Saamy 2
-
ఆ చిత్రంలో నటించడానికి ఇష్టపడలేదు
చెన్నై : ఆ చిత్రంలో నటించడానికి తానే ఇష్టపడలేదని చెప్పింది షాక్ ఇచ్చింది నటి ఐశ్వర్యరాజేశ్. కాక్కముట్టై, వడచెన్నై వంటి పలు చిత్రాల్లో తన ఉత్తమ నటనాభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకున్న ఈ అమ్మడు తెలుగింటి ఆడపడుచు అన్నది తెలిసిందే. ఇటీవల కనా చిత్రంలో కథానాయకిగా నటించి సక్సెస్ కథానాయకిగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యరాజేశ్ కొన్ని చిత్రాల్లో ఎలాంటి ప్రాధాన్యత లేని పాత్రల్లో నటించి విమర్శలను ఎదుర్కొంది. ఈమె అలా నటించిన చిత్రాల్లో సామీ స్క్వేర్ ఒకటి. విక్రమ్ హీరోగా కమర్షియల్ దర్శకుడు హరి తెరకెక్కించిన ఈ చిత్రం ఇంతకుముందు సంచలన విజయం సాధించిన సామి చిత్రానికి సీక్వెల్ అన్నది తెలిసిందే. నటి కీర్తీసురేశ్ కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో మరో నాయకిగా మొదట నటి త్రిషను ఎంపిక చేశారు. అయితే ఆ తరువాత ఆమె ఈ చిత్రం నుంచి వైదొలగడంతో నటి ఐశ్వర్యరాజేశ్‌ను ఎంపిక చేశారు. కాగా ఇటీవల ఒక భేటీలో నటి ఐశ్వర్యరాజేశ్ మాట్లాడుతూ సామీ స్క్వేర్ చిత్రంలో నటించడానికి తాను ఇష్టపడలేదని చెప్పింది. అయితే నటుడు విక్రమ్, దర్శకుడు హరి పర్సనల్‌గా నటించమని కోరడంతో అంగీకరించినట్లు తెలిపింది. వేరే నటి ఈ పాత్రలో నటించడానికి ఒప్పుకోవడం లేదని దర్శక, కథానాయకుడు చెప్పడం కూడా తానందులో నటించడానికి ఒక కారణం అని ఐశ్వర్యరాజేశ్ చెప్పి ఆ చిత్ర వర్గాలకు షాక్ ఇచ్చింది. కాగా ఈ బ్యూటీ ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. -
కావాలనే విమర్శిస్తున్నారు : హాస్య నటుడు
సినిమా సమీక్షల విషయంలో భిన్న వాదనలు కొనసాగుతున్నాయి. పెద్ద సినిమాల నిర్మాతలు రివ్యూల కారణంగా తమ సినిమాలకు నష్టం జరుగుతుందంటే.. చిన్న సినిమాల నిర్మాతలు మాత్రం రివ్యూల కారణంగానే తమ సినిమాలకు గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు. అయితే తాజాగా ఓ తమిళ కమెడియన్ రివ్యూలపై ఫైర్ అయ్యాడు. కోలీవుడ్‌లో బిజీ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్న కమెడియన్ సూరి ఇటీవల సామి స్క్వేర్, సీమ రాజ సినిమాల్లో కనిపించారు. ఈ రెండు సినిమాల్లో సూరి నటనపై విమర్శలు వినిపించాయి. ముఖ్యంగా సీమరాజ సినిమా కు రివ్యూలు నెగెటివ్‌గా రావటంతో.. కావాలనే తమ సినిమా మీద దాడి చేస్తున్నారంటూ ఆరోపించారు సూరి. అంతేకాదు విమర్శకులు తమిళ సినిమాలపై దాడి చేయటం ఆపి సినిమాలను కాపాడేందుకు ప్రయత్నించాలన్నారు. -
పోకిరి పోలీస్
విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో తమిళంలో రూపొందిన సినిమా ‘సామీ స్క్వేర్’. కీర్తీ సురేశ్, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటించారు. బాబీ సింహా, ప్రభు గణేశన్ కీలక పాత్రలు చేశారు. దాదాపు పదిహేనేళ్ల క్రితం హరి–విక్రమ్ కాంబినేషన్లోనే రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘సామీ’కి ఇది సీక్వెల్. ఇప్పుడీ సినిమాను నిర్మాతలు బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ తెలుగులో ‘సామి’ పేరుతో ఈ నెల 21న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. విక్రమ్‌గారి నటవిశ్వ రూపం ఇందులో కనిపిస్తుంది. హరి సినిమాలే ఎక్కువగా మాట్లాడతాయి. ఆయన తక్కువ మాట్లాడతారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలుస్తుంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. ట్రైలర్లో ‘నేను పోలీస్ కాదు పోకిరి’ అని విక్రమ్ చెప్పే డైలాగ్‌ను బట్టి ఈ సినిమా ఎక్కువగా మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవుతుందని టాక్. -
కీర్తీసురేశ్ కలిసి పాడడం విశేషం..
తమిళసినిమా: నన్ను కమర్సియల్ నిలబెట్టిన చిత్రం సామి అని నటుడు విక్రమ్ అన్నారు. ఈయన నటిస్తున్న తాజా చిత్రం సామి స్క్వేర్. కీర్తీసురేశ్ కథానాయకిగా నటిస్తున్న ఇందులో ముఖ్యపాత్రను నటి ఐశ్వర్యరాజేశ్ పోషిస్తున్నారు. ఇది సామి చిత్రానికి సీక్వెల్. సామి చిత్రాన్ని తెరకెక్కించిన హరినే దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. తమీస్ ఫిలింస్ పతాకంపై ఇంతకు ముందు ఇరుముగన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన శిబు తమీన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం సామి స్క్వేర్. దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో చిత్ర హీరోహీరోయిన్లు విక్రమ్, కీర్తీసురేశ్ కలిసి పాడడం విశేషం. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం స్థానిక గిండి సమీపంలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్ తిరుపూర్ సుబ్రమణియమ్, ఫైనాన్సియర్ అన్బుసెలియన్, నిర్మాత జ్ఞానవేల్‌రాజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు హరి మాట్లాడుతూ సామి చిత్ర ఎండింగ్‌లోనే రెండవ భాగానికి లీడ్ వదిలామన్నారు. అయితే వరుసగా పోలీస్ కథా చిత్రాలు చేయడంతో ఒక ఎపిసోడ్ ఖాళీ అయిపోయిందన్నారు. అయితే విక్రమ్‌ను కలిసి నప్పుడల్లా ఒక మంచి కథ లభించగానే సామికి రెండవ భాగం చేద్దాం అని చెప్పేవాడినన్నారు. అలాంటి కథ ఇప్పుడు లభించిదని పేర్కొన్నారు. పెరుమాళ్ పిచ్చై సామికు ఆరుసామియిన్ మగన్ సామికి మధ్య జరిగే పోరాటమే సామి స్క్వేర్ అని చెప్పారు. నటి ఐశ్వర్య రాజేశ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో త్రిషకు బదులుగా తాను నటించానని చెప్పింది. అయితే సామి చిత్రంలో అబ్బురపరచిన ఆమెలా తాను నటించగలనా అంటే కచ్చితంగా సాధ్యం కాదని, అయితే అందుకు ప్రయత్నించానని అన్నారు. నటి కీర్తీసురేశ్ మాట్లాడుతూ దర్శకుడు హరితో పనిచేస్తున్నప్పుడు కాలం విలువ, ప్రణాళికల గురించి తెలిసివస్తుందన్నారు. నిర్మాత శిబు తమీన్ తన గురించి దేవీశ్రీ ప్రసాద్‌కు చెప్పడంతోనే ఆయన తనతో ఈ చిత్రంలో పాడించారని తెలిపారు. ఇకపోతే తాను చిన్న వయసులోనే అన్నియన్ చిత్ర పోస్టర్‌ను ఇంటిలోని ఒక అరలో పెట్టుకున్నానని చెప్పింది.ఆ చిత్రంలో రోమో పాత్ర చాలా ఇష్టం అన్నారు. అలాంటిదిప్పుడు ఈ చిత్రంలో విక్రమ్‌తో నటించడం సంతోషంగా ఉందని అంది. దేవీశ్రీప్రసాద్ మాట్లాడుతూ సామి స్క్వేర్ చిత్రంలో అమ్మ పాట చోటు చేసుకుంటుందన్నారు. తాను ఇంతకు ముందు ఒక తెలుగు చిత్రంలో నాన్న పాటకు బాణీలు కట్టానన్నారు. అప్పుడే అమ్మకు సంబంధించిన పాటను రూపొందించాలన్న కోరిక కలిగిందని చెప్పారు. అది ఈ చిత్రం ద్వారా తీరిందని అన్నారు. చిత్ర హీరో విక్రమ్ మాట్లాడుతూ దర్శకుడు హరి గురించి చెప్పాలంటే ఆయన దర్శకత్వాన్ని ఒక తపంలా అవిశ్రాంతిగా చేస్తారన్నారు. ఆయన దర్శకత్వం వహించిన సామి చిత్రం తనను కమర్శియల్ హీరోగా నిలబెట్టిందన్నారు. ఈ చిత్రంలో ఒక పాట పాడించారని తెలిపారు. -
సరదాగా ఓ సాంగ్
‘గారెలు, బూరెలు, చక్రాలు, చక్కలు.... ఇవన్నీ డూపే పిజ్జాయే టాపు..’ అంటూ ‘మల్లన్న’ సినిమాలో తెలుగు ఆడియన్స్‌కు తనలోని గాయకుడిని కూడా పరిచయం చేశారు విక్రమ్. ‘సామీ స్క్వేర్’ సినిమా కోసం మరోసారి ఓ పాటను సరదాగా పాడారు విక్రమ్. హీరోయిన్ కీర్తీ సురేశ్‌తో కలిసి ‘పెణ్ణే’ అని సాగే సరదా పాట పాడారు. కీర్తీ సురేశ్ స్క్రీన్‌పై పాడటం ఇది ఫస్ట్ టైమ్. విక్రమ్, కీర్తీ సురేశ్, ఐశ్వర్యా రాజేశ్ ముఖ్య పాత్రల్లో దర్శకుడు హరి రూపొందించిన యాక్షన్ చిత్రం ‘సామీ స్క్వేర్’. 2003లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం∙‘సామీ’కి ఇది సీక్వెల్. ఇందులో ‘పెణ్ణే...’ అంటూ సాగే ఓ పాటను హీరోహీరోయిన్లు కలిసి పాడారు. ఈ సినిమా తమిళ ఆడియో వేడుక సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఈ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇవే కాకుండా ఇది వరకు తను యాక్ట్ చేసిన ‘జెమినీ’ టైటిల్ సాంగ్‌తో పాటు రీసెంట్గా ‘స్కెచ్’ సినిమాలో పాటలను పాడారు విక్రమ్. అలాగు తమిళంలో సూర్య యాక్ట్ చేసిన ‘శ్రీ’కి కూడా విక్రమ్ ఓ పాట పాడారు. ∙కీర్తీ సురేష్, విక్రమ్ -
సామికి జోడీ కుదిరింది
2003లో వచ్చిన ‘సామి’లో విక్రమ్, త్రిష భార్యాభర్తలుగా యాక్ట్ చేశారు. ‘సామి’ సీక్వెల్ ‘సామి స్క్వేర్’లో కూడా త్రిష యాక్ట్ చేస్తారని భావించారందరూ. త్రిష కూడా ముందు ఈ సినిమా కమిట్ అయ్యారు. ఆ తర్వాత క్రియేటీవ్ డిఫరెన్సెస్‌తో ‘సామి స్క్వేర్’ సినిమా నుంచి త్రిష తప్పుకున్నారు. తాజాగా త్రిష ప్లేస్‌లోకి ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్గా వచ్చారు. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ పవర్ఫుల్ యాక్షన్ మూవీలో జాయిన్ అవ్వడం గురించి ఐశ్వర్య మాట్లాడుతూ – ‘‘నా కెరీర్లో ఫుల్ కమర్షియల్ సినిమా ఇప్పటివరకు చేయలేదు. ఈ సినిమా ఆ లోటుని తీర్చేస్తుందని భావిస్తున్నాను. విక్రమ్సార్ పక్కన, హరి సార్ డైరెక్షన్లో యాక్ట్ చేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని పేర్కొన్నారు. సినిమా ఆగస్ట్‌లో రిలీజ్ కానుంది. -
ఆగస్ట్‌లో సామి!
‘సామి’ మిషన్ కంప్లీట్ చేయడానికి రెడీ అయ్యారు. కేవలం ఇంకొన్ని రోజుల్లో అప్పగించిన మిషన్‌ను పూర్తి చేస్తారట. హరి దర్శకత్వంలో విక్రమ్, కీర్తీ సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సామీ స్క్వేర్’. 2003లో రిలీజ్ అయిన ‘సామి’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ చిత్రం ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ అయిందని కోలీవుడ్ టాక్. ఈ షెడ్యూల్లో ఓ పాటను కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట దర్శకుడు హరి. ఈ షెడ్యూల్‌తో సినిమా కంప్లీట్ అవుతుంది. ఆగస్ట్‌కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. -
మాస్ యాక్షన్ ‘స్వామి స్క్వేర్’
సింగం సిరీస్‌లో మూడు చిత్రాలను తెరకెక్కించిన తమిళ దర్శకుడు హరి, తాజాగా తన మరో సూపర్ హిట్ సినిమా సామికి సీక్వల్‌ను రూపొందిస్తున్నారు. విక్రమ్ హీరోగా తెరకెక్కిన సామి 2003లో రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. తరువాత అదే సినిమాను తెలుగులో లక్ష్మీ నరసింహా పేరుతో బాలకృష్ణ హీరోగా రీమేక్ చేశారు. తాజాగా సామి సినిమా సీక్వల్‌ను సామి స్క్వేర్ పేరుతో రూపొందిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ మరోసారి యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. విక్రమ్ జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా ప్రమోషన్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే ఫస్ట్, టీజర్లను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తమిళనాట స్వామి స్క్వేర్ జూన్ 14న రిలీజ్ కానుంది. -
‘స్వామి స్క్వేర్’ ట్రైలర్
-
పవర్ఫుల్ పోలీస్ పాత్రలో విక్రమ్
‘లక్ష్మీ నరసింహా’ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. బాలకృష్ణ పవర్ పుల్ పోలీసాఫీర్‌గా నటించిన ఆ సినిమా తమిళ సినిమాకు రీమేక్. విక్రమ్ హీరోగా తెరకెక్కిన ‘సామి’ సినిమాను తెలుగులో బాలకృష్ణ రీమేక్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సామి సీక్వెల్ కూడా సిద్ధమవుతోంది. ఇటీవలే తమిళ్ మోషన్ పోస్టర్‌ను కూడా రిలీజ్చేశారు. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్వామి స్క్వేర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తాజాగా తెలుగు వెర్షన్ మోషన్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. సింగం సిరీస్‌ల సక్సెస్‌తో మంచి ఫాంలో ఉన్న డైరెక్టర్ హరి.. మరోసారి పవర్ఫుల్ పోలీస్ కథతో రెడీ అయినట్టు తెలుస్తోంది. తమిళ్లో సామి స్క్వేర్ గా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు సామి అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. అటు రాజమండ్రికి 3 కిలోమీటర్లు.... ఇటు న్యూఢిల్లీకి 1984 కిలోమీటర్లు... మధ్యలో విక్రమ్. ఎవరి కోసమో కాపు కాస్తున్నట్టు, చేతిలో ఆయుధం పట్టుకుని ఉన్న ఈ మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరి విక్రమ్ అలా ఎందుకు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో విక్రమ్‌కు జోడిగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. -
పయనం ఎటు?
ముందుకు వెళితే 2726 కిలోమీటర్ల దూరంలో ఢిల్లీ. వెనక్కు తిరిగితే 3 కిలోమీటర్ల దూరంలో తమిళనాడులోని తిరునెల్వేలి. మరి.. విక్రమ్ పయనం ఎటు? అనే ప్రశ్నకు సిల్వర్ స్క్రీన్‌పైనే సమాధానం దొరుకుతుంది. విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సామీ స్క్వేర్’. ఇందులో కీర్తీ సురేశ్ కథానాయిక. ప్రభు గణేశన్, బాబీ సింహా ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్సంగీతం. విక్రమ్, హరి కాంబినేషన్లో దాదాపు 15 ఏళ్ల క్రితం వచ్చిన ‘సామీ’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘సామీ స్క్యేర్’ చిత్రం మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోలీసాఫీసర్‌గా విక్రమ్ మార్క్ యాక్షన్ కనిపించనుందని ఈ మోషన్ పోస్టర్‌ను చూసిన సినీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఈ నెల 26న రిలీజ్ కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే ‘సామీ’ చిత్రం తెలుగు రీమేక్ ‘లక్ష్మీనరసింహా’ మూవీలో బాలకృష్ణ హీరోగా నటించిన విషయం తెలిసిందే. -
ఫస్ట్ లుక్.. పవర్ఫుల్ పోలీస్ ఈజ్ బ్యాక్
సాక్షి, చెన్నై: కోలీవుడ్‌లో ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ హీరో ‘చియాన్’ విక్రమ్. కానీ, అపరిచితుడు తర్వాత ఆయనకు సరైన హిట్ లేకుండా పోయింది. దశాబ్దానికి పైగా వరుసగా చిత్రాలు బోల్తా పడుతున్నాయి. గత చిత్రం స్కెచ్ అయితే డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో 15 ఏళ్ల క్రితం తనకు సామితో బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు హరితో విక్రమ్ మరోసారి జోడీ కట్టాడు. సామి స్క్వేర్‌గా త్వరలో మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను తాజాగా వదిలారు. ఫుల్ మాస్ లోడెడ్‌గా సామి స్క్వేర్ తెరకెక్కినట్లు ఫస్ట్ లుక్ చూస్తే అర్థమౌతోంది. మాస్ కంటెంట్.. పైగా రేసీ స్క్రీన్ ప్లేతో చిత్రాలను తెరకెక్కించటంలో హరి దిట్ట. అలాంటిది వీరిద్దరి కాంబోలో మళ్లీ చిత్రం వస్తుండటంతో చియాన్‌కి హిట్ గ్యారెంటీ అని ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. తమీన్ ఫిలింస్ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
పవర్ఫుల్ పోలీస్ ‘సామి’ ఈజ్ బ్యాక్
-
మూడు గెటప్‌లలో విలన్
తమిళ సినిమా : తమిళం, మలయాళం భాషల్లో విలక్షణ నటుడిగా రాణిస్తున్న తెలుగు నటుడు బాబీసింహా. స్వయంకృషితోనే ఎదుగుతున్న నటుడీయన. చిన్న పాత్రల నుంచే విలన్, హీరో స్థాయికి చేరుకున్నారు. జిగర్తండా చిత్రంలో విలక్షణ విలనీయంను ప్రదర్శించి జాతీయ అవార్డును గెలుచుకున్న నటుడు బాబీసింహా. ఆ తరువాత హీరోగా అవతారమెత్తారు. ఉరుమీన్ లాంటి కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించినా ఆయన్ని హీరోగా కంటే విలన్‌గానే ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్న విషయాన్ని గ్రహించి, వారి అభీష్టానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. అంతే మళ్లీ నటుడిగా బిజీ అవుతున్నారు. ప్రస్తుతం విక్రమ్ హీరోగా నటిస్తున్న సామి స్క్వేర్ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. ఇది గతంలో విక్రమ్ నటించిన సామి చిత్రానికి కొనసాగింపు అన్నది తెలిసిందే. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీసురేశ్ నాయకి. పులి, ఇరుముగన్ చిత్రాల నిర్మాత శిబుతమీన్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో బాబీసింహా మూడు గెటప్‌లలో కనిపించనున్నారట. దర్శకుడు హరి చిత్రంలో విలన్ పాత్రలు చాలా శక్తివంతంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. సామి చిత్రంలో కోటాశ్రీనివాసరావు విలన్‌గా నటించారు. ఆ చిత్రంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అదే విధంగా సామి స్క్వేర్ చిత్రంలో బాబీసింహా పాత్ర చాలా బలమైందిగా ఉంటుందట. ఈయన నటిస్తే బాగుంటుదనే దర్శక నిర్మాతలతో పాటు నటుడు విక్రమ్ కూడా బాబీసింహాను సంప్రదించారు. సామి స్క్వేర్ చిత్రం తరువాత బాబీసింహా మరోసారి విలన్‌గా బిజీ అయిపోతారంటున్నారు ఆ చిత్ర వర్గాలు. -
మరోసారి పోలీస్ పవర్ చూపించడానికి..
తమిళ సినిమా: కోలీవుడ్‌లో పోలీసు కథలతో చాలా చిత్రాలు వచ్చాయి. ఇంకా వస్తాయి కూడా. అయితే అలాంటి పోలీస్ కథా చిత్రాల్లో సామి చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకుంటే నటుడు విక్రమ్‌కు స్టార్ ఇమేజ్ను ఆపాదించిన అతి కొద్ది చిత్రాల్లో సామి ఒకటి. అదేవిధంగా నటి త్రిషను అగ్రనటిగా నిలబెట్టిన చిత్రం సామినే. కమర్శియల్ చిత్రాల దర్శకుడు హరి తెరకెక్కించిన సామి చిత్రం ఒక సంచలనం. దానికి సీక్వెల్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. విక్రమ్, హరి కాంబినేషనల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో క్రేజీ తార కీర్తీసురేశ్ నాయకిగా నటిస్తోంది. మరో హీరోయిన్గా ముందు నటించడానికి అంగీకరించి ఆ తరువాత వైదొలగి పెద్ద వివాదానికి తెరలేపిన నటి త్రిష మళ్లీ నటించడానికి సమ్మతించినట్లు ప్రచారం జరుగుతోంది. నటుడు బాబీసింహా విలన్‌గా నటిస్తున్నారు. ఇందులో విక్రమ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఒక పాత్రలో ఆయన పోలీస్ కమిషనర్‌గా కనిపించనున్నారు. అలా పోలీస్ అధికారిగా విక్రమ్ ఈ చిత్రంలో దుమ్మురేపనున్నార ని సమాచారం. దర్శకుడు హరి యాక్షన్ సన్నివేశాలను బ్రహ్మాండంగా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడన్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలను గురువారం చిత్ర వర్గాలు విడుదల చేశారు. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత దర్శకుడు హరి మరోసారి సూర్యతో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇది సింగం పార్ట్ 4 అవుతుందనే ప్రచారం వైరల్ అవుతోంది. -
‘నాకు ఆ హక్కు ఉంది’
తమిళసినిమా: చెన్నై చిన్నది త్రిష నాకు ఆ హక్కు ఉందని అంటోంది. సంచలనాలకు కేంద్ర బిందువుగా పేరు పొందిన నటీమణుల్లో ముందు ఉంటుంది. ఈ చిన్నది ఇటీవల కాలంలో కాస్త సైలెంట్ అయ్యిందనుకుంటున్న సమయంలో అలా ఉండటం నా వల్లకాదు అన్నట్లుగా మళ్లీ వివాదాల్లోకి వచ్చేసింది. విక్రమ్, త్రిష జంటగా నటించిన సామి చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తాజాగా సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో విక్రమ్‌కు జంటగా నటి త్రిష, కీర్తీ సురేశ్‌లను నాయికలుగా ఎంపిక చేశారు. ఇంతకు ముందు విక్రమ్‌తో ఇరుముగన్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించిన శిబు తమీన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా చిత్రం షూటింగ్‌కు రెడీ అవుతున్న సమయంలో అనూహ్యంగా త్రిష మీతో నాకు సెట్ కాలేదంటూ వైదొలిగింది. దీంతో షాక్‌కు గురైన చిత్ర నిర్మాత నిర్మాతల మండలిలో త్రిషపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో వివరణ కోరుతూ నిర్మాతల మండలి త్రిషకు నోటీసులు జారీ చేసింది. ఈ చిత్రంలో నటి కీర్తీసురేశ్‌కు అధిక ప్రాముఖ్యత ఉందని, ఆమె కంటే తనకు సన్నివేశాలు తక్కువగా ఉన్నందునే చిత్రం నుంచి తప్పుకున్నట్లు త్రిష పేర్కొన్నట్లు ప్రచారం జరిగింది. అయితే అసలు కారణం అది కాదని ఆమె చెప్పింది. సోమవారం నిర్మాతలమండలి నోటీస్‌కు బదులిచ్చిన త్రిష అందులో పేర్కొంటూ తాను సామి -2 చిత్రంలో ఒక్క సన్నివేశంలో కూడా నటించలేదని, అందువల్ల ఆ చిత్రం నుంచి వైదొలిగే హక్కు తనకు ఉందని చెప్పింది. అంతే కాదు తాను తీసుకున్న అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చేస్తానని, వ్యక్తిగత కారణాల వల్లే తాను సామి -2 చిత్రం నుంచి తప్పుకున్నట్లు వివరణ ఇచ్చిందట. అయితే త్రిష వివరణకు నిర్మాతల మండలి సంతృప్తి చెందిందో లేదో తెలియదుగాని, సామి -2 చిత్రంలో ఆమెను నటింపజేయడానికి సామరస్య చర్చలు మాత్రం జరుగుతున్నాయని సమాచారం. -
ఓకేనా? సెట్ చేశారా?
