Aaroghyasree services
-
ఆరోగ్యశ్రీ కార్డుల కోసం కమిటీ
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ కార్డుల ఎంపికకు మార్గదర్శకాల తయారీ కోసం త్వరలోనే ఒక కమిటీని నియమించాలని వైద్య ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఎవరిని అర్హులుగా ఎంపిక చేయాలి? పాత కార్డుల అప్డేట్, కొత్త పేర్ల ఎంట్రీ, సవరణలు వంటి అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. దీంతోపాటు రేషన్ కార్డుతో లింక్ కట్ చేస్తూ అందరికీ స్కీమ్ వర్తించేలా నిబంధనలు ఎలా ఉండాలనే అంశాలపై ఈ కమిటీ స్పష్టమైన మార్గదర్శకాలను తయారు చేస్తుందని అధికారులు చెబుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అనుమతి తర్వాత ఈ కమిటీ ఏర్పాటుపై స్పష్టత రానుంది.రేషన్ కార్డునే పరిగణనలోకి తీసుకోకుండా.. ప్రభుత్వం హామీయిచ్చినట్లు రేషన్ కార్డును పరిగణనలోకి తీసుకోకుండా బీపీఎల్ కుటుంబాలను ఆదాయ ధ్రువీకరణ పత్రం ద్వారా గుర్తిస్తూనే, క్షేత్రస్థాయి కమిటీ ద్వారా విచారణ చేయించనున్నారు. ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఏమిటి వంటి అంశాలపై కూడా ప్రభుత్వం ఆరా తీయనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల పైచిలుకుమంది ఆరోగ్య శ్రీ కార్డుల కోసం ఎదురుచూస్తుండగా, మరో 11 లక్షల దరఖాస్తులు మెంబర్ అడిషన్ (అదనపు సభ్యులు చేర్పులు) కోసం పెండింగ్‌లో ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే కార్డులు ఉన్నోళ్లకు అప్డేట్ చేస్తూనే, కొత్త కార్డులు పంపిణీ చేయనున్నారు. ఇప్పుడు 89.96 లక్షల కుటుంబాలకు మళ్లీ కొత్త కార్డులు ఇస్తూనే, ఇప్పటి వరకు అసలు పొందని వాళ్లకీ ఆరోగ్య శ్రీ కార్డులు అందజేయనున్నారు. ప్రభుత్వ అంచనా ప్రకారం దాదాపు 3 కోట్ల మందికి ఈ స్కీమ్ వర్తించేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీకి ప్రతి ఏటా దాదాపు రూ.1100 కోట్లు ఖర్చు అవుతుండగా, కొత్త కార్డుల ద్వారా మరో రూ.నాలుగైదు వందల కోట్ల వరకు ఖర్చు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త రేషన్ కార్డులపై ఉప సంఘం ఏర్పాటుచైర్మన్గా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాక్షి, హైదరాబాద్: కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్‌గా వ్యవహరించే ఈ ఉప సంఘంలో సభ్యులుగా మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కన్వీనర్‌గా ప్రభుత్వ కార్యదర్శి హోదాలో పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ వ్యవహరిస్తారు. కొత్త రేషన్ కార్డుల జారీకి ఎలాంటి మార్గదర్శకాలను అమలు చేయాలనే అంశంతో పాటు అర్హుల ఎంపిక ఏ ప్రాతిపదికన చేయాలనే విషయాన్ని ఈ సబ్ కమిటీ నిర్ణయిస్తుంది. -
ఇదెక్కడి రోగం?
సాక్షి, అమరావతి: ఏదైనా ఓ వ్యవస్థను నిర్వీ ర్యం చేయాలనుకుంటే సీఎం చంద్రబాబు తొలుత పథకం ప్రకారం దానిపై దుష్ప్రచారం ప్రారంభిస్తారు. తాను అనుకున్నది సాధించడం కోసం ప్రజల మెదడును ట్యూన్ చేసేలా పార్టీలోనే కొందరు నాయకులతో ప్రకటనలు చేయిస్తారు. అనుకూల మీడియాలో ఈమేరకు కథనాలతోపాటు టీవీ చానళ్లలోనూ తన మనుషుల ద్వారా చర్చలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ విషయంలోనూ అదే పంథాను కొనసాగిస్తున్నారు. మేనిఫెస్టోలో ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడతానని హామీ ఇచ్చి చివరకు ప్రజల ఆరోగ్యానికి పొగ బెట్టారు. ఇన్నాళ్లూ ఆరోగ్యశ్రీ పథకం ట్రస్టు పర్యవేక్షణలో పకడ్బందీగా కొనసాగుతుండగా అధికారంలోకి వచ్చీ రాగానే ఆ స్థానంలో బీమా ప్రవేశపెట్టడానికి సిద్ధం కావాలంటూ వైద్య శాఖకు హుకుం జారీ చేశారు. మరోవైపు ‘‘ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. ఆస్పత్రులకు బిల్లులు రావడం లేదు. రోగులకు చికిత్సలు అందడం లేదు. ప్రజలు వైద్యం కోసం కేంద్రం అమలు చేసే ఆయుష్మాన్ భారత్ కార్డును వెంటబెట్టుకుని ఆస్పత్రులకు వెళ్లాలి..’’ అని టీడీపీకి చెందిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. మాజీ సీఎంలు వైఎస్సార్, వైఎస్ జగన్‌ల ముద్రను చెరిపేయాలనే దురుద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగారుస్తూ రాష్ట్రంలోని కోట్ల మంది నిరుపేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. అధికారంలోకి వచ్చీ రావడంతోనే ఆరోగ్యశ్రీని నిర్వీ ర్యం చేసే పనికి శ్రీకారం చుట్టారు. మరోవైపు ఆరోగ్యశ్రీ బిల్లుల బకాయిలు చెల్లించకుండా, ప్రజలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందకుండా చేస్తున్నారు. అడ్డుకుని అభాండాలు2019–24 మధ్య ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం విప్లవాత్మక సంస్కరణలతో బలోపేతం చేసింది. అంతకుముందు టీడీపీ హయాంలో బిల్లుల చెల్లింపుల్లో జరిగిన తీవ్ర ఉన్న జాప్యానికి చెక్ పెట్టారు. ప్రజలకు వైద్య సేవలపై ఏ మాత్రం ప్రభావం పడకుండా ఎప్పటికప్పుడు ఆస్పత్రులకు బిల్లులను చెల్లిస్తూ వచ్చారు. ఈ ఏడాది జనవరి వరకూ పెండింగ్ లేకుండా బిల్లులు చెల్లించారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి వైద్య సేవల క్లెయిమ్‌లను ట్రస్ట్ పరిశీలించి, ఆమోదించడం.. అనంతరం బిల్లులను ట్రస్ట్ ప్రాసెస్ చేసి ఆర్థిక శాఖకు పంపి అక్కడ సీఎఫ్ఎంఎస్ ఐడీలు రావడానికి రెండు నెలల సమయం పట్టింది. సాధారణంగా ప్రతి నెలా ఇదే పద్ధతిలో బిల్లులను ప్రాసెస్ చేస్తారు. ఈ ప్రక్రియలో మార్చిలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో బిల్లులను చెల్లించలేకపోయారు. వాస్తవానికి ప్రజల ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన ఆరోగ్యశ్రీ పథకం ఎన్నికల నియమావళిలోకి రాదు. పథకానికి సంబంధించిన బిల్లులు చెల్లింపులు చేయడానికి వీలుంటుంది. అయితే ఆ సమయంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అప్పటికే అమలులో ఉన్న పథకాలకు ఎలాంటి చెల్లింపులు చేయకుండా చంద్రబాబు ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదులు చేసి అడ్డుకున్నారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కోడ్ అమలులో ఉంది. దీంతో జనవరి, ఫిబ్రవరి నెలలకు మరో మూడు నెలల బిల్లులు వచ్చి చేరాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ బకాయిలను చెల్లించకుండా తాత్సారం చేస్తూ యథావిధిగా గత ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ పథకాన్ని నిరీ్వర్యం చేయాలనే లక్ష్యాన్ని అమలు చేస్తోంది. పేదల్లో కలవరపాటు ఓవైపు బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేయడం, మరోవైపు బీమా పేరిట ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు సర్కారు పొగబెడుతుండటంతో పేదల్లో కలవరపాటు మొదలైంది. గత ఐదేళ్లలో దురదృష్టవశాత్తూ ఏదైనా జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ కార్డుతో వెళితే ఎంత ఖరీదైన వైద్యమైనా ఉచితంగా లభించే పరిస్థితి ఉండేది. 2019 అనంతరం రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి పథకాన్ని వర్తింపజేయడంతో ప్రైవేట్ ఉద్యోగాలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవించే మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్యశ్రీ రక్షగా నిలిచింది. అనంతరం చికిత్స వ్యయ పరిమితిని రూ.5 లక్షలు నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షలకు వైఎస్ జగన్ పెంచారు. టీడీపీ హయాంలో కేవలం 1,059 ప్రొసీజర్లతో అస్తవ్యస్థంగా ఉన్న ఆరోగ్యశ్రీకి ప్రాణం పోసి ప్రొసీజర్లను ఏకంగా 3,257కి పెంచారు. ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచితంగా చికిత్సలు అందించి ఆరోగ్యశ్రీ పథకానికి రూ.13 వేల కోట్లకు పైగా వెచ్చించారు. అంతేకాకుండా శస్త్ర చికిత్సలు జరిగిన 24.59 లక్షల మందికి కోలుకునే సమయంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్లకుపైగా ఆర్థిక సాయం అందించి కష్టకాలంలో గత ప్రభుత్వం అండగా నిలిచింది. మరోవైపు నాడు–నేడు కింద రూ.17 వేల కోట్లకు పైగా నిధులతో ప్రభుత్వాస్పత్రులను సదుపాయాలతో తీర్చిదిద్దడంతోపాటు 17 వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు. 108, 104 వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు దేశంలోనే ఎక్కడా లేనటువంటి ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేశారు. తద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ కల్పించారు. ఒక్క ఆరోగ్యశ్రీనే కాకుండా..కేవలం ఒక్క ఆరోగ్యశ్రీనే కాకుండా ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగంలో గత ఐదేళ్లలో చేపట్టిన సంస్కరణలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసేలా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేయడానికి తలపెట్టిన కొత్త వైద్య కళాశాలలకు అనుమతుల విషయంలోనూ కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రజలకు తాముంటున్న చోటే స్పెషాలిటీ వైద్య సేవలను అందించడంతోపాటు నిరంతర వైద్య పర్యవేక్షణ కల్పిస్తూ తెచి్చన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని కూటమి సర్కారు నిలిపివేసింది.కొత్త ప్రభుత్వం ఏర్పాటై రెండు నెలలు కావస్తున్నా ఆస్పత్రుల్లో మందుల సరఫరాపై కనీసం దృష్టి పెట్టలేదు. దీంతో ఆస్పత్రులను మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వాస్పత్రుల్లో వందకుపైగా రకాల మందుల కొరత ఉంది. గత ప్రభుత్వంలో బోధనాస్పత్రుల్లో 607 రకాల డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలున్న మందులు అందుబాటులో ఉండేవి. గ్రామ స్థాయిలోని వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లోనూ 105 రకాల మందులను అందుబాటులో ఉంచిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానికే దక్కింది. -
‘ఆరోగ్యశ్రీ’ ఆపేస్తాం..!
