Top Stories
ప్రధాన వార్తలు

Air India: పాక్ గగనతలంపై ఆంక్షలు.. ఎయిరిండియాకు వేల కోట్ల నష్టం
ఢిల్లీ: కశ్మీర్‌లోని పహల్గాం భూతల స్వర్గం.. ఆ ప్రదేశంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడితో భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భారత్‌లోని ప్రముఖ ఏవియేషన్ దిగ్గజం ఎయిరిండియాకు వేలకోట్ల నష్టం వాటిల్లింది.పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌పై భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. దీంతో పాక్ సైతం భారత్‌పై పలు ఆంక్షలు విధించింది. పాక్ గగన తలంపై భారత విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది.ఆ నిర్ణయంతో ఎయిరిండియా సుమారు 600 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. పాక్ గగనతలంపై భారత విమానాల రాకపోకలపై నిషేదం కారణంగా విమానాల దారి మళ్లింపు, పెరిగిన ప్రయాణ దూరం, అదనపు ఇంధనం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫలితంగా ప్రతీ ఏడాది తమ సంస్థకు 591 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేసింది.ఈ నష్టం నుంచి బయటపడేందుకు ప్రభుత్వం రాయితీ ఇవ్వాలని కోరుతూ విమానయాన శాఖకు ఎయిరిండియా యాజమాన్యం లేఖ రాసినట్లు సమాచారం. గగనం తలంపై పాక్ తీసుకున్న నిర్ణయంతో ఒక్క ఎయిరిండియా మాత్రమే కాదని టాటా గ్రూప్‌కు చెందిన ఇతర విమానాల సర్వీసులపై ప్రభావం పడనున్నట్లు ఆ లేఖలో పేర్కొంది.ఉదాహరణకు ఇండిగో గురువారం న్యూఢిల్లీ-బాకు (అజర్బైజాన్లో) విమానం ఐదు గంటల 43 నిమిషాలు ప్రయాణించింది. పాక్ గగన తలం నుంచి కాకుండా దారి మళ్లించిన కారణంగా 38 నిమిషాలు ఎక్కువ సమయం పట్టింది. ఆ సమయానికి అదనంగా ఇంధనం వెచ్చించాల్సి ఉంటుంది. ప్రయాణ సమయంలో ప్రయాణికులకు అందించే ఇతర సర్వీసుల్లో సైతం భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.అయితే, మిగితా విమానయాన సంస్థలతో పోలిస్తే ఎయిరిండియా పలు ప్రపంచ దేశాలకు విమానాల రాకపోకలన్నీ పాకిస్తాన్ గగన తలం నుంచే నిర్వహిస్తుంది. పాక్ తాజా నిర్ణయం ఎయిరిండియాపై కాస్త ప్రతికూల ప్రభావం పడనుంది. ఉదాహరణకు, ఢిల్లీ-మిడిల్ ఈస్ట్ విమానాలు ఇప్పుడు కనీసం ఒక గంట అదనంగా ప్రయాణించవలసి వస్తుంది, దీనికి ఎక్కువ ఇంధనం అవసరం అవుతుంది.ఎయిరిండియా దాని బడ్జెట్ సర్వీస్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఇండిగోలు గత నెలలో పదిహేను రోజుల్లో న్యూఢిల్లీ నుండి యూరప్, మిడిల్ ఈస్ట్, ఉత్తర అమెరికాలోని గమ్యస్థానాలకు 1,200 విమానాలు బయలుదేరాయని అంచనా.

హారతి ఇస్తుండగా మంటలు అంటుకుని.. కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ మృతి
జైపూర్: కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ కన్నుమూశారు. ఈ ఏడాది మార్చి నెలలో తన ఇంటి పూజగదిలో హారతి ఇస్తుండగా అగ్ని ప్రమాదానికి గిరిజా వ్యాస్ చికిత్స పొందుతూ మరణించారు. The news of the demise of former Union Minister, former Rajasthan Congress President, and senior Congress leader Dr. Girija Vyas ji is deeply saddening.A distinguished intellectual, powerful orator, and capable administrator, she served the nation and the Congress Party with… pic.twitter.com/2fJN88nva7— B M Sandeep (@BMSandeepAICC) May 2, 2025మర్చి నెలలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కేంద్రమంత్రి గిరిజా వ్యాస్ (Girija Vyas) అగ్ని ప్రమాదంలో పడ్డారు. రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లోని తన నివాసంలో పూజ చేసే సమయంలో హారతి (harathi) ఇచ్చే సమయంలో ఆమెకు మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఉదయపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పలు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. మెరుగైన వైద్యం కోసం ఆమెను 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌కు తరలించాలని సూచించారు. ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంపై గిరిజా వ్యాస్ సోదరుడు గోపాల్ శర్మ స్పందించారు. గిరిజా వ్యాస్ ఇంట్లో హారతి ఇచ్చే సమయంలో ప్రమాదవ శాత్తూ కింద నుంచి మంటలు ఆమె దుప్పటాకు మంటలు అంటుకున్నాయి. వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. తాజాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గిరిజా వ్యాస్ కన్నుమూశారు. ఆమె మరణంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. 👉ప్రముఖ కాంగ్రెస్ నేత గిరిజా వ్యాస్ గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కీలక పదవులు నిర్వహించారు.1985 నుండి 1990 వరకు ఎమ్మెల్యేగా, రాజస్థాన్ పర్యాటక మంత్రిగా పనిచేశారు1991లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. 1996, 1999లో ఉదయపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి,2009లో చిత్తోరగఘ్ నుండి లోక్ సభ సభ్యురాలిగా పనిచేశారుకేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా, అలాగే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ (NCW) చైర్ పర్సన్‌గా సేవలందించారు.

RR VS MI: కంటిపై 7 కుట్లు పడినా అదిరిపోయే ప్రదర్శన చేసిన హార్దిక్
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మే 1) రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా డబుల్ హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్‌లో ముంబై అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఏకపక్ష విజయం సాధించింది.ఈ గెలుపులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాట్‌తో చెలరేగి (23 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), ఆతర్వాత బంతితోనూ రాణించాడు (1-0-2-1). వాస్తవానికి ఈ మ్యాచ్‌కు హార్దిక్ అందుబాటులో ఉండాల్సింది కాదు. అతడికి ప్రాక్టీస్ సందర్భంగా తీవ్రమైన రక్తస్రావంతో కూడిన గాయమైంది. అతడి ఎడమ కంటి పైభాగంలో ఏడు కుట్లు పడ్డాయి. అయినా హార్దిక్ ఈ మ్యాచ్ బరిలోకి దిగి సత్తా చాటాడు.ఈ సీజన్లో హార్దిక్ మొదటి నుంచి చాలా కమిట్మెంట్తో ఉన్నాడు. ఎలాగైనా ముంబై ఇండియన్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టాలని కసితో రగిలిపోతున్నాడు. గత సీజన్లో ఎదురైన పరాభవానికి ఈ సీజన్లో ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. అనుకున్నట్లుగానే వరుస పరాజయాల బాట పట్టిన జట్టును డబుల్ హ్యాట్రిక్ విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలబెట్టాడు. వ్యక్తిగతంగానూ హార్దిక్ రాణించాడు. 9 మ్యాచ్‌ల్లో 172.5 స్ట్రయిక్ రేట్‌తో 157 పరుగులు చేసి, 13 వికెట్లు తీశాడు.రోహిత్ శర్మ నుంచి ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపట్టిన హార్దిక్ గత సీజన్లో కెప్టెన్‌గా, ఆటగాడిగా దారుణంగా విఫలమయ్యాడు. గత సీజన్లో ముంబై 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.ఈ సీజన్ తొలి 5 మ్యాచ్‌ల్లోనూ ముంబై అదే పేలవ ప్రదర్శన కొనసాగించింది. కేవలం ఒక్క విజయం మాత్రమే సాధించి, పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉండింది. అయితే సీజన్ గడిచే కొద్ది ముంబై ఇండియన్స్ ఆటతీరులో అనూహ్య మార్పు వచ్చింది. స్టార్ ఆటగాళ్లంతా టచ్‌లోకి రావడంతో ఒక్కసారిగా గెలుపు బాట పట్టింది. మూడు వారాలు తిరక్కుండానే తొమ్మిదో స్థానం నుంచి అగ్రస్థానానికి దూసుకొచ్చింది.వాస్తవానికి ముంబై ఇండియన్స్‌ను ఇలా పడి లేవడం కొత్తేమీ కాదు. గతంలో చాలా సీజన్లలో ఇలాగే ఆరంభంలో వరుస పరాజయాలు ఎదుర్కొని, ఆతర్వాత ఏకంగా టైటిల్‌నే ఎగరేసుకుపోయింది. ముంబై ఇండియన్స్ చరిత్రలో ఇలా వరుసగా 6 మ్యాచ్‌లు గెలవడం ఇది మూడో సారి. లీగ్ ఆరంభ సీజన్లో ఈ జట్టు తొలిసారి వరుసగా ఆరు విజయాలు సాధించింది. అయితే ఆ సీజన్లో లీగ్ దశలోనే నిష్క్రమించింది. తిరిగి 2017 సీజన్లో వరుసగా ఆరు విజయాలు సాధించింది. అయితే ఈ సారి ఛాంపియన్‌గా అవతరించింది.2017 సీజన్ తరహాలోనే ఆరు వరస విజయాల సెంటిమెంట్ ఈ సీజన్లోనూ కలిసొస్తుందని ముంబై ఇండియన్స్ భావిస్తుంది. ఈసారి కూడా తాము టైటిల్ ఎగరేసుకుపోతామని ఆ జట్టు అభిమానులు ధీమాగా ఉన్నారు. ఈ సీజన్లో టైటిల్ గెలిస్తే ముంబై చరిత్ర సృష్టించినట్లవుతుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు ఏ జట్టు ఆరు టైటిళ్లు సాధించలేదు. ముంబై, సీఎస్కే సంయుక్తంగా ఐదు టైటిళ్లు సాధించాయి.ఈ సీజన్లో ముంబై తదుపరి టార్గెట్ అన్ని మ్యాచ్‌లు పూర్తయ్యే సరికి టేబుల్ టాపర్‌గా నిలవడం. ఈ సీజన్లో ముంబై ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మే 6న గుజరాత్, మే 11న పంజాబ్, మే 15న ఢిల్లీతో తలపడాల్సి ఉంది.

ఢిల్లీలో వర్ష బీభత్సం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం సృష్టించిన వర్షం బీభత్సంలో కుటుంబంలో నలుగురు మృతి చెందారు. వర్ష కారణంగా ద్వారాకాలో ఓ ఇంటిపై చెల్లి కూలింది. ఈ దుర్ఘటనలో తల్లి, ఆమె ముగ్గురు పిల్లలు మరణించారు. శుక్రవారం తెల్లవారు జామున ఢిల్లీ వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకున్నాయి. దుమ్ముతో పాటు భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ సైతం ఢిల్లీలో రెడ్ జోన్ ప్రకటించింది. భారీ వర్షం కారణంగా ఏర్పడిన ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వర్షం దెబ్బకు విమానాల సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు ఆయా విమానయాన సంస్థలు అధికారికంగా ప్రకటించాయి. Severe thunderstorms and rain lash Delhi and NCR.IMD forecasts heavy rainfall, thunderstorms, and gusty winds for the next two days, issuing a yellow alert for the national capital.#Rain #IMD #DelhiRains #rainfall #thunderstorms #Weather pic.twitter.com/fiZb2DPJJS— All India Radio News (@airnewsalerts) May 2, 2025 ఎయిర్ పోర్టుకు వెళ్లే ముందు ప్రయాణికులు తమ విమానాల రాకపోకల్ని పరిశీలించాలని ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రయాణికుల్ని కోరింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది #TravelAdvisoryThunderstorms and gusty winds have affected flight operations in parts of Northern India. Some of our flights to and from Delhi are being delayed, which is likely to impact our overall flight schedule. We are doing our best to minimise disruptions.We advise our…— Air India (@airindia) May 2, 2025‘ఢిల్లీకి వెళ్లే, బయల్దేరే ఎయిరిండియా విమానాల సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. ఢిల్లీలో దుమ్ము తుఫాను, వర్షం కారణంగా విమానాల్ని దారి మళ్లిస్తున్నాం. ఫలితంగా మొత్తం విమానాల రాకపోకలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. అంతరాయాలను తగ్గించడానికి మా వంతు మేం కృషి చేస్తున్నాం’ అంటూ ఎయిరిండియా ట్వీట్లో పేర్కొంది.

ఆ యాక్సిడెంట్ నా జీవితంలో పెద్ద గిఫ్ట్ : అల్లు అర్జున్
ప్రమాదం జరిగితే కష్టం, నష్టమే. కానీ, అనుకోకుండా కొన్ని ప్రమాదాలు మంచి కూడా చేస్తాయి. ప్రముఖ హీరో అల్లు అర్జున్(Allu Arjun) స్వయంగా ఈ మాట అంటున్నారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్న ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)(WAVES 2025)లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ– ‘‘కెరీర్ తొలి రోజుల్లో నా దృష్టి అంతా ఫిజికల్ ఫిట్నెస్, ఎజిలిటీ మీదే ఉండేది. కానీ, జీవితంలో ఒక ఘటన నా ఆలోచననే మార్చేసింది. నా పదో సినిమా తర్వాత నా భుజానికి దెబ్బ తగిలి, ఆస్ట్రేలియాలో సర్జరీ చేయించుకున్నా. అంతా బాగైపోయి, నాలుగో వారం నుంచి సెట్స్ మీదకు వెళ్ళిపోవచ్చనుకున్నా. డాక్టర్లు 6 నెలలు రెస్ట్ తప్పనిసరి అన్నారు. నాకు కొత్తగా పెళ్ళయింది. ఓ సినిమా సగంలో ఉంది. అప్పటి దాకా ఫిజికల్ ఫిట్‌నెస్‌కే ప్రాధాన్యం ఇస్తూ వచ్చిన నాకు ఒక్కసారిగా జ్ఞానోదయం అయింది.వయసు పెరిగే కొద్దీ ఫిట్నెస్, ఎజిలిటీ తగ్గుతాయి. కానీ, నటనపై దృష్టి పెడితే అది చిరకాలం మిగిలిపోతుందని గ్రహించా. అక్కడి నుంచి నా ఆలోచనే మారిపోయింది’’ అని వివరించారు. ఇంకా మాట్లాడుతూ – ‘‘పదో సినిమా దగ్గర మొదలైన ఆ ఆలోచన ఇరవయ్యో సినిమా ‘పుష్ప–1’ దగ్గరకు వచ్చేసరి కల్లా నన్ను జాతీయ ఉత్తమ నటుడిగా, అందులోనూ తెలుగు సినీరంగం నుంచి ఆ ఘనత అందుకున్న తొట్ట తొలి నటుడిగా నిలిపింది. పదో సినిమా సమయంలో ఆ యాక్సిడెంట్ జరగకపోతే... నా దృక్పథం ఇలా మారేది కాదు.అందుకే, కొన్ని యాక్సిడెంట్లు అనుకోకుండా మన మంచికే జరుగుతాయి. మొత్తం నా ఆలోచనలు, కెరీర్‌నే మార్చేసిన ఆ యాక్సిడెంట్ నా జీవితంలో పెద్ద గిఫ్ట్’’ అని అల్లు అర్జున్ వివరించారు. ‘సాక్షి’ ఆయనను పలకరించినప్పుడు ‘‘మెడిసిన్, టెక్నాలజీ లాంటి అనేక రంగాలలో చాలా కాలంగా జరుగుతున్న సమ్మిట్లు చూసి, అలాంటివి మన సినీ, వినోద రంగంలో కూడా జరగాలనుకున్నాను. ప్రధాని మోదీ చొరవతో తొలిసారిగా వేవ్స్ సదస్సు జరగడం శుభారంభం’’ అన్నారు.

పెద్దారెడ్డిపై దాడికి కుట్ర.. రాళ్లను సిద్ధం చేసిన జేసీ వర్గీయులు
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుట్రకు తెరతీశారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రికి వెళ్లనున్న తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై రాళ్ల దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. జేసీ వర్గీయులు పెద్దారెడ్డి ఇంటికి సమీపంలో రాళ్లను సిద్ధం చేసి ఉంచారు. పెద్దారెడ్డిపై రాళ్ల దాడి చేసేందుకు ఇది పెద్ద కుట్రగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట.. జేసీకి షాక్మరోవైపు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టులో ఊరట లభించింది. తాడిపత్రి వెళ్లేందుకు పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర హోం శాఖ, డీజీపీ, అనంతపురం ఎస్పీలకు కోర్టు ఆదేశాలు గత 10 మాసాలుగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రానివ్వడం లేదని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి.. హైకోర్టు దృష్టి కి తీసుకెళ్లారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లొచ్చు.. ప్రజలను కలుసుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో తాడిపత్రిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోం శాఖ, డీజీపీ, అనంతపురం ఎస్పీలను కోర్టు ఆదేశించింది. అలాగే, పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లే క్రమంలో ఐదు వాహనాలకు మించి వెళితే పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించింది. ఇక, హైకోర్టు ఆదేశాలతో త్వరలోనే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లనున్నారు.

ఏపీలో భారీ వర్షం.. ఈ జిల్లాల ప్రజలకు విపత్తుల శాఖ హెచ్చరిక
సాక్షి, ప్రకాశం: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. కర్ణాటక నుంచి రాజస్థాన్ వరకూ.. ఒక బలమైన ద్రోణి ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై కూడా కనిపిస్తోంది. ఈ కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తాజాగా శుక్రవారం తెల్లవారుజాము నుంచి ప్రకాశం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలివాన కారణంగా పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెం దగ్గర రోడ్డుపై భారీ వృక్షం విరిగిపడింది. రోడ్డుపై చెట్టు పడటంతో భారీగా ట్రాఫిక్ స్తంభించి పోయింది. దీంతో, పిడుగురాళ్ల -సత్తెనపల్లి మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రెండు గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు.. చెట్టు తొలగించి రాకపోకలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నారు.రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగనున్నట్లు , శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు, pic.twitter.com/0sPdSsATQK— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 1, 2025మరోవైపు.. ప్రకాశం జిల్లాలో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తోంది. కనిగిరిలో ఈదురుగాలితో కూడిన భారీ వర్షం పడుతోంది. ఇక, అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు.. వాతావరణ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీ, తెలంగాణలో మరో ఏడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడతాయి. అలాగే.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడే అవకాశం ఉంది. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కోసారి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల శాఖ హెచ్చరించింది. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదన్నారు. బలమైన ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది.ఐఎండీ ప్రకారం నేడు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటూ.. కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రలో కొంత భాగం కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. బంగాళాఖాతం నుంచి ఏపీలోకి గాలులు బలంగా వస్తున్నాయి. ఈ రోజంతా ఈ పరిస్థితి ఉంటుంది. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో సైతం భారీ వర్షం కురుస్తోంది. దీంతో, రోడ్లన్నీ జలమయమయ్యాయి.

పుణ్యక్షేత్రాల్లో భద్రత వైఫల్యాలు.. అమిత్ షాకు ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమైన దేవాలయాల్లో భద్రత వైపల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి తెలిపారు. ఏపీలోని పుణ్యక్షేత్రాల్లో పరిపాలనా లోపాలు, భద్రతా వైఫల్యాల వల్ల తరచూ జరుగుతున్న దుర్ఘటనలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు గురువారం లేఖ రాసినట్లు ఎంపీ వెల్లడించారు.ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి.. ‘విశాఖపట్నం జిల్లా సింహాచలం దేవాలయంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. గోడ నిర్మాణంలో సరైన ఇంజనీరింగ్ పద్ధతులు పాటించకపోవడం, నాణ్యత లేని మెటీరియల్ ఉపయోగించడమే ఈ దుర్ఘటనకు కారణం. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీ కూర్మనాథ స్వామి ఆలయంలో భక్తులు పవిత్రంగా భావించే అరుదైన నక్షత్ర తాబేళ్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాయి. పోస్టుమార్టం చేయకుండానే వాటిని దహనం చేశారు.తిరుమలలో భద్రతా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. జనవరి 8న తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టికెట్ కౌంటర్ల క్యూ లైన్లలో తొక్కిసలాటి జరిగి భక్తులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత కూడా టీటీడీ పరిపాలనలో ఎలాంటి మార్పు రాలేదు. ఇటీవల మూడంచెల భద్రత వ్యవస్థను దాటి కొంతమంది భక్తులు పాదరక్షలతో తిరుమల శ్రీవారి ఆలయ సింహద్వారం వరకు వెళ్లారు. టీటీడీ గోశాలలో 100కు పైగా గోవులు మరణించాయి. గోశాల నిర్వహణలో నిర్లక్ష్యం, నాణ్యతలేని దాణా అందించడం, వైద్యసేవల లోపం వల్లే ఈ దారుణం జరిగింది.’ అని లేఖలో పేర్కొన్నారు.

కాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు 20 వేల కొలువులు
అమెరికన్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ ఈ ఏడాది సుమారు 20,000 మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకునే యోచనలో ఉంది. ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, మేనేజ్డ్ సర్వీసెస్ విభాగాల్లో ఈ కొలువులు ఉండనున్నాయి. ప్రస్తుతం కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,36,300గా ఉంది.‘ఇన్వెస్టర్ డే సందర్భంగా చెప్పినట్లు మా వ్యూహంలో భాగంగా 20,000 మంది ఫ్రెషర్లను తీసుకోబోతున్నాం. గతేడాదితో పోలిస్తే ఇది రెట్టింపు‘ అని కంపెనీ సీఈవో ఎస్ రవి కుమార్ తెలిపారు. ఫ్రెషర్లను తీసుకోవడం, ఏఐ ద్వారా ఉత్పాదకతను పెంచుకోవడం, మానవ వనరుల వ్యయాలను తగ్గించుకునేలా సామర్థ్యాల వినియోగాన్ని మెరుగుపర్చుకోవడం వంటి మూడు అంశాలపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు.ఈ ఏడాది జనవరి–మార్చ్ త్రైమాసికంలో కాగ్నిజెంట్ ఆదాయం సుమారు 7 శాతం పెరిగి 5.1 బిలియన్ డాలర్లకు చేరింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో టాప్ ఐదు ఐటీ కంపెనీలు మొత్తంగా 80 వేల నుంచి 84 మందిని కొత్తగా నియమించుకోనున్నట్లు సంకేతాలిచ్చాయి.

ఉద్రిక్తతలు ఆగిపోవాల్సిందే
న్యూయార్క్/వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడం పట్ల అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇరు దేశాల మధ్య సాధ్యమైనంత త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన బుధవారం రాత్రి భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, పాకిస్తాన్ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్‌లతో వేర్వేరుగా ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలపై చర్చించారు. భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం ఎవరికీ మేలు చేయదని అన్నారు.ఘర్షణ వాతావరణం సమసిపోయేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్.జైశంకర్‌తో మార్కో రూబియో మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మరణించడం పట్ల తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఉగ్రవాదంపై జరిగే పోరాటంలో భారత్‌కు తమ సహకారం ఉంటుందని పునరుద్ఘాటించారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదం అంతం కావాలని చెప్పారు. ఉద్రిక్తతలు తగ్గించుకొనే విషయంలో భారత్, పాక్ కలిసి పనిచేయాలని, పూర్తిస్థాయిలో సంయమనం పాటించాలని కోరారు. దక్షిణాసియాలో శాంతిభద్రతల పరిరక్షణకు చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎస్.జైశంకర్ స్పందిస్తూ.. పహల్గాంలో దాడికి పాల్పడిన ముష్కరులను, వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులను చట్టంముందు నిలబెట్టి, శిక్షించక తప్పదని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. భారత్‌కు పాక్ సహకరించాలి పహల్గాం ఉగ్రదాడిపై జరుగుతున్న దర్యాప్తుకు పాకిస్తాన్ ప్రభుత్వం సహకరించాల్సిందేనని మార్కో రూబియో తేల్చిచెప్పారు. ఆయన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో మాట్లాడుతూ ఈ సంగతి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇండియాతో నేరుగా సంప్రదింపులు జరుపుతూ ఉద్రిక్తతలు సడలిపోయేలా చర్యలు చేపట్టాలని హితవు పలికారు. పహల్గాంలో 26 మందిని పొట్టనపెట్టుకున్న ముష్కరులకు సరైన శిక్ష పడేలా భారత్‌కు సహకారం అందించాలని చెప్పారు. పాకిస్తాన్ నుంచి నిర్మాణాత్మక చర్యలను కోరుకుంటున్నామని రూబియో వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి పట్ల తమ వైఖరిని షెహబాజ్ షరీఫ్ అమెరికా విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.ఉగ్రవాదంపై పోరాటానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. పాకిస్తాన్ సైతం ఉగ్రవాద బాధిత దేశమేనని, 90 వేల మందికిపైగా ప్రజలు ఉగ్రదాడుల్లో మరణించారని తెలిపారు. ఉగ్రవాదం వల్ల తమకు 192 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తంచేశారు. పహల్గాం దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని మరోసారి వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడిపై పారదర్శకంగా దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు. ఉద్రిక్తతలు పెంచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఇండియాను కట్టడి చేయాలని రూబియోను కోరారు. సింధూనది జలాల ఒప్పందాన్ని ఇండియా నిలిపివేయడాన్ని షెహబాజ్ షరీఫ్ తప్పుపట్టారు. ఒప్పందాన్ని ఏకపక్షంగా నిలిపివేయడం చెల్లదని అన్నారు. భారత్ హక్కుకు మద్దతిస్తున్నాంతమను తాము రక్షించుకొనే హక్కు భారత్‌కు ఉందని, ఆ హక్కుకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు తమ సహకారం కచ్చితంగా ఉంటుందన్నారు. ఆయన గురువారం భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడారు. ధూర్త దేశమైన పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని తాము ఎంతమాత్రం సహించడం లేదని హెగ్సెత్ బదులిచ్చారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించినవారికి సంతాపం ప్రకటించారు.
ప్రభాస్ సినిమాపై పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ట్రెంట్ బౌల్ట్ ట్రిపుల్ సెంచరీ
పేరెంట్స్ 'నో' చెప్పడం నేర్చుకోవాలి..! హెచ్చరిస్తున్న నిపుణులు
భళా వైభవ్...వైకల్యానికి ‘చెక్’ పెట్టాడు!
తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. ప్రతాప్ కారణమా?
నటి రెజీనా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! రెండు వారాలకోసారి కలబంద గుజ్జు..
తెలంగాణ గొర్రెల స్కాంలో కీలక పరిణామం
గ్రీన్‌లో కదలాడుతున్న సూచీలు
RR VS MI: కంటిపై 7 కుట్లు పడినా అదిరిపోయే ప్రదర్శన చేసిన హార్దిక్
పెళ్లింట విషాదం.. మిన్నంటిన కుటుంబ సభ్యుల ఆవేదన
ఢిల్లీలో వర్ష బీభత్సం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి 'మెగా' గుడ్‌న్యూస్..?
పెద్దారెడ్డిపై దాడికి కుట్ర.. రాళ్లను సిద్ధం చేసిన జేసీ వర్గీయులు
'క' చిత్రానికి దక్కిన 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డ్
అతడు రీ-రిలీజ్.. ఈ టెక్నాలజీతో ఏకైక సినిమాగా రికార్డ్
Air India: పాక్ గగనతలంపై ఆంక్షలు.. ఎయిరిండియాకు వేల కోట్ల నష్టం
కాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు 20 వేల కొలువులు
హారతి ఇస్తుండగా మంటలు అంటుకుని.. కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ మృతి
భారత్ వీడే పాక్ పౌరులకు మరింత గడువు
గోడ చాటున గుట్టు!
క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు
ముంబై ‘సిక్సర్’ రాజస్తాన్ ‘అవుట్’
ఉద్రిక్తతలు ఆగిపోవాల్సిందే
ఉగ్రవాదంపై పోరులో ఏకమైన దేశం
‘మన టాలెంట్ పోతోంది’.. సీఈవో వార్నింగ్
ఏపీలో భారీ వర్షం.. ఈ జిల్లాల ప్రజలకు విపత్తుల శాఖ హెచ్చరిక
పెళ్లి నగలు స్త్రీ ధనమే
దేశమంతా పైపైకి.. ఏపీలో నేలచూపులు
నేడు అమరావతికి ప్రధాని మోదీ
కంచం లాగేశారు! : వైఎస్ జగన్
రిజిస్ట్రార్ జనరల్ నుంచే నేరుగా తాజా జాబితా
రూ.5,830 కోట్ల ప్రాజెక్ట్‌ను నిలిపేసిన జోహో
పుణ్యక్షేత్రాల్లో భద్రత వైఫల్యాలు.. అమిత్ షాకు ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు
హెడ్లైన్ సరే.. డెడ్‌లైన్ ఏదీ: జైరాం రమేశ్
అమరావతి పేరిట బాబు భూదందా
ఈ రాశి వారికి అందరిలోనూ గౌరవం.. అప్రయత్న కార్యసిద్ధి
రాక్షస రాజ్యం
ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు
జోరుగా హుషారుగా...
ఏడాదిలోగా చేయాలి: సీఎం రేవంత్
గ్రీన్‌లో కదలాడుతున్న సూచీలు
ఆ యాక్సిడెంట్ నా జీవితంలో పెద్ద గిఫ్ట్ : అల్లు అర్జున్
ఇలాంటి పనులు చేయకండి.. ఫ్యాన్స్‌కు విజయ్ సూచన
తెలంగాణలో చేసింది కుల సర్వేనే
రేపు కట్టబోయే అమరావతిలో కూడా గోడలుంటాయిగా..!
పింఛను కట్..
టార్గెట్ 5 లక్షలు
బదిలీ అయినా కదలరు
పట్టుతప్పిన పౌర సేవలు
మెట్రో బాదుడే!
ఆడుతూ పాడుతూ మార్కులు
వినోద రంగం@ 100 బిలియన్ డాలర్లు
ఆ‘లైన్’ ఎక్కడుందో మనవాళ్లకు కనపడటం లేదట..!
IPL 2025: ముంబై డబుల్ హ్యాట్రిక్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి రాజస్థాన్ ఔట్
గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య
పక్షుల కేంద్రం చెరువులో నీటిని నింపాలి
నరికిన చెట్ల కలప సంగతేంటి.?
RR VS MI: కంటిపై 7 కుట్లు పడినా అదిరిపోయే ప్రదర్శన చేసిన హార్దిక్
మూగ వేదన.. అరణ్య రోదన!
తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్
ఆర్థిక అనారోగ్యం ఏడాదిలో నయమవుతుంది
రేపటి నుంచి గ్రూప్–1 మెయిన్
‘మద్దతు ధర’ ఎక్కడ బాబూ?
సవాళ్ల మధ్య హైదరాబాద్ 'ఐటీ'
అయోమయం.. ఆగమాగం
గొంతెండిపోతోంది!
లార్డ్స్‌లో మరో ఫైనల్
మ్యాచ్ రిఫరీ అంటే ఆషామాషీ కాదు!
చివరకు కులగణన వైపే మొగ్గు
ఎవరినీ వదిలిపెట్టం!
నష్టాలివీ..
అదానీ పోర్ట్స్ లాభం జూమ్
జీఎస్టీ వసూళ్లు.. కొత్త రికార్డు
ఆటో.. అటూ ఇటూ!
‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయాలి
బంగారం డోర్ డెలివరీ.. సెక్యూరిటీ చూశారా?
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.6 లక్షల విరాళం
పారిశుద్ధ్యంపై శ్రద్ధ తప్పనిసరి
26న జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్
పరువు కోసం చంద్రబాబు సర్కార్ పాట్లు
ట్రెంట్ బౌల్ట్ ట్రిపుల్ సెంచరీ
నటి రెజీనా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! రెండు వారాలకోసారి కలబంద గుజ్జు..
తెలంగాణ గొర్రెల స్కాంలో కీలక పరిణామం
పెళ్లింట విషాదం.. మిన్నంటిన కుటుంబ సభ్యుల ఆవేదన
మేలో లాంచ్ అయ్యే టాప్ 5 స్మార్ట్ఫోన్లు
సివిల్స్ విజేతలు అక్కడ సైన్స్.. ఇక్కడ ఆర్ట్స్..
నిజామాబాద్ మార్కెట్‌కు భారీగా పసుపు
సెమీకండక్టర్.. అవకాశాల సెక్టార్!
త్వరలో కృష్ణా ట్రిబ్యునల్–2 అమల్లోకి..?
‘ఖేల్‌రత్న’ అందుకున్న సాత్విక్–చిరాగ్
ఇంట్లోకి చొరబడండి!
హిట్ 3తో ప్రేక్షకులు మళ్లీ ఎనర్జీ ఇచ్చారు: నిర్మాత ‘దిల్’ రాజు
భారత్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మారుతోంది
చైన్నె సరిహద్దు రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం
మార్గదర్శకాలు రావాల్సి ఉంది
కుల గణనపై ఫలించిన రాహుల్‌గాంధీ పోరాటం
జిల్లాలో మండలాల వారీగా ఫలితాలు
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి
సీనియర్ సిటిజన్ల అపూర్వ సమ్మేళనం
కొంపముంచింది
5న వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
నవతరానికి మేల్కొలుపు
నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు వేగవంతం
క్రీడలతోనే ఆరోగ్యం పదిలం
పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
అటు కళ్యాణ శోభ... ఇటు బ్రహ్మోత్సవ ప్రభ
ఎనిమిది మందికి కారుణ్య నియామకాలు
కార్మికుల గురించి ఆలోచించే పార్టీ వైఎస్సార్ సీపీ
ప్రభాస్ సినిమాపై పుకార్లు.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ట్రెంట్ బౌల్ట్ ట్రిపుల్ సెంచరీ
పేరెంట్స్ 'నో' చెప్పడం నేర్చుకోవాలి..! హెచ్చరిస్తున్న నిపుణులు
భళా వైభవ్...వైకల్యానికి ‘చెక్’ పెట్టాడు!
తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. ప్రతాప్ కారణమా?
నటి రెజీనా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! రెండు వారాలకోసారి కలబంద గుజ్జు..
తెలంగాణ గొర్రెల స్కాంలో కీలక పరిణామం
గ్రీన్‌లో కదలాడుతున్న సూచీలు
RR VS MI: కంటిపై 7 కుట్లు పడినా అదిరిపోయే ప్రదర్శన చేసిన హార్దిక్
పెళ్లింట విషాదం.. మిన్నంటిన కుటుంబ సభ్యుల ఆవేదన
ఢిల్లీలో వర్ష బీభత్సం.. తల్లి, ముగ్గురు పిల్లలు మృతి
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి 'మెగా' గుడ్‌న్యూస్..?
పెద్దారెడ్డిపై దాడికి కుట్ర.. రాళ్లను సిద్ధం చేసిన జేసీ వర్గీయులు
'క' చిత్రానికి దక్కిన 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డ్
అతడు రీ-రిలీజ్.. ఈ టెక్నాలజీతో ఏకైక సినిమాగా రికార్డ్
Air India: పాక్ గగనతలంపై ఆంక్షలు.. ఎయిరిండియాకు వేల కోట్ల నష్టం
కాగ్నిజెంట్‌లో ఫ్రెషర్లకు 20 వేల కొలువులు
హారతి ఇస్తుండగా మంటలు అంటుకుని.. కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ మృతి
భారత్ వీడే పాక్ పౌరులకు మరింత గడువు
గోడ చాటున గుట్టు!
క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు
ముంబై ‘సిక్సర్’ రాజస్తాన్ ‘అవుట్’
ఉద్రిక్తతలు ఆగిపోవాల్సిందే
ఉగ్రవాదంపై పోరులో ఏకమైన దేశం
‘మన టాలెంట్ పోతోంది’.. సీఈవో వార్నింగ్
ఏపీలో భారీ వర్షం.. ఈ జిల్లాల ప్రజలకు విపత్తుల శాఖ హెచ్చరిక
పెళ్లి నగలు స్త్రీ ధనమే
దేశమంతా పైపైకి.. ఏపీలో నేలచూపులు
నేడు అమరావతికి ప్రధాని మోదీ
కంచం లాగేశారు! : వైఎస్ జగన్
రిజిస్ట్రార్ జనరల్ నుంచే నేరుగా తాజా జాబితా
రూ.5,830 కోట్ల ప్రాజెక్ట్‌ను నిలిపేసిన జోహో
పుణ్యక్షేత్రాల్లో భద్రత వైఫల్యాలు.. అమిత్ షాకు ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు
హెడ్లైన్ సరే.. డెడ్‌లైన్ ఏదీ: జైరాం రమేశ్
అమరావతి పేరిట బాబు భూదందా
ఈ రాశి వారికి అందరిలోనూ గౌరవం.. అప్రయత్న కార్యసిద్ధి
రాక్షస రాజ్యం
ఇజ్రాయెల్‌లో భారీ కార్చిచ్చు
జోరుగా హుషారుగా...
ఏడాదిలోగా చేయాలి: సీఎం రేవంత్
గ్రీన్‌లో కదలాడుతున్న సూచీలు
ఆ యాక్సిడెంట్ నా జీవితంలో పెద్ద గిఫ్ట్ : అల్లు అర్జున్
ఇలాంటి పనులు చేయకండి.. ఫ్యాన్స్‌కు విజయ్ సూచన
తెలంగాణలో చేసింది కుల సర్వేనే
రేపు కట్టబోయే అమరావతిలో కూడా గోడలుంటాయిగా..!
పింఛను కట్..
టార్గెట్ 5 లక్షలు
బదిలీ అయినా కదలరు
పట్టుతప్పిన పౌర సేవలు
మెట్రో బాదుడే!
ఆడుతూ పాడుతూ మార్కులు
వినోద రంగం@ 100 బిలియన్ డాలర్లు
ఆ‘లైన్’ ఎక్కడుందో మనవాళ్లకు కనపడటం లేదట..!
IPL 2025: ముంబై డబుల్ హ్యాట్రిక్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి రాజస్థాన్ ఔట్
గోదావరిలో దూకి యువకుడి ఆత్మహత్య
పక్షుల కేంద్రం చెరువులో నీటిని నింపాలి
నరికిన చెట్ల కలప సంగతేంటి.?
RR VS MI: కంటిపై 7 కుట్లు పడినా అదిరిపోయే ప్రదర్శన చేసిన హార్దిక్
మూగ వేదన.. అరణ్య రోదన!
తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్
ఆర్థిక అనారోగ్యం ఏడాదిలో నయమవుతుంది
రేపటి నుంచి గ్రూప్–1 మెయిన్
‘మద్దతు ధర’ ఎక్కడ బాబూ?
సవాళ్ల మధ్య హైదరాబాద్ 'ఐటీ'
అయోమయం.. ఆగమాగం
గొంతెండిపోతోంది!
లార్డ్స్‌లో మరో ఫైనల్
మ్యాచ్ రిఫరీ అంటే ఆషామాషీ కాదు!
చివరకు కులగణన వైపే మొగ్గు
ఎవరినీ వదిలిపెట్టం!
నష్టాలివీ..
అదానీ పోర్ట్స్ లాభం జూమ్
జీఎస్టీ వసూళ్లు.. కొత్త రికార్డు
ఆటో.. అటూ ఇటూ!
‘ఆపరేషన్ కగార్’ను నిలిపివేయాలి
బంగారం డోర్ డెలివరీ.. సెక్యూరిటీ చూశారా?
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.6 లక్షల విరాళం
పారిశుద్ధ్యంపై శ్రద్ధ తప్పనిసరి
26న జిల్లా ఓపెన్ చెస్ టోర్నమెంట్
పరువు కోసం చంద్రబాబు సర్కార్ పాట్లు
ట్రెంట్ బౌల్ట్ ట్రిపుల్ సెంచరీ
నటి రెజీనా ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..! రెండు వారాలకోసారి కలబంద గుజ్జు..
తెలంగాణ గొర్రెల స్కాంలో కీలక పరిణామం
పెళ్లింట విషాదం.. మిన్నంటిన కుటుంబ సభ్యుల ఆవేదన
మేలో లాంచ్ అయ్యే టాప్ 5 స్మార్ట్ఫోన్లు
సివిల్స్ విజేతలు అక్కడ సైన్స్.. ఇక్కడ ఆర్ట్స్..
నిజామాబాద్ మార్కెట్‌కు భారీగా పసుపు
సెమీకండక్టర్.. అవకాశాల సెక్టార్!
త్వరలో కృష్ణా ట్రిబ్యునల్–2 అమల్లోకి..?
‘ఖేల్‌రత్న’ అందుకున్న సాత్విక్–చిరాగ్
ఇంట్లోకి చొరబడండి!
హిట్ 3తో ప్రేక్షకులు మళ్లీ ఎనర్జీ ఇచ్చారు: నిర్మాత ‘దిల్’ రాజు
భారత్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మారుతోంది
చైన్నె సరిహద్దు రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహం
మార్గదర్శకాలు రావాల్సి ఉంది
కుల గణనపై ఫలించిన రాహుల్‌గాంధీ పోరాటం
జిల్లాలో మండలాల వారీగా ఫలితాలు
కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపండి
సీనియర్ సిటిజన్ల అపూర్వ సమ్మేళనం
కొంపముంచింది
5న వైఎస్సార్సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం
నవతరానికి మేల్కొలుపు
నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు వేగవంతం
క్రీడలతోనే ఆరోగ్యం పదిలం
పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
అటు కళ్యాణ శోభ... ఇటు బ్రహ్మోత్సవ ప్రభ
ఎనిమిది మందికి కారుణ్య నియామకాలు
కార్మికుల గురించి ఆలోచించే పార్టీ వైఎస్సార్ సీపీ
సినిమా

జోరుగా హుషారుగా...
సమ్మర్ హాలిడేస్ లేవా గురూ అని ఏ సినిమా సెలబ్రిటీని అడిగినా... వేసవి సెలవుల్లో ప్రేక్షకులకు థియేటర్లలో వినోదం ఇవ్వాలంటే మేం హాలిడేస్ తీసుకోకూడదు గురూ అంటారు. ఎండలు మండిపోతున్నాయి కదా అంటే... నో ప్రాబ్లమ్ అంటారు. ప్రస్తుతం భాగ్యనగరంలో ఎండలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలిసిందే. ఎంచక్కా హాలిడే తీసుకుని కూల్ కూల్‌గా ఉండే విదేశాలు చుట్టి రావొచ్చు. కానీ... మండే ఎండలను లెక్క చేయకుండా హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు కొందరు హీరోలు. ఆ స్టార్స్ చేస్తున్న సినిమాల విశేషాలు తెలుసుకుందాం.జన్వాడలో ఆటా పాటా హీరో మహేశ్‌బాబు ఆడిపాడుతున్నారట. అది కూడా ఓ భారీ సెట్లో. ఎందుకంటే ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా కోసమే. మహేశ్‌బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు పోడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ ఆయ్యారు. ఆయన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అమేజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం హైదరాబాద్ సమీపంలోని జన్వాడలో దాదాపు 550 మందితో ప్రత్యేకంగా సెట్ వేశారు మేకర్స్. ఈ సెట్లో మహేశ్‌బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ఓ భారీ పాటని చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. ఇప్పటికే తొలి షెడ్యూల్‌ని హైదరాబాద్ ల్యూమినియం ఫ్యాక్టరీలో, రెండో షెడ్యూల్‌ని ఒడిశాలోని కోరాపుట్‌లో పూర్తి చేశారు. తాజాగా జన్వాడలో వేసిన ప్రత్యేకమైన సెట్లో మూడవ షెడ్యూల్లో భాగంగా పాట చిత్రీకరణని గ్రాండ్‌గా జరుపుతున్నారట. ఈ సెట్స్, ఈ సాంగ్ సినిమాలో ఓ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్. ఈ పాట షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని సమాచారం. మహేశ్ బాబు–రాజమౌళి వంటి క్రేజీ కాంబినేషలో రూపొందుతోన్న ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.ముచ్చింతల్‌లో జాతర హీరో రవితేజ జాతరలో సందడి చేస్తున్నారు. సందడంటే మామాలు సందడి కాదు... ఓ రేంజ్లో భారీగా అన్నమాట. మరి... ఆయన సందడి ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే ‘మాస్ జాతర’ సినిమా విడుదల వరకూ వేచి చూడాలి. రవితేజ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. ‘సామజ వరగమన’ మూవీ ఫేమ్ భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భారీ పీరియాడికల్ స్టోరీతో అరకు అటవీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగనుందని టాక్.ఇటీవల అరకులో ఓ షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్ తాజాగా హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద ఉన్న ముచ్చింతల్‌లో చిత్రీకరణ జరపుకుంటోంది. శరవేగంగా సాగుతోన్న ఈ చిత్రీకరణలో రవితేజతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటుండగా ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట భాను భోగవరపు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ‘సామజవరగమన’ లాంటి హిట్ సినిమా తర్వాత భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండటం, ‘ధమాకా’ సినిమాతో హిట్ పెయిర్‌గా నిలిచిన రవితేజ, శ్రీలీల రెండోసారి కలిసి నటిస్తుండటం, ‘ధమాకా’ సినిమాకి సూపర్ హిట్ సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో–రవితేజ కాంబో రిపీట్ అవుతుండటంతో ‘మాస్ ధమాకా’పై భారీ అంచనాలున్నాయి. గుహల్లో పరిశోధన హీరో నాగచైతన్య గుహలు, అడవులు, గుట్టలు, కొండలు వంటి ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి పరిశోధన చేస్తున్నారు. జనరల్‌గా పురావస్తు శాఖ అధికారులు పరిశోధన జరుపుతుంటారు. మరి... నాగచైతన్య ఎందుకు పరిశోధన చేస్తున్నారు? అంటే ఆయన నటిస్తున్న తాజా సినిమా కోసం అన్నమాట. ‘తండేల్’ మూవీ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు నాగ చైతన్య. సాయిదుర్గా తేజ్‌తో ‘విరూపాక్ష’ (2023) మూవీ తీసి, బ్లాక్‌బస్టర్ అందుకున్నారు డైరెక్టర్ కార్తీక్ దండు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ మిథికల్ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది.‘ఎన్సీ 24’ అనే వర్కింగ్ టైటిల్లో సినిమాని బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో (ఏడెకరాలు) జరుగుతోంది. మిస్టిక్ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ కోసం గుహలు, అడవులు, గుట్టలు, కొండలు వంటి ప్రత్యేకమైన సెట్స్ వేశారని టాక్. ఈ చిత్రంలో నాగచైతన్య సరికొత్త లుక్‌తో కనిపిస్తారని ఇటీవల విడుదలైన స్పెషల్ వీడియో గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఆయన కొత్తగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు కూడా. ఈ సినిమా నాగచైతన్య కెరీర్లో ఓ మైలురాయిలా ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించింది. సెట్లో స్పెషల్ సాంగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆడి పాడుతున్నారు హీరో వరుణ్ తేజ్. అది కూడా ప్రత్యేకమైన పాట కోసం. ఈ ఆటా పాటా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్) కోసమే. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రితికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై ‘వీటీ 15’ రూపొందుతోంది.ఇండో కొరియన్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సమీపంలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడ వేసిన ఓ సెట్లో ప్రత్యేక పాటని చిత్రీకరిస్తున్నారట మేకర్స్. ఈ పాటలో వరుణ్ తేజ్‌తో కలిసి ‘జాంబి రెడ్డి, బంగార్రాజు’ చిత్రాల ఫేమ్ దక్షా నగార్కర్ నటిస్తున్నారని సమాచారం. అంతేకాదు.. ఈ పాటలోని కొన్ని సన్నివేశాలను హైదరాబాద్‌లోని కోకాపేట సమీపంలో చిరంజీవి–రామ్‌చరణ్ నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా షూటింగ్ కోసం వేసిన ఓ ప్రత్యేకమైన సెట్లోనూ చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట మేకర్స్.ముచ్చింతల్‌లో లెనిన్ అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్ ’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్ర దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద ఉన్న ముచ్చింతల్‌లో జరుగుతోంది. శరవేగంగా సాగుతోన్న ఈ చిత్రీకరణలో హీరో, హీరోయిన్లతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా కోసం పోడవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్‌లోకి మారిపోయారు అఖిల్. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ‘లెనిన్ ’ టైటిల్ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘గతాన్ని తరమడానికి పోతా... మా నాయన నాకో మాట సెప్పినాడు.. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా.. పేరు ఉండదు, అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు.. పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...’’ అంటూ రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘ఏజెంట్’ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ అనంతరం అఖిల్ నటిస్తున్న చిత్రం ‘లెనిన్’.తుక్కుగూడలో సంబరాలుహీరో సాయిదుర్గా తేజ్ తుక్కుగూడలో సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు? ఎంత గ్రాండ్‌గా చేశారు? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్ 25 వరకూ వేచి చూడాల్సిందే. 2023లో విడుదలైన ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్టైన్ మెంట్‌పై ‘హను–మాన్’ (2024) వంటి పాన్ ఇండి యన్ హిట్ అందుకున్న కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. ఇక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో లాంగ్ షెడ్యూల్ జరుపుతున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు) సెప్టెంబర్ 25న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. బాచుపల్లిలో తెలుసు కదా!‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని బాచుపల్లిలో జరుగుతోంది. ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్‌కి ఏ మాత్రం తగ్గకుండా వినోదాత్మకంగా, అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట నీరజ కోన. స్టైలిస్ట్‌గా తానేంటో నిరూపించుకున్న నీరజ దర్శకురాలిగా ఏ స్థాయి హిట్ అందుకుంటారో వేచి చూడాలి. శంషాబాద్‌లో సూపర్ యోధబాలనటుడిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న తేజ సజ్జా ‘జాంబి రెడ్డి’ (2021) సినిమాతో హీరోగా పరిచయమై, హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే తేజ సజ్జా హీరోగా నటించిన రెండో చిత్రం ‘హను–మాన్’. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అందుకుంది. ‘హను–మాన్’ వంటి హిట్ చిత్రం తర్వాత తేజ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో తేజ సూపర్ యోధగా కనిపించనున్నారు. ఇటీవల నేపాల్‌లో జరిగిన ఓ షెడ్యూల్లో తేజపై భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్‌లో జరుగుతోందట. తేజ సజ్జాతో పాటు సినిమాలోని ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట కార్తీక్ ఘట్టమనేని.పై చిత్రాలే కాదు.. మరికొన్ని సినిమాల షూటింగ్స్ కూడా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్

హిట్ 3తో ప్రేక్షకులు మళ్లీ ఎనర్జీ ఇచ్చారు: నిర్మాత ‘దిల్’ రాజు
‘‘ఏప్రిల్ నెలలో సరైన సినిమాలు లేక ఏపీ, తెలంగాణలో చాలా సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ చేయడం జరిగింది. ఇలాంటి సమయంలో మా ఆశలన్నీ ‘హిట్ 3’ సినిమాపైనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో మూడు రోజులు ముందుగానే ఆన్లైన్ బుకింగ్స్ చూసి, జనాలు థియేటర్స్‌కు వస్తున్నారని హ్యాపీ ఫీలయ్యాను. ‘హిట్ 3’ సినిమా విజయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకున్నట్లయింది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు.నాని హీరోగా నటించిన తాజా చిత్రం ‘హిట్3: ది థర్డ్ కేస్’.ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. గురువారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘నానీకి ఓవర్సీస్లో హయ్యెస్ట్ గ్రాసర్ ఫిల్మ్‌గా ‘దసరా’ ఉంది.ఈ సినిమాను ‘హిట్ 3’ క్రాస్ చేసింది. అలాగే తెలంగాణలో కూడా మేం ఇదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం’’ అని అన్నారు. ‘‘చాలా రిలీజ్లు చూశాను. కానీ ఈ రిలీజ్ వైబ్, సినిమా బుకింగ్స్ అదిరిపోయాయి. ‘హిట్ 3’ సక్సెస్ తెలుగు సినిమా సక్సెస్’’ అని నాని అన్నారు. ‘‘నానీగారి నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నాను’’ అని తెలిపారు శైలేష్ కొలను. కెమెరామేన్ షాన్ వర్గీస్ మాట్లాడారు.

భారత్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మారుతోంది
‘‘కంటెంట్ క్రియేటర్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. మనుషులను మనం రోబోలుగా మార్చకూడదు. వారిని మరింత సున్నితంగా తీర్చిదిద్దాలి. సంగీతం, నృత్యం, కళల ద్వారా మానవ సున్నితత్వాన్ని పెంపొందించవచ్చు. కంటెంట్ క్రియేటర్లనుప్రోత్సహిస్తాం. భారత్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మారుతోంది. అలాగే ఆరెంజ్ ఎకానమీకి (సృజనాత్మకత, సాంస్కృతిక అంశాల ఆధారంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్యవస్థ) దేశంలో నాంది పడింది. ఇది దేశ ఆర్థిక వృద్ధికి కీలకం. కంటెంట్, క్రియేటివిటీ, కల్చర్ అనేవి ఆరెంజ్ ఎకానమీకి మూడు స్తంభాలు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ (వేవ్స్)– 2025’ని గురువారం ప్రారంభించారు నరేంద్ర మోదీ. క్రియే టివ్ ఎకానమీ, ఎంటర్టైన్మెంట్, డిజిటల్ మీడియా ఇండస్ట్రీలను ప్రోత్సహించేందుకు ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ’ (ఐఐసీటీ)ని దాదాపు రూ. 400 కోట్లతో ముంబైలో స్థాపించనున్నట్లు ఈ సందర్భంగా కేంద్ర సమాచార–ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ‘వేవ్స్’లో ఆమిర్ ఖాన్, నాగార్జున, ఫర్హాన్ అక్తర్, నాగ చైతన్య– శోభిత ధూళిపాళ, రాజ్ కుమార్ రావు, కబీర్ బేడీ, అనుపమ్ ఖేర్, అనిల్ కపూర్, శ్రీలీల, పలువురు దక్షిణాది ఫిలిం చాంబర్ ప్రముఖులు పాల్గొన్నారు.‘కనెక్టింగ్ క్రియేటర్స్, కనెక్టింగ్ కంట్రీస్’ అనే థీమ్‌తో నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 100కి పైగా దేశాల నుంచి 10,000 మంది డెలిగేట్స్, 1,000 మంది క్రియేటర్స్, 300 కంపెనీలు, 350 స్టార్టప్ కంపెనీలు పాల్గొంటున్నాయి. ‘వేవ్స్’ సదస్సు ప్రారంభ సూచికగా ప్రముఖ సంగీతదర్శకుడు కీరవాణి సారథ్యంలో ప్రముఖ గాయనీమణులు చిత్ర, శ్రేయా ఘోషల్, మంగ్లీ, లిప్సిక బృందం పలు భారతీయ భాషల సమాహారమైన ప్రారంభ గీతాన్ని ఆలపించడం ఆహూతులను అలరించింది.ఈ వేదికపై ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ– ‘‘సృజనాత్మకతనుప్రోత్సహించాలనే ఉద్దేశంతో త్వరలోనే ‘వేవ్స్’ అవార్డులను కూడా ప్రతిష్ఠాత్మకంగా అందించనున్నాం. ఇప్పుడు క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్ సమయం. ప్రపంచం కొత్త కథల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో భారత కథలు గ్లోబల్ రీచ్‌ని సాధిస్తున్నాయి. భారత సినిమాలు 100కిపైగా దేశాల్లో నేరుగా విడుదలవుతున్నాయి. భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడంలో మన దేశ సినిమా రంగం విజయం సాధించింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ఆస్కార్ దక్కడమే అందుకు నిదర్శనం. రష్యాలో రాజ్ కపూర్ చిత్రాలు పాపులర్. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంటే సత్యజిత్ రే పేరు, ప్రతిష్ఠలు గుర్తొస్తాయి. ఆస్కార్ అనగానే ఏఆర్ రెహమాన్, రాజమౌళి (‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ప్రస్తావించి) గుర్తొస్తారు. ఇటీవల 50 దేశాల గాయకులు కలిసి ‘వైష్ణవ జనతో’ అనే గీతాన్ని ఆలపించారు. సృజనాత్మకత ఉన్న యువతే దేశానికి అసలైన ఆస్తి’’ అని పేర్కొన్నారు.‘‘బాల్యంలో నేనెక్కువగా డ్యాన్సులు చేసేవాడిని. అలా నటనపై ఆసక్తి మొదలైంది. చెన్నై వెళ్లి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాను. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబుగార్లు... ఇలా అరడజనుకు పైగా స్టార్ హీరోలున్నారు. వారికంటే భిన్నంగా ఏం చేయగలనో ఆలోచించి, నాదైన శైలిలో ఫైట్స్, డ్యాన్స్ చేశా. మేకప్ లేకుండా సహజంగా నటించడంలో ‘మృగయా’లోని మిథున్ చక్రవర్తిగారు, స్టంట్స్ విషయంలో ‘షోలే’లో అమితాబ్‌గారు, డ్యాన్స్‌లో కమల్‌హాసన్‌గారు స్ఫూర్తిగా నిలిచారు. నన్ను నేను మల్చుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నాను’’. – హీరో చిరంజీవి‘ది జర్నీ: ఫ్రమ్ అవుట్‌సైడర్ టు రూలర్’ అనే అంశంపై జరిగిన చర్చకు బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ మోడరేటర్‌గా వ్యవహరించగా, నటుడు షారుక్ ఖాన్, నటి దీపికా పదుకోన్ మాట్లాడారు. ‘‘యువకుడిగా ఉన్నప్పుడు నేను ధైర్యంగా, ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉండేవాణ్ణి. అయితే కాస్త కూల్‌గా ఉండేవాడిని. యంగ్ షారుక్ అప్పుడు కూల్‌గా ఉన్నాడు కనుకనే ఇంత దూరం రాగలిగాడు’’ అన్నారు షారుక్. ఇంకా మాట్లాడుతూ – ‘‘సినిమా వినోదం ప్రజలకు చౌకగా లభించాలి. చిన్న చిన్న పట్టణాల్లో చిన్న థియేటర్స్ ఉండాలి.అప్పుడు భారతీయ సినిమా దేశ నలుమూలలకు చేరువ అవుతుంది’’ అని చెప్పుకొస్తూ, దర్శక–నిర్మాత కరణ్ జోహార్ స్క్రిప్ట్‌ను తాను రిజెక్ట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు షారుక్. ఇంకా ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త తరం తమ ఒరిజినాలిటీని కోల్పోకుండా ఉండాలని, ఇమేజ్‌ని నమ్మవద్దని సలహా ఇచ్చారు షారుక్. దీపికా పదుకోన్ మాట్లాడుతూ– ‘‘18 ఏళ్ల అమ్మాయి (తనని ఉద్దేశించి) ధైర్యంగా ఓ పెద్ద సిటీకి వచ్చింది. నా జర్నీని ఇప్పుడు నేను తిరిగి చూసుకుంటుంటే... ఫర్లేదు. నేను బాగానే చేశాననిపిస్తోంది’’ అన్నారు.‘వేవ్స్’ తొలి రోజున ఐదుగురు భారతీయ సినిమా దిగ్గజాల స్మారక తపాలా బిళ్లలను మోదీ విడుదల చేశారు. వీరిలో దక్షిణాది ప్రముఖ నటి–దర్శక–నిర్మాత–గాయని భానుమతి ఉండటం విశేషం. ఇంకా దర్శక–నిర్మాత–నటుడు గురుదత్, దర్శకుడు రుత్విక్ ఘటక్, దర్శక–నిర్మాత రాజ్ ఖోస్లా, మ్యూజిక్ డైరెక్టర్ సలీల్ చౌదరిల పోస్టల్ స్టాంపులు కూడా ఉన్నాయి. భానుమతి కుటుంబం పక్షాన ఆమె మనవరాలు పి. మీనాక్షి స్టాంప్‌ను అందుకున్నారు. ‘‘కథ, కథనం అనేవి వేలాది సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో భాగం. మనకు కొన్ని వందల భాషలు ఉన్నాయి. ప్రతి భాషలో, ప్రతి ప్రాంతంలో తమవైన లక్షల కథలు ఉన్నాయి. అసలు కథాకథనాలు మన నరనరాల్లో భాగం. ఆ విషయంలో మరి ఏ ఇతర దేశమూ మన దగ్గరకు కూడా రాదు. అయినప్పటికీ, అమెరికా, చైనా, జపాన్, సౌత్ కొరియా తదితర దేశాల వినోద రంగానికి మనం దీటుగా లేము. సినిమా, టీవీ, డిజిటల్ మీడియా లాంటి వాటిని అనుసంధానిస్తూ మనకు ఒక లాంచ్ ΄్యాడ్ ఇన్నాళ్లు కరువైంది. ఇప్పుడు సరిగ్గా ఆ లోటును తీర్చే ఆ లాంచ్ ΄్యాడ్ వేవ్స్’’. – దర్శకుడు రాజమౌళి – ముంబై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి

అదిరిపోయే లుక్‌లో నభా నటేశ్.. వేకేషన్లో ప్రగ్యా జైస్వాల్ చిల్!
ఏప్రిల్ జ్ఞాపకాల్లో అల్లు అర్జున్ సతీమణి స్నేహరెడ్డి..వేకేషన్లో చిల్ అవుతోన్న ప్రగ్యా జైశ్వాల్..హిమాచల్ ప్రదేశ్ స్టైల్లో అరియానా గ్లోరీ..విదేశాల్లో ఆదితి గౌతమ్ చిల్..హీరోయిన్ నభా నటేశ్ అదిరిపోయే లుక్.. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Aditi Gautam | Siya gautam (@aditigautamofficial) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)
న్యూస్ పాడ్‌కాస్ట్
క్రీడలు

మ్యాచ్ రిఫరీ అంటే ఆషామాషీ కాదు!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించడం కుర్చీలో కూర్చున్నంత సులువు కాదని, సవాళ్లు ఎదుర్కొన్న సందర్భాలెన్నో ఉన్నాయని ఇటీవలే రిటైరైన మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ అన్నారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో తన 14 ఏళ్ల కెరీర్లో బాల్ టాంపరింగ్, భద్రతా సవాళ్లు క్లిష్టమైనవని చెప్పుకొచ్చారు. ఆ్రస్టేలియాకు చెందిన మాజీ ఓపెనర్, 64 ఏళ్ల బూన్ పురుషుల క్రికెట్లో 87 టెస్టులు, 183 వన్డేలు, 112 టి20లకు... మహిళల క్రికెట్లో ఏడు టి20లకు మ్యాచ్ రిఫరీగా వ్యవహరించారు. అచ్చం క్రికెటర్లలాగానే కెరీర్‌కు టాటా చెప్పినా... కోచ్, మెంటార్లుగా ఆటతో అనుబంధాన్ని కొనసాగించినట్లే, ఈ వెటరన్ ఆస్ట్రేలియన్ కూడా రిఫరీగా రిటైర్మెంట్ ప్రకటించినా క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) డైరెక్టర్‌గా బంధాన్ని కొనసాగించనున్నారు. ‘రిఫరీ పనంటే అంతా సులువు కాదు. క్లిష్ట పరిస్థితులు, సవాళ్లు మాకు ఎదురవుతాయి. చాలా సార్లు బాల్ టాంపరింగ్‌పై వచ్చిన ఫిర్యాదులు, పరిష్కరించడంలో పడిన ఇబ్బందులు ఎన్నో ఉంటాయి. ఢాకా (బంగ్లాదేశ్), క్రైస్ట్‌చర్చ్ (న్యూజిలాండ్) వేదికల్లో జరిగిన మ్యాచ్‌కు సరిగ్గా ఇలాంటి కఠిన పరిస్థితుల్నే ఎదర్కొన్నాను. కొన్ని చోట్ల భద్రతా సవాళ్లు తప్పలేదు. ఏదేమైనా... బిజీ క్రికెట్ పెరిగినా... జెంటిల్మెన్ క్రికెట్ స్థాయి పెంచేందుకే రిఫరీ నిర్ణయాలుంటాయి. 14 ఏళ్ల రిఫరీ కెరీర్లో సాఫల్యాలు చూసుకుంటే సంతోషంగా ఉంటుంది’ అని 396 మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించిన బూన్ వివరించారు. జింబాబ్వే, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌తో ఆయన కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఆట ప్రతిష్టను పెంచుతూనే సుదీర్ఘ సేవలందించిన బూన్‌ను ఐసీసీ చైర్మన్ జై షా ప్రశంసిస్తూ ఆయన సేవల్ని కొనియాడారు. రిఫరీ కాకముందు క్రికెటర్‌గా బూన్ ఆ్రస్టేలియా తరఫున 107 టెస్టులు ఆడి 7422 పరుగులు, 181 వన్డేలు ఆడి 5964 పరుగులు సాధించారు.

‘ఖేల్‌రత్న’ అందుకున్న సాత్విక్–చిరాగ్
న్యూఢిల్లీ: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఎట్టకేలకు జాతీయ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ను స్వీకరించారు. కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం ఈ అవార్డును వీరిద్దరికి అందజేశారు. 2023 ఏడాదికిగాను ప్రకటించిన ఈ అవార్డును సాత్విక్–చిరాగ్ తీసుకోవడంలో చాలా ఆలస్యమైంది. రాష్ట్రపతి భవన్లో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమ సమయంలో మరో చోట టోర్నీలు ఆడుతున్న ఈ డబుల్స్ జోడీ గైర్హాజరైంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అందుకోవడానికి సిద్ధమైన తరుణంలో సాత్విక్ తండ్రి కాశీవిశ్వనాథ్ అనూహ్య మృతితో అవార్డు కార్యక్రమం వాయిదా పడింది. ‘ఈ ఇద్దరు షట్లర్ల అత్యుత్తమ ప్రదర్శన, అంకితభావానికి దక్కిన గౌరవమిది. భవిష్యత్తులో వీరు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ మాండవీయ ట్వీట్ చేశారు. ‘ఎట్టకేలకు అవార్డును అందుకున్నాం. మేమిద్దరం జోడీగా మారిన సమయం నుంచి ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తూ అండగా నిలిచింది. మా విజయాల్లో వారి సహకారం ఎంతో ఉంది. గత కొద్ది రోజులుగా మేం ఆశించిన ప్రదర్శన ఇవ్వలేదు. అయితే ఇప్పుడు మళ్లీ చెలరేగి కొత్త విజయాలు సాధించేందుకు ఈ అవార్డు మాకు ప్రేరణనిస్తుంది’ అని సాత్విక్–చిరాగ్ చెప్పారు. గత కొన్నేళ్లుగా ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సాత్విక్–చిరాగ్ అగ్రశ్రేణి జోడీగా ఎదిగారు. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో 3 స్వర్ణాలు, 3 రజతాలు గెలుచుకున్న ఈ జంట 2022 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించింది. ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నంబర్‌వన్ స్థానానికి చేరిన తొలి భారత జోడీగా నిలవడంతో పాటు టీమ్ ఈవెంట్ థామస్ కప్‌ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించింది. అనారోగ్య కారణాలతో ప్రస్తుతం జరుగుతున్న సుదిర్మన్ కప్ నుంచి వీరిద్దరు తప్పుకున్నారు.

ముంబై ‘సిక్సర్’ రాజస్తాన్ ‘అవుట్’
ఐపీఎల్–2025లో ‘ప్లే ఆఫ్స్’ రేసుకు దూరమైన రెండో జట్టుగా రాజస్తాన్ రాయల్స్ నిలిచింది. సీజన్లో ఎనిమిదో పరాజయంతో ఆ జట్టు కథ ముగియగా, టాప్–4 బ్యాటర్లంతా చెలరేగడంతో ముంబై పట్టికలో ‘టాప్’కు దూసుకెళ్లిపోయింది. ముందుగా పేలవ బౌలింగ్‌తో ముంబై ఇండియన్స్‌కు భారీ స్కోరు చేసే అవకాశం కల్పించిన రాయల్స్... ఆ తర్వాత చెత్త బ్యాటింగ్‌తో పూర్తిగా చేతులెత్తేసింది. తిరుగులేని ఆటతో చెలరేగుతున్న హార్దిక్ పాండ్యా బృందం ఖాతాలో ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం.జైపూర్: ఐపీఎల్ సీజన్లో చెన్నై తర్వాత ఇప్పుడు రాజస్తాన్ రాయల్స్ అధికారికంగా ‘ప్లే ఆఫ్స్’ అవకాశాలు చేజార్చుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. రికెల్టన్ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 53; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలతో శుభారంభం అందించగా... సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (23 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అదే జోరును కొనసాగించారు. రికెల్టన్, రోహిత్ తొలి వికెట్‌కు 71 బంతుల్లోనే 116 పరుగులు జోడించగా... సూర్య, పాండ్యా మూడో వికెట్‌కు 44 బంతుల్లో అభేద్యంగా 94 పరుగులు జత చేశారు. అనంతరం రాజస్తాన్ 16.1 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌటైంది. జోఫ్రా ఆర్చర్ (27 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సొంత మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ మేనేజ్మెంట్ ‘పింక్ ప్రామిస్’ పేరుతో సౌరశక్తికి సంబంధించి ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించింది. దీని ప్రకారం ఆటగాళ్లంతా పూర్తిగా ‘పింక్’ కిట్ ధరించగా... బ్యాటర్ కొట్టే ఒక్కో సిక్స్‌కు ఆరు ఇళ్లకు సౌరశక్తి సదుపాయాన్ని కల్పిస్తారు. టాప్–4 విధ్వంసం... ముంబై బ్యాటింగ్ మొదటి నుంచీ దూకుడుగా సాగింది. ఫారుఖీ ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన రికెల్టెన్... ఆర్చర్ ఓవర్లో వరుసగా 4, 6 బాదాడు. తీక్షణ ఓవర్లో రోహిత్ 3 ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లే ముగిసేసరికి స్కోరు 58 పరుగులకు చేరింది. కార్తికేయ ఓవర్లో భారీ సిక్స్‌తో 29 బంతుల్లో రికెల్టన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, కొద్ది సేపటికే 31 బంతుల్లో రోహిత్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. వీరిద్దరు 7 పరుగుల తేడాతో వెనుదిరిగిన తర్వాత సూర్య, పాండ్యా ధాటి మొదలైంది. ఫారుఖీ ఓవర్లో పాండ్యా 3 ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిపోవడంతో 21 పరుగులు వచ్చాయి. ఆర్చర్ ఓవర్లో సిక్స్‌తో స్కోరును 200 దాటించిన సూర్య...ఆఖరి బంతికి సిక్స్‌తో ఇన్నింగ్స్ ముగించాడు. టపటపా... ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలోపే 5 వికెట్లు కోల్పోవడంతో రాజస్తాన్ గెలుపు అవకాశాలు అక్కడే ముగిసిపోగా, ఆ తర్వాత లాంఛనమే మిగిలింది. గత మ్యాచ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ (0) ఈసారి డకౌట్ కావడంతో రాయల్స్ పతనం మొదలైంది. బౌల్ట్ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టిన యశస్వి జైస్వాల్ (13) అదే ఓవర్లో వెనుదిరిగాడు. బౌల్ట్ తర్వాతి ఓవర్లో నితీశ్ రాణా (9) అవుట్ కాగా... బుమ్రా తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో పరాగ్ (16), హెట్‌మైర్ (0)లను వెనక్కి పంపించాడు. ధ్రువ్ జురేల్ (11) ప్రభావం చూపలేకపోవడంతో రాజస్తాన్ కుప్పకూలింది. స్కోరు వివరాలు ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: రికెల్టన్ (బి) తీక్షణ 61; రోహిత్ (సి) జైస్వాల్ (బి) పరాగ్ 53; సూర్యకుమార్ (నాటౌట్) 48; హార్దిక్ పాండ్యా (నాటౌట్) 48; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 217. వికెట్ల పతనం: 1–116, 2–123. బౌలింగ్: ఆర్చర్ 4–0–42–0, ఫారుఖీ 4–0–54–0, తీక్షణ 4–0–47–1, కార్తికేయ 2–0–22–0, మధ్వాల్ 4–0–39–0, పరాగ్ 2–0–12–1. రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) బౌల్ట్ 13; వైభవ్ (సి) జాక్స్ (బి) చహర్ 0; నితీశ్ రాణా (సి) తిలక్ (బి) బౌల్ట్ 9; పరాగ్ (సి) రోహిత్ (బి) బుమ్రా 16; జురేల్ (సి అండ్ బి) కరణ్ శర్మ 11; హెట్‌మైర్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 0; శుభమ్ దూబే (సి) బౌల్ట్ (బి) పాండ్యా 15; ఆర్చర్ (సి) బుమ్రా (బి) బౌల్ట్ 30; తీక్షణ (సి) సూర్య (బి) కరణ్ శర్మ 2; కార్తికేయ (సి) చహర్ (బి) కరణ్ శర్మ 2; మధ్వాల్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (16.1 ఓవర్లలో ఆలౌట్) 117. వికెట్ల పతనం: 1–1, 2–18, 3–41, 4–47, 5–47, 6–64, 7–76, 8–87, 9–91, 10–117. బౌలింగ్: దీపక్ చహర్ 2–0–13–1, బౌల్ట్ 2.1–0–28–3, బుమ్రా 4–0–15–2, బాష్ 3–0–29–0, హార్దిక్ పాండ్యా 1–0–2–1, కరణ్ శర్మ 4–0–23–3. ఐపీఎల్లో నేడుగుజరాత్ X హైదరాబాద్ వేదిక: అహ్మదాబాద్‌రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

IPL 2025: ముంబై డబుల్ హ్యాట్రిక్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి రాజస్థాన్ ఔట్
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (మే 1) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై ముంబై ఇండియన్స్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. ర్యాన్ రికెల్టన్ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 53; 9 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ (23 బంతుల్లో 48 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (22 బంతుల్లో 48 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాయల్స్ బౌలరల్లో రియాన్ పరాగ్, తీక్షణ తలో వికెట్ తీశారు.అనంతరం 218 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రాయల్స్ ముంబై బౌలర్లు మూకుమ్మడిగా చెలరేగడంతో 16.1 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. రాయల్స్ ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్ (30) టాప్ స్కోరర్‌గా నిలువగా.. యశస్వి జైస్వాల్ (13), రియాన్ పరాగ్ (16), ధృవ్ జురెల్ (11), శుభమ్ దూబే (15) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. గత మ్యాచ్‌లో 35 బంతుల్లోనే సెంచరీ చేసిన చరిత్ర సృష్టించిన రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో డకౌటయ్యాడు. ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ, బౌల్ట్ తలో మూడు వికెట్లు తీయగా.. బుమ్రా 2, దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ గెలుపుతో ముంబై డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకుపోయింది. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.
బిజినెస్

అదానీ పోర్ట్స్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్(ఏపీసెజ్) గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 50 శాతం జంప్‌చేసి రూ. 3,025 కోట్లను తాకింది. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,015 కోట్లు మాత్రమే ఆర్జించింది. మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి నికర లాభం 37 శాతం ఎగసి రూ. 11,061 కోట్లకు చేరింది.ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికంకాగా.. మొత్తం ఆదాయం 16 శాతం బలపడి రూ. 31,079 కోట్లయ్యింది. క్యూ4లో కార్గో నిర్వహణ 8 శాతం పెరిగి 118 మిలియన్ టన్నులను తాకింది. పూర్తి ఏడాదిలో 7 శాతం అధికమై 450 మిలియన్ టన్నులకు చేరింది. కాగా.. పోర్టులు, లాజిస్టిక్స్ బిజినెస్‌లలో వృద్ధి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లోనూ పటిష్ట పనితీరు చూపనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఆదాయంలో 16–22 శాతం వృద్ధిని అంచనా వేసింది. ఈ ఏడాది రూ. 11,000–12,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు తెలియజేసింది.

జీఎస్టీ వసూళ్లు.. కొత్త రికార్డు
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల పరంగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సరికొత్త రికార్డు నమోదైంది. గతేడాది ఏప్రిల్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 12.6 శాతం అధికంగా రూ.2.37 లక్షల కోట్లు వసూలైంది. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక నెలవారీ గరిష్ట ఆదాయం ఇదే కావడం గమనార్హం. 2024 ఏప్రిల్ నెలకు జీఎస్టీ ఆదాయం రూ.2.10 లక్షల కోట్లుగా ఉంది.ఇక ఈ ఏడాది మార్చి నెలలో ఇది రూ.1.96 లక్షల కోట్లుగా ఉంది. దేశీ లావాదేవీలపై జీఎస్టీ 10.7 శాతం పెరిగి రూ.1.9 లక్షల కోట్లుగా నమోదైంది. దిగుమతి చేసుకున్న వస్తువులపై జీఎస్టీ 20.8 శాతం వృద్ధితో రూ.46,913 కోట్లకు చేరింది. రిఫండ్లు 48% అధికంగా రూ.27,341 కోట్లుగా ఉన్నాయి. రిఫండ్లను సర్దుబాటు చేసి చూస్తే నికర జీఎస్టీ ఆదాయం క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 9 శాతం వృద్ధితో రూ.2.09 లక్షల కోట్లకు చేరుకుంది. దేశీ లావాదేవీలపై సెంట్రల్ జీఎస్టీ రూ.48,634 కోట్లు కాగా, స్టేట్ జీఎస్టీ రూ.59,372 కోట్లు సమకూరింది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.69,504 కోట్లు, సెస్స్ వసూళ్లు రూ.12,293 కోట్ల చొప్పున ఉన్నాయి. బలమైన ఆర్థిక పనితీరు: డెలాయిట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నెల జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు మించడం బలమైన ఆర్థిక పనితీరుకు నిదర్శమని డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఎంఎస్ మణి పేర్కొన్నారు. అన్ని ప్రధాన తయారీ, వినియోగ రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ నెలలో 11–16 శాతం మధ్య ఉన్నాయని.. అంతకుముందు నెలల్లో పెద్ద రాష్ట్రాల్లో తక్కువ వృద్ధి నమోదైన దానికి ఇది భిన్నమని తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థలోని బలాన్ని జీఎస్టీ వసూళ్లు చాటుతున్నట్టు ఈవై ట్యాక్స్ పార్ట్నర్ సౌరభ్ అగర్వాల్ అన్నారు. సహకారాత్మక సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనం ‘‘జీఎస్టీ వసూళ్ల గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, సహకారాత్మక సమాఖ్యవాదాన్ని చాటుతున్నాయి’’అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కేంద్ర, రాష్ట్రాల జీఎస్టీ అధికారుల కృషిని అభినందించారు

ఆటో.. అటూ ఇటూ!
ముంబై: మార్కెట్లో నెలకొన్న పలు ప్రతికూల సవాళ్ల మధ్య మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) కంపెనీల వాహన అమ్మకాలు ఏప్రిల్‌లో పెరిగాయి. అయితే టాటా మోటార్స్, హ్యుందాయ్ మోటార్ విక్రయాలు తగ్గాయి. ఆసక్తికరంగా, గత నెలలో దేశీయ ప్యాసింజర్ వాహన విభాగంలో ఎంఅండ్ఎం, టాటా మోటార్స్ రెండు, మూడు స్థానాలు దక్కించుకోగా, ధీర్ఘకాలం పాటు ద్వితీయ స్థానంలో కొనసాగిన హ్యుందాయ్ మోటార్స్ నాలుగో స్థానానికి దిగివచ్చింది. ⇒ మారుతీ సుజుకీ దేశీయంగా ఏప్రిల్ నెలలో 1,38,074 ప్యాసింజర్ వాహనాలు విక్రయించింది. గత ఏడాది ఏప్రిల్‌లో అమ్ముడైన 1,37,952 వాహనాలతో పోలిస్తే 1% ఎక్కువ. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్–ప్రెస్సో విక్రయాలు 11,519 నుంచి 6,332 యూనిట్లకు తగ్గాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగి్నస్, స్విఫ్ట్, వేగన్–ఆర్ అమ్మకాలు 56,953 నుంచి 61,591 యూనిట్లకు పెరిగాయి. ఎగుమతులు కలుపుకొని ఈ ఏప్రిల్‌లో కంపెనీ 1,79,791 యూనిట్ల వాహనాలు విక్రయించింది. ⇒ మహీంద్రా అండ్ మహీంద్రా యుటిలిటీ వాహన విక్రయాలు 28% వృద్ధి చెంది 41,000 యూనిట్ల నుంచి 52,330 యూనిట్లకు వచ్చి చేరాయి. మా పోర్ట్‌ఫోలియో బలాన్ని, కస్టమర్ల ప్రతిపాదనలను అమ్మకాల సంఖ్య తెలియజేస్తుందని కంపెనీ ఆటోమోటివ్ డివిజన్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా తెలిపారు. ⇒ టాటా మోటార్స్ దేశీయ ప్యాసింజర్ వాహన అమ్మకాలు(ఈవీలను కలుపుకొని) క్రితం ఏడాది ఇదే ఏప్రిల్‌తో పోలిస్తే 47,883 యూనిట్ల నుంచి 45,199 యూనిట్లకు దిగివచ్చాయి. ⇒ హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయంగా మొత్తం వాహన విక్రయాలు 12% క్షీణించి 44,374 యూనిట్లకు వచ్చి చేరాయి. గతేడాది ఇదే నెలలో అమ్మకాలు 50,021 గా ఉన్నాయి.

బంగారం డోర్ డెలివరీ.. సెక్యూరిటీ చూశారా?
కాదేదీ డోర్ డెలివరీకి అనర్హం అన్నట్లు ఆర్డర్ ఇస్తే చాలు ఇప్పుడు ప్రతీదీ ఇంటి ముంగిటకే వచ్చేస్తోంది. ఈ ఏడాది అక్షయ తృతీయను పురస్కరించుకుని ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ ఇన్‌స్టా మార్ట్ నిత్యావసర సరుకుల మాదిరిగానే బంగారాన్నీ డెలివరీ చేస్తామంటూ ముందుకు వచ్చింది. అయితే డోర్ స్టెప్ గోల్డ్ డెలివరీ కోసం ఆ కంపెనీ చేసిన హై సెక్యూరిటీ ఏర్పాట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతున్న వరుస వైరల్ వీడియోలు నెటిజనుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా విస్తృతంగా షేర్ అవుతున్న ఒక వీడియో క్లిప్‌లో స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్.. సెక్యూరిటీ గార్డుతో కలిసి ట్రాఫిక్‌లో బైక్‌పై వెళ్తూ కనిపించారు. అందులో సెక్యూరిటీ గార్డు ఒక చేతిలో లాఠీ, మరో చేతిలో హై సెక్యూరిటీ లాకర్ పట్టుకొని కనిపించాడు. ఈ వీడియో వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది."ఏమి జరుగుతోంది?" అంటూ ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ ప్రశ్నించగా "రియల్ గోల్డ్ డెలివరీ కర్నే కే లియే రియల్ సెక్యూరిటీ చాహియే బ్రో (రియల్ గోల్డ్ కోసం రియల్ సెక్యూరిటీ కావాలిగా) అని స్విగ్గీ చమత్కారంగా బదులిచ్చింది. ఆన్ లైన్ లో ప్రచారం ఊపందుకోవడంతో స్విగ్గీ ఇన్ స్టామార్ట్ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో వైరల్ వీడియోలను రీపోస్ట్ చేసింది. దీనికి బంగారమా? నిజంగానా?' అంటూ మరో యూజర్ ఆశ్చర్యం వ్యక్తం చేయగా దీనికి కూడా ‘డెలివరింగ్ సోనా ఇన్ ఎవరీ కోనా కోనా’(ప్రతి మూలకూ బంగారం డెలివరీ) అంటూ స్విగ్గీ రిప్లయి ఇచ్చింది.కాగా కల్యాణ్ జ్యువెల్లర్స్ నుంచి వివిధ బరువుల బంగారు, వెండి నాణేలను నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ చేయనున్నట్లు స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. క్విక్ కామర్స్ సర్వీస్ ద్వారా లభించే నాణేలలో 0.5 గ్రాములు, 1 గ్రాము బంగారు నాణేలు, అలాగే 5 గ్రాములు, 10 గ్రాములు, 20 గ్రాముల వెండి నాణేలు ఉన్నాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)
ఫ్యామిలీ

ఇదేందయ్యా ఇది!.. ఒక్క నిమిషంలోనే ముగించేసింది.. సైంటిస్టులు సైతం ఫిదా
వయసుతో సంబంధం లేకుండా కొందరు అద్భుతాలు చేసి ఆశ్చర్యపరుస్తుంటారు. అదికూడా లేటు వయసులో సాహసోపేతమైన పనులు చేసి వయసు అనేది శరీరానికే గానీ మనసుకు కాదని చేతల్లో చూపిస్తుంటారు. వృద్ధాప్య దశలో పీజీలు, పీహెచ్‌డీలు చేస్తే..కొందరు మాత్రం ఆ వయసుకి సాధ్యవుతాయా..? అనేలా ఛాలెంజింగ్ సాహసాలకు పూనుకుని, రికార్డులు సృష్టిస్తారు. అలాంటి కోవకు చెందిందే ఈ 91 ఏళ్ల బామ్మ. ఈమె ఏం చేసిందో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. శాస్త్రవేత్తలక సైతం ఆమె చురుకైన యాక్టివిటీని చూసి కంగుతిన్నారు.ఇటలీకి చెందిన 91 ఏళ్ల ఎమ్మా మరియా మజ్జెంగా(Emma Maria Mazzenga) అనే బామ్మ 90 ప్లస్ 200 మీటర్ల రన్నింగ్ రేసులో ఊహకందని విధంగా ప్రపంచ రికార్డును సృష్టించింది. జస్ట్ ఒక్క నిమిషంలోపే రన్నింగ్ రేస్‌ని ముగించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. నిజానికి ఆ వయసులో మరొకరి సాయం లేనిదే అడుగులు వేయలేరు. కానీ ఆమె మాత్రం చాలా వేగంగా పరుగులు తీయడం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. పైగా ఎలాంటి ఆయాసం లేకుండా యువకుల మాదిరిగా అత్యంత ఉత్సాహంగా పరుగులు తీయడం అత్యంత షాకింగ్ విషయం. ఆమె తోటివారందరూ ఆయాసంతో ఆందోళపడుతుంటే..ఆమె మాత్రం చాలా ప్రశాంతంగా సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. ఇది శాస్త్రవేత్తలను ఎంతగానో ఆకర్షించింది. ఈ వయసులో ఆ బామ్మ మజ్జెంగా ఇంత చురుగ్గా ఉండటానికి వెనుకున్న ఆరోగ్య రహస్యం ఏంటా అని ఆసక్తిని రేకత్తించింది. చివరికి అదేంటో సవివరంగా తెలుసుకున్నారు కూడా.ఇక్కడ బామ్మ 200 మీటర్ల పరుగును కేవల 51.47 సెకన్లలో పూర్తిచేసి, మునుపటి 90-ప్లస్ ప్రపంచ రికార్డును బ్రేక్ చేసింది. ఇంత వేగంగా చేయడానికి ఆమె శరీరం ధర్మం ఎలా సహకరిస్తుందో తెలుసుకునే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. అందుకోసం ఆమెకు శారీరక కసరత్తులకు సంబంధించిన పలు పరీక్షలు నిర్వహించి మరీ ఆమె ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకున్నారు. 90 ఏళ్ల వయసులో బామ్మను సూపర్ ఫిట్‌గా ఉండేలా చేసినవి..పుణుల అభిప్రాయం ప్రకారం బామ్మ మజ్జెంగా వండర్ ఉమెన్. అందుకు రెండే రెండు ప్రధాన అంశాలని చెబుతున్నారు. ఆమె కార్డియోస్పిరేటరీ ఫిట్‌నెస్‌లో ఆమె గుండె,ఊపిరితిత్తులు, రాలకు ఆక్సిజన్‌ను పంప్ చేసే విధానం 40 లేదా 50 ఏళ్ల వయసులో ఉన్న ఆరోగ్యవంతమైన మహిళతో సమానంగా ఉంటుందట.ఆమె కండరాలు ప్రత్యేకమైనవి మరియు తక్కువ బర్నింగ్‌ని కలిగి ఉంటాయి. అంటే ఎనర్జీని కోల్పోకుండా ఉండటంతో అలిసిపోతు. అందువల్లే ఆమె సుదురాలకు సులభంగా పరిగెత్తగలతు. ఆమెలో "చాలా ఎక్కువ శాతం" వేగవంతమైన సంకోచ ఫైబర్లు కూడా ఉన్నాయి, ఇవి శక్తివంతమైన శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఇవే ఆమె వేగవంతమైన కదిలికలకు కారణమని అన్నారు. ఈ ప్రత్యేకమైన లక్షణాలే ఈ 200 మీటర్ల రన్నింగ్ రేసులో అలవోకగా రికార్డు చేచేసందుకు దారితీసిందని చెబుతున్నారు డాక్టర్ మార్టా కొలోసియో.ఈ ప్రత్యేకమైన శరీరాకృతి ఎలా వచ్చిందంటే..ఆమె దశాబ్దాలుగా కష్టపడి పనిచేస్తోంది. అదే ఆమె శరీరానికి వరంగా మారింది1933లో జన్మించిన మజ్జెంగా మొదట విశ్వవిద్యాలయంలో తన ఫిట్నెస్ ప్రయాణాన్ని ప్రారంభించింది, 100, 200, 400 మరియు 800 మీటర్ల రేసుల్లో కూడా పోటీ పడింది. అప్పటి నుంచే ఆమె విజయపరంపర మొదలైంది. ఆరోజుల్లో రోమ్‌లో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లలో నాల్గవ స్థానంలో నిలిచింది.తన విజయాలకు బ్రేక్‌పడింది పెళ్లి, పిల్లలు అనే చెప్పొచ్చు. అలా ఆమె రెండు దశాబ్దలకు పైగా తన ఫిట్నెస్ కెరీర్‌కు దూరంగాఉంది. మళ్లీ తిరిగి 1986లో తన కెరీర్ రన్నింగ్ రేస్‌లోకి వచ్చింద. అంటే.. 50ల వయసులో తన పాత సహచరులతో పోటీ పడటం మొదలైంది. మళ్లీ పుంజుకోవడానికి చాలా ఖర్చు పెట్టాల్సి వచ్చినా..ఈ రన్నింగ్ రేసులో పాల్గొనడం చాలా సంతృప్తినిస్తుందని అంటోంది బామ్మ. అదే కారణం..ఒక రేసు ఇచ్చే కిక్కే వేరు అంటోంది. ప్రతి శిక్షణా సెషన్ తనకు మంచి జీవితకాల వ్యాయామ శిక్షణ, అసాధారణ పనితీరుని అందిస్తుందట. అందువల్లే తొమ్మిది పదుల వయసులో కూడా ఇంతలా యువ క్రీడాకారులతో సరితూగేలా పోటీపడగలను అంటోంది. కాగా, బామ్మ ఐదు ప్రపంచ రికార్డులు, తొమ్మిది యూరోపియన్ రికార్డులు, మాస్టర్ స్ప్రింటింగ్ విభాగంలో 28 ఉత్తమ ఇటాలియన్ పెర్ఫామెన్స్‌గా అవార్డులు గెలుచుకుంది. ఈ బామ్మ నేటి యువతరానికి ఎంతోస్ఫూర్తి కదూ..!.(చదవండి: పిల్లలకు చెప్పాల్సిన 'మాయాబజార్' పాఠాలు..!)

రెండో కొడుకు... అనాథగా వచ్చి.. సెలబ్రిటీగా ఎవరో తెలుసా?
దొడ్డబళ్లాపురం: అభిమానం పుట్టిందంటే కోతి కూడా ఇంటి సభ్యురాలు అవుతుంది. ప్రేమ కరువైతే ఇంటివారు కూడా పరాయి వారవుతారు. అలాంటిదే ఈ ఉదంతం. పెంపుడు కోతికి ఆర్భాటంగా పుట్టినరోజు వేడుకలు చేయించాడో వ్యక్తి. హావేరి జిల్లా రాణెబెన్నూరు తాలూకా కాకోళ గ్రామంలో చోటుచేసుకుంది.కొత్త బట్టలు, కేక్ కటింగ్గ్రామ నివాసి ప్రభుగౌడకు నాలుగేళ్ల క్రితం మగ కోతి పిల్ల దొరికింది. దాన్ని చేరదీసి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. పిల్లవాని మాదిరిగా అంగీ, నిక్కర్ తొడిగిస్తారు. కోతిపిల్ల దొరికిన ఏప్రిల్ 29 తేదీని దాని పుట్టినరోజుగా వేడుకలు చేస్తున్నారు.కోతికి హనుమంతగౌడ అని పేరు కూడా పెట్టాడు. బర్త్ డే వేడుకలో హనుమంతగౌడకు కొత్త దుస్తులు వేశారు. పెద్ద కేక్‌ను తెప్పించి కట్ చేయించారు. చుట్టుపక్కలవారిని పిలిచి కేక్, మిఠాయిలు పంచిపెట్టారు. చూసినవారందరూ వానరానిదే వైభవమని ఆశ్చర్య పోయారు. ఈ కోతిపిల్ల ఇంటికి వచ్చాక ఆర్థికంగా బాగా కలిసి వచ్చినట్టు ప్రభుగౌడ చెబుతున్నాడు. గ్రామంలో ఈ కోతి సెలబ్రిటీగా మారింది. పెళ్లి పేరంటాలకు ప్రభుగౌడ తీసుకెళ్తాడు. జనం దాంతో ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఉంటారు.ఇదీ చదవండి : ప్రిన్స్ హ్యారీతో విడాకులా? తొలిసారి మౌనం వీడిన మేఘన్

ఎవరు పేద? ధనం లేకపోయినా పరవాలేదు గానీ..!
ఒక వ్యక్తి హజ్రత్ జునైద్ బొగ్దాదీ (ర) వద్దకు వచ్చి: ‘అయ్యా.. నేనొక నిరుపేదను. పేదరికం నా కాళ్ళూ చేతులూ కట్టి పడేసింది. ఎవరికీ ఏమీ చేయలేకపోతున్నాను. దీనికి కారణం ఏమిటీ?.’ అని ప్రశ్నించాడు. దానికి జునైద్ బొగ్దాదీ, ‘నువ్వు దానధర్మాలు చేస్తావా? ఇతరులపట్ల ఉదారబుద్ధితో వ్యవహరిస్తావా?’ అని ఎదురు ప్రశ్నించారు. ‘అయ్యా.. అదేకదా నా సమస్య, నేనే నిరుపేదను. ఆ కారణంగానే ఏమీ చేయలేక పోతున్నానన్నదే నా బాధ. దానధర్మాలు చేయడానికి, ఉదారంగా వ్యవహరించడానికి నా దగ్గరేమున్న దని.?’ అన్నాడా వ్యక్తి నిర్లిప్తంగా..‘అదేమిటీ అలా అంటావు? ఎంతో గొప్పసంపద ఉంది. పరులతో పంచుకోగల నిధులున్నాయి నీ దగ్గర. ’ అన్నారు బొగ్దాదీ. ఆ వ్యక్తి ఆశ్చర్యచకితుడై, ‘అయ్యా.. నేను చాలా చిన్నవాణ్ణి. నన్ను ఆట పట్టించకండి’ అన్నాడు.‘అయ్యయ్యో..! ఆట పట్టించడంకాదు. ఇది నిజం. నేను చెబుతావిను.’ అంటూ.. ‘నీ దగ్గర ఉన్న గొప్ప సంపద నీ ముఖారవిందం. ఎంత పేదరికమైనా, ఎన్ని కష్టాలొచ్చినా ముఖంపై చిరునవ్వును చెదరనీయకు. ఇతరులను చిరునవ్వుతో పలకరించడం కూడా సదఖాతో సమానం అన్నారు మన ప్రవక్త. (జామె తిర్మజీ 1956) దీనికోసం ధనం అవసరంలేదు. ఇది పూర్తిగా ఉతం. ఇది ఇతరులపై అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది.రెండవది కళ్ళు. ఇవి లక్షలాది మందిని ప్రభావితం చేస్తాయి. ఆ కళ్ళతో ఒక్కసారి అమ్మవైపు ప్రేమతో చూస్తే ఒక హజ్ చేసినంత పుణ్యం లభిస్తుంది. హజ్ అంటే ధనవంతులు చేయగలిగే ఆరాధనే గదా..!’ మూడవది నోరు. నోరు మందైతే ఊరు మందవుతుంది. ధనం లేకపోయినా పరవాలేదు. నోరు బాగుంటే చాలు. అంతేకాదు, నోటితో ఇతరులకు మంని బోధించవచ్చు. మంని చర్చించవచ్చు. దాన్ని విలువైనదిగా భావించు. ఆనందం, సానుకూలత వ్యాప్తి చెందుతాయి. ‘నీదగ్గరున్న మరోనిధి నీ మనసు. మంచి ఆలోచనలతో ఉదయాన్ని ప్రారంభిస్తే, ప్రశాంతత నీసొంతమవుతుంది. మానసిక ప్రశాంతత ప్రాప్తమైతే నీ అంత ధనవంతుడు మరెవరూ ఉండరు. తద్వారా ఇతరుల ఆనందంలో, కష్టసుఖాల్లో పాలుపంచుకోవచ్చు. వారి జీవితాలను తాకవచ్చు. మరోగొప్ప సంపద నీ శరీరం. దాంతో ఇతరులకు అనేక మంచి పనులు చేయవచ్చు. అవసరమైన వారికి సహాయం అందించవచ్చు. సహాయం చెయ్యడానికి డబ్బులే అవసరం లేదు.మంచి మనసుంటే చాలు. ఇప్పుడు చెప్పు నువ్వు పేదవాడివా?’ అన్నారు జునైద్ బొగ్దాదీ రహ్మతుల్లా అలై. ఈ మాటలు విన్న ఆ వ్యక్తి పరమానందభరితుడై, ఆత్మసంతోషంతో, ఆత్మవిశ్వాసంతో పెద్దపెద్ద అంగలు వేసుకుంటూ ముందుకు సాగిపోయ్యాడు.– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్

ధర్మ దేవతల ఆవాసం ‘ధర్మస్థల’ : ఒక్కసారైనా మంజునాథుని దర్శనం
ఏ శివాలయంలోనైనా వైష్ణవ పూజారులను చూడగలమా? ఏ విష్ణ్వాలయంలోనైనా జైన మతాధికారులు కనిపిస్తారా... అయితే కర్ణాటక రాష్ట్రంలోని ఓ పురాతన శైవక్షేత్రానికి మాత్రం ఈ ప్రత్యేకత ఉంది. ఈ క్షేత్రానికి ఆ ప్రత్యేకత ఎలా వచ్చిందో తెలుసుకుందాం.కర్ణాటక రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ధర్మస్థల ఒకటి. అందుకే భక్తులందరూ కర్ణాటకలోని ధర్మస్థలను ఒక్కసారైనా సందర్శించి, ధర్మదేవతలను దర్శించుకుని, మంజునాథుని మనసారా చూసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఏదైనా పనిమీద బెంగళూరు వచ్చిన వారు ధర్మస్థలను సందర్శించడాన్ని విధిగా పెట్టుకుంటారు. స్థలపురాణం... పూర్వం కుడుమ అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో జైన సైనికాధికారి బిర్మన్న, ఆయన భార్య అంబుబల్లాతి నివసించే వారు. నిరాడంబరులుగా, నిజాయితీపరులుగా, అతిథి సేవ, సాటివారికి సాయం చేసే ఆదర్శ్ర΄ాయులైన దంపతులుగా వారిని అందరూ గౌరవించేవారు. ధర్మపరాయణులుగా, ఆపదలలో ఉన్న వారిని ఆదుకునే వారిగా వారికి ఎంతో మంచి పేరుండేది. వారి కీర్తి దేవతల వరకు వెళ్లడంతో నిజంగా వారెంతటి ధర్మనిష్ఠాపరులో తెలుసుకుని, వారు గనక సరైన వారేనని తేలితే, వారి ద్వారా ధర్మపరిరక్షణ, ధర్మప్రచారం చేయిద్దామని ఇద్దరు ధర్మదేవతలు ఒక రాత్రిపూట వాళ్ల ఇంటికి నిరుపేద వృద్ధదంపతుల రపంలో వచ్చారు. హెగ్గడే దంపతులు వారిని సాదరంగా ఆహ్వానిం, అతిథి సత్కారాలు చేశారు. ధర్మదేవతలు వారితో తమకు ఆ ఇల్లు ఎంతో నచ్చిందని, ఇల్లు ఖాళీ చేసి తమకు ఇవ్వమని అడిగారు. వారు క్షణం కూడా ఆలస్యం చేయకుండా ముక్కూముఖం తెలియని వారి కోసం ఆ ఇంటిని ఖాళీ చేసి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. వారి ఔదార్యానికి సంతోషింన ధర్మదేవతలు నిజ రూపంలో వారికి సాక్షాత్కరించారు.హెగ్గడే దంపతులు ఎంతో సంతోషంతో వారికి ఆ ఇంటిని అప్పగించి, వారికి పూజలు చేశారు. ఆ ఇంటిని అందర నెలియాడిబీడు అని పిలవసాగారు. కాలక్రమేణా ఆ ఇల్లు కాస్తా ఆలయంగా రపు దిద్దుకుంది. ఆ ధర్మదేవతలకు ఇద్దరు పిల్లలు పుట్టారు. వారందర అక్కడే ఉండి, ధర్మపరిరక్షణ చేయసాగారు. కొంతకాలానికి వారందరూ విగ్రహాల రపంలో ఆ ఇంటిలోనే కొలువు తీరారు. అక్కడి ఆలయ పూజారికి ఒకరోజున పూనకం వచ్చి, ఆ దేవతల సన్నిధిలో శివలింగాన్ని ప్రతిష్టిం, పూజించవలసిందిగా గ్రామప్రజలను ఆదేశించాడు. దాంతో హెగ్గడే దంపతుల వంశీకుడైన అణ్ణప్ప హెగ్గడే అనే అతను మంగుళూరు పక్కనున్న కద్రి నుంచి శివలింగాన్ని తీసుకు వచ్చి ధర్మదేవతల సన్నిధి పక్కనే లింగాన్ని ప్రతిష్టించాడు. ఆ లింగమే మంజునాథుడుగా పూజలందుకుంటున్నాడు. అనంతరం ఓ వైష్ణవుడు తన ఆస్తి΄ాస్తులన్నింటినీ అమ్ముకుని ఆలయానికి అంగరంగవైభవంగా కుంభాభిషేకం జరిపించాడు. అప్పటినుంచి ఈ పుణ్యస్థలాన్ని అందరూ ధర్మస్థల అని పిలవసాగారు.ఆలయ వర్ణన...చెక్కస్తంభాలతో నిర్మితమైన ఈ ఆలయం అందమైన కళాకృతులతో శోభిల్లుతుంటుంది. ఆలయాన్ని చేరుకోగానే విశాలమైన ముఖద్వారం భక్తులకు స్వాగతం పలుకుతుంటుంది. ఆలయ ప్రాంగణంలో ఒక సన్నిధిలో మంజునాథుడు, మరో సన్నిధిలో నరసింహస్వామి దర్శనమిస్తారు. మరో సన్నిధిలో ΄ార్వతీ దేవి, ధర్మదేవతలు కొలువై ఉంటారు. ధర్మస్థల ప్రాంత్రానికి వెళ్లిన భక్తులు ముందుగా ఇక్కడకు సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని నేత్రావతి నదిలో స్నానమాచరించి, మంజునాథుని, అమ్మవారిని, నలుగురు ధర్మదేవతలను, గణపతిని, అణ్ణప్పదేవుని సందర్శించుకుని, ఆలయంలో ఇచ్చే తీర్థప్రసాదాలను స్వీకరించడం ఆనవాయితీ. అనంతరం ఆలయానికి బయట గల పురాతన రథాలను, వాహన ప్రదర్శనశాలను పుష్పవాటికను, వసంత మహల్‌ను సందర్శించుకుంటారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఆలయంలో జరిగే నిత్యాన్నదానంలో అన్ని కులాలు, మతాలవారూ తృప్తిగా భోజనం చేయవచ్చు. అవసరం అయితే ఆశ్రయం ΄÷ందవచ్చు.గోమఠేశ్వరుడు కొలువుదీరిన శ్రావణ బెళగొళ ఇక్కడికి సమీపంలోనే ఉంటుంది. ఎలా చేరాలంటే..?బెంగళూరు నుంచి ధర్మస్థలకు చేరుకోవడం సులువు. దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి ధర్మస్థలకు నేరుగా బస్సులున్నాయి. మంగుళూరు వరకు రైలులో వెళితే అక్కడినుంచి బస్సులో లేదా ప్రైవేటు వాహనాలలో ధర్మస్థలకు వెళ్లవచ్చు. మంగుళూరు ఎయిర్‌పోర్ట్‌నుంచి కూడా నేరుగా ధర్మస్థలకు బస్సులున్నాయి. ఇదీ చదవండి: అపుడు కాలుష్య కాసారం : ఇపుడు ఏడాదికి 600 టన్నుల పళ్లుఅన్ని విశ్వాసాలకూ, మతాలకూ చెందిన భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడి దేవతలను దర్శించుకుంటారు. మొక్కులు తీర్చుకుంటారు.ఈ ఆలయంలో నిత్యం పదివేలమందికి అన్నదానం, ఆధునిక వైద్యవిజ్ఞాన శాస్త్రానికి సైతం అంతుపట్టని పలు వ్యాధులకు ఔషధ దానాలతోబాటు వేలూ, లక్షలూ వెచ్చించి చదువుకొనలేని పేద విద్యార్థులకు సలక్షణమైన, నాణ్యమైన విద్యాదానమూ జరుగుతుంది. అంతేకాదు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అభాగ్యులు తలదాచుకునేందుకు వీలుగా ఇక్కడ ఆశ్రయమూ లభిస్తుంది. అదే బెంగళూరు నుంచి సుమారు డెబ్భై కిలోమీటర్ల దూరంలో గల ధర్మస్థల.– డి.వి.ఆర్.
ఫొటోలు
అంతర్జాతీయం

పాక్‌కు భారత్ సీరియస్ వార్నింగ్
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి (Terrorist attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దాడి తర్వాత నియంత్రణ రేఖ వెంట పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ క్రమంలో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్, భారత్‌కు చెందిన మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్ హాట్లైన్లో మాట్లాడుకున్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సైన్యం కాల్పులకు పాల్పడుతున్న విషయాన్ని ప్రస్తావించిన భారత్.. దాయాది దేశాన్ని హెచ్చరించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. ఏయే రోజు ఎక్కడెక్కడ పాక్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడిందో వివరించిన భారత సైనిక అధికారులు.. ఇకపై కొనసాగిస్తే చర్యలు తప్పవని.. దీటుగా బదులిస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు.. యుద్ధ వాతావరణం నెలకొనడంతో సరిహద్దు ప్రజలు అప్రమత్తమవుతున్నారు. ఇదే సమయంలో పాకిస్థాన్ (Pakistan) కూడా భద్రతాపరంగా పలు చర్యలు తీసుకుంటోంది. తాజాగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్, స్కర్దు తదితర ప్రాంతాలకు విమాన సర్వీసులను పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) రద్దు చేసింది. సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్థాన్ కూడా గగనతలాన్ని నిఘాను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే లాహోర్, కరాచీ నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లోని స్కర్దు, గిల్గిత్‌కు నడిచే విమాన సర్వీసులను పీఐఏ నిలిపివేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

చిగురిస్తున్న ఇండో-కెనడా స్నేహం
భారత్-కెనడా మధ్య సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ స్నేహం కొత్త చివుళ్లు వేస్తోందా? ఏడాదిన్నర కాలానికి పైగా గాడి తప్పిన భారత్, కెనడా దౌత్య సంబంధాలు పట్టాలెక్కబోతున్నాయా... అంటే అవుననే చెప్పాలి. కెనడా సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన లిబరల్ పార్టీ నేత, ఆ దేశ ప్రస్తుత తాత్కాలిక ప్రధాని, కాబోయే పూర్తికాలపు ప్రధాని మార్క్ కార్నీకి భారత్ ప్రధాని మోదీ పంపిన అభినందన సందేశానికి సంకేతం అదే. మార్క్ కార్నీకి ముందు కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో ఉన్నప్పుడు గత అక్టోబరులో రెండు దేశాలూ పరస్పరం హై కమిషనర్లను బహిష్కరించాయి. ఈ ఏడాది జూన్ మాసానికల్లా హై కమిషనర్ల వ్యవస్థను పునరుద్ధరించాలని ఉభయ దేశాలు తలపోస్తున్నాయి. ప్రస్తుతం ‘స్పెయిన్’లో భారత రాయబారిగా వ్యవహరిస్తున్న దినేష్ కుమార్ పట్నాయక్ ను కెనడాలో తదుపరి హై కమిషనరుగా భారత్ నియమించే అవకాశముందని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ త్వరలో ఆరంభమవనుందని తెలుస్తోంది. కెనడా ఎన్నికల ఓట్ల లెక్కింపు దాదాపు పూర్తయింది. 343 స్థానాలున్న పార్లమెంటు దిగువ సభలో లిబరల్ పార్టీ 168 సీట్లు, కన్జర్వేటివ్ పార్టీ 144 సీట్లు గెలుచుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మెజారిటీ రావాలంటే లిబరల్ పార్టీ 172 సీట్లు గెలవాలి. కానీ ఆ మేజిక్ నంబరుకు కొద్ది దూరంలో అది ఆగిపోయింది. చిన్న పార్టీల సహకారంతో లిబరల్ పార్టీ మైనారిటీ సర్కారు ఏర్పాటు చేసే అవకాశముంది. ఖలిస్థాన్ వేర్పాటువాద నేత హరదీప్ సింగ్ నిజ్జర్ 2023లో కెనడాలో హత్యకు గురయ్యాడు. భారత ప్రభుత్వ ఏజెంట్లే అతడిని హతమార్చారని కెనడా ఆరోపించడంతో ఆ దేశంతో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. తదనంతర పరిణామాల్లో కెనడాలో భారత హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మను కెనడా వెళ్లగొట్టడం, ప్రతిగా కెనడా దౌత్యవేత్తలను ఇండియా బహిష్కరించడం చకచకా జరిగిపోయాయి. దరిమిలా చాలినంత మంది దౌత్యవేత్తలు లేక కెనడా కాన్సులేట్లు మూతపడ్డాయి. నాటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పదవి నుంచి దిగిపోయారు. మరోవైపు కెనడా ఎన్నికల్లో ఖలిస్థాన్ సానుకూల నేత, న్యూ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు జగ్మీత్ సింగ్ కూడా ఓటమి పాలయ్యాడు. ఈ రెండు పరిణామాలు ఇండో-కెనడా బంధం మళ్లీ మొగ్గ తొడిగేందుకు పరిస్థితులను అనుకూలంగా మార్చాయి. ట్రూడోలా కాకుండా మార్క్ కార్నీ మరింత పరిణతితో వ్యవహరిస్తారని భారత్ అభిప్రాయపడుతోంది. - జమ్ముల శ్రీకాంత్

Bangladesh: చిన్మయ్ కృష్ణదాస్‌కు ఊరట
ఢాకా: ఇస్కాన్ మాజీ ప్రతినిధి, బంగ్లాదేశ్‌లో మైనారిటీ హక్కుల సాధన ఉద్యమకారుడు చిన్మయ్ కృష్ణదాస్‌కు ఎట్టకేలకు ఊరట లభించింది. బంగ్లాదేశ్ హైకోర్టు బుధవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రాజద్రోహం కేసులో కిందటి ఏడాది నవంబర్‌లో ఆయన్ని బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గతేడాది నవంబరులో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ బంగ్లా జాతీయజెండాను అగౌరవపరిచారనే అభియోగాలపై 2024 నవంబరు 25న ఢాకా హజారత్ షాహ్జలాల్ ఎయిర్‌పోర్టులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అనంతరం జైలుకు తరలించారు. ఆయన తరఫున వాదనలు వినిపించేందుకు న్యాయవాదులను సైతం అక్కడి ఆందోళనకారులు అనుమతించలేదు. చివరకు చిన్మయ్ భాగస్వామిగా ఉన్న బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే అనే సంస్థ.. 11 మందితో లాయర్ల బృందాన్ని ఏర్పాటుచేసింది. అయినా కూడా ఆయనకు బెయిల్ దక్కలేదు. మరోవైపు భారత్ సహా అంతర్జాతీయ సమాజం చిన్మయ్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించింది. శాంతియుతంగా నిరసన తెలిపే మైనారిటీల హక్కులను కాలరాయడం సరికాదంటూ భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. చిన్మయ్ కృష్ణదాస్ స్వస్థలం చిట్టాగాంగ్‌లోని సట్కానియా ఉపజిల. 2016-2022 మధ్య ఇస్కాన్ చిట్టాగాంగ్ డివిజనల్ సెక్రటరీగా దాస్ పని చేశారు. ఆపై హిందూ మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడిన బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన జాగరణ్ జోతే తరఫున ప్రతినిధిగా దాస్ పని చేశారు. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయనకంటూ అక్కడ ఓ పేరుంది. బంగ్లా మీడియా ఆయన్ని శిశు బోక్తాగా అభివర్ణిస్తుంటుంది. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు మైనారిటీ ప్రోటెక్షన్ లా తేవడంంలోనూ దాస్ కృషి ఎంతో ఉంది. కిందటి ఏడాది.. అక్టోబర్ 25న చిట్టాగాంగ్‌లో, నవంబర్ 22వ తేదీన రంగ్‌పూర్‌లో ఆయన నిర్వహించిన ర్యాలీలు దేశవ్యాప్త చర్చకు దారి తీశాయి. చిట్టాగాంగ్‌లో నిర్వహించిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాకు పైన కాషాయ జెండాను ఎగరేయడంతోనే ఆయనపై రాజద్రోహం కేసు నమోదు అయ్యింది.

ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన రద్దైంది. మే 9వ తేదీ మాస్కోలో జరగాల్సిన విక్టరీ డే వేడుకలకు ప్రధాని మోదీ బదులు.. భారత దౌత్య ప్రతినిధి హాజరవుతారని క్రెమ్లిన్ వర్గాలు ఇవాళ ప్రకటించాయి. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ మీద సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా రష్యా ప్రతీ ఏటా మే 9వ తేదీని విక్టరీ డేగా నిర్వహిస్తుంటుంది. ఈ ఏడాది 80వ వార్షికోత్సవం సందర్భంగా పలు ప్రపంచ దేశాల అధినేతలకు ఆహ్వానం పంపింది. అందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ వర్గాలు ధృవీకరించాయి కూడా.అయితే ఆయన బదులు.. ప్రతినిధి హాజరవుతారని ఇప్పుడు ప్రకటన వెలువడింది. అయితే పహల్గాం ఘటన తర్వాత.. పాక్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలోనే మోదీ పర్యటన రద్దై ఉండొచ్చని పలు ఆంగ్ల మీడియా ఛానెల్స్ కథనాలు ఇస్తున్నాయి.
జాతీయం

‘రాహుల్, కాంగ్రెస్ పార్టీలకు భయపడి మేం నిర్ణయాలు తీసుకోం’
ఢిల్లీ : వచ్చే జనగణనలో కులగణన చేర్చుతూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రతిపక్ష పార్టీలు రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కుట్రలు, కుతంత్రాలు చేశారని, ముస్లింలందరినీ బీసీల్లో చేర్చారన్నారు కిషన్ రెడ్డి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తమ ఘనతేనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ కు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు కిషన్ రెడ్డి. తాము రాహుల్ గాంధీకో, కాంగ్రెస్‌కో భయపడి కులగణన నిర్ణయం తీసుకోలేదన్నారు. జనగణనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారంటే..జనగణనలో భాగంగా కులగణన చేపట్టాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయించడం పట్ల.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.ఈ కులగణన చరిత్రపుటల్లో నిలిచిపోనుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తర్వాత ప్రతిపక్ష పార్టీలు.. రాజకీయ నాటకాలకు తెరలేపుతున్నారు.గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి.. కుట్రలు, కుతంత్రాలు చేశారు.ముస్లింలందరినీ.. బీసీల్లో చేర్చారు.దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి.. ప్రజలను మతం పేరుతో విడగొడుతూ.. మతఘర్షణలు సృష్టించిన కాంగ్రెస్ పార్టీ.. కులాల పేరుతోనూ.. సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేసింది.కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలపై, బీసీలపై కపటప్రేమను చూపించడం ఒక్కటే కాదు.. వీలు చిక్కినపుడల్లా విషం కక్కిన సందర్భాలు కూడా చరిత్రలో ఎన్నో ఉన్నాయి.ఎస్సీ అయిన రామ్‌నాథ్ కోవింద్ గారిని, ఎస్టీ అయిన ద్రౌపది ముర్ముగారిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినపుడు.. వ్యతిరేకించి తమ పార్టీ అభ్యర్థులను బరిలో దింపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మాదిగ రిజర్వేషన్ల సమస్యను పరిష్కరించేందుకు.. మోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పూర్తి వివరాలు అందజేసిన తర్వాత.. ఎస్సీ వర్గీకరణకు మార్గం సుగమమైంది.వెనుకబడిన వర్గాలనుంచి వచ్చిన.. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కులం పేరుతో దూషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.కాంగ్రెస్ పార్టీ మొదట్నుంచీ కూడా.. బీసీలపట్ల మొసలికన్నీరు కార్చుతోంది. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఏనాడూ పనిచేయలేదు.2018లో జాతీయ బీసీ కమిషన్ కు చట్టబద్ధత కల్పించిన ఘనత ఎన్డీయే ప్రభుత్వానికే దక్కుతుంది.2019లో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకోసం 10% రిజర్వేషన్ ను (EWS) అమల్లోకి తీసుకొచ్చింది.సమాజంలోని అన్ని వర్గాలకు సరైన న్యాయం జరగాలని.. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ నినాదంతో చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నాం. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించి వారి సాధికారిత కోసం, వారికి ఆత్మగౌరవం కల్పించిన ఘనత మోదీ గారిది.ముస్లిం మహిళలపై ‘ట్రిపుల్ తలాక్’ వంటి అనాగరికమైన విధానాలను రద్దు చేసి..ముస్లిం మహిళలకు హక్కులు, అధికారాన్ని కల్పించిన ఘనత మోదీ ప్రభుత్వానిది.సమాజంలోని ఏ ఒక్క వర్గానికీ.. తమను పట్టించుకోవడం లేదు.. అనే భావన రానీయకుండా మేం పనిచేస్తున్నాం.1881 నుంచి 1931 కులగణన జరిగింది. కానీ స్వాతంత్ర్యానంతరం కులగణన జరగకూడదని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం 1951 నుంచి నేటివరకు ఏనాడూ కులగణన జరగలేదు.మొదటినుంచీ కాంగ్రెస్ పార్టీ కులగణనకు వ్యతిరేకంగానే ఉంది. నెహ్రూ, మౌలానా ఆజాద్ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కులగణన పట్ల బహిరంగంగానే విముఖత వ్యక్తం చేశారు.మండల్ కమిషన్ ఇచ్చిన నివేదికను రాజీవ్ గాంధీ వ్యతిరేకించారు.6 సెప్టెంబర్, 1990 నాడు.. పార్లమెంటులో రాజీవ్ గాంధీ మాట్లాడుతూ.. దేశంలో బీసీలకంటే ముస్లింలు విద్యాపరంగా, సామాజికంగా, ఆర్థికంగా వెనకబడి ఉన్నారని, వారికి చేయూత అందించాలని చెప్పారు. బీసీలను పక్కనపెట్టి ముస్లింల హక్కుల గురించి మాట్లాడారు.అంతే తప్ప బీసీలకు న్యాయం చేసే విషయంలో ఒక్క మాట కూడా సానుకూలంగా మాట్లాడలేదు.2010లో నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు.. కులగణనపై మంత్రులతో సబ్ కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అదే సమయంలో, 2010లో బీజేపీ పక్షనేత సుష్మాస్వరాజ్ గారు.. నాటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ గారికి లేఖ రాస్తూ.. తమ పార్టీ కులగణనకు అనుకూలంగా ఉన్నామని లేఖ రాశారు.దీనిపై కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని పక్కనపెట్టి.. 2011లో జనగణన చేసింది.బీజేపీ మొదట్నుంచీ కులగణనకు సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తోంది. కానీ ఇది రాజకీయ అస్త్రంగా కాకుండా.. సామాజికంగా అన్ని వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడేలా ఉండాలనేది బీజేపీ ఆలోచన.దేశంలో కులగణన జరిగితే.. సామాజిక, ఆర్థిక పరమైన లబ్ధి పేదలకు అందించడంలో ఈ డేటా ఉపయోగపడుతుంది.సంక్షేమపథకాలు, రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు చేసేందుకు జనగణన డేటా ఉపయుక్తం అవుతుంది.ఇది మా ప్రభుత్వ స్పష్టమైన వైఖరిని ప్రస్ఫుటం చేసింది.కానీ, 2011లో జనగణనతో పాటుగా కులగణన చేయడాన్ని నాటి హోంమంత్రి చిదంబరం.. వ్యతిరేకించారు.బీజేపీ తరపున.. చాలా సందర్భాల్లో అమిత్ షా గారు మాట్లాడుతూ.. జనగణన చేపట్టినపుడు కులగణన చేస్తామని చెప్పారు.గతంలో సుష్మాస్వరాజ్ గారు ఇచ్చిన లేఖ ఆధారంగా.. మా పాలసీ మేరకు.. ఇవాళ మేం జనగణనలో భాగంగా కులగణన చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇవాళ, కాంగ్రెస్ అండ్ pvt Ltd కంపెనీలు.. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నాయి. మోదీ సర్కారు తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం.. తమ ఘనత అన్నట్లు రాహుల్ గాంధీ చెప్పుకోవడం సిగ్గుచేటు.రాహుల్ గాంధీకో, కాంగ్రెస్ పార్టీకో భయపడి బీజేపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదు.ఎద్దులబండి కింద కుక్క.. మొత్తం బండిని తానే మోస్తున్నానని అనుకుంటుంది.అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా.. తాము చెప్పినట్లే ప్రభుత్వాన్ని నడిపిస్తామని చెప్పుకుంటోంది.ఇది హాస్యాస్పదం.2010లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ కమిట్మెంట్ తో అయితే.. నిర్ణయం తీసుకున్నామో.. దానికి కట్టుబడి ముందుకెళ్తున్నాం.దేశానికి, సమాజానికి ఏ నిర్ణయం వల్ల మేలు జరుగుతుందో ఆలోచించి.. నిర్ణయం తీసుకుంటాం.ఆ నిర్ణయాలు తీసుకునే సత్తా బీజేపీకి, ఎన్డీయేకు, మోదీ గారి నాయకత్వానికి ఉంది.ఆర్టికల్ 370 రద్దు, రామజన్మభూమి, ట్రిపుల్ తలాక్, GST వంటి ఏ నిర్ణయాన్నయినా.. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటాం.మేం చేపట్టబోయే కులగణనలో.. ఎట్టిపరిస్థితుల్లోనూ ముస్లింలను బీసీల్లో చేర్చబోం.మత ప్రాతిపదికన ఎవరినీ బీసీల్లో చేర్చే ప్రసక్తే లేదు. రాజ్యాంగ విరుద్ధమన్న న్యాయస్థానాల తీర్పుకు విరుద్ధంగా బీసీ ముస్లింలు అనే ఆలోచనతో కాంగ్రెస్ ముందుకెళ్లింది. దీన్ని మేం ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం.కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా.. షార్ట్ టర్మ్ లక్ష్యాలతో, ఓటుబ్యాంకు రాజకీయాలు, అధికార దాహంతో తీసుకున్న నిర్ణయాలే తప్ప.. దేశం హితం కోసం, దేశ ప్రజల అభ్యున్నతి గురించి ఆలోచించలేదు.తెలంగాణ, కర్ణాటకల్లో రాష్ట్రాల్లో చేపట్టిన కులగణన కూడా హడావుడిగా.. ఏదో సాధించామని చెప్పుకునే ప్రయత్నం చేశారు తప్ప.. ఇందులో చిత్తశుద్ధి లేదు. ఇది కులగణన కాదు. ఇది కులాలకు సంబంధించిన సర్వే.కులగణన చేయాలంటే.. విధానపరమైన నిర్ణయాలు చాలా తీసుకోవాల్సి ఉంటుంది.50% జనాభాను కూడా చేరుకోకుండా మొత్తం సర్వే పూర్తి చేశామని చెప్పడం హాస్యాస్పదం.శాస్త్రీయమైన పద్ధతిలో ఈ సర్వే జరగలేదు.బీసీల్లోని అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే.. నిష్పాక్షికమైన, సైంటిఫిక్ పద్ధతిలో కులగణన జరగాలనేదే మోదీ సర్కారు ఆలోచన. దీనికోసమే.. జనగణన వరకు వేచి చూశాం.జనగణన చేస్తున్నప్పుడే.. కులగణన సాధ్యమవుతుంది.ఈసారి నిర్మాణాత్మకంగా జనగణన చేపట్టడం అందులో భాగంగా కులగణన జరపాలనేదే మా ప్రభుత్వ స్పష్టమైన విధానం.రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ గారు పదేళ్లలో కులగణన ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు.2010లో రేవంత్ ఏ పార్టీలో ఉన్నారో తెలియదు.అప్పుడే మేం కులగణనకు ఆమోదం తెలిపాము.ప్రతి పదేళ్లకోసారి, దశాబ్దపు మొదటి సంవత్సరంలో కులగణన జరుగుతుంది.బీజేపీ అధికారంలోకి వచ్చాక తొలిసారి జనగణన జరుగుతున్నప్పుడు.. కులగణన కూడా జరుగుతుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టలేదో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి.నెహ్రూ, ఇందిర, రాజీవ్ గాంధీలు కులగణను వ్యతిరేకించారు.తూతూ మంత్రంగా.. తంతు లాగా కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం అనుకోవడం లేదు.వాస్తవాలకు అనుకూలంగా, శాస్త్రీయమైన పద్ధతిలో కులగణన ఉంటుంది.ఒకసారి పబ్లిష్ చేసి.. లోపాలుంటే.. మరో రెండ్రోజులు సమయం ఇచ్చి.. మీ ఇష్టం వచ్చినట్లు సర్వే చేశారు తప్ప.. ఇందులో శాస్త్రీయత లేదు.ఈ విషయం రాహుల్ గాంధీకి అర్థం కాలేదు.తెలంగాణలో ఉన్న రాంగ్ రోల్ మోడల్ మాకు అవసరం లేదు.మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి.. సమగ్రంగా జనగణ చేస్తాం.కులగణన చేపట్టేందుకు ‘సెన్సెస్ యాక్ట్ 1948’లో సవరణ తీసుకొచ్చి.. ఇందులో ‘కులం’ అనే పదాన్ని ఓ ప్యారామీటర్ గా చేర్చాలి.వచ్చే పార్లమెంటు సమావేశాల్లో.. దీనికి సంబంధించిన సవరణ తీసుకొచ్చాకే.. జనగణనపై ముందుకెళ్తాం.కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడుతున్నారు.తెలుగు ప్రజలు, దేశ ప్రజలు ఈ రెండు పార్టీలను నమ్మడం లేదు.కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏనాడూ బీసీలకు సంబంధించిన అంశాల్లో.. రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో పనిచేయలేదు.42% బీసీ జనాభా ఉన్నప్పటికీ.. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను ఎందుకు ఇవ్వలేదు.కులగణను ఏనాడూ బీజేపీ వ్యతిరేకించలేదు.మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఓడిపోవడం ఖాయం.2026లో జనగణన మొదలయ్యే అవకాశం ఉంటుంది.ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడే కులగణన ఉంటుంది.రేవంత్ సర్కారు చేసిన సర్వే.. బీసీ వ్యతిరేక సర్వే.బీసీ ముస్లింలని జోడించి చేసిన సర్వేను మేం వ్యతిరేకిస్తున్నాం.హైదరాబాద్ లో 150 కార్పొరేషన్ సీట్లలో.. బీసీలకు రిజర్వ్ చేసిన 50 సీట్లలో.. 30 సీట్లు ముస్లింలే గెలిచారు

భారత జవాన్‌కు భార్యగా పాకిస్తానీ మహిళా?
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పౌరుల వీసాలను భారత్ రద్దు చేయడం.. ఆసక్తికర కథనాలను కళ్ల ముందు ఉంచుతోంది. పదిహేడేళ్లుగా భారత్‌లో ఉంటూ ఇక్కడి ఎన్నికల్లో ఓటేసిన వ్యక్తి తిరిగి అక్కడికి వెళ్లిపోవడం లాంటివి మీడియాకు ఎక్కాయి. అయితే భారత జవాన్‌ను వివాహం చేసుకుని ఇక్కడే ఉండిపోవాలనుకున్న ఓ పాకిస్థానీ మహిళకు హోంశాఖ ఝలక్ ఇవ్వగా.. బార్డర్ దాటే చివరి నిమిషంలో కోర్టు నుంచి ఊరటతో ఆమె ఆగిపోవాల్సి వచ్చింది.పీటీఐ కథనం ప్రకారం.. పాక్ పంజాబ్‌కు చెందిన మినాల్ ఖాన్‌కు జమ్ము కశ్మీర్లో డ్యూటీ చేసే సీఆర్పీఎఫ్ జవాన్ మునీర్ ఖాన్ కు కిందటి ఏడాది మేలో ఆన్లైన్లో వివాహం(నిఖా) జరిగింది. ఈ ఏడాది మార్చిలో షార్ట్ టర్మ్ వీసా మీద ఆమె భారత్‌కు వచ్చింది. మార్చి 22వ తేదీతో ముగిసినప్పటికీ ఇక్కడే ఉండిపోయింది. అయితే ఆమె ఎలా ఉండగలిగిందో ఇప్పటికీ అర్థం కావట్లేదని అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈలోపు పహల్గాం దాడి తర్వాత పాకిస్థానీలు భారత్ ను వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మినాల్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఏప్రిల్ 29వ తేదీలోపు పాక్ పౌరులు వెనక్కి వెల్లిపోవాలని కేంద్రం డెడ్ లైన్ విధించింది. ఈ క్రమంలో.. అట్టారీ వాఘా సరిహద్దుకు చేరుకుని బస్సులో కూర్చుందామె. అంతలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది.ఆమె లాయర్ అంకూర్ శర్మ కోర్టు నుంచి స్టే ఆదేశాలతో అక్కడికి చేరుకున్నారు. తన వీసాను పొడిగించాలని ఆమె కేంద్ర హోం శాఖ వద్ద విజ్ఞప్తి చేసుకుందని.. అది ఇంకా పెండింగ్ లోనే ఉందని.. కాబట్టి కోర్టు ఈఅంశాన్ని పరిగణనలోకి తీసుకుని ఆమెను తరలించడంపై నిలిపివేత ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. దీంతో ఆమె బస్సు దిగి వెనక్కి వచ్చేసింది. ఈ ఎపిసోడ్లో ట్విస్ట్ ఏంటంటే.. ఆమె తరఫున వాదించిన అంకూర్ శర్మ బీజేపీ అధికార ప్రతినిధిగా గ్రేటర్ కశ్మీర్ ఓ కథనం ఇచ్చింది. అంతేకాదు ప్రధాని మోదీకి మినాల్ చేసిన విజ్ఞప్తిని కూడా ప్రముఖంగా ప్రచురించింది.‘‘మేం రూల్స్ అన్నీ ఫాలో అయ్యాం. సుదీర్ఘ వీసా కోసం నేను ఎప్పుడో దరఖాస్తు చేసుకున్నా. అది త్వరలోనే వస్తుందని అధికారులు మాకు చెప్పారు కూడా. ఆలోపు దాడి జరిగింది. నా భర్త నుంచి నన్ను విడదీసే ప్రయత్నం జరిగింది. నాలాగే.. ఎంతో మంది తమ తల్లులు, తండ్రుల నుంచి విడిపోవాల్సిన పరిస్థితి. ఇది మానవత్వం అనిపించుకోదు. ప్రధాని మోదీకి మేం చేసే విజ్ఞప్తి ఒక్కటే.. మాలాంటి వాళ్లకు న్యాయం చేయమని అని ఆమె గ్రేటర్ కశ్మీర్ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.మినాల్‌పై అనుమానాలు?ఇదిలా ఉంటే.. మినాల్ ఖాన్ ఎపిసోడ్ సోషల్ మీడియాకు ఎక్కడం పెద్ద చర్చనీయాంశమైంది. ఒక జవాన్‌ను పాకిస్థాన్ మహిళను, అదీ ఆన్లైన్లో పరిచయంతో వివాహం చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. షార్ట్ వీసా ముగిసిన తర్వాత కూడా నెలపైనే ఆమె ఎక్కడ నివసించగలిగిందని ప్రశ్నిస్తున్నారు. బహుశా ఇది ట్రాప్ అయి ఉండొచ్చని.. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. మినాల్‌కు మద్దతుగానూ పలువురు కామెంట్లు చేస్తుండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పౌరులను వెనక్కి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. ఇందుకు తొలుత ఏప్రిల్ 29వ తేదీని గడువుగా ప్రకటించి.. ఆ తర్వాత మరొక రోజు పొడిగించింది. ఏప్రిల్ 30వ తేదీతో అట్టారీ వాఘా సరిహద్దును మూసేశారు. గత ఆరో రోజులుగా 786 మంది పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లిపోగా, అందులో 55 మంది దౌత్యవేత్తలు, సహాయ సిబ్బంది ఉన్నారు. అలాగే.. పాకిస్థాన్ నుంచి 1,465 భారతీయులు తిరిగి వచ్చారని కేంద్రం ప్రకటించింది.

ఐదు ఫుల్ బాటిళ్లు కచ్చా తాగేసి.. విషాదం నింపిన పందెం
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అనే చెప్పే వైద్యులు.. పరిమితంగా తాగాలంటూ మరోవైపు సూచించడం ఆశ్చర్యం కలిగించేదే!. అయితే.. డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఏడాదిలో నమోదు అయ్యే మరణాల్లో 4.7 శాతం మరణాలు మద్యానికి సంబంధించినవే ఉంటున్నాయట. ఏడాదికి సుమారు 26 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇదిలా ఉంటే..కర్ణాటకలోని కోలార్ జిల్లా ములబాగిల్‌లో ఘోరం జరిగింది. స్నేహితులతో రూ.10 వేల కోసం పందెం కాసిన ఓ యువకుడు 5 ఫుల్ బాటిళ్ల లిక్కర్‌ను.. అదీ నీరు కలపకుండా(కచ్చాగా) గడగడా తాగేశాడు. ఆపై తీవ్ర అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్నేహితులతో సిట్టింగ్ వేసిన టైంలో తాను ఐదు సీసాల మద్యాన్ని నీరు కలపకుండా తాగగలనని కార్తీక్ (21) అనే యువకుడు సవాల్ విసిరాడు. దానికి స్పందించిన స్నేహితులు.. అలా తాగితే రూ. 10 వేలు ఇస్తానని పందెం కాశారు. దీంతో.. కార్తీక్ ఐదు బాటిళ్ల మద్యాన్ని నీరు కలపకుండా గడగడా తాగేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని ములబాగిల్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కార్తీక్ ప్రాణాలు కోల్పోయాడు. కార్తీక్‌కు ఏడాది క్రితమే వివాహమైంది. అతడి భార్య ఎనిమిది రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటనపై సమాచారం అందుకున్న నాన్‌గలి పోలీసులు కార్తీక్ స్నేహితులు వెంకటరెడ్డి, సుబ్రమణి సహా ఆరుగురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు.

