abdul malik
-
మార్చని శిక్షలు
జునైద్ బగ్దాదీ అనే ధార్మిక పండితుడు తన వ్యక్తిత్వంతో ఎంతోమంది కరుడుగట్టిన నేరగాళ్లలో సైతం పరివర్తన తీసుకువచ్చారు. ఆయన కాలంలోనే ఒక గజ దొంగ ఉండేవాడు. తన దోపిడీలు, దొంగతనాలతో ప్రజలకు ముచ్చెమటలు పట్టించేవాడు. ఆ గజదొంగ పేరు వింటేనే ప్రజలు వణికిపోయేవారు. ఎన్నిసార్లు బంధించి ఎన్ని శిక్షలు విధించినా తన దొంగబుద్ధిని మాత్రం మార్చుకోలేదు. చివరికి హస్త ఖండన చేసినప్పటికీ ఒంటిచేత్తో కూడా దొంగతనాలకు పాల్పడేవాడు. ఒకసారి ఈ గజదొంగ జునైద్ బగ్దాది ఇంట్లో జొరబడ్డాడు. జునైద్ బగ్దాది విదేశాల నుంచి ఎంతో ఇష్టంగా తెప్పించుకున్న ఖరీదైన బట్టలపై ఆ దొంగ దృష్టిపడింది. ఆ బట్టలన్నీ ఒక మూటకట్టి ఒంటిచేత్తో తలకెత్తుకునేందుకు ఇబ్బంది పడుతున్నాడు. అంతలోనే జునైద్ బగ్దాది రాత్రి నమాజ్ కోసం లేచి చూస్తే దొంగ కనిపించాడు. గజదొంగ జునైద్‌ను ఇంటి నౌకరుగా భావించి, మూటను తలకెత్తుకుని తనతో రావాలని బెదిరించాడు. జునైద్ మారుమాట్లాడకుండా ఆ బట్టల మూటను తలకెత్తుకొని గజదొంగను అనుసరించారు. జునైద్ బక్కపల్చగా ఉండటం వల్ల మూటను మోయలేకపోయారు. వేగిరంగా నడవమని జునైద్ ను దొంగ తొందర పెట్టసాగాడు. ఎట్టకేలకు దొంగ ఇంటివద్ద ఆ బట్టల మూటను దించి, జునైద్ బగ్దాది తన ఇంటికి చేరుకున్నారు. రాత్రంతా ఆ గజదొంగ గుర్రుపెట్టి నిద్రపోయాడు. తెల్లారి లేచిన తరువాత గజదొంగకు భయం పట్టుకుంది. తన మూటను ఎత్తుకొచ్చినతను తన చిరునామా యజమానికి చెబుతాడేమోనన్న దిగులు పట్టుకుంది. ఆ ఇంటికి వెళ్లి ఆ నౌకరును బెదిరించి తన దారికి తెచ్చుకోవాలని బయలుదేరాడు. ఆ ఇంటి సమీపానికి చేరుకోగానే ఎంతోమంది ప్రముఖులు, సంపన్నులు, మహా మహా పండితులు ఆ ఇంటివద్ద బారులు తీరి ఉన్నారు. ఇదంతా గమనించిన దొంగకు ఆ ఇల్లు ఒక గొప్ప పండిత వారి ఇల్లు అని అర్థమైంది. ఆ పండిత మహాశయుడిని ఎలాగైనా చూడాలనే కోరిక కలిగింది. తన ఒంటి చేయి ఎవరికీ కనపడకుండా చొక్కాలో దాచుకుంటూ ఇంట్లోకి జొరబడ్డాడు. ఇంట్లోకి చేరుకోగానే దొంగ బిత్తరపోయాడు. ‘రాత్రి తాను నౌకరనుకుని మూట మూయించి హింసించిన వ్యక్తే ఆ మహాపండితుడని, ఆయనే ఆ ఇంటి యజమాని అని అర్థమైపోయింది. ఆయనను చూడగానే దొంగలో పరివర్తన వచ్చింది. పశ్చాత్తాపంతో కుంగిపోయాడు. పండితుల వారు దొంగకు విద్యాజ్ఞానాలు బోధించి మహామనిషిగా తీర్చిదిద్దారు. ఎన్ని శిక్షలు విధించినా కలగని మార్పు ఒక మంచి వ్యక్తిత్వంతో సాధ్యమవుతుందని ఈ సంఘటన రుజువు చేస్తుంది. – అబ్దుల్ మలిక్ -
యెమెన్ ప్రయాణం ఎటు?
మత విద్వేషంతో, విధ్వంసంతో నిండిపోయి ఉన్న ఎమెన్ పతనం అంచుకు చేరింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కి మూన్ సరిగ్గా రెండు రోజుల క్రితమే ఈ వాస్తవాన్ని వెల్లడించారు. అరబ్ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం యెమెన్ ఇప్పుడు దాదాపు అంతర్యుద్ధంతో విలవిలలాడుతోంది. కానీ అరబ్ దేశాలలో అతి పేద దేశం ఇదే. హౌతి ఉద్యమానికి చెందిన షియా ఉగ్ర వాదులు ఈ జనవరి నుంచి విజృంభించి పరిస్థితులను క్లిష్టతరం చేశారు. వీరికి ఇరాన్ మద్దతు ఉంది. సున్నీ గిరిజన తెగలతో షియా ఉగ్రవాదులు దక్షిణ యెమెన్‌లో ప్రారంభించిన ఈ పోరా టం ప్రస్తుతం చాలా ప్రాంతాలకు విస్తరించింది. షియా ఉగ్రవా దులు హింసాయుతంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నారని మిగిలిన అరేబియా దేశాలు ఇప్పటికే ఆరోపణ లకు దిగాయి. ఇంకా అరబ్ స్ప్రింగ్ (2011) సమయంలో పదవిని కోల్పోయిన మాజీ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్ కూడా ఈ ఉగ్రవా దుల వెనుక ఉన్నారని కూడా ఆరో పణలు ఉన్నాయి. యెమెన్ పొరు గు రాజ్యం సౌదీ అరేబియా. ఇక్కడే అల్‌కాయిదా అనుబంధ అల్కాయి దా ఇన్ ది అరేబియన్ పెనిన్సులా (అరేబియా ద్వీపకల్ప అల్కాయి దా) బలంగా ఉంది. ఫ్రాన్స్‌లో చార్టీ హెబ్దో కార్యాలయం మీద దాడి చేసిన సంస్థ ఇదే. హౌతీ ఉగ్రవాదులను ఎదురొడ్డి పోరా డుతున్న సున్నీ గిరిజన తెగ వారికి ఈ శాఖే మద్దతునిస్తోంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సౌదీ అరేబియా తమ దౌత్యకార్యాలయాలకు తాళాలు బిగించి దేశం విడిచి వెళ్లవ లసివచ్చింది. వారి వాహనాలను షియా ఉగ్రవాదులు సొంతం చేసుకోవడం సంక్షోభానికి పరాకాష్ట. జనవరిలో రాజధాని సానాను స్వాధీనం చేసుకుని, అధ్యక్షుడు అబ్దె రబ్బు మన్సూర్ హాదీ కార్యాలయాన్ని ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. అధ్యక్షుడిని ఒక ప్రైవేటు భవనానికి పరిమితం చేశారు. దీనితో ఆయన ప్రభుత్వం రాజీనామా చేసింది. ఈనెల మొదటివారంలో పార్లమెంట్ భవనాన్ని స్వాధీనం చేసుకున్నామని, ప్రస్తుత పార్ల మెంట్‌ను కూడా తాము రద్దు చేస్తున్నామని ఉగ్రవాదులు ప్రకటిం చారు. అబ్దుల్ మాలెక్ అల్ హౌతీ ఉగ్రవాదులకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ముందునుంచి పాశ్చాత్య దేశాల ప్రమే యాన్ని, ఒప్పందాలలో వారి మధ్యవర్తిత్వాన్ని, గ్రూప్ 10 దేశాల కూటమిని వ్యతిరేకిస్తున్నారు. దేశ జనాభాలో సగం-అంటే 26 మిలియన్ ప్రజలు ప్రస్తుతం ఈ మానవ కల్పిత ఉత్పాతంలో చిక్కుకుని ఉన్నారని కూడా ఐరాస ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. వీరితో పాటు, తాజాగా 2015 సంవత్సరంలో మరో 16 మిలియన్ల ప్రజలు నిరాశ్రయులు కాను న్నారనీ, వారికి కూడా సాయం అందించాలని ఐరాస అంచనా వేస్తోంది. 2004 నుంచి మొదలైన ఈ ఘర్షణ వల్ల పది లక్షల మం ది ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. షియా తెగ పట్ల యెమెన్ ప్రభు త్వం వివక్షకు నిరసనగానే 2004లో తాము ఉద్యమం ఆరంభిం చామని హౌతీ ఉగ్రవాదులు చెబుతారు. నిజానికి గడచిన సెప్టెం బర్ నుంచే ఈ ఉగ్రవాదులు రాజధాని సానా మీద పట్టు సాధిం చుకుని, సడలించకుండా కాపాడుకోగలిగారు. తరువాత ఐరాస ప్రమేయంతో ఉగ్రవాదులకు, మన్సూర్ హాదీ ప్రభుత్వానికి నడు మ శాంతి ఒప్పందం కుదిరింది. మొదట ప్రభుత్వ కార్యకలాపా లలో పాలు పంచుకోవడానికి అంగీకారం తెలిపినా, తరువాత హౌతీ ఉగ్రవాదులు ప్రభుత్వ వ్యవహారాలకు దూరంగా జరిగారు. ఐరాస ఆధ్వర్యంలో జరిగిన శాంతి ఒప్పందం ద్వారా కలిగిన ప్రత్యేక లబ్ధి హౌతీలను ఆ విధంగా వ్యవహరించేటట్టు చేసింది. ఇప్పుడు ఉత్తర ప్రాంతాలకు కూడా హౌతీ ఉగ్రవాదులు తమ అధి కారాన్ని విస్తరించి, దేశం మీద పట్టు సాధించే పనిలో ఉన్నారు. -
స్కూలుకు ఇలా...
స్కూలుకు ఇలా... చూడ్డానికి వరద బాధితుడిలా కనిపిస్తున్న ఇతడి పేరు అబ్దుల్ మాలిక్(40). అబ్దుల్ మాలిక్ ఓ టీచర్! మరి ఇదేంటి అని ప్రశ్నిస్తే.. రోజూ ఈయన పాఠశాలకు వెళ్లేది ఇలాగే..! కేరళలోని మలప్పురం జిల్లాలోని ఓ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మాలిక్ గత 20 ఏళ్లుగా ఇలా టైర్ ట్యూబేసుకుని.. ఓ చేతిలో టిఫిన్ బాక్సు, బట్టలు పట్టుకుని ఈ నదిని దాటుతూనే ఉన్నారు. ‘ఇది దగ్గరి దారి.. బస్సులో నేను పనిచేసే స్కూలుకు వెళ్లినా.. గంటల సమయం పడుతుంది. లేటైపోతుంది. విద్యార్థులు ఇబ్బందులు పడతారు’ అని మాలిక్ తెలిపారు. గురువారం ఉపాధ్యాయ దినోత్సవం నాడూ ఇదే సీన్.. 15 నిమిషాల్లో నదిని దాటేసిన మాలిక్.. వెంటనే బట్టలు వేసేసుకుని.. చిన్నపాటి కొండ ఎక్కి.. 10 నిమిషాల్లో స్కూలుకు చేరుకున్నారు. మాలి క్‌ను చూడగానే పిల్లలంతా చుట్టుముట్టేసి.. ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దయ్యాక ఏమవుతావురా అని ఓ జర్నలిస్ట్ జహంగీర్ అనే విద్యార్థిని అడిగితే.. మాలిక్ సార్లాగా టీచర్‌నవుతా అని చెప్పాడు. అది విన్న మాలిక్ సార్ కళ్లలో మెరుపు. ఇన్నేళ్లుగా ఆయన కష్టాలను మరిపిస్తోంది.. ఆ మెరుపే.. 100 వాహనాలు ఢీ అడుగు దూరంలో అసలేం కనపడనంతటి దట్టమైన పొగ మంచు కారణంగా గురువారం ఇంగ్లాండ్‌లోని కెంట్ కౌంటీలోని రహదారిపై దాదాపు 100 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. 200 వుంది గాయూలపాలయ్యారు. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే ఇంతటి ఘోరం జరిగిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కెంట్ కౌంటీలోని నాలుగు లేన్ల షెప్పీ రహదారిలో ఉదయం సమయంలో వంతెన వద్ద దట్టమైన పొగమంచు నిండిఉంది. దీంతో రోడ్డు కనిపించక ఆ రహదారిలో వెళ్తున్న కార్లు, లారీలు, రవాణా వాహనాలు మొత్తం ఒకదానికిమరోటి గుద్దుకొని ధ్వంసమయ్యాయి. ఉదయం సమయంలో వాహనాలు లైట్లు ఆర్పేసి వెళ్లడం సైతం ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. ఉల్లి @ రూ. 9 ఇది ఒక ఉల్లిపాయ రేటు కాదు.. కిలోదే! ఏ రైతు బజార్లో అని అడ్రస్సులు వెతికేయకండి.. ఇంత డెడ్‌చీప్‌గా ఇచ్చేస్తోంది ఓ ఆన్లైన్ బజార్లో.. గ్రూప్ఆన్ అనే షాపింగ్ వెబ్సైట్ ఈ సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. స్థానిక హోటళ్లలోని డిస్కౌంట్లు, సేవలు వంటివాటిల్లో రాయితీలను అందించే ఈ సైట్ ఢిల్లీకి చెందిన ఓ హోల్‌సేల్ వ్యాపారితో కలిసి ఈ డీల్‌ను అందిస్తోంది. గురువారం నుంచి ఏడురోజులపాటు ఇది అందుబాటులో ఉంటుంది. రోజూ మధ్యాహ్నం ఒంటిగంటకు డీల్ ప్రారంభమవుతుంది. రోజుకు 3 వేల కిలోల ఉల్లిపాయలను విక్రయిస్తారు. స్టాకు ముగియగానే ఆ రోజుకు డీల్ ముగిసిపోతుంది. ఉచితంగా కొరియర్ ద్వారా హోం డెలివరీ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నారు. మనం బుక్ చేసిన 10 రోజుల్లోగా డెలివరీ అందుతుంది. దేశంలోని 78 పట్టణాలకు చెందినవారికి ఈ డీల్ ప్రత్యేకం. కిలో మాత్రమే ఇస్తారు. వీటి కొనుగోలు కోసం ఈ సైట్లో యూజర్‌గా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ.9 కిలో ఉల్లిపాయలు మీకూ కావాలంటే.. www.groupon.co.inకు వెళ్లండి.