ACDP funds
-
ఆ విషయంలో వెనుకబడ్డ చట్టసభ సభ్యులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ) కింద ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను వినియోగించుకోవడంలో చట్టసభల సభ్యులు వెనకబడి ఉన్న ట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో అత్యవసర కార్యక్రమాలు, అభివృద్ధి పనులను వేగంగా జరపాలనే ఉద్దేశంతో ఏటా ప్రభుత్వం విడుద ల చేస్తున్న ఏసీడీపీ నిధుల్లో సగం మేర ఖజానాలోనే మూలుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎంపీ ల్యాడ్స్ తరహాలో క్రమం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తున్నప్పటికీ వినియోగం మాత్రం పూర్తి స్థాయిలో ఉండడంలేదు. ఒక్కో సభ్యుడికి ఏటా రూ.3 కోట్ల చొప్పున ప్రభుత్వం ఇస్తుండగా... వీటిని తమ విచక్షణాధికారంతో ఖర్చు చేసే వెసులుబాటు ఉంది. (చదవండి: బెంజి కార్లలో వచ్చి కల్లు తాగుతున్నారు.. ) ఐదేళ్లలో 1,900 కోట్లు... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2014–15 వార్షిక సంవత్సరం నుంచి 2018–19 వార్షిక సంవత్సరం వరకు ఐదేళ్ల కాలంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఏసీడీపీ నిధుల కింద రూ.1,900 కోట్లు విడుదల చేసింది. అయితే వీటిలో కేవలం రూ.1,228.93 కోట్లు ఖర్చు చేశారు. అంటే విడుదల చేసిన నిధులలో కేవలం 64.66 శాతం మాత్రమే ఖర్చు చేయగా.. మిగతావన్నీ ఖజానాలో మూలుగుతున్నాయి. ఖర్చు కాని నిధులను క్యారీఫార్వర్డ్ చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ సకాలంలో వీటిని వినియోగించకపోవడంతో ఆశిం చిన ప్రయోజనం కలగడం లేదు. ఎమ్మెల్యేలు కాస్త నయం... ఏసీడీపీ కార్యక్రమం కింద విడుదలైన నిధులను ఖర్చు చేయడంలో ఎమ్మెల్సీల కంటే ఎమ్మెల్యేలు కాస్త ముందు వరుసలో ఉన్నారు. ఐదేళ్లలో ఎమ్మెల్యే కోటాలో ప్రభుత్వం రూ.1,440 కోట్లు విడుదల చేయగా... ఇప్పటివరకు రూ.974.85 కోట్లు (67.69 శాతం)ఖర్చు చేశారు. ఎమ్మెల్సీల కోటాలో రూ.460.5 కోట్లు విడుదల చేస్తే ఇప్పటివరకు రూ.254.08 కోట్లు (55.17శాతం)మాత్రమే ఖర్చు చేశారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలు కాస్త ఎక్కువ నిధులు ఖర్చు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో వినియోగించకపోవడంతో నియోజకవర్గాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. (చదవండి: తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు) -
ప్రణాళికాబద్ధంగా పట్టణాభివృద్ధి
గద్వాల: ప్రజల దీర్ఘకాలి క ప్రయోజనాలను దృ ష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్ధంగా పట్టణాభివృ ద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే డీకే అరుణ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక 16వ వార్డు పరిధిలోని కుంటవీధిలో రూ. నాలుగు లక్షల ఏసీడీపీ నిధులతో చేపట్టనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం 14వ ఆర్థిక సంఘం నిధుల కింద మంజూరైన రూ. ఐదు లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ జిల్లా కేంద్రం అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణవేణి, వార్డు కౌన్సిలర్ జయలక్ష్మి, టీపీసీసీఎం సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, నాయకులు బండల వెంకట్రాములు, భాస్కర్‌యాదవ్, నాగేందర్‌యాదవ్, సరళమ్మ, అన్వర్, నెమలికంటి రామాంజి పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధికి కృషి గద్వాల క్రైం: ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. శనివారం గద్వాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి లో నూతనంగా తాగునీటి బోరు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరుణ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రి అభివృద్ధి తన సహాయ సహకారాలు ఉంటాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యాక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయ్‌కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణవేణి రామాంజనేయులు, రాష్ట్ర పీసీసీ మెంబర్ గడ్డం కృష్ణరెడ్డి, నాయకులు, వైద్యులు పాల్గొన్నారు. మల్దకల్ (గద్వాల): మండలంలోని వివిధ అభివృద్ది పనులకు మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ భూమి పూజ చేశారు. శనివారం మండలంలోని ఎల్కూర్, బిజ్వారం ఉన్నత పాఠశాలలో సొంత నిధులతో నిర్మించిన వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. అదే విధంగా బిజ్వారం బీసీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో గడ్డం కృష్ణారెడ్డి, పటేల్ ప్రభాకర్‌రెడ్డి, సత్యారెడ్డి, విక్రంసింహారెడ్డి, పాల్వాయి రాములు తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు ఏమిటో!
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులకు ఇచ్చే అభివృద్ధి నిధుల మార్గదర్శకాలు మారనున్నాయా? లేక పాత పద్ధతిలోనే 50 : 50 శాతంలో కేటాయిస్తారా? నిధులను ఏరూపంలో ఇవ్వనున్నారు? ఎంపీ లాడ్స్, ఏసీడీపీ నిధులను ఎలా ఖర్చు చేయాలి. వాటిని ఎలా కేటాయిస్తారు. కేంద్రంలో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ అంశాలు చర్చనీయాంశంగా మారాయి. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కేంద్రంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎంపీ లాడ్స్, ఏసీడీపీ నిధులు విడుదల చేస్తూ వస్తున్నాయి. ఆ నిధులకు ఒక్కో ప్రభుత్వం ఒక్కో పేరు పెట్టి విడుదల చేసింది. జిల్లాలో రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) పేరుతో నిధులు విడుదల చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ)గా పేరు మార్చి నిధులను మంజూ రు చేసింది. గతంలో ఒక్కో ఎమ్మెల్యేలకు ఏటా రూ.50 లక్షలు కేటాయించగా, ఆ తర్వాత రూ. కోటికి పెంచారు. ఒక్కో ఎమ్మెల్యేకు ఐదేళ్లలో ఏటా రూ. కోటి చొప్పున రూ. ఐదు కోట్లు ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం వెచ్చించే అవకాశం ఉంటుంది. ఇందులో సగం నిధులను జిల్లా ఇన్చార్జి మంత్రి సమన్వయంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎంపీ లాడ్స్ కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఎంపీకీ ఏటా రూ. ఐదు కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.25 కోట్లు కేటాయిస్తుంది. ఈ నిధులను ఎంపీలై నా, ఎమ్మెల్యేలైనా ప్రజల నుంచి డిమాండున్న అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తుండగా, వారి గెలుపు కోసం కష్టపడే ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆ పను లను చేసి తృణమో, ఫణమో దక్కించుకునేవారు. ఈసారి ఈ నిధుల విడుదలలో మార్గదర్శకాలపై ఆయా వర్గాలకు ఉత్కంఠగా మారింది. జిల్లాకు రూ.95 కోట్లు శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ), ఎంపీ లాడ్స్ కింద జిల్లాకు ఐదేళ్లలో రూ.95 కోట్లు విడుదలయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్, జహీ రాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్‌కు ఒక్కొక్కరి ఏటా రూ. ఐదు కోట్ల చొప్పున కేంద్రం ఇవ్వనుంది. ఐదేళ్లలో ఈ ఇద్దరు ఎంపీలకు రూ.50 కోట్లు రానున్నా యి. అలాగే, జిల్లాలోని తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఏటా రూ. కోటి చొప్పున ఐదేళ్లలో రూ.45 కోట్ల ఏసీడీపీ నిధులను రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేయనుంది. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, కామారెడ్డి నుంచి తిరిగి గెలిచిన ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్ సింధే, పోచారం శ్రీనివాస్‌రెడ్డి నియోజవర్గాలలో ఇది వరకే పనులు నడుస్తున్నాయి. కొత్తగా ఎన్నికైన వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్త, మహ్మద్ షకీ ల్ పనులను ప్రతిపాదించాల్సి ఉంది. ఎంపీలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు ప్రతియేటా విడుదలయ్యే నిధుల్లో అత్యధికంగా తాగునీరు, మౌళిక సదుపా యాల కల్పనకు ఖర్చు చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. కొద్ది రోజుల్లో ఈ నిధులు విడుదల కానుండగా, కొత్తగా అధికారంలోకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిధులకు వే రు పేర్లు పెడతాయా? ఎంపీ ల్యాడ్, ఏసీడీపీ నిధులతో చేపట్టే పనులు ఏమిటి? మార్గదర్శకాలను సవరిస్తారా? లేక పాత పద్ధతినే కొనసాగిస్తారా? అన్న స్పష్టత లేక నేతలు, అనుచరులు తర్జన భర్జనల్లో పడ్డారు.