ACDP
-
ఎవరికివారే యమునాతీరే
సాక్షి, ఆమదాలవలస(శ్రీకాకుళం) : ఆమదాలవలస ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిగా కొత్తూరు ప్రాజెక్టు ఏసీడీపీఓగా పనిచేస్తున్న టి. విమలారాణి కొన్ని నెలల క్రితం విధుల్లోకి చేరారు. అయితే ఆమె కొత్తూరు, ఆమదాలవలస రెండు ప్రాజెక్టులు చూస్తుండగానే మధ్యలో ఎన్నికలు వచ్చాయి. ఈ తరుణంలోనే ఆమదాలవలస ప్రాజెక్టు పరిధిలోని కొన్ని గ్రామాల్లో అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్‌ను అప్పటి పాలకుల మాటను కాదనలేక విడుదల చేశారు. అయితే అప్పటికి ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఎఫ్‌ఏసీపీఓ అత్యుత్సాహం చూపిస్తూ వంజంగి, జీకె.వలస, చిట్టివలసలతోపాటు ప్రాజెక్టు పరిధిలో మరికొన్ని గ్రామాల్లో పోస్టులను భర్తీ చేశారు. మాజీ ప్రభుత్వ విప్ కనుసన్నల్లో నియామకాలు..? ఎన్నికల ముందు మాజీ ప్రభుత్వ విప్ ఆదేశాల మేరకు కార్యకర్తల నియామకాలు పీఓ కార్యాలయానికి వచ్చినప్పటకీ కొత్తగా పోస్టింగ్‌లు వచ్చిన అభ్యర్థులకు ఆ నియామక పత్రాలు అందజేయకుండా గుట్టుగా ఉంచారు. కొత్తగా జాబ్ వచ్చిన వారికి ఎన్నికల ముందర ఆర్డర్స్ అందిస్తే కొంతమంది కార్యకర్తలు ఎదురు తిరుగుతారని, అందువలన ఎన్నికల తర్వాత ఆర్డర్లు ఇవ్వాలని విప్ చెప్పినట్లు సమాచారం. దీంతో కొత్తగా జాబ్ వచ్చిన వారికి ఎన్నికల తరువాత అనగా వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఎఫ్ఏసీ పీఓ స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా ఆర్డర్స్ అందజేసి, విధుల్లోకి అర్జెంటుగా చేరాలని ఆదేశించారు. దీంతో కొత్తగా పోస్టింగ్‌లు వచ్చిన వారు విధుల్లోకి చేరారు. ఈ విషయంలో ఎఫ్ఏసీ పీఓకు ఆయా గ్రామాల నుంచి ఒత్తిడి రావడంతో పాటు తాను తప్పు చేశాను అనే కారణంతో వెంటనే సెలవుపై వెళ్లిపోయినట్లు సమాచారం. ఆమె సెలవులో వెళ్లిపోయిన తరువాత కార్యాలయంలో ఉద్యోగులతోపాటు, ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో కూడా పర్యవేక్షణ లోపించి, అధికారులంతా ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన్న పనిచేస్తున్నారు. దీంతో ఆమదాలవలస ప్రాజెక్టు పరిస్థితి ప్రస్తుతం అధ్వానంగా ఉందని ఆ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. పీఓ పోస్టు ఖాళీ ఆమదాలవలస ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో పీఓ పోస్టు ఖాళీగా ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన జీఓతో పొందూరు ఐసీడీఎస్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఏసీడీ పీఓ శాంతిశ్రీని ఆమదాలవలస ప్రాజెక్టుకు ఎఫ్ఏసీ ప్రాజెక్టు అధి కారిగా నియమిస్తూ ఉత్తర్వులు వచ్చినట్లు సమాచారం. అయితే ఆమె ఇక్కడ జాయిన్ అవకుండా వేరే చోటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోం ది. ఆమదాలవలస ఎఫ్ఏసీ ప్రాజెక్టు అధికారిగా పనిచేస్తున్న టి.విమలారాణి కొత్తూరు ఏసీడీపీఓగా విధుల్లోకి చేరినట్లు సమాచారం. ఆమదాలవలస ప్రాజెక్టులో ఇన్చార్జి పీఓగా ఇక్కడే పనిచేస్తున్న సూపర్వైజర్ రత్నాంజలి విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాలకు హజరైన ఆమె సమాచారం లేకుండా హజరుకావడంతో స్పీకర్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన కూడా జరిగింది. ప్రస్తుతం ఆమదాలవలస ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిస్థితి అయోమయంగా ఉందనే చెప్పాలి. -
సంచలనం: జస్టిస్ కర్ణన్ రాజకీయ పార్టీ
కోల్‌కత: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్ మరో సంచలనానికి తెరలేపారు. 2019 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ పెడుతున్నట్లు బుధవారం ప్రకటించారు. దేశంలోని 543 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తామని ఆయన తెలిపారు. ‘ఆంటీ కరప్షన్ డైనమిక్ పార్టీ’ (ఏసీడీపీ) పేరుతో పార్టీని రిజిస్టర్ చేయించబోతున్నట్లు కర్ణన్ సహాయకుడు ఆంథోని డబ్ల్యూ లిజారో వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుంచి కర్ణన్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దిగుతారని ఆయన తెలిపారు. దేశం నుంచి అవినీతిని సమూలంగా తరిమికొట్టడమే తమ పార్టీ సిద్ధాంతమని కర్ణన్ ఉద్ఘాటించారు. వారణాసి మినహా మిగతా అన్ని స్థానాల నుంచి మహిళలు మాత్రమే తమ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగుతారని కర్ణన్ ప్రకటించారు. తమ పార్టీ తరపున ఎన్నికల పోటీలో పాల్గొనే అభ్యర్థులకు ఎన్నికల వ్యయంగా లక్ష రూపాయలు కర్ణన్ అందిస్తారని లిజారో తెలిపారు. కోల్‌కతా హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారన్న అభియోగంపై గతేడాది మే 9న జస్టిస్ కర్ణన్‌కు సుప్రీంకోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. దీంతో పశ్చిమబెంగాల్ నుంచి కోయంబత్తూరుకు పరారైన కర్ణన్‌ను జూన్ 20న సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. 6 నెలల జైలు జీవితం అనంతరం గత డిసెంబరు 20న కర్ణన్ విడుదలయ్యారు. కాగా, పదవిలో ఉండగా అరెస్టయిన తొలి హైకోర్టు జడ్జిగా ఆయన రికార్డులకెక్కారు. మద్రాస్ హైకోర్టు జడ్జిగానూ ఆయన పనిచేశారు. -
ప్రజాప్రతినిధి పదిలం
నల్లగొండ : నియోజకవర్గ అభివృద్ధి నిధులు (ఏసీడీపీ) ఖర్చు చేయడంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏడాది పాలన పూర్తయినా ఇప్పటివరకు కనీసం సగం నిధులు కూడా ఖర్చు పెట్టలేదు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల్లో నిధుల్లేక అభివృద్ధి పనులు ఆగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంటే... కోట్లాది రూపాయల నిధులు ఉండి కూడా ప్రజా అవసరాలకు వినియోగించుకోకపోవడం విచారకరం. అధికార, ప్రతిపక్ష పార్టీ అనే వ్యత్యాసం లేకుండా తొమ్మిది నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేల నిధుల్లో పైసా ఖర్చు చేయకుండా పదిలంగానే ఉంచారు. సాధారణంగా ఈ నిధులతో చేపట్టాల్సిన పనులను తమ అనుచరులు, దిగువ శ్రేణి నాయకులకు అప్పగిస్తుంటారు. కానీ ఎందుకో ఏమో తెలియదు కానీ నియోజకవర్గ నిధులు మంజూరైనా పనుల ప్రతిపాదనలు పంపడంలోనూ ఎమ్మెల్యేలు అంతగా ఆసక్తి చూపడం లేదు. వచ్చిన నిధులు రూ.18 కోట్లు.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా నియోజకవర్గ అభివృద్ధి పథకం కింద (ఏసీడీపీ) నిధులు మంజూరయ్యాయి. ఈ పథకం కింద ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు నియోజకవర్గానికి రూ.1.50 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. సమైక్య రాష్ట్రంలో ఇదే పథకం కింద నియోజకవర్గానికి కోటి రూపాయాలు మాత్రమే కేటాయించారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత ప్రజాప్రతినిధుల కోరిక మేరకు నియోజకవర్గానికి అదనంగా రూ.50 లక్షలు పెంచారు. ఈ లెక్కన జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు కలిపి మొత్తం రూ.18 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో ఎమ్మెల్యేలు రూ.9 కోట్లు, మంత్రి ఆమోదంతో రూ.9 కోట్లకు పనుల ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పంపిన ప్రతిపాదనలకు మంత్రి ఆమోదం యథావిధిగా లభిస్తుంది. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్, సీపీఐ ఎమ్మెల్యేలు మాత్రం తప్పనిసరిగా మంత్రి ఆమోదం పొందాల్సిందే. మంత్రి కోటా జోలికి వెళ్లని ఎమ్మెల్యేలు.. పన్నెండు నియోజకవర్గాలకు కలిపి మొత్తం రూ.18 కోట్లు మంజూరయ్యాయి. దీంట్లో కేవలం రూ.8.58 కోట్లు మాత్రమే పనుల ప్రతిపాదనలు పంపారు. నిధుల వినియోగానికి సంబంధించి ముందు వరుసలో ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాల నుంచి రూ.1.50 కోట్ల చొప్పున ప్రతిపాదనలు పంపారు. నకిరేకల్, మునుగోడు, నల్లగొండ, కోదాడ, హుజూర్నగర్, నాగార్జునసాగర్ ఎమ్మెల్యేలు మాత్రం మంత్రి కోటా నిధుల జోలికి వెళ్లలేదు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి కూడా ఎమ్మెల్యే కోటా నిధులకు మాత్రమే ప్రతిపాదనలు పంపారు. మిగిలిన రూ.75 లక్షలు ముట్టుకోలేదు. ఇక దేవరకొండ ఎమ్మెల్యే నిధులు రూ.1.50 కోట్లలో పైసా ఖర్చు పెట్టకపోవడంతో మూలుగుతున్నాయి. ఎమ్మెల్సీ నిధులు వినియోగం ఇలా.... ఎమ్మెల్సీలు పూల రవీందర్, కర్నె ప్రభాకర్, నేతి విద్యాసాగర్ నిధుల్లో మంత్రి కోటాతో కలిపి జిల్లాకు రూ.4.50 కోట్లు మంజూరయ్యాయి. దీంట్లో 175 పనులకు ఆమోద ముద్రపడింది. ఈ పనుల అంచనా వ్యయం రూ.3.80 కోట్లు. దీంట్లో ఇప్పటివరకు కేవలం 66 పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఖర్చు పెట్టింది రూ.1.24 కోట్లు మాత్రమే. ఇంకా 109 పనులు మొదలుపెట్టలేదు. ఎమ్మెల్యేలతో పోలిస్తే ఎమ్మెల్సీలు నిధుల వినియోగంలో ముందంజలో ఉన్నారు. అయితే ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనులకు నిధులు వెచ్చించడంలో చూపుతున్న నిర్లక్ష్యంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో ఉన్న నిధులను వినియోగించి అభివృద్ధి పనులు చేపడితే ఎంతో మేలు జరుగుతుందని వారంటున్నారు. ఇప్పటికైనా స్పందించి నిధుల వినియోగంపై దృష్టిపెట్టాలని వారు కోరుతున్నారు. -
ఎమ్మెల్యే నిధులకు మంగళం
ఏలూరు :ఎమ్మెల్యే కోటా నిధులుగా పిలిచే అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి (ఏసీడీపీ) నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడేసింది. దీంతో నియోజకవర్గాలను అభివృద్ది చేసే విషయంలో ఎమ్మెల్యేలు ఆమడదూరంలో నిలబడాల్సిన దుస్థితి తలెత్తింది. బడ్జెట్లో ఏసీడీపీ కింద కేటాయింపులు చేయకపోవడంతో ఎమ్మెల్యేలు ఒకింత ఆవేదనకు గురవుతున్నారు. తెలంగాణ సర్కారు ప్రతి ఎమ్మెల్యేకి రూ.2 కోట్ల చొప్పున నిధులను విడుదల చేసింది. ఏపీ సర్కారు మాత్రం మొండిచెయ్యి చూపించింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏటా రూ.కోటి చొప్పున నిధులు కేటాయించేవారు. 2015-16 బడ్జెట్లో టీడీపీ సర్కార్ ఆ నిధుల ఊసే ఎత్తకపోవడంతో ఎమ్మెల్యేలు ప్రజలకు ఏ విధమైన హామీలు ఇవ్వకుండా తప్పించుకుని తిరగాల్సిన దుస్థితి దాపురించింది. ఉత్తచేతులతో నియోజకవర్గాల్లో తిరగలేక మొహం చాటేయాల్సి వస్తుందని ఎమ్మెల్యేలు మదనపడుతున్నారు. చిన్నపాటి సమస్యలను సైతం పరిష్కరించాలంటే స్థానిక సంస్థలకు సిఫార్సు చేయడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయత దాపురించిందని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు ఇవ్వకుండా ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాలుగా మార్చేశారని ఒక ప్రజాప్రతినిధి వ్యాఖ్యానించారు. కాగా గత ప్రభుత్వాల హయాంలో మంజూరు చేసిన పనులను సైతం నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం కూడా ఎమ్మెల్యేలకు కొరుకుడు పడటం లేదు. ఎంపీ నిధులే ఆధారం నియోజకవర్గాల్లో కీలకమైన సమస్యలు, కొత్త ప్రాజెక్టులకు అవసరమైన నిధుల కోసం ఎమ్మెల్యేలంతా ఎంపీలను ఆశ్రయించాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఎంపీకి గడచిన సంవత్సరంలోనే రూ.5 కోట్ల చొప్పున కేటాయించగా, ఆ మేరకు పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. ఇందులోనే ఎంపీలు ఎంపిక చేసుకున్న దత్తత గ్రామాలకు నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు కోరిన పనులకు ఎంపీలు ఏమేరకు నిధులు కేటాయిస్తారనేది సందేహంగానే ఉంది. నిధులు కోసం పోరాటం చేసే పరిస్థితి లేదని, జిల్లాకు అన్నివిధాలా న్యాయం చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబును కలిసి కొన్ని ప్రాజెక్టులకైనా మంజూరు చేయించుకుందామన్నా ఆయన ఆ మేరకు స్పందించే పరిస్థితి లేదని ఎమ్మెల్యేలు వాపోతున్నారు.