Adavidevulapalli
-
భయం..భయం
సాక్షి, అడవిదేవులపల్లి (మిర్యాలగూడ) : అధికారుల నిర్లక్ష్యం, ప్రజా ప్రతినిధుల అలసత్వం ప్రజల పాలిట శాపంగా మారింది. అడవిదేవులపల్లి మండలం చిట్యాల, నడిగడ్డ, జాలికోటతండా, చింతలపాలెంలో టెయిల్‌పాండ్ బ్యాక్ వాటర్ గ్రామ పరిసరాల్లోకి వస్తుండటంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని ఇళ్లలోకి తరుచూ మొసళ్లు, విష సర్పాలు వస్తున్నాయి.దీంతో ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. రాత్రి వేళల్లో బయటకు రావాలంటే భయపడుతున్నారు. దాంతో తమకు పునరావాసం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు గుర్తించిన ఇళ్లు ఇవే టెయిల్‌పాండ్ బ్యాక్ వాటర్‌కు 100 మీటర్ల పరిధిలో ఉన్న ఇళ్లను జెన్కో, రెవెన్యూ అధికారులు గతంలో గుర్తించారు. పలు సర్వేలు, గ్రామ సభల అనంతరం గుర్తింపు ప్రక్రియను పూర్తి చేశారు. చిట్యాలలో మొత్తం 225 ఇళ్లు ఉండగా వీటిలో 167, నడిగడ్డలో 91 ఇళ్లకు 46, జాలికోట తండాలో 65కు ఏడు, చింతలపాలెంలో 450 ఇళ్లకు ఏడు ఇళ్లు ముంపునకు గురవుతున్నాయని అధికారులు తేల్చారు. ఈ గృహాలకే ఆర్ఆర్ ప్యాకేజీని వర్తింప జేస్తామని చెప్పారు. అయితే గ్రామస్తులు మాత్రం గ్రామం మొత్తాన్ని ముంపు ప్రాంతంగా ప్రకటించి అందరికీ పునరావాసం కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పునరావాసం కల్పించాలి టెయిల్‌పాండ్ బ్యాక్ వాటర్‌తో భయపడుతున్నాం. దీంతో పాటుగా గ్రామంలోకి తరుచూ మొసళ్లు, విషసర్పాలు వస్తున్నాయి. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా పునరావాసం కల్పించాలి. – జానపాటి మస్తాన్, చిట్యాల -
అడవిదేవులపల్లి మండలం కోసం యువకుడి ఆత్మహత్యాయత్నం
అడవిదేవులపల్లి (దామరచర్ల) : మండలంలోని అడవిదేవులపల్లిని మండల కేంద్రం చేయకపోవడాన్ని నిరసిస్తూ గ్రామానికి చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గురువారం గ్రామంలో అఖిలపక్షాలు చేపట్టిన దీక్షలు 15వ రోజుకు చేరుకున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం మండల కేంద్రం చేయక పోవడంతో మనస్తాపానికి గురైన దేవతల సైదయ్య(25) అనే యువకుడు దీక్షవద్ద పురుగుల మందు తాగాడు. దీనిని గమనించిన గ్రామస్తులు వెంటనే చికిత్స కోసం గ్రామంలో ఉన్న ఓప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడిని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి పరామర్శించారు. అనంతరం దీక్ష సభా స్థలం వద్ద జూలకంటి మాట్లాడారు. అన్ని అర్హతలున్న అడవిదేవులపల్లిని మండల కేంద్రం చేయక పోవడం అన్యాయమన్నారు. మండల కేంద్రం కోసం చేస్తున్న ఉద్యమాలకు తమ పార్టీ మద్దతు ఉంటుందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని, పోరాటాల ద్వారానే మండల కేంద్రం సాధించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు మల్లేశ్, జగదీశ్వర్‌రెడ్డి,చంద్రశేఖర్‌యాదవ్,పాపానాయక్,వినోద్,సైదులు, మద్దెలశ్రవన్,బండి నాగేశ్వరావు,మున్నా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -

అడవిదేవులపల్లిని మండలం చేయాలని తీర్మానం
దామరచర్ల : మండలంలోని అడవిదేవులపల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని జెడ్పీటీసీ కేతావత్ శంకర్ నాయక్ చేసిన తీర్మానాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. శనివారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కురాకుల మంగమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జెడ్పీటీసీ తీర్మానం ప్రవేశ పెడుతూ అడవిదేవులపల్లిని మండల కేంద్రం చేస్తే 10 గ్రామ పంచాయతీలు, 35 గిరిజన తండాలకు అనుకూలంగా ఉంటుందన్నారు. దీన్ని సభ్యులందరూ బలపరిచారు. సమావేశానికి పలువురు అధికారులు రాకపోవడంపై సర్పంచ్‌లు లింగానాయక్, ముత్తయ్య, శ్రీనివాస్‌నాయక్, ఎంపీటీసీ కన్నెలాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు ఎవరికి విన్నవించాలని.. సమావేశానికి రానివారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్వాకం వల్లే కార్పొరేషన్ల రుణాల లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని జెడ్పీటీసీ శంకర్‌నాయక్, ఎంపీటీసీలు బాలునాయక్, ఖాసీం, సింగిల్‌విండో చైర్మన్ నారాయణరెడ్డి ఆరోపించారు. అర్హులైన వారికి న్యాయం చేయాలన్నారు. వేసవిలో నీటి సరఫరాచేసిన బిల్లులు వెంటనే ఇప్పించాలని సర్పంచ్ బాలునాయక్, ఎంపీటీసీ కిషన్ నాయక్ కోరారు. సమావేశంలో వైస్ ఎంపీపీ కొందూటి మాధవి సిద్ధయ్య, తహసీల్దార్ గణేష్, ఎంపీడీఓ ఉమాదేవి, ఏఈ ఆదినారాయణ, ఎంఈఓ మంగ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -

నిర్వాసితులందరికీ పరిహారం ఇవ్వాలి
అడవిదేవులపల్లి (దామరచర్ల) : నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ కింద భూములు కోల్పోయిన నిర్వాసితులందరికీ పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న పాదయాత్ర గురువారం ముగిసింది. ఈ సందర్భంగా నడిగడ్డ, టెయిల్ పాండ్ల వద్ద జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. భూముల రకాలతో నిమిత్తం లేకుండా 2013 చట్టం ప్రకారం నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లించాలని కోరారు. రైతులకు అన్యాయం జరిగితే పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల పక్షాన సప్రీం కోర్టుకు సైతం వెళ్తామన్నారు. భూములు కోల్పోయిన కుటుంబాలన్నింటికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ టెయిల్ పాండ్ నిర్మాణంతో 8 ఎత్తిపోతల పథకాలు నీట మునగనున్నాయన్నారు. వీటి కింద ఉన్న 5 వేల ఎకరాలు ఎండి పోయే ప్రమాదముందన్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నయ చర్యలు చేపట్టాలని కోరారు. ముంపునకు గురయ్యే చిట్యాల, నడిగడ్డ, చింతలపాలెం, జమ్మికోట తండా వాసులకు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. టెయిల్ పాండ్ జెన్కో ఎస్ఈ కుమార్ మాట్లాడుతూ సమస్య తీవ్రతను గుర్తించామని, ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధీరావత్ రవినాయక్, జిల్లా అధ్యక్షుడు పాపానాయక్,ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొప్పని పద్మ, మల్లు లక్ష్మి, రైతు సంఘం నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్ యాదవ్, నాగిరెడ్డి, కత్తి లింగారెడ్డి, ఇంద్రారెడ్డి, ఎర్రానాయక్, మాజీ సర్పంచ్ కురాకుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.