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) పెండింగ్ బిల్లులను ఆగస్టు 15వ తేదీలోగా చెల్లించకుంటే వైద్య సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆశా) స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య సేవ ట్రస్ట్ సీఈవోకు మంగళ వారం లేఖ రాసింది. తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వైద్య సేవలు నిలిపివేయడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని పేర్కొంది. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ బిల్లులను చెల్లించడంతో పాటు పథకం ఆర్థిక నిర్వహణపై దృష్టి పెట్టాలని కోరింది. పెండింగ్ బిల్లుల అంశాన్ని వైద్య శాఖమంత్రి దృష్టికి తెచ్చినప్పటికీ తమకు ఎలాంటి హామీ లభించలేదని తెలిపింది.బకాయిలు ఎప్పటికప్పుడు క్లియర్ చేసిన వైఎస్ జగన్ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు బిల్లులు రాకపోవడంతో రోగులకు చికిత్సలు అందని పరిస్థితి నెల కొందని, కేంద్ర ప్రభుత్వ పథకంతో పేదలు సరిపెట్టుకోవాలని స్వయంగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తద్వారా రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్యానికి భరోసానిచ్చిన ఆరోగ్యశ్రీకి పొగబెట్టి రూ.5 లక్షల వరకే పరిమితమైన కేంద్ర పథకం దయా దాక్షిణ్యాలకు ప్రజల ఆరోగ్యాన్ని వదిలేసినట్లు స్పష్టమైంది. గతంలోనూ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేలా సీఎం చంద్రబాబు వ్యవహరించిన విషయం తెలిసిందే. 2014–19 మధ్య ప్రొసీజర్లు పెంచకుండా అరకొర సేవలతో పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆరోగ్యశ్రీకి 2019లో అధికారంలోకి రాగానే వైఎస్ జగన్ ప్రాణం పోశారు. వెయ్యి లోపు మాత్రమే ఉన్న ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్యను ఏకంగా 2,371కి విస్తరించారు. చికిత్స వ్యయ పరిమితిని రూ.5 లక్షలు నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షలకు పెంచారు. టీడీపీ హయాంలో కేవలం 1,059 ప్రొసీజర్లు మాత్రమే ఉండగా వాటిని 3,257కి పెంచారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచితంగా చికిత్సలు అందించి పథకానికి రూ.13 వేల కోట్లకు పైగా వెచ్చించారు. శస్త్ర చికిత్సలు జరిగిన 24.59 లక్షల మందికి కోలుకునే సమయంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద మరో రూ.1,465 కోట్లకుపైగా సాయం అందించారు. దేశంలోనే తొలిసారిగా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చి విపత్తు వేళ భరోసా కల్పించారు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా టీడీపీ సర్కారు దిగిపోతూ బకాయి పెట్టిన దాదాపు రూ.700 కోట్లను సైతం చెల్లించారు. అసోసియేషన్ లేఖ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఈ ఏడాది జనవరి వరకు ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులన్నీ ఎప్పటికప్పుడు క్లియర్ చేశారు. ఆ తరువాత బిల్లులను కూడా సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేశారు. అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆస్పత్రులకు దాదాపు రూ.1,600 కోట్లకుపైగా బిల్లులను చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టడంతో పేదలకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. -
ఆరోగ్యశ్రీకి పొగ
ఎంత ఖర్చైనా భరిస్తాం.. దురదృష్టవశాత్తూ పేదలు అనారోగ్యం పాలైతే ప్రభుత్వం అండగా నిలవాలి. పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు ఎంత పెద్ద జబ్బు బారినపడినా, వైద్యానికి ఎంత ఖర్చైనా మన ప్రభుత్వమే భరిస్తుంది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని వెళితే కార్పొరేట్ ఆస్పత్రుల్లో రూ.25 లక్షలు వరకు చికిత్సలు ఉచితంగా అందాలి – నాడు సీఎం హోదాలో వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘‘ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు! ఆస్పత్రులకు బిల్లులు రావడం లేదు! రోగులకు చికిత్సలు అందని పరిస్థితి! ప్రజలు వైద్యం కోసం ఆయుష్మాన్ భారత్ కార్డును వెంటబెట్టుకుని ఆస్పత్రులకు వెళ్లండి. ఈ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలి. కేంద్ర పథకాన్ని వాడుకుంటే రాష్ట్ర ప్రభుత్వంపైనా భారం తగ్గుతుంది..!’’ కేంద్ర సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ రాష్ట్రంలో పేదలకు ఇస్తున్న ఉచిత సలహా ఇదీ! ఆరోగ్యశ్రీని ఒక గుదిబండలా భావిస్తూ ప్రొసీజర్లు పెంచకుండా పథకాన్ని నిర్వీర్యం చేసిన సీఎం చంద్రబాబు ధోరణికి పెమ్మసాని వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి.తాజాగా కేంద్ర మంత్రి హోదా లో పెమ్మసాని మాట్లాడిన మాటలు పేద, మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళనకు దారితీస్తున్నాయి. ఏకంగా 3,200కిపైగా చికిత్సలతో రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యానికి భరోసా కల్పించే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చేసి కేంద్ర పథకం దయాదాక్షిణ్యాలకు రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని వదిలేసినట్లు పెమ్మసాని వ్యాఖ్యలు స్పష్టం చేస్తు న్నాయి. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వ చ్చేనాటికి టీడీపీ సర్కారు పెట్టిన ఆరోగ్యశ్రీ బకా యిలు రూ.700 కోట్ల మేర ఉండగా వాటిని వైఎస్ జగన్ పూర్తిగా క్లియర్ చేశారు. ఈ ఏడాది జనవరి వరకు ఆరోగ్యశ్రీ బకాయిలనూ పెండింగ్ లేకుండా చెల్లించి అటు ఆస్పత్రులకు ఇటు ప్రజలకు జగన్ సంపూర్ణ విశ్వాసం కల్పించారు. ఎన్నికల కోడ్ రావడంతో బిల్లుల చెల్లింపులకు బ్రేక్ పడింది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి 2 నెలలు కావస్తున్నా రూ. 1,600 కోట్లకుపైగా ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో వైద్య సేవలకు గండం ఏర్పడింది. పడకేసిన పథకానికి ప్రాణం.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ఏపీలో కోటిన్నర కుటుంబాలకు ఆపద్భాంధవిగా నిలిచింది. 2014– 19 మధ్య టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీకి వైఎస్ జగన్ అధికారంలో ఉండగా ప్రాణం పోశారు. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్, వైఎస్ జగన్ గుర్తుకొచ్చేలా గత ఐదేళ్లుగా ఈ పథకం అమలైంది. ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా ద్వారా 70 లక్షల మంది రూ.14,470 కోట్ల మేర ప్రయోజనం పొందారు. వారి ముద్రను చెరిపి వేయాలనే తలంపుతో ఆరోగ్య శ్రీ పథకాన్ని కనుమరుగు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ స్థానంలో బీ మా పేరిట ప్రైవేట్ కంపెనీని జొప్పించే యత్నంచేస్తున్నారు. ఇది కొనసాగుతుండగానే కేంద్ర పథకాన్నే నమ్ముకోవాలని చెప్పడం ద్వారా ప్రభుత్వ ఆంతర్యాన్ని పెమ్మసాని ఆవిష్కరించారు. రూ.25 లక్షల వరకూ వైద్య సేవలందించే ఆరోగ్యశ్రీని కాదని రూ.5 లక్షల మేర హెల్త్ కవరేజీ ఉండే ఆయుష్మాన్ పథకాన్ని వినియోగించుకోవాలంటూ సూచించడం దారుణమని వైద్య ఆరోగ్య రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో మొక్కుబడిగా బీమా అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. బీమా కంపెనీల చక్కర్లు.. ఆరోగ్యశ్రీ ట్రస్టు స్థానంలో బీమా పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కూటమి సర్కారు సన్నద్ధమైన నేపథ్యంలో ఇటీవల ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో 2014–19 మధ్య నామినేటెడ్ పదవిలో కొనసాగిన టీడీపీ నేత ఆధ్వర్యంలో పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. ఓ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీకి బాధ్యతలప్పగించేలా సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. మరికొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలూ టెండర్లలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం లబి్ధదారులు ఎంత మంది ఉంటారు? కొన్నేళ్లుగా పథకం కోసం ప్రభు త్వం ఎంత ఖర్చు చేసింది? వైద్య సేవలు, ఇతర వివరాల కోసం ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయం చుట్టూ బీమా కంపెనీల ప్రతినిధులు చక్కర్లు కొడుతున్నారు. ప్రైవేట్ వైపే మొగ్గు.. గతంలోనూ విద్య, వైద్య రంగాలను ప్రైవేట్ పరం చేయటమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగించారు. తొలి నుంచీ ఈ రంగాల్లో ప్రభుత్వ భాగస్వా మ్యం నామమాత్రంగా ఉండేలా వ్యవహరించారు. వ్యాధులన్నింటినీ ఆరోగ్యశ్రీలో చేర్చడంతోపాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్స, ఆపరేషన్ సౌకర్యం కల్పిస్తామంటూ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అనంతరం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారు. 2007లో వైఎస్సార్ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి పథకా న్ని ప్రారంభించగా అనంతరం చంద్రబాబు సర్కా రు ఎనీ్టఆర్ వైద్య సేవగా పేరు మార్చింది. తాజాగా బీమా రూపంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టబోతున్నారు. లాభాపేక్షతో సేవలకు గండం ప్రస్తుతం డాక్టర్ వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుండగా కొత్త విధా నంలో లబి్ధదారుల వారీగా ప్రభుత్వం ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వైద్య సేవల కల్పన చేపట్టాలని యోచిస్తున్నారు. ఇప్పటి వరకూ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రభుత్వమే నేరుగా పథకాన్ని అమలు చేయడంతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. ఇ న్సూరెన్స్ ఏజెన్సీల చేతుల్లోకి వెళితే లాభాపేక్షతో ప్రజలకు వైద్య సేవలు ప్రశ్నార్థకంగా మారుతాయి. ట్రస్టు పర్యవేక్షణలో ఉంటే అందులో ఎంపానెల్డ్ అ యిన ఆస్పత్రులు ఏ ప్రొసీజర్‌కు అయినా నిర్దేశించిన ధర ప్రకారమే వైద్య సేవలు అందిస్తాయి. అంతకు మించి ప్రజల నుంచి డబ్బుల వసూళ్లకు పా ల్పడేందుకు వీలుండదు. వసూళ్లకు పాల్పడితే జిల్లా స్థాయిలో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ట్రస్టు సీఈవో ఆధ్వర్యంలో ఆస్పత్రిపై చర్యలు తీసుకునేందుకు ఒక వ్యవస్థ ఉంటుంది. అదే ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఏజెన్సీలు రంగంలోకి దిగితే ఆస్పత్రులపై ప్రభుత్వ ని యంత్రణ పోతుంది. ఇష్టారాజ్యంగా బిల్లులు వేసి ప్రజల నుంచి అదనపు వసూళ్లు చేస్తాయి.గత ఐదేళ్లూ నిశ్చింత..ఆరోగ్యశ్రీ పథకాన్ని గత ఐదేళ్లలో బలోపేతం చేసి న వైఎస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలతో ప్రజల ఆరోగ్యానికి నిశి్చంత కల్పించారు. 2019 ఎన్నికల హామీ మేరకు అధికారంలోకి రాగానే రూ.5 లక్షల లోపు వార్షికాదాయ కుటుంబాలను పథకం పరిధిలోకి తెచ్చారు. 2019కి ముందు వెయ్యి లోపు మాత్రమే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ఉండగా వైఎస్ జగన్ ఏకంగా 2,371 ఆస్పత్రులకు పథకాన్ని విస్తరించారు. అనంతరం చికిత్స వ్యయ పరిమితిని రూ.5 లక్షలు నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షలకు పెంచారు. టీడీపీ హయాంలో కేవలం 1,059 చికిత్సలతో అస్తవ్యస్థంగా ఉన్న ఆరోగ్యశ్రీకి ప్రాణం పోసి ప్రొసీజర్లను ఏకంగా 3,257కి పెంచారు. ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచితంగా చికిత్సలు అందించి పథకానికి రూ.13 వేల కోట్లకు పైగా వెచి్చంచారు. అంతేకాకుండా శస్త్ర చికిత్సలు జరిగిన 24.59 లక్షల మందికి కోలుకునే సమయంలో జీవన భృతికి ఇబ్బంది లేకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్లకుపైగా సాయం అందించారు. ఇక దేశంలోనే తొలిసారిగా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి విపత్తు వేళ ప్రజలకు కొండంత భరోసా కల్పించారు. -
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, అమరావతి: ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ తదితర కార్యక్రమాల ద్వారా ప్రజారోగ్యానికి అండగా నిలుస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చికిత్స పూర్తయిన అనంతరం.. ఆస్పత్రులకు వెళ్లి ఫాలోఅప్ వైద్య సేవలు పొందడం కోసం రోగుల ప్రయాణాలకయ్యే ఖర్చును కూడా వారికి అందించబోతోంది. కన్సల్టేషన్‌కు రూ.300 చొప్పున.. ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకం కింద అందించే చికిత్సల సంఖ్య(ప్రొసీజర్లు)ను వైఎస్ జగన్ ప్రభుత్వం 3,257కు పెంచింది. అలాగే ఆరోగ్యశ్రీ వైద్య వ్యయ పరిమితిని కూడా రూ.25 లక్షలకు పెంచి పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత భరోసా కల్పించింది. అంతేకాకుండా 1,500కు పైగా ప్రొసీజర్లలో చికిత్సల తర్వాత వైద్యులు సూచించిన విశ్రాంత సమయానికి గాను రోగులకు వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద గరిష్టంగా నెలకు రూ.5 వేల వరకు సాయం అందిస్తోంది. ఇప్పుడు ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు. ఆరోగ్యశ్రీ పథకంలోని గుండె, మెదడు, ఆర్థో, పీడియాట్రిక్స్ విభాగాలకు సంబంధించిన 138 ప్రొసీజర్లలో ఏదైనా చికిత్స చేయించుకున్న తర్వాత.. ఏడాదిలోపు రోగులు 4సార్లు వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే రోజే.. ఫాలోఅప్ సేవల కోసం రావాల్సిన తేదీలను వైద్యులు చెబుతుంటారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందేవారంతా నిరుపేద, మధ్యతరగతి ప్రజలే. వీరు ప్రయాణాల ఖర్చులకు వెనుకడుగు వేసి ఫాలోఅప్ వైద్య సేవలపై నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో సమస్య పూర్తిగా నయం కాకపోవడంతో భవిష్యత్‌లో మళ్లీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ 138 ప్రొసీజర్లలో ఏదైనా చికిత్స పొందిన వారికి