జిల్లాలో సగటు వర్షపాతం 7.6 మి.మీ
ఏలూరు (మెట్రో): జిల్లాలో గడిచిన 24 గంటల్లో 364.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి కె.సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో సగటు 7.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా బుట్టాయగూడెం మండలంలో 44.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాళ్లలో 26.6, దెందులూరులో 23.2, ఉంగుటూరులో 22.8, పోలవరంలో 21.2, పెదపాడులో 18.6, నిడమర్రులో 18.2, ఏలూరులో 17.2, ఆకివీడులో 16.8, కొయ్యలగూడెంలో 14.4, నల్లజర్లలో 14.2, పెంటపాడులో 10.4, జంగారెడ్డిగూడెం, తణుకులో 9.8, నిడదవోలులో 9.2, జీలుగుమిల్లి 8.8, టి.నర్సాపురం, గణపవరంలో 7.2 మి.మీ వర్షపాతం నమోదైంది. పాలకొల్లులో 6.8, ద్వారకాతిరుమలలో 6.4, ఉండ్రాజవరం, ఉండిలో 6.2, భీమడోలులో 5.2, చాగల్లులో 4.2, తాడేపల్లిగూడెంలో 3.6, పెదవేగి, పోడూరు, పెనుమంట్రలో 3.4, తాళ్లపూడిలో 3.2, ఆచంటలో 2.2, గోపాలపురం, పెనుగొండలో 1.8, పెరవలిలో 1.6, కామవరపుకోటలో 1.4, చింతలపూడి, యలమంచిలి, భీమవరం మండలాల్లో 1.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలై మాసంలో 3.8 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటివరకూ 7.4 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు.