
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగితే టీఆర్‌ఎస్ పని ఖతం అవుతుందని అన్నారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరేందుకు కసరత్తు నడుస్తోందని తెలిపారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రపతి పాలనలోనే నిర్వహించాలని కోరతామని తెలిపారు.