ప్రయాణ చార్జీలను కూడా ప్రభుత్వమే భరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఒక్కో కన్సల్టేషన్‌కు రూ.300 చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైన మందులూ అందజేత.. ఫాలోఅప్ కన్సల్టేషన్ సమయంలోనే రోగికి అవసరమైన మందులను కూడా ఆస్పత్రిలో అందజేస్తారు. ఏటా ఆరోగ్యశ్రీ కింద చేసే మొత్తం చికిత్సల్లో 10 శాతం మేర కేసుల్లో ఫాలోఅప్ కన్సల్టేషన్లు అవసరం ఉంటాయని వైద్య శాఖ అంచనా వేసింది. ఫాలోఅప్ కన్సల్టేషన్ వైద్య సేవల పొందేందుకు ప్రభుత్వం ఇలా అదనపు సాయం చేయడం వల్ల రోగులు పూర్తి స్థాయిలో కోలుకుంటారని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇది ప్రజలకు గొప్ప మేలు చేస్తుందన్నారు. ఆదేశాల అమలుకు చర్యలు చేపట్టాం.. అవసరం ఉన్న ప్రతి ఒక్క రోగి ఫాలోఅప్ కన్సల్టేషన్ సేవలు పొందేలా చర్యలు తీసుకుంటున్నాం. కన్సల్టేషన్‌కు రూ.300 చొప్పున చెల్లించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అమలు చేయడానికి చర్యలు చేపట్టాం. మెడ్కో లాగిన్‌లో ఓ ప్రత్యేక ఆప్షన్ ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందిన వ్యక్తి ఫాలోఅప్ కన్సల్టేషన్‌కు హాజరయ్యాడని నిర్ధారిస్తే.. ఆ రోగి, వారి కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లో రూ.300 చొప్పున నగదు జమ అవుతాయి. – డీకే బాలాజీ, సీఈవో, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ -
ఆరోగ్యశ్రీ విస్తృతం
కరోనాతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వ్యాక్సిన్ వచ్చే వరకు కొన్ని నెలలపాటు కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దాని (కోవిడ్)తో కలిసి ఎలా బతకాలన్న దానిపై అంద రికీ అవగాహన కల్పించాలి. ఈ విషయంలో కలెక్టర్లు చొరవ చూపాలి. అలాగే.. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఎవరికి ఫోన్ చేయాలి? ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? అన్న వాటిపై ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచాలి. 85 శాతం కరోనా కేసులకు ఇంట్లోనే ఉండి వైద్యం పొందవచ్చు. మిగిలిన 15 శాతంలో కూడా కేవలం 4 శాతం కేసులకు మాత్రమే ఐసీయూలో చికిత్స అవసరమవుతుంది. కాబట్టి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి : వైద్యం కోసం ఏ ఒక్కరూ అప్పులపాలు కాకూడదని.. అలా జరగకూడదనే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా పలు చర్యలు తీసుకున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కుటుంబంలో ప్రతిఒక్కరూ చల్లగా ఉండాలన్న లక్ష్యంతోనే ఆరోగ్యశ్రీ పథకంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని సీఎం స్పష్టంచేశారు. ఇందులో భాగంగానే వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తూ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం అమలవుతున్న పైలట్ ప్రాజెక్టు విధానాన్ని ఇప్పుడు కొత్తగా మరో ఆరు (విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, కర్నూలు) జిల్లాలకు విస్తరించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. అలాగే, మొత్తం 2,200 రకాల వైద్య సేవలను ఈ పథకం కింద అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఆయా జిల్లాల్లోని ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు, కలెక్టర్లనుద్దేశించి సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. నాడు అరకొర సేవలు.. రూ.680 కోట్లు బకాయిలు ఆరోగ్యశ్రీ పథకంలో ఇవాళ మరో అడుగు ముందుకు వేశామని.. దీని పరిధిని విస్తృతంగా పెంచుకుంటూపోతున్నామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకంలో కేవలం 1,059 వైద్య సేవలు మాత్రమే అందేవని, అవి కూడా అరకొరగానే ఉండేవని సీఎం వివరించారు. అలాగే, నెట్వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ.680 కోట్లు చెల్లించకుండా బకాయిలు పెట్టారని.. తాము అధికారంలోకి రాగానే వాటన్నింటినీ చెల్లించేశామన్నారు. ఇంకా ఆయా ఆస్పత్రుల ద్వారా మెరుగైన సేవలందేలా చర్యలు చేపట్టామని వైఎస్ జగన్ చెప్పారు. పేదలు గర్వంగా తలెత్తుకుని చికిత్స చేయించుకుని, సంపూర్ణారోగ్యంతో డిశ్చార్జ్ అయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. డాక్టర్లు, ఆసుపత్రులు పేదలను చిన్నచూపు చూడకూడదన్న ఉద్దేశంతో ఆరోగ్యశ్రీకి సంబంధించిన చెల్లింపులన్నీ గ్రీన్ ఛానల్లో అందజేస్తున్నామని సీఎం చెప్పారు. మరిన్ని వైద్య సేవలు.. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పథకంలో 1,259 వైద్య సేవలు అందుతుండగా, పశ్చిమ గోదావరి జిల్లా పైలట్ ప్రాజెక్టులో మొత్తం 2,200 రకాల సేవలు అందుతున్నాయని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ 2,200 సేవలను ఇప్పుడు మరో ఆరు జిల్లాలకు విస్తరిస్తున్నామన్న ఆయన.. నవంబర్ 14 నుంచి మిగిలిన జిల్లాల్లోనూ అమలుకు ఆరోగ్యశాఖ సన్నాహాలు చేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో ఇది మరో మైలురాయిగా అభివర్ణించారు. అంతేకాక.. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏప్రిల్ 6న కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చామని, వారం క్రితం నాన్ ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లోనూ కరోనాకు చికిత్స చేయాలని ఆదేశాలు జారీచేశామని తెలిపారు. దేశంలో తొలిసారిగా అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఒకేసారి 1,088 అంబులెన్సులు ప్రవేశపెట్టామని, తద్వారా రాష్ట్రంలోని ప్రతి మండలంలో అత్యంత మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. 1.42కోట్ల మందికి ఆరోగ్యశ్రీ కార్డులు వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి కూడా ఈ పథకం అమలుచేస్తున్నామని.. తొలిసారిగా 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డులు క్యూఆర్ కోడ్‌తో ఇస్తున్నామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ఈ కార్డులో రోగికి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయన్నారు. ఇప్పటికే 1.38 కోట్ల కార్డులను పంపిణీ చేశామని.. మిగిలిన 4 లక్షల కార్డుల ముద్రణా పూర్తయిందని, వీలైనంత త్వరగా వలంటీర్ల ద్వారా వాటిని అందజేస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ‘నాడు–నేడు’తో ఆస్పత్రులకు కొత్తరూపు ఇక ఆరోగ్యశ్రీలో ఓ పక్క మంచి వైద్యం అందిస్తూనే.. మరోపక్క నాడు–నేడు కార్యక్రమం కింద ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 11 బోధనాస్పత్రులు ఉండగా, కొత్తగా మరో 16 ఏర్పాటుచేస్తున్నామన్నారు. అలాగే.. దాదాపు రూ.16 వేల కోట్ల వ్యయంతో ఆస్పత్రుల రూపురేఖలు మార్చడంతో పాటు, కొత్త ఆస్పత్రులు, వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. ఆస్పత్రులకు గ్రేడింగ్ ఇచ్చి, మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని సీఎం వివరించారు. అన్ని ఆస్పత్రులలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), జీఎంపీ ప్రమాణాలతో కూడిన మందులు ఇస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. గతంలో కేవలం 230 రకాల మందులు మాత్రమే ఇస్తుండగా, జనవరి నుంచి 510 రకాల మందులు ఇస్తున్నామని ఆయన తెలిపారు. 13వేల విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు గ్రామ సచివాలయాల పక్కనే అన్ని గ్రామాలలో 13 వేల వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు కూడా ఏర్పాటుచేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. వాటిలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు రోజంతా అందుబాటులో ఉంటారని, అవి రెఫరల్ ఆస్పత్రులుగా పనిచేస్తాయని తెలిపారు. వాటిల్లో 54 రకాల మందులు కూడా ఉంటాయని చెప్పారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి పెన్షన్లు ఇస్తున్నామని కూడా ముఖ్యమంత్రి తెలిపారు. ఇలాంటి వారికి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు పెన్షన్లు ఇస్తున్నామని.. లెప్రసీ, తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులకు, పక్షవాతంతో మంచానికి.. వీల్చైర్లకు పరిమితమైన వారికి రూ.10 వేల వరకు పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. 65 లక్షల మంది పిల్లలకు ‘వైఎస్సార్ కంటి వెలుగు’ రాష్ట్రంలో దాదాపు 65 లక్షల మంది పిల్లలకు వైఎస్సార్ కంటి వెలుగు పథకం కింద వైద్య పరీక్షలు చేశామని.. వారిలో 1.58 లక్షల మందికి కళ్లజోళ్లు అవసరమని తేలితే.. 1.29 లక్షల మంది పిల్లలకు వాటిని ఇచ్చామని, మిగిలిన 29 వేల కళ్లజోళ్లు కూడా ఈ నెలాఖరు నాటికి ఇవ్వబోతున్నామని సీఎం వెల్లడించారు. 2,621 మంది పిల్లలకు ఆపరేషన్లు అవసరమని తేలిందన్న ఆయన.. వారికి కూడా స్కూళ్లు తెరిచాక, సెలవులు వచ్చినప్పుడు ఆపరేషన్లు చేయిస్తామని చెప్పారు. ఇది తన మనసుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన అంశమని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. కలెక్టర్లకు దిశానిర్దేశం.. ఇప్పుడు విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల కలెక్టర్లు ఆరోగ్యశ్రీ పథకంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని.. ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ఎటువంటి సమస్యలు లేకుండా ఈ పథకం ద్వారా 2,200 వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం జగన్ నిర్దేశించారు. కరోనాపై ప్రత్యేక డ్రైవ్ రాష్ట్రాల సరిహద్దులు తెరుస్తున్నారని, అంతర్జాతీయ విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయని, అందుకే కరోనా కేసులు పెరుగుతున్నాయని వైఎస్ జగన్ చెప్పారు. కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? అన్న దానిపై ప్రజలందరికీ తెలిసేలా కలెక్టర్లు ఒక ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్దేశించారు. అలాగే, తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు.. ముఖానికి మాస్కు, చేతికి గ్లౌజెస్, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్, చేతులను శుభ్రంగా కడుక్కోవడం వంటివి ఇంకా బాగా ప్రచారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఎస్ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్ మల్లికార్జున్‌తో పాటు, జిల్లాల నుంచి కలెక్టర్లు పలువురు అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరో 87 చికిత్సలు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి మరో 87 చికిత్సలను చేరుస్తూ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. గత ప్రభుత్వం హయాంలో 1,059 చికిత్సలు మాత్రమే ఆరోగ్యశ్రీలో ఉండేవి. ప్రస్తుత ప్రభుత్వం ఆ సంఖ్యను భారీగా పెంచింది. ► తొలుత పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన 2,059 చికిత్సలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ► ఆ తర్వాత మరో 54 క్యాన్సర్ చికిత్సలను పథకం పరిధిలోకి తెచ్చారు. తాజాగా 87 చికిత్సలను తెస్తూ జీవో ఇచ్చారు. దీంతో మొత్తం చికిత్సల సంఖ్య 2,200కు చేరింది. ఈ చికిత్సలు పశ్చిమగోదావరితో పాటు జూలై 16 నుంచి మరో ఆరు జిల్లాల్లో (విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, వైఎస్సార్) జిల్లాల్లో అమల్లోకి వచ్చాయి. ► తాజాగా అనుమతి ఇచ్చిన 87 చికిత్సల్లో 53 ఇన్‌పేషెంటు చికిత్సలు, 29 స్వల్పకాలిక చికిత్సలు, మరో 5 డే కేర్ (ఔట్‌పేషెంటు తరహా) సేవలు ఉన్నాయి. ► వీటిలో యూరినరీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ సర్జరీ, కంటి చికిత్సలు, ఈఎన్టీ సమస్యలు, జనరల్ సర్జరీ వంటివి ఉన్నాయి. ► కనిష్టంగా రూ. 1,000 నుంచి రూ. 45 వేల వరకూ ఈ చికిత్సలకు వ్యయమవుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో పథకం అమలు తీరుతెన్నులను పరిశీలించి ఆరోగ్యశ్రీ సీఈవో నివేదిక ఇచ్చారని, ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. -
దిగివచ్చిన ప్రైవేటు ఆసుపత్రులు
ప్రభుత్వ హెచ్చరికతో 166 ఆసుపత్రుల్లో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల తీరుపై ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో అనేక నెట్వర్క్ ఆసుపత్రులు చిన్నగా సమ్మె నుంచి బయటకు వస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. పేదల కోసం ఏర్పాటు చేసిన ఆరోగ్యశ్రీని ఇష్టారాజ్యంగా సమ్మె పేరుతో ఇబ్బందులకు గురిచేస్తే సహించబోమని వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని ఆసుపత్రులు రాజీ ధోరణికి వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో 244 ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులుంటే వాటిల్లో 166 ఆసుపత్రుల్లో యథావిధిగా ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుతున్నాయని... మిగిలిన 78 మాత్రమే సమ్మె చేస్తున్నాయని ఆరోగ్యశ్రీ సీఈవో చంద్రశేఖర్ ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. సమ్మెలో పాల్గొనే 78 ఆసుపత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయని మంత్రి కార్యాలయం తెలిపింది. అత్యధికంగా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఉన్న నెట్వర్క్ ఆసుపత్రులే సమ్మెలో ఉన్నాయని చెబుతున్నారు. ఇదిలావుంటే నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిపడిన సొమ్ములో సోమవారం రూ.100 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం... మంగళవారం మరో రూ.130 కోట్లకు బీఆర్వో విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వెంటనే సమ్మె విరమించాలని వైద్య ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.