Adarsh nagar
-
కరీంనగర్ లోని ఆదర్శ నగర్ లో అగ్నిప్రమాదం
-
బీచ్ కి వెళ్లిన కోడలు.. ఇంటికి తిరిగొచ్చేసరికి షాక్ ఇచ్చిన అత్తామామలు
-
ముసుగులు.. గ్యాస్‌కట్టర్లు.. మారణాయుధాలు!
సాక్షి, ఆరిలోవ (విశాఖ తూర్పు): ముఖాలకు ముసుగులు... ఒకరితో ఒకరికి పరిచయమే లేని ఓ పది మంది... గ్యాస్‌కట్టర్లు, మారణాయుధాలు... వాటితో విశాఖలోని ఓ బ్యాంక్‌లోకి ప్రవేశించిన దుండగులు... ఆ బ్యాంక్‌ను కొల్లగొట్టి రూ.500ల కోట్లు దోచేస్తారు... ఇదీ ఓ తెలుగు సినిమాలోని సన్నివేశం. అచ్చం అలా సినీ ఫక్కీలోనే నగర శివారులోని ఓ ఏటీఎం కేంద్రాన్ని కొల్లగొట్టేసి రూ.9.6లక్షలు దోచేశారు అగంతకులు. నగరంలో సంచలనం రేపిన ఈ ఘటన జీవీఎంసీ 10వ వార్డు పరిధి ఆదర్శనగర్ ప్రాంతం సుందర్‌నగర్ ప్రధాన రహదారి పక్కన గల ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలో బుధవారం రాత్రి జరిగింది. ఇంతవరకు ఇలాంటి రీతిలో నగరంలో ఎన్నడూ దొంగతనం జరగలేదని పోలీసులే ఆశ్చర్యపోతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చదవండి: బంగారం, బైక్ ఇవ్వాల్సిందే.. మనస్తాపంతో.. పక్కా ప్రణాళికతో ప్రవేశించి... ఆదర్శనగర్ సమీప సుందర్‌నగర్ ప్రధాన రహదారి రాత్రి పది గంటల తర్వాత ఎప్పుడూ నిర్మాణుష్యంగా ఉంటుంది. పెద్దగా జనసంచారం ఉండదని భావించిన దుండగులు ఇక్కడి ఎస్బీఐ ఏటీఎం కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ముందస్తు ప్రణాళికతో గ్యాస్ సిలిండర్లు (ఒకటి పెద్దది, ఇంకొకటి చిన్నది), కట్టర్లు, గుణపంతో కేంద్రంలోకి బుధవారం అర్ధరాత్రి సమయంలో చేరుకున్నారు. లోపల ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియకుండా షట్టర్ దించేశారు. అక్కడి సీసీ కెమెరాల కనెక్షన్ కూడా కట్ చేసేశారు. గ్యాస్ ఉపయోగించి కట్టర్ల సాయంతో నగదు ఉండే మిషన్‌ను కోసేశారు. అనంతరం దాన్ని పగులగొట్టి అందులోని సుమారు రూ.9.60 లక్షలు దోచుకుపోయారు. గ్యాస్ కట్టర్‌తో కోసే సమయంలో రేగిన నిప్పు రవ్వలకు కొన్ని రూ.500ల నోట్లు కాలిపోవడంతో వాటిని అక్కడే వదిలేశారు. దోపిడీ కోసం వెంట తీసుకొచ్చిన సామాగ్రి మాత్రం కేంద్రంలో విడిచిపెట్టేసి వెళ్లిపోయారు. చదవండి: కరోనాతో భర్త.. బంగ్లాపై నుంచి దూకి భార్య! దొంగలు ఉపయోగించిన గ్యాస్ సిలిండర్లు, కట్టర్లు డబ్బులు నింపిన మూడు రోజులకే చోరీ సుందర్‌నగర్‌లోని ఏటీఎం కేంద్రంలో ఎప్పుడూ డబ్బులు అందుబాటులో ఉండేవి కాదని స్థానికులు చెబుతున్నారు. ఈ సారి మాత్రం అధికారులు మిషన్‌లో డబ్బులు నింపిన మూడు రోజులకే చోరీకి గురయ్యాయని అంటున్నారు. ఇక్కడి మిషన్‌లో నగదు నింపిన విషయం వినియోగదారులకూ తెలియదని, దొంగలకు మాత్రం బాగానే తెలిసిందని అంటున్నారు. ఈ చోరీకి ఇంటిదొంగల సహకారం ఏమైనా ఉందా అని పలువురు అనుమానిస్తున్నారు. మరోవైపు కొన్ని నెలల నుంచి ఇక్కడి సీసీ కెమెరాలు కూడా పని చేయకపోవడంతో దొంగలు గుట్టుగా చక్కబెట్టేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్యాస్ కట్టర్లు, సిలిండర్లు, గుణపం తీసుకొచ్చి చోరీ చేశారంటే కరుడుగట్టిన ముఠా పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఇంత సరంజామా తీసుకొచ్చి ఏటీఎం కేంద్రంలో చోరీ చేసేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతుందని.., అప్పటి వరకూ నైట్æరౌండ్స్ డ్యూటీలో ఉన్న ఆరిలోవ పోలీసులు ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ ఏటీఎం కేంద్రం వైపు తిరగలేదా..? తిరిగితే వారు దీన్ని పరిశీలించలేదా..? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వస్తున్నాయి. ఏటీఎం కేంద్రం వద్ద చోరీ వివరాలు తెలుసుకొంటున్న క్రైం డీసీపీ సురేబాబు ఈ తరహా దోపిడీ నగరంలో తొలిసారి స్థానికుల సమాచారంతో గురువారం ఉదయం విషయం తెలుసుకొన్న ఆరిలోవ పోలీసులు సుందర్‌నగర్‌లోని ఏటీఎం కేంద్రం వద్దకు చేరుకొన్నారు. లోపల చిందరవందరగా ఉన్న మిషన్‌ను పరిశీలించిన సీఐ ఇమ్మాన్యుయేల్ రాజు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వెంటనే క్రైం డీసీపీ సురేష్ బాబు, క్రైం ఏసీపీ పెంటారావు, సీఐలు, ఎస్ఐలు అక్కడకు చేరుకొన్నారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు. దొంగతనం జరిగిన విధానం పరిశీలించారు. ఈ సందర్భంగా క్రైం డీసీపీ సురేష్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ ఈ తరహాలో నగరంలోని ఏటీఎం కేంద్రాల్లో దొంగతనం జరగడం ఇదే తొలిసారన్నారు. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఓ వ్యక్తి ఈ ఏటీఎం కేంద్రానికి వచ్చాడని.., డబ్బులు రాకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడన్నారు. ఆ తర్వాత గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి డబ్బులు ఎత్తుకుపోయారని తెలిపారు. మూడు రోజుల క్రితమే ఎస్బీఐ సిబ్బంది మిషన్‌లో డబ్బులు నింపారని.., ఆ విషయం తెలిసిన వారు రెక్కీ నిర్వహించి దోచేశారని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించామని, సాధ్యమైనంత త్వరలో దొంగలను పట్టుకొంటామని పేర్కొన్నారు. -
అంతరిక్ష విజయాలు దేశానికి గర్వకారణం
గన్ ఫౌండ్రీ: ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా, రష్యాలను అధిగమించి ఎన్నో విజయాలు సాధించడం భారత దేశానికి గర్వ కారణమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం ఆదర్శ్ నగర్‌లోని బీఎం బిర్లా సైన్స్ సెంటర్లో ఇండియన్స్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శ్రీహరికోట, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, బిర్లా సైన్స్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అంతరిక్షంలో చోటు చేసుకుంటున్న మార్పులను నేటి తరం విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. ఇటీవల విజయాలు అందించిన శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. అనంతరం రాకెట్ల తయారీ, సోలార్ వినియోగం, రాకెట్ లాంచ్ ల పనితీరుపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో విద్యార్థులకు వివరించారు. అంతకు ముందు ఇస్రో బృందం తయారు చేసిన వాటర్ బాటిల్ రాకెట్ లాంచ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. క్విజ్, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఇస్రో ప్రాజెక్ట్ డైరెక్టర్ సెల్వరాజ్, ఇస్రో డిజిఎం టిఎస్ రఘురామ్, శాస్త్రవేత్త కె. సునీల్, పలు కళాశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. -
చోరీకి వచ్చి చంపేశారు!
