ఆక్వా పరిశ్రమ వద్దు
మొగల్తూరు : తుందుర్రులో ఆక్వా పరిశ్రమను ఏర్పాటు చేయవద్దంటూ మత్య్సకారులు కళ్లకు గంతలు కట్టుకుని శనివారం వినూత్నరీతిలో నిరసన తెలిపారు. ముత్యాలపల్లి పంచాయతీ చింతరేవులో జరిగిన ఈకార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ఆక్వా పరిశ్రమ వద్దని గత రెండేళ్లుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమన్నారు. పరిశ్రమ స్థాపిస్తే గొంతేరు డ్రెయన్ కలుషితమై తాము వేటతోపాటు జీవనోపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక మత్స్యకారులు కొల్లాటి పెద్దింట్లమ్మ, సుభద్రమ్మ, తిరుమాని లక్ష్మి, వాటాల ధనలక్ష్మి, కొల్లాటి లక్ష్మి, గాడి మాణిక్యం పాల్గొన్నారు.