Shubman Gill
-
‘గిల్ కంటే బెటర్.. టీమిండియా భవిష్య కెప్టెన్‌గా అతడికే నా ఓటు’
టీమిండియా స్టార్ శుబ్‌మన్ గిల్‌ను ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ(Basit Ali) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతడిపై భారీ అంచనాలు పెట్టుకోవడం సరికాదని.. పాకిస్తాన్‌పై శతకం బాదినప్పుడు మాత్రమే గిల్ ప్రశంసలకు అర్హుడని పేర్కొన్నాడు. నిజానికి గిల్ కంటే.. యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ టెక్నిక్ బాగుంటుందన్నాడు. అదే విధంగా.. భారత జట్టు భవిష్య కెప్టెన్(India Future Captain) ఎవరైతే బెటర్ అన్న అంశం గురించి కూడా బసిత్ అలీ ఈ సందర్భంగా కామెంట్ చేశాడు. పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నమెంట్ మొదలుకానున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దుబాయ్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌తో రోహిత్ సేన ఫిబ్రవరి 20న తమ వేట మొదలుపెట్టనుంది. ఈ క్రమంలో.. ఈ ఐసీసీ వన్డే ఫార్మాట్ ఈవెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ఈ టీమ్‌కు శుబ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది.గిల్ కంటే జైస్వాల్ బెటర్అంతేకాదు.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను తొలిసారిగా వన్డే జట్టులోకి తీసుకుంది. ఇక వికెట్ కీపర్ల కోటాలో కేఎల్ రాహుల్‌తో పాటు రిషభ్ పంత్‌కు కూడా బీసీసీఐ చోటిచ్చింది. ఈ నేపథ్యంలో గిల్, జైస్వాల్, పంత్ పేర్లను ప్రస్తావిస్తూ.. చాంపియన్స్ ట్రోఫీలో తుదిజట్టు కూర్పు గురించి బసిత్ అలీ తన అభిప్రాయాలు పంచుకున్నాడు.‘‘గిల్ కంటే జైస్వాల్ బిగ్ ప్లేయర్. గిల్ ఓవర్రేటెడ్. ఒకవేళ అతడు పాకిస్తాన్ మీద సెంచరీ కొడితే అప్పుడు అతడిని మనం ప్రశంసించవచ్చు. అయినా సరే.. నా దృష్టిలో గిల్ కంటే.. జైస్వాల్ మెరుగైన ఆటగాడు. అతడి టెక్నిక్ బాగుంటుంది. ప్రతి విషయంలోనూ జైస్వాలే బెటర్.టీమిండియా భవిష్య కెప్టెన్‌గా అతడికే నా ఓటుఇక టీమిండియా భవిష్య కెప్టెన్‌గా నా ఆప్షన్ రిషభ్ పంత్(Rishabh Pant). అతడికే నా ఓటు. కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌కు అవకాశాలు ఉండవచ్చు. అయితే, రిషభ్ పంత్ నాణ్యమైన నైపుణ్యాలున్న ఆటగాడు. అతడిని కెప్టెన్‌ను చేస్తే వ్యక్తిగత ప్రదర్శనతో పాటు.. సారథిగానూ అదరగొట్టగలడు. టీమిండియాకు అతడికి అవసరం ఉంది’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.ఓపెనర్‌గా జైసూ, మిడిల్ ఆర్డర్లో పంత్ఇక చాంపియన్స్ ట్రోఫీలో భారత తుదిజట్టు గురించి మాట్లాడుతూ.. ‘‘ఈసారి టీమిండియా ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్లతో బరిలోకి దిగితే మంచిది. ఒకరు ఓపెనర్(జైస్వాల్)గా.. మరొకరు మిడిలార్డర్(పంత్)లో రావాలి. ఏదేమైనా జైస్వాల్ లేకుండా ప్లేయింగ్ ఎలెవన్ ఉండదనే అనుకుంటున్నా.అదే విధంగా.. రిషభ్ పంత్ కూడా తుదిజట్టులో ఉంటాడు. మైదానం నలుమూలలా షాట్లు బాదగల సత్తా అతడి సొంతం. కేఎల్ రాహుల్‌కు అలాంటి నైపుణ్యాలు లేవు’’ అని బసిత్ అలీ అభిప్రాయపడ్డాడు. కాగా టెస్టు, టీ20లో టీమిండియా తరఫున రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే.అతడి వన్డే గణాంకాలు మాత్రం అంతంత మాత్రమేఅయితే, వన్డేల్లో మాత్రం రోహిత్- గిల్ భారత జట్టు ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నారు. మరి.. చాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్-వైస్ కెప్టెన్ జోడీని విడదీసి.. జైస్వాల్‌ను ఓపెనర్‌గా పంపుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బసిత్ అలీ మాత్రం గిల్‌ను కాదని.. ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రం చేయని జైసూకు ఓటేయడం గమనార్హం.ఇక వన్డేల్లో గిల్‌కు మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 47 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 2328 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలతో పాటు ఓ డబుల్ సెంచరీ ఉండటం విశేషం. మరోవైపు.. పంత్ వన్డే గణాంకాలు మాత్రం అంతంత మాత్రమే. 31 వన్డేల్లో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 871 రన్స్ మాత్రమే చేశాడు.చదవండి: CT 2025: భారత జట్టు ప్రకటన.. సిరాజ్‌కు దక్కని చోటు.. నితీశ్ రెడ్డికి ఛాన్స్! -
కరుణ్ నాయర్‌ను ఎలా సెలక్ట్ చేయగలం?: అగార్కర్
విజయ్ హజారే ట్రోఫీలో దుమ్ములేపుతున్న కరుణ్ నాయర్(Karun Nair)ను టీమిండియా సెలక్టర్లు పట్టించుకోలేదు. దేశవాళీ వన్డే టోర్నమెంట్లో సత్తా చాటుతున్నప్పటికీ అతడిని కనికరించలేదు. కాగా విదర్భ కెప్టెన్‌గా బరిలోకి దిగిన కరుణ్ నాయర్ సూపర్ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి ఐదు శతకాల సాయంతో కరుణ్ నాయర్ ఏకంగా 752 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో అతడిపై మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. ఇదొక అసాధారణ ప్రదర్శన అంటూ టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్(sachin Tendulkar) కూడా కరుణ్ నాయర్‌ను అభినందించాడు.ఇక స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ ఓ అడుగు ముందుకేసి అతడికి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో పాటు... చాంపియన్స్ ట్రోఫీ జట్టు(Champions Trophy Squad)లోనూ చోటివ్వాలని సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ అజిత్ అగార్కర్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ప్రకటించిన జట్టులో కరుణ్ నాయర్‌కు మాత్రం చోటు దక్కలేదు.కరుణ్ నాయర్‌ను ఎలా సెలక్ట్ చేయగలం?ఈ విషయం గురించి అగార్కర్‌కు మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. నిజంగానే అదొక ప్రత్యేకమైన, అద్భుతమైన ప్రదర్శన. దాని గురించి మా మధ్య చర్చ జరిగింది.అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో అతడికి జట్టులో చోటు ఇవ్వడం కష్టం. నలభైలకు దగ్గరపడుతున్న వాళ్లను మళ్లీ తీసుకోలేం. అయినా.. జట్టులో పదిహేను మంది సభ్యులకు మాత్రమే చోటు ఉంది. అలాంటపుడు ప్రతి ఒక్కరిని ఇందులో ఇరికించలేము.అయితే, అలాంటి ప్రదర్శనలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సదరు ఆటగాడి గురించి చర్చ జరుగుతుంది. కొంతమంది ఫామ్‌లేమి, గాయాల వల్ల కూడా చర్చనీయాంశంగా మారతారు’’ అని అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. కాగా 33 ఏళ్ల కరుణ్ నాయర్ 2016లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆ మరుసటి ఏడాదే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడేశాడు. ఇంత వరకు మళ్లీ భారత జట్టులో పునరాగమనం చేయలేకపోయాడు.ఇక రాజస్తాన్‌లో జన్మించిన కరుణ్ నాయర్.. దేశవాళీ క్రికెట్లో గతంలో కర్ణాటకకు ఆడాడు. గతేడాది నుంచి విదర్భకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో సారథిగా, బ్యాటర్‌గా ఆకట్టుకుంటూ విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ తొలిసారి ఫైనల్‌కు చేరేలా చేశాడు. అందుకే వాళ్లకు వైస్ కెప్టెన్లుగా అవకాశంఇంగ్లండ్తో టీ20 సిరీస్‌కు అక్షర్ పటేల్, వన్డే సిరీస్‌కు శుబ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్లుగా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ విషయంపై శనివారం అగార్కర్ స్పందిస్తూ.. ‘‘డ్రెస్సింగ్ రూమ్ నుంచి మేము ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. అయినా ప్రతి ఒక్కరూ కెప్టెన్ లేదంటే వైస్ కెప్టెన్ ఆప్షన్ కాబోరు. కొద్ది మందికి మాత్రమే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అలాంటి వారిపైనే మేము దృష్టి సారిస్తాం’’ అని పేర్కొన్నాడు.కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య జనవరి 22- ఫిబ్రవరి 12 వరకు ఐదు టీ20, మూడు వన్డేలు జరుగుతాయి. అనంతరం.. చాంపియన్స్ ట్రోఫీతో టీమిండియా బిజీ కానుంది. పాకిస్తాన్- యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ జరుగుతుంది.చదవండి: Ind vs Eng: టీ20, వన్డే సిరీస్‌లకు భారత్, ఇంగ్లండ్ జట్లు ఇవే -
CT 2025: వన్డేల్లోనూ అదరగొడతాడు.. అతడిని సెలక్ట్ చేయండి: సెహ్వాగ్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్(Virender Sehwag) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వన్డే ఫార్మాట్ టోర్నీలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఓ ‘అన్క్యాప్డ్’ ప్లేయర్‌ను పంపించాలని సూచించాడు. తద్వారా శుబ్‌మన్ గిల్‌పై వేటు వేయాలని పరోక్షంగా సెలక్టర్లకు సలహా ఇచ్చాడు.దుబాయ్ వేదికగాపాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) మొదలుకానుంది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తటస్థ వేదికైన దుబాయ్(Dubai)లో భారత జట్టు తమ మ్యాచ్‌లు ఆడనుంది.ఈ క్రమంలో ఈ మెగా ఈవెంట్లో టీమిండియా ఫిబ్రవరి 20న తమ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇదిలా ఉంటే.. చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించేందుకు ఐసీసీ జనవరి 13 డెడ్‌లైన్ విధించగా.. బీసీసీఐ మాత్రం మినహాయింపు కోరింది. జనవరి 17 నాటికి తమ జట్టును ప్రకటిస్తామని పేర్కొన్నప్పటికీ.. ఇంత వరకు ఆ వివరాలు వెల్లడించలేదు.అతడిని సెలక్ట్ చేయండిఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ హిందుస్తాన్ టైమ్స్‌తో ఈ విషయం గురించి మాట్లాడాడు. ‘‘సెలక్టర్లకు నాదో సలహా. యశస్వి జైస్వాల్‌ను 50 ఓవర్ల ఫార్మాట్లో కూడా ఆడించండి. అంతర్జాతీయ టీ20, వన్డేల్లో అతడు బ్యాటింగ్ చేసే విధానం అద్బుతం. వన్డే ఫార్మాట్‌కు కూడా అతడు సరిగ్గా సరిపోతాడు. కచ్చితంగా అతడిని టీమిండియా వన్డే జట్టులోకి తీసుకోవాలి’’ అని వీరూ భాయ్ పేర్కొన్నాడు.పంత్ వద్దు: భజ్జీమరోవైపు.. టీమిండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా చాంపియన్స్ ట్రోఫీ ఆడే భారత జట్టుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్‌గా తన మొదటి ఓటు సంజూ శాంసన్‌కే వేస్తానని కుండబద్దలు కొట్టాడు. కాగా ఓపెనింగ్ జోడీగా సెహ్వాగ్ రోహిత్- జైస్వాల్‌ల పేర్లను సూచించగా.. భజ్జీ రిషభ్ పంత్‌ను కాదని సంజూ శాంసన్‌కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించడం విశేషం.కాగా ముంబై బ్యాటర్ యశస్వి జైస్వాల్ టెస్టు, టీ20లలో టీమిండియా ఓపెనర్‌గా పాతుకుపోయాడు. అరంగేట్రంలోనే టెస్టుల్లో భారీ శతకం(171)తో మెరిసిన జైసూ ఖాతాలో రెండు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.ఇక ఇప్పటి వరకు ఓవరాల్‌గా భారత్ తరఫున 19 టెస్టులు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 1798, 723 పరుగులు చేశాడు. అయితే, జైస్వాల్‌కు ఇంత వరకు వన్డేల్లో ఆడే అవకాశం మాత్రం రాలేదు. రోహిత్ శర్మతో కలిసి శుబ్‌మన్ గిల్ యాభై ఓవర్ల ఫార్మాట్లో ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్నాడు.జైసూ భేష్అయితే, ఇటీవలి కాలంలో గిల్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ యశస్వి జైస్వాల్ పేరు చెప్పడం గమనార్హం. కాగా లిస్ట్-‘ఎ’ క్రికెట్లో జైసూ గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. కేవలం 32 మ్యాచ్‌లలోనే అతడు ఐదు సెంచరీలు, ఏడు అర్ధ శతకాలు, ఓ డబుల్ సెంచరీ సాయంతో 1511 పరుగులు సాధించాడు. చదవండి: ILT20 2025: చరిత్రపుటల్లోకెక్కిన పోలార్డ్ -
నేను ముందే చెప్పా.. అతడిపై అంచనాలు పెట్టుకోవడం వేస్ట్: శ్రీకాంత్
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను 3-1 తేడాతో టీమిండియా కోల్పోయిన సంగతి తెలిసిందే. ప్రధానంగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే పదేళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియాకు భారత్ సమర్పించుకుంది. ఈ సిరీస్‌లో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ సైతం తీవ్ర నిరాశపరిచాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 18.60 సగటుతో కేవలం 93 పరుగులు మాత్రమే చేశాడు.అందులో 31 పరుగులు అతడి అత్యధిక స్కోర్‌గా ఉంది. సొంతగడ్డపై బ్యాట్ ఝూలిపించే శబ్‌మన్.. విదేశాల్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. 2021లో అరంగేట్రం చేసినప్పటి నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్‌లలో 18 ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే ఈ ఇన్నింగ్స్‌లలో అతడి అత్యధిక స్కోర్ కేవలం 36 పరుగులు మాత్రమే కావడం గమానర్హం.ఈ క్రమంలో గిల్‌పై భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు. గిల్ ఒక ఓవర్రేటెడ్ క్రికెటర్ అని శ్రీకాంత్ ఫైరయ్యాడు."శుబ్‌మన్ గిల్ ఒక ఓవర్రేటెడ్ క్రికెటర్. అతడిపై ఎక్కువగా అంచనాలు పెట్టుకోవద్దని నేను ముందు నుంచి చెబుతునే ఉన్నా. కానీ ఎవరూ నా మాట వినలేదు. అతడిని ఆకాశానికెత్తేశారు. గిల్‌కు చాలా అవకాశాలు లభిస్తున్నాయి.పది ఛాన్స్‌లలో వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో విఫలమై ఆఖరి మ్యాచ్‌లో పరుగులు సాధిస్తున్నాడు. దీంతో అతడు జట్టులో తన స్ధానాన్ని పదిలం చేసుకుంటున్నాడు. అంతే తప్ప స్పెషల్ టాలెంట్ ఏమీ లేదు.భారత పిచ్‌లపై ఎవరైనా పరుగులు సాధిస్తారు. సేనా దేశాల్లో పరుగులు సాధించడం గొప్ప విషయం. ఈ విషయంలో కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు తమను తాము నిరూపించుకున్నారు అని ఓ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ పేర్కొన్నాడు.చదవండి: ఆసీస్ గడ్డపై ఎంతో నేర్చుకున్నాను.. మళ్లీ బలంగా పైకి లేస్తాం: జైస్వాల్ -
CT 2025: శుబ్‌మన్ గిల్‌పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్?
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్‌లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది టీమిండియా. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగా దాదాపు దశాబ్దం తర్వాత ఈ టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. కంగారూ గడ్డపై 3-1తో ఓడి రిక్తహస్తాలతో స్వదేశానికి పయనమైంది.బౌలర్‌గా, కెప్టెన్‌గా రాణించిఇక ఆసీస్‌తో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో టీమిండియా కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిచిందంటే అందుకు కారణం జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)నే. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గైర్హాజరీలో ఈ ఫాస్ట్‌బౌలర్ భారత జట్టును ముందుకు నడిపించాడు. పేసర్‌గా, కెప్టెన్‌గా రాణించి ఆసీస్ గడ్డపై టీమిండియాకు అతిపెద్ద టెస్టు విజయం(295 పరుగుల తేడాతో) అందించాడు.వెన్నునొప్పి వేధించినాఅయితే, ఆ తర్వాత రోహిత్ శర్మ తిరిగి వచ్చినా టీమిండియా ఇదే జోరును కొనసాగించలేకపోయింది. బ్యాటర్‌గా, సారథిగా రోహిత్ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆఖరిదైన ఐదో టెస్టు నుంచి అతడు స్వచ్చందంగా తప్పుకోగా.. బుమ్రా మరోసారి పగ్గాలు చేపట్టాడు. వెన్నునొప్పి వేధించినా జట్టును గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాడు.కానీ సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టులో టీమిండియాకు భంగపాటు తప్పలేదు. మ్యాచ్‌తో పాటు సిరీస్‌లోనూ ఓటమిని చవిచూసింది. బుమ్రా లేకపోయి ఉంటే.. టీమిండియా ఆసీస్ చేతిలో 5-0తో వైట్‌వాష్‌కు గురయ్యేదని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడంటే.. ఈ సిరీస్‌లో అతడి ప్రాధాన్యం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా?ఈ నేపథ్యంలో ఇప్పటికే పేస్ దళ నాయకుడిగా ఉన్న బుమ్రా.. త్వరలోనే పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. వన్డేల్లోనూ రోహిత్ వారసుడిగా బుమ్రా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గిల్‌పై వేటు.. బుమ్రాకు ప్రమోషన్?ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా రోహిత్ శర్మకు బుమ్రా డిప్యూటీగా వ్యవహరించనున్నట్లు సమాచారం. కాగా శ్రీలంక పర్యటన 2024 సందర్భంగా వన్డే, టీ20లలో యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). అయితే, ఏదేని కారణాల వల్ల రోహిత్ దూరమైతే.. గిల్ ఇప్పటికప్పుడు కెప్టెన్‌గా వ్యవహరించే పరిణతి సాధించలేదని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అందుకే బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయాలనే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మ తప్పుకొన్న తర్వాత.. వన్డే కెప్టెన్సీకి అతడు దూరం కానున్నాడనే వదంతులు వచ్చాయి. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించనున్నారనే ఊహాగానాలు వినిపించాయి.ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్లుకాగా చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అయితే, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు బుమ్రా దూరంగా ఉండనున్నట్లు సమాచారం. వెన్నునొప్పి కారణంగా అతడు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది. పాకిస్తాన్ ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో జరుగుతాయి. హైవోల్టేజీ పోరు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.చదవండి: 13 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. రషీద్ ఖాన్ మాయాజాలం.. అఫ్గన్ సరికొత్త చరిత్ర -
స్మిత్, లబుషేన్ మైండ్‌గేమ్.. ఇచ్చిపడేసిన గిల్! కానీ మనోడికే..
సిడ్నీ టెస్టులోనూ టీమిండియా బ్యాటింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఆస్ట్రేలియా బౌలర్ల దూకుడు కారణంగా భారత ఓపెనర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. కేఎల్ రాహుల్ 14 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు.పట్టుదలగా నిలబడ్డ గిల్, కోహ్లిఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 26 బంతుల్లో పది పరుగులు చేసి స్కాట్ బోలాండ్కు వికెట్ సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్(Shubman Gill).. నాలుగో స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లి(Virat Kohli)తో కలిసి ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. అయితే, కంగారూ జట్టు స్పిన్నర్ నాథన్ లియాన్ ఈ జోడీని విడదీశాడు. మొత్తంగా 64 బంతులు ఎదుర్కొన్న గిల్ రెండు ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసి బోలాండ్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.నిజానికి తన ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఆస్ట్రేలియా ఆటగాళ్లు పన్నిన వ్యూహంలో చిక్కిన గిల్.. ఒత్తిడిలోనే వికెట్ కోల్పోయాడని చెప్పవచ్చు. భారత తొలి ఇన్నింగ్స్ 25వ ఓవర్‌ను బోలాండ్ వేశాడు. ఐదో బంతికి షాట్ ఆడేందుకు ప్రయత్నించి గిల్ విఫలమయ్యాడు. గిల్‌ను స్లెడ్జ్ చేసిన స్మిత్, లబుషేన్అనంతరం గిల్ పిచ్ మధ్యలోకి వచ్చి బ్యాట్‌ను టాప్ చేస్తూ కాస్త అసహనం ప్రదర్శించాడు. ఈ క్రమంలో మార్నస్ లబుషేన్.. ఈజీ.. ఈజీగానే క్యాచ్ పట్టేయవచ్చు అని పేర్కొన్నాడు. ఇందుకు స్టీవ్ స్మిత్ స్పందిస్తూ.. ‘బుల్షిట్.. ఆట మొదలుపెడితే మంచిది’ అని గిల్‌ను ఉద్దేశించి అన్నాడు. ఇచ్చి పడేసిన గిల్!ఇందుకు బదులిస్తూ.. ‘‘నీ టైమ్ వచ్చినపుడు చూసుకో స్మితీ.. నీ గురించి ఇప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడలేదే’’ అని గిల్ పేర్కొనగా.. ‘‘నువ్వైతే ఆడు’’ అని స్మిత్ గిల్‌తో అన్నాడు.కానీ మనోడికే భంగపాటుదీంతో 25వ ఓవర్లో ఆఖరి బంతిని ఎదుర్కొనేందుకు గిల్ సిద్ధం కాగా.. అప్పటికే మాటలు మొదలుపెట్టిన లబుషేన్.. ‘‘స్మిత్.. నీ టైమ్ వచ్చింది చూడు’’ అని అరిచాడు. ‘‘నేను అలాగే చేస్తాను చూడు’’ అని చెప్పిన స్మిత్.. గిల్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టాడు. అలా శుబ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా గిల్ అవుటైన కాసేపటికే కోహ్లి(69 బంతుల్లో 17) కూడా నిష్క్రమించగా.. రిషభ్ పంత్(40), రవీంద్ర జడేజా(26) కాసేపు పోరాటం చేశారు. బుమ్రా మెరుపులుఆఖర్లో కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మెరుపు ఇన్నింగ్స్(17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్) కారణంగా టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో పేసర్లు బోలాండ్ నాలుగు, స్టార్క్ మూడు, కమిన్స్ రెండు వికెట్లు దక్కించుకోగా.. స్పిన్నర్ నాథన్ లియాన్ ఒక వికెట్ తీశాడు. ఇదిలా ఉంటే.. వరుస వైఫల్యాల నేపథ్యంలో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆసీస్‌తో ఆఖరిదైన ఐదో టెస్టుకు దూరంగా ఉన్నాడు. అతడి స్థానంలో బుమ్రా సారథిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథిగా అతడే! View this post on Instagram A post shared by Fox Cricket (@foxcricket) -
CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్ అవుట్!.. టీమిండియా కొత్త సారథి?
ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టుకు రోహిత్ శర్మ(Rohit Sharma) దూరమయ్యాడు. విశ్రాంతి పేరిట తనంత తానే తుదిజట్టు నుంచి తప్పుకొన్నాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు రోహిత్ నిర్ణయం గొప్పదని కొనియాడుతున్నారు. జట్టు ప్రయోజనాల దృష్ట్యా కెప్టెన్ బెంచ్‌కే పరిమితం కావడం అతడి పరిణతికి నిదర్శమని పేర్కొంటున్నారు.ఇదిలా ఉంటే.. ఇప్పటికే రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్పై క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. సిడ్నీ టెస్టు తర్వాత అతడు తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఆసక్తికర వార్త తెర మీదకు వచ్చింది. టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీ(ODI Captaincy) నుంచి వైదొలగనున్నాడనే వదంతులు వస్తున్నాయి.చివరగా లంక పర్యటనలో.. పరాభవంతో ఇంటికికాగా గతేడాది టీమిండియా ఒకే ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడింది. శ్రీలంక పర్యటనలో భాగంగా రోహిత్ సేన ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు ఆడి.. 0-2తో సిరీస్‌ను కోల్పోయింది. తద్వారా రెండున్నర దశాబ్దాల తర్వాత లంకకు వన్డే సిరీస్ సమర్పించుకున్న తొలి భారత జట్టుగా నిలిచింది. అంతేకాదు.. 45 ఏళ్ల తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్లో ఒక్క వన్డే కూడా గెలవని జట్టుగానూ అపఖ్యాతి మూటగట్టుకుంది రోహిత్ సేన.రోహిత్‌పై వేటు.. చాంపియన్స్ ట్రోఫీ నాటికి కొత్త సారథిఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy 2025) మొదలుకానుంది. ఈ మెగా వన్డే టోర్నీలో టీమిండియా మ్యాచ్‌లు తటస్థ వేదికైన దుబాయ్‌లో జరుగనున్నాయి. అయితే, ఈ ఐసీసీ ఈవెంట్ కంటే ముందు భారత్ ఒకే ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడనుంది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌లలో తలపడనుంది.ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) నాయకత్వం వన్డే కెప్టెన్సీ మార్పు అంశంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే టెస్టుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటూ బలవంతపు రిటైర్మెంట్కు చేరువైన రోహిత్.. ఇలాంటి మానసిక స్థితిలో ఇక జట్టును ముందుకు నడిపించేందుకు సిద్ధంగా లేడని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం.రేసులో ముందుంది అతడేశ్రీలంక పర్యటన తాలూకూ చేదు అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని.. వన్డే పగ్గాలను వేరొకరికి అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. వన్డే కెప్టెన్సీ రేసులో ప్రధానంగా హార్దిక్ పాండ్యా(Hardik Pandya), శుబ్‌మన్ గిల్, రిషభ్ పంత్ పేర్లు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, పాండ్యా వైపే మేనేజ్మెంట్ మొగ్గుచూపుతున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు మైఖేల్ సైట్ పేర్కొంది.‘‘గిల్ ఇంకా పూర్తి స్థాయిలో పరిణతి చెందలేదు. అతడు నాయకుడిగా ఎదగడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఇక సూర్యకుమార్ యాదవ్ వన్డే గణాంకాలు అంత గొప్పగా లేవు.. ఈ టీ20 కెప్టెన్ పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో పంత్ కంటే కూడా హార్దిక్ పాండ్యానే సరైన కెప్టెన్ అనే భావన నాయకత్వంలో ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నట్లు తెలిపింది.వరుస వైఫల్యాలతో సతమతంకాగా టెస్టుల్లో గత కొంతకాలంగా రోహిత్ శర్మ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలమవుతున్న విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై 3-0తో రోహిత్ సేన వైట్‌వాష్ కాగా.. ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ నిరాశపరుస్తోంది. పెర్త్‌లో బుమ్రా సారథ్యంలో గెలిచిన భారత జట్టు.. రెండో టెస్టు నుంచి రోహిత్ కెప్టెన్సీలో విఫలమైంది.అడిలైడ్‌లో పింక్ బాల్ టెస్టులో ఓడి.. బ్రిస్బేన్‌లో వర్షం వల్ల డ్రాతో గట్టెక్కింది. మెల్బోర్న్ వేదికగా బాక్సింగ్ డే టెస్టులో 184 పరుగుల భారీ తేడాతో ఆసీస్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడింది. ఈ సిరీస్‌లో రోహిత్ ఐదు ఇన్నింగ్స్ ఆడి మొత్తంగా కేవలం 31 పరుగులే చేశాడు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తగా ఆసీస్‌తో ఆఖరిదైన సిడ్నీ టెస్టు నుంచి విశ్రాంతి పేరిట తనంతట తానే స్వయంగా తప్పుకొన్నాడు. చదవండి: IND vs AUS: మళ్లీ అదే తప్పు చేసిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్ -
సిడ్నీ టెస్టుకు భారత తుదిజట్టు ఇదే! అతడి ఎంట్రీ ఫిక్స్!
ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టులో రెండు మార్పులు చేటుచేసుకున్నట్లు సమాచారం. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) విశ్రాంతి పేరిట ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండాలని భావించగా.. శుబ్‌మన్ గిల్‌కు మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. ఆకాశ్ దీప్ స్థానంలో యువ పేసర్మరోవైపు.. ఆకాశ్ దీప్ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. ఓ యువ పేసర్ ఏడాది కాలం తర్వాత పునరాగమనం చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా రోహిత్ శర్మ గైర్హాజరీలో ప్రధాన పేసర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గత నాలుగు పర్యాయాలుగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న భారత జట్టు.. ఈసారి మాత్రం అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతోంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపుతోంది. కోహ్లి, రోహిత్ విఫలంఆసీస్తో ఐదు టెస్టుల్లో భాగంగా ఇప్పటికి నాలుగు పూర్తి కాగా.. తొలి మ్యాచ్‌లో శతకం సాధించడం మినహా కోహ్లి పెద్దగా రాణించలేకపోతున్నాడు. ముఖ్యంగా ఆఫ్ సైడ్ బంతుల్ని ఎదుర్కొనే క్రమంలో పదే పదే తప్పుల్ని పునరావృతం చేస్తూ వికెట్ పారేసుకుంటున్నాడు.మరోవైపు.. రోహిత్ సారథిగా, బ్యాటర్‌గా విఫలమవుతున్నాడు. అడిలైడ్‌లో జరిగిన రెండో టెస్టుతో జట్టులోకి వచ్చిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఐదు ఇన్నింగ్స్‌లో కలిపి మరీ దారుణంగా31 పరుగులే చేశాడు. ఇక అతడి సారథ్యంలో రెండో టెస్టులో ఓడిన భారత్, బ్రిస్బేన్ టెస్టును డ్రాగా ముగించగలిగింది. అయితే, మెల్బోర్న్లో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది.సిడ్నీ టెస్టు నుంచి వైదొలిగిన రోహిత్!ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే సమయం ఆసన్నమైందని.. అతడు వెంటనే తప్పుకొని యువకులకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆసీస్‌తో ఆఖరి టెస్టు ముగిసిన తర్వాత రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో తనకు తానుగా సిడ్నీ టెస్టు నుంచి వైదొలగాలని అతడు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో యశస్వి జైస్వాల్‌తో ఓపెనింగ్ జోడీగా కేఎల్ రాహుల్ మరోసారి బరిలోకి దిగనుండగా.. శుబ్‌మన్ గిల్(Shubhman Gill) మూడో స్థానంలో ఆడనున్నట్లు సమాచారం. అదే విధంగా గాయపడిన పేసర్ ఆకాశ్ దీప్ స్థానంలో ప్రసిద్ కృష్ణ తుదిజట్టుకు ఎంపికైనట్లు తెలుస్తోంది. రెండే మార్పులుఈ రెండు మార్పులు మినహా.. పాత జట్టుతోనే భారత్ సిడ్నీ టెస్టుకు సన్నద్ధమైనట్లు సమాచారం. కాగా శుక్రవారం నుంచి మంగళవారం(జనవరి 3-7) వరకు ఆసీస్- భారత్ మధ్య ఐదో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది. ఇందులో గెలిస్తేనే టీమిండియా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోగలుగుతుంది. అదే విధంగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025 అవకాశాలు కూడా సజీవంగా ఉంటాయి.ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టుకు భారత తుదిజట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బుమ్రా(కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ.చదవండి: కెప్టెన్ కంటే బెటర్.. అతడిని మాత్రం తప్పించకండి: భారత మాజీ క్రికెటర్ -
రోహిత్, బుమ్రా కాదు!.. సిడ్నీ టెస్టులో టీమిండియా కెప్టెన్ అతడే!
ఆస్ట్రేలియాతో టీమిండియా ఆఖరి టెస్టుకు సమయం ఆసన్నమైంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో శుక్రవారం ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఇందుకోసం ఇరుజట్లు ఇప్పటికే పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యాయి. సిడ్నీలో గెలిచి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోవాలని భారత్ భావిస్తోంది.మరోవైపు.. ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)ని తామే కైవసం చేసుకోవాలని ఆసీస్ పట్టుదలగా ఉన్నాయి. ఫలితంగా భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్టు మరింత రసవత్తరంగా మారనుంది. అయితే, ఈ కీలక టెస్టుకు ముందు టీమిండియా డ్రెసింగ్‌రూమ్‌లో విభేదాలు తలెత్తాయనే వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి.హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌తో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)కు సమన్వయం కుదరడం లేదని.. అదే విధంగా ఆటగాళ్ల తీరు పట్ల కోచ్ అసంతృప్తితో ఉన్నాడనే వదంతులు వచ్చాయి. అయితే, గౌతీ మాత్రం ఇవన్నీ అబద్దాలేనని కొట్టిపారేశాడు. అయినప్పటికీ, టీమిండియా కెప్టెన్ మార్పు అంశం మీద మాత్రం ఊహాగానాలు ఆగటం లేదు.బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదో టెస్టుకు ముందు కెప్టెన్‌గా రోహిత్‌పై వేటు పడనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అతడి గైర్హాజరీలో పెర్త్‌లో టీమిండియాను గెలిపించిన జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) పగ్గాలు చేపట్టడం లాంఛనమేనని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, బెంగాల్ మాజీ క్రికెటర్, ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడిన శ్రీవత్స్ గోస్వామి మాత్రం భిన్నంగా స్పందించాడు.సిడ్నీ టెస్టులో టీమిండియా కెప్టెన్ అతడే!‘‘టీమిండియాలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే.. సిడ్నీ టెస్టులో గిల్ కెప్టెన్‌గా వ్యవహరించునున్నాడని అనిపిస్తోంది. తదుపరి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ సైకిల్ కోసం మేనేజ్మెంట్ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదెంతో ఆసక్తికరంగా ఉంది’’ అని శ్రీవత్స్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.సరైన నాయకుడు బుమ్రానేఅయితే, మెజారిటీ మంది నెటిజన్లు మాత్రం శ్రీవత్స్ అభిప్రాయంతో విభేదిస్తున్నారు. గిల్‌కు తుదిజట్టులోనే చోటు దక్కనపుడు కెప్టెన్ ఎలా అవుతాడని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో గిల్‌కు పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందని.. ఇప్పుడు మాత్రం బుమ్రాకు సారథ్య బాధ్యతలు అప్పగిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీమిండియాకు ప్రస్తుత పరిస్థితుల్లో బుమ్రానే సరైన నాయకుడు అని పేర్కొంటున్నారు. ఏదేమైనా శుక్రవారం సిడ్నీ టెస్టు మొదలైన తర్వాతే ఈ ఊహాగానాలకు చెక్ పడుతుంది.ఇదిలా ఉంటే.. ఐదు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియాకు సానుకూల ఫలితాలు రావడం లేదు. పెర్త్‌లో గెలిచిన భారత జట్టు.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో ఆసీస్ చేతిలో ఓటమిపాలైంది. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టులో వర్షం వల్ల డ్రాతో గట్టెక్కగలిగింది. అయితే, మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్టులో మాత్రం ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.రోహిత్ వైఫల్యాల వల్లే ఇలాఈ బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య ఆసీస్ చేతిలో 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడి.. సిరీస్‌లో 1-2తో వెనుకబడింది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ సారథిగా, బ్యాటర్‌గా విఫలం అవుతుండటంతో అతడు వెంటనే రాజీనామా చేసి.. రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త కెప్టెన్ అంశం తెరమీదకు వచ్చింది.చదవండి: లవ్ యూ కాంబ్లీ.. త్వరలోనే వచ్చి కలుస్తా: టీమిండియా దిగ్గజం భరోసా -
రోహిత్ శర్మ అందుకు సిద్ధంగానే ఉన్నాడు: రవిశాస్త్రి
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)ను ఉద్దేశించి మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి(Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. సిడ్నీ టెస్టు ముగిసిన వెంటనే హిట్‌మ్యాన్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందన్నాడు. రోజురోజుకీ రోహిత్ వయసు పెరుగుతోందని.. కాబట్టి తనకు తానుగా రెడ్ బాల్ క్రికెట్ నుంచి తప్పుకొనేందుకు సిద్ధంగానే ఉన్నాడని అభిప్రాయపడ్డాడు.బ్యాటర్‌గా.. కెప్టెన్‌గా వైఫల్యాలుకాగా గత కొంతకాలంగా రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా ఘోర పరాభవాలు చవిచూస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో క్లీన్‌స్వీప్.. తాజాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలోనూ వైఫల్యాలు రోహిత్‌ను వేధిస్తున్నాయి.ఆసీస్ పర్యటనలో రెండో టెస్టు నుంచి జట్టుతో చేరిన రోహిత్ శర్మ అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోతున్నాడు. ఇప్పటి వరకు కంగారూ జట్టుతో ముగిసిన మూడు టెస్టుల్లో ఐదు ఇన్నింగ్స్ ఆడిన అతడు.. కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ సారథ్యంలో ఈ మూడు మ్యాచ్‌లలో రెండింటిలో ఓడిన టీమిండియా.. ఒకటి మాత్రం డ్రా చేసుకోగలిగింది.ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలి, కెప్టెన్సీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. త్వరగా అతడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాటు.. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మ అందుకు సిద్ధంగానే ఉన్నాడుఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ తన కెరీర్ గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటాడనిపిస్తోంది. సిడ్నీ టెస్టు తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యం అక్కర్లేదు. ఎందుకంటే.. రోజురోజుకీ అతడేమీ యువకుడు కావడం లేదు కదా! శుబ్‌మన్ గిల్ (Shubman Gill)వంటి ఎంతో మంది యువ ఆటగాళ్లు జట్టులో సుస్థిర స్థానం కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది సగటున 40 పరుగులు చేసిన గిల్ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టడం సరికాదు. ప్రతిభ ఉన్న యువకులను బెంచ్‌కే పరిమితం చేయడం తెలివైన నిర్ణయం అనిపించుకోదు. కాబట్టి రోహిత్ వైదొలుగుతాడనే అనిపిస్తోంది. ఒకవేళ సిడ్నీలో టీమిండియా గెలిచి.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) ఫైనల్ చేరినా.. చేరకపోయినా రోహిత్ మాత్రం తుది నిర్ణయం వెల్లడిస్తాడని.. అందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. 37 ఏళ్ల రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలికితే యువకులకు మార్గం సుగమమవుతుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు.సిడ్నీలో గెలిస్తేనేకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడుతున్న టీమిండియా.. ఆతిథ్య జట్టు చేతిలో 2-1తో వెనుకబడి ఉంది. పెర్త్‌లో గెలిచిన భారత్.. అడిలైడ్‌లో ఓడి.. బ్రిస్బేన్ టెస్టును డ్రా చేసుకుంది. అయితే, మెల్బోర్న్లో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో మాత్రం 184 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఇరుజట్ల మధ్య జనవరి 3-7 మధ్య సిడ్నీ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టు జరుగుతుంది. ఇందులో గెలిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉంటాయి.చదవండి: లవ్ యూ కాంబ్లీ.. త్వరలోనే వచ్చి కలుస్తా: టీమిండియా దిగ్గజం భరోసా -
శుబ్‌మన్ గిల్‌కు షాక్.. గుజరాత్ సీఐడీ సమన్లు!?
బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కుంభకోణం కేసులో నలుగురు భారత క్రికెటర్లకు గుజరాత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ) సమన్లు పంపింది. వారిలో టీమిండియా ప్లేయర్లు శుబ్‌మన్ గిల్, సాయిసుదర్శన్, మొహిత్ శర్మ, రాహుల్ తెవాటియా ఉన్నారు. వీరు నలుగురూ ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టినందుకు గుజరాత్ సిఐడి సమన్లు పంపింది. త్వరలోనే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.అహ్మదాబాద్ మిర్రర్ కథనం ప్రకారం.. ఆ కంపెనీలో గిల్ రూ.1.95 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. మిగతా ముగ్గురు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు రూ. 10 లక్షల నుంచి కోటి మధ్య ఇన్వెస్ట్ చేసినట్లు సమాచారం. కాగా శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 ముగిసిన అనంతరం గిల్ విచారణకు హాజరు కానున్నాడు. అయితే మిగితా ముగ్గురు ఆటగాళ్లు భారత్‌లోనే ఉండడంతో గిల్ కంటే ముందు విచారణకు హాజరు అయ్యే అవకాశముంది.ఏంటీ బీజడ్ గ్రూపు స్కామ్?గుజరాత్‌లోని హిమ్మత్‌నగర్ చెందిన భూపేంద్రసిన్హ్ జాలా.. బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, బీజడ్ ట్రేడర్స్ కంపెనీలను స్దాపించాడు. ఈ సంస్థలకు సంబంధించిన కార్యాలయాలను గుజరాత్‌లోని పలు జిల్లాల్లో విస్తరించాడు. ఈ కంపెనీలలో పెట్టుబడి పెడితే బ్యాంకుల కంటే మెరుగైన వడ్డీ రేటును చెల్లిస్తామని ప్రజలను నమ్మించారు.అంతేకాకుండా బహుమతులను ప్రకటించి పెట్టుబడిదారులను భారీగా ఆకర్షించారు. ఉదాహరణకు వారి కంపెనీలో రూ. 5 లక్షల పెట్టుబడి పెడితే 32 ఇంచ్ టీవీ, రూ.10 లక్షల పెట్టుబడి పెడితే గోవా ట్రిప్స్ వంటి గిప్ట్ ప్యాకేజిలను బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫర్ చేసింది. దీంతో ప్రజలు భారీగా పెట్టుబడులు పెట్టారు. అయితే వారు ఇచ్చిన హామీలు అన్ని బూటకమని, మోసపోయాయని తెలుసుకున్న ప్రజలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఫోర్జరీ కేసు నమోదు చేసిన పోలీసులు బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో భూపేంద్రసిన్హ్ జాలాను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆ కేసును సిఐడీ అప్పగించారు.తొలుత భూపేంద్రసిన్హ్ రూ. 6000 కోట్ల చిట్-ఫండ్ మోసానికి పాల్పడ్డారని నివేదించిన గుజరాత్ సీఐడీ.. ఆ తర్వాత ఆ మొత్తాన్ని రూ. 450 కోట్లగా ఖారారు చేసింది. అయితే పోలీసుల విచారణలో గిల్, సాయిసుదర్శన్, మొహిత్ శర్మ, తెవాటియా సైతం పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. ఈ క్రమంలోనే ఈ నలుగురుకు సిఐడి సమన్లు పంపింది. -
ఆసీస్‌తో నాలుగో టెస్టు.. గిల్, నితీశ్ రెడ్డిపై వేటు! వారికి ఛాన్స్?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టులో తలపడేందుకు ఆస్ట్రేలియా, భారత్ జట్లు సిద్దమయ్యాయి. డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే ఈ బాక్సింగ్ డే టెస్టు కోసం ఇరు జట్లు తీవ్రంగా శ్రమించాయి. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించాలని అటు ఆస్ట్రేలియా, ఇటు భారత్ రెండూ భావిస్తున్నాయి. అయితే ఈ నాలుగో టెస్టులో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.ఓపెనర్‌గా రోహిత్.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా రాణిస్తుండడంతో గత రెండు మ్యాచ్‌ల్లో రోహిత్ ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ హిట్‌మ్యాన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. ఈ క్రమంలోనే అతడిని తన రెగ్యూలర్ బ్యాటింగ్ పొజిషేన్లోనే పంపాలని జట్టు మెనెజ్‌మెంట్ నిర్ణయించుకున్నట్లు వినికిడి. కాగా కేఎల్ రాహుల్ మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు రానున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఈ నేపథ్యంలో ఫస్ట్ డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌పై వేటు పడే అవకాశం ఉంది.. ఎందుకంటే రోహిత్ ఓపెనర్‌గా, రాహుల్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్ వస్తే.. గిల్ ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు రాక తప్పదు. అతడు ఎప్పుడూ టాపర్డర్‌లో తప్ప లోయార్డర్‌లో బ్యాటింగ్ చేసిన అనుభవం లేదు. దీంతో గిల్ స్దానంలో ధ్రువ్ జురెల్‌కు చోటు ఇవ్వాలని భారత జట్టు మెనెజ్‌మెంట్ యోచిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు టైమ్స్ ఇండియా కథనం ప్రకారం.. బ్యాక్సింగ్ డే టెస్టులో భారత్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సందర్లు బ్యాక్సింగ్ డే టెస్టులో స్పిన్నర్లగా ఆడున్నట్లు సమాచారం. యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టాలని రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గంభీర్ భావిస్తున్నరంట. నితీశ్ బ్యాటింగ్ పరంగా అద్బుతంగా రాణిస్తున్నప్పటికి, బౌలింగ్‌లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే అతడి స్ధానంలో స్పిన్ ఆల్‌రౌండర్ సుందర్‌కు అవకాశమివ్వనున్నారంట.భారత తుది జట్టు(అంచనా)యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), KL రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్చదవండి: IND vs AUS: భారత్‌తో నాలుగో టెస్టు.. ఆసీస్ తుది జట్టు ప్రకటన! 19 ఏళ్ల కుర్రాడికి చోటు -
గిల్.. భారత్‌లో ఆడినట్లు అక్కడ ఆడితే కుదరదు: దినేష్ కార్తీక్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న సంగతి తెలిసిందే. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టుకు గాయం కారణంగా దూరమైన గిల్ రెండో టెస్టు నుంచి అందుబాటులో వచ్చాడు.ఇప్పటివరకు ఈ సిరీస్‌లో మూడు ఇన్నింగ్స్‌లు ఆడిన గిల్.. వరుసగా 31, 28, 1 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్ తన బ్యాటింగ్ టెక్నిక్‌లో స్వల్ప మార్పులు చేయాలని చేయాలని కార్తీక్ సూచించాడు."శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో చిన్న సాంకేతిక లోపం ఉంది. అతడు బంతిని బలంగా కొట్టడానికి ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోతున్నాడు. మీరు వైట్‌బాల్ క్రికెట్ ఎక్కువగా ఆడే సమయంలో ఇది సహజంగా జరుగుతోంది. ట్రావిస్ హెడ్ కూడా అలానే ఆడేవాడు.కానీ ఇప్పుడు అతడు తన సమస్యకు పరిష్కరం కనుగొన్నాడు. శుబ్‌మన్ గిల్ వంటి ఆటగాళ్లు భారత కండీషన్స్‌కు ఎక్కువగా అలవాటు పడడంతోనే.. విదేశీ పిచ్‌లలో ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. బౌలర్ బంతిని రిలీజ్ చేసిన వెంటనే మీ మనసు దానిని ఫుల్బాల్గా అంచనావేసి.. ఫ్రంట్ ఫుట్కు వెళ్లి ఆడమని చెబుతుంది.కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా వంటి విదేశీ టార్లకు వెళ్లే ఆటగాళ్లు కొత్త బంతిని ఎలా ఆడాలో ముందే ప్రాక్టీస్ చేస్తారు. కొత్త బాల్‌ను ఆడేందుకు రెండు రకాలుగా ప్రయత్నిస్తారు. ఒకటి షాప్ట్ హ్యాండ్స్‌తో ఆడుతారు లేదా శరీరానికి దగ్గరగా బంతిని ఆడటం లేదా వదిలేయడం చేస్తారు. శుబ్‌మన్ గిల్ భారత్‌లో ఆడినట్లే ఆస్ట్రేలియాలో ఆడుతున్నాడు.స్వదేశంలో పరిస్థితులకు ఆసీస్ కండీషన్స్‌కు చాలా తేడా ఉంది. బంతిని గట్టిగా హిట్ చేయడానకి వెళ్లి ఔట్ అవుతున్నాడు. గబ్బా వంటి స్టేడియాల్లో ఫ్రంట్ ఫుట్ ఆడటం కొంచెం కష్టం. ఇన్నింగ్స్ ఆరంభంలోనే మీ మనస్సును నియంత్రించుకుని అలాంటి బంతులను వదిలేస్తాని నిర్ణయించుకోవాలి.టెస్టుల్లో చాలా కాలం నుంచి నంబర్3లో ఆడుతున్నావు. అటువంటి అప్పుడు అంత సులువగా ఔట్ అవ్వడం సరైనది కాదు. నిజం చెప్పాలంటే గిల్ ఒక్కడే కాదు, భారత బ్యాటింగ్ సమష్టిగానే విఫలమవుతోంది. ప్రతీ ఇన్నింగ్స్‌లో వారు ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు అన్పిస్తోందని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు. -
నేను బాగానే ఉన్నా.. వాళ్లు పుంజుకుంటారు: రోహిత్ శర్మ
ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టు(Boxing Day Test)కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన గాయం గురించి కీలక అప్డేట్ అందించాడు. తన మోకాలు బాగానే ఉందని.. ఈ విషయం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నాడు. అదే విధంగా.. జట్టు ప్రయోజనాలకు అనుగుణంగానే బ్యాటింగ్ ఆర్డర్ కూర్పు ఉంటుందని మరోసారి స్పష్టం చేశాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పెర్త్‌లో భారత్, అడిలైడ్‌లో ఆసీస్ గెలవగా.. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో టెస్టు వర్షం వల్ల డ్రా అయింది. ఫలితంగా ఇరుజట్లు సిరీస్‌లో ప్రస్తుతం 1-1తో సమంగా ఉన్నాయి.నేను బాగానే ఉన్నానుఈ క్రమంలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో డిసెంబరు 26(బాక్సింగ్ డే) నుంచి నాలుగో టెస్టు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma PC) మంగళవారం మీడియాతో మాట్లాడాడు. ప్రాక్టీస్‌లో తనకు తీవ్ర గాయమైందన్న వార్తలను ఖండించిన హిట్‌మ్యాన్.. తన మోకాలు బాగానే ఉందని పేర్కొన్నాడు.అతడిపై ఒత్తిడి లేదుఅదే విధంగా.. టీమిండియా యువ ఆటగాళ్ల వైఫల్యాల గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘‘రిషభ్ పంత్‌పై ఎలాంటి ఒత్తిడి లేదు. అతడు గత కొంతకాలంగా ఫామ్‌లోనే ఉన్నాడు. అయితే, రెండు, మూడో టెస్టులో మాత్రం రాణించలేకపోయాడు.వాళ్లు తిరిగి పుంజుకుంటారుఅంతమాత్రాన ఏకపక్షంగా అతడి గురించి తీర్పులు ఇచ్చేయడం సరికాదు. ఎలా ఆడాలన్న అంశంపై అతడికి పూర్తి స్పష్టత ఉంది. శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ కూడా తిరిగి పుంజుకుంటారు. జట్టులో వారి పాత్ర ఏమిటో వారికి బాగా తెలుసు’’ అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.కాగా ఆస్ట్రేలియాతో ఇప్పటి వరకు పూర్తయిన మూడు టెస్టుల్లో యశస్వి జైస్వాల్ 193, రిషభ్ పంత్ 96 పరుగులు చేశారు. ఇక రెండో టెస్టు నుంచి అందుబాటులోకి వచ్చిన శుబ్‌మన్ గిల్ 60 పరుగులు చేశాడు. మరోవైపు.. వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్టుకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ.. రెండు(3, 6), మూడు టెస్టు(10)ల్లో పూర్తిగా విఫలమయ్యాడు. అయితే, ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్ కోసం ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేసిన రోహిత్.. ఆరో స్థానంలో బరిలోకి దిగుతున్నాడు.చదవండి: BGT: అశ్విన్ స్థానంలో ఆస్ట్రేలియాకు.. ఎవరీ తనుశ్? -
‘షాట్ సెలక్షన్ చెత్తగా ఉంది.. నీ ఇమేజ్ను వదిలెయ్’
టీమిండియా స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఆట తీరును భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ విమర్శించాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో గిల్ షాట్ సెలక్షన్‌ను సన్నీ తప్పుబట్టాడు. బ్యాటింగ్‌కు వచ్చే ముందు డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఇమేజ్ను వదిలేస్తే ఇలాంటి పొరపాట్లు జరగవంటూ చురకలు అంటించాడు.అడిలైడ్‌లో అలాబోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుకు గాయం కారణంగా గిల్ దూరమయ్యాడు. అయితే, రెండో టెస్టు నాటికి అతడు అందుబాటులోకి వచ్చాడు. అడిలైడ్‌లో జరిగిన ఈ పింక్‌బాల్ మ్యాచ్‌లో గిల్ ఫర్వాలేదనిపించాడు. రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 31, 28 పరుగులు చేశాడు.అయితే, బ్రిస్బేన్ టెస్టులో మాత్రం గిల్ పూర్తిగా నిరాశపరిచాడు. మూడు బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఆఫ్ స్టంప్ వెలుపలా వెళ్తున్న బంతిని షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. నీ ఇమేజ్ను డ్రెస్సింగ్ రూమ్‌లోనే వదిలెయ్అయితే, షాట్ సరిగ్గా కనెక్ట్ కాలేదు. ఈ క్రమంలో బ్యాట్ ఎడ్జ్‌ను తాకిన బంతి గల్లీ పాయింట్లో ఉన్న మిచెల్ మార్ష్ చేతిలో పడింది. దీంతో గిల్ పెవిలియన్ చేరాడు. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ మాట్లాడుతూ.. ‘‘నీ ఇమేజ్ను డ్రెస్సింగ్ రూమ్‌లోనే వదిలెయ్. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఇలాంటి షాట్లు ఆడటం ప్రమాదకరమని తెలిసినా.. నువ్వు జాగ్రత్త పడలేదు.చెత్త షాట్ సెలక్షన్కాస్త కుదురుకున్న తర్వాత ఇలాంటివి ప్రయత్నించవచ్చు. 30- 40- 50 పరుగులు సాధించిన తర్వాత రిస్క్ తీసుకోవచ్చు. కానీ ఆరంభంలోనే ఇలాంటి చెత్త షాట్ సెలక్షన్ ఏమిటి? నిజానికి మార్ష్ క్యాచ్ పట్టిన తీరు అద్భుతం. ఈ విషయంలో గిల్‌కు కాస్త దురదృష్టం ఎదురైందని చెప్పవచ్చు.ఏదేమైనా.. ఆ బంతిని ఆడకుండా.. అలా వదిలేసి ఉంటే బాగుండేది. అనవసరపు షాట్‌కు యత్నించినందుకు గిల్ డగౌట్లో కూర్చోవాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో భాగంగా గావస్కర్ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కష్టాల్లో టీమిండియాకాగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కష్టాల్లో కూరుకుపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. భారత్ కనీసం మూడు వందల పరుగుల మార్కును కూడా చేరుకునేలా కనిపించడం లేదు. గాబ్బాలో మంగళవారం నాటి నాలుగో రోజు ఆటలో టీ బ్రేక్ సమయానికి రోహిత్ సేన ఏడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఇక ఈ సిరీస్‌లో పెర్త్‌లో టీమిండియా, అడిలైడ్‌లో ఆసీస్ గెలిచి ప్రస్తుతానికి 1-1తో సమంగా ఉన్నాయి.చదవండి: కెప్టెన్‌గా రింకూ సింగ్ -
అవునా.. నాకైతే తెలియదు: కమిన్స్‌కు ఇచ్చిపడేసిన గిల్
బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్టుకు టీమిండియా సిద్ధమవుతోంది. బ్రిస్బేన్ వేదికగా ఇరుజట్ల మధ్య శనివారం ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.చెరో గెలుపుతో సమంగాకాగా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఇందుకు ధీటుగా బదులిచ్చిన కంగారూ జట్టు అడిలైడ్‌లో భారత్‌ను పది వికెట్ల తేడాతో ఓడించింది. ఇక ఈ పింక్ బాల్ మ్యాచ్‌లో తాము షార్ట్ బాల్స్‌తో టీమిండియాను కట్టడి చేశామని ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ పేర్కొన్నాడు.అవునా.. నాకైతే తెలియదే!అడిలైడ్ ఓవల్ మైదానంలో షార్ట్ బాల్ వ్యూహాన్ని పక్కాగా అమలు చేసి.. టీమిండియా బ్యాటర్ల పనిపట్టామని కమిన్స్ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని శుబ్‌మన్ గిల్ దగ్గర విలేకరులు ప్రస్తావించగా.. ‘‘అవునా.. నాకైతే తెలియదే!.. షార్ట్ బాల్‌తో బహుశా వాళ్లు ఒక టెయిలెండర్‌ను లేదంటే లోయర్ ఆర్డర్ బ్యాటర్‌ను మాత్రమే అవుట్ చేశారు.కానీ.. అతడు ఏ షార్ట్‌బాల్‌ను ఉపయోగించి విజయం సాధించామని చెప్తున్నాడో నాకైతే తెలియదు’’ అంటూ కమిన్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. కాగా గాయం వల్ల పెర్త్ టెస్టుకు దూరమైన గిల్.. అడిలైడ్‌లో పింక్ బాల్ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు.ఇక రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 31 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్ స్కాట్ బోలాండ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా మిచెల్ స్టార్క్ గిల్‌ను బౌల్డ్ చేశాడు. ఇక మూడో టెస్టు జరుగనున్న బ్రిస్బేన్ స్టేడియంతో ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌కు మధురానుభవం ఉంది.నాడు 91 పరుగులతో చెలరేగిన గిల్2021 నాటి టెస్టులో గిల్ 91 పరుగులు చేసిన గిల్.. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈసారి కూడా గతంలో మాదిరి ప్రదర్శనను పునరావృతం చేయాలని పట్టుదలగా ఉన్నాడు. మూడో టెస్టునే ఫైనల్ మ్యాచ్‌గా భావించి బరిలోకి దిగుతామన్న గిల్.. గాబాలో గెలిస్తే.. మెల్బోర్న్, సిడ్నీ టెస్టుల్లో మరింత ఆత్మవిశ్వాసంతో ఆడగలమని పేర్కొన్నాడు. కాగా మూడో టెస్టు కోసం ఇప్పటికే బ్రిస్బేన్ చేరుకున్న టీమిండియా ప్రాక్టీస్ సెషన్లలో తీవ్రంగా శ్రమించింది.చదవండి: IND vs AUS: మూడో టెస్టుకు ఆసీస్ తుది జట్టు ప్రకటన.. వికెట్ల వీరుడు వచ్చేశాడుShots fired already? 👀While @patcummins30 claims Australia have succeeded in their short ball ploy, look what @ShubmanGill has to say about it! 😁😅1️⃣ DAY TO GO for #AUSvINDOnStar 3rd Test 👉 SAT 14 DEC, 5.20 AM onwards! #ToughestRivalry pic.twitter.com/vS55v5Qgwz— Star Sports (@StarSportsIndia) December 13, 2024 -
‘గిల్‌ను బెంచ్‌కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలి’
టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. స్టార్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను మరికొన్నాళ్లపాటు బెంచ్‌కే పరిమితం చేయాలని భారత జట్టు యాజమాన్యానికి సూచించాడు. యువ ఆటగాడు ధ్రువ్ జురెల్‌కు మరొక్క అవకాశం ఇవ్వాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.గాయం వల్ల జట్టుకు దూరంకాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ క్రమంలో పెర్త్‌లో జరిగిన తొలి మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల దూరంగా ఉండగా.. టెస్టుల్లో వన్‌డౌన్‌లో ఆడుతున్న గిల్ గాయం వల్ల జట్టుకు దూరమయ్యాడు.రిషభ్ పంత్ ఉన్నప్పటికీఈ నేపథ్యంలో రోహిత్ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్ ఆరంభించాడు. మరోవైపు.. గిల్ లేకపోవడంతో.. రిషభ్ పంత్ ఉన్నప్పటికీ మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. అయితే, రెండో టెస్టుకు రోహిత్ శర్మ, గిల్ అందుబాటులోకి రావడంతో ఎవరిపై వేటు పడుతుందనే చర్చ నడుస్తోంది.ఈ నేపథ్యంలో భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఇండియా టుడేతో మాట్లాడాడు. ‘‘కేఎల్ రాహుల్- యశస్వి జైస్వాల్‌లను ఓపెనింగ్ జోడీగా కొనసాగించాలి. కెప్టెన్ రోహిత్ శర్మ కోసం శుబ్‌మన్ గిల్ తన మూడోస్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక విరాట్ కోహ్లి నాలుగో స్థానంలో రాగా.. మిగతా స్థానాల్లో యథావిధిగా అందరూ కొనసాగాలి.గిల్‌ను బెంచ్‌కే పరిమితం చేయండి.. అతడికి మరొక్క ఛాన్స్ ఇవ్వాలిగిల్ మరికొన్నాళ్లు వేచి చూడాలి. నిజానికి జురెల్‌కు తొలి టెస్టులో అవకాశం ఇచ్చారు. కానీ అతడు పరుగులేమీ రాబట్టలేకపోయాడు. కాబట్టి అతడిని బెంచ్‌కే పరిమితం చేసే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ.. గిల్‌ను ఓపెనింగ్ నుంచి ఐదో స్థానం వరకు ఎక్కడా ఆడించలేము కదా!ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవడం మంచిదే. బెంచ్ ఎంత పటిష్టంగా ఉందో తెలియజేస్తుంది. మేనేజ్మెంట్ గిల్ వైపు మొగ్గు చూపి జురెల్‌ను తప్పించవచ్చు. అయితే, నా అభిప్రాయం ప్రకారం జురెల్‌కు మరొక్క అవకాశం ఇవ్వాలి’’ అని భజ్జీ పేర్కొన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ ఫిఫ్టీకాగా ఆసీస్-‘ఎ’ జట్టుతో రాణించిన జురెల్.. తొలి టెస్టులో మాత్రం నిరాశపరిచారడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లో వరుసగా 11, 1 పరుగులు చేశాడు. మరోవైపు.. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో పింక్ బాల్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో గిల్ ఫిఫ్టీ(రిటైర్డ్ హర్ట్) సాధించాడు.ఇక భారత్- ఆసీస్ మధ్య అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి రెండో టెస్టు జరుగనుంది. దీనిని పింక్ బాల్‌తో నిర్వహించనున్నారు. ఇక పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో టీమిండియా అదరగొట్టింది. ఆస్ట్రేలియాను ఏకంగా 295 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ బౌలర్ బుమ్రా.. నా మనుమలకూ చెబుతా: సన్‌రైజర్స్ విధ్వంసకర వీరుడు -
టీమిండియాకు గుడ్ న్యూస్.. ప్రిన్స్ వచ్చేస్తున్నాడు!
ఆడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న రెండో టెస్టుకు ముందు టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్ అందినట్లు తెలుస్తోంది. చేతి వేలి గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ తిరిగి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం.శుక్రవారం(నవంబర్ 29) మొదటిసారి గిల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఒకవేళ ప్రాక్టీస్‌లో అతడికి ఎటువంటి సమస్యలు తలెత్తకపోతే సెకెండ్ టెస్టుకు జట్టు సెలక్షన్‌కు అందుబాటులో ఉండనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ పింక్ బాల్ టెస్టుకు ముందు భారత జట్టు ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గిల్ బరిలోకి దిగనున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా తొలి టెస్టుకు ముందు ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ బొటన వేలికి గాయమైంది. దీంతో ఆఖరి నిమిషంలో పెర్త్ టెస్టుకు దూరమయ్యాడు.అతడి స్ధానంలో దేవ్‌దత్త్ పడిక్కల్ తుది జట్టులోకి వచ్చాడు. కానీ అతడు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకోలేకపోయాడు. మరోవైపు రెండో టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అందుబాటులోకి వచ్చాడు.వీరిద్దరూ జట్టులోకి వస్తే పడిక్కల్, ధ్రువ్ జురెల్ బెంచ్‌కే పరిమితం కానున్నారు. ఇక ఈ రెండో టెస్టు డిసెంబర్ 6 నుంచి ఆడిలైడ్ వేదికగా మొదలు కానుంది. కాగా తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియాతో టెస్టులకు భారత జట్టురోహిత్ శర్మ(కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్), సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మొహమ్మద్ జడేజా, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రానా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్చదవండి: వేలంలో ఎవరూ కొనలేదు..! రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్ -
IND vs AUS: రెండో టెస్ట్‌కూ గిల్ అనుమానమే..?
ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. ప్రాక్టీస్ సందర్భంగా గిల్ ఎడమ చేతి బొటన వేలు ప్రాక్చర్ అయ్యింది. ఈ కారణంగా అతను పెర్త్ టెస్ట్‌కు (తొలి టెస్ట్) దూరమయ్యాడు. డాక్టర్లు గిల్‌కు రెండు వారాల విశ్రాంతి అవసరమని చెప్పారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గిల్ రెండో టెస్ట్‌కు కూడా దూరం అవుతాడని తెలుస్తుంది. గిల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నా రెండో టెస్ట్‌కు తగినంత ప్రాక్టీస్ అవసరమని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుందట. అందుకు అతన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని సమాచారం. గిల్ రెండో టెస్ట్‌కు ముందు జరిగే రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా పాల్గొనడని తెలుస్తుంది. పింక్ బాల్‌తో జరిగే ఈ ప్రాక్టీస్ మ్యాచ్ నవంబర్ 30, డిసెంబర్ 1 తేదీల్లో జరుగనుంది. ఒకవేళ రెండో టెస్ట్‌కు గిల్ దూరమైతే తొలి టెస్ట్‌లో ఓపెనింగ్ చేసిన కేఎల్ రాహుల్ వన్ డౌన్లో బరిలోకి దిగుతాడు. తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన దేవ్‌దత్ పడిక్కల్ జట్టు నుంచి తప్పించబడతాడు. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్ట్‌లో యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడు.గిల్ అందుబాటులోకి వస్తే..గిల్ గాయం నుంచి కోలుకునే సమయం డిసెంబర్ 1తో ముగుస్తుంది. ఒకవేళ టీమిండియా మేనేజ్మెంట్ ఎలాంటి ప్రాక్టీస్ లేకపోయినా గిల్‌ను బరిలోకి దించాలని భావిస్తే, రెండో టెస్ట్‌లో అతను పడిక్కల్ స్థానంలో వన్‌డౌన్‌లో బరిలోకి దిగుతాడు. యశస్వికి జతగా రోహిత్ అందుబాటులో ఉంటాడు కాబట్టి రాహుల్ మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు దిగుతాడు. గిల్ రెండో టెస్ట్‌లో బరిలోకి దిగితే అడిలైడ్ ఓవల్ మైదానంలో అతనికి మొదటి టెస్ట్ అవుతుంది. గిల్ గత పర్యటనలో మెల్బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్లలో టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్ట్ పింక్ బాల్‌తో జరుగనున్న విషయం తెలిసిందే.తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయంబోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 295 పరుగుల భారీ తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకే పరిమితమైన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా పుంజుకుని ఆసీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో సత్తా చాటిన టీమిండియా బౌలర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ సమిష్టిగా రాణించి ఆసీస్‌ను గెలుపు దరిదాపుల్లోకి కూడా చేరనివ్వలేదు. ఈ మ్యాచ్ బుమ్రా 8 వికెట్లు పడగొట్టగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి సూపర్ సెంచరీలతో మెరిశారు. -
ఆసీస్‌తో తొలి టెస్టు.. టీమిండియాకు శుభవార్త?!
ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ రోజురోజుకు మెరుగు అవుతున్నాడని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. పెర్త్ టెస్టుకు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటూ అభిమానులకు శుభవార్త అందించాడు.కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనుంది. శుక్రవారం నుంచి ఈ మెగా సిరీస్ మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే ఆసీస్‌కు చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో బిజీబిజీగా గడుపుతోంది.ఈ క్రమంలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గిల్ ఎడమ బొటన వేలికి గాయం అయింది. అయితే, బౌలింగ్ కోచ్ మోర్కెల్ అందించిన సమాచారం ప్రకారం.. గిల్ వేగంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. బలహీనంగా టాపార్డర్ఇదిలా ఉంటే.. ఇప్పటికే వ్యక్తిగత కారణాల వల్ల రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరం కావడంతో... టాపార్డర్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ఇలాంటి సమయంలో గిల్ కూడా మ్యాచ్ ఆడకపోతే జట్టుకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.మ్యాచ్ ప్రారంభానికి ముందుఈ నేపథ్యంలో చివరి వరకు వేచి చూసే ధోరణి అవలభించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మ్యాచ్ రోజు వరకు గిల్ ఫిట్నెస్ సాధించాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ‘గిల్ రోజు రోజుకు మెరుగవుతున్నాడు. టెస్టు మ్యాచ్ ప్రారంభానికి ముందు అతడిపై నిర్ణయం తీసుకుంటాం’ అని పేర్కొన్నాడు.ఇక రోహిత్ శర్మ గైర్హాజరీలో కెప్టెన్సీ చేయబోతున్న బుమ్రా గురించి మోర్కెల్ మాట్లాడుతూ.. ‘ఆస్ట్రేలియా పిచ్‌లపై బుమ్రాకు మంచి అనుభవం ఉంది. నాయకత్వ బృందంలో బుమ్రా కూడా భాగం. అతడు గతంలో ఇక్కడ చాలా మంచి ప్రదర్శనలు చేశాడు. జట్టును ముందుండి నడిపించడాన్ని ఇష్టపడే బౌలర్ అతడు. మిగిలిన వాళ్లు అతడిని అనుసరిస్తారు’ అని తెలిపాడు.ఒత్తిడిని దరిచేరనివ్వం... ఇక స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 0–3తో టెస్టు సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో భారత జట్టు ఒత్తిడిలో ఉందని అంతా అనుకుంటున్నారని... అయితే దాన్ని మార్చి వేసుకునేందుకు ఆస్ట్రేలియా పర్యటనకు మించింది లేదని మోర్కెల్ అన్నాడు. ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియాలో రాణిస్తే వచ్చే పేరు ప్రఖ్యాతులు వేరని పేర్కొన్నాడు. ‘ప్రతి ఒక్కరు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు అని అడుగుతున్నారు. మా వరకు దాన్ని పక్కన పెట్టేసి మెరుగైన ప్రదర్శనపైనే దృష్టి పెట్టాం’ అని మోర్కెల్ అన్నాడు. చదవండి: సంజూ శాంసన్ తండ్రి క్షమాపణ చెప్పాల్సిందే.. లేదంటే! -
BGT 2024: టీమిండియాకు గుడ్‌న్యూస్
ప్రతిష్టాత్మక ‘బోర్డర్–గావస్కర్’(బీజీటీ) సిరీస్‌కు ముందు టీమిండియాకు శుభవార్త. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడ్డ మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కోలుకున్నాడు. తిరిగి మైదానంలో అడుగుపెట్టి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో పాటు మిగతా ఆటగాళ్ల బౌలింగ్‌లో దాదాపు గంటసేపు క్రీజులో నిలబడినట్లు సమాచారం.నెట్స్లోనూఅనంతరం.. కేఎల్ రాహుల్ నెట్స్‌లోనూ తీవ్రంగా చెమటోడ్చాడు. కొత్త, పాత బంతులతో సైడ్ ఆర్మ్ త్రోయర్స్ బౌలింగ్ చేస్తుండగా.. రాహుల్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కాగా బీజీటీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా నవంబరు 22న తొలి టెస్టు ఆరంభం కానుంది.ఇందుకోసం.. భారత జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఆసీస్‌తో సిరీస్ సన్నాహకాల్లో భాగంగా ఇండియా-‘ఎ’ జట్టుతో కలిసి మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. శుక్రవారం మొదలైన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ మోచేతికి గాయమైంది. దీంతో ఒకరోజు మొత్తం ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్న ఈ సీనియర్ బ్యాటర్.. ఆదివారం తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు.శుబ్‌మన్ గిల్‌కు గాయంఇదిలా ఉంటే.. టీమిండియా మరో స్టార్ క్రికెటర్ శుబ్‌మన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. టెస్టు మ్యాచ్‌ను పోలిన పరిస్థితుల మధ్య (సిమ్యులేషన్) ‘వాకా’ మైదానంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా... బంతిని ఆపే క్రమంలో గిల్ ఎడమ బొటన వేలికి తీవ్రగాయమైంది. బాధతో విలవిల్లాడి గిల్ వెంటనే గ్రౌండ్‌ను వీడాడు.పరీక్షల అనంతరం గిల్ వేలు ఫ్యాక్చర్ అయినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తొలి టెస్టుకు గిల్ అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. సాధారణంగా ఇలాంటి గాయాల నుంచి కోలుకునేందుకు కనీసం రెండు వారాల సమయం అవసరం కావడంతో... గిల్ తొలి మ్యాచ్ ఆడటం దాదాపు అసాధ్యమే. అయితే తొలి టెస్టుకు రెండో టెస్టుకు మధ్య వ్యవధి ఎక్కువ ఉండటంతో అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న రెండో మ్యాచ్ వరకు అతడు కోలుకోవచ్చని టీమ్ మేనేజ్మెంట్ అంచనా వేస్తోంది. గత ఆసీస్ పర్యటనలో మెరుగైన ప్రదర్శన కనబర్చిన గిల్... ‘బోర్డర్–గావస్కర్’ ట్రోఫీని నిలబెట్టుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. టాపార్డర్ బలహీనం! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో తొలి టెస్టుకు దూరమవుతాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో... గిల్ కూడా అందుబాటులో లేకపోతే భారత టాపార్డర్ బలహీనపడే అవకాశాలున్నాయి. రోహిత్ శర్మ భార్య శుక్రవారం పండంటి బాబుకు జన్మనివ్వగా... టెస్టు సిరీస్ ప్రారంభానికి ఇంకా గడువు ఉండటంతో అతడు జట్టుతో చేరితే ఓపెనింగ్ విషయంలో ఎలాంటి సమస్య ఉండదు.లేదంటే ఇప్పటి వరకు అంతర్జాతీయ అరంగేట్రం చేయని అభిమన్యు ఈశ్వరన్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు. ఇలాంటి తరుణంలో కేఎల్ రాహుల్ కోలుకోవడం నిజంగా టీమిండియాకు సానుకూలాంశం. ఇక ఆదివారంతో ప్రాక్టీస్ మ్యాచ్ ముగియనుండగా... మంగళవారం నుంచి మూడు రోజుల పాటు భారత జట్టు ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొననుంది.మరోవైపు గాయం నుంచి కోలుకొని రంజీ ట్రోఫీలో సత్తా చాటిన మహ్మద్ షమీ... ఆసీస్‌తో రెండో టెస్టుకు ముందు జట్టులో చేరే చాన్స్ ఉంది. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో బెంగాల్ తరఫున బరిలోకి దిగిన షమీ 43.2 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టడంతో పాటు 37 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. చదవండి: నాకు కాదు.. వాళ్లకు థాంక్యూ చెప్పు: తిలక్ వర్మతో సూర్య -
ఆసీస్‌తో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్
ఆసీస్‌తో తొలి టెస్ట్‌కు (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఇండియా-ఏతో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ గాయపడ్డాడు. గిల్ స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ చేతి వేలిని గాయపర్చుకున్నాడు. గాయం తీవ్రతపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. మెడికల్ టీమ్ గిల్‌కు తగిలిన గాయాన్ని దగ్గరి నుంచి పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తుంది. గిల్ గాయం నేపథ్యంలో అతను తొలి టెస్ట్ ఆడేది లేదన్నది సందిగ్దంలో పడింది.కాగా, గిల్ గాయానికి ముందు టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్ కూడా ప్రాక్టీస్ సందర్భంగా గాయపడ్డారు. ఈ ముగ్గురిలో రాహుల్ గాయం కాస్త తీవ్రమైందిగా తెలుస్తుంది. విరాట్ తనకు తగిలిన స్వల్ప గాయం నుంచి పూర్తిగా కోలుకుని ప్రాక్టీస్ మ్యాచ్‌లో చురుకుగా పాల్గొన్నాడు. సర్ఫరాజ్ సైతం మోచేతి గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని తెలుస్తుంది. శుభ్‌మన్ గిల్ గాయమే ప్రస్తుతం టీమిండియా మేనేజ్మెంట్కు ఆందోళన కలిగిస్తుంది.ఇదిలా ఉంటే, తొలి టెస్ట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో కేఎల్ రాహుల్ భారత ఇన్నింగ్స్‌ను (యశస్వి జైస్వాల్‌తో కలిసి) ప్రారంభిస్తాడని తెలుస్తుంది. శుభ్‌మన్ గిల్ పూర్తి ఫిట్నెస్ సాధిస్తే వన్‌డౌన్‌లో వస్తాడు. ఆతర్వాత విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు దిగుతారు. ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్లలో ఎవరో ఒకరికి తుది జట్టులో చోటు దక్కవచ్చు. ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజా బరిలో ఉంటాడు. అశ్విన్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి టెస్ట్ అరంగేట్రం చేయడం ఖాయమని తెలుస్తుంది. స్పెషలిస్ట్ పేసర్లుగా బుమ్రా, సిరాజ్, ఆకాశ్‌దీప్ బరిలోకి దిగడం దాదాపుగా ఖయమైపోయింది. తొలి టెస్ట్ పెర్త్ వేదికగా నవంబర్ 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. -
BGT 2024: రోహిత్ ఓపెనర్‌గా వద్దు.. వాళ్లిద్దరే ఆడాలి: పాక్ మాజీ క్రికెటర్
టెస్టు సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. నవంబరు 22 నుంచి బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. వీటిలో కనీసం నాలుగు గెలిస్తేనే రోహిత్ సేన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్‌కు చేరే అవకాశం ఉంటుంది.ఇదే తొలిసారి..కాగా ఇటీవలే సొంతగడ్డపై టీమిండియాకు ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. న్యూజిలాండ్‌తో ఆడిన మూడు టెస్టుల్లో ఓడి 0-3తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. స్వదేశంలో భారత జట్టు ఇలా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లలో ఓడిపోవడం ఇదే తొలిసారి.ఈ నేపథ్యంలో రోహిత్ సేన ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంతగడ్డపైనే రాణించలేనివాళ్లు.. ఆసీస్ పిచ్‌లపై ఆడటం కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.రోహిత్ ఓపెనర్‌గా వద్దుఆస్ట్రేలియాతో టెస్టుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా కాకుండా వన్‌డౌన్‌లో బరిలోకి దిగాలని సూచించాడు. కివీస్‌తో సిరీస్‌లో పేసర్ టిమ్ సౌతీని ఎదుర్కొనేందుకు రోహిత్ ఇబ్బందిపడ్డాడన్న కనేరియా.. ఆస్ట్రేలియాలో బంతి మరింత స్వింగ్ అవుతుంది కాబట్టి.. వన్‌డౌన్‌లో వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఇండియలో సౌతీ బౌలింగ్‌లో ఆడేందుకు రోహిత్ ఇబ్బందిపడ్డాడు. రెండుసార్లు అతడి బౌలింగ్‌లోనే అవుటయ్యాడు. కాబట్టి అతడి బ్యాటింగ్ ఆర్డర్ మారిస్తే బాగుంటుంది.జైస్వాల్‌కు జోడీగా అతడు రావాలిటాపార్డర్లో యశస్వి జైస్వాల్‌తో కలిసి శుబ్‌మన్ గిల్ ఓపెనర్‌గా రావాలి. రోహిత్ వన్‌డౌన్‌లో, కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలి. బ్యాటింగ్ లైనప్ విషయంలో గౌతం గంభీర్ తప్పక మార్పులు చేయాలి. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా కూడా బ్యాట్‌తో వీలైనంత ఎక్కువగా రాణిస్తేనే ఫలితం ఉంటుంది’’ అని డానిష్ కనేరియా పేర్కొన్నాడు. కాగా ఆసీస్- టీమిండియా మధ్య నవంబరు 22 నుంచి జనవరి 3 వరకు మూడు టెస్టుల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.చదవండి: BCCI- Pant: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. మరి ఆ టెక్నాలజీ ఎందుకు వాడదంటే? -
చరిత్ర సృష్టించిన అజాజ్ పటేల్
న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్‌లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా రికార్డు సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి కివీస్ క్రికెటర్ కూడా అతడే! అంతేకాదు.. మాతృదేశంలో.. విదేశీ జట్టుకు ఆడుతూ ఈ ఫీట్ నమోదు చేసిన అరుదైన రికార్డునూ అజాజ్ పటేల్ సొంతం చేసుకున్నాడు.కాగా ముంబైలో జన్మించాడు అజాజ్ పటేల్. ఆ తర్వాత అతడి కుటుంబం న్యూజిలాండ్‌కు మకాం మార్చింది. అయితే, బాల్యం నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న అజాజ్ అంచెలంచెలుగా ఎదిగి కివీస్ ప్రధాన స్పిన్నర్లలో ఒకడిగా మారాడు. ఈ క్రమంలో 2021లో టీమిండియా- న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌తో ఒక్కసారిగా అతడు భారత్‌లో ఫేమస్ అయ్యాడు.నాడు 10 వికెట్ల హాల్ముంబైలోని వాంఖడే స్టేడియంలో నాడు టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 వికెట్లు కూల్చాడు. జన్మనిచ్చిన గడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగి ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లు అజాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ తన జట్టును గెలిపించలేకపోయాడు.ఈసారి ఐదేసిన అజాజ్ఇక తాజాగా టీమిండియాతో మ్యాచ్‌లో మరోసారి అజాజ్ పటేల్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో ఐదు వికెట్లతో మెరిశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(30)తో పాటు శుబ్‌మన్ గిల్(90), మహ్మద్ సిరాజ్(0), సర్ఫరాజ్ ఖాన్(0), రవిచంద్రన్ అశ్విన్(6)ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ నేపథ్యంలో భారత్ ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక జట్టు బౌలర్ల జాబితాలో అజాజ్ పటేల్ చోటు సంపాదించాడు. వాంఖడే స్టేడియంలో ఇప్పటి వరకు అజాజ్ 19 వికెట్లు(10+4+5) పడగొట్టాడు.భారత్‌లో ఒకే వేదికపై అత్యధిక వికెట్లు తీసిన పర్యాటక జట్టు బౌలర్లుఇయాన్ బోతమ్(ఇంగ్లండ్)- వాంఖడేలో 22 వికెట్లుఅజాజ్ పటేల్(న్యూజిలాండ్)- వాంఖడేలో 19 వికెట్లురిచీ బెనాడ్(ఆస్ట్రేలియా)- ఈడెన్ గార్డెన్స్‌లో 18 వికెట్లుకర్ట్నీ వాల్ష్(వెస్టిండీస్)- వాంఖడేలో 17 వికెట్లు.భారత్ 263 ఆలౌట్ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా- న్యూజిలాండ్ మధ్య శుక్రవారం మొదలైన మూడో టెస్టులో ఇరుజట్ల బౌలర్లు రాణిస్తున్నారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్‌ను భారత్ 235 పరుగులకు తొలిరోజే ఆలౌట్ చేసింది. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా ఐదు, వాషింగ్టన్ సుందర్ నాలుగు, పేసర్ ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు. తర్వాత భారత్ బ్యాటింగ్ చేసింది.ఈ క్రమంలో 86/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా 263 పరుగులకు ఆలౌట్ అయింది. కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టగా.. గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.చదవండి: విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత తొలి క్రికెటర్‌గా పంత్ రికార్డు -
విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత తొలి క్రికెటర్‌గా పంత్ రికార్డు
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో టెస్టుల్లో వేగవంతమైన అర్ధ శతకం నమోదు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. కాగా రోహిత్ సేన స్వదేశంలో కివీస్ జట్టుతో టెస్టు సిరీస్ ఆడుతోంది.ఇందులో భాగంగా తొలి రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో శుక్రవారం ముంబై వేదికగా మూడో టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. వాంఖడే మైదానంలో టాస్ ఓడిన భారత్ తొలుత బౌలింగ్ చేసింది.పాత కథను పునరావృతం చేస్తూతొలిరోజే బౌలర్లు రాణించడంతో కివీస్‌ను 235 పరుగులకు ఆలౌట్ చేసింది. అయితే, పాత కథను పునరావృతం చేస్తూ బ్యాటింగ్‌లో మళ్లీ విఫలమైంది. దీంతో మొదటి రోజు ఆట ముగిసేసరికి నాలుగు వికెట్లు నష్టపోయి కేవలం 86 పరుగులు చేసింది. ఈ క్రమంలో శనివారం నాటి రెండో రోజు ఆరంభం నుంచి నైట్వాచ్మెన్లు శుబ్‌మన్ గిల్, రిషభ పంత్ దూకుడుగా ఆడారు.యశస్వి జైస్వాల్ రికార్డు బద్దలు గిల్ 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. పంత్ 36 బంతుల్లోనే యాభై పరుగులు సాధించాడు. ఈ క్రమంలో కివీస్‌పై తక్కువ బంతుల్లోనే అర్ధ శతకం చేసిన భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టాడు.కాగా కివీస్‌తో తాజా సిరీస్‌లో భాగంగా పుణెలో జరిగిన రెండో టెస్టులో 41 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా న్యూజిలాండ్‌పై టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు. అయితే, పంత్ ఇప్పుడు ఆ రికార్డును సవరించి.. జైస్వాల్‌ను వెనక్కినెట్టి నంబర్ వన్‌గా అవతరించాడు. గిల్ సెంచరీ మిస్ ఇదిలా ఉంటే.. ముంబైలో జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు యశస్వి జైస్వాల్(30) ఫర్వాలేదనిపించగా.. రోహిత్ శర్మ(18), మహ్మద్ సిరాజ్(0), విరాట్ కోహ్లి(4) పూర్తిగా నిరాశపరిచారు. అయితే, రెండో రోజు గిల్, పంత్ అర్ధ శతకాల వల్ల టీమిండియా ఆధిక్యంలోకి రాగలిగింది.దురదృష్టవశాత్తూ గిల్ సెంచరీ(90) మిస్ కాగా.. పంత్ 59 బంతుల్లో 60 పరుగులు రాబట్టాడు. రవీంద్ర జడేజా 14 పరుగులకే నిష్క్రమించగా.. సర్ఫరాజ్ ఖాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. రవిచంద్రన్ అశ్విన్ తొమ్మిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఇక వాషింగ్టన్ సుందర్(36 బంతుల్లో 38 నాటౌట్) నిలకడగా ఆడినా.. ఆకాశ్ దీప్ రనౌట్ కావడంతో భారత తొలి 263 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ ముగిసింది. కివీస్ కంటే కేవలం 28 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కాగా న్యూజిలాండ్ బౌలర్లలో స్పిన్నర్ అజాజ్ పటేల్ 5 వికెట్లతో చెలరేగగా.. గ్లెన్ ఫిలిప్స్, ఇష్ సోధి, మ్యాట్ హెన్రీ ఒక్కో వికెట్ తీశారు.చదవండి: IND vs NZ: 'అదొక చెత్త నిర్ణయం.. రోహిత్, గంభీర్‌కు కొంచెం కూడా తెలివి లేదు'