవర్దిని (17) నగర శివారులోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతూ ఇటీవల పబ్లిక్ పరీక్షలు రాసింది. అయితే పరీక్షలు తాను సక్రమంగా రాయలేదని, ఆశించిన స్థాయిలో మార్కులు రావేమోననే అనుమానంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన ఆమె శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కల వారి నుంచి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు ఇంటికి చేరుకుని బోరున విలపించారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పిల్లల కోసం వస్తే.. పిల్లలతో పాటు భార్యా దక్కలేదని..
డాబాగార్డెన్స్: పిల్లల కోసం కలలు కన్న ఒక నిరుపేద దంపతులకు ఫెర్టిలిటీ సెంటర్ తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఇందుకోసం తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేకపోగా.. కడుపులో పెరుగుతున్న కవలలతో సహా తల్లి కూడా మృతి చెందడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఆ ముగ్గురు ప్రాణాల విలువను రూ.4 లక్షలుగా వెలకట్టి ఆస్పత్రి యాజమాన్యం చేతులు దులుపుకుంది. బాధితుడు తెలిపిన వివరాలివి..అనకాపల్లి జిల్లా మాకవరపాలెం ఎస్సీ కాలనీకి చెందిన గెంజి వరహాలు బాబు ఓ కంపెనీలో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఎనిమిదేళ్ల కిందట లక్ష్మితో అతనికి వివాహం జరిగింది. పిల్లలు లేకపోవడంతో బాధపడుతున్న వరహాలు బాబుకు.. అదే కంపెనీలోని ఒక సహోద్యోగి రామ్‌నగర్‌లోని ఆరాధ్య ఆస్పత్రి గురించి చెప్పాడు. అక్కడ చికిత్స తీసుకుంటే పిల్లలు పుడతారని చెప్పడంతో.. వరహాలు బాబు, లక్ష్మి దంపతులు ఎనిమిది నెలల కిందట ఆరాధ్య ఆస్పత్రిని సంప్రదించారు. ప్రారంభంలో ఆస్పత్రి యాజమాన్యం రూ.2,25,000 ఖర్చు అవుతుందని చెప్పగా.. తమ ఆర్థిక పరిస్థితిని వివరించడంతో రూ.2,10,000కు అంగీకరించింది. వరహాలు బాబు పరీక్షల కోసం మరో రూ.12 వేలు చెల్లించాడు. పరీక్షలు పూర్తయ్యాయి. లక్ష్మికి రూ.12 రోజుల పాటు రోజుకు ఒక ఇంజక్షన్ చొప్పున 12 ఇంజక్షన్లు వేశారు. అప్పటి నుంచి ప్రతి నెలా పరీక్షల కోసం మాకవరపాలెం నుంచి నగరానికి వెళ్లొస్తూ ఉండేవారు. ప్రయాణాలు, వైద్య ఖర్చులు, మందులు, స్కానింగ్‌ల కోసం నెలకు దాదాపు రూ. 20 వేల వరకు ఖర్చు చేసేవారు. నాలుగో నెలలో లక్ష్మి గర్భంలో ముగ్గురు పిల్లలు ఉన్నారని వైద్యులు చెప్పడంతో సంతోషించిన ఆ దంపతులు.. ఇద్దరు పిల్లలు చాలని కోరారు. దీంతో వైద్యులు ఒక పిండాన్ని తొలగించారు. ఆ తర్వాత ఆరు నెలల వరకు తల్లి, పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నారు. 7వ నెలలో నిర్వహించిన పరీక్షల్లో లక్ష్మికి మధుమేహం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్యుల సూచనల మేరకు ఆహార నియమాలు పాటించినప్పటికీ.. సరైన పోషకాహారం లేక పిల్లల ఎదుగుదల సరిగా లేకపోయింది. దీంతో ఆస్పత్రి చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.ముందే చెప్పి ఉంటే..కాగా.. గత ఆదివారం రాత్రి లక్ష్మికి తీవ్రమైన విరేచనాలు మొదలయ్యాయి. సోమవారం ఉదయం వరకు అవి ఆగకపోవడంతో ఆందోళన చెందిన వరహాలు ఆస్పత్రికి ఫోన్ చేసినా స్పందన రాలేదు. ఉదయం 8 గంటల తర్వాత స్పందించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తీసుకురావాలని సూచించారు. మధ్యాహ్నానికి ఆస్పత్రికి చేరుకున్న లక్ష్మిని మొదట 6వ అంతస్తులో, తర్వాత 3వ అంతస్తుకు మార్చారు. పరిస్థితి విషమించడంతో స్కానింగ్ చేయగా కడుపులో ఇద్దరు పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పిల్లలు చనిపోయినా భార్యను కాపాడమని వేడుకున్న వరహాలు బాబుకు చెప్పకుండానే అదే రోజు రాత్రి లక్ష్మిని అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం లక్ష్మి తుదిశ్వాస విడిచింది. భార్యను, కడుపులోని ఇద్దరు పిల్లలను కోల్పోయిన వరహాలు బాబు కన్నీరుమున్నీరుగా విలపించాడు. పిల్లల కోసం వస్తే.. పిల్లలతో పాటు భార్యా దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఆవేదననను చూసి కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యాన్ని నిలదీస్తే.. ముగ్గురి ప్రాణాలకు కలిపి రూ.4 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించాడు. ప్రతి నెలా పరీక్షలు చేస్తూ లక్షలు వసూలు చేసిన యాజమాన్యం.. చివరికి తల్లి శరీరం సహకరించడం లేదని చెప్పడం దారుణమని వరహాలు బాబు తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ముందే చెప్పి ఉంటే ఈ ప్రయత్నమే చేసేవాళ్లం కాదని, ముగ్గురు ప్రాణాలను రూ.4 లక్షలకు వెలకట్టడం దారుణమని ఆమె రోదించింది.
వీడియోలు


ముంబైపై గుజరాత్ ఘన విజయం
చిరంజీవిని కలిసిన 'కోర్ట్' మూవీ టీమ్ (ఫొటోలు)


కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నేతల ఓవరాక్షన్


ఉగాది రాశి ఫలాలు 2025.. ఆ రాశుల వారు జాగ్రత్తగా ఉండకపోతే..


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అఘాయిత్యాలు పెరిగాయి: జక్కంపూడి రాజా


సూపర్ సిక్స్ పై చంద్రబాబు పిల్లి మొగ్గలు


తెలుగు ప్రజలకు YS జగన్ ఉగాది శుభాకాంక్షలు


పిన్నెల్లి YSRCP నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు


తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ ఉగాది శుభాకాంక్షలు


చంద్రబాబుకు అసదుద్దీన్ ఒవైసీ వార్నింగ్