కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులకు ఇచ్చే అభివృద్ధి నిధుల మార్గదర్శకాలు మారనున్నాయా? లేక పాత పద్ధతిలోనే 50 : 50 శాతంలో కేటాయిస్తారా? నిధులను ఏరూపంలో ఇవ్వనున్నారు? ఎంపీ లాడ్స్, ఏసీడీపీ నిధులను ఎలా ఖర్చు చేయాలి. వాటిని ఎలా కేటాయిస్తారు. కేంద్రంలో, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కేంద్రంలో, రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎంపీ లాడ్స్, ఏసీడీపీ నిధులు విడుదల చేస్తూ వస్తున్నాయి. ఆ నిధులకు ఒక్కో ప్రభుత్వం ఒక్కో పేరు పెట్టి విడుదల చేసింది. జిల్లాలో రెండు లోక్‌సభ, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీపీ) పేరుతో నిధులు విడుదల చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ)గా పేరు మార్చి నిధులను మంజూ రు చేసింది. గతంలో ఒక్కో ఎమ్మెల్యేలకు ఏటా రూ.50 లక్షలు కేటాయించగా, ఆ తర్వాత రూ. కోటికి పెంచారు.
ఒక్కో ఎమ్మెల్యేకు ఐదేళ్లలో ఏటా రూ. కోటి చొప్పున రూ. ఐదు కోట్లు ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం వెచ్చించే అవకాశం ఉంటుంది. ఇందులో సగం నిధులను జిల్లా ఇన్‌చార్జి మంత్రి సమన్వయంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎంపీ లాడ్స్ కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కో ఎంపీకీ ఏటా రూ. ఐదు కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.25 కోట్లు కేటాయిస్తుంది. ఈ నిధులను ఎంపీలై నా, ఎమ్మెల్యేలైనా ప్రజల నుంచి డిమాండున్న అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తుండగా, వారి గెలుపు కోసం కష్టపడే ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆ పను లను చేసి తృణమో, ఫణమో దక్కించుకునేవారు. ఈసారి ఈ నిధుల విడుదలలో మార్గదర్శకాలపై ఆయా వర్గాలకు ఉత్కంఠగా మారింది.
జిల్లాకు రూ.95 కోట్లు
శాసనసభ నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమం (ఏసీడీపీ), ఎంపీ లాడ్స్ కింద జిల్లాకు ఐదేళ్లలో రూ.95 కోట్లు విడుదలయ్యే అవకాశం ఉంది. నిజామాబాద్, జహీ రాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్‌కు ఒక్కొక్కరి ఏటా రూ. ఐదు కోట్ల చొప్పున కేంద్రం ఇవ్వనుంది. ఐదేళ్లలో ఈ ఇద్దరు ఎంపీలకు రూ.50 కోట్లు రానున్నా యి. అలాగే, జిల్లాలోని తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఏటా రూ. కోటి చొప్పున ఐదేళ్లలో రూ.45 కోట్ల ఏసీడీపీ నిధులను రాష్ర్ట ప్రభుత్వం విడుదల చేయనుంది. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్, కామారెడ్డి నుంచి తిరిగి గెలిచిన ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్ రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్ సింధే, పోచారం శ్రీనివాస్‌రెడ్డి నియోజవర్గాలలో ఇది వరకే పనులు నడుస్తున్నాయి.
కొత్తగా ఎన్నికైన వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్త, మహ్మద్ షకీ ల్ పనులను ప్రతిపాదించాల్సి ఉంది. ఎంపీలు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు ప్రతియేటా విడుదలయ్యే నిధుల్లో అత్యధికంగా తాగునీరు, మౌళిక సదుపా యాల కల్పనకు ఖర్చు చేస్తున్న దాఖలాలు ఉన్నాయి. కొద్ది రోజుల్లో ఈ నిధులు విడుదల కానుండగా, కొత్తగా అధికారంలోకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిధులకు వే రు పేర్లు పెడతాయా? ఎంపీ ల్యాడ్, ఏసీడీపీ నిధులతో చేపట్టే పనులు ఏమిటి? మార్గదర్శకాలను సవరిస్తారా? లేక పాత పద్ధతినే కొనసాగిస్తారా? అన్న స్పష్టత లేక నేతలు, అనుచరులు తర్జన భర్జనల్లో పడ్డారు.
నిబంధనలు ఏమిటో!
Published Tue, Jul 15 2014 4:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:17 AM
Advertisement