* మహిళ మరణంపై అనుమానాలు * రూ.50 వేలు, 13 కాసుల బంగారం చోరీ ఆకివీడు : ఆకివీడులో ఓ మహిళ వంటింట్లో కాలిపోయి మరణించండంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది దుండగులపనే అయి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. బీరువాలో నగలు, నగదు మాయం కావడంతో ఎవరో చోరీకి వచ్చి హత్యచేసి ఉంటారని పేర్కొంటున్నారు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. స్థానిక ప్రధాన సెంటర్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఆదర్శ నగర్ కాలనీలో వేగేశ్న వెంకట్రాజు, అతని భార్య భాగ్యలక్ష్మి(56) నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం వెంకట్రాజు చేపలచెరువుల దగ్గరకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో వంటగదిలో వాసన రావడంతో అక్కడికి వెళ్లి చూడగా భార్య భాగ్యలక్ష్మి శరీరం కాలిపోయి చనిపోయి బోర్లా పడి ఉంది. దీంతో అతను వెంటనే కుమారులు రామరాజు, నాగరాజుకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి గ్యాస్‌లీక్ వల్ల ప్రమాదం సంభవించి ఉంటుందని భావించి దహనసంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకుని ఏఎస్ఐ శ్రీనివాస్ రాగా, గ్యాస్ లీక్ అని చెప్పి పంపేశారు. అంత్యక్రియల సమయంలో నోట్లో బంగారం పెట్టే ఆచారం ఉండడంతో కుటుంబసభ్యులు ఇంట్లోని బీరువా తెరిచి బంగారం కోసం చూశారు. అందులో 13 కాసుల బంగారం, రూ.50వేల నగదు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఎస్ఐ అశోక్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భీమవరం రూరల్ సీఐ జయసూర్యకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి ముందుగా విషయం తెలిసినప్పుడు ఇంటిని ఎందుకు తనిఖీ చేయలేదని సిబ్బందిపై మండిపడ్డారు. ఇంటిని నీటితో కడిగేశారని, ఇప్పుడు వేలిముద్రలు ఎలా దొరుకుతాయని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలిముద్ర నిపుణులు, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించారు. మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. బీరువాలో నగలు, నగదు మాయం కావడాన్ని బట్టి ఇది హత్యేనని అనుమానిస్తున్నట్టు చెప్పారు. అన్నికోణాల్లో విచారణ చేపడతామని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు. మద్యం సీసా లభ్యం వంటగదిలో మద్యం సీసా లభించడం పోలీసుల అనుమానానికి బలం చేకూరుస్తోంది. వెంకట్రాజుకు మద్యం తాగే అలవాటు లేదు. అలాంటప్పుడు మద్యం సీసా వంటగదిలోకి ఎలా వచ్చిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. భాగ్యలక్ష్మి పీకనొక్కి ఆ తర్వాత మద్యం శరీరంపై పోసి నిప్పంటించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారం కోసం మహిళ దారుణహత్య
ఆకివీడు (పశ్చిమ గోదావరి) : బంగారం కోసం ఓ మహిళను దారుణంగా హతమార్చిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండల కేంద్రంలోని ఆదర్శనగర్‌లో సోమవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న భాగ్యలక్ష్మి(52) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి ఆమెను హతమార్చి మెడలోని 10 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఇంట్లో ఉన్న రూ.50 వేలు ఎత్తుకెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ఆమె భర్త వెంకటరెడ్డి వంటగదిలోకి వచ్చి చూసేసరికి మృతదేహమై పడి ఉంది. ఇది గమనించిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేసి బంగారం కోసమే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు.