ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెంనాయుడి కష్టాలు పగవాడిక్కూడా రాకూడదంటున్నారు రాజకీయ పండితులు. తాను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత తన విషయంలోనే ఎందుకిలా జరుగుతోందా అని పాపం అచ్చెంనాయుడు తెగ బాధ పడుతున్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలను బతిమాలుకున్నా లాభం లేకపోవడంతో ఆయన తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్‌కు నిరసనగా బాబుతో నేను కార్యక్రమానికి పిలుపు నిస్తే.. పార్టీ నేతలెవరూ అందులో పాల్గొనకపోవడంతో అచ్చెంనాయుడికి మండుకొచ్చింది. పార్టీ చెప్పిన కార్యక్రమంలో పాల్గొనని వారిపై చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
✍️టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో 371 కోట్లు నమిలేశారన్న అభియోగంపై రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిని సంగతి తెలిసిందే. పార్టీ అధ్యక్షుడు అరెస్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన ఆందోళనలు నిరసనలు ఉంటాయనుకున్నారు టీడీపీ నేతలు. అయితే అటు ప్రజలూ ఇటు పార్టీ కార్యకర్తలు కూడా చంద్రబాబు అరెస్ట్‌ను పట్టించుకోలేదు. దీంతో అప్పుడు అచ్చెం నాయుడు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి చంద్రబాబు నాయుడి అరెస్ట్ ఘటనను మించిన పెద్ద సందర్భం ఇంకేముంటుంది? ఆయన్ని అరెస్ట్ చేసిన ఎక్కడా జనాన్ని సమీకరించలేకపోతున్నారు ఇలా అయితే ఎలాగ? కనీసం ఇప్పుడైనా వీలైనంత ఎక్కువ మందిని సమీకరించండి. అందులో మహిళలు ఎక్కువగా ఉండేలా చూడండి. మహిళలను పోలీసులు ఇబ్బంది పెట్టడం లేదు కాబట్టి ఆందోళనలు విజయవంతం అవుతాయంటూ అచ్చెంనాయుడు చేసిన వ్యాఖ్యల ఆడియో సోషల్ మీడియాలో సిల్వర్ జూబ్లీ ఆడేసింది.
✍️అది వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని జైలుకు పంపిన తర్వాత హౌస్ రిమాండ్ కు న్యాయస్థానం అంగీకరించకపోవడంతో బాబుతో నేను పేరిట రిలే నిరాహార దీక్షలకు పిలుపు నిచ్చారు అచ్చెంనాయుడు. అయితే ఈ కార్యక్రమం కూడా ఢమాల్ మంది. పార్టీ నేతలు ఎవ్వరూ దీన్ని పట్టించుకోవడం లేదు. ఎల్లో మీడియాలో మాత్రం చంద్రబాబుకు అద్భుతమైన మద్దతు లభిస్తోందని ఊదరగొట్టేస్తున్నాయి. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. తాజాగా అచ్చెంనాయుడు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. అందులో బాబుతో నేను కార్యక్రమంలో పార్టీలో ఒకళ్లిద్దరు తప్ప ఎవ్వరూ పాల్గొనడం లేదని ఆక్రోశం వ్యక్తం చేశారు. రిలే నిరాహార దీక్షల్లో పాల్గొనని నేతలపై చర్యలు తప్పవని ఆ లేఖలో హెచ్చరించారు.
✍️చంద్రబాబు నాయుణ్ని అరెస్ట్ చేసినా..ఆయన్ను న్యాయస్థానం జైలుకు పంపినా.. పార్టీ క్యాడర్ కూడా పట్టించుకోవడం లేదనడానికి అచ్చెంనాయుడి లేఖే తిరుగులేని నిదర్శనం. రండిరా బాబూ ప్లీజ్ అని పార్టీ కార్యకర్తలను బతిమాలాడుకున్నా ఆందోళన కార్యక్రమాలు సక్సెస్ కావడం లేదు. అంతకు ముందు నారా లోకేష్ యువగళం యాత్రలోనూ రాయలసీమలో పార్టీ నేతలతో అచ్చెంనాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
✍️లోకేష్ యాత్రకు జనం ఎవరూ రాకపోవడం ఏమాత్రం బాగా లేదన్న అచ్చెంనాయుడు పెద్దాయన చాలా బాధ పడుతున్నారు.. మీరంతా దగ్గరుండి జనాన్ని సమీకరించాలని సూచించారు. దానికి ఆ నేత స్పందిస్తూ జనానికి బాగా డబ్బులు ఇస్తున్నాం..చాలా మందినరి పురమాయించాం అని బదులిచ్చారు. అప్పట్లో ఈ ఆడియో క్లిపింగ్ కూడా బాగా వైరల్ అయ్యింది. లోకేష్ యాత్రకు కూడా డబ్బులిచ్చి జనాన్ని రప్పించుకోవలసిన దుస్థితి నెలకొందని పార్టీ సీనియర్లే ఆందోళన వ్యక్తం చేశారు అప్పట్లో.
✍️అసలు తెలుగుదేశం పార్టీ పరిస్థితే బాగా లేదని అచ్చెంనాయుడు ఎప్పుడో చెప్పారు. తిరుపతి ఉప ఎన్నిక సమయంలో ఓ హోటల్ లో అచ్చెంనాయుడు వేడి వేడి ఇడ్లీ కొబ్బరి చట్నీ తింటూ పార్టీ లేదు డ్యాష్ డ్యాష్ లేదు అని పార్టీ పరిస్థితిని కళ్లకు కట్టిన వీడియో క్లిపింగ్‌ను కోట్లాది మంది చూసి విస్తు పోయారు. ఆయన ఏ ముహూర్తాన ఈ వ్యాఖ్య చేశారో కానీ అది నూటికి నూరు శాతం నిజమని పార్టీ శ్రేణులే చాటి చెబుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు జైలుకు పోవడంతో పార్టీ పరిస్థితి మరింత దిగజారింది. పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. ఇక తమకి రాజకీయ భవిష్యత్తు లేనట్లే అని వారు పెదాలు విరుస్తున్నారు. పాపం అచ్చెంనాయుడి బాధనే ఎవరూ అర్ధం చేసుకోవడం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
చదవండి: పొత్తు పొడిచింది అమరావతి కోసమే
Comments
Please login to add a commentAdd a comment