జాతీయస్థాయి షాట్ పుట్ పోటీలకు కృష్ణలంక కుర్రోడు
గుజరాత్లో డిసెంబర్ 28వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి షాట్‌పుట్ పోటీలకు విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన కూచిభట్ల అభిరామ్ ఎంపికయ్యాడు. ముందుగా నాగ్‌పూర్‌లో రెండు రాష్ట్రాల స్థాయిలో జరిగిన పోటీలలో రజత పతకం సాధించడం ద్వారా జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించాడు.
తల్లిదండ్రుల ఉద్యోగరీత్యా పుణెలో చదువుతున్న అభిరామ్.. మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలకు చెందిన పలు సీబీఎస్ఈ పాఠశాలల నుంచి వచ్చిన క్రీడాకారులతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగిన సీబీఎస్ఈ క్లస్టర్ అథ్లెటిక్స్ పోటీలలో రజత పతకం సాధించాడు. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ నిర్వహించిన ఈ పోటీలలో పుణెలోని సింహగఢ్ స్ప్రింగ్‌డేల్ పబ్లిక్ స్కూల్ తరఫున అతడు అండర్ 17 విభాగంలో పాల్గొన్నాడు. అక్కడ గట్టి పోటీ ఎదుర్కొని రెండో స్థానంలో నిలవడంతో.. గుజరాత్లో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం లభించింది. తాను బయట ఎక్కడా కోచింగ్ తీసుకోలేదని, స్కూల్లో తమ వ్యాయామ ఉపాధ్యాయులు ఇచ్చిన శిక్షణతోనే ఈ పతకం సాధించానని అభిరామ్ ‘సాక్షి’కి తెలిపాడు.