Sana Makbul
-
ఆటోఇమ్యూన్ వ్యాధి.. స్టెరాయిడ్స్ తీసుకుంటున్నా: టాలీవుడ్ నటి
కొన్నేళ్లుగా ఆరోగ్యం అస్సలు బాగుండట్లేదంటోంది బిగ్‌బాస్ బ్యూటీ, నటి సనా మక్బుల్ (Sana Makbul). సమంతలాగే తనకు ఆటోఇమ్యూన్ వ్యాధి వచ్చిందని వాపోయింది. శరీరంలోని కణాలు.. అవయవాలపై దాడి చేస్తున్నాయంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో సనా మక్బుల్ మాట్లాడుతూ.. కొన్ని అనారోగ్య కారణాల వల్ల నేను ఈ మధ్యే శాఖాహారిగా మారిపోయాను. నేను ఆటోఇమ్యూన్ హెపటైటిస్ రోగినని చాలామందికి తెలియదు. 2020లో బయటపడిందినాకు కాలేయ వ్యాధి ఉంది. ఇది 2020లో బయటపడింది. ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో ఈ వ్యాధి ఉందన్న విషయం ఆలస్యంగా తెలిసింది. ఈ వ్యాధి కారణంగా నా శరీరంలోని కణాలు నా అవయవాలపై దాడి చేస్తున్నాయి. అది శరీరమంతటా పాకొచ్చు, కిడ్నీలపైనా దాడి చేయొచ్చు, మోకాళ్ల నొప్పులకు కారణం కావచ్చు, ఇలా ఏదైనా జరగొచ్చు. సమంతకు ఉన్న ఆటోఇమ్యూన్ వ్యాధి మయోసైటిస్. దీని వల్ల ఆమె కండరాల బలహీనతను ఎదుర్కొంటోంది. అలాగే నాకున్న ఆటోఇమ్యూన్ వ్యాధి వల్ల కాలేయం డ్యామేజ్ అవుతోంది.నయమవుతుందో.. లేదో!స్టెరాయిడ్స్, కొన్నిరకాల ఔషధాలు తీసుకున్నాను. జీవనశైలిలో వస్తున్న మార్పుల వల్ల ఇది వచ్చిందనుకుంటున్నాను. నా ఆరోగ్యం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఈ వ్యాధి పూర్తిగా నయం అవుతుందో, లేదో కూడా తెలియదు అని చెప్పుకొచ్చింది. సనా మక్బుల్.. దిక్కులు చూడకు రామయ్య, మామ ఓ చందమామ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. హిందీ బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్ విజేతగానూ నిలిచింది. ప్రస్తుతం మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటిస్తోంది.చదవండి: అవతార్ సినిమాలో ఛాన్స్.. కోట్లు ఇస్తానన్నా 'నో' చెప్పా: గోవిందా -
టాలీవుడ్ హీరోయిన్‌పై సెటైర్.. ఇంత చీప్‌గా ప్రవర్తిస్తారా?
హీరోయిన్, బిగ్‌బాస్ బ్యూటీ సనా మక్బుల్‌కు కోపమొచ్చింది. తనపై సెటైర్లు వేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. నటుడు అర్జున్ బిజ్లానీ ముంబైలో దీపావళి పార్టీ ఇచ్చాడు. ఈ పార్టీకి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. వారిలో హీరోయిన్ సనా మక్బుల్ కూడా ఉంది.ఇంత చీప్‌గా ప్రవర్తిస్తారా? పార్టీలో అడుగుపెట్టేముందు అక్కడున్న ఫోటోగ్రాఫర్లకు ఓపికగా పోజులిస్తూ ఫోటో దిగింది. చిరునవ్వుతో ఫోటోలు దిగుతున్న సనాను ఉద్దేశించి ఓ ఫోటోగ్రాఫర్ అసలు మజాయే రావట్లేదు, ఇటు తిరగండి అని కటువుగా మాట్లాడాడు. అతడి మాటలు విని షాకైన సనా ఇది చాలా తప్పు. ఇంత చీప్‌గా ప్రవర్తిస్తారా? మీరిలా మాట్లాడకూడదు. తప్పు అని కౌంటరిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఫోటోగ్రాఫర్పై మండిపాటుఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా నటిపై సెటైర్ వేసిన కెమెరామెన్‌ను నెటిజన్లు తప్పుపడుతున్నారు. ఒక అమ్మాయికి ఇలాగేనా గౌరవమిచ్చేది? అని మండిపడుతున్నారు. మరీ ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడమేంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.హీరోయిన్..కాగా సనా మక్బుల్ తెలుగులో దిక్కులు చూడకు రామయ్య, మామ ఓ చందమామ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. 2021లో ఖత్రోన్ కె ఖిలాడీ 11వ సీజన్లో పాల్గొనగా సెమీ ఫైనల్స్ వరకు వెళ్లింది. ఇకపోతే ఈ ఏడాది హిందీ బిగ్‌బాస్ ఓటీటీ మూడో సీజన్ విజేతగానూ నిలిచింది. Cuteness overload sana Makbul Diwali look ❤️🤌🏻#SanaMakbul #desipaps pic.twitter.com/ndmo5Z7Be3— Desi Paps (@desipaps) October 31, 2024 View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)బిగ్‌బాస్ ప్రత్యేకవార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
హిందీ బిగ్ బాస్ విన్నర్‌గా టాలీవుడ్ నటి (ఫోటోలు వైరల్)