advances
-
వీడిన గ్రహణం
ఎట్టకేలకు తేలిన హౌసింగ్‌బోర్డు ఇళ్ల పంచాయితీ అగ్రిమెంట్ నాటి రేటుతోనే కొత్త డిజైన్‌తో ఇళ్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం దాదాపు 150 మంది లబ్ధిదారులకు రూ.6.5కోట్ల మేర ఊరట హౌసింగ్‌బోర్డు అధికారులతో హైదరాబాద్‌లో మంత్రులు జగదీశ్, ఇంద్రకరణ్ సమావేశం నల్లగొండ : సొంత ఇంటి కోసం అడ్వాన్సులు చెల్లించి నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న వారికి ఊరట లభించింది. జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్డులో ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీ పంచాయితీ ఎట్టకేలకు తేలింది. పాత అగ్రిమెంట్ ప్రకారం హౌసింగ్‌బోర్డు రూపొందించిన కొత్త డిజైన్‌తో ఇళ్లు కట్టించి ఇవ్వాలని జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిల సమక్షంలో సోమవారం హైదరాబాద్‌లో సంబంధిత అధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. హెచ్ఐజీ గృహాల ధరను రూ.16.34 లక్షలు, ఎంఐజీ గృహాలను రూ.13.40 లక్షలకు కట్టించి ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో దాదాపు 150 మంది లబ్ధిదారులకు రూ.6.5 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది. వాస్తవానికి జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో గృహాలు నిర్మించి ఇచ్చేందుకు 2011లో నిర్ణయం తీసుకున్నారు. ఈ దేవరకొండ రోడ్డులో కతాల్‌గూడ వద్ద మొత్తం 334 ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. అందులో 152 హెచ్ఐజీ కాగా, 182 ఎంఐజీ ఇళ్లు. హెచ్ఐజీ ఇళ్లకు రూ.16.34 లక్షలు, ఎంఐజీ ఇళ్లకు రూ.13.40 లక్షలకు నిర్మించాలని 2011లోనే అగ్రిమెంట్లు కూడా కుదుర్చుకున్నారు. దీంతో లబ్ధిదారులంతా అడ్వాన్సులు చెల్లించారు. చాలామంది ఇళ్లపనులు ప్రారంభించారు. ఆ ఇళ్లలో ఇప్పటివరకు 52 హెచ్ఐజీ, 117ఎంఐజీ ఇళ్లు నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలినవి నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే, అగ్రిమెంట్లో ఉన్న దానికి భిన్నంగా మధ్యలో మార్పులు తెచ్చి హెచ్ఐజీ, ఎంఐజీ ఇళ్లలో బాల్కనీలు ఏర్పాటుకు మరో రూ.3లక్షలు చెల్లించాలని హౌసింగ్ బోర్డు అధికారులు మెలికపెట్టారు. దీంతో భారమవుతుందనే ఆలోచనతో అడ్వాన్సులు చెల్లించిన వారు కూడా నిర్మాణ పనులు నిలిపివేశారు. ఇందులో రూ.2లక్షల నుంచి రూ.5లక్షల వరకు అడ్వాన్సులు చెల్లించిన వారున్నారు. దీంతో అధికారులు వారి అగ్రిమెంట్లను రద్దు చేస్తున్నామని, అడ్వాన్సుగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి చెల్లించేది లేదని లబ్ధిదారులకు నోటీసులు కూడా పంపారు. దీంతో ఈ హౌసింగ్‌బోర్డు ఇళ్ల నిర్మాణం పెండింగ్‌లో పడింది. ఇప్పుడేం జరిగిందంటే.. లబ్ధిదారులు ఈ సమస్యను నల్లగొండ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్ దుబ్బాక నర్సింహారెడ్డి చొరవతో రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యను పరిష్కరించాలని, ఆర్థికంగా భారం పడకుండా పాత అగ్రిమెంట్ వరకు ఇళ్లు కట్టించి ఇచ్చేలా హౌసింగ్ బోర్డు అధికారులకు ఆదేశాలివ్వాలని కోరారు. దీంతో సోమవారం సచివాలయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి హౌసింగ్‌బోర్డు అధికారులు, లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేయించారు. అందులో గృహనిర్మాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాత రేటుకే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, అది కూడా కొత్త డిజైన్‌తో కట్టించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు వెంటనే ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ సమావేశంలో మరో అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఈ గృహాలను కట్టించి ఇచ్చిన చోట మరో 25 ఓపెన్ ప్లాట్లను అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చిన ఒక హౌసింగ్‌బోర్డు అధికారిపై మంత్రులు ఆగ్ర హం వ్యక్తం చేసినట్టు సమాచారం. -
మరింత వేగంగా ‘ఔషధ’ పరిశోధనలు
కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారామ్ అయ్యర్ బాలానగర్: ఔషధాల పరిశోధన మరింత వేగవంతంగా, ఫలవంతంగా జరగాలని, ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుగొనాలని కేంద్ర రసాయన, ఎరువుల శాఖా మంత్రి హన్సరాజ్ గంగారామ్ అయ్యర్ అన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూ ఆఫ్ ఫార్మసూటికల్స్ అండ్ రీసర్చ్ ఆడిటోరియంలో ఔషధాల తయారీలో ఆధునిక ఆవిష్కరణలు (ఐపీబీడీ-2015) అనే అంశంపై గురువారం అవగాహన సదస్సును కేంద్ర కార్మికశాఖ మంత్రి దత్తాత్రేయతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఎన్ఎంఆర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హన్సరాజ్గంగారామ్ అయ్యర్ మాట్లాడుతూ దేశంలోనే హైదరాబాద్ నైపర్‌లో ఔషధ పరిశోధనలు బాగా జరుగుతున్నాయని ప్రశంసించారు. నేటి ఫార్మా కంపెనీల అధినేతలు ఒకప్పుడు ఐడీపీఎల్ ఉద్యోగులే నని ఆయన గుర్తు చేశారు. ప్రసుత్తం క్యాన్సర్, హెచ్ఐవీ వంటి భయంకరమైన వ్యాధులకు సరైన మందులు లేవని, వీటిని నివారించేందుకు కొత్త ఔషధాలు కనుగొనాలని కోరారు. పరిశోధనలకు అయ్యే ఖర్చు భరించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన చెప్పారు. తక్కువ ఖర్చుతో త్వరగా నయం అయ్యే మందులను కనుగొని ఫార్మా రంగంలో నైపర్ ఖ్యాతిని నిలబెట్టాలని కోరారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ సరికొత్త పద్ధతుల ద్వారా అత్యాధునిక పరిజ్ఞానంతో మందులను కనుగొన్నప్పుడే నైపర్‌కు పేరు ప్రఖ్యాతలు వస్తాయని అన్నారు. ఐడీపీఎల్‌కు పూర్వ వైభవాన్ని నైపర్ విద్యార్థులు తీసుకురావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఐఐసీటీ డెరైక్టర్ లక్ష్మీకాంతం, నైపర్ ప్రాజెక్టు డెరైక్టర్ అహ్మద్ కమల్, నైపర్ రిజిస్ట్రార్ సత్యనారాయణ, కార్యక్రమ కన్వీనర్లు ఎల్.శ్రీనివాస్, నాగేంద్రబాబు, ఫార్మా విద్యార్థులు పాల్గొన్నారు. -
తీర్థ, స్నేహ ముందంజ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయిలు స్నేహ పడమట, తీర్థ ఇస్కా ముందంజ వేశారు. సికింద్రాబాద్ క్లబ్ టెన్నిస్ కోర్టుల్లో సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో గెలుపొందారు. స్నేహ 6-2, 2-6, 7-5తో సృష్టి స్లారియా (పంజాబ్)పై, తీర్థ 7-5, 4-6, 7-5తో ముఖర్జీ (బెంగాల్)పై గెలుపొందారు. అక్షర ఇస్కా 6-2, 6-0తో జనగాం సింధుపై గెలిచింది. నిఖిత 5-7, 4-6తో సాన్యా మదన్ (ఉత్తరప్రదేశ్) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాయిశరణ్ (ఏపీ) 6-4, 6-4తో ప్రశాంత్ సెల్వరాజ్ (తమిళనాడు)పై గెలుపొందగా, వైష్ణవ్ (ఏపీ) 0-6, 2-6తో చంద్రిల్ సూద్ (ఉత్తరప్రదేశ్) చేతిలో ఓడాడు. -
ఈపీడీసీఎల్ ఉద్యోగులకు శుభవార్త
