బాధ్యులను గుర్తించాం.. ప్రమాదానికి కారణం అదే: అశ్వినీ వైష్ణవ్
బాలాసోర్: ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఘోర రైలు ప్రమాద ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పటికే దాదాపు 288కి చేరింది. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్రాక్ పునరుద్ధణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రమాదానికి గల కారణాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం కారణంగా పాడైపోయిన ట్రాక్ పనులను పునరుద్దరిస్తున్నాము. బుధవారం ఉదయానికి మిగతా పనులను పూర్తి చేసి రైళ్ల రాకపోకలు కొనసాగిస్తాయి. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ఇప్పటికే రైల్వే సేఫ్టీ కమిషనర్ దర్యాప్తు చేసి నివేదిక పూర్తి చేశారు. రిపోర్టు అందాల్సి ఉంది. అయితే నివేదిక రావడానికి ముందే బాధ్యులను గుర్తించామని తెలిపారు. ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్‌ను మార్చడం ద్వారానే ప్రమాదం జరిగిందని చెప్పారు. కవచ్‌కు, రైలు ప్రమాదానికి సంబంధం లేదు. అయితే ప్రస్తుతం తమ ఫోకస్ మొత్తం పునరుద్ధరణ పనులపైనే ఉన్నట్లుగా స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఒడిశా రైళ్ల ప్రమాదం తర్వాత ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధప్రాతిపదికన నడుస్తున్నాయి. ఒకదానిపైన మరొకటి ఎక్కిన బోగీలను ఇప్పటికే కష్టపడి తొలగించారు. వీలైనంత తొందరగా ట్రాక్‌ను పునరుద్ధరించేందుకు నిరంతరాయంగా వందలాది మంది కార్మికులు, నిపుణులు శ్రమిస్తున్నారు అని స్పష్టం చేశారు.
#WATCH | The commissioner of railway safety has investigated the matter and let the investigation report come but we have identified the cause of the incident and the people responsible for it... It happened due to a change in electronic interlocking. Right now our focus is on… pic.twitter.com/UaOVXTeOKZ
— ANI (@ANI) June 4, 2023
ఇది కూడా చదవండి: అలా జరిగితే ప్రమాదం తప్పేదా?