యెమెన్ ప్రయాణం ఎటు? | To which side Yemen's Journey? | Sakshi
Sakshi News home page

యెమెన్ ప్రయాణం ఎటు?

Published Sun, Feb 15 2015 1:59 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM

హౌతీ ఉగ్రవాద నాయకుడు  అబ్దుల్ మాలెక్

హౌతీ ఉగ్రవాద నాయకుడు అబ్దుల్ మాలెక్

మత విద్వేషంతో, విధ్వంసంతో నిండిపోయి ఉన్న ఎమెన్ పతనం అంచుకు చేరింది.

 మత విద్వేషంతో, విధ్వంసంతో నిండిపోయి ఉన్న ఎమెన్ పతనం అంచుకు చేరింది. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కి మూన్ సరిగ్గా రెండు రోజుల క్రితమే ఈ వాస్తవాన్ని వెల్లడించారు. అరబ్ ప్రపంచంలో రెండో అతిపెద్ద దేశం యెమెన్ ఇప్పుడు దాదాపు అంతర్యుద్ధంతో విలవిలలాడుతోంది. కానీ అరబ్ దేశాలలో అతి పేద దేశం ఇదే. హౌతి ఉద్యమానికి చెందిన షియా ఉగ్ర వాదులు ఈ జనవరి నుంచి విజృంభించి పరిస్థితులను క్లిష్టతరం చేశారు. వీరికి ఇరాన్ మద్దతు ఉంది. సున్నీ గిరిజన తెగలతో షియా ఉగ్రవాదులు దక్షిణ యెమెన్‌లో ప్రారంభించిన ఈ పోరా టం ప్రస్తుతం చాలా ప్రాంతాలకు విస్తరించింది. షియా ఉగ్రవా దులు హింసాయుతంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కుట్ర పన్నారని మిగిలిన అరేబియా దేశాలు ఇప్పటికే ఆరోపణ లకు దిగాయి. ఇంకా అరబ్ స్ప్రింగ్ (2011) సమయంలో పదవిని కోల్పోయిన మాజీ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్ కూడా ఈ ఉగ్రవా దుల వెనుక ఉన్నారని కూడా ఆరో పణలు ఉన్నాయి. యెమెన్ పొరు గు రాజ్యం సౌదీ అరేబియా. ఇక్కడే అల్‌కాయిదా అనుబంధ అల్‌కాయి దా ఇన్ ది అరేబియన్ పెనిన్సులా (అరేబియా ద్వీపకల్ప అల్‌కాయి దా) బలంగా ఉంది. ఫ్రాన్స్‌లో చార్టీ హెబ్దో కార్యాలయం మీద దాడి చేసిన సంస్థ ఇదే. హౌతీ ఉగ్రవాదులను ఎదురొడ్డి పోరా డుతున్న సున్నీ గిరిజన తెగ వారికి ఈ శాఖే మద్దతునిస్తోంది.

 అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సౌదీ అరేబియా  తమ దౌత్యకార్యాలయాలకు తాళాలు బిగించి దేశం విడిచి వెళ్లవ లసివచ్చింది. వారి వాహనాలను షియా ఉగ్రవాదులు సొంతం చేసుకోవడం సంక్షోభానికి పరాకాష్ట. జనవరిలో రాజధాని సానాను స్వాధీనం చేసుకుని, అధ్యక్షుడు అబ్దె రబ్బు మన్సూర్ హాదీ కార్యాలయాన్ని ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. అధ్యక్షుడిని ఒక ప్రైవేటు భవనానికి పరిమితం చేశారు. దీనితో ఆయన ప్రభుత్వం రాజీనామా చేసింది. ఈనెల మొదటివారంలో పార్లమెంట్ భవనాన్ని స్వాధీనం చేసుకున్నామని, ప్రస్తుత పార్ల మెంట్‌ను కూడా తాము రద్దు చేస్తున్నామని ఉగ్రవాదులు ప్రకటిం చారు. అబ్దుల్ మాలెక్ అల్ హౌతీ ఉగ్రవాదులకు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన ముందునుంచి పాశ్చాత్య దేశాల ప్రమే యాన్ని, ఒప్పందాలలో వారి మధ్యవర్తిత్వాన్ని, గ్రూప్ 10 దేశాల కూటమిని వ్యతిరేకిస్తున్నారు.

 దేశ జనాభాలో సగం-అంటే 26 మిలియన్ ప్రజలు ప్రస్తుతం ఈ మానవ కల్పిత ఉత్పాతంలో చిక్కుకుని ఉన్నారని కూడా ఐరాస ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. వీరితో పాటు, తాజాగా 2015 సంవత్సరంలో మరో 16 మిలియన్‌ల ప్రజలు నిరాశ్రయులు కాను న్నారనీ, వారికి కూడా సాయం అందించాలని ఐరాస అంచనా వేస్తోంది. 2004 నుంచి మొదలైన ఈ ఘర్షణ వల్ల పది లక్షల మం ది ప్రజలు ఇక్కట్లకు గురయ్యారు. షియా తెగ పట్ల యెమెన్ ప్రభు త్వం వివక్షకు నిరసనగానే 2004లో తాము ఉద్యమం ఆరంభిం చామని హౌతీ ఉగ్రవాదులు చెబుతారు. నిజానికి గడచిన సెప్టెం బర్ నుంచే ఈ ఉగ్రవాదులు రాజధాని సానా మీద పట్టు సాధిం చుకుని, సడలించకుండా కాపాడుకోగలిగారు. తరువాత ఐరాస ప్రమేయంతో ఉగ్రవాదులకు, మన్సూర్ హాదీ ప్రభుత్వానికి నడు మ శాంతి ఒప్పందం కుదిరింది. మొదట ప్రభుత్వ కార్యకలాపా లలో పాలు పంచుకోవడానికి అంగీకారం తెలిపినా, తరువాత హౌతీ ఉగ్రవాదులు ప్రభుత్వ వ్యవహారాలకు దూరంగా జరిగారు. ఐరాస ఆధ్వర్యంలో జరిగిన శాంతి ఒప్పందం ద్వారా  కలిగిన ప్రత్యేక లబ్ధి హౌతీలను ఆ విధంగా వ్యవహరించేటట్టు చేసింది. ఇప్పుడు ఉత్తర ప్రాంతాలకు కూడా హౌతీ ఉగ్రవాదులు తమ అధి కారాన్ని విస్తరించి, దేశం మీద పట్టు సాధించే పనిలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement