Abdul Majeed
-
ఆరుగురు భార్యలు.. 54 మంది పిల్లలు.. గుండెపోటుతో మృతి..
ఇస్లామాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి యజామానిగా గుర్తింపు తెచ్చుకున్న అబ్దుల్ మజీద్ మంగల్(75) తుదిశ్వాస విడిచాడు. పాకిస్తాన్‌కు చెందిన ఈయన.. బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అబ్దుల్ మృతితో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. డ్రైవర్‌గా పనిచేసే అబ్దుల్‌కు మొత్తం ఆరుగురు భార్యలు. 54 మంది పిల్లలు. బలూచిస్తాన్ నోష్కి జిల్లా కాలి మంగల్ గ్రామంలో నివసిస్తున్నాడు. అయితే ఆరుగురు భార్యల్లో ఇద్దరు చనిపోయారు. 54 మంది పిల్లలో 12 మంది వివిధ కారణాలతో మరణించారు. మిగిలిన 42 మంది పిల్లలలో 22 మంది అబ్బాయిలు, 20 మంది అమ్మాయిలు ఉన్నారు. అబ్దుల్ మనవళ్లు, మనవరాళ్లను కూడా కలిపితే ఆయన కుటుంబంలో మొత్తం 150 మంది అవుతారు. అబ్దుల్ 18 ఏళ్ల వయసులోనే తొలి వివాహం చేసుకున్నాడు. 2017లో జనాభా లెక్కల కోసం ఆయన ఇంటికి వెళ్లిన సబ్బింది వివరాలు సేకరించాక కంగుతిన్నారు. ఆయనకు ఆరుగురు భార్యలు, 54 మంది పిల్లలు అని తెలిసి అవాక్కయ్యారు. అప్పటినుంచే ఆయన అతిపెద్ద కుటుంబానికి యజమానిగా గుర్తింపు పొందారు. చదవండి: Rishi Sunak: ఓటమి భయంతో.. -
వేశ్యల జీవితాలపై టార్చ్‌లైట్
చూస్తున్నాం బాస్... ప్రతి సుఖానికీ ఓ రేటుందీ లోకంలో. కోరుకున్న సుఖం కోసం కావల్సినంత రేటు పెట్టి కొనేస్తున్నారీ లోకంలో కొందరు మగాళ్లు! పడక సుఖంతో సహా! మరి... డబ్బులకు మానాన్ని అమ్ముకుంటూ ఎవరో ఊరు పేరు తెలియనివాళ్లకు పడక సుఖాన్ని అందిస్తున్న స్త్రీలందరూ ఇష్టంగానే ఆ పని చేస్తున్నారా? అనే కథతో రూపొందుతోన్న తమిళ చిత్రం ‘టార్చ్‌లైట్’. అబ్దుల్ మజిత్ దర్శకుడు. ఇందులో అర్ధరాత్రి హైవేల పక్కన నిలబడి విటుల కోసం వేచి చూసే వేశ్యగా ‘జయం’ ఫేమ్ సదా నటిస్తున్నారు. తెలుగులో ‘జయం, దొంగ దొంగది, చుక్కల్లో చంద్రుడు’ తదితర చిత్రాల్లో నటించిన సదా, ఎప్పుడూ హోమ్లీ క్యారెక్టర్స్‌లోనే కనిపించారు. రియాలిటీ డ్యాన్స్ షో జడ్జ్‌గా వ్యవహరించిన సమయంలోనూ అందాల ప్రదర్శన విషయంలో ఎక్కడా హద్దు దాటలేదు. అటువంటిది ఒక్కసారిగా వేశ్య పాత్రలో సదా అనేసరికి ఆమె ఎలా నటించారోననే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. యాక్చువల్లీ... దర్శకుడు అబ్దుల్ ఫస్ట్ ఛాయిస్ సదా కాదు. పలువురు కథానాయికల్ని ఆయన సంప్రదించగా... వేశ్యగా నటించడానికి నిరాకరించారట! ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఇష్టపడే సదా, కథ విన్న వెంటనే అంగీకరించారని అబ్దుల్ తెలిపారు. ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. -
షాకింగ్ న్యూస్
-
షాకింగ్ న్యూస్
ముంబై: షాకింగ్ న్యూస్. ముంబైలో ఓ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన ఐదుగురు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరడానికి వెళ్లినట్టు సమాచారం. కేరళ నుంచి అదృశ్యమైన పది మంది ఐసిస్ లో చేరినట్టు అనుమానాలు బలపడుతుండగా తాజాగా వెలుగు చూసిన ఉదంతం మరింత భయాందోళన కలిగిస్తోంది. వ్యాపారవేత్త అబ్దుల్ మజీద్ కుమారుడు అష్ఫాక్ అహ్మద్ తన భార్య, బిడ్డను తీసుకుని పశ్చిమాసియాకు వెళ్లిపోయాడు. మరో ఇద్దరు సోదరులు అతడితో కలిశారని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' వెల్లడించింది. 26 ఏళ్ల అష్ఫాక్ తన భార్యాబిడ్డ, సోదరులు మహ్మద్ సిరాజ్(22), ఇజాజ్ రెహ్మాన్(30)లతో పాటు ఈ ఏడాది జూన్ లో దేశం విడిచిపెట్టి ఐసిస్ లో చేరడానికి వెళ్లాడని తెలిపింది. సిరాజ్, వ్యాపారవేత్త కాగా, రెహ్మాన్ మెడికల్ ప్రాక్టిషినర్ గా పనిచేశాడు. తామంతా ఐసిస్ లో చేరడానికి వెళ్లినట్టు అష్ఫాక్ తన తమ్ముడికి మెసేజ్ పంపాడు. తన కుటుంబ సభ్యుల అదృశ్యంపై అబ్దుల్ మజీద్ ఆగస్టు 6 పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు ఐసిస్ లో చేరడానికి ఇస్లాం మతబోధకుడు మహ్మద్ హనీఫ్ కేరళకు చెందిన స్కూల్ టీచర్ అబ్దుర్ రషీద్, నవీ ముంబైకి చెందిన ఆర్షీ ఖురేషీ, కళ్యాణ్ ప్రాంతవాసి రిజ్వాన్ ఖాన్ కారణమని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ముంబై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హనీఫ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.