Abhay Sharma
-
ఉగాండ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్
ఉగాండ జాతీయ పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అభయ్ శర్మ నియమించబడ్డాడు. ఈ విషయాన్ని ఉగాండ క్రికెట్ అసోసియేషన్ తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. 54 ఏళ్ల అభయ్ శర్మ ఉగాండ క్రికెట్ జట్టుతో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూసీఏ పేర్కొంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న తమ జట్టుకు అభయ్ అనుభవం, క్రికెట్ పరిజ్ఞానం మేలు చేకూరుస్తుందని ఉగాండ క్రికెట్ అసోసియేషన్ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, ఉగాండ క్రికెట్ జట్టు పొట్టి ప్రపంచకప్‌కు తొలిసారి అర్హత సాధించింది. జూన్ 1 నుండి యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్ 2024లో ఉగాండ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మెగా టోర్నీకి క్వాలిఫై అయిన 20 జట్లలో ఉగాండ ఒకటి. గతేడాది కాలంలో ఆట పరంగా చాలా మెరుగుపడిన ఉగాండ.. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో అద్భుత విజయాలు సాధించింది. రాబోయే వరల్డ్‌కప్‌లో ఉగాండ గ్రూప్-సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి మేటీ జట్లతో పోటీ పడనుంది. ఉగాండ ఉండే గ్రూప్‌లో మరో పసికూన (పపువా న్యూ గినియా) కూడా ఉంది.అభయ్ శర్మ విషయానికొస్తే.. ఈ మాజీ ఢిల్లీ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినప్పటికీ, దేశవాలీ క్రికెట్లో సత్తా చాటాడు. అభయ్ ఢిల్లీతో పాటు రైల్వేస్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అభయ్ తన కెరీర్లో 89 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 40 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో దాదాపు 5000 పరుగులు చేసి 230 వరకు వికెట్లు పడగొట్టడంలో భాగమయ్యాడు. అభయ్ తన కెరీర్లో 9 శతకాలు, 21 అర్దశతకాలు సాధించాడు. ఆటగాడిగా కెరీర్‌కు వీడ్కోలు పలికాక అభయ్ కోచింగ్ బాధ్యతల్లోకి వచ్చాడు. అభయ్.. భారత-ఏ, భారత అండర్-19 జట్టు, ఢిల్లీ రంజీ జట్టు, భారత మహిళా క్రికెట్ జట్లకు కోచింగ్ అందించాడు. -
భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ గా అభయ్ శర్మ నియమితమయ్యే అవకాశం
-
టీమిండియా ఫీల్డింగ్ కోచ్ రేసులో అభయ్ శర్మ..
Abhay Sharma set To Apply for India Fielding Coach: భారత యువ జట్లకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేసిన అభయ్ శర్మ ఇప్పుడు సీనియర్ జట్టుకు సేవలందించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. ఫీల్డింగ్ కోచ్ పదవి కోసం త్వరలోనే దరఖాస్తు చేయనున్నాడు. 52 ఏళ్ల అభయ్ శర్మకు ఢిల్లీ తరఫున 89 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. జాతీయ క్రికెట్ అకాడమీలో డైరెక్టర్ ద్రవిడ్ సహాయక సిబ్బందిలో ఫీల్డింగ్ శిక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు. భారత్ ‘ఎ’, అండర్–19, భారత సీనియర్ మహిళల జట్లకు ఫీల్డింగ్ కోచ్‌గా పనిచేశాడు. చదవండి: T20 WC 2021 IND Vs PAK: పఠాన్ టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్.. అశ్విన్‌కు నో ప్లేస్ -
భారత మహిళా క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌పై వేటు
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్ అభయ్ శర్మను బీసీసీఐ తప్పించింది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు జట్టు సభ్యులతో పాటు సహాయక సిబ్బంది కూడా బెంగళూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘బయోబబుల్’లోకి మంగళవారంలోగా అడుగు పెట్టాల్సి ఉంది. అయితే అభయ్ ఇంకా జట్టుతో చేరకపోవడంతో ఆయనను తొలగించినట్లు తెలిసింది. ఈ క్రమంలో.. త్వరలోనే ఫీల్డింగ్ కోచ్‌ను ఎంపిక చేస్తామని బోర్డు వర్గాలు వెల్లడించాయి. కాగా, 52 ఏళ్ల అభయ్ శర్మ భారత దేశవాళీ క్రికెట్లో ఢిల్లీ, రైల్వేస్, రాజస్థాన్ జట్ల తరఫున వికెట్ కీపర్‌గా రాణించాడు. ఇటీవలి కాలంలో అతను ఇండియా-ఏ, భారత్ అండర్-19 జట్లకు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఇదే ఏడాది అభయ్ భారత మహిళా క్రికెట్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. -
ఫీల్డింగ్‌లో మెరుగుపడాలి
న్యూఢిల్లీ: విదేశీ జట్లపై నిలకడగా విజయాలు దక్కాలంటే భారత మహిళల క్రికెట్ జట్టు ఫీల్డింగ్ విభాగంలో మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని టీమిండియా ఫీల్డింగ్ కోచ్ అభయ్ శర్మ అభిప్రాయపడ్డారు. చాలాకాలం భారత అండర్–19 పురుషుల జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన అభయ్ శర్మ... గత మార్చిలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టి20 సిరీస్‌లో భారత మహిళల జట్టుకు తొలిసారి ఫీల్డింగ్ కోచ్‌గా వచ్చారు. చివరి నిమిషంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఏర్పాటు కావడం... జట్టు సభ్యులతో కలిసి పనిచేసేందుకు తగినంత సమయం కూడా లభించకపోవడంతో ఆయన ఫీల్డింగ్ విభాగంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయారు. అయితే వచ్చే నెలలో ఇంగ్లండ్ పర్యటన మాత్రం అభయ్ శర్మ పనితీరు ఎలా ఉందనే విషయం తెలియజేస్తుంది. ఈ పర్యటనలో భారత జట్టు ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది. ‘ఫీల్డింగ్ విషయానికొస్తే చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. మహిళల క్రికెట్లో కాలానుగుణంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. ప్రత్యర్థి జట్టును కట్టడి చేయాలంటే, పరుగులు ఎక్కువ ఇవ్వకూడదంటే ఫీల్డర్లు మైదానంలో ఎల్లవేళలా చురుకుగా కదలాల్సి ఉంటుంది. సాంకేతికంగా కూడా కొన్ని అంశాల్లో మనం మెరుగుపడాలి. ముఖ్యంగా త్రోయింగ్‌లో మన అమ్మాయిలు బలహీనంగా ఉన్నారు. కెరీర్ ఆరంభంలోనే మనం సరైన పద్ధతిలో శిక్షణ తీసుకోకపోతే ఆ తర్వాత మనకు ఇబ్బందులు ఎదురవుతాయి’ అని అభయ్ శర్మ విశ్లేషించారు. ‘విదేశీ మహిళా క్రికెటర్లతో పోలిస్తే మనం కొన్ని విభాగాల్లో ఇంకా వెనుకబడి ఉన్నామని అంగీకరించాలి. దక్షిణాఫ్రికా అమ్మాయిలు మైదానంలో చురుకుగా కదులుతారు. శారీరకంగా కూడా విదేశీ మహిళా క్రికెటర్లు పటిష్టంగా ఉంటారు’ అని అభయ్ శర్మ వివరించారు. -
బ్యాటింగ్ కోచ్‌గా బంగర్
ముంబై: భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా సంజయ్ బంగర్, ఫీల్డింగ్ కోచ్‌గా అభయ్ శర్మలను నియమిం చినట్లు బీసీసీఐ ప్రకటించింది. హెడ్‌కోచ్ అనిల్ కుంబ్లేను సంప్రదించిన తర్వాత వెస్టిండీస్ పర్యటన వరకు మాత్రమే ఈ ఇద్దరినీ నియమించింది.