విమ్స్‌లో అత్యాధునిక వైద్య పరికరాలు
వైద్య నిపుణుల సూచనలు
కేజీహెచ్‌ను సందర్శించిన వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి
విశాఖపట్నం- మెడికల్: కింగ్ జార్జి ఆస్పత్రిలో లేని వైద్య విభాగాలు, అత్యాధునిక వైద్య పరికరాలను త్వరలో ప్రారంభించనున్న విమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేయాలని ఆంధ్ర వైద్య కళాశాల వైద్య నిపుణులు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యంకు సూచిం చారు. ఆయన గురువారం ఆంధ్ర వైద్య కళాశాల, కేజీహెచ్, ఆర్సీడీ ఆస్పత్రులను సందర్శించారు.
ఈ సందర్భంగా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ చాంబర్లో పలు విభాగాల అధిపతులతో సమావేశమై విమ్స్ ఆస్పత్రిని ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా వైద్య నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించారు. విమ్స్‌ను దశలవారీగా అభివృద్ధి చేయాలని వైద్యులు ఈ సందర్భంగా ఆయనకు సూచించారు.
తొలిదశలో న్యూరో సెన్సైస్స్, అవయవమార్పిడి వైద్య విభాగాలను అభివృద్ధి చేస్తే బాగుం టుందని అభిప్రాయపడ్డారు. అవయవమార్పిడి వైద్యానికి అవసరమైన అవకాశాలను, సదుపాయాలను లోతుగా చర్చించారు. గుండె, కాలేయం, కిడ్నీ, కన్ను వంటి అవయవాలను మార్చేందుకు అవసరమైన ట్రాన్స్‌ప్లాంటేషన్ లేబ్ ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన అంశాలను ఏపీ ఎంఎస్ఐడీసీ ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు.
తొలుత సూపర్‌స్పెషాల్టీ బ్లాక్‌లోని నెఫ్రాలజీ విభాగాన్ని సందర్శించారు. సమావేశంలో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ టి.రవిరాజు, ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు డాక్టర్ సోమరాజు, ఏఎంసీ ప్రిన్సిపాల్ ఎస్.వి.కుమార్, కేజీహెచ్ సూపరింటెండెంట్ ఎం.మధుసూదనబాబు, విమ్స్ ఓఎస్డీ డాక్టర్ కె.వి.సుబ్బారావు, శ్రీకాకుళం రిమ్స్ డెరైక్టర్ డాక్టర్ జయరాజు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆర్.శ్యామల, ఏపీఎంఎస్ఐడీసీ పర్యవేక్ష క ఇంజనీర్ వి.చిట్టిబాబు, డీఈ ఎం.ఎస్.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.