Abu Dhabi Knight Riders
-
సికందర్ రజా ఆల్‌రౌండ్ షో.. నైట్‌రైడర్స్ నిష్క్రమణ
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ కథ ముగిసింది. వరుసగా రెండో సీజన్లోనూ ఆ జట్టు ఎలిమినేటర్ దశ దాటలేకపోయింది. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్.. నైట్‌రైడర్స్‌ను 85 పరుగుల తేడాతో చిత్తు చేసి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. క్యాపిటల్స్ ఆటగాడు సికందర్ రజా (40, 2/27) ఆల్‌రౌండ్ షోతో నైట్‌రైడర్స్‌ను ఓడించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. టామ్ బాంటన్ (44), ఏబెల్ (41), సామ్ బిల్లింగ్స్ (46 నాటౌట్), సికందర్ రజా (40) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో సాబిర్ అలీ 2, విల్లే, జాషువ లిటిల్, ఫేబియన్ లిటిల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 189 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన నైట్‌రైడర్స్.. సికందర్ రజాతో పాటు స్కాట్ కుగ్గెలిన్ (4/17), జహీర్ ఖాన్ (2/25), ఓలీ స్టోన్ (1/18) విజృంభించడంతో 16.5 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ విల్లే (36) టాప్ స్కోరర్‌గా నిలువగా.. సామ్ హెయిన్ (29), జో క్లార్క్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. కాగా, ఈ సీజన్ క్వాలియర్-1కు ఎంఐ ఎమిరేట్స్, గల్ఫ్ జెయింట్స్ ఇదివరకే అర్హత సాధించగా.. ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఓడిన జట్టు ఫిబ్రవరి 15న జరిగే క్వాలిఫయర్-2లో దుబాయ్ క్యాపిటల్స్‌తో తలపడుతుంది. ఎమిరేట్స్, గల్ఫ్ జెయింట్స్ మధ్య క్వాలియర్-1 మ్యాచ్ ఇవాళ జరుగనుంది. -
రెచ్చిపోయిన రసెల్.. 17 బంతుల్లో 6 సిక్సర్లు, అయినా ఓడిన నైట్‌రైడర్స్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ ఆటగాడు, విండీస్ విధ్వంసకర వీరుడు ఆండ్రీ రసెల్ శివాలెత్తిపోయాడు. ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే ఏకంగా 6 సిక్సర్లు కొట్టి 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. రసెల్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయినా ఈ మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ ఓటమిపాలైంది. రసెల్ ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన నైట్‌రైడర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రసెల్‌తో పాటు జో క్లార్క్ (21), మైఖేల్ పెప్పర్ (38), అలీషాన్ షరాఫు (37), సామ్ హెయిన్ (40) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. ఎమిరేట్స్ బౌలర్లలో ఫజల్ హక్ ఫారూకీ 3 వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్, వకార్ సలామ్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం ఎంఐ ఎమిరేట్స్ మరో ఓవర్ మిగిలుండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు కుశాల్ పెరీరా (27 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ముహమ్మద్ వసీం (61 బంతుల్లో 87 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధశతకాలతో ఎమిరేట్స్‌ను విజయతీరాలకు చేర్చారు. ఆఖర్లో ఎమిరేట్స్ కెప్టెన్ నికోలస్ పూరన్ సైతం విరుచుకుపడ్డాడు. పూరన్ కేవలం 19 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 33 పరుగులు చేసి ఔటయ్యాడు. ముహమ్మద్ వసీం.. టిమ్ డేవిడ్ (10) సాయంతో ఎమిరేట్స్‌ను గెలిపించాడు. నైట్‌రైడర్స్ బౌలర్లలో డేవిడ్ విల్లే, అలీ ఖాన్లకు తలో వికెట్ దక్కింది. అలెక్స్ హేల్స్ మెరుపు ఇన్నింగ్స్ వృధా.. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో డెజర్ట్ వైపర్స్‌పై షార్జా వారియర్స్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వారియర్స్.. 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన వైపర్స్ లక్ష్యానికి 8 పరుగుల దూరంలో నిలిచిపోయింది. వారియర్స్ ఇన్నింగ్స్‌లో ఆ జట్టు కెప్టెన్ టామ్ కోహ్లెర్ కాడ్మోర్ (68) టాప్ స్కోరర్‌గా నిలువగా.. వైపర్స్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ హేల్స్ (61) అర్దసెంచరీతో రాణించాడు. వారియర్స్ బౌలర్లు క్రిస్ వోక్స్ (2/26), డేనియల్ సామ్స్ (2/29) వైపర్స్ పతనాన్ని శాశించాడు. -
సెంచరీ చేయకుండా అడ్డుకున్నాడు..!
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో ఇవాళ (జనవరి 21) ఆసక్తికర మ్యాచ్ జరిగింది. డెసర్ట్ వైపర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అబుదాబీ నైట్‌రైడర్స్ సునాయాసంగా విజయం సాధించి, లీగ్‌లో తమ గెలుపును నమోదు చేసింది. మ్యాచ్ వరకు సాదాసీదాగా సాగినా ఓ సందర్భం మాత్రం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. నైట్ రైడర్స్ ఓపెనర్ ఆండ్రియస్ గౌస్ (50 బంతుల్లో 95 నాటౌట్; 5 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ చేసే అవకాశం ఉన్నా సహచర ఆటగాడి కారణంగా ఆ మార్కును అందుకోలేకపోయాడు. ఆఖర్లో గౌస్ సిక్సర్ కొడితే అతని సెంచరీ పూర్తి కావడంతో పాటు తన జట్టు కూడా గెలుస్తుంది. అయితే అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన ఇమాద్ వసీం.. స్ట్రయిక్ రొటేట్ చేసే అవకాశం ఉన్నా అలా చేయకుండా గెలుపు కావాల్సిన పరుగులు (ఫోర్) చేశాడు. ఇమాద్ సింగిల్ తీసి గౌస్‌కు స్ట్రయిక్ ఇచ్చుంటే సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకుని ఉండేవాడు. అప్పటివరకు దూకుడుగా ఆడిన గౌస్.. సెంచరీ కోసమనే నిదానంగా ఆడుతూ 18వ ఓవర్ వరకు మ్యాచ్‌ను తీసుకెళ్లాడు. ఇమాద్.. గౌస్ సెంచరీ విషయాన్ని పట్టించుకోకుండా బౌండరీ కొట్టి మ్యాచ్‌ను ముగించడంతో అంతా ఆశ్చర్యపోయారు. టీ20 క్రికెట్లో సెంచరీ చేసే అవకాశం తరుచూ రాదు కాబట్టి గౌస్ పట్ల అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వైపర్స్.. అలీ ఖాన్ (3/29), సునీల్ నరైన్ (2/23), జాషువ లిటిల్ (1/21), ఇమాద్ వసీం (1/45), డేవిడ్ విల్లే (1/24) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 164 పరుగులకు పరిమితమైంది. వైపర్స్ ఇన్నింగ్స్‌లో ఆడమ్ హోస్ (45) ఒక్కడే ఓ మోస్తరుగా రాణించాడు. ఛేదనలో ఆండ్రియస్ గౌస్ రెచ్చిపోవడంతో నైట్‌రైడర్స్ 17.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. గౌస్‌కు కైల్ పెప్పర్ (36), లారీ ఈవాన్స్ (21) సహకరించారు. గౌస్ ఐదు పరుగుల తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. 30 ఏళ్ల గౌస్ సౌతాఫ్రికాకు చెందిన వాడు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన గౌస్.. నైట్‌రైడర్స్ ఓపెనింగ్ బ్యాటర్‌గా బరిలోకి దిగుతాడు. -
స్టేడియంలో సందడి చేసిన షారుఖ్ ఖాన్.. వీడియో వైరల్
ఇంటర్నేషనల్ లీగ్ టీ20-2024లో భాగంగా శనివారం దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్ ఎమిరేట్స్, దుబాయ్ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సందడి చేశాడు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కింగ్ ఖాన్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంకి వచ్చాడు. స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్‌ను షారుఖ్ ఎంజాయ్ చేశాడు. ఆటగాళ్లు బౌండరీలు బాదిన ప్రతీసారి షారుఖ్ ఖాన్ చప్పట్లు కొడుతూ ఉత్సాహపరిచాడు. షారుఖ్‌తో పాటు దుబాయ్ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ కిరణ్ రెడ్డి కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా గత ఏడాది ఇంటర్నేషనల్ టీ20 లీగ్ తొలి ఎడిషన్ ప్రారంభ వేడుకలకు సైతం షారుఖ్ హాజరయ్యాడు. ఈ లీగ్‌లో అబుదాబి నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ యాజమానిగా షారుఖ్ ఖాన్ ఉన్నాడు. కాగా అబుదాబి నైట్ రైడర్స్ జట్టులో ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ వంటి స్టార్ ఆటగాళ్లు భాగమయ్యారు. కాగా కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ సహ యజమానిగా షారుఖ్ ఖాన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముంబై ఎమిరేట్స్‌పై 7 వికెట్ల తేడాతో దుబాయ్ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. చదవండి: #Shoaib Malik: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్.. ఒకే ఒక్కడు Shah Rukh Khan spotted watching #ILT20 game in UAE pic.twitter.com/AW6BywpDF0 — Syed Irfan Ahmad (@Iam_SyedIrfan) January 20, 2024 -
ప్రమాదకరంగా మారుతున్న పొలార్డ్.. ప్లేఆఫ్స్‌కు ఎంఐ ఎమిరేట్స్
అబుదాబి వేదికగా జరుగుతున్న తొలి ఎడిషన్ ఇంటర్నేషనల్ లీగ్ టి20లో ఎంఐ ఎమిరేట్స్ దుమ్మురేపుతుంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్ రోజురోజుకు మరింత ప్రమాదకరంగా మారుతున్నాడు. ఇప్పటికే వరుస అర్థసెంచరీలతో జోరు కనబరుస్తున్న పొలార్డ్ తాజాగా మరో కీలక ఇన్నింగ్స్‌తో మెరిసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడిన పొలార్డ్ 337 పరుగులు చేశాడు. మూడు అర్థసెంచరీలు సాధించిన పొలార్డ్ ప్రస్తుతం లీగ్‌లో రెండో టాప్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. శుక్రవారం లీగ్‌లో భాగంగా ఎంఐ ఎమిరేట్స్, అబుదాబి నైట్‌రైడర్స్ మధ్య 26వ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో ఎంఐ ఎమిరేట్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంఐ ఎమిరేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. మహ్మద్ వసీమ్ 60 పరుగులతో రాణించగా.. ఆఖర్లో పొలార్డ్ 17 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. టక్కర్ 33 పరుగులు చేశాడు. అనంతరం 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అబుదాబి నైట్‌రైడర్స్ 19.2 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రీ రసెల్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎంఐ ఎమిరేట్స్ బౌలర్లలో డ్వేన్ బ్రేవో మూడు వికెట్లు తీయగా.. ఇమ్రాన్ తాహిర్, జహూర్ ఖాన్లు చెరో రెండు వికెట్లు తీశారు. కాగా ఈ విజయంతో ఎంఐ ఎమిరేట్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోగా.. సీజన్లో అబుదాబి నైట్‌రైడర్స్‌కు ఇది వరుసగా ఎనిమిదో పరాజయం. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ రద్దు కాగా.. ఎనిమిదింటిలో ఓడిన ఆ జట్టు ఎప్పుడో టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఇక ఇప్పటికే డెసర్ట్ వైపర్స్, గల్ఫ్ జెయింట్స్ కూడా ప్లే ఆఫ్స్‌కు వెళ్లగా.. తాజాగా ఎంఐ ఎమిరేట్స్ ప్లేఆఫ్‌కు చేరకుంది. ఇక షార్జా వారియర్స్, దుబాయ్ క్యాపిటల్స్‌లో ఏ జట్టు నాలుగో స్థానంలో ప్లేఆఫ్‌కు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. Four 4️⃣s. Three 6️⃣s. A powerful 4️⃣3️⃣ off just 17 balls.@KieronPollard55 lit up the field with every shot. Another #DPWorldILT20 innings you don't want to miss! #ALeagueApart #MIEvADKR @MIEmirates pic.twitter.com/vR4FkASBZs — International League T20 (@ILT20Official) February 3, 2023 With a never-say-die attitude, the @MIEmirates have made it to the playoffs 🤩 Congratulations, team 💙 #MIEmirates #DPWorldILT20 #ALeagueApart pic.twitter.com/46XEgirZxK — International League T20 (@ILT20Official) February 3, 2023 చదవండి: అంత భయమేలా.. అరిగిపోయిన పిచ్‌లపై ప్రాక్టీస్ -
ILT20: తీరుమారని నైట్ రైడర్స్.. వరుసగా ఏడో ఓటమి
ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో అబుదాబి నైట్ రైడర్స్ మరో ఓటమి చవిచూసింది. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం దుబాయ్ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో అబుదాబి నైట్ రైడర్స్ పరాజాయం పాలైంది. ఈ టోర్నీలో నైట్ రైడర్స్‌కు ఇది 7వ ఓటమి కావడం గమానార్హం. ఇక 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దుబాయ్ క్యాపిటల్స్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. దుబాయ్ బ్యాటర్లలో ఓపెనర్ మున్సీ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డిక్వెల్లా(37), షనక (28) పరుగులతో రాణించారు. నైట్‌రైడర్స్ బౌలర్లలో కుమార, రస్సెల్, అకేల్ హోసేన్ తలా వికెట్ సాధించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన అబుదాబి నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. నైట్ రైడర్స్ బ్యాటర్లలో జో క్లార్క్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దుబాయ్ క్యాపిటల్స్ బ్యాటర్లలో జంపా మూడు వికెట్లు పడగొట్టగా.. హజ్రత్ లుక్మాన్, ఆకీఫ్ రజా తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: IPL 2023: భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డ ధోని.. వీడియో వైరల్ -
దుబాయ్ ప్రీమియర్ లీగ్ మొదలైంది.. తొలి మ్యాచ్‌లోనే నైట్ రైడర్స్‌కు షాక్
ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్), బీబీఎల్ (బిగ్‌బాష్ లీగ్, ఆస్ట్రేలియా), బీపీఎల్ (బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్), పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్), ఎస్ఏ 20 (సౌతాఫ్రికా టీ20 లీగ్) తరహాలోనే యూఏఈ వేదికగా మరో టీ20 లీగ్ ప్రారంభమైంది. అంతర్జాతీయ స్టార్లతో నిండిన ఈ లీగ్‌కు ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్ టీ20)గా నామకరణం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్ తరహాలోనే ఈ లీగ్‌లోనూ 6 జట్లు పోటీపడుతున్నాయి. One for the history books 📖@Dubai_Capitals WIN THE FIRST #DPWorldILT20 GAME 👏 #ALeagueApart #DCvADKR pic.twitter.com/l4Z5GXPVxr — International League T20 (@ILT20Official) January 13, 2023 నిన్న (జనవరి 13) జరిగిన లీగ్ ఇనాగురల్ మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్, అబుదాబీ నైట్ రైడర్స్ జట్లు తలపడగా.. దుబాయ్ క్యాపిటల్స్ 73 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాపిటల్స్.. రాబిన్ ఉతప్ప (33 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ రోవమన్ పావెల్ (29 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. జో రూట్ (21 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), సికందర్ రజా (17 బంతుల్లో 26; ఫోర్, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించగా.. భానుక రాజపక్స (9), యూసప్ పఠాన్ (6) విఫలమయ్యారు. రవి బొపారా (4 బంతుల్లో 12 నాటౌట్; ఫోర్, సిక్స్), ఇసురు ఉడాన (3 బంతుల్లో 11 నాటౌట్; ఫోర్, సిక్స్) ఆఖర్లో మెరుపులు మెరిపించారు. నైట్ రైడర్స్ బౌలర్లలో రవి రాంపాల్, అలీ ఖాన్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్ రైడర్స్.. రజా అకీఫుల్లా ఖాన్ (2/20), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (2/16), రోవమన్ పావెల్ (2/15), ఇసురు ఉడాన (1/14), హజ్రత్ లుక్మా్న్ (1/27), సికందర్ రజా (1/17) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 114 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (38 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రీ రసెల్ (12 బంతుల్లో 12; ఫోర్) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగా.. కొలిన్ ఇంగ్రామ్ (1), బ్రాండన్ కింగ్ (8), జవార్ ఫరీద్ (9), సునీల్ నరైన్ (4), కాన్నర్ (3), అకీల్ హొస్సేన్ (3), ఫహాద్ నవాజ్ (1) దారుణంగా విఫలమయ్యారు. రవి రాంపాల్ (6), అలీ ఖాన్ (6) అజేయంగా నిలిచారు. లీగ్‌లో తదుపరి మ్యాచ్‌లో ఇవాళ (జనవరి 14) ముంబై ఎమిరేట్స్ (ముంబై ఇండియన్స్ యాజమాన్యం), షార్జా వారియర్స్ (క్యాప్రి గ్లోబల్) జట్లు తలపడనున్నాయి. About time you plan your schedule as ours is all set. 34 action packed matches from 13th Jan 2023 💥 Teams are ready to duel for the glorious ILT20 trophy. Catch all the action live with @ilt20onzee Check out the #ILT20 schedule.#ALeagueApart pic.twitter.com/dVINE7FIEu — International League T20 (@ILT20Official) November 29, 2022 ఐఎల్ టీ20 లీగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు.. షెడ్యూల్.. జనవరి 13 నుంచి మొదలయ్యే ఈ లీగ్ ఫిబ్రవరి 12న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. 6 జట్లు పాల్గొనే ఈ లీగ్‌లో మొత్తం 34 మ్యాచ్‌లు జరుగుతాయి. Ready to conquer! 🏆 The captains and the trophy, a glimpse of the final destination before the tournament begins 🤩 #DPWorldILT20 #ALeagueApart pic.twitter.com/IC88z9Qu59 — International League T20 (@ILT20Official) January 12, 2023 ఎలా చూడాలి.. ఐఎల్ టీ20 లీగ్‌ను జీ నెట్‌వర్క్స్‌లోని 10 ఛానల్లలో ఇంగ్లీష్, హిందీ, తమిళ భాషల్లో వీక్షించవచ్చు. జీ సినిమా (ఎస్డీ, హెచ్డీ), జీ అన్మోల్ సినిమా, జీ తిరాయ్, జీ బంగ్లా సినిమా, జీ జస్ట్ (ఎస్డీ, హెచ్డీ), పిక్చర్స్ హెచ్డీ, ఫ్లిక్స్ (ఎస్డీ, హెచ్డీ) ఛానల్‌లతో పాటు ఇదే సంస్థకు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో చూడవచ్చు. The BIGGEST movie star in the world meets the BIGGEST T20 League 🤩 2023 will indeed start with a BANG because @iamsrk has joined #ALeagueApart 🔥 Book your tickets now; https://t.co/MXQYHlHN5j#DPWorldILT20 #SRK #ShahRukhKhan pic.twitter.com/fXUP0P6XaV — International League T20 (@ILT20Official) January 7, 2023 టీమ్స్, ఓనర్స్ .. ఎంఐ ఎమిరేట్స్ (ముంబై ఇండియన్స్) అబుదాబి నైట్ రైడర్స్ (కోల్‌కతా నైట్ రైడర్స్) డెసర్ట్ వైపర్స్ (గ్లేజర్ ఫ్యామిలీ) దుబాయ్ క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) గల్ఫ్ జెయింట్స్ (అదానీ గ్రూప్) షార్జా వారియర్స్ (క్యాప్రి గ్లోబల్) కెప్టెన్లు.. ఎంఐ ఎమిరేట్స్ - కీరన్ పొలార్డ్/ డ్వేన్ బ్రావో అబుదాబి నైట్ రైడర్స్ - సునీల్ నరైన్ డెసర్ట్ వైపర్స్ - కొలిన్ మున్రో దుబాయ్ క్యాపిటల్స్ - రొవమన్ పావెల్ గల్ఫ్ జెయింట్స్ - జేమ్స్ విన్స్ షార్జా వారియర్స్ - మొయిన్ అలీ లీగ్‌లో పాల్గొనే కీలక ఆటగాళ్లు.. సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, రోవమన్ పావెల్, షిమ్రోన్ హెట్మెయర్, ఆండ్రీ రసెల్, పాల్ స్టిర్లింగ్, మొయిన్ అలీ, సికందర్ రజా, రాబిన్ ఉతప్ప, యూసఫ్‌పఠాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, జో రూట్, క్రిస్ జోర్డాన్, జేమ్స్ విన్స్, దసున్ షనక, వనిందు హసరంగ, ట్రెంట్ బౌల్ట్ తదితరులు