బంగారం కోసం మహిళ దారుణహత్య | Woman murdered | Sakshi
Sakshi News home page

బంగారం కోసం మహిళ దారుణహత్య

Published Mon, Apr 18 2016 7:10 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

Woman murdered

ఆకివీడు (పశ్చిమ గోదావరి) : బంగారం కోసం ఓ మహిళను దారుణంగా హతమార్చిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండల కేంద్రంలోని ఆదర్శనగర్‌లో సోమవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న భాగ్యలక్ష్మి(52) ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి ఆమెను హతమార్చి మెడలోని 10 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఇంట్లో ఉన్న రూ.50 వేలు ఎత్తుకెళ్లారు. 
 
మధ్యాహ్నం ఇంటికి వచ్చిన ఆమె భర్త వెంకటరెడ్డి వంటగదిలోకి వచ్చి చూసేసరికి మృతదేహమై పడి ఉంది. ఇది గమనించిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేసి బంగారం కోసమే హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement