AchamNaidu
-
అచ్చెంనాయుడికి కష్టాలు.. ఎందుకిలా జరుగుతోంది?
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడి కష్టాలు పగవాడిక్కూడా రాకూడదంటున్నారు రాజకీయ పండితులు. తాను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత తన విషయంలోనే ఎందుకిలా జరుగుతోందా అని పాపం అచ్చెంనాయుడు తెగ బాధ పడుతున్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలను బతిమాలుకున్నా లాభం లేకపోవడంతో ఆయన తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్‌కు నిరసనగా బాబుతో నేను కార్యక్రమానికి పిలుపు నిస్తే.. పార్టీ నేతలెవరూ అందులో పాల్గొనకపోవడంతో అచ్చెంనాయుడికి మండుకొచ్చింది. పార్టీ చెప్పిన కార్యక్రమంలో పాల్గొనని వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ✍️టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో 371 కోట్లు నమిలేశారన్న అభియోగంపై రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిని సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు అరెస్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన ఆందోళనలు నిరసనలు ఉంటాయనుకున్నారు టీడీపీ నేతలు. అయితే అటు ప్రజలూ ఇటు పార్టీ కార్యకర్తలు కూడా చంద్రబాబు అరెస్ట్‌ను పట్టించుకోలేదు. దీంతో అప్పుడు అచ్చెం నాయుడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి చంద్రబాబు నాయుడి అరెస్ట్ ఘటనను మించిన పెద్ద సందర్భం ఇంకేముంటుంది? ఆయన్ని అరెస్ట్ చేసిన ఎక్కడా జనాన్ని సమీకరించలేకపోతున్నారు ఇలా అయితే ఎలాగ? కనీసం ఇప్పుడైనా వీలైనంత ఎక్కువ మందిని సమీకరించండి. అందులో మహిళలు ఎక్కువగా ఉండేలా చూడండి. మహిళలను పోలీసులు ఇబ్బంది పెట్టడం లేదు కాబట్టి ఆందోళనలు విజయవంతం అవుతాయంటూ అచ్చెంనాయుడు చేసిన వ్యాఖ్యల ఆడియో సోషల్ మీడియాలో సిల్వర్ జూబ్లీ ఆడేసింది. ✍️అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని జైలుకు పంపిన తర్వాత హౌస్ రిమాండ్ కు న్యాయస్థానం అంగీకరించకపోవడంతో బాబుతో నేను పేరిట రిలే నిరాహార దీక్షలకు పిలుపు నిచ్చారు అచ్చెంనాయుడు. అయితే ఈ కార్యక్రమం కూడా ఢమాల్ మంది. పార్టీ నేతలు ఎవ్వరూ దీన్ని పట్టించుకోవడం లేదు. ఎల్లో మీడియాలో మాత్రం చంద్రబాబుకు అద్భుతమైన మద్దతు లభిస్తోందని ఊదరగొట్టేస్తున్నాయి. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. తాజాగా అచ్చెంనాయుడు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. అందులో బాబుతో నేను కార్యక్రమంలో పార్టీలో ఒకళ్లిద్దరు తప్ప ఎవ్వరూ పాల్గొనడం లేదని ఆక్రోశం వ్యక్తం చేశారు. రిలే నిరాహార దీక్షల్లో పాల్గొనని నేతలపై చర్యలు తప్పవని ఆ లేఖలో హెచ్చరించారు. ✍️చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేసినా..ఆయన్ను న్యాయస్థానం జైలుకు పంపినా.. పార్టీ క్యాడర్ కూడా పట్టించుకోవడం లేదనడానికి అచ్చెంనాయుడి లేఖే తిరుగులేని నిదర్శనం. రండిరా బాబూ ప్లీజ్ అని పార్టీ కార్యకర్తలను బతిమాలాడుకున్నా ఆందోళన కార్యక్రమాలు సక్సెస్ కావడం లేదు. అంతకు ముందు నారా లోకేష్ యువగళం యాత్రలోనూ రాయలసీమలో పార్టీ నేతలతో అచ్చెంనాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ✍️లోకేష్ యాత్రకు జనం ఎవరూ రాకపోవడం ఏమాత్రం బాగా లేదన్న అచ్చెంనాయుడు పెద్దాయన చాలా బాధ పడుతున్నారు.. మీరంతా దగ్గరుండి జనాన్ని సమీకరించాలని సూచించారు. దానికి ఆ నేత స్పందిస్తూ జనానికి బాగా డబ్బులు ఇస్తున్నాం..చాలా మందినరి పురమాయించాం అని బదులిచ్చారు. అప్పట్లో ఈ ఆడియో క్లిపింగ్ కూడా బాగా వైరల్ అయ్యింది. లోకేష్ యాత్రకు కూడా డబ్బులిచ్చి జనాన్ని రప్పించుకోవలసిన దుస్థితి నెలకొందని పార్టీ సీనియర్లే ఆందోళన వ్యక్తం చేశారు అప్పట్లో. ✍️అసలు తెలుగుదేశం పార్టీ పరిస్థితే బాగా లేదని అచ్చెంనాయుడు ఎప్పుడో చెప్పారు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో ఓ హోటల్ లో అచ్చెంనాయుడు వేడి వేడి ఇడ్లీ కొబ్బరి చట్నీ తింటూ పార్టీ లేదు డ్యాష్ డ్యాష్ లేదు అని పార్టీ పరిస్థితిని కళ్లకు కట్టిన వీడియో క్లిపింగ్‌ను కోట్లాది మంది చూసి విస్తు పోయారు. ఆయన ఏ ముహూర్తాన ఈ వ్యాఖ్య చేశారో కానీ అది నూటికి నూరు శాతం నిజమని పార్టీ శ్రేణులే చాటి చెబుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు జైలుకు పోవడంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. ఇక తమకి రాజకీయ భవిష్యత్తు లేనట్లే అని వారు పెదాలు విరుస్తున్నారు. పాపం అచ్చెంనాయుడి బాధనే ఎవరూ అర్ధం చేసుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చదవండి: పొత్తు పొడిచింది అమరావతి కోసమే -
‘అందుకే ఆ కుంభకోణం బయటపడింది’
సాక్షి, విజయవాడ: ఈఎస్ఐ స్కాంలో తెలంగాణలో దోషులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో.. ఏపీలో కూడా అలాంటి చర్యలే తీసుకోవాలని బీజేపీ జాతీయ మైనార్టీ నేత షేక్ బాజీ డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టే.. ఈఎస్ఐ స్కాం బయటపడిందన్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఈ స్కాం మరుగున పడిపోయేదన్నారు. అచ్చెన్నాయుడు ప్రమేయంతోనే అవినీతి జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయని ఆయన పేర్కొన్నారు.('అచ్చెన్నాయుడు జైలుకు వెళ్లడం ఖాయం' ) అధిక ధరలకు మందులు,యంత్ర పరికరాలు ఎందుకు కొనుగోలు చేశారో సమాధానం చెప్పాలన్నారు. ఈఎస్ఐ కుంభకోణంలో కూడా చంద్రబాబు పాత్రపై విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఈఎస్ఐ స్కాం లో వాటాలు వెళ్లే ఉంటాయని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఈఎస్ఐ కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం కూడా విచారణ చేపట్టాలని బాజీ కోరారు. (ఏపీ ఈఎస్ఐలో భారీ కుంభకోణం) -
విశాఖలో 200 ఎకరాల్లో స్పోర్ట్స్ విలేజ్
- రాష్ట్ర క్రీడల మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ సౌజన్యంతో 200 ఎకరాల స్థలంలో విశాఖపట్నంలోనే క్రీడాగ్రామాన్ని (స్పోర్ట్స్ విలేజ్)ను నిర్మించనున్నట్లు రాష్ట్ర క్రీడల మంత్రి కె.అచ్చెన్నాయుడు వెల్లడించారు. తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియంను నిర్మంచనున్నట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి పూజారి శైలజకు ఇంతవరకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సాయం అందలేదని అంగీకరించారు. ఆమెకు నగదు ప్రోత్సాహంతోపాటు స్థలం కూడా అందేటట్టు చూస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని క్రీడల హబ్‌గా మార్చేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా కృషిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అమరావతిని స్పోర్ట్స్ విలేజ్‌గా మార్చుతామని, 2018లో జరిగే జాతీయ క్రీడలను విజయవంతంగా నిర్వహిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి, కలెక్టర్ లక్ష్మీనృసింహం, డీఎస్డీఓ శ్రీనివాస్‌కుమార్‌లు పాల్గొన్నారు.