సాక్షి, తమిళ సినిమా: ఓకేనా..సెట్ చేశారా? ఏమిటీ అర్థం పర్థం లేని రాతలు అనుకుంటున్నారా? మీరలా అనుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. అయితే ఏదో విషయం ఉంటుందనే ఆలోచన కూడా వస్తే బాగుంటుంది. ఇక సోదిలోకి వెళ్లకుండా అసలు విషయానికి వచ్చేద్దాం. దాదాపు దశాబ్దన్నర ముందు తెరపైకి వచ్చిన చిత్రం సామి. హరి దర్శకత్వంలో విక్రమ్, త్రిష జంటగా నటించిన ఆ చిత్రం అప్పట్లో సూపర్‌హిట్ అయ్యింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌కు పిచ్చ పిచ్చగా నచ్చేసింది. ఆ చిత్రానికి తాజాగా రెండవ భాగం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తమీస్ పతాకంపై శిబు తమీస్ నిర్మిస్తున్న ఇందులో విక్రమ్ సరసన త్రిష, కీర్తీసురేశ్ నటిస్తున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. చిత్ర షూటింగ్ ప్రారంభం అయిన కొద్దిరోజులకే త్రిష చిత్రం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది. చిత్ర యూనిట్‌తో సెట్ కాకపోవడం కారణంగానే సామి 2 నుంచి తప్పుకున్నట్లు త్రిష పేర్కొన్నా, అందులో తన పాత్ర కంటే కీర్తీసురేశ్‌కే ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నందునే ఈ చెన్నై చిన్నది వైదొలగినట్లు ప్రచారం హోరెత్తింది. ఇదంతా పాత విషయమే. కొత్తగా ప్రచారం అవుతున్నదేమిటంటే, నటుడు విక్రమ్ ఇటీవల తన కూతురు పెళ్లి పనులతో బిజీగా ఉండి సామి 2 చిత్రం గురించి పెద్దగా పట్టించుకోలేదని, ఆ వేడుక కాస్త పూర్తి కావడంతో చిత్రంపై దృష్టి పెట్టిన విక్రమ్ ఇటీవల తనే స్వయంగా త్రిష ఇంటికి వెళ్లి ఆమెకు నచ్చచెప్పి సామి2 లో నటించేలా సెట్ చేసినట్లు ప్రచారం వైరర్ అవుతోంది. అయితే త్రిష వర్గం మాత్రం ఒక్కసారి కాదనుకుంటే మళ్లీ నటిస్తారా? సామి2 చిత్రంలో త్రిష చేయడం లేదు అని అంటున్నట్లు సమాచారం. ఈ విషయంలో స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఎందుకుంటే త్రిష పాత్రలో సామి2 యూనిట్ ఇంకా వేరే నటిని ఎంపిక చేయలేదు. చిత్ర షూటింగ్ మాత్రం కేరళలో నిరాటంకంగా జరుపుకుంటోంది. -
సామి 2 నుంచి త్రిష ఔట్
సామి2 చిత్ర యూనిట్ ఆదిలోనే షాక్‌కు గురైంది. నటుడు విక్రమ్‌కు కమర్షియల్ హీరో ఇమేజ్ను ఆపాధించిన చిత్రం సామి. యాక్షన్ కథా చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన హరి దర్శకత్వం వహించిన ఈ చిత్ర విజయంలో కథానాయకి త్రిషకు భాగం ఉంటుంది. ఆమె అందాలు సామి చిత్రానికి ఆకర్షణగా నిలిచాయి. ఇక విషయానికి వస్తే సామి చిత్రానికి సీక్వెల్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి హరినే దర్శకుడు. హీరోయిన్ కూడా త్రిషనే. అయితే అధనంగా కీర్తీసురేశ్ వచ్చి చేరింది. శిబుతవీన్ భారీ ఎత్తున్న నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీత బాణీలు కడుతున్నారు. చిత్ర యూనిట్ ఇటీవలే ఢిల్లీలో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించుకుని తొలి షెడ్యూల్ పూర్తి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సామి 2 చిత్రం నుంచి వైదొలగుతున్నట్లు నటి త్రిష సోమవారం తన ట్విట్టర్లో పేర్కొన్నారు. బేధాభిప్రాయం కారణంగా తాను చిత్రం నుంచి తప్పుకున్నానని, చిత్ర యూనిట్‌కు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ త్రిష పేర్కొన్నారు. కాగా ఆది నుంచి సామి 2 చిత్రంలో నటి కీర్తీసురేశ్‌కే ప్రాముఖ్యత అని, త్రిష పాత్ర పరిమితంగానే ఉంటుందనే ప్రచారం సాగుతోంది. తాజా పరిణామాలతో అది నిజమని రుజువయ్యిందనిపిస్తోంది. కాగా త్రిష సామి2 చిత్రం నుంచి వైదొలగడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై చిత్ర వర్గాలు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. మొత్తం మీద ఈ విధంగా త్రిష సామి2 చిత్ర యూనిట్‌కు షాక్ ఇచ్చారన్నమాట. Due to creative differences,I have chosen to opt out of Saamy 2 . Wishing the team goodluck. — Trisha Krishnan (@trishtrashers) 23 October 2017 -
విక్రమ్‌కు జోడిగా రకుల్..?
చిన్న సినిమాల హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.., టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ సరసన చేరిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. తనతో పాటు ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లందరూ చిన్న, మీడియం రేంజ్ సినిమాలతోనే సరిపెట్టుకుంటుంటే.. రకుల్ మాత్రం భారీ బడ్జెట్ సినిమాలతో దూసుకుపోతోంది. ఇప్పటికే ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈ బ్యూటి ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ద్విభాషా చిత్రంతో పాటు, రాం చరణ్ ధృవలోనూ హీరోయిన్గా నటిస్తోంది. తెలుగులో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నా.. కోలీవుడ్‌లో కూడా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది రకుల్ ప్రీత్ సింగ్. తమిళంలో తడైయర తక్క సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రకుల్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తొలి సినిమా సక్సెస్ ఇవ్వకపోయినా కోలీవుడ్‌లో కూడా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ఇప్పటికే విశాల్ హీరోగా తెరకెక్కుతున్న తుప్పరివాలన్ సినిమాలో నటిస్తోన్న రకుల్, మరో భారీ ప్రాజెక్ట్‌కు సైన్ చేసింది. విలక్షణ నటుడు విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సామి 2లో రకుల్ హీరోయిన్గా నటించనుంది. తమిళ నాట ఘనవిజయం సాధించిన సామి సినిమాకు సీక్వల్గా అదే కాంబినేషన్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే తొలి భాగంలో త్రిష హీరోయిన్గా నటించగా సీక్వల్ కోసం రకుల్‌ను హీరోయిన్గా ఫైనల్ చేశారు. ప్రస్తుతం సింగం 3 పనుల్లో బిజీగా ఉన్న దర్శకుడు హరి ఆ సినిమా పూర్తి అయిన తరువాత సామి 2 ప్రారంభమవుతుంది. -
ఇప్పటికైనా కుదురుతుందా?
త్రిష-నయనతార.. ఈ ఇద్దరి మధ్య ఒకప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. పోటాపోటీగా సినిమాలు చేసేవాళ్లు. ఒకరి గురించి ఒకరు సన్నిహితుల దగ్గర వ్యంగ్యాస్త్రాలు విసురుకునేవాళ్లనే వార్త కూడా అప్పట్లో ప్రచారమైంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. వన్ ఫైన్ డే ఈ ఇద్దరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఆ తర్వాత పలు ప్రైవేట్ పార్టీల్లో ఇద్దరూ కలసి దిగిన ఫొటోలు బయటికొచ్చాయి. దాంతో ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిన విషయం స్పష్టమైంది. ఈ ఫ్రెండ్స్ ఇద్దరూ ఇప్పటివరకూ కలసి నటించలేదు. తమిళంలో కొంతమంది ఈ కాంబినేషన్‌ని తెరపై చూపించడానికి ట్రై చేశారట. కానీ, అన్నీ కుదరాలి కదా. ఇప్పుడు కుదిరిందని చెన్నై కోడంబాక్కమ్ టాక్. దాదాపు పదమూడేళ్ల క్రితం విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో ‘సామి’ అనే సూపర్ హిట్ మూవీ రూపొందింది. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ చేయబోతున్నామని ఆ మధ్య హరి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలోనే నయనతార, త్రిషలను కథానాయికలుగా తీసుకోవాలని హరి అనుకుంటున్నారట. ‘సామి’లో త్రిష కథానాయికగా నటించారు. ఆ చిత్రంలో ఒకే ఒక్క హీరోయిన్ ఉంటుంది. కానీ, ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ఇద్దరు నాయికలు ఉండటం సహజం అయిపోయింది. సో.. కథలో ఇంకో హీరోయిన్ పాత్రను హరి సృష్టించి ఉంటారు. మరి.. ఈ సినిమాతో అయినా త్రిష, నయనతార కాంబినేషన్ కుదురుతుందా? వేచి చూడాల్సిందే.