బంగ్లాదేశ్ సాయంతో.. భారత్‌లో కుట్రకు పాకిస్తాన్ తెర
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పహల్గాం దాడిపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్.. పాక్ బుద్ధి చెప్పే ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో భారత ఇంటెలిజెన్స్ వర్గాలు,భద్రతా బలగాలు హైఅలెర్ట్ ప్రకటించాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దులో అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించాయి. అందుకు పాక్ కుట్రలే కారణమని భద్రతా ఏజెన్సీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.గూఢాచార సంస్థలు (Intelligence agencies) సమాచారం మేరకు..ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు, పాకిస్తాన్ ఐఎస్ఐ, పాకిస్తాన్ సైనికులు మొహరించినట్లు గుర్తించాయి. కాబట్టే బంగ్లాదేశ్ సరిహద్దులో మరింత అప్రమత్త అవసరమని భద్రతా ఏజెన్సీలు హెచ్చరిస్తున్నాయి.సైనిక చర్యతో పాటు బంగ్లాదేశ్‌తో పాటు ఆ దేశ రాడికల్ ఇస్లామిస్ట్ గ్రూప్‌లతో పాక్ సన్నిహిత సంబంధాల్ని మరింత పటిష్టం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. తద్వారా భారత్‌లో అల్లర్లు సృష్టించే దిశగా కుట్రకు తెరతీసినట్లు సమాచారం. అలా భారత్‌లో వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేలా చర్యలకు సిద్ధమైనట్లు పలు ఆధారాల్ని సేకరించాయి. ఇటీవల బంగ్లాదేశ్‌కు సరిహద్దు ప్రాంతమైన పశ్చిమ బెంగాల్, ముర్షిదాబాద్ జిల్లాల్లో వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లలో బంగ్లాదేశ్ పౌరులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఆ అల్లర్లలో ముగ్గురు పౌరులు మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో మళ్లీ అలజడులు జరిగే అవకాశముందని భారత భద్రతా సంస్థలు గుర్తించాయి. సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ విధించాయి. గూఢచార సంస్థలు అందుకు తగ్గ ఆధారాల్ని కేంద్రానికి సమర్పించాయి. ఈ భారత్‌లో మళ్లీ అలజడులు జరిగే అవకాశముందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతో సరిహద్దులుగా ఉన్న భారత్ భూభాగంగా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఎన్ఆర్ఐ

డల్లాస్‌లో నిరాశ్రయుల ఆశ్రయ గృహంలో పేదలకు ఆహారం
తెలంగాణా పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (Telangana Peoples Association of Dallas) మరో సేవా కార్యక్రమాన్ని చేపట్టింది. అమెరికాలోని డల్లాస్ ప్రాంతంలో 'ఫుడ్ డ్రైవ్'తో అన్నార్తుల ఆకలి తీర్చింది. Austin Street Homeless Shelter లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఒక రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో TPAD సభ్యులు స్వయంగా పాస్తా, చికెన్, మాష్డ్ పొటాటో తదితర వంటకాలు తయారు చేసి.. అన్నార్తులకు వడ్డించారు. 450 మందికి పైగా నిరాశ్రయుల ఆకలి తీర్చారు. అనురాధ మేకల (ప్రెసిడెంట్), రావు కల్వల (FC చైర్), పాండు పాల్వే (BOT చైర్), రమణ లష్కర్ (కోఆర్డినేటర్), దీపికా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఫుడ్ డ్రైవ్‌లో 450 మందికి పైగా నిరాశ్రయులకు ఆహారం వడ్డించామని, టీప్యాడ్ చెందిన 50 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలియజేశారు. టీప్యాడ్ సీనియర్ నాయకుడు రఘువీర్ బండారు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. (మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Texas: మృత్యువుతో పోరాడి ఓడిన దీప్తి
ఆస్టిన్: అమెరికా టెక్సాస్‌లో తెలుగు విద్యార్థిని హిట్ అండ్ రన్ కేసు విషాదాంతంగా ముగిసింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వంగవోలు దీప్తి(Deepthi Vangavolu)కన్నుమూశారు. ఈ విషయాన్ని అక్కడి అధికారులు ఇచ్చిన సమాచారం ద్వారా కుటుంబ సభ్యులు ధృవీకరించారు. దీంతో గుంటూరులోని ఆమె స్వస్థలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీప్తి(23) తండ్రి హనుమంత రావు చిరువ్యాపారి. ఆమె కుటుంబం గుంటూరు(Guntur) రాజేంద్రనగర్ రెండో లైనులో నివాసం ఉంటోంది. టెక్సాస్‌లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్‌లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈలోపు రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు ఆమెను కబళించింది. ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీప్తి తలకు తీవ్ర గాయమైంది. స్నిగ్ధకు కూడా గాయాలయ్యాయి. దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. క్రౌడ్ ఫండింగ్(Crowd Funding) ద్వారా ఆమె చికిత్స కోసం ప్రయత్నాలు కొనసాగగా.. మంచి స్పందన లభించింది. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి చికిత్స పొందుతూ కన్నుమూసింది. శనివారం(ఏప్రిల్ 19) నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉంది. మరో బాధితురాలు స్నిగ్ధ ప్రస్తుతం అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం. అవే ఆమె చివరి మాటలు..దీప్తి మృతి వార్త విని ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదిస్తున్నారు. చదువులో చాలా చురుకైన విద్యార్థిని అని, అందుకే పొలం అమ్మి మరీ అమెరికాకు పంపించామని చెప్పారు. నెల రోజుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి కావాల్సి ఉందని, ఆ టైంకి మమ్మల్ని అమెరికాకు రావాలని ఆమె కోరిందని, అందుకు ఏర్పాట్లలో ఉండగానే ఇలా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 10వ తేదీన దీప్తి చివరిసారిగా తమతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. కాలేజీకి టైం అవుతోందని.. ఆదివారం మాట్లాడతానని చెప్పి హడావిడిగా ఫోన్ పెట్టేసిందని.. అవే తమ బిడ్డ మాట్లాడిన చివరి మాటలని గుర్తు చేసుకుని బోరున విలపించారు.

దుబాయి హతుల వారసులకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఇటీవల దుబాయిలో హత్యకు గురైన ఇద్దరు తెలంగాణ యువకుల కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగాలు ఇవ్వాలని జపాన్ పర్యటన నుంచి ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారని తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ది కార్పోరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే అనిల్ ఈరవత్రి ఒక ప్రకటనలో తెలిపారు. నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టపు ప్రేమ్ సాగర్‌తో పాటు, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేట కు చెందిన స్వర్గం శ్రీనివాస్ లు దుబాయి లో హత్యకు గురైన విషయం తెలిసిందే. దుబాయి నుంచి మృత దేహాలను త్వరగా స్వదేశానికి తెప్పించడానికి చర్యలు తీసుకోవాలని సీఎం అధికారుల్ని ఆదేశించినట్లు అనిల్ తెలిపారు.. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దుబాయి లోని భారత రాయబార కార్యాలయానికి, ఢిల్లీ లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖలు రాసినట్లు వెల్లడించారు. మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:ఎన్నారై అడ్వయిజరీ కమిటీ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్ బృందం, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి లు మృతుల కుటుంబాలను పరామర్శించారు.

రాయలసీమ ప్రగతికి డాలస్‌లో జీఆర్ఏడీఏ అడుగులు
గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డాలస్ ఏరియా (GRADA) ఆధ్వర్యంలో ఏప్రిల్ 13న ఫ్రిస్కో, టెక్సాస్‌లో రాయలసీమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలపై సమావేశం జరిగింది. రాయలసీమ సమస్యలు, అభివృద్ధి అవకాశాలు, తెలుగు భాషా సాహిత్యాల ప్రాముఖ్యతపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమకు చెందిన రచయిత భూమన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన తన ప్రసంగంలో రాయలసీమ ప్రస్తుత పరిస్థితి, ముఖ్యంగా దీర్ఘకాలంగా వేధిస్తున్న నీటి సమస్యలు, వెనుకబాటుతనం గురించి ఎంతో ఆవేదనతో, స్పష్టంగా వివరించారు.మన ప్రాంత సహజ సంపద అయిన శేషాచలం అడవుల గురించి, ముఖ్యంగా ఎర్రచందనం చెట్ల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విలువైన సంపదను అక్రమ మార్గాల్లో ఇతర దేశాలకు తరలించి లాభం పొందకుండా, స్థానికంగానే వాటి ఆధారిత పరిశ్రమలను స్థాపించి, ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా మన ప్రాంతాన్ని ఎలా ఆర్ధికంగా బలోపేతం చేయవచ్చో ఆయన చక్కగా వివరించారు. ఆయన మాటలు మనందరిలో కొత్త ఆలోచనలను రేకెత్తించాయి. సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే రాయలసీమ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందనే ఆశాభావాన్ని ఆయన కలిగించారు.మరో గౌరవ అతిథిగా కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ఛాన్సలర్, ప్రఖ్యాత విద్యావేత్త ప్రొఫెసర్ పి. కుసుమ కుమారి హాజరయ్యారు. ఆమె తన ప్రసంగంలో తెలుగు భాష మాధుర్యం, సాహిత్యం గొప్పదనం, పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. నంద కోర్వి, అనిత నాగిరెడ్డి, సతీష్ సీరం, బ్రహ్మ చిరా, హరినాథ్ పొగకు, హేమంత్ కాకుట్ల, జగదీశ్వర నందిమండలం, జగదీష్ తుపాకుల, పవన్ పల్లంరెడ్డి, ప్రసాద్ నాగారపు, రాజు కంచం, శివ అద్దేపల్లి, శివ వల్లూరు, శ్రీధర్ బొమ్ము, శ్రీకాంత్ దొంత, సురేష్ మోపూరు, ఉమా గొర్రెపాటి, మరియు కార్తీక్ మేడపాటి ఈ సమావేశానికి హాజరయ్యారు.
క్రైమ్

భూమికపై విచక్షణా రహితంగా దాడి చేసిన భర్త
గుడివాడరూరల్: అనుమానం పెనుభూతమై భార్యపై కత్తితో భర్త విచక్షణా రహితంగా దాడి చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన మట్టా అశోక్, భూమికలకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఆటోడ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న అశోక్ చెడు అలవాట్లకు బానిసై తరచూ అనుమానంతో భార్యను వేధిస్తుండేవాడు. ఇటీవల జరిగిన గొడవతో భార్య భూమిక పిల్లలను తీసుకుని సమీపంలో నివాసముంటున్న తల్లి రాణి ఇంటికి వెళ్లింది. ఈక్రమంలో మంగళవారం తన బట్టలు తీసుకునేందుకు చెల్లి అనుష్కతో కలిసి భర్త అశోక్ ఇంటికి వెళ్లిన భూమికపై భర్త కత్తితో విచక్షణా రహితంగా మొఖంపై దాడి చేసి పొట్టలో పొడిచాడు. అడ్డుకోబోయిన చెల్లిపై కూడా దాడి చేయడంతో ఆమె చేతికి తీవ్ర గాయమైంది. అనంతరం అశోక్ పరారయ్యాడు. గాయపడిన వారు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి వారిని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. భూమిక పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య సేవల నిమిత్తం విజయవాడ తరలించారు. బాధితురాలి తల్లి రాణి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ వి.దీరజ్ వినీల్, స్థానిక పోలీస్ అధికారులతో కలిసి గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చి ఘటనపై ఆరా తీశారు. అనంతరం ఇందిరానగర్ కాలనీలోని సంఘటనా స్థలానికి డీఎస్పీ వెళ్లి పరిశీలించారు.

అరెస్ట్ చేసిన బాలుడు ఎక్కడ?
హైదరాబాద్: ఎలాంటి తప్పు చేయని తన కుమారుడిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారని మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌కు బుధవారం ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్..పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తూ మే 5వ తేదీకి వాయిదా వేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఏప్రిల్ 28న మహబూబ్‌నగర్ జిల్లా కడ్తాల్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసులు తన కమారుడు మేకల కళ్యాణ్‌పై ఎలాంటి కేసు నమోదు చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా, కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం కూడా ఇవ్వకుండా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆరోపిస్తూ అలివేలు అనే మహిళ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు దాఖలు చేసింది. పోలీసులు అక్రమ కస్టడీకి తీసుకున్న వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చూడగా అక్కడ తన కుమారుడు కనిపించలేదని పిటిషన్లో పేర్కొన్నారు.తర్వాత మూడు గంటల సమయంలో తన కుమారుడి ఫోన్ నుంచి కాల్ రాగా అతన్ని కోర్టులో హాజరు పరుస్తున్నామని చెప్పిన పోలీసులు కోర్టు ఎదుట కూడా హాజరు పర్చకుండా ఎక్కడికి తీసుకెళ్లారో కూడా సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో న్యాయవాది అమర్నాథ్ ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేస్తూ తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కమిషన్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేస్తూ ఈ కేసుపై విచారణ జరిపించి మే 5వ తేదీలోపు పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది.

థాయ్‌లాండ్‌లో హ్యాండ్లర్!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు మంగళవారం అరెస్టు చేసిన అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా కేసు దర్యాప్తు ముమ్మరమైంది. ఈ దందాలో కీలక వ్యక్తిగా భావిస్తున్న ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ థాయ్‌లాండ్‌లో ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. హవాలా నెట్వర్క్ మీద దృష్టి పెట్టిన పోలీసులు సహకరించిన వారి కోసం ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం జ్యుడీíÙయల్ రిమాండ్‌లో ఉన్న అభిష్ క్, హర్షవర్థన్, ధావల్, రాహుల్‌లను పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఓజీ కుష్ పండించేదీ అతడేనా..? ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్, మారువానా, హైడ్రాపోనిక్ గాంజా, ఓజీ కుష్ ఇలా వివిధ పేర్లతో పిలిచే గంజాయితో పాటు మ్యాజిక్ మష్రూమ్స్‌ను ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ సరఫరా చేస్తున్నాడు. ఈ గంజాయి థాయ్లాండ్లోనే ఎక్కువగా పండుతుంది. జబల్పూర్కు చెందిన హర్షవర్థన్‌కు ఓడల ద్వారా చేరింది కూడా థాయ్‌లాండ్ నుంచే. దీన్నిబట్టి ఈ ఓజీ కుష్‌ను హ్యాండ్లరే పండించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నుంచి ఈ ఓజీ ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు ఎగుమతి అవుతోంది. హైడ్రోఫోనిక్ టెక్నిక్ విధానంలో కృత్రిమ కాంతితో పండిస్తుంటారు. ఆన్లైన్లో విత్తనాలు ఖరీదు చేసి, ఎల్ఈడీ లైట్లను ఉపయోగించి గంజాయి మొక్కలను పెంచుతారు. ఏమాత్రం మట్టితో అవసరం లేకుండా ప్రత్యేకంగా తయారు చేసిన కుండీలు, ట్రేల్లో ఇసుక, కంకర లేదా నీటిలో అదనపు పోషకాలతో ఉపయోగించి సాగు చేస్తుంటారు. కొందరు మాత్రం కొబ్బరి పొట్టు నారలు, గులకరాళ్లు కూడా వాడతారు. నేలమీద పండే గంజాయి కంటే ఈ ఓజీ నాణ్యత ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు. ఈ మొక్కలు ఓపెన్–రూట్ వ్యవస్థ ద్వారా పోషకాలు, ఆక్సిజన్‌ను నేరుగా తీసుకోవడమే దీనికి కారణం. వ్యవస్థీకృతంగా సాగుతున్న వ్యాపారం... ఈ డ్రగ్స్ క్రమవిక్రయాల దందా మొత్తం పక్కా వ్యవస్థీకృతంగా సాగుతోందని పోలీసులు చెప్తున్నారు. ఎన్‌క్రిపె్టడ్ యాప్స్ ద్వారా ఇండియా నుంచి తనకు వచ్చిన ఆర్డర్ల విషయాన్ని ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’ ఆయా యాప్స్ ద్వారానే హర్షవర్థన్‌కు చేరవేస్తాడు. ఇతడు జబల్పూర్లో ఉన్న హవాలా ఏజెంట్‌కు ఆ కస్టమర్ వివరాలు పంపిస్తాడు. అతగాడు సదరు కస్టమర్ నివసించే ప్రాంతానికి చెందిన మరో హవాలా ఏజెంట్‌కు ఇవి అందిస్తాడు. ఆ వినియోగదారుడిని సంప్రదించే ఈ ఏజెంట్ డబ్బు ముట్టిన తర్వాత జబల్పూర్ ఏజెంట్‌కు బదిలీ చేస్తాడు. అతడి ద్వారా విషయం తెలుసుకునే హర్షవర్థన్ విషయాన్ని ‘హెచ్‌హెచ్ హ్యాండ్లర్’కు చెప్తాడు. ఔన్స్ (28.34 గ్రాములు) డ్రగ్‌కు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు క్రిప్టో కరెన్సీ రూపంలో అతడికి పంపిస్తాడు. ఆపై డ్రగ్ హ్యాండ్లర్ నుంచి హర్షవర్థన్‌కు వచి్చ... అక్కడ నుంచి డీటీడీసీ, శ్రీ తిరుపతి, శ్రీ ఆంజనేయులు కొరియర్స్‌లో కస్టమర్‌కు చేరుతుంది. హర్షవర్థన్ కూడా పోలీసుల నిఘాకు చిక్కకుండా ఈ పార్శిల్ బుక్ చేస్తున్నాడు. అక్కడ కస్టమర్ చిరునామా, ఫోన్ నెంబర్ తప్పుగా ఇస్తాడు. దాని ట్రాకింగ్ ఐడీని వినియోగదారుడికి పంపిస్తాడు. దీని ద్వారా ట్రాక్ చేసే కస్టమర్ ఆ పార్శిల్ కొరియర్ ఆఫీసుకు చేరిందని గుర్తించిన వెంటనే అక్కడకు వెళ్లి తీసుకుంటారు. ఈ హవాలా, కొరియర్ నెట్వర్క్ పైనా హెచ్–న్యూ దృష్టి పెట్టింది. ఈ ముఠాలో కీలక పెడ్లర్‌గా ఉన్న హర్షవర్థన్‌కు చెందిన క్రిప్టో వాలెట్లో రోజుకు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు విలువైన బిట్కాయిన్లు డిపాజిట్ అవుతున్నట్లు గుర్తించామని అధికారులు చెప్తున్నారు.

ఫ్రెండ్‌కి సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు వెళ్తూ..
మక్కువ(విజయనగరం): మండలంలోని తూరుమామిడి గ్రామానికి చెందిన నూకమ్మ అలియాస్ ఉమ మంగళవారం తమ ఇంట్లో జరిగిన శుభ కార్యక్రమానికి తనతోపాటు డిగ్రీ చదువుతున్న ఫ్రెండ్స్‌ను ఆహ్వానించింది. స్నేహితులంతా కలిసి మంగళవారం ఆటపాటల్లో మునిగితేలారు. బుధవారం తన ఫ్రెండ్ షర్మిలకు సెండ్ ఆఫ్ ఇచ్చేందుకు గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై మక్కువ వెళ్తుండగా టాక్టర్ రూపంలో మత్యువు నూకమ్మను కబళించింది. అంతవరకు గ్రామంలో అందరితో కలివిడిగా ఉండి, ఫ్రెండ్‌ను మక్కువలో డ్రాప్ చేసి వస్తానని చెప్పి, తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందంటూ గ్రామస్తులు కన్నీరుమున్నీరయ్యారు. తూరుమామిడి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థినికురసాన నూకమ్మ అలియాస్ ఉమ(20) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటనపై హెడ్ కానిస్టేబుల్ ఎస్. శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నూకమ్మ తన ఫ్రెండ్ షర్మిలకు సెండాఫ్ ఇచ్చేందుకు గ్రామం నుంచి మక్కువకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, మార్గమధ్యంలోని శాంతేశ్వరం గ్రామం సమీపంలో ఎదురుగా ట్రాక్టర్ మితిమీరిన వేగంతో వచ్చింది. టాక్టర్ను తప్పించే ప్రయత్నంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోవడంతో నూకమ్మ తలపై నుంచి ట్రాక్టర్ టైర్ వెళ్లగా అక్కడికక్కడే మృతిచెందింది. నూకమ్మ బొబ్బిలిలోని ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. తండ్రి జనార్దనరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం సాలూరు ఆస్పత్రికి తరలించారు.