రూ.22,45,43,256 రుణాలు, అడ్వాన్స్‌లు 2014-15 ఆర్థిక సంవత్సర గ్రాంట్ విడుదల సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీపీసీఎల్) ఉద్యోగులకు శుభవార్త. వరుస ఎన్నికలు, కోడ్ అమలు నేపథ్యంలో నిలిచిన సంస్థాగత రుణ సౌకర్యానికి ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో పనిచేస్తున్న సిబ్బందికి రుణాలు, అడ్వాన్సులు చెల్లిం చేందుకు నిధులు కేటాయించింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.22 కోట్ల 45 లక్షల 42 వేల 256తో నగదు గ్రాంట్‌ను విడుదల చేస్తూ ఈపీడీసీఎల్ రెండు రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో బైక్, మోటార్ సైకిల్, మోపెడ్, వివాహం, పర్సనల్ కంప్యూటర్ (పీసీ), ఇంటి మరమ్మతులు తదితర అవసరాలకు రుణం, అడ్వాన్స్ రూపంలో రూ.3 కోట్ల 92 లక్షల 92 వేల 256, కారు, గృహనిర్మాణ కేటగిరీలో రుణం, అడ్వాన్స్ రూపంలో రూ. 18 కోట్ల 52 లక్షల 51 వేలు కేటాయించారు. నామమాత్రపు వడ్డీ : ఏటా నామమాత్రపు వడ్డీ (5-6 శాతం)తో సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి నగదు రూపంలో రుణాలిస్తున్నారు. సైకిల్, మోటార్ సైకిల్, మోపెడ్, వివాహ వ్యయం, కారు, పీసీలు, ఇంటి భవనం మరమ్మతులు, స్థలాల కొనుగోళ్లు, ఇంటి కొనుగోళ్లు తదితర అవసరాలకు ఈ రుణాలందింస్తున్నారు. నిర్దేశిత వ్యవధిలో దరఖాస్తు చేసుకున్నవారికి సీనియార్టీ ఆధారంగా రుణం మంజూరు చేస్తారు. ఈ ఏడాది మార్చి 31లోగా వివాహ అడ్వాన్స్‌లు, పీసీ, బైక్ కొనుగోళ్లకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఈపీడీసీఎల్ సాయం దక్కింది. కార్లు, గృహ నిర్మాణ రుణాలకు దరఖాస్తు చేసుకున్నవారివి మాత్రం గత ఆర్థిక సంవత్సరం నాటి దరఖాస్తులు కూడా ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వీటికి ప్రస్తుతం ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సర్కిళ్లవారీ కేటాయింపులు : ఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు సర్కిళ్లు, కార్పొరేట్ కార్యాలయ పరిధిలో మొత్తం 878 మందికి వివిధ అవసరాల నిమిత్తం రూ.22,45,43,256లు కేటాయించారు. వీరిలో ఎవరైనా విముఖత చూపితే ఆ స్థానంలో తర్వాతి దరఖాస్తుదారునికి అవకాశం కల్పించనున్నారు. -
చిరు జీతగాళ్లకు ఆన్లైన్ చిక్కులు
=సమ్మె కాలపు అడ్వాన్సులకు ఆటంకం =ట్రెజరీల్లో ఆగిన తీరు =300 మంది వీఆర్ఏల ఎదురుచూపులు =ఉన్నతాధికారులు పట్టించుకోవాలని వేడుకోళ్లు గుడివాడ, న్యూస్‌లైన్ : అసలే అత్తెసరు జీతాలు.. ఆపై సమ్మెకాలపు అడ్వాన్సులు పొందడానికి ఆటంకాలు.. ఆన్లైన్ వ్యవస్థలో పేర్లు నమోదు చేయకపోవడమే దీనికి కారణం కాగా.. అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి దారితీసిందని వెల్లడవుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రెవెన్యూ శాఖలో పనిచేసే వీఆర్ఏలు సమ్మెలో పాల్గొన్నారు. సమ్మె ముగిసిన అనంతరం ఉద్యోగులతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో భాగంగా ట్రెజరీ ద్వారా జీతాలు పొందే ఉద్యోగులకు సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జీతం అడ్వాన్సుగా పొందేందుకు ప్రభుత్వం నవంబరులో జీఓ విడుదల చేసింది. 010 పద్దు ప్రకారం జీతం పొందే వీఆర్ఏలకు కూడా రెండు నెలల జీతం అడ్వాన్సుగా పొందే అవకాశం ఉంది. వీరి జీతం నెలకు రూ.3,500 చొప్పున రెండు నెలలకు రూ.7 వేలు అడ్వాన్సుగా ఇవ్వాల్సి ఉంది. ఆన్లైన్లో లేవని సబ్‌ట్రెజరీల్లో తిరస్కరణ... రాష్ట్రంలో 010 పద్దు కింద జీతాలు పొందే ఉద్యోగులు ప్రతి ఒక్కరూ హెచ్ఆర్ఎంఎస్ విధానం ప్రకారం ఉద్యోగుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంది. ఈ మేరకు డిసెంబర్లో జీఓ నంబర్ 334 ద్వారా ఉత్తర్వులిచ్చారు. దీని ప్రకారం ఉద్యోగులు అడ్వాన్సులు పొందాలంటే తప్పనిసరిగా ఆన్లైన్లో ఉద్యోగి వివరాలు నమోదై ఉండాలి. ఈ విధానాన్ని డిసెంబర్ 9 నుంచి అమలు చేయాల్సిందిగా ఖజానా అధికారులకు ఆదేశాలిచ్చారు. జిల్లాలోని వీఆర్ఏల వివరాలు నేటివరకు ఆన్లైన్ కాలేదు.