advance elections
-
తెలంగాణలో ముందస్తు ఎన్నికలొచ్చే అవకాశం ఉంది: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగితే టీఆర్ఎస్ పని ఖతం అవుతుందని అన్నారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరేందుకు కసరత్తు నడుస్తోందని తెలిపారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రపతి పాలనలోనే నిర్వహించాలని కోరతామని తెలిపారు. -
ముందస్తుపై చర్చ నిజమే
సాక్షి, న్యూఢిల్లీ: ముందస్తు ఎన్నికలపై చర్చ నిజమేనని, ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదని టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. అయితే ఇందుకు ఎలాంటి ముహూర్తాలు పెట్టలేద ని, కేవలం మీడియాలోనే కల్పిస్తున్నారని పేర్కొ న్నారు. అసెంబ్లీ రద్దయితే ఎన్నికలు ఎప్పుడు ఉంటాయనే అంశం ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుందని అన్నారు. అసెంబ్లీ రద్దయితే ఆరు నెలల్లోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఇది స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో బూర నర్సయ్యగౌడ్‌తో కలసి వినోద్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘‘ముందస్తు ఎన్నికలపై చర్చలు జరుగుతున్న మాట నిజమే. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర కేబినెట్ ఆలోచించి అసెంబ్లీని రద్దుచేయాలనుకుంటే చేయొచ్చు.. కానీ ఎన్నికలను ఎప్పుడు పెట్టుకోవాలన్న నిర్ణయం మాత్రం ఎన్నికల కమిషన్‌దే. మేం ప్రధానమంత్రిని కలసినా, హోం మంత్రిని కలసినా, ఇంకెవరిని కలసినా తెలంగాణ రాష్ట్ర సమస్యలపైన మాత్రమే కలుస్తున్నాం. నాలుగేళ్లుగా ఇదే చేస్తున్నాం’’అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 28 గడువు వచ్చే నెలలో శాసనసభ సమావేశాలు ఉంటాయా? లేక అంతకుముందే అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నలకు వినోద్ సమాధానమిస్తూ ‘‘తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరగడానికి ఆరు నెలల గడువు ఈ సెప్టెంబర్ 28తో ముగుస్తుంది. ఆ లోపు శాసనసభ సమావేశం జరపాలి. లేదా అంతకుముందుగానే అసెంబ్లీ రద్దు కు కేబినెట్ నిర్ణయం తీసుకుంటే అసెంబ్లీ రద్దవుతుంది’’అని వివరించారు. . 6 నెలల్లోపు ఎన్నికలు జరపాల్సిందే అసెంబ్లీ రద్దు చేసినా ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధనేదీ లేదని.. అసెంబ్లీ గడువు ఉన్నంత వరకూ ఎన్నికలను పొడిగించవచ్చన్న అభి ప్రాయంపై వినోద్ స్పందిస్తూ ‘‘తప్పనిసరిగా అసెంబ్లీ రద్దయిన 6 నెలల్లోపు ఎన్నికలు జరపాలి. ఇది గుజరాత్ కేసులో సుప్రీంకోర్టు చెప్పిన విషయం. అసెంబ్లీ రద్దయినప్పుడు అప్పటివరకు మెజారిటీ ఉన్న ప్రభుత్వాన్ని ఆపద్ధర్మ ప్రభుత్వంగా కొనసాగించాలని కరుణానిధి కేసులో సుప్రీం చెప్పింది. వాటిపై మాకు స్పష్టత ఉంది’’అని వివరించారు. ఈసీ ప్రతిపాదనకు టీఆర్ఎస్ ఓకే: వినోద్ పార్టీ పరంగా ఏర్పాటు చేసే వివిధ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు కేటాయించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనను టీఆర్ఎస్ పార్టీ సమ్మతిస్తుందని ఎంపీ వినోద్‌కుమార్ తెలిపారు. ఎన్నికల సంస్కరణలపై కేంద్ర ఎన్నికల సం ఘం సోమవారం ఢిల్లీలో జాతీయ, ప్రాంతీయ పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసి పలు ప్రతిపాదనలపై ఆయా పార్టీల అభిప్రాయాలను తెలుసుకోనుంది. దీనిపై ఆదివారం ఢిల్లీలో వినోద్ మాట్లాడుతూ.. పార్టీలో మహిళలకు తగిన ప్రా« దాన్యం కల్పించాలని ఈసీ చేసిన ప్రతిపాదనను టీఆర్ఎస్ సమ్మతిస్తుందని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చులపై పరిమితులున్నాయని, అయితే ఎమ్మెల్సీ అభ్యర్థు లకు పరిమితులు లేని నేపథ్యంలో వీటిపై కూడా పరిమితులు విధించే అంశమై ఈసీ అభిప్రాయం కోరిందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులపైనే కాకుండా రాజకీయ పార్టీల ఖర్చులపై కూడా పరిమితి విధించే ప్రతిపాదన చేసిం దని వెల్లడించారు. అలాగే ఓటర్ల నమోదును నిర్దిష్ట కాలంలోనే కాకుండా ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిరంతరాయంగా నమోదు ప్రక్రియ జరిగేలా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయండంపై అభిప్రాయం కోరిందన్నారు. వీటన్నింటిపై సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని ఆయన తెలిపారు. -
ముందేనా!
♦ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల శకునాలు ♦ ‘ఉప’ గెలుపుతో కాంగ్రెస్‌లో ఊపు ♦ సై అంటున్న బీజేపీ ♦ జేడీఎస్‌కు దగ్గరగా హస్తం షెడ్యూల్ ప్రకారమైతే 2018 మే లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. కానీ వేసవితో సంబంధం లేకుండా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏడాది వరకు ఆగడం కంటే ముందే ఎదురెళ్లి అధికార కాంతను వరిద్దామని కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష బీజేపీ రెడీ అవుతున్నాయని తెలుస్తోంది. సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల కసరత్తు జరుగుతోందా? ఇందుకు పార్టీలకు అతీతంగా నాయకులందరూ సిద్ధమవుతున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఉప ఎన్నికల ఫలితాలతో ఈ దిశగా రాష్ట్ర రాజకీయాలు ప్రయాణిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గుండ్లుపేట, నంజనగూడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అనూహ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసిన విషయం తెలిసిందే. దీంతో హస్తం నాయకులు ముఖ్యంగా సీఎం సిద్ధరామయ్య మంచి ఊపు మీద ఉన్నారు. రానున్న శాసనసభ ఎన్నికలకు సెమీఫైనల్ లాంటి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారాన్ని ఆయనే నడిపించారు. ఫలితాలతో... తమ సర్కారుపై అంత ప్రజా వ్యతిరేకత లేదని తేలినట్లు కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీంతో రానున్న శాసనసభ ఎన్నికల్లో గెలుపుతో మళ్లీ అధికారం తథ్యమని ఆశిస్తోంది. ఈ క్రమంలోనే గతంలో తాను వచ్చే ఎన్నికల నుంచి తప్పుకోనున్నట్లు చెప్పిన సిద్ధరామయ్య తిరిగి ఎన్నికల బరిలో దిగుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా తానే సీఎం అని ప్రకటించుకున్నారు. అధిష్టానం అంగీకరిస్తే 2018 మే పోలింగ్‌కు బదులుగా ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులోనే సిద్ధు శాసనసభను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లవచ్చని విశ్లేషకుల భావన. పీసీసీ పీఠానికి డిమాండ్ ఇక ముందస్తు ఎన్నికల వ్యూహాలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్‌లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఎప్పుడూ లేని విధంగా తీవ్ర పై పోటీ నెలకొంది. ‘టికెట్ల పంపకం సమయంలో అన్ని విధాలుగా లాభపడవచ్చు’ అన్న విషయం ఇందుకు ప్రధాన కారణం. ముఖ్యంగా పీసీసీ చీఫ్‌గా ఆరేళ్లు పూర్తి చేసిన పరమేశ్వర్ ఇంకా కొనసాగడానికి అవసరమైతే హోం మంత్రి పదవికి రాజీనామాకు సిద్ధమని చెప్పడం గమనార్హం. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఇలాంటి పరిణామాలు ముందస్తు ఎన్నికలు రావచ్చొనదానికి సంకేతమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కమలనాథుల కసరత్తు భారతీయ జనతా పార్టీకి దక్షిణ పథాన బలం ఉన్న రాష్ట్ర కర్ణాటకనే. ఒకటి రెండుసార్లు అధికార పీఠం చేపట్టింది కూడా. ఈసారి పూర్తిబలంతో ఉత్తరప్రదేశ్ తరహాలో కైవసం చేసుకోవాలని బీజేపీ అధినాయకత్వం పావులు కదుపుతోంది. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలకు ఆరునెలల ముందు పంచాయతీ స్థాయిల్లో పార్టీ పరిస్థితి పై రహస్య నివేదికను పార్టీ అధినేత అమిత్‌షా తెప్పించుకున్నారు. అదే ఇక్కడా చేస్తున్నారు. చివరికి బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్పకు కూడా సదరు సమాచారం చేరకూడదన్న కఠిన ఆదేశాలతో పార్టీ స్థితిపై నివేదిక సిద్ధం అవుతోంది. స్థానిక నాయకుల ద్వారా వచ్చే ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇవ్వొచ్చో, ఇప్పటి వరకూ స్థానికంగా పార్టీ పటిష్టత కోసం కృషి చేసిన నాయకులు 30 పాయింట్ల నివేదికను ప్రతి గ్రామ పంచాయతీ నుంచి తెప్పించుకుంటున్నారు. ఇక ముందుస్తు ఎన్నికలు వస్తాయన్న ఉద్దేశంతోనే ఇతర పార్టీలకు చెందిన చాలా మంది విపక్షబీజేపీలోకి చేరి రానున్న ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడుతున్నారు.