acqua ponds
-
ఆక్వా ’బడా’యి
సిండికేట్‌గా బడా రైతులు ఏకమొత్తంలో భారీ చెరువుల తవ్వకం కొల్లేరులోకీ ప్రవేశం నిబంధనలకు తూట్లు జిల్లాలో ఆక్వా బడాయి నానాటికీ పెచ్చుమీరుతోంది. బడా రైతులు సిండికేట్‌గా మారి చిన్నచిన్న కమతాలను లీజుకు తీసుకుని వందలాది ఎకరాల్లో ఏకమొత్తంగా భారీ చెరువులు తవ్వుతున్నారు. నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఫలితంగా పిల్ల కాలువలు, పంట బోదెలు, గట్లు కనుమరుగవుతున్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలో చెరువుల తవ్వకం పరిస్థితి ఇదీ(మారుగా) చెరువులు అధికారికం అనధికారికం మొత్తం (ఎకరాల్లో ) చేపలు 2,00,000 20,000 2.20,000 రొయ్యలు 15,000 65,000 80,000 ==================================== మొత్తం 2,15,000 80,000 3,00,000 ఆకివీడు : జిల్లా వ్యాప్తంగా, ముఖ్యంగా డెల్టా ప్రాంతంలో పెద్ద మొత్తంలో చెరువులు తవ్వేందుకు వివిధ ప్రాంతాల నుంచి బడా రైతులు తరలివస్తున్నారు. అధిక లీజులు చెల్లిస్తామంటూ చిన్నసన్నకారు రైతులను ఆశపెట్టి వందలాది ఎకరాల్లో ఏకమొత్తంగా చెరువులు తవ్వేస్తున్నారు. తమకున్న పలుకుబడితో నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. అధికారులు తమవైపు చూడకుండా చేసుకుంటున్నారు. ఆక్వా రంగాన్ని కార్పొరేట్ బాట పట్టించేందుకు యత్నిస్తున్నారు. ఈ తరహాలో ఇప్పటికే డెల్టాలో 2 వేల ఎకరాలకుపైగా చేపల చెరువులు తవ్వేశారు. మరో 3 వేల ఎకరాలు తవ్వేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో చేపల చెరువులున్నట్టు అధికార వర్గాల సమాచారం. వీటిలో 20వేల ఎకరాల చెరువులకు అనుమతులు లేవని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో 80వేల ఎకరాలు రొయ్యల చెరువులుగా మారిపోయాయి. వీటిలో అధికారికంగా 15వేల ఎకరాలు కూడా ఉండవని సమాచారం. అనధికారికంగా రొయ్యల చెరువులనూ భారీగా తవ్వేందుకు బడా రైతులు ముందుకు వస్తున్నారు. బోదెలు, కాలువలు çకనుమరుగు భారీ చెరువుల తవ్వకంతో పంట బోదెలు, పిల్లకాలువలు మాయమవుతున్నాయి. మురుగు కాలువలూ కనుమరుగవుతున్నాయి. వీటితో పాటు వేలాది ఎకరాల ప్రభుత్వం భూమి కూడా మాయమవుతోంది. పంట, మరుగుకాలువల అంతర్ధానంతో భవిష్యత్తులో రానున్న రోజుల్లో నీటి సరఫరా వ్యవస్థ అధ్వానంగా తయారయ్యే ప్రమాదం ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పంట కాలవల్లోకి ఉప్పునీరు రొయ్యల చెరువులు విచ్చలవిడిగా తవ్వేయడం వల్ల పంట కాలువల్లో ఉప్పునీటి శాతం పెరిగిపోయింది. రొయ్యల పెంపకానికి ఉప్పునీటి అవసరాన్ని గుర్తించిన రైతులు అనధికారికంగా బోర్లు తవ్వేస్తున్నారు. భూగర్భ జలాలను పీల్చేస్తున్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీంతోపాటు రొయ్యల చెరువుల్లోని ఉప్పునీటిని పంట కాలువల్లోకి వదిలివేయడంతో వాటిల్లో ఉప్పునీటి శాతం పెరిగిపోతోంది. ఈ నీటిని పంట చేలకు పెట్టడంతో భూములు చౌడుబారుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరులోకి తిమింగలాలు కొల్లేరు సరస్సులోకి మళ్లీ తిమింగలాలు ప్రవేశిస్తున్నాయి. కొల్లేరులోని ఐదో కాంటూర్ దిగువనున్న డిఫారం భూములకు అక్రమార్కులు గాలం వేస్తున్నారు. ఇప్పటికే డిఫారం భూముల్లో 4 వేల ఎకరాలకుపైగా చేపల చెరువులుగా మారిపోయాయి. మిగిలిన భూములతోపాటు జిరాయితీ, ప్రభుత్వ భూములనూ తవ్వేసేందుకు బడా రైతులు నడుం బిగించారు. అధికార పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు కొల్లేరు భూములను చెరువులుగా మార్చడంలో కీలక పాత్ర వహిస్తున్నారు. నాలుగు సార్లు నారుమళ్లు చెరువుల్లోని ఉప్పునీరు పంట కాలువల్లో నుంచి చేలల్లోకి ప్రవేశిస్తోంది. దీంతో చేలు చౌడుబారుతున్నాయి. ఉప్పునీటి వల్ల వేసిన నారుమళ్లు చనిపోతున్నాయి. ఖరీఫ్‌లో మూడు సార్లు, రబీలో నాలుగు సార్లు నారుమళ్లు పోసుకోవలసి వచ్చింది కొట్టు సత్యనారాయణ, సన్నకారు రైతు, దుంపగడప. వరి దండగ అనిపిస్తోంది పెదకాపవరం గ్రామంలో వరి సాగు చేయడం దండగ అనిపిస్తోంది. చుట్టూ చేపలు, రొయ్యల చెరువులతో నిండి ఉన్నాయి. పట్టుబడుల సమయంలో చెరువుల నీటిని పంట కాలువల్లోకి వదిలివేస్తున్నారు. దీనివల్ల వరి పంటకు తీవ్ర నష్టం వస్తోంది. దాళ్వాలో వరి దిగుబడులు తగ్గే ప్రమాదం ఏర్పడింది. రొయ్యల చెరువు నీటి వల్ల నా పొలంలో వేసిన నారుమడి ఎండిపోయింది. సత్యనారాయణ, రైతు, పెదకాపవరం అనుమతుల్లేకుండానే అనుమతుల్లేకుండానే చేపల చెరువులు తవ్వేస్తున్నారు. కొంతమందే జిల్లా కమిటీ అనుమతి తీసుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా చెరువుల తవ్వకం వల్ల నీటి పారుదల వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. పంట కాలువల్లోకి చెరువుల నీరు వదలకూడదు. అలాంటి వారిపై చర్యలు తప్పవు. కె.శ్రీనివాస్, సూపరింటెండెంట్, నీటిపారుదలశాఖ -

అక్రమాలకు అండ
చెరువులకు గండ్లుకొట్టిన అధికారులు మరునాడే వాటికి అనుమతులు పేట్రేగుతున్న ఆక్వా మాఫియా మామూళ్ల మత్తులో జిల్లాస్థాయి కమిటీ ఆందోళనలో వరి రైతులు సాక్షి ప్రతినిధి, ఏలూరు : అక్రమ చెరువులకు అధికారిక రంగులు అద్దుతున్నారు. దీంతో ఆక్వా మాఫియా చెలరేగిపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా.. ఎలాంటి అనుమతులు లేకుండా తవ్విన అక్రమ చెరువులు తవ్వకాలకు తాము అండగా ఉంటామనే విషయాన్ని అధికారులు అనుమతులు మంజూరు చేయడం ద్వారా స్పష్టంగా చాటుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నిడమర్రు బాడవ ఆయకట్టులో 163 ఎకరాల విస్తీర్ణంలో ఆక్రమంగా చేపల చెరువులు తవ్వారు. వాటికి ఎలాంటి అనుమతులు లేకపోగా.. చెరువల తవ్వకాలు పూర్తయ్యాక అందులో 69.85 ఎకరాలకు 3 దరఖాస్తులు (పీఆర్ఎఫ్ 011700018229 / 011700018228 / 01170018226 ) ఆన్లైన్ చేఃఇరు. ఈ విషయాలను ఆధారాలతో సహా ’సొమ్ములిచ్చుకో.. చెరువు తవ్వుకో’ శీర్షికన గత నెల 16వ తేదీన ’సాక్షి’ కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన తహసీల్దార్ ఎం.సుందర్రాజు సిబ్బందితో కలసి అక్రమ చెరువు గట్లకు యంత్రాలతో తూతూమంత్రంగా గండి కొట్టించారు. అనుమతులు లేకుండా చెరువులు తవ్వడం నిబంధనలకు విరుద్దమని, ఈ చెరువులకు అనుమతులు రావడం చాలా కష్టమని రెవెన్యూ అధికారులే ఆ రోజున చెప్పారు. ఇందుకు భిన్నంగా ఆ మరునాడే.. ఫిబ్రవరి 17న ఒక దరఖాస్తుకు, ఫిబ్రవరి 20న మిగిలిన రెండు దరఖాస్తులకు జిల్లాస్థాయి కమిటీ అధికారి, మత్స్య శాఖ డెప్యూటీ డైరెక్టర్ ఎండీ అబ్దుల్యాకుబ్ బాషా తాత్కాలిక అనుమతులను ఆగమేఘాలపై మంజూరు చేయడం విశేషం. అక్రమ చెరువులు తవ్వుతున్న ఆక్వా మాఫియాకు క్షేత్రస్థాయి నుండి జిల్లాస్థాయి అధికారుల వరకూ మద్దతు ఏమేరకు ఉందనే విషయం దీనిద్వారా స్పష్టమవుతోంది. మరో కోణం ఇదీ ఆక్వా మాఫియా భాగోతం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 100 ఎకరాల సాగు భూమిని చెరువులుగా మార్చాలంటే తొలుత సుమారు 30 నుంచి 40 ఎకరాల్లో మాత్రమే చెరువుల తవ్వకాలకు అనుమతులు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఎకరానికి రూ.10 నుంచి రూ.12 వేల వరుకూ ఖర్చు పెడుతున్నారు. ఆ అనుమతులను ఆధారం చేసుకుని మొత్తం 100 ఎకరాల్లో చెరువు తవ్వకాలు పూర్తి చేస్తున్నారు. ఈ విషయంలో రెవెన్యూ సిబ్బంది అయినకాడికి దండుకుంటున్నారు. తర్వాత క్రమబద్ధీకరణ పేరుతో మిగిలిన 60 ఎకరాలకు ఎకరానికి రూ.వెయ్యి చొప్పున ప్రభుత్వానికి చెల్లించి, మొత్తం 100 ఎకరాల చెరువుకు అధికారిక చెరువులుగా మార్చుకుంటున్నారు. దీనివల్ల మిగిలిన 60 ఎకరాల్లో ఎకరానికి రూ.10 వేల వరకూ మాఫియా మిగుల్చుకుంటోంది. ఇలా ప్రభుత్వ నిబంధనలు అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు మాఫియా కూడగడుతున్నట్టు సమాచారం. ఆన్సైట్ వద్దు.. ఆన్లైన్ ముద్దు చెరువుల అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మండల కమిటీ కనీసం ఆ భూమిని క్షేత్రస్థాయిలో (ఆన్సైట్) పరిశీలించేందుకు రాదు. మామూళ్ల మత్తులో పడి ఆన్లైన్లోనే వచ్చిన దరఖాస్తులకు వారం రోజుల్లో అనుమతులు లభిస్తున్నాయి. కనీస నిబంధనలు పాటించకుండా వ్యవహారమంతా ఆన్లైన్లో ముగిసిపోతోంది. చెరువుల తవ్వకాల విషయంలో సరిహద్దు రైతుల అభ్యంతరాలను సైతం అధికార గణం గాలికి వదిలేస్తోంది. నోటీస్ బోర్డు నిబంధన ఎక్కడ చెరువు తవ్వకాలకు అనుమతి కోరుతూ దరఖాస్తు అందితే సర్వే నంబర్లతో పూర్తి వివరాలను సంబంధిత గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో 15 రోజులపాటు ప్రదర్శించాలి. వాటిపై వచ్చిన అభ్యంతరాలను సమీక్షించాలి. అభ్యంతరాలు ఉంటే జిల్లా కమిటీ దృష్టికి తీసుకెళ్లాలి. ఈ నిబంధనను అధికారులు గాలికి వదిలేసారు. రెండు పంటలు పండే భూమిని చేపల చెరువులుగా మార్చడానికి అనుమతి మంజూరు చేయకూడదు. దీనికి సంబంధించి మండల వ్యవసాయ అధికారులు గడచిన 8 సంవత్సరాల పంట ఉత్పాదకతను ఉదహరించి పంట నష్టం వాటిల్లిన ప్రాంతాల్లో సర్వే నంబర్లకు మండల గణాంకాధికారి నుంచి పంటకోత ప్రయోగంలోని నిష్పత్తులను అనుసరించి తయారు చేసిన నివేదిక ఆధారంగా చెరువుల తవ్వకానికి అనుమతి ఇవ్వాలా వద్దా అనేది నిర్ణయించాల్సి ఉంటుంది. ఈ నిబంధన పాటించకుండానే వ్యవహారం నడిచిపోతోంది. -
మందేసి.. చిందేశారు
చేపల చెరువుల మధ్య రేవ్ పార్టీ పశ్చిమకూ పాకిన నగర సంస్కృతి పోలీసుల కళ్లుగప్పి చాలా రోజులుగా సాగుతున్న వ్యవహారం ఎస్సై చొరవతో పట్టుబడిన యువతీ యువకులు నిడమర్రు పోలీస్ స్టేషన్ వద్ద హైడ్రామా సాక్షి ప్రతినిధి, ఏలూరు : మహా నగరాలు, రిసార్ట్స్‌కే పరిమితమైన రేవ్ పార్టీల సంస్కృతి పల్లెలకూ పాకింది. చేపల చెరువుల మధ్య నిర్మించిన గెస్ట్‌హౌస్‌లు ఈ అశ్లీల నృత్యాలకు వేదికగా మారాయి. దీన్ని ఒక వ్యాపారంగా నిర్వహిస్తున్నట్టు సమాచారం. కొల్లేరు ప్రాంతమైన నిడమర్రు మండలం పత్తేపురం శివారు ఆముదాలపల్లి గ్రామంలో చేపల చెరువుల వద్ద ఓ ప్రైవేట్ గెస్ట్‌హౌస్‌లో నిర్వహిస్తున్న రేవ్ పార్టీపై పోలీసుల దాడి చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పత్తేపురానికి చెందిన తాడేపల్లిగూడెం వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు చింతలపాటి చినమూర్తిరాజుకు ఆముదాలపల్లిలో చేపల చెరువుల వద్ద గెస్ట్‌హౌస్ ఉంది. అందులో జిల్లాలోని ఓ సామాజిక వర్గంకు చెందిన యువకులు రేవ్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం, విజయవాడకు చెందిన యువకులు ఇందులో పాల్గొన్నారు. పోలీసుల దాడి జరపగా 16 మంది విటులు, 10 మంది యువతులు పట్టుబడ్డారు. ఈ దాడిలో భీమవరం పట్టణానికి చెందిన క్రికెట్ బుకీ, తాడేపల్లిగూడెంకు చెందిన ఓ ప్రముఖ బంగారం దుకాణం యజమాని కుమారుడు ఉన్నారు. గెస్ట్‌హౌస్‌లోని గదుల్లో కండోం ప్యాకెట్లు, మద్యం బాటిల్స్ కనిపించాయి. పోలీసులు గెస్ట్‌హౌస్‌ను తమ అధీనంలోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ నిర్వహించిన గెస్ట్‌హౌస్ యజమాని చింతలపాటి చినమూర్తిరాజు, చింతలపాటి గిరిరాజుపై కూడా కేసు నమోదు చేశారు. వీరిద్దరిని కేసు నుంచి తప్పించేందుకు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు. పోలీసులు మాత్రం అందుకు అంగీకరించలేదు. 15 రోజులకు ఒకసారి ఇక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. చేపల చెరువుల మధ్యన దూరంగా ఈ ప్రాంతం ఉండటంతో పోలీసులు ఇక్కడికి రావడం సాధ్యం కాదనే ఉద్దేశంతో కొంతకాలంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. నిడమర్రు పోలీస్ స్టేషన్లో హైడ్రామా నిడమర్రు పోలీస్ స్టేషన్ వద్ద ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకూ హైడ్రామా జరిగింది. విషయం తెలిసిన వెంటనే మీడియా ప్రతినిధులు నిడమర్రు స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే, పట్టుబడిన వారిని చూపించేందుకు పోలీసు అధికారులు నిరాకరించారు. ఒక గంటలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తామని.. ఆ తరువాత ఏలూరులో సమావేశం పెడతామని పోలీసులు గంటకో మాట చెబుతూ వచ్చారు. చివరకు పట్టుబడిన 26 మందిని నాలుగు వాహనాల్లో ఏలూరు తరలించారు. వారికి నిడమర్రు పోలీస్ స్టేషన్లో అన్ని మర్యాదలూ జరిగాయి. 16 మంది విటులు బయటకు వచ్చే సమయంలో పోలీస్ సిబ్బంది వారికి పేపర్లు ఇచ్చి మొహాలకు అడ్డం పెట్టుకోమని చెప్పారు. ఆ తరువాత వారిని ఏలూరులో మీడియాకు చూపించి స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన యువతులను ఏలూరులోని స్వధార్ హోమ్‌కు తరలించారు.