విమానంలో మూత్ర విసర్జన చేసిన ప్రయాణీకుడికి జరిమానా
లండన్ః మద్యం మత్తులో విమానంలో మూత్ర విసర్జన చేసిన ఓ ప్రయాణీకుడికి ఎయిర్ ఇండియా 1000 పౌండ్ల జరిమానా విధించింది. ఎయిర్ ఇండియా విమానంలో ఇండియానుంచి బర్మింగ్ హామ్ వరకూ తన పదేళ్ళ కొడుకుతో కలసి ప్రయాణించిన జిను అబ్రహం (39).. ఒళ్ళు తెలియకుండా విమానంలోనే మూత్ర విసర్జన చేయడంతో ప్రయాణీకుల ఆగ్రహానికి గురయ్యాడు.
జనవరి 19న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఎక్కిన అబ్రహం.. మద్యం మత్తులో తాను కూర్చున్న సీటు బెల్టు తొలగించి, పక్కనే ఉన్న ప్రయాణీకులు వద్దన్నా వినకుండా విమానంలోనే మూత్ర విసర్జన చేశాడు. దీంతో ప్రయాణీకులంతా అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానం బర్మింగ్ హామ్ చేరుకున్న వెంటనే ఎయిరిండియా సిబ్బంది అతడ్ని అదుపులోకి తీసుకుంది. అనంతరం బర్మింహామ్ కోర్టుకు హాజరు పరచగా... విచారణ అనంతరం బర్మింగ్ హామ్ క్రౌన్ కోర్టు అబ్రహం కు 300 యూరోలు అంటే సుమారు వెయ్యి పౌండ్లు జరిమానా విధించింది.