కాంగ్రెస్, బీజేపీలు రెండు సోషల్ మీడియాలోనూ ముమ్మర ప్రచారం చేపట్టాయి. జేడీఎస్‌తో కాంగ్రెస్ దోస్తీ శత్రువుకు శత్రువు మిత్రుడన్న విషయం తెలిసిందే. బీజేపీ అంటే పడని జేడీఎస్‌తో కాంగ్రెస్ సఖ్యత కనబరుస్తోంది. రాజకీయ వైషమ్యాలను పక్కనపెట్టి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, జేడీఎస్ జాతీయాధ్యక్షుడు దేవెగౌడలు ఇప్పటికే రెండుసార్లు చర్చించినట్లు సమాచారం. అభ్యర్థుల జాబితాను మరో నెలరోజుల్లోపు విడుదల చేయనున్నట్లు జేడీఎస్ చెప్పడానికి కారణం ముందస్తు ఎన్నికలను ఊహించబట్టే. 2018లో రావాల్సిన అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఆఖరుకు వచ్చినా ఆశ్చర్యంలేదని తెలుస్తోంది. -
అధికార పార్టీ ఆశ్చర్యకర నిర్ణయం??
ముందస్తు ఎన్నికలకు సై! బెంగళూరు: కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌లను విస్మయంలో ముంచెత్తబోతుందా? వచ్చే ఏడాది మేలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఉండగా.. ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లేందుకు హస్తం సిద్ధమవుతోందా? అంటే విశ్వసనీయంగా ఔననే వినిపిస్తోంది. పైకిమాత్రం కాంగ్రెస్ పార్టీ ఈ ఊహాగానాలను తోసిపుచ్చుతున్నా.. బీజేపీ సీనియర్ నేతలు, ప్రతిపక్షాలు మాత్రం అందుకు అవకాశముందని చెప్తున్నారు. ఐదేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాతే ఎన్నికలకు వెళుతామని తాజాగా కర్ణాటక పీసీసీ చీఫ్ దినేశ్ గుండురావు చెప్పారు. 2014 ఏప్రిల్‌లో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అప్పటి సీఎం ఎస్ఎం కృష్ణ ముందస్తు ఎన్నికలకు వెళ్లి భంగపడ్డారు. ఇప్పుడు ముందస్తుకు వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ వెనుకాడేందుకు ఇది ఒక కారణమని చెప్పేవారూ లేకపోలేదు. అయితే, ఇటీవల ప్రధాని మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్ మీద అధికంగా ఫోకస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్లో జరగాల్సిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను జూలై నుంచి సెప్టెంబర్ నెలలో ముందస్తుగా జరిపే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు ఎన్నికలకు సీఎం సిద్దరామయ్యను ఒప్పించేందుకు కాంగ్రెస్‌లోని ఓ బలమైన వర్గం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఏకకాలంలో గుజరాత్, ఒడిశా ఎన్నికలకు బీజేపీ చీఫ్ అమిత్‌షా తీవ్రంగా వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో కర్ణాటకలోనూ ముందస్తు ఎన్నికలకు సిద్ధపడితే.. కమలానికి షాక్ ఇచ్చినట్టు అవుతుందని ఆయా నేతలు సీఎంకు నూరిపోస్తున్నారు. గుజరాత్, ఒడిశా ఎన్నికలతో షా తీరికలేకుండా ఉన్న సమయంలోనే కర్ణాటకలో ఎన్నికలకు వెళితే.. అప్పుడు బీజేపీకి ముందస్తు వ్యూహరచనకు, ప్రచారానికి తగినంత వెసులుబాటు ఉండదని వారు చెప్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవల జరిగిన నంజనగూడ, గుండ్లుపేట ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల విజయం ఊపులోనే ముందస్తు ఎన్నికలకు వెళితే పార్టీకి కలిసి వస్తుందని, పార్టీ శ్రేణులు కూడా మరింత ఉత్సాహంతో పనిచేస్తారంటూ కాంగ్రెస్ నేతలు సీఎంను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కర్ణాటకలో ముందస్తు ఎన్నికలకు అవకాశం కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.